Sri Naradapuranam-3    Chapters    Last Page

త్రిచత్వారింశత్తమోsధ్యాయః = నలుబది మూడవ అధ్యాయము

పూజాది కధనమ్‌

వసిష్ఠ ఉవాచ:

వసోర్వచన మాకర్ణ్య గంగామహాత్య్మ సూచకమ్‌ l పునః పప్రచ్ఛ రాజేన్ద్ర తం విప్రం స్వపురోహితమ్‌ 1

వసిష్ఠ మహర్షి పలికెను: @Li»R½ÈÁ ®ªsWz¤¦¦¦¬ds ®µ…[„s gRiLigS ª«sV¥¦¦¦»R½øQùª«sVVƒ«sV ¾»½ÖÁzmsƒ«s ª«sxqsVª«so ª«sWÈÁÌÁƒ«sV „s¬s »R½ƒ«s xmsoL][z¤¦¦¦»R½V¬s ª«sVLRiÌÁ BÈýÁV @²T…lgiƒ«sV.

మోహిన్యువాచ:

శ్రుతం విప్ర మయా సర్వం గోదానాది శుభావహమ్‌ l అధునా శ్రోతుమిచ్చామి గంగావ్రతమనుత్తమమ్‌ 2

గంగాదీనాం పూజనం చ స్థాపనం తత్ర వా ద్విజ l కిం ఫలం వద సర్వజ్ఞ త్వామహో శరణం గతా 3

అధునా గతి దాతా త్వం వర్జితాయా స్వబంధుభిః l పత్యా విరహితా చాహో పుత్రహీనా విదాం వర 4

త్వామేవ శరణం ప్రాప్తా పితుర్వచన గౌరవాత్‌ l తద్భవాన్ప్రణతాయా మే గంగామాహత్య్మ సంయుతమ్‌ 5

దేవతా రాధనం బ్రూహి యచ్చ్రుత్వా ముచ్యతే హ్యఘాత్‌

మోహిని పలికెను:

ఓ బ్రాహ్మణోత్తమా, శుభకరములగు గోదానాదులను చక్కగా వింటిని . ఇపుడు సాటిలేని గంగా వ్రతమును వినగోరుచున్నాను. గంగాది పూజనము, స్థాపనము, తత్పలమును సర్వజ్ఞుడవగు నీవు తెలుపుము. నిన్ను నేను శరణు వేడితిని. ఇపుడు నేను పతిహీనను పుత్రహీనను, బందు వర్జితను. ఇపుడు నీవే నాకు ఉత్తమగతి ప్రదాతవు. నాతండ్రి గారి మాట మీది గౌరముతో నిన్నే శరణు పొందిన దానను కావున నీవు నిన్నాశ్రయించిన నాకు సాటిలేని గంగా మాహాత్మ్యమును దేవతారాధనమును తెలుపుము. దానిని విని పాప విముక్తురాలనగుదును.

వసిష్ఠ ఉవాచ :

తచ్చ్రత్వా మోహినీ వాక్యం వసుర్విప్రః ప్రతాపవాన్‌ l సభాజ్య మోహినీం భుప ప్రాహ వేదవిదాం వరః 6

వసిష్ఠ మహర్షి పలికెను : తేజో వంతుడగు వసువు మోహినీం వాక్యమును విని ఆమెను చక్కగా ఆదరించి వేద విదుత్తముడిట్లు పలికెను.

వసురువాచ :

సాధు పృష్టం త్వయా దేవి! లోకానాం హితకామ్యయా l గంగా మహాత్మ్య మఖిలం మహా పాప ప్రణాశనమ్‌ 7

వృషధ్వజేన కధితం శివేన దయయా పురా 8

ప్రీత్యా దేవ్యాభిపృష్టేన గంగాతీర నివాసినా l దేవైస్తు భుక్తం పూర్వాహ్ణే మధ్యాహ్నే ఋషిభిస్తథా 9

అపరాహ్ణే చ పితృభిః శర్వర్యాం గుహ్యకాదిభిః l సర్వావేలా అతిక్రమ్య నక్త భోజన ముత్తమమ్‌ 10

ఉపవాసాద్వర భైక్ష్యం బైక్ష్యాద్వర మయాచితమ్‌ l అయాచితాద్వరాం నక్తం తస్మాన్నక్తం సమాచరేత్‌ 11

హవిష్య భోజనం స్నానం సత్యమాహార లాఘమవ్‌ l అగ్నికారమధః శయ్యాం నక్తాశీ షట్‌ సమాచరేత్‌ 12

గంగాతీరే మాఘమాసే యః కుర్యాన్నక్త భోజనమ్‌ l శివాయతన పార్వ్శేతు కృశరం ఘృత సంయుతమ్‌ 13

నైవేద్యం చ నివేద్యైవ కృశరాన్నం శివస్య తు l కాష్ఠ మౌనేన భుంజానో దిహ్వాతౌల్యం వివర్జయేత్‌ 14

పలాశపాత్రే భుంజానః శివం స్మృత్వా జితేంద్రియః l ధర్మరాజస్య దేవ్యాశ్చ పృథక్పిండం ప్రకల్పయేత్‌ 15

సోపవాసశ్చతుర్దశ్యాం భ##వేదుభయ పక్షయోః l పౌర్ణమాస్యాం తు గందైశ్చ గంగాయాః సలిలైస్తధా 16

శివం సంస్నాప్య పయసా మధ్వాజ్యదధిభిః పృథక్‌ l తదైవ హేమపుష్పం చ లింగముర్ద్ని వినిక్షిపేత్‌ 17

తతో దద్యాత్తు శ##క్త్యైవా పూపంచ ఘృత పాచితమ్‌ l తిలాఢకం ప్రగృహ్యాధ శివలింగోపరి క్షిపేత్‌ 18

నీలోత్పలైశ్చ సర్వేశం పూజయేత్పంకజైరపి l తదలాభేతు సౌవర్ణైః పంకజైః పూజయేద్దరమ్‌ 19

పాయసం చాత్ర మధ్వక్తం ఘృత యుక్తం చ గుగ్గులమ్‌ l ఘృతదీపం తధా చైవ చందనాద్యైర్విలే పనమ్‌ 20

