Sri Naradapuranam-3
Chapters
Last Page
పంచచత్వారింశత్తమోధ్యాయః = నలుబదియైదవ అధ్యాయము పిండదానవిధి వసురువాచ శృణు మోహిని వక్ష్యామి పుణ్యం ప్రేతశిలాభవమ్ | మాహాత్మ్యం యత్ర దత్వా తు పిండాన్పితౄంన్సముద్ధరేత్ 1 ఆచ్ఛాదితశిలాపాదః ప్రభాసేనాత్రిణాతతః | ప్రభాసో మునిభిస్తుష్టః శిలాంగుష్ఠాద్వినిర్గతః 2 అంగుష్ఠస్థిత ఈశో పి ప్రభాసేశః ప్రకీర్తితః శిలాంగు ష్ఠైక దేశో యః సాచ ప్రేతశిలా స్థితా 3 పిండదానాద్యతస్తస్మా త్ప్రేతత్వాన్ముచ్యతే నరః మహానదీ ప్రభాసాత్ర్యోః సంగమే స్నానకృన్నరః 4 వామదేవః స్వయం భూయా ద్వామతీర్ధం తతః స్మృతమ్ ప్రార్థితోథ మహానద్యాం రామస్స్నాతోభవద్యదా 5 రామతీర్ధం త్వత్రజాతం సర్వలోకసుపావనమ్ | జన్మాంతరసహసై#్రస్తు యత్కృతం పాతకం నరైః 6 తత్సర్వం విలయం యాతి రామతీర్ధాభిషేచనాత్ | మంత్రేణానేన యః స్నాత్వా శ్రాద్ధం కుర్వీత మానవః 7 రామతీర్ధే పిండదస్తు విష్ణులోకే మహేయతే | 'రామ రామ మహాబాహో దేవానామభయంకర 8 త్వాం నమస్యే తు దేవేశ మమ నశ్యతు పాతకమ్' | నమస్కృత్య ప్రభాసేశం భాసమానం శివం వ్రజేత్ 9 తం చ శంభుం నమస్కృత్య కుర్యాద్యామ్యబలిం తతః | ఆపస్త్వమసి దేవేశ! జ్యోతిషాం పతిరేవచ 10 పాపం నాశయ మే శీఘ్రం మనోవాక్కాయకర్మజమ్' | శిలాయా జఘనం భూయః సమాక్రంతం యమేన చ 11 ధర్మరాజేనాద్రిరుక్తో నగచ్ఛేతి నగః స్మృతః | యమరాజ ధర్మరాజా నిశ్చలాయేహ సంస్థితౌ 12 తాభ్యాం బలిమకృత్వా స్యాద్గయాశ్రాద్ధమపార్ధకం | 'శ్వానౌ ద్వౌ శ్యామశబలౌ వైవ్వతకులోద్భవౌ 13 తాభ్యాం పిండం ప్రదాస్యామి స్యాతామేతావహింసకే | తీర్థే ప్రేతశిలాదౌ చ చరుణా సఘృతేన చ 14 పితౄనావాహ్య తేభ్యశ్చ మంత్రైః పిండాంస్తు నిర్వపేత్ | కృత్వా ధ్యానం పితృణాం తు ప్రయతః ప్రేతపర్వతే 15 ప్రాచీనావీతికోభూయా ద్దక్షిణాభిముఖః స్మర | 'కవ్యవాలో నలః సోమో యమశ్చైవార్యమా తధా 16 అగ్నిష్వాత్తా బర్హిషదః సోమపాః పితృదేవతాః | ఆగచ్ఛంతు మహాభాగా యుష్మాభీరక్షితాస్త్విహ 17 మదీయాః పితరో యేచ కులే జాతాః సనాభయః | తేషాం పిండ ప్రదానార్ధమా గతో స్మి గయామిమామ్ 18 తే సర్వే తృప్తి మాయాంతు శ్రాద్ధేనానేన శాశ్వతీమ్' | ఆచమ్యోక్త్వాధ పంచాంగం ప్రాణానాయమ్య యత్నతః 19 పునరావృత్తి రహిత బ్రహ్మలోకాప్తిహేతవే | ఏవం సంకల్ప్య విధివత్ శ్రాద్ధం కుర్యాద్యధాక్రమమ్ 20 పితౄనావాహ్య చా భ్యర్చ్య మంత్రైః పిండప్రదో భ##వేత్ | ప్రజ్వాల్య పూర్వం తత్థ్నానం పంచగవ్యైః పృధక్ పృధక్ 21 దత్వా శ్రాద్ధం సపిండానాం తేషాం దక్షిణ భాగతః | కుశైరాస్తీర్య తేషాం తు సకృద్దత్వా తిలోదకమ్ 22 గృహీత్వాంజలినా తేభ్యః పితృతీర్ధేన యత్నతః | సక్తునా ముష్టిమాత్రేణ దద్యాదక్షయ్యపిండకమ్ 23 తిలాజ్య దధిమధ్వాది పిండద్రవ్యేషు యోజయేత్ |సంబంధిన స్తిలాద్యైశ్చ కుశేష్వావాహయేత్తతః 24 ఏతాంస్తు మంత్రాంస్త్రీన్న్మాద్ధే స్త్రీ లింగాన్వై సముచ్చరేత్ | పిండాన్దద్యాద్యధాపూర్వం పితౄనావాహ్య పూర్వవత్ 25 నిస్వగోత్రే విగోత్రే వా దమ్పత్యోః పిండపాతనే | అపృధజ్నిష్ఫలం శ్రాద్ధం పిండం చోదకతర్పణమ్ 26 పిండపాత్రే తిలాన్దత్వా పూరయిత్వా శుభోదకైః | మంత్రేణానేన పిండాంస్తా న్ప్రదక్షిణకరం యధా 27 పరిషించేత్త్రిధా సర్వా న్ప్రణిపత్య