Sri Naradapuranam-3    Chapters    Last Page

త్రయంస్త్రిం శో ధ్యాయః = ముప్పది మూడవ అధ్యాయము

ధర్మాందోక్తిః

వసిష్ఠ ఉవాచః

సంధ్యావలీ తతః పాదౌ భర్తు స్సంగృహ్య భూపతే | ఉవాచ వచనం దేవి ధర్మాంగద వినాశనమ్‌1
బహుధాప్యను శిష్టేయం మయా భూప యధా త్వయా | మోహిన్యా మోహరూపాయా నాన్యత్సంరోచ
తేధునా 2
భోజనం వాసరే విష్ణో ర్వధం వా తనయస్యవై | ధర్మత్యాగా ద్వరం నాధ పుత్రస్య వినిపాతనమ్‌ 3
యాదృశీ హి జనన్యాస్తు పీడా భవతి భూపతే | పుత్ర స్యోత్పాదనే తీవ్రా తాదృశీ భ##వేత్పితుః 4
గర్భ సంధారణ రాజన్‌ ఖేదస్స్నేహో ధికో యధా | బీజనిర్వాపకః ప్రోక్తః పితా రాజేన్ద్ర భూతే

జననీ ధారణ క్లిష్టా వర్ధనే పాలన
ధికా
పితుశ్శ తగుణ స్స్నేహో మాతుః పుత్రే ప్రవర్తతే | స్నేహాధిక్యం తు సంప్రేక్ష్య మాతరం మహతీం విదుః 7
సాహం జాతా గతస్స్నేహో పరలోక జిగీషయా | పుత్రస్య నృప శూర్దూల సత్యవాక్యస్య పాలనాత్‌ 8
వ్యాపాదయ సుతం భూప స్నేహం త్యక్త్వా సుదూరతః | మా సత్య లంఘనం కార్షీః శాపితో సి మయాత్మానా| 9
నికషేషు హృషీకేశో భవిష్యతి ఫలప్రదః | యస్మింశ్చీర్ణే రుజా దేహే నాల్పాపి నృప జాయతే 10
అధర్మాన్మా నవో1 వశ్యం స్వర్గ భ్రోష్టో న సంశయః | ప్రాణా నాదాయ పుత్ర వా సర్వస్వం వా మహీపతే 11
యశ్చాను వర్తే దైవం సపుమాన్జాయతే మహాన్‌ | తా ఆపద్యపి భూపాల! ధన్యాయాస్స త్యకారికాః 12
సత్య సంరక్షణార్థత్వా న్నృణాం స్యు ర్మోక్షదాయికాః | కీర్తి సంస్తరణార్థాయ కర్తవ్యం మనుజైస్సదా 13
కర్మ భూపాల శాస్త్రోక్తం స్నేహ ద్వేష వివర్జితమ్‌ | తదలం పరి తాపేన సత్యం పాలయ భూపతే 14
సత్యస్య పాలనా ద్రాజ న్విష్ణు దేహేన యుజ్యతే | దైవవైరుత్పాదితా హేషా నికషేతే విమోహినీ 15
మన్యే భూపాల సాపత్న్యా కృతా తాం త్వం న బుధ్యసే | పుత్ర వ్యాపాదనాద్దేవా భవిష్యన్తి వ్యావాఙ్మఖాః 16
తేషాం దత్వా పదం మూర్ద్ని యాస్యసే పరమం పదమ్‌ | విష్ణోరుద్వహతాం భక్తిం దేవతాః పరిపంధినః 17
భవిష్యత్యంధతా లోకే తదేవ ప్రకటీకృతమ్‌ | విరుద్దా విబుధా భూప సేశ్వరాస్తవచ్చేష్టితైః 18
సత్వం భూప దృఢో భూత్వా ఘాతయస్వ సుతం ప్రియమ్‌ 19
మోహిన్యుః కురు వాక్యం తు ఆత్మన స్సత్యపాలనాత్‌ 20
లుప్తేసి వాక్యే భవితా నృపేశ పాపం నమం బ్రహ్మవధేన ఘోరమ్‌ | గంతాపి లోకే శమనస్య భూప యాః ప్రణాశో భవితా ధరాయామ్‌ 21
