Sri Naradapuranam-3 Chapters Last Page
ద్వ్యశీతితమోऽధ్యాయ = ఎనుబదిరెండవ అధ్యాయము
పురాణశ్రవణాదిఫలనిరూపణమ్
ఋషయ ఊచుః
సూత సాధో త్వయాఖ్యాతం శ్రీకృష్ణచరితామృతమ్ | శ్రుతం కృతార్థేస్తేన స్మో వయం భవదనుగ్రహాత్ 1
గతే వసౌ బ్రహ్మలోకం మోహినీ విధినందినీ | కిం చకార తతః పశ్చా త్తన్నో వ్యాఖ్యాతుమర్హసి 2
ఋషులు పలికిరి :- సాధుమహాశయా! సూతమహర్షీ! మీరు శ్రీకృష్ణ చరితామృతమును చెప్పితిరి. మేము వింటిమి. మీ అనుగ్రహమువలన కృతార్థులమైతిమి. వసువు బ్రహ్మలోకమునకు వెళ్లిన తరువాత బ్రహ్మ పుత్రికయగు మోహిని ఏమి చేసెనో మాకు తెలుపుడు.
సూత ఉవాచ:-
శృణుధ్వమృషయస్సర్వే మోహిన్యాశ్చరితం శుభమ్ | యచ్చకార వసోః పశ్చా త్తీర్థానాం పరిసేవనమ్ 3
యధానుశిష్టా వసునా మోహినీ సా విధేస్సుతా | జగామ విధినా తీర్థ యాత్రార్థం స్వర్ణదీతటమ్ 4
తత్ర గత్వా సమాప్లుత్య గంగాదీని తు వైధసీ | చచార విధివద్ధృష్టా బ్రాహ్మణౖస్సహ సంగతా 5
పురోహితేన వసునా యస్య తీర్థస్య యో విధిః | కధితస్తత్ర్పకారేణ సేవమానా చచార హా 6
తేషుతీర్ధేషు దేవాంశ్చ విష్ణ్వాదీన్పూజయన్త్యధ | సమర్పయన్తీ విప్రేభ్యో దానాని వివిధాని చ 7
గయాయాం విధివద్భర్తుః పిండదానం చకార హ | కాశ్యాం విశ్వేశ్వరం ప్రార్చ్య సంప్రాప్తా పురుషోత్తమమ్ 8
తస్మిన్ క్షేత్రే తు నైవేద్యం భుక్త్వా సా జగదీశితుః | శుద్ధదేహా తతః పశ్చా త్సంప్రాప్తా లక్ష్మనాచలమ్ 9
తం సమభ్యర్చ్య విధివత్ గత్వా సేయం సమర్చ్య చ | రామేశ్వరం మహేన్ద్రాద్రిం భార్గవం సమవందత 10
గోకర్ణం చ శివక్షేత్రం గత్వాభ్యర్చ్య తమీశ్వరమ్ | ప్రభాసం ప్రయ¸° విపాః సార్థం తైర్ద్విజసత్తమైః 11
స్నాత్వా సంతర్ప్య దేవాదీం స్తస్య యాత్రాం విధాయ చ | ద్వారకాయాం హరిం దృష్ట్వా కురుక్షేత్రం జగామ సా 12
తత్రాపి విధివద్యాత్రాం సంవిధాయ నరేశ్వర | గంగాద్వార ముపేయాయ తత్ర సస్నౌ విధానతః 13
తతస్తు దృష్ట్వా కామెదాం నమస్కృత్య ముదాన్వితా | బదర్యాశ్రమమాసాద్య నరనారాయణావృషీ14
సమభ్యర్చ్యాధ కామాక్షీం య¸° ద్రష్టుం త్వరాన్వితా | సిద్ధనాధం నమస్కృత్య తతోऽయోధ్యాముపాగతా 15
స్నాత్వా సరయ్వాం విధివ త్ర్పార్చ్య సీతాపతిం తతః | మధ్యయాత్రాముపాశ్రిత్య యయావమరకంటకమ్ 16
మహేశం తత్ర సంపూజ్య ప్రతిస్రోతస్తు నర్మదామ్ | సంపేవ్యోంకారమీశానం దృష్ట్వా మాహిష్మతం య¸° 17
త్ర్యంబకేశం తతః ప్రార్చ్య సంప్రాప్తా ప్రతిపుష్కరమ్ | పుష్కరేషు విధానేన దత్వా దానాన్యనేకశః 18
సంప్రాప్తా సా తు మధురాం సర్వతీర్థోత్తమోత్తమామ్ | విధాయాభ్యంతరీం యాత్రాం యోజనానాం తు వింశతీమ్ 19
పరిక్రమ్య పురీం పశ్చా చ్చతుర్వ్యాహం దదర్శ సా | స్నాత్వా వింశతితీర్ధే తు సరూప్యాధ ప్రదక్షిణామ్ 20
