Sri Naradapuranam-3 Chapters Last Page
షష్ఠితమో% ధ్యాయః=అరువదియవ అధ్యాయము
అభిషేకః
వసురువాచ :-
తతో గచ్ఛేద్విధిసుతే తీర్థం యజ్ఞాంగ సంభవమ్ | ఇంద్ర ద్యుమ్న సరో నామ యత్రాస్తే పావనం శుభమ్ 1
తత్ర గత్వా శుచిర్విద్వా నాచమ్య మనసా హరిమ్ | ధ్యాత్వోపస్థాయ చ విభుం మన్త్రమేన ముదీరయేత్ 2
''అశ్వమేధాంగ సంభూత! తీర్థ సర్వాఘనాశన! స్నానం త్వయి కరోమ్యద్య పాపం హర నమో%స్తుతే'' 3
ఏవముచ్చార్య విధివత్ స్నాత్వాదేవానృషీన్పితౄన్ | తిలోదకేన చాన్యాంశ్చ సంతర్ప్యా చమ్య వాగ్యతః. 4
దత్వా పితౄణాం పిండాంశ్చ సంపూజ్య పురుషోత్తమమ్ | దశాశ్వమేధికం సమ్యక్ ఫలం ప్రాప్నోతి మానవః 5
సప్తావరాన్సప్త పరా న్వంశానుద్ధృత్య దేవవత్ | కామగేన విమానేన విష్ణులోకం స గచ్చతి 6
భుక్త్వా తత్ర వరాన్భోగా న్యావ చ్చన్ద్రార్కతారకమ్ | చ్యుతస్త స్మాదిహాయాతో మోక్షం చ లభ##తే ధ్రువమ్ 7
ఏవం కృత్వా పంచతీర్థే మేకాదశ్యాముపోషితః జ్యేష్ఠ శుక్లే పంచదశ్యాం యః పశ్యేత్పురుషోత్తమమ్ 8
స పూర్వోక్త ఫలం ప్రాప్య క్రీడిత్వా చాచ్యుతాలయే | ప్రయాతి పరమం స్థానం యస్మాన్నావర్తతే పునః. 9
పృధివ్యాం యాని తీర్ధాని సరితశ్చ సరాంసిచ | పుష్కరిణ్యస్తడాగాని వాప్యః, కూపాస్త ధా హ్రదాః. 10
నానానద్యస్సముద్రాశ్చ సప్తాహం పురుషోత్తమే | జ్యేష్ట శుక్ల దశమ్యాది ప్రత్యక్షం యాంతి సర్వదా 11
స్నానదానా దికం యస్మా ద్దేవతా ప్రేక్షణ సతి | నృభిర్యత్క్రియతే తత్ర తత్సర్వం చాక్షయం భ##వేత్ 12
జ్యేష్ఠ మాసే తు దశమీ శుక్ల పక్షస్య మోహిని! | హరతే దశ పాపాని తస్మాద్దశహరాస్మృతా 13
యస్తస్యాం హలినం కృష్ణం పశ్యేద్భద్రాంచ సువ్రతః | సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం వ్రజేన్నరః 14
నరో దోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమమ్ | పాల్గున్యాం సంయతో భూత్వా గోని న్దస్య పరం వ్రజేత్ 15
విషువే దివసే ప్రాప్తే పంచతీర్థ విధానతః | దృష్ట్వా సంకర్షణం కృష్ణం సుభద్రాం చ సులోచనే 16
నరస్సమస్త యజ్ఞానాం ఫలం ప్రాప్నాతి దుర్లభమ్ | విముక్తస్సర్వపాపేభ్యో విష్ణులోకం చ గచ్చతి 17
యః పశ్యతి తృతీయాయాం కృష్ణం చన్దనరూషితమ్ | వైశాఖస్య సితే పక్షే స యాత్యచ్యుత మందిరమ్ 18
యదా భ##వేన్మహా జ్యేష్ఠీ రాశినక్షత్రయోగతః | ప్రయత్నేన తదామర్త్యై ర్గంతవ్యం పురుషోత్తమమ్ 19
కృష్ణం దృస్ట్వా మహాజ్యైష్ఠ్యాం రామం భద్రాంచ మోహిని | నరో ద్వాదశయాత్రాణాం ఫలం ప్రాప్నోతి చాధికమ్ 20
ప్రయాగే చ కురుక్షేత్రే నైమిషే పుష్కరే గయే | గంగాద్వారే చ కుబ్జామ్ర గంగాసాగరసంగమే 21
కోకాముఖే సూకరే చ మధురాయాం మరుస్థలే | శాలగ్రామే వాయుతీర్థే మందరే సింధుసాగరే 22
పిండారకే చిత్రకూటే ప్రభాసే కనఖలే తథా | శంఖోద్ధారే ద్వారకాయాం తథా బదరికాశ్రమే 23
