Sri Naradapuranam-3    Chapters    Last Page

చతుష్టష్టిటమోధ్యాయః అరువది నాలుగవ అధ్యాయము

కురుక్షేత్ర మమాత్మ్యే క్షేత్ర ప్రమాణాది నిరూపణమ్‌

ప్రయాగ నుండి ప్రతిష్ఠానము వరకు వాసుకి హృదము నుండి బహుమూలకనాగము వరకు కబలాశ్వతర నాగములుండును. ఇంత వరకు ప్రజాపతిక్షేత్రమని లోకత్రయ ప్రసిద్ధము. ఈ క్షేత్రమున స్నానమాచరించి స్వర్గమునకు చేరెదరు. ఇచట మరణించిన వారు మరల పుట్టరు. వేద వచనము వలన కాని, లోకవచనమువలకాని ప్రయాగమరణ విషయమున బుద్ధిని తొలగించరాదు. ప్రయాగయందు పదివేల తీర్ధములు అరువది కోట్ల తీర్థములు సన్నిహితములుగా నుండును. యోగయుక్తునకు సన్మార్గగతునకు లభించుగతి గంగాయమునా సంగమమున ప్రాణములను విడిచిన వానికి లభించును. బాధితుడు, దీనుడు కోపించిన వాడు కాని గంగాయమునా సంగమమును చేరి ప్రాణ పరిత్యాగము గావించినచో దీప్తకాంచన వర్ణములు సూర్యకాంతి సన్నిభములు అగు విమానములతో గంధర్వాప్సరసల మధ్యన స్వర్గమున ఆనందించును. అభీష్టకామనలను పొందును. నిదురించిన వాడు గీత వాద్యనాదములచే మేలు కొనును. పుట్టుకను కోరు వరకు స్వర్గములోనే నివసించును. కర్మక్షయమున స్వర్గ పరిభ్రష్టుడై హిరణ్యరత్నసంపూర్ణ కులమున పుట్టును. పూర్వసుకృతమును స్మరించుచు విష్ణులోకమును చేరును. ఇచట వట మూలమును చేరి ప్రాణపరిత్యాగమును చేయువాడు సర్వలోకములనతిక్రమించి రుద్రలోకమును చేరును. అచట రుద్రుని ఆశ్రయించి ద్వాదశాదిత్యులను తపింపచేయును. జగత్తును వెడలి వచ్చిన ద్వాదశాదిత్యులు వటమూలమున దహించబడును. ప్రజాపతి పురస్కృతుడగు శ్రీహరి వటపత్రమున పాదాంగుష్టమును పానమును చేయుచు ఉండును. విపులము హంసపాండురము అటు ఉర్వశీపులినమున ప్రాణములను విడుచువాడు అరువదియారు వేల సంవత్సరములు పితరులతో కలసి స్వర్గలోకమున నివసించును. దేవలోకమున ఉర్వశిని చూచినపుడు దేవ ఋషిగంధర్వులచే పూజించబడును. కర్మక్షయమున స్వర్గ భ్రష్టుడై ఇచటికొచ్చి ఊర్వశీతుల్యులగు యువతులను నూరు మందిని పొందును. నారీ సహస్రమునకు భర్తయగును. పది వేల గ్రామములకు భోక్త శాస్తయగును. ఇతను నిదురించినచో కాంచీనూపుర శబ్దములచే మేలుకొనును. విపుల భోగములననుభవించి మరల అదే తీర్థమును చేరును. నిత్యము శుక్లాంబరధరుడు, నియమబద్ధుడు, జితేన్ద్రియుడు, ఒక పూట మాత్రమే భుజించుచు ఒక మాసము భోగపతియగును. సువర్ణాలంకృతలగు నారీ శతమును పొందును. సముద్రాన్తపృధివిలో మహాభోగపతి యగును. ధనధాన్యసమాయుక్తుడు దాతగా విపులభోగములననుభవించి మరల క్షేత్రమును స్మరించును. కోటి తీర్ధమున మరణించిన వారు వేయి కోట్ల వర్షములు స్వర్గములో నుందురు. తరువాత ఇటకొచ్చి సువర్ణమని ముక్తా భూయిష్ఠకులమున పుట్టున. ఇష్టముండికాని లేకకాని గంగలో మరణించిన వాడు స్వర్గమున చేరును. నరకమును చూడడు. హంసయుక్త విమానమున విహరించును. అప్సరోగణమధ్యన నిదురించి మేల్కొనును. స్వర్గము నుండి ఇటకొచ్చి పరిశుద్ధులు శ్రీమంతులగుయోదుల కులముతో జన్మను పొందును.