వసిష్ట మహర్షి పలికెను ః అంతట సంధ్యావలీదేవి భర్త పాదములను పట్లుకొని ధర్మాంగత వినాశనము గురించి ఇట్లు పలికెను. ఓ రాజా మోహరూపయగు మోహినకి నీవు చెప్పినట్లుగా చలా చెప్పి చూచితిని. అయిననూ ఏకాదశీ భోజనము, లేదా తనయుని వధ కంటే ఇతరముల ఈమెకు ఇష్టములు కావు. ధర్మత్యాగమున కంటే పుత్రవధయే ఉత్తమ మని తలచెదను. పుత్రునికి జన్మనిచ్చుటలో తల్లి పడువేదన తండ్రికి యుండదు. గర్భమును ధరించుటలో ఖేదముతో కలుగు స్నేహము తల్లికి అధికముగా నుండును. తండ్రి కంతగా యుండదు. తండ్రి క్షేత్రమున బీజమునుంచు వాడు మాత్రమే. గర్భమును ధరించుటల, జన్మనిచ్చుటలో పెంచి పోషించుటలో తల్లి ఎక్కువగా కష్టములననుభవించును. పుత్రుని యందు తండ్రి కంటే తల్లికి నూరురెట్లు ఎక్కువగా నుండును స్నేహధిక్యమును చూచియే తండ్రి కంటే తల్లిని అధికురాలనిగా తెలియుదురు. అట్లు తల్లినగు నేను పరలోక జిగీషితో పుత్రునిపై స్నేహమును దూరముగా విడిచి పుత్రుని వధించుము. సత్యమును మాత్రము తప్పకుము. నామీద ఓట్టుపెట్టుచున్నాను. కష్టములతోనే శ్రీ హరి ఫలప్రదుడగును. ఈ వ్రతము పూర్తి చేసినచో దేహమున కొద్ది బాధ కూడా కలుగదు. అధర్మముచే మానవుడు తప్పక స్వర్గ భ్రష్టుడగును. ప్రాణములను కాని, పుత్రులను కాని సర్వస్వమును కాని ఇచ్చి దైవమును అనుసరించు వాడే మహాపురుషుడుగా కీర్తించబడును. సత్యమును నిలబెట్టు ఆపదలు కూడా ధన్యములు. సత్యమును సరక్షించుట కొఱకు పడిన కష్టములు మోక్షప్రదములగును. కీర్తిని వ్యాపింపచేయుటకు మానవులెపుడూ స్నేహ ద్వేషములను విడిచి శాస్త్రోక్త కర్మలనాచరించవలయును. కావున పరితాపమును విడిచి సత్యమును కాపాడుము. సత్యపాలనముచే విష్ణు దేహము లభించును. ఈ విమోహిని నీ కొఱకు దేవతలు సృజించిన వరిపిడి రాయి. శత్రుత్వము వారు చేసిన దానిని మీరు తెలియుట లేదు. పుత్రుని వధించుటచే దేవతలు తలను వంచెదరు. దేవతల శిరముపై పాదమునుంచి పరమ పదమును పొందెదవు. విష్ణుభక్తి కలవారికి దేవతలు శత్రువలు, లోకమున గుడ్డితనము వచ్చును. ఇపుడదియే ప్రకటించబడినది. నీ కర్మలచే ఈశ్వరుడు మొదలు దేవతలందరూ నీకు శత్రువులైరి నీ నిశ్చయమును చలింపచేసి మోక్షమార్గమును భేదించువారే. కావున నీవు దృఢనిశ్చయముతో ప్రియుడగు పుత్రుని వధించుము. నీ సత్యపాలనమునకై మోహని మాటలను ఆచరించుము. నీవు నీ మాటలను తప్పినచో బ్రహ్మహత్యపాతకముతో సమమగు పాపము కలుగును. యమలోకమునకు వెళ్ళెదవు. ఈ భూమండలమున నీ కీర్తి నశించును.
