Sri Naradapuranam-3    Chapters    Last Page

చతుస్సప్తతి తమోధ్యాయ : డెబ్బది నాలుగవ అధ్యాయము

గోకర్ణ మహాత్మ్యమ్‌

మోహిన్యువాచ :-


పుండరీక పురాఖ్యానం త్వయా ప్రోక్తం శ్రుతం గురో | గోకర్ణస్యాద్య తీర్థస్య మమాత్మ్యం మే సమాదిశ 1
మోహిని పలికెను :-
గురువర్యా! మీరు చెప్పిన పుండరీక పురోపఖ్యానమును వింటిని. ఇపుడు నాకు గోర్ణాఖ్యానమును చెప్పుము.
వసురువాచ:-
శృణు మోహిని వక్ష్యామి తీర్థం పుణ్యప్రదం నృణామ్‌ | గోకర్ణాఖ్యం హరక్షేత్రం సర్వపాతకనాశనమ్‌2

పశ్చిమస్థ సముద్రస్య తీరే
స్తి వరవర్ణిని ! | సార్ధయోజన విస్తారం దర్శనాదపి ముక్తిదమ్‌3
సగరస్యాత్మజైర్దేవి ఖనితే భూతలే క్రమాత్‌ | సాగరో వర్ధితస్త్వారా త్పావయా మాస మేదినీమ్‌ 4
త్రింశద్యో జనవిస్తారాం సతీర్థక్షేత్ర కాననామ్‌ | తతస్తన్నిలయాస్సర్వే సదేవాసుర మానవాః 5
తత్ధ్సానం సంపరిత్యజ్య సహ్యాది గిరిషు స్థితాః | తతో గుహ్యం పరం తీర్థం గోకర్ణాఖ్యం సముద్రగమ్‌ 6
చిన్తయన్తో మునివరా స్తదుద్ధారే మతిందధు | తతస్సంమన్త్య్ర తే సర్వే పర్వతోపత్యకాస్థితాః 7
మహేన్ద్రా చలసంస్థానాం పర్శురామం దిదృక్షవః | జగ్ముర్మునివరా దేవి! గోకర్ణోద్ధార కాంక్షయా 8
సమారుహ్య తు తం శైలం దదృశుస్తస్య చాశ్రమమ్‌ | ప్రశాంతా క్రూర సత్వాఢ్యం సర్వర్తుషు సుఖావహమ్‌ 9
ఫలితైః పుష్పితై ర్వృక్షై ర్గహనం తత్త పోవనమ్‌ | స్నిగ్ధ చ్ఛాయ మనౌపమ్యం స్వామోది సుఖమారుతమ్‌ 10
తం తదాశ్రమ మాసాద్య బ్రహ్మఘోషనివాదితమ్‌ | వివిశుర్హృష్టమనసో యధావృద్ధ పురస్సరమ్‌ 11
బ్రహ్మసనే సుఖాసీనం మృదు కృష్ణాజినోత్తరే | శిషై#్యః పరివృతం శాంతం దదృశుస్తం తపోధనమ్‌ 12
కాలాగ్ని మివ లోకాంస్త్రీ న్దగ్ధ్వా శాంతం తపస్త్సితమ్‌ | తే సమేత్య భృగు శ్రేష్టం వినయేన వవందిరే 13
తతస్తా నాగతాన్దృష్టవా మునీన్ఖృగు కులోద్వహః | అర్ఘ్య పాద్యాదిభిస్సమ్యక్‌ పూజయామాస సాదరమ్‌ 14
తానాసీనా న్కృతా తిధ్యా నువాచ భృగునందనః | స్వాగతం వో మహాభాగామ యదర్ధమిహ చాగతాః 15

తద్వదధ్వం సువిశ్వస్తాః కరణీయం మయాస్తి యత్‌ | తతో
%బ్రువన్మునిశ్రేష్ఠా యదర్ధం రామమాగతాః 16
అవేహ్యస్మాన్భృగు శ్రేష్ఠ గోకర్ణ నిలయాన్మునీన్‌ | ఖనద్భిస్సాగరైర్భూమిం తస్మాత్తీర్థా ద్వివాసితాన్‌ 17
సత్వ మాత్మప్రభావేణ క్షేత్రప్రవరమద్యనః | దాతు మర్హసి విప్రేన్ద్ర ! సముత్సార్యార్ణవోదకమ్‌ 18
తచ్ఛ్రుత్వా వచనం తేషాం న్యస్త శస్త్రో వ్యచింతయత్‌ | తతో విచిన్త్య భగవా న్ధర్శ్యం సాధ్వభిరక్షణమ్‌ 19

