Sri Naradapuranam-3    Chapters    Last Page

వసురువాచ:-

అధాన్యత్తే ప్రవక్ష్యామి గంగామాహాత్మ్యముత్తమమ్‌ | వారాణసి స్థితం భ##ద్రే భుక్తి ముక్తి ఫలప్రదమ్‌ 1

అవిముక్తే కృతం యత్తు తహాక్షయతాం వ్రజేత్‌ | అవిముక్తే గతః కశ్చిన్నరకం నైతి కిల్చిషీ 2

అవిముక్తకృతం యత్తు పాపం వజ్రం భ##వేచ్చుభే | త్రైలోక్యే యాని తీర్దాని మోక్షదాని చ కృత్య్నశః 3

సేవంతే సతతం గంగాం కాశ్యాముత్తర వాహినీమ్‌ | దశాశ్వ మోథే యః స్నాత్వా దృష్ఠ్వా విశ్వేశ్వరం శివమ్‌ 4

సద్యో నిష్పాతకో భూత్వా ముచ్యతే భవయంధనాత్‌ | గంగా హి సర్వతః పుణ్యా బ్రహ్మహత్యాపహారిణీ 5

వారాణస్యా విశేషేణ యత్ర చోత్తరవాహినీ | వరణా యాస్తధాస్యాశ్చ జాహ్నవ్యాః సంగమే నరః 6

స్నానమాత్రేణ సర్వేభ్యః పాతకేభ్యః ప్రముచ్యతే | కాశ్యాముత్తర వాహిన్యాం గంగాయాం కార్తికే తధా 7

స్నాత్వా మాఘే చ ముచ్యంతే మహాపాపాది పాతకైః | సర్వలోకేషు తీర్ధాని యాన్యాఖ్యాతాని తానిచ 8

సర్వాణ్యతాని సుభ##గే కాశ్యామాయాంతి జాహ్నవీమ్‌ | నిత్యం పర్వసు సర్వేషు పుణ్యౖశ్చాయతనైః సమం 9

ఉత్తరాభిముఖీం గంగాం కాశ్యామాయాంతి చాన్వహం | మహాపాతక దోషాది దుష్టానాం స్పర్శనోద్భవమ్‌ 10

వ్యపోహితుం స్వపాపం చ జంతు పాపవిముక్తయే | జన్మాంతర శ##తేనాపి సత్కర్మ నిరతస్య చ 11

అన్యత్ర సుధియా భ##ద్రే మోక్షో లభ్యేత వా నవా | ఏకేన జన్మనా త్వత్ర గంగాయాం మరణన చ 12

మోక్షస్తు లభ్యతే కాశ్యాం నరేణావలితాత్మనా | ఖ్యాతో ధర్మనదో నామ హ్రదస్తత్రైవ సుందరి 13

ధర్మ ఏవ స్వరూపేణ మహాపాతక నాశనః | ధూలీ చ ధూతపాపా సా సర్వతీర్థమయీ శుభా 14

హరేన్మహా పాపసంఘా న్కూలజానీవ పాదపాన్‌ | కిరణా ధూతపాపాచ పుణ్యతోయా సరస్వతీ 15

గంగా చ యమునా చైవ పంచ నద్యః ప్రతీర్తితాః | అతః పంచనదం నామ తీర్థం తైల్రోక్యవిశ్రుతమ్‌ 16

తత్రాప్లుతో న గృహ్ణీయా ద్దేహితాం పాంచ భౌతికీమ్‌ | అస్మినృంచ నదీనాం తు సంగమే ఫ°ఘ భేదనే 17

స్నానమాత్రాన్నరో యాతి భిత్యా బ్రహ్మండమండపమ్‌ | ప్రయాగే మాఘమాసే సమ్యక్‌ స్నానస్య యత్ఫలమ్‌ 18

తత్ఫలం స్యాద్దినైకేన కాశ్యాం పంచనదే ధ్రువమ్‌ | స్నాత్వా పంచనదే తీర్థే కృత్వా చ పితృతర్పణమ్‌ 19

