Sri Naradapuranam-3 Chapters Last Page
ద్వాత్రింశ త్తమోధ్యాయః = ముప్పది రెండవ అధ్యాయము
సంధ్యావలీ కథనమ్
సంధ్యావలీవచః శ్రుత్వా మోహినీ దుహితా విధేః | ఉవాచ తత్పరా స్వీయే కార్యే మోహకరండికా1
యద్యేవం త్వం విజానాసి ధర్మాధర్మం గతిం శుభే | భర్తురర్ధే ప్రదాత్రీ చ ధన జీవితయోరపి2
తదాహం యాచయే విత్తం జీవితాదధికం శుభే | దేహి పుత్ర శిరో మహ్యం యదిష్టం హృదయాధికమ్3
యది నో బోజనం కుర్యా త్సంప్రాప్తే హరివాసరే | తదా స్వహస్తే సంగృహ్య ఖడ్గం రాజా పతిస్తవ4
ధర్మాంగద శిర శ్చారు చన్ద్రబింబోపమం శుభమ్ | అజాత శ్మశ్రుకం చైవ కుండలాభ్యాం విభూషితమ్5
ఛిత్వా శీఘ్రం పాతయతు మమోత్సంగే సులోచనే | ఏతద్వా కురు తద్భద్రే ఏ యదాన్నం న భునక్తి చ6
దినే మాధవ దేవస్య పాప సంఘ వినాశ##నే | తచ్ఛ్రుత్వా వచనం తస్యా మోహిన్యాః కటుకాక్షరమ్7
సంధ్యావలీ తతో ధైర్య మాస్ధాయ వరవర్ణినీ 8
ఉవాచ మోహినీం వాక్యం సంముఖీ ప్రహసన్త్యసి | శ్రూయన్తే హి పురాణషు గాధాస్సుభ్రు సమీరితాః9
ద్వాదశీం ప్రతిసంబద్ధా స్స్వర్గమోక్ష ప్రదాయికాః | ధనం త్యజేత్త్యజే ద్దారాన్ జీవితం చ గృహంత్యజేత్ 10
త్యజేద్దేశం తధా భూపం స్వర్గం మిత్రం గురుం త్యజేత్ | త్యజేత్తీర్ధం త్యజేద్దర్మం త్యజేదత్యంత సుప్రియమ్ 11
త్యజేద్యోగం త్యేజేద్దానం జ్ఞానం పుణ్యక్రియాం త్యజేత్ | తపస్త్య జేత్త్య జేద్విద్యాం సిద్దం మోక్షం త్యజేచ్ఛుభే 12
నత్యజేద్ద్వాదశీ పుణ్యాం పక్షయో రుభయోరపి | ఇపి సంబంధిన స్సర్వే పుత్రభ్రాతృ సుహృత్ర్పియాః 13
ఐహికాముష్మికే దేవి సాధనీ ద్వాదశీ స్మృతా | ద్వాదశ్యాస్తు ప్రభావేణ సర్వం క్షేమం భవిష్యతి 14
దాపయే తవ తుష్త్యర్దం ధర్మాంగద శిర శ్శుభే | విశ్వాసం కురు మే వాక్యే సుఖినీ భవ శోభ##నే 15
ఇహర్ధే శ్రూయతే భ##ద్రే ఇతహాసః పురాతనః | కధయిష్యామి తే భ##ద్రే సావధానా శృణుష్వమే 16
వసిష్ఠ మహర్షి పలికెను ః బ్రహ్మపుత్రిక యగు మోహని సంధ్యవలీదేవి మాటలను వినిమోహపరవశురాలై స్వకార్య తత్పరురాలై ఇట్లు పలికెను. ఓ శుభకరురాలా? నీవిట్లు ధర్మాధర్మ స్వరూపమును తెలిసి భర్త కొరకు ధన జీవితముల నీయదలచినచో నేను జీవితమున కంటే అధికమగు విత్తమును యాచించెదను. నీకు చాలా ఇష్టమగునది హృదయము కంటె అధికమగు నీ పుత్రుని శిరమును నాకిమ్ము. నీ భర్త ఏకదాశి నాడు భోజనము