Sri Naradapuranam-3    Chapters    Last Page

షట్పంచాత్తమోధ్యాయః యాబదియారవ అధ్యాయము

పురుషొత్తమ మహాత్య్మమ్‌

వసురువాచః-

అన్యచ్ఛృణు మహాభాగే తసటి ఞ్రఛ్రీ పురుషోత్తమే l తీర్థవ్రజం మహత్‌ పుణ్యం దర్శనాత్పాపనాశనమ్‌ 1

అనన్తాఖ్యం వాసుదేవం దృష్ట్వా భక్త్యా ప్రణమ్య చ l సర్వపాపవినిర్ముక్తో నరో యాతి పరం పదమ్‌ 2

శ్వేత గంగాం నరస్నాత్వా యః పశ్యేచ్చ్వేత మాధవమ్‌ l మత్స్యాఖ్యం మాధవం చైవ శ్వేత ద్వీపం స గచ్ఛతి 3

తుషార ప్రతిమం శుద్దం శంఖ చక్రగదాధరమ్‌ l సర్వ లక్షణ సంయుక్తం పుండరీకామతేక్షణమ్‌ 4

శ్రీవత్స వక్షసా యుక్తం సుప్రసన్నం చతుర్బుజమ్‌ l వనమాలావృతోరస్కం ముకుటాంగదధారిణమ్‌ 5

పీతవస్త్రం సుపీనాంసం కుండలాభ్యా మలంకృతమ్‌ l కుశాగ్రేణాపి రాజేన్ద్ర శ్వేతగాంగేయమేవచ 6

స్పృష్ట్వా స్వర్గం గమిష్యంతి విష్ణుభక్తాస్సమహితాః l యస్త్విమాం ప్రతిమాం పశ్యే న్మాధవాఖ్యాం శశిప్రభామ్‌ 7

శంఖగోక్షీర సంకాశా మశేషాఘవినాశినీమ్‌ l తాం ప్రణమ్య సకృద్భక్త్యా పుండరీక నిభేక్షణమ్‌ 8

విహయ సర్వకామన్వై విష్ణులోకే మహీయతే l మన్వన్తరాణి తత్రైవ దేవకన్యాభిరావృతః 9

గీయామానశ్చ గంధర్వై స్సిద్ధవిద్దాధరార్చితః l భునక్తి విపులాన్భోగా న్యధేష్టం దైవతైస్సహ 10

చ్యుత స్తస్మాదిహాగత్య మానుష్యే బ్రహ్మణో భ##వేత్‌ l వేదవేదాంగ విద్దీమాన్‌ భోగవాంశ్చిర జీవితః 11

గజాశ్వరధ యానాఢ్యో ధనద్యానవృతశ్చుచిః l రూపవాన్బహు భాగ్యశ్చ పుత్ర పౌత్ర సమన్వితః 12

పురుషోత్తమం పునః ప్రాప్య వటమూలేధ సాగరే l త్యక్త్వా దేహం హిరిం స్కృత్వా తతశ్శాంతం పదం వ్రజేత్‌ 13

ééశ్వేత మాధవ మాలోక్య సమీపే మత్స్య మాధవమ్‌ l ఏకార్ణవే జలే పూర్వం రూపం రోహిత మా స్థితః 14

వేదానాం హరణార్థాయ రసాతల తలేస్థితః l చింతయిత్వా క్షితిం మత్స్యం తస్మింస్థానే వ్యవస్థితమ్‌ 15

ఆధాయ తరుణం రూపం మాధవం మత్స్య మాధవమ్‌ l ప్రణమ్య ప్రయతో భూత్వా సర్వాన్కష్టాన్విముంచితి 16

ప్రయాతి పరమం స్థానం యత్రదేవో హరిస్స్వయమ్‌ l కాలే పునరీహాయతో రాజా స్యాత్పృధీవీతలే 17

మత్స్య మాధవ మాసాద్య దురాధర్షో భ##వేన్నరః l దాతా భోక్తా భ##వేద్యాద్దా వైష్ణవ స్సత్య సంగరః 18

యోగం ప్రాప్య హరేః పశ్చాత్‌ తతో మోక్షమవాప్నుయాత్‌ l మత్స్యమాధవ మహాత్మ్యం మయా తే పరికీర్తితమ్‌ 19

