Sri Naradapuranam-3 Chapters Last Page
అష్టావింశో`òధ్యాయః = ఇరువది యెనిమిదవ అధ్యాయము
కాష్టీలోపాఖ్యానమ్ కాష్టీలోవాచ
రాక్షసం ధావమానం తు కాలాంతకయమోపమమ్| దృష్ట్వా సా రాక్షసీప్రాహ భర్తారం మమ శంకితా1
ప్రక్షిపస్వాలప్రఖ్యాం శక్తిం హేమవిభూషితామ్ | మమాయం పంచతాం యాతు దిగంబరరిపుప్రియ 2
తస్యా వాక్మాన్మమ పతిః పౌరుషేతు వ్యవస్థితిః | ముమోచ విపులాం శక్తిం రక్షోవక్షస్థలం ప్రతః 3
జ్వలన్తీ జ్వలన ప్రఖ్యా ద్యోతయన్తీ దిశో దశ | దివ్యాంశుతీక్లవక్త్రాంతా కింకణీశతనాదితా 4
రక్తచన్దనలిప్తాంగీ రక్తవస్త్రోశోభితా | హృది తస్య నిపత్యాసౌ శక్తిర్విప్రకరాచ్యుతా 5
కృత్వా స్మావశేషం తు రాక్షసం గగనం య¸° | పాతయిత్వాస్వ భర్తారం విప్రహస్తేన రాక్షసీ 6
కృతకృత్యామివాత్మనం మేనే హృష్టతనూరుహా | అథోవాచ ద్విజం హృష్టా రాక్షసీ శుభలోచనమ్ 7
ఏహి కాంత గుహాం రమ్యాం ప్రవిశ త్వం యదృచ్ఛయా | భుంక్ష్య భోగాన్మయా సార్ధం యే దివ్యా యే చమానుషాం 8
తథేతి ప్రాణనాధో మే ప్రాహ హృష్టవపు స్తదా | తతస్సాదాయ మే కాంతం స్వాం ప్రవిష్టా గుహాం ముదా 9
అసంవీక్ష్యైవ తద్ధస్మ భర్తృదేహసముద్భవమ్ | కుచాభ్యామున్నతాభ్యాం సా మద్భర్తారమపీడయత్ 10
దర్శయామాస తాం తన్వీం కరుణం శయనే స్థితామ్ | ఇయం తోనాసితాపాంగీ బిం బోష్టీ కాంచన ప్రభా 11
భార్యార్దే సముపనీతా వారణస్యా ద్విజోత్తమ | యస్యాః సీమాం న లంఘతి పాతకాని హ్యశేషితః 12
శక్తిక్షేత్రం చ తం ప్రాహుః పుణ్యం పాపక్షయంకరమ్ | యా గృహం త్రిపురారేశ్చ పంచగవ్యూతి సంస్థితా 13
యస్యాం మృతాః పునర్మర్త్యాః గర్భవాసం వింశతి న | సత్వమస్యా గృహం ప్రిత్యం పునర్నయ సులోచనామ్ 14
ఇమాని తవ రత్నాని శయనాన్యాసనానిచ | మయా సహ సమస్తాని విక్రీమణీహి నిజేచ్చయా 15
త్వదర్దే రాక్షసో ఘోరో మయా బ్రహ్మన్నిఘాదితః | ముగ్దయా తవ రూపేణ ప్రేషితో యమసాదనమ్ 16
తస్మాన్మమోపరి విభో కృత్వా విశ్వాసమాత్మనా | భజస్వ మాం విశాలాక్ష భక్తాం వై కామరూపిణీమ్ 17
ఏతచ్ఛృత్వాతు వచనం భర్తా మే చారులోచనే| రాక్షస్యాః కామతప్తాయాః కుమార్యః సన్నిధౌ శుభే 18
ఉవాచ రాక్షసీం తాం తు సశంకో మధురం వచః
కాష్ఠీల పలికెను: కాలాంతకయమునిలా ఉన్న రాక్షసుడు పరుగెత్తుతూ వచ్చుటను చూచిన రాక్షసి అనుమానంతో నా భర్తతో ఇట్లు పలికెను. ఓదిగంబరరివుప్రియా హేమవిభూషిత అనలసన్నిభయగు శక్తిని రాక్షసునిపై ప్రయోగించుము. నా భర్త మరణించవలయును. ఆ రాక్షసి మాటలను వినిన నా భర్త పౌరుషముతో రాక్షసుని వక్షస్థలమున శక్తిని ప్రయోగించెను. ఆ శక్తి అగ్నిహోత్రము వలె జ్వలించుచు పది దిక్కులు ప్రకాశింపచేయుచు దివ్యాంకుశ తీవ్ర వక్త్రాంతయై కింకిణీశత నాదితయై రక్తచన్దన లిప్తాంగి, రక్తవస్త్రోపశోభితయగు శక్తి బ్రాహ్మణునిచే