Sri Naradapuranam-3 Chapters Last Page
ఏకోన పంచాశత్తమోsధ్యాయః = నలుబది తొమ్మిదవ అధ్యాయము
తీర్థయాత్రా వర్ణనమ్
వసురువాచ:
వాయవ్యే తు దిశే భాగే తస్య పీఠస్య సుందరి ! l లింగం ప్రస్థాపితం తత్ర సగరేణ చతుర్ముఖమ్ 1
సాగరాద్వాయుకోణ తు భద్రదేహం సరః స్మృతమ్ l గవాం క్షీరేణ సంజాతం సర్వపాతకనాశనమ్ 2
కపిలానాం సహస్రస్య సమ్యగ్దత్తస్య యత్ఫలమ్ l తత్ఫలం లభ##తే మర్త్యః స్నానమాత్రేణ మోహిని 3
పూర్వాభాద్ర పదా యుక్తా పౌర్ణమాసీ యదా భ##వేత్ l తదా పుణ్యతమః కాలో హ్యశ్వమేధ ఫలప్రదః 4
యత్ర సా దృశ్యతే దేవ వి ఖ్యాతా భీష్మచండికా l శ్మశానే తాం సుమభ్యర్చ్య న నరో దుర్గతిం వ్రజేత్ 5
అంతకేశ్వర పూర్వేణ దక్షే సర్వేశ్వరస్య చ l మాతలీశ్వర సౌమ్యే తు కృత్తి వాసేశ్వరః స్మృతః 6
కృత్తివాసేశ్వరం దృష్ట్వా తం సంపూజ్య పరాం గతిమ్l ఏకేన జన్మనా దేవి కృత్తివామే తు లభ్యతే
పూర్వజన్మకృతం పాపం తమసాపి న శుద్ధ్యతి 7
తత్‌క్షణాన్నశ్యతే పాపం తస్య లింగస్య దర్శనాత్ l కృతే తు త్ర్యంబకం పూర్వం త్రేతాయాం కృత్తివాససమ్ 8
మహేశ్వరం తు దేవస్య ద్వాపరే నామ గీయతే l హస్తిపాలేశ్వరం నామ కలౌ సిద్దైస్తు గీయతే 9
కృత్తివాసేశ్వరో దేవో ద్రష్టవ్యశ్చ పునః పునః l యదీహేత్తారకం జ్ఞానం శాశ్వతం చామృతప్రదమ్ 10
దర్శనద్దేవదేవస్య బ్రహ్మహాపి ప్రముచ్మతే l స్పర్శనే పూజనే చై వ సర్వయజ్ఞఫలం లభేత్ 11
శ్రద్ధయా పరయా దేవం యేsర్చయంతి సనాతనమ్ l ఫాల్గునస్య చతుర్దశ్యాం కృష్ణపక్షే సమాహితాః 12
పుషై#్పః ఫలైస్తథా పత్రై ర్బక్ష్యైరుచ్చావచైస్తథా l క్షీరేణ మదునాచైవ తోయేన సహ సర్పిషా 13
తర్పయంతి పరం లింగ మర్చయంతి శుభం శివమ్ l డుండుకార నుస్కారై ర్నృత్యగీతైస్త దైవచ 14
ముఖవద్యై రనేకైశ్చ స్తోత్రైర్మంత్రై స్తధైవచ l ఉపోష్య రజనీమేకాం భక్త్యా పరమయా హరమ్ 15
తే యాంతి పరమం స్థానం పూజయిత్వా చ మోహిని భూతాయాం చైత్రమాసస్య యోర్చయేత్పరమేశ్వరమ్ 16
సచ విత్తేశ్వరం ప్రాప్య క్రీడతే యక్షరాడివ l వైశాఖస్య చతుర్దశ్యాం యోర్చయోత్ర్పయతః శివమ్ 17
వైశాఖలోకమాసాద్య తసై#్యవానుచరో భ##వేత్ l జ్యేష్ఠమాసే చతుర్ధశ్యాం యోర్చయేచ్ఛ్రద్ధయా హరమ్ 18
స్వర్గలోకమవాప్నోతి యావదాభూత సంప్లవమ్ l చతుర్దశ్యాం శుచౌ భద్రౌ యోర్చయేత్ర్పయతః శివమ్ 19
సూర్యలోకం సమాసాద్య క్రీడతే యావదీప్సితమ్ l శ్రావణస్య చతుర్దశ్యాం కామలింగం సముత్థితమ్ 20
