Sri Naradapuranam-3    Chapters    Last Page

అష్ట పంచాశత్తమోధ్యాయః యాబదియెనిమిదవ అధ్యాయము

బ్రహ్మాండోత్పత్తి వర్ణనమ్‌

వసురువాచః-

ఏవం సంపూజ్య విధివ ధ్బక్త్యా తం పురుషోత్తమమ్‌ l ప్రణమ్య శిరసా పశ్చా త్సాగరంచ ప్రసాదయేత్‌ 1

''ప్రాణస్త్వం సర్వభూతానాం విశ్వస్మిన్సరితాం పతే l తీర్థరాజ నమస్తేs స్తు త్రాహి మా మచ్యుత ప్రియ 2

స్నాత్వైవం సాగరే సమ్యక్‌ తస్మినక్షేత్రవరే శుభే l తేరే చాభ్యర్చ్య విధివ న్నారాయణ మనామయమ్‌ 3

రామం కృష్ణం సుభద్రాంచ ఫ్రతిపత్య చ సాగరమ్‌ l శతానామశ్వమేధానం ఫలం ప్రాప్నోతి మానవః 4

సర్వ పాప వినిర్ముక్త స్సర్వ దుఃఖ వివర్జితః | బృందారకహరి శ్శ్రీమా న్రూప¸°వన గర్వితః. 5

విమానేనార్క వర్ణేన దివ్య గంధర్వ నాదినా l కులైక వింశతిం ధృత్వా విష్ణులోకం చ గచ్ఛతి 6

భుక్త్వా తత్ర వరాన్భోగా న్ర్కీడిత్వా చ సురైస్సహ l చ్యుతస్తస్మాదిహాయాతో బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః 7

యశస్వీ మతిమఞ్చ్రీ మా న్సత్యవాదీ జితేంద్రియః l వేద శాస్త్రార్ద విద్విప్రో భ##వేత్సశ్చాత్తు వైష్ణవః 8

యోగం చ వైష్ణవం ప్రాప్య తతో మోక్షమవాప్నుయాత్‌ l గ్రహోపరాగే సంక్రాన్త్యా మయనే విషువే తథా 9

యుగాదిషు చ మన్వాదౌ వ్యతీపాతే దినక్షయే l ఆషాఢ్యాం చైవ కార్తిక్యా మాఘ్యాం వాన్యశుభే తిధౌ 10

యే త్వత్ర దానం విప్రేభ్యః ప్రయచ్ఛన్తి సుమేధసః l ఫలం సహస్యగుణిత మన్య తీర్థాల్లభన్తితే 11

పితౄణాం యే ప్రయచ్ఛన్తి పిండం తత్ర విధానతః l అక్షయాం పితరస్తేషాం తృప్తిం సంప్రాప్నువంతి వై 12

ఏవం స్నానఫలం సమ్యక్‌ సాగరస్య మయేరితమ్‌ l దానస్య చ ఫలం దేవి పండదానస్య చైవ హి 13

దర్మార్ధ మోక్షఫలద మాయుః కీర్తియశస్కరమ్‌ l భుక్తి ముక్తి ప్రదం నౄణాం ధన్యం దుస్స్వప్న నాశనమ్‌ 14

సర్వ పాప హరం పుణ్యం సర్వకామఫలప్రదమ్‌ l నాస్తికాయ న వక్తవ్యం శఠాయ కృపణాయ చ 15

తావద్గర్జన్తి తీర్థాని మహాత్మ్యైసై#్వఃపృధక్‌ పృధక్‌ l యావన్నతీర్థ రాజస్య మాహాత్య్మం వర్ణ్యతే ద్విజైః 16

పుష్కరాదీని తీర్థాని ప్రయచ్ఛన్తి స్వకం ఫలమ్‌ l తీర్థ రాజస్సముద్రస్తు సర్వతీర్థ ఫలప్రదః 17

భూతలే యాని తీర్థాని సరితశ్చ సరాంసిచ l విశంతి సాగరే తాని తేన వై శ్రేష్ఠతాం గతః 18

రాజా సమస్త తీర్దానాం సాగర స్సరితాంపతిః l తస్మాత్స్పమస్త తీర్థేభ్య శ్రేష్ఠోసౌ సర్వకామదః 19

తమోనాశం యధాభ్యేతి భాస్కరేభ్యుదితే సతి l కోట్యో నవనవత్యస్తు యత్ర తీర్థాని సన్తివై 20

