Sri Naradapuranam-3 Chapters Last Page
త్రిపంచాశత్తమోsధ్యాయ : యాభయి మూడవ అధ్యాయము
పురుషోత్తమమాహాత్మ్యమ్
మోహిన్యువాచ :-
బ్రుహి మే ముని శార్దుల యత్ప్సచ్చామి పురాతను%్ l యథా తాః ప్రతిమాః పూర్వ మింద్రద్యుమ్నేన నిర్మితాః 1
కేనచైవ ప్రకారేణ తుష్టస్తసై#్మ స మాధవః l తత్సర్వం వద మే విప్ర శ్రోతుం కౌతూహలం మమ 2
మోహిని పలికెను :-
ఓ మునిశ్రేష్ఠా ! పురాతన విషయమును నేనడిగిన దానిని తెలుపుము. పూర్వము ఇంద్రద్యుమ్నుడు అ ప్రతిమలను ఎట్లు నిర్మించెను. శ్రీహరి ఎట్లు సంతోషించెను. దానినంతటిని వివరించుము. నాకు వినవలయునని చాలా కుతూహలమున్నది.
వసురువాచ:-
శృణష్వ చారునయనే పురాణం వేద సంమితమ్ l కథయామి పురావృత్తం ప్రతిమానాం చ సంభవమ్ 3
ప్రవృత్తేచ మహాయజ్ఞే ప్రాసాదే చైవ నిర్మితే l చింతా తస్య బభూవాధ ప్రతిమార్థ మహర్నిశమ్ 4
కేనోపాయేన దేవేశం సర్వలోక విభావనమ్ l సర్గస్థిత్యంత కర్తారం పశ్యామి పురుషోత్తమమ్ 5
చింతావిష్ణో నరేంద్రస్తు నైవం శేతే దివానిశమ్ l న భుంక్తే వివిధాన్బాగా న్నచ స్నానం ప్రసాధనమ్ 6
శైలజా దారుజా వాపి ధాతుజా వా మహీతలే l విష్ణోర్యోగ్యాస్తు ప్రతిమాః సర్వలక్షణ లక్షితాః 7
ఏతైరేవ త్రయాణాం తు దయితం యత్సురార్చితమ్ l స్థాపితే ప్రీతి మభ్యేతి ఇతి చింతాపరో భవత్ 8
పంచరాత్ర విధానేన సంపూజ్య పురుషోత్తమమ్ l చింతావిష్టో మహీపాలః సంస్తోతుముపచక్రమే 9
వసువు పలికెనుః- సునేత్రా! పురాణము వేద సమ్మితము అగు ప్రతిమా సంభ##వేతిహాసమును చెప్పెదను వినుము. మహాయజ్ఞము జరుగు చుండగా ప్రాసాదము నిర్మించ బడుచుండగా ఇంద్రద్నుమ్నునకు రేయి బవలు ప్రతిమల కొరకు చింతకలుగును. ఏ ఉపాయముచే సర్వలోక విభావసుడు సర్గస్థిత్యంత కర్తయగు పురుషోత్తముని దర్శించగలవను? ఇట్లు చింతా విష్ణుడగు నరేంద్రుడు రాత్రి పగలు పరుండలేదు. స్నానము లేదు. భోగాను భవము లేదు. అలంకరణ లేదు. శైలజ, ధాతుజ, దారుజ ప్రతిమలు మాత్రమే సర్వలక్షణ లక్షితములువిష్ణువునకు యోగ్యములు. ఈ మూడు విధములగు ప్రతిమలనే దేవతలర్చింతురు. వీటిని స్థాపించిన చో ప్రభవు ప్రీతి చెందునని చింతా పరుడాయెను. పాంచరాత్ర విధానముచే పురుసోత్తముని పూజించి చింతాకులుడై స్తుతించ సాగెను.
ఇంద్రద్యుమ్న ఉవాచః
వాసుదేవ నమస్తేs నమస్తే మోక్షకారణ l త్రాహి మాం సర్వలోకేశ జన్మసంసార సాగరాత్ 10
నిర్మలాంశుక సంకాశ నమస్తే పరుషోత్తమ l సంకర్ణణ నమస్తే స్తు త్రాహి మాం ధరణీధర 11
నమస్తే హేమగర్బాయ నమస్తే మకరధ్వజ l రతికాంత నమస్తుభ్యం త్రాహి మాం శంబరాంతక 12
నమస్తే మేఘ సంకాశ నమస్తే భక్తవత్సల l అనిరుద్ద నమస్తే స్తు త్రాహి మాం వరదో భవ 13
నమస్తే విబుధావాస నమస్తే విబుధప్రియ l నారాయణ నమస్తే స్తు త్రాహి మాం శరణాగతమ్ 14
నమస్తే బలినా శ్రేష్ఠ నమస్తే లాంగలాయుధ l నమస్తే విబుధశ్రేష్ఠ నమస్తే కమలోద్భవ 15
చతుర్ముఖ జగద్దాత స్త్రాహి మాం ప్రపితామహ l నమస్తే నీలమేఘాభ నమస్తే త్రిదశార్చిత 16
త్రాహి విష్ణో జగన్నాథ మగ్నం మాం భవసాగరే l ప్రళయానల సంకాశ నమస్తే దితిజాంతక 17
నరసింహ మాహావీర్య త్రాహి మాం పదీప్తలోచన l యథా రసాతలాచ్చోర్వీ జలే మగ్నోద్దృతా పూరా 18
తథా మహావరాహ త్వం త్రాహి మాం దుఃఖ సాగరాత్ l తవాజ్ఞ మూర్తయః కృష్ణ వరదాః సంస్తుతా మయా 19
త్వం చేమే బలదేవాద్యా ః పృధగ్రూపేణ సంస్థితాః l అంగాని తవ దేవేశ గరుడాద్యాస్తథా ప్రభో 20
దిక్పాలాః సాయుధాశ్చైవ వాసవాద్యాస్తధాచ్యుత l యే చాన్యే తవ దేవేశ భేదాః ప్రోక్తా మనీషీభి ః 21
తేపి సర్వే జగన్నథ ప్రసన్నాయత లోచన l యేవార్చితాః స్తుతాః సర్వే తథా యూయం నమస్కృతాః 22
ప్రయచ్చత వరం మహ్మం దర్మకామార్థమోక్షదమ్ l భేదాస్తే కీర్తతా యే తు హరే సంకర్ణణాదయః 23
తవ పూజార్థ సంబద్దా స్తతస్త్వయి సమాశ్రితాః lన భేదాస్తవ దేవేశ విద్యతే పరమార్థతః 24
వివిధం తవ రుద్రూపం యుక్తం తదుపచారతః l అద్వైతం త్వా కథం ద్వైతం వక్తుం శక్నోతి మానవః 25
ఏకస్త్వం హి హరే వ్యాపీ చిత్స్వభావో నిరంజనః lపరమం తవ యద్రూపం భావాభావ వివర్జితమ్ 26
నిర్లేపం నిర్మలం సూక్ష్మం కూటస్థమచలం ధ్రువమ్ l సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్ర వ్యవస్థితమ్ 27
తతద్దేవొ పి నజానాతి కధం జానామ్యహం ప్రభో l అపరం తవ యద్రూవపం పీతవస్త్ర చతుర్బుజమ్ 28
శంఖచక్ర గదాపాణిం ముకుటాంగద ధారిణమ్ l శ్రీవత్సవక్షోసా యుక్తం వనమాలా విభూషితమ్ 29
తదర్చయంతి విబుధా యే చాన్యే త్వత్సమాశ్రయాః lదేవ సర్వసురశ్రేష్ఠ భక్తానామభయప్రద 30
త్రాహి మాం చారు పద్మాక్ష మగ్నం విషయసాగరే l నాన్యం పశ్యామి లోకేశయస్యాహం శరణం వ్రజే 31
త్వామృతే కమాలాకాంత ప్రసీద మధుసూధన l జరావ్యాధి శ##తైర్యుక్తో నానాదుః ఖైర్నిపీడితః 32
హర్షశోకాన్వితో మూఢః కర్మపాశైః సుయంత్రితః l పతితోహం మహారౌద్రే ఘోరే సంసారసాగరే 33
విషయోదక దుష్పారే రాగద్వేషసమాకులే l ఇంద్రియావర్త గంభీరే తృష్ణాశోకోర్మిసంకులే 34