క్షమాపయేత్ | పితౄన్విసృజ్య చాచమ్య సాక్షిణః శ్రావయేత్సురాన్ 28 సర్వస్థానేషు చైవం స్యా త్పిండదానం తు మోహిని | గయాయాం పిండదానే తు న చ కాలం విచింతయేత్ 29 అధిమాసే జనిదినే హ్యస్తే చ గురు శుక్రయోః | న త్యజేత్తు గయాశ్రాద్ధం సింహస్థే చ బృహస్పతౌ 30 దండం ప్రదర్శయేద్భిక్షు ర్గయాం గత్వా న పిండదః | న్యస్య విష్ణుపదే దండం ముచ్యతే పితృభిఃసహ 31 పాయసేన గయాయాం చ సక్తునా పిష్టకేన వా | చరుణా తండులాద్యైర్వా పిండదానం విధీయతే 32 గయాం దృష్ట్వా తు సుభ##గే మహాపాపోపి పాతకీ | పూతఃకృత్యాధికౌరీచ శ్రాద్ధక్పద్బ్రహ్మలోకభాక్ 33 అశ్వమేధ సహస్రాణం సహస్రం యః సమాచరేత్ | నాసౌ తత్ఫలమాప్నోతి ఫల్గుతీర్ధే యదాప్నుయాత్ 34 గయాం ప్రాప్యార్పయేత్పిండా న్పితౄణాంచాతి వల్లభాన్ | విలంబో నైవకర్తవ్యో నైవ విఘ్నం సమాచరేత్ 35 పితా పితామహశ్చైవ తధైవ ప్రపితామహః | మాతా పితా మహీచైవ తధైవ ప్రపితామహీ 36 మాతామహస్తత్పితాచ ప్రమాతామహకాదయః | తేషాం పిండో మయా దత్తో హ్యక్షయ్యముపతిష్ఠతామ్ 37 అస్మత్కులే మృతా యే చ గతిర్యేషాం న విద్యతే | తేషాముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహ మ్ 38 బంధువర్గకులే యే చ గతిర్యేషాం న విద్యతే | తేషాముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహమ్ 40 ఆజాద దంతా యే కేచిత్ యే చ గర్బే ప్రపీడితాః| తేషా ముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహమ్ 38 అగ్నిదగ్ధాశ్చ యే కేచి న్నాగ్నిదగ్ధాస్తధాపరే | విద్యుచ్చౌరహతాయేచ తేభ్యంః పిండం దదామ్యహమ్ 41 దావదాహే మృతా యే చ సింహవ్యాఘ్ర హతాశ్చ యే | దంష్ట్రిభిశృంగిభిర్వాపి తేభ్యః పిండం దదామ్యహమ్ 42 ఉద్బంధన మృతా యే చ విషశస్త్ర హతాశ్చ యే | ఆత్మనో ఘాతినో యేచ తేభ్యః పిండం దదామ్యహమ్ 43 ఆరణ్య వర్త్మని వనే క్షుధయా తృషయా హతాః | భూతప్రేత పిశాచైశ్చ తేభ్యః పిండం దదామ్యహమ్ 44 రౌరవే యే చ తామిస్రే కాలసూత్రే చ యే స్థితాః | తేషాముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహమ్ 45 అనేకయాతనా సంస్థాః ప్రేతలోకం చ యే గతాః | తేషాముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహమ్ 46 దుర్గతిం సమనుప్రాప్య అభిశాపాదినా హతాః | తేషాముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహమ్ 47 నరకేషు సమస్తేషు యమదూతవశం గతాః | తేషాముద్ధరణార్ధాయ ఇమం పిండం దదామ్యహమ్ 48 పశుయోనిగతా యే చ పక్షికీటసరీసృపాః | అధవా వృక్షయోనిస్థా స్తేభ్యః పిండం దదామ్యహమ్ 49 జాత్యంతరసహస్రేషు యే భ్రమన్తి స్వకర్మణా | మానుష్యం దుర్లభం యేషాం తేభ్యః పిండం దదామ్యహమ్ 50 దివ్యంతరిక్షభూమిష్ఠా పితరో బాంధవాదయః | అసంస్కృత మృతా యే చ తేభ్యః పిండం దదామ్యహమ్ 51 యే కేచిత్ప్రేతరూపేణ వర్తంతే పితరో మమ | తే సర్వే తృప్తి మాయాంతు పిండే నానేన సర్వదా 52 యే బాంధవా బాంధవా వా యేకన్య జన్మని బాంధవాః | తేసాం పిండో మయా దత్తో హ్యక్షయ్యముపతిష్ఠతామ్ 53 పితృవంశే మృతా యే చ మాతృవంశే చ యే మృతాః | గురు శ్వశుర బంధూనాం యే చాన్యే బాంధవా మృతాః 54 యే మే కులే లుప్తపిండా పుత్రదారవివర్జితాః | క్రియాలోపగతా యే చ జాత్యంధా పంగవశ్చయే 55 విరూపా ఆమగర్భాశ్చ జ్ఞాతాజ్ఞాతాః కులే మమ | తేషాం పిండో మయా దత్తో హ్యక్షయ్య ముపతిష్టతామ్ 56 ఆ బ్రహ్మణోయే పితృవంశజాతా మాతుస్తధా వంశభవా మదీయా | కులద్వయే యే మమ సంగాతశ్చ తేభ్యస్స్వధా పిండమహందదామి 57 సాక్షిణస్సంతుమే దేవా బ్రహ్మేశానాదయస్తధా | మయా గయాం సమాసాద్య పితౄణాం నిష్కృతిః కృతా 58 ఆగతోస్మి గయాం దేవ పితృకార్యే గదాధర | త్వమేవ సాక్షీ భగవాన్ అనృణో`òహమృణత్రయాత్ 59 వసువు పలికెను : ఓ మోహినీ ఇపుడు ప్రేతశిలాభవ పుణ్యమును చెప్పెదను. వినుము. ఇచట పిండ ప్రదానము గావించినచో పితృ సముద్ధరణము జరుగును. ఇచట ప్రభాసాత్రిచే శిలచే పాదము ఆచ్ఛాదితమాయెను. మునులచే స్తుతించబన ప్రభాసుడు శిలాంగుష్ఠము నుండి బయలు వెడలెను. ఈ అంగుష్ఠమున నున్న ఈశుడు ప్రభాసేశునిగా ప్రసిద్ధి గాంచెను. శిలాంగుష్ఠ దేశమున ప్రేత శిల కలదు. ఇచట పిండదానమును చేసిన ప్రేత భావము తొలగును. ప్రభాసాత్రి సంగమమున మహానదిలో స్నానము చేయువాడు పవిత్రుడగును. వామదేవుడు స్వయముగా నిలిచినది వామతీర్థమని ప్రసిద్ధము. ఇచట ఈ మహానదిలో ప్రార్థించబడిన రాముడు స్నానమాచరించెను గాన రామతీర్థమని ఏర్పడినది. ఇది స్వరలోకపావనము. ఈ రామ తీర్థమున పిండప్రదానము చేసిన విష్ణులోకమున నివసించును. ''రామ రామ మహాబాహో దేవానామభయంకర త్వాం నమస్యేతు దేవేశ మమ నశ్యతుపాతకమ్'' అనునది మంత్రము. దేవతలకునభయమునిచ్చు ఓ రామచంద్రా! మహాబాహూ నీకు నమస్కరించెదను. నా పాపము నశించుగాత. ఇచట ప్రభాసేశుని నమస్కరించి ప్రకాశించు శివుని సమీపించవలయును. శివునికి నమస్కరించి యామ్యబలిని గావించవలయును. ''ఆపస్త్వమసి దేవేశ జ్యోతిషాం పతిరేవ చ పాపం నాశయ మే శీఘ్రం మనోవాక్కాయ కర్మజమ్'' అనుమంత్రముచే బలిని గావించవలయును. ఓ దేవేశా! నీవు జలరూపుడవు జ్యోతిష్పతివి. నా మనోవాక్కాయ సంభవములగు పాపములను త్వరగా నశింపచేయుము. అని పై మంత్రమునకర్ధము. శిలాజఘన ప్రాంతమును యమధర్మారాజు ఆక్రమించి యుండెను. ధర్మరాజు ఆ పర్వతమును వెళ్ళకు అని అనుటచే అది అదృశ్యానగమోయెను. ఈ పర్వతమున యమరాజధర్మరాజులు నిశ్చలముగా నుండిరి. వీరిద్దరిని పూజించక చేసిన శ్రాద్ధము వ్యర్ధమగును. ''ఈ శ్వానములు శ్యామ బలములు. వైవస్వతకులోత్పన్నములు ఈ రెంటికి పిండ ప్రదానము చేయుచున్నాను. ఈ రెండు హింసిచక ఉండనిమ్ము.'' అని పలుకవలయును.ప్రేత శిలాతీర్థమున నేయి కలిపిన చరువుచే పితరుల నావాహన గావించి మంత్రములచే పిండ ప్రదానము గవించవలయును. ప్రేత పర్వతమున సావధానుడై పితరులను ధ్యానించి ప్రాచీనావీతికుడై ధక్షిణాభిముఖముగా స్మరించుచు, కవ్యవాహుడు, అనలుడు, సోముడు, యముడు, అర్యమా, అగ్విష్వాత్తా, బర్హిషదులు, సోమపులు, పితృదేవతలు మీరందరు మహానుభావులు ఇటకు రండు. మీచే రక్షించబడు నా పితరులు నాకులజాతులు సగోత్రులు వీరందరికి పిండప్రదానమును చేయుటకు ఇచటికి వచ్చితిని. ఈ శ్రాద్ధముచే వారందరు శాశ్వతమగు తృప్తిని పొందుదురు గాత. అని పలికి అచమనము గావించి పంచాంగమును వినిపించి ప్రాణాయామము చేసి పునరావృత్తి రహిత బ్రహ్మలోకాప్తి హెతువుగా సంకల్పించి యధాక్రమముగా శ్రాద్ధము నాచరించవలయును. పితరులు నావాహన చేసి అర్చించి, మంత్రములచే పిండ ప్రదానము గావించవలయును. మొదట హోమమును