Sri Naradapuranam-3    Chapters    Last Page

త్రిషష్టితమోధ్యాయః అరువది రెండవ ది మూడవ అధ్యాయము

ప్రయాగమాహాత్మ్యమ్‌

వసురువాచ:-

శృణు మోహిని వక్ష్యామి మాహాత్మ్యం వేద సంమతమ్‌ | ప్రయాగస్య విధానేన స్నాత్వా యత్ర విశుద్ధ్యతి 1

కురుక్షేత్రసమా గంగా యత్ర తత్రావగాహితా | తస్మాద్దశగుణాప్రోక్తా యత్ర వింధ్యేన సంగాతా 2

తస్మాచ్ఛతగుణప్రోక్తా కాశ్యాముత్తరవాహినీ | కాశ్యాశ్శతగుణా ప్రోక్తా గంగా యత్రార్కజాన్వితా 3

సహస్రగుణితా సా పి భ##వేత్పశ్చిమావాహినీ | సా దేవి దర్శనాదేవ బ్రహ్మహత్యాది హారిణీ 4

పశ్చిమాభిముకీ గంగా కాళింద్యా సహ సంగతా | హనిక్త ల్పశతం పాపం సామాఘే దేవి దుర్లభా 5

అమృతం కధ్యతే భ##ద్రే సా వేణీ భువి సంగతా | యస్య మాఘే ముహుర్తం తు దేవానామపి దుర్లభమ్‌ 6

పృథివ్యాం యాని తీర్ధాని పుర్యః పుణ్యాస్తధా సతి | స్నాతు మాయాతి తా వేణ్యాం మాఘే మకర భాస్కరే 7

బ్రహ్మవిష్ణుమహాదేవ రుద్రాదిత్యమరుద్గణాః | గంధర్వా లోకపాలాశ్చ యక్షకిన్నర గుహ్యకాః 8

అణిమాది గుణోపేతా యే చాన్యే తత్త్వదర్శినః | బ్రహ్మాణీ పార్వతి లక్ష్మీ శ్శచీమేధ దితీ రతిః 9

సర్వాస్తాదేవపత్న్యశ్చ తధా నాగాంగనాశ్శుభే | ఘృతాచీ మేనకా రంభా ప్యుర్వశీ చ తిలోత్తమా 10

గణాశ్చాప్సరసాం సర్వే పితౄణాం చ గణాస్తధా | స్నాతుమాయాన్తి తే సర్వే మాఘే వేణ్యాం విరించి జే 11

కృతే యుగు స్వరూపేణ కలౌ ప్రచ్ఛన్నరూపిణః | సర్వతీర్ధానీ కృష్ణాని పాపినాం సంగదోషతః 12

భవన్తి శుక్ల వర్ణాని ప్రయాగే మాఘమజ్జనాత్‌ | మకరస్ధే రవౌ మాఘే గోవిన్దాచ్యుత మాధవ! 13

స్నానేనానేన మే దేవ! యధోక్తఫలదో భవ| ఇమం మన్త్రం సముచ్చార్య స్నాయాన్నౌనం సమాశ్రితః 14

వాసుదేవం హరిం కృష్ణం మాధవం చ స్మరేత్పునః | తప్తేన వారిణా స్నానం యద్గృ హే క్రియతే నరైః 15

షష్ట్యబ్దేన ఫలం తద్ది మకరే స్థే దివాకరే | బహిస్స్నానం తు వాప్యాదౌ ద్వాదశాబ్దఫలం స్మృతమ్‌ 16

తటాకే ద్విగుణం తద్ధి నద్యాదౌ తచ్చతుర్గుణమ్‌ | దశధా దేవఖాతే చ మహానద్యాం తు త చ్ఛతమ్‌ 17

చతుర్గుణశతం తచ్ఛ మహానద్యోస్తు సంగమే | సహస్రగుణితం సర్వం తత్ఫలంమకరే రవౌ 18

గంగాయాం స్నానమాత్రేణ ప్రయాగే తత్ర్పకీర్తితమ్‌ | గంగాం యే చావగాహంతి మాఘే మాసి సులోచనే 19

చతుర్యుగ సహస్రాంతే న పతంతి సురాలయత్‌ | శ##తేన గుణితం మాఘే సహస్రం విధి నందిని! 20

నిర్దిష్టమృషిభిస్నానం గంగా యమున సంగమే | పాపౌఘైర్భువిభారస్య దాహాయేమం ప్రజాపతిః 21

ప్రయాగం విదధౌ దేవి! ప్రజానాం హితకామ్యయా | స్నానస్థానమిదం సమ్యక్‌ సితాసితజలం కిల 22

పాపరూప పశూనాం మి బ్రహ్మణా నిర్మితం పురా | సితాసితా తు యా ధారా సరస్వత్యా విదర్భితా 23

తం మార్గం బ్రహ్మలోకస్య సృష్టికర్తా ససర్జ వై | జ్ఞానదో మానసే న తు మోక్షఫలప్రదః 24

హిమవత్పృష్ఠ తీర్ధేషు సర్వపాపప్రణాశనః | వేదవిద్భిర్వనిర్దిష్ఠం ఇంద్రోకప్రదోహి సః 25

సర్వమాసోత్తమో మాఘో మోఓదో బదరీ వనే | పాపహా దుఃఖ హారి చ సర్వకామఫలప్రదః 26

రుద్రలోకప్రదో మాఘో నార్మదే పరికీర్తితః 27

విశాల ఫలదో మాఘో విశాలాయ ప్రకీర్తితః | పాపేంధన దవాగ్నిశ్చ గర్భవాస వినాశనః 28

విష్ణులోకాయ మోక్షాయ జాహ్నవః పరికీర్తితః | సరయూర్గండకీ సింధు శ్చంద్రభాగా చ కౌశికీ 29

తాపీ గోదావరీ భీమా పయోష్ణీ కృష్ణవేణికా | కావేరీ తుంగ భద్రా చ యాస్తధాన్య స్సముద్రగాః 30

