Sri Naradapuranam-3    Chapters    Last Page

పంచ సప్తతి తమోధ్యాయః డెబ్బది యైదవ అధ్యాయము

లక్ష్మణాచలమహాత్మ్యమ్‌

మోహిన్యువాచ :-


శ్రుతం గోకర్ణ మాహాత్మ్యం మనోపాప వినాశనమ్‌ | లక్ష్మణ స్యాపి మాహాత్మ్యం వక్తు మర్హసి సాంప్రతమ్‌ 1
మోహిని పలికెను :-
ఓ మహానుభావా! పాప వినాశనమగు గోకర్ణ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు లక్ష్మణాచల మాహాత్మ్యమును తెలుపుము.
వసురువాచ :-
శృణు దేవి ప్రవక్ష్యామి మాహాత్మ్యం లక్ష్మణస్యచ | యం దృష్ట్వా మనుజో దేవం ముచ్యతే సర్వపాతకైః 2
చతుర్వ్యూహావతా గేయో దేవస్సంకర్షణ స్స్వయమ్‌ | సర్వ భూమండలం హ్యేత త్సహస్రవదన స్స్వరాట్‌ 3
ఏక స్మిన్‌ శిరసి న్యస్తం నావూత్సిద్దార్థ కోపమమ్‌ | దేవో నారాయణ స్సాక్షా ద్రామో బ్రహ్మాది వందితః 4
ప్రద్యుమ్నో భరతో భ్రదే శత్రుఘ్నోహ్యనిరుద్ధకః | లక్ష్మణస్తు మహాభాగే స్వయం సంకర్షణ శ్శివః 5
బ్రహ్మాద్యైః ప్రార్థితః పూర్వం సాక్షాద్దేవో రమాపతిః | రామాది నామ భిర్జజ్ఞే చతుర్ధాదిగ్రధాన్నృపాత్‌ 6
తతఃకాలాంతరే దేవి! విశ్వామిత్రో మునీశ్వరః | యజ్ఞ రక్షార్థ మాగత్య ప్రార్ధయద్రామ లక్ష్మణౌ 7
తతో రాజాదశరధః ప్రాణభ్యోపి ప్రియా సుతా | మునేశ్శాప భయాద్భీతో దదౌ తౌ రామాలక్ష్మణౌ 8
గత్వా యజ్ఞం మునీన్ద్రస్య గాధిపస్య రరక్షతుః | సతాడకం సుబాహుంతు హత్వా ప్రక్షిప్య దూరతః 9
మారీచం మానవాస్త్రేణ విశ్వామిత్రుమ తోషయత్‌ | తతః స తు కియత్కాలం సానుజప్తేన సత్కృతః 10
వైదేహనగరం నీతో విశ్వామిత్రేణ తత్పరమ్‌ 11
తతస్తు రాజా జనకో విశ్వామిత్రం సుసత్కృతమ్‌ | పప్రచ్ఛ బాలకావేతౌ కస్య క్షత్ర కులేశితుః 12
తతోస్తసై#్మ మునివరో రాజ్ఞో దశరధస్య తౌ | పుత్రౌ నివేదయామాస భ్రాతరౌ రామలక్ష్మణౌ 13
తతో విదేహస్సుప్రీతో దృష్ట్వా రామం చ లక్ష్మణమ్‌ | సీతోర్మిలాఖ్యయోః పుత్ర్యో శ్చేతసా కల్పయత్పతీ 14

త్రికాలజ్ఞస్తు సమునిర్‌ జ్ఞాత్వా తస్య మనోగతమ్‌ | మోదమానో ధ
జనకం ప్రాహ దర్శయ తద్ధనుః 15
సీతాస్వయంవరే న్యస్తం న్యాసభూతం మహేశితుః | రాజా శ్రుత్వా తు తద్వాక్యం విశ్వామిత్రస్య సత్వరమ్‌ 16
భృత్య త్రిశత్యానాయ్యాసై#్మ దర్శయా మాస సాదరమ్‌ | రామశ్చండీశచాపం త ద్వామ దోష్ణాద్ధరత్‌ క్షణాత్‌ 17
సజ్యం వికృష్య సహసా బభంజేక్షు మివేభరాట్‌ | తతో