నిరాశ్రయే నిరాలంభే ని ః సారే sత్యంత చంచలే l మాయయా మోహితస్తత్ర భ్రమామి సుచిరం ప్రభో 35
నానాజాతి సహస్రేషు జాయమానః పునః పునః l మయా జన్మాన్యనేకాని సహస్రాణ్యయుతానిచ 36
వివిధాన్య ను భూతాని సంసారే స్మిఞ్జనార్దన l వేదాః సాంగా మయాధీతాః శాస్త్రాణి వివిధానిచ 37
ఇతిహాస పురాణాని తథా శిల్పాన్యనేకశః l అసంతోషాశ్చ సంతోషాః సంచయా బహవో వ్యయాః 38
మయా ప్రాప్తా జగన్నాథ క్షయవృద్ద్యుదయేతరాః | భార్యామిత్ర స్వబంధూనాం వియోగాః సంగమాస్తథా 39
పితరో వివిధా దృష్టా మాతరశ్చ తథా మయా l దుఃఖాని చానుభూతాని మయా సౌఖ్యాన్యనేకశః 40
ప్రాప్తాశ్చ బాంధవాస్వసృ భ్రాతరో జ్ఞాతయస్తథా l మయోషితం తథా స్త్రీణాం కోష్ఠే విణ్మూత్ర పిచ్ఛిలే 41
గర్బవాసే మహాదుఃఖ మను భూతం తథా ప్రభో l దుఃఖాని యాన్యనేకాని బాల్యే ¸°వన గర్వితే 42
వార్థక్యే చ హృషీకేశ తాని ప్రాస్తాని వై మయా l మరణ యాని దుఃఖాని గుప్త మార్గే యమాలయే 43
మయా తాన్యను భూతాని నరకే యాతనాకులే l క్రిమికీట ద్రుమాణాం చ హస్త్యశ్వమృగ పక్షిణామ్ 44
మహిషాణాం గవాం చైవ తథాన్యేషాం వనౌకసామ్ l ద్విజాతీనాం చ సర్వేషాం శూద్రాణాం చైవ యోనిషు 45
ధనినాం క్షత్రియాణాం చ దరిద్రాణాం తపస్వినామ్ l నృపాణాం నృపభృత్యానాం తథాన్చేషాం చ దేహినామ్ 46
గృహే తేషాం సముత్పన్నో దేవ చాహం పునః పునః l గతో స్మి దాసతాం నాథ భృత్యానాం బహుశో నృణామ్ 47
దరిద్రత్వం చేశ్వరత్వం స్వామిత్వం చ తథాగతః | హతా మయా హ తశ్చాన్యై ర్హతం మే ఘాతితా మయా 48
దత్తం మేs న్యైర ధాన్యేభ్యో మయాదత్తమనేకశః l పితృమాతృ సుహృద్వర్గ కలత్రాణాం కృతేన చ 49
అహం హృష్టో సకృదైన్యై శ్చాశ్రుధౌతాననో గతః lదేవతిర్యజ్మనుష్యేషు చరేషు స్థావరేషు చ 50
న విద్యతే చ తత్థ్సానం యత్రాహం న గతః ప్రభో l కదా మే నరకే వాసః కదా స్వర్గే జగత్పతిః 51
కదా మనుష్యలోకేషు కదా తిర్యగ్గతేషు చ l జలయంత్రే తథా చక్రే కదా వటనిబంధనే 52
పాతితో థస్త ధోర్ద్వం చ కదా మధ్యే స్థితస్త్వహమ్ l తథాచాహం సురశ్రేష్ఠ కర్మవల్లీం సమాశ్రితః 53
ఏవం సంసార చక్రే స్మిన్ఛైరవే లోమహర్షణ l భ్రమామి సుచిరం కాలం నాంతంపశ్యామి కర్హిచిత్ 54
న జానే కిం కరోమ్యేష హరే వ్యాకులితేంద్రియః l శోకతృష్ణాభిభూతశ్చ కాందిశీకో విచేతనః 55
ఇదానీం త్వామహందేవ వికలః శరణం గతః l త్రాహి మాం దుఃఖితం కృష్ణ మగ్నం సంసారసాగరే 56
కృపాం కురు జగన్నాథ భక్తోహం యది మన్యసే l త్వామృతే నాస్తి మే బంధు ర్యో సౌ చింతాం కరిష్యతి 57
దేవ త్వాం నాథ మా సాద్యా న భయం మే స్తి కుత్రచిత్ l జీవితే మరణ చైవ యోగక్షేమే తథా ప్రభో 58
