Sri Naradapuranam-3 Chapters Last Page
యాబదియవ అధ్యాయము-కాశీమాహాత్మ్యమ్ అతః పరం ప్రవక్ష్యామి యాత్రాకాలం తు మోహిని! | దేవాద్యైస్తు కృతా యా తు యధాయోగ్యఫలాప్తిదా 1
వసురువాచ:-
చైత్రమాసే తు దివిజై ర్యాత్రేయం విహితా పురా | తత్రసై#్తః కామకుండే తు స్నానపూజన తత్పరైః 2
జ్యేష్ఠమాసే తు వై సిద్ధైః కృతా యాత్రా శుభాననే | రుద్రావాసస్య కుండే తు స్నానపూజా పరాయణౖః 3
ఆషాఢే చాపి గంధర్వై ర్యాత్రేయం విహితా శుభైః | ప్రియా దేవ్యాస్తు కుండే వై స్నానపూజన కారకైః 4
విద్యాధరైస్తు యాత్రేయం శ్రావణ మాసి మోహిని | లక్ష్మీకుండ స్థితై శ్చీర్ణా స్నానార్చన పరాయణౖః 5
మార్కండేయ హ్రదసై#్తస్తు స్నానపూజర తత్పరైః | కృతా యక్షైస్తు యాత్రేస్తు మిషమాసే వరాననే 6
పన్నగైశ్చైవ యాత్రేయం మార్గమాసే తు మోహిని | కోటి తీర్ధ స్థితై శ్చీర్ణా స్నానపూజావిధాయకైః 7
కపాలమోచనసై#్తస్తు గుహ్యకైః శుభలోచనే | పౌషే మాసి కృతా యాత్రా స్నానసంధ్యర్చనాన్వితే 8
కాలేశ్వరాఖ్యకుండ స్థైఃఫాల్గునే మాసి శోభ##నే | పిశాచైస్తు కృతా యాత్రా స్నానపూజాది తత్పరైః 9
ఫాల్గునే తు శుభే మాసే సితే యా తు చతుర్దశీ | తేన సా ప్రోచ్యతే దేవి పిశాచీ నామ విశ్రుతా 10
అధ తే సంప్రవక్ష్యామి యాత్రాకృత్యం శుభాననే | కృతేన యేన మనుజో యాత్రా ఫలమావాప్నుయాత్ 11
ఉదకుంభాస్తు దాతవ్యా మిష్టాన్నేన సమన్వితాః | ఫలపుష్పసమోపేతా వసై#్త్రః సంఛాదితాః శుభాః 12
చైత్రస్య శుక్ళపక్షే తు తృతీయా యా మహాఫలా | తత్ర గేరీ తు ద్రష్ఠవ్యా భక్తి భావేన మానవైః 13
స్నానం కృత్వా తు గంతవ్యం గో ప్రేక్షే తు వరాననే | స్వర్ధ్వారి కాలికా దేవీ అర్చితవ్యా ప్రయత్నతః 14
అన్యాచాపి పనరా ప్రోక్తా సంవర్తా లలితా శుభా | ద్రష్టవ్యా చైవ సా భక్త్యా సర్వకామఫలప్రదా 15
తతస్తు భోజయేద్విప్రాన్ శివభక్తాంఞ్ఛచివ్రతాన్ | వాసోభిర్ధదక్షిణాభిశ్చ పుష్కలాభిర్యథార్హతః 16
పంచగౌరీః సముద్దిశ్య రసాన్ గంధాన్ద్విజే`òర్పయేత్ | ఉత్తమం శ్రేయ ఆప్నోతి సౌభాగ్యేన సమన్వితః 17
వినాయకాన్ప్రవక్ష్యామి క్షేత్రావాసే తు విఘ్నదాన్ | యాన్సంపూజ్య నరో దేవి నిర్విఘ్నేన ఫలం లభేత్ 18
ఢుంఢిం తు ప్రథమం దృష్ట్వా తథా కిల వినాయకమ్ | దేవ్యా వినాయకం చైవ గోప్రేక్షం హస్తి హస్తినమ్ 19
