Sri Naradapuranam-3
Chapters
Last Page
షట్సప్తతి తమోధ్యాయః డెబ్బదియారవ అధ్యాయము సేతు మాహాత్మ్యమ్ మోహిన్యువాచ : - సాధు సాధు ద్విజశ్రేష్ఠ యన్మే రామాయణం త్వయా | శ్రావితం సర్వ పాపఘ్నం నృణాం పుణ్య వివర్థనమ్
1 అధునా శ్రోతుమిచ్ఛామి సేతు మహాత్మ్యముత్తమమ్ మోహిని పలికెను :- బ్రాహ్మణోత్తమా! బాగు! బాగు! మానవులకు పాపములను హరించి పుణ్యమును పెంపొందించు రామాయణుమును వినిపించితిరి. ఇక ఇపుడు ఉత్తమమగు సేతు మాహాత్మ్యమును వినగోరు చున్నాను. వసురువాచ :- శృణు దేవి ప్రవక్ష్యామి సేతు మాహాత్మ్యముత్తమమ్ 2 యం దృష్ట్వా మనోజో దేవి ముచ్యతే భవసాగరాత్ | సేతోస్సందర్శనం పుణ్యం యత్ర రామేశ్వరో విభుః 3 దర్శనాదేవ మర్త్యానాం అమరత్వం ప్రయచ్ఛతి | రామేశ్వరం తు సంపూజ్య నరో నియతమానసః 4 సర్వాస్సమశ్నుతే భూతీ ర్నాత్ర కార్యా విచారణా | చక్రతీర్థ మిహాన్యచ్ఛ వర్తతే పాపనాశనమ్ 5 స్నానం దానం జపో హోమ స్తత్రానన్త్యం విగాహతే | తాలతీర్థం తు సంప్రాప్య యస్స్నా యాత్తత్ర మానవః 6 స ఉత్తమాం జనిం లబ్ధ్వా మోదతే దేవవద్భువి | తతస్సంప్రాప్య సుభ##గే తీర్థం పాపవినాశనమ్ 7 స్నాత్వా నిర్ధూత పాపో సౌ నరస్స్వర్గే మహీయతే | సీతాకుండే తతః ప్రాప్య స్నానం సమ్యగ్విధాయచ 8 తర్పయిత్వా పితౄద్దేవా న్సర్వా న్కామానవాప్నుయాత్ | మంగలం తీర్థం మాసాద్య స్నాత్వా ముచ్యేత పాతకాత్ 9 స్నాత్వై వామృత వాప్యాంతు మానవో% మరతాం లభేత్ | బ్రహ్మకుండే నరస్స్నాత్వా బ్రహ్మలోకమవాప్నుయాత్ 10 స్నాత్వా లక్ష్మణ తీర్థే వై నరోయోగ గతిం వ్రజేత్ | జటాతీర్థే నరస్స్నాత్వా నీరోగో జాయతే భువి 11 హనుమత్కుండకే స్నాత్వ దుర్జయో జాయతే%రిభిః | అగస్త్య తీర్థే ఆప్లుత్య పుత్ర వాన్థన వాన్భవేత్ 12 రామకుండే ప్లుతో మర్త్యో రామసాలోక్య మాప్నుయాత్ | లక్ష్మీ తీర్థా భిషేకేణ లక్ష్మీవాన్రూపవాన్భవేత్ 13 అగ్ని తీర్థే నరస్స్నాత్వా ముచ్యతే సర్వకిల్బిషైః | స్నానేన శివతీర్థేతు శివలోకగతిర్భవేత్ 14 శంఖతీర్థేతు సంస్నాతో న నరో దుర్గతిం వ్రజేత్ | యమునాదిషు తీర్థేషు నరస్స్నాత్వా దివం వ్రజేత్ 15 కోటి తీర్థేతు సంప్లుత్య సర్వతీర్థ ఫలం లభేత్ | సాధ్యామృతే ప్లుతో యాతి నరస్సాధ్య సలోకతామ్ 16 సర్వతీర్థే నరస్య్నాత్వా లభేత్కామాన భీప్సితాన్ | ధనుష్కోట్యాం తు విధివ త్స్నాతో ముచ్యేత బంధనాత్ 17 క్షీరకుండాప్లుతో మర్త్యో భోగానుచ్చావచావజాన్ల భేత్ | కపితీర్థే నరస్స్నాత్వా న వియోనిం సమాలభేత్ 18 గాయత్ర్యాం చ సరస్వత్యాం స్నాతో ముచ్యేత కిల్బిషాత్ | ఋణమోచన తీర్ధాదౌ స్నాత్వా ముక్తో భ##వేదృణాత్ 19 ఇత్యేతత్సేతు తీర్థానాం మాహాత్మ్యం