యే తు త్వాం విధి వద్దేన నార్చయంతి నరాధమాః l సుగతిస్తు కధం తేషాం భ##వేత్సం సారంబంధనాత్ 59
కిం తేషాం కులశీలేన విద్యయా జీవితేన చ l యేషాంన జాయతే భక్తి ర్జగద్దాతరి కేశ##వే 60
ప్రకృతిం త్వాసురీం ప్రాప్య యే త్వాం నిందంతి మానవా l పతంతి నరకే ఘోరే జాయమానాః పునః పునః 61
న తేషాం నిష్కృతిస్తస్మా ద్విద్యతే నరకార్ణవాత్ l యే దూషయంతి దర్వృత్తా స్తేదేవ పురుషాధ మాః 62
యత్ర యత్ర భ##వేజ్జన్మ మమ కర్మ నిబంధనాత్ l తత్ర తత్ర హరే భక్తి స్త్వయి స్తాదక్షతా సదా 63
ఆరాధ్య త్వాం పరం దైత్యా నరాశ్చాన్యే పి సంగతాః l అవాపుః పరమాంం సిద్దిం కస్త్వాం దేవ న పూజయేత్ 64
న శక్నువంతి బ్రహ్మాద్యాః స్తోతుం త్వాం ప్రకృతే ః పరమ్ l యథా చాజ్ఞానభావేన సంస్తుతో సి మయా ప్రభో 65
తత్ క్షమస్వా పరాధాన్యే యది తే స్తి దయా మయి l కృతాపరాధే పి హరే క్షమాం కుర్వంతి సాధవః 66
తస్మాత్ర్పసీద దేవేశ భక్త్యా స్నేహం సమాశ్రితః l స్తుతో పి యన్మయా దేవ భక్తి భావేన చేతసా 67
సాంగం భవతు తత్సర్వం వాసుదేవ నమోస్తుతే 68
ఇతి శ్రీ బృహన్నారాదీయ పురాణోత్తరభాగే
వసుమోహినీ సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే
త్రిపంచాశత్తమోsధ్యాయః
ఇంధ్రద్యుమ్నుడు పలికెను:-
వాసుదేవా! నీకు నమస్కారము. మోక్షకారణా! నమస్కారము. సర్వలోకేశా నన్ను సంసార సాగరమునుండి కాపాడుము. నిర్మలాంశుక సంకాశా! పురుషోత్తమా! నమస్కారము సంకర్షణా! నీకు నమస్కారము. ధరణీధరా! నన్ను కాపాడుము. హోమగర్భునకు మకర ధ్వజునకు నమస్కారము. రతికాంతి ! నీకు నమస్కారము. శంబరాంతకా! నన్ను కాపాడుము. మేఘ సంకాశా! భక్తవత్సల! అనిరుద్దా! నమస్కారము. నన్ను కాపాడుము. వరదుడవు కమ్ము . విబుధావాస! విబుధప్రియ! నారాయణా నమస్కారము. శరణాగతుడను కాపాడుము. బలిశ్రేష్ఠా! లాంగలాయుధా! విబుధ శ్రేష్ఠా! కమలోద్భవా! నమస్కారము! చతుర్ముఖా! జగద్దాత! ప్రపితామహా! నన్ను కాపాడుము. నీల మేఘాభ! త్రిదశార్చిత! విష్ణో! జగన్నాథా! సంసార సాగరమున మునిగియున్న నన్ను కాపాడుము. ప్రళయానల సంకాశ! దితిజాంతకా! నమస్కారము. నరసింహ! మహావీర్య! దీప్తలోచనా! న్నను కాపాడుము. ఓమహావరాహా! నీటిలో మునిగి యున్న భూమిని రసాతలమునుండి ఉద్దరించి నటుల నన్ను దుఃఖ సాగరము నుండి ఉద్దరించుము. నీ అవయవ స్వరూపములు వరదలగు దేవతలను స్తుతించితిని. నీవు ఈ బల దేవాదులు పృథగ్రూపముతో నుంటిరి. నీ అవయవములు గరుడాదులు, దిక్పాలాదులు సాయుధులగు ఇంద్రాదులు, ఇతర దేవతలు వీరందరూ నీ భేధములు. ప్రసన్నాయత లోచనా! వీరందరిని స్తుతించితిని. నమస్కరించితిని. నాకు