Sri Naradapuranam-3 Chapters Last Page
త్రిపస్తతి తమో`òధ్యాయః డెబ్బది మూడవ అధ్యాయము
త్ర్యంబక మాహాత్మ్యమ్
శ్రుతం గురో త్వయా ప్రోక్తం పుణ్యాఖ్యానం చ గౌతమమ్ | త్య్రంబకస్యచ మహాత్మ్యం
గోదాపంచవటీ భవమ్ 1
అధునా శ్రోతుమిచ్ఛామి పుండరీక పురోద్భవమ్ | యధా తత్ర మహాదేవ స్తాండవం నృత్యమాచరత్
2
తధా వద మహీదేవ పుణ్యాత్పుణ్యతరం మ
మోహిని పలికెను :-
గురువర్యా! నీవు చెప్పగా గౌతమ పుణ్య చిరిత్రమును త్ర్యంబక మహాత్మ్యమును
గోదాపంచవటి ప్రభావమును వింటిని. ఇక ఇపుడు పుండరీక పురోద్భవమగు
వినదలిచితిని. అచట మహాదేవుడు తాండవ నృత్యమునెట్లు చేసెనో ఆపరమ పావన
చరిత్రమును తెలుపుము.
వసురువాచ :-
భక్తవశ్యో మహాదేవః సద్యో వరద ఏవచ
3
ప్రాకట్యం యాతి భక్తానాం కరోతి చ తదిచ్ఛయా | ఏకదా జైమిని ర్నామ్నా వ్యాస శిష్యో
మునీశ్వరః 4
అగ్నివేశాదిభి శ్శిషై#్య సార్థం తీర్ధాన్యటన్నగాత్ | పుండరీక పురం సాక్షా ద్దేవ
రాజపురోపమమ్ 5
సర్వతోలంకృతం శ్రీమ త్సర్వర్తు కుసుమద్రుమైః | శోభితం శీతల చ్ఛాయైః శుభ్రవారి
జలాశ##యైః 6
నానావయః కులాకీర్లై స్సురమ్యైః కమలాకరైః | నారీ భిరప్సరోభిశ్చ నృభిర్విద్యాదర
ధ్యుభిః 7
విలసద్భవనై శ్శుభ్రైః విమానమివరాజతే | దృష్ట్వా శోభాం మునిస్తస్య పురస్య ప్రీతి
మాన్భృశమ్ 8
బభూవ చ మనశ్చక్రే స్నాతుం తత్ర సరోవరే | స్నిగద్ధచ్ఛాయై ద్ద్రుమై ర్యుక్తం
నానాపుష్పసుగంథితే 9
విశ్రమ్య తరు ఛాయాధ్యే తటే తస్య క్షణం మునిః | స్నాత్వా నిత్యాః క్రియాశ్చక్రే దేవర్షి
పితృ తర్పణమ్ 10
నిర్మాయ పార్దివం లింగం వివిధై రుప చారకైః | పూజయా మాస విధివ
త్పాధ్యార్ఘ్యధ్యైర నాకులః 11
గంధై ర్థూపై స్తథాదీపైస ర్నైవేద్యైర్వివిదైరపి | పుషై#్ప స్సు గంధిభిః ప్రార్చ్య స్థితో
యావద భూన్మునిః 12
తావత్ర్పసన్నో భగవా న్సాక్షాత్కారమః పాగతః | తస్మిన్నేవచ మృల్లింగే నానారత్న
ప్రభోద్గమే 13
తతస్స జైమినిర్దృష్ట్వా సాక్షాద్దేవముమాపతిమ్ | పపాత దండవద్భూమౌ పునరుత్థాయ
సాంజలిః 14
ప్రాహ ప్రపన్నార్తిహరం హరార్ధాంగం హరిం విభుమ్
వసువు పలికెను :
మహాదేవుడు భక్తవశ్యుడు. సద్యోవరప్రదుడు. భక్తులకు ప్రత్యక్షమగును. వాని అభీష్టమును ప్రసాదించును. ఒకపుడు జైమినియను వ్యాస శిశ్యుడు మునీశ్వరుడు అగ్నివేదాది శిష్యులతో తీర్థములను పర్యటించుచు వెళ్ళుచుండెను. అమరావతిని బోలిన పుండరీకపురమునకు వెళ్ళెను. సర్వఋతు కుసుమయుత మగు వృక్షములచే అంకరించబడినది. శీతలఛాయలతో శుభ్రవారి జలాశయములచే నానా పక్షి సంఘాకీర్ణములగు రమ్యమగు కలాకరములచే విద్యాధరుల కాంతి గల నరులచే అస్సరసలచే యువతులచే, ప్రకాశించు భవనములచే విమానము వలె ప్రకాశించు చుండెను. ఆ నగర శోభను చూచి జైమిని మహర్షి ప్రీతి చెందెను. అచటి సరోవరమున స్నానమాడ సంకల్పించెను. దట్టమైన నీడ గలిగి నానాపుష్ప సుగంధి తమగు చెట్టుక్రింద సరస్తీరమున క్షణకాలము విశ్రమించి స్నామాఇ నిత్యకృత్యములను దేవర్షి పితృ తర్పనమును గావించెను. పార్థివ లింగమును నిర్మించి అర్ఘ్య పాద్యాద్యుపచారములచే యధావిధిగా పూజించెను. ధూప ధీపగంధనైవేధ్యములను సమర్పించెను. సుగంధి పుష్పములతో పూజించి నిలుచుంనంతలో ప్రసన్నుడగు శంకరుడు సాక్షాత్కరించెను. నానారత్న ప్రభలను వెదజల్లు ఆ పార్థివ లింగమున ప్రత్యక్షమైన శివుని చూచిన జైమిని భూమిమీద దండము వలె పడి నసమ్కరించి మరల లేచి చేతులు జోడించి ప్రపన్నార్తిహరుడు హరార్ధాంగుడగు హరిని గూర్చి ఇట్లు పలికెను.
జైమిని రువాచ :-
ధన్యోస్మి కృతకృత్యోస్మి దేవదేవ జగత్పతే !
15
యస్త్వం బ్రహ్మదిభి ర్థ్యేయః సాక్షాన్మద్దృష్టి గోచరః | తతః ప్రసన్న స్సవిభు గ్గిరోశో`òస్య నిజం కరమ్
16
శిరస్యాధాయాగదత్తం బ్రూహి పుత్రికి మిచ్ఛసి | తచ్ఛ్రుత్వా వచనం శంబో ర్గైమినిః ప్రత్యువాచ హ
17
దేవం సాంబం సవిఘ్నేశం సకుమారం విలోకయే | తతస్సాంబస్సపుత్రో`òస్య శంకరో దర్శనం గతః
18
పునః ప్రాహ ప్రసన్నాత్మా బ్రూహి పుత్రకి మిచ్ఛసి | అధాస్య జైమినిర్వీక్ష్య కృపాలుత్వం జగద్గురోః
19
స్మయన్నాహ సమీక్షే త్వాం తాండవం నటనంగతమ్ | అధ తద్వాంఛితం కర్తుం భగవానంబికాపతిః.
20
సస్మార ప్రమధాన్సర్వా న్నానా క్రీడా విశారదాన్ | స్మృతమాత్రాస్తు తే సర్వే నన్ది భృంగి పురోగమాః
21
సమాజగ్ముః ప్రజల్పన్తః కౌతూహల సమన్వితాః | సవిఘ్నేశకుమారాంబం తే నమస్కృత్య వాగ్యతాః.
22
తస్థుః ప్రాంజలయో దేవ దేవస్యాజ్ఞా సమీక్షకాః
23
తతో హరే హరాజ్ఞయా విధాయ రూప మద్భుతం ప్రనర్తుముద్యతో బభౌ విచిత్ర వేషభూషణః.
విలోలనాగ వల్లరీద్దకక్ష ఈ షదుత్స్మితాననో లలాట శోభితేన్దులేఖ ఊర్ద్వదోర్ద్వజః
24
సుదృగ్విలిప్త భస్మదేహ రుగ్జితేన్దు చంద్రికో టాకలాప నిస్సర త్సురాప గార్ద్ర విగ్రహః.