తస్మాత్స్ననంచ దానంచ హోమం జప్యం సురార్చనమ్‌ l యత్కించిత్క్రయతే తత్ర తదక్షయ మితీరితమ్‌ 21

వసువు పలికెనుః-

BÈýÁV xmsoLRiVu¡»R½òª«sVV¬s ¸R…Vµ³y„sµ³j…gS ˳ÏÁNTPò¿Á[ xmspÑÁLiÀÁ, bPLRixqsV¿Á[ ƒ«sª«sVxqsäLjiLiÀÁ, »R½LRiVªy»R½ rygRiLRiª«sVVƒ«sV úFyLójiLi¿RÁª«sÌÁ¸R…VVƒ«sV. J ƒ«sµk… ƒyµ³y! నీవు సర్వ భూతములకు ప్రాణభూతుడవు. తీర్థరాజా! నీకు నమస్కారము. ఓ అచ్యుత ప్రియా! నన్ను కాపాడుము. ఇట్లు ఉత్తమము శుభప్రదమగు ఈ క్షేత్రమున చక్కగా స్నానమాడి తీరమున యథావిధిగా నారాయణుని పూజించి బలరామ శ్రీకృష్ణ సుభద్రలకు సముద్రమునకు నమస్కరించి శతాశ్వమేధ ఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై, సర్వదుఃఖవర్జితుడై శ్రీమంతుడై బృన్దారక హరివలె రూప ¸°వన గర్వితుడై దివ్య గంధర్వ నాదముగల అర్కవర్ణము గల విమానముచే ఇరువది యొక్క కులములనుద్ధరించి విష్ణులోకమును పొందును. ఇచట ఉత్తమ భోగములనను భవించి దేవతలతో కలిసి క్రీడించి ఆటనుండి భూలోకమునకు వచ్చి బ్రహ్మ జ్ఞానము గల బ్రాహ్మణునిగా పుట్టును. యశస్వి, మతిమంతుడు, శ్రీమంతుడు, సత్యవాది, జితేన్ద్రియుడు, వేద శాస్త్రార్ద జ్ఞానము కలవాడుగా ఉండి తరువాత విష్ణుభక్తుడై వైష్ణవ యోగమును పొంది తరువాత మోక్షమును పొందును. గ్రహణ కాలమున, సంక్రమణమున, అయనములందు విషువమున, యుగాదులందు, మన్వాదులందు, వ్యతీపాతమున, దినక్షయమున, ఆషాడ పూర్ణిమయందు కార్తీక పూర్ణిమయందు, మాఘ పూర్ణిమ యందు ఇతర శుభతిధులందు ఈ క్షేత్రమున బ్రాహ్మణులకు దానము చేయువారు ఇతర తీర్థములలో దానము చేసిన నానికి వేయిరెట్లు ఫలమును అధికముగా పొందెదరు. ఇచట యధావిధిగా పితరులకు పిండ ప్రదానమును చేయువారు వారి పితరులను అక్షయ మగు తృప్తిని కలిగించెదరు. ఇది సాగర స్నాన ఫలము. నీకు సమగ్రముగా వివరించితిని. అట్లే దానఫలమును, పిండ ప్రదాన ఫలమును చెప్పితిని, ఈ సాగర స్నానము ధర్మర్థమోక్ష ఫలప్రదము. ఆయుఃకీర్తి యశ పూజ, భుక్తిముక్తి ప్రదము, నరులకు ధన్యము, దుస్స్వప్న నాశకము. సర్వపాపహరము, పుణ్యము, సర్వకామ ఫలప్రదమ. ఈ విధానము నాస్తికునకు శఠునకమ, దీనునకు చెప్పరాదు. పురుషోత్తమ తీర్థ రాజమమాత్య్మామును బ్రాహ్మణులు వర్ణించువరకే ఇతర తీర్థ రాజములు తమ మహాత్త్మ్యామును గర్జించును. పుష్కరాది తీర్థములు తమ తమ ఫలములను మాత్రమే నిచ్చును. తీర్థ రాజమగు సముద్రము మాత్రము సర్వతీర్థ ఫలములనిచ్చును. ఈ భూమండలమున నున్న సకల తీర్థములు, నదులు సరస్సులు సాగరమున ప్రవేశించును. కావున సాగరము సర్వశ్రేష్ఠమైనది. నదీపతియగు సముద్రము సమస్త తీర్థరాజము. కావున సాగరము సమస్త తీర్థములలో శ్రేష్ఠ తమము. సర్వకామ ప్రదము. సూర్యుడుదయించగనే చీకటి నశించునట్లు సాగర తీర్థమున సర్వపాపములు నశించును. ఈ సాగరమున తొంబది తొమ్మిది కోట్ల తీర్థములు గలవు. కావున సాగరమున చేయు స్నానము, దానము, హోమము జపము, దేవతార్చన అన్నియూ అక్షయ ఫలము నొసంగును.