దదాతి వారుణం లోకం క్రీడతే చా ప్సరోన్వితః l మాసి భాద్రపదే యుక్త మర్చయిత్వా తు శంకరమ్ 21
పుషై#్పః ఫలైశ్చ వివిధై రింద్రసై#్యతి సలోకతామ్ l పితృపక్షే చతుర్దశ్యాం పూజయిత్వా యధేశ్వరమ్ 22
ప్రాప్నోతి పితృలోకం తు క్రీడతే పూజితశ్చతైః l ప్రబోధమాసే దేవేశ మర్చయిత్వా మహేశ్వరమ్ 23
చంద్రలోకం సమాసాద్య క్రీడతే యావదీప్సితమ్ l బహుళే మార్గశీర్షస్య పూజయిత్వా పినాకినమ్ 24
విష్ణులోకమవాప్నోతి క్రీడతే కాలమక్షయమ్ l అర్చయిత్వా తథా పౌషే స్థాణుం హృష్టేన చేతసా 25
ప్రాప్నోతి నైఋతం స్థానం తేనైవ సహ మోదతే l మాఘే సమర్చయితా వై పుష్పమూలఫలై ః శుభైః 26
ప్రాప్నోతి శివలోకం తు త్యక్త్వా సంసారసాగరమ్ l కృత్తివాసేశ్వరం దేవ మర్చయేత్తు ప్రయత్నతః 27
అవిముక్తే వసేచ్చైవ యదీచ్ఛేచ్ఛాంకరం పదమ్ l ఘంటాకర్ణో హ్రదస్తత్ర వ్యాసేశస్య తు పశ్చిమే 28
స్నానం కృత్వా హ్రదే తస్మి న్వ్యాసే శస్య చ దర్శనాత్ l యత్ర యత్ర మృతో దేవి వారాణస్యాం మృణో భ##వేత్ 29
దండఖాతే నరః స్నాత్వా తర్పయిత్వా స్వ కాన్పితౄన్ l నరకస్థాస్తు యే దేవి పితృలోకం వ్రజంతి తే 30
పిశాచత్వం గతా దేవి యే నరాః పాపకర్మిణః తేషాం పిండ ప్రదా నేన దేహస్యోద్ధరణం స్మృతమ్ 31
దర్శనాత్తస్య ఖాతస్య కృత కృత్యోs భిజాయతే l తత్రైవ లలితా దేవీ వర్తతే లోకశర్మదా 32
యే చ తాం పూజయిష్యంతి తస్మిన్మానే స్థితాః స్వయమ్ lతేషాం సా వివిధాన్బోగా న్సంప్రదాస్యతి మానదే 33
జాగరం యేతు తస్యాశ్చ పురః కుర్వంతి దీ పకైః l తేషాం సా హ్యక్షయాన్ లోకాన్ వితరిష్యతి మోహిని 34
ఆలయం యే ప్రకుర్వంతి భూమిం సంమార్జయంతి చ l తేషామష్ట సహస్రస్య సువరస్య ఫలం భ##వేత్ 35
తాముద్దిశ్య తు యో దేవి బ్రాహ్మణాన్వేద పారగాన్ l భోజయిష్యతి విష్టాన్నై పుణ్యఫలం శ్రుణు 36
వసువు పలికెను:- ఆ పీఠమునకు వాయవ్య దిగ్భాగమున సగరునిచే చతుర్ముఖ లింగము స్థాపించబడినది. సాగరసంగమమునకు వాయు కోణమున భద్రదేహసరస్సు కలదు. ఈ సరస్సు గోక్షీరము చో ఏర్పడినది. సర్వపాతకనాశనము. ఈ భద్రహ్రదమున స్నానమాచరించిన సహస్రకపిల గోదాన ఫలము కలుగును. పూర్ణిమరోజున పూర్వాభాద్ర నక్షత్రము కలిగినచో అది చాలా పుణ్యతమ కాలము. ఈనాడు స్నామాచరించిన అశ్వమేధ ఫలము కలుగును. ఇచట భీష్మచండిక యను దేవి ప్రసిద్ధి: చెందినది. శ్మశానమున భీష్మచండికను పూజించునవాడు దుర్గతిని పొందడు. అందకేశ్వరునకు పూర్వభాగమున సర్వేశ్వరునకు దక్షిణ భాగమున మాతలీశ్వరునకు ఉత్తరమున కృత్తివాసేశ్వరుడు