Sri Naradapuranam-3 Chapters Last Page
ద్విషష్టి తమో`òధ్యాయః = అరువది రెండవ అధ్యాయము
ప్రయాగరాజ మాహాత్య్మేతీర్థవిదిః
వసిష్ఠ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా తు భూపాల మోహినీ విధినందినీ | పురుషోత్తమ మాహాత్మ్యం భుక్తిముక్తి ప్రదాయకమ్ 1
పునః వప్రచ్ఛ తం విప్రం వసుం స్వస్య పురోహితమ్
వసిష్ఠ మహర్షి పలికెను ః ఓ రాజా! బ్రహ్మపుత్ర యగు మోహిని భక్తిముక్తి ప్రదాయకమగు పురుషోత్తమ మాహాత్మ్యమును విని తన పురోహితుడగు వసువును మరల ఇట్లడిగెను.
మోహిన్యువాచ : -
శ్రుత మత్యద్భుతం విప్ర పురషోత్తమ సంభవమ్ 2
మాహాత్మ్యం చాధునా బుూహి ప్రయాగస్యాపి సువ్రతః | తీర్థరాజః ప్రయాగాఖ్యః శ్రుతః పూర్వం మయా గురో 3
తన్మాహాత్మ్యం మమాఖ్యాహి తీర్థయాత్రా విధానయుక్ | సామాన్యానాం విశేషాణాం తీర్థానాం గమనే ద్విజ 4
యత్కర్తవ్యం చ విధినా నృభిర్దర్మ పరాయణౖః | తచ్ఛ్రుత్వా సద్విజో రాజ న్మోహిన్యా భాషితం వచః 5
సామాన్య విధి పూర్వం త త్ప్రయాగాఖ్యాన మబ్రవీత్
మోహిని పలికెనుః ఓ బ్రాహ్మణోత్తమా ! అత్యద్భుతమగు పురుషోత్తమ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు ప్రయాగమాహాత్మ్యమును చెప్పుము. సామాన్య విశేష తీర్థయాత్రలకు వెళ్ళినపుడు నరులు ఆచరించివలసిని విధానమును తెలుపుము. ఇట్లు పలికిన మోహిని మాటలను వినిన ఆ బ్రాహ్మణోత్తముడగు వసువు సామాన్య విధి పూర్వకముగా ప్రయాగ మాహాత్మ్యమును ఇట్లు చెప్పసాగెను.
వసురువాచ:-
శృణు భ##ద్రే ప్రవక్ష్యామి తీర్థభిగమనే విధిమ్ 6
యం సమాశ్రిత్య మనుజో యధోక్తం ఫలమాప్నుయాత్ | తీర్థాభి గమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే 7
అనుపోష్య త్రిరాత్రాని తీర్థాన్య నగ్యభిగమ్యచ | అదత్వా కాంచనం గాశ్చ దరిద్రో జాయతే నరః 8
అగ్నిష్టోమాదిభిర్యజ్ఞే రిష్ట్వా విపుల దక్షిణౖః | న తత్ఫల మావాప్నోతి తీర్థాభి గమనేన యత్ 9
అజ్ఞానేవాపి యస్యేహ తీర్థాభిగమనం భ##వేత్ | సర్వాకామ సమృద్దస్స స్వర్గలోకే మహీయతే 10
స్థానం చ లభ్యతే నిత్యం ధనధాన్య సమాకులమ్ | ఐశ్వర్యజ్ఞాన సంపూర్ణ స్పదా భవతి భోగవాన్ 11
తారితాః పితరస్తేన నరకాత్ర్పపితామహాః | యస్య హస్తే చ పాదౌ చ మనశ్చైవ సుసంయత్ 12
విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థ ఫలమశ్నుతే | ప్రతి గ్రహాదపావృత్త స్సంతుష్టో యేన కేనచిత్ 13
అహంకార విముక్తశ్చ స తీర్ధ ఫలమాప్నుయాత్ | అకల్పకో నిరారంభో లఘ్వాహారో జితేంద్రియః 14
విముక్త సర్వసంగస్తు త తీర్ధ ఫల భాగ్భవేత్ | తీర్థాన్యను సరన్ధీరః శ్రద్ధధానస్సమామితః 15