చేయనిచో నీ భర్తయే స్వయముగా తన హస్తమున ఖడ్గమున తీసుకొని, చంద్రబింబము వంటి శుభకరమగు, మీసముల మొలవని. కుండలవిభూషితము అగు పుత్రుని శిరమును ఛేదనము గావించి నావడిలో పడవేయ వలయును. ఏకదశిన భుజించనిచో ఈ పనిని చేయమని చెప్పుము. మోహినీదేవి పలికిన పరుష పదజాలమును వినిన సంధ్యావలీ దేవి శీతార్తమగు కదలీ వృక్షమువలె క్షణకాలము వడకెను. తరువాత ధైర్యమును కూడ గట్టుకొని మోహిని ఎదురుగా నవ్వుచు మోహినితో ఇట్లు పలికెను. ఓ సుందరీ! పురాణములో ద్వాదశిని గురించి స్వర్గమోక్షప్రదములగు చాలా కధలు వినబడుచున్నవి. ధనమును భార్యను, జీవితమును, గృహమును దేశమును, రాజును, స్వర్గమును, మిత్రుని, గురువును, తీర్ధమును, ధర్మమును అత్యంత ప్రియమును కూడా ఏకాదశీ వ్రతము కొఱకు విడువ వలయును. యోగమును, దానమును, జ్ఞానమును, పుణ్యక్రియలను కూడా విడువవలయును. తపస్సును, విద్యను, సిద్దిని మోక్షమును కూడా విడువవలయును. కాని శుక్లకృష్ణ పక్షములలోని ద్వాదశిని మాత్రము విడువరాదు. బంధువులు, పుత్రులు, సోదరులు, మిత్రులు, ప్రియులు ఈ లోకమున సంబంధము కలవారు. కాని ద్వాదశి మాత్రము ఇహపరములను సాధించగలది. ద్వాదశీ ప్రభావముచే సర్వము క్షేమప్రదము కాగలదు. కావు ఓ సుందరీ! నీ సంతోషము కొఱకు ధర్మాంగదుని శిరమును ఇప్పించగలను. నా మాట యందు విశ్వాసమునుంచుము సంతోషించుము. ఓ మంగళప్రదురాలా! ఈ విషయమునే పురాతనమగు ఇతిహాసమొటి కలదు. దానిని నీకు చెప్పెదను. సావధానముగా వినుము.
ఆసీద్విరోచన ః పూర్వం దైత్యో ధర్మపరాయణః | తస్య భార్యా విశాలక్షీ ద్విజ పూజన తత్పరా 17
నిత్యమేక మృషిం ప్రాతః పూజయిత్వా యధావిధి | పాదోదకం తస్య సుభ్రు భక్త్యా పిబతి హృష్టధీః 18
ప్రాహ్లాదిశంకితా దేవా ఆసన్పూర్వం మృతే సతి | హిరణ్యకశిపౌ రాజ్యం శాసతి హ్యుగ్రతేజసి 19
ప్రాహ్లాదౌ హ్లాద సంయుక్తే చరుర్వ్యగ్రా మహీతలే | ఏకదా శక్రము ఖ్యాస్తే దేవాస్సంమన్త్య్ర వాక్పతిమ్ 20
ప్రోచుః కిం కార్యమధునా స్మాభి శ్శత్రు ప్రతాపితైః | త చ్ఛ్రుత్వా భాషితం తస్య గురోరమితతేజసః 22
విరోచన ప్రాణహత్యై జగర్మర్వైకుంఠ మంతికే | తత్ర గత్వా సుర శ్రేష్ఠం వైకుంఠం తుష్టువుస్త్సవైః 23