దద్యాద్బక్త్యా మహేశాయ తథా పత్రఫలాని చ lకృష్ణగోమిధునం చైవ సరూపం చ నివేదయేత్‌ 21

భోజయేద్ర్బాహ్మణానష్టౌ మాసాంతే తు సదక్షిణాన్‌ l వర్జయేన్మధు మాంసం చ తం మాసం బ్రహ్మచర్యవాన్‌ 22

ఏవం కృత్వా యధోద్దిష్ట మేకవారమిదం వ్రతమ్‌ l యమైంశ్చ నియమైర్యుక్తః శ్రద్దా భక్తి పరాయణః 23

ఇహ భోగానవాప్నోతి ప్రేత్యచానుత్తమాం గతిమ్‌ l ఇంద్రనీల ప్రతీకాశై ర్విమానైః శిఖిసంయుతైః 24

దివ్యరత్నమయైశ్చైవ దివ్యభోగ సమన్వితైః l గత్వా శిపురం రమ్యం సర్వస్వకుల సంయుతః 25

సుహృద్బిర్వివిదైశ్చైవ వివిధానప్యభీప్సితాన్‌ l భుక్త్వా భోగాన శేషాంశ్చ యావధాభూత సంప్లవమ్‌ 26

తతో భవతి ధర్మా త్మా జంబుద్వీపపతి స్తధా l తత్ర భుంక్తే సమస్తాంశ్చ భోగాన్విగత కల్మషః 27

సురూపః సుభగశ్చైవ తథా విహిత శాసనః l సర్వరోగవినిర్ముక్తః సోsప్యే తత్ఫలభాగ్బనేత్‌ 28

వైశాఖే శుక్ల పక్షే వా చతుర్దశ్యాం సమాహితః l శాల్యన్నం క్షీరసంయుక్తం యః కుర్యాన్నక్తభోజనమ్‌ 29

శివం సంపూజ్య పుష్పాద్యైః భోజ్యం తు సంనివేద్యచ l కాష్ఠమౌనేన భుంజానో వటకాష్ఠేన వైవతథా 30

మౌనేన ప్రయతో భూత్వా కుర్యాద్వై దంత ధావనమ్‌ l శివలింగసమీపే తు గంగాతీరే నిశి స్వపేత్‌ 31

పౌర్ణమాస్యాం ప్రభాతే తుగంగాయాం విధినా తథా l స్నాత్వోపవాసం సంకల్ప్య కుర్యా జ్జాగరణం నిశి 32

లింగం ఘృతేన సంస్నాప్య పుష్ప గంధా దిభస్తధా l నైవేద్య ధూప దీపైశ్చ సంపూజ్య వృషభం శుభమ్‌ 33

సుశ్వేత పుష్ప వస్త్రాద్యై ర్హారిద్రైశ్చందనైస్తథా l అలంకృత్య విధానేన శివాయ వినివేదయేత్‌ 34

బ్రాహ్మణాంశ్చ యధా శక్తి పాయసేనతు భోజయేత్‌ l ఏవం సకృచ్చయో భక్త్యా కరోతి శ్రద్దయాన్వితః 35

లభ##తే దైవపాదొన యుగానాం ద్వి సహస్రకమ్‌ l తపః కృత్వా తు నియమా ద్యత్పుణ్యం తదసంశయమ 36

హంసకుంద ప్రభాయుక్తై హేమ జలవిభూషణౖః 37

స్వకీయ పితృభిః సార్థం ప్రయాతీశ్వర మందిరమ్‌ l నీలోత్పల సుగంధాభిః సురూపాభిః సమంతతః 38

కాంతాభిర్దివ్య రూపాభి ర్బుక్త్వా భోగాననేకశః l అనంతకాలమైశ్వర్య యుక్తో భుత్వా తతో భువి 39

జాయతే స మహీపాలః కీర్త్యైశ్వర్య సమన్వితః l ఏకచ్చత్రేణ స మహీం పాలయత్యాజ్ఞయా సహ 40

అంతే వైరాగ్య సంపన్నో గంగాం స లభ##తే పునః l స తయాశ్రద్ద యా యుక్తో గంగాయాం మరణం లభేత్‌ 41

తథా తత్ర స్మృతిం లబ్ద్వా మోక్ష మాప్నోతి స ధ్రువమ్‌ l జ్యేష్ఠే మాసి సితే పక్షే దశమ్యాం హస్త సంయుతే 42

గంగాతీరే తు పురుషో నారీ వా భక్తిభావతః l నిశాయాం జాగరం కృత్వా గంగాం దశవిదైస్తతః 43

పుషైర్గందైశ్చ నైవేద్యైః ఫలైశ్చ దశసంఖ్యయా l తదైవదీపై స్తాంబులైః పూజయేచ్ఛ్రధ్దయాన్వితః 44

స్నాతా భక్త్యాతు జాహ్నవ్యాం దశకృత్వో విధానతః l దశప్రసృతి కృష్ణాంశ్చ తిలాన్సర్పిశ్చ వై జలే 45

సక్తుపిండాన్గుడపిండా న్దద్యాచ్చ దశ సంఖ్యయా l తతో గంగాతటే రమ్యే హేమ్నా రూప్యేణ వా తథా 46

గంగాయాః ప్రతిమాం కృత్వా వక్ష్యమాణస్వరూపిణీమ్‌ l పద్మస్వస్తిక చిహ్నస్య సంస్థితస్య తథోపరి 47

వస్త్రస్రగ్దామకంఠస్య పూర్ణకుంభస్య చోపరి l సంస్థాప్య పూజయేద్దేవీం తదలాభే మృదాది వా 48

అథ తత్రాప్యశక్తశ్చే ల్లిఖేత్పష్టేన వై భువి l చతుర్బుజాం సునేత్రాంచ చంద్రాయుత సమప్రభామ్‌ 49

చామరైర్వీ జ్యమానాంచ శ్వేతచ్చత్రోపశోభితామ్‌ l సుప్రసన్నాం చ వరదాం కరుణార్ద్ర నిజాంతరామ్‌ 50

సుధాప్లావిత భూపృష్టాం దేవాది భిరిభి ష్టుతామ్‌ l దివ్యరత్న పరీతాంచ దివ్యమాల్యాను లేపనామ్‌ 51

ధ్యాత్వా జలే యధా ప్రోక్తాం తత్రార్చాయాం తు పూజయేత్‌ l వక్ష్యమాణన మంత్రేణ కుర్యాత్పూజాం విశేషతః 52