తి మిథిలః ప్రీతః స్వేకన్యే రామలక్ష్మణౌ 18
సమభ్యర్బ్యా ర్పయామాస తాభ్యాం తే విధి పూర్వకమ్‌ | జ్ఞాత్వా మునివరాదన్యౌ రాజ్ఞో దశరధస్య తు 19
తాభ్యాం సత్వరమాహూయ భాతృకన్యే అదాపయత్‌ | తతస్స కృతదారైస్తు చతుర్భిస్తనయై స్సహ 20
సమర్చితో విదేహేనా యోధ్యాం మున్యాజ్ఞయా య¸° | మార్గే భృగు పతేర్దర్పం శమయిత్వా స రాఘవః 21
పితృభ్రాతృయుత శ్శ్రీమా న్ముముదే బహువత్సరాన్‌ | పండితైస్తు వసిష్ఠా ద్యైర్‌ భోదితో సౌ నిం మహః 22
బ్రహ్మాఖ్యం బుబుధే రామో మానుషత్వం విడంబయన్‌ | తతో దశరధో రాజా జ్ఞాతజ్ఞేయం నిం సుతమ్‌ 23
రామం సముద్యతో హృష్టో ¸°వరాజ్యేభిషేతుమ్‌ | యజ్‌జ్ఞాత్వా కైకయీ దేవీ రాజ్ఞః ప్రేపా కనీయసే 24
సన్నివార్య హఠాత్తస్య పుత్రస్య తదరోచత | తతో రామో ముదే తస్యాః పిత్రాననుమతే య¸° 25
సభార్యస్స చ సౌమిత్రి శ్చిత్రకూటం గిరిం శుభే | కియత్కాలమువాసాసౌ తత్రైవ మునివేషధృక్‌ 26
మాతామహగృహాత్తచ్చ శ్రుత్వాయాతః పితుర్వధమ్‌ | స విజ్ఞాయ మృతం తాతం హారేమేతి విరావిణమ్‌ 27
ధిక్కృత్య కేకయీం యాతో రామం స వినివర్తితుమ్‌ | తతస్స పాదుకే దత్వా భరతం వినవర్త్యచ 28

రామో
త్రేశ్చాప్యగస్త్యస్య సుతీక్షణస్యా శ్రమేష్వగాత్‌ | తేషు ద్వాదశ వర్షాణి గమయిత్వా రఘూద్వహః 29
భార్యాను జాన్విత శ్రీమాన్‌ తతః పంచవటీ మగాత్‌ | తత్రావసజ్జన స్థానే త్రిశిరః ఖరదూషణాన్‌ 30
శూర్పణఖ్యా వికృతయా ప్రేరితావ్యనాశయత్‌ | తతో రక్షస్సహసై#్రశ్చ చతుర్దశభిరాగతాన్‌ 31
విచిత్ర వాజైర్నారా చై ర్యమక్షయ మనీనయత్‌ | యచ్ఛ్రుత్వా రక్షసాం రాజా మారీచం కాంచనం మృగమ్‌ 32
దర్శయిత్వాప వాహ్యేతౌ సీతాం హృత్వా జటాయుషమ్‌ | రుంధానం మార్గ మాహృత్య లంకాయాం సుమపానయత్‌ 33
ఆగత్య తౌ హృతాం సీతాం మార్గ మాణౌ సమంతతః | దృష్ట్వా జటాయుషం శాన్తం దగ్ధ్వా హత్వా కబంధకమ్‌ 34
శబరీ మనుకంప్యాధ ఋష్యమూకముపాగమత్‌ | తతస్తు హనుమద్వాక్యా త్స్వసఖ్యుః ప్లవగేశితుః 35
విద్విషం వాలినం హత్వా సుగ్రీవ మకరోన్నృపమ్‌ | ప్రాప్య సంపాతి వచనా ల్లంకాయా నిశ్చయం గతాః 37
తతస్తు హనుమానేకః ప్రాప్య లంకాపురీం కపిః | సముద్రస్య పరేపారే
పశ్య ద్రామప్రియాం సతీమ్‌ 38
వసువు పలికెను :-