పూర్వకాలమున ధర్మాపరాయణుడు వరోచనుడను దైత్యుడుండెను. అతని భార్య విశాలాక్షి. బ్రాహ్మణ పూజాపరురాలు. ప్రతిదినము పాత్రఃకాలము ఒక ఋషిని యధావిధిగా పూజించి అతని పాదోదకమును భక్తితో సంతోషముతో పానము చేసెడిది. హిరణ్యకశ్యపుడు మరణించిన తరువాత ఉగ్రతేజస్సు గల ప్రహ్లదపుత్రుడగు విరోచనుడు రాజ్యపాలన చేయుచుండగా భూమండలవాసులు నిశ్చింతులైరి. ఒకపుడు ఇంద్రాది దేవతలు గురువును చేరి శత్రు తాపితుల మగు మేము ఏమి చేయవలయును అని యడగిరి. వారి మాటలను వినిన బృహస్పతి దుఃఖితులగు దేవతలు విష్ణువునకు మొరపెట్టుకొనవలయునని చెప్పెను. అమితతేజోవంతుడగు గురువాక్యమును వినిన దేవతలు విరోచన వధ కొరకు వైకుంఠమునకు వెళ్ళిరి. అచటికి దేవశ్రేష్ఠుడగు శ్రీ హరిని ఈ విధముగా స్తుతించిరి.
వసిష్ఠ ఉవాచః
నమో దేవాది దేవాయ విష్ణవే మితతేజసే | భక్త విఘ్న వినాశాయ వైకుంఠాయ నమో నమః 24
హరయే ద్భుత సింహాయ వామనాయ మమాత్మనే | క్రోదరూపాయ మత్స్యాయ ప్రలయాభ్ధి నివాసినే 25
కూర్మాయ మందల ధృతే భార్గవాయాభ్ది శాయినే రామయాఖిల నాధాయ విశ్వేశాయ చ సాక్షిణ
దత్తాత్రేయాయ శుద్దాయ కపిలాయార్తి హారిణ | యాజ్ఞాయ ధృత ధర్మాయ సనకాది స్వరూపిణ 27
ధ్రువస్య వరదాత్రే చ పృధవే భూరి కర్మణ | ఋషభాయ విశుద్ధాయ హయ శీర్ష భృతాత్మనే 28
హింసాయాగమ రూపాయా మృత కుంభ విధారిణ కృష్ణాయ వాసుదేవాయ సంకర్షణ వపుర్ధృతే 29
ప్రద్యుమ్నయా నిరుద్ధాయ బ్రహ్మణ శంకరాయచ | కుమారాయ గణశాయ నందినే భృంగినే నమః 30
గంధమాదన వాసాయ నరనారాయణాయ చ | జగన్నాధాయ నాధాయ నమో రామేశ్వరాయ చ 31
ద్వారకా వాసినే చైవ తులసీ వన వాసినే | నమః కమలనా భాయ నమస్తే
పంకజాంఘ్రయే 32
నమః కమల హస్తాయ కమలాక్షాయ తే నమఃకమలా ప్రతిపాలాయ కేశవాయ నమో నమః
నమో భాస్కర రూపాయ శశిరూప ధరాయ చ | లోక పాల స్వరూపాయ ప్రజాపతి వపుర్ధృతే 34
భూత గ్రామ స్వరూపాయ జీవరూపాయ తేజసే | జయాయ జయినే నేత్రే నియమాయ క్రియాత్మనే 35
నిర్గుణాయ నిరీహాయ నీతిజ్ఞాయాక్రియాత్మనే | బుద్ధాయ కల్కిరూపాయ క్షేత్ర జ్ఞాయాక్షరాయ చ 36
గోవిందాయ జగద్భర్త్రే నన్తాయాద్యాయ శార్జిణ | శంఖినే గదినే చైవ నమశ్చ క్రధరాయ చ 37
ఖడ్గినే శూలినే చైవ సర్వ శస్త్రాస్త్ర ఘాతినే | శరణ్యాయ వరేణ్యాయ పరాయ
పరమాత్మనే 38
హృషీకేశాయ విశ్యాయ విశ్వరూపాయ తే నమః | కాలనా భాయ కాలాయ శశి సూర్య దృశే మః 39
పుర్ణాయ పరిసేవ్యాయ పరాత్పరతరాయ చ | గజత్కర్త్రే జగద్భర్త్రే జగద్దత్ర్యేంత కాయ చ 40