లలాటలో చనోజ్వల త్కృశాను తప్త శీతగుః స్రవత్సుధాను జీవితైణ భూపకృత్తి హుంకృతః
25
కుమార వామకేకి చంచు కృష్ణనాగి పుంకృతో గలత్సుధాను జీవదబ్ యోని తండు తుంకృతః
26
ఫణి ప్రభీత విఘ్నరాజ వాహనాఖు చుంకృతో మృగేన్ద్ర నాద భీషతాక్ష తన్మహోక్ష భాంకృతః
ముహుః పదాంబునా ప్రపాత కంపితావనీతలః ప్రకృష్ణ వాద్యహృష్ణ గాత్ర రోమ రాజికంటకః
సురాసురేన్ద్ర మౌళిరత్న భాసి తాంఘ్రి పంకజో గణశకార్తికేయ శైలపుత్రి వీక్షితాననః
27
ప్రవృధ్ద హర్ష భక్తబృన్ద సమ్యగుక్త సంజయః ప్రవృత్త తాండవైర్విభుర్బభౌ దిశో`òవభాసయన్
28
అధానందార్ణవే మగ్నో దృష్ట్వా నృత్యం మహేశితుః జైమినిర్వేదపాదేన స్తవేనాస్తేస్సమాహితః
29
జైమిని పలికెను :-
నేను ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని. దేవదేవా! జగత్పతీ! బ్రహ్మాదిధ్యేయుడవగు నీవు దృష్టి గోచరుడవైతివి. అంతట ప్రసన్నుడైన శంకరుడు తన హస్తమును జైమిని శిరస్సుపై నుంచి పుత్రా! ఏమి కావాలయునో చెప్పుము అని పలికెను. శంకరుని మాటలను విన్న జైమిని మహర్షి పార్వతితో విఘ్నేశకుమారులతో మిమ్ములను దర్శించవలయునని కోరెను. వెంటనే శంకరుడు జైమిని కోరికమేరకు దర్శనమిచ్చి ఇంకనూ ఏమి కావలయునని కోరెను. జగద్గురువగు శంకరుని దయను గుర్తించిన జైమిని విస్మయము చెందుచు తాండవనృత్యమును చేయుచున్న తమను చూడవలయునని కోరుచున్నాను అని పలికెను. జైమిని కోరికను నెరవేర్చేటకు పార్వతీపతి నానాక్రీడావిశారదులగు ప్రమధులనందరిని స్మరించెను. ఇట్లు తలచిన వెంటనే నందిభృంగి మొదలగు ప్రమధ గణములన్నియూ కౌతూ హలముతో పరస్పరము మాటలాడుచు వచ్చిరి. పార్వతీ పరమేశులను విఘ్నేశుని కుమారుని నమస్కరించి వారు దేవదేవుని ఆజ్ఞను ఎదురు చూస్తూ నిలిచిరి. అంతట శంకరుడు ఆ విచిత్ర వేషభూషణములు కలవాడై అద్భుత వేషమును ధరించి నటించుటకు సన్నద్ధుడాయెను. కదలాడు సర్ప కంకణములను ధరించి చిరునవ్వు మోముతో శిరమున ఉన్న చన్ద్రలేఖతో కేశములు మెరయ శోభించు చుండెను. చక్కని కనులు చూపులతో భస్మదేహపు కాంతితో చంద్రుని వెన్నెలను జయించి, జటాకలాపము నుండి బయలు వెడలు గంగతో తడిసిన దేహము కలవాడై లలాట నేత్రము నుండి ప్రకాశించు అగ్నిచేత తపించు చంద్రుడు కలవాడై చంద్రుని నుండి వచ్చిన అమృతముచే బ్రతుకు చున్న లేడి కలవాడుగా నుండెను. కుమార స్వామి వాహనమగు నెమిలి చంచువుచే లాగబడుచున్న సర్ప పుంకృతి కలవాడై ప్రవహించు అమృతముచే జీవించు అబ్జయోని తుండుతుంకృతుడై, సర్పములకు భయపడు వినాయక వాహనమగు ఎలుక చేయు ధ్వని కలవాడై పార్వతి వాహనమగు సింహము గర్జనతో భయమును ప్రకటించు కనులు గలనంది అంభారావుమ కలవాడుగా నుండెను. మాటి మాటికి చేయు పదపాతములచే భూమిని కంపింప చేయుచు ప్రకర్ష వాద్య ధ్వనులచే సంతోషించి పులకాంకురములు కలవాడు దేవ దానవ మకుట కిరీట రత్నరాజిత పాద పద్మునిగా గణశ కుమారస్వామి పార్వతులచే చూడబడు ముఖాంబుజము కలవాడు సంతోషము పెరిగిని భక్తులు చేయు జయ శబ్దములు కలవాడు పెరిగిన తాండవముతో దిక్కులను ప్రకాశింపచేయుచు శివుడు విరాజిల్లెను. శంకరుని నృత్యమును చూచిన జైమిని మహర్షి ఆనందసాగరమున మునిగి వేదపాదస్తవముతో శివుని స్తుతించెను.
విరించి విష్ణుగిరిశ ప్రణతాంఘ్రి సరోరోహే | జగన్మాతే నమస్తుభ్యం దేవి
కాంపిల్యవాసిని! 30
విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేన్ద్ర వందిత | నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం
బ్రహ్మణస్పతే 31
ఉమా కోమల హస్తాబ్జ సంభావితలలాటకమ్ | హిరణ్య మండలం వందే కుమారం
పుష్కర స్రజమ్ 32
శివం బ్రహ్మాది దుర్దర్శం నరః కస్త్సోతు మర్హతి | దర్శనాత్తే స్తుతిర్మే సా చాభ్రా
ద్వృష్టిరివాజని 33
నమశ్శివాయ సాంబాయ నమశ్శర్వాయ శంభ##వే | నమో నటాయ రుద్రాయ
సదసస్పతయే నమః 34
పాదభిన్నాయ లోకాయ మౌలి భిన్నోండభిత్తమే | భుజభ్రాంత దిగంతాయ భూతానాం
పతేయే నమః 35
శంకరాయ నమస్తుభ్యం మంగలాయ నమోనమః | ధనానాం పతయే తుభ్య మన్నానాం
పతయే నమః 36
కాలకాలాయ సోమాయ యోగినే శూలపాణయే | అస్థిభూషాయ శుద్ధాయ జగతాం
పతయే నమః 38
పాత్రే సర్వస్య జగతో నేత్రే సరవదివౌకసామ్ | గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాదం
పతయే నమః 39
ఆత్మాధి పతయే తుభ్యం నమో మీఢుష్టమాయచ | అష్టాంగాయాతి హృద్యాయ క్లిష్ట
భ##క్తేష్ట దాయినే 40
ఇష్టిఘ్నాయ సతుష్టాయ పుష్టానాం పతయే నమః | పంచభూతధి పతయే కాలాధి
పతయే నమః 41
నమ ఆత్మాధిపతయే దిశాం చ పతయే నమః | విశ్వకర్త్రే మహేశాయ విశ్వభ##ర్త్రే
పినాకినే 42
విశ్వహన్త్రే%గ్నినేత్రాయ విశ్వరూపాయ వై నమః | ఈశాన తే తత్పురుష నమో
ఘోరాయ తే సదా 43
వామదేవ నమస్తే%స్తు సద్యో జాతాయవై నమః | భూతి భూషాయ భక్తానాం భీతి భంగ
ప్రదాయినే 44
నమో భవాయ భర్గాయ నమో రుద్రాయ మీఢుషే | సహస్రాంబాయ సాంబాయ
సమస్రాభీషవే నమః 45
సహస్ర బాహవే తుభ్యం సహస్రాక్షాయ మీఢుషే | సుకపోలాయ సోమాయ
సులలాటాయ సుభ్రువే 46
సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే | భవక్లేశని మిత్తోరు భయచ్ఛేద
కృతే సదా 47
నమస్తుభ్యం మషాఢాయ సహమానాయ మృఢుషే | వందే`òహం దేవమానంద
సందోహం లాస్య సుందరమ్ 48
సమస్త జగతాం నాధం సదసస్పతి మద్భుతమ్ | సుజంఘం సుందరం క్షేమం
రక్షోభూతక్షతిక్షమమ్ 49
యక్షేశేష్టం నమామీశ మక్షరం పరమం ప్రభుమ్ | అర్థాలక మవస్త్రార్థ మస్థ్యుత్పల