పంచగ వ్యములచే చేసి, సపిండులకు శ్రాద్ధమును చేసి, వారికి దక్షిణ భాగమున దర్భలను పరిచి తిలోదకమును ఇచ్చి, చేతులు జోడించి అంజలిలో తీసుకొని పితృతీర్థముతో ప్రయత్న పూర్వకముగా ముష్టి మాత్ర సక్తువులచే అక్షయ్య పిండమును పెట్టవలయును. పిండ ద్రవ్యములలో తిలాజ్యదధి మధ్వాదులను కలుపవలయును. దర్భలలో తిలాదులచే సంబంధుల నావాహన చేయవలయును. ఈ మూడు మంత్రములచే మూడు లింగములను నర్చించవలయును. పూర్వము వలె పితరుల నావాహన గావించి యధా పూర్వముగా పిండప్రదానమును గావించవలయును. స్వగోత్రమున కాని వి గోత్రమున కాని దంపతులకు కలిపి పిండ ప్రదానమును చేసినచో శ్రాద్ధమునిష్పలమగును. పిండ ప్రదానము ఉదక తర్పణమును చేయుచు. పిండపాత్రలో తిలల నుంచి శుభోదకములచే నింపి ఈ మంత్రముచే ప్రదక్షిణముగా పిండములను మూడు మార్లు పరిషేచనము చేయవలయును. నమస్కరించి క్షమాపణ వేడవలయును. పిత రులను విడిచి ఆచమనము చేసి సాక్షులగు దేవతలకు వినిపించవలయును. అన్ని స్థానములలో ఇట్లే పిండ ప్రదానము గావించవలయును. గయా పిండదానమునకు కాల విచారమును చేయరాదు. అధిక మాసమున, జన్మదినమున, గురు శుక్రమూఢములలో, బృస్పతి సింహారాశిలో ఉన్ననూ పిండ ప్రదానమును విడువరాదు. గయకు వెళ్ళి పండ ప్రదానము చేయని వానికి భిక్షువు కూడా దండమును చూపును. విష్ణు పదమున దండము నుంచి పితరులతో విముక్తుడగును. గయయందు, పాయసముతో సత్తుచే, పిండిచే చరువుచే, తండులాదులచే పండదానమును చేయవలయును. మహాపాపి అయిననూ గయా దర్శనమున పరిశుద్దుడగును. గయా శ్రాద్ధమునాచరించిన వాడు బ్రహ్మలోకమును పొందును. ఫల్గుతీర్థమున పిండ ప్రదానము చేసిన వారికి కలుగు ఫలము సహస్రాశ్వమేధములచే కూడా కలుగదు. గయను చేరగానే పితరులకు ప్రియములుగ పిండప్రదానము గావించవలయును. ఆలస్యమును చేయరాదు. విఘ్నములను కలిగించరాదు. పిత, పితామహులు, ప్రపితామహులు. మాత, పితామహి ప్రప్రితామపి మాతామహుడు, అతని పిత, ప్రమాతామహదులు. వీరందిరికి నాచే ఈయబడు పిండము అక్ష్యయ్యమును కలిగించనిమ్ము. నాకులమున మరణించిన, వారిని, గతిలేని వారిని ఉద్ధరించటకు ఈ పిండము నిచ్చుచున్నాను.బంధు వర్గములోని వారికి గతినేని వారి ఉద్ధరణ కొరకు ఈ పిండమునిచ్చుచున్నాను. దంతములు రాని వారిని, గర్భపీడితులను ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. అగ్నిదగ్ధులను అనగ్నిదగ్ధులను, విద్యుచ్చోరహతులను ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను.దావ దాహ మృతులకు, సింహవ్యాఘ్రహతులకు, దంష్ట్రులచే శృంగులచే హతులైన వారికి పిండమునిచ్చుచున్నాను. వురిచే మరణించిన వారికి, విషశస్త్రహతులకు, అత్మఘాతకులకు పిండ ప్రదానము చేయుచున్నాను. అరణ్యమున, దారిలో, అడవిలో మరణించిన వారికి, ఆకలి దప్పులచే మరణించిన వారికి, భూతప్రేత పిశాచహతులకు పిండమునిచ్చుచున్నాను. రౌరవనరకమున, తామిస్రమున, కాలసూత్రమున నున్నవారికి ఉద్ధరణ కొరకు ఈపిండమునిచ్చుచున్నాను. అనేక యాతనాస్థితులకు, ప్రేతలోకగతులకు ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. అనేక యాతనాస్థితులకు, ప్రేతలోకగతులకు ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చచున్నాను. దుర్గతిని పొంద అభిశాపాదులచే హతులైన వారినుద్దరించుటకు ఈ పిండము నిచ్చుచున్నాను. సమస్త నరకములలో యమదూతవశులైన వారిని ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను.సవస్త నరకములలో యమదూతవశులైన వారిని ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. పశుయోనిగతులకు పక్షికీట సరీసృపయోనిగతులకు, వృక్షయోనిగతులకు ఈ పిండము నిచ్చుచున్నాను. స్వకర్మవశమున జాత్యంతర సహస్రములలో భ్రమించువారికి, మానజన్మ దుర్లభమగు వారికి పిండము నిచ్చుచున్నాను. దివ్యంత రిక్ష భూమిగతులగు పితరులకు బాంధవాదులకు సంస్కారహీనముగా మరణించిన వారికి పిండము నిచ్చచున్నాను. ప్రేతరూపములో నున్న పితరులందరూ పిండదానముచే తృప్తి పొందుదురుగాక. బంధువులకు, బంధువులు కాని వారికి, ఇతర జన్మలలో బంధువులకు, నాచే ఈయబడు పిండము అక్షయముగా చేరినీ. పితృవంశమున మరణించిన వారికి, మాతృవంశమున మరణించిన వారికి గురుశ్వశుర బంధువులకు, వరణించిన ఇతర బందువులకు, నాకులమునలుప్త పిండులకు, పుత్రదారవర్జితులకు, క్రియాలోపము జరిగిన వారికి, జాత్యంధులకు, పంగువులు, విరూపులకు, ఆమగర్భులకు, నాకులమున తెలిసిన వారికి, తెలియని వారికి వారందరికి నాచే ఈయబడిన ఈ పిండము అక్షయము కానిమ్ము. బ్రహ్మ నుండి నా పితృవంశమున పుట్టినవారికి, మాతృవంశీయులకు రెండు కులములలో సంగతులకు నేను పిండమునిచ్చుచున్నాను. నేను గయను చేరి పితరులకు నిష్కృతిగా గావించితిని. బ్రహ్మేశానాది దేవతలు నాకు సాక్షులుగా నుందురు గాత. ఓ దేవా గదాధరా! గయా తీర్థమునకు వచ్చితిని. ఇచట నీవే సాక్షివి. ఇచట రుణత్రయము నుండి నేను విముక్తుడనైతిని. అపరేహ్ణి శుచిర్భూత్వా గచ్ఛేత్తు ప్రేత పర్వతమ్l బ్రహ్మకుండే తతస్స్నాత్వా దేవదీం స్తర్పయే త్పుధీః 60 కృత్వా హ్వానం పితృణాం తు ప్రయతః ప్రేత పర్వతే lపూర్వచ్చైవ సంకల్ప్య తతః పిండాన్ప్రదాపయేత్ 61 స్వమంత్రై రధ సంపూజ్య పరమాః పితృ దేవతాః l యావంతస్తు తిలా పుంభిః గహీతా ః పితృకర్మణి 62 గచ్ఛన్తి భీతా అసురా స్తావంతో గరుడాహివత్ l పూర్వవత్సకుం కర్మ కుర్యాత్తత్రాపి మోహిని63 తిల మిశ్రాంస్తధా సక్తూ న్నిక్షిపేత్ప్రేత పర్వతే l యేకే చిత్ర్పే తరూపేణ వర్తంతే పితరో మమ 64 తే సర్వే తృప్తి మాయాంతు సక్తుభిస్తిలమిశ్రితైః ఆ బ్రహ్మస్తంభ పర్యన్తం యత్కించిత్స చరాచరమ్ 65 మయా దత్తేన పిండేన తృప్తిమాయాన్తు సర్వశః l ఆదౌ తే పంచతీర్దేషు చోత్తరే మానసే విధిః 66 అచమ్య కుశహస్తేన శిరశ్చాభ్యక్ష్య వారిణా l ఉత్తరం మానసం గత్వా మంత్రేణ స్నానమా చరేత్ 67 ఉత్తరే మానసే స్నానం కరోమ్యాత్మ విశుద్దయే l సూర్యలోకాద సంప్రాస్తి సిద్ధయే పితృముక్తయే 68 స్నాత్వాధ తర్పణం కుర్యా ద్దేవాదీనాం యధావిధి l ఆ బ్రహ్మస్తంబ పర్మంతం దేవర్షి పితృమానవా ః 69 తృప్యన్తు పితరస్సర్వే మాతృమాతా మహాదయః lశ్రాద్దే సపిండకం కుర్యా త్స్వసూత్రోక్త విధానతః 70 అష్టకాసు చ వృద్దౌ చ గయాయాంచ క్షయేsహనిl మాతుశ్శ్రాద్ధం పృధక్కుర్యా దన్యత్ర స్వామినా సమం 71 'ఓం' నమోస్తు భానవే భ##ర్త్రే సోమభౌమజ్ఞరూపిణ l జీవభార్గవశ##వైశ్చ రరాహుకేతు స్వరూపిణ 72 సూర్యం నత్వార్చయిత్వాచ సూర్యలోకం నయేత్పితౄన్ l మానసం హి సరోహ్యత్ర తస్మాదుత్తరమానసమ్ 73 