మోహినే క్షోభిణ కామ రూపిణ్ర జాయ సూరిణ | భగవంస్తవ సంప్రాప్తా శ్శరణం దైత్యతాపితాః 41
తద్విధత్స్వాఖిలాధార యధా హి సుఖినో వయమ్ పుత్రమిత్రకలత్రాది సంయుతా విహరామ హే
దేవతలు పలికిరి: దేవాధిదేవుడు అమితతేజోవంతుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. భక్త విఘ్న వినాశకునకు, వైకుంఠనకు నమస్కారము. శ్రీహరికి, అద్భుతసింహునకు, వామనునకు, మహాత్మునకు, వరాహరూపునకు, మత్స్యరూపునకు, ప్రలయాబ్ధి నివాసికి, నమస్కారము, కూర్మరూపునకు, మందరాచలధారికి, భార్గవరామునకు, అభ్దిశాయికి, శ్రీరామునకు అఖిలలోకనాధునకు, విశ్వేశునకు, సాక్షికి నమస్కారము. దత్తాత్రేయునకు, శుద్ధునకు, కపిలునకు, ఆర్తిహారికి, యజ్ఞరూపునకు, ధర్మధారకునకు, సనకాది స్వరూపనకు, ధ్రువవర ప్రదాతకు, పృధునకు, భూరికర్మునకు, ఋషభునకు, విశుద్దునకు, హయశీర్షధరరూపునకు, హంసునకు, ఆగమరూపునకు, అమృత కుంభధారకి నమస్కారము. శ్రీకృష్ణునకు వాసుదేవునకు సంకర్షణ దేహధారికి, ప్రద్యమ్నునకు అనిరద్ధునకు, బ్రహ్మకు, శంకరునకు, కుమారస్వామికి, గణశునకు, నందికి, భృంగికి నమస్కాము. గం ధమాదన నవాసికి, నరనారయణ స్వరూపనకు, జగన్నాధునకు, నాధునకు రామేశ్వరునకు నమస్కారము. ద్వారకా నివాసికి, తులసీవనవాసికి, కమలనాభునకు, పద్మపాదునకు నమస్కారము, కమలహస్తునకు, కమలాక్షునకు, కమలాపాలకునకు, కేశవునకు నమస్కారము, భాస్కరరూపునకు, చంద్ర రూపధరునకు లోకపాల స్వరూపునకు, ప్రజాపతిరూపునకు, నిర్గుణునకు నిరీహునకు, నీతిజ్ఞునకు, క్రియారహితునకు, బుద్దనకు కల్కిరూపునకు, క్షేత్రజ్ఞునకు, అక్షరునకు గోవిందునకు, జగద్భర్తకు, అనస్తునకు, అద్యునకు, శార్జికి నమస్కారము. శంఖధారికి, గదాధారికి, చక్రధారునకు నమస్కారము. ఖడ్గశూలాది సర్వశస్త్రాసతధారికి, శరణ్యునకు, వరేణ్యునకు, పరునకు, పరమాత్మకు, హృషీకేశునకు, విశ్వునకు, విశ్వరూపునకు, నమస్కారము. కాలనాభునకు, కాలునకు, చంద్రసూర్యనేత్రునకు, పూర్ణనకు, పరిసేవ్యునకు, పరాతృర తరునకు, గజత్కర్తకు, జగద్భర్తకు, జగద్ధాతకు అంతకునకు, మోహికి క్షోభికి, కామరూపికి, ఆజునకు, సూరికి నమస్కారము. ఓ భగవాన్ ! మేము దైత్యతాపితులమై, నిన్ను శరుణువేడచున్నాము. కావున ఓ యఖిలాధారా ! మేము ఆనందముగా ఉండునట్లు చేయుము. మేము పుత్రమిత్ర కళాత్రాదిసహితులమై ఆనందముగా విహరించునట్లు చేయుము.