మోహిన్యువాచ:-

సర్వేషు తు సముద్రేషు క్షారోయం సరితాం పతిః l కధం జాతో గురో సర్వ జ్ఞోసి యతో ద్విజ 22

మోహిని పలికెను:-

J gRiVLRiVª«sLSù! అన్ని సముద్రములలో ఈ సముద్రము ఉప్పు సముద్రముగా ఎందుకైనదో నీవు సర్వజ్ఞుడవు కావున తెలుపుము.

వసురువాచ:-

శృణు వక్ష్యామి సుభ##గే క్షారత్వం చాసగ వారిధేః l యధా ప్రాప్తః పురాసీచ్ఛ మాత్రాస్య జగతామపి 23

పురా సృష్టిక్రమ్‌ జాతా స్సముద్రాస్సప్త మోహిని l రాధికాగర్భసంభూతా దివ్యదేహః పృధగ్విధాః 24

ఏకదా రాధికా నాధః కాంతయా సహ సంగతః l ఆస్తే బృందావనే సాక్షాత్‌ గోపగోపీ గవాంపతిః 25

రాసమండల మథ్యేతు సుదీప్తే మణిమండపే l సుస్నిగ్దయా సమాయుక్త శృంగారే కాంతయా సహ 26

తే సప్త సాగరా బాలా స్తన్యపానకృతక్షణాః l తతస్తే సర్వతో దృష్ట్వా మాతరం తాం జగత్ఫ్రసూమ్‌ 27

క్షుధార్తాశ్చ రుదంతస్తు ఆసేదుర్ముణి మండపమ్‌ l తత్ర జగ్ముస్తు తే సర్వే స్తన్యపానకృతేక్షణాః 28

సర్వే నివారితాశ్చాపి ద్వారస్తే ర్వల్లవీ గణౖః l వివిశుశ్చ భృశం క్రుద్దా బాలకాస్తే స్తనార్దినః 29

ఉపేక్షితా గోపికాభి ర్మాతురుత్సం గవర్తినః l తతస్తు ప్రరుదన్తో వై తే గత్వా మణి మండపమ్‌ 30

ఉచ్చైః ప్రచుక్రుశుర్దేవి మాతః క్వాసీతి వాదినః l యదా నాహ్వయతే మాతా బాలకాంస్తాంస్త నార్దినః 31

తదా కనిష్ఠ స్సర్వేషాం వివేశాయం రతిస్థలమ్‌ l తం దృష్ట్వా స్వసుతం రాధా ముగ్ధం శృంగార భంగదమ్‌ 32

శశాప క్షుభితా రాధా భూలోకం యాత మాచిరమ్‌ | యత శ్శృంగార భంగం తు మమ కర్తుం సముద్యతాః 33

తతో యూయం భువం గత్వా స్థాస్యదైకాకినస్సుతాః l తచ్ర్ఛుత్వా వచనం మాతు ర్జగద్ధాత్ర్యా విరించి జే 34

అత్యుచ్చైరురుదుస్సర్వే వియోగ భయకాతరాః l తతః ప్రసన్నో భగవా ఞ్ర్చీ కృష్ణః ప్రణతార్తిహా 35

మాభైష్ట పుత్రాస్తిష్ఠామి సమీసే భవతామహమ్‌ l ద్రవరూపా భవంతస్తు పృధగ్రూప చరాస్సదా 36

వర్తధ్వాం క్షారతాం యాతు కనిష్ఠోభ్యంతరేస్థితః l ఏవముక్త్వా జగన్నాధో బాలకాన్వి ససర్జ హ 37

తేషాం తు సాంత్వనార్దాయ సమీపస్థస్సదా భవత్‌ l యః ప్రవిష్టో రతిగృహం న క్షారోదో బభూవ హ 38