తాసు స్నాయీ నరో యాతి స్వర్గలోకం వికల్మషః

వసువు పలికెను:- మోమినీ! వేదసంమ్మతమగు ప్రయాగక్షేత్ర స్నాన విధానమును తెలిపెదను. వినుము. గంగలో నిచట స్నానముచేసిననూ కురుక్షేత్ర సమఫలము కలుగును. గంగ వింధ్యసంగతయైనచో పదిరెట్లు అధిక పలము నిచ్చును. కాశిలో ఉత్తరవాహిని యగుగంగ నూరురెట్లు అధిక ఫలము నిచ్చును. యమునా నదితో కలిసి యున్న గంగ కాశీ గంగ కంటె నూరు రెట్లు అధికపలమునిచ్చును. పశ్చిమ వాహిని గంగయైనచో వేయిరెట్లు అధికపలము నిచ్చును. పశ్చిమవాహిన గంగా దర్శనమాత్రముననే బ్రహ్మహత్యాది పాపములను హరించును. పశ్చిమాభిముఖియగు గంగ యమునతో కలసియున్నదచో నూరు కల్పముల పాపములను నశింప చేయును. మాఘ మాసమున ఇట్టి గంగ దుర్లభము. భూమండలమున గంగాయమున సంగమ తీర్ధము అమృతముగా కీర్తించబడును. ఇట్టి తీర్దము మాఘమాసమున దేవతలకు కూడా దుర్లభ##మే. ఈ భూమండలమున నున్న సమస్త తీర్ధములు, పవిత్రక్షేత్రములు మాఘమాసమున మకర భాస్కరుడున్నపుడు వేణిలో స్నానముచేయుటకు వచ్చును. బ్రహ్మవిష్ణుమహాదేవులు, రుద్రాదిత్యమరుద్గణములు, గంధర్వులు, లోకపాలకులు, యక్షకిన్నర గుహ్యకులు, అణిమాది గుణోపేతులగు తత్త్వదర్శులు, సరస్వతి, పార్వతి, లక్ష్మి, శచి, మేధా, అదితి, రతి, సకలదేవపత్నులు నాగాంగనలు, ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశీ, తిలోత్తమ, అప్సరోగణములు, పితృగణములు, అందరు మాఘమాసమున వేణీ స్నానమునకై వత్తురు. కృతయుగమున ప్రత్యక్షరూపముతో, కలియుగమున ప్రచ్ఛన్నరూపముతో వచ్చెదరు. వేణిలో దిగుచున్నపుడు పాపులసంగదోషముతో నల్ల బారిన సర్వతీర్ధములు మాఘమాసమున ప్రయాగమజ్జనమున శుక్లవర్ణములగును. సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘమాసమున ''గోవిన్ద, అచ్యుత! మాధవ నాస్నానముచే నాకు యధోక్త ఫలమునిమ్ము'' అనుమన్త్రమునుచ్చరించి మౌనముగా స్నానమునాచరించవలయును. మరల వాసుదేవుని, హరిని, కృష్ణుని మాధవుని స్మిరంచవలయును. సూర్యుడు మకరరాశిలో ఉండగా ఇంటిలో వేడినీరుతో స్నానముచేసినచో అరువదిసంవత్సరముల ఫలము కలుగును. వెలపలనున్న వాప్యాదులలో స్నానమాచరించిన ద్వాదశాబ్దనస్నానఫలము కలుగును. తటాకమున స్నానము ద్విగుణఫలమును, నద్యాదులందు చతుర్గుణఫలము, దేవఖాత స్నానము దశగుణఫలమును, మహానదీస్నానము శతగుణ ఫలమును, మహానదీసంగమస్నానము చతుశ్శతగుణఫలము కలుగును. సూర్యుడు మకరరాశిలో నుండగా చేయు అన్ని విధములస్నానము సహస్రగుణ ఫలమునిచ్చును. గంగాస్నానము, ప్రయాగ స్నానము సమాన ఫలమునిచ్చును. మాఘమాసమున గంగాస్నానమును చేయువారు నాలుగువేలయుగములు స్వర్గములో నివసింతురు. గంగాస్నానము శతగుణము, ప్రయాగ స్నానముసహస్రగుణిత ఫలమునిచ్చునని గంగాయమున సంగమమున స్నానమును నిర్ధేశించిరి. భూమండలమునగల పాపసమూహ భారదాహము కొరకు ప్రజాహితమును కోర ప్రజాపతి ప్రయాగను సృజించెను. తెలపు నలుపు జలము కలిగి తీర్ధము స్నానస్థానము. పాపరూప పశునాశమునకు ఈ స్థానమను బ్రహ్మనిర్మించెను. సితాసిత జలయగు ధారను సరస్వతితో కలిగి బ్రహ్మలోకమార్గమును సృష్టికర్త ఏర్పరిచెను. మానససరోవరస్నానము జ్ఞానప్రదముకాని మోక్ష ప్రదముకా జాలదు. హిమత్పృష్టతీర్దములన్నింటిలో సర్వపాప ప్రణాశనముగా ఇంద్రలోక ప్రదమని వేదవిదులు నిర్దేశించిరి. మాఘ మాసము సర్వమాసములలో ఉత్తమము. బదరీవనమున మోక్షప్రదము, పాపహారి, దుఃఖహారి, సర్వకామఫలప్రదము, నర్మదానది మాఘమాసమున రుద్రలోలకప్రదము. సకలపాపనాశకము సర్వలోకసుఖప్రదము, మాఘమాసమున విశాల నది విశాలఫలప్రదము. పాపసమూహమునకు దవాగ్ని, జన్మనాశకము, మాఘమాసమున గంగానది విష్ణులోక ప్రదము. మోక్ష ప్రదము. సరయు, గండికి, సింధు, చన్ద్రభాగా, కౌశికి, తాపీ, గోదావరి, భీమా, పయోష్ణీ, కృష్ణవేణి, కావేరి, తుంగభద్ర, ఇతరసముద్రగతనదులు అన్నియూ మాఘమాసమున స్వర్గలోక ప్రదములు.

నైమిషే విష్ణు సారూప్యం పుష్కరే బ్రహ్మణోంతికమ్‌ | 31

ఆఖండలస్య లోకో హి కురుక్షేత్రే చ మాఘతః | మాఘో దేవ హ్రదే దేవి యోగసిద్ధి ఫలప్రదః 32

ప్రభాసే మకరా దిత్యే స్నాతో రుద్రకగణో భ##వేత్‌ | దేవికాయాం దేవదేహో నరో భవతి మాఘతః 33

మాఘస్నానేన విధిజే గోమత్యాం న పునర్భవః | హేమకూటే మమాకాలే ఓంకారే హ్యపరే తధా 34

నీలకంధార్భుదే మాఘో రుద్రలోక ప్రదో మతః | సర్వాసాం సరితాం దేవి సంపూరో మాకరే రవౌ 35

స్నానేన సర్వాకామానాం ప్రాపై#్య జ్ఞేయో విచక్షణౖః | మాఘస్తు ప్రాప్యతే ధన్యైః ప్రయాగే విధినందిని 36

అపునర్భవదం తత్ర సితాసిత జలం యతః 37

గాయన్తి దేవా స్సతతం దివిష్ఠా మాఘః ప్రయాగే కిల సంభవిష్యతి | స్నాతా నరా యత్ర న గర్భేవేదనాం పశ్యన్తి తిష్ఠన్తి చ విష్ణు సన్నిధౌ 38

తీర్దైర్వతైస్న్సానతపో భిరధ్వరై స్సార్ధం విధాత్రా తులయా ధృతం పురా | మాఘః ప్రయాగశ్చ తయోర్ధ్వయోరభా న్మాఘో గరీయాంశ్చతురాననాత్మజే 39