విష్ణుం మాధవమభ్యర్చ్య న భూయో జన్మభాగ్భవేత్‌ | యావత్పంఖ్యాస్తిలా దత్తాః పితృభ్యో జలతర్పణ 20

పుణ్య పంచనదే తీర్థే తృప్తిః స్యాత్తావదాబ్దికీ | శ్రద్దయా యైః కృతం శ్రాద్దం తీర్థే పంచనదే శుభే 21

తేషాం పితామహా ముక్తా నానాయోనిగతా అపి | యమలోకే పితృగణౖ ర్గాధేయం పరిగీయతే 22

మహిమానం పంచనదం దృష్ట్వా శ్రాధ్దవిధానతః | అస్మాకమపి వంశో త్ర కశ్చిచ్చ్రాద్దం కరిష్యతి 23

కాశ్యాం పంచనదం ప్రాపు. యేన ముచ్యామహే వయమ్‌ | తత్ర పంచనదే తీర్థే యత్కించిద్దీయతే వసు 24

కల్పక్షయేపి న భ##వే త్తస్య పుణ్యస్య సంక్షయః | వంధ్యాపి వర్ష పర్యంతం స్నాత్వా పంచనదే హ్రదే 25

సమర్చ్య మంగలాం గౌరీం పుత్రం జనయతి ధ్రువమ్‌ | జలైః పాంచనదైః పుణ్యౖః వాససా పరిశోధితైః 26

మహాఫలమావాప్నోతి స్నాపయిత్వేహ దిక్‌ శ్రుతామ్‌ | పంచామృతానాం కలశై రష్టోత్తర శతోన్మితైః 27

తులితోధికతాం ప్రాప్తో బిందుః పాంచనదస్తు సః | పంచకూర్చేన పీతేన యాత్ర శుద్దిరుదాహృతా 28

సా శుద్దిః శ్రద్దయాప్రాశ్య బిందుం పాంచనదాంభసా | భ##వేరథ హ్రదస్నానా ద్రాజసూయాశ్వమేథయోః 29

యత్ఫలం తచ్ఛతగుణం స్యృతం పంచనాదాంబునా | రాజసూయశ్వమేథౌ చ భ##వేతాం స్వర్గ సాధనే 30

ఆ బ్రహ్మ పట్టికాద్వాంద్వా నుక్త్మిః పంచనదాంబుభిః | సకవర్గనద్యాభిషేకోపి న తథా సంమతః సతామ్‌ 31

అభిషేకః పాంచనదో యథా నాన్యో వరప్రదః | శతం సమాస్తపస్తప్త్వా కృతే యత్ప్రాప్యతే ఫలమ్‌ 32

తత్కార్తికే పంచనదే సకృ త్స్నానేన లభ్యతే | ఇష్టాపూర్తేషు ధర్మేషు యావజ్జన్మకృతేషు యత్‌ 33

అన్యత్ర స్యాత్ఫలం తస్యా ధికం పంచనదాంబుభిః | న ధూత పాప సదృశం తీర్థం క్వాపి మహీతలే 34

యదేక స్నానతో పశ్యే దఘం జన్మత్రయార్జితమ్‌ | కృతే ధర్మనదం నామ త్రేతాయాం ధూతపాతకమ్‌ 35

ద్వాపరే బిందుతీర్థంచ కలౌ పంచనదం స్మృతమ్‌ | బిందుతీర్థే నరో దత్వా కాంచనం కృషలోన్మితమ్‌ 36

నదరిద్రో భ##వేత్వ్కాపి న సుఖేన వియుజ్యతే | గోభూతిల హిరణ్యాశ్వ వాసోన్నస్థాన భూషణమ్‌ 37

యత్కించిద్బిందు తీర్థేత్ర దత్వాక్షయ మవాప్నుయాత్‌ | ఏకామప్యాహుతిం కృత్వా సమిద్దేగ్నౌ విధానతః 38

పుణ్యధర్మనదీతీర్థే కోటిహోమఫలం లభేత్‌ | న పంచనద తీర్థస్య మహిమానమనంతకమ్‌ 39

కోపి వర్ణయితుం శక్త శ్చతుర్వర్గ శుభౌకసః | ఇతి తే కథితం భ##ద్రే కాశీమహాత్మ్య ముత్తమమ్‌ 40

సుఖదం మోక్షదం నౄణాం మహా పాతక నాశనమ్‌ | బ్రహ్మఘ్నోమథుపః స్వర్ణ స్తేయీచ గురుతల్పగః 41

మహాపాతక యుక్తోపి సంయుక్తో ప్యుప పాతకైః | అవిముక్తస్య మహాత్మ్య శ్రవణాచ్ఛుద్దిమాప్నుయాత్‌ 42

బ్రాహ్మాణో వేదవిద్వాన్‌ స్యాత్కత్రియో విజయి రణ | వైశ్యో ధనపతిః శూద్రో విష్ణుభక్త సమాగమీ 43

శ్రవణాదస్యసుభ##గే భూయాత్పఠనతో పి వా | సర్వయజ్ఞేషు యత్పుణ్యం సర్కవతీర్థేషు యత్ఫలమ్‌ 44

తత్సర్వం సమవాప్నోతి పఠనాచ్ఛ్రవణాదపి | విద్యార్థీ లభ##తే విద్యాం ధనార్థీ లభ##తే ధనమ్‌ 45

భార్యార్థీ లభ##తే భార్యాం సుతార్థీ పుత్రమాప్నుయాత్‌ | అవిముక్తస్య మహాత్మ్యం మయా తే పరికీర్తితమ్‌ 46

