Sri Naradapuranam-3    Chapters    Last Page

సప్తచత్వారింశత్తమోsధ్యాయః నలుబదియేడవ అధ్యాయము

గయామాహాత్మ్యమ్‌

వసురువాచ:-

పంచమేsహ్ని గదాలోలే కృత్వా స్నానాది పూర్వవత్‌ l శ్రాద్ధం సపిండకం కుర్యాత్‌ తతోsక్షయవటే నరాః 1

తత్ర శ్రాద్ధాదికం కృత్వా పితౄన్బ్రహ్మపురం నయేత్‌ l బ్రహ్మప్రకల్పితా న్విప్రా న్బోజయే త్పూజయే దధ 2

కృతశ్రాద్ధోsక్షయ వటే అనేనైవ ప్రయత్నతః l దృష్ట్వా నత్వాధ సంపూజ్య వటేశం చ సమాహితః 3

పితౄ న్నయే ద్బ్రహ్మపుర మక్షయం తు సనాతనమ్‌ l''గదాలోలే మహాతేర్ధే గదా ప్రక్షాలనే వరే 4

స్నానం కరోమి శుద్ధ్యర్ధ మక్షయ్యాయ స్వరాప్తయే l ఏకాన్తరే వటస్యాగ్రే యశ్శేతే యోగనిద్రయా 5

బాలరూపధర్మస్తసై#్మ నమస్తే యోగ శాయినే l సంసార వృక్ష శాస్త్రాయా శేషపాపక్షయాయాచ 6

అక్షయ్య బ్రహ్మదాత్రేచ నమోsక్షయ్య వటాయవై '' l కలౌ మాహేశ్వరా లోకా యేన తస్మాద్గదాధరః 7

లింగరూపోsభవత్తం చ వందే త్వాం ప్రపితామహమ్‌ '' l నయే త్పితౄన్రుద్ర పదం నత్వా తం ప్రపితామహమ్‌ 8

హెతిం హత్వాసురం తస్య శిరశ్చైవ ద్విధాకృతమ్‌ l గదయా సా గదా యత్ర క్షాలితా ప్రభూణా భవత్‌ 9

గదాలోలమితి ఖ్యాతం తత్తీర్ద ప్రవరం హ్యభూత్‌ l హెతీ రక్షో బ్రహ్మపుత్ర స్తపస్తేపే ద్భుతం మహత్‌ 10

బ్రహ్మదీంస్తపసా తుష్టా స్వరం వవ్రే వరప్రదాన్‌ దైత్యాదిభిశ్చ శస్త్రాద్యై ర్వివిధైర్య నుజైరపి

కృష్ణేశానాది చక్రాద్యై రవధ్య స్స్యాం మహాబలః l తథే త్యుక్తాంతర్హితాస్తేతు హాతీర్దేవానధాజయత్‌ 12

ఇన్ద్రత్వ మకరోద్ధేతి స్తదా బ్రహ్మహరాదయః l దేవా హరింప్రపన్నాస్త మూచుర్హేతిం జహీతి చ 13

ఊచే హరిరవధ్యోsయం హాతిర్దేవాస్సురాసురైః l బ్రహ్మస్త్రం మే ప్రయచ్ఛధ్వం హెతిం హన్యాం హి యేన తమ్‌ 14

ఇత్యుక్తాస్తే తతో దేవా విష్ణవే తాం గదాం దదుః l ఉపేన్ద్ర త్వంప జహీత్యేవ హేతిం ప్రోచుర జాదయః 15

