Sri Matrukachakra viveka    Chapters   

శ్రీః

శ్రీమాతృకాచక్రవివేకః

***

సంజ్ఞావివేకః ప్రథమః

శ్రీ గురుభ్యోనమః

జాగ్రత్సుషుప్తి కృత రక్షిణ వామపార్శ్వాం
స్వప్న స్వభావ పరికుప్త జఘన్యభాగాం |
తుర్యాతితుర్య ఘటితాసన హృత్ప్రదేశాం

ప్రాణశ్వరీం పరశివస్య పరామృశామః ||
1
శ్రీ గణశాయ నమః - శ్రీ పితృభ్యోనమః
శిష్యమస్తక నిరంతరస్థితం
చిత్సుఖామృత పయోధికారణం |
శ్రీ గురోరరుణ పాదపంకజం
సేవకాళి కులసంకలం భ##జే||
నమస్తేజస్త్రయీసర్గ విశ్రాంతిస్థాన శక్తయే |
తదుత్తీర్షోర్థ్వ విశ్రాంతిస్ఫూర్తయే గురుమూర్తయే ||

జాగ్రత్సుషుప్తికృత దక్షిణవామ పార్శ్వాం
= జాగ్రత్సుషుప్తులచేత చేయబడినటువంటి కుడియెడమ భాగములు గలిగినట్టిది, స్వప్నభావ=స్వప్నభావముచేత, పరిక్లప్త=కల్పింపబడిన, జఘన్యభాగాం=యోనిభాగముగా గలిగినట్టిది, తుర్యాతితుర్య=తుర్యాతితుర్యముల చేత, ఘటిత=కల్పింపబడిన, ఆననహృత్ప్రదేశాం=ముఖ హృదయ భాగములు గలిగినది, పరశివ=పరశివుని యొక్క, ప్రాణశ్వరీం=ప్రాణశ్వరిని, పరామృశామః=విమర్శంచుచున్నాము.
సుషుప్తి నివర్తించిన పిమ్మట ఘటపటాదులను చిత్తుకంటే భేదముగా అనుసంధానదశలో కలదు. జాగ్రత్‌ సుషుప్తులచేత క్రమముగా నిరూపించబడిన దక్షిణ వామపార్శ్వములు కలిగినటువంటిది. జాగ్రత్‌ క్రియారూపమై నందున దక్షిణభాగము, శరీరమందు దక్షిణభాగము కర్మ ప్రధానము. నిష్క్రియాత్మకమగు వామభాగము స్త్రీ భాగము. సుషుప్తి నివర్తించనిదిగా నుండగా మనస్సులో కలుగు భేదసంసారము స్వప్నము. ఆ స్వప్నావస్థచే కల్పించబడినది యోనిభాగముగా కలిగినటువంటిది. స్నప్నము, సుషుప్తి జాగ్రన్మధ్యదైనను వికల్పసృష్టికి స్థానమైనందున యోనిత్వమొప్పెను. సుషుప్తి సంసారముయొక్కొ గర్భదశ. స్వప్నము ప్రసవదశ. జాగ్రత్‌ను ప్రవృత్తిదశగా తెలియనగును. ఈ ప్రకారము శరీరచక్రమందు జీవునియొక్క అవస్థాత్రయాత్మకమగు త్రికోణమును అనుసంధానుముచేసి, ఆ శరీర మందే శివత్రికోణముయొక్క అనుసంధానమును చెప్పుచున్నారు.
తుర్యమనగా నాలుగవదశ చైతన్యమునకు వ్యాప్తి గలదు. జీవునియొక్క అవస్థాత్రయమందు చిత్తే కారణముగా గల చైతన్యమునకు తిరిగి చిన్మయముగా అనుసంధానవదశ యగు తుర్యమును విచారించగా తుర్యమందు చిద్వ్యాప్తిగా అవస్థా త్రయమున్నప్పటికిని అవస్థాత్రయమందు విచిత్రము లేక ఏకరసముగా నుండుటవల్ల ఏకవిధత్వమే తుర్యమునకు చెప్పబడెను. తుర్యమును అతిక్రమించినది తుర్యాతీతము. సంసారకళ##చే తాకబడక శుద్ధమై అంతర్ముఖమైన చిద్విశ్రాంతి యీ రెంటిచేత క్రమముగా ముఖ హృదయభాగములుగా యేర్పడినటువంటిది. తురీయమునకు జాగ్రదాది దశలయందు విజృంభించు చైతన్యమును కబళించుట వలన ముఖత్వము చెప్పబడెను. ముఖము చర్వణవ్యాపారము కలది. దశలకు ప్రాణభూతమైనందున హృదయత్వము నిరూపించబడెను. జాగ్రదాది దశాచతుష్టయముగా భావించి చతురశ్రచక్రముగా నైనను లేక, తుర్యమందున జాగ్రదాది త్రైవిద్యోపాధిబనిట్టి శివజీవ త్రికోణములు రెండును కలసికొనుటచే షట్కోణ చక్రముగాగాని శరీరనుందు భావించి, చక్ర నాభిస్థానమైన హృదయదేశమందు తుర్యాతీతవిశ్రాంత్యాత్మకముగా ప్రాణ కళ##చే స్ఫురిందుచున్నటువంటిది. చతురంగినిగా గాని, షడంగిని గా గాని పరశివువియొక్క ప్రాణశ్వరిని పరామర్శచేయు చున్నాము. పరశివస్య ప్రాణశ్వరీం అని, పరశివునికి సత్తా సంపాదకురాలుగా జెప్పుటచే యీ పంచావస్థలకు పరమందు అఖండరూపమగు పరశివదశ ఒకటి అంగీకరించినందువలన శివాధిక్యము చెప్పబడుచున్నది. ప్రాణశ్వర అనుటవలన అట్టి పరశివదశ కూడ ఈవిమర్శశక్తి ఆధీనముగానే ఉండుటవలన శక్తికి కూడా ఆధిక్యము పరిగ్రహించబడెను. నమస్కారాది సమస్త క్రియలను ఆలోచించగా విమర్శ గర్భితములే గనుక పరామర్శించుచున్నామనిరి.
స్పర్శ స్వరోల్లిఖిత జాగర సుప్త్యవస్థాం
అంతస్థ సూచిత సుషుప్త్యుదిత ప్రబోధాం |
ఉష్మోక్త జాగర దశోదిత సుప్త్యవస్థాం