వాతాంబుపర్ణాశనదేహ శోపణౖస్తపోభిరుగై శ్చిరకాలసంచితై | యోగైశ్చసంయాన్తి నరాస్తు యాం గతిం స్నానాత్రృయాగస్య హి యాంతి తాం గతిమ్‌ 40

స్నాతా హి యే మాకర భాస్కరోదయే తీర్ధే ప్రయాగే సురసింధుసంగమే | తేషాం గృహద్వార మలంకరోతి భృంగావళీ కుంజరకర్ణతాడితా 41

యో రాజసూయాఖ్య సమాధ్వరస్య స్నానాత్పలం సంప్రదదాతి చాఖిలమ్‌ | పాపాని సర్వాణి నిహత్య లీలయ నూనం ప్రయాగః స కధం న వర్ణ్యతే 42

చతుర్వేదిషు యత్పుణ్యం సత్యవాదిషు చైవహి | స్నాత ఏవ తదాప్నాతి గంగాకాలింది సంగమే 43

తత్రాభిషేకం కుర్వీత సంగమే శంసితవ్రతః | తుల్యం ఫలమావాప్నోతి రాజసూయాశ్వమేధయోః 44

పంచయోజనవిస్తీర్ణం ప్రయాగస్యతు మండలమ్‌ | ప్రవేశాదస్య భూమౌతు అశ్వమేధః పదే పదే 45

త్రీణి కుండాని సుభ##గే తేసాం మధ్యే తు జాహ్నవీ | ప్రాయగస్య ప్రవేశేన పాపం న శ్యతి తత్‌క్షణాత్‌ 46

నైమిషమున విష్ణుసారూప్యమును, పుష్కరమున బ్రహ్మసామీప్యమును, కురుక్షేత్రమున ఇంద్రలోకమును ప్రసాదించును. దేవహ్రదమున మాఘమాసము యోగపిద్ధి ఫలప్రదము. మకరాదిత్యకాలమున ప్రభాసస్నానము రుద్రగణత్వప్రదము. దేవికానదిలో మాఘస్నానము దేవదేహమును ప్రసాదించును. గోమతీస్నానము పున్జన్మ హరము. హేమ కూటమున మహాకాలమున, ఓంకారమున, నీలకంఠార్బుదమున మాఘస్నానము రుద్రోలోకప్రము. సూర్యుడు మకరరాశిలో నుండగా సర్వనదులు కలియును గాన అపుడు చేయుస్నానము సర్వకామప్రదము. మాఘమాసమున ప్రయాగను ధన్యులు చేరెదరు. అచట సితాసిత జలముండును గాన పునర్జన్మును హరించును. మాఘమాసము ప్రయాగలో మాకు గడువవలయునని స్వర్గమున నుండు దేవతలు గానము చేయు చుందురు. ప్రయాగలో మాఘస్నానమును చేయువారు. మరల గర్భవేదనను పొందరు. విష్ణుసన్నిధిలో ఉందురు. పూర్వము బ్రహ్మ తీర్ధవ్రత స్నానతపోయాగ మాఘప్రయాగలను తలతూచెను. వాటిలో మాఘమాసము ప్రయాగ అధికమాయెను. ఈ రెంటిలో మాఘము ఇంకనూ శ్రేష్ఠమాయోను. గాలి, నీరు అకులు, ఆహారముగా తీసుకొని దేహశోషణముచే ఉగ్రతపములచే చిరకాల సంచితయోగములచే పొందుగతిన మాఘప్రయాగ స్నానమున పొందెదరు. మకర భాస్కరోదయకాలమున గంగాసంగమమగు ప్రయాగలో స్నానము చేయువారి గృహద్వారమున కుంజరకర్ణతాడిత భృంగావళి అలంకార మగును. మాఘప్రయాగస్నానము రాజసూయాధ్వార సమఫలప్రదము సర్వపాపహరము. అట్టి ప్రయాగనేలస్తుతించరు? నాలుగువేదములను చదివినవారికి కలుగు ఫలము, సత్యవాది ఫలము, గంగాయమునాసంగమ స్నానమున లభించును. ఈ సంగమమున వ్రతమును స్వీకరించి స్నానమావవలయును. ఇట్లు చేసిన రాజసూయాశ్వమేధముల ఫలమును పొందును. ప్రయాగమండలము పంచయోజనవివస్తీర్ణము. ఈ భూమిలో ప్రవేశించి నంతనే ప్రతిపదమున అశ్వమేధ ఫలము లభించును. ఇచట మూడు కుండములుండును. వీటి మధ్యలో జాహ్నవి యుండును. ప్రయాగతీర్ధ ప్రవేశమాత్రముననే తత్‌క్షణమే సకలపాపములు నశించును.

మాసమేకం నరస్స్నాత్వా ప్రయాగే నియతేంద్రియః | ముచ్యతే సర్వపాపేభ్యో యధా దృష్టం స్వయంభువా 47

శుచిస్తు ప్రయతో భూత్వా హింసక శ్శ్రద్ధయాన్వితః | స్నాత్వా ముచ్యేత పాపేభ్యో గచ్ఛేచ్చ పరమం పదమ్‌ 48

నైమిషం పుష్కరం చైవ గోతీర్ధం సింధుసాగరమ్‌ | గయా చ ధేమకం చైవ గంగాసాగరసంగమః 49

ఏతే చాన్యేచ బహవో యే చ పుణ్యా శ్శిలోచ్చయాః | దశతీర్ధ సహస్రాణి త్రింశత్కోట్యస్తధాపరాః 50

ప్రయాగే సంస్థితా నిత్య మేధమానా మనీషిణాం | త్రీని యాన్యగ్ని కుండాని తేషాం మధ్యేతు జాహ్నవీ 51

ప్రయాగాద్ధి వినిష్క్రాన్తా సర్వతీర్ధపురస్కృతా | తపనస్య సుతా దేవీ త్రిషులో కేషు విశ్రుతా 52

యమునా గంగయా సార్ధం సంగతా లోకపావనీ | గంగాయమునయోర్మధ్యే పృధివ్యాం యత్పరం స్మృతమ్‌ 53

ప్రయాగస్య తు తీర్ధస్య కలాం నార్హతి షోడశీమ్‌ | త్రిసః కోట్యోర్ధకోటీచ తీర్ధానాం వాయురబ్రవీత్‌ 54

దివి భువ్యం తరిక్షే చ జాహ్నవ్యంతాని సంతి చ | ప్రయాగే సమధిష్ఠాయ కబలాశ్వతరావుభౌ 55

భోగవత్యధవాచైషా వేదీవేద్యాప్రజాపతిః | తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమంత స్సమాస్థితాః 56

ప్రజాపతి ముపాసంతే ఋషయశ్చ తపోధనాః | యజన్తి క్రతు భిర్దేవాం స్తధా చక్రధరాస్సతి 57

తతః పుణ్యతమో నాస్తి త్రిషు లోకేషు సున్దరి!

ప్రభావాత్సర్వతీర్ధేభ్యః ప్రభవత్యధిక స్తధా | తత్ర దృష్ట్వా తు తత్తీర్ధం ప్రయాగం పరమం పదమ్‌

ముచ్యన్తే సర్వపాపేభ్య శ్శశాంక ఇవ రాహుణా 59

తతో గత్వా ప్రయాగం తు సర్వదేవాభిరక్షితమ్‌ | బ్రహ్మచారీ వసన్మాసం పితౄన్దేవాంశ్చ తర్పయాన్‌ 60

ఈప్సితాంల్లభ##తే కామ న్యత్రతత్రాభిసంగతః | మకరస్థే రవౌ మాఘే న స భూయస్తు గర్భగః

ఒక మాసము జితేద్రియడై ప్రయాగస్నానమాచరించిన సర్వపాపములు నశించుటకు బ్రహ్మ ప్రత్యక్షముగా చూచెను. పాపియైననూ శుచియై ఏకాగ్రమనస్కుడై శ్రద్ధతో ప్రయాగలో స్నానమాడినచో సర్వపాపములు తొలగి పరమపదమును పొందును. నైమిషము, పుష్కరము, గోతీర్ధము, సింధుసాగరము, గయా, ధేనుకము, గంగాసాగర సంగమము ఇవి, ఇతరబాహు పుణ్యశిలోచ్చయలములు, దశసహస్రతీర్ధములు, ఇతరములగు ముప్పదికోట్ల తీర్ధములు, ఇవన్నియూ ప్రయాగలో ఎపుడూ నిలిచియుండును. ఇచట మూడు అగ్ని కుండములు కలవు. వీటి మధ్యలో జాహ్నవి కలదు. ప్రయాగనుండి సర్వతీర్థ పురస్కృతయై బయలువెడలిన యమునానది లోకత్రయ ప్రసిద్ధిని పొందినది. లోకపావనియగు యమునానది గంగతో కలిసెను గంగాయమునల మధ్య భూభాగమున నున్న సకలపుణ్యక్షేత్ర తీర్ధరాజలములన్నియూ ప్రయాగషోడశాంశకు సాటిరావని చెప్పిరి. ఈ భూమండలమున మూడు కోట్ల యాబది లక్షల తీర్ధముల, ఇంకను అంతరిక్షమున స్వరగమున జాహ్నవ్యంతములుగా కలవని వాయువు తెలిపెను. ఇవన్నియూ ప్రయాగలో కలియును. మరియూ కబలాశ్వతరములు రెండు, భోగవతి, వేది, వేధ్యము, ప్రజాపతిని సేవించుచుందురు. యాగములచే దేవతలను పూజింతురు. కావున ప్రయాగకంటే పుణ్యతమ మగునది ఈ భూమండలమున మరియొకటి లేదు. ప్రయాగప్రభావమున అన్ని తీర్ధములను అతిశయించును. ఇచట ప్రయాగతీర్దమును చూచిన వారు సర్వపాపవినిర్మక్తులై పరమపరమును పొందెదరు. కావున సర్వదేవాభిరక్షితమగు ప్రయాగకు వెళ్ళి బ్రహ్మచర్యముతో ఒకమాసముండి పితరులను, దేవతలను తృప్తులను చేయవలయును. ఇట్లు చేసిన సకలాభీష్టములను పొందును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున ప్రయాగలో స్నానమాడినవాడు మరల పుట్టడు.

దుర్జయా వైష్ణవీ మాయా దేవైరపి సుదస్త్యజా | 62

ప్రయాగే దహ్యతే సా తు మాఘే మాసి విరించిజే | తేషు తేషు చ లోకేషు భుక్త్వా భోగాననేకశః 63

పశ్చాచ్చక్రిణి లీయన్తే ప్రయాగే మాఘమజ్జినః | ఉపస్పృశతి యో మాఘే మకరార్కే సితా సితే 64

తస్య పుణ్యస్య సంఖ్యాం నో చిత్ర గుప్తో పివేత్త్యలమ్‌ | రాజసూయ సహస్రస్య వాజపేయ శతస్య చ 65

ఫలం సితాసితే మాఘే స్నాతానాం భవతి ధ్రువమ్‌| ఆకల్ప జన్మభిః పాపం సంచితం మనుజైస్తు యత్‌ 66

తద్భవేద్భస్మసాన్మాఘే స్నాతానాం తు సితాసితే| గంగాయమునయైశ్చైవ సంగమో లోకవిశ్రుతః 67

స ఏవ కామికం తీర్ధం యత్ర స్నానేన భక్తితః | యస్య యస్య చ యః కామ స్తస్య తస్యభ##వేద్ధి సః 68

భోగకామస్యభోగాస్యు స్స్యాద్రాజ్యం రాజ్యకామినః | స్వర్గస్స్యాత్‌స్వర్గ కామస్య మోక్షస్స్యాన్మోక్షకామినః 69

కామప్రదాని తీర్ధాని త్రైలోక్యే యాని కాని చ | తావి సర్వాణి సేవన్తే ప్రయాగం మకరే రవౌ 70

హరిద్వారే ప్రయాగే చ గంగాసాగరసంగమే | స్నాత్వైవ బ్రహ్మణో విష్ణో శ్శివస్య చ పురం వ్రజాత్‌ 71

సితా సితే తు యత్స్నాం నం మాఘమాసే సులోచనే | న దత్తే పునరావృత్తిం కల్పకోటి శ##తైరపి 72

సత్యవాదీ జితక్రోధో హ్యహింసాం పరమాం శ్రితః | ధర్మానుసారీ తత్వజ్ఞో గోబ్రాహ్మణ హితే రతః 73

గంగాయమున యోముర్మధ్యే స్నాతో ము చ్యేతకిల్బిషాత్‌ | మనసా చింతితాన్కామాం స్తత్ర ప్రాప్నోతి పుష్కలాన్‌ 74

స్వర్ణభారసహస్రేణ కురుక్షేత్రే రవిగ్రహే | యత్ఫలం లభేత్‌ మాఘే వేణ్యాం తత్తు దినే దినే 75

గనాం శతసహస్రస్య సమ్యగ్దత్తస్య యత్ఫలమ్‌ | యోగభ్యాసేన యత్పుణ్యం సవంత్సర శతత్రయే

ప్రయాగే మాఘ మాసేతు త్ర్యహం స్నానేన యత్ఫలమ్‌ 77

నాశ్వమేధసహస్రేణ తత్ఫలం లభేత్‌ సతి | త్ర్యహస్నాఫలం మాఘే పురా కాంచన మాలినీ 78

రాక్షసాయ దదౌ ప్రీత్యా తేన ముక్తస్సపాపకృత్‌ | త్ర్యహాత్పాపక్షయో జాతః సప్తవింశతిభిర్దినైః 79