అన్యేతు ద్రవరూపా వైక్షీరోదాద్యా ! పృధక్థ్సితాః

వసువు పలికెను:-

C xqsª«sVVúµR…ª«sVV DxmsöV xqsª«sVVúµR…®ªsVLiµR…V\ZNPƒ«sµ][ ¿Á|msöµR…ƒ«sV „sƒ«sVª«sVV. xmspLRi*ª«sVV xqsXztísQúNRPª«sVª«sVVƒ«sV G²R…V xqsª«sVVúµR…ª«sVV ÛÍÁ[LRiö²T…ƒ«s„s. C ¹¸…[V²R…V xqsª«sVVúµR…ª«sVVÌÁV LSµ³j…NS gRiLRi÷é xqsLi˳ÏÁW»R½VÌÁV µj…ª«sù®µ…[x¤¦¦¦§ÌÁV gSƒ«sVLi²T…Lji. INRP xqsª«sV¸R…Vª«sVVƒ«s LSµ³j…NSxms¼½ úzms¸R…VVLSÌÁgRiV LSµ³j…NRP»][ NRPÖÁzqs ¸R…VVLi®²…ƒ«sV. ‡ÁXƒôyª«sƒ«sª«sVVƒ«s g][xmsg][{ms g][xms¼½ LSxqs ª«sVLiÌÁª«sVµ³R…ùª«sVVƒ«s xqsVµk…xmsòª«sVgRiV ª«sVßÓá ª«sVLi²R…xmsª«sVVƒ«s zqsõgôRiVLSÌÁVgRiV úzms¸R…VVLSÖÁ»][ aRPXLigSLRi xqsLi¸R…VVNRPVòQ\®²… ¸R…VVLi®²…ƒ«sV. ËØÌÁVÌÁgRiV A xqsxmsò rygRiLRiVÌÁV, xqsòƒ«sùFyƒ«sª«sVVƒ«s AaRPgRiÌÁ ªy\lLi ÇÁgRiƒyø»R½¸R…VgRiV »R½ÌÁ »R½ÖýÁ¬s ®ªs»R½VNRPV¿RÁV @Li»R½ÉØ ¿RÁWÀÁ ORPVµ³yLRiVòQ\ÛÍÁ, G²R…Vè¿RÁV ª«sVßÓ᪫sVLi²R…xmsª«sVVƒ«sV ¿Á[LjiLji. µy*LRiª«sVVƒ«s ƒ«sVƒ«sõ g][zmsNRPÌÁV ªyLjiLi¿RÁV ¿RÁVƒ«sõƒ«sW xqsòƒ«sùFyƒyÕ³ÁÍØxtsv\ÛÍÁ ®ªs²R…ÖÁLji. ¿yÍØ N][xmsª«sVV»][ ƒ«sVLi²T…Lji. »R½ÖýÁ ª«s²T…ÍÜ[ ƒ«sVLi²R…µR…gRiV ªyLRi¬s g][zmsNRPÌÁV NRPW²y D}msOTPQLiÀÁLji. @Li»R½ÈÁ ªyLRiV G²R…Vè¿RÁV ª«sVßÓá ª«sVLi²R…xmsª«sVVƒ«sNRPV ®ªs×Áþ J »R½ÖdýÁ ! ఎక్కడుంటివి అని పెద్దగా అరిచిరి. కాని స్తనార్థులగు తమను తల్లి పిలువక పోవుటచే అందరిలో చిన్నవాడు. రాధాకృష్ణులరతిస్థలమును చేరెను. తన మీద మిక్కిలి మమకారముతో తనవద్దకు వచ్చిన శృంగార భంగప్రదుడగు పుత్రుని చూచి కోపించిన తల్లి త్వరగా భూలోమనకు వెళ్ళుడని శపించెను. మీరు నాకు శృంగార భంగమును చేయుటకు ప్రయత్నించితిరి కావున మీరు భూలోక మునకు వెళ్ళి ఒంటరిగా ఉండుడు. అని శపించెను. జగన్మాతయగు రాధ మాటలను విని వియోగభయము చే దీనులై అందరూ పెద్దగా యేడ్చిరి. అంతట ప్రణతార్తిహరుడగు శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడై పుత్రులారా! మీరు భయపడకుడు. నేను మీ చెంతనే యుందును. మీరు ద్రవ రూపులై వేరు రూపములతో సంచరించుడు. లోని కొచ్చిన ఇతను మాత్రము క్షారత్వమును పొందుగాక. అని పలికి వారిని విడిచిపిచ్చెను. ఆ సాగరములను ఓదార్చుటకు శ్రీహరి ఎపుడూ వారి సమీపమునే ఉండును. రతి గృహమున ప్రవేశించిన కనిష్ఠ సాగరము లవణార్ణవమాయెను. మిగిలిన సాగరములు ద్రవరూపములై క్షీరాదులుగా విడిగా నుండెను.