చేతి నుండి విడవడి రాక్షసుని హృదయమున పడెను. రాక్షసుని భస్మము చేసి ఆకాశమునకెగరెను. ఇట్లు బ్రాహ్మణునిచే భర్తను చంపించి సంతోషముతో పులకించి తనను కృతకృత్యులాలిగా భావించెను. అంత రాక్షసి సంతోషించినదై శుభలోచనుడగు బ్రాహ్మణుని గూర్చి ఇట్లు పలికెను. ఓ ప్రియా రమ్ము సుందరమగు గుహను యధేచ్ఛగా ప్రవేశించుము. నాతో కలిసి దివ్యమానుషభోగములను అనుభవించుము. అంతట నా భర్త సంతోషముతో పులికించిప వాడై అట్లేయని పలికెను. అపుడు ఆ రాక్షసి నా భర్తను తీసుకని తన గుహలో ప్రవేశించెను. తన భర్త దేహపు బూడిదరాశిని చూడకనే వెళ్ళెను. ఉన్నతమగు తన స్తనములతో నా భర్తను హత్తుకొనెను. గుహలో శయ్యపై నున్న ఆ రాజకుమారిని చూపెను. ఈ నల్లని క్రీగంటి చూపులు కలది, బింబోష్ఠి కాంచనప్రభయగు రాకుమారిని నా భర్త తనకు భార్యగా చేసుకొనుటకు పాపములు చొరరాని కాశీపట్టణము నుండి అపహరించుకొని వచ్చెను. ఆ కాశి శక్తిక్షేత్రము, పుణ్యప్రదము, పాపక్షయకరము, శంకరుని గృహము ఇచ్చటికి పది కోసుల దూరముననున్నది. ఈ కాశీ నగరమున మరణించిన వారు మరల పుట్టరు. కావున నీవు మరల ఈమె తండ్రిగారి గృహమున చేర్చుము. ఇచ్చటనున్న రత్నములు శయనములు, ఆసనములు నాతోపాటు సమస్త సంపదను నీ ఇష్ట ప్రకారము అనుభవించుము. నేను నీ కొరికే ఘోరుడగు రాక్షసుని చంపించితిని. నీ రూపమును మోహించి నా భర్తను యమపురికి పంపితిని. కావున నాపైన నమ్మకము నుంచి కామరూపిణిని భక్తురాలినగునన్ను అనుభవించుము అని పలికెను. నా భర్త ఈ మాటలను విని రాజకుమారి సమీపమున కామ తప్తయగు రాక్షసితో ఇట్లు అనుమానముతో మధురముగా పలికెను.
సుభ##గే నీతి శాస్త్రేషు విశ్వస్తవ్యా న యోషిత: 19
కౌమారం యా తపతిం హన్తి సా కథం మాం నహింసతి | మత్తో రూపాధికం మత్వా పరం పురుషలంపటా 20
సో హంవిశ్వాసభావేన విశ్వస్తస్తే వరాననే | అద్యవాధ పరేద్యుర్వా పక్ష్‌ఏ మాసే೭థ వత్సరే 21
వ్యాపాదయ యధేచ్ఛం వా త్వాం ప్రసన్నోస్మి భామిని 22
ఏవమేవ త్వయా కార్యం నాద్య చోపకృతం తవ | ఆత్మా తే సర్వధా దేయః ప్రతీకారస్య హేతవే 23
మదర్థే నిహతో భర్తా త్వాయా నిశ్శంకయా యతః | తతో೭హం నోత్తరం వచ్మి పరం కించిత్సులోచనే 24
త్చ్ఛృత్వా వచనం తస్య మద్భర్తు: సాబ్రవీదిదమ్ | విశ్వస్తహింసనం బ్రహ్మన్ బ్రహ్మహత్యా సమం భ##వేత్ 25
యద్యేవం రాక్షసీం క్రూరాం మన్యసే పతిఘాతినీమ్ | పతిం తధాపి గర్హేయం విశ్వస్తం ఘాతయే కథమ్ 26
సూక్ష్మా హా ధర్మస్య గతి ర్నజ్ఞాయేత కథంచన | కేనాపి కుత్రచిద్దేవ దైత్య రాక్షసకాదినా
కేచిన్మనుష్యాః పటవో ధర్మసూక్ష్మత్వచింతనే 27
యే`ò నిత్యేన శరీరేణ నైష్కర్మ్యం సాధయంత్యుత | శ్రూయతే చ పురాణషు కించిదత్ర నిగద్యతే 28
ధర్మసై#్యవానుకూల్యేన విష్ణునా ప్రవిష్ణునా | దశావతారగ్రహణ దుఃఖం ప్రాప్తమనేకధా 29