యం దృష్ట్వా బ్రహ్మతనయే సర్వాన్కామానవాప్నుయాత్‌

వసువు పలికెను :-

శ్రీపురుషోత్తమ క్షేత్రమున మహాపుణ్య ప్రదమగు మరియొక తీర్థ వ్రజమును గూర్చి చెప్పెదను విముము. ఈ తీర్థ రాజ సందర్శనము పాపనాశకము. ఇచట అనన్త నామముతో నున్న వాసుదేవుని దర్శించిన భక్తితో నమస్కరించి సర్వపాపవినిర్ముక్తుడై పరమ పదమును చేరును. శ్వేతగంగలో స్నానమాడి శ్వేతమాధవుని దర్శించవారు ఉత్తమగతిని పొందెదరు. మత్స్యనామముతో ఉన్న మాధవుని దర్శించిన వారు శ్వేతద్వీపమును పొందెదరు. తుషార ప్రతిముడు, శంఖచక్రగదాధరుడు, సర్వలక్షణ సంయుక్తుడు, పుండరీకాయతేక్షణుడు, శ్రీవత్స వక్షుడు, సుప్రసన్నుడు, చతుర్బుజుడు, వనమాలాకృతోరస్కుడు, ముకుటాంగదధారి, పీతవస్త్రుడు, సుపీనాంసుడు, కుండలాలంకృతుడు, అగు మత్స్య నామ మాదవుని దర్శించవలయును. శ్వేతగంగాజలమును కుశాగ్రముచే స్పృశించిననూ సావధానులగు విష్ణుభక్తులు స్వర్గమును చేరెదరు. ఇచట శశిప్రభగలది శంఖగోక్షీర సంకాశము, సకల పాపవినాశని, యగు ఈ ప్రతిమను దర్శించి ఒకసారి భక్తిచే నమస్కరించి సర్వకామనలను విడిచి విష్ణులోకమున విరాజిల్లును. అచటనే అన్ని మన్వన్తరమలు దేవాకన్యలచే కూడి గంధర్వ గానములతో సిద్ద విద్యాధర పూజితుడై యధేష్టముగా దేవతలతో కలిసి సకల భోగములననుభవించును. పుణ్యక్షరుయమున ఆటనుండి భూలొకమున కొచ్చి మానవులలో బ్రాహ్మణునిగా పుట్టును. వేదవేదాంగములను తెలిసినవాడు, దీమంతుడు, భోగి, దీర్ఝాయుష్యము కలవాడు, గజాశ్వరధవాహనములపై వెళ్ళు వాడు, ధనధాన్య సమన్వితుడు, పవిత్రుడు, రూపవంతుడు, బహు భాగ్యవంతుడు, పుత్రపౌత్ర సమన్వితుడుగా నుండును. మరల పురుషోత్తమ క్షేత్రము చేరి సాగరమున నున్న వటవృక్షమూలమున శ్రీహరిని స్మరించుచు దేహమును విడిచి శాంతిధామమును చేరును. శ్వేతమాధవుని చూచి, తత్సమీపమున రోహిత రూపమును ధరించి వేద హరణము కొరకు రసాతలమున నుండెను. భూమి పై ఈ స్థానమున మత్స్య రూపముగా నున్న స్వామిని ధ్యాగనించి తరుణరూపముతో మత్స్య మాధవునిగా నున్న మత్స్యని భక్తిచే నమస్కరించి సకల కష్టలములనుండి విముక్తుడగును. సాక్షాత్తుగా శ్రీహరియున్న పరమ పదమును చేరును. యధాకాలమున మరల ఇటకొచ్చి భూమండలమున రాజుగా పుట్టును. మరల మత్స్య మాధవమును చేరి దురాధర్షుడగును. దాత, భోక్త, యోద్ధ, విష్ణుభక్తుడు, సత్యపాలకుడు, అగును. తరువాత శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. ఇట్లు నీకు మత్స్య మాధవ మాహాత్య్మమును వివరించితిని. ఈ క్షేత్రమును దర్శించిన వారు సర్వాభీష్టములను బడయగలరు.

