Sri Naradapuranam-3 Chapters Last Page
పంచషష్టితమో`òధ్యాయః అరువదియైదవ అధ్యాయము
తీర్ధయాత్రావర్ణనమ్
మోహిన్యువాచ
యాని తీర్ధాని సంత్యత్ర కురుక్షేత్రే సుపుణ్యదె
తాని సర్వాణి మే బుూహి గతిదస్త్వం గురుర్యతః 2
మోహిని పలికెను:- ఓ బ్రాహ్మహోత్తమా! కురుక్షేత్రమున నున్న వనములేవి? నదులెన్ని? ఎన్ని తీర్ధముల కలవు? వాటి నన్నటిని క్రముగా తెలపుము. నాకు ఉత్తమ గతిని ప్రసాదించు గురువు నీవేకదా!
వసురువాచ
శృణు మోహిని వక్ష్యామి కురుక్షేత్రస్య పుణ్యదమ్ | యత్రావిధానం యత్కృత్వా లభ##తే గతి ముత్తమామ్ 3
వనాని సప్త సన్తీహ కురుక్షేత్రస్యమధ్యతః | తేసాం నామాని వక్ష్యామి పుణ్యదానం నృణామిహ 4
కామ్యకంచ వనం పుణ్యం తధాదితి వనం మహత్ | వ్యాసస్యచ వన పుణ్యం ఫలకీవనమేవచ 5
తధా సూర్యవనం చాత్ర పుణ్యం మధువనం చ వై | సీతా వనం తధాఖ్యాతం నృణాం కల్మషనా శనమ్ 6
వనాన్యేతాని సప్తాత్ర తేషు తీర్థాన్యనేకశః | సరస్వతీ నదీ పుణ్యా తధా వైతరణీ నదీ 7
గంగా మందాకినే పుణ్య తధైవాన్యా మధుస్రవా | దృషద్వతీ కౌశికీ చ పుణ్యా హైరణ్వతీ నదీ 8
వర్ష కాల వహాశ్చైతా వర్జయిత్వా సరస్వతీమ్ | ఏతాసా ముదకం పుణ్యం స్పర్శే పానే సమాప్లుతా 9
రజస్వలాత్వాం నైతాసాం పుణ్యక్షేత్ర ప్రభావతః | రంతుకం తు పురాసాద్య ద్వారపాలం మహాబలమ్ 10
యక్షం సమాభివాద్యాధ తత్ర యాత్రాం సమారభేత్ | తతో గచ్ఛేన్నరః పుణ్యం భ##ద్రే`òదితి వనం మహత్ 11
అదిత్యా యత్ర పుత్రార్ధం సమ్యక్ఛీర్ణం మహత్తపః | తత్ర స్నాత్వా సమభ్యర్చ్య దేవమాతరమంగనా 12
సూతే పుత్రం మహాశూరం సర్వలక్షణ సంయుతమ్ | తతో గచ్ఛేద్వరారొహా విష్ణోస్థ్సాన మనుత్తమమ్ 13
విమలం నామ విఖ్యాతం యత్ర సన్నిహితో హరిః | విమలే తు నరస్స్నాత్వా దృష్ట్వా చ విమలేశ్వదమ్ 14
విమలస్స లభేల్లోకం దేవదేవస్య చక్రిణః | హరిం చ బలదేవంచ దృష్ట్యే కాసనమాస్థితః 15
ముచ్యతే కిల్బిషాత్సద్యో మోహిన్యత్ర న సంశయః | తతః పారిప్లవం గచ్ఛే త్తీర్ధం లోకేషు విశ్రుతమ్ 16
తత్ర స్నాత్వా చ పీత్వా యో బ్రాహ్మణం వేదపాగరమ్ | సంతోష్య దక్షినాద్యేన బ్రహ్మయజ్ఞఫలం లభేత్ 17
యత్రాస్తి సంగమో భ##ద్రే కాశిక్యాః పాపనాశనః | తత్ర స్నాత్వా నరో భక్త్వా ప్రాప్నోతి ప్రియసంగమమ్ 18
తతస్తు పృధివీతీర్థ మాసాద్య క్షాంతి మాన్నరః | స్నాతో భక్త్వా మమాభాగే ప్రాప్నోతి గతి ముత్తమామ్ 19
ధరణ్యా మపరాధా యే కృతాస్స్యుః పురుషైస్తథా లై | తాన్సర్వాక్షమతే దేవీ తత్ర స్నాతస్య దేహినః 20
వసుపు పలికెను: ఓ మోహినీ! పుణ్యప్రదమగు కురుక్షేత్రయాత్రా విధానమును చెప్పెదను. వినుము. ఈ యాత్ర నాచరించిన వారు ఉత్తమ గతిని పొందెదరు. ఈ క్షేత్రమున ఏడు వనములు కలవు. పుణ్యప్రదములగు ఆ వనముల పేర్లను చెప్పెదను. కామ్యకవనము, అదితివనము, వ్యాసవనము, ఫలకీవనము, సూర్యవనము, మధువనము, సీతావనము. ఈ వలములన్నియూ మానవ కల్మషనాశకములు. ఈ ఏడు వనములలో అనేక తీర్ధములు కలవు. సరస్వతీ నదీ, వైతరణీ నది, గంగానది, మధుస్రవా, దృషద్వతీ, కౌశికీ, హైరణ్వతీ అని కలవు. వీటిలో ఒక సరస్వతి తప్ప మిగిలిన నదులన్ని యీ వర్షకాలము ప్రవహించునవి. ఈ నదుల జలములు స్పర్శకు పానమునకు స్నానమునకు పవిత్రములు. పుణ్యక్షేత్ర ప్రభావనమువలన ఈ నదులకు కలుషితత్వములేదు. మొదట రంతుక క్షేత్రమునకొచ్చి అచట మహాబలుడు యక్షుడగు ద్వారపాలుని నమస్కరించి యాత్రను ప్రారంభించవలయును. తరువాత పుణ్యప్రదమగు అదితి వనమునకు వెళ్ళవలయును. ఇచటనే అదితి సంతానముకొరకుగొప్ప తపము నాచరించినది. ఇచట స్నానమాడి దేవమాతయగు అదితిని చక్కగా పూజించిన స్త్రీ సర్వలక్షణయుతుడు, మహా శూరుడగు పుత్రుని ప్రసవించును. తరువాత పరమోత్తమమగు విష్నుస్థానమునకు వెళ్ళవలయును. ఇదియే విమల తీర్థము. ఇచట ఎపుడూ శ్రీమహావిష్ణువు సన్నిహితుముగా నుండును. విమలా తీర్థము స్నానమాడి విమలేశ్వరుని దర్శించి నిర్మలుడై దేవదేవుడగు శ్రీహరిలోకమును పొందును. శ్రీకృష్ణుని బలరాముని ఒకే స్థానమున నుండగా చూచినవారు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. తరువాత లోకప్రసిద్ధమగు పారిప్లవమునకు వెళ్ళవలయును. ఇచట స్నానమాడి ఆచమనము చేసి వేదపారగుడగు బ్రాహ్మణుని దక్షిణాదులచే సంతోషపరిచిన బ్రహ్మయజ్ఞ ఫలము లభించును. పాపనాశకమగు కౌశికీసంగమమున భక్తిచే స్నానమాడినవాడు ప్రియసమాగమమును పొందును. తరువాత క్షమతో పృథివీతీర్థమును చేరి భక్తితో స్నానమాడి ఉత్తమగతిని పొందును. ఇచట స్నానమాడినవాడు చేసిన సమస్త పృథివీగత దోషములను ఇచటి దేవి క్షమించును.
