Sri Naradapuranam-3    Chapters    Last Page

పంచ పంచాశత్తమో ధ్యాయః యాబదియైదవ అధ్యాయము

పురుషొత్తమ మాహాత్మ్యము

మోహిన్యువాచ

కస్మిన్కాలే ద్విజశ్రేష్ఠ! గన్తవ్యం పురుషోత్తమే l విధినా కేన కర్తవ్యా పంచతీర్థ్యపి మానద! 1

ఏకైకస్య చ తీర్థస్య స్నానే దానే చ యత్ఫతమ్‌ l దేవతా ప్రేక్షేణ చైవ బ్రూహి సర్వం పృధక్ఫృధక్‌ 2

మోహినీ దేవి పలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా! పురుషొత్తమ క్షేత్రమునకు ఏ సమరుమున వెళ్ళవలయును? పంచతీర్థిని ఏ విధిచే ఆచరించవలయును? ఒక్కొక్క తీర్థమున స్నానము దానమున ఏఫలము కలుగును. దేవ దర్శనమున ఏ ఫలమకలుగునో దానింతటిని విడివిడిగా తెలుపుము.

వసురువాచ :-

నిరాహార ః కురుక్షేత్రే పాదేనైకేన యస్తపేత్‌ l జిత్రేన్ద్రియో జితక్రోధః సప్త సంవత్సరాయుతమ్‌ 3

దృష్ట్వా సకృజ్జ్యేష్ఠ శుక్ల ద్వాదశ్యాం పురుషొత్తమమ్‌ l కృతోపవాసః ప్రాప్నోతి తతో ధికతరం ఫలమ్‌ 4

తస్మా జ్జ్యేష్ఠేతు సుభ##గే ప్రయత్నేన సుసంయుతైః l స్వర్గలోకే ప్సు భిర్మర్యై ర్ద్రష్టవ్యః పురుషొత్తమః 5

éపంచతీర్థే చ విధివ త్కృత్వా జ్యేష్ఠే నరోత్తమః l ద్వాదశ్యాం శుక్లపక్షస్య పశ్యేత్తం పురుషోత్తమమ్‌ 6

యే పశ్యన్త్యవ్యయం దేవం ద్వాదశ్యాం పురుషోత్తమమ్‌ l తే విష్ణులోక మాసాద్య న చ్యవన్తే కదాచన 7

తస్మాజ్జ్యేష్ఠే ప్రయత్నేన గన్తవ్యం విధి నందిని! l కృత్వా సమ్యక్పంచతీర్థే ద్రష్టవ్యః పురుషోత్తమః 8

సు దూరస్థో పి ప్రీతాత్మా కీర్తయేత్పురుషోత్తమమ్‌ l అహన్యహని శుద్దాత్మా సో పి విష్ణుపురం వ్రజేత్‌ 9

యాత్రాం కరోతి కృష్ణస్య శ్రద్ధయా యస్సమాహితః l సర్వ పాపవినిర్ముక్తో విష్ణులోకం వ్రజేన్నరః 10

చక్రం దృష్ట్వా హరేర్దూరా త్ర్పాసాదొపరి సంస్థితమ్‌ l సహసా ముచ్యతే పాపా న్నరో భక్త్యా ప్రణమ్య తమ్‌ 11

వసువు పలికెనుః-

NRPVLRiVZOP[QQú»R½ª«sVVƒ«s ¬sLS¥¦¦¦LRiV\®²…, ÑÁ¾»½[Liúµj…¸R…VV\®²… ÑÁ»R½ úN][µ³R…V\®²… ¹¸…[V²R…V xqsLiª«s»R½=LRiª«sVVÌÁV ILiÉÓÁ NSÖÁ\|ms »R½xmsxqsV= ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. ÛÇÁ[ùxtîsQ aRPVNýRP µ³y*µR…bP ƒy²R…V INRPª«sWLRiV xmsLRiVu¡»R½òª«sVVƒ«sV µR…Lji+LiÀÁ Dxmsª«szqsLiÀÁƒ«s¿][ @µ³j…NRP xmnsÌÁª«sVV ÌÁÕ³ÁLi¿RÁVƒ«sV. NSª«soƒ«s J xqsVLiµR…Lki! జ్యేష్ఠమాసనమున సర్వప్రయత్నముచే సావధానులై స్వర్గమును కోరువారు పురుషోత్తమ క్షేత్రమును దర్శించవలయును. జ్యేష్ఠమాసమున యధావిధిగా పంచతీర్థిని శుక్ల ద్వాదశిన ఆచరించి పురుషోత్తమును దర్శించవలయను. ద్వాదశినాడు అవ్యయుడు దేవుడగు పురుషోత్తముని దర్శించిన వారు శ్రీ విష్ణులోకమున చేరి మరల ఇటకు రారు. కావున జ్యేష్ఠ శుక్ల ద్వాదశిన సర్వ ప్రయత్నములచే పంచ తీర్థమునకు వెళ్ళ వలయును. పురుషోత్తముని దర్శించవలయును. పురుషోత్తమ క్షేత్రమునకు చాలా దూరము నున్నవారుకూడా ప్రతి దినము పరిశుద్దమగు మనసుచే పురుషోత్తమమను కీర్తించిననూ, శ్రీవిష్ణు లోకమును చేరును. శ్రద్దతొ సావధానుడై శ్రీ కృష్ణయాత్ర నాచరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై శ్రీ విష్ణులోకమును చేరును. పురుషోత్తమగోపురమున ఉన్న శ్రీహరి చక్రమును చూచి భక్తితో నమస్కారించిన వారు పాపము నుండి విముక్తులగుదురు.

పంచతీర్థ విదిం వక్ష్యే శృణు మోహిని సాంప్రతమ్‌ l యస్యాం కృతాయాం మనుజో మాధవస్య ప్రియో భ##వేత్‌ 12

మార్కండేయ హ్రదం గత్వా స్నాత్వా చోదఙ్శఖశ్శుచిః l నిమజ్జేత్తత్ర త్రీన్వారా సమం మన్త్రము దీరయేత్‌ 13

సంసార సాగరే మగ్నం పాపగ్రస్తమచేతనమ్‌ l త్రాహి మాం భగనేత్రఘ్న త్రిపురారే నమోస్తుతే 14

నమశ్శివాయ శాంతాయ సర్వపాపహరాయచ l స్నానం కరోమి దేవేశ! మమ నశ్యతు పాతకమ్‌ 15

నాభి మాత్రే జలే స్థిత్వా విధి వద్దేవతా ఋషీన్‌ l తిలోదకేన మతిమా న్పితౄనన్యాంశ్చతర్పయేత్‌ 16