కృతపాపో విశుద్ధ్యేత్తు కింపున శ్శుద్ధకర్మకృత్ | అశ్రద్దధానః పాపార్తో నాస్తికో`ò చ్ఛిన్న సంశయః 16
నృణాం పాపకృతాం తీర్దే పాపస్య శమనం భ##వేత్ 17
యధోక్త ఫలదం తీర్థం భ##వేచ్చుఏద్ధాత్మనాం నృణామ్ | కామం క్రోధం చ లోభం చ యో జిత్వా తీర్థమావిశేత్ 18
న తేన కించిదప్రాప్తం తీర్థాభిగమనాద్భవేత్ | తీర్థాని చ యధోక్తేన విధినా సంచరన్తియే 19
సర్వద్వంద్వసహా ధీరా స్తే నరస్స్వర్గగామినః 20
గంగాది తీర్థేషు వసన్తి మత్య్సా దేవాలయే పక్షిగణాశ్చ సన్తి | భావోజ్ఘితాస్తే న ఫలం లభ##న్తే తీర్థాచ్చ దేవాయతనాచ్చ ముఖ్యాత్ 21
భావం తతో హృత్కమలే నిధాయ తీర్థాని సేవేత సమాహితాత్మా | యా తీర్థయాత్రా కధితా మునిసై#్త్ర కృతా ప్రయుక్తా హ్యానుమోదితా 22
తాం బ్రాహ్మచారి విధివత్కరోతి సుసంయతో గురుణా సంనియుక్తః | సర్వస్వనాశే`òప్యధవాల్పక్షే సబ్రాహ్మణానగ్రత ఏవ కృత్వా 23
యజ్ఞాది కారే`ò ప్యధవా నివృత్తే విప్రస్తు తీర్ధాని పరిభ్రమే చ్ఛ | తీర్దేష్వలం యజ్ఞఫలం హి యస్మా త్ప్రోక్తం మునీన్ద్రైరమలస్వభావైః 24
యస్యేష్టియ జ్ఞేష్వధికారతాస్తి వరం గృహో గృహ ధర్మాశ్చ సర్వే | ఏవం గృహస్థాశ్రమ సంస్థితస్య తీర్థే గతిః పూర్తతరై ర్నిషిద్దా 25
సర్వాణి తీర్థాన్యపి చాగ్నిహోత్ర తుల్యాని నైవేతి వదంతి కేచిత్ 26
యో య! కశ్చిత్తీర్థయాత్రాంత్‌తు గచ్చే తో సుసంయుత స్సచ పూర్వం గృహేషు | కృతావాసశ్శుచి రప్రమత్ర స్సంపూ జయే ద్భక్తినమ్రో గణశమ్ 27
దేవాన్పితౄన్బ్రాహ్మణాంశ్చైవ సాధూ న్దీమాన్విప్రో విత్తశక్త్యాప్రయత్నాత్ | ప్రత్యాగతశ్చాపి పునస్తధైవ దేవాన్పితౄన్బ్రహ్మణా న్టూజయేచ్చ: 29
గచ్ఛన్దే శాన్తరం యస్తు శ్రాద్ధం కుర్యాత్ససర్ప్సిషా | యత్రార్థమితి తత్ర్పోక్తం ప్రవేశే చ నసంశయః 30
ప్రయాగే తీర్థయాత్రాయం పితృమాతృ వియోగతః | కచానాం వపనం కుర్యా ద్వృధా వికచోభ##వేత్ 31
ఉద్యత శ్చేద్గయాం గన్తుం శ్రాద్ధం కృత్వా విధానతః | విధాయ కార్పటీవేషం కృత్వా గ్రామ ప్రదక్షినామ్ 32
తతో గ్రామన్తరం గత్వా శ్రాద్ధశేషస్య భోజనమ్ | తతః ప్రతిదినం గచ్ఛే త్ప్రతిగ్రహ వివర్జితః 33
పదే పదే`ò శ్వమేధస్య స్యాత్ఫలం గచ్ఛతో గమాయ్ | బలీవర్ద సమారూడ స్తీర్ధం యో యాతి సువ్రతే 34
నరకే వసతే ఘోరే గవాం క్రోధో మి దారుణః | సలిలం చ న గృహన్ణన్తి పితరస్తస్యదేహినః 35
ఐశ్వర్యాల్లో భమోహాద్వా గచ్ఛేద్యానేన యో నరః | నిష్పలం తస్య తీర్ధం తు తస్మాద్యానం వివర్జయేత్ 36
గోయానే గోవధః ప్రోక్తో హయయానే తు నిష్పలమ్ | నరయానే తదర్ధం స్యా త్పద్భ్యాం తచ్చ చతుర్గుణమ్ 37