కలడు. కృత్తివాసక్షేత్రమున కృత్తవాసేశ్వరుని దర్శించి, అతనిని చక్కగా పూజించి ఒకే జన్మలో ఉత్తమగతిని పొందును. పూర్వజన్మకృత పాపము తపస్సుతో కూడా నశించదు. కాని కృత్తివాసేశ్వరలింగ దర్శనము వలన నశించును. కృతయుగమున త్య్రంబకనామమున, త్రేతాయుగమున కృత్తివాసుడని, ద్వాపరమున మహేశ్వరుడని, కలియుగమున హస్తిపాలేశ్వరుడని గానము చేయబడును. కృత్తివాసేశ్వరుని పలుమార్లు దర్శించవలయును. శాశ్వతము అమృతప్రదమగు తారకజ్ఞానమును కోరినచో దర్శనము ఆవశ్యకము. దేవదేవుని దర్శనము వలన బ్రహ్మఘ్నుడు కూడా ముక్తిని పొందును. దేవదేవుని స్పృశించిన, పూజించిన సర్వయజ్ఞఫలము లభించును. సనాతనుడగు ఈ పరదేవుని శ్రద్ధచే అర్చించినవాడు విశేషించి ఫాల్గునబహుళచతుర్దశినాడు సావధానులై పత్ర పుష్పఫలములచే భక్ష్యములచే క్షీరదధిఘృత జలముల చే శివలింగమును తర్పణ చేసి పూజించిన, పూజించిన వారు, డుండుకార నమస్కారములతో, నృత్యగీతములతో, అనేక విధముఖ్యవాద్యములచే, స్తోత్రములచే, మంత్రములచే సేవించి ఉత్తమభక్తిచే ఒకరాత్రి ఉపవసించినవారు, పూజించినవారు పరమస్థానమును పొందెదరు. చైత్రఅమావాస్యనాడు పరమేశ్వరుని అర్చించువారు కుభేరుని చేరి కుబేరుని వలె విహరించును. వైశాఖ చతుర్దశినాడు భక్తియుతుడై శివుని పూజించినచో వైశాఖలోకమును చేరి విశాఖునికి సేవకుడగును. జ్యేష్ఠ చతుర్దశినాడు శ్రద్ధతో హరుని పూజించివారు ప్రళయకాలము వరకు స్వర్గమున నివసించును. ఆషాఢ చతుర్దశినాడు భక్తితో శివుని పూజించినవాడు సూర్యలోకమునుపొంది యధేచ్ఛగా క్రీడించును. శ్రావణ చతుర్దశినాడు ఉద్భవించిన కామలింగమునను పూజించినవాడు వరుణలోకమును చేరి అప్సరసలతో క్రీడించును. భాద్రపదమాసమున శంరుని వివిధ ఫలపుష్పములచే పూజించి ఇంద్రలోకమును పొందును. భాద్రపదబహుళ చతుర్దశినాడు ఈశ్వరుని పూజించి
పితృలోకమున పొంది వారితో విహరించును. కార్తికమాసమున మహేశ్వరుని పూజించి చంద్రలోకమును చేరి యేధేచ్చగా విహరించును. మార్గశీర్షబహుళపక్షమున పినాకిని పూజించి విష్ణులోకమును పొంది అనంతకాలము క్రీడించును. పుష్యమాసమున సంతోషముతో స్థాణువును పూజించి నిబ్రుతిలోకమున చేరి నైబ్రుతులుతో విహరించును మాఘమాసమున పుష్పమూలఫలములచే శివుని పూజించి శివలోకమును చేరును. సంసారసాగరమును వీడును. శంకరలోకమును కోరువారు ప్రయత్నపూర్వకముగా కృత్తివాసేశ్వరుని పూజించవలయును. అవిముక్తమున నివసించవలయును. వ్యాసేశుని పశ్చిమ భాగమున నున్న