Sri Naradapuranam-3 Chapters Last Page
షట్త్రింశోsధ్యాయః = ముప్పదియారవ అధ్యాయము
మోహినీ మోహముత్యృజ్య గతా విబుధమందిరమ్ భర్త్సితా దేవదూతేన స్థితిస్తేత్ర న పాపినీ 1
పాపశీలే సు దుర్మేధే భర్తృనిందా పరాయణ l హరివాసరలోపిన్యాం వాసస్తే న త్రివిష్టపే 2
ధర్మతో విముఖానాం చ నరకే వాస ఇష్యతే l ఏవముక్త్యా తు తాం వాయః క్రూరం వచన మద్భతమ్ 3
తాడయిత్వా చ దండేన ప్రేరయామాస యాతనామ్ l ఏ వం సంతాడితా రాజన్ దేవదూతేన మోహినీ 4
బ్రహ్మదండపరాభూతా సంప్రాప్త నరకం నృపl తత్ర ధర్మాజ్ఞయా సాతు దూతైస్సంతాడితా చిరమ్ 5
సర్వేషు క్రమశో గత్వా నరకేషు నిపాతితా l పాపే ధర్మాంగదః పుత్రో ఘాతితః పతిపాణినా 6
త్వయా యతస్తతో భుంక్ష్వ కృతకర్మఫలంత్విహ l ప్రజాహితం స్థిరప్రజ్ఞం మహేన్ద్రవరుణోపమమ్ 7
సప్తద్వీపాధింప పుత్రం హత్వే దృక్ఫలభోగినీ l ప్రాకృతస్యాపి పుత్రస్య హింసాయాం బ్రహ్మహా భ##వేత్ 8
కిం పునర్దర్మయుక్తస్య పాపే ధర్మాంగదస్య చ l ఏవంప నిర్భర్త్సితా దుతై ర్యమస్య నృపసత్తమ 9
బుభుజే యాతనాస్సర్వాః క్రమశశ్శమనోదితాః l బ్రహ్మదండహతాయాస్తు దేవాస్పర్శేన యాతనాః 10
జ్వలితాంగా బభూవుస్తాః ధారణాయ న తు క్షమాః l తతస్తే నరకా రాజన్ ధర్మ రాజుముపాగతాః 11
ప్రోచుః ప్రాంజలయో భీతాః తదంగస్పర్శపీడితాః దేవదేవ జగన్నాధ ధర్మరాజ దయాం కురు 12
ఇమాం నిః స్సారయాశు త్వం యాతనాభ్యః సుఖాయ నః l యస్యాః స్పర్శనతో నాధ భసభూతాః క్షణాదహో 13
భవిష్యామ స్తతస్త్వేనాం నరకేభ్యో వినాసయ l తచ్ఛృత్వా వచనం తేషాం ధర్మరాజోతి విస్మితః 14
దూతాన్ స్వాన్ ప్రత్యువాచేదం నిస్సార్యా మమ మందిరాత్ l యో బ్రహ్మదండనిర్దగ్దః పుమాన్ స్త్రీ వాచ తస్కరః 15
తస్య పాపస్య సంస్పర్శం నేచ్ఛంతి యాతనా మమl తస్మాదిమాం మహాపాపాం భర్తుర్వచనలోపినీమ్ 16
పుత్రఘ్నీం దర్మహంత్రీం చ బ్రహ్మదండహతామపి l నిఃసారయత మే వాపి దేహో జ్మలతి దర్శనాత్ 17
ఇత్యుక్తాస్తే తదా దూతా ధర్మరాజేన భూపతే l ప్రహరంతో స్త్రశ##స్త్రెశ బహిశ్చక్రుర్యమ క్షయాత్ 18
తతః సా దఃఖితా రాజన్ మోహినీ మోహసంయుతా l పాతాళం ప్రయ¸° తత్ర పాతాళ##స్ధైర్నివారితా 19
తతస్తు వ్రీడితా త్యర్దం మోహినీ బ్రహ్మణః సుతా l జనకస్యాంతికం గత్వా దుఃఖం స్వం సంన్యవేదయత్ 20
తాత తన్నాస్తి మే స్థానం త్రైలోక్యే సచరాచరే l యత్ర యత్ర తు గచ్ఛామి తత్ర తత్ర క్షిపంతి మామ్ 21