తచ్ఛ్రుత్వా స్తవనం తేషాం వైకుంఠం ప్రీతమానసః | ప్రదదౌ దర్శనం తేషాం దైత్యసంతాపితాత్మనామ్ 43
తే దృష్ట్వా దేవాదేవేశం వైకుంఠం స్నిగ్ధమానసమ్ | విరోచన వధాయాశు ప్రార్ధయా మాసురాదరాత్ 44
తచ్ఛ్రత్వా శక్రముఖ్యానాం కార్య కార్యవిదాం వరః | స మాశ్వాస్య సురాన్ప్రీత్యా విససర్జ ముదాన్వితన్ 45
గతేషు దేవ వర్గేషు సర్వోపాయ విదాం వరః | వృద్ధ బ్రాహ్మణ రూపేణ విరోచన గృహం య¸° 46
ద్విజపూజనకా రే తు సంప్రాప్తః కార్యసాధకః | తం తు దృష్ట్వా విశాలాక్షీ బ్రాహ్మణం హృష్టమానసా 47
అపూర్వ భక్తి భావేన దదౌ సత్కృత్య చాసనమ్ |సోనంగీకృత్య తద్దత్త మాసనం ప్రాపళితాం శుభే 48
నాహం సమాదదే దేవి! త్వద్దత్తం పరమాసనమ్ | శృణు మే కార్యమతులం యదర్ధ మహామాగతః 49
యన్మే మనోగతం కార్యం తద్వి జ్ఞాయా చ మానిని యో೭గీకరోతి తత్పూజాం గ్రహీష్యామి వరాననే 50
తచ్ఛ్రుత్వా వృద్ధ విప్రస్య వాక్యం వాక్య విశారదా | మాయయా మోహితా విష్ణో స్త్ర్సీత్వాచ్చాహాతి హర్షితా 51
ఇట్లు దేవతలు చేసి స్తోత్రమును వినిన శ్రీహరి సంతోషించి దైత్యపీడుతులగు దేవతలకు దర్శనము నిచ్చెను. వారు స్నిగ్ధమానసుడగు వైకుంఠుని చూచి ఆదరముతో విరోచన వధ కొరకు ప్రార్థించిరి. ఇంద్రాదుల కార్యమును విని కార్యజ్ఞులలో శ్రేష్ఠుడు వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి వరోచనుని ఇంటికి వెళ్ళెను. బ్రాహ్మణ పూజాకాలమున కార్యసాధకుడు వచ్చెను. ఆ బ్రాహ్మణుని చూచి విశాలాక్షి సంతుష్టాంతరంగయై అపూర్వ భక్తి భావముతో సత్కరించి ఆసనము నొసంగెను. ఆ బ్రాహ్మణుడు ఆమె ఇచ్చిన ఆసనము నంగీకరించక ఆమెతో ఇట్లు పలికెనుః ఓ దేవీ ! నేను నీ విచ్చునాసనమును స్వీకరించను. నేనొచ్చిన కార్యమును వినుము. నా మనసున నున్న పనిని తెలుసుకొని అంగీకరించు వారి పూజనే నేను స్వీకరించెదను. బ్రాహ్మణ వృద్దుని వాక్యమును విని వాక్య విశారదుదాలగు విశాలాక్షి విష్ణుమాయా మోహితురాలై స్త్రీత్వము వలన మిక్కిలి సంతోషించి ఇట్లు పలికెను.