ఘంటార్ణహ్రదమున స్నానమాడి వ్యాసేశుని దర్శించువారు ఎక్కడ మృతి చెందిననూ వారాణసీమృతి ఫలము లభించును. దండ ఖాతమున స్నానమాడి స్వపితరులకు తర్పణముగావించి నరకమున నున్న వారు కూడా పితృలోకమును చేరెదరు. పిశాచత్వమును పొందిన పాపకర్ములు కూడా పిండ ప్రదానము చే దేహోద్ధరణము జరుగును. దండఖాతదర్శనముచే కృతకృత్యుడగును. ఇచటనే లోకసుఖప్రదయగు లలితాదేవి కలదు. అచటనుండి లలితాదేవిని పూజించిన వారికి ఆదేవి వివధ భోగములనిచ్చును. దీపములచే అమె ముందు జాగరణమును చేసినవారికి ఆమె అక్షయ లోకములను ప్రసాదించును. ఆలయమును నిర్మించువారికి, మార్జనము చేసినవారికి అష్టసహస్ర సువర్ణముల ఫలము లభించును. లలితా దేవినుద్దేశించి వేద పారగులగు బ్రాహ్మణులను భుజింపచేసిన వారికి కలుగు పుణ్యఫలమును చెప్పెదను వినుము.
దుర్గాలోకే వసే త్కల్ప మిహైవాగచ్ఛతే పునః l నరో వా యది వా నారీ సర్వభోగ సమన్వితౌ 37
ధన ధాన్య సమాయుక్తో జాయతే మహతాం కులే l సుభగౌ దర్శనీ¸°చ రూప¸°వన గర్వితౌ 38
భ##వేతామీదృశౌ దేవి సర్వ సౌఖ్యస్య భాజనౌ l మానుష్యం దుర్లభం ప్రాప్య విద్యుత్సంపాత చంచలమ్ 39
యేన సా లలితా దృష్టా తస్య జన్మభయం కుతః l పృధ్వీ ప్రదక్షిణాం కృత్వా యత్ఫలం లభ##తే నరః 40
తత్ఫలం లలితాయాశ్చ వారాణస్యాం ప్రదర్శనత్ l మాసి మాసి చతుర్ల్యాం తు తస్మిన్కాల ఉపోషితః 41
అర్చయిత్వా తు తాం దేవీం జాగరం తత్ర కారయేత్ l తస్యర్ధంః సకలా దేవి త్రైలోక్యస్యాపి పూజితమ్ 42
నలకూబర కేశానం తం చ సంపూజ్య మోహిని l సర్వ సిద్ధి ప్రదాతారం కృత్యకృత్యో నరో భ##వేత్ 43
తసై#్యవ దక్షిణ దేవి మణికర్ణీతి చ శ్రుతమ్ | తస్య చాగ్రే మహత్తీర్ధం సర్వ పాప ప్రణాశనమ్ 44
మణికర్ణీశ్వరం దేవి కుండమధ్యే వ్యవస్థితమ్ | దృష్ట్వా నత్వా సమభ్యర్చ్య న భూయో జఠరే వసేత్ 45
తస్య దక్షిణ పార్శ్వే తు గంగాయాం స్థాపితం పరమ్ | గంగేశ్వరం సమభ్యర్చ్య సురలోకమవాప్నుయాత్ 46
అన్యదాయతనం వక్ష్యే వారాణస్యాం సుమోహిని | యత్ర వై దేవదేవస్య రుచిరం స్థానమీప్సితమ్ 47
నీయమానం పురా లింగం సుభ##గే శశి మౌలినః | రాక్షసైరంతరిక్షస్థైః వ్రజమానైశ్చ సత్వరమ్ 48
అస్మిన్దేశే యదా ప్రాప్తం తదా దేవేన చింతతమ్ | అవిముక్త వియోగస్తు కధం మే న భ##వేదితి 49
ఇమ మర్ధం తు దేవేశో యావచ్చింతయతే శుభే | తావత్కుక్కుట శబ్దస్తు తస్మిన్నానే బ భూవ హ 50
శబ్దం శ్రుత్వా తే తం దేవి రాక్షసాస్త్రస్తచేతసః | లింగముత్సృజ్య తత్రై వ ప్రభాతసమయే గతాః 51