వినాయకం తథైవాన్యం సిందూర్యం నామ విశ్రుతమ్ | చతుర్ద్యాం దేవి ద్రష్టవ్యా ఏవం చైవ వినాయకాః 20
లడ్డుకాశ్చ ప్రదాతవ్యా ఏతానుద్దిశ్య వాడవే | ఏతేన చైవ కృత్యేన సిద్దిమాన్ జాయతే నరః 21
అతః పరం ప్రవక్ష్యామి చండికాః క్షేత్రరక్షికాః | రక్షిణ రక్షతే దుర్గా నైఋతే చాంతరేశ్వరీ 22
అంగారేశీ పశ్చిమే తు వాయవ్యే భద్రకాళికా | ఉత్తరే భీమచండా చ మహామత్తా తథైశ##కే 23
ఊర్ధ్వకేశీ సమాయుక్తా శాంకరీ పూర్వతః కృతా | అధః కేశీ తథౄగ్నేయ్యాం చిత్రఘంటా చ మధ్యతః 24
ఏతాస్తు చండికా దేవీ ర్యో వై పశ్యతి మానవః | తస్య తుష్టాశ్చ తాః సర్వాః క్షేత్రం రక్షంతి తత్పరాః 25
విఘ్నం కుర్వంతి సతతం పాపినాం దేవి సర్వదా | తస్మాద్దేవ్యః సదా పూజ్యా రక్షార్దే సవినాయకాః 26
యదీచ్చేత్పరమాం సిద్దిం సంతతిం విభవం సుఖమ్ | తతో భక్త్వా గంధపుష్ప నైవేద్యా దీన్సమర్పయేత్ 27
అన్యచ్చ తే ప్రవక్ష్యామి తస్మిన్ధ్సానే సులోచనే | తిస్రో నద్యస్తు తత్ర స్థా వహంతి చ శుభోదకాః 28
తాసాం దర్శన మాత్రేణ బ్రాహ్మహత్యా నివర్తతే | ఏకా తు తత్ర త్రిస్నాతా తథా మందాకినీ పరా 29
మత్స్యోదరీ తృతీయాచ ఏతాస్తిస్రస్తుపుణ్యదాః | మందాకినీ తత్ర పుణ్యామధ్యమేశ్వర సంస్థితా 30
సంస్థితాత్రిస్రోతికా చ అవిముక్తేతి పుణ్యదా | మత్స్యో దరీ తు ఓం కారే పుణ్యదా సర్వదైవహి 31
తస్మిన్నానే యదా గంగా ఆగమిష్యతి మోహినీ | తదా పుణ్యతమః కాలో దేవానామపి దుర్లభః 32
వరణాసిక్త సలిలే జాహ్నవీ జలవిప్లుతే | తత్ర నాదేశ్వరే పుణ్య స్నాతః కి మనుశోచితి 33
మత్య్సోదరీసమాయుక్తా యదా గంగా బభూవా హ | శివస్స్నానా త్కపాలం ముక్తవా ఞ్చుంభే 34
కపాల మోచనం నామ తత్త్రైవ సుమహత్సరః | పాపనం సర్వసత్త్వానాం పుణ్యదం పరికీర్తితమ్ 35
వసువు పలికెను:- ఇక ఇపుడు దేవాదులచే చేయబడిన యథాయోగ్యఫలప్రదమగు యాత్రాకాలమును చెప్పెదను. పూర్వము చైత్రమాసమున దేవతలచే ఈ యాత్ర విధించబడినది. అచట ననుండి కామకుండమున స్నానపూజాదులు నిర్వర్తించిరి. జ్యేష్ఠమాసమున సిద్దులు ఈ యాత్రను చేసిరి. వీరు రుద్రావాసమున కుండమున స్నానపూజాదులు నిర్వర్తించిరి. ఆషాఢమున ప్రియాదేవీకుండమున స్నానపూజాదులు చేయు గంధర్వులు ఈ యాత్రనాచరించిరి. శ్రావణమాసము లక్ష్మీకుండమున నుండి స్నానార్చన పరాయణులకు విద్యాధరులు పన్నగులు ఈ యాత్రను చేసిరి.