తతో దక్షాశ్రమే పుణ్య దృష్ట్వా దక్షేశ్వరం శివమ్ | అశ్వమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః 21
తతశ్శాలకినీం గచ్ఛే త్తత్ర స్నాత్వా సమర్చయేత్ | హరిం హరేణ సంయుక్తం వాంఛితార్థస్య లబ్ధయే 22
నాగతీర్థం తతః ప్రాప్య స్నాత్వా తత్ర విధానవిత్ | సర్పిశ్చాస్య దధి ప్రాశ్య నాగేభ్యో హ్యభయం లభత్ 23
తతస్సాయము పావృత్య రంతుకం ద్వారాపాలకమ్ | ఏకరాత్రోషితస్తత్ర పూజయేత్తం పరే`ò హని 24
గంధాద్యైరుపచారైస్తు బ్రాహ్మణం ప్రార్చ్య భోజయేత్ | తతః పంచనదం గచ్ఛే త్తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ 25
పంచనాదాః కృతా యత్ర హరేణాసుర భీషణాః | తేన పంచదనం నామ సర్వపాతక నాశనమ్ 26
తత్ర స్నానేన దానేన నిర్భయో జాయతే నరః | కోటి తీర్థం తతోగచ్ఛే ద్యత్ర రుద్రేణ మోహిని 27
కోటి తీర్థా న్యుపాహృత్య స్థాపితాని మమాత్మనా | తత్ర తీర్థే నరస్న్వాత్వా దృష్ట్వా కోటీశ్వరం హరమ్ 28
పంచ యజ్ఞ భవం పుణ్యం తత్ర్పభృత్యాప్నుయాత్సదా | తత్రైవ వామనో దేవ స్సర్వదేవైః ప్రతిష్ఠితః 29
తస్మాత్తం తత్ర సంపూజ్య అగ్నిష్టోమ ఫలం లభేత్ | తతో`òశ్వితీర్థ మాసాద్య శ్రద్ధావాన్విజితేంద్రియః 30
స్నాత్వా తత్రయశసీచ రూపవాంశ్చనరో భ##వేత్ | తతో వారాహ తీర్థం చ ప్రాప్య విష్ణు ప్రకల్పకమ్ 31
ఆప్లుత్య శ్రద్ధయా తత్ర నరస్సద్గతి మాప్నుయాత్ | తతో వ్రజేత్సోమతీర్థం యత్ర సోమో వరాననే 32
తపస్త్వప్త్వా హ్యరోగో, భూ త్తత్రచ స్నానమాచరేత్ | దత్తా చ తత్ర గామేకాం రాజసూయ ఫలం భ##వేత్ 33
భూతేశ్వరంచ తత్రైవ జ్వాలామాలేశ్వరం తధా| తాడలింగం సమభ్యర్చ్య న భూయో భవ మాప్నుయాత్ 34
ఏక హంసే నరస్స్నాత్వా గోసహస్ర ఫలం లభేత్ | కృతశౌచే నరస్స్నాత్వా పుండరీక ఫలం లభేత్ 35
తతో మంజవటం నామ ప్రాప్య దేవస్య శూలినః | సముష్య చ ని శామేకాం ప్రార్బ్యేశం గణపో భ##వేత్ 36
ప్రాసాద్య యక్షిణీం తత్ర ద్వారస్థాముపవాసకృత్ | స్నాత్వాభ్యర్శ్చాశ ద్విప్రా న్మహాపాతక శాంతయే 37.
ప్రదక్షిణము పావృత్య పుష్కరం చ తతోవ్రజేత్ | తత్ర స్నాత్వా పితౄన్ప్రార్చ్య కృతకృత్యో నరో భ##వేత్ 38
కన్యాదానం చ యస్తత్ర కార్తిక్యాం వై సమాచరేత్ | ప్రసన్నా దేవతాస్తస్య యచ్ఛకన్త్యభిమతం పలమ్ 39
కపిలశ్చ మహాయక్షో ద్వారపలో`ò త్ర సంస్థితః | విఘ్నం కరోతి పాపానాం సుకృతం చ ప్రయచ్ఛతి 40
పతీ తస్య మహాభాగా నామ్నా సా ఖలమేఖలా | ఆహత్య దుందుభిం సా తు బ్రమతే నిత్యమేవ హి 41
వారయేత్పాపి న స్స్నానాత్ తధా సుకృతినో నయేత్ | తతో రామహ్రదం గచ్ఛే త్స్నాత్వా తత్ర విధానతః 42
దేవాన్పితౄనృషీనిష్ట్వా భుక్తిం ముక్తిం చ విందతి | రామమభ్యర్చ్య సచ్ర్ఛద్దః స్వర్ణం దత్వా ధనీ భ##వేత్ 43
తరువాత పుణ్యప్రదమగు దక్షాశ్రమమను దక్షేశ్వరుడగు శివుని దర్శించి అశ్వమేధ యజ్ఞఫలమును పొందును. తరువాత శాలకీని తీర్థమునకు వెళ్ళి అచట స్నానమాడవలయును. వాంఛి తార్థలాభమునకు హరునితో కలిసియున్న శ్రీహరిని పూజించవలయును. ఇచటి నుండి నాగతీర్థమునకు వెళ్ళి యధవిధిగా స్నానమునాచరించి ఇచటి నాగులగు పెరుగును, నేతిని తినిపించి సర్పములనుండి అభయమును పొందును. తరువాత సాయంకాలము రంతుక తీర్థమున కొచ్చి ఒక రాత్రి నివసించి మరునాడు ద్వారపాలకుని పూజింవలయును. గంధాద్యుపచారములచే బ్రాహ్మణుని పూజించి భుజింప చేయవలయును. తరువాత లోకత్రయ ప్రసిద్ధమగు పంచనద తీర్థమునకు వెళ్ళవలయును. ఇచట శంకరుడు రాక్షసులను భీతిల్లజేయు పంచనాదములను గావించెను గాన దీనికి పంచనదమను పేరు కలిగెను. ఈ తీర్థము సర్వపాతక నాశనము. ఇచట స్నానముచే దానముచే నరుడు నిర్భయుడగును. తరువాత కోటి తీర్థమునకు వెళ్ళవలయును. ఇచట స్వయముగా రుద్రుడు కోటి తీర్థములను సంగ్రహించి స్థాపించెను. ఈ తీర్థమున స్నానమాడి కోటిశ్వరుడగు శివుని దర్శించి, పంచయజ్ఞ భవపుణ్యమును ఇప్పటి నుండి ఎపుడూ పొందును. ఇచటనే దేవతలందరూ వామనదేవుని ప్రతిష్ఠించిరి. కావున ఇచట వామనుని పూజించి అగ్నిష్టోమ ఫలమును పొందును. తరువాత అశ్వితీర్థమును చేరి శ్రద్ధ కలిగి జితేంద్రియుడై స్నానమాచరించి యశస్వి రూపవంతుడగును. తరువాత వారాహతీర్థమును చేరి విష్ణు ప్రకల్పిత తీర్థమున శ్రద్ధచే స్నానము చేసి సద్గతిని పొందును. తరువాత చంద్రుడు తపమునాచరించి ఆరోగ్యమును పొందిన సోమతీర్థమునకు వెళ్ళి స్నానమాడవలయును. ఇచట గోదానమును చేసినవారికి రాజసూయ ఫలము లభించును. ఇచటనే భూతేశ్వరుని, జ్వాలామాలేశ్వరుని తాపలింగమును పూజించినవారు మరల సంసారమును పొందరు. ఏకహంసమున స్నానమాడిన వారు సహస్రగోదాన ఫలమును పొందును. కృతశౌచమున స్నానమాడినవారు పుండరీక ఫలము పొందును. ఇచట ఉపవసించి ద్వారమున నున్న యక్షిణిని ప్రార్థించి స్నానమాడి బ్రాహ్మణులను పూజించి మహాపాతక శాంతి కొఱకు భుజింప చేయవలయును. ప్రదక్షిణ మాచరించి పుష్కరమునకు వెళ్ళవలయును. ఇచట స్నానమాడి పితృదేవతలను పూజించి కృతకృత్యుడగును. ఇచట కార్తిక పూర్ణిమరోజున కన్యాదానమునాచరించి వాడు దేవతానుగ్రహమున అభిమత ఫలమును పొందును. ఇచట మహాయక్షుడగు కపిలుడు ద్వారపాలకునిగా ఉండును. పాపములకు విఘ్నములను కల్పించి సుకృతమును ప్రసాదించును. కపిలపత్ని ఖలమేఖల కలదు. దుందుభిని మ్రోగించుచు నిత్యము తిరుగుచుండును. పాపులను స్నానము చేయనీయక వారించును. సుకృతులను తీసుకొనివచ్చును. తరువాత రామహ్రదమునకు వెళ్ళవలయును. ఇచట యధావిధిగా స్నానమాచరించి దేవతలను పితరులను ఋషులను పూజించి భుక్తిని ముక్తిని పొందును. శ్రద్ధతో రాముని పూజించి స్వర్ణదానమును గావించి ధనవంతుడగును.
వంశ మూలం సమాసాద్య స్నాత్వా స్వం వంశముద్ధరేత్ | కాయ శోధనకే స్నాత్వా శుద్ధదేహో హరిం విశేత్ 44
లోకోద్ధారం తతః ప్రాప్య స్నాత్వాభ్యర్చ్య జనార్దనమ్ | ప్రాప్నోతి శాశ్వతం లోకం యత్ర విష్ణు స్సనాతనః 45
శ్రీతీర్థం చ తతః ప్రాప్య శాలగ్రామ మనుత్తమమ్ | స్నాత్వాభ్యర్చ్య హరిం నిత్యం పశ్యతి స్వాంతికే స్థితమ్ 46
కపిలాహ్రదమాసాద్య స్నాత్వాభ్యర్చ్య సురాన్పితౄన్ | సహస్ర కపిలా పుణ్యం లభ##తే నాత్ర సంశయః 47
కపిలం తత్ర విశ్వేశం సమభ్యర్య్చ విధానతః | దేవైశ్చ సత్కృతో భ##ద్రే సాక్షాచ్ఛివ పదం లభేత్ 48
సూర్యతీర్థే తతో భానుం సోపవాసస్సమర్చయేత్ | అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం లబ్ద్వా వ్రజేద్దివమ్ 49
పృథివీవివరద్వారి స్థితో గణపతి స్స్వయమ్ | తం దృష్ట్వాచాస్య యజ్ఞస్య ఫలం లబ్ద్వా వ్రజేద్దివమ్ 50
దేవ్యాస్తీర్థే నరస్స్నాత్వా లభ##తే రూపముత్తమమ్ | బ్రహ్మావర్తే నరస్స్నాత్వా బ్రహ్మజ్ఞానమవాప్నుయాత్ 51
సుతీర్థకే నర స్స్నాత్వా దేవర్షి పితృమానవాన్ | సమభ్యర్చ్యాశ్వమేధస్య యజ్ఞస్య ఫలమాప్నుయాత్ 52
కామేశ్వరస్య తీర్ధేతు స్నాత్వా శ్రద్ధాసమన్వితః | సర్వవ్యాధి వినిర్ముక్తో బ్రహ్మ ప్రాప్నోతి శాశ్వతమ్ 53
స్నాతస్య మాతృతీర్థ తు శ్రద్ధయాభ్యర్చ కస్యతు | ఆసప్తమం కులం దేవి వర్ధేత శ్రీరనుత్తమా 54
తతస్సీతావనంగ చ్ఛే త్తత్ర తీర్థం మహచ్ఛుభే | పునాతి దర్శనాదేవ పురుషానేక వింశతిమ్ 55
కేశాన్ప్రక్షిప్య వై తత్ర పూతో భవతి పాపతః | దశాశ్యమేధికం తత్ర తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ 56
దర్శనాత్తస్య తీర్థస్య ముక్తో భవతి కిల్చిషైః | మానుషాహ్వం తతస్తీర్థం ప్రాప్య స్నానం సమాచరేత్ 57
యదీచ్చేన్మానుషం జన్మ పునశ్చ విధినందిని | మానుషాచ్చ తతస్తీర్ధా త్క్రోశమాత్రే మహానదీ 58
ఆపగా నామ విఖ్యాతా తత్ర స్నాత్వా విధానతః | శ్యామాకం పయసా సిద్ధం భోజయేద్ద్విజసత్తమాన్ 59
తస్య పాపం క్షయం యాతి పితౄణాం శ్రాద్ధతో గతిః | నభ##స్యే మాసి కృష్ణే తు పితృపక్షే మహాలయే 60
చతుర్దశ్యాంతు మధ్యాహ్నే పిండదో ముక్తిమాప్నుయాత్ | బ్రాహ్మోదుంబరకం గచ్ఛే ద్బ్రహ్మణ స్థ్సాన కం తతః 61