క్వ సీతార్థం శ్రీనివాసో రామో లక్ష్మణసంయుతః | విలాపం కురుతే నాగపాశంబంధాదికర్మసు 30
క్వదేవ దేవో వసుదేవ సూనుః విజ్ఞానరూపో నిఖిల ప్రపంచీ | హా కష్టమిత్యస్రదృగాది చేష్టః పార్దోగ్రసేనాదిక భృత్యఃకృత్య 31
ఈశస్య కృత్యం ద్విజ దుర్విభావ్యం ధర్మానుకూల్యేన సమాస్థితస్య
వ్యాసః స్వయం వేదవిభాగకర్తా పారాశరిస్తత్త్వదృగిజ్యమూర్తి; | కన్యాత్వ విధంసక వీర్య జన్మా కానీన సంజ్ఞో`òనుజదారగామీ 32
పరివేత్తాచ దిధిషూః శంతనుః స్వఃసరిత్పతిః | దిధిషూ తనయః సాక్షాత్ వసుః స్త్రీవాద మృత్యుభాక్ 33
యే గోలకసుతాః కుండాః పొండవా, సమయోనిగాః | తేషాం సంకీర్తనం పుణ్యం పవిత్రం పాపనాశనమ్ 34
యం ధ్యాయంతి స్మరంత్యద్ధా యోగమూర్తిః సనాతన 35
విష్ణుర్వేశ్వా సమాసక్తః ప్రహ్లాదాద్యుపదేశకృత్ | శ్రీ నృసింహో`òసురధ్వంసీ దేవదేవాదిదైవతమ్ 36
సంసారవాసనపా ధ్వంసీ స్వర్వాక్షభవన స్థితిః 37
జామదగ్న్యః స్వయం సిద్ధ: తపసా దగ్ధకిల్బిషః | ఈశ్వరః క్షత్రసంహార భ్రూణహత్యాది కర్మకృత్ 38
స్వయమేవర్షభో యోగీ లోకశిక్షాపరో ద్విజః | లోకగ్లానికరోజాతః కుర్వన్ ధర్మానురోధతః 39
నారదో నారదో భూయో భూయో భూయోపి నారదః | నారాయణపరో నారో నరో నరహితో`òమరః 40
గౌతమో గౌతమో విప్ర గోపచేష్టాపరాయణః | వేద బాహ్యార్థ సంయుక్త శాస్త్రీ వేదోపకారకృత్ 41
వసిష్ఠశ్చోర్వశీ జాతో అగస్త్య స్స్వయమీశ్వరౌ | యేన లోకోపకారార్ధం సంయుక్త వసిష్ఠం శాస్త్రముత్తమమ్ 42
కృతం యస్మిన్పురాణాని వేదాః సామ్యత్వమాగతాః | యః స్వయం రామచంద్రస్య గురుః సర్వేశ్యరస్యచ 43
స కథం గాధిజాశప్తః తిర్యగ్యోనిముపాగమత్ | యో దమిత్వా విభుర్విధ్యం వాతాపిం సాగరం స్థితః 44
స కథం మృతకాదాతా దుష్కరం సముపాసతే | యో విధిః కర్మసాక్ష్యాది వంద్యో మాన్యః పితామహాః 45
మోహినీ మోహితో దేహం ఉత్ససర్జ కథం స చ | యః శివ శివదఃసాక్షాత్ ప్రకృతీశః పరాత్పరః 46
స కథం దేవ పత్నీగః శ్మశానాశుభ చేష్టితః | తస్మాద్ద్విజ సదాచారో నిషేవ్యో విధానా విధిః 47
తమహం భావన యుక్తో నో హేయాద్యో విదాంవరః | సశాంతిమాప్నుయాదగ్య్రాం ధమ్యాముభయసంస్థితామ్ 48
ఆపవర్గ్యః స్మృతో ధర్మో ధనం ధర్మైక సాధనమ్ | తన్మయా సాధితో ధర్యః సర్వోత్తమ ధనాత్మనా 49
శృణువిప్రాత్ర ధర్మస్య గతిం సూక్ష్మాం వదామ్యహం
ఓ సుందరీ! నీతి శాస్త్రములందు స్త్రీలను నమ్మరాదని చెప్పియున్నారు. యువకుడగు భర్తను చంపిన స్త్రీ నన్ను మాత్రము ఏల చంపదు. నాకంటే సౌందర్యవంతుడగు మరో పురుషుని చూచి అతని యందు మోహముతో నన్ను కూడా చంపవచ్చును. కాని నేను మాత్రము నమ్మవలయును కావున నిన్ను నమ్మెదను. ఈనాడు కాని, రేపు కాని, పక్షమునకు కాని, మాసమునకుగాని, సంవత్సరమునకుకాని, లేదా నీకు ఇష్టమొచ్చినపుడు యధేచ్ఛముగా