స్నాత్వైవం చ తథాచమ్య తతో గచ్ఛేచ్ఛివాలయమ్‌ l ప్రవిశ్య దేవతాగారం కృత్వా తం త్రిః ప్రదక్షిణమ్‌ 17

మూలమంత్రేణ సంపూజ్య మార్కండేయేశ మాదరాత్‌ l అఘోరేణతు మంత్రేణ ప్రణిపత్య క్షమాపయేత్‌ 18

త్రిలోచన నమస్తేస్తు నమస్తే శశిభుషణ! l త్రాహి మాం పుండరీకాక్ష! మహాదేవ నమోస్తుతే'' 19

మార్కండేయ హ్రదేత్వేవం స్నాత్వా దృష్ట్వా చ శంకరమ్‌ l దశానా మశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి మానవః 20

పాపై స్సర్వేర్వినిరుమక్త శ్శివలోకం సగచ్ఛతి l తత్ర భుక్త్వా వరాన్భోగా న్యావధాభూత సంప్లుతమ్‌ 21

ఇహలోకం సమాసాద్య భ##వేద్విప్రో బహుశ్రుతః l శాంకరం యోగ మాసాద్య తతో మోక్షమవాప్నుయాత్‌ 22

కల్ప వృక్షం తతో గత్వా కృత్వా తంత్రిః ప్రదక్షిణమ్‌ l పూజయేత్పరయా భక్త్యా మంత్రేణానేన తం వటమ్‌ 23

''ఓం నమోsవ్యక్త రూపాయ మహాతే నతపాలినే l మహోదకోపవిష్టాయ న్యగ్రోధాయ నమో స్తుతే 24

అవసస్త్వం సదాకల్పే హరేశ్చాయతనే వటే l న్యగ్రోధ హర మే పాపం కల్పవృక్ష నమోస్తుతే'' 25

భక్త్యా ప్రదక్షిణం కృత్వా గత్వా కల్పవటం నరః l సహసోజ్ఝతి పాపౌఘం జీర్ణాం త్వచమివోరగః 26

ఛాయాం తస్య సమా క్రమ్య కల్ప వృక్షస్య మోహినిl బ్రహ్మహత్యాం నరో జహ్యా త్పాపేష్వన్యేషు కా కధా 27

దృష్ట్వా కృష్ణాంగ సంభూతే బ్రహ్మతేజోమయం పరమ్‌ l న్యగ్రోధాకృతికం విష్ణుం ప్రణిపత్య చ వైధసి 28

రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం ప్రాప్నోతి చాదికమ్‌ l తథా కులం సముద్దృత్య విష్ణులోకం స గచ్ఛతి 29

వైనతేయం నమస్కృత్య కృష్ణస్య పురతస్థ్సితమ్‌ l సర్వపాపవినిర్ముక్త స్తతో విష్ణు పురం వ్రజేత్‌ 30

దృష్ట్వా వటం వైనతేయం యః పశ్యేత్పురుషొత్తమమ్‌ 31

é ప్రవిశ్యాయతనం విష్ణోః కృత్వా తం త్రిః ప్రదక్షిణమ్‌ l సంకర్షణం సుభద్రాం చ భక్త్యా పూజ్య ప్రసాదయేత్‌ 32

నమస్తే హదధృఙ్నామ్నే నమస్తే ముసలాయుధ! l నమస్తే రేవతీకాన్త ! నమస్తే భక్తవత్సల! 33

నమస్తే బలినాం శ్రేష్ఠ! నమస్తే ధరణీధర! l ప్రలంబారే! నమస్తేs స్తు త్రాహి మాం కృష్ణపూర్వజ! 34

ఏవం ప్రసాద్య చానంత మజేయం త్రిదశార్చితమ్‌ l కైలాస శిఖరాకారం చంద్రకాన్త వరాననమ్‌ 35

నీల వస్త్రధరం దేవం ఫణావికటమస్తకమ్‌ l మహాబలం హలధరం కుండలైక విభూషితమ్‌ 36

రౌహిణయం నతో భక్త్యా లభేదభిమతం ఫలమ్‌ సర్వ పాపైర్వినిర్ముక్తో విష్ణులొకం చ గచ్ఛతి 37

ఆభూత సంప్లవం యావ ద్బూక్త్యా తత్ర స్వయం బుధః l పుణ్యక్షయా దిహాగత్య ప్రవరో యోగినాం కులే 38

బ్రాహ్మణ ప్రవరో భూత్వా సర్వశాస్త్రార్థ పారగః l జ్ఞానం తత్ర సమాసాద్య ముక్తిం ప్రాప్నోతి దుర్లభామ్‌ 39

ఏవ మభ్యర్చ్య హలినం తతః కృష్ణం విచక్షణః l ద్వాదశాక్షర మంత్రేణ పూజయేత్పు సమాహితః 40

ఓమోహినీ ః ఇపుడు పంచతీర్థ విధిని చెప్పెదను. శ్రద్దగా వినుము. ఈ పంచతీర్థ విధినాచరించిన వారు శ్రీహరికి ప్రియులగుదురు. మార్కండేయ హ్రదమునకు వెళ్ళి ఉత్తరాభిముఖుడై శుచిగా హ్రదమున మూడుమార్లు మునుగవలయును. తరువాత ఈ మత్రమును చ్చరించవలయును.

''సంసార సాగరేమగ్నం పాప గ్రస్తమచేతనమ్‌ l త్రాహి మాం భగనేత్రఘ్న త్రిపురారే! నమోస్తుతే

నమశ్శివాయ శాంతాయ సర్వపాపహరాయచ l స్నానం కరోమి దేవేశ! మమ నశ్య తు పాతకమ్‌'' అనునది మంత్రము.

సంసార సాగరమును మునిగియున్న, పాపగ్రస్తుడను, జ్ఞానహీనుడనగు నన్ను కాపాడుము. ఓ త్రిపురారీ ! నీకు నమస్కారము. శివునకు శాంతునకు, సర్వపాపహరునకు నమస్కారము. ఓ దేవేశ! ఇచట స్నానము చేయుచున్నాను. నా పాతకము నశించుగాత అని అర్థము.