లోహకూటే చాశ్వతీర్థే సర్వపాపప్రమోచనే | కర్దమాలే కోటితీర్థే తథా చామరసంకటే 24
లోలార్కే జంబుమార్గేచ సోమతీర్థే పృధూదకే | ఉత్పలావర్తకే చైవ పృధుతుంగే సకుబ్జకే 25
ఏకామ్రకే చ కేదారే కాశ్యాం వా విరజే సతి | కాలంజరే చ గోకర్ణే శ్రీశైలే గంధమాదనే 26
మహేన్ద్రే మలయే వింధ్యే పారియాత్రే హిమాహ్వయే | సహ్యేచ శుక్తి మతి చ గోమంతే చార్బుదే తథా 27
గంగాయాం చ మహాభాగే యత్పుణ్యం యామునేషు చ | సారస్వతేషు గోమత్యాం బ్రహ్మాపుత్రేషు సప్తసు 28
గోదావరీ భీమరధీ తుంగభద్రా చ నర్మదా | తాపీ పయోష్ణీ కావేరీ శిప్రా చర్మణ్వతీ తథా 29
వితస్తా చంద్రభాగా చ శతద్రుర్బాహుదా తధా | ఋషి కుల్యా మరుద్వృధా విపాశా చ దృషద్వతీ 30
సరయూర్నాకగంగాచ గండకీచ మహానదీ | కౌశికీకరతోయా చ త్రిస్రోతా మధువాహినీ 31
మహానదీ వైతరణీ యాశ్చాన్యా నానుకీర్తితాః | తాస్సర్వా నసమాః ప్రోక్తా కృష్ణ సందర్శనస్యచ 32
యత్ఫలం స్నానదానేన రాహుగ్రస్తే దివాకరే | తత్ఫలం కృష్నమాలోక్య మహాజ్యైష్ఠ్యాం లభేన్నరః 33
తస్మాత్పర్వప్రయత్నేన గంతవ్యం పురషోత్తమమ్ | మహాజ్యైష్ఠ్యాం విధిసుతే సర్వకామఫలేప్సుభిః. 34
దృస్ట్వా రామం మహాజ్యేష్ఠ్యాం కృష్ణం చాపి సుభద్రయా | విష్ణులోకం నరో యాతి సముద్ధృత్యకులం శతమ్ 35
భుక్త్వా తత్రవరా న్భోగా న్యావదాభూత సంప్లవమ్ | పుణ్యక్షయాదిహాగత్య చతుర్వేదీ ద్విజో భ##వేత్ 36
స్వధర్మ నిరతశ్శాన్తః కృష్ణభక్తో జితేంద్రియః | వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షమావాప్నుయాత్ 37
మాసి జ్యేష్ఠే సంప్రాప్తే నక్షత్రే చైన్ద్రదైవతే | పౌర్ణమాస్యాం తదా స్నానం ప్రశస్తం సాగరాంభసి 38
సర్వతీర్థమయః కూప స్తదాస్తే స జలశ్శుచిః | తధా భోగవతీ తత్ర ప్రత్యక్షో భవతి ధ్రువమ్ 39
తస్మాజ్జ్యేష్ఠ్యాం సముద్ధృత్య హైమాది కలశైర్జలమ్ | కృష్ణరామాభిషేకార్థం సుభద్రాయాశ్చ మోహిని! 40
కృత్వా సుశోభనం మంచం పతాకాభిరలంకృతమ్ | సుదృఢం సుఖసంచారం వసై#్త్రః పుషై#్పరలంకృతమ్ 41
విస్తీర్ణం ధూపితం ధూపై స్నానార్ధం రామకృష్ణయోః | పీత వస్త్ర పరిచ్ఛన్నం ముక్తాహారావలంబితమ్ 42
తత్ర నానావిధైర్వాద్యైః కృష్ణం నీలాంబరం సతి | మంచే సంస్థాప్య భద్రాం చ జయమంగలనిస్స్వనైః 43
బ్రాహ్మణ్యౖః క్షత్రియైర్వైశ్యై శ్శూద్రైశ్చాన్యైశ్చ మోహిని! | అనేక శతసాహసై#్ర ర్వృతం స్త్రీ పురుషై స్తధా 44
గృహస్థా స్స్నాతకాశ్చైవ యతయో బ్రహ్మచారిణః | స్నాపయన్తి తదా కృష్ణం మంచస్థం సహలాయుధమ్ 45
వసువు పలికెను : ఓ బ్రహ్మపుత్రీ! తరువాత యజ్ఞాంగ సంభవమగు ఇంద్రద్యుమ్న సరమను పరమ పావనమగు తీర్థమునకు వెళ్ళవలయును. అచటికి వెళ్ళి పరిశుద్ధుడై జ్ఞానియై, ఆచమనముచేసి మనసులో శ్రీహరిని ధ్యానించి విభువును సేవించి ఈ మన్త్రమును జపించవలయును.
