Sri Naradapuranam-3 Chapters Last Page
ఏకోన షష్ఠితమోsధ్యాయః = యాబది తొమ్మిదివ అధ్యాయము
పురుషోత్తమ మాహాత్మ్యమ్
వసురు వాచః-
యోsసౌ నిరంజనో దేవ శిచిత్స్వరూపీ జనార్దనః l జ్యోతీరూపో మహాభాగే కృష్ణస్త ల్లక్షణం శృణు 1
గోలోకే స విభుర్నిత్యం జ్యోతిరభ్యంతరే స్థితః l ఏక ఏవ పరం బ్రహ్మ దృశ్యాదృశ్య స్వరూప ధృక్ 2
తస్మింల్లో కే తు గావో హి గోపా గోప్యశ్చమోహిని l బృపందావనం పూర్వతశ్చ శతశృంగస్తదా సరిత్ 3
విరజా నామ వృక్షాశ్చ పక్షిణశ్చ పృధగ్విధాః l యావత్కాలం తు ప్రకృతి ర్జాగర్తి
విధినందిని! 4
తావత్కాం తు గోలోకే దృశ్య ఏవ విభుస్థ్సితః | లయే సుప్తా గవాద్యాస్తు న జానన్త విభుం పరమ్. 5
జ్యోతి స్సమూహాంతరతః కమనీయ వపుర్దరః l కిశోరో జలదశ్యామః పీతకౌశాంబరావృతః 6
ద్విభుజో మురళీహస్త కిరీటాది విభూషితః | ఆస్తే కైవల్యనాధస్తు రాధావక్షోస్థ్సలోజ్జ్వలః 7
ప్రాణాధిక ప్రియతమా సా రాధా రాధితో యయా l సువర్ణ వర్ణా దేవీ సా చిద్రూపా ప్రకృతేః పరా 8
తయోర్దేహస్థయోర్నాస్తి భేదో నిత్యస్వరూపయోః l ధావల్య దుగ్దయోర్యద్వత్ పృధివీగంధయోర్యధా 9
తత్కారణం కారణానాం నిర్దేష్టుం నైవ శక్యతే l వేదానిర్వచనీయం య త్తద్వక్తుం నైవ శక్యతే 10
జ్యోతిరంతరతః ప్రోక్తం యద్రూపం శ్యామసుందమ్ l శివేన దృష్టం యద్రూపం కదాచిద్ద్యాన గోచరమ్ 11
తతః ప్రభృతి జానన్తి గోలోకాఖ్యానమీప్సితమ్ l నారదాద్యా విధిసుతే సనకాద్యాశ్చ యోగినః 12
శ్రుతం ధ్యాయన్తి తం సర్వే న తై ర్దృష్టం కదాచన l సాక్షాద్ద్రష్టుం తు తపతే శివోsద్యాపి సనాతనః 13
కదాచిత్ర్కీడ తో ర్దేవి రాధామాధవయోర్వపుః l 14
ద్విధాభూతమ భూత్తత్ర వామాంగం తు చతుర్బుజమ్ l సమానరూపావయవం సమానాంబర భూషణమ్ | 15
తద్వద్రాధాస్వరూపం చ ద్విధారూపమభూత్సతి l తా భ్యాం దృష్టం తత్స్వరూపం సాక్షాత్తా వపి తత్సమౌ 16
చతుర్ఖుజం తు యద్రూపం లక్ష్మీకాంతం మనోహరమ్ l తద్దృష్టంతు శివాద్యైశ్చ భక్తబృన్దైరనేకశః 17
సకృత్తు బ్రహ్మణా దృష్టం దేవీరూపం చతుర్బుజమ్ l సృ/ష్టికార్య ప్రమగ్దేన దర్శితం కృపయా స్వయమ్ 18
లక్ష్మా సనత్కుమారాయ వర్ణితం విధినన్దిని l విష్వక్సేనాయతూద్దిష్టం స్వరూపం తత్త్వమూర్తయే 19
నారాయణన విధిజే తతో ద్యాయన్తి సర్వశః l ధర్మపుత్రేణ దేవేశి నారదాయ సమీరితమ్ 20