మార్జనం తత్ర వక్ష్యామి మార్కండేయ హ్రదే శుభే 20

భక్త్యా తు తన్మనా భూత్వా పురాణం పుణ్యముక్తిదమ్‌ l మార్కండేయ హ్రదే స్నానం సర్వకాం ప్రశస్యతే 21

చతుర్దశ్యాం విశేషేణ సర్వ పాప ప్రణాశనమ్‌ l తద్వత్స్ననం సముద్రస్య సర్వకాలం ప్రశస్యతే 22

పౌర్ణమాస్యాం విశేషేణ హయమేధ ఫలం లభత్‌ | పూర్ణిమా జ్యేష్ట మాసస్య జేష్ఠాఋక్షం యదాభ##వేత్‌ 23

తదాగచ్ఛే ద్విశేషేణ తీర్థరాజం పరం శుభమ్‌ l కాయవా ఙ్మనసైశ్శుద్ద సద్బావోనన్య మానసః 24

సర్వద్వన్ద్వ వినిర్ముక్తో వీతరాగో విమత్సరః l కల్ప వృక్షం వటం రమ్యం యత్ర సాక్షాజ్జనార్దనః 25

ప్రదక్షిణం ప్రకుర్వీత త్రీన్వారాన్సు సమాహితః l దృష్ట్వా నశ్యతి యత్పాపం సప్త జన్మ సముద్భవమ్‌ 26

పుణ్యం ప్రాప్నోత విపులం గతిమిష్టాం చ మోహిని! l తస్య నామాని వక్ష్యామి సప్రమాత్ర యుగే యుగే 27

వటం వటేశ్వరం శాంతం పురాణ పుయషం విదుః l వటస్యేతాని నామాని కీర్తితాని కృతానితు 28

యోజనం పాదహీనంచ యోజనార్థం తదర్థకమ్‌ l ప్రమాణం కల్పవృక్షస్య కృతాధిషు యధాక్రమమ్‌ 29

పూర్వోక్తేన తు మంత్రేణ నవుస్కృత్వా చ తం వటమ్‌ l దక్షిణాభిముఖో గచ్ఛే ద్ధన్వంతరశతత్రయమ్‌ 30

యత్రసౌ దృశ్యతే చిహ్నం స్వర్గద్వారాం మనోరమమ్‌ l సాగరాంతస్స మాకృష్టం కాష్ఠం సర్వగుణాన్వితమ్‌ 31

ప్రణిపత్య తతస్తిష్ఠే త్పరిపూజ్య తతః పునః l ముచ్యతే సర్వపాపౌఘై స్తధా పాప గ్రహాదిభిః 32

ఉగ్రసేనః పురా దృష్ట్వా స్వర్గద్వారేణ సాగరమ్‌ l గత్వాచమ్య శుచిస్తత్ర ధ్యాత్వా నారాయణం పరమ్‌ 33

న్యసేదష్టాక్షరం మంత్ర పశ్చాద్దస్త శరీరయోః l ఓం నమో నారాయణాయేతి యం వదన్తి మనీషిణః 34

కిం కార్యంబహుభిర్మంత్రై ర్మనో విభవకారకైః l నమో నారారుణాయేతి మన్త్రస్సర్వార్థసాధకః 35

ఆపో నరస్య సూనుత్వా న్నారా ఇతి హ కీర్తితాః l విష్ణోస్తాస్త్వాలయం పూర్వం తేన నారాయణ స్మృతః 36

నారాయణ పరా వేదా నారాయణ పరా ద్విజా l నారాయణ పరం జ్ఞానం నారాయణం పరా క్రియా 37

నారాయణ పరో ధర్మొ నారాయణ పరం తపః l నారాయణ పరం దానం నారాయణ పరం వ్రతమ్‌ 38

నారాయణ పరా లోకా నారాయణ పరాస్సురాః l నారాయణ పరం నిత్యం నారాయణ పరం పదమ్‌ 39

నారాయణ పరా పృధ్వీ నారాయణ పరం జలమ్‌ l నారాయణ పరో వహ్నిః నారాయణ పరం నభః 40

నారాయణ పరో వాయు ర్నారాయణ పరం మనః l అహంకారశ్చ బుద్దశ్చ ఉభే నారాయణాత్మకే 41

భూతం భవ్యం భవిష్యచ్ఛ యత్కించి జ్జీవ సంజ్ఞితమ్‌ l స్థూలం సూక్ష్మం పరం చైవ సర్వం నారాయణాత్మకమ్‌ 42

