Sri Naradapuranam-3    Chapters    Last Page

చతుస్త్రింశోధ్యాయః: ముప్పది నాల్గువ అధ్యాయము

భగవద్దర్శనమ్‌

వనిష్ఠ ఉవాచః

తత్పుత్ర వచనం శ్రుత్వా రాజా రుక్మాంగద స్తదా l సంధ్యావలీ ముఖం ప్రేక్ష్య ప్రహృష్టకమలోపమమ్‌ 1

మోహినీ వచనం శృణ్వ న్భుంక్ష్వ మా హన దేహజమ్‌ l మా భుంక్ష్వ తనయం హింస చేత్యాగ్రహ సమన్వితమ్‌ 2

ఏ తస్మిన్నేవ కాలేతు భగవాన్కమలేక్షణః l అంతర్ధా నగత స్తస్థౌ వ్యొమ్ని దైర్యావలోకకః 2

త్రయాణాం నృపశార్దూల మేఘ శ్యామో నిరంజన ః l వచనే భుక్ష్వ భుంక్ష్వేతి మోహిన్యా వ్యాహృతే తదా 4

జగ్రాహ విమలం ఖడ్గం హంతుం ధర్మాంగదం సుతమ్‌ l సుప్రహర్షేణ మనసా ప్రణమ్య గరుడ ధ్వజమ్‌ 6

తం దృష్ట్యా ఖడ్గ హస్తం తు పితరం ధర్మ భుషణః l ప్రణమ్య మాతాపితరౌ దేవం చక్రధరం తధా 7

వదనం ప్రేక్ష్య చాదీనం జనన్యా నృప పుంగవః l వుషాంగ దేన తు తదా స్వగ్రీవోర్వీలే కృతా 8

కంబుగ్రీవాం సమానాంతు సువర్ణాంచ సుకోమలామ్‌ l బహురేఖా మధ స్థులాం ఖడ్గ మార్గే న్య దర్శయత్‌ 9

పితృభక్త్యా యుతేనైవ మాతృ భక్త్యాదికేన వై 10

గ్రీవా ప్రదానే తనయస్య భూప హర్షాకులే చారుసుధాంశువక్రైl గ్రహీత ఖడ్గే జగదీశనాధే చచాల పృధ్వీ సనగా సముద్రా 11

సింధుః ప్రవృద్దశ్చ బభూవ సద్యో నిమజ్జనార్దం భువనత్రయస్య l నిపేతు రుల్కాశ్శతశో ధరాయాం నిర్ఝాత యుక్తా స్సతడి త్సమధ్యాత్‌ 12

వివర్ణ రూపా చ బభూవ మోహినీ న దేవ కార్యం హి కృతం మయే l నిరర్దకం జన్మ మమాధునా భూత్‌ కృతం తు దైవేన జగద్విధాయినా 13

విమోహనం రూపమిదం విడంబనం యద్భూమి పాలేన స భుక్త మన్నమ్‌ l హరేర్దినే పాపభయాపహోచ తృణౖస్స మాహం భవితా త్రివిష్టపే14

సత్వాధికో యాస్యతి మోక్షమార్గం గంతాస్మి పాపా నరకం సుదారుణ మ్‌ 15

సముద్యతే తదా ఖడ్గే నృపేణ నృపపుంగవే l మోహినీ మోహసంయిక్తా పపాత ధరణీ తలే 16

రాజాపి తేన ఖడ్గేన భ్రాజమానస్సముద్యతః గ్రీవాయా శ్చేదనార్ధాయ వృషాంగద సుతస్యతు 17

సకుండలం చారు శశిప్రకాశం భ్రాజిష్ణు వక్త్రం తనయస్య భూపః l ప్రచిచ్ఛిదే యావ దతీవహర్షా దైర్యాన్వితో రుక్మవిభూషణోసౌ 18

తావద్గృహీత స్స్వకరేణ భుపః క్షీరాబ్ది కన్యాపతినా మహీపః l తుష్టోస్మి తుష్టోస్మి న సంశయోక త్ర గచ్ఛస్వ లోకం మమ లోకనాథ 19

