Sri Naradapuranam-3    Chapters    Last Page

1. చతుశ్చత్వారి ంశోsధ్యాయ = నలుబది నాలుగవ అధ్యయము

గయా మాహాత్మ్యమ్‌

వసిష్ఠ ఉవాచ :-  

తతస్తు మోహినీ భూప శ్రుత్వా మహాత్మ్యముత్తమమ్‌ l గంగాయాః పాపనాశిన్యాః పునః ప్రాహ పురోహితమ్‌ 1

వసిష్ఠ మహర్షి పలికెనుః అంతట మోహిని పాపనాశిని యగు గంగా మహాత్మ్యమును విని మరల పురోహితునితో ఇట్లు పలికెను.

మోహిన్యువాచ :-

త్వయాచానుగృహీతాస్మి భగవన్నను కంపయా l యదుక్తం పుణ్యమాఖ్యానం గంగాయాః పాప శోధనమ్‌ 2

గయాతీర్థంతు విఖ్యాతం కధం లోకే ద్విజోత్తమ l తదహం శ్రోతుమిచ్చామి కృపాం కృత్వాధునా వద 3

మోహిని పలికెను. పూజ్యుడా ! నీవు దయచే నన్ను అనుగ్రహిచితి. పాప శోధనమగు పవిత్రమగు గంగా ఆఖ్యానమును చెప్పితివి. ఈ లోకమున గయాతీర్థము ఎట్లు ప్రసిద్ధి పొందినదో వినగోరుచున్నాను. నా యందు దయ యుంచి ఇపుడు చెప్పుము.

వసురువాచ:-

పితృతీర్దం గయా నామ సర్వతీర్థవరం స్మృతమ్‌ l యత్రాస్తే దేవ దేవేశ స్స్వయమేవ పితామహః 4

యత్రైషా పితృభిర్గీతా గాధా యోగమభీప్సుభిః | ఏష్టవ్యా బహవః పుత్రా యద్యేకోపి గయాం వ్రజేత్‌ 5

యజేత వాశ్వమేధేన నీలం వా వృషముత్సృజేత్‌ | సారాత్సారతరం దేవి గయా మాహాత్మ్యముత్తమమ్‌ 6

ప్రవక్ష్యామి సమాసేన భుక్తి ముక్తి ప్రదం శృణు | గయా సురో భవత్పూర్వం వీర్య వాన్పరమస్సచ 7

తపశ్చక్రే మహాఘోరం సర్వభూతోపతాపనమ్‌ | తత్తప స్తాపితా దేవా స్తద్వధార్ధం హరిం గతాః 8

శరణం హరిరూచే తా న్భవితవ్యం శివాత్మభిః | పాతితస్య మహాన్దేహే తధేత్యూచు స్సురా హరిమ్‌ 9

కదాచిచ్చివ పూజార్ధం క్షీరాబ్ధేః కమలాని చ | ఆనీయ నికటే దేశే శయనం చాకరోద్ధరేః 10

విష్ణుమాయా విమూఢోసౌ గదయా విష్ణునా హతః | తతో గదాధరో విష్ణు ర్గయాయాం ముక్తిద స్స్మృతః 11

తస్య దేహే లింగరూపీ స్థితశ్శుద్ధః పితామహః | విష్ణువాహార్ధ మర్యాదాం పుణ్యక్షేత్రం భవిష్యతి 12

యజ్ఞం శ్రాద్ధం పిండదానం స్నానాది కురుతే నరః | స స్వర్గం బ్రహ్మలోకం వా గచ్ఛేన్న నరకం నరః 13

గయాతీర్ధం పరం జ్ఞాత్వా యోగం చక్రే పితామహః | బ్రాహ్మణా న్పూజయామాస ఋషేంశ్చ సముపాగతాన్‌ 14

నదీం సరస్వతీం సృష్ట్వా స్థితో వ్యాప్తదిగంతరః | భక్ష్య భోజ్యఫలా దీంశ్చ కామధేనూస్తధాసృజత్‌ 15

పంచక్రోశం గయా తీర్థం బ్రాహ్మణభ్యో ధనం దదౌ | ధర్మయాగే తు లోభాద్వై ప్రతి గృహ్య ధనాదికమ్‌ 16

స్థితా విప్రాస్తదా శప్తా గయాయాం బ్రాహ్మణా తతః | మా భూత్త్రిపురుషీ విద్యా మా భూత్త్రి పురుషం ధనమ్‌ 17

యుష్మాకం స్యాద్ధి విరసా నదీ పాషాణ పర్వతః | సతైస్తు ప్రార్థితో బ్రహ్మ తీర్ధాని కృతవాన్ప్రభుః 18

లోకాః పుణ్యా గయాయాం వై శ్రాద్ధేన బ్రహ్మలోకగాః | యుష్మాన్యే పూజయిష్యన్తి తైరహం పూజితస్సదా 19

బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం గోగృహే మరణం తథా | వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధా 20

సముద్రా స్సరిత స్సర్వే వాపీ కూప హ్రదాస్తధా | స్నాతుకామా గయాతీర్థం దేవి యాన్తి నసంశయః 21

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనాగమః | పాపం తత్సంగజం సర్వం గయాశ్రాద్దా ద్వినశ్యతి 22

అసంస్కృతా మృతా యే చ పంచభిః ప్రహతాశ్చయే | సర్పదష్టా గయాశ్రాద్ధా న్ముక్తా స్స్వర్గం వ్రజన్తి తే 23

గయాయాం పిండదానేన యత్ఫలం లభ##తే నరః | న త చ్ఛక్యం మయా వక్తుం కల్పకోటి శ##తైరపి 24

అత్రైవ శ్రూయతే దేవి ఇతిహాసః పురాతనః | తం ప్రవక్ష్యామి సుభ##గే శృణుషై#్వకాగ్రమానసా 25

వసువు పలికెను ః గయా తీర్థము పితృతీర్థము. సర్వతీర్థోత్తమముగా తలచబడుచున్నది. ఇచట దేవ దేవేశుడగు పితామహుడే స్వయముగా ఉన్నాడు. యోగమును కోరు పితరులు ఈ గాథను గానమును చేసిరి. చాలా పుత్రులను పొందవలయును. వారిలో ఒకడైనను గయకు వెళ్ళును. అశ్వమేధయాగమును చేయును. నీల వృషభమును విడువవలయును. అట్లే గయా మహాత్మ్యమును వినవలయును. అన్ని సారముల కంటే సారతరము భుక్తి ముక్తి ప్రదమగు ఉత్తమమగు గయా మహాత్మ్యమును సంగ్రహముగా చెప్పెదను. వినుము. పూర్వము గయుడను పేరుగల అసురుడు అమిత బలపరాక్రమవంతుడుగా నుండెను. సర్వప్రాణులను తపింప చేయు ఘోరతపమును అతడాచరించెను. అతని తపస్సుచే పరితపించిన దేవతలందరు గయాసురుని సంహారమునకు శ్రీహరిని సమీపించిరి. శ్రీహరి వారికి అభయమునిచ్చెను. మీరందరూ శివ రూపులు కండని పలికెను. గయాసురుని దేహమున శివరూపముతోనుండుడనగా దేవతలు అట్లేఅనిరి. ఒకపుడు శివపూజ కొరకు క్షీరసాగరము నుండి కమలములను గొని తెచ్చి సమీప ప్రాంతమున శ్రీహరికి శయ్యనేర్పంచెను. విష్ణుమాయా విమూఢుడగు గయాసురుడు శ్రీహరి గదచే హతుడాయెను. అప్పటి నుండి గదాధరుడగు విష్ణువు గయలో మోక్షప్రదుడుగా చెప్పబడుచున్నాడు. అతని దేహమున శుద్ధడగు పితామహుడు లింగరూపమున నుండెను. విష్ణు వాహార్ధ మర్యాదగా పుణ్యక్షేత్రముగా గయ ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రమున యజ్ఞమును, శ్రాద్ధమును, పిండదానమును, స్నానాదికమును కాని చేసినచో స్వర్గమును కాని బ్రహ్మలోకమును కాని పొందును. నరకమును చూడడు. గయాతీర్థము ఉత్తమమని తలిచి పితామహుడు యోగమును చేసెను. బ్రాహ్మణులను, వచ్చిన ఋషులను పూజించెను. సరస్వతీ నదిని సృజించి దిగంతముల వరకు వ్యాపించి యుండెను. భక్ష్య భోజ్య ఫలాదులను, కామ ధేనువులను సృజించెను. గయాతీర్థము పంచ క్రోశ వ్యాప్తము. బ్రాహ్మణులకు ధనమునిచ్చెను. ధర్మయాగమున విత్తలోభముచే ధనాధికమును గ్రహించిన బ్రాహ్మణులను బ్రహ్మ శపించెను. మీవిద్య పురుష వ్యాప్తము కాదు. మీ ధనము త్రిపురుష కాలము నిలువదు. మీ విషయమున ఈ నది విరసమై పాషాణ పర్వత మయముగా నుండును. అపుడు అవిప్రులు ప్రార్థించగా అచట తీర్థములను సృజించెను. గయాశ్రాద్ధమున లోకులందరు పావనులై బ్రహ్మలోకమును చేరెదరు. మిమ్ములను పూజించినచో నేను పూజించ బడుదును. బ్రహ్మజ్ఞానము, గయాశ్రాద్ధము, గోశాల యందు మరణము, కురుక్షేత్ర నివాసము అని ముక్తి నాలుగు విధములు. సముద్రములు, అన్ని నదులు వాపీ కూపహ్రదములన్నియూ స్నానము చేయుటకు గయాతీర్థమునకు వెళ్ళును. బ్రహ్మహత్య, సురాపానము, స్తేయము, గుర్వంగనాగమనములను మహాపాతకములన్నియూ గయాశ్రాద్ధముచే నశించును. చనిపోయి సంస్కరించ బడని వారు, పశువులచే హతులైన వారు, సర్పదష్టులు కూడా గయాశ్రాద్ధమున ముక్తులై స్వర్గమును పొందెదరు. గయా తీర్థమున పిండదానముచే పొందు ఫలితమును నేను శతకోటి కల్పములలో కూడా చెప్ప జాలను. ఓ మోహినీ! ఇచట ఒక పురాతన మగు ఇతిహాసము ప్రసిద్ధిగాంచినది. ఇపుడా ఇతిహాసమును చెప్పెదను. ఏకాగ్రమనుస్కురాలవై వినుము.

