Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకోనత్రింశో ధ్యాయః : ఇరువది తొమ్మిదవ అధ్యాయము
కాశీ వర్ణనమ్‌

కాష్ఠీలోవాచ

ఏవం సా రాక్షసీ సుభ్రు హస్తనీ రూపధారిణీ | త్రిభుర్ముహూర్తై స్సంప్రాప్తా కాశీం విశ్వేశ మందిరమ్‌ 1
ఉవాచ తాం పురీం ప్రాప్య భర్తారమసితేక్షణా | ఇయం పాపతరోః కాంత కుఠారా పరికీర్తితా 2
షడూర్మికాంచసై#్యషా కాంత ప్రోక్తా దురోదరీ | కర్మ బీజోప శమనీ సర్మేషాం గతిదాయినీ 3
ఆద్యం హి వైష్ణవం స్థానం పురానా స్సంప్రచక్షతే | నా వైష్ణవే స్థలే ముక్తి స్సర్వస్యతు కదాచన 4
మాధవస్య పురీ చేయం పూర్వమాసీద్ద్వజోత్తమ | ముక్తిదా సర్వంజంతూనాం సర్వపాపణ్రాశినీ 5
ఏకదా శంకరో దేవో ద్రష్టుం ప్రాగాత్పితామహమ్‌ | సర్వలోకైక కర్తారం బ్రాజపమానం స్వతేజసా 6
గత్వా తత్ర మహదేవో బ్రహ్మాణం జగతాం గురుం | నమస్కృత్య స్థితో హ్యగ్రే వేదపాఠం నిశామయన్‌ 7

చతుర్భిరద్భుతైర్వక్త్రైః చతురో నిగమాన్ముదా | ఉద్గిరంతం జగన్నాథం దృష్ట్వా ప్రీతోక్య
, భవత్తదా 8
అథ తత్పంచమం వక్త్రం బ్రహ్మణో భూతనాయక | ప్రగల్భం తముపాలక్ష్య క్షణాజ్ఞాతః సమత్సరః 9
సక్రోధ జన్మా విప్రేంద్ర తస్య ప్రాగల్భ్యమక్షయం | చకర్త తన్నఖాగ్రేణ స్వస్థం వక్త్రం త్రిలోచన 10
తచ్ఛిన్నం బ్రహ్మణః శీర్షం సంలగ్న కరపల్లవే | వామే నిర్దూతమనిశం న నివృత్తం ద్విజోత్తమ 11
బ్రహ్మా తు దుఃఖితో భూత్వా తస్థౌ స్థాణుం వ్యలోకయన్‌ | రుద్రోపి లజ్జితో భూత్వా నిర్జగామ త్వరాన్వితః 12
బహుధా యతమానోపి తచ్ఛిరః క్షేప్తుమాతురః | న శశాక పరిత్యక్తుం తదద్భుతమభూన్మహత్‌ 13
చింతయా వ్యాకులో భూత్వా సస్మార గరుడధ్వజమ్‌ | తేన సంస్మృత మాత్రస్తు శీఘ్రమావిరభూచ్చ సః 14
తం దృష్ట్వా దేవదేవేశం విష్ణుం సర్వగతం ద్విజ | ననామ శిరసా నమ్రో నిష్ప్రభో వృషభద్వజః 15
తం తథాతురమాలక్ష్య భీతం బ్రహ్మద్రుహం హరిః సమాశ్వాశ్వాస్యాబ్రవీద్వాక్యం తత్తోష పరికారకమ్‌ 16
శంభో త్వయా కృతం పాపం యచ్ఛిన్నం బ్రహ్మణః శిరః | తత్ఫలం భుంక్ష్వ సర్వజ్ఞ కియత్కాలం కృతం స్వయమ్‌ 17
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ | నా భుక్తం క్షీయతే కర్మ హ్యపి జన్మశ##తైః ప్రియ 18
కిం కరోమి క్వ గచ్ఛామి త్వాం దృష్ట్వా దుఖితం హరమ్‌ | ప్రాణా వికలతాం యాన్తి మమ త్వద్దుఃఖదర్శనాత్‌ 19
యాని కాని చ పాపాని మహాంతి మహతాంగతే | న తాని బ్రహ్మహత్యాయాః సమానీతి మతిర్మమ 20