దధార తాం గదామాజౌ దేవైరుక్తో గదాధరః l గదయా హెతి మహత్య దేవే భ్యస్త్రిదివం దదౌ 16

వసువు పలికెనుః అయిదవ రోజు గదాలోల తీర్థమున పూర్వము వలె స్నానాదికమునాచరించి సపిండకమగా శ్రాద్ధము నాచరించవలయును. తరువాత అక్షయ వటమున శ్రాద్ధాదికమునాచరించి పితయిలను బ్రహ్మపురమును చేర్చెదరు. తరువాత బ్రహ్మ కల్పితులగు బ్రాహ్మణులను పూజించి భుజింప చేయవలయును. ఈ ప్రయత్నము చేతనే అక్షయ వటమున శ్రాద్ధము గావించి సావధానముతో వటేశుని దర్శించి, నమస్కరించి పూజించి పితరులను అక్షయము సనాతనమగు బ్రహ్మపురమును చేర్చెదరు. గదా ప్రక్షాళణము గావించిన శ్రేష్ఠమగు గదాలోల మహాతీర్థమున స్వర్గప్రాప్తికి అక్షయమునకై శుద్ధి కొరకు స్నానమును చేయుచున్నాను. వటాగ్రమున ఏకాన్తమున బాల రూపమున యోగనిద్ర చే శయనించు యోగశాయికి నమస్కారము. సంసార వృక్ష శాస్త్రము అశేష పాపక్షయకరము, అక్షయ బ్రహ్మదాత యగు అక్షయ వటమునకు నమస్కారము.కలియుగమున మహేశ్వరలోకములు కావున గదాధరుడు లింగరూపిగా యున్న ప్రపితామహునికి నమస్కారము. పితామహుకి నమస్కరించి రుద్రపదమునకు పితరులను చేర్చును. హెతి యను రాక్షసుని వధించి అతని శిరమును రెండుగా చేసిన గద ఈ తీర్థమున కడుగబడెను. కావున ఈ తీర్థము గదాలోలమని ప్రసిద్ధనొందెను. బ్రహ్మపుత్రుడగు హతి యను రాక్షసుడు అద్బుతమగు గొప్ప తపమునాచరించెను. తపసుచే ప్రీతులగు బ్రహ్మదులను దైత్యాదులచే వివిధ శస్త్రాదులచే మనుజులచే కృష్ణేశానాది చక్రాదులచే అవధ్యుడుగా వరమును పొందెను. బ్రహ్మదులట్లేయని అంతర్ధానము నందిరి. అంతట హెతిదేవతలను జయించెను. ఇన్ద్రత్వమును పొందెను. అపుడు బ్రహ్మేశ్వరాదులు దేవతలు హరినాశ్రయించి హెతిని చంపుమని కోరిరి. అంతట హరి హెతి సురాసురులచే అవధ్యుడు నాకు బ్రహ్మస్త్రమునిచ్చిన హెతిని చంపెదననెను. అపుడు దేవతలు విష్ణువునకు ఈ గదనిచ్చిరి. హెతిని చంపుమనిరి. అట్లు దేవతలు పలుకగా శ్రీహరి ఆగదను ధరించి యుద్ధమున గదచే హెతిని చంపి దేవతలతో కలిసి త్రిదివమునకు వెళ్ళెను.

ఉషోషితోధ గాయత్రీ మహానదీస్థితే l గాయత్ర్యా పురతస్స్నాతా స్తతస్సంధ్యాం సమాచరేత్‌ 17

శ్రాద్ధం సంపిండకం కృత్వా నయే ద్ర్బాహ్మణతాం కులమ్‌ l తీర్ధే సముద్యతే స్నాత్వా సావిత్య్రాః పురతో నర ః 18

సంధ్యా ముపాప్య మధ్యాహ్నె నయేత్పితౄన్విధిక్షయమ్‌ l ప్రాచీ సరస్వతీస్నాత స్సరస్వత్యాస్తతోsగ్రతః 19

సంధ్యాముపాస్య సాయాహ్నే నయేత్సర్వజ్ఞతాం కులమ్‌ l బహు జన్మకృతాత్సంధ్యాలోపపాపాద్వి శుద్ధ్యతి 20

విశాలాయాం లిలేహానౌ తీర్థే చ భరతాశ్రమే l పదాంకితే మండపృష్ఠే గదాధర సమీపతః 21

తీర్థ ఆకాశగంగాయాం గిరికర్ణముఖేషు చ l శ్రాద్ధదః పిండదో బ్రహ్మలోకం పితృశతం నయేత్‌ 22

స్నాతో గోదావైతరణ్యాం త్రిస్సప్త కుల ముద్ధరేత్‌ l దేవనద్యాం గోప్రచారే తధా మానసకే పదే 23

పుష్కరిణ్యాం గదాలోలే తీర్ధే చామరకే తధా l కోటి తీర్ధే రుక్మకుండే పిండదస్స్వర్నత్పితౄన్‌ 24

మార్కండేయేశ కోటీశౌ నత్వా స్యాత్పితృతారకః lతధా పాండు శిలాయాస్తు పుణ్యదా యాస్సులోచనే 25

దృష్టిమాత్రేణ సంపూతా న్నరకస్థాన్దివం నయేత్‌ l ఇత్యుక్తా ప్రయ¸° పాండు శ్శాశ్వతం పదమవ్యయమ్‌ 26

ఘృతకుల్యామధుకుల్యా దేవికా చ మహానదీ l శిలాయాం సంగతా తత్ర మధుప్రసవాప్రకీర్తతా 27

అయుతం హ్యశ్వమేధానాం స్నానేన లభ##తే నరః l తర్పయిత్వా పితృగణం శ్రాద్ధం కృత్వా సంపిండకమ్‌ 28

సహస్ర కుల ముద్ధృత్య నమేద్విష్ణుపురం నరః l ఉద్బిజ్జాస్స్వేదజా వాపి హ్యండజా యే జరాయుజాః 29

మధుప్రసవాం సమాసాద్య మృతా విష్ణుపదం యయుః l దశాశ్వమేధికే హంసతీర్ధే శ్రాద్ధాద్దివం వ్రజేత్‌ 30

దశాశ్వమేధ హంసౌ చ నత్వా శివపురం వ్రజేత్‌ l మతంగస్య పదే శ్రాద్ధ కర్తా బ్రహ్మపురం వ్రజేత్‌ 31