ధేనూనామయుతం ప్రాదా న్మాధురేభ్యోహ్యలంకృతమ్ | సంభోజ్య తాన్వరాన్నేన భక్తి క్లిన్నేన చేతసా 21
నమస్కృత్య విసృజ్యైతా న్కాలిందీం సముపావిశత్ | తతః ప్రవిష్టా సా దేవీం కాలిందీమఘనాశనమ్ 22
నాద్యాపి నిర్గతా భూయో యమతిధ్యంతమాస్థితా | స్మార్తాన్మూర్యోదయం ప్రాప్య శ్రౌతానప్యరుణోదయమ్ 23
నిశీధం వైష్టవాన్విప్రా ప్రాప్యదూషయతే వ్రతాన్ | మోహినీవే ధరహితా ముపోపై#్యకాదశీం నరః 24
ద్వాదశ్యాంవిష్ణుమభ్యర్చ్య వైకుంఠం యాత్యసంశయమ్ | మోహినీ విధిజా దేవీ విష్ణుజైకాదశీ ద్విజాః 25
విష్ణుజాస్పర్థయా ధాత్రా మోహినీ సా వినిర్మితా | రుక్మాం దస్తు రాజర్షి విష్ణుభక్తి పరాయణః 26
న తు వారయితుం శక్తా సా తమేకాదశీవ్రతాత్ | విష్ణులోకం గతే తస్మి న్సభార్యే ససుతే నృపే 27
స్పర్థత్యై కాదశీం సిద్ధిం యమాన్తే మోహినీ స్థితా | ఇత్యేతదుక్తం వి ప్రేన్ద్రా మోహినీ చరితం మయా 28
యదర్ధం నిర్మితా ధాత్రా తథాచాత్ర వ్యవస్థితా
సూతమహర్షి పలికెను:- ఓ మహర్షులారా! మీరందరూ శుభప్రదమగు మోహినీ చరితమును వినుడు. వసుపురోహితులు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిదప మోహినీదేవి పుణ్య తీర్థములను సేవించెను. బ్రహ్మపుత్రికయగు మోహిని వసువు చెప్పిన విధముగా యధావిధిగా తీర్థయాత్ర కొరకు గంగా తీరమునకు వెడలెను. అచట గంగాదితీర్థములలో స్నానమాడి యధావిధిగా దర్శించి బ్రాహ్మణులతో కలిసి పురోహితుడగు వసువు ఆయా తీర్థములకు చెప్పిన ఆయా విధులననుసరించి తీర్థములను సేవించుచు పర్యటించెను. ఆ తీర్థములందు విష్ణ్వాది దేవతలకు పూజించుచు బ్రాహ్మణులకు బహువిధ దానములనిచ్చుచు గయా తీర్థమున యధావిధిగా భర్తయగు రుక్మాంగదునకు పిండప్రదానమును గావించెను. కాశీ నగరమున విశ్వేశ్వరుని పూజించి పురుషోత్తమును చేరెను. అచట జగన్నాథుని నైవేద్యమును భుజించి పరిశుద్ధ దేహులై లక్ష్మణాచలమును చేరెను. అచట లక్ష్మణుని యధావిధిగా పూజించి సేతు తీర్థమునకు వెడలి రామేశ్వరుని పూజించి, మలిహోద్రిని చేరి పరశురాముని నమస్కరించెను. శివక్షేత్రమగు గోకర్ణమునకు
వెడలి ఈశ్వరుని పూజించి బ్రహ్మాణులతో కలిసిత ప్రభాసతీర్థమునకు వేళ్ళెను. అచట స్నానమాడి, దేవాదులకు తర్పనములనిచ్చి ప్రభాసయాత్రను జరిపి, ద్వారకయందు శ్రీహరిని చూచి కురుక్షేత్రమునకు వెడలెను. అచట కూడా యధావిధిగా యాత్రను జరిపి గంగాద్వారమును చేరి అచట స్నానమునాచరించెను. తరువాత కామోదాదేవిని దర్శించి సంతోషముచే నమస్కరించి, బదరికాశ్రమమును చేరి నరనారాయణ ఋషులను చక్కగా పూజించి కామాక్షీదేవిని దర్శించుటకు త్వరగా వెళ్ళెను. ఆచట సిద్ధనాధుని నమస్కరించి అయోధ్యకు చేరెను. సరయూనదిలో యధావిధిగా స్నానమాడి సీతాపతిని పూజించి