గంగాయమున యోర్మధ్యే కరీషాగ్నిం తు ధారయేత్‌ | అహీనాంగో హ్యరోగశ్చ పంచేంద్రియ సమన్వితః 158
యావంతి లోమ కూపాని తస్య గాత్రే తు ధీమతః | తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే 159
తతస్స్వర్గాత్పరి భ్రష్టో జంబూద్వీపపతిర్భవేత్‌ | భుక్త్వాంతు విపులాన్భోగాం స్తత్తీర్ధ లభ##తే పునః 160
యస్తు దేహం నికృత్య స్వం శకునిభ్యః ప్రయచ్ఛతి | స వర్షశతసాహస్రం సోమలోకే మహీయతే 161
తతస్తస్మాదిహాగత్య రాజా భవతి ధార్మికః | గుణవాన్రూపసంపన్నో విద్యావాన్ప్రియ వాక్ఛుచిః 162
భుక్త్వా తు విపులాన్భోగాం స్తత్తీర్ధం పునరావ్రజేత్‌ | పంచయోజన విస్తీర్ణే ప్రయాగస్య తు మండలే 163
విపన్నో యత్ర కుత్రాప్యనాశకం వ్రతమాస్థితః | వ్యతీతాన్పురుషాన్సప్త భావినస్తు చతుర్దశ 164
నరస్తారయతే సర్వా నాత్మానం చ సముద్ధరేత్‌ | అగ్నితీర్థమితి ఖ్యాతం దక్షిణాయమునాతటే 165

పశ్చిమే ధర్మరాజస్య తీర్థం తు నరకం స్మృతమ్‌ | తత్ర స్నాత్వా దివం యాన్తి మేమృతాస్తే
పునర్భవాః 166
యమునోత్తరకూలేతు పాపఘ్నాని బహూన్యపి | తీర్ధాని సంతి విధిజే సేవితాని మునీశ్వరైః 167

తేషు స్నాతా దిపం యాన్తి యే మృతాస్తే
పునర్భవాః | గంగా చ యుమునా చైవ ఉభే తుల్యఫలే స్మృతే 168
కేవలం జ్యేష్ఠభావేన గంగా సర్వత్ర పూజ్యతే | యస్తు సర్వాణి రత్నాని బ్రాహ్మణభ్యః ప్రయచ్ఛతి 169
తేన దత్తేన దేవేశి యోగో లభ్యేత వా న వా | ప్రయాగేతు మృతస్యేదం సర్వం భవతి నాన్యధా 170
దేశస్థో యది వారణ్య విదేశే యది వా గృహే | ప్రయాగం స్మరమాణో
పి యస్తు ప్రాణాన్పరిత్యజేత్‌ 171
బ్రహ్మలోక మవాప్నోతి మహీ యత్ర హిరణ్మయీ | సర్వకామఫలా వృక్షా స్తిష్ఠన్తి ఋషయో గతాః 172
స్త్రీ సహస్రాకులే రమ్యే మంగాకిన్యాస్తటే శుభే | క్రీడతే సిద్ధ గంధర్వైః పూజ్యతే త్రిదశైస్తధా 173
తతః పున రిహాయాతో జంబూ ద్వీప పతిర్భవేత్‌ | ధర్మాత్మా గుణ సంపన్న స్తీత్తీర్ధం లభ##తే పునః 174
ఏతత్తే సర్వ మాఖ్యాతం మాహాత్మ్యం చ ప్రయాగజమ్‌ | సుఖదం మోక్షదం సారం కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛసి 175
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే
బృహదుపాఖ్యానే వసు మోహినీ సంవాదే

ప్రయాగమాహాత్మ్యే త్రిషష్ఠితమో
ధ్యాయః