ఉత్తరాన్మానసాన్మౌనీ వ్రజేద్దక్షిణమానసమ్ l ఉదీచీతీర్దమత్యుక్తం తతోదీచ్యాం విముక్తిదమ్ 74 ఉదీచ్యాం ముండపృష్ఠస్య దేవర్షి పితృతర్పణమ్ l మధ్యే కనఖలం తీర్థం పితృణాం గతిదాయకమ్ 76 స్నాతః కనక వద్భాతి నరో యాతి పవిత్రతామ్ l అతః కనఖలం తీర్ధ మనుత్తమమ్ 76 తస్మాద్దక్షిణ భాగే తు తీర్ధం దక్షిణ మానసమ్ l దక్షిణ మానసే చైవం తీర్ధత్రయముదాహృతమ్ 77 స్నాత్వా తేషు నిధానేన కుర్యాచ్చ్రాద్ధం పృధక్పృధక్ l దివాకర కరోమిహ స్నానం దక్షిణ మానసే 78 బ్రహపాత్యాది పాపౌఘ ఘాతనాయ విముక్తయే l అనేన స్నాన పూజాది కుర్యా చ్ఛ్రాద్ధం సపిండకమ్ 79 నమామి సూర్యం తృప్త్యర్దం పితృణాం తారణాయచ l పుత్ర పౌత్రధనైశ్వర్య ఆయురారోగ్య వృద్ధయే 80 దృస్ట్వా సంపూజ్యమౌనార్క మిమం మన్త్రముదీరయేత్ l ''కవ్యవాడాదయో యేచ పితృణాం దేవతాస్తధా 81 మదీయైః పితృభి స్సార్ధం తర్పితా స్థ్స స్వధాభుజః l ఫల్గుతీర్థం వ్రజేత్తస్మా త్సర్వతీర్ధోత్తమోత్తమమ్ 82 ముక్తి ర్భవతి కర్తౄణాం పితౄణాం శ్రాద్ధత స్సదా l బ్రహ్మణా ప్రార్థితో విష్ణుః పల్గుకో హ్యభవత్సురా 83 దక్షిణాగ్నౌ కృతం నూనం తద్భవం ఫల్గుతీర్థకమ్ l యస్మిన్ఫలతి పల్గ్వాం గౌ ః కామధేనుర్జలం మహీ 84 సృష్టేరంతర్గతం యస్మా త్ఫల్గుతీర్థం న నిష్ఫలమ్ l తీర్థాని యాని సర్వాణి భవనేష్వఖిలేషుచ 85 తాని స్నాతుం సమాయాన్తి ఫల్గుతీర్థం న సంశయః l గంగా పాదోదకం విష్ణోః పల్గుశ్చాది గదాధరః 86 హిమం చ ద్రవరూపేణ తస్మాద్గంగాధికం విదుః l అశ్వమేధ సహస్రాణాం ఫలం ఫల్గుజలాప్లవాత్ 87 ఫల్గు తీర్ధే విష్ణుజలే కరోమి స్నానమద్య వై l పిత్రణాం విష్ణులోకాయ భుక్తిముక్తి ప్రసిద్ధయే 88 ఫల్గుతీర్దే నరస్నాత్వా తర్పణం శ్రాద్దమాచరేత్ l స పిండకం స్వసూత్రోక్తం నమేదధ పితామహమ్ 89 ''నమశ్శివాయ దేవాయ ఈశాన పురుషాయ చ l అఘోర వామదేవాయ సద్యో జాతాయ శంభ##వే '' 90 నత్వా పితామహం దేవం మంత్రేణానేన పూజయేత్ l ఫల్గుతీర్థే నరస్నాత్వా దృష్ట్వా దేవం గదాధరమ్ 91 ఆనమ్య పితృభిస్సార్థం స్వం సయేద్వైష్ణవం పదమ్ l ''ఓం నమో వాసుదేవాయ నమస్సంకర్షణాయ చ 92 ప్రద్యుమ్నాయానిరుద్ధాయ శ్రీధరాయ చ విష్ణవే l పంచతీర్థ్యాం నరస్న్సాత్వా బ్రహ్మలోకే నయే త్పితౄన్ 93 అమృతైః పంచభిః స్నాతం పుష్పవస్త్రాద్యలంకృమ్ l నకుర్యాద్యో గదాపాణిం తస్య శ్రాద్ధమ పార్ధకమ్ 94 నాగకూటా ద్గృధ్రకుటా ద్విష్ణోశ్చోత్తర మానపాత్ lఏతద్గయాశిరః ప్రోక్తం ఫల్గుతీర్థం తదుచ్యతే 95 ముండపృష్ఠనగాధ స్తా త్ఫల్గుతీర్ధమనుత్తమమ్ l అత్ర శాద్ధాదినా సర్వే పితరో మోక్షమానప్నుయః 96 శమీ పత్ర ప్రమాణన పిండం దద్యాద్గయాశిరే l యన్నామ్నా పాతయేత్పిండం తం నయేద్ర్బహ్మ శాశ్వతమ్ 97 అవ్యక్తరూపీ యో దేవో మండప్పష్ఠాద్రిరూపతః l ఫల్గుతీర్ధాద్రి రూపేణ నమస్యతి గదాధరమ్ 98 శిలాపర్వత ఫల్గ్వాది రూపేణావ్యక్త మాస్ధితః l గదాధరాది రూపేణ వ్యక్తమాది ధరస్తధా 99 ధర్మారణ్యం తతో గచ్ఛే ద్దర్మోయత్ర వ్యవస్థితః l మతంగవాప్యాం స్నాత్వా తు తర్పణం శ్రాద్దమాచరేత 100 గత్వా నత్వా మతంగేశ మిమం మంత్ర ముదీరయేత్ l ''ప్రమాణం దేవతాః శంభు ర్లోకపాలాశ్చ సాక్షిణః 101 మయాగత్య మతంగే స్మిన్ పితృణాం నిష్కృతిః కృతా'' l పూర్వంతు