వసిష్ట ఉవాచ:
భార్యాయా వచనం శ్రుత్వా రాజా రు క్మాంగుదస్తదా | సంధ్యావలీ మువాచేదం మోహిన్యాస్సన్నిధౌ నృప 22
పుత్రహత్యా మహాహత్యా బ్రహ్మహత్యాధికా ప్రియే | ఘాతయిత్వా సుతం లోకే కా గతిర్మే భవిష్యతి 23
క్వ గతో మందరం శైలం క్వ ప్రాప్తా మోహినీ మయా | ధర్మాంగద వినాశాయ దేవి కాలప్రియా త్వియమ్‌ 24
ధర్మజ్ఞం వినయోపేతం ప్రజారంజన కారమ్‌ | అప్రజం చ సుతం హత్వా కా గతిర్మే భవిష్యతి 25
కుపుత్రస్యాపి హననా ద్దేవి దుఃఖం భ##వేత్పితుః 26
కిం పునర్ధర్మ శీలస్య గురుసేవా విధాయినః | జంబూ ద్వీప మిదం భుక్తం మయా తు వరవర్ణని 27
ద్వీపాని సప్త భుక్తాని తనయేన తవాధునా | విష్ణోరంశో వరారోహే పితురప్యధికో భ##వేత్‌ 28

పురాణషు వరారోహే కవిభిః పరి కీర్తితః | యో
య మత్యమధికః పుత్రో దర్మాంగద ఇతి క్షితౌ 29
మమ వంశస్య చార్వంగి కింపునర్మమ మానదః | అహో దుఃఖమను ప్రాప్తం పుత్రా దవ్యధికం మయా 30
పునరేవ వరారోహే బ్రూహి త్వం వచనై శ్శుభైః | మోహినీం మోహ సంప్రాప్తాం మమ దుఃఖప్రదాయినీమ్‌ 31
ఏవ ముక్త్వాతు నృపతిః ప్రియాం సంధ్యావలీం తదా | సమీప మాగత్య నృపో మోహినీ మిద మబ్రవీత్‌ 32
న భోక్ష్యే వాసరే విష్ణో ర్న హింస్నే తనయం శుభే | ఆత్మానం దారయిష్యామి దేవీం సంధ్యావలీం తధా 33
అన్యద్వా దారుణం కర్మ కరోమి తవ శాసనాత్‌ | దుష్టాగ్రహ మిమం సుభ్రు పరిత్యజ సుతం ప్రతి 34
కిం ఫలం భవితా తుభ్యం హత్వా ధర్మాంగదం సుతమ్‌ | భోజయిత్వా దినే విష్ణోః కో లాభో భవితా వద 35
దాసోస్మి తవ భృత్యోస్మి వశగోస్మి వరాననే | అన్యం యాచస్వ సుభ##గే వరంత్వాం శరణం గతః 36
వ్రసాదం కురు మే దేవి పుత్ర భిక్షాం ప్రయచ్ఛ మే 37
దుర్లభో గుణవాన్పుత్రో దుర్లభో హరివాసరః 38
దుర్లభం హి కులే జన్మ దుర్లభా వంశజా ప్రియా 39
దుర్లభా వైష్ణవీ దీక్షా దుర్లభ స్మృతి సంగ్రహః 40
దుర్లభశ్శౌకరే వాసో దుర్లభం హరి చిన్తనమ్‌ | దుర్లభో జాగరో విష్ణో దుర్లభా హ్యాత్మ సత్క్రియా 41
దుర్ల భా పుత్ర సంప్రాప్తి ర్దుర్ల భం పౌష్కరంజలమ్‌ | దుర్లభ శ్శిష్ట సంసర్గో దుర్లభం నీలమోక్షణమ్‌ 42
కృతం శ్రాద్ధం త్రయోదశ్యాం దుర్లభం వరవర్ణిని 43
దుర్లభా వసుధా చీర్ణ వ్రతం పాతక నాశనమ్‌ | ధేనుస్తిల మయీ సుభ్రు దుర్లభా విప్రగామినీ 44
ధాత్రీస్నానం వరారోహే దుర్లభో వారివాసరః | దుర్లభం పర్వకాలేతు స్నానం శీతల వారిణా 45
మాఘమాసే విశేషణ ప్రత్యూష సమయే శుభే | యధా శాస్త్రో దితం కర్మ తద్దేవి భువి దుర్లభమ్‌ 46
దుర్లభం కుశలం పధ్యం దుర్లభం చౌ షధం తధా | వ్యాధేర్విఘాత కరణం దుర్లభం శాస్త్ర మార్గతః 47
దుర్లభం స్మరణం విష్ణో ర్మరణ వరవర్ణిని | ఏవం వచో వరారోహే కురు మే దర్మరక్షకమ్‌ 48
కిం వధేనైవ చార్వంగి ప్రాసదం కుర్తు మర్హసి | సేవితా విషయాస్సమ్యక్‌ కృతం రాజ్యమకంటకమ్‌ 49
మయా మూర్థ్ని పదం దత్తం దేవగో విప్ర రక్షణమ్‌ | అదృష్ట విషయం పుత్రం నాహం హింస్యే కదా చన 50
స్వహస్తే నేహ చార్వంగి కింను పాపమతఃప రమ్‌