ఓ మోహినీ! లక్ష్మణ మాహాత్మ్యమును చెప్పెదను. ఈ లక్ష్మణుని దర్శించిన వాడు. సర్వపాతక వినిర్ముక్తుడగును. చతుర్వ్యూహావతారములలో సంకర్షణ దేవుడు స్వయముగా సహస్ర శిరస్సులతో ఒక శిరసుపైన ఈ భూమండలమంతటిని ధరించు చుండును. ఈ సంకర్షణుడే లక్ష్మణునిగా అవతరించెను. సాక్షాన్నారాయణ దేవుడు బ్రహ్మాది వందితుడు రామునిగా అవతరించెను. ప్రద్యుమ్నుడు భరతునిగా అనిరుద్ధుడు శత్రుఘ్నునిగా అవతరించెను. బ్రహ్మాదులచే ప్రార్థించబడని శ్రీమన్నారాయణుడు దశరధమహారాజు వలన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపమున నలుగురిగా అవతరించెను. కొంత కాలమునకు విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షన కొరకు రామలక్ష్మణులను యాచించెను. అంతట దశరధ మహారాజు ముని శాప భయముచే ప్రాణములకంటే మిన్న అయిన రామలక్ష్మణులను విశ్వామిత్రునికి ఇచ్చెను. తాటకను చంపి, సుబాహువుని చంపి మారీచుని దూరమగుఆ పడవేసి రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞమును కాపాడిరి. విశ్వామిత్రుని ప్రీతుని చేసిరి. అట్లు ప్రీతుడగు విశ్వామిత్రుని వలన అస్త్ర సమూహమును పొందిన రాముడు లక్ష్మణునితో కలసి అచటనే కొంత కాలముండెను. తరువాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిధిలా నగరమునకు తీసుకొని పోయెను. అంతట జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సత్కరించి బాలకులిద్దరు ఎవరి పుత్రులు? ఎచటి వారు అని అడిగెను. అపుడు విశ్వామిత్ర మహర్షి వారు దశరధుని పుత్రులు రామ లక్ష్మణులు అని తెలిపెను. అంతట జనక మహారాజు రామ లక్ష్మణులను చూచి ప్రీతుడై సీతను ఊర్మిలను రామ లక్ష్మణులకు భర్తలుగా మనసున కల్పించుకొనెను. త్రికాలజ్ఞుడగు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు మనోగతమును తెలుసుకొని సంతోషించి సీతాస్వయం వరమునకు మహేశ్వరుడు న్యాసముగా ఉంచిన ధనువును చూపుమని పలికెను. విశ్వామిత్రుని మాటను వినిన జనక మహారాజు త్వరగా మూడు వందల మంది భృత్యులచే సాదరముగా శివధనువును తెప్పించెను. శ్రీరామ చంద్రుడు ఆ శివధనువును ఎడమ చేతితో క్షణములో లేపెను. నారి తాడును లాగి సులభముగా ఏనుగు చెరుకు గడను విరిచినట్లు విరిచెను. అంతట మిథిలాధిపతి సంతోషించి రామ లక్ష్మణులను సత్కరించి తన కన్యలను రామ లక్ష్మణులకు సమర్పించెను. విశ్వామిత్రుని వలన దశరధుని మరో ఇద్దరు పుత్రులు కలరని తెలిసి వారి తోపాటు దశరధుని కూడా ఆహ్వానించి