మధ్యయాత్రానుసారముగా అమరకంటకమును చేరెను. అచట మహేశుని పూజించి ప్రతిస్రోతస్వియనగల నర్మదా తీర్థమును సేవించి ఓంకారేవుని దర్శించి మాహిష్మతీపురమునకు వెడలెను. అచట త్య్రంబకేశుని పూజించి త్రిపుష్కరమును చేరెను. పుష్కరములయందు యధావిధిగా దానములనొసంగి సర్వతీర్థోత్తమమగు మధురా తీర్థమును చేరెను. వింశతి యోజనముల అభ్యర్తర యాత్రను ఆచరించి, మధురానగరమునకు ప్రదక్షిణ మాచరించి చతుర్వ్యూహములను దర్శించెను. వింశతి తీర్థములలో స్నానమాచరించి యాత్రను ముగించి బహుదక్షిణలతో మధురానగర వాసులకు పదివేల గోవులను దానమొసంగెను. భక్తి పూర్ణమానసముతో వారిని పరమాన్నముచే భుజింపచేసి నమస్కరించి వారిని విడిచి పుచ్చి యమునానదికి చేరెను. అంత పాపనాశిని యగు కాలిందీనదిలో ప్రవేశించిన మోహిని నేటికి బయటికి రాలేదు. అటనుండి దశమీతిథిని చేరియున్నది. సూర్యోదయ కాలమున స్మార్తులను, అరుణోదయ కాలమున శ్రౌతులను, నిశీధ కాలమున వైష్ణవులను చేరి దూషింప చేయును. మోహినీ
వేధరహితయగు ఏకాదశిన ఉపవసించి ద్వాదశినాడు శ్రీహరిని పూజించినచో వైకుంఠమును పొందెదరు. మోహిని బ్రహ్మపుత్రిక. ఏకాదశి విష్ణుపుత్రిక. విష్ణుపుత్రికతో పోటీ చేయుటకు బ్రహ్మ మోహినిని సృజించెను. రుక్మాంగద రాజర్షి విష్ణుభక్తి పరాయణుడు కావున అతనిని ఏకాదశీవ్రతమునుండి వారించజాలకపోయెను. భార్యాపుత్ర సహితముగా రుక్మాంగదుడు విష్ణులోకమును చేరిన తరువాత ఏకాదశిని ద్వేషించుచు దశమీతిధిలో మోహిని నివసించుచున్నది. ఇట్లు మీకు మోహినీ చరితమును తెలిపితిని. మోహినీ ఏ కార్యమునకు సృజించబడి ఇచట ఎట్లు నివసించుచున్నదో మీకు వివరముగా తెలిపియున్నాను.
నారదీయోత్తరంహ్యేత త్ర్పోక్తం వో భుక్తిముక్తిదమ్ 29
అత్రసమ్యగ్ఘరేర్భక్తి స్సాధ్యతేऽనుపదం నృణామ్ | నారదీయం పురాణం తు లక్షణౖర్ధశభిర్యుతమ్ 30
యశ్శృణోతి నరో భక్త్యా స గచ్ఛేద్వైష్ణవం పదమ్ | ధర్మార్ధకామమోక్షాణాం చతుర్ణాం కారణం పరమ్ 31
సర్వేషాం చ పురాణానాం ఇదం బీజం సనాతనమ్ | ప్రవృత్తం చ నివృత్తం చ పురాణ్వऽస్మిన్ద్విజోత్తమాః 32
విస్తరాదుదితం సర్వం పారాశ##ర్యేణ ధీమతా | అలౌకిక చరిత్రాఢ్యం పురాణం నారదీయకమ్ 33
యసై#్మ కసై#్మ న దాతవ్యం మహ్యం వ్యాసేన కీర్తితమ్ | హిత్వా స్వశిష్యాన్పైలాదీ న్మహ్యం నారదసంహితామ్ 34
యో వ్యాచక్రే నమస్తసై#్మ వేదవ్యాసాయ విష్ణవే | పురాణసంహితామేతాం నారదాయ విపశ్చితే 35
సనకాద్యా మహాభా8గా మునయః ప్రచకాశిరే | హంసస్వరూపీ భగవా న్యదా తం బ్రహ్మ శాశ్వతమ్ 36
తదుపాదిశ##దేతేభ్యో విజ్ఞానేన విజృంభితమ్ | తదితం భగవాన్సాక్షా న్నారదోऽధ్యాత్మదర్శనః 37
వేదవ్యాసాయ మునయే రహస్యం నిర్దిదేశ హ | మయా ప్రకాశితం హ్యేత ద్రహస్యం భువి దుర్లభమ్ 38