త్రేతాయుగే వై నృపతిర్బభూవ విశాలనామా స పురీం విశాలామ్‌ | ఉవాస ధన్యో ధృతి మానపుత్రో స్వయం విశాలాధిపతిర్ధ్విజాగ్ర్యాన్‌ 26

పప్రచ్ఛ పుత్రార్థమ మిత్రహన్తా తం బ్రాహ్మణాః ప్రోచురదీన సత్వాః | రాజన్‌ పిత్రూంస్తర్పయ పుత్రహేతో ర్గత్వా గయాయాం విధివత్తు పిండైః 27

ధ్రువం తతస్తే భవితా తు వీర స్సహస్రదాతా సకలక్షితీశః | ఇతీరితో విప్రగణౖస్సహృష్టో రాజా విశాలాధిపతిః ప్రయత్నాత్‌ 28

సమస్త తీర్థ ప్రవణద్విజేన గయా మియాత్తద్గత మానసస్సన్‌ | ఆగత్య తీర్థ ప్రవరం సుతార్థీ గయా శిరో యాగపరః పిత్రౄణామ్‌ 29

పిండప్రదానం విధినా ప్రయచ్ఛ త్తావద్వియ త్యుత్తమ మూర్తి యుక్తాన్‌ | పశ్యన్సపుంస స్సితరక్త కృష్ణా నువాచ రాజా కిమిదం భవన్తః 30

సంముహ్యతే శంసతి సర్వమేత త్కుతూహలం మే మనసి ప్రవృత్తమ్‌ 30

త్రేతాయుగమున విశాలుడను రాజుండెను. అతను విశాలాపురిని నిర్మించి ధన్యుడు ధైర్యవంతుడుగా రాజ్యపాలనమును గావించెను. కాని పుత్రులు లేనందున బ్రాహ్మణులను పుత్ర సంతానమునకు చేయవలసిన దానిని అడిగెను. అంతట ధైర్యముగల బ్రాహ్మణులు ఇట్లు పలికిరి. ఓరాజా! గయకు వెళ్ళి యధావిధిగా పిండదానముచే పితరులను తృప్తి పరుచుము. అపుడు నీకు నిశ్చయముగా వీరుడు సహస్రదాత సకలక్షితీశుడగు పుత్రుడు కలుగును. బ్రాహ్మణులిట్లు పలుకగా విశాలరాజు బ్రాహ్మణులతో గయకు వెళ్ళెను. గయలో పితరులకు యధావిధిగా పిండ ప్రధానము చేయునందలో ఆకాశము సిత రక్త కృష్ణమూర్తులగు పురుషులను చూచెను. వారిని చూచి రాజు ఇదేమి? మీరెవరు? చెప్పుడు. మోహమును పొందు నాకు కుతూహలము కలుగుచున్నది.

సితఉవాచ :

అహో సితస్తే జనకోస్మి రాజన్‌ నామ్నాచ వర్ణేన చ కర్మణాచ 31

అయం చ మే జనకో రక్తవర్ణో నృశంస కృద్బ్రహ్మహా పాపకారీ | అతః పరం శృణు

ప్రపితామహశచ కృష్ణో నామ్నా కర్మణా వర్ణతశ్చ 32

ఏతేన కృష్ణేన హతా పురావై జన్మన్యనేకా ఋషయః పురాణా | ఏతౌ స్మృతౌ ద్వావపి పితృపుత్రౌ అవీచి సంజ్ఞం నరకం ప్రవిష్టౌ 33

అతః పరోయం జనకః పరోస్య తత్క్రష్ణ వక్త్రావపి దీర్ఘకాలమ్‌ | అహంచ శుద్ధేన నిజేన కర్మణా శక్రాసనం ప్రాప్య సుదుర్లభం తత్‌ 34