నాభి మాత్ర జలమున నిలిచి యధావిధిగా దేవతలను ఋషులను, పితరులను, ఇతరులను మతిమంతుడై తిలోదకముచే తర్పణమును గావించ వలయును. ఇట్లు స్నానము గావించి ఆచనమును చేసి శివాలయమునకు వెళ్ళవలయును. దేవాలయమున ప్రవేశించి దేవునికి మూడు సార్లు ప్రదక్షిణము గావించి ఆదరముతో మూల మంత్రముచే మార్కండేయేశుని చక్కగా పూజించి అఘోర మంత్రము చే నమస్కరించి క్షమాపణను కోరవలయును''

''త్రిలోచన నమస్తేస్తు నమస్తే శశిభుషణ! l త్రాహి మాం పుండరీకాక్ష! మహాదేవ నమోస్తుతే''

ఇది మంత్రము. త్రిలోచనా! నీకు నమస్కారమ. చంద్రభుషణా! నీకు నమస్కారము. ఓ పుండరీకాక్షా! నన్ను కాపాడుము. మహాదేవా! నమస్కారము. అని అర్థము. ఇట్లు మార్కండేయ హ్రదమున స్నానమాచరించి శంకరుని దర్శించి దశాశ్వమేధముల ఫలమును పొందును. సర్వ భోగములనను భవించి భూలోకమున బ్రాహ్మణునిగా పుట్టును. బహుశాస్త్రకోవిదుడగును. శంకరయోగమును పొంది మోక్షమునందును. తరువాత కల్పవృక్షమనకు వెళ్ళి మూడు మార్లు ప్రదక్షిణమును చేసి ఉత్తమ భక్తిచే ఈ వటవృక్షమును ఈ మత్రముచే పూజించ వలయును.

''ఓం నమోవ్యక్త రూపాయ మహతే నతపాలినే l మహోదకోపవిష్టాయ న్యగ్రోధాయ నమోస్తుతే

అవసస్త్వం సదా కల్పే హరేశ్చాయతనే వటే l న్యగ్రోధ హర మే పాపం కల్పవృక్ష నమోస్తుతే''

ఇది మంత్రము. అవ్యక్త రూపునకు మహత్స్వరూపునకు, నతపాలకునకు, మహోద కోపవిష్టుడగు న్యగ్రోధమునకు నమస్కారము. నీవు ఎపుడూ హరి నివాసమగు వటమున నుంటివి. ఓన్యగ్రోధమా! నా పాపమును హరించుము. కల్పవృక్షమా! నీకు నమస్కారము అని యర్థము. ఇట్లు కల్పవృక్షమును చేరి భక్తిచే ప్రదక్షిణమాచరించి, పాము కుబుసమును విడుచునట్లు వెంటనే పాపములను వీడును. కల్పవృక్షచాయ నాశ్రయించినవారు బ్రహ్మహత్యా పాతకమును కూడా విడిచెదరు. ఇక ఇతర పాపముల కథయేమే ? కృష్ణాంగ సంభూతమున పరమగు బ్రహ్మతేజ స్వరూపుడగు న్యగ్రోధాకారామున నున్న శ్రీహరిని దర్శించి నమస్కరించి రాజసూయా శ్వమేధముల ఫలమును పొందును. కులమును ఉద్దరించి విష్ణులోకమును పొందును. శ్రీకృష్ణభగవానుని ముందున్న గరుడుని నమస్కరించి సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరిలోకమును చేరును. వటవృక్షమును, గరుడుని దర్శించి పురుషోత్తముని చూచినవాడు సంకర్షణుని, సుభద్రను చూచినచో ఉత్తమ గతిని పొందును. శ్రీహరి మందిరమును ప్రవేశించి మూడు మార్లు ప్రదక్షిణము నాచరించి సంకర్షణుని సుభద్రను భక్తిచే పూజించి ప్రసన్నుల గావించలవలయును. ఓహలధారీ! ముసలాయుధా! రేవతీకాన్త! భక్తవత్సలా! బలిశ్రేష్ఠా! ధరణీధరా! ప్రలంబారీ! నీకు నమస్కారము. కృష్ణాగ్రజా! నన్ను కాపాడుము. ఇట్లు అజేయుడు, త్రిదశార్చితుడగు అనంతుని ప్రసన్నుని చేసి, కైలాస శిఖరాకారుడు చన్ద్రకాన్త, వరాననుడు, నీల వస్త్రధరుడు, ఫణావికటమస్తకుడు, మహాబలుడు, హలధరుడు, ఏక కుండల విభూషితుడు, రోహిణయుడగు బలభద్రుని భక్తిచే నుస్కారించి అభిమత ఫలమును పొందును. సర్వపాపవినిర్ముక్తుడై విష్ణులొకమును పొందును . ఆచట ప్రళయకాలము వరకు భోగములననుభవించి పుణ్యక్షయమున ఇచట యోగికుల ఉత్తమ జ్ఞానమును పొంది దుర్లభమగు ముక్తిని పొందును. ఇట్లు బలరాముని పూజించి తరువాత సావధానముతో శ్రీకృష్ణుని ద్వాదశాక్షరమంత్రముచే పూజించి వలయును.

ద్విషట్‌ వ్రర్ణమంత్రేణ భక్త్యా యే పురుషోత్తమమ్‌ l పూజయన్తి సదా ధీరా స్తే మోక్షం ప్రాప్నునంతి వై 41

న తాం గతిం సురా యాన్తి యోగినొ నైవ సోమపాః l యాం గతిం యాన్తి విధిజే ద్వాదశాక్షర తత్పరాః 42

తస్మాత్తేనైవ మంత్రేణ భక్త్యా కృష్ణం జగద్గురుమ్‌ l సంపూజ్య గంధపుష్పాద్యైః ప్రణిపత్య ప్రసాదయేత్‌ 43

జయకృష్ణ జగన్నాధ! జయ సర్వాఘనాశన! జయ చాణూరకేశిఘ్న జయ కంసనిషూదన! 44

జయ పద్మ పలాశాక్ష! జయ చక్రగదాధర! | జయ నీలాంపబుదశ్యామ! జయ సర్వసుఖప్రద! 45

జయ దేవ జగత్పూజ్య! జయ సంసారనాశన! l జయ లోకపతే ! నాధ! జయ వాంఛాఫలప్రద! 46

సంసార సాగరే ఘోరే నిస్సారే దుఃఖఫేనిలే l క్రోధగ్రాహాకులే రౌద్రౌ విషయోదక సంప్లవే 47

నానారోగోర్మికలిలే మోహావర్తసుదుస్తరే l నిమగ్నో హం సురశ్రేష్ఠ! త్రాహి మాం పురుషోత్తమ! 48

ఏవం ప్రసాద్య దేవేశం వరదం భక్తవత్సలమ్‌ l సర్వపాపహరం దేవం సర్వకామఫలప్రదమ్‌ 49

పీనాంసం ద్విభుజం కృష్ణం పత్మపత్రాయతేక్షణమ్‌ l మహోరస్కం మహాబాహుం పీతవస్త్రం శుభాననం 50