పంచామృతేన చ స్నాన మర్చాయాం తు విశిష్యతే l ప్రతిమాగ్రే ప్థండితే తు గోమయేనో పలేపయేత్‌ 53

నారాయణం మహేశం చ బ్రహ్మాణం భాస్కరం తథా l భగీరధం చ నృపతిం హిమవంతం నగేశ్వరమ్‌ 54

గంధపుష్పాదిభిశ్చైవ యధా శక్తి ప్రపూజయేత్‌ l దశ ప్రస్థాం తిలాన్దద్యా ద్దశ విప్రేభ్య ఏవ చ 55

దశప్రస్థాన్యవాన్దద్యా ద్దశగవ్యైర్యధా హితాన్‌ l మత్స్య కచ్ఛప మండూక మకరాది జలేచరాన్‌ 56

కారితాన్వై యథాశక్తి స్వర్ణేన రజతేన వా | తదలాభే షిష్ఠ మయాన్‌ అభ్యర్చ కుసుమాదిభిః

గంగాయాం ప్రక్షిపేత్పూర్వం మంత్రేణౖవ తు మంత్రవిత్‌ 57

రథయాత్రాదినే తస్మిన్‌ విభ##వే సతి కారయేత్‌ l రథా రూఢ ప్రతికృతిం గంగాయా స్తుత్తరాముఖామ్‌ 58

భ్రమంత్యా దర్శనం లోక దుర్లభం పాపకర్మణామ్‌l దుర్గాయా రధ యాత్రాస్తి తదై వాత్రాపి కారయేత్‌ 59

ఏవం కృత్వా విధానేన విత్తశాఠ్య వివర్జితః l దశపాపై ర్వక్ష్య మాణౖః సద్య ఏవ విముచ్యతే 60

అదత్తానాముపాదానం హింసాచైవా విధానతః l పరదారోపసేవాచ కాయికం త్రివిధం స్మృతమ్‌ 61

పారుష్యమనృతం వాపి పైశున్యం చాపి సర్వశః l అసంబద్ద ప్రలాపశ్చ వాచికం స్యాచ్ఛతుర్విధమ్‌ 62

పరద్రవ్యేష్య భి ధ్యానం మనసానిష్ట చింతనమ్‌ l వితథాభినవేశశ్చ మానసం తంవిధం స్మృతమ్‌ 63

ఏతైర్దశవిదైః పాపైః కోటి జన్మ సముద్బవైః l ముచ్యతే నాత్ర సందేహో బ్రహ్మణో వచనం యథా 64

దశ త్రింశచ్చ తా న్పూర్వాన్పితౄ నేవ తధాపరాన్‌ l ఉద్దరత్యేవ సంసారాన్మంత్రేణానేన పూజితా 65

ఓం నమో దశహరాయై నారాయణ్యౖ గంగాయై నమః l ఇతి మంత్రేణ యో మర్త్యో దినే తస్మిన్దివానిశమ్‌ 66

జసెత్పంచ సహస్రాణి దశధర్మఫలం లభేత్‌ l ఉద్దరేద్దశ పూర్వాణ పరాణిచ భవార్ణవాత్‌ 67

వక్ష్యమాణమిదం స్తోత్రం విధినా ప్రతిగృహ్య చ l గంగాగ్రే తద్దనే జప్యం విష్ణు పూజాం ప్రవర్తయేత్‌ 68

ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమోsస్తుతే l నమోsస్తు విష్ణురూపిణ్యౖ గంగాయై తే నమో నమః 69

సర్వదేవ స్వరూపిణ్యౖ నమో భేషజ మూర్తయే l సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్‌ శ్రేష్ఠే నమోsస్తుతే 70

స్థాణు జంగమ సంభూత విషహన్త్రి నమోsస్తుతే l సంసార విషనాశిన్యై జీవనాయై నమో నమః 71

తాపత్రితయ హన్త్యై చ ప్రాణశ్వర్యై నమో నమః | శాంత్యై సంతాపహారిణ్యౖ నమస్తే సర్వమూర్తయే 72

సర్వసంశుద్ద కారిణ్యౖ నమః పాపవిముక్తయే l భుక్తి ముక్తి ప్రదాయిన్యై భోగవత్యై నమో నమః 73

మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమా నమః l నమసై#్త్రలోక్యమూర్తయై త్రిదశాయై నమోనమః 74

నమస్తే శుక్లసంస్థాయై క్షేమవత్యై నమోనమః l త్రిదశాసన సంస్థాయై తేజోవత్యై నమోsస్తుతే 75

మందాయై లింగధారిణ్యౖ నారాయణ్యౖ నమో నమః l నమస్తే విశ్వమిత్రాయై రేవత్యై తే నమోనమః 76

బృహత్యే తే నమో నిత్యం లోకధాత్ర్యై నమోనమః l నమస్తే విశ్వముఖ్యాయై నందిన్యై తే నమో నమః 77

పృద్వై శివామృతాయై చ విరజాయై నమోనమః l పరావరగతాద్యాయై తారాయై తే నమోనమః 78

నమస్తే సర్వ సంస్థాయై అభిన్నాయై నమో నమః l శాంతయై తే ప్రతిష్ఠాయై వరదాయై నమోనమః 79

ఉగ్రాయై ముఖజల్పాయై సంజీవిన్యై నమో నమః l బ్రహ్మగాయై బ్రహ్మాదాయై దురితఘ్న్యై నమోనమః 80

వ్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోనమః l విలుషాయై దుర్గహన్య్రై దక్షాయైతే నమో నమః 81

సర్వాపత్ప్రతి పక్షాయై మంగలాయై నమో నమః l పరాపరే పరే తుభ్యం నమో మోక్ష ప్రదే సదా 82

గంగా మమాగ్రతో భూయా ద్గంగా మే పార్శ్వయో స్తధా l గంగా మే సర్వతో భూయాత్త్వయి గంగేsస్తు మే స్థితిః 83

ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వా త్వం పగాం గతే శివే l త్వమేవ మూలప్రకృతి స్త్వం హి నారాయణః ప్రభుః 84

గంగే త్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమోనమః l ఇతీదం పఠితం స్తోత్రం నిత్యం భక్త పరస్తు యః 85

శృణోతి శ్రద్దయా వాపి కాయవాచిక సంభ##వైః l దశధా సంస్థితై ర్దోషై స్సర్వైరేవ ప్రముచ్యతే 86