మోహిన్యువాచ:-

కా రాధా భవతా ప్రోక్తా గురోలోక ప్రసూఃసతీ l తస్యాస్తత్వం సమాఖ్యాహి శ్రోతుం కౌతూహలం మమ 39

పూరాణషు రహస్యం తు రాధా మాధవ వర్ణనమ్‌ l యతస్సర్వం భవాన్వేత్తి యధాతధ్యేన సువ్రత 40

మోహిని పలికెను:-

మీరు చెప్పిన జగన్మాతయగు రాధ ఎవరు? ఆరాధాతత్త్వమును నాకు సమగ్రముగా తెలుపుము. నాకు వినవలయునని కోరిక కలదు. పురాణములలో వర్ణించబడిన రాధా మాధన రహస్యమునంతయూ యధర్థముగా నీకు తెలియును.

వసిష్ఠ ఉవాచ:-

తచ్ఛ్రుత్వా మోహినీ వాక్యం భూపతే స వసుర్మహాన్‌ l అతీవ భక్తో గోవిందే నిమగ్నహృదయో భవత్‌ 41

పులకాంకిత సర్వాంగః ప్రహృష్టహృదయో ముదాl ఉవాచ మోహమాపన్నో మోహినీం ద్విజసత్తమః 42

వసిష్ఠ మహర్షి పలికెను:-

ఓరాజా! అమోహినీ వాక్యమును వినిన వసువు గోవిన్దుని యందు మిక్కిలి భక్తిగలవాడై తన్మయుడాయెను. పులకాంకిత సర్వాంగుడై ప్రహృష్ట హృదయుడై సంతోషముతో మోహమును పొంది మోహినితో ఇట్లు పలికెను.

వసురువాచ:-

శృణు దేవి ప్రవక్ష్యామి రహస్యాతి రహస్యకమ్‌ l సుగోప్యం కృష్ణచరితం బ్రహ్మైకత్వ విధాయకమ్‌ 43

ప్రకృతే ః పురుషస్యాపి నియంతారం విధేర్విధిమ్‌ l సంహర్తారంచ సంహర్తు ర్భగవంతం నతోస్మ్యహమ్‌ 44

దేవి సర్వేవతారాస్తు బ్రహ్మణః కృష్ణరూపిణః l అవతారీ స్వయం కృష్ణ స్సగుణో నిర్గుణస్స్వయమ్‌ 45

స ఏవరామః కృష్ణశ్చ వస్తుతో గుణతః పృథక్‌ l సర్వే ప్రాకృతికా లోకా గోలోకో నిర్గుణ స్స్వయమ్‌ 46

గావస్తే జోంశవో భ##ద్రే వేదవిద్భిర్నిరూపితాః l బ్రహ్మ విష్ణు శివాద్యాస్తు ప్రాకృతా గుణ నిర్మితాః 47

తత్తేజ స్సర్వాదా దేవి! నిర్గుణం గుణకృన్మతమ్‌ l గుణాస్తదంశవో భ##ద్రే సర్వే వ్యాకృతరూపిణః 48

వ్యాకృతోత్పాదకా జ్ఞేయా రజస్సత్త్వతమోభిధాః l అవ్యాకృతస్యపుంసో హి గుణా విజ్ఞాపకాకశ్శుభే 49

దేహభూతాస్మృతాస్తసగ తచ్ఛక్తిః ప్రకృతి ర్మతా l ప్రధానం ప్రకృతిం ప్రాహుః కార్యకారణరూపిణీమ్‌ 50

సాక్షిణం పురుషం ప్రాహు న్నిర్గుణంతు సనాతనమ్‌ l పురుషో వీర్యమాదత్త ప్రకృత్యాం చ తతో గుణాః 51

సత్త్వాద్యాహ్యభవం స్తేభ్యో మహత్తత్త్వం సముద్గతమ్‌ l పురుషస్స్వేచ్ఛయా తత్తు వ్యాకృతం సమభూదహమ్‌ 52