యస్త్వం సర్వస్య లోకస్య గురుర్ధర్మోపదేశకః | బ్రహ్మ హత్యాభి భూతస్తు క్షణం స్థాతుం న చ క్షమః 21
ఏషా ఘోరతరా హత్యా మీనగం ధ్యా జరాతురా | లేలివానా సురేశాన గ్రహీతుం త్వానుధావతి 22
తస్మాన్నైకత్ర భవతా స్థేయం ద్వాదశ వత్సరమ్‌ | అటనీయం హితార్ధాయ పాపనాశాభికామ్యాయ 23
అటిత్వా ద్వాదశాబ్దాని తీర్దేషు సకలేషు చ | ప్రక్షాళయన్‌ కరం వామ భిక్షాం గృహ్ణన్కపాలకే 24
శుద్ధిం యాస్యసి దేవేశ పాపాదస్మాత్సుదారుణాత్‌ | ఇత్యుక్తో విష్ణునా విప్ప స్థాణుః సర్వగతో భవత్‌ 25
కపాల మోచనార్థం హి పాణిం ప్రక్షాళయన్‌ జలే | వర్షత్రయం భ్రమిత్వా తు ప్రాప్తో బదరికాశ్రమమ్‌ 26
భిక్షార్ధం దేవదేవస్య ధర్మపుత్రస్య మానద | ద్వారస్థో దేమి భిక్షాం మే విష్ణో ఇత్యవదన్మహుః 27
తతో నారాయణో దేవో దృష్ట్వా ద్వారి స్థితం హరమ్‌ | గృహాణ భిక్షామిత్యుక్త్వా ప్రదదౌ దక్షిణం కరమ్‌ 28
తతో హరో హరిం దృష్ట్వా భిక్షాం దాతుం సముద్యతం | ప్రాహరద్దక్షిణం పాణిం త్రిశూలేన ద్విజోత్తమ 29
తత్త్రి శూల క్షతాద్థారాః తిస్రో లోకభయం కరాః | ఏకా క్షతజధారా తు కపాలే న్యపతత్తదా 30
ద్వితీయా తన్ముఖేప్రాప్తా పయస్యథ తృతీయకా | జలధార శివం ప్రాప్తా మరస్య హేతురగ్రతః 31
తా ధారాస్త్రీణి వర్షాణి సంసేవ్య విధివద్ధరః | కించి త్ప్రీతో యా¸° క్షేత్రం కురోః పుణ్యకరం ద్విజ 32
కాష్ఠీల పలికెనుః ఇట్లు ఆడయేనుగు రూపమును ధరించిన ఆ రాక్షసి మూడు ముహూర్తముల కాలములో విశ్వేశ్వరుని నివాసమగు కాశీ నగరమును చేరెను. ఆ నగరమును చేరిన రాక్షసి భర్తో ఇట్లు పలికెను. ఓ ప్రియా ఈ కాశీ నగరము పాపమను వృక్షమునకు గొడ్డలివంటిది. షడూర్మికాంచనమునకు ఈ నగరము దురోదరి. కర్మయను బీజమును శమింప చేయునది. అందరికి సద్గతిని ప్రసాదించునది. ఈ నగరము మొదట విష్ణుక్షేత్రమని పురాణములు చెప్పుచున్నవి. విష్ణుక్షేత్రము కాని చోట ఎవరికీ మోక్షము కలుగదు. ఈ నగరము పూర్వము శ్రీహరి నగరము. సర్వప్రాణులకు మోక్షమును ప్రసాదించునది. అన్ని పాపమును నశింప చేయుదని. ఒకప్పుడు శివుడు సర్వలోక కర్త తన తేజస్సుచే ప్రకాశించుచున్న పితామహుని చూచుటకు బయలుదేరెను. బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి, వేదమును వినిపించుచు బ్రహ్మముందు నిలిచెను. నాలుగు ముఖములచే నాలుగు వేదలములను పఠించుచు బ్రహ్మ ముందు నిలిచెను. నాలుగు ముఖములచే నాలులు వేదములను పఠించుచున్న జగన్నాధుడగు బ్రహ్మను చూచి శంకరుడు ప్రీతి చెందెను. ఇక బ్రహ్మయొక్క అయిదవ ముఖము ప్రగల్భముగా నుండుట చూచిన శంకరుడు క్రోధావిష్టుడాయెను. ప్రగల్భముతోనున్న ఆ అయిదవ ముఖమును త్రిలోచనుడు కోపముచే నఖాగ్రముతో ఖండించెను. అట్లు ఛేదించబడిన బ్రహ్మ శిరస్సు శివుని వామహస్తమును అంటియుండెను. వదలిపెట్టలేదు. బ్రహ్మ కూడా దుఃఖితుడై శివుని చూచుచుండెను. రుద్రుడు కూడా లజ్జితుడై త్వరగా బయలుదేరెను. పలు విధములుగా ఆ శిరమును వదిలించుకొనుటకు ప్రయత్నించినను ఆ శిరము విడివడలేదు. ఈ సంఘటన చారా ఆశ్చర్యమును కలిగించెను. చింతవ్యాకులడై శ్రీ హరిని స్మరించెను. శివుడు స్మరించిన వెంటనే శ్రీహరి ఆవిర్భివించెను. దేవదేవుడు, సర్వ వ్యాపియగు శ్రీ మహావిష్ణువును చూచిన శంకరుడు తేజోహీనుడై వినయముగా శిరస్సును వంచి నమస్కరించెను. అట్లు చింతవ్యాకులుడు బ్రహ్మద్రోహి, భయాతురుడగు శివుని ఓదార్చి అతని సంతోషకరమగు మాటలను పలికెను. ఓ శంకర నీవు బ్రహ్మ శిరమును ఖండించి పాపమునాచరించితివి. కావున స్వయం కృతాపరాధ ఫలమును కొంతకాలము అనుభవించుము. ప్రతి ప్రాణి తానాచరించిన శుభాశుభభకర్మలను ఆనుభవించియే తీరవలయును. నూరు జన్మలలోనైనను అనుభవించనిదే కర్మనశించదు. నేనేమి చేతును? ఎటు వెళ్ళదును? దుఃఖితుడవగు నిన్ను చూచి, నీ దుఃఖమును చూచి నా ప్రాణములు వికలములగు చున్నవి. ఈలోకములోని మహాపాపములన్నియూ బ్రహ్మహత్యతో సమములు కాజాలవు. నీవు సర్వలోకములకు గురువువు. దర్మమునుపదేశించువాడవు. అయిననూ బ్రహ్మహత్యాపాతకముచే పరాభూతుడవై ఒక్క క్షణము కూడా నిలువుజాలవు. ఈ బ్రహ్మహత్య మహా ఘోరము. మత్స్యగంథము కలది. జరాతుర నాలకను బయటికి చాచి నిన్ను పట్టుకొనుటకు నీవెంట పరుగెట్టి వచ్చుచున్నది. కావున నీవు పన్నెండు సంవత్సరములు ఒకేచోట నిలువక పాపనాశనమును కోరి అంతటా తిరుగు చుండవలయును. పన్నెండు సంవత్సరములు సకల తీర్థములలో తిరుగుచు వామహస్తమును ప్రక్షాళనము చేసుకొనుచు కపాలమున భిక్షను స్వీకరించుచు ఈ దారుణమగు పాపమునుండి విముక్తుడవగుదువు. ఇట్లు శ్రీహరి పలుకగా శివుడు అన్ని తీర్థములలో తిరుగుచుండెను. కపాలమును విడిపించుకొనుటకు జలములలో హస్త ప్రక్షాళనమును గావించుకొనుచు మూడు సంవత్సరములు తిరిగి బదరికాశ్రమమును చేరెను. ధర్మపుత్రుడు దేవదేవుడగు