ప్రగృహ్యస్వధనుర్భాణా న్సంప్రతస్థే సతైస్సమమ్‌ | సో
% వరుహ్య మహేంద్రాద్రే ర్దిశం దక్షిణ పశ్చిమామ్‌ 20
సముద్దిశ్య య¸° శీఘ్రం సస్వముల్లంఘ్య పర్వతమ్‌ | సంప్రాప్త స్సాగరతటం సార్థం గోకర్ణవాసిభిః 21
ముహూర్తం తత్ర విశమ్య వరుణం యాదసాం పతిమ్‌ | మేఘ గంభీరయా వాచా ప్రోవాచ వదతాం వరః 22

రామో
హం భార్గవః ప్రాప్తో మునిభిస్సహ కార్యవాన్‌ | ప్రచేతో దర్శనం దేహి కార్యమాత్యాయికం త్వయా 23
ఏవం రామ సమాహూతో యాదఃపతి రహన్తయా | శ్రుత్వాపి తస్య తద్వాక్యం నాయాతో రామ సన్నిధౌ 24

ఏవం పునః పునస్తేన సమాహూతో
%పి నాగతః | యదా తదాభి సంక్రుద్ధో ధనుర్గ్రాహ భార్గవః 25
తస్మిన్సంధాయ విశిఖం వహ్నిదైవం తు భార్గవమ్‌ | అస్త్రం సంయోజయామసా శోషణాయ సరిత్పతేః 26

తస్మిన్సంయోజతే
%స్త్రేతు భార్గవేణ మహాత్మనా | సంక్షుబ్ధ స్సాగరో భ##ద్రే యాదోగణ సమాకులః 27
వరుణో స్త్రాభి సంతప్తో రామస్య భయ సంప్లుతః | స్వరూపేణ సమాగత్య రామపాదౌ స మగ్రహీత్‌ 28
తతోస్త్రం స వినిర్వర్త్య వరుణం ప్రాహ సత్వరమ్‌ | గోకర్ణో దృశ్యతాం దేవ ఉత్సర్పయ జలం కిల 29

తతో రామాజ్ఞయా సో
%పి గోకర్ణోదక మహారత్‌ | రామో%పి తం సమభ్యర్చ్య గోకర్ణం నామ శంకరమ్‌ 30
ప్రాప్తః పునర్మహేన్ద్రాద్రిం తస్థుస్తత్రైవ తే ద్విజాః | యత్ర సర్వే తపస్తప్త్వా మునయశ్శంసిత వ్రతాః 31
నిర్వాణం పరమం ప్రాప్తాః పునరావృత్తి వర్జితమ్‌ | తత్‌క్షేత్రస్య ప్రభావేణ ప్రీత్యా భూతగణౖస్సహ 32
దేవ్యా చ సకలైర్దేవై ర్నిత్యం వసతి శంకరః | ఏనాంసి దర్శనాత్సద్యః గోకర్ణస్య మహీశితుః 33
సద్యో వియుజ్య గచ్ఛన్తి ప్రవాతే శుష్కపర్ణవత్‌ | తత్‌క్షేత్ర సేవనరతి ర్నృణాం జాతు నజాయతే 34
నిర్భంధేన తు యే తత్ర ప్రాణినస్థ్సిర జంగమాః | మ్రియంతే దేవి సద్యస్తే స్వర్గం యాన్తి సనాతనమ్‌ 35