బ్రహ్మతీర్థే చ కూపే శ్రాద్ధాది కారయేత్ 102 తత్కూపయూపయోర్మధ్యే కుర్వంస్తు త్రాయతే పితౄన్ l ధర్మం ధర్మేశ్వరం నత్వా మహాభోథితరుం నమేత్ 103 ద్వితీయ దివసేకృత్యం మయా తే సముదాహృతమ్ l స్నానతర్పణ పిండార్చా నత్యాద్యైః పితృసౌఖ్యదమ్ 104 ఇతి శ్రీబృహన్నారదీయ పురాణోత్తర భాగే మోహినీ వసు సంవాదే గయా మహాత్య్మే పిండదానవిధిర్నామ పంచచత్వారింశత్తమోsద్యాయః మరునాడు శుచియై ప్రేత పర్వతమునకు వెళ్ళవలయును. బ్రహ్మకుండమున స్నానము గావించి దేవదులకు తర్పణమును గావించవలయును. శ్రద్దాలులై ప్రేత పర్వతమున పితరులనాహ్వానించి పూర్వము వలె సంకల్పించి పిండ ప్రదానము గావించవలయును. స్వమంత్రములతో పరమ పితృదేవతలను చక్కగా పూజించవలయును. పితృకర్మలలో గ్రహించిన తిలల సంఖ్యతో అసురులు గరుడుని చూచిన సర్పముల వలె భయపడి పారిపోదురు. ఇచట కూడా అంతయూ పూర్వము వలెనే అచరించవలయును.ప్రేత పర్వతమున తిలమిశ్రితములగు సక్తును చల్లవలయును. ప్రేత రూపములోనున్న నా పితృదేవతలు అందరూ తిల మిశ్రిత సక్తులచే తృప్తిని చెందుదురుగావుత. బ్రహ్మ నుండి స్తంభము వరకున్న చరాచర సకల జగత్తు నేనిచ్చు పిండముచే తృప్తిన పొందనిమ్ము. మొదట పంచతీర్థములలో ఉత్తర మానసమున ఆచమనమును గావించి దర్భలచే శిరస్సున నీరు చల్లుకొని, ఉత్తర మానసమునకు వెళ్ళి మత్రములచే స్నానమాచరించవలయును. ఆత్మ శుద్ధి కొరకు ఉత్తరమానసమున స్నానము చేయుచున్నాను. సూర్యలోకాది సంప్రాప్తిసిద్దికి, పితృముక్తికి స్నానము చేసి దేవాదులకు యధావిధిగా తర్పణముచేయవలయును. బ్రహ్మ నుండి స్తంభ పర్యంతము దేవర్షి పితృమానవులు పితరులందరు మాతృమాతామహాదులు తృప్తి పొందెదరు గాత, స్వసూత్రోక్త విధానముగా శ్రాద్ధమున సపిండకమును చేయవలయును. అష్టకల యందు, వృద్ధి యందు, గయయందు, అక్షయ దినమున విడిగా తల్లికి శ్రాద్ధమను చేయవలయును. ఇతరత్ర స్వామితో చేయవలయును ''ఓం నమోsస్తు భానవే భ##ర్త్రే సోమభౌమ జ్ఞరూపిణ, జీవ భార్ణవ శ##నైశ్చర రాహుకేతు స్వరూపిణ, '' అని మంత్రమును జపించి, సూర్యునికి నమస్కరించి, అర్చించినచో పితరులను సూర్యలోకమునకు చేర్చును. ఇచట మానససరోవరము కలదు. దాని తరువాత ఉత్తర మానసము కలదు. ఉత్తర మానసమునుండి మౌనముగా దక్షిణ మానసమునకు వెళ్ళవలయును. ఇది ఉత్తర తీర్థమని చెప్పబడినది. కావున ఉత్తర దిక్కు మోక్షప్రదము. మండపృష్ఠమునకు ఉత్తర భాగమున దేవర్షి పితృతర్ఫణమును చేయవలయను. మధ్యలో కన ఖల తీర్థము పితరులకు గతిదాయకము. ఇచట స్నానము చేసిన నరుడు కనకము వలె భాసించును. పవిత్రుడగును. కావున కనఖల తీర్థము ఉత్తమ తీర్థముగా ప్రసిద్ధిగాంచినది. కావున దక్షిణ భాగమున దక్షిణ మానసతీర్థము కలదు. దక్షిణ మానసమున తీర్థత్రయము చెప్పబడినది. వీటిలో యధావిధిగా స్నానముచేసి విడివిడిగా శ్రాద్ధమును చేయవలయును. ఓ దివాకర! ఇచట దక్షిణ మానసమున స్నానము చేయుచున్నాను. బ్రహ్మహత్యాది పాపరాశి నాశమునకు, విముక్తికి స్నానము చేయుచున్నాను. అను ఈ మంత్రముచే స్నానపూజాదికమును సపిండ శ్ద్రామును చేయవలయును. పితరులను తృప్తికొరకు తరింపచేయుటకు సూర్యునికి నమస్కరిచుచున్నాను. పుత్రపౌత్ర ధనైశ్వర్య ఆయురారోగ్యవృద్ధి కొఱకు నమస్కరించుచున్నాను అని పలికి దర్శించి సూర్యుని