రోగీ ప్రముచ్యతే రోగా న్ముచ్యేతాపన్న ఆపదః l ద్విషద్బ్యో బంధనాచ్చాపి భ##యేభ్యశ్చ విముచ్యతే 87

సర్వాన్కామానవాప్నోతి ప్రేత్య బ్రహ్మణి లీయతే l ఇదం స్తోత్రం గృహే యస్య లఖితం పరిపూజ్యతే 88

నాగ్నిచౌర భయం తత్ర పాపేభ్యోsపి భయం నహి l తస్యాం దశమ్యామేతచ్చ స్తోత్రం గంగాజలే స్థితః 89

జపంస్తు దశకృత్వశ్చ దరిద్రో వాపి చాక్షమః l సోsపి తత్పలమాప్నోతి గంగాం సంపూజ్య భక్తితః 90

పూర్వోక్తేన విధానేన ఫలం యత్పరికీర్తతమ్‌ l యథా గౌరీ తధా గంగా తస్మాద్గౌర్యాస్తు పూజనే 91

విధిర్యో విహతస్సమ్యక్శి సోsపి గంగా ప్రపూజనే l యథా శివస్తధా విష్ణు ర్యధా విష్ణుస్తధా హ్యుమా 92

ఉమా యథా తథా గంగా చాత్ర భేదో న విద్యతే l విష్ణురుద్రాంతరం యశ్చ గంగాగౌర్యంతరం తధా 93

లక్ష్యీగౌర్యంతరం యశ్చ ప్రబ్రూతే మూఢధీస్తు సః

వసువు పలికెను: ఓ మోహినీ ! నీవు లోకహితమును కోరి చక్కగా అడిగితివి. మహా పాప ప్రణాశకమగు సమస్త గంగా మాహాత్మ్యమును పూర్వము వృషధ్వజుడగు శివుడు దయచే గంగాతీరమున పార్వతీదేవి యడుగగా చెప్పెను. దేవతలు పూర్వాహ్ణమున భుజింతురు. ఋషులు మధ్యాహ్నమున, ఆపరాహ్ణమున పితరులు, రాత్రిపూట గుహ్యకాదులు భుజింతురు. కావున ఈ అన్ని వేళలను దాటి రాత్రి భోజనము ఉత్తమము. ఉపవాసముకంటే భిక్షావ్రతము ఉత్తమము. బైక్ష్యము కంటే ఆయాచితవ్రతము మేలు . అయా చితవ్రతము కంటే నక్త భోజనం వ్రతము మేలు. కావున ఈ నక్త వ్రతము నాచరించవలయును. హ విష్య భోజనము, స్నానము, సత్యము ఆహార లాఘవము. అగ్నికార్యము, అధః శయ్యా ఈ అరింటిని నక్త భోజి ఆచరించవలయును. మాఘ మాసమున గంగాతీరమున నక్త వ్రతము నాచరించ వలయును. శివాలయ పార్శ్వ భాగమున నువ్వుల అన్నమును ఘృతముతో కలిపి శివునికి నివేదన చేసి కాష్ఠ మౌనముచే భుజించుచు జిహ్వా చాపల్యమును విడువవలయును. జితేంద్రియుడై శివుని ధ్యానించుచూ మోదుగాకు పాత్రలో భుజించవలయును. ధర్మరాజునకు, దేవికి విడిగా ముద్దలను కల్పించవలయును. రెండు పక్షములలొచతుర్దశినాడు ఉపవసించ వలయును. పూర్ణిమనాడు గంధములతో గంగాజలముతో పాలు పెరుగు నేయి తేనెలలో శివునికి శివునికి స్నానం చేయించి (విడిగా) లింగ శరోభాగమున హోమపుష్పము నుంచవలెను. తరువాత శక్తి కొలది ఘృతపాచితములగు అపూపములను శక్తికి సమర్పించవలయును. తిలాఢకమును గ్రహించి శివలింగోపరిభాగమున నుంచవలయను. నీలో త్పలములచే పంకజములచే సర్వేశ్వరుని పూజించవలయును. ఇవి లభింనిచో సువర్ణ పంకజములచే పూజించ వలయును. తేనె కలిపిన పాయసమును, ఘృతయుక్తమగు గుగ్గులమును, ఘృతదీపమును చందనాది విలేపనమును, మహేశ్వరునికి భక్తితో సమర్పించ వలయును. అట్లే పత్రములను ఫలములను సమర్పించవలయును. సమాన రూపమగు కృష్ణగో మిధునమును సమర్పించ వలయును. మాసాంతమున ఎనిమిది మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణల నీయ వలయును. ఈ మాసము బ్రహ్మచర్యమును అవలంభించి మద్య మాంసములను విడువవలయును. ఇట్లు యధావిదిగా యమనియమాది యుక్తుడై, శ్రద్దా భక్తి పరారుణుడై ఒక మారు ఈ వ్రతము నాచరించినవాడు ఇహలోకమున అన్నిభోగములను పొంది అంతమున ఉత్తమ గతిని పొందును. ఇంద్రనీల ప్రతీకాశములు, శిఖిసంయుతములు, దివ్యరత్నమయములు, దివ్యభోగసమన్వితములు, అగు విమానములచే, రమ్యమగు శివపురమునకు స్వకులము వారందరితో కలిసి వెళ్ళి, మిత్రులతో కూడా వెళ్ళి బహు విధాభీప్సితములను అశేష భోగములను అను భవించి ప్రళయ కాలమువరకుండి , తరువాత జంబూ ద్వపపతిగా ధర్మాత్ముడుగా పుట్టును. కల్మషరహితుడై ఇచట సకల భోగములననుభవించును. సుందరుడు సౌ భాగ్యవంతుడు, అందరిని శాసించువాడు, సర్వరోగ వినిర్ముక్తుడు అగును. అతను కూడా ఈ ఫలమును పొందును. ఇక వైశాఖ శుక్ల చతుర్దశినాడు సావధానుడై క్షీరసంయుక్తమగు శాల్యన్నమును రాత్రపూట భుజించవలయును, మొదట పుష్పాదులచే శివుని పూజించి, అన్నమును నివేదన చేసి కాష్ఠ మౌనముతో భుజించవలయును. మొదట వటకాష్ఠముతో మౌనముగా దంతధావనమును చేయ వలయును, రాత్రపూట గంగా తీరమున శివలింగ సమీపమున పరుండవలయును. పూర్ణిమా ప్రాతఃకాలమున యధావిధిగా గంగానదిలో స్నానమాడి ఉపవాసమును సంకల్పించ, రాత్రిపూట జాగరణ చేయవలయును. శివలింగమును ఘృతముతో స్నాము చేయించి, పుష్ప గంధాదులచే ధూప దీపనైవేద్యములచే పూజించి శుభకరమగు వృషభమును శ్వేత పుష్పవస్త్రాదులచే హరిద్రా చందనములచే అలంకరించి శివునకి నివేదన చేయవలయును. శక్త కొలది బ్రాహ్మణులకు పాయసమును భుజంప చేయవలయును. ఇట్లు భక్తి శ్రద్ధలతో ఒకసారి రెండు వేల యుగములు ఒక పాదము తక్కువగా తపస్సు చేసిన కలుగు పుణ్యమును పొందును. హంస కుంద ప్రభాయుక్తములు చన్ద్ర సన్నిభములు, సుశ్వేత వృషయుక్తములు ముక్తా జాలవి భూషితములు అగు విమానములతో తమ పితరులతొ కలిసి ఈశ్వర మందింమును చేరును. అంతట నీలోత్పలసుగందులు రూప వతులగు యువతులతొ పలుభోగములను భవించును. తరువాత భూలోకమున రాజుగా పుట్టి అనంతకాలము ఐశ్వర్యయుక్తుడై కీర్తి సమన్వితుడై ఏక ఛత్రముగా భూమిని పరిపాలించును. అంతకాలమున వైరాగ్య సంపన్నుడై గంగను పొందును. గంగయందు శ్రద్దాభక్తులు కలవాడు కావున గంగానదిలో మరణమును పొందును. దానిచే పూర్వజన్మజ్ఞానమును పొంది మోక్షమును పొందును.