చంపుము. నేను మాత్రము నిన్ను ఆశ్రయించియున్నాను. నీవిట్లే చేయుము. ఇపుడు నీకుపకారమును చేయవలయును. ప్రత్యుపకామునకై నీకు నన్ను నేను అర్పించుకొనవలయును. నీవు నా కొరకు నిస్సందేహముగా నీ భర్తను చంపితివి. కావున నేను నీకు బదులు పలుకను. అంతట ఆ రాక్షసి నా భర్త మాటలనువిని ఇట్లు పలికెను. నమ్మిన వారిని చంపుట బ్రహ్మహత్యతో సమానము. అయిననూ భర్తను చంపించిన నన్ను క్రూరరాక్షిసిగా తలచిననూ నేను నమ్మిన వానిని ఎట్లు చంపెదను. ధర్మ స్వరూపము పరమసూక్ష్మము. సామాన్యముగా తెలియరాదు. దైత్యరాక్షసులు దేవతలు మొదలగు వారికి కూడా తెలియరాదు. ధర్మసూక్ష్మమును తెలియుటలో కొందరు మానవులు సమర్ధులగుదురు. అనిత్యమగు శరీరముచే మోక్షమును సాధించెదరు. ఈ విషయమున పురాణములలోని కొన్ని విషయములను ఇచట చెప్పుచున్నాను. ధర్మమును కాపాడుటకు సర్వశక్తివంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించి బహుకష్టములను పొందెను. శ్రీనివాసుడగు రామచంద్రుడు సీత కొరకు లక్ష్మణునితో కలిసి నానా కష్టముల పాలై నాగపాశంబంధాదులచే విలపించెను. దేవదేవుడు, విజ్ఞాన స్వరూపుడు, నిఖిలప్రపంచ రూపుడగు శ్రీహరి వసుదేవ పుత్రుడై బాల్యమును కన్నీటితో అల్లరి పనులతో, పెత్తనమును ఉగ్రసేనునకి, అర్జునునకి భృత్యుడుగా కష్టమునునుభవించెను. ధర్మాను కూలముగా నుండి పరమేశ్వరుని కర్మలు మన ఊహలంకదనివి. వేదవిభాగమును చేసినవాడు, తత్త్వదర్శి యజ్ఞరూపుడు, పరాశరపుత్రుడగు వ్యాసుడు స్వయముగా కన్యాత్వమును ధ్వంసము చేయుచు పుట్టి కానీనుడపించుకొనునె. తమ్ముడగు విచిత్రవీర్యుని భార్యలను సంగమించినవాడు. గంగానదికి భర్తయగు శంతనుడు పరివేత్త దిధిషుయనబడెను. అక్కకు వివాహము కాకమునుపు చెల్లెలును వివాహమైనచో అక్క దిధిషుయందురు. అన్నకు వివాహము కాకమునుపు తమ్మునికి వివాహమైనచో అన్నను పరివేత్త యందురు. సాక్షాత్తు వసువు దిధిషుపుత్రుడుగా భీష్ముడై జన్మించి అంబయను కాశీ రాజపుత్రిక నిందచే మరణించెను. భర్త జీవించి యుండగా పర పురుషునిచే పుట్టిన వారు పాండవులు ఒకే తల్లి పిల్లలు. మొదట భర్త మరణించిగా రెండవ భర్తతో పుట్టిన వారు కౌరవులు. ఈ కౌరవపాండవ సంకీర్తనము పావనము, పుణ్యప్రదము, పాపనాశకము, యోగమూర్తి, సనాతనుడు, ప్రహ్లాదాదులకు ఉపదేశమును చేసిన వాడగు శ్రీ మహావిష్ణువు యగు శ్రీనరసింహస్వామి వేశ్యాసమాసక్తుడు. దేవదేవుడు, అధిదేవత, రాక్షసనాశకుడు, సంసార వాసనా నాశకుడు, స్వర్ణాక్షభవన వాసి. ఇక జగమదగ్నిపుత్రుడగు పరశురాముడు స్వయముగా సిద్ధుడు, తపస్సుచే పాపములను నశింపచేసుకొనినవాడు. క్షత్రియులను సంహరించిన ఈశ్వరుడు కూడా భ్రూణ హ్యతాదిపాపములనాచరించెను. స్వయుముగా తాను యోగియగు ఋషభుడు లోకమునకు ఉపదేవించు బ్రహ్మణుడై