Sri Naradapuranam-3    Chapters    Last Page

సప్త సప్తతి తమో%ధ్యాయః డెబ్బదియేడవ అధ్యాయము

నర్మదా తీర్థ మహాత్మ్యమ్‌

మోహిన్యువాచ :-

శ్రుతం మయా ద్విజశ్రేష్ఠ సేతు మాహాత్మ్య ముత్తమమ్‌ | అధునా శ్రోతుమిచ్ఛామి నర్మదాతీర్థ సంగ్రహమ్‌ 1

మోహిని పలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా ! నేను ఉత్తమమగు సేతు మాహాత్మ్యమును వింటిని. ఇపుడు నర్మదాతీర్థ సంగ్రహమును వినగోరుచున్నాను.

వసురువాచ :-

శ్రుణు మోహిని వక్ష్యామి నర్మదో భయతీరగమ్‌ | చతుశ్శతం ముఖ్యతమం ప్రోక్తం తీర్థకదంబకమ్‌ 2

ఏకాదశోత్తరే తీరే దక్షిణ చ త్రివింశతిః | పంచత్రింశత్తమః ప్రోక్తో రేవాసాగర సంగమః 3

ఓంకార తీర్థం పిరతో నగాదమర కంటకాత్‌ | క్రోశద్వయే సర్వదిక్షు సార్ధకోటి త్రయీ స్థితా 4

కోటిరేకాతు తీర్థనాం కపిలాసంగమే స్థితా | అశోక వని కాయాం చ తీర్థ లక్షం ప్రతిష్ఠితిమ్‌ 5

శతమంగార గర్తాయా కుబ్జాయా అయుతం తథా | సహస్రం వయూ సంగేతు సరస్వత్యా శ్శతం స్థితమ్‌ 6

శతద్వయం శుక్లతీర్థే సహస్రం విస్ణు తీర్థేకే | మాహిష్మత్యాం చ సాహస్రం శూలభేదే%యుతం విదుః 7

దేవగ్రామే సహస్రంచో లూకే సప్త శతీ స్థితా | తీర్థా న్యష్టోత్తర శతం మణి నద్యాశ్చ సంగమే 8

వైద్యనాధే చ తావన్తి తావంత్యేవ ఘటేశ్వరే | సార్థ లక్షం చ తీర్థానాం స్థితం రేవాబ్ధి సంగమే 9

అష్టాశీతి సహస్రాణి వ్యాసే దీప శతానిచ | సంగమే తు కరం జాయా స్థ్సిత మష్టోత్తరాయుతమ్‌ 10

ఏరండీ సంగమే తద్వ తీర్థాన్యష్టాధికం శతమ్‌ | ధూత పాప్యేష్ట షష్టిశ్చ సార్థ కోటిశ్చ కోకిలే 11

సహస్రం రోమకేశే చ ద్వాదశార్కే సహస్రకమ్‌ | లక్షాష్టకే సహస్రే ద్వే శుక్ల తీర్ధే నరేశ్వరి 12

సంగమేషు తు సర్వేషు శతమష్టాధికం విదుః | కావేర్యాస్సంగమే నందే తీర్థ పంచశతీ స్థితా 13

భృగోః క్షేత్ర చ తీర్ధానాం కోటి రేకా వ్యవస్థితా | భార భూత్యాం చ తీర్థానాం శతమష్టోత్తరం స్థితమ్‌ 14

అక్రూరేశే సార్థ శతం విమలేశే దశాయుతమ్‌ | సా సార్థ కోటి రిత్యేషా తీర్థ సంజ్ఞాచ నార్మదే 15

దశాదిత్యస్య నవచ కపిలస్యాష్టవై విధో ః | నందినః కోటి సంజ్ఞాని దథైవాష్ట శుభాననే 16

నాగాగ్ని సిద్ధావర్తాని సప్త సంఖ్యాని మోహిని | కేదారేన్ద్రియ వారీశ నందిదైవాని పంచ చ 17

యమేశావైద్య నాధాశ్చ వామనాంగార కేశ్వరాః | సారస్వతా మునీశాశ్చ దరుకేశాశ్చ గౌతమాః 18

చత్వార ఏవ గదితా స్త్రయో వై విమేశ్వరాః | సహస్రయజ్ఞభీష్మేశా స్వర్ణతీర్థాని చాపి హి 19

ధౌతపాప కరం జేశా ఋణముక్తి గుహాహ్వయమ్‌ | దశాశ్వమేధనందాఖ్యం మన్మధేశాఖ్య భార్గవమ్‌ 20