వసువు పలికెను :-
ఓ మోహినీ! సర్వపాతక నావనము పుణ్యప్రదము హర క్షేత్రమగు గోకర్ణము మాహాత్మ్యమును చెప్పెదను వినుము. పశ్చిమ సముద్ర తీరమున కలదు. కొటిన్నర యోజన విస్తారము కలదు. దర్శన మాత్రముననే ముక్తి ప్రదము. సగర పుత్రులు భూమిని త్రవ్వగా సాగరము పెరిగి భూమిని పెంచినది. తీర్థక్షేత్రకాననము ముప్పది యోజ విస్తారము కలదు. అచట అన్నియూ దేవాసుర మానవుల నిలయములే. కాని వారందరూ ఆస్థానమును వదిలి సహ్యాది పర్వతములను చేరిరి. అంతట సముద్రములో మునిగిపోయిన గోకర్ణ మహాక్షేత్రమును చింతించుచు మునివరులందరూ గోకర్ణ క్షేత్రమునుద్దరించదలచి ఆలోచించి మహేన్ద్రాచలముననున్న పరశురాముని దర్శించుకొనిరి. అచట పరశురామాశ్రమము ప్రశాంతములగు సౌమ్య మృగములచే కూడియున్నది. అన్ని ఋతువులయందు ఆనందప్రదము. పండ్లతో కూడియున్న చెట్లు కలది. దట్టమైన నీడగలది. సాటిలేనిది. సుగంధ మును ఆనందమును కలిగించు గాలి కలది. బ్రహ్మఘోషనినాదితమగు ఆశ్రమమును సంతోషముతో ప్రవేశించిన ఋషులు మృదుకృష్ణాజినోత్తరమగు బ్రహ్మాసనమున సుఖాసీనుడు, శిష్యులచే పరివృతుడు, శాంతుడు, తపోధనుడగు పరశురాముని చూచిరి. కాలాగ్నివలె మూడు లోకములను దహించి శాంతించి తపసులో నున్న పరశురాముని చూచి వినయముగా నమస్కరించిరి. అట్లు వచ్చిన ఋషులను చూచిన పరశురాముడు సాదరముగా ఆర్థ్యపాద్యాదులతో పూజించెను. అతిధ్యమును చేసి ఇట్లు పలికెను. మహానుభావులారా మీకు స్వాగతము. మీరెందులకొచ్చితిరో నానుండి కోరదగినదేమున్నదో వివరించుడు. అంతట మునులు పరశురామునితో ఓ భృగుశ్రేష్ఠా! మేము గోకర్ణాశ్రమమునునండి వచ్చితిమి. సగర పుత్రులుభూమిని త్రవ్వి సముద్రమును వృద్ధి పరచగా గోకర్ణము సముద్ర జలము మునుగగా మేము అటనుండి వెడలి వచ్చితిమి. మీరు తమ మహిమచే నీట మునిగిన ఆశ్రమమును నీరును దూరముగా పారదోలి ఉద్దరించుడు అని పలికిరి. వారి మాటలు వినిన పరశురాముడు తానాయుధ పరిత్యాగమును చేసితిని కదా ఎట్లని క్షణకాలము ఆలోచించెను. సాధు రక్షణము పరమ ధర్మమని నిశ్చయించి ధనుర్భాణములను గ్రహించి వారితో కలిసి బయలు దేరెను. మహేన్ద్ర గిరినుండి దిగి వాయువ్య దిశగా తన పర్వతమును దాటి వెడలెను. గోకర్ణవాసులతో కలిసి సాగర తీరమును చేరెను. ఒక క్షణకాలము విశ్రమించి మేఘ గంభీర వాక్కుతో సముద్రునితో ఇట్లు పలికెను. ఓ సముద్రుడా! నేను భార్గవరాముడను. మునులతో వచ్చితిని. మాకు నీదర్శనమునిమ్ము. నీతో అత్యవసర కార్యము నిమ్ము. ఇట్లు పరశురాముని మాటలను వినికూడా అహంకారముతో పరశురాముని సన్నిధికి చేరలేదు. ఇట్లు పలుమార్లు పిలిచిననూ సముద్రుడు రాకపోవుటచే కోపించి పరశురాముడు ధనస్సును గ్రహించెను. ధనువున వహ్నిదైవమగు భార్గవాస్త్రమును సంధించి సముద్రుని ఇంకించుటకు నిశ్చయించెను. భార్గవరాముడు అస్త్రమును సంధించుటతో క్షోభను చెందిన సముద్రుడు యాదోగణ పరివృతుడై పరాశురామాస్త్ర సంతప్తుడై రామ భయముతో స్వరూపముతో వచ్చి పరశురామ పాదములను పరిగ్రహించెము. అంతట అస్త్రమును ఉపసంహరించి సముద్రునితో ఇట్లు పలికెను. గోకర్ణ తీర్థము కనపడునటుల జలమును ఉపసంహరించుమ అని అంతట పరశురామాజ్ఞతో గోకర్ణమున నున్న జలమునుప సంహరించెను. పరశురాముడు కూడా గోకర్ణవాసుడగు శంకరుని చక్కగా పూజించి మహేన్ద్రాద్రిని చేరెను. ఆ మునులు మాత్రము అచటనే నివసించిరి. అచటనే మునులందరూ వ్రతమును స్వీకరించి తపమునాచరించి పునరావృత్తి రహితమగు మోక్షమును చేరిరి. ఆ క్షేత్రప్రభావముచే శంకరుడు భూతగణములతో దేవతలతో పార్వతీ దేవితో అత్యంత ప్రీతుడై అచటనే నిత్య నివాసము నేర్పరచుకొనెను. గోకర్ణ గత శంకర దర్శన మాత్రముననే పాపము పెనుగాలికి ఎండు టాకులవలె వెంటనే విడుచును. గోకర్ణమును సేవించ వలయుననుకోరిక మానువులకు సామాన్యముగా కలగదు. గోకర్ణక్షేత్రమున నిర్బంధముతో మరణించిన స్థావర జంగమములు కూడా వెంటనే సనాతన స్వర్గమును చేరెదరు.
స్మృత్యాపి సకలైః పాపై ర్యస్యముచ్యేత మానవః | తద్గోకర్ణాభిధం క్షేత్రం సర్వతీర్థనికేతనమ్‌ 36
స్నాత్వా క్షేత్రేషు సర్వేషు యజంతశ్చ సదాశివమ్‌ | లభంతే యత్ఫలం మర్త్యా స్తత్సర్వం తత్ర దర్శనాత్‌ 37
కామక్రోధాది భిర్హీనా యే తత్ర నివసన్తి వై | అచిరేణౖవ కాలేన తే సిద్ధిం ప్రాప్నువన్తి హి 38
జపహోమరతాశ్శాన్తాం నియతా బ్రహ్మచారిణః | వసన్తి తసప్మిన్యేతేహి సద్ధిం ప్రాప్స్యన్త్య భీప్సితామ్‌ 39
దానహోమ పాద్యంచ పితృదేవద్విజార్చనమ్‌ | అన్యస్మాత్కోటి గుణితం భ##వేత్తస్మిన్ఫలం సతి 40
ఇత్యేత త్కధితం భ##ద్రే గోకర్ణక్షేత్ర సంభవమ్‌ | మాహాత్మ్యం సర్వపాపఘ్నం పఠతాం శృణ్వతామపి 41
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదుమన గోకర్ణ మాహాత్మ్యమను