వసిష్టి మహర్షి పలికెను. ః రుక్మాంగద మహరాజు భార్య వచనములను విని మోహిని సమీపమున సంధ్యావలితో ఇట్లు పలికెను. ఓ ప్రియురాలా, పుత్రహత్య మహాహత్య, బ్రహ్మహత్య కంటే ఘోరమైనది. పుత్రుని వధించిన నాకు ఏ గతి లభించును. నేను మందారాచలమున కేల వెళ్ళితిని? మోహిని ఏల లభించినది? ధర్మాంగద వినాశనమునకు వచ్చిన కాలుని ప్రియురాలు ఈ మోహని. ధర్మజ్ఞుడు, వినయాన్వితుడు, ప్రజారంజన కారకుడు, సంతానవంతుడు కాని పుత్రుని చంపిన నాకు ఏ గతి పట్టును? దుష్ట పుత్రుని చంపిననూ తండ్రికి దుఃఖము కలుగును. ఇక ధర్మశీలుడు గురుసేవాపరాయణుని చంపిన చెప్పవలయునా? నేనొకా జంబూద్వీపమును మాత్రమే అనుభవించితిని. నీ పుత్రుడు సప్తద్వీపములనునుభవించెను. శ్రీహరి అంశ సంభుతుడు మాత్రమే తండ్రిని మించిన వాడగునేని పురాణములలో పండితులు చెప్పియున్నారు. ఈ భూమండలమున ధర్మంగదుడు అత్యధికుడని ప్రసిద్ధి నొంది నా వంశమును తరింపచేసి నా కీర్తిని పెంపొందించెను. నాకు పుత్రుని వలన ధర్మాంగదుడు అత్యధికుడని ప్రసిద్ధి నొంది నా వంశమును తరింపచేసి నా కీర్తిని పెంపొందించెను. నాకు పుత్రుని వలన ఎంత దుఃఖము కలుగుచున్నది. నీవు నాకు దుఃఖమును కలిగించు మోహరూపయగు మోహినికి ఇంకొకసారి మంచి మాటలో చెప్పి చూడుము. ఇట్లు ప్రియురాలగు సంధ్యావలితో పలకి రుక్మాంగద మహారాజు మోహినిని సమీపించి ఇట్లు పలికెను. చెప్పి చూడుము. ఇట్లు ప్రియురాలగు సంధ్యావలితో పలకి రుక్మాంగద మహారాజు మోహినిని సమీపించి ఇట్లు పలికెను. ఏకాదశినాడు భుజించును. పుత్రుని సంహరించను. నన్ను సంధ్యావలిని చంపుకొందును. నీ ఆజ్ఞతో ఇంకొక రౌరవకర్మను చేతను, పుత్రవధ విషయమున పట్టుదలను విడువుము. పుత్రుడగు ధర్మాంగదుని వధించిన నీకు కలుగు లాభ##మేమి? ఏకాదశీ భోజనమున మాత్రము నీకేమి లాభము? నీకు నేను దాసుడను భృత్యుడను వశవర్తిగ నుండని. నిన్ను ఏకాదశీ భోజనమున మాత్రము నీకేమి లాభము? నీకు నేను దాసుడను భృత్యుడను వశవర్తిగ నుంటిని. నిన్ను శరుణవేడుచున్నాను. మరొక వరమును కోరుము. నీకు కావలసిన ఇతర ప్రయోజనములను చేకూర్చెదను. నన్ను అనుగ్రహింంచుము. నాకు పుత్ర భిక్షను ప్రసాదించుము. గుణవంతుడగు పుత్రుడు దుర్లభుడు, హరి వాసరము కూడా దుర్లభ##మే. గంగా జలము, తల్లి సత్కుల జన్మ సద్వంశ జాతయగు ప్రియురాలు, స్వర్ణదానము, హరి పూజనము, వైష్ణవ దీక్ష, స్మృతి సంగ్రహము దుర్తభములు. శౌకరవాసము, హరి చిన్తనము, విష్ణు వాసర జాగరము. ఆత్మ సత్కారము, పుత్ర ప్రాప్తి, పుష్కర జలము, సజ్జన సంగతి, భక్తి కపిలగోదానము, నీలమోక్షణము, త్రయోదశి శ్రాద్ధము దుర్లభములు. భూమి పాతకనాశక వ్రతపాలనము తిలమయి విప్రగామిని యగు ధేనువు. ధాత్రీస్నానము. శ్రీహరి వాసరము దుర్లభములు. సర్వకాలమున శీతల జలస్నానము, విశేషించి మాఘ మాసోషః కాలమున శీతల జలస్నానము శాస్త్రోక్త కర్మాచరణము, వధ్యమగు దానికి క్షేమము, ఔషధము, వ్యాధి విఘాతము, శాస్త్ర మార్గానుసరణము, మరణ కాలమున శ్రీమరి స్మరణము, దుర్లభములు. కావున ధర్మమును రక్షణసేయు నా మాటను వినుము. పుత్ర వధతో నీకేమి లాభము. నాపై అనుగ్రహమును చూపుము. విషయ సుఖములను చక్కగా అనుభవించితిని. నిష్కంటకముగా రాజ్యపాలనమును గావించితిని. దేవగోవిప్రరక్షకుల పాదములను నా శిరమును దాల్చితిని. విషయ భోగములననుభవించని పుత్రుని నేను వధించజాలను. నా చేతిలో నేను స్వయముగా నా పుత్రుని చంపుటను మించిన మహాపాతకమింకొకటి యుండదు.
