Sri Naradapuranam-3    Chapters    Last Page

అష్టత్రింశత్తమో ధ్యాయః : ముప్పది ఎనిమిదవ అధ్యాయము

గంగామాహాత్య్మవర్ణనమ్‌

వసిష్ఠ ఉవాచ ః-

సవసుర్నృపశార్దూల మోహినీం యాజ్మకామినీమ్‌ l ఉవాచ శ్లక్ణయా వాచా సర్వలోకహీతే రతః 1

వసురువాచ :-

శృణు మోహిని వక్ష్యామి తీర్థానాం లక్షణం పృథక్‌ l యేన విజ్ఞాతమాత్రేణ పాపినాం గతిరుత్తమా 2

సర్వేషామపి తీర్థానాం శ్రేష్ఠా గంగా ధరాతలే l న తస్యా సదృశం కించిత్‌ విద్యతే పాపనాశనమ్‌ 3

తచ్ఛృత్వా వచనం తస్య వసోః స్వస్య పురోధసః l ప్రణతా మోహినీ ప్రాహ గంగాస్నానకృతాదరా 4

మోహిన్యువాచః-

భగవన్వాడవశ్రేష్ఠ గంగామాహాత్య్మ ముత్తమమ్‌ l సర్వేషాం చ పురాణానాం సంమతం వద సాంప్రతమ్‌ 5

శ్రుత్వా మాహాత్మ్యమతులం గంగాయాః పాపనాశనమ్‌ l పశ్చాత్పాపవినాశిన్యాం స్నాతుం యాస్యే త్వయా సహ 6

తచ్ఛృత్వా మోహినీవాక్యం వసుః సర్వపురాణవిత్‌ l మాహాత్య్మం కథయామాస గంగాయాః పాపపాశనమ్‌ 7

వసిష్ఠమహర్షి పలికెనుః- వసువు శుద్ధిపొందదలచిన మోహినిని సర్వలోక హితమును కోరి మృదువుగా ఇట్లు పలికెను:

వసువు పలికెను :- ఓమోహినీ వేరు వేరు తీర్థ లక్షణములను చెప్పెదను వినుము. ఇవి తెలిసినంతనే పాపులకుత్తమగతి లభించును. భూలోకమున అన్ని తీర్థములలో శ్రేష్ఠమైనది గంగాతీర్థము. గంగతో సమానమగు పాపనాశకతీర్థము మరియొకటి లేదు. ఆ మాటను వినిన మోహిని గంగా స్నానము చేయదలచి వసువుతో ఇట్లు పలికెను.

మోహిని పలికెను:- ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! సర్వపురాణ సమ్మతమగు ఉత్తమగంగా మహాత్య్మమును ఇప్పుడు చెప్పుము. పాపనాశకమగు గంగా మహాత్మ్యమును విని నీతో కలిసి పాపనాశినిలో స్నానము చేయుటకు వెళ్ళెదను. ఆ మోహినీ వాక్యమును వినిన సర్వపురాణ విదుడగు వసువు పాపనాశకమగు గంగా మహాత్మ్యమును చెప్పసాగెను.

వసురువాచ:-

తే దేశాస్తే జనపదా స్తేశైలా స్తేపిచాశ్రమాః l యేషాం భాగీరధీ పుణ్యా సమీపే వర్తతే సదా 8

తప్ప సా బ్రహ్మచర్యేణ యజ్ఞెస్త్యాగేన వా పునః l తాం గతిం న లభేత్‌ జంతుర్గంగాం సంసేవ్య యాం లభేత్‌ 9

పూర్వే వయసి పాపాని కాత్వా కర్మాతి యే నరాః l శేష గంగాం నిషేవంతో తే పి యాంతి పరాం గతిం 10

తిష్ఠేద్యుగసహస్రం తు పాదేనేకైన యః పుమాన్‌ l మాసమేకం తు గంగాయాం స్నాతస్తుల్య ఫలావుభౌ 11

తిష్ఠేతార్వాక్‌శిరా యస్తు యుగానామయుతం పుమాన్‌ l తిష్ఠేద్యధేష్టం యశ్చాపి గంగాయాం స విశిష్యతే 12