మంత్రోత్కరస్య జననీం మనసా విశామః ||
2
స్పర్శలచేత, స్వరములచేత బోధింపబడిన జాగర, సుషుప్త్యవస్థలు కలిగినటువంటిది. అంతస్థలచేత బోధించబడిన సుషుప్తి దశయందు పుట్టిన జాగ్రత్‌ కలిగినటువంటిది. ఊష్మలచేత చెప్పబడిన జాగ్రద్దశయందు పుట్టిన సుషుప్తి దశ కలిగినటువంటి మంత్రనముదాయమునకు కారణభూతురాలైన మాతృకము మనస్సుచేత విశామః
= విచారించుచున్నాము.
'క' మొదలుకొని 'మ' వరకు గల స్పర్శలలో సృష్టిప్రయత్నముండును. అకారము మొదలుకొని విసర్గ వరకు గలవి స్వరములు. ఉచ్చారణయందు సంకోచమునకు వికాసబాహుళ్యము వలన అని అర్థము. స్పర్శలచే జాగరమును, స్వరములచే సుషుప్తిని తెలుపుచున్నటువంటిది. య ర ల వ లు అంతస్థలు. అంతస్థలచే సుషుప్తి దశయందు పుట్టిన ఘటపటాద్యనుసంధానరూపమగు స్వప్నమును తెలుపు చున్నటువంటిది. శ ష స హ లు ఊష్మలు. ఊష్మలచే జాగ్రద్దశయందు పుట్టిన సుషుప్తి అను అవస్థను తెలుపు చున్నటువంటిది. అనగా జాగ్రత్‌ ఊర్థ్వమందు సుషుప్తికి పూర్వమందు కలుగు యోగనిద్ర అను పేరుగల తుర్యావస్థను తెలుపుచున్నదనుట. ఇంకను సమస్త లౌకికాలౌకిక మంత్ర సముదాయమునకు కారణభూతురాలైన మాతృకను ఏకాగ్ర చిత్తముచే అనుసంధానము చేయుచున్నాము. ఇచట క్షకారము చెప్పకున్నను కూటాక్షరమైన క్షకారము తుర్యా తీతమును తెలుపుచున్నదని వివక్షింపబడినది.
సంకోచ సంశ్రయణ వర్జన భావభంగ్యా
జాగ్రత్సుషుప్తి దశయోర్గమకౌ ప్రయత్నే |
ద్వౌ స్పృష్టతా వివృతతే విదితౌ సుధీ భిః