త్వయా పునర్మన్త్ర విదా గయాయాం పిండప్రదానేన బలాదిమౌ చ | మోక్షాయి తా తీర్థ వరప్రభావాత్‌ అవీచిసంజ్ఞం నరకం గతౌ 35

పిత్రూన్పితా మహాంశ్చైవ తధైవ ప్రపితామహాన్‌ | ప్రీణయామీతి యత్తోయం త్వయా దత్తమరిందమ 36

తేనాస్మద్యుగ పద్యోగో జాతో వాక్యేన సత్తమ! | తీర్థ ప్రభావాద్గచ్ఛామః పితృలోకం న సంశయః 37

తత్ర పిండప్రదానేన ఏతౌ తవ పితామహౌ | తద్గతావపి సంసిద్ధౌ

పాపాద్వికృతలింగకౌ 38

ఏతస్మాత్కారణాత్పుత్ర అహమేతౌ ప్రగృహ్య తు | ఆగతోస్మి భవంతం వై ద్రష్టుం యాస్యామి సాంప్రతమ్‌ 39

తీర్థ ప్రభావాద్యత్నేన బ్రహ్మఘ్నస్యావై పితుః | గయాయాం పిండదానేన కుర్యాదుర్ధరణం సుతః 40

ఇత్యేవముక్త్వా తు పితా సి తోస్య సార్థం చ తాభ్యాం హి పితామహాభ్యామ్‌ | జగామ సద్యో హి సుతో విశాలం సంయోజ్య చా శీర్భిర పిస్వలోకమ్‌ 41

సకృద్గయాభిగమనం సకృత్పిండ ప్రపాతనమ్‌ | దుర్లభం కిం పునర్నిత్య మస్మిన్నేవ వ్యవస్థితిః 42

క్రియతే పతితానాం తు గతే సంవత్సరే క్వచిత్‌ | దేశకాలప్రమాణత్వా ద్గయాకూపే స్వబంధుభిః 43

ప్రేతరాజోధ వణిజం కించిత్ప్రాహ స్వముక్తయే | గయా తీర్థం తు దృష్ట్వా స్నాత్వా శౌచసమన్వితః 44

మమ నామ సముద్దిశ్య పిండనిర్వాపణం కురు | తత్ర పిండప్రదానేన ప్రేత భావాదహం సుఖమ్‌ 45

ముక్తస్తు సర్వదాత్రూణాం ప్రాప్స్యామి శుభలోకతామ్‌ | ఇత్యేవముక్త్వా వణిజం ప్రేతరాజోనుగైస్సహ 46

స్వనామాని యధా న్యాయం సమ్యగాఖ్యాతవాన్రహః | ఉపార్జయిత్వా ప్రయ¸° గయాశీర్షమనుత్తమమ్‌ 47

పొంశు నిర్వాపణం చక్రే ప్రేతానామను పూర్వశః | చకార వసుదానం చ పిత్రూన్కృత్వా పురస్సరాన్‌ 48

ఆత్మనోసౌ మహాబుద్ధి ర్విధినాపి తిలైర్వినా | పిండనిర్వాపణం చక్రే తథాన్యానపి గోత్రజాన్‌ 49

ఏవం దత్తే తు వై పిండే వణిజా ప్రేత భావతః | విముక్తా ద్విజతాం ప్రాప్య బ్రహ్మలోకం తతో గతాః 50

పాయసం ఖడ్గమాంసం చ పుత్రైర్దత్తం పితృక్షయం | కృష్ణో లోహ స్తధాభాగ ఆనన్త్యాయ ప్రకల్పతే 51

గయాయా మక్షయం శ్రాద్ధం జపహోమతపాంసి చ | పితృక్షయే హి తత్పుత్రైః కృతమానన్త్యతాం వ్రజేత్‌ 52

కాంక్షన్తి పితరః పుత్రా న్నరకస్య భయార్దితాః | గయాం యాస్యతి యః పుత్ర స్సోస్మాన్సంతారయిష్యతి 53

గయాయాం ధర్మపృష్ఠేచ సదసి బ్రాహ్మణస్తధా | గయాశీర్షేక్ష యవటే పిత్రౄణాం దత్తమక్షయమ్‌ 54

దృష్ట్వైతాని పితౄం శ్చార్చ్య వంశ్యాన్వింశతి ముద్ధరేత్‌ 55

మహాకల్పకృతం పాపం గయాం ప్రాప్య వినశ్యతి | గవి గృధ్రపటేచైవ శ్రాద్ధం దత్తం మహాఫలమ్‌ 56

మతంగస్య పదం తత్ర దృశ్యతే సర్వమానుషైః | ఖ్యాపితం ధర్మ సర్వస్వం లోకసై#్యవ నిదర్శనాత్‌ 57