గంగాయమునల మధ్యన పిడకలు అగ్నిలో దహించబడవలయును. అట్లు దహించబడువాడు హీనాంగుడు రోగయుక్తడు కారాదు. పంచేంద్రియుడు కావలయును. అట్టి వాని శరీరమున గల రోమకూపములు ఎన్ని యుండునో అన్ని వేల వర్షములు స్వర్గలోకమున నివసించును. స్వర్గమునుండి తిరిగి వచ్చి జంబూద్వీప పతి యగును. ఇచట విపుల భోగములననుభవించి మరల ఆ తీర్థమును చేరును. ఇచట తనదేహమును ఖండించి పక్షలకు వేసిన వాడు లక్ష సంవత్సరముల చంద్రలోకమున నివసించును. అట నుండి ఇటకువచ్చి ధార్మికుడగు రాజగును. గుణవంతుడు రూపవంతుడు విద్యావంతుడు, ప్రియవాక్కుగలవాడు, పరిశుద్ధుడుగా నుండి విపుల భోగములననుభవించి మరల ఈ తీర్థమునకు చేరును. పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమున అనశనవ్రతముతో మరణించిన వారు గడిచిన ఏడు తరములను, రాబోవు పదునాలుగు తరములను తరింపచేసి తాను కూడా తరించును. యమునా దక్షిణ తటమున అగ్ని తీర్థము కలదు. ధర్మరాజు నరకతీర్థము పశ్చిమ భాగమున కలదు. ఇచట స్నానము చేసినవారు స్వర్గమును పొందెదరు. మరణించిన వారు మరల పుట్టరు. యమునా నదికి ఉత్తర తీరమున పాపహరములగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్థములను చాలా మంది మునులు సేవించి యుండిరి. ఈ తీర్థములలో స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వీటిలో మరణించిన వారు మరల జన్మను పొందురు. గంగాయమునానదులు రెండు సమాన ఫలములనిచ్చునవిగా ప్రసిద్ధిని పొందినవి. జ్యేష్ఠ భావనతో గంగ అంతట పూజించబడును. సర్వరత్నములను బ్రాహ్మణులకు దానము చేసిన వారికి కూడా యోగము లభించునో లేదో కాని ప్రయాగలో మరణించిన వారికి మాత్రము అన్నియూ లభించును. దేశములో నుండి కాని, అరణ్యములో నుండి కాని, విదేశములలో లేదా గృహములో నుండు వాడైనను ప్రయాగను స్మరించుచు ప్రాణములను విడిచినచో హిరణ్మయ భూప్రాంతము కల బ్రహ్మలోకమును పొందును. అచట సర్వాకామ ఫలములు గల వృక్షములుండును. ఋషులుందురు. స్త్రీ సహస్ర పరివేష్ఠితమగు శుభకరమగు మందాకినీ తటమున సిద్ధులతో గంధర్వులతో కలిసి క్రీడించును. అచటి నుండి మరల ఇటకొచ్చి జంబూద్వీప పతియగును. ధర్మాత్ముడు గుణ సంపన్నుడుగా ఉండి మరల ఆ తీర్థమును పొందును. ఇట్లు నీకు సమగ్రముగా సుఖప్రదము, మోక్ష ప్రదమగు ప్రయాగమాహాత్మ్యమును తెలిపితిని. ఇంకనూ ఏమి వినదలచితినో చెప్పుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ఉత్తర భాగమున బృహదుపాఖ్యానమున
వసు మోమినీ సంవాదమున
ప్రయాగమాహాత్మ్యమున
అరువది మూడవ అధ్యాయము
మోహిన్యువాచ:
వసో కృపాలో ధర్మజ్ఞ త్వయా బహువిధా మమ | తీర్ధరాజస్య మాహాత్మ్యం ప్రయాగస్య నిరూపితమ్‌ 1
యత్సర్వతీర్థముఖ్యేషు కురుక్షేత్రం శుభావహమ్‌ | పావనం సర్వలోకానాం తన్మమాచక్ష్వ సాంప్రతమ్‌ 2
మోమిని పికెను: కృపాలూ! ధర్మజ్ఞా వసూ బహువిదుడవగు నీవు ప్రయాగ తీర్థమాహాత్మ్యమును తెలిపితివి. ఇక ఇపుడు సర్వతీర్ధములలో పావనము, శుభప్రదము, ముఖ్యము అగు కురుక్షేత్ర మాహాత్మ్యమును తెలుపుము.