స్వర్శస్వరాక్షర గతౌ పరిశీలయామః ||
3
సంకోచ భంగ్యా
=సంకోచముయొక్క, సంశ్రయణ=పరిగ్రహించుట, వర్జన=త్యాగముల యొక్క, భావ=స్వభావముయొక్క, భంగ్యా=ప్రకారముచేత, జాగ్రత్సుషుప్తిదశయోః=జాగ్రత్సుషుప్తిదశలకు, గమకౌ=జ్ఞాపకములైన, స్పర్శస్వరాక్షరగతౌ=స్పర్శస్వరాక్షరముల యందు ఉన్నటువంటి, స్పృష్టతావివృతతే=స్పృష్టతా వివృతత అనునటువంటివి, సుధీభిః=పండితులచేత, విదితౌ=తెలియ బడిన, ద్వౌ=రెండైనటువంటి, ప్రయత్నౌ=ప్రయత్నములను, పరిశీలయామః=పసరిశీ లించుచున్నాము.
సంకోచముయొక్క పరిగ్రహణము, సంకోచము యొక్క వర్జనము, ఈ రెండు భావములయొక్క ప్రకారము చేత అనగా సాదృశ్యముచేత జాగ్రత్సుషుప్తి దశలను సూచించుచున్న స్పృష్టతా వివృతతా అను రెలడుప్రయత్నములు, స్పృర్శ స్వరాక్షరములయందు కలవని పండితులచే తెలుసుకొన బడెను, అట్టివాటిని పరిశీలించు చున్నాము. స్పృష్టతా అనగా - కంఠతాల్వాదులయొక్క ఊర్థ్వాధోభాగ సంఘట్టనరూప వర్ణోచ్చారణ ప్రయత్నము. వివృతత అనగా సంఘట్టితములైన కంఠాది భాగద్వయముయొక్క విఘటన ప్రయత్నము. ఘటపటాదులను గ్రహించు జాగ్రత్‌ యందు స్వాత్మకు సంకోచభావము. విశ్రాంతిస్థానమైన సుషుప్తియందు పూర్ణభావము అనుభవవేద్యము. అందుచే జాగ్రత్సుషుప్తులకు సృర్శ స్వరములచే సంకోచగ్రహణము, సంకోచత్యాగము సాదృశ్యముగా బుద్ధిమంతులచే అంగీకరించబడినది. వర్ణములు అవస్థాసూచకము లైనప్పటికిని వర్ణోచ్చారణ ప్రయత్ములు కూడా సాదృశ్యమును సూచించు చున్నవి. ఇట్లు అవస్థలకు, వర్ణములకు, ఉచ్చారణప్రయత్నము లకు సాదృశ్యమును పరిశీలించుట సమాధి యని ఉపదేశింపబడెను.
స్పృష్టి ర్యవర్గ విషయా వివృతత్వయుక్తా
స్పృష్ట్యన్వితా వివృతతా చ శవర్గనిష్ఠా |
తౌ స్వప్నతుర్యదశయో ర్గమకౌ ప్రయత్నౌ