కూడా ధర్మానురోధమును చేయుచు లోకమునకు పీడా కరుడాయెను. నారదుడు ఎన్నిసార్లు పలికిననూ నారదుడే. నారాయణపరుడగు నరుడు. నరహితుడగు అమరుడు. గోపచేష్ఠాపరాయణుడగు గౌతముడు గౌతముడే, వేద బాహ్యార్ధములను బోధించినవాడు. శాస్త్రకారకుడు. వేదములను ఉపకారమును చేసిన వాడు. ఇక వసిష్టమహర్షి ఊర్వశీపుత్రుడు. అగస్త్యుడు కూడా ఇట్లే వీరిద్దరూ స్వయముగా సర్వసమర్ధులు. ఈ వసిష్ఠమహర్షి లోకోపకారము కొరకు ఉత్తమమగు వాసిష్ఠ శాస్త్రమును రచించెను. ఈ శాస్త్రము పురాణవేద సమమాయెను. ఇతను సాక్షాత్తు శ్రీ రామచంద్రునకు గురువు. ఇతనే విశ్వామిత్రుని శాపముచే తిర్యగ్యోనిగా జన్మించెను. ఇక అగస్త్య మహర్షి వింధ్యపర్వతమును వంచెను. వాతాపిని సంహరించెను. సముద్రజలమును నిశ్శేషముగా త్రాగెను. అట్టి అగస్త్యుడే మృతకుని స్వీకరించెను. దుష్కరమగు తపమును చేయుచుండెను. సూర్యాదివందితుడగు వాడు సాక్షాత్తు సృష్ఠికర్తయగు బ్రహ్మయే తన పుత్రికారూపమును చూచి మోహించి తన దేహమునే విడిచెను. శుభమును ప్రసాదించువాడు, ప్రకృతి నాధుడగు సాక్షాత్తు శివుడు కూడా దేవపత్నులను సంగమించినవాడు శ్మశానమున నివసించువాడు. కావున ఓ బ్రాహ్మణోత్తమా, యధావిధిగా సదాచారమునే అనుసరించవలయును. భావనలో ధర్మమే యుండవలయును. హోమములను ఆలోచించరాదు. అపవర్గ్యము ధర్మముగా చెప్పబడినది. ధర్మమునకు భావనలతో ముఖ్యసాధనము ధనము. అట్టి ధర్మమును ధర్మసాధనమగు ధనమును కూడా నేను సంపాదించితిని. ఓ బ్రాహ్మణోత్తమా? ఇచట ధర్మము యొక్క సూక్ష్మస్వరూపమును చెప్పెదను వినుము.
యదా సమాగతో భర్తా మమ కన్యాం సమాహరన్ 50
త్వాం పశ్యన్ నిజకర్మస్థం కోపి దోషో న తస్య వై | మయా పృష్టః కథం నా కన్యేయం సముపాహృతా 51
తదా తేన మృషావాక్యం ఉక్తం మద్భక్షణార్థకమ్ | తన్నిశమ్యాహ మాం బద్ధా స్వయం చాస్థానిదర్శనాత్ 52
యే వదంతి చ దాంపత్యే భార్యా మోక్షవిరోధినీ | న తే తత్త్వదృశో జ్ఞేయా న సా భార్యావిరోధినీ 53
భార్యసముద్ధరేత్పాపాత్ పతంతం నిరయే పతిమ్ | సా భార్యాన్యా కర్మవల్లీ కర్మవల్లీ రూపా సంసారదాయనీ 54
పాపం కిమత్ర తన్మత్తః సమ్యక్ఛృణు స్వయంవర | అలీకం నైవ వక్తవ్యం ప్రాణౖః కంఠగతైరపి 55
సత్యమేవాచరేత్సత్యే సాక్షాద్ధర్మో వ్యవస్థితః | సత్యే సమాస్థితో బ్రహ్మ సత్యే సన్తః సమాస్థితా 56
సత్యే సమాస్థితం విశ్వం సర్వదా సచరాచరమ్ | సత్యం బ్రూయాదితి వచో వేదాంతేషు ప్రణీయతే 57
సత్యం బ్రహ్మస్వరూపం హి తత్సత్యమభీధీమహి | సత్యంతు సర్వదా విప్ర మంగలం మంగల ప్రదమ్ 58
అసత్యమాత్మక్షయదం సద్యః ప్రత్యయకారకమ్ | స్త్రీషు సత్యం న వక్తవ్యం తత్రాపి శృణు కారణమ్ 59
నిధిం స్త్రియై న కథయేది త్యాదౌ దోషవారణమ్ | ఉక్తం తద్ధర్మజనకం ధర్మ సూక్ష్మత్వదర్శకమ్ 60