నిర్మధ్యాగ్నీన్శమీగర్భే విధర్వష్ణ్వాదిభిస్సహ l మంధోకుండం హి తత్తీర్దం పితౄణాం ముక్తికారకమ్‌ 32

తర్పణాత్పిండాదానాచ్చ స్నానకృన్ముక్తి మాప్నుయాత్‌ l పితౄన్స్వర్గం నయేన్నత్వా రామేశ కరకేశ్వరౌ 33

గయాకూపే పిండదానా దశ్వమేధ ఫలం బేత్‌ l భస్మకూటే భస్మనాధ స్నానాత్తారయతే పితౄన్‌ 34

తయవాత మహానదిగా యున్న గాయత్రీ తీర్థమున ఉపవసించి గాయత్రీ అగ్రభామున స్నానమాచరించి సంధ్యోపాసన చేయవలయును. సపిండకముగా శ్రాద్ధము చేసి కులమునకు బ్రాహ్మణత్వమును కూర్చువలయును. సముద్యత తీర్థమున సావిత్రి ముందు స్నానమాచరించి మధ్యాహ్నమున సంధ్యోపాసన గావించి పితరులను బ్రహ్మలోకమునకు చేర్చును. సరస్వతీ అగ్రభాగమున ప్రాచీ సరస్వతిలో స్నానము గావించి సాయంకాలమున సంధ్యోపాసన గావించి కులమును సర్వజ్ఞుల ను చేయును. బహు జన్మలలో చేసిన సంధ్యాలోప పాపమునుండి విముక్తుడగును. విశాలాతీర్థమున భరతాశ్రమమున పదాంకితమగు ముండపృష్ఠమున గదాధరుని సమీపము, ఆకాశగంగా తీర్ధమున, గిరికర్ణాదులందు శ్రాద్ధమునాచరించువాడు, పిండప్రదానము చేయువాడు పితృశతమును బ్రహ్మలోకమునకు చేర్చును. గోదావైతరణిలోస్నాన మాచరించి ఇరువది యొక్క తరములనుద్ధరించును. గంగానదిలో గోప్రచారమున, మానసపదమున, పుష్కరిణియందు, గదాలోల తీర్థమున, అమరకక్షేత్రమున, కొటి తీర్థమున, రుక్మకుండమున, పిండ ప్రదానము గావంచినచో పితరులను స్వర్గమునకు చేర్చును.మార్కండేయేశ కోటీశులకు నమస్కరించి పితృతారకుడగును. పుణ్యోదయమగుపాండు శిలాదర్శన మాత్రముననే పవిత్రులై నరకములో నున్నవారు స్వర్గమును చేరెదరు. అని పలికి పాండవుడు శాశ్వతపదమును చెరెను. ఘృతకుల్య, మధుకుల్యా, దేవికామహానది ఈ శిలయందు సంగతయై మధుస్రవగా ప్రసిద్ధిగాంచినది. ఈ మధ్రుస్రవలో స్నానమాచరించిన వాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును పొందును. పితృ తర్పణముగావించి, సపిండ శ్రాద్ధమునాచరించి సహస్ర కులమునుద్ధరించి విష్ణు పదమును చేర్చును. ఉద్భిజ్జములు, స్వేదజములు, అండజములు జరాయుజములగు ప్రాణులలో ఏ ప్రాణి అయిననూ మధుస్రవాతీర్థమున మరణించినచో విష్ణు లోకమును పొందును. ఈ దశాశ్వమేధమునిచ్చు హంస తీర్థమున శ్రాద్ధము నాచరించిన స్వర్గమును పొందును. దశాశ్వమేధ హంస తీర్థములను నమస్కరించి శివలోకమును పొందును. మతంగ పదమున శ్రాద్ధమునాచరించువాడు బ్రహ్మలోకమును పొందును. బ్రహ్మ విష్ణ్వాదులతో కలిపి శమీగర్భమున అగ్నిమధనము చేసిన ప్రదేశము మంధోకుండమను తీర్థము. ఈ తీర్థము. ఈ తీర్థము పితరులకు ముక్తిని ప్రసాదించును. ఇచట తర్పణము పిండదానము స్నానమును చేసినవాడు ముక్తిని పొందును. రామేశకరకేశ్వరులకు నమస్కరించి పితరులను స్వర్గమున చేర్చును. గయాకూపమున పిండదానము వలన అశ్వమేధ ఫలమును పొందును. భస్మకూటమున భస్మస్నానముచే పితరులను తరింపచేయును.