నారాయణాత్పరం కించిత్‌ నేహ పశ్యామి మోహిని! l తేన వ్యాప్త మిదం సర్వం దృశ్యాదృశ్యం చరాచరమ్‌ 43

ఆపోహ్యాయతనం విష్ణో స్సచా సావంభసాం పతిః l తస్మాదప్సు స ఇత్యేవం నారాయణ మఘాపహమ్‌ 44

స్నానకాలే విశేషేణ చోపస్థాయ జలే శుచిః l స్మరేన్నారాయణం ధ్యాయే ధ్దస్తే కాయే చ విన్యసేత్‌ 45

ఓంకారం వామ కట్యాం తు నాకారం దక్షిణ తథా l రాకారం నాభిదేశేతు యకారం వామ బాహుకే 46

ణాకారం దక్షిణ న్యస్య యకారం మూర్ద్ని విన్యసేత్‌ l అధశ్చోర్ద్వం చ హృదయే పార్శ్వతః పృష్ఠతో గ్రతః 47

ధ్యాత్వా నారాయణం పశ్చా దారభేత్కవచం బుధః

ఇక ఇపుడు శుభప్రదమగు మార్కండేయ హ్రదమున చేయదగిన మార్జనమును వివరించెదను. ఈ మార్జనము భక్తిచే తన్మనస్కులై పుణ్యమును ముక్తిని ప్రసాదించు పురాతనమగు మార్జనమను చేయవలయును. మార్కండేయ హ్రదమున అన్నికాలములందు స్నానము విశేష ఫలప్రదముగా చెప్పబడినది. విశేషించి చతుర్దశీస్నానము సర్వపాపప్రణాశనముగా పేర్కొనబడినది. ఇట్లే సముద్ర స్నానము కూడా సర్వకాలములందు విశేష ఫలప్రదమే. పౌర్ణమిన సముద్రస్నానము అశ్వమేధ యాగ ఫలప్రదము. జ్యేష్ఠ పూర్ణిమన జ్యేష్ఠా నక్షత్రయోగమున్న నాడు విశేషించి ఈ తీర్థ రాజమునకు వెళ్ళ వలయును. కాయవాజ్మానసములచే పరిశుద్దుడై, రాగమును వీడి, మాత్సర్యమును వదలి, రమ్యమగు వట కల్ప వృక్షమును సాక్షాత్తుగా జనార్థన రూపమున నున్న దానిని సావధానముతో మూడు మార్లు ప్రదక్షిణము నాచరించవలయును. ఈ కల్ప వృక్షమునకు ప్రతియుగమున ప్రసిద్దిని పొందిన నామములును చెప్పెదను. వటము, వటేశ్వరము, శాంతము, పురాణ పురుషుడు, ఈ నాముముల కృతాది యుగములందు చెప్పబడినవి. యోజనము, పాదహీనయోజనము, యోజనార్థము, తదర్థము, కృతాదియుగములలో వట వృక్ష విస్తార ప్రమాణములు. పూర్వోక్త మంత్రముచే వట వృక్షమును నమస్కరించి, దక్షిణాభిముఖముగా మూడు వందల ధనుః ప్రమాణ దూరమును వెళ్ళవలయును. అచట మనోహరమగు స్వర్గ ద్వార చిహ్నము సాగరాంతర్దామమున అకర్షించబడు సర్వగుణాన్వితమగు కాష్ఠము కనిపించింను. ఆ కాష్ఠమునకు నమస్కరించి చక్కగా పూజించి నిలువ వలయును. ఇట్లు ఆచరించినచోసర్వపాపముల నుండి పాపగ్రహాదులనుండి విముక్తుడగును. పూర్వ కాలమున ఉగ్రసేనుడు స్వర్గ ద్వారముచే సాగరమును సందర్శించి వెళ్ళి ఆచమనము చేసి శుచియై పరుడగు నారాయణుని ధ్యానము గావించి హస్త శరీర భాగములందు అష్టాక్షర మంత్రన్యాసమును గావించ వలయును. 