భూతానామిహ సర్వేషాం దుఃఖోపహతచేతసాం l గతిమన్వేషమాణానాం న గంగాసదృశీ గతిః 13

ప్రకృష్టైః పాతకైర్ఘోరైః పాపినై పురుషాధమాన్‌ l ప్రసహ్య తారయేద్గంగా దినాని శద మోహిని 17

శుక్లప్రతిపదాదేశ్చ దినాని దశ సంఖ్యయా l పాతాలే సన్నిధానం తు కురుతే స్వయమేవ హి 18

ఆరభ్య శుక్లైకాదశ్యా దినాని దశ యాని తు l పంచమ్యంతాని తాంస్వర్గే భ##వేత్సన్నిహితా సదా 19

కృతేతు సర్వతీర్థాని త్రేతాయాం పుష్కరం పరమ్‌ l ద్వాపరేతు కురుక్షేత్రం కతౌ గంగా విశిష్యతే 20

కలౌతు సర్వతీర్థాని స్వం స్వం వీర్యం స్వభావతః l గంగాయాం ప్రతిమంచంతి సా తు దేవి న కుత్రచిత్‌ 21

గంగాంభః కణదిగ్ధస్య వాయోః సంస్పర్శనాదపి l పాపశీలా అపి నరాః పరాం గతిమవాప్నుయుః 22

యోసౌ సర్వగతో విష్ణు శ్చిత్స్వరూపీ జనార్దనః l స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః 23

బ్రహ్మహా గురుహా గోఘ్నః స్తేయీ చ గురుతల్పగః l గంగాంభసాచ పూయంతే నాత్ర కార్యా విచారణా 24

క్షేత్రస్థముద్ధృతం వాపి శీతమముష్ణమథాపి వా l గాంగేయం తు హరేత్తోయం పాపమామరణాంతికమ్‌ 25

వర్జ్యం పర్యుషితం తోయం వర్జ్యం పర్యుషితం దలమ్‌ l న వర్జ్యం జాహ్నవీతోయం న వర్జ్యం తులసీదళమ్‌ 26

మేరోః సువర్జస్య చ సర్వరత్నైః సంఖ్యోపనాలానాముదకస్య వాపి l గంగాజలానాం న తు శక్తిరస్తి వక్తుం గుణాఖ్యాపరిమాణమత్ర 27

తీర్థయాత్రావిధిం కృత్స్నం ఆ కుర్వాణోపి యో నరః | గంగాతోయస్య మాహాత్మ్యాత్‌ సోప్యత్ర ఫలభాగ్భవేత్‌ 28

చింతామణి గుణాచ్చాపి గంగాయాస్తోయబిందవః l విశిష్టా యత్ర్పయచ్ఛంతి భ##క్తేభ్యో వాంఛితం ఫలమ్‌ 29

గండూషమాత్రతో భక్త్యా సకృద్గంగాంభసా నరః l కామధేనుస్తనూ ద్భూతాన్‌ భుంక్తే దివ్యరసాన్దివి 30

శాలగ్రామశిలాయాం తు యస్తు గంగాజలం క్షిపేత్‌ l అపహత్య తమస్తీవ్రం భాతి సూర్యో యధోదయే 31

మనోవాక్కాయజైర్గ్రస్తః పాపైర్బహువిధైరపి l వీక్ష్య గంగాం భ##వేత్పూతః పురుషో నాత్ర సంశయః 32

గంగాతోయాభిషిక్తాం తు భిక్షామశ్నాతియః సదా l సర్పవత్కంచుకం ముక్త్వా పాపహీనో భ##వేత్సవై 33

హిమవద్వింధ్యసదృశా రారయః పాపకర్మణామ్‌ l గంగాంభసా వినశ్యంతి విష్ణుభక్త్యా యధాపదః 34

ప్రవేశమాత్రే గంగాయాం స్నానార్థం భక్తితో నృణామ్‌ l బ్రహ్మహత్యాది పాపాని హాహేత్యుక్త్వా ప్రయాంత్యలమ్‌ 35

గంగాతీరే వసేన్నిత్యం గంగాతోయం పిబేత్సదా l యః పుమాన్సవిముచ్యేత పాతకైః పూర్వసంచితైః 36