ధౌత పాపాsధ నిఃక్షీరా సంగమే స్నానకృన్నరః l శ్రాద్ధీ రామ పుష్కరిణ్యాం బ్రహ్మలోకం నయేత్పితౄన్‌ 35

సుషుమ్నాయాం మహానద్యాం త్రిస్సప్తకులముద్ధరేత్‌ l స్నాతో నత్వా వసిష్ఠేశం తస్య తీర్థేsశ్వమేధభాక్‌ 36

పిండదో ధేనుకారణ్య కామధేను పదేషుచ l స్నాతో నత్వా తు తం దేవం బ్రహ్మలోకం నయేత్పితౄన్‌ 37

కర్దమాలే గయానభౌ ముండ పృష్ఠ సమీపతః l స్నాత్వా శ్రాద్ధీ నయేత్స్వర్గం పితౄన్నత్వాచ చండికామ్‌ 38

ఫల్గుచండీశనామానం సంగమాధీశ మర్చ్య చ l గయాగజో గయాదిత్యో గాయత్రీ చ గదాధరః 39

గయా గయా శిరశ్చైవ షడ్గయా ముక్తిదాయకాః l గయాయాం తు వృషోత్సర్గా త్రిస్సప్తకులముద్ధేరేత్‌ 40

యత్ర యత్ర స్థితో విప్ర గదితో విజితేంద్రియః l ఆద్యం గదాధరం ధ్యాయన్‌ శ్రాద్ద పిండాని కారయేత్‌ 41

కులానాం శతముద్ధృత్య బ్రహ్మలోకం నయే ద్ధ్రువమ్‌ lతతో దధ్యోదనేనైవ దత్వా నైవేద్యముత్తమమ్‌ 42

జనార్దనాయ దేవాయ సమభ్యర్చ్య యధావిధి l దద్యాన్నిక్షిప్య పిండాంస్తు తచ్ఛేషేణౖవ జీవతి 43

దైత్యస్య ముండపృష్ఠేతు యస్మాత్సా సంస్థితా శిలా l తస్మాద్వై ముండ పృష్ఠాద్రి ః పితౄణాం బ్రహ్మలోకదః 44

రామే వనం గతే శైల మారుహ్య భరతస్ధ్సితః l పిత్రే పిండాదికం దత్వా రామేశం స్థాప్య తత్రచ 45

స్నాత్వా నత్వాచ రామేశం రామం సీతాం సమాహితః l శ్రాద్ధం పిండ ప్రదానం చ కృత్వా విష్ణు పురం వ్రజేత్‌ 46

పితృభిస్సహ ధర్మాత్మా కులానాం శ##తైస్సహ l శిలా దక్షిణ హస్తే చ స్థాపితః కుండ పృష్ఠతః 47

తత్ర శ్రాద్ధాదినా సర్వా న్పితౄన్బ్రహ్మపురం నయేత్‌ l కుండేనాధ తపస్తప్తం సీతా ద్రేర్దక్షేణ నగే 48

మతంగస్య పదే పుణ్య పిండదస్స్వర్నయేత్పితౄన్‌ l వామహస్తే శిలాయశ్చ హ్యంతకో విధృతో గిరిః 49

ఉదయాద్రిరిహానీతో హ్యగస్త్యేన మహాత్మనా l స్థాపితః పిండదస్తత్ర పితౄన్‌ బ్రహ్మపురం నయేత్‌ 50

కుండముద్యంతకం తత్ర స్వాత్మనస్తపసే కృతమ్‌ l బ్రహ్మ తత్ర చసావిత్రీ కుమారాభ్యాం స్థితస్త్విహ 51

హాహాహూహూ ప్రభృతయో గీతం వాద్యం ప్రచక్రముః l స్నాతోs గస్త్యే చ మధ్యాహ్నె సావిత్రీం సముపాస్య చ 52

కోటి జన్మ భ##వేద్విప్రో ధనాఢ్యో వేదపారగః lఅగస్త్యస్య పదే స్నాతః పిండదస్స్వర్నయే త్పితౄన్‌ 53

బ్రహ్మయోనిం ప్రవిశ్యాధ నిర్గచ్ఛేద్యస్తు మానవ ః l పరం బ్రహ్మ సయాతీహ విముక్తో యోని సంకటాత్‌ 54

నత్వా గయాం కుమారంచ బ్రాహ్మణ్యం లభ##తే నరః l స్సోమకుండాభిషేకాద్యై సోమలోకం నయేత్పితౄన్‌ 55