పరాశరాయోని సంజ్ఞం వ్యాసాఖ్య పితృ నిందకమ్‌ | గోపేశ మారుతే శాఖ్యం జంగలేశాఖ్య శుక్లకమ్‌ 21

అక్షరేశం పిప్పలేశం మాండవ్యం దీపకేశ్వరమ్‌ | ఉత్తరేశ మశోకేశం యోధనేశం రౌహిణమ్‌ 22

లుకేశం చ ద్విసంఖ్యాకం ప్రత్యేకం గదితం శుభే | సైకోన వింశతి శతం తీర్థాన్యేకైకశః శుభే 23

స్తబకేషు చ తీర్థాని ద్విశతం చ చతుర్దశమ్‌ | శైవాన్యేతాని తీర్థాని వైష్ణవాని ద్వివింశతిః 24

బ్రాహ్మాణి సర్వతీర్థాని శాక్తాన్యష్టౌ చ వింశతిః | తేషు సప్తచ మాతౄణాం త్రీణి బ్రాహ్మ్యా శ్శుభాననే 25

వైష్ణవ్యాద్వే తధా భ##ద్రే రౌద్రీశేషేషు సంస్థితా | తథైకం క్షేత్ర పాలస్య తీర్థముక్తం శుభాననే 26

అవాంతరాణి గుహ్యాని ప్రకటాని చ మోహిని | సార్ధత్రి కోటి తీర్థాని గదితానీహ వాయునా 27

దివి భువ్యంతరిక్షే చ రేవాయాం తాని సంతి చ | యస్త్వే తేషు మహాభాగే యత్ర కుత్రాపి మానవః 28

స్నానం కరోతి శుద్ధాత్మా స లభే దుత్తమాం గతిమ్‌ | స్నానం దానం జపో హోమో వేదాధ్యయన మర్చనమ్‌ 29

సర్వ మక్షయతాం యాతి నర్మదాయాస్తటే కృతమ్‌ | త్ర్యహాత్సారస్వతం తోయం సప్తాహోద్యామునం సతి 30

గాంగం సకృత్ల్పవాత్పుణ్యం దర్శనాదేవ నార్మదమ్‌ | ఇత్యేష కధితో దేవి నర్మదా తీర్థ సంగ్రహః 31

స్మరతామపి మర్త్యానాం మహాపాతక శాంతిదః | య ఇమం శృణు యాన్మర్త్యో నర్మదా తీర్థ సంగ్రహమ్‌ 32

శ్రావయేద్వా పఠేద్భద్రే సోపి పాపైః ప్రముచ్యతే | యద్గృహే లిఖితం చైత న్మాహాత్మ్యం నర్మదాభవమ్‌ 33

విద్యత్యేభ్యర్చితం తత్ర న మారీ నాగ్నిజం భయమ్‌ | నరాజ చౌర శత్రుభ్యో భయం రోగభయం న చ 34

తద్గృదహం పూర్యతే లక్ష్మ్యా ధనైర్థాన్యైర్నిరంతరమ్‌ | పుత్ర పౌత్రాదికానాం చ వివాహాద్యైస్సుమంగలమ్‌ 35

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున నర్మదా తీర్థ మాహాత్మ్యమను సప్త సప్తతి తమో%ధ్యాయః