యత్తే మనోగతం విప్ర తద్దాస్యామి గృహేణ మే | ఆసనం పాదసలిలం దేమి మే వాంచి తార్దదమ్ 52
ఇత్యుక్త స్సద్విజః ప్రాహ న ప్రత్యేమి స్త్రియా వచః | తవ భర్తా యదది వదే త్తదా మే ప్రత్యయే భ##వేత్‌ః 53
తదాకర్ణ్య ద్విజేనోక్తం విరోచన గృహేశ్వరీ | పతి మకారయామసా తత్రైవ ద్విజ సన్నిధౌ 54
సప్రాప్తో దూత వాక్యేన ప్రాహ్లాదిర్హృష్ట మానసః | అంతఃపురం యత్ర భార్య విశాలాక్షీ సమాస్థితా 55
తమాగతం సమాలోక్య పతిం ధర్మపరాయణా| ఉత్థాయ నత్వా విప్రాగ్ర్య మాసనం పునరర్పయత్ 56
యదాతు జగృహే నైవ దత్త మానస మాదరాత్ రాజానం కధయామాస దైత్యానాం పతిమాత్మనః 57
తద్వృత్వాంత ముపాజ్ఞాయ దైత్యరాట్స విరోచనః | భార్యాస్నేహేన ముగ్దాత్మ తత్తదాంగీ చకార హ 58
అంగీకృతే తు దైత్యేన తద్విజ్ఞాయ చ మానసమ్ | ఉవాచ బ్రాహ్మణో హృష్ట
స్స్వ మాయుర్మమ కల్పయ 59
తతస్తు దంపతీ తత్ర ముగ్దౌ స్వకృతయా శుచా | ముహూర్తం ధ్యానమాస్థాయ కరౌ బద్ద్వో చతుర్ద్విజమ్ 60
గృహేణ జీవితం విప్ర దేహి పాదోదకం మమ | త్వయోక్తం వచనం సత్యం కుర్వః ప్రీతి మవాప్నుహి 61
తతస్తు విప్రః ప్రీతాత్మా తదాంగీకృత్య చాసనమ్ | పాదోదకం దదౌ దసై#్య భక్త్యా ప్రీతో జనార్దనః 62
ప్రక్షాల్య పాదౌ విప్రస్య విశాలాక్షీ ముదదాన్వితా | పత్యా సహాదధౌ మూర్ద్ని అపః పాదావనే జనీః 63
తతస్తు సహసా సుభ్రు దంపతీ దివ్యరూపి ణౌ | విమాన వరమారుహ్య జగ్మతుర్వైష్ణవం పదమ్ 64
తతః ప్రసన్నో భగవాన్ దేవ శల్యం విమోచ్య సః | య¸° వైకుంఠ భవనం సర్వైర్దేవగణౖ స్త్సతః 65
ఏవం మయాపి దాతవ్యం తవ దేవి ప్రతి శ్రుతమ్ | న సత్యాచ్చాలయే దేవి! పతి రుక్మాంగ దాభిధమ్ 66
సత్యమేవ మనుష్యాణాం గతిదం పరికీర్తితమ్ | సత్యాచ్చ్యుతం మనుష్యం హి శ్వపాకాదధమం విదుః 67
ఇత్యేవ ముక్త్వా కనకావదాతా సామోహినీం పంకజ జన్మజాతమ్ | జగ్రాహ భర్తశ్చరుణౌ సుతామ్రౌ రక్తాంగులీ పాణియుగేన సుభ్రూః 68
ఇతి శ్రీబృహన్నారదీయ పురాణోత్తర భాగే మోహినీ చరితే సంధ్యావలీ కధనం నామ ద్వాత్రిం శత్తమో೭ధ్యాయ