నిఃక్షీరా సంగమమున స్నానము చేయుట వలన పాపములు నశించును. రామ పుష్కరిణిలో శ్రాద్దమునాచరించిన పితురులను బ్రహ్మలోకమునకు చేర్చును. సుషుమ్నా మహానదిలో స్నానము గావించినచో ఇరువది యొకటి తరములనుద్ధరించును. వసిష్ఠ తీర్థమున స్నానము గావించి వసిష్ఠేశుని నమస్కరించిన అశ్వమేధ ఫలమును పొందును. ధేనుకారణ్యమున కామధేను పదమున స్నానము చేసి అచటి దేవుని నమస్కరించిన ఆశ్వమేధ ఫలమును పొందును. ధేనుకారణ్యమున కామధేను పదమున స్నానము చేసి అచట దేవుని నమస్కరించి పిండ ప్రదానము గావించిన పితరులను బ్రహ్మలోకమున చేర్చును. కర్ధమాల తీర్థమున, గయానాభి యందు ముండ పృష్ఠ సమీపమున స్నానము గావించి చండికకు నమస్కరించి శ్రాద్ధము గావించిన పితరులను స్వర్గమున చేర్చును. ఫల్గు చండీశుడను పేరు గల సంగమాధీశుని అర్చించిన ఈ ఫలమే లభించును. గయాగజము, గయాదిత్యము గాయత్రీ, గదాధరుడు, గయ, గయాశిరము అను ఆరుగయలు ముక్తి దాయకములు. గయమందు వృషోత్సర్జనము గావించి ఇరువది యొక తరముల నుద్ధరించును. జితేంద్రియుడగు విప్రుడున్న ప్రదేశమున ఆద్యుడగు గదాధరుని ధ్యానించి శ్రాద్ధమును పిండ ప్రదానము నాచరించవలయును. నూరు కులములనుద్దరించి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. తరువాత జనార్దన దేవుని యధావిధిగా పూజించి దధ్యోదనమును నైవేద్యమునిడి తచ్ఛేషముతో శ్రీరామచంద్రుడు అరణ్యమునకు వెళ్ళగా భరుతుడు పర్వతము నధిరోహించి యుండెను. తండ్రికి పిండాదికములనిచ్చి అచట రామేశుని స్థాపించి స్నానము చేసి రామేశునికి నమస్కరించి సీతారాములను చేరెను. కావున నరుడు అచటికి వెళ్ళి స్నానమాచరించి సావధానముతో రామేశుని నమస్కరించి, రాముని సీతను నమస్కరించి శ్రాద్ధమును పిండ ప్రదానమును గావించి విష్ణులోకమును చేరును. తానే కాక నూరు కులములనుద్ధరించి పితరులతో విష్ణులోకమును చేరును. శిలాదక్షిణ హస్తమున కుండ పృష్ఠమువైపు శ్రాద్ధాదులనాచరించి పితరులను బ్రహ్మపురమును చేర్చును. సీతాద్రియొక్ర దక్షిణ పర్వతమున కుండుడు తపమునాచరించెను. పుణ్యముగ మతంగపదమున పిండప్రదుడు పితరులను స్వర్గమున చేర్చును. శిల యొక్క రామహస్తమున అంతకగిరి ధరించబడినది. మహాత్ముడగు అగస్త్యుడు ఇచటికి ఉదయాద్రిని తెచ్చెను. ఇచట పిండ ప్రదుడు పితరులను స్వర్గమున చేర్చును. తన తపస్సునకు కుండము చేయుబడినది. ఇచట బ్రహ్మ సావిత్రి కుమారులతో నుండెను. హాహా హూహూ మొదలకు గంధర్వులు గీతవాద్యములను చేయుచుండిరి మధ్యాహ్నమున అగస్త్యతీర్థమున స్నానమాడి సావిత్రిని ఉపాసించి కోటి జన్మలు వేదపారగుడు ధనాఢ్యుడగు విప్రునిగా పుట్టును. అగస్త్యతీర్థమున స్నానమాడి పిండములనిచ్చువాడు పితరులను స్వర్గమున చేర్చును. ఇక బ్రహ్మయోనిని ప్రవేశించి వచ్చువాడు పునర్జన్మరహితుడై పరబ్రహ్మను పొందును . గయాకుమారుని నమస్కరించి బ్రాహ్మణ్యమును పొందును. సోమకుండమున అభిషేకాదులచే పితరులను సోమలోకమున చేర్చును.

బలిః కాకశిలాయం తు కాకేభ్యః క్షణమోక్షదః l స్వర్గద్వారేశ్వరం నత్వా స్వర్గాద్బ్రహ్మపురం నయేత్‌ 56

పిండదో వ్యోమగంగాయాం నిర్మలస్స్వర్నయే త్పితౄన్‌ l శిలాయా దక్షిణ హస్తే భస్మకూటమధారయత్‌ 57

ధర్మోతస్తత్ర చ హర స్తన్నామ సమకారయత్‌ l యత్రాసౌ భస్మకూటాద్రి ర్భస్మనామాతు మోహిని 58

వటో వటేశ్వరస్తత్ర స్థితశ్చ ప్రపితామహః l తదగ్రే రుక్మిణీకుండం పశ్చిమే కవిలానదీ 59

కపిలేశో నదీ తీరే ఉమాసోమ సమాగమః l కపిలాయాం నరస్న్నాత్వా కపిలేశం నమేధ్యజేత్‌ 60

శ్రాద్ధదస్స్వర్గ భాగీస్యా వ్మహెశీకుండ ఏవచ l గౌరీ చ మంగలా తత్ర సర్వసౌభాగ్యదార్చితా 61

జనార్దనో భస్మకూటే తస్యం హస్తే తు పిండదః l మంత్రేణ చాత్మనోsన్వేషా సంఖ్యేనాపి తిలైర్వినా 62

పిండం చ దధిసంమిశ్రం సర్వే తే విష్ణులోకగా ః l ఏష పిండో మయా దత్త స్తవహస్తే జనార్దన 63