తత్త్రిధా సమ భూద్భద్రే ద్రవ్యజ్ఞానక్రియాత్మకమ్‌ l వైకారికస్తేజసశ్చ తామసశ్చేత్యహంత్రిధా 53

వైకారికాన్మనో జజ్ఞే దేవా వైకారికా దశ 54

దిగ్వాతార్క ప్రచేతోశ్వి బ్రహ్ర్మేన్ద్రో పేన్ద్రమిత్రకాః l తై జసానీంద్రియా ణ్యాహు ర్‌జ్ఞానకర్మమయాని చ 55

శ్రోత్రత్వగ్ఘ్రాణదృగ్జిహ్వా విజ్ఞానేంద్రియ రూపకాః l కర్మేంద్రియాణి సుభ##గే వాగ్దోర్మేఢ్రాంఘ్రి పాయవః 56

శబ్దస్తు తామసాజ్జజ్ఞే తస్మాదాకాశ ఏవచ l అకాశాదభవత్స్వర్శ స్తస్మాద్వాయుర భూత్సతి 57

వాయోర భూత్తతోరూపం తస్మాత్తేజో వ్యజాయత l తే జసస్తు రసస్తస్మా దాపస్సమభవిష్యతి 58

అధ్బ్యోగంధస్సముత్పన్నో గంధాత్‌ క్షితిర జాయత l చరాచరస్య నిష్ఠా తు భూమావేవ ప్రదృశ్స్యతే 59

అకాశాదిషు తత్వేషు ఏకద్వితరిచతుర్గుణాః l భూమౌ పంచగుణాః ప్రోక్తా విశేషస్తు తతః

క్షితేః 60

కాలమాయాంశలింగే భ్య ఏతేభ్యండమ చేతనమ్‌ | సమభూచ్ఛేతనం జాతం దరేణ విశతా సతి 61

తస్మా దండాద్విరాడ్జజ్ఞే సోశయిష్ట జలాంతరే l ముఖాదీన్యస్య జాతాని విరాజోsవయవా అపి 62

వచనాదేశ్చ సిద్ద్యర్దం సలిలస్థస్య భామిని l తస్య నా భ్యామ భూత్పద్మం సహస్రార్కోరుదీధితిః 63

తస్మిన్స్వయం భూస్సమభూ ల్లోకానాం ప్రపితామహః l తేన తప్త్వా తపస్తీవ్రం పుంసోsను జ్ఞామవాప్య చ 64

లోకాశ్చ లోకపాలాశ్చ కల్పితా బ్రహ్మణా సతి l కట్యాదిభిరధస్సప్త సప్తోర్ద్వం జఘనాదిభిః 65

చతుర్దశభిరేభిస్తు లోకైర్భ్రహ్మాండ మీరితమ్‌ l తస్మిన్ససర్జ భూతాని స్థావరాణి చరాణి చ 66

బ్రహ్మణో మనసో జాతా శ్చత్వార స్సనకాదయః l దేహాద్భావాదయో దేవి యైరిదం వర్ధితం జగత్‌ 67