''అశ్వమేధాంగ సంభూత! తీర్థ! సర్వాఘనాశన!
స్నానం త్వయి కరోమ్యద్య పాపం హర నమోస్తు తే'' అని
ఓ అశ్వమేధయజ్ఞాంగ సంభూతా! సర్వపాపహరతీర్థరాజమా! ఇపుడు నీ యందు స్నానమును చేయుచున్నాను. నా పాపమును హరించుము. నీకు నమస్కారము అని ఈ మంత్రమునకర్థము. ఇట్లు పలికి యధావిధిగా స్నానమాచరించి దేవతలకు, పితరులకు, ఋషులకు, ఇతరులకు తిలోదకముచే తర్పణముగావించి, మరల ఆచమనము చేసి, మౌనముగా పితరులను పిండ ప్రదానము గావించి, పురుషోత్తముని పూజించి దశాశ్వమేధ యాగ ఫలమును పొందును. ఏడు ముందు తరములను, ఏడు తరువాతి తరములను ఉద్ధరించి దేవతల వలె కామగతి గల విమానముచే విష్ణులోకమునకు వెళ్లును. అచట ప్రళయకాలము వరకు ఉత్తమ భోగముననుభవించి మరల భూలోకమున జన్మించి మోక్షమును పొందును. ఇట్లు పంచతీర్థములను పర్యటించి, ఏకాదశి నాడు ఉపవసించి, జ్యేష్ఠ పూర్ణిమనాడు పురుషోత్తముని దర్శించినచో పూర్వోక్తఫలమును పొంది శ్రీహరిలోకమున విహరించి మరల తిరిగిరాని పరమపదమును పొందును. భూమండలమున కల సమస్త తీర్థములు, నదులు,సరస్సులు, పుష్కరిణులు, తటాకములు, వాపులు, కూపములు, హ్రదములు, నానానదులు, సముద్రములు జ్యేష్ఠ శుక్లదశమి నుండి ఏడు దినములు పురుషోత్తమ తీర్థమున ప్రత్యక్షమగును. కావున ఈ దినములలో ఈ తీర్థమున చేయబడు స్నానదానాదికములు దైవదర్శములన్నియు అక్షయ పలమును ప్రసాదించును. జ్యేష్ఠ శుక్లదశమి పదిపాపములను హరించును. కావున ఆ దశమిని ''దశహర'' అందురు. ఈ దశమినాడు బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను దర్శించుకొనువారు సర్వపాపవవినిర్ముక్తులై శ్రీ మహావిష్ణులోకమును చేరెదరు. గోవిందుడగుపురుషోత్తముని ఊయలలో నుండగా చూచినవాడు. ఇది కూడా ఫాల్గున పూర్ణిమనాడు చూచినచో గోవిందలోకమును చేరును. విషువదినమున పంచతీర్థ విధానముచే బలరాముని శ్రీకృష్ణుని సుభద్రాదేవిని దర్శించి దుర్లభమగు సమస్త యజ్ఞఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకము పొందును. వైశాఖశుద్ధ తృతీయనాడు చన్దన రూషితుడగు శ్రీకృష్ణభగవానుని సందర్శించినచో అచ్యుతమందిరమును చేరును. రాశి నక్షత్రయోగముననుసరించి మహా జ్యేష్ఠి యేర్పడినపుడు ప్రయత్నము చేసి పురుషోత్తమునకు వెళ్ళవలయును. మహా జ్యేష్ఠి నాడు శ్రీ కృష్ణభగవానుని, బలరాముని, సుభద్రను సందర్శించినచో ద్వాదశయాత్రాఫలమును పొందును. ప్రయాగలో, కురుక్షేత్రములో, నైమిషమున, పుష్కరమున, గయలో, గంగాద్వారమున కుబ్జామ్రమున, గంగాసాగరసంగమమున, కోకాముఖమున, సూకరమున, మధుర యందు, మరుస్థలమున, శాలగ్రామమున, వాయుతీర్థమున, మందరమున, సింధుసాగరమున, పిండారకమున, చిత్రకూటమున, ప్రభాసమున, కనఖలమున, శంఖోద్ధారమున, ద్వారకయందు, బదరికాశ్రమమున, లోహకూటమున, అశ్వతీర్థమున, సర్వపాప