శ్రీ మహా విష్ణువు నుండి భిక్షను స్వీకరించదలచెను. ద్వారమున నిలిచి విష్ణూ నాకు భిక్షనిమ్ము అని పలికెను. అంతట నారాయణ దేవుడు ద్వారమున నిలిచియున్న హరుని చూచి భిక్షను స్వీకరించమని దక్షిణహస్తమును చాచెను. అట్లు భిక్షనిచ్చుటకు చూచిన శ్రీహరి దక్షిణహస్తమును చూచి హరుడు త్రిశూలముచే ప్రహరించెను. అట్లు త్రిశూలముచే అయిన గాయము నుండి లోకభయంకరములగు మూడు ధారలు వెడలెను. ఆ ధారలు ప్రస్థద్వాదశహస్త ప్రమాణములు చిత్రవర్ణములు గలవిగా నుండెను. ఆ మూటిలో ఒక రక్త ధారమూత్రము హరుని కపాలమున పడెను. రెండవ ధార శివుని ముఖమున వడెను. మూడవది జలమునపడెను. ముందు పాపమును హరించుచుటకు హేతువగునది శివుని ఒక జలధార చేరినది. ఆ మూడు ధారలను శివుడు యధావిధిగా మూడు సంవత్సరములు సేవించి కొద్దిగా ప్రీతిని చెంది పుణ్యకరమగు కురుక్షేత్రమును చేరెను.
తత్ర గత్వా హరః స్థాణు ర్ధూత స్తత్ర పపాత చ | 33
బ్రహ్మహ్రదే త్రివర్షాణి మగ్నో బ్రహ్మహ్రదాంబుని | వర్షత్రయే గతే తత్ర క్షతార్ధాంగో వినిస్తృతః | 34
చిరం తుష్టావ దేవేశం విష్ణుం సర్వగుహాశయమ్‌ తత్తస్తుష్టో జగన్నాధో వరం తసై#్మ దదౌ తు సః 35
గచ్ఛ కాశీమితో భ్రాంత్వా తీర్ధాని బహుశో హర | తతో హరిం నమస్కృత్య పరీత్య బహుధా తధా | 36
క్రమాత్తీర్ధాటనం కుర్వన్‌ అవిముక్తపురీం గతః | అవిముక్తస్య సీమాయం ప్రావిశద్వీక్ష్య ధూర్జటిః 37

నాపశక్యత్తామనుప్రాప్తాం బ్రహ్మహత్యాం బహిస్థ్సితామ్‌ | తతో
% సౌ వైష్ణవం జ్ఞాత్వా క్షేత్రం దురితనాశనమ్‌ 38
తుష్టావ ప్రయతో భూత్వా మాధవం వన్ద్యమీశ్వరమ్‌ 39
జయజయ జగదీశనాధవిష్ణో జగదానన్ద నిధాన వేదవేద్య | మధు మధన నృసింహ పీతవాసో గరుడాధిష్ఠిత మాధవదేవ 40
వ్రజరమణ రమేశ రాధికేశ త్రిదేశేశాఖిల కామ్యపూరకృష్ణ | సురవర కరుణార్ణవారినాశిన్‌ నలినాక్షాధిపతే విభో పరేశ 41
యదుకుల తిలకాబ్ధివాస శౌరే కుధరోద్దార విధ్మాన క్షధన్విన్‌ | కలికలుషహరాంఘ్రిపద్మయుగ్మ గృణదాత్మప్రద కూరశ్యపోత్థ 42
కుకుపతి వనపావకాఖిలేజ్యా స్రపకాలాశిత వస్త్రబుద్ధ కల్కిన్‌ | భవభయహర భక్తవశ్య గోప ప్రణతోద్ధారక పుణ్యకీర్తినామ 43
ధరణీ భరహరాసురారిపూజ్య ప్రకృతీశేశ జగన్నివాస రామ | గుణగణ విలసచ్చరాచరేశ త్రిగుణాతీత సనాతనాగ్రపూజ్య 44
నిజజనపరిరక్షితాంతకరే కమలాంఘ్రే కమనీయ పద్మనాభ | కమలకర కుశేశయాధివాస ప్రియకామోన్మదన త్ర్యధీశవంద్య 45