పూజించి ఈ మత్రమునుచ్ఛరించవలయను. కవ్యవాడాదులు పితృదేవతలు నా పితృదేవతలతో కలిసి స్వధాభూజులై తాప్తి పొందుదురు. ఇట నుండి ఫల్గు తీర్థమునకు వెళ్ళవలయునను. ఈ ఉత్తమ తీర్థమున పితృ శ్రాద్ధమునాచరించిన వారికి పితరులకు ముక్తి కలుగును. బ్రహ్మ ప్రార్థించగా విష్ణువు ఫల్గుకుడాయెను. దక్షిణాగ్నిలో చేయబడినది ఫల్గు తీర్థకమైనది . ఇచటనే ఫల్గులొ గోవు కామధేనువు జలము, మహిమ ఫలించును ఇది యుగ సృష్ట్యంతర్గతము. కావున ఫల్గు తీర్థము నిష్పలము కాదు.అఖిల భువనములలో నున్న సమస్త తీర్థములు స్నానముచేయుటకు ఫల్గు తీర్థమునకు వచ్చును. గంగ విష్ణుపాదోదకము. ఫల్గుతీర్థము సాక్షాత్తు గదాధురుడే. హిమము ద్రవమైనపుడు ఫల్గుతీర్థమైనది. కావున ఇది గంగ కంటే అధికము. ఫల్గు తీర్థమున స్నానము చేసినచో సహస్రాశ్వమేధ ఫలితము కలుగును. ఫల్గు తీర్థమున విష్ణు జలమున ఈ రోజు స్నానము చేసి తర్పణమును శ్రాద్దమునాచరించవలయును. ఈ శ్రాద్ధమును సపిండకముగా నాచరించి పితామహునికి నమస్కరించవలయును. శివునకు దేవునకు, ఈశాన పురుషునికి అఘోరవామదేవునకు సద్యోజాతునకు శంభునకు నమస్కారము. పితామహనికి నమస్కరించి ఈ మత్రముచే పూజించ వలయును. ఫల్గు తీర్థమున స్నానమాడి గదాధరుని దర్శించి, పితరులతోపాటు విష్ణులోకమును చేరును. వాసుదేవునకు నమస్కారము. సంకర్షణునకు, ప్రద్యుమ్నునకు, అనిరుద్ధునకు, శ్రీధరునకు, విష్ణువునకు, నమస్కారము. పంచతీర్థమున స్నానమాచరించి పితరులను బ్రహ్మలోకమునకు చేర్చును. గదాధరుని పంచామృతముతో స్నానము చేయించి పుష్ప వస్త్రాదులచే అలంకరించి శ్రాద్ధమును చేయవలయును. ఇట్లు గదాధురుని పూజించక చేసిన శ్రాద్ధము నిరర్ధ మగును. నాగకూటము, గృధ్రకూటము, విష్ణువు ఉత్తర మానసముల కంటే ఇది గయాశిరమనబడును. దీనినే ఫల్గు తీర్థమందురు. ముండ పృష్ఠ పర్వతాధో భాగమున ఫల్గు తీర్థము కలదు. ఈ ఫల్గుతీర్థమున శ్రాద్ధము చేయుటచే పితరులు మోక్షమును పొందెదరు. గయా శిరమున శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానమును చేయువలయును. ఎవరి పేరుతో పిండమర్పించిన వారు బ్రహ్మలోకమును చేరెదరు. అవ్యక్తరూపముగా నున్న దేవుడు మండ పృష్ఠాద్రి రూపమున ఫల్గు తీర్దాది రూపముగా గదాధరునని నమస్కరించును. శిలాపర్వత ఫల్వదిరూపముతో ఆవ్యక్తముగా నుండి, గదాధరుని రూపముగా వ్యక్తముగా నుండును. ఆటనుండి ధర్మారణ్యమునకు వెళ్ళును. ఇచటనే ధర్ముడున్నాడు . మతంగవాపిలో స్నానము చేసి తర్పణమును శ్రాద్ధమును ఆచరించవలయును. వెళ్లి మతంగేశునికి నమస్కరించి ఈ మంత్రమును పలుకవలయును. దేవతలు శంభువు ప్రమాణము. పలోకపాలకులు సాక్షులు. నేను మతంగక్షేత్రమున కొచ్చి పితరులకు నిష్కృతిని చేసితిని. మొదట బ్రహ్మ తీర్థమున కూపమన శ్రాద్దాదుల నాచరించవలయును. కూపయూపముల మధ్యన శ్రాద్దము నాచరించి పితరులను తరింప చేయును. ధర్ముని, ధర్మేశ్వరుని నమస్కరించి, మహా బోధితరువును నమస్కరించవలయును. ఇట్లు ద్వితీయ దివసమున చేయవలసిన స్నానతర్పణ పిండనమస్కారాదికృత్యములను వివరించితిని. ఈ కృత్యము పితృసౌఖ్యమును కలిగించును. ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గయా మాహాత్మ్యమున పిండదాన విధియను నలుబదియైదవ అధ్యాయము