యో వైగంగాం సమాశ్రిత్య నిత్యం తిష్ఠతి నిర్భయః l స ఏవ దేవైర్మర్యైశ్చ పూజనీయో మహర్షిభిః 37

కిమష్టాంగేన యోగేన కిం తపోభిః కిమధ్వరైః 38

కిం యజ్ఞెర్బహభిర్జాపై#్యః కింతపోభిర్ధనార్పణౖః | స్వర్ణమోక్షప్రదా గంగా సుఖసేవ్యా యతః స్థితా 39

యజ్ఞెర్యమైశ్చనియమైః దానైః సంన్యాసతోపివా l న తత్ఫలమానవాప్నోతి గంగాం సేవ్య యదాప్నుయాత్‌ 40

ప్రభాసే గోసహస్రేణ రాహుగ్రస్తే దివాకరే l యత్ఫలం లభ##తే మర్త్యో గంగాయాం తద్దినేవవై 41

అన్యోపాయాంశ్చ యస్త్యక్త్వ మోక్షకామః సునిశ్చితః l గంగాతీరే సుఖం తిష్ఠేత్‌ సవై మోక్షస్య భాజనం 42

వారాణస్యాం విశేషేణ గంగా సద్యస్తు మోక్షదా l ప్రతిమాసంచ చతుర్దశ్యాం అష్టమ్యాం చైవ సర్వదా 43

గంగాతీరే నివాససశ్చ యావజ్జీవం చ సిద్ధిదః l కృచ్ఛ్రాణి సర్వదా కృత్వా యత్ఫలం సుఖమశ్నుతే 44

సదా చాంద్రాయణం చైవ తల్లభేజ్జాహ్నావీ జలే l గంగా సేవాపరస్యేహ దివసార్థేన యత్ఫలమ్‌ 45

న తచ్ఛక్యం బ్రహ్మసుతే ప్రాప్తుం క్రతుశ##తైరపి l సర్వయజ్ఞతపోదాన యోగస్వాధ్యాయ కర్మభిః 46

యత్ఫలం తల్లభేద్భక్త్యా గంగాతీరనివాసతః l యత్పుణ్యం తస్యవచనై ర్నైష్ఠిక బ్రహ్మచారిణామ్‌ 47

యదగ్నిహోత్రిణాం పుణ్యం తత్తు గంగానివాసతః l స మాతృపితృదారాణాం కులకోటి మనంతకమ్‌ 48

గంగాభక్తిస్తారయతే సంసారార్ణవతో ధృవమ్‌ l సంతోషః పరమైశ్వర్యం తత్త్వజ్ఞానం సుఖాత్మనామ్‌49

వినయాచార సంపత్తిః గంగాభక్తస్య జాయతే l కృతకృత్యో భ##వేన్మర్త్యో గంగాం ప్రాసై#్యవ కేవలమ్‌ 50

తద్భక్తః తత్పరశ్చస్యాత్‌ మృతో వాపి న సంశయః l భక్త్యా తజ్జలసంస్పర్శీ తజ్జలం పిబతే చయః 51

అనాయాసేన హి నరో మోక్షోపాయం స విందతి l దీక్షితః సర్వయజ్ఞేషు సోమపానం దినే దినే 52

సర్వాణి యేషాం గంగాయాః తోయైః కృత్యాని సర్వదా l దేహం త్యక్త్వా నరాస్తేతు మోదంతే శివసన్నిధౌ 53

దేవాః సోమార్కసంస్థాని యధా శక్రాదయో మఖైః l అమృతాన్యుపభుంజంతి తథా గంగాజలం నరాః 54

కన్యాదానైశ్చ విధివత్‌ భూమిదానైశ్చ భక్తితః l అన్నదానైశ్చ గోదానైః స్వర్ణదానాదిభిస్తథా 55

రథాశ్వగజదానైశచ యత్పుణ్యం పరికీర్తతమ్‌ l తతః శతగుణం పుణ్యం గంగాంభశ్చులుకాశనాత్‌ 56