బాద్ర పదమాసమున మార్కండేయ హ్రదమున నుండి స్నానపూజతత్పరులగు యక్షులచే ఈ యాత్ర నాచరించబడినది. మార్గశిరమాసమున కోటి తీర్థముననుండి స్నానపూజా విధాయకులగు పన్నగులు ఈ యాత్ర నాచరించిరి. పుష్యమాసమున కపాలమోచనమున నున్న స్నానధ్యానార్చనలు గావించు గుహ్యకులు ఈ యాత్రను ఆచరించిరి. ఫాల్గున మాసమున కాలేశ్వరకుండస్థులు స్నానపూజాది తత్పరులగు పిశాచులు ఈ యాత్రను నిర్వహించిరి. శుభప్రదమగు ఫాల్గునమాసమున శుధ్ధ చతుర్ధశి పిశాచి యను పేర ఇందువలననే ప్రసిద్దిగాంచినది. ఇక ఇపుడు నీకు యాత్రాకృత్యమునుచెప్పెదను. ఈ కృత్యమును నిర్వర్తించినవాడు యాత్రాఫలమునుపొందును. మిష్ఠాన్నముతో కూడిన ఫలపుష్పసమన్వితములగు, వస్త్రసంఛాదితములగు ఉదకుంభములను దానము చేయవలయును. చైత్రశుక్లతృతీయ మహాఫలప్రద. ఈనాడు మానవులు భక్తిభావముతో గౌరీదేవిని దర్శించవలయును. స్నానమాచరించి గోప్రేక్షమునకు వెళ్ల వలయును. స్వర్ద్వారమున కాలికాదేవిని పూజించవలయును. ఇచట మరియొకదేవి పరాయని సంవర్తలలితాదేవి చెప్పబడినది. ఈ దేవి సర్వకామ ఫలప్రద గావున భక్తిచే దర్శించవలయును. తరువాత శివభక్తులు శివవ్రత పరులగు బ్రాహ్మణులను భుజింనచేయవలయును. సమృద్దిగా వస్త్రములను దక్షిణల నర్పించవలయును పంచగిరులనుద్దేశించి రసములను గంధములను బ్రాహ్మణులకు అర్పించవలయును. ఇట్లుచేసిన ఉత్తమ శ్రేయస్సును సౌభాగ్యమును పొందును. ఆయాక్షేత్రా వాసములందు విఘ్నప్రదులగు వినాయకులను ఇపుడు చెప్పెదను. వీరిని పూజించి నరుడు నిర్విఘ్నముగా ఫలమును పొందును. మొదట ఢుండిని దర్శించవలయును. తరువాత వానాయకుని దేవి వినాయకుని, గోప్రేక్షుని, హస్తి హస్తిని మరియొక వినాయకుని సిందూర్యనామకుని చతుర్ధియందు చూడవలయును వీరు వినాయకులు వీరికి మోదకములనర్పించవలయును. ఈ కృత్యముచే సిద్దిని పొంది జయమును పొందును. ఇక ఇపుడు క్షేత్రరక్షిణిలగుచండికలను చెప్పెదను. దక్షిణమున దుర్గ, నైఋతమున అంతరేశ్వరి, పశ్చిమమున అంగారేశ్వరి, వాయవ్యమున భద్రకాళికా, ఉత్తరమున భీమచండ, ఈవాన్యమున మహామత్తా, పూర్వమున ఊర్ధ్వకేశసమితయగు శాంకరి, ఆగ్నేయమున అధఃకేశీ, మధ్యన చిత్రఘంట; ఈ చండికలను దర్శించువానికి ప్రీతిచెందిరవారై క్షేత్రమును రక్షించుచుందురు. పాపులకు ఈ చండికలు ఎల్లపుడు