గోలోకవర్ణనం సర్వం రాధాకృష్ణమయం తధా l యాతు రాధా విధిసుతే దేవీ దేవవరార్బితా 21
సా స్వయం శివరూపాభూ త్కౌతుకేన వరాననే l తద్దృష్ట్వా సహసాశ్చర్యం కృష్తో యోగేశ్వరేశ్వరః 22
మూల ప్రకృతి రూపంత్రు దధ్రే తత్సమయోచితమ్ l విపరీతం వపుర్దృ/త్వా వామదేవో ముదాన్వితః 23
ధ్యాయే దహర్నిశం దేవం దుర్గారూప ధరం హరిమ్ l యా రాధా సైవ లక్ష్మీస్తు సావిత్రీ చ సరస్వతీ 24
గంగా చ బ్రహ్మతనయే నైవ భేదోస్తి వస్తుతః l పంఛదా సా ప్థితా విద్యా కామధేను స్వరూపిణీ 25
వసువు పలికెను ః శ్రీకృష్ణ భగవానుడు నిరంజనుడు చిత్స్వరూపుడు జనార్దనుడు, జ్యోతి స్స్వరూపుడు. అతని లక్షణమును వినుము. ఆ భగవాడు నిత్యము గోలోకమున అభ్యంతరమున నుండును. అతనొక్కడే పరబ్రహ్మ. దృశ్యాదృశ్య స్వరూపమును ధరించియుడును. అ గోలోకమున గోవులు గోపాలురు గోపికలు, పూర్వభాగమున బృన్దావనము, శతశృంగము, విరజానది, వేరు వేరు పక్షులుండును. ప్రకృతి ఉన్నంత వరకు గోలోకమున శ్రీకృష్ణభగవానుడు దృశ్యస్వరూపుముతో నుండును. ప్రలయ కాలమున నిదురించిన గవాదులు శ్రీకృష్ణభగవానుని తెలియజాలవు. జ్యోతిః పుంజాంతర్బాగమున సుందర శరీరధారియైకిశోరుడు, నీల మేఘశ్యాముడు పీతాంబరధారి, ద్విభుజుడు, మరళీహస్తుడు కిరీటాదివిభూషితుడు, రాధావక్షస్థలోజ్జ్వలుడు కైవల్యనాధునిగా యుండును. శ్రీ కృష్ణ భగవానునకు రాధ ప్రాణాధికప్రియతమురాలు. ఈ రాధ స్వర్ణవర్ణ చిద్రూపురాలు, ప్రకృత్యతీతురాలు. నిత్యస్వరూపులగు దేహిస్థులగు రాధాకృష్ణులకు తెలుపుకు పాలకు, పృథివీగంథములకు భేదము లేనట్లుభేదము లేదు. సకల కారణములను కారణమును నిర్దేశించ శక్యము కాదు. వేదములకు కూడా చెప్ప శక్యము కాని ఆ వస్తువును చెప్పజాలము. జ్యోతి అంతర్భగమున నున్న శ్యామ సుందంరూపమును శివుడు మాత్రము చూడగలిగెను. ఎపుడో ఒక మారు ధ్యానగోచరమగును. అప్పటి నుండి కోరబడు గోలోకకథను నారదాదులు సనకాదులు మాత్రమే తెలియుదురు. వారు కూడా వినినదానిని మాత్రమే ధ్యానము చేయుచున్నారు కాని ఎప్పుడూ చూడలేదు. సనాతనుడగు శివుడు కూడా సాక్షాత్తుగా చూచుటకు తపించుచున్నాడు. కాని చూడలేకపోవుచున్నాడు. ధ్యాన గోచరమగు దానిని ధ్యానముచేయుచున్నాడు. ఒక మారు క్రీడించుచున్న రాధామాధువుల శరీరము రెండు భాగములాయెను. వామభాగము మాత్రము చతుర్భుజముగా నుండెను. రెండు రూపములు సమానరూపావయవము, సమాన వస్త్రాభరణములు