దలస్రజమ్ 50
అర్తపురం లక్షణం వందే పురుషం కృష్ణ పింగలమ్ | సకృత్ప్రణత సంసార మహాసాగర
తారకమ్ 51
ప్రణమామి తమీశానం జగతస్త స్థుషస్పతిమ్ | ధాతారం జగతా మీశం దాతారం
సర్వసంపదామ్ 52
నేతారం మరుతాం వన్దే జేతార మపరాజితమ్ | తం త్వా మంతకనేతారం వందే
మందాకినీధరమ్ 53
దధాతి విదధద్యోమాం ఇమాని త్రీణి విష్టపా | సర్వజ్ఞం సర్వగం సర్వం కలిం వన్దే
తమీశ్వరమ్ 54
యతశ్చ యజుషా సార్ధ మృచస్సామాని జజ్ఞిరే | భవన్తం సుదృశం వన్దే భూత భవన్తి
చ 55
త్యజన్తీ తర కర్మాణి యో విశ్వాభి విపశ్యతి | హరం సురనియన్తారం హన్తార
మహమానతః 56
యదాజ్ఞయా జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థ్సితః | తం నమామి మహాదేవం
యన్నియోగాదిదం జగత్ 57
కల్పాదౌ భగవాన్దాతా యధా పూర్వమకల్పయత్ | ఈశ్వరం తమహం దేవం యస్య
లింగమహర్ణిశమ్. 58
యజన్తే సహ భార్యాభి రిన్ద్ర జ్యేష్టా మరుద్గణాః | నమామి తమిమం రుద్రం
యమభ్యర్చ్య సకృత్పురా 59
అవాపు స్వ్సంస్వమైశ్వరం దేవాసః పూతరాతయః | తం వందే దేవ మీశానం యం
జపం హృదయాంబుజే 60
సతసం యత శ్శాన్తా స్సంజానానా ఉపాపతే | తదసై#్మ సతతం కుర్మో నమః కలమ
కాంతయే 61
ఉమాకుచ పటోరస్క యాతే రుద్ర శివాతనూః | నమస్తే రుద్ర భావాయ నమస్తే రుద్ర
కేలయే 62
నమస్తే రుద్ర శాన్యైచ నమస్తే రుద్ర మన్యవే | వేదాశ్వర ధనిష్ఠాభ్యాం పాదాభ్యాం
త్రిపురాంతక 63
భాణకార్ముక యుక్తాభ్యాం బాహుభ్యాముత తే నమః | సమస్తే వాసుకి జ్యాయ
విష్కిరాయ చ శంకర 64
మహతే మేరు రూపాయ నమస్తే అస్తు ధన్వనే | నమః పరశ##వే తే`òస్తు శూలాయాతుల
రోచిషే 65
హయగ్రీవాత్మనే తుభ్య ముతోత ఇషవే నమః | ధరాధర సుతాలీలా సరోజాహత
బాహవే 67
తసై#్మ తుభ్య మఘోరాయ నమో అస్మో శ్రవస్యచ | రక్షమా మజ్ఞ మక్షీణ మశిక్షిత
మనన్యగమ్ 68
అనాధం దీన మాపన్నం దరిద్రం నీల లోహితమ్ | దుర్ముఖం దుష్ర్కియం దుష్టం రక్ష
మా మీశ దుర్దశమ్ 69
ఆదృశా తమహం నత్వ దన్యం విందామి రాధసే | భావాఖ్యే నాగ్నినా శంభో రాగద్వేష
మదార్చిషా 70
దయాలో దహ్యమానానా మస్మాక మవితా భవ | పరదారం పరావాసం పరవస్త్రం
పరాశ్రయమ్ 71
హర పాహి పరాన్నం మాం పురుణామన్పురుష్టుత | లౌకికైర్యత్కృతం దుష్టై
ర్నావమానం సహామహే 72
దేవేశ తవ దాసేభ్యో భూరిదా దేహినః | కులోకానా మయత్నానాం గర్విణా మీశ
పశ్యతామ్ 73
అస్మభ్యం క్షేత్ర మాయుశ్చ వసుస్పార్హం తదాభర | యాఞ్చాతో మహతీం లజ్జా
మస్మదీయాం ఘృణానిధే 74
త్వమేవ వేత్సి నస్తూర్ణ మిదం స్తోతృభ్య ఆభర | జాయా మాతా పితా చాన్యే మాం
ద్విషన్త్య మితం కృశమ్ 75
దేహి మే మహతీం విద్యాం రాయా విశ్వపుషా సహ | అదృష్టార్ధేషు సర్వేషు
దృష్టార్ధేష్వపి కర్మసు 76
మేరు ధన్వన్న శ##క్తేభ్యో బలం ధేహి తనూషు నః | లబ్ధానిష్ట సహస్రస్య నిత్యమిష్ట
వియోగినః. 77
హృద్రోగం మమ దేవేశ హరిమాణం చ నాశయ | యే యే రోగాః పిశాచా వా నరా
దేవాశ్చ మామిహ 78
బాధన్తే దేవతా స్సర్వా నిబాధస్వ మహానసి | త్వమేవ రక్షితా స్మాక మన్యః కశ్చిన్న
విద్యతే 79
తస్మాత్స్వీకృత్య స్సర్వా నిబాధస్వ మహానసి | త్వమేవ రక్షితా స్మాక మన్యః కశ్చిన్న
విద్యతే 80
త్తమాయుస్త్వ మితిస్త్వం శ్రీ రుత భ్రాతోత నస్సఖా | యతస్త్వా మేవ దేవేశ కర్తా
సర్వస్య కర్మణః 81
తతః క్షమస్వ తత్సర్వం యన్మాయా దుష్కృతం కృతమ్ | త్వత్సమో న
ప్రభుత్వేన ఫల్గుత్వే న చ మత్సమః 82
తతో దేవ మహాదేవ త్వమస్మాకం తవాస్మ్యహమ్ | సుస్మితం భస్మగౌరాంతం
తరుణాదిత్య విగ్రహమ్ 83
ప్రసన్నవదనం సౌమ్యం గాయే త్వా మనసా గిరా | ఏష ఏవ వరో`òస్మాకం నృత్యంతం
త్వాం సభాపతిమ్ 84
లోకయంత ముమాకాంతం పశ్యేమ శరదశ్శతమ్ | అరోగిణో మహాభాగ విద్వాంసశ్చ
బహు శ్రుతాః 85
భగవంపస్త్వత్ర్పసాదేన జీవేమ శరదశ్శతమ్ | దేవ దేవ మహాదేవ త్వదీయాంఘ్రి
సరోరుహమ్ 87
కామం మధు మయం పీత్వా మోదామ శరద శ్శతమ్ | కీటా నాగా పిశాచా వా యే వా
కే వా భ##వే భ##వే 88
తవ దాసా మహాదేవ భవామశ్శరదశ్శతమ్ | సభాయా మీశ తే దేవ నృత్య వాద్యగల
స్వనమ్ 89
శ్రవణాభ్యాం మహాదేవ శృణుయామ శరద శ్శతమ్ | స్మృతి మాత్రేణ సంసార వినాశన
కరాణి తే 90
నామాని ఖలు దివ్యాని ప్రబ్రవామ శరద శ్శతమ్ | ఇషు సంధాన మాత్రేణ దగ్ధత్రిపుర
ధూర్జటే 91
ఆదిభిర్వ్యాధిభిర్నిత్య అఇతాస్స్యామ శరదశ్శతమ్ | చారు చామీకరా భాసం గౌరీకుచ
పటోరసమ్ 92
కదాను లోకయిష్యామి యువానం విశ్పతిం కలిమ్ | ప్రమధేంద్రావృతం పీత వదనం
ప్రియవాససమ్ 93
సేవిష్యే హం కదా సాంబం సుభాసం శుక్ర శోచిషమ్ | బహ్వేనసం మామకృత
పుణ్యలేశం చ దుర్మతిమ్ 94
స్వీకరిష్యతి కిన్వీశో నీలగ్రీవో విలోహితః | కాలశూలానలాసక్తం భీతం వ్యాకుల
మానసమ్ 95
కదానుద్రక్ష్యతీశో మాం తువిగ్రీవో అనానతః | గాయకా యూయ మాయాత యది
రాగాది లిప్సవః 96
ధనదస్య సఖాయం త ముపాసై#్మ గా తా నరః | స్వస్త్యస్తు సఖి తే జిహ్వే
విద్యాదాతురుమాపతేః 97
స్తవముచ్చతరం బ్రూహి జయతామివ దుందుభిః | చేతయాజన శాన్తస్త్వం నేదం
వేదాఖిలం జగత్ 98
అస్య తృప్త్యఖిలం శంభో ర్గౌరో నతృసితః పిబ | సుగంధించ సుఖస్పర్శం కామదం
సోమ భూషణమ్ 99
గాఢమాలింగ మచ్ఛిత్తం యోషా జారమివ ప్రియమ్
100
మహామయూఖాయ మహా భుజాయ మహా శరీరాయ మహాంబరాయ
మహాకిరీటాయ మహేశ్వరాయ మహో మహీం సుష్టుతి మీరయామి
101
యధా కధంచి ద్రచితాభిరీష త్ర్పసన్నత శ్చారుభి రాదరేణ
ప్రపూజయామి స్తుతిభిర్మహేశ మషాఢ ముగ్రం సమామానమాభిః.