వసురువాచ
శృణు మోహిని వక్ష్యామి కురుక్షేత్రం సుపుణ్యదమ్‌ | యత్ర గత్వా నరస్స్నాత్వా సర్వ పాపైః ప్రముచ్యతే 3

తత్ర తీర్ధాన్యనేకాని సేవితాని మునీశ్వరైః | తాన్యహూతే
భిధాస్యామి శృణ్వతాం ముక్తిదాని చ 4
బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం గోగ్రహో మరణంతథా | వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరుక్తా చతుర్విధా 5
సరస్వతీ దృషద్వత్యోర్దేవన ద్యోర్యదన్తరమ్‌ | తం దేవసేవితం దేశం బ్రహ్మవర్తం ప్రచక్షతే 6

దూరస్థో
cపి కురుక్షేత్రే గచ్ఛామి చ వసామ్యహమ్‌ | ఏవం యస్సతతంబ్రూయా త్సోపి పాపైః ప్రముచ్యతే 7
తత్ర యో వై వసేద్ధీఈరః సర్వస్వత్యాస్తటే స్థితః | తస్య జ్ఞానం బ్రహ్మమయం భవిష్యతి నసంశయః 8
దేవతా ఋషయస్సిద్ధా స్సేవంతే కురు జాంగలమ్‌ | తత్ర సంసేవనాద్దేవి బ్రహ్మచాత్మని పశ్యతి 9
వసువు పలికెను:- మోహినీ! ఇపుడు పుణ్యప్రదగము కురుక్షేత్ర మాహాత్మ్యమును చెప్పెదను. వినుము. ఇచటికి వెళ్ళిస్నానము చేసినవాడు సర్వపాప వినిక్ముక్తుడగును. ఇచట అనేక తీర్థములను మునీశ్వరులు సేవించిరి. ఇపుడు నీకు ఆ తీర్థములను ముక్తి ప్రదములను చెప్పెదను. వినుము. గయాశ్రాద్ధమన బ్రహ్మజ్ఞానము గోగ్రహమున మరణము, కురుక్షేత్రమున నివాసము ముక్తి ప్రదములని చెప్పబడినవి. సరస్వతీ దృషద్వతీనదుల మధ్యభాగము బ్రహ్మవర్తమనబడును. దూరమున నుండు వాడుకూడా కురుక్షేత్రమునకు వెళ్ళెదను, నివసించెదను. అని ఎల్ల కాలము స్మరించువాడుకూడా పాప విముక్తుడగును. ఇచట సరస్వతీ తీరమున నివసించు వారు బ్రహ్మజ్ఞానమును పొందును. ఈ కురుక్షేత్రమును దేవతలు ఋషులు సిద్ధులు సేవించుచుందురు. ఈ కురుక్షేత్రమును సేవించుట వలన తనలో బ్రహ్మను దర్శించగలడు.
మోహిన్యువాచ
కురుక్షేత్రం ద్విజశ్రేష్ఠ సర్వతీర్ధాధికం కథమ్‌ | తన్మే విస్తరతో బ్రూహి త్వా మహం శరణం గతా 10
మోహినా పలికెను: - ఓ బ్రాహ్మణోత్తమా! కురుక్షేత్రము సర్వతీర్ధాధికమెట్లు అయినదో నాకు విస్తరముగా తెలుపుము. నిన్ను నేను శరణుపొందితిని.