అహం నిర్వాపితా లోకై ర్ఝాతయిత్వాయుదైర్దృఢమ్ l భవదాజ్ఞాం సమాదాయ గతా రుక్మవిభూషణమ్ 22
మయా వ్యవసితం చేదం సర్వలోకవిగర్హితమ్ l క్లేశయిత్వా తు భర్తారం పుత్రం హత్వా వరాసినా 23
సంధ్యావళీం క్షోభయిత్వా పితః ప్రాప్తా దశామిమామ్ l న గతి ర్విద్యతే దేవ పాపాయా మమ సాంప్రతమ్ 24
విశేషాద్ద్విజశాపేన జాతాహం దుఃఖభాగినీ l విప్రవాక్యహతానాం చ దగ్దానాం చిత్ర భానునా 25
దివాకీర్తి హతానాం చ భక్షితానాం మృగాదిభిః l శతహ్రదావిపన్నానాం ముక్తిదా స్వర్ణదీ పితః 26
యది త్వం త్రిదశైః సార్దం విప్రం తం శాపదాయినమ్ l ప్రసాదయసి మత్ప్రీత్యా తర్హి మే విహితా గతిః 27
తాం తధావాదినీం రాజన్ బ్రహ్మా లోకపితామహః l శివేంద్ర ధర్మ సూర్యాగ్ని దేవేశైర్ముని భిర్యుతః 28
మోహినీమగ్రతః కృత్వా జగామ ద్విజసన్నిధౌ l తత్ర గత్వా మహీపాల బ్రహ్మా దేవాదిభిర్వృతః 29
మహతా గౌరవేణాపి నమశ్చక్రే స్వయం విధిః l భుప రుద్రాదిదేవైస్తు పూజ్యో మాన్యః పితామహః 30
మోహినీ ప్రీతయే ముగ్దః స్వయం చక్రే నమస్క్రియాం l కార్యే మహతి సంప్రాప్తే వ్యాసాధ్యే భవనత్రయే 31
న దూషితం భ##వే ద్భూప యవిష్ఠస్యాభివాదనం l స ద్విజో వేద వేదాంగ పారగస్తపసి స్థితః 32
సంప్రేక్ష్య లోకకర్తారం దేవైః సహ సమాగతమ్ l సముత్థాయ నమశ్చక్రే బ్రహ్మాణం తన్మునీన్ సురాన్ 33
వాసయామాస భక్త్యాచ స్తుతిం చక్రేబ్జజన్మనః l తతః ప్రసన్నో భగవాన్ లోకకర్తా జగద్గురుః 34
తే ద్విజం ప్రార్దయామాసుః మోహిన్యర్దే నృపార్చతమ్
వసిష్ఠమహార్షి పలికెను. మోహిని మోహమును విడిచి స్వర్గమునకు వెళ్ళను. అచట దేవదూత ఓ పాపాత్మురాలా%ా నీ విచటికి రా దగదు. పాపశీలురాలా. దుర్బుద్ధీ ! భర్తృనిందా పరాయణురాలా. హరివాసరమును లోపింప చేయు నీకు స్వర్గమున స్థానమ లేదు. ధర్మవిముఖులకు నరకములో నివాసముండును. ఇట్లు వాయువు మెహినితో పలికి దండముచే దండించి నరకమునకు పంపివేసెను. ఇట్లు దేవదూతచే దండించబడిన మోహిని బ్రహ్మదండపరాభూతురాలై నరకమును చేరెను. అచట యమధర్మరాజు అజ్ఞచే దేవతలు మోహినిని చాలాకాలము దండించిరి. అన్ని నరకములలోనికి వెళ్ళి పడిపోయెను. ఓ పాపాత్మురాలా పుత్రుడగుధర్మాంగదుని భర్త చేతితో చంపించితివి. కావున నీవు స్వయముగా నాచరించిన కర్మఫలమును అనుభవించుము. ప్రజాహితము నాచరించువానిని స్థిరప్రజ్ఞుని, మహేంన్ద్రవరుణోపముని, సప్తద్వీపాధిపతియగు పుత్రుని వధించి ఈఫలమును అనుభవించు చున్నావు. సామాన్య