చతుర్వర్గప్రదం నౄణాం శృణ్వతాం పఠతాం సదా | విప్రో వేదవిధి ర్భూత్వా క్షత్రియో జయతే మహీమ్ 39
వైశ్యో ధనసమృద్ధస్స్యా చ్ఛూద్రో ముచ్యేత దుఃఖతః | పంచవింశతిసాహస్రీ సంహితేయం ప్రకీర్తితా 40
పంచపాదసమాయుక్తా కృష్ణద్వైపాయనేన హ | అస్యాం వై శ్రూయ మాణాయాం సర్వసందేహ భంజనమ్ 41
పుంసాం సకామభక్తానాం నిష్కామానాం విమోక్షణమ్ | పుణ్యతీర్థం సమాసాద్య నైమిషం పుష్కరం గయామ్ 42
మథురాం ద్వారకాం విప్రా నరనారాయాణాశ్రమమ్ | కురుక్షేత్రం నర్మదాం చ క్షేత్రం శ్రీపురుషోత్తమమ్ 43
హవిష్యాశీ ధరాశాయీ నిస్సంగో విజితేంద్రియః | పఠిత్వా సంహితామేనాం ముచ్యతే భవసాగరాత్ 44
ఏకాదశీవ్రతాణం చ సరితాం జాహ్నవీ యధా | బృందావన మరణ్యానాం క్షేత్రాణాం కౌరవం యధా 45
యధా కాశీ పురీణాం చ తీర్థానాం మధురా యథా | సరసాం పుష్కరం విప్రాః పురాణానా మిదం తథా 46
గణశభక్తా స్సౌరాశ్చ వైష్ణవాః శాక్తశాంభవాః | సర్వేऽధికారిణో హ్యత్ర సకామాశ్చాప్యకామకాః 47
యం యం కామమభిధ్యాయ నరోऽనార్య ధవాదరాత్ | శృణోతి శ్రావయేద్వాపి తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ 48
రోగార్తో ముచ్యతే రోగాత్ భయార్తో నిర్భయో భ##వేత్ | జయకామో జయేచ్ఛత్రూ న్నారదీయానుశీలనాత్ 49
సృష్ట్యాదౌ రజసా విశ్వం మధ్యే సత్త్వేన పాతి యః | 50
ఋషయో మనవో సిద్ధా లోకపాలాః ప్రజేశ్వరాః | బ్రహ్మాద్యా రచితా యేన తసై#్మబ్రహ్మత్మనే నమః 51
యతోవాచోనివర్తంతే న మనో యత్ర సంవిశేత | తద్విద్యాదాత్మనో రూపం హ్యరూపస్య చిదాత్మనః 52
యస్య సత్యతయా సత్యం జగదేతద్వికాశ##తే | విచిత్రరూపం వన్దే తం నిర్గుణం తమసః పరమ్ 53
ఆదౌ మధ్యే చాప్యజన శ్చాన్తే చైకాక్షరో విభుః | విభూతి నానారూపేణ తం వందేऽహం నిరంజనమ్ 54
నిరంజనాత్సముత్పన్నం జగదేతచ్చరాచరమ్ | తిష్టత్యప్యేతి వా యస్మిం స్తత్సత్యం జ్ఞానమద్వయమ్ 55
శివం శైవా వదన్త్యేనం ప్రధానం సాంఖ్యవేదినః | యోగినః పురుషం విప్రాః కర్మ మీమాంసకా జనాః 56
విభుం వైశేషికాద్యాశ్చ చిచ్ఛక్తిం శక్తి చింతకాః | బ్రహ్మద్వితీయం తద్వన్దే నానారూపక్రియాస్పదమ్ 57
భక్తిర్భగవతః పుంసాం భగవద్రూపకారిణీ | తాం లబ్ధ్వా చాపరం లాభం కో వాంఛతి వినా పశుమ్ 58
భగవద్విముఖా యే తు నరాస్సంసారిణో ద్విజాః | తేషాం ముక్తిర్భవాటవ్యా నాస్తి సత్సంగమంతరా 59
సాధవస్సముదాచారా సర్వలోకహితావహాః | దీనానుకంపినో విప్రాః ప్రపన్నాస్తారయంతి హి 60
యూయం ధన్యతమా లోకే మునయస్సాధుసమ్మతాః | యన్ముహుర్వాసుదేవస్య కీర్తిం పల్లవనూతనామ్ 61
ధన్యోऽస్మ్యనుగృహీతోऽస్మి భవద్భర్లోకమంగలమ్ | యత్స్మరితో హరిస్సాక్షా త్సర్వకారణకారణమ్ 62
ఓమ్
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణ బృహదుపాఖ్యానే