చతుస్సప్తతితమో
%ధ్యాయః
గోకర్ణ తీర్థ స్మరణ మాత్రముననే సకల పాపములు నశించును. ఈ గోకర్ణ క్షేత్రము సర్వతీర్థ నివాస భూతము. సర్వక్షేత్రములందు స్నానమాడి సదాశివుని పూజించుట వలన కలుగు ఫలము గోకర్ణగత శివదర్శనము వలన కలుగును. కామక్రోధాది హీనులై గోకర్ణమున నివసించు వారు త్వరలో సిద్ధిని పొందెదరు. జపహోమపరులై నియమమును గ్రహించిన బ్రహ్మచారులు గోకర్ణమున నివసించిన అభీష్టసిద్ధిని పొందెదరు. గోకర్ణమున ఆచరించిన దానహోమ పాదులు పితృదేవద్విజార్చనములు ఇతరత్ర ఆచరించిన వాటికంటే కోటి గుణిత ఫలమునిచ్చును. ఇట్లు చదువు వారికి వినువారికి సర్వపాప నాశకమగు గోకర్ణక్షేత్ర మహాత్మ్యమును నీకు తెలిపితిని.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున గోకర్ణ మాహాత్మ్యమను
డెబ్బది నాలగవ అధ్యాయమ

Sri Naradapuranam-3    Chapters    Last Page