పుత్రుని చంపిననే బ్రహ్మ హత్యా పాతకము సంప్రాప్తించును. ఇక ధర్మయుక్తుడగు ధర్మాంగదుని చంపిన ఏమి చెప్పవలయును? ఇట్లు దూతలచే నిందించబడుచు యముడు విధించిన యాతనలనన్నింటిని క్రమముగా అనుభవించెను. బ్రహ్మణ శాపముపాలైన మోహినీ దేహమును స్పృశించుటచే ఆయాతనలన్ని తమ శరీరములు కాలుచుండగా సహించజాలక నరకములన్నియూ యమధర్మరాజును చేరినవి. మోహినీ శరీరస్పర్శచే పీడితలై చేతులు జోడించి ఇట్లు పలికినవి . దేవ దేవా. జగన్నాధా ! ధర్మరాజా దయను చూపుము. ఈమోహినిని త్వరగా యాతనలనుండి దూరముగా పంపుము. ఈమెను స్పృశించినంతనే క్షణములో మేము భస్మమైతిమి. కావున ఈమెను నరకములనుండి పారద్రోలుము. అట్లు పలికిన నరకముల మాటలను వివి యమధర్మరాజు ఆశ్చర్యమును చెందెను. తన దూతలతో ఈమెను బయటికి పంపుము. బ్రహ్మదండనిర్ధగ్ధుడగు స్త్రీకాని పురుషుడుగాని, చోరుడుకాని, అతని స్పర్శను నా యాతనలు సహించజాలవు. కావున మహాపాపురాలు భర్తృవచనలోపిని, పుత్రఘ్ని, ధర్మహంతకురాలు, బ్రహ్మదండహతురాలగుమోహినిని దూరముగా తరలించుడు. ఈమెను చూచుటచే నా శరీరము మండుచున్నది. ఇట్లు ధర్మరాజు పలుకగా అతని దూతలు శస్త్రాస్త్రములచే మోహినిని కొట్టుచు యమలోకమునుండి బహిష్కరించిరి. అంతట మోహయుతురాలగు మోహిని దుఃఖితురాలై పాతాలలోకమునకు వెళ్ళెను. అచట పాతాల వాసులు వారించిరి. అంతట బ్రహ్మపుత్రి మిక్కిలి సిగ్గుపడి తండ్రివద్దకు వెళ్ళి తనదుఃఖమును తెలిపెను. ఓ తండ్రీ ! చరాచరాత్మాకమగు ఈ మూడు లోకములలో నాకు స్థానము లేదు. నేనెచటికి వెళ్ళిననూ బహిష్కరించుచున్నారు. నన్ను ఆయుధములచే బాగా కొట్టి బహిష్కరించుచున్నారు. నీ అజ్ఞను స్వీకరించి నేను రుక్మాంగదుని సమిపించితిని. అన్నిలోకములు నిందించు పనిని చేసితిని. భర్తను బాధించి శ్రేష్ఠమకు ఖడ్గముతో పుత్రుని చంపించి సంధ్యావళీదేవిని క్షోభింప చేసి ఈ దశను పొందితిని. పాపురాలనగు నాకు ఇపుడు ఏగతిలేదు. విశేషించి బ్రాహ్మణ శాపము చే దుఃఖభాగినినైతిని. బ్రాహ్మణ వాక్యహతులకు అగ్నిదగ్ధులకు, దివాకీర్తిహతులకు, మృగాదులచే భక్షించబడిన వారికి, మెరుపుచే పీడించబడువారికి దేవనది ముక్తినిచ్చును కావున నీవు నాకు శాపమునిచ్చిన బ్రాహ్మణుని దేవతలచే కలిసి ప్రసన్నుని చేసినచో నాకు గతి లభించును. ఇట్లు మోహిని పలుకగా వినిన లోకపితామహుడగు బ్రహ్మ శివ ఇంద్ర యమ సూర్యాగ్ని దేవేశులతో కలిసి, మోహినిని