గదితం శుభే | ఫఠతాం శృణ్వతాం చైవ సర్వపాతక నాశనమ్ 20 ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున సేతు మాహాత్మ్యమను షట్సప్తతి తమః అధ్యాయః వసువు పలికెను :- ఓ మోహినీ ! ఉత్తమమగు సేతు మాహాత్మ్యమును చెప్పెదను వినుము. సేతువును దర్శించిన వారు సంసార సాగరమునుండి విముక్తులగుదురు. రామేశ్వరుడు నివసించి యున్న సేతు సందర్శనము పరమ పుణ్య ప్రదము. రామేశ్వరుని దర్శన మాత్రమునే అమరత్వము లభించును. నియత మనస్కుడై రామేశ్వరుని పూజించిన వారు సర్వకామనలను పొందెదరు. ఇచటనే పాపనాశనమగు చక్రతీర్థము కూడా కలదు. ఇచట ఆచరించిన స్నాన దాన జపహోమాదులు అనన్త్యమును ప్రసాదించును. తాల తీర్థమును చేరి నియతమనస్కుడై స్నానమాడిన వాడు ఉత్తమ జన్మను పొంది స్వర్గమున దేవతల వలె ఆనందించును. తరువాత పాపవినాశమను తీర్థమను చేరి స్నానమాడిన వారు స్వర్గమున ఆనందించెదరు. తరువాత సీతాకుండమును చేరి చక్కగా స్నానమాచరించి పితరులను దేవతలను తృప్తి పరిచి సర్వకామనలను పొందగలడు. మంగళతీర్థమును చేరి స్నానమాడిన వారు పాపవిముక్తులగుదురు. అమరవాసిలో స్నానమాడిన వారు అమృతత్వమును పొందెదరు. లక్ష్మణ తీర్థమున స్నానమాడిన వారు యోగగతిని పొందెదరు. జటాతీర్థమున స్నానమాడిన వారు రోగరహితులగుదురు. హనుమత్కుండమున స్నానమాడిన వారు అజేయులగుదురు., అగస్త్య తీర్థమున స్నానమాడిన వారు పుత్రవంతులు ధనవంతులూ అయ్యెదరు. రామ కుండమున స్నానమాడి రామసాలోక్యమును పొందెదరు. లక్ష్మీ తీర్థాభిషేకముతో లక్ష్మీవంతుడు రూపవంతుడగును. అగ్ని తీర్థమున స్నానమాడి సర్వకిల్బిష వినిర్ముక్తుడగును. శివతీర్థమున స్నానముచే శిలోకమును చేరును. శంఖ తీర్థమున స్నానమాడిన వాడు దుర్గతిని పొందడు. యమునాది తీర్థములందు స్నానమాడి స్వర్గమును పొదును. కోటి తీర్థమున స్నానమాడి సర్వతీర్థ ఫలమును పొందును. సాధ్యామృతమున స్నానమాడి సాధ్యసాలోక్యమును పొందును. సర్వతీర్థమున స్నానమాడి సకలాభీష్టములను పొందును. ధనుష్కోటిలో యధావిధిగా స్నానమాడి బంధ విముక్తుడగును. క్షీరకుండమున స్నానమాడిన వారు ఉన్నత భోగములను అనుభవించును. కపి తీర్థమున స్నానమాడిన వారు విజాతిని పొంద జాలరు. గాయత్రీ తీర్థమున, సరస్వతీ తీర్థమున స్నాన మాడిన వారు కిల్బిష విముక్తులగుదురు. ఋణమోచన తీర్థాదులందు స్నానమాడిన వారు ఋణ విముక్తులగుదురు. ఇది సేతు తీర్థముల మాహాత్మ్యమును నీకు చెప్పితిని. దీనిని వినువారు చదువు వారు సర్వపాపవినిర్ముక్తులయ్యెదరు. ఇది శ్రీ బృహన్నణారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదుమున సేతు మాహాత్మ్యమను డెబ్బది యారవ అధ్యాయము