కుశా ద్విజా జలం వహ్ని ర్వేదా భూపాలదిక్సురాః | సాక్ష్యే యత్ర వివాదేషు దాంపత్యం తదుదీరితమ్ 61
సమంగీకరణం కర్మ వివాహే తు విధీయతే! | స్త్రీపుంసోర్ద్విజ సంస్కారే నిర్దష్టం గురుశిష్యయోః 62
తస్మాత్పరస్పరం జ్ఞే¸° గురుశిష్యా వధూవరౌ | నానయో రణుమాత్రోపి భేదో బోధ్యో విజానతా 63
తత్తత్కర్మాను రూపత్త్వాత్ ప్రాధాన్యం స్త్రీనియోజ్యయోః | క్వచిత్ వ్యత్యయదోషశ్చేత్ దైవమేవాత్ర కారణమ్ 64
దైవాధీనం జగత్సర్వం సదేవాసురమానుషమ్ | దైవం తత్పూర్వజన్మాని సంచితాః కర్మవాసనాః 65
ప్రాప్తం నిషేవన్నన్యోన్యం వర్తతే కామకారకమ్ | శుభం వాప్యశుభం విప్ర తం తు శాంతం విదుర్బుధా 66
శాంతః సత్యసమాచారో జంతుర్లోకప్రతారకః | ఏవమాది విదిత్వా తు నాయం భర్తా నిపాదితః 67
కన్యాత్వధ్వంసకాత్పాపాత్ పూతో మదుపకారతః | గతిం ప్రయాతః కృతినాం త్వద్ధస్తవినిపాతితః 68
మయాతూపకృతం పత్యే జానంత్యా ధర్మసూక్ష్మతామ్ | త్వత్ర్పాణరక్షణ ధర్మో మమాభూద్ద్విజసత్తమ 69
తేన ధర్మేణ ప్రాప్తమితి సమ్యక్ నిబోధ మే | రాక్షసీం యోనిమాపన్నా రాక్షసస్య ప్రియాహ్యహమ్ 70
కామరూపా బ్రాహ్మణీ తు సంజాతా ధర్మకారణాత్ | ధర్మకామదుఘా ధేనుః సంతోషం నందనం వనమ్ 71
విద్యా మోక్షకరీ ప్రోక్తా తృష్ణా వైతరణీ నదీ | వైతరణ్యాం పతన్ భర్తా మయోద్ధృత ఇహాభవత్ 72
అస్యాశ్చోపకృతం విప్ర వర్ణోత్తమని వేశనాత్ | ఇయం త్వత్సంగినీ భార్య భవిష్యతి పితుర్గృహే 73
అహం తవాస్యాశ్చ సదా రక్షికా ధర్మబోధినీ | మత్సంగమాత్పూర్వమేవ యా భార్యా విప్ర తే, భవత్ 74
ఇయం త్వత్సంగినీ భార్యా భవిష్యతి వరాననా | సాపి తిర్యగ్గతిం ప్రాప్య ముచ్యతే మదనుగ్రహాత్ 75
అహం పురాభ##వే భూవం రమణీ లోకసుందరీ | కందలీతి చ విఖ్యాతా తనయార్వమునేర్ద్విజ 76
తపఃప్రభావాత్సంజాతా యమలా మిధునంధరా | పురుషోమే సహభవో దమితో ధర్మకారణాత్ 77
తేనైవోర్వేణ శిష్టాహం దత్తా దుర్వాససేభవమ్ | తం పతిం ప్రాప్య విప్రేంద్ర ప్రాక్కర్మవశగా హ్యహమ్ 78
కలహాభిరతా పత్యా శప్తా భస్మత్వమాగతా | కించిత్పాపావశేషేణ రాక్షసీం యోనిమాగతా 79
తత్ర యోనౌ మయా లబ్దో భర్తాయం రాక్షసాధిపః | గోభిలో నామ తేజస్వీ స త్వయా వినిపాతిత 80
శాపోస్యపూర్వవయసి బభూవ ద్విజసత్తమ | కస్యాశ్చద్రాజ కన్యాయాః స్త్రియారబ్దామృతి స్తవ 81
అహం తు రాక్షసీ భావ రహితా పూర్వకర్మణః | శుభస్య బలమాపన్నా జాతా తవ సహాయినీ 82
దుఃఖితాహం కృతా భర్త్రా కుమార్యాహరణాత్పురా | భార్యాధ పాపినా బ్రహ్మన్ తేన వ్యాపాదితో మయా 83
విశ్వస్తో హి యత స్వంవై మయా సర్వేణ చేతసా | తతస్త్వాం గోపయిష్యామి సర్వభావేన కాముక 84
ఏష తే శపధః సత్యః పంచభూతోపసాక్షికః | కృత్స్నస్య పురుషస్యేహ సన్నిథౌ వ్యాహృతో మయా 85
న కరోషి ద్విజశ్రేష్ట సంవిదం హ్యాన్యధా క్వచిత్ | మద్వాక్యే భవతా స్ధేయం సర్వకృత్యేషు మానద 86