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే

మోహినీవసు సంవాదే పురుషోత్తమ మాహాత్య్మే

బ్రహ్మండోత్పత్తి వర్ణనం నామ అష్టపంచాశత్తమోధ్యాయః

వసువు పలికెనుః ఓదేవీః రహస్యములలో అతిరహస్యము, పరమ గోప్యము బృహ్మైకత్వ విధాయకమగు శ్రీకృష్ణ చరితమను చెప్పెదను వినుము. ప్రకృతి పురుషులను నియమించువాడు, విధికి విధి, సంహరించువారి నందరిని సంహరించువాడు యగు భగవంతునికి నమస్కారము. బ్రహ్మయొక్క సర్వావతారములు కృష్ణరూపములు. శ్రీకృష్ణుడు. మాత్రము స్వయముగా అవతారి. ఇతను సగుణుడు నిర్గుణుడు. వస్తు రూపుముగా అతనే రాముడు. అతనే కృష్ణుడు. గుణములననుసరించి వేరు. అన్ని లోకములు ప్రాకృతికములే. గోలోకమ మాత్రము నిర్గుణము. గోవులు తేజోంశములు అని వేదవిదులు చెప్పియున్నారు. బ్రహ్మ విష్ణు శివాదులు ప్రాకృతులుగుణనిర్మితులు. శ్రీకృష్ణుని తేజస్సు సర్వదా నిర్గుణము. గుణకారి. గుణములన్నియూ అతని అంశ##లే. ఇవి యన్నియు వికారరూపములే. రజస్సత్త్వ తమోనామకములు వ్యాకృతోత్పాదికములుగా తెలియుము. అవ్యాకృతపురుషుని తెలుపునవి గుణములు. ఈ గుణములు అతనికి దేహభూతములు. అతని శక్తియే ప్రకాతి. ప్రధాన ప్రకృత కార్యకారణరూపిణి అనబడును. పురుషుడు నిర్గుణుడు సనాతనుడు సాక్షి అనబడును. పురుషుడు ప్రకృతియందు వీర్యమునుంచిన గుణములేర్పడును. వాటి నుండి సత్వాదులేర్పడును. సత్త్వాదులనుండి మహత్తత్త్వము ఏర్పడును. ఈ మహాత్తత్త్వము పురుషుని ఇచ్చచే వ్యాకృతమై అహంకార తత్త్వముగా ఏర్పడును. ఈ ఆవ్యాకృతము ద్రవ్య జ్ఞానక్రియారూపముగా మూడు విధములగును. అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములు. వైకారికము నుండి మనసు పుట్టెను. వైకారికులు అను దేవతలు పది విధములు. దిక్కులు, వాయవు, సూర్యుడు వరుణుడు, అశ్వనీదేవతలు, బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేన్ద్రుడు, మిత్రుడు అని. జ్ఞానేన్ద్రియములు కర్మేన్ద్రియములు తైజసములు శ్రోత్రత్వక్‌ఘ్రాణనేత్ర జిహ్వలు జ్ఞానేంద్రియములు. వాకా%ృణిపాదపాయు ఉపస్థలు కర్మేంద్రియములు. తామసాహంకారము నుండి శబ్దము కలిగెను. శబ్దము నుండి ఆకాశము కలిగెను. ఆకాశము నుండి స్సర్శ, స్పర్శ నుండి వాయువు, వాయువు నుండి రూపము, రూపమునుండి తేజస్సు, తేజస్సు నుండి రసము రసము నుండి జలము, జలము నుండి గంథము, గంథము నుండి పృథివి ఏర్పడెను. సకల చరా చర జగత్‌ స్థితి భూమి యందే కనపడుచున్నది. ఆకాశాది పంచతత్త్వములందు ఒకటి, రెండు, మూడు నాలుగు గుణములు వరుసగా నుండును. పృథివి యందు అయిదు గుణములుండును. ఇదియే విశేషము, కాలమాయాంశ లింగముల నుండి అచేతనమగు అండము కలిగెను. ఈ అండముదరమున ప్రవేశించి చేతనమగును. ఈ అండము నుండి విరాట్పుషుడు కలిగెను. ఈ పురుషుడు జలాంతరమున శయనించెను. ఇతనికి ముఖాద్యవయవములు కలిగెను. నీటిలో ఉన్న ఈ పురుషునికి వచనాది సిద్ది కొరకు ఈ పురుషుని నాభి నుండి సూర్య సన్నిభమగు పద్మము కలిగెను. ఈ పద్మము నందు లోకమునకు ప్రపితామహుడగు బ్రహ్మ పుట్టెను. ఈ బ్రహ్మ తీవ్రమగు తపము నాచరించి పురుషుని ఆజ్ఞను పొంది లోకములను, లోకపాలురను సృజించెను. కట్యాదులనుండి అదోలోకములేడు, జఘనాదుల నుండి ఊర్ద్వలోకము లేడు కలిగెను. ఈ పదునాలుగులోకములతో బ్రహ్మండమనబడును. ఈ బ్రహ్మండమున స్థావరజంగమ ప్రాణులను సృజించెను. బ్రహ్మమనసు నుండి సనకాదులు నలుగురు మహర్షులు కలిగిరి. బ్రహ్మదేహము నుండి భవాదులు పుట్టిరి. వీరిచేతనే ఈ జగత్తు వృద్ది చెందినది.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున మోహిని వసుసంవాదమున

పురుషోత్తమమాహాత్య్మమున

బ్రహ్మండోత్పత్తి వర్ణనమను

యాబదియెనిమిదవ

అద్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page