తత్పంకజ వనం పుణ్యం పుణ్యవద్భిర్నిషేవితమ్‌ | యస్మిన్పాండు ర్విశ##త్యేవ తీర్థం సర్వనిదర్శనమ్‌ 58

తృతీయాయాం తధా పాదే నిక్షీరాయాశ్చమండలే | మహాహ్రదే చ కౌశిక్యాం దత్తం శ్రాద్ధం మహాఫలమ్‌ 59

ముండపృష్ఠే పదం న్యస్తం మహాదేవేన ధీమతా | బహువర్షశతం తప్తం తపస్తీర్ధేషు దుష్కరమ్‌ 60

అల్పేనా ప్యత్ర కాలేన నరో ధర్మపరాయణః | పాప్మాన ముత్సృజత్యాశు జీర్ణాంత్వచమివోరగః 61

నామ్నా కనక నందేతి తీర్థం తత్రైవ విశ్రుతమ్‌ | ఉదీచ్యాం ముండ పృష్టస్య బ్రహ్మర్షి గణసేవితమ్‌ 62

తత్ర స్నాత్వా దివం యాన్తి స్వశరీరేణ మానవాః | దత్తం తత్ర సదా శ్రాద్ధం అక్షయం సముదాహృతమ్‌ 63

స్నాత్వాదినత్రయం తత్ర నిక్షీరాయాం సులోచనే | మానసే సరసి స్నాత్వా శ్రాద్ధం తత్ర సమాచరేత్‌ 64