స్నానేన యద భూత్పుణ్యం తేన దేవత్వమాగతా

విష్ణుమాయ దేవతలచేకూడా జయించ రానిది. కాని మాఘప్రకయాగస్నానమున విష్ణుమాయ కూడా దహించడును. మాఘప్రయాగస్నానమునాచరించినవారు ఆయాలోకములలో బహు భోగములననుభవించి శ్రీ విష్ణువలో లీనమగుదురు. మకరార్కకాలమున ప్రయాగస్పర్శవలన కలుగు పుణ్యరాశులను చిత్రగుప్తుడు కూడా లెక్కించ జాలడు. సహస్రరాజసూయముల ఫలము, శత వాజపేముల ఫలము మాఘ ప్రయాగస్నానమున కలుగును, మాఘప్రయాగస్నానమున కల్పారంభమునుండి బహుజన్మలలో చేసిన పాపరాశులు భస్మమగును. గంగాయమునాసంగమము లోక ప్రసిద్ధము. దీనినే కామిక తీర్ధ మందురు. ఇచట భక్తిచేస్నానముచేయువారి కొరికలన్నియూ తీరును. భోగకాములకు భోగము, రాజ్యకాములకు రాజ్యము, స్వర్గకామికి స్వర్గము, మోక్షకామికి మోక్షము కలుగును ఈ భూమండలమున గల కామప్రద తీర్ధములన్నియూ మాఘమున ప్రయాగలో లీనమగును. హరిద్వారమున, ప్రయాగలో, గంగా సాగర సంగమమున స్నానము చేసినవారు బ్రహ్మ విష్ణు శివలోకములను పొందెదరు. మాఘమాసము ప్రయాగస్నాము చేసినవారికి పునర్జన్మ కలుగదు. సత్యవాది, జితక్రోధుడు, అహింసా శీలుడు, ధర్మానుసారి, తత్వజ్ఞుడు, గోబ్రాహ్మణహితకారి, గంగాయమునా సంగమస్నానమాత్రమున పాపముక్తుడగును. మనసులో చింతించిన కామనలన్నింటినీ పొందును, సూర్యగ్రహణకాలమున కురుక్షేత్రమున స్వర్ణభారసహస్రదానమును చేసినవానికి కలుగు ఫలము మాఘప్రయాగస్నానమున లభించును, సహస్రగోదాన జన్మఫలము మాఘప్రయాగమున త్రిదిన స్నానము వలన కలుగును. త్రిశతవత్సరములు యోగాభ్యాసమువలన కలుగు ఫలము మాఘమాసమున ప్రయాగలో త్రిదినస్నానమున కలుగును. మాఘమాసమున దినత్రయమున ప్రయాగస్నానము వలన కలుగు ఫలము, అశ్వమేధ సహస్రముచే కూడా లభించదు. పూర్వము కాంచనమాలిని మాఘమున త్రిదిన ప్రయాగస్నానఫలమును రాక్షసునకిచ్చుటచే రాక్షసుడుపాపముక్తుడాయెను. మూడు దినములలో పాక్షయము జరిగెను. ఇరువదియేడు దినములు స్నానముచేయుటచే దేవత్వమును పొందెను.

రమమాణా తు కైలాసే గిరిజాయాః ప్రియా సఖీ 80

జాతిస్మరా తథా జాతా ప్రయాగస్య ప్రసాదతః | అవంతీ విషయే రాజా వాసరాజో భవత్పురా 81

నర్మదా తీర్ధ మాసాద్య రాజసూయం చకార సః | అశ్వైష్టోడశభిస్తత్ర స్వర్ణయూప విరాజితైః 82

స్వర్ణభూషణ భూషాఢ్యై రీజే సోపి యధా విధి | ప్ర దదౌ ధాన్య రాశిం చ ద్విజేభ్యః పర్వతోపమమ్‌ 83

శ్రద్ధావాన్దేవతాభక్తో గోప్రదశ్చ సువర్ణదః | బ్రాహ్మణో భద్రకో నామ ముర్ఖో హీన కులస్తధా 84

కృషీవలోధమాచారః సర్వధర్మ బహిష్కృతః | సీరకర్మ స ముద్విగ్నో బంధుభిశ్చ స వంచితః 85

ఇతస్తతః పరిక్రమ్య నిర్గలో దుష్ట పీడితః | దైవతో జ్ఞానమాశ్రిత్య ప్రయాగం సముపాగతః 86

మహా మాఘీం పురస్కృత్య సస్నౌ తత్ర దినత్రయమ్‌ | అనఘ స్స్నానమాత్రేణ సమభూత్సద్విజోత్తమః 87

ప్రయాగాచ్చలితస్తస్మా ద్య¸° యస్మాత్సమాగతః | స రాజా సోపితైర్విప్రోతిపన్నావేకదా తదా 88

తయోర్గతి స్సమాదృష్టా దేవరాజస్య సన్నిధౌ | తేజోరూపం బలం సై#్త్రణం దేవయానం విభూషణమ్‌ 89

మాలా చ పారిజాతస్య నృత్యం గీతం సమం తయోః | ఇతి దృష్ట్యా హి మాహాత్మ్యం క్షేత్రస్య కధముచ్యతే 90

మాఘ స్సితాసితే భ##ద్రే రాజసూయ సమో న చ | ధనుర్వింశతి విస్తీర్ణే సితనీలాంబుసంగమే 91

మాఘదపున రావృత్తీ రాజసూయాత్పునర్భవేత్‌ |మ కంబలాశ్వతరౌ నాగౌ విపులే యమునాతటే 92

తత్ర స్నాత్వా చ పీత్వా చ సర్వపాపైః ప్రముచ్చతే | తత్ర గత్వా చ సంస్థానే మహాదేవస్య ధీమతః 93

నరస్తారయతే పుంసో దశపూర్వాన్దశాపరావ్‌ | కూపం చైవ తు తత్రాస్తి ప్రతిష్ఠాన్వేత్తి విశ్రుతమ్‌ 94

తత్ర స్నాత్వా పితౄన్దేవా న్సంతర్ప్య యత మానసః | బ్రహ్మచారీ జితక్రోధ స్త్రిరాత్రం యోత్ర తిష్ఠతి 95

సర్వపాప విశుద్ధాత్మా సోశ్వమేధఫలం లభేత్‌ | ఉత్తరేణప్రతిష్ఠానా ద్భాగీరధ్యాశ్చ పూర్వతః 96

హంసప్రతపనం నామ తీర్ధం లోకేషు విశ్రుతమ్‌ | అశ్వమేధ ఫలం తత్ర స్నానమాత్రేణ లభ్యేతే 97

యావచ్చన్ద్రశ్చ సూర్యశ్చ తావత్స్వర్గే మహీయతే | తతో భోగవతీం గత్వా వాసుకేరుత్తరేణ చ 98

దశాశ్వమేధికం నామ తత్తీర్ధం పరమం స్మృతమ్‌ | తత్ర కృత్వాభిషేకంతు వాజిమేధఫలం లభేత్‌ 99