ఏతౌ స్మరామ్యసకలా పరిపూర్తి పూర్త్యోః ||
4
యవర్గవిషయా
=యవర్గయందు ఉన్నటువంటి, స్పృష్టి=స్పృష్టతా ప్రయత్నము, వివృతత్వయుక్తా=వివృతత్వముతో కూడుకొన్నది, శవర్గనిష్ఠా=శవర్గమం దున్నటువంటి, వివృతాచ=వివృతప్రయత్నము. స్పృష్టన్వితా=స్పృష్టతతో కూడుకొన్నది, ఏతౌ=ఆ రెండైన, అసకలా పరిపూర్తిపూర్త్యోః=అసమగ్రమైన సంకోచభావము, అసమగ్రమైన పూర్ణభావము కలిగినటువంటి, స్వప్నతుర్య దశయోః=స్వప్న తురీయదశలకు, గమకౌ=బోధకము లైన, ప్రయత్నౌ=ప్రయత్నములను, స్మరామి=స్మరించు చున్నాను.
యవర్గోచ్చారణయందున్న స్పృష్టతాప్రయత్నము వివృతత్వముతో కూడుకొన్నది. అనగా మిశ్రప్రయత్నము. ఇచ్చట స్పృష్టత ప్రధానము, వివృతత అప్రధానము. శవర్గ యందున్న వివృతత, స్పృష్టతతో కూడుకొన్నది. ఇచట వివృతతకు ప్రాధాన్యము, స్పృష్టతకు అప్రాధాన్యము. అనగా యవర్గోచ్చారణయందు స్పృష్టతా ప్రయత్నము వివృతత్వముతో సంకీర్ణమైనందువలన పూర్ణస్పృష్టతగాక ఈషత్స్పృష్టతగా నుండెను. శవర్గోచ్చారణయందున్న వివృతతా ప్రయత్నము కూడ స్పృష్టతా సంకీర్ణమైనందువలన పూర్ణము గాక ఈషద్వివృతత్వమే. అందువలననే ఈ రెండు ప్రయత్నములు అసమగ్ర సంకోచభావము, అసమగ్రపూర్ణభావము లైన స్వప్నతుర్యదశలను సూచించుచున్నవి. ఈషత్సంకోచ రూపమైన స్వప్నమునకు ఈషత్స్పృష్ఠత, ఈషత్పూర్ణరూప మైన తుర్యమునకు ఈషద్వివృతతయు.
పూర్ణైవ పూర్తి రవికల్పపదే సుషుప్తౌ
జాగ్రత్యపూర్తి రపి సంసృతిధామ్ని తద్వత్‌ |
జాగ్రత్సుషుప్తి సమవాయపదే తురీయే

స్వప్నేచ తాదృశి తయోరసమగ్రతైవ ||
5
అవికల్పపదే
=నిర్వికల్పకక్ష అయినటువంటి, సుషుప్తౌ సుషుప్తియందు, పూర్తిః=పూర్తి, పూర్ణెవ=పూర్ణ మైనదే, సంసృతిధామ్ని=సంసారపదమైన, జాగ్రతి=జాగ్రతయందు, అపూర్తిరపి=సంకోచభావము కూడ తద్వత్‌=అట్లే పూర్ణమైనదే, జాగ్రత్సుషు... పదే = జాగ్రత్సుషుప్తులు కలుసుకున్న, తురీయే = తురీయమందు, తాదృశి = అటువంటి, స్వప్నేచ = స్వప్నమందును, తయోః=ఆ పూర్త్యపూర్తులకు, అసమగ్రతైవ=సమగ్రత లేకపోవుటయే.
నిర్వికల్పకక్ష్య అయిన సుషుప్తి యందు బాహ్యాభ్యంత రేంద్రియములు విశ్రాంతిని పొందుటవల్ల పూర్తి పూర్ణముగా నుండును. వికల్పములు లేకపోవుటయే నిరాఘాటమైన పూర్ణ భావము, ఇట్లు అనుభవమే ప్రమాణము. ఘటపటా ద్యను సంధానరూపమైన జాగ్రతయందు అపూర్తి కూడా పూర్ణముగా నుండును. గాఢ వికల్పోదయ స్థానమైనటువంటి, విశ్రాంతి లేనటువంటి సంసారపదమైన జాగ్రతయందు సంకోచభావము సమగ్రముగా నుండును. గాఢవికల్పోదయమే మహాసంకోచ సమర్పకమని అనుభవమే ప్రమాణము. జాగ్రత్సుషుప్తి సమవాయ పదమగు మిశ్రపదమైన తురీయమందునుకూడి మిశ్ర పదమైన స్వప్నమందును పూర్తిఅపూర్తులకు పూర్ణత లేదు. విచారించగా తురీయమందు విశ్రాంతి లక్షణమైన సుషుప్తికే వ్యాప్తి అయినప్పటికిని చైత్యానుసంధానముండుటచే వికల్ప సంబంధ ముండుటవలన జాగ్రతగూడ అనుసరించి ఉండుటచే విశ్రత్వమేగాని స్వప్నము వికల్ప ప్రాధాన్యమైనది. తురీయము విశ్రాంతి ప్రాధాన్యమైనది. జాగ్రత్సుషుప్తి సమవాయ మున్నంతమాత్రము చేత రెండును ఏకరూపముకాదు. అయి నప్పటికిని మిశ్రత్వ వివక్షమాత్రమే ఇచట సామ్యముగా చెప్పబడినది. తుర్యమందు పూర్తికి అసామగ్ర్యము. స్వప్న మందు అపూర్తికి అసామగ్ర్యమని యోచించవలెను.
స్వప్నః సుషుప్త్యనుగతో నను జాగ్రదేవ
తుర్యంచ జాగ్రదనువృత్త సుషుప్తి రేవ |
స్వప్న స్తధా చ సతి జాగ్రత ఏవ భేదః