గతేషు రాక్షసేష్వేవం లింగం తత్రైవ సంస్థితమ్ | స్థానేతిరుచిరే శుభ్రే దేవదేవః స్వయం ప్రభుః 52
అవిముక్తే తత్ర మధ్యే అవిముక్త తరం స్మృతమ్ 53
తదావిముక్తేతి సురైర్హరస్య నామ స్మృతం పుణ్యతమాక్షరాఢ్యమ్
మోక్షప్రదం స్థావరజంగమానాం యే ప్రాణినః పంచతాం యాంతి తత్ర 54
కుక్కుటాశ్చాపి సుభ##గే తస్మిన్నావే స్థితాః సదా | అద్యాపి తత్ర దృశ్యంతే పూజ్యమానాః శుభాత్మభిః 55
అవిముక్తం సదా దేవి యః శ్రయేదీక్షయా నరః | న తస్య పునరావృత్తిః కల్పకోటి శ##తైరపి 56
దేవస్య దక్షిణ భాగే వాపీ తిష్ఠతి శోభనా | తస్యాస్తధోదకం పీత్వా నావృత్తిః పునరత్ర చ 57
త్రీణి లింగాని వర్తంతే హృదయే పురుషస్య తు | తథా యైస్తజ్జలం పీతం తే కృతార్ధాస్తు మానవాః 58
తేషాం తు తారకం జ్ఞాన మస్త్యేవేతి న సంశయః | వాపీ జలే నరః స్నాత్వా దృష్ట్వా దండక నామకమ్ 59
అవిముక్త తతో దృష్ట్వా కైవల్యం లభ##తే క్షణాత్ | తత్ర సంధ్యాముపాసిత్వా బ్రహ్మణః సకృదేవ తు 60
పంచషష్టిసమాః సంధ్యా తేన చోపాసితాభ##వేత్ | పురీం వారాణసీం తాం తు శ్మశానం చావిముక్తకమ్ 61
అవిముక్తేశ్వరం చైవ దృష్ట్వా గణపతిర్భవేత్ | అవిముక్తేశ్వరం లింగం తత్ర దృష్టైవ మానవః 62
సద్మః పాపైస్తథా రోగైః పశుపాశైర్విముచ్యతే | అవిముక్తస్య చాగ్రే తు లింగం పశ్చా న్ముఖం స్థితమ్ 63
అవిముక్తం చ తం భ##ద్రే నామ్నా వై లక్షణశ్వరమ్ | తేన వై దృష్ట మాత్రేణ జ్ఞానవాన్ జాయతే నరః 64
తస్య చోత్తరతో దేవి లింగం చైవ చతుర్మఖమ్ | చతుర్ధేశ్వరనా మేదం పాపభీ మోచనం పరమ్ 65
క్షేత్రం వారాణసీ నామ ముక్తిదం ప్రాణినాం భువి | అవిముక్తేశ్వరం తత్ర జీవన్ముక్తం ప్రకీర్తితమ్ 66
యత్ర యత్ర స్థిత స్యాపి గాణపత్యం విధీయతే | ప్రాణాంస్తు తత్ర సంత్య జ్య ముక్తి మాత్యంతికీం వ్రజేత్ 67
ఏతదభ్యంతరే క్షేత్రే ప్రధమావరణం స్మృతమ్ | తధా ద్వితీయావరణ ప్రాచ్యాం తు మణికర్ణికా 68
సప్తకోట్యస్తు లింగాని తత్ర స్థానే స్థితాని హి | తేషాం దర్శన మాత్రేణ యజ్ఞానాం ఫలమాప్నుయాత్ 69
ఏతాని సిద్దలింగాని కూపాః పూణ్యాస్తథా హ్రదాః | వాప్యో నద్యోథ కుండాని తథా తే%పి ప్రకీర్తితాః 70
ఏతేషు చైవ యః స్నానం కరిష్యతి సమాహితః | లింగాని స్పర్శయిత్వా చ సంసారే న విశేత్పునః 71
పృథివ్యాం యాని తీర్ధాని హ్యంతరిక్షే చ యాని తు | తేషాం మధ్యే తు ముఖ్యాని కీర్తితాని మయా హి తే 72