ధనాఢ్యో రూపవాన్దక్షో దాతా భవతి ధార్మిక! | చతుర్వేదిషు యత్పుణ్యం సత్యవాదిషు యత్ఫలమ్‌ 100

అహింసాయాం తు యో ధర్మో గమనాత్తస్య తత్ఫలమ్‌

పార్వతీ ప్రియసఖి కైలాసమున క్రీడించునది ప్రయాగస్నామువలన పూర్వజన్మ జ్ఞానమును పొందెను. పూర్వము అవంతిదేశమున వాసరాజుండెను. ఇతను నర్మదా తీర్ధమును చేరి రాజసూయయాగమునాచరించెను. స్వర్ణయూపవిరాజితములను పదహారశ్వములచే అశ్వమేధయాగమునారించెను. బ్రాహ్మణులను పర్వతోపమధాన్యరాశిని దానము చేసెను. శ్రద్ధకలవాడు, దేవతా భక్తుడు, గోదానమును, స్వర్ణదానమును చేసినవాడుగాద నుండెను.

ఇట్లే భద్రకుడను బ్రాహ్మణుడు మూర్లుడై, హీనకులసంగతితో కృషీవలుడైచ, అధమాచారుడు, సర్వధర్మబహిష్కృతుడు, హలకర్మయందాసక్తిగలవాడు బంధువులచే వంచించబడి అంతటా తిరుగుచు, అదృష్టవశమున బయలుదేవరి దైవవశమున జ్ఞానమున పొంది ప్రయాగతీర్ధమునకొచ్చెను. మహామాఘీ సందర్భమున ప్రయాగలో మూడుదినములు స్నానమాడెను. ఇట్లు అనఘస్నానమాత్రమున భద్రకుడు బ్రాహ్మణోత్తముడాయెను. ప్రయాగనుండి బయలుదేరి స్వదేశమునకు వెడలెను. వాసరాజు భద్రక బ్రాహ్మణుడు ఒకేసారి మృతి చెందిరి. వారిద్దరూ ఇంద్ర సమీపమున సమానస్థానమును పొందిరి. తేజస్సు, రూపము, బలము, స్త్రీజనము, దేవయానము, విభూషణము, పారి జాలమాల, నృత్యము, గీతము అన్నియూ సమములుగా నుండెను. ఇట్లు ప్రత్యక్షముగా మహాత్యమును చూచిన తరువాత మాఘమున ప్రయాగస్నానము రాజసూయసమముకాదని ఎట్లు చెప్పెదరు? వింశతిధనుర్విస్తీర్ణప్రాంతమున గంగాయమున సంగమమున మాఘమాసస్నానమున పునర్జన్మకలుగదు. రాజసూయమున పునర్జన్మ కలుగును. విపులమగు యమునాతీరమున కబలా అశ్వ తర అనురెండు నాగములు కలవు. ఇచట స్నానపానములనుచేసినవారు సర్వపాప వినిర్మక్తులగుదురు. ఇచటికి వెళ్లి నివసించినచో మహాదేవుని ప్రసాదము వలన దశపూర్వులను, దశాపరులను తరింపచేయును. ఇచటనే ప్రతిష్ఠాన మనుకూపము కలదు. ఇచట స్నానముచేసి పితరులను దేవతలను, తర్పణము గావించి బ్రహ్మచారియై, జితక్రోధుడై మూడురాత్రులున్న చో సర్వపాపవిశుద్ధాత్మయై అశ్వమేధఫలమును పొందును. ప్రతిష్ఠానమునకు ఉత్తరమున, భాగీరధికి పూర్వమున హంసప్రతపనమను తీర్ధము లోకప్రసిద్ధము ఇచట స్నానమాచరించిన అశ్వమేధ ఫలమును పొందును. ప్రళయకాలము వరకు స్వర్గము నుండును. ఇక వాసుకికి ఉత్తరమున భోగవతీ సమీపమున దశాశ్వమేధికను ఉత్తమతీర్ధము కలదు. ఇచటస్నానము చేసిన అశ్వమేధఫలము లభించును. ధనాఢ్యుడు, రూపవంతుడు, దక్షుడు, దాత, ధార్మికుడు అగును. చతుర్వేదాధ్యాయన పరులను కలుగు పుణ్యము, సత్యవాదులకు కలుగు ఫలము, అహింసలో నుండు ధర్మము దశాశ్వమేధగమనమున కలుగును.

పాయతే శ్చోత్తరేకూలే ప్రయాగస్య తు దక్షిణ 101

ఋణమోచనకం నామ తీర్ధం తు తధా పరమం స్మృతమ్‌ | ఏకరాత్రో షిత స్స్నాత్వా ఋణౖస్సర్వైః ప్రముచ్చతే 102

స్వర్గలోక మావాప్నోతి హ్మమరశ్చ తధా భ##వేత్‌ | త్రికాలమేక స్సాయీచా హరముక్తిం య ఆచరేత్‌ 103

విశ్వాస ఘాత పాపాత్తు త్రిభిర్మాసైస్స శుద్ధ్యతి | కీర్తనాల్లభ##తే పుణ్యం దృష్ట్వా భద్రాణి పశ్యతి 104

అవగాహ్య చ పీత్వా చ పునాత్యాసప్తమం కులమ్‌ | మకరస్థే రవౌ మాఘే న స్నాత్యనుదితే రవౌ 105

కధం పాపైః ప్రముచ్యేత కధం వా త్రిదివం వ్రజేత్‌ | ప్రయాగే వపనం కుర్యా ద్గంగాయాం పిండపాతనమ్‌ 106

దానం దద్యా త్కురుక్షేత్రే వారాణస్యాం తనుం త్యజేత్‌ | కిం గయా పిండదానేన కాశ్యాం వా మరణన కిమ్‌ 107

కిం కురుక్షేత్ర దానేన ప్రయాగే ముండనం యది | సంవత్సరం ద్విమాసోనం పునస్తీర్ధం వ్రజేద్యది 108

మండనం చోపవాసం చ తతో యత్నేన కారయేత్‌ | ప్రయాగప్రాప్తనారీణాం ముండనం త్వేవమీరయేత్‌ 109

సర్వాన్కేశాన్సముద్ధృత్య సర్వాపాపాని దేహినామ్‌ 110

తిష్ఠన్తి తీర్ధస్నానేన తస్మాత్తాన్యత్ర వాపయేత్‌ | అమార్కపాత శ్రవణౖ ర్యుక్తాచేత్పౌషమాఘయోః 111

అర్ధోకదయస్స విజ్ఞేయ స్సూర్య పర్వశతాధికః | కిం చిన్య్యూనే తు విధిజే మహోదయ ఇతిస్మృతః 112

అరుణోదయ వేలాయాం శుక్లామాఘస్య సప్తమీ | ప్రయాగే యది లభ్యేత సహస్రార్కగ్రహై స్సమా 113