102
నమశ్శివాయ త్రిపురాంతకాయ జగత్త్రయే శాయ దిగంబరాయ
నమో`òస్తు ముఖ్యా య హరాయ భూయో నమో జఘన్యాయ చ బుద్ధ్నియాయ
103
సమో వికారాయ వికారిణ తే నమో భవాయాస్తు భవోద్భవాయ
బహు ప్రజాత్యంత విచిత్ర రూపయతః ప్రసూతా జగతః ప్రసూతిః
104
తసై#్మ సురేశోరు కిరీట నానా రత్నా వృతాష్టా పదవిష్టరాయ
భస్మాంగరాగాయ నమః పరసై#్మ యస్మాత్పరం నా పరమస్తి కించిత్
105
సర్పాధిరాఔషధినాధ యుద్ధ క్షుబ్యజ్జటా మండల గహ్వరాయ
తుభ్యం నమ స్సుందర తాండవాయ యస్మిన్నిదం సంచ విచైతి సర్వమ్106
మురారి నేత్రార్చిత పాద పద్మ ముమాంఘ్రి లాక్షా పరిరక్త పాణిమ్
నమామి దేవం వృషనీల కంఠం హిరణ్యదంతం శుచి వర్ణమారాత్
107
అనంత మవ్యక్త మచింత్యమేకం హరంతమాశాంబర మంబరాంగమ్
అజం పురాణం ప్రణమామి యూప మణోరణీయాన్మహతో మహీయాన్
108
అంతస్థ్స మాత్మాన మం న దృష్ట్వా భ్రమంతి మూఢా గిరి గహ్వరేషు
పశ్చాదుదగ్దక్షిణతః పురస్తా దధస్స్విదాసీ దుపరిస్విదాసీత్
109
ఇమం న మామీశ్వర మిందుమూలే శివం మహానన్ద మశోక దుఃఖమ్
హృదంబుజే తిష్ఠతి యః పరాత్మా యతశ్చ సర్వాః ప్రదిశో దిశశ్చ110
రాగాది కాపట్య సముద్భవేన భ్రాన్తం భవాఖ్యేన మహామయేన | విలోక్య మాం పాలయ
చన్ద్రమౌలీ భిషక్తమం త్వా భిష జా శృణోమి
111
దుఃఖాంబురాశిం సుఖలేశహీనం అస్పృష్ఠ పుణ్యం బహుపాతకం మామ్
మృత్యోః కరస్థం భవరక్షభీతం పశ్చాత్పురస్తా దధరాదుదస్తాత్112
గిరీన్ద్రజా చారు ముఖావలోక సుశీతయా దేవ తవైవ దృష్ట్వా
వయం దయాపూరితయైన పూర్ణ మపో న నావా దురితా తరేమ
113
అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నముత్క్రోశ మనల్పరాగమ్
మామక్షమం పాహి మహేశజుష్ట మోజిష్ఠయా దక్షిణయేవ రాతిమ్
114
స్మరన్పురా సంచిత పాతకాని ఖరం యమస్యాపి ముఖం యమారే !
బిభేమి మే దేహి యధేష్ట మాయు ర్యదిక్షతాయుర్యది వా పరేతః
115
సుగంధి భిస్సుందర భస్మరాగై రనంత భోగైర్మృదులైరఘోరైః
ఇమం కదాలింగతి మాం పినాకీ స్థిరేభి రంగైః పురురూప ఉగ్రః
116
క్రోశన్త మీశం పతితం భవాభ్ధౌ నాకస్థ మండూక మివాతి భీతమ్
కదాను మాం రక్షతి దేవదేవో హిరణ్య రూప స్సహిరణ్య సందృక్
117
చారుస్మితంవ చన్ద్ర కలావతంసం గౌరీ కటాక్షారుహయుగ్మనేత్రమ్
ఆలోకయిష్యామి కదాను సాంబ మాదిత్య వర్ణం తమసః పరస్తాత్
118
ఆగచ్ఛతానాది ముముక్షవో యే యూయం శివం చింతయతాంతరే%జ్జె
ధ్యాయన్తి ముక్త్వర్థమముం హి నిత్యం వేదాన్త విజ్ఞాన సునిశ్చితార్థాః
119
ఆయాత యూయం భవతాధిపత్యే కామం గుహేశం గిరిశం యజధ్వమ్
ఏవం పురాభ్యర్చ్య హిరణ్య గర్భో భూతస్య జాతః పతిరేక ఆసీత్
120
ఏకాయనం తే విపులాం శ్రియం తే శ్రీకంఠమేనం సుకృతా నమంతామ్
శ్రీమానయం శ్రీపతి వంద్యపాదః శ్రీణాముదారో ధరుణో రయీణామ్
121
సుపుత్ర కామా అపి యే మనుష్యా యువాన మేనం గిరిశం యజంతామ్
యతస్స్వయం భూర్జగతో విధాతా హిరణ్య గర్భస్సమవర్తతాగ్రే
122
అలం కిముక్తై ర్భహుభి స్సమీహితం సమస్త మస్యాశ్రయణన సిద్ధ్యతి
పురైన మాశ్రిత్య హి కుంభ సంభవో దివా న నక్తం పలితోయువాజని
123
అన్యత్పరిత్యజ్య మమాక్షిభృంగాః సర్వం సదైవం శివమాశ్రయధ్వమ్
ఆమోదవానేష మృదు శ్శివాయ స్వాదుః ష్కలాయం మధుమాం ఉతాయమ్
124
భవిష్యసి త్వం ప్తరిమాన హీనో వినిర్జితాశేష నరామరశ్చ
నమశ్చ తే వాణి మహేశ##మేనం స్తుహి శ్రుతం గర్త సదం యువానమ్
125
యద్యన్మనశ్చిన్తయసి త్వమిష్టం తత్త ద్భవిష్యత్యఖిలం ధ్రువం తే
దుఃఖేన వృత్తిం విషయే కదాచి ద్యక్ష్యా మహే సౌమనసాయ రుద్రమ్
126
అజ్ఞాన యోగాదప చారకర్మ యత్పూర్వ మస్మాభిరనుష్ఠుతం తే
తదేవ సోఢా సకలం దయాలో పితేవ పుత్రాన్ప్రతి నో జుషస్వ
127
సంసారాఖ్య క్రుద్ధ సర్పేణ తీవ్రై రాగద్వేషోన్మాద లోభాదిదన్తైః
దష్టం దృష్ట్వా మాం దయాలుః పినాకీ దేవ్నస్త్రాతా త్రాయతా మప్రయచ్ఛన్
128
ఇత్యుక్త్వాతే యే సమాధేర్నమంతే రుద్ర త్వాం తే యాంతి జన్మాహి దష్టాః
సంతో నీలగ్రీవ సూత్రాత్మనాహం తత్త్వా యామి బ్రహ్మణా వందమానః
129
భవాధి భీషణ జ్వరేణ పీడితాన్మహోమయా నశేష పాతకాల యా నదూరకాలలోచనాన్
అనాధ నాధ తే కరేణ బేషజేన కాలహా ఉదూషణో వసేమహే మృశస్వ శూరరాధసే
130
జయేమ యేన సర్వమేత దిష్ట మష్ట దిగ్గణం భువస్థ్సలం దివస్థలం నభస్థ్సలం చ
తద్గతమ్
య ఏవ సరవదేవదానవ ప్రభు సభాపతిస్సనో దదాతు తం రయిం పురుం పిశంగ
సందృశమ్ 131
నమో భవాయ తే హరాయ భూతి భాసితోరసే నమో భవాభిభూతి భీతి సంగినే పినాకినే
నమశ్శివాయ విశ్వపాయ శాశ్వతాయ హేలయే న యస్యహన్యతే సఖా న జీయతే
కదాచన 132
సురపతి పతయే నమోనమః ప్రజాపతి పతయే నమోనమః | క్షతిపతి పతయే
నమోనమో%ంబికా పతయ ఉమాపతయే నమో నమః
133
వినాయకం నిత్యం ప్రణాతారతినాశం కవిం కవీనా ముపమశ్రవస్తమమ్
134
దేవా యుద్ధేయాగే విప్రా స్త్వా మాహ్వాయంతి భువనే మనుజాః