గయాశ్రాద్ధే త్వయా దేయో మహ్యం పిండో మృతే మయి l తుభ్యం పిండో మయా దత్తో యుముద్దిశ్య జనార్ధన 64

దేహి దేవ గయా శీర్షే తసై#్మ మృతే తతః l జనార్దన నమస్తుభ్యం నమస్తే పితృరూపిణ 65

పితృపాత్ర నమస్తు భ్యం సమస్తే ముక్తి హాతవే lగయాయాం పితృరూపేణ స్వయమేవ జనార్దనః 66

తం దృష్ట్వాం పుండరీకాక్షం ముచ్యతే చ ఋణత్రయాత్‌ l సమస్తే పుండరీకాక్ష ఋణత్రయవిమోచన 67

లక్ష్మీకాంత నమస్తే స్తు నమస్తే పితృమోక్షద!' l పుండరీకాక్ష మభ్యర్చ్య స్వర్గగస్స్యాజ్జనార్దనమ్‌ 68

వామజానుం తు సంపాత్య నత్వా భూమిం జనార్దనమ్‌ lశ్రాద్ధం సపిండకం కృత్వా భ్రాతృభి ర్విష్ణులోకభాక్‌ 69

శిలాయా వామపాదే తు ప్రేతకూటో గిరిర్ధృతః l ధర్మరాజేన పాపాఢ్యో గిరిః ప్రేత శిలామయః 70

పాదేన దూరే నిక్షిప్తః శిలాయాః పాదభారతః lప్రేతా ధానుష్కరూపేణ కరగ్రహణకారాకాః 71

పృథక్‌ స్థితాశ్చ బహవో విఘ్నకారిణ ఏవ తే l శ్రాద్ధాదికారిణం నౄణాం తీర్ధే పితృవిముక్తయే 72

గతశ్శిలాద్రి సంపర్కాత్‌ ప్రేత కూట ః పవిత్రతామ్‌ l ప్రేతకుండం తు తత్రాస్తే దేవాస్తత్ర పదేస్ధ్సితా 73

శ్రాద్ధపిండాదికృత్స్నాతః ప్రేతత్వాన్మోచయే త్పతౄన్‌ l కీకటేషు గయా పుణ్యా పుణ్యం రాజగృహాం వనమ్‌ 74

చ్యవన స్యాశమః l పుణ్యో నదీ పుణ్యా పునఃపునః వైకుంఠో లోకదండశ్చ గిరికూటశ్చశోణగః 75

శ్రాద్ధపిండాదికృత్తత్ర పితౄన్బ్రహ్మపురం నయేత్‌ l శిలాదక్షిణపాదేతు గృధ్రకూటో గిరి ర్ధృతః 76

కాక శిల యందు కాకులకు చేయు బలి క్షణకాలమున మోక్షమునిచ్చును. స్వర్గద్వారేశ్వరునికి నమస్కరించి స్వర్గము నుండి బ్రహ్మలోకమును పొందును. అకాశగంగ యందు పిండప్రదానముచేయువాడు నిర్మలుడై పితరులను స్వర్గమునకు చేర్చును. శిలాదక్షిణ హస్తమున భస్మకూటమును దరించెను. కావున అచట హరుడు భస్మకూటాద్రియని నామకరణమును చేసెను. ఇచట నటుడు, వటేశ్వరుడు ప్రపితామహుడు అచట నివసించును. భస్మకూటాద్రి అగ్రభాగమున రుక్మిణీ కుండము, పశ్చిమ భాగమున కపిలానది కలదు. కపిలానదీతీరమున కపిలేశుడు కలడు. ఇచటనే ఉమాసోమ సమాగమము కలదు. కపిలానది యందు స్నానము చేసి కపిలేశునికి నమస్కరించి పూజించవలయును. ఇచట శ్రాద్ధప్రదుడు స్వర్గమును పొందును. మహెశకుండమున గౌరి మంగళ సర్వసౌభాగ్య ప్రద అర్చించ బడవలయును. భస్మకూటమున గల జనార్దన హస్తమున పిండప్రదుడు స్వస్వమంత్రములతో ఇతరులకు సత్యముగా తిలలు లేక దథిసంమిశ్ర పిండప్రదానము గావించిన వారందరు విష్ణులోకమును పొందెదరు. ఓ జనార్దనా నా హస్తమున ఈ పిండమును నేనిచ్చుచున్నాను. నేను మరణించినపుడు గయాశ్రాద్ధమున నీవు నాకు పిండమును చేయవలయును. నేను నీకు ఎవరెవరి కొరకు పిండమునిచ్చితినో వారు మరణించినపుడు వారికి నీవు పిండములనిమ్ము. పితృరూపియగు జనార్ధనా! నీకు నమస్కారము ఓ పితృపాత్రా ముక్తి హేతువగునీకు నమస్కారము. గయయందు పితృరూపముగా జనార్దనుడే స్వయముగా నుండెను. ఆ పుండరీకాక్షుని దర్శించినవాడు ఋణత్రయ విముక్తులగుదురు. ఓ పుండరీకాక్షా! ఋణత్రయ విమోచనా నీకు నమస్కారము. లక్ష్మీకాంత! పితృమోక్షప్రదాః నీకు నమస్కారము. జనార్దనుడుగు పుండరీకాక్షుని పూజించి స్వర్గమును పొందును. వామజానమవునువంచి భూమి మీద నుంచి జనార్ధనుని నమస్కరించి సపిండకముగా శ్రాద్ధమును చేసి సొదరులతో విష్ణులోకమును చేరును. శిలావామ భాగమున ప్రేతకూటగిరి కలదు. ప్రేత శిలామయము పాపాఢ్యమగు ఈ పర్వతమును యమధర్మరాజు తన పాదముచే శిలాపాదభాగము నుండి దూరముగా పడవేసెను. ధానుష్కరూపముతో విఘ్నకరులగు చాలా మంద ప్రేతలు ఆచట విడివిడిగా ఉండిరి. ఈ తీర్థము పితృవిముక్తి కొరకు శ్రాద్ధమును చేయు వారి సంపర్కముతో ప్రేత కూటము పవిత్రత నందెను. ఇచటనే ప్రేత కుండము కలదు. ఇచట ప్రతి పదమున దేవతలు నివసించియిన్నారు. ఇచట స్నానము గావించి శ్రాద్ధ పిండాదికములనిచ్చినచో పితరులు ప్రేతత్వ విముక్తులగుదురు. కీకటములందు గయ పవిత్రమైనది. రాజ గృహము వనము పవిత్రములు. ఇచట చ్యవనాశ్రమము పావనము. ఇచట నది పావనము. వైకుంఠము, లోకదండము, గిరికూటము శోణగము, ఇవియన్నియూ పుణ్యప్రదములు. ఈ తీర్థములలో శ్రాద్ధమును పిండ ప్రదానమును గావించినచో పితరులను బ్రహ్మాపురమునకు చేర్చును.