అయనే కోటిపుణ్యం స్యా ల్లక్షంతు విషువే ఫలమ్‌ | షడశీత్యాం సహస్రం తు తధావిష్ణుపదీషు చ 114

దానం ప్రయాగే కర్తవ్యం యధా విభవ విస్తరమ్‌ | గంగాయమున యోర్మధ్యే యస్తు గాం వై ప్రయచ్ఛతి 115

సువర్ణం మణి ముక్తాం వా యది వాన్యం ప్రతి గ్రహమ్‌ | 116

పాటలాం కపిలాం భ##ద్రే యస్తు తత్ర ప్రయచ్ఛతి స్వర్ణశృంగీం రౌప్యఖురాం చైలకంఠీం పయస్వినీమ్‌ 117

సవత్సాం శ్రోత్రియం సాధుం గ్రాహయిత్వా యధావిధి | శుక్లాంభరధరం శాంతం ధర్మజ్ఞం వేదపారగమ్‌ 118

సా చ గౌస్తస్య దాతవ్యా గంగాయమున సంగమే | వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ 119

యావన్తో రోమ కూపాస్యు స్తాస్యాగోర్వత్సకస్యచ | తావద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే 120

యత్రాసౌ లభ##తే జన్మ సా గౌస్తత్రాభిజాయతే | న చ పశ్యన్తి నరకం దాతారస్తేన కర్మణా 121

ఉత్తరాంశ్చం కురున్ర్పాప్య మోదంతే కాలమక్షయమ్‌ | గవాం శతసహస్రేభ్యో దద్యాదేకాం పయస్వినీమ్‌ 122

పుత్రాన్దారాంస్థధాభృత్యాన్‌ గౌరేకా ప్రతితారయేత్‌ | తస్మాత్సర్వేషు దానే షు గోదానం తు విశిష్యతే 123

దుర్గమే విషమే ఘోరే మహాపాతక సంక్రమే | గౌరేవ రక్షాం కురుతే తస్మాద్దేయా ద్విజోత్తమే 124

తీర్ధేన ప్రతిగృహ్ణీయా త్పుణ్యష్వాయతనేషు చ | నిమిత్తే షు చ సర్వేషు హ్యప్రమత్తో భ##వేద్ద్విజః 125

స్వకార్యే పితృకార్యే వా దేవాతాభ్యర్చనేపి వా | విఫలం తస్య తత్తీర్ధం యావత్తద్ధన మశ్నుతే 126

గంగాయమునయోర్మధ్యే యస్తు కన్యాంప్రయచ్ఛతి న స పశ్యతి ఘోరం తు నరకం తేన కర్మణా 127

ఉత్తరాంస్తు కురూన్గత్వా మోదతే కాలమక్షయమ్‌ పుత్రాన్దారాంశ్చ లభ##తే ధార్మికాన్రూప సంయుతాన్‌ 128

అధశ్విరాస్తతో ధూమ మూర్ధ్వ బాహుః పిబేన్నరః శతం వర్ష సహస్రాణాం స్వర్గలోకే మహీయతే 129

పరిభ్రష్టస్త తస్స్వర్గాత్‌ అగ్నిహోత్రీ భ##వేన్నరః భుక్త్వా తు విపులాన్భోగాం స్తత్తీర్ధం లభేత్‌ పునః 130

పాయత్యుత్తరతీరమున ప్రయాగకు దక్షిణ భాగమున ఋణమోచనకమను తీర్ధము కలదు. ఇచట స్నానము చేసి ఒకరాత్రి ఉన్నవారు ఋణవిముక్తలగుదురు. స్వర్గలోకమును పొంది అమరతమునందెదరు. మూడుపూటలా ఒకమారు స్నానముచేయుచు నిరాహారియై మూడునెలలున్నచో విశ్వాసఘాతక పాపమునుండి శుద్ధి పొందును. ఈ తీర్ధమును కీర్తించుట వలన పుణ్యమును పొందెను| దర్శించి శుభములను బడయును. స్నానము పానముచేసి ఏడుతరములను పావనము చేయును. సూర్యడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున సూర్యోదయముకంటె స్నానము చేయనిచో ఎట్లు పాపవిముక్తి కలుగును? ఎట్లు స్వర్గమును పొందును? ప్రయాగలో వపనము, గయలో పిండదానము, కురుక్షేత్రమున దానము, కాశిలో దేహత్యాగము చేయవలసిన పనులు. ప్రయాగలో ముండనము చేసుకొన్నవానికి గయా పిండాదానముతో కాశీమరణముతో కురుక్షేత్రదానముతో పనిలేదు. పదినెలల తరువాత మరల తీర్ధమునకు వెళ్ళిననూ ముండనమును ఉపవాసమును ప్రయత్నముచే నాచరించవలయును. ప్రయాగతకు వెళ్ళిన స్త్రీలకు ముండన విధి ఇట్లు చెప్పబడినది. అన్నికేశలములను ఒకచోచేర్చి రెండుఅగుళములను ఛేదించవలయును. మానవులకు కేశాంత్యభాగమునాశ్రయించి సర్వపాపములండును. కావున తీర్ధ స్నానకాలమున కేశాంత్య భాగములను ఛేదించవలయును. పుష్యమాఘమాసములలో అమావాస్య అర్కపాత శ్రవణములతో మహోదయమనబడును. మాఘశుక్లసప్తమినాడు అరుణోదయవేళయందు ప్రయాగలో ఉన్నవారికి వేయి సూర్యగ్రహణములతో సమానము. అయనకాలమున కోటి పుణ్యము, విషువమున లక్షగుణము, షడశీతియందు సహస్రపలము ఇట్లే విష్ణపదులలో కూడా ఫలము కలుగును. ప్రయాగలో విభవానుసారముగా దానము చేయవలయును. దానముచే తీర్ధ పలము పెరుగును. గంగాయమునా సంగమమమున గోదానమును గావించిన స్వర్ణదానము, మనిముక్తాది దానములను గావించిననూ, పాటలగోవును కాని కపిలాగోవునుకాని స్వర్ణశృంగిని రౌప్య ఖురను, ఏకకంఠిని పయస్వినిని సవత్సను శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు యధావిధిగా దానము గావించవలయును. శుక్లాంబరధరుడు, శాంతుడు, ధర్మజ్ఞుడు, వేదపారగుడు అగువానికి గోవునీయవలయును. అట్లే మహార్హములగు వస్త్రములను ఆభరణములను బహువిధరత్నములను దానము చేయవలయును. ఆ గోవునకు వత్సమునకున్నరోమకూపముల సంఖ్యననుసరించి అన్నివేలసంవత్సరములు స్వర్గమున నివసించును. అతనుపుట్టిన ప్రదేశముననే ఆ గోవుకూడా పుట్టును. దాత తన సుకృత వశమున నరకమును చూడడు. ఉత్తర కురుదేశములను పొంది అక్షయ కాలము భోగములననుభవించును. వందలవేల ఆవులకంటె ఒకపాలిచ్చు ఆవును దానము చేయవలయును. పుత్రులను భార్యలను భృత్యులను ఒక గోవే తరింపచేయును. కావుననే అన్ని దానములలో గోదానము విశిష్టము దుర్గమము విషమము ఘోరము అగు మహాపాతక సంక్రమమున గోవే రక్షించును. కావున గోదానమును చేయవలయును. తీర్ధమున పుణ్యాయతనములందు ప్రతిగృహమును వర్జించి బ్రాహ్మణుడు అప్రమత్తునిగా ఉండవలయును. స్వకార్యమున కాని పితౄకార్యమున కాని దేవతారాధనలో కాని ప్రతిగ్రహధనానుభవము వరకు ఆ తీర్ధయాత్ర విఫలమగును. గంగాయమున మధ్యలో కన్యాదానమును చేసినవాడు నరకమును చూడజాలడు. ఉత్తరకురుదేశములనకు వెళ్ళి అక్షయకాలము భోగాను భవనమును పొందును. ధార్మికులు రూపసంయుతులు అగు భార్యపుత్రులను పొందును. అధశ్శిరమునుంచి ఊర్ధ్వబాహులై అచటి యజ్ఞధూమమును పానము చేయవలయును. అక్ష సంవత్సరములు స్వర్గమున నివసించును. స్వర్గమునుండి దిగివచ్చి అగ్నిహోత్రిగా పుట్టి విపులభోగములననుభవించి మరల ఈతీర్ధమును చేరును.