ద్వయం విదంతి స్కన్దం వందే సుబ్రహ్మణ్యోం సుభ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోమ్
135
నమశ్శివాయై జగదంబికాయై శివప్రియాయై శివవిగ్రహాయై
సముద్భభూవాద్రిపతే స్సుతాయా చతుష్కపర్దా యువతిస్సుపేశాః
136
హిరణ్య వర్ణాం మణినూపురాంఘ్రిం ప్రసన్నవక్త్రాం శుకపద్మహాస్తామ్
విశాల నేత్రాం ప్రణమామి గౌరీం వచో విదం వాచ ముదీర యంతీమ్
137
నమామి మేనా తనయామయేయా మిమా ముమాం కాంతి మతీ మమేయామ్
కరోతి యా భూతి సితౌ స్తనౌ ద్వౌ ప్రియం సఖాయం పరిషస్వజానా
138
కాంతా ముమాకాంతని భాంగకాంతి భాంతా ముపాత్తానతహర్య జేన్ద్రామ్
నతో`òస్మి యాస్తే గిరిశస్య పార్శ్వే వివ్వాని దేవీ భువనాని
చష్టే 139
వందే గౌరీం తుంగపీన స్తనీం తాం చంద్రాచూడాం క్లిష్ట సర్వాంగరాగామ్
యైషా దుఃఖి ప్రాణినా మాత్మకాన్తిం దేవీం దేవీం రాధసే చోదయన్తీమ్
140
ఏనాం వందే దీన రక్షా వినోదాం మేనాకన్యాం మానదానందధాత్రీమ్
యా విద్యానాం మంగలానాం చ వాచామేషా నేత్రీరాధసే సూనృతానామ్
141
సంసారతా పోరు భయాపహన్త్రీ భవాని భోజ్యాభరణౖకభోగే
ధియం వరాం దేహి శివే నిరర్గలాం యయాతి విశ్వాదురి తా తరేమ
142
శివే కధం త్వత్సమతా క్వ దీయతే జగత్కృతిః కేలిరయం శివః పతిః
హరిస్తు దాసో%ను చరీందిరా శచీ సరస్వతీ వా సుభగా దదిర్వసు
143
బ్రహ్మ విష్ణు మహేశులచే నమస్కరించ బడు పాదపద్మములు కలదానా. కాంపిల్య వాసినీదేవి! జగన్మాతా! నీకు నమస్కారము. విఘ్నేశవిధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేన్ద్ర వందితా! బ్రహ్మాధిపతీ గణశా! నీకు నమస్కారము. పార్వతీదేవి సుకుమార హస్తములచే లాలించబడు ముఖములు కల హిరణ్య మండలధారి పద్మమలాలంకృతుడగు కుమారస్వామిని నమస్కరించు చున్నాను. బ్రహ్మాదులకు చూడ శక్యము కాని శివున ఎవడు స్తుతించగలడు. నీదర్శనము వలన మేఘమునుండి వర్షము వలె స్తుతి నానుండి ప్రసరించుచున్నది. శివునకు సాంబునకు, శర్వునకు, శంభును, నటునకు, రుద్రునకు సదసస్పతికి నమస్కారము. పాదభిన్న లోకును మౌలి భిన్నాండభిత్తికి, భుజభ్రాంత దిగంతునకు భూతపతికి నమస్కారము. శంకరునకు మంగలునకు ధనపతికి మన్ పతికి నమస్కారము. క్వణ న్నూపురయుగ్మునకు, విల సత్కృత్తి వాసునకు ఫణీన్ద్ర మేఖలునకు పశుపతికి నమస్కారము. కాలవాలునకు సోమునకు యోగికి శూలపాణికి అస్థి భూషునకు, శుద్ధునకు జగత్పతికి నమస్కారము. సర్వ జగత్పాలకునకు సర్వ దేవనాయకునకు గోత్రపతికి మీఢుష్టమునకు నమస్కారము. అష్టాంగునకు, అతి హృద్యునకు పుష్పపతికి, పంచభూతాధి పతికి కాలాధి పతికి నమస్కారము. ఆత్మాధిపతికి దిక్పతికి విశ్వకర్తకు, మహేశునకు విశ్వభర్తకు పినాకికి నమస్కారము. విశ్వహంతకు, అగ్నినేత్రునకు విశ్వరావునకు ఈశానునకు తత్ఫురుషునకు భూతిభూషునకు, భక్త భీతిహరునకు నమస్కారము. భవునకు, భర్గునకు, రుద్రునకు, సహస్రాంబునకు, సాంబునకు, సహస్రబీషునకు సహస్ర బాహువనకు, సహస్రాక్షునకు, సుకపోలునకు, సోమునకు సులలాటునకు సుభ్రువునకు, సుదేహునకు నమస్కారము. సుమృడీకునకు, భవక్లేశనిమిత్త ఉరుభయ చ్ఛేదవారికి ఆషాఢునకు, సహమానునకు, నమస్కారము. ఆనంద సందోహునకు, లాస్య సుందరునకు, సమస్త జగన్నాధునకు, సదసస్పతికి, అద్భుతునకు నమస్కారము. సుజంఘనకు, సుందరుని క్షాముని, రక్షభూతనాశదక్షుని, యక్షీశప్రియుని, అక్షరుని, పరమ ప్రభుని నమస్కరించు చున్నాను. అర్థాలకుని, అవస్త్రార్థుని, అస్థ్యుత్పల దలమాలుని, అర్థ పుంలక్షణుని, కృష్ణ పింగల పురుషుని నమస్కరించు చున్నాను. ఒకసారి ఆశ్రయించిన వారిని సంసార సాగరము నుండి తరింప చేయు వానిని, స్థావర జంగమనాధుని ఈ శానుని నమస్కరించు చున్నాను. జగద్ధాతను, సర్వ సంపద్ధాతను, మరున్నేతను, సకలేతను, అపరాజితుని, అంతకనేతను, మందాకినీ ధరుని నమస్కరించు చున్నాను. ఋగ్యుజుస్సామోద్ధవస్థానుని భవుని, సునేత్రుని భూత భవ్యభవత్స్వరూపుని ఇతరకర్మలను విడిచి విశ్వమును సమీక్షించు వానిని హరుని సురనియన్తను అహంకారహంతను నమస్కరించు చున్నాను. నారాయణుడు ఈ జగత్తునంతటిని వ్యాపించి యుండు టను ఆజ్ఞ ఇచ్చిన వారిని జగన్నియన్తను నమస్కరించు చున్నాను. కల్పాది యందు ఈ జగత్తును యధా పూర్వకముగా సృజించిన వానిని ఈశ్వరుని అహర్నిశము లింగరూపముగా పూజింప బడు వానిని రుద్రుని నమస్కరించుచున్నాను. ఒకసారి అర్చించినంతనే ఇంద్రాది దేవతలకు సకలైశ్వర్యములనిచ్చిన వానిని నమస్కరించు చున్నాను. శాంతులు సమ్యక్ జ్ఞానులగు యతులచే హృదయాంబుమున సతతము ఉపాసించబడువానిని కమల సన్నిభుని నమస్కరించుచున్నాను. ఉమాకుచపటోరస్క శివతనువునకు, రుద్రభావునకు రుద్ర కేళికి నమస్కారము. రుద్ర శాంతునకు, రుద్ర మన్యునకు, వేదాశ్వరధనిష్టములగు పాదములు బాణ కార్ముక యుక్తములగు బాహువులుకలవానికి