చాంద్రాయణసహస్రాణాం యత్ఫలం పరికీర్తతం తతోధికఫలం గంగా తోయపానాదవాప్యత్‌ 57

గండూషమాత్రపానేతు అశ్వమేధఫలం లభేత్‌ l స్వచ్ఛందం యః పిబేత్‌ అంభఃతస్య ముక్తిః కరేస్థితా 58

త్రిభిః సారస్వతం తోయం సప్తభిస్త్వధ యామునమ్‌ l నార్మదం పదశభిర్మాసై ర్గాంగం

వర్షేణ జీర్యతి 59

శాస్త్రేణాకృతతోయానాం మృతానాం కాపి దేహినామ్‌ l తదుత్తరఫలావాప్తి ర్గంగాయామస్థియోగతః 60

చాంద్రాయణసహస్రంతు యశ్చరేత్కా యశోధనం l యః పిభేత్తు యధేష్టం హి గంగాంభః స విశిష్యతే 61

గంగాం పశ్యతి యః స్తౌతి స్నాతి భక్త్యా పిబేజ్జలమ్‌ l స స్వర్గం జ్ఞానమమలం యోగం మోక్షం చ విందతి 62

యస్తు సూర్యాంశునిష్టప్తం గాంగేయం పిబతే జలం l గోమూత్రయావకాహారాత్‌ గంగాపానం విశిష్యతే 63