కలదిగా నుండెను. అట్లే రాధా స్వరూపము కూడా రెండుగా అయెను. ఆ ఇద్దరూ ఈ స్వరూపమును చూచిరి. వీరు కూడా వారితో సమానముగా నున్నది. చతుర్భజముగా నున్న సుందరమగు లక్ష్మీకాంతరూపమున శివాది భక్త బృందములు చాలా మార్లు చూచిరి. చతుర్బుజమగు దేవి రూపమును ఒకసారి బ్రహ్మ చూచెను. సృష్టి కార్యమున ముగ్ధుడగు బ్రహ్మకు దయతలచి చూపెను. సనత్కుమారునికి లక్ష్మి స్వయముగా వర్ణించినది. తత్త్వమూర్తి యగు విష్వక్సేనునకు శ్రీమన్నారాయణుడు స్వయముగా వివరించెను. దర్మపుత్రుడు నారదునకు చెప్పెను. గోలోకవర్ణనమంతయూ రాధాకృష్ణమయము, ఉత్తమదేవ గణములచే పూజించబడు రాధాదేవి తాను కుతూహలముతో స్వయముగా శివరూపమును ధరించెను. ఆ రూపమును చూచి యోగీశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యకరముగా సమయోచితమగు మూల ప్రకృతిరూపమును ధరించెను. వామదేవుడు సంతోషముచే విపరీతమగు శరీరమును దాల్చియుండెను. కావున దుర్గారూపమును దరించిన శ్రీహరిని రేయింబవళ్ళు ధ్యానించవలయును. రాధయే లక్ష్మీదేవి, సావిత్రి సరస్వతి గంగ వీరికి భేదములు లేవు. కామధేను స్వరూపిణియగు ఈ విద్య అయిదు రూపములతో నుండెను.
యః కృష్ణో రాధికానాధ స్సలక్ష్మీశః ప్రకీర్తిత l స ఏవ బ్రహరూపశ్చ ధర్మోనారాయణ స్తథా 26
ఏవం తు పంచధా రూప మాస్థితో భవానజః l కార్యకారణ రూపోsసౌ ధ్యాయన్తి జగతీతలే 27
తేన వై ప్రేమ సంబద్దో విషయీ య శ్శివస్సతు l రాధేశం రాధికారూపం స్వయం సచ్చిత్సుఖాత్మకమ్ 28
దేవతేజస్సముద్బూతా మూల ప్రకృతిరీశ్వరీ l కృష్ణ రూపా మహాభాగే దైత్య సంహారకారిణీ 29
సతీ దక్షసుతా భూత్వా విషయేశం శివం శ్రితా l భర్తుర్వినిన్దనం శ్రుత్వా సతీ త్యక్తా కలేవరమ్ 30
జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయాం పునరేవ చ l తతస్తప్త్వా తపోభ##ద్రే శివం ప్రాప శివప్రదా 31
వస్తుతః కృష్ణరాధాసౌ శివమోహన తత్పరా l జగదంబా స్వరూపాచ యతో మాయా స్వయం విభుః 32
అత ఏవ బ్రహ్మసుతే స్కందో గణపతి స్తథా l స్వయం కృష్ణో గణపతిః స్వయం స్కన్ద శ్శివోsభవత్ 33
శివమేవం వదన్త్యేకే రాధారూపం సమాశ్రితమ్ l కృష్ణ వక్షస్ద్సల స్థానం తయోర్బేదో నలక్ష్యతే 34
ఏకం వా మిధునం వాపి కేనా పీతి నిశ్చితమ్ 35
అనిర్దేశ్యంతు యద్వస్తు తన్నిర్దేష్టుం న చ క్షమమ్ l ఉపలక్షణమే తద్ది యన్ని దేశనమై శ్వరమ్ 36