వర్షాత పాదికే ఛత్రీ దండీ శర్కర సంకటే | శరీర త్రాణకామో`òసౌ సోపానత్కస్సదా వ్రజేత్ 32
తీర్థం ప్రాప్యానుషంగేణ స్నానం తీర్థే సమాచరన్ | స్నానజం ఫలమాప్నోతి తీర్థయాత్రాఫలం నతు 39
షోడశాంశం స లభ##తే యః పరార్దేన గచ్చతి | అర్థం తీర్థపలం తస్య యః ప్రసంగేన గచ్ఛతి 40
తీర్ధేషు బ్రాహ్మణం నైవ పరీక్షేత కదాచన | అత్రార్ధిన మనుప్రాప్తం బోజ్యం తం మనురబ్రవీత్ 41
సక్తుభిః పిండాదానం చ సంయావైః పాయసేన వా | బదరామలకైర్వాపి పిణ్యాకైర్వా సులోచనే 42
శ్రాద్ధం తు తత్ర కర్తవ్యం అర్చావాహన వర్జితమ్ | శ్వధ్వాంక్ష గృధ్రపాపానాం నైవ దృష్టి హతం చ యాత్ 43
శ్రాద్ధంతు తైర్థికం ప్రోక్తం పితౄణాం తృప్తికారకమ్ | అకాలే`ò ప్యధవా కాలే తీర్థశ్రాద్ధం తధా నరైః 44
ప్రాపైరేవ సదా తత్ర కర్తవ్యం పితృతర్పణమ్ | విలంబో నైవ కర్తవ్యో నైవ విఘ్నం సమాచరేత్ 45
ప్రతికృతిం కుశమాయీం తీర్థవారి ని మజ్జయేత్ | యముద్దిశ్య విశాలాక్షి సో`òష్టమాంశం ఫలం లభేత్ 46
కుశో`òసి కుశపుత్రో`òసి బ్రహ్మణా నిర్మితః పురా | త్వయి స్నాతే తు సస్నాతో యస్యేదం గ్రంథి బంధనమ్ 47
ముండనం చోపవాసశ్చ సర్వతీర్ధష్వయం విధిః | వర్జయిత్వా కురుక్షేత్రం విశాలం విరజాం గయామ్ 48
భౌమానామధ తీర్థానాం పుణ్యత్వే కారణం శృణు | యధా శరీర స్యోద్దేశా కేచిన్ముఖ్యతమా స్స్మృతా! 49
ప్రభావాదద్భుతాద్భూమేః సలిలస్య చ తేజసః | పరిగ్రహాన్మనీనాంచ తీర్థానాం పుణ్యతా స్మృతా 50
గంగాం సంప్రాప్య యో దేవి ముండనం నైవ కారయేత్ | క్రియా తస్యా క్రియాస్సర్వా తీర్థద్రోహీ భ##వేత్తధా 51
గంగాయాం భాస్కరక్షేత్రే ముండనం యో న కారయేత్ | స కోటి కులసంయుక్త ఆకల్పం రౌరవం వ్రజేత్ 52
గంగాం ప్రాప్య సరిచ్ఛ్రేష్ఠాం కల్పాన్తా పాపసంచయాః | కేశానాశ్రిత్యతిష్టన్తి తస్మాత్తాన్పరివర్జయేత్ 53
తావద్వర్ష సహస్రాణి స్వర్గోలోకే మహీయతే 54
ప్రయాగవ్యతిరేకే తు గంగాయాం ముండనం నహి | యో`òన్యధా కురుతే మోహా త్సమహారౌరవం వ్రజేత్ 55
స జీవత్పితృ కో యస్తు తీర్థం ప్రాప్య విధానవిత్ | క్షౌరం సమాచరేన్నైవ శ్మశ్రూణాం వపనం సతి 56
గయాదావపి దేవేశి శ్మశ్రూణాం వపనం వినా | నా క్షౌరం మునిఖి స్సర్వై ర్నిషిద్ధం చేతి కీర్తితమ్ 57
సశ్శ్మశ్రుకేశవపనం ముండనం తద్విదుర్భుధాః | నక్షౌరం ముండనం సుభ్రు కీర్తితం వేదవేదిభిః 58
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే
వసు మోహినీ సంవాదే ప్రయాగరాజ మాహాత్మ్యే
తీర్ధ విధిర్నామ ద్విషష్టి తమో`òధ్యాయః