ప్రమోచనమున, కర్దమాలమున, కోటి తీర్థమున, అమరసంకటమున, లోలార్కమున, జంబుమార్గమున, సోమతీర్థమున, పృధూదకమున, ఉత్పలావర్దకమున, పృధుతుంగమున, కబ్జకమున, ఏకామ్రకమున, కేదారమున, కాశియందు, విరజాతీర్థమున, కాలంజరమున, గోకర్ణమున, శ్రీశైలమున, గంధమాదనమున, మహేన్ద్రమలయ విన్థ్యపర్వతములందు, పారియాత్రమునందు, హిమాలయము నందు, సహ్యశుక్తి మద్గోమతి అరుద పర్వతములందు, గంగయందు, యమునానది యందు, సారస్వతము నందు, గోమతి యందు సప్త బ్రహ్మపుత్ర తీర్థములందు, గోదావరీ, భీమరధీ, తుంగభద్రా, నర్మదా, తాపీ, పయోష్ణీ, కావేరీ, శిప్రా, చర్మణ్వతీ, వితస్తా, చన్ద్రభాగా, శతద్రు, బాహుదా, ఋషికుల్యా మరుద్వృధా, విపాశా, దృషద్వతీ, సరయూ, నాకగంగ, గండకీ, కౌశికీ, కరతోయా, త్రిస్రోతా, మధువాహిని, వైతరణీ ఇతర నదులు ఇవన్నియూ క్షేత్ర తీర్థములు శ్రీకృష్ణసందర్శనమునకు సమము కాజాలవు. సూర్యగ్రహణ సమయమున స్నానదానముల వలన కలుగు ఫలము మహాజ్యేష్ఠినాడు శ్రీకృష్ణసందర్శనముచే లభించును. అందువలన సర్వాభీష్ట ఫలమును కోరువారు మహాజ్యేష్ఠినాడు సర్వప్రయత్నములతో పురుషోత్తమమునకు వెళ్ళవలయును. పురుషోత్తమమున బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను చూచినవారు నూరుకులముల నుద్ధరించి శ్రీ విష్ణులోకమును చేరెదరు. విష్ణులోకమున ప్రళయకాలము వరకు సకల భోగములననుభవించి పుణ్యక్షయమున భూలోకమునకు వచ్చి చతుర్వేదములు తెలిసిన బ్రాహ్మణునిగా పుట్టును. స్వధర్మనిరుతుడు, శాన్తుడు, కృష్ణభక్తుడు, జితేన్ద్రియుడుగా నుండును. శ్రీ విష్ణుభక్తి యోగమున మోక్షమును పొందును. జేష్ఠ పౌర్ణమినాడు జ్యేష్ఠా నక్షత్రమైనచో సాగరస్నానము ప్రశస్తము. సాగరమున సర్వతీర్థమయకూపము. సజలము, పరిశుద్ధము. సాగరమున భోగవతి కూడా ప్రతక్షమగును. కావున జ్యేష్‌ఠ శుద్ధ పూర్ణిమనాడు హైమాది కలశములచే జలమును తీసుకొని బలరామ శ్రీకృష్ణ సుభద్రలకు అభిషేకము కొరకు చక్కని వేదికనుసిద్ధము చేసి, పతాకములతో అలంకరించి, సుదృఢముగా, సుఖసంచారముగా నేర్పరించి, వస్త్రములతో పుష్పములతో అలంకరించి విశాలముగా సిద్ధముగా నేర్పరిచి, ధూపమును అర్పించి రామకృష్ణులస్నానము కొఱకు, పీతాంబరధారి ముక్తాహారభూషితుడుగు శ్రీకృష్ణభగవానుని నీలాంబరధారియగు బలరాముని నానావిధవాద్యములచే జయమంగలనాదములచే వేదికయందు ప్రతిష్ఠించి బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రులచే కొన్ని వేలమంది స్త్రీ పురుషులచే పరివృతులై గృహస్థులు, స్నాతకులు, యతులు, బ్రహ్మచారులు వేదికయందున్న బలరామకృష్ణులను స్నానము చేయించెదరు.