తీర్థయాత్రా వరారోహే కధితా పాపనాశినీ | యేన చైషా కృతా దృష్టా సోపివై ముక్తిభాగ్భవేత్ 73
అవిముక్తం తు సుశ్రోణి మధ్యమావరణం శుభమ్ | ఏతత్తు కంటకం నామ మృత్యుకాలేక మృతప్రదమ్ 74
ఇతి శ్రీ బృహన్నారదీయోత్తరభాగే
మోహినీ వసుసంవాదే కాశీ మాహాత్మ్యే తీర్దయాత్రా వర్ణనం
నామైకోన పంచాశత్తమో ధ్యాయః
ఒకకల్పకాలమ్ దుర్గాలోకమున నివసించి మరల భూలోకమునకు వచ్చును. నరునిగా కాని నారిగా కాని పుట్టును. సర్వభోగసమన్వితముగా ధనధాన్య యుక్తముగా పుట్టును. మహాకులములో పుట్టును. సౌభాగ్యము సౌందర్యము రూప¸°వనములు కలిగి సర్వసౌఖ్యములను పొందెదరు. విద్యుత్సంపాత చంచలమగు దుర్లభమగు మానుష్యమును పొందినవారు లిలతాదేవిని పూజించినచో మరలపుట్టరు. భూప్రధక్షిణము వలన కలుగు ఫలము వారాణిసిలో లలితాదర్శనము వలన కలగును. ప్రతిమాసమున చుతుర్ధినాడు తత్కాలముగా ఉపవసించి లలితాదేవిని పూజించి జాగరణము చేయవలయును. ఇట్లుచేసినవానికి సకలసమృద్ది కలుగును. లోకత్రయము చే పూజించబడును. సర్వసిద్దిప్రదుడగు నలకూబరకేశుని చక్కగా పూజించిన వాడు కృతకృత్యుడగును. నలకూబరకేశునికి దక్షిణ భాగమును మణికర్ణి కలదు. మణికర్ణి అగ్రభాగమును సర్వపాపప్రణాశకమగు తీర్థము కలదు. కుండ మధ్యనున్న మణికర్ణీశ్వరదేవుని దర్శించి నమస్కరించి చక్కగా పూజించిన వారు మరలగర్భవాసమును అనుభవించరు. ఇచటికి దక్షిణ భాగమును గంగయందు స్థాపించబడియున్న పరుడగు గంగేశ్వరుని చక్కగా పూజించి సురలోకమును పొందును. వారాణసిలో మరియొక ఆయతనము కలదు. ఇచట దేవదేవుని రుచిర స్థానము కలదు. అంతరిక్షముననుండు రాక్షసులు శివలింగమును తీసుకొని వేగముగ వెళ్ళుచుండగా ఈ ప్రదేశమును చేరగానే దేవదేవుడు ఆలోచించెను. నాకు అవిముక్తక్షేత్రములతో వియోగము సంభవించరాదని తలచెను. ఈ విషయమును దేవదేవుడు విచారించుచుండగా అచట కుక్కుట శబ్దము వినవచ్చెను. ఆ శబ్దమునున వినిన రాక్షసులు భీతిచెందిన వారై ప్రభాతసమయమున అచటనే లింగమును విడిచి పారిపోయిరి. రాక్షసులు వెళ్ళిపోగా శివలింగమచటనేయుండెను. అతిరుచిరముస్వచ్ఛము అగుస్థానమున దేవదేవుడు స్వయం ప్రభువు అవిముక్తక్షేత్రమధ్యమున ఉండుటచే ఆ క్షేత్రము అవిముక్తతరమాయెను. అపుడు దేవదేవునికి దేవతలు 'అవిముక్త' అని పుణ్యాక్షరాఢ్యమగు నామమునుపెట్టిరి. ఈ నామము స్థావర జంగమములకు మోక్షప్రదము. ఇచట మరణించిన వారికి వెంటనే ముక్తిని ప్రసాదించును.