వసురువాచ
శృణు భ##ధ్రే ప్రవక్ష్యామి కురుక్షేత్ర మహాఫలమ్‌ | యధా జాతం నృణాం పాప దహనం బ్రహ్మణః ప్రియమ్‌ 11
ఆద్యం బ్రహ్మ సరః పుణ్యం తత్ర స్థానే సముద్గతమ్‌ | తతో రామహ్రదో జాతః కురుక్షేత్రం తతఃపరమ్‌ 12
సరస్సన్ని హితం తచ్చ బ్రహ్మణా నిర్మితం పురా | అధైషా బ్రహ్మణో వేదీ దిశమంతరత స్థ్సితా 13
బ్రహ్మణాత్ర తపస్తప్తం సృష్టి కామేన మోహిని! | స్థితి కామేన హరిణా తపస్తప్తం చ చక్రిణా 14
సరః ప్రవేశాత్సం ప్రాప్తం స్థాణుత్వం శంభునాపి చ | పితుర్వధాచ్ఛ తప్తేన పర్శురామేణ భామిని 15
ఆ బ్రహ్మణ్యక్షత్ర వధా ద్యేచ రక్తహ్రదాః కృతాః | తద్రేక్తేన తు సంతర్ప్య కృతవాం స్తత్ర వై తపః 16
రామతీర్థం తతః ఖ్యాతం సంజాతం పాపనాశనమ్‌ | మార్కండేయేన మునినా సంతప్తం పరమం తపః 17
యత్ర తత్ర సమాయతా ప్లక్షజాతా పాపనాశనమ్‌ | సా సభాజ్య స్తుతా తేన మునినా ధార్మికేణ హి 18
సరస్సన్నిహితం ప్లావ్య పశ్చిమాం ప్రస్థితా దిశమ్‌ | కురుణా తు తతః కృష్టం యవత్‌క్షేత్రం సమంతతః 19
పంచయోజన విస్తారం దయా పత్యక్షమోద్గమమ్‌ | స్యమంత పంచకం తావ త్కురుక్షేత్రముదాహృతమ్‌ 20
అత్ర స్నాతా నరా దేవి లభంతే పుణ్యమక్షయమ్‌ | మృతా విమాన మారుహ్య బ్రహ్మలోకం ప్రజన్తి చ 21
ఉపవాస శ్చ దానం చ హోమో జప్యం సురార్చనమ్‌ | అక్షయత్వం ప్రయాంత్యేవ నాత్ర కార్యా విచారణా 22
బ్రహ్మవేద్యాం కురుక్షేత్రే యో మృతా స్తేపునర్భవాః | గ్రహనక్షత్ర తారాణాం కాలేన పతనాద్భయమ్‌ 23
కురుక్షేత్రే మృతానాం తే న భూయః పతనం భ##వేత్‌ | దేవర్షి సిద్ధ గంధర్వా స్తత్సంసై#్సవ నోత్సుకాః 24
యత్ర నిత్యం స్థితా దేవి రంతుకం నామతస్తతః | తస్య క్షేత్రస్య రక్షార్ధం విష్ణువా స్థాపితాః పురా 25
యక్షస్సు చన్ద్ర స్సూర్యశ్చ వాసుకి శ్శంబుకర్ణకః | విద్యాధరస్సుకేశీచ రాక్షసాస్ధ్సాపితాశ్శుభే 26
సభృత్యై స్వేష్ట సాహసై#్ర ర్ధనుర్భాణధరై స్సదా | రక్షన్తి చ కురుక్షేత్రం వారయన్తి చ పాపినః 27
రంతుకం తు సమాసాద్య క్షామయిత్వా పునః పునః | తతస్స్నాత్వా సరస్వత్యాం యక్షం దృష్ట్యా ప్రణమ్య చ 28
పుష్పం ధూపం చ నైవేద్యం కృత్వై తద్వాక్యముచ్చరేత్‌ | తవ ప్రసాదాద్యక్షేన్ద్ర వనాని సరితస్తధా 29
భ్రమతో మమ తీర్ధాని మా విఘ్నం జాయతాం నమః | ఇతి ప్రసాద్యయక్షేశం యాత్రాం సమ్యక్స ఆచరేత్‌ 30
వనానాం చాపి తీర్థానాం సరితామపి మోహిని | యో నరః కురుతే యాత్రాం కురుక్షేత్రస్య పుణ్యదామ్‌ 31
స తస్య న్యూనతా కాచి దిహ లోకే పరత్ర చ 32
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే
వసు మోహినీ సంవాదే కురుక్షేత్ర మాహాత్మ్యే
క్షేత్రప్రమాణాది నిరూపణం నామ

చతుష్టష్ఠితమో
ధ్యాయః