శంఖ చక్రగదాపాణిం ముకుటాంగద భూషణమ్‌ l సర్వలక్షణ సంయుక్తం వనమాలా విభూషితమ్‌ 51

దృష్ట్వా నరోs ంజలిం కృత్వా దండవత్ప్రణి పత్య చ l అశ్వమేధ సహస్రాణాం ఫలం ప్రాప్నోతి మోహిని! 52

యత్ఫలం సర్వతీర్థేషు స్నానే దానే ప్రకీర్తతమ్‌ l నరస్తత్ఫలం మాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ 53

యత్ఫలం సర్వవేదేషు సర్వయజ్ఞేషు యత్ఫలమ్‌ l తత్ఫలం సమవాప్నోతి నరః కృష్ణం ప్రణమ్యచ 54

యత్ఫలం బ్రహ్మ చర్యేణ సమ్యచక్చీర్ణేణ కీర్తితమ్‌ l నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్యా కృష్ణం ప్రణమ్య చ 55

గార్హస్థ్యేన యధోక్తేన యత్ఫలం సముదాహృతమ్‌ l నరస్తత్ఫల మాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ 56

యత్ఫలం సర్వదానేషు వ్రతేషు నియమేఘ చ l నరస్తత్ఫల మాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ 57

యత్పలం వనవాసేన వాన ప్రస్థస్య కీర్తితమ్‌ l నరస్తత్ఫల మాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్య చ 58

సన్యాసేన యధోక్తేన యత్ఫలం సముదాహృతమ్‌ l నరస్తత్ఫలం మాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ 59

కిం చాత్ర బహునోక్తేన మాహాత్మ్యం తస్య భామిని l దృష్ట్వా కృష్ణం నరో భక్యా మోక్షం ప్రాప్నోతి దుర్లభమ్‌ 60

పాపైర్విముక్త శ్శుద్దాత్మా కల్పకోటి సముద్బవైః l శ్రియా పరమయా యుక్తః సర్వైస్సముదితో గుణౖః 61

సర్వకామ సమృద్దేన విమానేన సువర్చసా l త్రిస్సప్తకులముద్ధృత్య నరో విష్ణుపురం వ్రజేత్‌ 62

తతః కల్పశతం యావత్‌ భుక్త్వా భోగాన్మనోరమాన్‌ l గంధర్వాప్సరసైస్సార్థం యథా విష్ణుశ్చతుర్బుజః 63

చ్యుతస్తస్మాదిహాయాతో విప్రాణాం ప్రవరే కులే l సర్వజ్ఞ స్సర్వవేదీ చ జాయతె గతమత్సరః 64

స్వధర్మ నిరతశ్శాంతో దాతా భూతహితేరతః l ఆసాద్య వైష్ణవం జ్ఞానం తతోముక్తి మవాప్నుయాత్‌ 65

భక్తిచే ద్వాదశాక్షర మంత్రముతో ఎల్లకాలము పురుషొత్తముని పూజించువారు మోక్షమును పొందెదరు. ద్వాదశాక్షర తత్పురులు పొందు గతిని దేవతలు, యోగులు, సోమపానమును చేసిన వారుకూడా పొంద జాలరు. కావున జగద్గురువగు శ్రీకృష్ణుని ద్వాదశాక్షర మంత్రముచే గంధ పుష్పాదులచే చక్కగా పూజించి, నమస్కరించి ప్రసన్నుని చేసుకొనవలయును. కృష్ణా! జగన్నాధా! సర్వపాప నాశన! చాణూరకేశిఘ్నా! కంస నిషూదనా! నీకు జయము. పద్మపలాశాక్షా ! చక్రదాధరా! నీలమేఘశ్యామా! సర్వసుఖప్రదా! జగత్పూజ్యా! సంసార నాశనా! లోకపతీ ! వాంఛాఫప్రదా! నీకు జయము. ఘోరము, నిస్సారము, దుఃఖ బహుళము, క్రోధగ్రాహాకులము, రౌద్రము విషయోదక సంప్లవము, నానారోగోర్మికలిలము, మోహావర్తము, సుదుస్తరము, అగు సంసార సాగరమున నేను మునిగి యుంటిని. ఓపురుషోత్తమా! నన్ను కాపాడుము. ఇట్లు వరప్రదుడు భక్తవత్సలుడగు దేవేశుని ప్రసన్నుని చేసుకొని, సర్వ పాపహరుడు, దేవుడు సర్వకామఫలప్రదుడు, పీన భుజుడు, ద్విభుజుడు, పద్మపత్రాయతేక్షణుడు, మహోరస్కుడు, మహాబాపూవు, పీతవస్త్రుడు, శుభాననుడు, శంఖ చక్రగదాపాణి, ముకుటాంగద భుషణుడు, సర్వలక్షణ సంయుక్తుడు, వనమాలా విభూషితుడు, అగు శ్రీకృష్ణ భగవానుని దర్శించి చేతులు జోడించి దండవత్ర్పణామము లాంచరించి సహస్రాశ్వమేథ ఫలమును పొందును. సర్వతీర్థములలో స్నానదానముల వలన కలుగు ఫలము శ్రీకృష్ణుని దర్శించి నమస్కరించినచో కలుగును. సర్వవేదములందు, సర్వ యజ్ఞములందు నుండు ఫలము శ్రీకృష్ణ ప్రణామముచే కలుగును. యధావిధిగా గృహస్థ దర్మమును నాచరించిన వారికి కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే లభించును. సర్వదానములందు, వ్రతములందు, నిరుమములందు కలుగు ఫలము శ్రీకృష్ణ ప్రణామముచే లభించును. వాన ప్రస్థునికి వనవాసముచే కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే కలుగును. యధావిధిగా నాచరించు సన్యాసము చే కలుగు ఫము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే కలుగును. ఇంకనూ వేయేల? భక్తిచే శ్రీకృష్ణుని దర్శించినవారు మోక్షమును పొందుదురు. కోటి కల్పమునలనుండి వచ్చు పాపములచే విముక్తుడై, పరిశుద్ధుడై ఉత్తమ సంపద్యుక్తుడై సర్వ సద్గుణోపేతుడై సర్వకామ సమృద్దిని పొంది, చక్కని తేజోవంతమగు విమానముచే ఇరువది యొక కులములనుద్ధరించి శ్రీవిష్ణులోకమును పొందును. అచట నూరు కల్పముల కాలము మనకు నచ్చిన భోగములను అనుభవించి చతుర్బుజుడగు శ్రీహరివలె గంధర్వాప్సరసలతొ ఆనందించి, అటనుండి భులోకమున కొచ్చి ఉత్తమ బ్రాహ్మణ కులమున సర్వజ్ఞునిగా సర్వవేద పారంగతునిగా మత్సర రహితునిగా పుట్టును. స్వధర్మ నిరతుడు, శాంతుడు, దాత, భూతహితరతుడు,గానుండి విష్ణు జ్ఞానమును పొంది మోక్షమును పొందును.