మోహిన్యువాచ
దర్మాంగదో న మే శత్రు ర్నాహం హన్ని సుతం తవ 51
పూర్వమేవ మయా ప్రోక్తం భుంక్ష్య త్వం హరివాసరే | వసుధాం స్వేచ్ఛయా రాజం స్త్వం శాధి బాహు వత్సరమ్‌ 52
నాహం వ్యాపాదయే పుత్ర మర్ద సిద్ధిస్తు భోజనే | మమ భూమిపతే కార్యం న పుత్ర నిధనే తవ 53
యది పుత్రః ప్రియో రాజ న్భుజ్యతాం హరివాసరే | కిం విలాపై ర్మహీపాల ఏ తైర్థర్మ బహిష్కృతైః 54
సత్యం సంరక్ష యత్నేన కురుష్వ వచనం మమ | ఏవం బ్రువాణాం తాం రాజ న్మొహినీం తను మధ్యమామ్‌ 55
ధర్మాంగ దః ప్రత్యు వాచ దృష్ట్వా నత్వాగ్రత స్ద్సిత ః| ఏత దేవ గహేణ త్వం మా శోకం కురు భామిని 56
గృహీత్వా నిర్మలం ఖడ్గం విన్యస్య నృపతేః పురః ఆత్మానం చ ప్రత్యువాచ సత్యధర్మ వ్యవస్థితః 57
న విలంబః పితః కార్య స్త్వయా మమ నిపాతనే | మన్మాతు ర్వచనం సత్యం కురు భూప ప్రతిశ్రుతమ్‌ 58
ఆత్మా రక్ష్యో ధనైర్దారై రధ వాపి నిజాత్మజైః | అపత్యం ధర్మ కామార్ధం శ్రేయస్కామస్య భూపతేః 59
త్వదర్దే మరణ మహ్య మక్షయ్య గతిదాయకమ్‌ | తవాపి నిర్మలా లోకా స్స్వవాక్య పరిపాల నాత్‌ 60
పరిత్యజ్య పరం దుఃఖం పుత్ర వ్యాపాదతనోద్భవమ్‌ | దేహత్యాగే మమారంభో నరదేవ భవిష్యతి 61
సర్వామయ వినిర్ముక్తే శతక్రతు సమే విభో
l పితురర్ధే హతా యేతు మా తురర్ధే హతాస్తధా 62
గవార్దే బ్రహ్మణార్ధేవా ప్రమదార్ధే మహీపతే
l భూమ్యర్దే పార్ధి వార్ధేవా దేవతార్దే తధైవచ 63
బాలర్ధే వికలార్ధే చ యాన్తి లోకా న్సు భాస్వరా ః
l తదలం పరితాపేన జహి మాత్వం వరాసినా 64
సత్యం పాలయ రాజేన్ద్ర మా భుంక్ష్వ హరి వాసరే
l ధర్మర్దే తనయం హన్యా ద్ధారాం వాపి మహీపతే 65
శ్రూయతే వేదవాక్యేషు పుత్రం హన్యాన్మఖస్థితః
l అశ్వమేథ మఖవరే న దోషో జాయతే నృ ప 66
యద్బ్రవీత మహీపాల మోహినీ జననీ మమ
l తత్త్వయా హ్యవిచారేణ కర్తవ్యం వచనం ధ్రువమ్‌. 67
ప్రసీద రాజేన్ద్ర కురుష్వ వాక్యం మయేరితం చాత్మవధాయ సతగం
l విమోచ యేధా నృపతే సుఘోరాత్‌ వాక్యానృతా న్మోహిని హస్తయోగాత్‌ 68
వధేన తే భూమిపతే సుతస్య యశః ప్రకాశం గమయిష్యతే చ