తత్రబ్రహ్మర్షి కుండేషు స్నాతస్సోమఫలం లభేత్ | వృద్దకేదారకే తీర్థే స్థాణుం దండిసమన్వితమ్ 62
సమర్చ్య యత్ర చాప్నోతి నరో`Åòంంతర్ధానమిచ్ఛయా | కలశ్యాం చ తతో గచ్ఛే ద్యత్ర దేవీ స్వయం స్థితా 63
స్నాత్వా శ్యామాంబికాం ప్రార్చ్య తరేత్సంసారసాగరమ్ | సరకే కృష్ణ భూతాయాం దృస్ట్వా దేవం మహేశ్వరమ్ 64
తిస్ర : కోట్యస్తు తీర్థానాం నరకే సన్తి భామిని 65
రుద్రోకోటి స్తధా కూపే సరోమధ్యే వ్యవస్థితా | తస్మిన్సరసి యస్న్సాత్వా రుద్రోకోటిం స్మరేన్నరః 66
పూజితా రుద్రోటిస్తు తేనస్యాన్నాత్ర సంశయః | ఈహాస్పదం చ తత్రైవ త్థీం పాపప్రణాశనమ్ 67
యస్మిన్ముక్తి మవాప్నోతి దర్శనాదేవ మానవః | తత్రస్థానర్చయిత్వాచ దేవాన్పితృగణానపి 68
న దుర్గతి మవాప్నోతి మనసా చింతితం లభేత్
వశమూల తీర్థమును చేరి స్నానము చేసి తన వంశము నుద్దరించును. కాయ శోధనక తీర్థమున స్నానమాడి శుద్ధదేహుడై శ్రీహరిని చేరును. తరువాత లోకోద్దార తీర్థమును చేరి స్నానమాడి జనార్దనుని పూజించి సనాతనమగు శ్రీ విష్ణులోకమును చేరును. తరువాత శ్రీ తీర్థమున చేరి స్నానము నాచరించి పరమోత్తమమగు సాలగ్రామమును పూజించి నిత్యము తన సమీపముననే శ్రీహరిని చూడగలుగును. తరువాత కపిలాహ్రదమును చేరి స్నానమాడి పితరులను దేవతలను పూజించి సహస్రకపిలాదాన పుణ్యమును పొందును. ఇచట విశ్వేశ్వరుడగు కపిలుని యధావిధిగా పూజించి దేవతాసత్కారమును పొందుచు శివలోకమును చేరును. తరువాత సూర్యతీర్థమున ఉపవసించి సూర్యని పూజించు వలయును. ఇట్లు చేసిన అగ్నిష్టోమయజ్ఞ ఫలమును పొంది స్వరగమును చేరును. ఇచట పృథివి వివరద్వారమున నున్న గణపతిని స్వయముగా దర్శించి పూజించి యజ్ఞపలమును పొందును. దేవీతీర్థమున స్నానమాడినవారు ఉత్తమ తీర్థమును పొందును. బ్రహ్మావర్తమున నరుడు స్నానమాడి బ్రహ్మజ్ఞానమును పొందును. సుతీర్థమున నరుడు స్నానమాడి దేవతలను, ఋషులను పితరులను మానవులను చక్కగా పూజించి అశ్వమేధయజ్ఞఫలమును పొందును. కామేశ్వరతీర్థమున శ్రద్దాసమానితుడై స్నానమాచరించి సర్వవ్యాధి వినిర్ముక్తుడై శాశ్వత బ్రహ్మపొందును. మాతృ తీర్థమున స్నానం చేసి శ్రద్ధగా పూజించిన వారికి ఏడు తరములు వరకు కులమున సంపదలు పెరుగను. తరువాత సీతావనముకు వెళ్ళి దర్శించినంతనే ఇరుపది యొకటి తరములను పావనము చేయును ఇచట కేశములను విడిచి పాపములనుండి వినిర్ముక్తుడై పరిశుద్ధుడగును. ఇచట లోకత్రయ ప్రసిద్ధమగు దశాశ్వమేధిక తీర్థము కలదు. ఈ తీర్థమును దర్శించినంతనే నరుడు పాపముల నుండి పరిముక్తుడగును. తరువాత మానుషాహ్వతీర్థమున స్నానమాచరించవలయును. ఇట్లు చేసిన మరల మానవజన్మకలుగును. మానుషతీర్థమునకు ఒక కోసు దూరమున ఆపణాతీర్థము కలదు. ఇచట స్నామునాచరించి బ్రహ్మణులకు పాలతో సిద్దము చేసిన శ్యామాకమును భుజింపచేయవలయును. శ్రాద్ధకర్తకు పాపము నశించును. భాద్రపద కృష్ణ పక్షమున పితృపక్ష మహాలయమున చతుర్దశినాడు మధ్యాహ్నమున పిండి ప్రదానము చేయువారికి ముక్తి లభించును. ఇటనుండి బ్రహ్మస్థానమగు బ్రాహ్మోదుంబరకమున చేరి ఇచట బ్రహ్మర్షికుండము నందు స్నానము నాచరించి సోమయాగఫలమును పొందును. వృద్ధకేదారక తీర్థమున దండిసమన్వితుడగు స్థాణువును చక్కగా పూజించి ఇచ్ఛానుకూలముగా అంతర్ధానమును పొందగలడు. తరువాత కలశీతీర్థమునకు వెళ్ళి స్నానమాడి అంబికాదేవిని పూజించి సంసారసాగరమును దాటగలడు. కృషి సరమునందు మహేశ్వరుని దర్శించి శిలోకమును పొందును. నరకమున మూడు కోట్ల తీర్థములు కలవు సరోమధ్యమున రుద్రోకోటి కలదు. సరసున స్నానమాడి రుద్రకోటిని స్మరించినచో రుద్రకోటిని పూజించినవాడగును. ఇచటనే పాపప్రణాశనమగు ఈహాస్పద తీర్థము గలదు. ఈ తీర్థమును దర్శించినంతనే ముక్తిని పొందును. ఇచట నున్న దేవతలను పితరులను పూజించి దుర్గతికి దూరుడగును. మనసున కోరినది లభించును.