వసువు పలికెను : - భద్రపరులారా! తీర్థయత్రాగమనవిధానమును తెలిపెదను వినుము. ఈ విధానమును అనుసరించినవారు యధోక్త ఫలమును పొందగలగుదురు. పవిత్రమగు తీర్థయాత్రాగమనము యజ్ఞములనాచరించుటకన్నా విశేష ఫలప్రదము, దశమి ఏకాదశి ద్వాదశి రాత్రులందు ఉపవసించక, తీర్థయాత్రలకు వెళ్ళక, స్వర్ణదానమును, గోదానమును చేయక మానవుడు దరిద్రుడుగును. తీర్థయాత్రల వలన పొందు పలమును విపులదక్షిణలనిచ్చు అగ్నిష్టోమాదియాగముల వలన కూడా పొందజాలడు. అజ్ఞానముచే తీర్థయాత్రలు చేసినవాడు కూడా సర్వాకామ సమృద్ధుడే స్వర్గమును పొందును. ధనదాన్య సమాకులమగు స్థానమును పొందును. ఐశ్వర్య పూర్ణుడు జ్ఞానపూర్ణుడగును. సర్వకాలములందు భోగయుతుడగును. అతని పితరులు పితామహులు నరకమునుండి తరించబడుదురు. హస్తములు పాదములు మనస్సునియమబద్ధముగా ఉండువానికి విద్య తపస్సు కీర్తి నియమబద్దముగా నున్నవానికి తీర్థయాత్రా ఫలముల లభించును. ఎవరి నుండి దేనిని గ్రహించక, లభించిన దానితో సంతృప్తి చెందువాడు, అహంకార విముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందకలుగును. కల్పనలు లేనివాడు, ప్రయత్నశూన్యుడు, తగినంత ఆహారమును పొందువాడు, ఇన్ద్రియని గ్రహము కలవాడు, సర్వసంగవినిర్ముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందును. శ్రద్ధతో, ఏకాగ్రమనస్కుడై, ధీరుడై తీర్థయాత్ర ననుసరించుచు పాపములను చేయువాడు కూడా శుద్ధి పొందును., ఇక పరిశుద్ధుని మాటలే? శ్రద్ధ లేనివాడు, పాపార్తుడు, నాస్తికుడు, సంశయములు తొలగనివాడు, హేతువాది ఈ అయిదు గురు తీర్థయాత్రా ఫలమును పొందజాలరు. పాపములను చేయువారి పాపములు తీర్థయాత్రలతో నశించును. పరిశుద్ధాత్ములకు తీర్థయాత్రలు యధోక్తఫలము లభించును. కామక్రోధలోభములను జయించి తీర్థయాత్రలు చేయువారు పొందజాలని ఫలముండదు. యధోక్త ఫలము లభించును. కామక్రోధలోభములను జయించి త్రీర్థయాత్రలు చేయువారు పొందజాలని ఫలముండదు. యథోక్త విధిచే తీర్థ యాత్రలను చేయువారు సుఖదుఃఖాది సకల ద్వంద్వ విధిచే సకల ద్వంద్వములను సహించగలవారు స్వర్గమును పొందెదరు. గంగాది పుణ్యతీర్థములందు చాలా చేపలు నివసించుచుండును. దేవాలయములందు పక్షి గణములుండును. అయిననూ వారందరికి పలము కలగుటలేదు. తీర్థమునందు కాని దేవాలయములందు కాని వాసము ముఖ్యముకాదు. భావము ప్రధానము. భావహీనులు ఫలమును పొందజాలరు. కావున హృదయమున భక్తి భావమును ప్రతిష్ఠించుకొని ఏకాగ్రమనస్కుడై పుణ్యతీర్థములను సేవించవలయును. మునీన్ద్రులు చెప్పిన విధించిన ఆమోదించిన తీర్థయాత్రను గురువులచే నియమించబడిన బ్రహ్మచారులు యధావిధిగా