తతస్సంపూజ్య మంత్రేణ సుభద్రాం భక్తవత్సలామ్‌ l ప్రసాదయేచ్చవిధినా ప్రణిపత్య కృతాంజలిః 66

''నమస్తే సర్వగే దేవి! నమస్తే శుభసౌఖ్యదే ! త్రాహి మాం పద్మ పత్రాక్షి ! కాత్యాయని! నమోస్తుతే'' 67

ఏవం ప్రసాద్య తాం దేవీం జగద్ధాత్రీం జగద్దితామ్‌ l బలదేవస్య భగినీం సుభద్రాం వరదాం శివామ్‌ 68

కామగేన విమానేన నరో విష్ణుపురం వ్రజేత్‌ l ఆభూత సంప్లవం యావ త్ర్కీడిత్వా తత్ర దేవవత్‌ 69

ఇహ మానుషతాం ప్రాప్తో బ్రాహ్మణో వేద విద్బవేత్‌ l ప్రాప్య యోగం హరేస్తత మోక్షం చ లభ##తే ధ్రువమ్‌ 70

నిష్క్రమ్య దేవతాగారా త్కృత కృత్యో భ##వేన్నరః l ప్రణమ్యాయతనే పశ్చా ద్వ్రజేత్తత్ర సమాహితః 71

ఇంద్రనీల మయో విష్ణు ర్యత్రాస్తే వాలుకావృతః l అంతర్దానేపి తం నత్వా తతో విష్ణు పురం వ్రజేత్‌ 72

సర్వదేవమయో దేవో హిరణ్య కశిపూద్దరః l యత్రాస్తే నిత్యాదా దేవీ సింహార్దకృత విగ్రహః 73

భక్త్యా దృష్ట్వా తు తం దేవం ప్రణమ్య నృహరిం శుభే! l ముచ్యతే పాతకైర్మర్త్య స్సమసై ర్నాత్ర సంశయః 74

నరసింహస్య యే భక్తా భవన్తి భువి మానవాః l నతేషాం దుష్కృతం కించి త్ఫలం చ స్యాద్యదీప్సితమ్‌ 75

తస్మాత్సర్వ ప్రయత్నేన నరసింపాం సమాశ్రయేత్‌ l ధర్మార్థ కామమోక్షణాం ఫలం యస్మాత్ప్రయచ్చతి 76

తస్మాత్తం బ్రహ్మతనయే భక్త్యా సంపూజయేత్సదా l మృగరాజం మహావీర్యం సర్వకామ ఫలప్రదమ్‌ 77

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా స్త్రియా శ్శూద్రాంత్య జాదయః l సంపూజ్య తు సురశ్రేష్టం

భక్తాస్సింహవపుర్ధరాః 78

ముచ్యన్తే చాశుభాద్దుఃఖా జ్జన్మకోటి సముద్బువాత్‌ l సంపూజ్య తం సురశ్రేష్ఠం ప్రాప్నువన్త్యభివాంఛితమ్‌ 79

éదేవత్వ మమరేశత్వం ధనేశత్వం చ భామిని ! | యక్ష విద్యాధరత్వం చ తధాన్యచ్ఛ ప్రయచ్ఛతి 80

శృణుష్వ నరసింహసగ ప్రభావం విధినందిని! l అజితస్యా ప్రమేయస్య భుక్తి ముక్తి ప్రదస్య చ 81

కశ్శక్నోతి గుణాన్వక్తుం సమస్తాం స్తస్య సువ్రతే l సింహార్థకృతదేహస్య ప్రవక్ష్యమి సమాసతః 82

యాః కాశ్చిత్సిద్దయాశ్చాత్ర శ్రుయన్తే దైవ మానుషాః l ప్రసాదాత్తస్య తాస్సర్వా సిద్ద్యన్తే నాత్ర సంశయః 83

స్వర్గే మర్త్యేచ పాతాలే దివి తోయే సురే నగే l ప్రసాదాత్తస్య దేవస్య భవత్సవ్యాహతాగతిః 84

అసాధ్యం తస్య దేవస్య నాస్త్యత్ర సచరాచరే l నరసింహస్య సుభ##గే సదా భక్తానుకంపినః 85

విధానం తస్య వక్ష్యామి భక్తానాముపకారకమ్‌ l యేన ప్రసీదతే చాసౌ సింహార్దకృత విగ్రహః 86

యత్తత్త్వం తస్య దేవస్య తదజ్ఞాతం సురాసురైః l శాక యావమూలైస్తు ఫలపిణ్యాక సక్తుభిః 87

పయోభ##క్ష్యేణ వా భ##ద్రే వర్తతే సాధకేశ్వరః l కాస కౌపీన వాసాశ్చ ధ్యానయుక్తో జితేంద్రియ ః 88

అరణ్య విజనే దేశే నదీ సంగమ పర్వతే l సిద్దక్షేత్రే చోషరేచ నరసింహాశ్రమే తథా 89

ప్రతిష్ఠాప్య స్వయం చాపి పూజాం కృత్వా విధానతః lఉపపాతకవాన్దేవి! మహాపాతక వానపి 90

ముక్తో భ##వేత్పాతకేభ్య స్సాధకో నాత్ర సంశయః l కృత్వా ప్రదక్షిణం తత్ర నరసింహం ప్రపూజయేత్‌ 91

గంధ పుష్పాధిభిర్ధూపై ః ప్రణమ్య శిరసా ప్రభుమ్‌ l కర్పూర చందనాక్తాని జాతి పుష్పాణి మస్తకే 92

ప్రదాద్యాన్నరసింహస్య తతస్సిద్దిః ప్రజాయతే l భగవాన్సర్వకార్యేషు నక్వచిత్ర్పతి దూయతే 93

న శక్తాస్తం సమాక్రాంతుం బ్రహ్మరుద్రాదయ స్సురాః l కింపు నర్ధానవా లోకే సిద్ద గంధర్వ మానుషాః 94

విద్యాధరా యక్షగణాః సకిన్నరమహోరగాః l తే సర్వే ప్రలయం యాన్తి దివ్యాదివ్వాగ్ని తేజసా 95

సకృజ్జప్త్వాగ్ని శిఖయా హన్యాత్సర్వానుప్రదవాన్‌ l త్రిర్జప్త్వా కవచం దివ్యం సంరక్షేదైత్య దానవాత్‌ 96

భూతాత్పిశాచాద్రక్షేభ్యో యేచాన్యే పరిపంథినః l త్రిర్జప్తం కవచం దివ్యం అభేద్యం చ సురాసురైః 97

యోజన ద్వాదశాంతస్తు దేవో రక్షతి సర్వదా l నరసింహా మహాబల పరాక్రమః 98

తరువాత భక్తవత్సల యగు సుభద్రను మంత్రమచే పూజించి నమస్కరించి, చేతులను జోడించి, ప్రార్థిచవలయును.