నమస్కారము. వాసుకిజ్యునకు, విష్కిరునకు, శంకరునకు, మహామేరు స్వరూప ధన్వికి నమస్కారము. పరశురూపునకు శూల రూపునకు, అతుల రోచిష్కునకు, హయగ్రీవాత్మకును నమస్కారము. దానవస్త్రీహార హారికి, ఇతరాస్త్ర ధారికి నమస్కారము. పార్వతీ లీలాపద్మ అహత బాహువునకు, అఘోరునకు నమస్కారము. అజ్ఞుని ఆక్షీణుని అశిక్షితుని, అనన్య గతిని, అనాధుని, దీనుని ఆపన్నుని, దరిద్రుని నీలలోహితుని, దుర్ముఖుని, దుష్క్రియుని, దుష్టుని, దుర్దశుని అగునన్ను రక్షించుము. నిన్ను తప్ప ఇతరుల నారాధించుట నా పుట్టుక నుండి నాకు తెలియదు. భావాగ్నిచే, రాగద్వేష మద జ్వలలచే దహించబడు మాకు రక్షకుడవు కమ్ము. పరదారరతుని, పరావాసుని, పరవస్త్రుని, పరాశ్రయుని పరాన్నుని నన్ను పురునామా! పురుష్టుతా! కాపాడుము. దుష్టులగు లౌకికుల చే చేయబడు అవమానమును సహించలేము. కావున నీ దాసులగు మాకు క్షేత్రమును ఆయువును ధనమును ప్రసాదించుము. యాచించు మేము పొందు బిడియము నీకు తెలుసు. కావున నిన్ను స్తుతించు వారికి పరిపూర్ణతను ప్రసాదించుము. తల్లి తండ్రి భార్య ఇతరులు నన్ను అమితముగా ద్వేషించు చున్నారు. కావున నాకు మహావిద్యను, ధనము ధాన్యమును ప్రసాదించుము. అదృష్టార్థములు దృష్టార్థములగు సర్వ కర్మలందు శక్తి హీనులమగు మాకు శరీరము లందు బలమును నింపుము. అనిష్టములను పొంది ఇష్టములను పోగొట్టుకొనిన మా హృద్రోగమును నశింప చేయుము. నన్నుబాధించు పిశాచములను నరులను దేవతలను మహాత్ముడవగు నీవు బాధించుము. మాకు నీవు తప్ప వేరొక రక్షకుడు లేడు. కావున ఓ దేవేశా నీ కృత్యమగు మారక్షణను చేయుము. పార్వతీ పతీ! నీవే తల్లివి తండ్రివి తాతవు. నీవే ఆయువు బుద్ధిని శ్రీవి సోదరుడవు. మిత్రుడవు. అన్ని కర్మలకు కర్త నీవే. కావున నేను చేసిన దుష్కృతములను క్షమించుము. నీసాటి రాజు నాసాటి నీచుడు మరియొకరు లేరు. కావున నీవు నా వాడవు. నేను నీవాడను. సుస్మితము అగు నీ రూపమును గానము చేసెదను. ఎప్పుడు సభాపతిగా నృత్యము చేయుచున్న నిన్ను నూరెండ్లు రోగహీనులమై విద్వాంసులమై శాస్త్రార్థ జ్ఞానము కలిగి నూరు సంవత్సరములు బ్రతుకవలయును. భార్యా సహితులమై బంధు సమితులమై నీ తాండవామృతమును పానము చేయుచు నూరు వత్సరము ఆనందించవలయును. దేవదేవా! మహాదేవా! నీ పాద పద్మ మకరందమును యధేచ్ఛగా పానము చేయుచు చాలా సంవత్సరములు ఆనందించవలయును. కీటములుగా కాని నాగులుగా కాని పిశాచములగా కాని ఏదో ఒక ప్రాణి రూపమున నీదాసులముగా చాలా సంవత్సరము లుండవలయును. ఓ దేవా! నీ సభలో నృత్య వాద్యగలధ్వని శ్రవణములచే చాలా సంవత్సరములు వినుచుండ వలయును. స్మరణ మాత్రముననే సంసార వినాశకరములగు నీ దివ్య నామములను చాలా సంవత్సరములు పలుకుచుండ వలయును. స్మరణ సంధాన మాత్రముననే త్రిపురములను దహించిన ధూర్జటీ! మేము ఆధివ్యాదులచే చాలా సంవత్సరములు గెలవక ఉండవలయును. చారు చామీకరా భాసుడు గౌరీకుచ పటోరసుడు విశ్పతి కలియగు నిన్నెపుడు చూచెదను. ప్రమధ గణాధిపతులచే కూడియున్న పీతవదనుడు, ప్రియవాససుడు, సుభాసుడు శుక్రశోభితుడగు సాంబశివుని ఎపుడు సేవించగలను. చాలా పాపములను చేసిన వాడను, పుణ్యలేశమును కూడా చేయని వనిని దుర్గతిని అగునన్ను నీలగ్రీవుడు విలోహితుడగు శిశుడు స్వీకరించునా? కాల శూలానలాసక్తుని భీతుని వ్యాకులమానసుని నన్ను నీలగ్రీవుడు అగునతడు నన్నెపుడు కటాక్షించునో! ఓ గాయకులారా? మీరు తాగతాళాదులను నేర్వగోరినచో మీరొచ్చి కుబేర మిత్రుని సేవించుడు. ఓ జిహ్వా నీకు శుభమగుగాక. విద్యాదాతయగు ఉమాపతి స్తోత్రమును పెద్దగా పఠించుము. ఓ మనసా నీవీ సకల జగత్తును తెలియవు. శంకరునికి తృప్తిని కలిగించుటే ఓ చిత్తమా? జారుని యువతివలె గాడముగా ఆలింగనము చేసుకొనుము. మహామయూఖునకు మహాభుజునకు, మహాశరీరునకు, మహాంబరునకు, మహాకిరీటునకు మహేశ్వరునకు చక్కని స్తుతిని పలికెదను. ఏదో విధముగా రచించబడిన ప్రసన్నములగు చక్కని స్తుతులచే అషాఢుని ఉగ్రుని మహేశుని పూజించెదను. శివునకు త్రిపురాంతకునకు, జగత్త్రయేశునకు, దిగంబరునకు నమస్కారము. ముఖ్యునకు వికారికి భవునకు భవోద్ధరునకు నమస్కారము. బహుప్రజ! అత్యంత విచిత్ర రూప! నీనుండియే ఈ జగత్తు ప్రభవించినది. ఏదవతా మకుటతట ఘటిత కిరీట రత్న శోభిత పాద పద్మునకు, భస్మాంగరాగునకు నమస్కారము. నీకంటే పరము అపరము లేదు. సర్పరాజు చంద్రుడు పరస్సరము నీ శిరస్సునందు త్తమ స్థానము కొరకు యుద్ధము చేయగా చిక్కుపడిన జటా మండలముకల వానికి? సకల జగత్తును లయము చేసుకొను సుందర తాండవునకు నమస్కారము. మురారి నేత్రార్చిత పాద పద్ముని, ఉమాచరణ లాక్షా పరిరక్షా పాణిని, నీలకంఠుని హిరణ్య దంతుని శుచి వర్ణుని నమస్కరించు చున్నాను. అనంతుని అవ్యక్తుని, అచింత్యుని, ఏకుని