కేదారంచ మహాతీర్థం సర్వ కల్మషనాశనమ్ 69
తత్ర స్నాత్వా చ పురుషః సర్వదానఫలం లభేత్ | అన్యజన్మేతి విఖ్యాతం సరకస్య తు పూర్వతః 70
సరో మహత్స్వచ్చ జలం దేవౌ హరిహరౌ యతః | విష్ణుశ్చతుర్భుజస్తత్ర లింగాకార శ్శివస్థ్సితః 71
తత్ర స్నాత్వా చ తౌ దృష్ట్వా స్తుత్వా మోక్షం లభేన్నరః | నాగహ్రదే తతో గత్వా స్నాత్వా చైత్రే సితాంతకే 72
శ్రాద్ధతో ముక్తి మాప్నోతి యమలోకం న పశ్యతి | తతస్త్రి విష్టపం గచ్చే త్తీర్థం దేవనిషేవితమ్ 73
యత్ర వైతరణీ పుణ్యా నదీ పాప ప్రమోచనీ | తత్ర స్నాత్వా ర్చయిత్వా చ శూలపాణిం వృషధ్వజమ్ 74
సర్వపాప విశుద్ధాత్మా గచ్ఛత్యేవ పరాం గతిమ్ | రసావర్తే నరస్స్నాత్వా సిద్ధిమాప్నోత్యనుత్తమామ్ 75
చైత్రస్య సిత భూతాయాం స్నానం కృత్వా విలేపకే | పూజయిత్వా శివం భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే 76
యత్ర దేవా స్సగంధర్వా స్తప్యంతే పరమం గతః 77
తత్ర న్నద్యాం దృషద్వత్యాం నరస్స్నాత్వా విధానతః | దేవాన్పితౄంస్తర్పయిత్వా హ్యగ్నిష్టోమాతిరాత్రభాక్ 78
దర్శే తధా విధుదినే తత్ర శ్రాద్ధం కరో తియః | గయాశ్రాద్ధ సమం తత్ర లభ##తే ఫలముత్తమమ్ 79
శ్రాద్ధేఫలమరణ్యస్య స్మరణం పితృతృప్తిదమ్ | పాణిఘాతే తతస్తీర్దే పితౄన్సంతర్ప్యమానవః 80
రాజసూయఫలం ప్రాప్య సాంఖ్యం యోగం చ విందతి | తతస్తు మిశ్రకే తీర్థే స్నాత్వా మర్త్యో విధానతః 81
సర్వతీర్థ ఫలం ప్రాప్య లభ##తే గతిముత్తమామ్ | తతో వ్యాసవనే గత్వా స్నాత్వా తీర్థే మనోజవే 82
మనీషిణం విభుం దృష్ట్వా మనసా చింతితం లభేత్ | గత్వా మధువనం చైవ దేవ్యాస్తీర్దే నరశ్శుచిః 83
స్నాత్వా దేవానృషీనిష్ట్వా లభ##తే సిద్ధిముత్తమామ్ | కాశికే సంగమే తీర్థే దృషద్వత్యాం నరః ప్లుతః 84
నియతో నియతాహారః సర్వపాపైః ప్రముచ్యతే | తతో వ్యాసస్థలీం గచ్ఛే ద్యత్ర వ్యాసేన ధీమతా 85
పుత్రశోకాభి భూతేన దేహత్యాగో వినిశ్చితః | పునరుత్థాపితో దేవై స్తత్ర గత్వా న శోకభాక్ 86
కిందుశూకూపమాసాద్య తిలప్రస్థం ప్రదాప్యచ | గచ్ఛేద్ది పరమాం సిద్ధిం మృతో ముక్తి మవాప్నుయాత్ 87
ఆహ్నం చ ముదితం చైవ ద్వే తీర్థే భువి విశ్రుతే | తయోస్స్నాత్వా విశుద్ధాత్మా సూర్యలోకమవాప్నుయాత్ 88
మృగముచ్యం తతో గత్వా గంగాయాం ప్రణత స్థ్సితః | అర్చయిత్వా మహాదేవ మశ్వమేధ పలం లభేత్ 89
కోటి తీర్థం తతో గత్వా స్నాత్వా కోటీశ్వరం శివమ్ | దృష్ట్వా స్తుత్వా శ్రద్ధధాన! కోటి యజ్ఞ ఫలం లభేత్ 90
తతో వామనకం గచ్చే త్రిషు లోకేషు విశ్రుతమ్ | యత్ర వామన జన్మాభూ ద్బలేర్యజ్ఞ జిహీర్షయా 91
తత్ర విష్ణుపదే స్నాత్వా పూజయిత్వా చ వామనమ్ | సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకే మహీయతే 92
జ్యేష్ఠాశ్రమం చ తత్రైవ సర్వపాతకం నాశనమ్ | జ్యేష్ఠస్య శుక్లైకాదశ్యాం సోపవాసః పరే%హని 93
స్నాత్వా తత్ర కృతం దేవి! పితౄణా మతితుష్టిదమ్ 94
తత్రైవ కోటి తీర్థం చ త్రిషు లోకే షు విశ్రుతమ్ | తస్మింస్తీర్థే నరస్స్నాత్వా కోటియజ్ఞ పలం లభేత్ 95
తత్ర కోటీశ్వరం నామ దేవదేవం మహేశ్వరమ్ | సమభ్యర్చ్య విధానేన గాణపత్యమవాప్నుయాత్ 96
కేదార మహాతీర్థము సర్వకల్మష నాశనము. ఇచట స్నానము చేసిన పురుషుడు సర్వదాన పలమును పొందును. సరక తీర్థమునకు పూర్వభాగమున ఆన్యజన్మయను తీర్థము ప్రసిద్ధము. ఈ తీర్థము స్వచ్ఛజలము. ఇచట హరిహరులు సన్నిహితులుగా నుందురు. ఇచట విష్ణువు చతుర్భుజునిగా, శివుడు లింగాకారముతో నుండును. ఇచట స్నానమాడి హరిహరులను దర్శించి స్తుతించి మోక్షమును పొందును. చైత్ర శుక్ల పక్షమున నాగహ్రదమునకు వెళ్లి స్నానమాడి శ్రాద్ధమును ఆచరించువాడు ముక్తిని పొందును. యమలోకమును చూడడు. తరువాత దేవసేవితమగు త్రివిష్టప తీర్థమును చేరి అచట నున్న వై తరణీనది యందు స్నానమాడి శూలపాణియగు పృషధ్వజుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై ఉత్తమగతిని పొందును రసావర్తమున స్నానమాడి