తమ్ముని పుత్రికలను వారికి అర్పించెను. ఇట్లు వివాహము చేసుకొనిన నలుగురు పుత్రులతో జనక మహారాజు దారిలో భార్గవరాముని గర్వమును శ్రీరాముడు హరించెను. తలిదండ్రులతో సోదరులతో అయోధ్యలో చాలాకాలము ఆనందముగా గడిపెను. లీలామానుషత్వమును విడంబించుచున్న రామచంద్రుడు వసిష్ఠాది పండితులందరు బోధించగా తన మహిమను బ్రహ్మ స్వరూపముగా తెలుసుకొనెను. అంతట దశరథమహారాజు స్వర్వజ్ఞుడగు శ్రీరామచంద్రుని చూచి ప్రీతి చెంది ¸°వరాజ్య పట్టాభిషేకమును చేయు నుద్యుక్తుడాయెను. ఈ విషయమును దశరధునికి అత్యంత ఇష్టురాలగు కైకయీ దేవి రామ పట్టాభిషేకమును వారించి తన పుత్రుడగు భరతునికి పట్టాభిషేకమును కోరెను. అంతట రామ చంద్రుడు కైక సంతోషము కొరకు తండ్రి అనుమతితో లక్ష్మణునితో సీతాదేవితో చిత్రకూటమునకు వెళ్ళెను. మునివేషమును ధరించి అచటనే కొంతకాలము నివసించెను. అంతట తాత ఇంటిలో ఉన్న భరతుడు తండ్రి మరణమును విని వచ్చి రాముని తలచుచు మరణించిన తండ్రిని తెలుసుకొని కైకను ధిక్కరించి రాముని అయోధ్యకుమరలించుటకు వెళ్ళెను. రామ చంద్రుడు తన పాదుకలను భరతునకిచ్చి పంపి అత్రి అగస్త్య సు తీక్ష మహర్షుల ఆశ్రమములకు వెళ్ళెను. రాచంద్రుడు ఋషుల ఆశ్రమములలో పన్నెండు సంవత్సరములు గడిపి భార్యతో తమ్మునితో పంచవటికి వెళ్ళెను. అచటికి వచ్చిన శూర్పణఖను వికృతురాలను చేయగా ఆమె పంపిన ఖరదూషణాది రాక్షసులను పదునాలుగు వేల మందిని తీక్షనారాచములచే యమలోకమునకు పంపెను. ఈ విషయమును వినిన రాక్షాసరాజగు రావణుడు మారీచుని బంగారులేడిగా పంపి రామలక్ష్మణులను దూరముగా పంపి సీతాదేవిని హరించి అడ్డగించిన జటాయువును సంహరించి లంకకు గొనిపోయెను. అంతట రామలక్ష్మణులు ఆశ్రమమును చేరి హరించిన సీతను వెదకుచు మరణించిన జటాయువును చూచి దహన సంస్కారము గావించి కంబంధుని సంహరించి శబరిని సందర్శించి ఋష్యమూక పర్వతమును చేరిరి. హనుమంతుని వాక్యములచే సుగ్రీవుని మిత్రుని చేసుకొన అతని శత్రువగు వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసెను. సుగ్రీవుని ఆజ్ఞచే హనుమదాది వానరేంద్రులు సీతను అన్వేషించుచు దక్షిణ సాగరమును చేరిరి. సంపాతి వాక్యము వలన సీతాదేవి లంకలో ఉన్నదని నిశ్చయించుకొనిరి. అంతట ఒక హనుమంతుడు మాత్రమే సముద్రము ఆవతలి వడ్డున ఉన్న లంకను చేరి సీతను చూచెను.