ఏతచ్ఛృత్వా తు వచనం రాక్షస్యా పరిభాషితమ్ | ప్రతిపేదే వచః సర్వం యత్కృతం హి తయా తదా 87
తతః సా రాక్షసీ సర్వం సంప్రగృహ్య గుహాధనమ్ | కరేణు రూపిణీ భూత్వా పృష్టే కృత్వా పతిం మమ 88
తయా సహ విశాలాక్ష్యా రత్నవల్యా ముదాన్వితా | యయా వాకాశమార్గేణ కాశీమభి సులోచనే 89
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ
ఉత్తరభాగే మోహినీ చరితే
కాష్టీలోపాఖ్యానం నామ
అష్టావింశోధ్యాయః
నా భర్త రాజకన్యను అపహరించి స్వకర్మలో నున్ను నిన్ను చూచుచు వచ్చినపుడు అతని దోషమేమియూ లేదు. ఈ కన్యనేల తెచ్చితివని నేనడుగగా నీ ఆహారము కొఱకని అసత్యమును పలికెను. ఆ మాటలు విని ఆ కన్య ఇది అబద్ధమని పలికెను. అతని చేష్టల వలన అతని మాటల అసత్యమని తెలసుకొంటిని. భార్యకు అబద్ధము చెప్పిన వారు తత్త్వదర్శులు కారు. విరోధమును ప్రకటించునది భార్య కాదు. నరకములో పడవేయు పాపము నుండి భర్తను భార్య ఉద్ధరించవలయును. సంసారమును ప్రదానము చేయు కర్మవల్లీ రూపమగు భార్య మరియొకతె. కావున ఈ విషయమున నా వలన జరిగిన పాపమేమిటో తెలుపుము. ప్రాణములు కంఠగలములుగా నున్ననూ సత్యమునే ఆచరించవలయును. సత్యములో సాక్షాత్తుగా ధర్మము నిలిచియున్నది. సత్యముననే బ్రహ్మయుండును. సత్యముననే సత్పురుషులు ఉందురు. ఈ ప్రపంచమంతయూ సత్యమునే నిలిచియున్నది. సత్యమునే చెప్పవలయునని వేదాంతములందు చెప్పబడియున్నది. బ్రహ్మస్వరూపమునే సత్యమని చెప్పుచున్నాము. సత్యము సర్వకాలములందు శుభము, శుభప్రదము, అసత్యము ఆత్మనాశకరము. అపుడు మాత్రమే నమ్మకమును కలిగించునది. స్త్రీలతో సత్యమును చెప్పరాదు. దానికి కారణమును వినము. నిధిని గూర్చి స్త్రీకి చెప్పరాదని దోషనివారణము. ఇటు వంటి అసత్యము ధర్మజనకము. ధర్మసూక్ష్మమును చూపునది. దర్భలు, బ్రాహ్మణులు, నీరు అగ్ని, వేదములు, భూమి, కాలము, దిక్కులు, దేవతలు, సాక్ష్యముగా నున్న దానినే వివాహమందురు. ఆ వివాహముతో ఏర్పడు దానినే దాంపత్యమందురు. వివాహమున సాంగకర్మవిధించడినది. స్త్రీ పురుషులకు గురుశిష్యులకు ద్విజసంస్కారము విధించబడినది. కావున వధూవరులు పరస్పరము గురు శిష్యులని తెలియవలయును. జ్ఞానము కలవాడు దంపతులలో అణుమాత్రము భేదమును కూడా చూడజాలడు. ఆయాకర్మలననుసరించి స్త్రీ పురుషులకు ప్రాధాన్యము చెప్పబడినది. కొన్ని చోట్ల వ్యత్యయదోషమున్నచో దానకి దైవమే కారణము. దేవాసురమానవ రూపమగు ఈ జగత్తు సర్వము దైవాధీనమే. పూర్వజన్మలో సంచితమగు కర్మవాసనలననుసరించి దైవము మన కామననలను సమకూర్చును. అది శుభము కావచ్చును. ఆ శుభము కావచ్చును. దానిని శాంతమని పండితులు తెలియుదురు. సత్యసమాచారము శమింపచేయు ప్రాణిలోకమును వంచించువాడుగును. దీనినంతటిని చక్కగా నెరిగి ఇతను