అఘహర రఘనాధ యాదవేశ ప్రియభూదేవ పరాత్పరామరేజ్య! | హలధర దురితాపహప్రణమ్య త్రిగుణవ్యాప్త జగత్త్రి కాల దక్ష! 46
దనుజకుల వినాశ##నైక కర్మ న్నన ఘారూఢ ఫణీశ కంసకాల | రవి శశినయన ప్రగల్ఛ చేష్ట! ప్రదుతధ్వాంత నవాంబుదాభ మేశః 47
మఖమఖ ధర మాతృబద్ధదామ న్నవనీత ప్రియ వల్లవీగణశ! | ఆఘబక వృషకేశిపూత నాంత త్రిశిరోవాలి దశాస్యభేదకారిన్‌ 48
నరకపుర వినాశబాణదోః కృ త్త్రిపురారీజ్య సుదామమ్రితసేవ్య భవతరరణ పవిత్ర పాదపద్మ ప్రకటైశ్వర్య పురాణ పూర్ణబాహో 49
బహు జని సుకృతాప్య మంగలార్హ శ్రుతివేద్య శ్రుతి ధామ శాంతశుద్ధన్న వరద వరేణ్య మంఘ్రియుగ్మం శరణం ప్రాప్తమఘార్దతం ప్రపాహి 50

నహి మమగతిదం పురాణ పుంసో
% న్యదితి ప్రార్ధనయా ప్రసీద మే%ద్య 51
ఇతి స్తుతో జగన్నాధో భక్త్వాదేవేన శంభునా | ఆవిర్బభూవ సహసా మాధవో భక్తవత్సలః 52
కురుక్షేత్రమును చేరిన హరుడు స్థాణువై అచటనే పడెను. మూడు సంవత్సరములు బ్రహ్మహ్రదజలమున క్రుంకులిడెను. అచట మూడు సంవత్సరములు గడుపగా కపాలమున సగభాగము విడిచెను. సర్వగుహాశయుడగు శ్రీహరిని చాల కాలము స్తుతించెను. అట్లు స్తుతించబడిన శ్రీహరి శివునికి వరమునిచ్చెను. ఓ శివా చాలా తీర్ధములను పర్యటించి ఇక్కడి నుండి కాశీ నగరమునకు వెళ్ళుము. అంతట శ్రీహరికి నమస్కరించి చాలా మార్లు ప్రదక్షిణములనాచరించి తీర్ధయాత్రలను పర్యటించుచు అవిముక్త పురిని (కాశీ నగరమును) చేరెను. కాశీ నగర సీమను ప్రవేశించుచు వెనుక తిరిగి చూచెను. అచట తన వెనక బ్రహ్మహత్య రాక పోవుటను చూచెను. సీమకు అవతర నిలిచి యుండుటను గమనించెను. అప్పుడు ఇతి వైష్ణవక్షేత్రము పాపనాశనము అని తెలిసి సర్వవంద్యుడగు మాధవుని శ్రద్ధతో స్తుతించెను. ఓ జగదీశా! నాధా! విష్ణూ! జగదానన్ద నిధాన! వేదవేద్యా! మధుమధన! నృసింహా! పీతాంబరధారీ! గరుడవాహనా! మాధవా, ఆదిదేవా గోపనాయక! రమేశ ! రాధాపతీ! దేవేశ! సకల కామపూర! కృష్ణ! జయము జయము. సురవర! వరుణ సాగరా! ఆర్తినాశక! పుండరీకాక్ష! అధిపతి! విభో! పరేశ! యదు కుల తిలక! సాగరవాస! శౌరీ! పర్వతోద్ధార దక్ష! ధనుర్ధారీ! కలికలుషాపహరణ! పద్మపాద ! గృణద! ఆత్మప్రద! కూర్మ! వామనా! వరాహా! నరసింహా పరశురామా! యజ్ఞరూపా! కాలాశితవస్త్రధారీ! బుద్ధిరూపా కల్కీ! భవభయహరణ! భక్తవశ్య! గోపాలక! ప్రణతోద్ధారక! పుణ్యకీర్తి నామ! భూభారహరణ! దేవపూజ్య! ప్రకృతీశ | జగన్నివాస! రామ! గుణగణ విలసచ్చరాచరేశ! త్రిగుణాతీత! సనాతన ! అగ్రపూజ్య! నిజజన పరిరక్షిత! అంతకరిపూ! కమలపాద! సుందర! పద్మనాభ! కలమకర! కుశేశయాధి వాస ప్రియ! కామానన! త్రిగుణాధీశ! త్రిమూర్తి వరదా! పాపహరణ! రఘునాధ! దురితాపహరణ! త్రిగుణవ్యాప్త జగత్‌! త్రికాలదక్ష! తనుజకుల వినాశ##నైక కర్మ! అనఘారుఢ! ఫణశ! కంసనాశా! సూర్యచన్ద్రనేత్ర! ప్రగల్భ చేష్ట! ధ్వాంతహరణ! నవజలదశ్యామదేహా! లక్ష్మీనాధా ! యజ్ఞరూపా యజ్ఞధర ! మాతృబద్ధదామ! నవనీత ప్రియ! గోపీజనప్రియ! అఘ, బక, వృషకేశి, పూతనాంతక! త్రిశిరోవాలి దశాస్యభేదక! నరకపుర వినాశన! బాణబాహుచ్చేదక! త్రిపురారిపూజ్య, సుదామమిత్ర! సంసారతారణ! అహిత్రపాదపద్మ! ప్రకటైశ్వర్య! పురాణ పురుష! ఆ జానుబాహు బహుజన్మ పుణ్యప్రాప్య! మంగళార్హ! శ్రుతివేద్య! శ్రుతిధామ! శాంత! శుద్ధ! వరద! వరేణ్య! నీ పాదపద్మములను శరణు పొందితిని. పాపపీడుతుడనగు నన్ను కాపాడుము. నాకు సద్గతిని ప్రసాదించువారు నీకంటే ఇతరులు లేరు. నా ప్రార్థనచే ప్రసన్నుడవు కమ్ము! ఇట్లు దేవదేవుడగు శంకరుడు భక్తిచే స్తుతించగా భక్తవత్సలుడగు శ్రీ నాధుడు వెంటనే అచత ఆవిర్భివించెను.
తం దృష్ట్యా దండవద్భూమౌ నిపపాత హరో హరిమ్‌ | పునరుత్ధాయ విప్రేన్ద్ర ననామ విధృతాంజలి! 53

తమువాచ హృషేకేశః ప్రణతం భూతనాయకమ్‌ | వరం వృణు ప్రదాస్యే
% హం సంతుష్ట స్తోత్రతస్తవ 54
తచ్ఛ్రుత్వా భగవద్వాక్యం భూతేశో బ్రహ్మహత్యయా | పీడితాత్మా జగాదేదం భుక్తిముక్తి ప్రదం హరిమ్‌ 55
ఇచ్ఛామి వసితుం క్షేత్ర తవ చక్రగదాధార! త్వత్‌క్షేత్ర సీమాబాహ్యస్థా బ్రహ్మహత్యా యదీక్ష్యతే 56
క్షేత్ర దానేన కారుణ్యం కురుమే గరుడధ్వజ | మమ నిర్గమనే బ్రహ్మ హత్యా మా పునరేష్యతి 57

త్వత్‌క్షేత్రే సంస్థితో
% హం తు పూజాం ప్రాప్య్సే జగత్త్రయే | ఇత్యుక్త్వా హ్యభవత్తూష్ణీం దేవదేవం వృషధ్వజః 58
తధేతి ప్రతిపేదే చ క్షీరసాగర జాప్రియః | తతః ప్రభృతి విప్రేన్ద్ర శైవం క్షేత్రం నిగద్యతే 59
క్షేత్రం తు కేశవస్యేదం పురాణం కవయో విదుః | కృపయా సంపరీతస్య మాధవస్య ద్విజోత్తమ 60

నేత్రాభ్యాం నిర్గతం వారి తేన బిందు సరో
%భవత్‌ | మాధవస్యాజ్ఞయా తత్ర సస్నౌదేవో వృషధ్వజః 61
స్నాతమాత్రే హరే తత్తు కపాలం పాణితో
% పతత్‌ | కపాలమోచనం నామ తత్తీర్ధం ఖ్యాతి మాగతమ్‌ 62
బిందు మాధవ నామాసౌ దత్వా స్వం ధామ శూలినే | భక్తి భావేన శంభుస్తు అబద్ధస్తత్ర సంస్థితః 63