జ్యేష్ఠ శుద్ద దశమి హస్తా నక్షత్రయుక్త మగుచో గంగాతీరమన నరుడు కాని నారి కాని భక్తి భావము చే రాత్రి జాగరణ కావించి, గంగను పదివిధములగు పుష్ప గంధనైవైద్య ఫలములను దశసంఖ్యచే దీపములను తాంబూలములను సమర్పించి పూజించవలయును. గంగానదిలొ పదిమార్లు యధావిధిగా స్నానమాడి భుజించి దశప్రస్థ ప్రమాణములగు నువ్వులను నేయిని దశసంఖ్యచే సక్తుపిండములను, గుడపిండములను గంగా జలమున అర్పించ వలయును. తరువాత సుందరమగు గంగాతీరమున బంగారముచే కాని వెండిచే కాని, పద్మస్వస్తిక చిహ్నములు కల పూర్ణ కుంభముపైన ఉన్న, వస్త్రస్రగ్దామములు కుంభమునకు కంఠభాగమున చుట్టి యుండగా గంగాదేవి ప్రతిమను నిర్మించి స్థాపించి పూజించ వలయును. స్వర్ణాదులు లభించనిచో మృదాదులచే చేయవచ్చును. అది కూడా లభించనిచొ పిండిచే వ్రాయవలయును. చతుర్బుజములు కలది, సునేత్ర, చంద్రాయుత సమప్రభ, చామరములచే వీయబడునది, శ్వేత చ్ఛత్రోప శోభిత, సుప్రసన్న, వీరద, కరుణార్ద్రాంతరంగ, సుధాప్లావిత భూపృష్ఠ, దేవాదులచే సంస్తూయ మాన, దివ్యరత్న పరీత, దివ్యమాల్యాను లేపన, యగు గంగాదేవిని నిర్మించి స్థాపించి, జలమున ధ్యానించి, ప్రతిమను పూజించవలయును. చెప్ప బోవు మంత్రముచే విశేష మంత్ర పూజగావింవలెను.