భర్తకాదని తలచి చంపించితిని. నేను చేసిన ఉపకారము వలననే కన్యాత్వమును ద్వంసము చేయు మహాపాపమునుండి తప్పించబడెను నీ చేతితో మరణించి పుణ్యాత్ముల లోకమును చేరెను. ధర్మసూక్ష్మమును తెలిసిన నేను భర్తకు ఉపకారమును చేసితిని. అట్లే నీ ప్రాణరక్షణమును చేసిన నాకు విశేషధర్ము కలిగెను. ఆ ధర్మముచే నేమిలభించినదో చక్కగా తెలియుము. రాక్షస జాతిలో పుట్టిన నేను రాక్షసునకు భార్యగా యుండి కూడా కామరూపధారిణినైను నేను ఈ ధర్మ కారణము వలననే బ్రాహ్మణినైతిని (బ్రాహ్మణ భార్య) ధర్మమును, కామమును వర్షించునది ధేనువు, సంతోషమును ప్రసాదించునది నందనవనము. మోక్షమునిచ్చేనది విద్య. తృష్ణవైతరణినది. ఆ వైతరణిలో పడుచున్న భర్తను నేను ఉద్ధరించితిని. ఉత్తమ వర్ణమును చేర్చుటచే ఈ రాజ కుమారికి కూడా ఉపకరించితిని. ఈమె తండ్రి ఇంటిలో చేరును. నేను నీకు ఈమెకు సర్వకాలముంలదు రక్షకురాలనుగా నుందును. నాతో కలియుటకు ముందుగా నీకున్న భార్య కూడా తిర్యగ్జన్మను పొంది నాయనుగ్రహమున మోక్షమును పొందును. నేను కూడా పూర్వజన్మమున జౌర్వముని కూతురుగా కందలియను పేరుతో నుంటిని. లోకొత్తర సౌందర్యవతిని తపఃప్రభావమును ఆశ్రయించితిను. నా తండ్రియగు జౌర్వముని నన్ను దుర్వాసునకు ఇచ్చెను. అతనిని భర్తగా పొందిన నేను పూర్వజన్మకర్మ వశమున భర్తతో ఎపుడూ కలహించుచుంటిని. నా భర్త కోపించి శపించగా భస్మమైతిని. కొంచెము పాప శేషముచే రాక్షసిగా పుట్టితిని. అపుడు ఈ రాక్షసుని భర్తగా పొందినతి. ఇతని పేరు గోభిలుడు. మహా పరాక్రమశాలి ఇతనిని నీవు సంహరించితివి. ఈ రాక్షసునికి ¸°వనమున ఒక రాజకన్యా కారణమున నీకు మరణము సంభవించునని శాపము కలిగెను. నేను పూర్వజన్మకర్మ వశమున రాక్షసీ భావవము లేని దాననుగా నుండి శుభకరమగు బుద్ధిచే నీకు సహాయము చేసితిని. నా భర్త పాపియై రాజకుమారిని అపహరించుటచే దుఃఖించి నీచే సంహరింప చేసితిని. నీవు నన్ను సర్వభావములచే నమ్మి యుంటివి. నాచే భర్తగా వరించబడితివి కావున నిన్ను సర్వకాలములందు రక్షించుచుందును. నేను పంచభూతముల సాక్షిగా చేయు ఈ శపథము సత్యము. పరిపూర్ణ పురుషుని సన్నిధిలో నేను చెప్పుచుంటిని. నాతో ఎప్పుడు వాదమును ఆరంభించకుండుము. అన్ని విషయములలోను నీవు నీ మాటయందు నిలువలయును. ఇట్లు పలికిన రాక్షసి మాటలను వినిన నా భర్త ఆమె చేసిన దానిని చెప్పిన దానిని నిజమని విశ్వసించి అంగీకరించెను. అంతట ఆ రాక్షసి ఆడయేనుగు రూపమును ధరించి, గుహలోని సంపదను, నాభర్తను తన వీపుపై కూర్చోబెట్టుకొని ఆరాజకుమారిని కూడా తీసుకొని ఆకాశమార్గమున కాశీ నగరమునకు బయలుదేరెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున
ఉత్తర భాగమున మోహీనీ చరితము కాష్ఠీలోపాఖ్యానమను
ఇరువది ఎనిమిదవ అధ్యాయము