ఉత్తరభాగే ఏతత్పురాణశ్రవణాదిఫలనిరూపణం
నామ ద్వ్యశీతి తమోऽధ్యాయః
సమాప్తమిదం సప్తమం
నారదీయం మహాపురాణమ్
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓ బ్రాహ్మణోత్తములారా? మీకు భక్తి ముక్తి ప్రదమగు నారదీయోత్తరభాగమును చెప్పితిని. ఈ భాగమున ప్రతిక్షణము ప్రతిపదము శ్రీహరియందు భక్తిని పెంపొందించును. పది లక్షణములతో కూడియున్న నారదీయ మహాపురాణమును భక్తితో వినినవారు శ్రీ విష్ణుపదమును చేరెదరు. ఈ నారదీయ పురాణము ధర్మార్థకామ మోక్షములను నాలుగు పురుషార్థములకు కారణము. సర్వపురాణములకు ఇదియే బీజము. ఈ పురాణమున ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును శ్రీ వేదవ్యాస భగవానులు విస్తరముగా వర్ణించిరి. నారదీయ మహాపురాణము అలౌకిక చరిత్రచే శోభితము. నాకు వ్యాస భగవానులు తెలిపిరి. ఈ పురాణమును అందరికీ ఉపదేశించరాదు. వ్యాస భగవానుడు స్వశిష్యులకు పైలాదులను విడిచి నాకు మాత్రమే వ్యాఖ్యానముగావించెను. అట్టి వేదవ్యాస భగవానుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. ఈ నారదీయమహాసంహితను పండితోత్తముడగు నారద మహర్షికి మహానుభావులకు సనకాది మహర్షులు ప్రకాశింపచేసిరి. పరమహంస స్వరూపియగు శాశ్వత బ్రహ్మరూపుడగు భగవానుడు విజ్ఞాన విజృంభితమగు నారదీయ మహాపురాణమును సనకాదులకు ఉపదేశించెను. సాక్షాద్భగవత్స్వరూపుడు అధ్యాత్మజ్ఞానము కల నారదమహర్షి వేదవ్యాస మహర్షికి రహస్యముగా ఉపదేశించెను. వేదవ్యాస మహర్షి నాకుపదేశించెను. చదువువారికి వినువారికి చతుర్వర్గ ఫలప్రదము పరమరహస్యము, భూలోక దుర్లభము అగు ఈ నారదీయ మహాపురాణమును నేను మీకు ఉపదేశించితిని ఈ నారదీయ మహాపురాణమును చదివినవారు, వినినవారు బ్రాహ్మణులైనచో వేదవిదులగుదురు. క్షత్రియుడు భూమండలమును జయించును. వైశ్యుడు ధన సమృద్ధిని పొందును. శూద్రుడు దుఃఖనివృత్తిని పొందును. ఈ నారదీయ మహాపురాణము ఇరువది అయిదువేల శ్లోకములు గలదని చెప్పబడినది. అయిదు పాదములు కలది అని వేదవ్యాస భగవానులు చెప్పిరి. నారదీయ మహాపురాణమును వినినచో సర్వసందేహములు తొలగిపోవును. కోరికలు కలవారికి కోరికలు తీరును. నిస్కాములకు మోక్షములభించును. నైమిషారణ్యమును, గయను, పుష్కరమును, మధురానగరమును, ద్వారకానగరమును, నర నారాయనాశ్రమమును, కురుక్షేత్రమును, నర్మదాతీర్థమును, శ్రీపురుషోత్తమ క్షేత్రమును ఇంకా ఇతర పుణ్య తీర్థములను దర్శించువారు. ఆయా తీర్థములలో హవిష్యమును భుజించుచు, ధరపై పడుకొనుచు, నిస్సంగులై, జితేంద్రియులై ఈ నారదీయ మహాపురాణమును చదివినచో భవసాగరము నుండి విముక్తులగుదురు. వ్రతములలో ఏకాదశీ, నదులలో గంగ, అరణ్యములలో బృన్దావనము, క్షేత్రములలో