నాచరింతురు. సర్వస్వము నశించుననూ అల్పబలము కలవాడైననూ బ్రాహ్మణులను ముందు నిడుకొని, యజ్ఞధికారము ఉన్నూ తోలగిననూ బ్రహ్మణులు తీర్థములను పర్యటించవలయును. పరిశుద్ద మనస్సుకల మునీన్ద్రులు పవిత్ర తీర్థములలో యజ్ఞపలము లభించునని చెప్పియున్నారు. యజ్ఞములందు అధికారము కలవారు మాత్రము ఇల్లు, గృహస్థధర్మములే ముఖ్యము. గృహస్థాశ్రమమును యధావిధిగా ఆచరించువారికి తీర్ధయాత్రలు నిషేధించబడినది. సర్వతీర్థములలో అగ్నిహోత్రతుల్యములు కాజాలవని కొందరు చెప్పెదరు. మొదట గృహస్థాశ్రమమున చక్కగా ఆచరించువాడు అప్రమత్తుడై గృహమున నుండువాడు తీర్థయాత్రలకు వెళ్ళదలచినచో సావధానుడై మొదట గణశుని పూజించవలయును. దేవతలను పితరులను బ్రాహ్మణులను సాధువులను విత్తానుసారముగా ప్రయత్నముతో పూజించవలయును. తీర్థయాత్రల నుండి తిరిగి గృహమునకు వచ్చిన తరువాత ఇట్లే దేవ పితృ బ్రహ్మణ సాధువులను పూజించవలయును. ఇట్లు యధావిధఙగా తీర్థయాత్రలను చేయువారికి యధోక్త ఫలము నిశ్చయముగా లభించును. దేశాన్తరమునకు వెళ్ళుచు నేతితో శ్రాద్ధమునా చరించవలయును. ఇది యాత్రార్థము చెప్పబడినది. మరల ఇల్లు చేరిన వెంటనే చేయవలయును. ప్రయాగతీర్థమున యాత్రకు వచ్చినవారు పితృమాతృ వియుక్తలైనచో కేశములను వపనము చేయవలయును. నిష్కారణముగా వపనము చేయరాదు. గయను వెళ్ళుటకు సిద్ధపడినవాడు యధావిధిగా శ్రాద్ధమునా చరించి కార్పటీ వేషమును ధరించి గ్రామ ప్రదక్షిణము నాచరించి గ్రామాన్తరమునకు వెళ్ళి శ్రాద్ధశేషమును భుజించవలయును. తరువాత విఘ్నము లేకుంéడా ప్రతి దినము వెల్ళవలయును. గయాక్షేత్రమునకు వెళ్ళువానికి ప్రతిపదమున అశ్వమేధ పలము లభించును. వృషభము నధిరోహించి తీర్థయాత్రలకు వెళ్ళువాడు నరకమున నివసించును. గోవుల క్రోధము పరమదారుణము కదా. అతనిచ్ఛు తర్పణమును పితృదేవతలు గ్రహించరు. ఐశ్వర్యము వలననో లోభము వలననో వాహనముతో చేసిన యాత్ర నిష్ఫలమగును. కావున వాహనమును విసర్జించవలయును. గోవాహనమున వెళ్ళినచో గోవధ పాతకము లభించును. హయయానమున వెళ్ళినచో నిష్ఫలమగును. నరవాహనమున వెళ్ళినచో అర్ధఫలము లభించును. నడిచి వెళ్ళినచో నాలగురెట్టు ఫలము కలుగను. వర్షాతపాది బాధలున్నచో ఛత్రమునుదరించవలయును. గులకరాళ్లున్నచో దండమును ధరించవలయును. శరీరమును కాపాడుకొనుటకు పాదరక్షలను ధరించి యుండవలయును. పుణ్యతీర్థమును చేరి అచట స్నామును అప్రాధాన్యముగా చేసినచో స్నానపలమును పొందును కాని తీర్థఫలమును పొందజాలడు ఇతరుల ధనముతో వెళ్ళిన వారికి పదునారవ భాగము పలము లభించును. అనుకోకుండా ప్రసంగవశమున వెళ్ళినవారికి సగము ఫలము