ప్రతిమను పంచామృతము తోస్నానమును చేయించవలయును. ప్రతిమాగ్ర భాగమున భూమిని గోమయముతో అలుక వలయును. నారారుణుని, మహాశుని బ్రహ్మను భాస్కరుని, బగీరధ రాజును, హిమవత్పర్వతమును, గంధ పుష్పాదులచే యధా శక్తిగా పూజించవలయును. పదిమంది బ్రాహ్మణలకు దశ ప్రస్థ పరిమాణ తిలలను దానము గావించ వలయును. దశ ప్రస్థయవలను గవ్యముచే కలిపి దాను%ుగావించ వలయును. మత్స్యకచ్ఛప మండూకమక రాది జలచారములను స్వర్ణముచే కాని రజితముచే కాని నిర్మించి, స్వర్ణరజతములు లభించనిచొ పిష్టముచే నిర్మించి కుసుమాదులచే పూజించి గంగలో పడవేయవలయును. మొదట మంత్రవిత్తై మంత్రముచే విభవమున్నచో రథయాత్రను జరుప వలయును. గంగా ప్రతిమను ఉత్తరాభి ముఖముగా రథారూఢను చేసి తిప్ప వలయును. రథారూఢ యగు గంగాదర్శనము పాపులకు దుర్లభము. దుర్గా రధయాత్ర వలెనే గంగా రధయాత్రను చేయవలయును. ఇట్లు యధావిధిగా విత్తలోభమును విడిచి చేయువాడు ఈ చెప్పెబోవు పది పాపములనుండి విముక్తుడగును. ఈయని వాటిని గ్రహించుట, అ విధాన హింస, పరధారా భిగమనము, అనునవి మూడు కాయిక పాపములు. కఠినముగా మాట లాడుట, అసత్య భాషణము, చాడీలుచెప్పుట, అసంబద్ద ప్రలాపములు అను నాలుగు వాచిక పాపములు. పరద్రవ్యములందు ధ్యానము, మనసుచే అనిష్ట చింతనము, అసత్యాభి నివేశము అనునవి మూడు మానస పాపములు. కోటి జన్మలలో ఏర్పడిన ఈదశ విధములగు పాములచే విముక్తుడగునని బ్రహ్మవాక్యము. ఈ మత్రముచే పూజించ బడిన గంగాదేవి పది పూర్వ తరములను, పది ఉత్తర తరములను, ఇతరములగు పది తరములను ఇట్లు ముప్పది పితరులను తరింప చేయును. ''ఓం నమో దశహరాయై నారాయణ్యౖ గంగాయై నమః'' అని మంత్రము. దశవిధపాపములను హరించి నారాయణి యగు గంగకు నమస్కారము అని అని యర్థము. ఈ మంత్రమును ఆదినము రాత్రింబవళ్ళు అయిదు వేలు జపించ వలయును. దశ ధర్మఫలము లభంచును. సంసారసాగరమునుండి దశపూర్వులను, దశపరపితరులను పతరింప చేయును. చెప్పబోవు ఈ స్తోత్రమును యధావిధిగా గ్రహించి ఆ దినమున గంగాగ్రభాగమున జపించి విష్ణ్ను పూజను చేయవలయును. శివరూపపురాలికి, గంగాదేవికీ, శివదకు నమస్కారము. విష్ణురూపిణి యగు గంగకు నమస్కారము. సర్వదేవ స్వరూపిణికి, ఔషధమూర్తికి, అందరికి అన్ని వ్యాధులకు ఔషధరూపు రాలికి నమస్కారము, స్థాణు జంగమసంభూత విషహారిణికి, సంసార విషనాశనికి, జీవన స్వరూపురాలికి నమస్కారము. తాపత్రయ నివారిణికి, ప్రాణశ్వరికి, శాంతి స్వరూపిణికి, సంతాప హారిణికి%ి, సర్వమూర్తికి నమస్కారము. సర్వసంశుద్ధకారిణికి పాపవిముక్తికి నమస్కారము. భుక్తి ముక్తి ప్రదాయినికి, భోగవతికి, స్వర్గప్రదకు, మందాకినికి నమస్కారము. త్రైలోక్య స్వరూపురాలికి త్రిదశకు, శుక్ల సంస్థకు, క్షేమ వతికి నమస్కారము. త్రిదశాసన సంస్థకు, తేజోవతికి, మందకు, లింగధారిణికి, నారాయణికి నమస్కారము. విశ్వమిత్రకు, రేవతికి, బృహతికి, లోకధాత్రికి నమస్కారము. విశ్వముఖ్యకు, నందినివి, పృధివికి, శివమృతకు, విరజకు నమస్కారము. పరావరగతాద్యకు, తారకు, సర్వసంస్థకు అభిన్నకు నమస్కారము. శాంతకు, ప్రతిష్ఠకు, వరదకు, ఉగ్ర, ముఖజల్పకు, సంజీవినికి, బ్రహ్మగకు, బ్రహ్మదకు, దురితఘ్నికి నమస్కారము. ప్రణతార్తి ప్రభజంనికి, జగన్మాతకు, విలుషకు, దుర్గహన్త్రికి, దక్షకు నమస్కారము. సర్వాపత్ర్పతి పక్షకు, మంగలమ, పరాపరురాలకు, పరమ మోక్షప్రదాత్రికి నమస్కారము. గంగ నా ముందు భాహమున, పార్శ్యము లందు సర్వదిశలందు ఉండు గాక, నా ఉనికి నీయందే ఉండు గాత. ఆది మద్యాంతములందు భూమి యందు నీవుంటివి. నీవే మూల ప్రకృతివి. నీవే నారాయణా ప్రభువు. నీవే పరమాత్మవు. నీవే శివునివి. నీకు నమస్కారము. ఇట్లు ఈ స్తోత్రమును భక్తి పరుడై ప్రతినిత్యము పఠించువానికి, వినువానికి వినిపించు వానికి కాయిక వాచిక మానస భావములగు దశవిధ పాపములనుండి విముక్తుడగును. రొగి రోగములనుండి, ఆ పన్నుడు ఆ పదలనుండి, విముక్తుడగును. శత్రువులనుండి, బంధనములనుండి, భయములనుండి విముక్తుడగును. సర్వకామనలను పొందును. అంతమున బ్రహ్మలో లీనమగును. ఈ స్తోత్రమును లిఖించి ఇంటిలో పూజించబడినచో అగ్ని చోర భయములు పాప భయములుండవు. ఈ దశమినాడు ఈ స్తోత్రమును గంగా జలమున నిలిచి పదిమార్లు జపించినచో దరిద్రుడు, అసమర్థుడు కూడా గంగా పూజను గావించిన వాడు ఆ ఫలమును పొందును. కావున పూర్వోక్త విధానముచే చెప్పబడిన ఫలితము లభించును. గంగ గౌరి వంటిది. కావున గౌరీ పూజనమున చెప్పబడిన విధియే గంగా పూజనమున అనుసరించవలయును. శివుడెట్లో విష్ణువట్లే. విష్ణువైట్లో పార్వతీయట్లు. పార్వతి వలె గంగ. ఈ విషయమున భేదములేదు. హరిహరులకు గంగా గౌరులకు, లక్ష్మీపార్వతులకు భేదమును చూచువాడు, చెప్పువాడు మూఢబుద్దియే.

శుక్లపక్షే దివా భూమౌ గంగాయా ముత్తరాయణ 94

ధన్యాదేహో విముంచంతి హృదయస్థే జనార్దనే l యే ముంచంతి నరాః ప్రాణాన్‌ గంగాయాం విధినందిని l 95

తే విష్ణులోకం గచ్ఛంతి స్తూయ మానా దివి స్థితైః l అర్దోదకేన జాహ్నవ్యాం మ్రియతేనsశ##నేన యః 96

స యాతి న పునర్జన్మ బ్రహ్మ సాయుజ్యమేతి చ l యా గతి ర్యోగయుక్తస్య సాత్త్వికస్య మనీషిణః 97

సా గతిస్త్యజతః ప్రాణా న్గంగాయాం తు శరీరిణః l అనశనం గృహీత్వా యో గంగాతీరే మృతో నరః 98

సత్యమేవ పరం లోక మాప్నోతి పితృభిస్సహ l గంగాయాం మరణాత్ర్పాణా న్యో ప్రాజ్ఞస్త్యక్తు మిచ్ఛతి 99