ప్రీయాన్విత శ్చాత్మజ సయుతశ్చ కీర్తం సమాధాయ మహీతలే తు l త్రైలోక్య పూజాం విమలాంచ శుక్లాం కృత్వా పదం మూర్ద్ని యమస్య భూప 20

ప్రయాహి వాసం మమ దేహసంజ్ఞం స చక్రిణో భూమిపతిః కరేణ l సంస్పృష్ట? మాత్రో విరజా బభూవ ప్రియా సమేత స్తనయేన యుక్తః 21

ఉపేత్య వేగేన జగామ పదేహం దేవస్య దివ్యం స నృపో మహాత్మా l విహాయ లక్ష్మీ మవనీ ప్రసూతాం విహాయ దాసీ స్సుధనం సకోశమ్‌ 22

విహాయ నాగాంస్తురగా న్రధాంశ్చ స్వదార వర్గం స్వజనాదికాంశ్చ l జగామ దేహం మధుసూదనస్య తతోం బరాత్పుష్పచయః పపాత 23

సంహృష్ణ సిద్దై స్సురలోక పాలై స్సంతాడితదా దుందుభయో వినేదుః l రాజన్జ గుర్గీతమతీవ రమ్యం దేవాంగనా సంననృతు ర్ముదాన్వితా ః 24

గంధర్వ కన్యా నృపకర్మతుష్టా స్త దద్భుతం ప్రేక్ష్య దినేశసూనుఃl హరేస్తనౌ భుమి పతిం ప్రవిష్టం సదారపుత్రం స్వలిపిం ప్రమార్జ్య 25

లోకొశ్చ సర్వాన్నైపదిష్ట మాశే కృత్వాజ్ఞాన్హరిలోక మార్గాన్‌ l భీతిః పునః ప్రాప్య పితామహాంతికం ప్రోవాచ దేవం చతురాననం రుదన్‌ 26

నాహ్ననియోగీ భవితా హి దేవ అజ్ఞావిహీన స్సురలోకనాథ! విధేహి చాన్యత్ర్పకరోమి తాత నిదేశనం మాస్తు మదీయ దండమ్‌ 27

ఇతి శ్రీ బృహన్నరదీయ మహాపురాణ ఉత్తర భాగే మోహీనీ చరితే సుతవధోద్యతస్య రుక్మాంగదస్య భగవద్దర్శనం నామ చత్తుస్రింశోధ్యాయః.