మాత్రమే లభించును. పుణ్యతీర్థములందు బ్రాహ్మణులను పరీక్షించరాదు. పుణ్యతీర్థములలో యాచనకొచ్చిన వారికి భోజనము పెట్టవలయునని మనువు చెప్పియున్నాడు. తీర్థములలో సత్తు పిండితో కాని యవలతోకాని, పాయసముతో కాని, రేగి పండ్లతో కాని, వుసిరికతోకాని, పిండితో కాని పిండదానమును చేయవలయును. తీర్థములలో అర్చావాహన వర్జితముగా శ్రాద్ధము నాచరించవలయును. శునక కాక గృహ్రపాపుల దృష్టి హతము కాని దానిని చేయవలయును. తీర్థములలో నాచరించు శ్రాద్ధము పితరులకు తృప్తిని కలిగించును. సకాలములో కాని అకాలమున కాని తీర్థమున లభించినవారితోనే లభించిన పదార్థములతోనే పితృతర్పణమును చేయవలయును. ఆలస్యము చేయరాదు. విఘ్నము నాచరించరాదు. కుశమయి ప్రకృతిని తీర్థజలమున విసర్జించవలయును. ఎవరినుద్దేశించి విసర్జన చేసిన అతని అష్టమాంశ ఫలము లభించును. నీవు కుశస్వరూపుణివి. కుశపుత్రుడవు. పూర్వము బ్రహ్మచే నిర్మించబడితివి. నీవు స్నానముచేసినచో ఈ గ్రంథి బంధన ఉద్దేశ్యభూతుడు కూడా స్నానము చేసిన వాడగును. ముండనము ఉపవాసము అన్ని తీర్థములలో విధి. విశాల, విరజ, గయ కురుక్షేత్రములలో మాత్రము ఈ విధి వర్తించదు. భూమండలగత తీర్థములు పుణ్యప్రదములగుటకు కారణమును వినుము. శరీరమున కొన్ని అవయవములు ప్రధానములగునట్లు భూప్రభావము వలన, అద్భుతము వలన, జలము వలన, అగ్ని వలన, మునులు పరిగ్రహించట వలన తీర్థములు పుణ్యప్రదములగుచున్నవి. గంగాతీర్థమును చేరి ముండనమును చేయుంచుకొననిది వాని క్రియలన్నియూ వ్యర్థములగును. అతను తీర్థద్రోహియగును. గంగాతీర్థమున భాస్కరక్షేత్రమున ముండనము చేయించుకొననివాడు కోటికులములతో కల్పాన్తము వరకు రౌరవనరమును చేరును. ఉత్తమనదియగు గంగను చేరి కల్పాన్తము వరకుండు పాపరాశులన్నియూ కేశముల నాశ్రయించియుండును. గాన కేశములను విడువలయును. గంగాజలమున ఎన్నినఖకేశములు పడునో అన్ని వేలవర్షములు స్వర్గములో నివసించును. ప్రయాగ వ్యతిరిక్త గంగలో ముండనము చేయించుకొనరాదు. ఇందుకు భిన్నముగా వ్యవహిరించిన వాడు మహారౌరవనరమును పొందును. తండ్రి బ్రతికియుండగా తీర్థమును చేరినవాడు యధావిధిగా క్షౌరమునాచరించవలయును కాని మీసములను ఖండిచుకొనరాదు. మునులెల్లరూ క్షౌరమును నిషేధించియుండలేరు. మీసములను కేశలములను వపనము చేసిననే ముండనమందురు. మీసములను వదిలి కేశములను మాత్రము తీసినచో క్షౌరమందురు. కావున వేదవిదులు క్షౌరము ముండనము వేరువేరని చెప్పియుండిరి.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున
ప్రయాగరాజ మహాత్మ్యమున తీర్థ విధి
యను అరవది రెండవ అధ్యాయము