ఉత్తమసిద్ధిని పొందును చైత్ర శుద్ధ పూర్ణిమనాడు విలేపక తీర్థమున స్నానమాడి భక్తిచే శివుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడగును. తరువాత ఉత్తమమగు ఫలకీవనమునకు వెళ్లవలయును. ఇచట గంధుర్వులు దేవతలు పరమతపము నాచరింతురు. ఇచట దృషద్వతీనదిలో యధావిధిగా స్నానమాడి దేవతలకు పితరులకు తర్పణము గావించి అగ్నిష్టోమ అతిరాత్ర ఫలమును పొందును. పూర్ణిమనాడు అమావాస్యనాడు ఇచట శ్రాద్ధమునాచరించు వాడు గయాశ్రాద్ధ ఫలమును పొందును. అరణ్యమున శ్రాద్ధమాచరించిననూ ఫలకీవనమును స్మరించిన చో పితరులకు తృప్తి కలుగును. తరువాత పాణిఘాత తీర్థమున పితరులకు తర్పణము నాచరించి రాజసూయ ఫలమును పొంది సాంఖ్యయోగమును పొందును. మిశ్రకతీర్థమున యధావిధిగా స్నానము నాచరించి సర్వతీర్థ పలమును పొంది ఉత్తమగతిని పొందును. తరువాత వ్యాసవనమునకు వెళ్లి అచటి మనోజనతీర్థమున స్నానమాడి మనీషి విభును దర్శించి మనోభీష్టమునలను పొందును.
మధువనమునకు వెళ్ళి శుచియై దేవితీర్థమున స్నానమాడి దేవతలను ఋషులను పూజించి ఉత్తమసిద్ధిని పొందును. కాశీకీ సంగమతీర్థమున దృషద్వతీనదిలో స్నామాడి నియమబద్ధుడై నియతాహారమును భుజించి సర్వపాప వినిర్ముక్తుడగును. వ్యాస మహర్షి పుత్రశోకాభిభూతుడై దేహత్యాగమునకు నిశ్చయించి దేవతలచే మరల స్వస్థతను పొందించబడిన వ్యాసస్థలికి వెళ్లినవారు. దుఃఖమును పొందజాలరు. కిందుశూ కూపమును చే తిలప్రస్థదానమును గావించి పరమ స్థితిని పొందును. ఇచట మరణించినవాడు ముక్తిని పొందును. ప్రసిద్ధములగు ఆహ్నముదిత తీర్థము లందు స్నానము చేసి సూర్యలోకమును పొందును. మృగమచ్యమునకు వెళ్లి గంగకు నమస్కరించి మహాదేవుని పూజించి అశ్వమేధ ఫలమును పొందును. కోటితీర్థమునకు వెళ్ళి స్నానమాడి కోటీశ్వరుడగు శివుని దర్శించి స్తుతించి కోటి యజ్ఞఫలమును పొందును. బలి యజ్ఞమును హరించుటకు వామనుడవతరించిన లోకత్రయ ప్రథితమగు వామనకమునకు వెళ్ళి విష్ణుపదమున స్నానమాడి వామనుని పూజించి సర్వపాప విశుద్ధాత్మయై విష్ణులోకమున విరాజిల్లును. ఇచటనే సర్వపాతకనాశనమగు జ్యేష్ఠాశ్రమము కలదు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినాడు పవసించి మరునాడు ఇచట యధావిధిగా స్నానమాడి నరశ్రేష్ఠుడగును. ఇచట శ్రాద్ధమాచరించిన పితరులకు మిక్కిలి ప్రీతి కలుగును. ఇచటనే లోకత్రయ ప్రసిద్ధమగు కోటి తీర్థము కలదు. ఇచట స్నానమాడి కోటి యజ్ఞఫలమును పొందును. ఇచట కోటీశ్వరుడును మహేశ్వరుని యధావిధిగా పూజించి గణాధితప్యమును పొందును.
సూర్యతీర్థంచ తత్రైవ స్నాత్వాత్ర రవిలోక భాక్ | కులోత్తరాణకే తీర్థే గత్వా స్నానం సమాచరన్ 97
ఉద్దృత్య స్వకులం స్వర్గే కల్పాన్తం నివసేత్తతః | పవనస్యహ్రదే స్నాత్వా దృష్ట్వా ఏవం మహేశ్వరమ్ 98
స్వాత్వా చ హనుమత్తీర్ధే నరో ముక్తి మవాప్నుయాత్ 99
శాలహోత్రస్య రాజర్షే స్తీర్దే స్నాత్వాధ యజ్ఞవాక్ 100
స్నాతశ్చ నైమిషే కుండే నైమిష స్నానపుణ్యభాక్ | స్నాత్వా వేదవతీ తీర్థే స్త్రీ సతీత్వమవాప్నుయాత్ 101
బ్రహ్మణంః పరమం స్థానం యత్ర గత్వాన శోచతి 102
సోమతీర్థే నరస్స్నాత్వా స్వర్గతిం సమవాప్నుయాత్ | సప్తసారస్వతం తీర్థం ప్రాప్య స్నాత్వా చ ముక్తిభాక్ 103
యత్ర సప్తసరస్వత్య స్సమ్యగైక్యం సమాగతాః | సుప్రభా కాంచనాక్షీ చ విశాలా చ మనోహరీ 104
సునందా చ సువేణుశ్చ సప్తమీ విమలోదకా | తదై వౌశనసే తీర్థే స్నాత్వా ముచ్యేత పాతకైః 105
కపాలమోచనే స్నాత్వా బ్రహ్మహాపి విశుధ్యతి | వైశ్వామిత్రే నరస్స్నాత్వా బ్రహ్మణ్యం సమవాప్నుయాత్ 106
అవికేర్ణే నరస్స్నాత్వా బ్రహ్మచర్య ఫలం లభేత్ 107
మధ్యస్నవే%ధ ప్రయతః స్నాతో ముచ్యేత పాతకైః | స్నాత్వా తీర్థేచ, వాసిష్ఠే వాసిష్ఠం లోకమాప్నుయాత్ 108
అరుణా సంగమే స్నాత్వా త్రిరాత్రోపోషితో నరః | స్స్నాత్వా ముక్తి మవాప్నోతి వాత్ర కార్యా విచారణా 109
సముద్రాస్తత్ర చత్వార స్తేషు స్నాతో నరశ్శుభే | గోసహస్ర ఫలం లబ్ధ్వా స్వర్గలోకే మహీయతే 110