కురుక్షేత్రము, పురములలో కాశీపురి, తీర్థములలో మధురాతీర్థము, సరస్సులలో పుష్కర సరస్సు, పురాణములలో నారదీయ మహాపురాణము సర్వశ్రేష్ఠములు. గణశభక్తులు, సూర్యభక్తులు, శ్రీవిష్ణుభక్తులు, శక్తిభక్తులు, శివభక్తులు అందరూ సకాములు నిష్కాములు ఈ మహాపురాణమునకు అధికారులు. ఏ కోరికను సంకల్పించుకొనినవారు పురుషులు కాని స్త్రీలుకాని ఆదరముతో ఈ నారదీయ మహాపురాణమును వినినూ వినిపించిననూ ఆయా కోరికలు తీరును. రోగార్తులు రోగ విముక్తులగుదురు. భయార్తులు భయముక్తులగుదురు. నారదీయపురాణ పఠన శ్రవణమువలన జయమును కోరువారు జయమును పొందెదరు. సృష్ట్యాదిలో రజోగుణముచే, మధ్యకాలమున సత్త్వగుణముచే జగత్పాలనను, అంతమున తమోగుణముచే సంహారమును చేయు సర్వాత్మయగు పరమాత్మకు నమస్కారము. ఋషులు, మనువులు, సిద్ధులు, లోకపాలకులు, ప్రజాపతులు, బ్రహ్మాదులు సృజించబడిన పరమాత్మకు నమస్కారము. వేదము కూడా అచటి నుండి మరలివచ్చును. మనసు వెళ్ళజాలదు. అట్టి రూపరహితుడు, చిత్స్వరూపుడగు పరమాత్మ స్వరూపమును తెలియవలయును. అతని సత్యము చేతనే ఈ జగత్తు సత్యముగా విచిత్ర రూపముగా ప్రకాశించును. అట్టి తమోతీతుని నిర్గుణుని నమస్కరించుచున్నాను. ఆదిమధ్యలలో పుట్టుకలేనివాడు, అన్తమున ఏకాక్షరస్వరూపుడు, నానారూపములచే ప్రకాశించువాడు యగు ఆ పరమాత్మకు నమస్కారము. చరాచరరూపమగు ఈ జగత్తంతయూ నిరంజనుని వలననే పుట్టినది. అతనిలోనే నిలుచును. లీనమగును. అదియే సత్యము. ఏకరూపమగు జ్ఞానము. శైవులు శివుడని, సాంఖ్యులు ప్రధానమని, యోగులు పురుషుడని, మీమాంసకులు కర్మయని, వైశేషికాదులు విభువని, శక్తిచింతకులు శక్తియని, చెప్పబడు అద్వితీయము నానారూపక్రియాస్పదమగు పరబ్రహ్మను నమస్కరించుచున్నాను. మానవులకు భగవద్భక్తియే భగవత్స్వరూపమును ప్రసాదించును. అట్టి భక్తిని పొందిన తరువాత ఇతర లాభములను కోరు పశువెవడు? భగవద్విముఖులై సంసారమున సంచరించు మానవులకు సత్సంగమము లేనిదే సంసారారణ్యమునుండి విముక్తి లభించదు. సాధువులు సదాచారపరాయణులు సర్వలోక హితానుషంగులు, దీనులయెడ దయాపరులు, భగవంతుని ఆశ్రయించిన మహానుభావులు లోకులను తరిపంజేతురు. ఓ మహర్షులారా! ఈ లోకమున మీరు ధన్యతములు, సాధు సమ్మతులు. మీరు ఎప్పుడూ నిత్యనూతన మగు వాసుదేవుని కీర్తిని గానము చేయుచు చేయించుచుంటిరి. లోకకళ్యాణమును కాంక్షించి మీరు సర్వకారణ కారణమగు శ్రీమన్నారాయణుని స్మరింపచేసితిరి. మీ వలన నేను ధన్యుడనైతిని. అనుగ్రహించబడితిని.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
ఈ పురాణ శ్రవణాది ఫలనిరూపణ
మను ఎనుబదిరెండవ
అధ్యాయము
సమాప్తము
ఏడవ నారదీయమహాపురాణము సమాప్తము
ఓం శాన్తిః శాంతిః శాంతిః
శ్రీ కృష్ణార్పణమ్
------