విష్ణుభక్తాయ దాతవ్యం శివభక్తిరతాయ చ | జగజ్జనని భక్తాయ సూర్యహేరంబసేవినే 47

గురుశుశ్రూషవే దత్వా తీర్థస్నానఫలం లభేత్‌ | శఠాయ నిందకాయాపి గోవిప్రగురువిద్విషే|

గురు ద్రుహే సూయకాయ దత్వా మృత్యుమవాప్నుయాత్‌ 48

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే

వసు మోహినీ సంవాదే కాశీమాహాత్మ్యే

ఏక పంచాశత్తమో ధ్యాయః

వసువు పలికెను:-

ఇక ఇపుడు వారాణాసిలో నున్న గంగానదీ మహాత్మ్య మును భుక్తి ముక్తి ఫలప్రదమును చెప్పెదను. ఆవిముక్తమున చేసినదంతయు అక్షయమగును. అవిముక్తమున నివసించు వాదెవ్వడూ నరకమునకు వెళ్ళడు. ఆ విముక్తమున చేయబడు పాపము కూడా పుణ్యమగును. మూడు లోకములలో ఉన్న సకల మోక్షప్రద తీర్ఘములు కాశీలో నున్న ఉత్తరవాహినియగు గంగను సేవించు చుండను. దశాశ్వమేధ తీర్థమున స్నానమాడి విశ్వేశ్వరుడగు శివుని దర్శించినవాడు వెంటనే పాతక రహితుడై సంసార బంధమునుండి విముక్తుడగును. గంగానది అన్ని విధములుగా పవిత్రమైనది. బ్రహ్మాహత్యపాపమును హరించునది . ఇక వారణాసిలో ఉత్తర వాహిని యగు గంగ విశేషఫలప్రదము. వారణా అసి గంగానదుల సంగమమున స్నానమాత్రముననే సర్వపాతక వినిర్ముక్తుడగును. వారణసిలో ఉత్తర వాహినిలో గంగానదిలోకార్తిక మాసమున కాని మాఘమాసమున కాని స్నానమాడిన మహాపాపాది పాతకములనుండి విముక్తుడగును. సమస్త లోకములలో ప్రసిద్ది గాంచిన సకల తీర్థములు కాశీలోని గంగానదిని చేరును. ప్రతి నిత్యము అన్ని పర్వకాలములలొను అ తీర్థములు చేరును. మహాపాతక దోషాది దుష్టస్పర్శవలన కలుగు పాపములుకూడా ఇచట తొలగి పోవును. మానవులకే కాక పశుపక్ష్యాదుల పాపములు కూడా ఇచట నశించును. ఇతర క్షేత్రములలో శత జన్మలలో సుకృతము చేసిననను మోక్షములభించునో లేదో కాని ఆచట మాత్రము ఒక జన్మలోనే కాశీ గంగా మరణమున మహాపాతకికి కూడా మోక్షములు లభించును. ఇచటనే దర్మనదమను హ్రదము ప్రసిద్దమైనది. ఇచట యమధర్మరాజే స్వయముగా మహాపాతకములను నశింప చేయును. ఈనది సర్వతీర్థమయి. సర్వ పాపనాశిని. ప్రహహము తీరమున ఉన్న వృక్షములను కూల్చునట్లు ఈ హ్రదము మహాపాప సంఘములను కూల్చును. కిరణా, ధూతపా, పుణ్యతోయమగు సరస్వతి, గంగా, యమున అను పంచనదులు పరమ పావనములు. కావున ఈ అయిదు నదులుగల తీర్థము పంచనదమన ప్రసిద్ది గాంచినది . ఇచట స్నానమును చేసిన వాడు మరల పాంచ భౌతిక దేహమును ధరించడు. ఈ పంచనదతీర్థమున స్నాన మాత్రమున మానవుడు బ్రహ్మాండ మండపమును భేదించి వెళ్ళును. కాశీలోని పంచనద తీర్థమున స్నానముచే మాఘమాసమున ప్రయాగలొ స్నానమాడిన ఫలము కలుగును. పంచనద తీర్థమున స్నానమాడి పితృ తర్పణము గావించి శ్రీహరిని పూజించిన వాడు మరల జన్మనందుడు. ఇచట జల తర్పణమున పితరులకు ఎన్ని తిలలిచ్చునో అన్ని సంవత్సరములు పితపరులకు తృప్తికలుగను. పంచనద తీర్థమున శ్రద్ధచే శ్రాద్దమునా చరించినచో వారి పితామహులు బహుయోని గతులైననూ ముక్తులౌదురు. యమలోకమున పితృ గణములు ఇట్లు చెప్పుకొనుచుందురు. మా వంశములోని వాడొకడైననూ పంచనద మహిమను తెలుసుకొని శ్రాద్ద విధానముతో ఇచట శ్రాద్దమును చేయును అని. కాశీ పంచనదమును చేరి ఎవరో మమ్ములను తరింప చేయరా అని. ఈ పంచనద తీర్థమున