తధా సమస్త తీర్థాని పూర్వోక్తాని చ సుందరి! | మోదకైః పుష్పమిశ్రైశ్చ స్నాపయన్తి పృథక్పృధన్ 46
పశ్చాత్పటహసంఘోషై ర్భేరీమురజనిస్స్వనైః | కాహలైస్తాల శ##బ్దైశ్చ మృదంగెర్ఘరైస్తధా 47
అనైశ్చ వివిధైర్వాద్యై ర్ఘంటా స్వన విమిశ్రితైః | స్త్రీణాం మంగలశ##బ్దైశ్చ స్తుతిశ##బ్దైర్మనోరమైః 48
జయశ##బ్దైస్తధాస్తోత్రై ర్వీణావేణుని నాదితైః | శ్రూయతే సమహాఞ్ఛబ్దః సాగరస్యేవ గర్జతః 49
మునీవాం వేదఘోషైశ్చ మన్త్రఘోషైస్తధాపరైః | నానాస్తోత్రరవైః పుణ్యౖ స్సామగానోపబృంహితైః 50
శ్యామావదాతవేశ్యాభిః పీతరక్తాంశుకైస్తధా | చామరైరత్నదండైశ్చ వీజ్యేతే రామకేశవౌ 51
యక్ష విద్యాధరైస్సిధ్దై ర్దేవగంధర్వ చారణౖః | ఆదిత్యా వసవోరుద్రా స్సాధ్యావిశ్వే మరుద్గణాః 52
లోకపాలాస్తధాన్యేచ స్తువన్తి పురషోత్తమమ్ | నమస్తే దేవదేవేశ పురాణ పురుషోత్తమ 53
సర్గస్థిత్యంతకృద్దేవ లోకనాధ జగత్పతే | త్రైలోక్యశరణం దేవం బ్రహ్మణ్యం మోక్షకారణమ్ 54
తం సమస్యామహే భక్త్యా సర్వకామఫలప్రదమ్ | స్తుత్వైవం విబుధాః కృష్ణం రామం చైవ మహాబలమ్ 55
సుభద్రాం చాపి విధిజే తదాకాశే వ్యవస్థితాః | గాయన్తి దేవగంధర్వా నృత్యంత్యప్సరసస్తధా 56
దేవతూర్యాణి వాద్యన్తే వాతా వాన్తి సుశీతలా l పుష్పమిశ్రం తదా మేఘా వర్షన్త్యా కాశగోచరాః 57
జయశబ్దం చ కుర్వన్తి మునయస్సిధ్దచారణాః l శక్రాద్యా విబుదా స్సర్వే ఋషయః పితరస్తధా 58
ప్రజానాం పతయో నాదా యేచాన్యే స్వర్షవాసినః l తతో మంగలసంభారై ర్విధి మన్త్రపురస్కృతమ్ 59
ఆభిషేచనికం ద్రవ్యం గృహీత్వా ఏవ తా గణాః l ఇంద్ర విష్ణుమహావీర్యౌ సూర్యాచన్ద్రమసౌ తధా 60
ధాతా చైవ విధాతా చ తధాచైవానిలానలౌ l పూషా భగోర్యమా త్వష్టా వివస్వానంశుమాంస్తధా 61
రుద్రాశ్వి సహితో ధీమా న్మిత్రేణ వరుణన చ l రుద్రైర్వసుభిరాదిత్యై ర్వాలఖిల్యైర్మరీచిజైః 62
భృగుభిశ్చాంగి రోభిశ్చ సర్వవిద్యాసు నిష్ఠితైః l పితామహః పులస్త్యశ్చ పులహశ్చ మహాతపాః 63
అంగిరాః కశ్యపోత్రిశ్చ మనుర్దక్షస్తదైవచ l 64
ఋతవశ్చ గ్రహాశ్చైవ జ్యోతీంషి చ ద్విజోత్తమాః l మూర్తి మత్యశ్చ సరితో దేవాశ్చైవ సనాతనాః 65
పృధివీ ద్యార్దిశ##శ్చైవ పాదపాశ్చ ద్విజోత్తమాః l 66
అదితిర్దేవమాతాచ హ్రీశ్శ్రీస్స్వాహా సరస్వతీ l ఉమా శచీ సినీవాలీ తథాచానుమతిః కుహూః l 67
రాకా చ ధిషణాచైవ పత్న్యశ్చాన్యా దివౌకసామ్ l శ్రేష్ఠో గిరీణాం హిమనా న్నాగరాజశ్చ వామనః 68