యంతు బ్రహ్మదయో దేవా స్స్వస్థాః పశ్యన్తి సర్వదా | సూర్యాయుత సమప్రఖ్యం దిగంబర నిషేవితమ్‌ 64
విఘ్నాని శూలినా కాంత కృతాన్యస్య నిషేవణ | యైర్విఘ్నైరభిభూతాస్తు స్తుత్వా విష్ణుం శివార్చకాః 65
సర్వే లోకా స్థ్సితా హ్యత్ర శివః కాశీతి చింతకాః | శివస్య చింతనాద్విష్ణు శైవాస్సర్వేనిరామయాః 66
ప్రయాంతి శివలోకాం వై జరామృత్యు వివర్జితమ్‌ | బాహుపుణ్యయుతాస్సన్తో నివసన్త్యత్ర నీరుజా 67
యజ్ఞ శిష్ఠాశినః కాశీ కాన్తఋద్ధి సమన్వితాః | నాత్ర స్నానం ప్రశంసన్తి న జపం నసురార్బనమ్‌ 68
నాపి దానం ద్విజశ్రేష్ఠ ముక్త్వైవం దేహపాతనమ్‌ | మృత్యుం ప్రాప్య నరః కామం కృతకృత్యో భ##వేద్ధ్రువమ్‌ 69
సేయ మాసాదితా విప్ర పురీప్రాసాద సంకులా భోగినా మపిమోక్షాయ కింపునర్వ్రత ధారిణామ్‌ 70
నిక్షిప్యతామియం బాలా కాశీశ##స్యేహమందిరే | వియోజితా తు యా పూర్వం తేన దుష్టేన రక్షసా 71

ఆత్మనస్సురతార్ధాయ కుమారీ నియమాన్వితా | ఏష ప్రభావో
% భిహితః క్షేత్రస్యాస్య ద్విజోత్తమ 72
వినశ్యంతీహ కర్మాణి శుభాన్యప్యశుభానిచ | భూతభవ్య భవిష్యాణి జ్ఞానా జ్ఞానకృతానిచ 73
ఏషా పురీ కర్మ వినాశనాయ కృష్ణేన పూర్వం హి వినిర్మితాభూత్‌ | యస్యాం మృతా దుఃఖమనంత ముగ్రం భుంజంతి మర్త్యా యమయాతనాం నో 74
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ
ఉత్తభాగే మోహినీ చరితే
కాష్ఠీలోపాఖ్యానే రాక్షసీ చరితే
కాశీవర్ణనం నామ

ఏకోనత్రింశో
ధ్యాయః అట్లు ఆవిర్భివించిన శ్రీహరిని చూచి హరుడు దండవత్ర్పణామము నాచరించెను. మరల లేచి చేతులు జోడించి నమస్కరించెను. ఇట్లు నమస్కరించుచున్న భూతనాయకుని హృషీకేశుడిట్లు పలికెను. నీ సోత్తమ్రునకు సంతోషించింతిని. ఏమి వలరము కావలయునో కోరుకొనుము. ఇచ్చెదను. అని ఆ శ్రీహరి వాక్యమును వినిన భూతేశుడు బ్రహ్మహత్యచే పీడించబడుచు భక్తి ప్రదాయకుడగు శ్రీహరితో ఇట్లు పలికెను. చక్రగదారా! నీ క్షేత్రమున నివాసమును చేయగోరుచున్నాను. బ్రహ్మహత్య నీ క్షేత్రసీమకు అవతల నున్నది. గరుడ ధ్వజా నాకు క్షేత్రదానమును గావించి దయ చూపుము. నేను ఇటునుండి మరలి వెళ్ళినచో బ్రహ్మహత్య మరల నా వెంటపడును. నీ క్షేత్రమున నేను నివసించినచో ఈ మూడు లోకములలో పూజలనందగలను. ఇట్లు పలికి వృషధ్వజుడు ఊరకుండెను. రమాప్రియుడు అట్లే అని అంగీకరించెను. అప్పటి నుండి ఈ కాశీపురము శివక్షేత్రమనబడుచున్నది. కాని ఇది పూర్వము విష్ణుక్షేత్రమని విద్వాంసులు తెలియదురు. దయార్ద్రహృదయుడగు మాధవుని నేత్రముల నుండి నీరు వెడలివచ్చెను. ఆ జలము బిందు సరస్సుగా మారెను. మాధవుని ఆజ్ఞ చే యచట వృషధ్వజుడు స్నానము గావించెను. ఆ బిందు సరస్సులో స్నానమాడినంతనే శంకరుని చేత నుండి కపాలము వీడి పడెను. కావున ఆ తీర్థమునకు కపాలమోచన తీర్ధమని ప్రసిద్ధి కలిగెను. ఈ సరస్సు బిందుమాధవ సరస్సు లని కూడా పేరు వచ్చెను. శ్రీహరి శంకరునికి తన క్షేత్రమునిచ్చి వెడలెను. శంకరుడు కూడా భక్తి భావముచే అచట నిలిచెను. ఇచట నున్న శంకరుని బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానములలో నుండియే ఎల్లవేళలా చూచుచుందురు. ఇచట శంకురుడు పదివేల సూర్యులతో సమమగు కాంతి గలవాడు, దిగంబర నిషేవితుడు, తనను సేవించుటలో శూలియే విఘ్నములను కలిగించుచుండెను. ఇట్లు విఘ్నములు కలుగగా శివార్చకులు శ్రీహరిని స్తుతించి విఘ్నములను తొలగించుకొందురు. ఇచట శివుని కాశీనగరమును ధ్యానించుచు అన్ని లోకమలు నిలిచినవి. శివుని ధ్యానించు శైవులందరూ చింతలేనివారైరి. జరామృత్యురహితలై శివలోకమును చేరెదరు. ఇహలోకమున కూడా బహు పుణ్యయుతులై రోగహీనులై నివసించెదరు. యజ్ఞశేషమును భుజించుచుందురు. బుద్ధియుతులగుదురు. ఈ కాశీ క్షేత్రమున స్నానము, జపము దైవపూజ, దానము కూడా విధించబడలేదు. ఇచట మరణించుట యొకటే ప్రశంసించబడినది. ఈ కాశీ నగరమున మరణించినవారు కృతకృత్యులగుదురు. అట్టి కాశీ నగరమును చేరితిమి. భోగులకు కూడా మోక్షమును ప్రసాదించున్న ఇక వ్రతధారుల విషయము చెప్పనేల? ఈ రాజకుమారిని కాశీనాధుని మందిరమున నుంచుము. ఈ రాజకుమారిని దుష్టుడగు రాక్షసుడు విడదీసెను. నియమాన్వితయగు ఈ కుమారిని తన భోగము కొఱకు తీసుకొనివచ్చెను. ఇది కాశీ క్షేత్ర మహాత్మ్యము. నీకు సవిస్తరముగా వివరించితిని. ఇచట శుభాశుభకర్మలు అన్నియూ నశించును భూత భవ్యభవిష్య కర్తలు జ్ఞానాజ్ఞానకృతములగు కర్మలు కూడా నశించును. ఈ కాశీ నగరమున శ్రీహరి కర్మనాశమునకు నిర్మించెను. ఈ కాశీనగరమున మరణించిన వారు అనంతము ఉగ్రమగు దుఃఖమును యమయాతనలను అనుభవించరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున
మోహినీ చరితమున కాష్ఠీలో పాఖ్యానమున
రాక్షసీ చరితమున కాశీ వర్ణనమను
ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page