ఇతి శ్రీబృహన్నారదీయ పురాణోత్తర భాగే మోహినీవసుసంవాదే

గంగామాహాత్మ్యవర్ణనం నామ

అష్టత్రింశత్తమోధ్యాయః

వసువు పలికెనుః- గంగానదీ సమీపముననున్నవి మాత్రమే దేశములు, జనపదములు, పర్వతములు ఆశ్రమములనబడును. గంగా సేవనముచే లభించు సద్గతి తపస్సుచే, బ్రహ్మచర్యముచే, యజ్ఞములచే, త్యాగముచే లభించదు. ¸°వనమున పాపకర్మలను చేసిన వారు కూడా వృద్ధాప్యమున గంగను సేవించినచో ఉత్తమ గతిని పొందెదరు. వేయి యుగములు ఒంటికాలుపై నిలిచి తపమును చేసినవాడు ఒక మాసము గంగను సేవించిన వాడు సమాన ఫలమున పొందును. పదివేల యుగములు తలక్రిందులుగా తపస్సు చేసినవాడు యధేచ్ఛగా గంగయందు నిలిచినవానికంటే తక్కువ స్థితిలో నుండును. దుఃఖోపవాతచేతస్కులగు ఉత్తమగతిన అన్వేషించు సమస్త ప్రాణులకు గంగను మించిన గతి లేదు. ప్రకృష్టములు ఘోరములుగు పాపముల నాచరించిన, అపవిత్రమగు నరకమునకు వెళ్ళు పరమపాపులను కూడా సహించి నిరోధించి గంగ తరింప చేయును. గంగను ఎప్పుడూ వెళ్ళి సేవించువారు మునులతో ఇంద్రాది దేవతలతో సమానులు. అంధులను జడులను ద్రవ్యహీనులను కూడా విశ్వరూపబృహతి యను గంగ పావనము చేయును. ఇంద్రాది దేవతలచేత మునులచేత మానవుల చేత తమ సమృద్ధి కొఱకు సర్వకాలములందు సేవించబడుచున్నది. పక్షాదియందు, కృష్ణపక్షమున అమావాస్యనుండి వెనుకకు పది దినమలు గంగ భూమియందు సన్నిహితముగా నుండును. శుక్ల ప్రతిపత్తు నుండి పది దినములు పాతాళమునకు సన్నిహితముగా నుండును. శుద్ధైకాదశి నుండి పది దినములు అనగా బహుళ పంచమి వఱకు స్వర్గమునకు సన్నిహితముగా నుండును. కృతయుగమున అన్ని తీర్థములు పావనములే. త్రేతాయుగమున పుష్కరతీర్థము, ద్వాపరయుగమున కురుక్షేత్రము, కలియుగమున గంగాతీర్థము విశిష్ఠము. కలియుగమున అన్ని తిర్థములు తమతమ శక్తులను గంగలో నిక్షేపించును. గంగ మాత్రము ఎచటా నిక్షేపించదు. గంగాజుల కణమును తాకిన వాయువును స్పృశించిననూ పాపశీలులగు నరులు కూడా ఉత్తమ గతిని పొందెదరు. సర్వగతుడు జ్ఞాన స్వరూపుడు అగు జనార్దనుడే ద్రవరూపమున గంగాజలముగా నిలిచెను. ఈ విషయమున సంశయముతో పనిలేదు. బ్రహ్మహత్య చేసిన వాడు, గురుహంతకుడు, గోహంతకుడు, చోరుడు, గురుతల్పగతుడు గంగా జలముచే పావనులగుదురు. ఇచట విచారించవలసిన పనిలేద. క్షేత్రస్థమగు జలము, ఉద్దృతమగు జలము శీలమైనను ఉష్ణమైననూ గంగా జలమైనచో మరణము వరకు చేసియున్న పాపములను హరించివేయును. పర్యుషితమగు జలమును వర్జించవలయును. పర్యుషితదలమును వర్జించవలయును. కాని గంగాజలమును తులసీదళమును వర్జించవలసిన పనిలేదు. మేరు పర్వతగుణములను, సువర్ణ గుణములను, సర్వరత్న గుణములను, పాషాణ సంఖ్య ఉదకసంఖ్య, గంగాజలగుణ సంఖ్య చెప్పశక్యము కానిది. సకల తీర్థయాత్రా విధి నాచరించని వారు కూడా గంగా జలసేవన మాహత్మ్యమున ఉత్తమ గతిని పొందగలుగును. చింతామణి గుణములకంటే భక్తులకు వాంఛితార్థమును ప్రసాదించు గంగా జలబిందమవు విశిష్ఠములు. భక్తిచే గండూషమాత్రగంగాజలసేవనము కామధేనువు సృజించు దివ్య భోగములనునుభవించ గలుగును. శాలగ్రామశిలయందు గంగాజలమును ప్రోక్షించినవాడు తీవ్రమగు అజ్ఞానమును హరించి ఉదయకాలసూర్యుని వలె ప్రకాశించును. మనోవాక్కాయపాపములు చేసినవాడు కూడా గంగా జలమును దర్శించినచో పావనత్వమును పొందును. గంగా జలభిషిక్తమగుభిక్షను భుజించినవాడు పాము కుబుసమును విడుచునట్లు పాపములను విడుచును. హిమాలయ వింధ్య పర్వతములంతటి పాపరాశులు కూడా గంగా జలముచే విష్ణుభక్తిచే అ పదలు తొలగునట్లు తొలగిపోవును. భక్తితో స్నానమునకై నరులు గంగా జలమున ప్రవేశించినంతనే బ్రహ్మహత్యాది పాపములు హాహాయనుచు పారిపోవును. నిత్యము గంగాతీరమున నివసించవలయను. గంగా జలమును పానము చేయవలయును. ఇట్లు చేసిన