విఘ్నములను కలిగించుచుందురు. కావున ఉత్తమసిద్దిని, సంతానమును, విభవమును, సుఖమును కోరువారు వినాయకులతో కూడియున్న ఈక్షేత్రపాలికలనుఎల్లపుడూ పూజించవలయును. భక్తిచే గంధపుష్పనైవేద్యాదులను సమర్పించవలయును. ఇచటనే మరియొక విశేషమును గూర్చి నీకు చెప్నెదను. ఇచటనే శుభజలములుగలమూడు నదులు ప్రవహించుచుండు%ు. ఈ నదులు దర్శించినంతనే బ్రహ్మహత్య తొలగి పోవును. వీటిలో ఒకటి త్రిస్రోతా, రెండవది మందాకిని, మూడవది మత్స్యోదరి. ఈ మూడు పుణ్యప్రదములు. వీటిలో మధ్యమేశ్వరమున నున్న మందాకిని మహాపుణ్యకరము. త్రిస్రోతిక యున్నందున అవిముక్త పుణ్యప్రద. ఓంకారమున మత్స్యోదరి పుణ్యప్రద ఈస్థానమున గంగవచ్చుకాలము అత్యంత పుణ్యతమకాలము. ఈకాలము దేవతలకు కూడా దుర్లభము. వరణాసిక్త సకాలమున, జాహ్నవీజలవిప్లుతమున పుణ్యతమమగు నాగేశ్వరమున స్నానము చేయువాడు దేనిని ఆలోచించును? గంగమత్స్యోదరీ సమాయుక్త మగునపుడు శివుడు స్నానము చేయగా కపాలము విడిచెను. కావున ఇచట కపాల మోచనమను గొప్ప సరస్సు సర్వప్రాణులను పావనము చేయునది, పరమ పుణ్యప్రదముగా ప్రసిద్ధి గాంచినది.
మత్స్యోదరీ జలే గంగా ఓంకారేశ్వరసన్నిధౌ | తదా తస్మి ఞ్జలే స్నాత్వా దృష్ఠ్వాచోంకార మీశ్వరమ్ 36
శోకం జరాం మృత్యుబన్ధం తతో న స్పృశ్యతే నరః | తస్మిన్న్సత శ్శివస్సాక్షా దోంకారేశ్వర సంజ్ఞితః 37
ఏ తద్రహస్య మాఖ్యాతం తవ స్నేహాద్వరాననే | అకారం చాప్యుకారం చ మకారం చ ప్రకీర్తితమ్ 38
ఆకారస్త త్ర విజ్ఞేయో విష్ణులోకగతిప్రదః | తస్య దక్షిణ పార్శ్వేనతు ఉకారః పరికీర్తిత. 39
తత్ర సిద్దిం పరాం ప్రాప్తో దేవాచార్యో బృహస్పతిః | ఓంకారం తత్ర విజ్ఞేయం బ్రహ్మణః పదమవ్యయమ్ 40
తయోస్తధోత్తరే భాగే మకారం విష్ణు సంజ్ఞితమ్ | తస్మింల్లింగే తు సంసిద్దః కపిలర్షిర్మహామునిః 41
వారాణపీ మ భ్యుపేత్య పంచాయతన ముత్తమమ్ | ఆరాధ్యమానో దేవేశం భీష్మస్తత్ర స్థితోభవత్ 42
తస్మిన్నానే తు సుభ##గే స్వయమావిరభూచ్చివః | గోప్రేక్షే ఇతి ఖ్యాతః సంస్తుతస్సర్వదైవతైః 43
గోప్రేక్షశ్వరమాగత్య దృష్ట్వాభ్యర్చ్య చ మానవః | న దుర్గతి మావాప్నోతి కల్మషైశ్చ విముచ్యతే 44
వవస్థా దహ్యమానాస్తు సురభ్యో దావవహ్నినా | భ్రమంతో`òస్మిన్హ్రదే`òభ్యేత్య శాంతాస్తోయం పపుస్తదా 45