ముందిడుకొని బ్రాహ్మణుని వద్దకు వెళ్ళెను. దేవాది సహితుడగు బ్రహ్మ అచటికి వెళ్ళి తానుస్వయముగా గొప్ప గౌరముతో బ్రాహ్మణునికి నమస్కరించెను. రుద్రాది దేవతలచే పూజించబడు పితామహుడు మోహినికి సంతోషమును కలిగించవలయునని ముగ్ధుడై స్వయముగా తానే నమస్కరించెను. మూడులోకములలోను సాధింపశక్యము కాని గొప్పకార్యము సంప్రాప్తించినపుడు చిన్నవానికి నమస్కరించుట దోషముకాదు. వేదవేదాంగ పారగుడు తపస్సులో నున్న ఆ బ్రాహ్మణుడు దేవతలతో కలిసి వచ్చిన లోకకర్తను చూచి లేచి బ్రహ్మకు, మునులకు, దేవతలకు నమస్కరించెను. ఆసనమును సమర్పించి కూర్చుండజేసి భక్తిచే బ్రహ్మను స్తుతించెను. అపుడు ప్రసన్నుడగులోకకర్త అయిన బ్రహ్మ, ఆదేవతలు మోహిని కొఱకు ఆ బ్రాహ్మణుని ప్రార్థించసాగిరి.
తాత విప్ర సదాచార పరలోకోపకారక 35
కృపాం కురు కృపాసింధో మోహినీ గతిదో భవ l మయా సంప్రేషితా బ్రహ్మన్ రుక్మాంగదవిమోహనే 36
సుతా మే యమలోకం తు శూన్యం దృష్ట్వా చ మానద l వైకుంఠం సంకులం ప్రేక్ష్యు
లోకైః పర్వైర్నిరాకులైః 37
మనసోత్పాదితా దేవీ దేవానాం హితకారిణీ l నిశామయ ధరాదేవ యద్బ్రవీమి తవాగ్రతః 38
గతిం ధర్మస్యాతిసూక్ష్మాం లోక కల్యాణకారిణీమ్ l అనయా నికషాప్యాంగ్యా పరీక్ష్య స్వర్ణభూషణః 39
సదారః ససుతో బ్రహ్మన్ ప్రాపితో హరిమందిరం l రాజ్ఞ్యాప్రహతయా భక్త్యా హరివాసరపాలనాత్ 40
కృతం శూన్యం యమస్థానం లిపిమార్జన కర్మణా l దేవాపకారో విప్రర్షే న క్షమో బాహుజన్మనా 41
భూసురాణాం విశేషేణ యాతాస్తే తత్సహాయకాః 42
న ప్రాప్యతే సాంఖ్యవిదా తు యచ్చ నాష్టాంగయోగేన తు భక్తిగమ్యం l తత్ర్పాపితం భూసుర భూపభర్తు ర్నిజస్య పుత్రస్య తదా సపత్న్యాః 43
యత్పుణ్య శీలస్య నృపస్య భూప శిరోమణరాచరితం ప్రతీపమ్ l తత్పాపవేగేన బభూవ విద్రుతా భస్మావశేషా తవ శాపదగ్దా 44
దేవార్దమేషా భవవర్దనార్దం నృపోపకారాయ చ సంప్రవృత్తా l న స్వార్దకామా లభ##తేవమానం కథం ద్విజాతోపకృతిం క్షమస్వ 45
దయాం కురుష్వ ప్రశయం భజస్వ పిష్టస్య పేషో నహి నీతియుక్తః
శాపప్రదానేన నిపాతితేయం కురు ప్రసాదం గతిదో భవ త్వమ్
యస్మిన్ కృతే బ్రాహ్మణమోహినీయం బుద్ధిం త్యజేత్ క్రురతరాం త్వయీజ్యే 46
స ఏవముక్తః కమలాసనేన విమృశ్య బుద్ద్యా విససర్జ కోపం l ఉవాచ దేవం త్రిదశాధినాధం విమోహినీదేహకృతం ద్విజేంద్రః 47
నలోకేషు స్థితిస్తస్మాత్ ప్రాణిభిః సంకులేషు చ 48