వసుపు పలికెను: శుభప్రదులారా! మహాఫల ప్రదము మానవుల పాపమును దహింపచేయునది బ్రహ్మకు ప్రియమగునది యగు కురుక్షేత్రమేట్లేర్పడినదో చెప్పెదను. వినుము. ఇచట మొదట పవిత్రమగు బ్రహ్మసరస్సు ఏర్పడినది. తరువాత రామహ్రదము ఏర్పడినది. ఇపుడు కురుక్షేత్రమేర్పడినది. మొదట బ్రహ్మచే నిర్మించిన సరస్సు సన్నిహితముగానున్నది. ఇపుడే బ్రహ్మవేదికకు మధ్యలో నున్నది. సృష్టి చేయగోరిన బ్రహ్మ ఇచట తపమును చేసెను స్థితిని కోరు విష్ణువు కూడా ఇచటనే తపమునాచరించెను. ఈ సరస్సును ప్రవేశించుటవలననే శంకరునకు స్థాణుత్వమేర్పడినది. పితృవధముచే పరితపించిన పరశురాముడు బ్రాహ్మణద్వేషులగు క్షత్రియును వధించి ఇచటనే రక్తపు మడుగులనేర్పరిచెను. ఆ రక్తముతో పితరులకు తర్పణమునిచ్చి ఇచటనే తపమునాచరించెను. అప్పటి నుండి ఇది పాప నాశకమగు రామతీర్థముగా ఖ్యాతి గాంచినది. ఇచటనే మార్కండేయ మహర్షి పరమ తపమునాచరించెను. ప్లక్షజాతయగు సరస్వతి వచ్చిన ప్రతి ప్రదేశమును మార్కండేయ మహర్షి స్తుతించెను. సన్నిహితమగు సరస్సునుండి పశ్చిమదిశకు బయలుదేరినది. అపుడు ఈ సరస్వతిని కురువుక్షేత్రమున్నంతవరకు ఆకర్షించెను. ఈ క్షేత్రము పంచయోజన విస్తీర్ణము. దయాసత్యక్షమలకు పుట్టిల్లు. స్యమంత పంచకమునే కురుక్షేత్రమనిరి. ఇచట స్నానమును చేసిన వారు అక్షయ పుణ్యమును పొందును. మరణించిన వారు విమానము నధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. ఇచట ఆచరించిన ఉపవాసము, దానము, జపము, హోమము, దేవతార్ఛనము అక్షయత్వమును పొందును. బ్రహ్మ వేదియందు కురుక్షేత్రమునందు మరణించిన వారు మరల పుట్టరు. గ్రహములకు నక్షత్రములకు తారలకు పతన భయముండును. కాని కురుక్షేత్రమున మరణించిన వారికి పతన భయముండదు. దేవతలు, ఋషులు సిద్ధులు ఈ సరస్సును సేవించు కోరికతో నుండు ప్రదేశమును రంతుకక్షేత్రమందురు. పూర్వము ఈ క్షేత్రమును కాపాడుటకు శ్రీ మహావిష్ణువు యక్ష సుచన్ద్ర సూర్య వాసుకి, శంఖుకర్ణక విద్యాధర సుకేశులను రాక్షసులను స్థాపించెను. వీరందరు ధనదుర్బాణధరులై భృత్యులతో కలిసి కురుక్షేత్రమును కాపాడుచు పావులను వారించుచుందురు. రంతుకక్షేత్రమును చేరి పలు మార్లు క్షమాపణను వేడి సరస్వతిలో స్నానమాడి యక్షుని దర్శించి నమస్కరించి పుష్పధూప దీపనైవేద్యములను సమర్పించి ఈ వాక్యమును పలుకవలయును. ఓ యక్షేన్ద్రా నీ అనుగ్రహమువలన వనములను నదులను తీర్ధములను పరిభ్రమించు నాకు విఘ్నము కలుగకుండుగాక. ఇట్లు ప్రార్థించి చక్కగా యాత్ర నాచరించవలయును. వనములను తీర్ధములను, నదులను కురుక్షేత్ర పుణ్యతీర్ధములను పర్యటించువాడు. ఇహలోకమున పరలోకమున న్యూనత్వమును పొందజాలడు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున
కురుక్షేత్ర మాహాత్మ్యమున
క్షేత్రప్రమాణాది నిరూపణ
మను అరువది నాలుగవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page