సోమతీర్థం చ తత్రాన్య త్తస్మిన్ స్నాత్వా చ మోహిని | చైత్రే షష్ఠ్యాంచ శుక్లాయాం శ్రాద్ధం కృత్వోద్దరేత్పితౄన్ 111
అధ పంచవటే స్నాత్వా యోగమూర్తి ధరం శివమ్ | సమభ్యర్చ్య విధానేన దైవతైస్సహామోదతే 112
కురుతీర్థే తతస్స్నాత స్సర్వసిద్ధి మవాప్నుయాత్ | స్వర్గద్వారే ప్లుతో మర్త్య స్స్వర్గలోకే మహీయతే 113
స్నాతో హ్యనరకే తీర్థే ముచ్యతే సర్వకిల్బిషైః | తతో గచ్చేన్నరో దేవి కామ్యకం వనముత్తమమ్ 114
యస్మిన్ర్పవిష్టమాత్రస్తు ముచ్యతే సర్వంసచయైః | అధాదిత్యవనం ప్రాప్య దర్శనాదేవముక్తిభాక్ 115
స్నానం రవిదినే కృత్వా తత్ర వాంఛితమాప్నుయాత్ | యజ్ఞోపవీతికే స్నాత్వా స్వధర్మఫల భాగ్భవేత్ 116
తతశ్చతుః ప్రవాహాఖ్యే తీర్థే స్నాత్వా నరోత్తమః | సర్వతీర్థఫలం ప్రాప్య మోదతే దివిదేవవత్ 117
స్నాతస్తీర్దే విహారేతు సర్వసౌఖ్య మవాప్నుయాత్ | దుర్గాతీర్థే నరస్స్నాత్వా న దుర్గతి మవాప్నుయాత్ 118
తతస్సరస్వతీ కూపే పితృతీర్థాపరాహ్వయే | స్నాత్వా సంతర్ప్య దేవాదీం ల్లభ##తే గతిముత్తమామ్ 119
స్నాత్వా ప్రాచీ సరస్వత్యాం శ్రాద్ధం కృత్వా విధానతః | దుర్లభం ప్రాప్నుయాత్కామం దేహాంతే స్వర్గతిం లభేత్ 120
శుక్రతీర్థే నరస్స్నాత్వా శ్రాద్ధదః ప్రోద్ధేరేతృతౄన్ | అష్టమ్యాం వా చతుర్దశ్యాం చైత్రై కృష్ణే విశేషతః 121
సోపవాసో బ్రహ్మతీర్థే ముక్తిభాఙ్ న్నాత్రసంశయః | స్థాణుతీర్థే తతస్స్నాత్వా దృష్ట్వా స్థాణు వటం నరః 122
ముచ్యతే పాతకై ఘోరై రితి ప్రాహ పితామహః | దర్శనాత్థ్సాణు లింగస్య యాత్రా పూర్ణా ప్రజాయతే 123
కురుక్షేత్రస్య దేవేశి సత్యం సత్యం మయోదితమ్ | కురుక్షేత్రం సమం తీర్థం న భూతం న భవిష్యతి 124
తత్ర ద్వాదశయాత్రాస్తు కృత్వా భూయో న జన్మభాక్ | పూర్త మిష్టం తపస్తప్తం హుతం దత్తం విధానతః 125
తత్ర స్యాదక్షయం సర్వ మితివేద విదోవిదుః | మన్వాదౌ చ యుగాదౌ చ గ్రహణ చంద్ర సూర్యయోః 126
మహాపాతే చ సంక్రాంతౌ పుణ్యచాప్యన్యవాసరే | స్నాతస్తత క్రరుక్షేత్రే ఫలానన్త్యమవాప్నుయాత్ 127
కలిజానాం తు పాపానాం పావనాయ మహాత్మనామ్ | బ్రహ్మణా కల్పితం తీర్థం కురుక్షేత్రం సుఖావహమ్ || 128
య ఇమాం కీర్తయేత్పుణ్యాం కధాం పాపప్రణాశినీమ్ | శృణుయాద్వా నరో భక్త్యా సో%పి పాపైః ప్రముచ్యతే 129
తత్తదేవ సదాప్నోతి నరో జన్మని జన్మని 130
అధ కిం బహుననోక్తేన విధిజే శృణు నిశ్చితమ్ | సేవేతైవ కురుక్షేత్రం యదీచ్ఛేద్భవ మోక్షణమ్ 131
ఏతదేవ మహత్పుణ్‌యం మేతదేవ మహత్తపః | ఏత దేవ మహత్‌జ్ఞానం యద్ర్వజేత్ స్థాణు తీర్థకమ్ 132
కురుక్షేత్ర సమం తీర్థం నాన్యద్భువి శుభావహమ్ | సాచారో వాప్యనాచారో యత్రముక్తి మవాప్నుయాత్ 133
ఏతత్తే సర్వమాఖ్యాతం యత్పృష్టోహం త్వయానఘే | కురుక్షేత్రస్య మహాత్మ్యం సర్వపాప నికృంతనమ్ 134
పుణ్యదం మోక్షదం చైవ కిమన్యచ్ఛ్రోతుమిచ్చసి 135
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే
బృహదుపాఖ్యానే వసుమోహినీ సంవాదే
కురుక్షేత్ర మాహాత్ర్మ్య తీర్థయాత్రా వర్ణనం నామ
పంచషష్టి తమో%ధ్యాయః
ఇచటనే ఉన్న సూర్యతీర్థమున స్నానమాడి సూర్యలోకమును చేరును. కులోత్తారకతీర్థమునకు వెళ్ళి స్నానమాచరించవలయును. స్వకులమును తరింపచేసి స్వర్గమున కల్పాన్తము వరకు నివసించును. పవనహ్రదమున స్నానమాడి దేవుడగు మహేశ్వరుని దర్శించి సర్వపాప వినిర్ముక్తుడై శివలోకమును చేరును. హనుమత్తీర్థమున స్నానమున చేసి ముక్తిని పొందును. రాజర్షియగు శాలిహోత్రుని తీర్థమున స్నానమాడి పాపరహితుడగును. శ్రీకుంభమను సరస్వతీ తీర్థమున స్నానమాడి యజ్ఞభాక్కగును నైమిషకుండమున స్నానమాడి నైమిషపుణ్యమును పొందును. వేదవతీ తీర్థమున స్నానమాడిన స్త్రీ సతీత్వమును పొందును. బ్రహ్మతీర్థమున స్నానమాడిన వాడు బ్రాహ్మణ్యమును పొందును. బ్రహ్మలోకమును పొంది దుఃఖరహితుడగును. సోమతీర్థమున స్నానమాడినవాడు సద్గతిని