పారియాత్రశ్చ వింధ్యశ్చ మేరుశ్చానేకశృంగవాన్ l ఐరావత స్సాను చరః కలాః కష్ఠాస్తధైవచ 69
మాసార్ధమాసా ఋతవ స్తధా రాత్య్రహనీ సమాః l ఉచ్చైశ్శ్రవా హయశ్రేష్ణో నాగరాజశ్చ వామనః 70
అరుణో గరుడశ్చైవ లతాశ్చౌషదిభిస్సహ l ధర్మశ్చ భగవాన్దేవః సమాగచ్ఛన్తి సర్వతః 71
కాలో యమశ్చ మృత్యుశ్చ యమస్యానుచరాశ్చ యే l బహులత్వాచ్చ నోక్తా యే వివిధా దేవతాగణాః 72
తే దేవస్యాభిషేకార్ధం సమాయాన్తి తతస్తతః l దివ్యసంభారసంయుక్తైః కలశైః కాంచనైస్తదా 73
సారస్వతీభిః పుణ్యాభి ర్తివ్యతోయాభ##రేవచ l తోయే నాకాశ గంగాయాః కృష్ణం రామేణ సంగతమ్ 74
సుపుషై#్పః కుంబసలిలై స్స్నపయత్యంబరే స్థితా l సంచరన్తి విమానాని దేవానామంబరే తథా 75
ఉచ్చావచాని దివ్యాని కామగాని స్థిరాణిచ l దివ్యరత్న విచిత్రాణి సేవితాన్యప్సరోగణౖః 76
గీతైర్వాద్యైః పతాకాభి శోభితాని సమన్తతః 77
ఇతి శ్రీబృహన్నరదీయ మహాపురాణ ఉత్తర భాగే
మోహిని వసుసంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే
అభిషేకోనామ షష్టితమోsధ్యాయః
అట్లే సమస్త తీర్థములు మోదకములచే పుష్పమిశ్రములచే విడవిడిగా స్నానము చేయించును. తరువాత. పటహఘోషములచే భేరీమురజధ్వనులచే కాహలములచే, తాలశబ్దములచే మృదంగ ఝుర్ఝరములచే, ఇతరములగు బహువిధవాద్యములచే ఘంటానాద మిశ్రితమూగా, స్త్రీల మంగల శబ్దములచే మనోహరములగు స్తుతి శబ్దములచే, జయ శబ్దములచే, స్తోత్రముచే వీణావేణు నినాదములచే సాగరఘోషముల వలె గొప్ప శబ్దము వినవచ్చును. మునుల వేదఘోషలచే మన్త్రఘోషములచే, నానాస్తోత్ర నాదాములచే పవిత్రములగు సామగానములచే, పీతరక్తాంశుకములను ధరించిన శ్యామావదాతవేశ్యలు రత్నదండములు గల చామరములచే వీచుచుందరు. యక్షులు, విద్యాధరులు, సిద్దులు, దేవగంధర్వ కిన్నరులు, చారణులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, కపాలులు, ఇతరులు పురుషోత్తముని స్తుతించుచుందురు. దేవదేవేశా! పురాణ పురుషోత్తమా? నీకు నమస్కారము. సృష్టిస్థితి లయకారక! లోకనాధ! గత్పతీజ! నేన త్రైలోక్యరక్షకుడు బ్రాహ్మణ ప్రియుడు., మోక్షకారణము, సర్వకామఫలద్రుడుగు అదిదేవుని నమస్కరించుచున్నాను. ఇట్లు దేవతలు బలరాముని, శ్రీకృష్ణుని సుభద్రను కూడా ఆకాశము నుండి స్తుతించెదరు. దేవతలు గందర్వులు గానము చేతురు. అప్సరసలు నృత్యము చేతురు. దేవ వాద్యములు