'ఓం నమో నారాయణాయ' అను మంత్రమును జపించిన వారికి మనోవిభవ కారకములగు ఇతర మంత్రములచే పని యేముండును. ఓం నమోనారాయణ అను మంత్రమును సర్వార్థసాధనము జలములు నరసముత్పన్నములు కావున నారములనబడును. పూర్వము నారములే శ్రీ మహావిష్ణువునకు నివాస స్థానము కావున విష్ణువునకు నారాయణ నామము కలిగినది. వేదములు నారయణ పరములు. బ్రాహ్మణులు నారాయణ పరులు. నారాయణ పరము. జ్ఞానము. ప్రతికార్యము నారాయణ స్వరూపము. ధర్మము నారాయణ పరము. తపస్సు నారాయణ పరము. దానము నారాయణ పరము. వ్రతము నారాయణ నారాయణ పరమ.వ్రతము నారాయణ స్వరూపము. దర్మము నారాయణ పరము. తపస్సు నారాయణ పరము. దానము నారాయణ పరము. ప్రతిస్థానమ నారాయణ పరము. భూమి నారాయణ పరమే. జలము అగ్ని, ఆకాశము, వాయువు నారాయణ పరములే. మనస్సు నారాయణ పరమే . బుద్ది, అహంకారములు నారాయణ పరమేములే భూతభవ్యభవిష్యత్తులు, సకల జీవ సంజ్ఞకములు, స్థూల సూక్ష్మములు, పరము అంతయూ నారాయణాత్మకమే. ఈ సృష్టిలో నారాయణనుకంటే పరమైన దేదియూ లేదు. దృశ్యాదృశ్యము చరాచరమంతయు నారాయణునిచే వ్యాపించ బడియున్నది. శ్రీ విష్ణువునకు నివాసము జలములు. కావున శ్రీ మహావిష్ణువు జలాధిపతి. కావుననే జలములలో శ్రీహరి యుండును. కావున నారాయణ స్వరూపములగు జలము సర్వపాపప్రణాశకము. విశేషించి స్నానకాలమున జలమున శుచియై నారాయణుని స్మరించి ధ్యానముచేసి హస్తములందు శరీరమునందు న్యాసమును గావించ వలయును. వామకటియందు ఓంకారమును, దక్షిణకటియందు నాకారమును, నాభి దేశమున రాకారమును, వామ బాహువు నందు యకారమును, దక్షిణ బాహువు నందు నాకారమును, శిరస్సునందు యకారమును న్యాసమును చేయవలయును. అధోబాగమున, ఊర్థ్వ భాగమున హృదయమున, పార్శ్వములందు, పృష్ఠ భాగములందు, అగ్రభాగమున న్యాసమును కావించ వలయును. తరువాత నారాయణుని ధ్యానము చేసి, కవచము నారంభించవలయును.

పూర్వే మాం పాతు గోవిందో దక్షిణ మధుసూదనః 48

పశ్చిమే శ్రీధరో దేవః కేశవస్తు తధోత్తరే l పాతు విష్ణుస్తథాగ్నేయే నైరుతో మాధవోsవ్యయః 49

వాయువ్యేతు హృషీకేశ స్తధేశానే చ వామనః l భూతలే పాతు వారాహ స్తధోర్థ్యేచ త్రివిక్రమః 50

కృత్వైవం కవచం పశ్చా దాత్మానం చింతయేత్తతః l అహం నారాయణో దేవ శ్శంఖ చక్రగదాధరః 51

ఏవం ధ్యాత్వా తదాత్మానం ఇమం మన్త్రము దీరయేత్‌ l త్వమగ్నిర్ద్విపదాం నాధ రేతోధాః కామదీపనః 52

ప్రధాన స్సర్వ భూతానం జీవానాం ప్రభురవ్యయః l అమృతస్యారణిస్త్వం హి దేవయోని రపాం పతే 53

వృజినం హర మే సర్వం తీర్థరాజ నమోస్తుతే'' l ఏవముచ్ఛార్య విధివ త్తతస్స్నానం సమాచరేత్‌ 54