ఏకొంచెము దానము చేసిననూ దాని పుణ్యము కల్పక్షయమున కూడాక్షీణము కాదు. గొడ్దురాలైననూ ఒక సంవత్సరము సంచనదమున స్నానమాడి మంగలగౌరిని పూజించినచో పుత్రవతి యగును. పంచనద జలమును వస్త్రముచే శోధించి స్నానము చేయించిన మహాఫలమును పొందను. ఆష్టోత్తర శతసంఖ్య కల పంచామృత కలశములచే తోలితమగు బిందు సరస్సు పాంచనదత్వమును పొందెను. ఇచట పంచకూర్చమాత్ర జలపానము చేసిన శుద్దిని పొందెదరు. పంచనదీతీర్థ బిందువును శ్రద్దగా ప్రాంశనము చేసిన శుద్దిని పొందెదరు. పంచనద జలముచే స్నానమాడిన వారికి నూరు రాజసూయాశ్వమేధ యాగముల ఫలము కలుగను. రాజసూయాశ్వమేథ యాగములు సర్వసాధకమలు మాత్రమే. బ్రహ్మలోకము వరమన్న సకల బంధవిముక్త పంచనద జలస్నానమున కలుగును. ఆకాశగంగా స్నానము కూడా ఇట్టి ఫలమునీయ జాలదు. పంచనద జలాభిషేకము అనన్య సాధ్యవరప్రదము. నూరు సంవత్సరములు తపం మాచరించన కలుగుఫలము కార్తిక మాసమున పంచనదతీర్థ స్నానమున లభించును. జీవిత కాలము ఇష్టా పూర్త ధర్మములనాచరించిన కలుగు ఫలముకంటే అధిక ఫలము పంచనద జలముచే కలుగును. ఈ భుమండలమున ధూత పాప తీర్థ సదృశమగు తీర్థము లేదు. ఈ తీర్థమున ఒక మారు స్నానము చేయుటచే జన్మత్రయార్జిత పాపము నశించును. కృతయుగమున ధర్మనదము, త్రేతాయుగమున ధూత పాతకము, ద్వాపర యుగమున బిందు తీర్థము, కలియుగమున పంచనదము పావనములు. బిందు తీర్థమునన కృషలోన్మితమగు కాంచనమును దనము చేసిన వానికి దారిద్ర్యము దుఃఖము కలుగదు. ఈ బిందు తీర్థమున గోభూతిలహిరణ్య అశ్యవాసోన్న స్థాన భూషణాదులను ఏ కొంచెము దానము చేసినచో అక్షయ ఫలము నిచ్చును. పావనమగు ధర్మనదీ తీర్థమున జ్వలితాగ్నిలో ఒక అహుతి నిచ్చిననూ కోటిహోఫలమును పొందును. పంచనద తీర్థమహిమను చతుర్వర్గప్రాణులలొ ఏ ఒక్కరూ వర్ణించజాలరు. ఇట్లు నీకు కాశీ మాహత్మ్యమును తెలిపితిని. నరులకు సుఖప్రదము, మోక్షప్రదము, మహాపాతక నాశనము. బ్రహ్మఘ్నుడు, మధుపాయి, స్వర్ణచొరుడు, గరుతల్పగతుడు, మహా పాతక యుక్తుడు ఉప పాతక యుక్తుడైనను అవిముక్త మాహాత్య్మ శ్రవణముచే శుద్దిని పొందును. ఈ మహాత్య్మామును వినుటచే బ్రాహ్మణుడు వేదపారగుడగును. క్షత్రియుడు యుద్దమున జయించును వైశ్యుడు ధనపతియగును. శ్రూద్రుడు విష్ణుభక్త సంగతిని పొందును. ఈమహత్మ్యమును చదువుటచే వినుటచే సర్వయజ్ఞపుణ్యము, సర్వతీర్థ ఫలము పొందును. విద్యార్థి విద్యను, ధనార్థి ధనమును,. భార్యార్థి భార్యను, పుత్రార్థి పుత్రులను పొందును. ఇట్లు నీకు నేను అవిముక్త మాహాత్య్మమును చెప్పితిని. ఈ మాహాత్మ్యమును విష్ణు భక్తునకు కాని, శివభక్తిరతునకు గాని జగజ్జననీ భక్తునకు కాని సూర్యభక్తునకు వినాయక భక్తునకు, గురువును భక్తిచే సేవించు వానికి మాత్రమే చెప్పవలయును. ఇట్లు ఉపదేశించిన అవిముక్త తీర్థ స్నానఫలము లభించును. ఈ మహాత్య్మమును శఠునకు, నిందకునకు, గోవిప్ర గురువులను ద్వేషించు వారికి, గురు ద్రోహమును చేయు వారికి, అసూయకల వారికి ఉపదేశించినచో మృత్యువును పొందును.

ఇది శ్రీ బృహన్నరదీయ మహాపురాణమున

ఉత్తరభాగమున మోహినీ వసు సంవాదమున

కాశీమహాత్మ్యమున యాబది యొకటవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page