మోగును. చల్లగాలులు వీచును. గంధర్వులు గానము చేతురు. అప్సరలు నృత్యము చేతురు. దేవ వాద్యములు మోగును. చల్లగాలులు వీచును. ఆకాశగోచరములగు మేఘములు పుష్పవర్షమును కురియును. మనులు, సిద్దచారణులు జయ శబ్దములను చేతురు. ఇంద్రాదిదేవతలు, ఋషులు, పితరులు, ప్రజాపతులు, నాగులు, ఇతర స్వర్గవాసులు మంగళ సంభారములచే విధిమన్త్ర పురస్కృతముగా అభిషేక ద్రవ్యమును గ్రహించి, మహావీరులగు ఇంద్ర ఉపేనన్ద్రులు, సూర్యచంద్రులు, ధాత, విధాత, అగ్ని వాయువులు, పూష, భగ అర్యమ త్వష్ట, వివస్వాన్, అంశుమంతుడు, రుద్రులు, అశ్వనీ దేవతలు, వరుణుడు రుద్రవస్వాదిత్యవాలఖిల్య మరీచి పుత్రులచే, భృగు అంగిరసులచే సర్వవిద్యా విశారదులచే కూడి పితామహుడు పులస్త్యుడు మహాతపస్వియగు పులహుడు, అంగిరసుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, భృగువు, క్రతువు, హరుడు . ప్రచేతా, మనువపు, దక్షప్రజాపతి, ఋతవులు గ్రహములు, నక్షత్రములు, బ్రాహ్మణోత్తములు, అకారమును దరించిన నదులు, సనాతన దేవతలు సుభద్రములగు హ్రదములు, బహు విధతీర్థములు, భూమి , అకాశము, దిక్కులు, వృక్షరాజములు, దేవమాతయగు ఆదితి, హ్రీ, శ్రీ స్వాహా, సరస్వతి, పార్వతి, శచీదేవి, సినీవాలి, సానుమతి, కుహు, రాకా ధిషణా, ఇతర దేవపత్న్యులు, పర్వతరాజగు హిమవంతుడు, నాగరాజు వామన గజరాజు, పారియాత్ర వింద్య మేరుపర్వతములు, ఐరవతము కలలు, కాష్ఠలు, మాసము, పక్షము, రాత్రి ,పగలు, సంవత్సరములు, హయశ్రేష్ఠమగు ఉచ్చైశ్శ్రవము, అరుణుడు, గరుడుడు, లతలు, ఓషదులు, ధర్మదేవతలు అందరూ అన్ని దిక్కులనుండి రాగలరు. కాలము, యముడు, మృత్యువు, యమభటులు, ఇంకనూ చెప్పబడని ఇతర దేవతాగణములు దేవాభిషేకము కొరకు వచ్చెదరు. దివ్య సంబారములను, బంగారు కలశములలొ పవిత్రములగు సారస్వత తోయములను తీసుకొని, అకాశగంగా జలములలో మంచి పుష్పములను కలిపి రామునితొ కలిసియున్న శ్రీకృష్ణభగవానుని స్నాము చేయించెదరు. ఆకాశమున దేవతా విమానములు తిరుగుచుండును. ఈ విమానము అత్యున్నతములు, దివ్యములు, కామగమనము కలవి, స్థిరములు, దివ్యరత్న విచిత్రతములు, అప్సరోగణసేవితములు గీతవాద్య పతాకములచే అంతటా అలంకరించబడియుండును. ఇట్టి విమానములలో నుండి దేవతాగణములు బలరామకృష్ణ సుభద్రలను స్నానము చేయించెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున
అభిషేకమును
అరువదియవ అధ్యాయము