ధర్మరాజేన స్వస్థైర్య కరణాయాశు పావనః గృధ్రరూపేణ సంసిద్ధ స్సప్త కృత్వో మహర్షయః 77

అతో గిరిర్గృద్రకూట స్తత్ర గృధ్రేశ్వరశ్శివ ః l దృష్ట్వా గృధ్రేశ్వరం స్నాత్వా యాతి శంభోః పురం నరః 78

తత్ర గృధ్రపురం గత్వా ప్రాప్తకాలో దివం వ్రజేత్‌ l ఋణమోక్షం పాపమోక్షం శివం దృష్ట్వా శివం వ్రజేత్‌ 79

ఆదిపాదేన గిరిణా సమాకాన్త్రం శిలోదకమ్‌ l తత్రాస్తే గజరూపేణ విఘ్నేశో విఘ్నేనాశనః 80

త్యం దృష్ట్వా ముచ్యతే విఘ్నైఃపితౄఞ్ఛివపురం నయేత్‌ l గాయత్రం చ గయాదిత్యం స్నాతో దృష్ట్వా దివం వ్రజేత్‌ 81

బ్రహ్మాణంచాది పాదస్థం దృష్ట్వా స్యాత్పితృతారకః l నాభౌ పిండదో యస్తు పితౄన్బ్రహ్మపుర నయేత్‌ 82

శోభార్దే ముండపృష్ఠస్య అరవింద వరం త్వభూత్‌ l ముండపృష్ఠారవిందే చ దృష్ట్వా పా పైర్విముచ్యతే 83

శృంగిభిర్దం ష్ట్రిభిర్వ్యాలై విషవహ్నిస్త్రియా జలైః l సుదూరాత్పరిహర్తవ్యః కుర్వన్ర్కీడాం మృతస్తు యః 84

నాగానాం విప్రియం కుర్వన్‌ హతశ్చాప్యధ విద్యుతా l నిగృహీతస్స్వయంరాజ్ఞా చౌర్యదోషేణ చక్వచిత్‌ 85

పరదారాన్రమంతశ్చ ద్వేషాతత్తత్పతిభిర్హతాః l అసమానైశ్చ సంకీర్ణై శ్చాండాలాద్వైశ్చ విగ్రహమ్‌ 86

కృత్వా తైర్నిహతాస్తాంశ్చ చాండాలాదీన్సమాశ్రితాః l గవాగ్ని విషదాశ్చైవ పాషండాః క్రూరబద్ధయః 87

క్రోధాత్ర్పాయం విషం వహ్నిం శస్త్రముద్బంధనం జలమ్‌ l గిరి వృక్షాత్ప్రపాతంచ యే కుర్వన్తి నరాధమాః 88

కుశిల్పజీవినో యే చ పంచసూనాధికారిణః l మఖే నను యే కేచిత్‌ దీనప్రాయా నపుంసకాః 89

బ్రహ్మదండహతా యే తు యేచాపి బ్రహ్మణౖర్హతాః l మహాపాతకినో యే చ పతితాస్తే ప్రకీర్తితాః 90