''నమస్తే సర్వగే దేవీ! నమస్తే శుభసౌఖ్యదే! త్రాహి మాం పద్మపత్రాక్షి! కాత్యాయని నమోస్తు తే !''

ఇది మంత్రము. సర్వ ప్రదేశములలో నుండే దేవీ! శుభసౌఖ్యప్రదాత్రీ ! నీకునమస్కారము. పద్మపత్రాక్షీ! నన్నుకాపాడుము. కాత్యాయనీ! నీకు నమస్కారము. అని అర్థము . ఇట్లు సుభద్రాదేవిని ప్రార్థించి, బలదేవ సోదరి, వరద, శుభప్రద యగు సుబద్రను జగద్దాత్రిని, జగద్దితను నమస్కరించి కామగతిగల విమానముచే శ్రీహిరిలోకమును చేరును. అచట ప్రళయ కాలము వరకు దేవతల వలే విహరించి, మరల భూలోకమున వేదవిత్తగు బ్రాహ్మణునిగా పుట్టి, శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. దేవాలయమునుండి బయలు వెడలి కృతకృత్యుడగును. తరువాత దేవాయ తనమున నమస్కరించి సావధానముగా ఇంద్రనీలమయుడగు శ్రీహరి వాలుకావృతుడుగా ఉన్న ప్రదేశమునకు వెళ్ళవలయును. అచట అంతర్థానముగా ఉన్ననూ శ్రీహరిని నమస్కరించి శ్రీ విష్ణులోకమును చెందును. సర్వదేవమయుడు, హిరణ్య కశ్యపసంహారకుడు, అర్థ సింహదేహుడగు నరసింహ దేవుడున్న ప్రదేశమునకు వెళ్ళి నృహరిని భక్తితో నమస్కరించి సకల పాప వినిర్ముక్తుడగును. ఈ భూలోకమున నరసింహ దేవుడున్న ప్రదేశమునకు వెళ్ళి నృహరిని భక్తితో నమస్కరించి సకల పాప వినిర్ముక్తుడగును. ఈ భులోకమున నరసింహస్వామి భక్తులకు దుష్కృతముండదు. అభీష్టఫలము లభించును. కావున సర్వ ప్రయత్నముచే శ్రీ నృసింహదేవుని ఆశ్రయించవలయును. దర్మార్థ కామమోక్షముల నొసంగును. కావున మహావీర్యుడు సర్వకామ ఫలప్రదుడు, అగు శ్రీ నృహరిని ఎల్లపుడూ భక్తిచే పూజించవలయును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అంత్యజాతిజులు సురశ్రేష్ఠుడగు శ్రీ నృహరిని భక్తిచే పూజించి, కోటి జన్మలనుండి కలిగిన ధుఃఖములనుండి అశుభములనుండి విముక్తిలగుదురు. శ్రీ హరిని పూజించి అభిష్టములను పొందును. దేవత్యమును అమరేశత్వమును, ధనేశత్వమును, యక్షవిద్యాధరత్వమును, ఇంకా ఇతర ఫలములను కూడా పొందును. ఓ బ్రహ్మపుత్రీ ! నరసింహభగవానుని ప్రభావము వినుము. శ్రీనృహరి అజితుడు, అప్రమేయుడు, భుక్తి ముక్తి ప్రదుడు అగు నరహరి సమస్త గుణములను ఎవరు చెప్పగలరు? నరసింహదేవుని ప్రభామును సంగ్రహమగా చెప్పెదను. ఈ లోకమున కల దైవమానుష సిద్దులు సమగ్రముగా నృహరి అనుగ్రహముతో లభించును. స్వర్గమున, భూలోకమున, పాతాలమున, అకాశమున, జలమున, దేవతలలో పర్వతములందు, నరహరి అనుగ్రహము వలన అడ్డులేని గమనము కలవాడగును. ఈ చరాచరజగత్తులో నృహరికి అసాధ్యమగునది లేదు. శ్రీనృహరి సర్వదా భక్తానుగ్రహశీలుడు. నృహరిని పూజించు విధానమును భక్తోప కారమును చెప్పెదను. ఈ విధానముచే శ్రీనృహరి ప్రసన్నుడగున. నృహరితత్త్వము దేవదానవులకు కూడా తెలియదు. శ్రీనృహరి పూజకుడు శాకయావకమూలములను, ఫలములున, పిండిన భూజించుచు కాసకౌపీన ధారియై ధ్యానయుక్తుడు, జితేన్ద్రియుడు కావలయును. అరణ్యమునందుకాని, ఏకాంత ప్రదేశమున కాని, నదీసంగమమున కాని పర్వత ప్రాంతమున కాని, సిద్దక్షేత్రమున, ఊషర ప్రదేశమున, నరసింహాశ్రమమున కాని నరసింహస్వామిని ప్రతిష్ఠించి వాని, స్వయంవ్యక్తుని కాని, యధావిధిగా పూజించినచో ఉపపాతకములు కలవాడు, మహాపాతకములు కలవాడు కూడా అన్ని పాతకముల నుండి విముక్తుడగును. మొదట ప్రదక్షిణము నాచరించి నృహరిని పూజించవలయును. గంధపుష్పాదులను, ధూపదీపములను సమర్పించి, శిరసువంచి నమస్కరించి కర్పూర చంనములను, జాతీ పుష్పములను, నరసింహ స్వామి మస్తకమున నుంచవలయిను. అపుడు సిద్ది కలుగును. సర్వకార్యములందు విఘ్నములు కలగువు. ఎచటా విచారించడు . ఇట్టి నరసింహ భక్తుని బ్రహ్మరుద్రాది దేవతలు కూడా అడ్డగించజాలరు. ఇక దానవులు, సిద్దులు, గందర్మలు, మానవులు, విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, మహోరగులు, ఏల అడ్డగించగలరు. దివ్యశక్తులన్నియూ శ్రీనృహరి దివ్యాగ్నితేజస్సుచే ధ్వంసమగును. ఒకసారి అగ్ని శిఖా మంత్రమును జపించి సర్వోప్రదవములనునిశింప చేయగలుగును. నృసింహ కవచమును మూ%ు మార్లు జపించి దైత్యదానవులనుండి కాపాడుకొనగులును. భూతములనురి, పిశాచములనుండి, ఇతర శత్రువర్గమునుండి రక్షణను పొందును. మూడు మార్లు జపించిన కవచము సురాసురులచే కూడా భేదించ శక్యము కాదు. ద్వాదశయోజన పర్యంతము సర్వకాలములందు నృహరి కాపాడు చుండును. శ్రీనరసింహస్వామి మహా బలపరాక్రమము కలవాడు అంతటా కాపాడును.