ఇచటనే కుక్కుటములు కూడా ఉండును. ఇప్పటికి ఇచట క్కుకుటములు పుణ్యాత్ములచే పూజించబడుచుండును. కోరి అవిముక్తమును ఆశ్రయించినవానికి కల్పకోటి శతములలోకూడా పునర్జన్మ కలుగదు. ఇచట దేవదేవుని దక్షిణభాగమున నున్న వాపీ జలమును పానము చేసిన వారికి కూడా పునరావృత్తియుండదు. ఇచట పురుషుని హృదయమున నున్న లింగత్రయ జలమును పానము చేసిన వారు కృతార్దుడగుదురు. వారికి తారక జ్ఞానము కలుగును. వాపీ జలమున స్నానమాడి దండకేశ్వరుని దర్శించి తరువాత అవిముక్తదర్శనమును చేసుకొనిన వానికి క్షణకాలమునకైవల్యము లభించును. ఇచట బ్రహ్మణుడు ఒకమారు సంధ్యోపాసన గావించినచో అరువది అయిదు సంవత్పరములు సంధ్యోపాసన చేసినవాడగును. వారాణసీ పురమును, అవిముక్తక స్మశానమును, అవిముక్తేశ్వరుని దర్శించినవాడు గణపతి యగును. ఇచట అవిముక్తేశ్వరలింగమును దర్శించిన మానవుడు వెంటనే పాపములచే, రోగములచే, పశుపాపముల చే విముక్తుడగును. అవిముక్తక్షేత్రాగ్రభాగమున పశ్చాన్ముఖముగా నున్నలింగమును, ఆ అవిముక్తమును, లక్షణశ్వరుని దర్శించినంతనే నరుడు జ్ఞానియగును. ఇచటికి ఉత్తరమున చతుర్ముఖలింగము కలదు. ఈ లింగమునకు చతురర్దేశ్వరుడని పేరు. ఈ నామము పాపమును భయమును తొలగించును. వారాణసీ యనుక్షేత్రము భూలోకమున ప్రాణులకు ముక్తిని ప్రసాదించునది. ఇక ఇచటి అవిముక్తేశ్వరము జీవన్ముకక్తముగా పేరు గాంచినది. ఎచటనున్న వాడైనను దర్శనమాత్రమున గణపతియగును. ఇచట ప్రాణములను విడిచిన వారు ఆత్యంతికముక్తిని పొందెదరు. ఈ అభ్యంతర క్షేత్రమున ప్రధమావరణము కలదు. ద్వితీయావరణమున ప్రాగ్దిశలో మణికర్ణికాతీర్ధము కలదు. ఇచట ఏడు కొట్లలింగములు కలవు. ఈలింగములను దర్శించినంతనే యజ్ఞఫలమును పొందును. ఇవి సిద్ద లింగములు. ఇట్లే పవిత్రములగు కూపములు, హ్రదములు, వాపులు, నదులు, కుండములు, చాలా కలవు. వీటియందు సావధానుడై స్నానమాచరించువాడు, లింగములను స్పృశించువాడు మరల సంసారమున ప్రవేశించ జాలడు. పృథివియందు అంతరిక్షమునందు గల అన్ని తీర్దములలో కొన్ని ముఖ్యతీర్దములను నీకు తెలిపితిని. పాపనాశినియగు తీర్ధయాత్రనుచెప్పితిని. ఈ తీర్ధయాత్రను చేసినవారు చూచినవారు ముక్తిని పొందెదరు. అవిముక్త తీర్ధము మధ్యమావరణమనబడును. దీనినే కంటకమందురు. ఇదియే మృత్యుకాలమున అమృతకాలమున అమృతప్రదమని ప్రసిద్ది గాంచినిది.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున
మోహినీ వసుసంవాదమున కాశీమాహాత్మ్యమున తీర్ధ యాత్రావర్ణనము అను నలువదితొమ్మిదవ అధ్యాయము.
పంచాశత్తమో`òధ్యాయః