కపిలాహ్రద ఇత్యేవం తతః ప్రభృతి కధ్యతే | తత్రాపి స శివస్సాక్షా ద్వృషధ్వజ ఇతి స్మృతః 46
సాన్నిధ్యం కృతవాన్దేవో దృశ్యమానస్స ఆస్థితః | కపిలాహ్రదతీర్ధే`òస్మి స్స్నాత్వా`òసంయత మానసః 47
వృషధ్వజం శివం దృష్ట్వా సర్వయజ్ఞఫలం లభేత్ | స్వర్లోకతాం మృతస్తత్ర పూజయిత్వా శివోభ##వేత్ 48
లభ##తే దేహ భేదేన గణత్వం చాతిదుర్లభమ్ | అస్మిన్నేవ ప్రదేశే తు గావో వై బ్రహ్మణా స్వయమ్ 49
శాంత్యర్ధం సర్వలోకానాం సర్వాన్పావయితుం ధ్రువమ్ | భద్ర దోహం సరస్తత్ర పుణ్యం పాపహరం శుభమ్ 50
తస్మిన్ధ్సానే నరః స్నాతః సాక్షాద్వాగీశ్వరో భ##వేత్ | శివసత్ర సమానీయ స్థాపితః పరమేష్ఠినా 51
బ్రహ్మణశ్చాపి సంగృహ్య విష్ణునా స్థాపితః పునః | హిరణ్యగర్భ ఇత్యేవం నామ్నా తత్ర స్థితః శివః 52
పునశ్చాపి తతో బ్రహ్మ స్వర్లోకేశ్వర సంజ్ఞకమ్ | స్థాపయామాస వై లింగం స్వర్లీలం కారణ క్వచిత్ 53
దృష్ట్వా వైతం తు దేవేశం శివలోకే మహీయతే | ప్రాణానిహ పునస్త్యక్త్వా న పునర్జాయతే క్వచిత్ 54
అనంతా సా గతిస్తస్య యోగినామేవ యాస్మృతా | అస్మన్నేవ మహీదేశే దైత్యో దైవత కంటకః 55
వ్యాఘ్రరూపం సమాస్థాయ నిహతో దర్పితో బలీ | వ్యాఘ్రేశ్వర ఇతి ఖ్యాతో నిత్యం తత్ర సమాస్థితః 56
న పునర్ధుర్గతిం యాతి దృషై#్వన మమరేశ్వరమ్ | హిమవత్సాపితం లింగం శైలేశ్వరమితి స్థితమ్ 57
దృష్టైతన్మనుజో భ##ద్రే న దుర్గతిమవాప్ను యాత్ | ఉత్పలో విదలశ్చైవ ¸° దైత్యౌ బ్రహ్మణో వరాత్ 58
స్త్రీతౌల్యాద్దర్పితౌ దృష్ట్వా పార్వత్యా నిహతావుభౌ | సారంగం కంతు కేనాత్ర తస్యేదం చిహ్నమాస్థితమ్ 59
దృష్ట్వైతన్మనుజో లింగం జ్యేష్ఠస్థానం సమాశ్రితమ్ | న శోచతి పునర్భద్రే సిద్దో జన్మని జన్మని 60
సమంతాత్తస్య దే వైస్తు లింగాని స్థాపితాని చ | దృష్ట్వా చ తానివై మర్త్వో దేహభేధే గణోభ##వేత్ 61
నదీ వారాణపీ చేయం పుణ్యా పాపప్రణాశినీ | క్షేత్రమేతదలంకృత్య జాహ్నవ్యా సహ సంగతా 62
స్థాపితం సంగమే చాస్మి న్ర్బహ్మణా లింగముత్తమమ్ | సంగమేశ్వరమిత్యేవ ఖ్యాతం జగతి దృశ్యతామ్ 63
సంగమే దేవ నద్యోశ్చ యః స్నాత్వా మనుజః శుభే | అర్చయేత్సంగమేశానం తస్య జన్మభయం కుతః 64
స్థాపితం లింగమేతచ్చ శుక్రేణ భృగు సూనునా | నామ్నా శుక్రేశ్వరం భ##ద్రే సర్వ సిద్ధామరార్చితమ్ 65