సితుడు పలికెను : ఓ రాజా! నా పేరు సితుడు. నీ తండ్రిని. నేను పేరుచే వర్ణముచే పనిచే సితుడనే. ఇతను రక్తవర్ణుడు నా తండ్రి హీనకర్మల నాచరించినవాడు. బ్రహ్మహత్యను చేసినవాడు. పాపకారి. ఇక మూడవవాడు నా తాత. నీకు ముత్తాత. పేరుతో వర్ణముచే కర్మలచే కృష్ణుడు. ఈ కృష్ణుడు పూర్వ జన్మలో అనేక ఋషులను చంపెను. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఆవీచియను నరకమును పొందిరి. ఇతని తండ్రి కృష్ణవర్ణుడు దీర్ఘ కాలమునుండి నరకమున నివసించుచున్నాడు. నేను మాత్రము నాసత్కర్మలచే సుదుర్లభమగు ఇంద్రాసనమును పొంది యుంటిని. మంత్ర విదుడవైన నీవు గయా తీర్థమున పిండదానమును చేయుటచే ఉత్తమ తీర్థ మహిమ వలన వీరిద్దరూ ఆ వీచియను నరకమునుండి విముక్తిని పొందిరి. పితరులను పితామహులను ప్రపితామహులను ప్రీతినొందింప చేయు చున్నానని నీవిడిచిన జలముచే నీ వాక్యముచే మేము మువ్వురము ఒక సారి కలిసితిమి. ఈ తీర్థ ప్రభావముచే పితృలోకమునకు వెళ్ళెదము. నీవు చేసిన పిండ ప్రదానముచే ఈ నీ పితామహులు నరకములో నున్ననూ శుద్ధులై వెళ్ళుచున్నారు. ఇట్టి వీరిని తీసుకొని నిన్ను చూచుటకు వచ్చితిని. ఇపుడు వెళ్ళుచున్నాను. ఈ తీర్థ ప్రభావమువలన బ్రహ్మఘ్నుడగు తండ్రిని కూడా గయాపిండదానముచే పుత్రుడుద్ధరించగలుగును. ఇట్లు విశాలుని తండ్రి మాటలాడి పితామహులతో కలిసి విశాలుని ఆశీర్వదించి స్వలోకమునకు వెళ్ళెను. ఒకసారి గయకు వెళ్ళుట, ఒకసారి గయలో పిండ ప్రదానము చేయుట చాలా దుర్లభము. ఇక నిత్యము గయాగమనము, గయా పిండ ప్రధానము గురించి ఏమి చెప్పవలయును. పతితులు మరణించగా ఒక సంవత్సరము తరువాత లేదా ఆయా దేశకాల ప్రమాణములననుసరించి గయాకూపమున స్వబంధువులచే తర్పణాదులు చేయబడును. ప్రేతరాజు వణిజుని గూర్చి స్వముక్తి కొరకు ఇట్లు పలికెను. నీవు గయాతీర్థమును చూచి స్నానమాడి శుచివై నాపేరుతో పిండప్రదానమును చేయుము. గయలో పిండ ప్రదానము చేయుట వలన నేను సులభముగా ప్రేత భావమును విడిచి దాతలు పొందులోకమును పొందగలను. ఇట్లు ప్రేతరాజు వణిజునితో పలికి అనుచరులతో తన పేర్లను రహస్యముగా స్పష్టముగా తెలిపెను. వణిజుడామాటలను విని గయాతీర్థమునకు వెళ్ళెను. అచట యధాక్రమముగా ప్రేతలకు పాంసు నిర్వాపణమును చేసెను. పితృపురస్సరముగా వసుదానమును చేసెను. మహా బుద్ధియగు ఇతను యధావిధిగా తిలలు లేకనే తనకు ఇతరులకు కూడా పిండ నిర్వాపణమును చేసెను. ఇట్లు పిండ ప్రదానమును చేయగా వణిజులు ప్రేత భావము నుండి విముక్తులై బ్రాహ్మణత్వమును పొంది బ్రహ్మలోకమునకు వెళ్ళిరి. పాయసము, ఖడ్గ మృగమాంసము కృష్ణమృగము లోహము పితరులకు సమర్పించిన ఆనన్త్యమునిచ్చును. గయలో చేసిన శ్రాద్ధము, జపము, హోమము, తపస్సు, పుత్రులచే చేయబడినవి పితరులకు ఆనన్త్యమును ప్రసాదించును. నరకభయపీడితులకు పితరులు పుత్రులు గయకు వెళ్ళి మమ్ములను తరింపజేతురని కోరుచుందురు. గయలో ధర్మపృష్ఠమున సదస్సులు బ్రాహ్మణులు పితరులను తరింపజేతురు. గయాశీర్షమున అక్షయవటమున పితరులకిచ్చినది అక్షయమగును. బ్రహ్మారణ్యము, ధర్మపృష్ఠము, ధేనుకారణ్యము ఈ క్షేత్రములను దర్శించి పితరులనర్చించి ఇరువది తరములనుద్ధరించును. మహాకల్పకాలమున చేసిన పాపము కూడా గయను చేరి నశించును. గోక్షేత్రమున, గృహవటమున చేసిన శ్రాద్ధము మహాఫలమును ప్రసాదించును. ఇచటనే మతంగ పదమున్నది. ఇది ధర్మసర్వస్వముగా ప్రసిద్ధిచెందినది. ఇచటనున్న పవిత్రమును పంకజవనమును పుణ్యాత్ములు సేవింతురు. ఇచట పాండువు ప్రవేశించుటయే సర్వనిదర్శనము. తృతీయపాదమున నిక్షీరమండలమున మహాహ్ర్రదమున కౌశికిలో చేసిన శ్రాద్ధము మహాఫలప్రదము. మహాదేవుడు ముండపృష్ఠమున పాదమునుంచెను. ఆయాతీర్థములలో బహువర్షకాలము దుర్లభమగు తపస్సు నాచరించెను. ఇచట కొద్ది కాలము తపము చేసిననూ పాము కుబుసమును విడిచినిట్లు పాపమును విడుచును. ఇచటనే కనకందయను ప్రసిద్ధ క్షేత్రము కలదు ఇచట స్నానము ముండపృష్ఠమునకు ఉత్తరముదే వర్షిగణ సేవితలు చేసిన శరీరముగా స్వర్గములో చేరెదరు. ఇచట చేసిన శ్రాద్ధము అక్షయఫలప్రదము. నిక్షీరమండలమున మూడు దినములు స్నానమాడి, మానస సరోవరమున స్నానమాడి ఇచట శ్రాద్ధమునాచరించవలయును.

ఉత్తరం మానసం గత్వా సిద్ధింప్రాప్నొత్యనుత్తమామ్‌ | యస్తత్రనిర్వపే చ్ఛ్రాద్ధం యధాశక్తి యధాబలమ్‌ 65

కామాన్యోలభ##తే దివ్యా న్మోక్షోపాయాంశ్చ కృత్స్నశః | తతో బ్రహ్మసరో గచ్ఛే ద్బ్రహ్మవశ్యోపశోభితమ్‌ 66

బ్రహ్మలోకమవాప్నోతి ప్రభాతామేవ శర్వరీమ్‌ | బ్రహ్మణా తత్ర సరసి యూపః పుణ్యఃప్రకల్పితః 67

యూపం ప్రదక్షిణీకృత్య వాజపేయఫలం లభేత్‌ | తతో గచ్ఛేత్తు సుభ##గే ధేనుకం లోక విశ్రుతమ్‌ 68

ఏకరాత్రోషితో యత్ర ప్రయచ్ఛేత్తిలధేనుకామ్‌ | సర్వపాపవినిర్ముక్త స్సోమలోకం వ్రజేద్ధ్రువమ్‌ 69