దత్వా రామాంగుళీ రత్నం విశ్వాసముపపాద్య తామ్‌ | తయోః కుశలమాశ్రావ్య లబ్ధ్వా చూడామణిం తతః 39
భఙ్క్వాచా శోకవనికాం హత్వా చాక్షం ససైన్యకమ్‌ | ఇన్ద్ర ఇద్బంధనాత్ర్పాప్య సంభాష్యాపి చ రావణమ్‌ 40
దగ్ధ్వా లంకాంపురీం కృత్స్నాం పునర్దృష్ట్వాతు మైథిలీమ్‌ | లబ్ధా జ్ఞోర్ణవ ముల్లంఘ్య రామాయైనాం న్యవేదయత్‌ 41
శ్రుత్వా రామోపి తాం సీతం రాక్షసస్య నివాసగామ్‌ | సార్థం స కపిసైన్యేన సంప్రాప్తో మకరాలయమ్‌ 42
సాగరానుమతే నాసౌ సేతుం బద్ధ్వా మహాదధౌ | అద్రికూటైః పరం తీరం ప్రాప్య సేనాం న్యవేశయత్‌ 43
తతో
%సౌ రావణో భ్రాత్రా బోధితో%పి కనీయసా | ప్రదానం తత్ర మైథిల్యా స్తద్భర్త్రే నత్వరో చయత్‌ 44
పదాహతస్త తస్తేన రావణన విభీషణః | సంప్రాప్త శ్శరణం రామం రామో లంకాముపారుణత్‌ 45

తతస్తు మంత్రిణో
% మాత్యాః పుత్రా భృత్యాః ప్రచోదితాః | యద్ధాయ తే క్షయం నీతాః తాభ్యాం సంఖ్యే కపీశ్వరైః 46
లక్ష్మణ శ్శక్ర జేతారం జఘ్నివాన్నిశితై శ్శరైః | రామోపి కుంభ శ్రవణం రావణం చాప్య జీఘనత్‌ 47
విభీషణన తత్కృత్యం కారయిత్వా నిజాం ప్రియామ్‌ | వహ్నౌ సంశోధ్య దత్వాసై#్శ రామో రక్షోగణశతామ్‌ 48
లంకా మాయుశ్చ కల్పాంతం య¸° చీర్ణవ్రతః పురీమ్‌ | పుష్పకేణ విమానేన ససుగ్రీవ విభీషణః 49
నన్ధి గ్రామస్థ భరతం నీత్వాయోధ్యాం సమావిశత్‌ | మాతౄః ప్రణమ్య తాస్సర్వా భ్రాతరస్తే పురోధసా 50
వసిష్ఠేనాను విజ్ఞాప్య రామం రాజ్యే భ్యషే చయత్‌ | తతో రామోపి భగవా న్ర్పజా శ్శాసన్ని వౌరసాన్‌ 51
లోకాపవాదాత్సంత్రస్త స్సీతాం తత్యాజ ధర్మవిత్‌ | సాతు సంప్రాప్య వాల్మీకే రాశ్రమం న్య వసత్సుఖమ్‌ 52
పుత్రౌ చ సుషువే తత్ర నామ్నాఖ్యాతా కుశీలవౌ | వాల్మీకిస్తు తయోః కృత్వా యధా సముదితాః క్రియాః 53
రామాయనం విరచ్యైతా వధ్యాపయ దుదారధీః | తౌ గాయమానౌ సత్రేషు మునీనాం ఖ్యాతి మాగతౌ 54
యజ్ఞే రామస్య సంప్రాప్తౌ వాజిమేధే ప్రవర్తితే | తత్ర తాభ్యాం తు తద్గీతం స్వచరిత్రం ప్రసన్నధీః 55
ముని మాకార యామాస ససీతం తత్ర సంసది | సాతు రామాయ తౌ పుత్రౌ నివేద్య జగతీజనిః 56
జగత్యా వివరం భూయో వివేశాసీత్తదద్భుతమ్‌ | తతః పరం బ్రహ్మచర్యం యజ్ఞమేవ త్రయోదశ 57
సహస్రా బ్దాన్ర్పకుర్వాణ స్తస్థౌ భువి రఘూత్తమః | తతస్తు కాలే ధర్మస్తు సంప్రాప్తో రాఘవం ప్రతి 58

బ్రహ్మణా ప్రేషితో భ##ద్రే వైకుంఠ గమనాయ చ | స ఏకాంత గతో రామం ప్రాహ కో
%పీహ నావ్రజేత్‌ 59
ఆగతో వధ్యతాం యాతు రామస్త త్ర్పతిజజ్ఞివాన్‌ | స లక్ష్మణం సమాహూయ ప్రోవాచ రఘునన్ధనః 60
ద్వారి తిష్ఠాత్ర నిర్విష్టో వద్యతాం మే ప్రయాస్యతి | స తధేతి ప్రతి జ్ఞాయ రామస్యాజ్ఞాం సమాచరన్‌ 61