దృష్ట్వైతన్మానవః సద్యో ముక్తః స్యాత్సర్వకిల్బిషైః | మృతశ్చ న పునర్జన్మ సంసారే లభ##తే నరః 66
జంబుకోత్ర హతో దైత్యో మహాదేవేన మోహిని | తల్లింగం తు నరో దృష్ట్వా సర్వాన్కామానవాప్నుయాత్ 67
దేవైః శక్రపురోగైశ్చ ఏతాని స్థాపితాని హి | జానీహి పుణ్యలింగాని సర్వకామప్రదాని చ 68
ఏవమేతాని సర్వాణి శివలింగాని మోహిని | కథితాని మయా తుభ్యం క్షేత్రేస్మిన్నవిముక్తకే 69
ఇతి శ్రీ బృహాన్నార దీయ పురాణోత్తరభాగే
మోహినా వసుసంవాదే కాశీ మాహాత్మ్యం
నామ పంచాశత్తమో`òధ్యాయః
ఓంకారేశ్వరసన్నిధిలో మత్ప్యోదరీ గంగాజలమున స్నానమాచరించి ఓంకారేశ్వరుని దర్శించి శోకమును, జరను, మృత్యువును విడుచును. మత్స్యోదరీజలమున స్నానమాడిన వాడు సాక్షాత్తుగా ఓంకారేశ్వరుడను శివుడే యగును. నీ మీది వాత్సల్యముచే ఈ రహస్యమును చెప్పితిని. ఓంకారమున ఆకార ఉకార మకారములు కలవు. వీటిలో ఆకారము విష్ణులోకగతిప్రదము. ఆకారమునకు దక్షిణ భాగమున ఉకారము చెప్పబడినది. ఇచటనే దేవాచార్యుడగు బృహస్పతి ఉత్తమసిద్దిని పొందెను. ఇచట ఓంకారము అవ్యయమగు బ్రహ్మపదముగా తెలియ వలయును. ఆకార ఉకారములకు ఉత్తరభాగమున విష్ణుసంజ్ఞితమగు మకారము కలదు. ఈ లింగమునే మహర్షియగు కపిలముని సిద్ది పొందెను. భీష్ముడు వారాణసికి చేరి ఉత్తమమగు పంచాయతనమును దేవేశుని ఆరాధించుచు అచటనే యుండెను. ఈ స్థానమున శివుడు స్వయముగా ఆవిర్భవించెను సర్వదువతలచే స్తుతించబడుచు గోప్రేక్షకుడని ప్రసిద్దిని గాంచెను. గోప్రేక్షేశ్వరుని చేరి దర్శించి పూజించిన మానవుడు దుర్గతిని పొంద జాలడు. కల్మషములనుండి విముక్తుడగును. అరణ్యములోనుండు సురభులు దావాగ్నిచే దహించబడుచు తిరుగుచు ఈ హ్రదమును చేరి శాంతిని పొంది జలపానమును చేసినవి. అప్పటినుండి ఈ హ్రదమును కపిలా హ్రదమందురు. ఇచటనున్న శివుని వృషధ్వజుడందురు. ఇచట సాక్షాత్తు శివుడు సర్వకాలములందు సన్నిహితుడై దృశ్యమానుడై యుండెను. ఇంద్రియనిగ్రహముతో ఈ కపిలాహ్రదమున స్నానమాచరించి వృషధ్వజుడగు శివుని దర్శించి సర్వయజ్ఞఫలమును పొందును. ఇచట శివుని పూజించి మరణించినవాడు స్వర్గమును పొందును. దేహ భేదముచే అతిదుర్లభమగు గణత్వమును పొందును ఈ ప్రదేశముననే పూర్వము బ్రహ్మ స్వయముగా గోవులను