మయా విమృశ్య సుచిరం మోహిన్యర్దే విచింతతమ్ l తద్దాస్యామి తవ ప్రీత్యా త్వం హి పూజ్యతరో మమ 49
యధా తవ వచః సత్యం మమ చాపి సురేశ్వర l దేవకార్యం చ భవితా మోహినీ కృత్యమేవ చ 50
యన్నాక్రాంతం హి భూతౌఘైః తత్ స్థానే మోహినీ స్థితి ః l జంగమా జంగమై ర్భూమిః వ్యాప్తా ద్వీపవతీ సదా 51
తలాని చాపి దైతగాద్వైః ఆకాశః పక్షిపూర్వకైః l నకః సుకృతిభి ర్జీవై ర్నరకాః పాపకర్మభిః 52
ఝషాద్యైః సాగరా వ్యాప్తా నైష్వస్సృశ్యా స్థితిస్తతః l తతో బ్రహ్మాసురైః సర్వైః సంమంత్య్ర నృపసత్తమ 53
ఉవాచ మోహినీం దేవీం నాస్తి స్థానం తవ క్వచిత్ l తచ్ఛృత్వా మోహినీ వాక్యం పితురాజ్ఞావిధాయినీ 54
ఉవాచ ప్రణతా సర్వాన్ హరివాసరనాశినీ l పురోధసా సమేతానాం దేవానాం లోకసాక్షిణామ్ 55
నాయనా! బ్రహ్మణోత్తమా సదాచారపరా! పరలోకోపకారక! కృపాసింధో దయతలచి మోహినికి సద్గతిని ప్రపాదించుము. రుక్మాంగదుని మోహింప చేయుటకు మోహినిని నేనేపంపియుంటివి. యమలోకము శూన్యమగుట, వైకుంఠము పూర్ణముగా నుండటను చూచి, లోకులందరూ బాధలు లేని వారుగా నుండుటచే, దేవతలకు హితమునుచేయు మోహినిని మనసుచే సృజించితిని. ఓ బ్రాహ్మణోత్తమా నేను చెప్పుదానిని పావధానముగా వినుము. లోకకళ్యాణకారిణియగు ధర్మసూక్ష్మమును ధర్మస్వరూపమును తెలియుము. ఈ స్వర్ణసన్నిభయగు రూపముకల మోహినిచే రుక్మాంగదుని పరీక్షించి భార్యా పుత్రులతో శ్రీహరి మందిరమున చేర్చితిమి. రాజు ఎదురులేని భక్తి చే హరివాసరమును సేవించెను. కావున యమలోకము శూన్యము చేయబడినది. యమ లిపిని తుడిచి వేసెను. ఓ బ్రహ్మర్షీ! ఎన్ని జన్మలలోనైననూ దేహపకారము క్షమించరానిది. బ్రహ్మణాపకారము విశేషించి క్షమించరానిది. కావున మోహినికి సహాయముగా బ్రాహ్మణులు వెడలిరి. సాంఖ్యవిదులకు పొందరానిది, అష్టాంగయోగముచే పొందజాలని, భక్తిమాత్రముచే పొందదగిన శ్రీహరిలోకమునకు రాజును రాజపుత్రుని, రాజపత్నిని చేర్చితిమి. పుణ్యశీలుడగు రాజశ్రేష్ఠునకు జరిపిన కార్యమునకు పాపవేగమునకు నీశాపముచే దగ్దురాలై మోహిని భస్మముగా మిగిలి పోయెను. ఈ మోహిని దేవతల కొఱకు, సంసారమును పెంచుటకు, రాజునకు ఉపకరించుటకు మాత్రమే ప్రవర్తించినది. అంతే కాని స్వార్థమును కోరి ఆచరించలేదు. అయినపుడు ఈమె అవమానమును పొదుట తగదు. కావున ఓ బ్రాహ్మణోత్తమా ఈ అపకారమును క్షమించుము. దయ చూడుము. శాంతిని పొందుము. పిండిని ఇసురుట నీతిసమ్మతముకాదు. శాపమునిచ్చి పతితురాలను