ధర్మకామార్థమోక్షప్రదమగు వరము నిమ్ము . శ్రీహరీ ! నీ భేదములుగా కీర్తించబడిన సంకర్షణాదులునీ పూజ కొరకు అరంభించి బడినవి మాత్రమే. నిన్ను ఆశ్రయించి యుండునవి మాత్రమే. పరమార్థమున నీకే భేదములు లేవు. నీ బహువిధ రూపములు ఉపచారము మాత్రమే. అధ్వైతముగా ఉన్న నిన్ను ద్వైతముగా ఎట్లు చెప్పగలరు? శ్రీహరీ! నీవు ఒకడివే. సర్వవ్యాపకుడవు. చిత్స్వభావుడవు. నిరంజనుడవు. నీరూపము పరమము. భావాభావవివర్జితము. నిర్లేపము. నిర్మలము. సూక్ష్మము. కూటస్థము. అచలము ధ్రువము. సర్వోపాధి వినిర్ముక్తము. సత్తామాత్రముగా వ్యవస్థితము. ఈ విషయము దేవునికే తెలియును. నేనెట్లు తెలియుదును? ఇక నీ మరియొక రూపము పీతాంబరము, చతుర్బుజము, శంఖ చక్రదాపాణి, మకుటాంగదధారి, శ్రీ వత్సవక్షసము, వనమాలావిభూషితము. ఈ నీ రూపమును నిన్ను ఆశ్రయించిన వారు దేవతలు పూజింతురు. హే దేవా! సర్వసురశ్రేష్ఠ! భక్తాభయ వరప్రద! చారు పద్మాక్ష! విషయసాగరమున మునిగి ఉన్న నన్ను కాపాడుము. నిన్ను తప్పనేనెవిరిని శరణు పొందగలను? కావున నాయెడ ప్రసన్నుడవు కమ్ము. జరచే వ్యాధిశతములచే కూడియుండి, నానాదుఃఖములచే పీడితుడనై హర్ష శోకాన్వితుడనై కర్మపాశయంత్రితుడనై రౌద్రము మహాఘోరమగు సంసార సాగరమున పడియుంటిని. ఈ సాగరము విషయ జలములు గలిగి దాటరానిని. రాగద్వేష సమాకులము. ఇంద్రియములను సుడిగుండములచే గంభీరము. తృష్ణాశోకము అను తరంగములచే సంకులము. నిరాశ్రయము, నిరాలంబము, నిస్సారము, అత్యంతచంచలము. మాయచే మోహితుడనై ఈ సాగరమున భ్రమించు చున్నాను. నానాజాతి సహస్రమలలో పుట్టు చుంటిని. నేను కొన్నివేల జన్మలను పొందితిని. ఈ సంసారమున బహువిధాను భూతులను పొందితిని. సాంగ వేదములను బహువిధ శాస్త్రములను చదివితిని. ఇతి హాస పురాణములను చదివితిని. అనేక శిల్ప శాస్త్రములను అధ్యయనము చేసితిని. సంతోషములను, దుఃఖములను చాలా చవి చూచితిని. చాలాక్షయములను, వృద్దులను, ఉదయములను పొందితిని. భార్యామిత్రబంధు వియోగములు సంగమములు సంభవించినవి . చాలా మంది తండ్రులను తల్లులను చూచితిని. బంధువులను సోదరులును, జ్ఞాతులను పొందితిని. మల మూత్ర భూయిష్టమగు స్త్రీల దేహమున నివసించితిని. గర్భవాసమున మహా దుఃఖముననుభవించితిని. బాల్యమున, ¸°వన గర్వమున, వార్థక్యమును బహుదుఃఖములను అనుభవించితిని. మరణ దుఃఖములననుభవించితిని. గుప్త మార్గముగల యమాలయమున యాతనాకులమగు నరకమున నానాయాతనలననుభవించితిని. క్రిములుగా, కీటకములుగా, వృక్షములుగా యేనుగులుగా, అశ్వములుగా మృగములుగా, పక్షులుగా మహిషములుగా, గోవులుగా, ఇతర వనచరములుగా, బ్రాహ్మణులుగా, శూద్రులుగా. ధనవంతులుగా, క్షత్రియులుగా, దరిద్రులుగా, తపస్వసులుగా, రాజులుగా