శాస్త్రం వేదాశ్చ సుభ##గే వర్ణయన్తి యదీశ్వరమ్ l తత్సర్వం ప్రాకృతం విద్ధి విర్దేష్టుం శక్యమేవ చ 37
అనిర్దేశ్యం తు యద్దేవి తన్నేతీతి వినిషిధ్యతే l నిషేధ శేషస్స విభుః కీర్తిత శ్శరణాగతైః 38
శాస్త్రం నియామకం భ##ద్రే సర్వేషాం కర్మణాం భ##వేత్ l కర్మీతు జీవః కధిత ఈశ్వరాంశో విభుస్స్వయమ్ 39
ప్రకృతేస్తు పరో నిత్యో మాయయా మోహితశ్శుభే l యస్తు సాక్షీ స్వయం పూర్ణ స్సహానుశయితా స్థితః 40
నవేత్తి తం చానుశయీ వేదానుశయినం స తు l శంఖ చంక్రగదా పద్మై రలంకృత భజ్వయాః 41
ప్రపన్నాస్తేతు విజ్ఞేయా ద్వివిధా విధినందిని l అర్తదృప్త విభేదేన తత్రార్తా అసహామతా 42
దృప్తా జన్మాంతర సహా నిర్భయా సదసజ్జనాః l యే ప్రపన్నా మహాలక్ష్మ్యాం సఖిభావం సమాశ్రితాః 43
తేషాం మన్త్రం ప్రవక్ష్యామి ప్రయాంతి విధి భోధితమ్ l గోపీ జన పదస్యాంతే వల్లభేతి సముచ్చరేత్ 44
చరణం శరణం పశ్చా ప్రపద్యే పదమీరయేత్ l షోడ శార్ణో మన్త్రరాజ స్సాక్షాల్లక్ష్య్మా ప్రకాశితః 45
పూర్వం సనత్కుమారాయ శంభ##వే తదనన్తరమ్ l సఖి భావం సమాశ్రిత్య గోపికాబృన్దమధ్యగమ్ 46
ఆత్మానం చింతయేద్భద్రే రాధామాధవ సంజ్ఞకమ్ l గురుష్వీశ్వర భావేన వర్తేత ప్రణత స్సదా 47
వైష్ణవేషు చ సత్కృత్య తధా సమతయాన్యతః దివానిశం చింతనం చ స్వామినోః ప్రేమబంధనాత్ 48
కుర్యాత్పర్వస్వపి సదా యాత్రా పర్వ మహోత్సవాన్ 49
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే
వసుమోహినీ సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యం
నామ ఏకోన షష్టితమోsధ్యాయః
రాధికాపతియగు శ్రీకృష్ణభగవానుడే లక్ష్మీపతి. అతనే బ్రహ్మరూపుడు. ధర్మస్వరూపుడగు నారాయణుడు. ఇట్లు అజుడగు శ్రీకృష్ణుడు కూడా అయిదు రూపములను ధరించియుండెను. ఈ కృష్ణభగవానుని కార్యకారణరూపముగా ధ్యానించుచుందురు. ఈ రూపముతో ప్రేమసంబద్దుడై విషయ రూపముతో శివుడగును. రాధారూపమును, రాధాపతి రూపమును స్వయముగా సచ్చిత్సుఖ స్వరూపముగా చూచెదరు. దేవతేజస్సు నుండి ఉద్భుతమగు ఈశ్వరి యగు మూల ప్రకృతి కృష్ణరూపురాలు ఈమెయే దైత్య సంహారకారణి. దక్షపుత్రియగు సతీరూపమును ధరించి శివుని ఆశ్రయించినది. భర్తను నిందించుట చూచి సతీదేవి తన దేహమును విడచెను. హిమంతుని భార్యయగు మేనయందు పుట్టి తపమునాచరించి మరల శివుని పొంది శివప్రదురాలయోను. శస్తముగా ఈ కృష్ణుని రాధయే శివమోహన తత్పురురాలు. జగదంబాస్వరూపురాలు. విభువు కూడా స్వయముగా మాయా స్వరూపుడు. కావుననే కుమారస్వామి, గణపతి కూడా ఈ రూపములే. శ్రీకృష్ణుడే స్వయముగా గణపతి. శివుడే కుమారస్వామి. రాధా రూపమునాశ్రయించిన స్వామినే కొందరు శివునిగా చెప్పెదరు. రాధశ్రీకృష్ణవక్షస్థ్సలముననుండును. వీరిద్దరికీ భేదములేదు. కృష్ణుడే మూలప్రకృతి. శివుడే రాధిక. ఈ ఇద్దరూ ఒకటా జంటయాఅని ఎవ్వరూ నిశ్చయింపజాలరు. మనచే నిర్దేశించబడు స్వరూపము కేవలము ఉపలక్షణము మాత్రమే, శాస్త్రములు వేదములు వర్ణించు ఈశ్వర స్వరూపము ప్రాకృతము మాత్రమే, కావున నిర్దేంచవీలగును. అనిర్దేశ్యమగు దానిని 'న,' 'న2' అని చెప్పజాలము అని నిషేదించబడుచున్నది. కావున శరణాగతులు ప్రభువును నిషేధ శేషము యందురు. సర్వకర్మలకు శాస్త్రములని యామకముగా నుండును. కర్మలనాచరించు జీవుడు ఈశ్వరాంశ స్వయముగా విభువు. ప్రకృతి కంటే పరుడే, నిత్యుడే, కాని మాయామోహితుడు, సాక్షిగా ఉండు జీవుడు తెలియజాలడు. పరమాత్మను ఆశ్రయించినవారు శంకచక్రగదా పద్మములచే అలంకరించబడిన భుజద్వయము కలవారు ప్రసన్నులనబడును. ఈ ప్రసన్నులు రెండు విధములుగా నుందుదు. ఆర్త ప్రపన్నులు, దృప్తప్రపన్నులు అని. ఆర్త ప్రపన్నులు మాత్రముస్వామి వియోగమును ఏమాత్రము సహించజాలరు. దృప్తప్రపన్నులు జన్మాంతరము వరకు సహించగలరు. వీరు నిర్దయులు. సదసజ్జనులు. మహాలక్షి ప్రపన్నులైనవారు సఖిభావమునాశ్రయింతురు. ఇట్టి వారు జపించు మంత్రమును బ్రహ్మ చెప్పిన దానిని ఇపుడు చెప్పెదను.
''గోపీజనవల్లభ చరణం శరణం ప్రపద్యే'' అను మంత్రము పదునారు వర్ణములు కలది. ఈ మంత్రమును సాక్షాత్తుగా లక్ష్మిదేవియే ప్రకాశింపచేసినది. మొదట సనత్కుమారునకు, తరువాత శంకరునకు ప్రకాశింపచేసినది. సఖిభావమునాశ్రయించి గోపికాబృన్ద మధ్యగతుడగు రాధామాధవ నామము గల ఆత్మను ధ్యానించవలయును. గరువులందు ఈశ్వరభావముచే ఎల్లపుడూ ప్రణతుడై యుండవలయును. విష్ణు భక్తులందు సత్కారపూర్వకముగా ప్రవర్తించవలయును. ఇతరులను సమభావముతో చూడవలయును. ప్రేమ బంధనముచే రాధాకృష్ణులను రాత్రి పగలు ధ్యానించవలయును. అన్ని పర్వకాలములందు యాత్రలను, పర్వ మహోత్సవములను ఆచరించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున
పురుషోత్తమ మాహాత్మ్యమను
యాబది తొమ్మిదివ
అధ్యాయము