ప్రవేశనం న కస్యాపి ప్రదదౌ రామ సన్నిధౌ | ఏవమే కాంతగం రామం కాల సంవిదమాస్థితమ్‌ 62
జ్ఞాత్వాధ ద్వారి దుర్వాసా లక్ష్మణం సముపాగమత్‌ | తమాగతం తు సంప్రేక్ష్య సౌమిత్రిః ప్రణిపత చ 63
ముహూర్తం పాలయే త్యాహ మంత్రవ్యగ్రోస్తి రాఘవః | దుర్వాసాస్తద్వచ శ్శ్రుత్వా కాలస్యార్థ విధాయకః 64

క్రుద్ధః ప్రోవాచ సౌమిత్రిం దేహిమే
%న్తః ప్రవేశనమ్‌ | నోచేత్త్వాం భస్మ సాత్సద్యః కరిష్మామి విచారయ 65
వచో దుర్వాసన శ్శ్రుత్వా లక్ష్మణో జాతసంభ్రమః | మునేర్బీతో వివేశాం తః ర్విజ్ఞాపయితు మగ్రజమ్‌ 66
దృష్ట్వా తు లక్ష్మణం కాల ఉత్థాయ కృతమంత్రకః | ప్రతిజ్ఞాం పాలయేత్త్యుక్త్వా య¸° రామ విసర్జితః 67
తతో నిష్క్రమ్య భగవా న్రామోధర్మభృతాం వరః | ప్రతోష్య తం మునిం ప్రీతో దుర్వాససమ భోజయత్‌ 68
భోజయిత్వా ప్రణమ్యైనం విసృజ్య ప్రాహ లక్ష్మణమ్‌ | భ్రాతర్లక్ష్మణ సంప్రాప్తం సంకటం ధర్మకారణాత్‌ 69
యత్త్వం మే వధ్యతాం ప్రాప్తో దైవం హి బలవత్తరమ్‌ | మయాత్యక్త స్తతో వీర యధేచ్ఛం గచ్ఛ సాంప్రతమ్‌ 70
తతః ప్రణమ్య తం రామం సత్య ధర్మే వ్యవస్థితమ్‌ | దక్షిణాం దిశమాశ్రిత్య తపశ్చక్రే నగోపరి 71

తతో రామో
%పి భగవా న్బ్రహ్మప్రార్థనయా పునః | స్వధామా విశదవ్యగ్ర స్ససాకేతస్సకోసలః 72
గోప్రతారే సరయ్వాం యే రామం సంచిన్త్య సంప్లుతాః | తే రామధామ వివిశు ర్దివ్యాంగా యోగి దుర్లభమ్‌ 73
లక్ష్మణస్తు కియత్కాలం తపోయోగ బలాన్వితః | రామాను గమనేనైవ స్వధామావిశదవ్యయమ్‌ 74
సాన్నిధ్యం పర్వతే తస్మి న్దత్త్వా సౌమిత్రి రన్వహమ్‌ | చక్రే నిజాధి కారం స తతస్తత్‌క్షేత్ర ముత్తమమ్‌ 75
యే పశ్యన్తి నరా భక్త్యా లక్ష్మణా లక్ష్మణం చలే | తే కృతార్థా న సందేహో గచ్ఛన్తి హరి మందిరమ్‌ 76
తత్రదానం ప్రశంసన్తి స్వర్ణగోభూమివాజినామ్‌ | దత్తం తత్రాక్షయం సర్వం హుతం జప్తం కృతం తధా 77
బహునా కిమిహోక్తేన దర్శనం తస్య దుర్లభమ్‌ | అగస్త్యా జ్ఞాంతరా దేవి దృష్టే ముక్తిర్న సంశయః 78
ఏతద్రామ చరిత్రం తు లక్ష్మణా ఖ్యాన సంయుతమ్‌ | శ్రావయే ద్యోపి శృణుయా త్స్యాతాం తౌ రామ వల్లభౌ 79
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున రామలక్ష్మణ చరిత్ర సహిత లక్ష్మణాచల మాహాత్మ్యమను

పంచ సప్తతి తమో