స్నానేన శుద్ధిమాయాన్తి గయాకూపస్య భస్మనా l ఇతి తే కధితం దేవి గయామహాత్మ్య ముత్తమమ్‌ 91

సర్వపాపప్రశమనం పితౄణాం ముక్తిదాయకమ్‌ l యశ్శృణో తి నరో భక్త్యా శ్రాద్ధే పర్వణి వాన్వహమ్‌ 92

శ్రావయేద్వా వరారోహె సోపి స్యాద్ర్బహ్మలోకభాక్‌ l ఇదం స్వస్త్యయనం పుణ్యం ధన్యం స్వర్గతిదం నృణామ్‌ 93

యశస్యమపి చాయుష్యం పుత్ర పౌత్ర వివర్ధనమ్‌ 94

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే మోహినీ వసుసంవాదే గయామాహాత్మం

నామ సప్త చత్వారింశత్తమోsధ్యాయః

శిలాదక్షిణ పాదమున గృధ్రకూటగిరి కలదు. ఈ గిరిని యమధర్మరాజు తన స్దైర్యమునకు ఈ గిరిని ధరించెను. ఇచట తాను స్వయముగా తన స్థిరతకు గృధ్రరూపమున తపము నాచరించి సిద్ధిని పొందెను. కావుననే ఈ గిరికి గృధ్రకూటమని పేరు. ఇచట గృధ్రేశ్వరుడు శివుడు. ఇచట స్నానము చేసి గృధ్రేశ్వరుని దర్శించి శివపురమును చేరును. అచట గృధ్రపురమునకు వెళ్ళి సమయమొచ్చినపుడు స్వర్గమును చేరును. ఋణమోక్షమును పాపమోక్షమును శివుని దర్శించి శివుని పొందును. ఈ పర్వతము తన ఆదిపాదముతో శిలోదనమాక్రమించబడినది . ఇచట విఘ్ననాశకుడుగు విఘ్నేశుడు గజరూపముతో నుండెను. ఈ విఘ్నేశుని దర్శించి విఘ్నవినిర్ముక్తుడగును. పితరులను శివపురము చేర్చును. ఇచట స్నానము చేసి గాయత్రిని గయాదిత్యుని దర్శించి స్వర్గము చేరును. ఆది పాదమున నున్న బ్రహ్మను దర్శించి పితృతారకుడగును. నాభి యందు పిండప్రదుడు పితరులను బ్రహ్మపురము చేర్చును. ముండ వృష్ఠమునకు శోభ కొరకు ఉత్తమారవిందమేర్పడెను. ముండ పృష్ఠారవిందములను చూచి పాపముల నుండి విముక్తుడగును. శృంగులచే, దంష్ట్రులచే, వ్యాలములచే, విషముచే, వహ్నిచే, స్త్రీలచే, జలములచే, సంగమమును చాలా దూరమున విడువవలయును. సర్పములకు అపకారమును చేయుచు మరణించినవాడు, విద్యుత్తుచే మరణించినవాడు, రాజుచే శిక్షించబడినవాడు (శౌర్యమున పరదారలనురమించుచు వారి పతులచే ద్వేషముచే చంపబడినవాడు అసమానులచే, సంకీర్ణులచే, చాండాలులచే విరోధమును చేసి వారిచే చంపబడినవారు, చాండాలాదులను ఆశ్రయించినవారు, గోవులకు అగ్నిని విషమునిచ్చినవారు, పాఖండులు, క్రూరబుద్ధులు, క్రోధముచే విషమును, అగ్నిని, శాస్త్రమును, ఉద్బంధనమును, జలమును ప్రయోగించినవారు, గిరుల నుండి వృక్షములనుండి పడినవారు, కుశిల్ప జీవులు, పంచసూనాధికారులు, యజ్ఞములలో సభలలో దీన ప్రాయులు, నపుంసకులు, బ్రహ్మదండహతులు, బ్రహ్మణహతులు, మహాపాతకులు. వీరంతా పతితులనబడుదురు. వీరు గయాకూప భస్మస్నానముచే శుద్ధిని పొందెదరు. ఇది గయామాహాత్మ్యము. ఇట్లు నీకు చేప్పితిని. ఈ మాహాత్మ్యము సర్వపాపప్రశమనము. పితృముక్తిదాయకము. శ్రాద్ధమున కాని, పర్వకాలమున కాని, ప్రతి నిత్యము ఈ మహాత్య్మమును భక్తిచే వినువారు, వినిపించువారు బ్రహ్మలోకమును పొందెదరు. ఈ గయా మాహాత్మ్యము, శుభములకు నిలయము, పరమపావనము, ధన్యము, నరులకు స్వర్గతిదాయకము, యశస్కరము, ఆయుష్యకరము, పుత్రపౌత్ర వివర్ధనము. కావున దీనిని చదువవలయును. వినవలయను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున గయా మాహాత్మ్యమను నలుబది ఏడవ అద్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page