వసిష్ఠమహర్షి పలికెనుః

రుక్మాంగద మహారాజు పుత్రుని మాటలను విని, వికసించిన కమలము వలె నున్న సంధ్యావలీ ముఖమును చూచి, ఏకాదశిన భుజింపుము. పుత్రుని చంపకుము అని మోహిని పలికిన మాటలను విను చుండెను. ఈ సమయముననే పుండరీకాక్షుడగు శ్రీహరి అంతర్దానగతుడై రుక్మాంగదుని దైర్యమును చూడగోరి అకాశమున నిలిచి యుండెను. మేఘశ్యాముడు నిరంజనుడగు భగవానుడు రుక్మాంగద ధర్మాంగద సంధ్యావలుల మధ్యన గరుడ వాహనారూఢుడై నిలిచి యుండెను. భుజించుము భుజించుము అని మోహిని పలుకు చుండగా సుతుడగు ధర్మాంగదుని చంపుటకు నిర్మలమగు ఖడ్గమును స్వీరించెను. సంతోషమునిండిన మనసుతో గరుడధ్వజునికి నమస్కరించెను. ధర్మాంగదుడు కూడా ఖడ్గమును ధరించిన తండ్రిని చూచి, తల్లిదండ్రులకు నమస్కరించి, చక్రధరునికి నమస్కరించి దైర్యముతో నున్న తల్లి ముఖమును చూచి తన కంఠమును భూమి మీద వంచి యుంచెను. అతని కంఠము శంఖము వంటిది, సమము, చక్కని వర్ణము కలది, కోమలము, బహురేఖలుకలది, స్థూలము, అయి కంఠమును ఖడ్గమార్గమున నుంచెను. ధర్మాంగ దునకు గల పితృభక్తి మాత్రభక్తి కంఠ సమర్పణకు ప్రేరేపించెను. ధర్మాంగదుడు కంఠమునిచ్చుటకు సంతోషముచే చంద్రవదనుడు కాగా, రుక్మాంగద మహారాజు ఖడ్గమును స్వీకరించగా భుమి పర్వతములతో అరణ్యములతో కంపించసాగెను. మూడు లోకములను ముంచుటకు సముద్రముప్పొంగెను. అకాశ మధ్యమునుండి మెరుపులతో ఉరుములతో భూమిమీద ఉల్కలు పడెను . నేను దేవకార్యమును చేయలేకపోతినని మోహిని వివర్ణరూపము కలదాయెను. ఇపుడు నాపుట్టుక నిరర్థక మాయోను. జగద్విధాయియగు దైవమిట్లు చేసెను. అందరిని మోహింప చేయు ఈ రూపము విడంబకము మాత్రమే . రాజు భుజించలేదు. ఇపుడు స్వర్గమున నాస్థితి గడ్డి పరకతో సమానమాయెను. సత్త్వాధికుడగు రుక్మాంగద మహారాజుమోక్షమునకు వెళ్ళును. నేను పరమదారుణమగున నరకమునకు వెళ్ళెదను. రుక్మాంగద మహారాజు ఖడ్గమునెత్తగా మోహముక్తయగు మోహిన భుమిపై మూర్ఛిల్లెను. రుక్మాంగద మహారాజు కూడా ధర్మాంగదుని మండలయుతము, చంద్రప్రకాశము, శోకించు వక్త్రము అగు శిరమును ఖండించుటకు దైర్యాన్వితుడై ఖడ్గమును వేయునంతలో శ్రీ లక్ష్మీనాదుడు రుక్మాంగదుని హస్తమును తన కరముచే గ్రహించెను. సంతోషించితిని. సంతోషించితిని. ఇక సంశయమేలేదు. ఈ భూమి పై కీర్తిని స్థాపించి ప్రియురాలగు సంధ్యా వలితో ధర్మాంగదునితో నాలోకమునకు వెళ్ళుము. నీ కీర్తిని మూడులోకములలో పూజ్యముగా చేసి, స్వచ్ఛమును, శుక్లమును చేయుము. యమధర్మరాజు శరమున పాదమునుంచి వెళ్ళుము. నా దేహమును చేరుము అని పలికెను. శ్రీహరి స్పృశించగనే రుక్మాంగదుడు ప్రియురాలితో పుత్రునితో పరిశుద్దుడాయెను. వేగముగా మహానుభావుడగు రుక్మాంగదుడు భూమండలములోని సంపదను, దాసీ జనమును, ధనమును భోగములను, గజాశ్వరధములను, దార వర్గమును, స్వజనాదికములను విడిచి మధుసూదనుని దేహమును చేరెను. అకాశమునుండి పుష్పవర్షము కురిసెను. సంతోషించిన సురసిద్ధులచే మ్రోగించబడిన దేవదుందుభులు మ్రోగినవి. గంధర్వులు గానము చేసిరి సంతోషించిన దేవాంగనలు నృత్యము చేసిరి. సూర్యపుత్రుడగు యమధర్మరాజు దారాపుత్రులతో రుక్మాంగద మహారాజు, తన లిపిని చెరిపి శ్రీహరిని ప్రవేశించుటను చూచి లోకములన్నింటిని రాజు చూపిన దారిలోహరిమార్గము వైపు పయనింప చేయుటను చూచి భయపడుచు మరల బ్రహ్మను సమీపంచి రోధించుచు బ్రహ్మతో ఇట్లు పలికెను. నేను నీ యాజ్ఞను పాలించలేక పోయితిని కావున ఈ వియోగముతో నాకు పనిలేదు. ఇంకొక పనిని తెలుపుము . చేసెదను. దండించుట మాత్రము నాకొద్దు.

ఇది శ్రీ బ్రహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున సుత వధోధ్యతుడగు రుక్మాంగ దునకు భగవద్దర్శనమను ముప్పది నాలుగవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page