దిగంబరుని, అంబరవర్ణుని, అజుని, పురాణుని, అణువులలో అణువును, మహత్తులలో మహత్తును నమస్కరించు చున్నాను. అంతర్యామిని, ఆత్మ స్వరూపుని, అఉని, చూడజాలక మూర్ఖులు గిరి గహ్వరములందు భ్రమించు చుందురు. పశ్చిమమున ఉత్తరమున దక్షిణమున పూర్వమున క్రింద మీద అంతటా ఉంటివి. ఓ చంద్రమౌళీ! మహానన్ధ స్వరూపుని శోక దుఃఖ రహితుని ఈశ్వరుని హృదయాంబుజమున పరాత్మగా నివసించు వానిని సకల దిక్కులను విదిక్కులను మూలమగు వానిని నమస్కరించు చున్నాను. రాగకాపట్యము వనల పుట్టిన మహామయమగు సంసారముతో భ్రమించు నన్ను చూచి కాపాడుము. ఉత్తమవైద్యుడవని వైద్యునిచే వినుచున్నాను. దుఃఖ జలరాశిని, సుఖలేశహీనుని, పుణ్యస్పర్శలేని వానిని, బహుపాతకుని, మృత్యువు చేతిలోనున్న వానిని భవరక్షణకై భీతుని ముందు వెనుక ఊర్థ్వ భాగమున అధోభాగమున చూడుము. పార్వతీ సుందర ముఖావలోకనముచే చల్లబడిన దయాపూరిత మగు నీ చూపను నావచే మేము దురిత సాగరమును దాటవలయును. అపార సంసార సముద్ర మధ్యమున మునిగిన వానిని ఉత్ర్కోశించు వానిని బహురాగములు కలవానిని అసమర్థుడనగు నన్ను ఓ ఇష్టమగు దక్షిణచే సేవించబడు వానిని కాపాడుము. పూర్వ జన్మ సంచిత పాతకములను స్మరించి కఠినమగు యముని ముఖమునకు భయపడుచున్నాను. కావున క్షీణాయువునకు, లేదా గతాయువునకు నాకు ఆయుష్యమునిమ్ము. సుగంధులు సుందర భప్మరాగములుగల అనంత భోగములు కలవి మృదులములు సౌమ్యములు, స్థిరములు అగు తన అవయవములచే పురు రూపుడు ఉగ్రుడగు శివుడు నన్ను ఎపుడాలింగనము చేసుకొనును? భవసాగరమున పడి బిలమున పడిన మండూకము వలె క్రోశించుచున్న నన్ను హిరణ్యరూపుడు హిరణ్యనేత్రుడు అగు దేవదేవుడు నన్నెపుడు కాపాడును? చారుస్మితుని, చంద్రకలావతంసుని గౌరీ కటాక్షారుహయుగ్మనేత్రుని, ఆదిత్యవర్ణుని, తమమునకు పరుడగు సాంబుని ఎపుడు చూడగలను? అనాది ముముక్షువులై మీరు రండు మీ హృదయ పద్మమున శివుని ధ్యానించుడు. వేదాన్త విజ్ఞాన సునిశ్చితార్ధులు ఈ శివునే మోక్షము కొరకు ఎల్లపుడూ ధ్యానించు చుందురు. మీరందరూ రండున. ఆధిపత్యమును పొందుడు. యధేచ్ఛముగా గుహేశుడగు శంకరుని పూజించుడు. పూర్వమిట్లే బ్రహ్మ పూజించి సకలప్రాణి నాధుడాయెను. పుణ్యాత్ములారా? శ్రీఆయతనమగు శ్రీకంఠుని నమస్కరించుడు. ఈ శంకరుడు శ్రీమంతుడు శ్రీపతి వన్ధ్యపాదుడు. శ్రీలకు ఉదారుడు. వేగధారి ఇతనే. సుపుత్రనాములైననూ యువకుడగు శంకరుని పూజించును. జగద్విధాత యగు హిరణ్య గర్భుడు మొదటి ఇతని నుండే పుట్టెను. ఎక్కువగా చెప్పనేల? శంకరుని ఆశ్రయించుటచే సకలాభీష్టములు నెరవేరును. పూర్వము అగస్త్య మహర్షి శంకరుని పూజించియే జరావర్జితుడగు యువకుడాయెను. కామనల తుమ్మెదలను ఇతరముల నొదిలి ఎపుడు శివునే ఆశ్రయించ వలయును. ఇతను అపూర్వ సుగంధము కలవాడు. సుకుమారుడు. స్వాదువు మకరందము కలవాడు. ఈ మహేశ్వరుని నీ వాక్కు నమస్కారమును. పలికిన సాటిలేని వాడవు సమస్తరామరులను యించువాడవగుదువు. కావున గర్త సదుడగు యువకుని స్తుతించుము. నీవు మనసు చే చింతించిన దంతయూ సిద్ధించగలదు. దుఃఖ విషయములందు ఎపుడూ ప్రవర్తించకుము. సౌమనస్యము కొరకు రుద్రుని పూజించెదము. పూర్వము అజ్ఞానము వలన నీయెడ చేసిన సకలాపచారములను దయాలుడవగు నీవు పుత్రులను తండ్రివలె క్షమించుము. సంసారమును క్రోధ సర్పము తీవ్రములగు రాగద్వేషము ఉన్మాదలోభాదిదంతములచే కరవబడిన నన్ను దయాలుడగు పినాకి రక్షించుగాక. ఇట్లు స్తుతించి సమాధి అంతమున నిన్ను నమస్కరించువారు జన్మ సర్పదష్టులైననూ నిన్ను చేరెదరు. నీలగ్రీవ సూత్రాత్మచే నేను బ్రహ్మచే నమస్కరించు బడువాడనే నిన్ను చేరెను. సంసారమను మనోవ్యాధియను భీషణ జ్వరముతో పీడితులను మహామయులను అశేష పాతకాలయాన దూర కాలలోచనులకు అనాధ నాధుడవగు నీకరముచే ఔషధమును పొంది నీలో నివసింతుము. సర్వదేవ దానవ ప్రభువగు ఈశానుడు బలమును, వేగమును సూక్ష్మదృష్టిని ప్రసాదించిన అష్టదిక్పాలకులను, దివస్థ్సలమును, భూస్థలమును, నభసప్థలమును అన్నిటిని జయించగలము. భవునకు హరునకు, భూతిభాసితో రస్కునకు భవాభిభూతి భీతి సంగికి, పినాకికి, శివునకు, విశ్వపాలునకు, శాశ్వత హేలకు నమస్కారము. ఇతని సేవకుడు చంపబడడు గెలువబడడు. సురపతి పతికి, ప్రజాపతి పతికి, క్షిపతిపతికి, అంబికాపతి పతికి, ఉమాపతికి నమస్కారము. వినాయకుని, నమస్కరించు మస్తకముల కిరీట సంఘిటిత దేవమస్తకుని, ప్రణతార్తి నాశనుని, కవులకు కవిని నమస్కరించు చున్నాను. యుద్ధమున దేవతలు, యాగమున విప్రులు లోకమున మనుజులు నిన్ను పలిచెదరు. కుమార స్వామి వలన ఇహ పరములను పొందెదరు. కావున సుబ్రహ్మణ్యుని నమస్కరించు చున్నాను. శివకు జగదంబికకు, శివప్రియకు శివ విగ్రహకు నమస్కారము. చతుష్కపర్ధయువతి సుపేశగా ఈమెయే హిమవంతునికి పుత్రికగా