అన్యధా బ్రహ్మతనయే స్నానం తత్ర న శస్యతే l కృత్వచాభ్దైవత్తెర్మన్త్రై రభిషేకం చ మార్జనమ్‌. 55

అంతర్జలే జపన్పశ్చా త్త్రిరావృత్యాఘమర్షణమ్‌ l హయమేధో యధా దేవి! సర్వాప హరః క్రతుః 56

తధాఘ మర్షణం చాత్ర సూక్తం సర్వాఘమర్షణమ్‌ | ఉత్తీర్య వాససీ ధౌతే నిర్మలే పరిధాయ చ 57

ప్రాణానాయమ్య చాచమ్య సంధ్యాం చోపాస్య భాస్కరమ్‌ l ఉపాతిష్ఠేత్తతశ్చోర్థ్వం క్షిప్త్వాపుష్ప జలాంజలిమ్‌ 58

ఉపస్థాయోర్థ్వ బాహుశ్చ తల్లింగైర్భస్కరం తతః l గాయత్రీం పావనీం దేవీం జపేదష్టోత్తరం శతమ్‌ 59

అన్యాంశ్చసౌరమంత్రాన్‌హి జప్త్వా తిష్ఠన్సమాహితః l కృత్వా ప్రదక్షిణం సూర్యం నమస్కృత్యోపవిశ్యచ 60

స్వాధ్యాయం ప్రాజ్ముఖః కృత్వా తర్పయేద్దేవ మానవాన్‌ l ఋషీన్పితౄన్హిస్వీయాంశ్చ విధివన్నామగోత్రవిత్‌ 61

తోయేన తిలమిశ్రేణ విధివత్సు సమాహితః l శ్రాద్దే హవన కాలే చ పాణినైకేన నిర్వపేత్‌ 62

తర్పణతూ భయం కుర్యా దేష ఏవ విధిస్సదా l అన్వారబ్దేన సవ్యేన పాణినా దక్షిణన తు 63

తృప్యతామితి సువ్యక్తం నామగోత్రేణ వాగ్యతః l కాయస్దైర్యస్తిలైర్మోహా త్కరోతి పితృతర్పణమ్‌ 64

తర్పితాస్తేన పితర స్త్వజ్మాంస రుధిరాస్థిభిః l జలే స్థిత్వా స్థలే దత్తం స్థలే స్దిత్వా జలేర్పితమ్‌ 65

నోపతిష్ఠతి తత్తోయం యధ్బూమ్యాం న ప్రదీయత్‌ l పితౄణామక్షయం స్థానం మహీ దత్తా విరించినా 66

తస్మాత్తత్రైవ దాతవ్యం పితౄణాం ప్రీతిమచ్చతా l భూమిస్తేన సముత్పన్నా భూమ్యాం చైవ తు సంస్థితమ్‌ 67

భూమ్యాం చైవ లయం యాంతి భూమౌ దద్యాత్తతో జలమ్‌ l అస్తీర్య చ కుశాన్సాగ్రా నావాహ్య స్వస్వమంత్రతః 68

ప్రాచీనాగ్రేషు వై దేవా న్యామ్యాగ్రేషు తథా పితౄన్‌ 69

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే

మోహినీవసు సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే

షట్పాంచాశత్తమోs ధ్యాయః

పూర్వదిక్కున గోవిందుడు, దక్షిణమున మధుసూదనుడు, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున కేశవుడు కాపాడుగావుత. అగ్నేయమున విష్ణువు. నైరుతమున మాధవుడు, వాయవ్యమున హృషీకేశుడు, ఈశాన్యమున వామనుడు కాపాడు గావుత. భూతలమున వరాహస్వామి, ఊర్థ్వము త్రివిక్రముడు కాపాడు గావుత. ఇట్లు కవచమును ఆచరించి తరువాత ఆత్మస్వరూపమును చింతించవలయును. నేను శంఖచక్ర గదాధరుడగు నారాయణ దేవుడను. ఇట్లు ఆత్మ ధ్యానమును గావించి ఈ మంత్రమును పఠించవలయును.