సర్వలోక శాంతికొరకు అందరిని పవిత్రము చేయుటకు భద్రదోహమను సరస్సును ఏర్పరిచెను. ఈ సరస్సు పరమపావనము. సర్వపాపహరము. ఇచట స్ననమాడినవాడు సాక్షాత్తు వాక్పతియగును. బ్రహ్మ ఇచట స్వయంగా శివుని తీసుకొని వచ్చి స్థాపించెను. విష్ణువు బ్రహ్మ అంశమును సంగ్రహించి ఇచట స్థాపించెను కావున ఇచట శివుడు హిరణ్యగర్భనామముతో నుండెను. మరల ఇచట బ్రహ్మ స్వర్లోకేశ్వరమను పేరుగల లింగమును కారణాంతరమున స్థాపించెను ఈలింగదర్శనమున శివలోకమున విరాజిల్లును. ఇచట మృతి చెందిన వాడు మరల పుట్టుడు. యోగులకు లభించు అనంతగతి ఆతనికి లభించును ఈ ప్రదేశమునే ఒక రాక్షసుడు దేవకంటకుడు వ్యాఘ్రేశ్వరుని దర్శించిన వారు దుర్గతిని పొంద జాలరు. హిమవంతుని చే స్థాపంచబడిన శైలేశ్వరలింగమిచట కలదు. ఈ లింగమును దర్శించిన నరుడు దుర్గతిని పొందడు. ఉత్పలుడు విరలుడను రాక్షసులిద్దరు బ్రహ్మవరగర్వముతో స్త్రీ లౌల్యమును కనబరచగా పార్వతీదేవి సంహరించెను. ఈ కథను చిహ్నముగా లింగము స్థాపించబడినది. జ్యేష్ఠ స్థానము నాశ్రయించిన ఈ లింగమును దర్శించిన మనుజుడు ప్రతి జన్మలో సిద్ధుడై దుఃఖించడు. ఇచట అంతట దేవతలు లింగములను స్థాపించిరి. ఈలింగమును దర్శించినవారు దేహభేదమున గణత్వమును పొందెదరు. ఇచట వారాణసీ నదీ పవిత్రము పాపనాశిని. ఈ క్షేత్రమున చేరి గంగతో కలిసినది. ఈ వారనాసి గంగా సంగమమున. బ్రహ్మలింగమును స్థాపించెను. ఈ లింగం సంగమేశ్వరమని ప్రసిద్ధి గాంచినది. ఈ దేవనదీ సంగమమున స్నానమాచరించి సంగమేశ్వరుని పూజించినవాడు జన్మభయమును పొందడు. ఈ యుగమును భృగుపుత్రడగు శుక్రుడు స్థాపించెను. ఈ లింగమునకు శుక్రేశ్వరుడని పేరు. సర్వసిద్ధామమరార్చితమీ లింగమును చూచి సర్వకిల్బిషముక్తుడై సద్యోమోక్షమును పొందును. మరణించినచో మరల జన్మించడు. ఇచట జంబుకాసురుని శివుడు చంపెను. ఈ లింగమును చూచిన వారు సర్వకామనలను పొందును. ఇంద్రాదిదేవతలు ఈలింగములను స్థాపించిరి. ఈ లింగములు పవిత్రములు సర్వకామప్రదములు. ఇట్లు ఈ అవిముక్త క్షేత్రమున నున్న అన్ని లింగములను గూర్చి నీకు విస్తరముగా చెప్పితిని.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున
మోహినీ వసుసంవాదమున కాశీ మాహాత్మ్యమను
యాబది యవ అధ్యాయము
కాశీ మహాత్మ్యమ్