విశాలాక్షి పలికెను ః ఓ బ్రాహ్మణోత్తమా ! నీ మనసున నున్నదానిని ఇచ్చెదను. కావున నేనిచ్చు ఆ సనమును స్వీకరించుము. వాంచితార్ధ ప్రదమగు పాదోదకమునిమ్ము. విశాలాక్షి ఇట్లు పలుకగా ఆ బ్రాహ్మణ వృద్ధుడు నేను స్త్రీ పలుకులను విశ్వసించును. నీ భర్త ఈ మాట చెప్పినచో విశ్వసించెదనని పలికెను. వృద్ధ బ్రాహ్మణుని మాటలను విని విరోచనుని గృహిణి అపుడే భర్తను పిలిపించెను. దూత వాక్యముతో ప్రహ్లాదపుత్రుడగు విరోచనుడు సంతోషముగా అచటికి వచ్చెను. విశాలాక్షి యున్న అంతఃపురమును చేరెను. వచ్చిన భర్తను చూచి ధర్మపరాణురాలగు విశాలాక్షి లేచి నమస్కరించి బ్రాహ్మణునకు మరల ఆసనమును అర్పించెను. వృద్ధ బ్రాహ్మణుడు ఆసనమును స్వీకరించకపోవుటచే తన భర్త రాక్షసరాజగు విరోచనునితో జరిగిన వృత్తాంతమును వివరించెను. భార్యయందు గల ప్రీతిచే విరోచనుడు విశాలాక్షి మాట నంగీకరించెను. విరోచనుడు అంగీకరించ గనే అతని మనసును తెలసుకొని వృద్ధ బ్రాహ్మణుడు సంతోషముతో మీ ఆయుష్యమును నాకు అర్పించుడని పలికెను. అపుడు ఆ దంపతులు తమ ఆ చారముతో మోహితులై ఒక ముహూర్త కాలము ధ్యానములో నుండి చేతులు జోడించి బ్రాహ్మణునితో ఇట్లు పలికెరి. ఓ బ్రాహ్మణోత్తమా! మా జీవితమును స్వీకరించుము. నాకు పాదోదకమునిమ్ము. నీవు చెప్పిన మాటను నిజము చేతుము. సంతోషించుము. అంతట బ్రాహ్మణుడు ప్రీతికలవాడై విశాలాక్షి సమర్పించిన ఆసనమును స్వీకరించి భక్తిప్రీతుడగు జనార్దనుడు విశాలాక్షికి పాదోదకమునిచ్చెను. అంతట విశాలాక్షి సంతోషముతో భర్తతో కలిసి బ్రాహ్మణుని పాదములను కడిగి ఆ పాద జలమును శిరస్సుపై ధరించిరి. అంతట వెంటనే ఆ దంపతులు దివ్యరూపమును ధరించి ఉత్తమ విమానమునధిరోహించి విష్ణుపదమునకు వెళ్ళిరి.. అంతట ప్రసన్నుడగు శ్రీహరి దేవతల వ్యసనమును తొలగించి, దేవగణములచే స్తుతించబడుచు వైకుంఠ భవనమునకు వెళ్ళెను. ఇట్లే నీవు చేసిన ప్రతిజ్ఞననుసరించి నేను కూడా ఈయవలయును. రుక్మాంగదుడను నా భర్తను సత్యము నుండి తప్పించజాలను. మానవులకు సత్యమే సద్గతినిచ్చును. సత్యమునుండి తప్పిన మానవుడు చండాలున కంటే అధముడుగును. ఇట్లు సంధ్యావలీదేవి బ్రహ్మపుత్రి యగు మోహినతో పలికి కోమలారుణాంగుళులు కల చేతులతో ఎఱ్ఱనైన భర్త పాదములను పట్టుకొనెను.
ఇది శ్రీ బృహన్నరదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున సంధ్యావలీ కథనమను ముప్పది రెండవ అధ్యాయము