గతాని బహుజన్మాని యత్ర యత్ర మృతానిచ l మహాంశ్చాపి గతః కాలోయత్ర పతత్రాపి గచ్ఛతః 100

అత్ర దూరే సమీపే చ సదృశం యోజన ద్వయమ్‌ l గంగాయా మరణనేహ నాత్ర కార్యా వచారణా 101

జ్ఞానతో sజ్ఞానతొ వాపి కామతోs కామతోపి వా l గంగాయాం తు మృతో మర్త్య స్స్వర్గం మోక్షం చ విందతి 102

ప్రాణఘాత్సృజ్య మనేషు యో గంగాం సంస్మరేన్నరః lస్పృశేద్వా పాపశీలోsపి వై యాతి పరాం గతిమ్‌ 103

గంగాం గత్వా యెశ్శరీరం విస్పష్టం ప్రాప్తా ధీరా స్తేతు దేస్సమత్వమ్‌ l తస్మాత్సర్వా న్ప్రోహ్య ముక్తి ప్రదత్వే సేవేద్గంగా మా శరీరస్య పాతమ్‌ 104

అంతరిక్షే క్షితౌ తోయే పాపీయానపి యో మృతః l బ్రహ్మ విష్ణు శివైః పూజ్యం పదమక్షయ్య మశ్నుతే 105

యోధర్మిష్ఠశ్చ సప్రాణః ప్రయాత శ్శిష్టసంమతః l చింతయేన్మనసా గంగాం స గతిం పరమాం లభేత్‌ 106

యత్ర యత్ర మృతో వాపి మరణ సముపస్థితే l భక్త్యా గంగాం స్మరన్యాతి శైవం వా వైష్ణవం పురమ్‌ 107

శంభోర్జటాకలపాత్తు వినిష్క్రాంతాతి కర్కశాత్‌ l ప్లావయిత్వా దివం నిన్యే యా పాపాన్సగరాత్మజాన్‌ 108

యావంత్యస్థీన గంగాయాం తిష్ఠన్తి పురుషసsవై l తావ ద్వర్ష సహస్రాణి స్వర్ణలోకే మహీయతే 109

గంగాతోయేతు యస్యాస్థి నీతా ప్రక్షిప్యతే నరైః l తత్కాలమాదితఃకృత్వా స్వర్గలోకే భ##వేత్ద్సితిః 110

గంగాతోయే తు యస్యాస్థి ప్రాప్యతే శుబుకర్మణః l న తస్య పునరావృత్తి ర్బ్రహ్మలోకాత్కధంచన 111

దశాహాభ్యన్తరేయస్య గంగాతోయేsస్ది సంగతమ్‌ l గంగాయాం మరణ యాద్బ క్తాదృక్ఫల మవాప్నుయాత్‌ 112

స్నాత్వాష్నితతః పంచగవ్యేన సిక్త్యా హిరణ్య మధ్వాజ్యతి లైర్నియోజ్య | తదస్థి పండం పుటకే నిధాయ పశ్యన్దిశం ప్రేత గణోప గూఢామ్‌ 113

నమోsస్తు ధర్మాయ వదన్ర్పవిశ్య జలం సమే ప్రీత ఇతి క్షిపేచ్చl స్నాత్వా తతస్తర్థ వటాక్షయం చ ప్రదృష్ట్యా ప్రదద్యాధధ దక్షిణాం తు 114

ఏవం కృతాహ ప్రేత స్థితస్య స్వర్గే గతిస్స్యాత్తు మహేన్ద్రతుల్యా 115

ప్రవాహ మవధిం కృత్వా యావద్దస్త చతుష్టయమ్‌ l తత్ర నారాయణ స్స్వామీ నాన్య స్స్వామీ కదాచన 116

భాద్రశుక్ల చతుర్ద శ్యాం యావదాక్రమతే జలమ్‌ 117

తావద్గర్భం విజానీయా త్తద్దూరం తీరముచ్యతే l సార్థహస్త శతం యావ ద్గర్బ స్తీరం తతః పరమ్‌ 118

ఇతి కేషాం మతం దేవి శ్రుతిస్మృతిషు సంమతమ్‌ l తీరాద్గవ్యూతి మాత్రం తు పరితః క్షేత్రముచ్యతే 119

తీరం త్యక్త్వా వసేత్‌ క్షేత్రే తీరే వాసో న చేష్యతే l ఏకయోజనవిస్తీర్తౌ క్షేత్రసీమా తట ద్వయాత్‌ 120

గంగాసీమాం న లంఘన్తి పాపాన్య ప్య ఖిలాన్యపి l తే తు దృష్ట్వా పలాయన్తే యథా సింహం వనౌకసః 121

యత్ర గంగా మహాభాగే రామశంభుతపోవనమ్‌ l సిద్దక్షేత్రం తు తజ్ఞేయం సమంతాత్తు త్రియోజనమ్‌ 122

తీర్ధే న ప్రతి గహ్ణీయా త్పుణ్యష్వాయ తనేషు చ l నిమిత్తేషు చ సర్వేషు తన్నివృత్తో భ##వేన్నరః 123

తీర్దే యః ప్రతిగృహ్ణాతీ పుణ్య ష్వాయత నేషు చ l నిష్పలం తస్య తతీర్థం యావత్తద్దానముచ్యతే 124

గంగా విక్రయణాద్దేవి విష్ణోర్విక్రయణం భ##వేత్‌ l జనార్దనే తు విక్రీతే విక్రీతం భువనత్రయమ్‌ 125

గంగాతీర సముద్బూతాం మృదం మూర్ద్నా భిభర్తి యః l బిభర్తి రూపం సోsర్కస్య తమో నాశాయ కేవలమ్‌ 126

గంగాపులినజా ధూలి మాస్తీర్యాధ నిజాన్‌ పితౄన్‌ lప్రీణయన్యోనరః పిండాన్‌ దద్యాత్తన్‌ స్వర్నయే దపి 127

ఇతం తేsభిహితం భ##ద్రే గంగామాహాత్మ్య ముత్తమమ్‌ l పఠన్‌ శణ్వన్న రోహ్యతి తద్వష్ణోం పరమం పదమ్‌ 128

నిత్యం జప్యమిదం భక్త్యా ప్రయతై శ్శ్రద్దయాన్వితైః | వైష్ణవీం గతిమిచ్చద్భి శ్శైవీం వా విధినందిని 129