తతో గత్వా బిల ద్వార ముపోష్య రజనీత్రయమ్‌ l ఫలాశకాషైః ప్రజ్వాల్య భగవజ్జాత వేదసమ్‌ 99

పాలాశసమిధం తత్ర జుహూయత్త్రిమధుప్లుతామ్‌ l ద్వే యుతే కంజనయనే శకటశ్చైవ సాధకః 100

తతః కవల్లీ వివరం ప్రకటం జాయతే క్షణాత్‌ l తతో విశేత్తు నిశ్శంకః కవల్లీ వివరం బుధః 101

గచ్ఛతశ్శకటస్యాధ తమో మోహశ్చ నశ్యతి l రాజమార్గస్తు విస్తీర్ణో దృశ్యతే తత్ర మోహిని! 102

నరసింహం స్మరం స్తత్ర పాతాలం విశ##తే తదా l గత్వా తత్ర జపేచ్చుద్దో నరసింహం తమవ్యయమ్‌ 103

తతస్త్రీణాం సహస్రాణి వీణాచామర కర్మణామ్‌ l నిర్గచ్ఛన్తి పురాచ్ఛైవ స్వాగతం తా వదన్తిచ 104

ప్రవేశయన్తి తం హస్తే గృహీత్వా సాధకేశ్వరమ్‌ l తతో రసాయనం దివ్యం పాయయన్తి సులోచనే 105

పీతమాత్రే దివ్యదేహో జాయతే సుమహాబలః l క్రీడతే దివ్య కన్యాభి ర్యావదాభూత సంప్లమ్‌ 106

భిన్నదేహో వాసుదేవం నీయతే నాత్ర సంశయః l యదా నరోచయన్త్యేతా స్తతో నిర్గచ్చతే పునః 107

పట్టం శూలం చ ఖడ్గం చ రోచనాం చ మణిం తథా l రసం రసాయనం చైవ పాదుకాంజనమేవచ 108

కృష్ణాంజలిం చ సుభ##గే గుటికాం చ మనశ్శిలామ్‌ l మండలాం చాక్ష సూత్రం చ షష్టీం సంజీవనీం తథా 109

సిద్దాం విద్యాం చ శాస్త్రౌణి గృహీత్వా సాధకోత్తమః l జ్వలద్వహ్ని స్సులింగోర్మి వేష్టితం త్రిదశం హృది 110

సకృన్న్యస్తం దహేత్సర్వం వృజినం జన్మకోటిజమ్‌ l విషే న్యస్తం విషం హన్యా త్కుష్టం హన్యాత్తనౌ స్థితమ్‌ 111

సుదేహ భ్రూణ హత్యాది కృత్వా దివ్యేన శుద్ద్యతి l మహాగ్రహ గృహీతేషు జ్వలమానం విచింతయేత్‌ 112

రుదన్తవై తతశ్శీఘ్రం నశ్యేయుద్దారుణా గ్రహాః l బాలానాం కంఠకే బద్ధా రక్షా భవతి నిత్యాశః 113

గండపిండక కృత్యానాం నాశనం కురుతే ధ్రువమ్‌ l వ్యాది ఘాతే సమద్భిశ్చ ఘృతం క్షీరేణ హోమయేత్‌ 114

త్రిసంధ్యం మాసమేకం తు సర్వరోగాన్వినాశ##యేత్‌ l అసాధ్యం నాస్య పశ్యామి తత్త్వస్య సచరాచరే 115

యాం యాం కామయతే సిద్దిం తాం తాం ప్రాప్నోత్యపి ధ్రువమ్‌ l అష్టోత్తర శతం త్వేకం పూజయిత్వా మృగాధిపమ్‌ 116

మృత్తికాం సప్తవల్మాకే స్మశానేచ చతుష్పధే l రక్త చన్దన సంమిశ్రాం గవాం క్షీరేణ లేపయేత్‌ 117

సింహస్య ప్రతిమాం కృత్వా ప్రమాణన షడంగులామ్‌ l భూర్జపత్రే విశేషేణ లిఖేద్రోచనయా తథా 118

నరసింహస్య కంఠే తు బద్దాచైవ స మంత్రవత్‌ l జపేత్సంఖ్యావిహీనం తు పూజయిత్వా జలాశ##యే 119

యావన్మన్త్రం జపతి సప్తాహాం సంరుతేన్ద్రియః l జలాకీర్ణా ముహూర్తేన జయతే సర్వమేదినీ 120

అధవా శుద్ద వృక్షాగ్రే నరసింహం తు పూజయతే l జప్త్వా చాష్టశతం తత్త్వం వర్షం తద్వినివారయేత్‌ 121

తమేవ పింజకే బద్ధా భ్రామయే త్సాథకోత్తమః l మహావాతో ముహుర్తేన ఆగచ్చెన్నాత్ర సంశయః 122

పునశ్చవారయన్సిక్తాం సప్తజప్తేన వారిణా l అధ తాం ప్రతిమాం ద్వారే నిఖనేద్యస్య సాధకః 123

గోత్రోత్సాదో భ##వేత్తస్య ఉద్దృతే చైవ శాంతిదః l తస్మాద్వై బ్రహ్మతనవయే పూజద్భక్తి దస్సదా 124

మృగరాజం మహావీర్యం సర్వకామ ఫలప్రదమ్‌ l దృష్ట్వా శ్రుత్వా నమస్కృత్య సంపూజ్య నృహరిం శుభే 125

ప్రాప్నువంతి నరా రాజ్యం స్వర్గం మోక్షం చ దుర్లభమ్‌ l నరసింహం నరోదృష్ట్వా లభేదభిమతం ఫలమ్‌126

విముక్త స్సర్వపాపేభ్యో విష్ణులోకం చ గచ్చతి l సకృతద్దృష్ట్వాతు తం దేవం భక్త్యా సింహవపుర్థరమ్‌ 127

ముచ్యతే పాతకైస్సర్వైః కాయవాక్చిత్త సంభ##వైః l సంగ్రామే సంకటే దుర్గే చౌరవ్యాఘ్రాధి పీడితే 128

కాంతారే ప్రాణసందేహో విషవహ్నిజలేషు చ l రాజాదిభీషు సంగ్రామే గ్రహరోగాది పీడితే 129

స్మృత్వా తం యో హి పురుష స్సంకటైర్విప్రముచ్యతే l సూర్యోదయే యధానాశం తమో భ్యేతి మహత్తరమ్‌ 130