%ధ్యాయః సీతాదేవికి శ్రీరామాంగుళీయకమునిచ్చి నమ్మకము కలిగించి రామ లక్ష్మణుల కుశలమును వినిపించి ఆమెనుండి చూడామణిని పొంది, ఆశోకవనమును భంగపరిచి సైన్యముతో పాటు అక్షకుమారుని చంపి, ఇంద్రజిత్‌ బ్రహ్మాస్త్రముచే బంధింపిబడి, రావణుని చేరి, అతనితో మాటలాడి, లంకాపురమును మొత్తము దహించి, మరల సీతాదేవిని చూచి అనుజ్ఞను పొంది సాగరమును లంఘించి రాముని చేరి సీతా వృత్తాన్తమును వినిపించెను. రావణ నివాసమున సీత కలదని వినిన రాముడు కపిసైన్యముతో సముద్రమును చేరెను. సముద్రుని అంగీకారముచే సాగరమున సేతువును నిర్మించి అవతలి తీరమును చేరి సైన్యమును నిలిపెను. అంతట విభీషణుడు సీతాదేవిని రాముని కర్పించమని బోధించిననూ రావణుడంగీకరించక పాయెను. రావణుడు పాదముతో తన్నగా విభీషణుడు రాముని చేరి శరణు జొచ్చెను. అంతట రామ చంద్రుడు లంకను ముట్టడించెను. అపుడు రావణాసురుని మంత్రులు, అమాత్యులు, పుత్రులు, భృత్యులు రావణాజ్ఞచే యుద్ధముచేసి రామ లక్ష్మణులతో వానరేశులతో నాశమునొందిరి. లక్ష్మణుడు ఇన్ధ్రజిత్తును నిశిత శరముచే అంతము గావించెను. రామ చన్ద్రుడు కుంభకర్ణుని రావుణుని సంహరించెను. విభీషణునిచే రావణునికి అంత్య క్రియలను రిపించి తన ప్రియురాలగు సీతాదేవిని అగ్నిలో శోధించి విభీషణునకు రాక్షసాధిపత్యము నొసంగి, కల్పాంతము వరకు ఆయుష్యము నొసంగి, వ్రతమును ముగించుకొని అయోధ్యా నగరమును పుష్పక విమానము చే చేరి, నందిగ్రామమున నున్న భరతుని అయోధ్యకు చేర్చి వారతో కలిసెను. తల్లులందరికి నమస్కరించెను. సోదరులందరూ వసిష్ఠాజ్ఞను పొంది రామునికి రాజ్యాభిషేకమునుగావించిరి. అప్పటినుండి శ్రీరామచంద్రుడు ప్రజలను కన్నబిడ్డలవె పరిపాలించుచు లోకాపవాదమునకు భయపడి ధర్మజ్ఞుడు కావున సీతాదేవిని పరిత్యజించెను. సీతాదేవి వాల్మీకి ఆశ్రమమును చేరి సుఖముగా నివసించెను. కుశలవులను పుత్రులను యధావిధిగా నాచరించెను. శ్రీమద్రామాయణమును రచించి కుశలవులకు బోధించెను. కుశలవులు మహార్షులతో రామాయణమును గానము చేయుచు ప్రసిద్ధిని గాంచిరి. శ్రీరామ చంద్రుడాచరించు అశ్వమేధయాగమునకు వచ్చిరి. అచట శ్రీరామ చంద్రుడు కుశలవులచే గానము చేయబడిన తన చరిత్రను విని ప్రసన్న మనస్కుడై సీతాదేవితో వాల్మీకి మహర్షిని పిలిపించెను. జగన్మాతయగు సీతాదేవి కుశలవులను శ్రీరామచంద్రున కర్పించి భూవివరమున జొచ్చెను. అది అత్యద్భుతమాయెను. తరువాత శ్రీరామ చంద్రుడు బ్రహ్మచర్యమును అవలంబించి యజ్ఞముల నాచరించుచు పదమూడు వేల సంవత్సరములను రాజ్య పాలన గావించుచు భూలోకమున నివసించెను. అంతట యధా సమయమున యమధర్మరాజు రామచంద్రుని చేరి బ్రహ్మ సందేశమును వైకుంఠమును చేరమని చెప్పుటకు ముందు మనిద్దరము మాటలాడు చుండగా ఎవ్వరూ రారాదు. వ