చేసితివి. అనుగ్రహించి గతిప్రదానము చేయుము. నీవిట్లు చేసినచో ఈ మోహిని తన క్రూర బుద్దిని విడుచును. ఇట్లు బ్రహ్మ పలుకగా విచారించి కోపమును విడిచెను. త్రిదశాధినాధుని ఇట్లు పలికెను. నీపుత్రికయగు మోహిని బహుపాపముల నాచరించినది. కావున సకల ప్రాణులలో సకలలోకములలో ఉనికిని గోల్పోయినది. కావున నేను చాలాసేపు విచారించి మోహిని కొరకు నిర్ణయించితివి. నీ ప్రీతికొరకు అగతిని ఇచ్చెదను. నీవు నాకు పూజ్యతరుడవు కదా నీ మాట నామాట నిజము కావలయును. దేవకార్యము మోహినీ కార్యము నెరవేరవలయును. భూతసంఘములు ఆక్రమించని ప్రదేశమున మోహినియుండును. సప్తద్వీపవతియగు భూమి జంగమా జంగమముల చే వ్యాపించ బడియున్నది . తలాది లోకములు దైత్యాదులచే, అకాశము పక్ష్యాదులచే, స్వర్గము సుకృతులచే, నరకము పాపులచే, మత్స్యాదులచే సాగరము వ్యాప్తమైయున్నది. కావున వీటియందు మోహినికి ఉనికి లేదు. అని అంతట బ్రహ్మదేవతలతో ఆలోచించి మోహినితో నీకెక్కడా స్థానములేదని పలికెను. అపుడు మోహిని అమాటను విని, తండ్రి ఆజ్ఞను ఆచరించునదై హరివాసరన్మాశినియగు మోహిని పురోహితునితోపాటు అందరికి నమస్కరించి ఇట్లు పలికెను.
భవతాం త్రిదశ##శ్రేష్ఠా ఏష బుద్దో మయాంజలి ః l ప్రణిపాతశ##తేనాపి ప్రసన్నేన హృదా సురాః 56
దాతవ్యం యాచితం మహ్యం సర్వేషాం ప్రీతి కారకమ్ l ఏకాదశ్యాః ప్రభావేణ సర్వేషాం పాపినాం గతిః 57
సాధ్యతే తాం సురశ్రేష్టా వర్ధితుం మే ప్రయోదనమ్ l పతిః సపత్నీ పుత్రంశ్చ మయా వైకుంఠగా ః కృతాః 58
భూర్లోకే విధవాద్యాపాం వర్తామి భవతాం కృతే l యథా హరిదినం దుష్టం జాయతే మమ మానదాః 59
ఏతత్ప్రయాచే దదత స్వార్దార్దం తద్ది నన్యాథా 60
ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే
మోహినీచరితే షట్ త్రింశత్తమోధ్యాయః
ఓ దేవోత్తములారా మీకు చేతులు జోడించుచుంటిని. ఇట్లు నవస్కారశతముచే దేవతలగు మీరు ప్రసన్నహృదరుముతో సర్వప్రీతి కరముగా నా యాచన నీయ దగును. ఏకాదశిప్రభాముచే పాపులందరికి సద్గతి లభించును. అగతిని పెంచుటయే నాకు ప్రయోజనము కావలయును. భర్త సవతి, పుత్రుడు ఈ ముగ్గురిని నేను వైకుంఠమునకు పంపితిని. భూలోకమున ఇపుడు నేను మీకొరకు పతిహీననై యున్నాను. హరిదినము దుష్టమెట్లగునో తెలుపుడు. నాస్వార్దమునకు ఇట్లు యాచించుచున్నాను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మహినీ చరితమున
ముప్పది యారవ అధ్యాయము.