పొందును. సప్త సారస్వత తీర్థమును చేరి స్నానమాడి ముక్తిని పొందును. ఇచటనే ఏడు సరస్వతీనదులు ఐక్యమును పొందినవి. సుప్రభా, కాంచనాక్షి. విశాలా, మనోహరీ, సునందా, సువేణు, విమలోదక అనునది సప్తసరస్వతులు. నోశనస తీర్థమున స్నానమాడి పాతకములనుండి ముక్తుడగును. కపాలమోచన తీర్థమున స్నానమాడి బ్రహ్మహతకుడు కూడా శుద్ధి పొందును. విశ్వామిత్ర తీర్థమున స్నానమాడి బ్రాహ్మణ్యమును పొందును. పృధూదకమున స్నానమాడి సంసార బంధముక్తుడగును. అవి కీర్ణతీర్థమున స్నానమాడి బ్రహ్మచర్య ఫలమును లభించును. మధుప్రసవ తీర్థమునకు వెడలి స్నానమాడి పాతక విముక్తుడగును. వాసిష్ఠ తీర్థమున స్నానమాడి వసిష్ఠలోకమును పొందును. అరునాసంగమమున స్నానమాచరించి మూడు రాత్రులుపవసించి మరల స్నానము చేసినవాడు ముక్తిని పొందును. ఇచట నాలుగు సముద్రములు కలవు. వీటిలో స్నానమాడినవాడు గోసహస్రప్రదానపలమును పొంది స్వర్గమున విరాజిల్లును. సోమతీర్థమున స్నానమాడి చైత్ర శుక్లషష్ఠినాడు శ్రాద్ధము నాచరించి పితరులను తరింపచేయును. ఇక పంచవటమున స్నానము చేసి యోగమూర్తి ధరుడగు శివుని యధావిధిగా పూజించి దేవతలతో కలిసి ఆనందించును. తరువాత కురుతీర్థమున స్నానమాడి సర్వసిద్ధిని పొందును. స్వర్గద్వారము స్నానమాడినవాడు స్వర్గమును నివసించును. అనరక తీర్థమున స్నానము చేసి సర్వపాతకముక్తుడగును. తరువాత కామ్య, కవనమునకు వెళ్లవలయును. ఇచట ప్రవేశించినంతనే సర్వసంచితముల నుండి విముక్తుడగును. ఇక ఆదిత్యవనమును చేరి దర్శనమాత్రముననే ముక్తిని పొందును. ఇచట ఆదివారము నాడు కామితమును పొందును. యజ్ఞోపవీతిక తీర్థమున స్నానము చేసి స్వధర్మఫలమును పొందును. తరువాత చతుప్రవాహత్మమున స్నానము చేసి సర్వతీర్థపలమును పొంది స్వర్గమున దేవతలవలె ఆనందించును. విహారతీర్థమున స్నానమాడి సర్వసౌఖ్యమును పొందును దుర్గాతీర్థమున నరుడు స్నానమాడి దుర్గతిని పొందజాలడు. పితృతీర్థమను పేరుగల సరస్వతీ తీర్థమున స్నానమాడి దేవాదుతలను తృప్తిపరిచి ఉత్తమగతిని పొందును. ప్రాచీ సరస్వతి యందు స్నానమాడి యధావిధిగా స్నానము చేసి దుర్లభకామనలను పొంది దేహాంతమున స్వర్గమును పొందును. శుక్ర తీర్థమున నరుడు స్నానమాడి శ్రాద్ధము నాచరించినచో పితరులను తరింపచేయును. బ్రహ్మతీర్థమున చైత్ర కృష్ణ అష్టమినాడు. కాని, చతుర్దశినాడు కాని ఉపవసించినచో ముక్తిని పొందును. స్థాణు తీర్థమున స్నానము చేసి స్థాణువటమును దర్శించి ఘోరపాతకములనుండి ముక్తిని పొందునని పితామహుడు చెప్పెను. స్థాణులింగ దర్శనముచే యాత్ర పరిపూర్ణమగును. కురుక్షేత్రముతో సాటివచ్చు తీర్థము ఇంతకు మునుపు లేదు. ఇక ఉండదు. ఇచట ద్వాదశయాత్రలను చేసినవాడు మరల జన్మను పొందడు. ఇచట నాచరించి ఇష్టాపూర్తములు తపస్సు, హోమము, యధావిధానము అన్నియు అక్షయములగును. మన్వాదిక, యుగాదిన, సూర్యచన్ద్ర గ్రహణములలో, మహాపతమున, సంక్రమణమున, పవిత్రుములగు ఇతర దినములందు కురుక్షేత్రమున స్నానమాడిన వాడు అనన్త ఫలమును పొందును. ప్రతియుగమున కలుగు పాపములను నశింపచేయుటకే బ్రహ్మ కురుక్షేత్రమును కల్పించెను. ఇట్లు పాపప్రణాశిని పుణ్యప్రదము అగు ఈ కథను కీర్తించినవారు వినినవారు కూడా పాపములనుండి విముక్తులగుదురు. కురుక్షేత్రమున సూర్యగ్రహణ కాలమున దానము చేసిన దానినే ప్రతిజన్మలో పొందును. సంసారముక్తిని కోరువారు కురుక్షేత్రమునే సేవించవలయును. ఇదియే మహాపుణ్యము. ఇదియే మహాతపము. ఇదియే మహాజ్ఞానము. ఈ భూమండలమున కురుక్షేత్రము వంటి తీర్థము మరియొకటి లేదు. ఆచారవంతుడు ఆచార రహితుడు కూడా ఇచట ముక్తిని పొందును. ఇట్లు నీవడిగిన దంతయూ చెప్పితిని. సర్వపాపనాశకము. పుణ్యప్రదము మోక్షప్రదమగు కురుక్షేత్ర మాహాత్మ్యమును చెప్పితిని. ఇంకనూ ఏమీ వినదలచితిరి?
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున కురుక్షేత్రమాహత్మ్యమున
తీర్థయాత్రా వర్ణనమను ఆరువది అయిదవ
అధ్యాయము.