జన్మించెను. హిరణ్యవర్ణను, మణనూపురాంఘ్రిని, ప్రసన్నవక్త్రను, శుకపద్మహస్తను, విశాల నేత్రను, వేదార్థములను బోధించు గౌరిని నమస్కరించు చున్నాను. మేనాతనయకు, వేదార్థములను బోధించు గైరిని నమస్కరించు చున్నాను. మేనాతనయకు అమేయను కాంతిమతిని, సఖుడు ప్రియుడగు శంకరుని ఆలింగనము చేసుకొని స్తనములను భూతిసితములుగా చేసుకొను పార్వతీ దేవిని నమస్రించు చున్నాను. శంకరుని శరీర కాంతిచే ప్రకాశించు తలవంచిన మృగరాజము కలది, శంకరుని పార్శ్వమున నివసించునది సకల జగత్తులను క్రియాశీలముల నాచరించు పార్వతీదేవిని నమస్కరించు చున్నాను. తుంగపీనస్తని, చంద్రచూడ, క్లిష్ట సర్వాంగరాగ, దుఃఖించు ప్రాణులకు ఆత్మకాన్తి నొసగి ఆరాధింపచేయు పార్వతిని నమస్కరించు చున్నాను. దీన రక్షా వినోదము కలది, ఆనందదాత్రి సర్వవిద్యలకు, శుభములకు వాక్కులకు అధినేత్రి సూనృతప్రవర్తకురాలు మేనా పుత్రికయగు పార్వతిని నమస్కరించు చున్నాను. సంసారము వలన కలుగు ఘోర తాపమును హరించునది ఆందరిచే ఆనందమును అనుభవింప చేయు ఆభరణౖక భోగురాలగు ఓ పార్వతీ దేవీ! నిరంతరము ఉత్తమమగు బుద్ధిని ప్రసాదించుము. అ బుద్ధిచే అన్ని దురితములను తరించెదను. ఓ పార్వతీ నీసములు ఈలోకమున ఎవరు కలరు? నీకు ప్రపంచ సృష్టి వినోదము. శివుడు నీ భర్త. శ్రీహరి దాసుడు. లక్ష్మి అనుచరురాలు. శచీదేవి, సరస్వతి పరిచారికలు. మాకు ధనసంపదల నిమ్ము.
వసురువాచ:-
ఇత్యనేన స్తవేనేశం స్తుత్వేత్థం స మహామునిః | స్నేహోశ్రుపూర్ణనయనః ప్రణనామ సభాపతిమ్
144
ముహుర్ముహుః పిబన్నీశం తాండవామృత మంగలమ్ | సర్వాన్కామానవాప్యాంతే గాణపత్య మవాపహ
145
ఇమం స్తవం జైమినినా వచోదితం ద్విజోత్తమో యః పఠతేహ భక్తితః
తమిష్ట వాక్సిద్ధి మతిద్యుతిశ్రియః పరిష్వజంతే జనయో యధాపతిమ్
146
మహీపతిర్యస్తు యుయుత్సురాదరా దముం పఠంత్యస్య తధైవ సాదరాత్
ప్రయాంతి శ్రీఘ్రం ప్రమదాంతకాంతికం భియం దధానా హృదయేషు శత్రవః.
147
త్రైవర్ణికేష్వన్య తమో య ఏనం నిత్యం కదాచిత్పఠతీశ భక్తితః | కలేవరాన్తే శివపార్శ్వవర్తీ నిరంనస్సామ్య ముపైతి దివ్యమ్
148
లభ##న్తే పఠన్తో మతిం బుద్ధి కామా లభ##న్తే తధైవ శ్రియం పుష్టికామాః
లభ##న్తే హి ధాన్యం నరా ధాన్యకామా లభ##న్తే హ పుత్రాన్నరాః పుత్రకామాః
149
పాదం వాప్యర్థ పాదం వా శ్లోకం శ్లోకార్థమేవ వా | యస్తు ధారయతే నిత్యం శివలోకం సగచ్ఛతి
150
యత్ర నృత్తం శివశ్చక్రే తాండవం తత్థ్సలం శుభే | పుణ్యాత్పుణ్యతరం తీర్థం తత్ర స్నాత్వా విముచ్యతే
151
యస్తత్ర కురుతే శ్రాద్ధం పితృణాం మనుజోత్తమ | పూర్వ జాన్స నయేత్స్వర్గం నాత్ర కార్యా విచారణా
152
గాం సువర్ణం ధరాం శయ్యాం వస్త్ర మాతపవారణమ్ | పానమన్నం ద్విఏ దద్యా త్తత్ర త త్సర్వ మక్షయమ్
153
ఏత దాఖ్యానకం పుణ్యం పుండరీక పురోద్భవమ్ | శృణుయాచ్ఛ్రవయేద్వాపి సో`òపి రుద్రప్రియో భ##వేత్
154
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణ బృహదుపాఖ్యానే ఉత్తర భాగే
వసుమోహినీ సంవాదే త్య్రంబకేశ్వర మాహాత్మ్యే
వేదపాదస్తవో నామ త్రిపస్తతి తమో%ధ్యాయః
్హ వసువు పలికెను :-
ఇట్లు జైమిని మహర్షి శివుని స్తుతించి ఆనందాశ్రుపూర్ణ నేత్రుడై శంకరునికి నమస్కరించెను. తాండవామృత మంగలుడగు శంకరుని మాటి మాటికి నేత్రలముచే పానముచేయుచు సకలాభీష్టములను పొంది అంతమును గణాధిప్యతమును పొందెను. జైమిని చే చేయబడిన ఈ స్తోత్రమును భక్తితో పఠించు వానికి వాక్సిద్ధి మతి సంపదలు ప్రజలు రాజును వరించునట్లు వరించును. యుద్ధము చేయగోరు రాజు ఈస్తోత్రమును పఠించినచో అనతి శత్రువులు యమలోకమును చేరెదరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఈ స్తోత్రమును భక్తిచే పఠించినవారు దేహాన్తమున శివపార్శ్వవర్తియై శివసామీప్యమును పొందెదరు. ఈ స్తోత్రమును పఠించువారు బుద్ధి కాములైనచో బుద్ధిని, పుష్టికాములు పుష్టిని, ధాన్యకాములు ధాన్యములు, పుత్రకాములు పుత్రులను పొందెదరు. ఈ స్త్రోములోని ఒకశ్లోమును కాని, శ్లోకార్థను కాని పాదమును కాని, పాదార్థమును కాని ప్రతినిత్యము పఠించు వారు శివలోకమును చేరెదరు. శివుడు తాండవము చేసిన ప్రదేశము పరమ పవిత్రమగు ప్రదేశము. ఇచట స్నాననము చేసిన వారు ముక్తిని పొందెదరు. ఇచట పితరులను శ్రాద్ధమునాచరించినచో పితరులను తరింప చేయును. ఇచట గోవును, కాంచనమును, భూమిని, శయ్యను, వస్త్రమును, ఛత్రమును, జలమును, అన్నమును, బ్రాహ్మణునకు దానమును గావించినచో అది అంతయూ అక్షయమగును. పుండరీకపురమున జరిగిన ఈ కథను వినిన వారు, వినిపించినవారు కూడా రుద్ర ప్రియులగుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున త్య్రంబకేశ్వర మాహాత్మ్యమున
వేదపాదస్తవమను డెబ్బది మూడవ అధ్యాయము