తత్ర చిహ్నం మహాభాగే అద్యాపి మహదద్భుతమ్‌ | కపిలా సహ వత్సేన పర్వతే విచరత్యుత 70

పదాని తత్ర దృశ్యంతే సవత్సాయాశ్చమోహిని | సవత్సాయాః ప్రహృష్టేఘ పదేషు నరపుంగవైః 71

యత్కించిదశుభం కర్మ తేషాం తన్నశ్యతి ధ్రువమ్‌ | తతో గృధ్రవటం గచ్ఛే త్థ్సానం దేవస్య ధీమతః 72

స్నాయీత భస్మనా తత్ర అభిగమ్య వృషధ్వజమ్‌ | బ్రాహ్మణానాం భ##వేద్దేవి వ్రతం ద్వాదశవార్షికమ్‌ 73

ఇతరేషాం తు వర్ణానాం సర్వం పాపం ప్రణశ్యతి | ఉద్యంతంచ తతోగచ్ఛే త్పర్వతం గీత నాదితమ్‌ 74

సావిత్ర్యాస్తు పదం యత్ర దృశ్యతే పుణ్యదం మహత్‌ | తత్ర సంధ్యాముపాసీత బ్రాహ్మణశ్శంసితవ్రతః 75

ఉపాసితా భ##వేత్సంధ్యా తేన ద్వాదశ వార్షికీ | యోనిద్వారంచ తత్రైవ విద్యతే విధినన్దిని 76

తత్రాధిగమ్య ముచ్యేత పురుషో యోనిసంకటాత్‌ | శుక్ల కృష్ణావుభౌ పక్షౌ గయాయాం యో వసేన్నృపః 77

పునాత్యాసప్తమం చైవ కులాన్యత్రనసంశయః | తతో గచ్ఛేచ్చ సుభ##గే ధర్మపృష్టం మహాఫలమ్‌ 78

యత్రధర్మస్థ్సితస్సాక్షా త్పితృలోకస్య పాలకః | అభిగమ్య తతస్తత్ర వాజిమేధఫలం లభేత్‌ 79

తతో గచ్ఛేత మనుజో బ్రహ్మణస్తీర్థముత్తమమ్‌ | తత్రాధిగమ్య బ్రహ్మాణం రాజసూయఫలాన్వితమ్‌

కౌశికీ చ నదీ యత్ర శ్రాద్ధం తత్రాక్షయం స్మృతమ్‌ 81

తతో మహీధరం గచ్ఛే ద్ధర్మజ్ఞేనాభిరక్షితమ్‌ | రాజర్షిణా పుణ్యకృతా

గయేనానుపభుజ్యతే 82

సరో గయశిరో యత్ర పుణ్యాచైవ మహానదీ ఋషిజుష్టం మహాపుణ్యం తీర్థం బ్రహ్మసరోవరమ్‌ 83

అగస్త్యో భగవాన్యత్ర గతో వైవస్వతం ప్రతి | ఉవాస సతతం యత్ర ధర్మరాజస్సనాతనః 84

సర్వాసాం సరితాం యత్ర సముద్భేదో హి దృశ్యతే | యత్ర సన్నిహితో నిత్యం మహోదేవః పినాకహా 85

యత్రాక్షయో వటో నామ వర్తతే లోకవిశ్రుతః | గయేన యజమానేన తత్రేష్టం క్రతునా పురా 86

ఆస్థితా తు సరిచ్ఛ్రేష్ఠా గయయజ్జేషు రక్షితా | ముండపృష్ఠం గయాం చైవ రైవతం దేవపర్వతమ్‌ 87

తృతీయంక్రౌంచపాదం చ దృష్ట్వా పాపాత్ప్రముచ్యతే | శివనద్యాం శివకరం గయాయాం చ గదాధరమ్‌ 88

సర్వత్ర పరమాత్మానం దృష్ట్వా ముచ్యేదఘవ్రజేత్‌ | వారాణాశ్యాం విశాలాక్షీ ప్రయాగే లలితా యధా 89

గయాయాం మంగలా నామ కృతశౌచేతు సైంహికా | యద్దదాతి గయాస్థస్త త్సర్వమానన్త్యమశ్నుతే 90

నందంతి పితరస్తస్య సుప్రకృష్టేన కర్మణా యద్గయాస్థో దదాత్యన్నం పితరస్తేన పుత్రిణః 91