తథా సందర్శనే తస్య వినాశం యాన్యుపద్రవాః l గూటికాం జనపాతాలే పాదలేపరసాయనమ్‌ 131

నరసింహే ప్రసన్నే తు ప్రాప్నోత్య న్యాంశ్చ వాంఛితాన్‌ l యాన్యాన్కామానభిధ్యాయ న్భజేత నృహరిం నరః 132

తాంస్తాన్కామానవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః 133

ఇతి శ్రీబృహన్నారాదీయ మహాపూరాణ ఉత్తర భాగే

మోహినీవసు సంవాదే పురుషోత్తమ మహాత్మ్యే

పంచపంచాశత్తమో ధ్యాయః

తరువాత బిలద్వారమునకు వెళ్ళి మూడురాత్రులు పవసిరంచి మోదుగు సమిధలచే అగ్నిని ప్రజ్వలింపచేసి మోదుగు సమిధలను పాలు పెరుగు నేతులలో కలిపి హోమమును గావించవలయును. రెండు పద్మక్షముల జంటల శకటమును హోమము గావించిన బిలాద్వారము క్షణకాలమున తెరుచుకొనును. అంతట నిస్సందేహముగా బిలద్వారమును ప్రవేశించవలయును. శకటము వెళ్ళు చుండగా చీకటి మోహము నశించును. అచట విశాలమగు రాజ మార్గము కనపడును. నరసింహస్వామిని స్మరించుచు పాతాళమున ప్రవేశించును. పాతాళమునకు వెళ్ళి అవ్యయుడగు నరసింహ స్వామిని జపించవలయును. అంత వీణాచామరపాణుగు వేలస్త్రీలు నగరమునుండి వెలుపలకు వచ్చి స్వాగతమును పలికెదరు. మంత్రసాధకుని చేయి పట్టుకొని నగరమున ప్రవేశింప చేతురు. అపుడు దివ్యమగు రసాయనమును త్రాగించెదరు. రసాయన పానము చేసిన పవెంటనే దివ్యదేహుడు మహాబలుడగును. ప్రళయ కాలమువరకు దివ్యకన్యలచే క్రీడించును. భిన్నదేహుడైనచో వాసుదేవుని చేరును. ఈ దివ్యక్రీడలు రుచించనిచో మరల అటనుండి పట్టమును, శూలమును, ఖడ్గమును, రోచనమును, మణిని, రసమును, రసాయనమును, పాదుకలను, ఆంజనమును, కృష్ణాంజలిని, గుటికను, మనశ్శిలను, మండలమును, అక్షసూత్రమును, సంజీవనిని, సిద్ధ విద్యను, శాస్త్రములను తీసుకొని బయలు దేరును. మండు అగ్ని విస్ఫులింగ ప్రవాహ చక్రమును హృదయమున న్యాసము గావించును. ఈ న్యాసము ఒక మారు జరిగిన కోటి జన్మముల పాపములు భస్మములగును. విషమున నుంచిన విషమును దహించున శరీరమునున్న కుష్టువ్యాధిని నశింప చేయును. భ్రూణహత్యాది పాపములు నశించును. మహాగ్రహు%ులు పట్టినచో ఈ జ్వాలను ధ్యానించ వలయును. వెంటనే ఆగ్రహములన్నియూ రోదించుచు నశించును. ఈ న్యాసమును బాలుల కంఠమున ధరించినచో ఎల్లకాలము రక్షించును. గండపిండ కృత్యములను నశింప చేయును. వ్యాధులు కలిగినచో సమిధలచే నేయిచే పాలచే హోమమును చేయవలయును. ఇట్లు ఒకనేల నశించును. ఈ చరాచర ప్రపంచమున ఇతనికి అసాధ్యమగున దేదియునుండదు. కోరిన ప్రతి సిద్ది లభించును. నరసింహస్వామిని నూటా ఎనిమిది సార్లు పూజించి ఏడు పుట్టలలోని మట్టిని స్మశాన మృత్తికను, నాలుగు దారుల కూడలిలోమట్టిని రక్తచందనమును గోక్షీపరములు కలిసి ఆరంగుళముల సింహప్రతిమను నిర్మించి గోరోచనముతో భూర్జపత్రమున వ్రాసి మంత్రించి కంఠమున బంధించి సంఖ్యాహీనముగా జపించి, జలాశరుమున పూజించి ఇంద్రియ నిగ్రహముతొ ఏడు దినములు జపించినంతనే భూమియంతయు జలమయమగును. లేదా పరిశుద్దమగు వృక్షాగ్రమున నృసింహస్వామిని పూజించవయును. నూటా ఎనిమిదిమారులు జపించినచో వర్షమును వారించును. ఈ మత్రమును పింజకమున బంధించి తిప్పినచో క్షణ్కాలమున పెనుగాలి వచ్చను. ఏడుమార్లు జపించిన జలముచే తడిపిన నరసింహప్రతిమను ద్వారమున ప్రతిష్టించినచో గోత్రోత్సాదనము జరుగును. ప్రతిమనుద్దురించిన శాంతి కలుగును. కావున ఎపుడూ మహావీర్యుడు, సర్వకామ ఫలప్రదుడు అగు మృగరాజును పూజించవలయును. నరసింహస్వామిని దర్శించి, విని నమస్కరించి, పూజించవలయును, నరసింహస్వామిని దర్శించిన వారు అక్షయ ఫలములను పొందెదరు. సర్వపాప వినిర్ముక్తులై విష్ణులోకమును చేరెదరు. సింహవపుర్ధరుడగు శ్రీనృహరిని ఒకమారు దర్శించినచో వాక్కాయ మనో సంభవములగు అన్ని పాపములనుండి విముక్తిని పొందును. సంగ్రామమున, సంకటమున, దుర్గమున చోరవ్యాఘ్రాది పీడలందు, అరణ్యమున, ప్రాణసంకటమున, విషవహ్నిజలములందు, రాజ భయమున, గ్రహరోగాది పీడలందు, నృసింహుని స్మరించినచో సకల సంకటములు తొలగును. సూర్యోదయమున చీకటివలె ఆపదలు నశించును. నరసింపదంశనము ఉపద్రవములు నిశించును. జనపాతాలను%ున గుటికను, పాదలేప రసాయనమును, ఇతర వాంఛితములను నృసింహ ప్రసాదమున పొందగలుగును. ఇతరములగు కామములను మనసున సంకల్పించి నరసింహస్వామిని సేవించినచో ఆ కోరికలన్నింటిని నిశ్చయముగా పొందగలుగును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున

మోహినీవసు సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబదియైదవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page