''త్వమగ్ని ర్ద్విపదాం నాధ రేతోధాః కామదీపనః

ప్రధానస్సర్వ భూతానాం జీవానాం ప్రభురవ్యయః

అమృతస్యారణి స్త్వంహి దేవయోని రపాం పతే

వృజినం హర మే సర్వం తీర్థరాజ నమోస్తుతే'''

అనునది మంత్రము. ఓద్విపాత్‌ పతీ! నీవు అగ్నివి. కామదీపకమగు రేతో నివాసము నీవే. సర్వభూతములలో ప్రధానుడవు. జీవులకు ప్రభువు నీవే. నీవు అవ్యయుడవు. అమృతమును ఉత్పత్తి స్థానము. దేవతలకు కారణ భూతుడవు. జలాధిపతివి నీవే కావున నా సర్వ పాములను హరించుము. ఓ తీర్థ రాజా! నీకు నమస్కారము . అని ఈ మంత్రమునకు అర్థము. ఇట్లు యధావిధిగా మంత్రమునుచ్చరించి తరువాత స్నానమును ఆచరించవలయను. ఇట్లు ఆచరించక చేసిన స్నానము సఫలము కాజాలదు. జలదేవతా మన్త్రములచే అభిషేకమును, మార్జనమును ఆచరించి నీటిలో అఘమర్షణ మంత్రమును మూడు మార్లు జపించ వలయును. అశ్వమేధ యాగము సర్వపాహరమగునట్లు అఘమర్షణ సూక్తము సర్వపాపహరము. తరువాత జలమునుండి తీరమునకు వచ్చి ధౌతములు నిర్మలమగు వస్త్రములను ధరించి, ప్రాణాయామము నాచరించి, ఆచమనము గావించి, సంధ్యావందనము చేసి సూర్యుని పూజించి, ఊర్థ్వమునకు పుష్ప జలాంజలిని చల్లి ఉపాసన గావించవలయును. ఇట్లు ఉపస్థానము గావించి, ఊర్థ్వ బాహువుగా నిలిచి సూర్యుని ఆ చిహ్నములతో సేవించి, పరమ పవిత్రమగు గాయత్రీ మంత్రమును నూటా ఏనిమది మార్లు జపించవలయును. సావధానముగా నిలిచి ఇతర సౌర మంత్రములను జపించి ప్రదక్షిణము నాచరించి, సూర్యునికి నమస్కరించి, కూర్చొని ప్రాజ్ఞునిగా స్వాధ్యాయమును అధ్యయనము గావించి దేవతలకు, మానవులకు తర్పణము గావించవలయును. స్వఋషులను, పితరులను యధావిధిగా నామగోత్రములతో నువ్వులు కలిపిన జలముచే తర్పణముగావించవలయును హవన కాలమున, శ్రాద్దకాలమున ఒక హస్తముతో తర్పణము గావించవలయును. తర్పణమునుమాత్రము రెండు హస్తములచే చేయవలయును. ఇదియే అన్నివేళలలో విధి. సవ్యముగా అన్వారబ్దమగు దక్షిణహస్తముతో నామగోత్రములను చ్చరించి తృప్తి చెందుగాక అని పలికి వాజ్నియమముచే, స్థిర కాయముచే తిలములచే తర్పణము గావించిన త్వఙ్మాంసరుధిరాస్థులచే తృప్తి పొందెదరు. నీటిలో ఉండి భూమిపై నిచ్చిన తర్పణమును గావించవలయును. పితరులకు అక్షయ స్థానము భూమి అని బ్రహ్మ భుమిని ప్రదానముగావించెను. కావున పితరుల ప్రీతిని గోరువారు భూమి మీదనే తర్పణమును గావించవలయును. నీటిలో నుండియే భూమి పుట్టినది. భూమియందే జలముండును. భూమియందే జలము లీనమగును. కావున జలమును భూమియందే విడువవలయును. కొనలున్న దర్భలను భూమియందు పరిచి స్వస్వమంత్రములచే అహహన చేయవలయును ప్రాచీనాగ్రములగు దర్భలందు దేవతలను, దక్షిణాగ్రదర్భములందు పితరులను అవాహన చేయవలయున

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగమున

మోహినీవసు సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున

యాబది యారవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page