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే

మోహినీ వసుసంవాదే గయామాహాత్మ్యం నామ

చతుశ్చత్వారింశ్యోధ్యాయః

ఉత్తర మానసమునకు వెళ్ళి సాటిలేని సిద్ధిని పొందును. ఈ ఉత్తర మానసమున యధాశక్తిగా యధాబలముగా శ్రాద్ధమునాచరించినవాడు దివ్యకామనలను మోక్షోపాయములను పొందగలుగును. తరువాత బ్రహ్మవశ్యోపశోభితమగు బ్రహ్మసరస్సునకు వెళ్ళవలయును. రాత్రి గడిచిన వెంటనే బ్రహ్మలోకమును పొందును. ఈ సరస్సున బ్రహ్మ యూపమును కల్పించెను. ఈ యూపమునకు ప్రదక్షిణము గావించినచో వాజపేయ యాగఫలమును పొందును. తరువాత లోకవిశ్రుతమగు ధేనుకమునకు వెళ్ళవలయును. ఇచట ఒక రాత్రి యుండి తిలధేను దానము గావించవలయును. సర్వపాపవినిర్ముక్తుడై చంద్రలోకమును పొందును. ఇచట ఒక అద్భుతమగు నిదర్శనము ఇప్పటికీ కానవచ్చుచున్నది. ఈ పర్వతమున కపిల గోవు దూడతో తిరుగుచుండును. ఈ పర్వతము దూడతో తిరుగుచున్న కపిలా గోపదములు కనపడుచుండును. దూడతో నున్న కపిలాగోపదములను పూజించిన మానవులు తాము చేసిన ఆశుభకర్మలను నశింపచేసుకుందురు. తరువాత దేవస్థానమగు గృధ్రవటమునకు వెళ్ళవలయును. ఇచట వృషధ్వజుని దర్శించి భస్మస్నానమునాచరించవలయును. ఇచట బ్రామ్మణులు ద్వాదశవర్షవ్రతమునాచరించవలయును. ఇతర వర్ణముల వారికి దర్శన మాత్రముననే సర్వపాపములు నశించును. తరువాత గీతనాదితమగు ఉద్యతపర్వతమునకు వెళ్ళవలయును. ఇచట ఒక మారు సంధ్యోపాసన చేసిన ద్వాదశవర్ష సంధ్యోపానసన చేసినట్లగును. ఇచటనే యోని ద్వారము కలదు. ఇచట చేరి మానవుడు జన్మసంకటము నుండి విముక్తుడగును. గయాతీర్థమున శుక్లకృష్ణపక్షములు నివసించినవాడు ఏడు తరములను తరింపచేయును. తరువాత మహాఫలప్రదమగు ధర్మపృష్ఠమునకు వెళ్ళవలయును. ఇచట సాక్షాత్తు పితృలోకపాలకుడగు ధర్మరాజుండును. ఇచట యమధర్మరాజును దర్శించినవాడు అశ్వమేధఫలమును పొందును. తరువాత ఉత్తమమగు బ్రహ్మతీర్థమునకు వెళ్ళవలయును. ఇచట బ్రహ్మను దర్శించి రాజసూయ ఫలమును పొందును. ఇచటనే బహుమూలఫలాన్వితమగు ఫల్గు తీర్థము ప్రసిద్ధము. ఇచటనే కౌశికానది యున్నది. ఇచట చేసిన శ్రాద్ధము అక్షయఫలప్రదము. తరువాత ధర్మజ్ఞునిచే రక్షించబడు మహీధరమునకు వెళ్ళవలయును. పుణ్యకారి రాజర్షియను గయుడు ఉపయోగించిన క్షేత్రమిది. ఇచటనే గయశిరమను సరస్సుకలదు. ఇదియే పవిత్రమగు మహానది. బ్రహ్మసరోవరమను తీర్థము మహాపుణ్యము. సకలర్షిసేవితము. ఇచటనే అగస్త్యమహర్షి యముని వద్దకు వెళ్ళెను. ఇచట సనాతనుడగు ధర్మరాజు నివసించును. ఇచట అన్ని నదులుద్ధరించును. ఇచట ఎల్లవేళలా పినాకపాణియగు మహాదేవుడు వసించుచుండును. ఇచటనే లోకప్రసిద్ధమగు అక్షయవటము కలదు. ఇచట గయాసురుడు యజ్ఞమును గావించెను. గయయజ్ఞములలోనిది సురక్షితముగా నుండెను. ముండపృష్ఠము, గయారేవతమనుదేవపర్వతము, క్రౌంచపాదము వీటిని దర్శించిన వారు పాపవిముక్తులగుదురు. శివనదిలో శివకరుని, గయయందు గదాధరుని, అంతట పరమాత్మను దర్శించి పాప సంఘమునుండి విముక్తుడగును. వారణాశిలో విశాలాక్షి, ప్రయాగయందు లలిత, గయయందు మంగలా, కృతశౌచమున సింహికా ప్రసిద్ధులు. గయలో నివసించి చేయు దానమంతయూ ఆనన్త్య ఫలప్రదమగును. ఇతని సుకృతముచే పితరులు సంతోషింతురు. గయకు వెళ్ళి అన్నదానము చేయువారితో పితరులు నిజముగా పుత్రవంతులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గయా మహాత్మ్యమను నలుబది నాలుగవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page