వసువు పలికెను :-

ఓ మోహినీ! చెప్పెదను వినుము. నర్మదానదికి రెండు తీరములందు నాలుగు వందల తీర్థముల కలవు. ఉత్తరతీరమున పదకొండు, దక్షిణ తీరమున ముప్పది, రేవా సాగర సంఘమమున ముప్పది యైదు. చుట్టూ ఓంకార తీర్థము. అమర కంటక పర్వతమునకు క్రోశద్వయమున అన్ని దిక్కులలో సార్థకోటిత్రయి కలదు. కపిలాసంగమమున ఒకకోటి తీర్థములు కలవు. అశోకవనికయందు లక్ష తీర్థములు కలవు. అంగార గర్తము నందు నూరు, కుబ్జయందు పదివేలు, వాయు సంగమమున సహస్రము, సరస్వతి యందు నూరు, శుక్ల తీర్థమున రెండొందలు. విష్ణుతీర్థమున వేయి, మాహిష్మతియందు వేయి, శూల భేదమున పదివేలు, దేవగ్రామమున వేయి ఉలూకమున ఏడొందలు, మణి నదీ సంగమమున నూటా ఎనిమిది, వైద్య నాధమున ఘటేశ్వరమున కూడా అన్నియు రేవాసాగర సంగమమున సార్థ లక్ష తీర్థములు ఎనుబది ఎనిమిది వేలు, వ్వాస తీర్థమున ద్వీప శతకము, కరంజా సంగమమున పదివేల ఎనిమిది, ఏరండి సంగమమున నూట ఎనిమిది, ధూత పాపమున అరువది యెనిమిది, కోకిరమున సార్ధకోటి, రోమ కేశమున సహస్రము ద్వాదశార్కమున సహస్రము, లక్షాష్టక మున రెండు వేలు, శుక్ల తీర్థమున సర్వసంగమములందు నూటా ఎనిమిది, కావేరీ సంగమమున అయిదొందలు, భృగు క్షేత్రమున కోటి తీర్థములు భార భూతియందు నూట ఎనిమిది. ఆమ్రారేశమున సార్థశతము, విమలేశమున లక్ష తీర్థములు కలవు. ఇట్లు నార్మదమున సార్థకోటి తీర్థములు కలవు. దశాదిత్య తీర్థమున తొమ్మిది, కపిల తీర్థమున ఎనిమిది, నంది తీర్థమున కోటి ఎనిమిది, నాగాగ్నిసిద్ధా వర్తములు ఏడు, కేదారేంద్రియ వాగీశ నంది దైవతకములు అయిదు, యమేశ వైద్య నాధులు, వామనాంగార కేశ్వరులు సారస్వతులు మునీన్ద్రులు దాంకేశులు గౌతములు, నలుగురు విమలేశ్వరులు మువ్వురు, సహస్ర యజ్ఞ భీష్మేశులు, స్వర్ణతీర్థములు, ధౌతపాపకరం జేశులు ఋణముక్తి గుహసంజ్ఞకములు. దశాశ్వమేధము, నంద, మన్మధేశము, భార్గవము, పరాశరయోని సంజ్ఞము, వ్యాసాఖ్యపితృనందికలు, గోపీశ మారుతేశాఖ్యములు, జంగలేశాఖ్య శుక్లకము, అక్షరేశము, పిప్పలేశము, మాండవ్య దీపకేశ్వరము, ఉత్తరేశము, అశోకేశము, యోధనేశము, రౌహిణము, ద్విసంఖ్యాకమగు లంకేశము ప్రత్యేకముగా చెప్పబడినవి. ఇవి మొత్తము పందిమ్మిదొందలు విడి విడిగా ఒక్కొక్కటి పుణ్యప్రదము. స్తబకములందున్న తీర్థములు రెండు వందల పదునాలుగు. ఇవన్నియు శైవతీర్థములు. వైష్ణవ తీర్థములు ఇరువది రెండు. అన్నియూ బ్రహ్మతీర్థములే. శాక్త తీర్థములు ఇరువది యెనిమిది. వీటిలో మాతృదేవతలవి మూడు సరస్వతివి లక్ష్మివి రెండు, మిగిలిన పదునారుపార్వతీ తీర్థములు. ఇట్లే ఒకటి క్షేత్ర పాలతీర్థము కలదు. ఇచట అవాంతర తీర్థములు రహస్య తీర్థములు, ప్రకాశ తీర్థములు అన్నియూ కలిసి మూడు కోట్ల యాబధి లక్షలని వాయుదేవుడు చెప్పియున్నాడు. స్వర్గమున భూలోకమున అంతరిక్షమున కల తీర్థములన్నియూ ఇచట కలవు. ఈ తీర్థములలో ఏ దో ఒక తీర్థమున స్నానమాడిన పరిశుద్ధుడు ఉత్తమగతిని పొందును. నర్మదా తీరమున చేసిన దంతయూ అక్షయమగును. సరస్వతీ జలము మూడు దినములలో యమునా లము ఏడుద దినములలో, ఒక స్నానముచే గంగా జలము, దర్శన మాత్రముననే నర్మదా జలము పావనము చేయును. ఇట్లు నీకు నర్మదా తీర్థ సంగ్రహమును చెప్పితిని. ఈ తీర్థ సంగ్రహమును లిఖించి నిత్యము పూజించి ఇంటిలో మారీ అగ్ని, రా చోర శత్రు రోగ భయములు కలుగవు. ఆ గృహము నిరంతరము ధన ధాన్య సమృద్ధికలిగి యుండును. పుత్ర పౌత్రులతోవివాహాది శుభకార్యములచే నిరంతరము శోభిల్లు చుండును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున నర్మదాతీర్థ మాహాత్మ్యమను

డెబ్బది యేడవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page