l యశః ప్రకాశాద్భవితా హికీర్తి స్తధాక్షయా తాత న సంశయోత్ర 69 ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే మోహినీ చరితే ధర్మాంగదోక్తిర్నామ త్రయస్త్రింశః అధ్యాయః మోహిని పలికెనుః దర్మాంగదుడు నాకు శత్రువు కాడు. నేను నీ పుత్రుని చంపుట లేదు. నీవు హరి వాసరమున భుజించమని మొదటనే చెప్పితిని. నీ ఇష్టమొచ్చినంత కాలము చాలా సంవత్సరములు భూమిని పాలించుము. నేను నీ పుత్రుని చంపుట లేదు. నీవు భోజనము చేయుటయే నాకు కావలసినది . కాన నీపుత్రుని చంపుటలో పనియేమియు లేదు. నీకు పుత్రుడు ప్రియుడైనచో హరివాసరమున భుజించుము. ధర్మ బహిష్కృతములగు ఈ విలాపములతో పనిలేదు. యత్నించి సత్యమును కాపాడుము. నా మాటను పాటించుము. ఇట్లు మోహిని పలుకుచుండగా ధర్మాంగదడు చూచి నమస్కరించి ముందు నిలిచి ఇట్లు పలికెను. నీవు దీనినే స్వీకరించుము. ఓ దేవీ ! సందేహించకుము. నిర్మల ఖడ్గమును తీసుకొని రాజు ముందు ఉంచి, తనను కూడా నుంచి సత్య ధర్మ నిష్ఠుడై ఇట్లు పలికెను. ఓ తండ్రీ! నన్ను చంపుటలో నీవాలసించకుము. నా తల్లి మాటలను, తల్లికి నీ విచ్చిన మాటను నిజము చేయుము. ధనములతో దారలతో, పుత్రులతో తనను తాను కాపాడుకొనుట ధర్మము. శ్రేయస్కాముడగు రాజునకు సంతానము ధర్మకామార్ధ రక్షణ కొరకే. నీకొరకుమరణించుట నాకక్షయ లోకమును ప్రసాదించును. నీకు కూడా నీ వాక్యపాలనతో నిర్మలలోకములుసంప్రాప్తించును. పుత్రుని సంహరించుట వలన కలుగు దుఃఖమును విడిచిపెట్టుము. సర్వరోగ వినిర్ముక్తము, ఇంద్రసమమగు ఈ మానవదేహమును విడుచుటకే నా ప్రయత్నమంతయు. తండ్రి కొరకు కాని, తల్లికొరకు కాని, గోవుల కొరకు , బ్రాహ్మణుల కొరకు, స్త్రీల కొరకు,భూమి కొరకు, రాజు కొరకు, దేవతలు కొరకు, బాలుల కొరకు వికలుల కొరకు చనిపొయిన వారు తేజోమయ లోకములను వెళ్ళెదరు. కాసున నీ పరితాపము చాలును. నన్ను ఉత్తమ ఖడ్గముచే వధించుము. ఓ రాజేన్ద్ర! నీవు సత్యమును నిలుపుము. హరివాసరమున భుజించకుము. దర్మరక్షణ కొరకు పుత్రునికాని, భార్యను కాని చంపవచ్చును. అశ్వమేధయాగమున నున్నవారు యజ్ఞ విఘ్ననివారణకొరకు పుత్రుని వదించిననూ దోషము లేదని వేదవాక్యములలో చెప్పబడి యున్నది. ఓ రాజా నా తల్లియగు మోహిని చెప్పిన మాటను అన్ని సందేహములను విడిచి ఆచరించుము. ఓ రాజా ! ప్రసన్నుడవుకమ్ము. నా వధ కొరకు నేను చెప్పు మాటలను అచరించుము. మోహిని హస్తమున నున్న ఘోరమగు అనృత వాక్యము నుండి నిన్ను విడిపించుకొనుము. పుత్రుని వధచే నీకు యశము ప్రకాశమానమగును. యశః ప్రకాశము వలన కీర్తి అక్షయమగును. ఇది శ్రీ బ్రహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున దర్మాంగ దోక్తియను ముప్పది మూడవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page