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే

మోహినీ వసు సంవాదే గంగా మాహాత్య్మే

పూజాది కధనం నామ

త్రిచత్వారిం శత్తమోsధ్యాయః

ఉత్తరాయణమున, శుక్ల పక్షమున, భుమి మీద, పగలు గంగయందు హృదయమున జనార్దనుని ఉంచుకొని ధన్యులు మాత్రమే దేహమును విడుతురు. ఓ బ్రహ్మపుత్రీ ! గంగానదియందు ప్రాణములను విడిచిన నరులు దేవతలచే స్తుతించబడుచు విష్ణులొకమునకు వెళ్ళెదరు. గంగానది యందు దప్పితోకాని నిరాహారముతో కాని మరణించువారు పునర్జన్మనందరు. బ్రహ్మసాయుజ్యమును పొందెదరు. సాత్విక బుద్ది గల వానికి, యోగయుక్తునికి లభించు గతి గంగలో ప్రాణములను విడిచిన వానికి లభించును . ఉపవాసముచే గంగా తీరమున మృతి చెందినవాడు పితరులతో పరలొకమును పొందును. గంగానదిలో ప్రాణములను విడువదలిచిన వాడు పపూర్వజన్మలను విడిచిన వాడగును. పూర్వమృతులను విడిచిన వాడగును. చాలా కాలము గడిచిపోవును. ఇచట రెండు యోజనముల దూరము సమీపము సమానమే. తెలిసి, తెలియక, కొరీ, కోరకనైను గంగ యందు మరణించినవాడు స్వర్గమును మోక్షమును పొందును. ప్రాణములు పోవుచుండగా గంగను తలచినవాడు, లేదా తాకినవాడు, పాపశీలుడైనను ఉత్తమగతిని పొందును. గంగకు వెళ్ళి శరీరమును విడిచిన వారు దేవసములగుదురు. కావున అన్నిటిని విడిచి ముక్తి కొరకు శరీర పాతము వరకు గంగను సేవించవలయును. అంతరిక్షమున కాని, క్షితియందుకాని, జలమునందు కాని గంగా సంబంధమునుండగా మరణంచినవాడు బ్రహ్మ విష్ణుశివులచే పూజించబడు అక్షయపదమును పొందును. ధర్మిష్టుడు శిష్ట సమ్మతుడు ప్రాణప్రయాణ సమయమున మనసున గంగను ధ్యానించిన పరమగతిని పొందును. ఎచట మృతి చెందిననూ మరణకాలమున గంగను భక్తిచే స్మరించువాడు శివలొకమును కాని విష్ణులోకమును కాని పొందును అతి కర్కశమగు శివుని జటా జూటము నుండి బయలువెడలి పాపులను నగరపుత్రులను తడిపి స్వర్గమున చేర్చెను. ఎన్ని అస్థులు గంగలో ఉండునో అన్ని యేండ్లు స్వర్గలోకమున నివసించును. గంగా జలమున అస్థులనుపడవేసిన నాటి నుండి అతను స్వర్గమున నివసించును. గంగా జలమున ఆస్థులున్నవాడు మరల బ్రహ్మలోకము నుండి ఇచటకు రాబోడు. మరణించిన పది రోజులలోపు గంగలోన ఆస్థులను కలిపినచో గంగా మరణఫలము లభించును. స్నానముచేసి అస్థులను పంచగవ్యములచే స్నానము చేయించి, హిరణ్యమధు, ఆజ్య తిలలతో కలిపి అస్థి పిండమును హస్తపుటమున నిడుకొని దక్షిణ దిక్కును చూచుచు ధర్మరాజునకు నమస్కారమని పలుకుచు జలమున ప్రవేశించి అతను ప్రీతిచెందుగాత అని గంగలొ వేయవలయును. తరువాత స్నానము నాచరించి తర్థమును అక్షయ వటమును దర్శించి దక్షిణలనిచ్చినచో నరకమున నున్న వానికి స్వర్గమున ఉనికి కలగును. ప్రవాహము నుండి నాలుగు హస్తముల ప్రమాణ ప్రదేశమున నారాయణా మూర్తియే యుండును . ఇచట జలమును గ్రహించరాదు. భాద్రశుక్ల చతుర్దశినాడు జలకమాక్రమించు ప్రాంతము వరకు గర్భమనబడును. దూర ప్రాంతము అంతయే తీరమనబడును. నూట యాబైహస్తముల ప్రమాణ ప్రాంతము గర్భము, తరువాతది తీరమనబడును. ఇది శ్రుతి స్మృతులలోచెప్పబడిన కొందరి మతము. తీరము నుండి రెండు క్రోసుల దూరము క్షేత్రమనబడును. తీరమును విడిచి క్షేత్రమున నివసించవలయును. తీరమున నివసించరాదు. రెండు తటముల నుండి ఒక యోజన విస్తార ప్రాంతము క్షేత్రసీమనబడును. సమస్త పాపములు గంగాసీమను దాటజాలవు. గంగాసీమను చూచిన పాపములుసింహమును చూచిన క్షుద్రమృగముల వలె పలాయనమును పాటించును. గంగా ప్రాంతమున రామశంభుతపోవనమున్న ప్రదేశము మూడు యోజనముల ప్రాంతము సిద్ధ క్షేత్రమనబడును. పుణ్యకాలము లందు, అయతనములందు సర్వనిమిత్తమ లందు తీర్థము గ్రహించరాదు. పుణ్యములందు ఆయతనము లందు తీర్థము లందు గ్రహించు వాని తీర్థము నిష్పలమగును. గంగా విక్రయణమున విష్ణు విక్రయణము అగును. జనార్ధన విక్రయణమున మూడు లోకములు విక్రయించినట్లగును. గంగా తీరసముద్భవమగు మృత్తికను తల దాల్చినవాడు సూర్యరూపమును ధరించును. గంగాతీర ధూలిని పరిచి పిండ ప్రదానముగావించినచొ పితరులను స్వర్గమునకు చేర్చును. ఓ భద్రురాలా నీకు ఈ గంగా మహాత్య్మమును చెప్పితిని. ఈ మాహాత్య్మమును చదివిననూ వినిననూ నరుడు విష్ణులోకమును పొందును. ఈ గంగా మాహాత్మ్యమును ప్రతిదినము భక్తిచే శ్రద్దచే విష్ణులోకమను కాని, శివలోకమును కాని కోరువారు జపించవలయును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున

గంగా మాహాత్మ్యమున పూజాది కధన

మను నలుబది మూడవ

అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page