మానవుమ పూర్వ జన్మ సంచిత పాపముల నుండి కూడా విముక్తుడగును. నితగము గంగనాశ్రయించి నివసించు వాడు దేవతలకు, మానవులకు, మహర్షులకు కూడా పూజించదగినవాడు. అష్టాంగ యోగముతో, తపములచే, యాగములచే ప్రయోజనము లేదు. గంగా తీరవాసమే విశిష్ట ఫలప్రదము. కాలహరణమును చేయు బహుయజ్ఞములచే, తపస్సులచే, ధనార్పణలచే ఏమి ప్రయోజనము. సర్వమోక్ష ప్రదయగు గంగ సులభ సేవ్యముగా నున్నది కదా. యజ్ఞ యమ నియమ దాన సన్యాసములచే కూడా గంగాసేవఫలము లభించజాలము. రాహుగ్రస్త సూర్యగ్రహణకాలమున ప్రభాస తీర్థమున గోసహస్రదానము చేసిన లభించు ఫలము గంగా సేవనముచే లభించును. మోక్షమును కోరువాడు అన్యోపాయములను విడిచి గంగాతీరమున ఆనందముగా నుండవలయను. అ గంగాతీరమే మోక్ష భాజనము. విశేషించి వారాణసీలో నున్న గంగ సద్యోమోక్షప్రదము. ప్రతిమాసమున చతుర్దశినాడు అష్టమినాడు యావజ్జీవము గంగా తీరవాసము సిద్ధిని ప్రసాదించును. ఎల్లపుడు కృచ్ఛ్రవ్రతముల నాచరించి పొందు ఫలము, సదా చాంద్రాయణమునాచరించు వాడు పొందు ఫలము జాహ్నవీతీరవాసమున పొందగలుగును. సగము దినము గంగా సేవా పరుడైన వాడు పొందు ఫలమును నూరు యాగములనాచరించువాడు కూడా పొందజాలడు. సర్వయజ్ఞతపోదాన యోగ స్వాధ్యాయకర్మలచే పొందు ఫలమును గంగా తీరనివాసి పొందకులును. సత్యవచనమున, నైష్ఠిక బ్రహ్మ చర్యమున, నిత్యాగ్నిహోత్రులకు లభించు పుణ్యము గంగాతీర నివాసులకు లభించును. మాతృపితృదారలను కోటికులమును అనంతముగా గంగా భక్తి సంసారసాగరము నుండి తరింపచేయును. సంతోషము పరమైశ్వర్యము. తత్త్వజ్ఞానము, వినయము, అచార సంపత్తి గంగా భక్తునికి సమకూరును. గంగాజలమును పానము చేసినవాడు కృతకృత్యుడగును. నరుడు మృతుడైనను గంగా భక్తుడు గంగాపరుడుగనే ఉండవలయును. భక్తిచే గంగా జలమును పానము చేసినవాడు, గంగా జలమును స్పృశించువాడు సులభముగా మోక్షోపాయమును తెలియును. గంగా జలముచే సర్వకార్యముల నాచరించువాడు సర్వయజ్ఞ దీక్షితుడు, ప్రతినిత్యము సోమపానము సేసినవాడగును. సూర్యంచంద్రాదులు ఇంద్రాదిదేవతలు అమృతమును పానము చేసినట్లు గంగా జలపానమును చేసిన వారు దేహమును విడిచి శివుని సన్నిధిలో ఆనందింతురు. భక్తిచే కన్యాదానమును, భూదానమును, అన్నదానమును, గోదానమును, స్వర్ణదానాదులను, రధాశ్వగజదానములను, చేసినవారికి కలుగు పుణ్యమునకు నూరురెట్లు చులుకమాత్ర గంగాజల ప్రాశనముతో కులుగును. సహస్ర చాంద్రాయణ వ్రతములనాచరించిన వారిగి కలుగును. సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించినవారికి కలుగు ఫలమునకంటే అధిక ఫలము గంగా జలపానము వలన కలుగును. గండూషమాత్ర గంగా జలపానముచే అశ్వమేధ యాగఫలము లభించును. ఇష్టపూర్వకముగా గంగా జలపానము చేసిన వారికి మోక్షము కరతలామలకముగా నుండును. మూడు మాసములు సరస్వతీ తోయము, ఏడు మాసములు యమునాజలము పది మాసములతో నర్మదా జలమును సంవత్సరము గంగా జలమును సేవించ వలయును. మరణించిన వారికి శాస్త్రవిధి ననుసరించి తర్పణమును చేయువారి అస్థులను గంగాతోయమున కలిపినచో ఉత్తమగతులు లభించును. కాయశోధనమును చేయు సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించిన వారికంటే యధేష్టముగా గంగా జలపానమును చేసిన వాడు విశేష ఫలమును పొందును. గంగను దర్శించినవాడు, స్తుతించినవాడు, గంగా స్నానము చేసినవాడు, భక్తిచే గంగా జలమును పానము చేసినవాడు, స్వర్గమును, పవిత్ర జ్ఞానమును, ఉత్తమ యోగమును, మోక్షమును పొందును. గోమూత్రయావకాహారముకంటే సూర్యకిరణ పరితప్తమగు గంగాజలపానము విశేషఫలమునిచ్చును.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున గంగా మాహాత్మ్యవర్ణనమను

ముప్పది యెనివిదవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page