ఆప్రయాగా త్ప్రతిష్ఠానా మత్పురోవాసుకేర్హ్రదాత్‌ కబలాశ్వతరౌ నాగౌ నాగాదాబహుమూలకాత్‌ 131

ఏతత్ప్రజాపతేఃక్షేత్రం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ తత్రస్నాత్వా దివం యాన్తి యే మృతాస్తేపునర్భవాః 132

న వేదవచనా చ్చైవ న లోకవచనాదపి | మతిరుత్క్రమణీయా హి ప్రయాగమరణం ప్రతి 133

దశతీర్ధసహస్రాణి షష్ఠికోట్యస్తధాపరాః | తత్రైవ తేషాం సాన్నిధ్యం కీర్తితం విధినందిని 134

యా గతిర్యోగయుక్తస్య సత్పధస్తస్య ధీమతః | సా గతిస్త్యజతః ప్రాణా న్గంగాయమున సంగమే 135

బాధితో యది వా దీనః క్రుద్ధోవాపి భ##వేన్నరః | గంగాయమున మాసాద్య యస్తు ప్రాణాన్పరిత్యజేత్‌ 136

దీప్తకాంచన వర్ణాభై ర్విమానైస్సూర్యకాంతిభిః | గంధర్వాప్సరసాం మధ్యే స్వర్గే మోదతి మానవః 137

ఈప్సితాంల్లభ##తే కామా న్వదంతీతి మునీ శ్వరాః | గీతవాదిత్రనిర్ఘోషైః ప్రసుప్తః ప్రతిబుధ్యతే 138

యా వన్న స్మరతే జన్మ తావత్స్వర్గే మహీయతే | తతస్స్వర్గాత్పరిభ్రష్టః క్షీణకర్మాత్రచాగతః 139

హిరణ్యరత్న సంపూర్ణే సమృద్ధే జాయతే కులే | తదేవ సంస్మరస్తత్ర విష్ణులోకం స గచ్చతి 140

వటమూలం సమాసాద్య యస్తు ప్రాణాన్పిరిత్యజేత్‌ | సర్వలోకానతక్రమ్య రుద్రోకం స గచ్చతి 141

తత్ర తే ద్వాదశాదిత్యాం సప్తతే రుద్రమాశ్రితాః | నిర్గచ్ఛన్తి జగత్సర్వం వటమూలే స దహ్యతే 142

హరిశ్చ భగవాంస్తత్ర ప్రజాపతిపురస్కృతః | ఆస్తే తత్ర పుటే దేవి పాదాంగుష్ఠం ధయశ్శిశుః 143

ఊర్వశీపులినేరమ్యే విపులే హంసపాదుకే | పరిత్యజతి యః ప్రాణా ఞ్జృణు తస్యాపి యత్ఫలమ్‌ 144

షష్ఠి వర్ష సహస్రాణి షష్ఠివర్షశతానిచ | వసేత్స పితృభిస్సార్థం స్వర్గలోకే విరించిజే 145

ఊర్వశీం చ యదా పశ్యే దేవలోకే సులోచనే | పూజ్యతే సతతం దేవ ఋషిగంధర్వకిన్నరైః 146

తతస్స్వర్గాత్పరిభ్రష్టః క్షీణకర్మాత్విహాగతః | ఉర్వశీ సదృశీనాం తు కాంతానాం లభేత్‌ శతమ్‌ 147

మధ్యే నారీ సహస్రాణాం భోక్తా శాస్తా చ మోహిని 148

కాంచీనూపురశ##బ్దేన సుప్త్వాసౌ ప్రతిబుధ్యతే | భుక్త్వాతు విపులాన్భోగాం స్తతీర్ధం లభ##తే పునః 149

శుక్లాంబర ధరో నిత్యం నియతస్సజితేంద్రియ | ఏక కాలంతు భుంజానో మాసం యోగపతి ర్ధవేత్‌ 150

సువర్ణాలంకృతానాం తు నారీణాం లభేత్‌ శతమ్‌ | పృధివ్యామా సముద్రాయాం మహాభోగపతిర్భవేత్‌ 151

ధనధాన్యసమాయుక్తో దాతా భవతి నిత్యశః | స భ్యుక్త్వా విపులాన్భోగాం స్తత్తీర్ధం స్మరతే పునః 152

కోటి తీర్థం సమాసాద్య యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌ | కోటి వర్ష సహస్రాన్తం స్వర్గోలోకే మహీయతే 153

తతస్స్వర్గాదిహాగత్య క్షీణకర్మా నరోత్తమః | సువర్ణమణి ముక్తాగ్రే కులే జాయేత రూపవాన్‌ 154

అకామో వా సకామో వా గంగాయాం యో విపద్యతే | శక్రస్య లభ##తే స్వర్గం నరకంద తు న పశ్యతి 155

హంస సారసయుక్తేన విమానేన స గచ్ఛతి | అప్సరోగణ సంకీర్ణే సుప్త్యాసౌ ప్రతిబుధ్యతే 156

తతస్స్వర్గా దిహాయాతః క్షీణకర్మా విరించిజే | యోగినాం శ్రీమతాం చాపి స్వేచ్ఛయా లభేత్‌ జనిమ్‌ 157

Sri Naradapuranam-3    Chapters    Last Page