రాజు భృత్యులుగా, ఇతర దేహులుగా వారి వారి ఇండ్లలో పుట్టితిని. చాలామందిని చంపితిని. చాలామందిచే చచ్చితిని. ఇతరులు నాకిచ్చిరి. ఇతరులకు నేనిచ్చితిని. తల్లి, తండ్రి, మిత్రులు, భార్య మొదలగు వారి కొరకు సంతోషించితిని. చాలామార్లు రోదించితిని. దేవతిర్మఙ్మనుష్య స్థావర జంగమములన్నిటిలో నేను పుట్టని స్థానము లేదు. నేను ఎపుడు నరకములో నుందునో, ఎపుడు స్వర్గములో నుందునో, ఎపుడు మనుష్య లోకములో నుందునో, ఎపుడ తిర్యగ్జన్మనందుదునో, జలయంత్రములందు, చక్రమునందు, గోతులలో, బంధనములలో నుంటినో, క్రింద పడవేయబడితినో ఊర్థ్వ భాగమునకు వెళ్ళితినో, మధ్యలో నుంటినో, ఇట్లు కర్మలతా పాశమునాశ్రయించి యుంటిని. ఇట్లు మహాభయంకరము, శరీరమును గగుర్పొడుచు ఈ సంసార చక్రమున చాలాకాలమునుండి తిరుగు చున్నాను. ఎచటా అంతము కనపడుట లేదు. నేను వ్యాకుల మనస్సులో ఏమి చేయుచున్నానో తెలియ లేకున్నాను. శోకముచే ఆశ##చే అభిభూతుడనై కాందిశీకుడను విచేతనుడనైతిని. ఇపుడు వ్యాకులుడనై నిన్ను శరణు వేడితిని. కావున సంసార సాగరమగ్నుడను దుఃఖితుడనగు న్నన్ను కాపాడుము. నన్ను భక్తునిగా తలచితివేని నాయందు దయ తలచుము. నీవు తప్ప నా గురించి విచారించువారు లేరు. నిన్ను ప్రభువుగా పొందిన నాకు భయము లేదు. జీవితమున మరణమున యోగక్షేమము లందు నాకు సంశయమే కలుగదు. నిన్ను యథావిధిగా పూజించని వారికి సంసార బంధనము నుండి సద్గతి ఎట్లు లభించును? వారి కులము శీలము విద్య జీవితములచే ఏమిప్రయోజనము? జగద్దాతవగు నీయందు భక్తిలేని వారి జీవితము వ్యర్థము. అసురప్రకృతినవలంబించి నిన్ను నిందించు వారు మాటి మాటికి పుట్టుచు ఘోరనరకముల పాలగుదురు. వారికి నరకసముద్రమునుండి నిష్కృతి లభించదు. చెడు నడవడి కలవారై నిన్ను దూషించువారు నరాధములు. కర్మానుసారముగా నా పుట్టుక కలుగు ప్రతిచోట నీయందు అక్షతమగు భక్తి అన్నివేళలా ఉండనిమ్ము. నిన్ను పూజించిన దైత్యులు మానవులు పరమ సిద్ది పొందిరి. కావున నిన్నెవరు పూజించ కుందురు? ప్రకృత్య తీతుడవగు నిన్ను బ్రహ్మాదులు కూడా స్తుతించజాలరు. అయిననూ నేను అజ్ఞానముచే నిన్ను స్తుతించు నా ఆపరాధమును నాయందలి దయ కలదేవి క్షమించుము. సాధువులు తప్పు చేసిన వారిని కూడా క్షమింతురు. కావున నాయందు ప్రసన్నుడవు కమ్ము. నా భక్తిచే నాయందు స్నేహమును చూపుము. భక్తి భావముచే నేను స్తుతించు చుటింని నా స్తోత్రము సమగ్రము కానిమ్ము. ఓ వాసుదేవా నీకు నమస్కారము.
ఇతి శ్రీ బృహన్నారాదీయ పురాణోత్తరభాగమున
వసుమోహినీ సంవాదమున
పురుషోత్తమ మాహాత్మ్యమున
యాబది మూడవ అధ్యాయము