చ్చినవారు వధించ బడవలయును అని పలికెను. శ్రీరామ చంద్రుడు అట్లే ప్రతిజ్ఞ గావించెను. లక్ష్మణుని పిలిచి ఇచట ద్వారమున నిలుపుము. ఇచటికి వచ్చిన వారు వధార్హులగుదురు అని తెలిపెను. లక్ష్మణుడు అటులనే యని రామాజ్ఞను పరిపాలించు చుండెను. ఎవరినీ లోపల ప్రశేశించనీయలేదు. ఇట్లు ఏకాంతమున శ్రీరామచంద్రుడు యమధర్మరాజుతో సంభాషించు చుండెనని తెలిసి దుర్వాస మహర్షి అటకొచ్చెను. అట్లు వచ్చిన దుర్వాస మహర్షి లక్ష్మణుడు నమస్కరించి రామచంద్రుడు రహస్యసమలోచనలో నుండెను. ఒక ముహూర్త కాలము నిలువుడని పలికెను. దుర్వాసమహర్షి ఆమాటలను విని కాలమునకు కావలసిన దానిని చేయువాడు కావున కోపించి నన్నులోనికి ప్రవేశించనిమ్ము. లేనిచో నిన్ను భస్మము గావించెదనని పలికెను. దుర్వాస మహర్షి వాక్యమును వినిన లక్ష్మణుడు తత్తరాపాటుతో మునికి భయపడి రామ చంద్రునికి తెలుపుటకు లోనికి వెళ్ళెను. యమధర్మ రాజు వచ్చిన లక్ష్మణుని చూచి మాటాడుట ముగించి ప్రతిజ్ఞను నెరవేర్చుమని పలికి రామాజ్ఞతో వెడలెను. అంతట శ్రీరామచంద్రడు ధర్మ భృఛ్ఛ్రేష్టుడు బయటికి వచ్చి దుర్వాస మహర్షిని సత్కరించి భుజింప చేసెను. తరువాత నమస్కరించి అతనిని సాగనంపి లక్ష్మణుని తో ఇట్లు పలికెను. లక్ష్మణా ధర్మ కారణమున సంకటము ప్రాప్తించినది. నీవు వధ్యుడవయితివి. దైవము బలీయము. కావున నేను విడిచితిని. యధేచ్ఛముగా వెడలుము. అని అంతట లక్ష్మణుడు సత్య ధర్మములలో నిలిచిన శ్రీరామచంద్రునికి నమస్కరించి దక్షిణ దిశగా వెళ్ళి పర్వతముపై తపము నాచరించెను. అంతట శ్రీరామచంద్రుడు కూడా బ్రహ్మ దేవుని చే సాకేత పురములో కోసల రాజ్యముతో పాటు స్వధామమును చేరెను. కోసల వాసులు కూడా దివ్యదేహులై యోగి దుర్లభమగు రామధామమును చేరిరి. గోప్రతారమును సరయూనదిలో రాముని ధ్యానించి స్నామాడిన వారు దివ్య దేహులై యోగిదుర్లభమగు రామధామమును చేరిరి. లక్ష్మణుడు కూడా కొంతకాలము తపోయోగబలము కలవాడై రామాను గమమున స్వధామమును చేరెను. లక్ష్మణుడు నివసించి తపమాచరించిన ఆ పర్వతము ఉత్తమ క్షేత్రమాయెను. లక్ష్మణాచలమున లక్ష్మణుని సందర్శించిన వారు కృతార్థులై నిస్సందేహముగా శ్రీహరి మందిరము చేరెదరు. ఈ క్షేత్రమున స్వర్ణ గోభూ అవ్వాది దానములు ప్రశస్తములు. ఇచట లక్ష్మణుని దర్శనము దుర్లభము. అగస్త్యమహర్షి ఆజ్ఞచే లక్ష్మణ దర్శనమును పొందినచో మోక్షము తప్పక లభించును. ఇది లక్ష్మణాఖ్యాన సహితమగు రామ చరిత్రము. ఈ చరితమును వినిన వారు, వినిపించినవారు రామచంద్రుని ప్రీతిపాత్రులగుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదుమన రామ లక్ష్మణ చరిత్ర సహిత లక్ష్మణాచల మాహాత్మ్యమను
డెబ్బది యైదవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page