స్వప్నః=స్వప్నము, సుషుప్త్యనుగతః=సుషుప్తిని అనుసరించినటువంటి, జాగ్రదేవ నను=జాగ్రద్దశ##యే, తుర్యంచ=తుర్యముకూడ, జాగ్రదనువృత్త సుషుప్తిరేవ=జాగ్రత్‌ను అనుసరించిన సుషుప్తియే, తధాచ సతి = అ ప్రకార మగుచుండగా, తుర్యాదశాపిచ=తుర్యదశయును, సుషుప్తి బేధ ఏవ=సుషుప్తి భేదమే.
స్వప్నమనగా ఏ ప్రకారముగా జాగ్రత్‌లో ఘటపటాదులు గ్రహించబడునో, స్వప్నమునకూడ ఆ ప్రకారమే గలవు. విశేషమేమనగా స్వప్నమునందు సుషుప్తియొక్క అనువృత్తి కలదు. జాగ్రత్‌లో లేదు. తురీయమనగా సుషుప్తియే. సుషుప్తి యందువలెనే తురీయమందును. విశ్రాంతి యొక్క ఉపలంభమువలన. విశేషమేమనగా తురీయమందు జాగ్రత్‌ యొక్క అనువృత్తి ఉండును. సుషుప్తి యందు లేదు. ఈ ప్రకారము విశేషము అల్పముగా నున్నందున స్వప్న తుర్యములకు జాగ్రత్సుసుష్తి భేదత్వము తెలియదగినది.
జానాత్మ నాంతరుదితే ఖలు బోధసుప్తీ
స్వప్న స్తురీయమితి నామ విశేషభాజా |
బాహ్యే క్రియాత్మకతయో దితయో స్తయోస్స్యా

దాఖ్యా ప్రబోధ ఇతి సుప్తిరితి ప్రసిద్ధా ||

బోధసుప్తీ
=జాగ్రత్సుషుప్తులు, అంతః=అభ్యంతర కక్షయందు, జ్ఞానాత్మనా=జ్ఞానరూపముచేత, ఉది తేఖలు=పుట్టినవగుచుండగా, స్వప్న ఇతి=స్వవ్నమని, తురీయమితి=తురీయమని, నామవిశేషభాజా=నామవిశేషములను పొందినవి, బాహ్యే=బాహ్యేంద్రియకక్షయందు, క్రియాత్మక తయా=క్రియారూపముచేత, ఉదితయోః=పుట్టినటువంటి, తయోః=ఆ జాగ్రత్సుసుప్తులకు, ప్రబోధ ఇతి=జాగ్రత్‌ అని, సుషుప్తిరితి=సుషుప్తి అని, ఆఖ్యా=పేర్లు, ప్రసిద్ధా=ప్రసిద్ధ మైనవి.
జాగ్రత్సుషుప్తులు ముందుగా అభ్యంతరకక్ష్యయందు జ్ఞానరూపముచేత పుట్టినవగుచుండగా స్వప్నమని తురీయమని నామవిశేషములను పొందినవి, పిమ్మట బాహ్యేంద్రియకక్ష్య యందు క్రియారూపముచేత పుట్టినవగుచుండగా ఆ జాగ్రత్సుషుప్తులకే ప్రబోధమని, సుషుప్తియని పేర్లువచ్చెను. ఇందుచే అభ్యంతరేంద్రియాను సంధానము క్రియారూపమని తెలియ వలెను. సంసారమేమి?, విశ్రాంతియేమి? ముందుగా అభ్యంతరేంద్రియాను సంధాన సహితమైన పిమ్మట బాహ్యేంద్రియ పదమును పొందును. సమస్త భావము శివశక్త్యాత్మకమగుటచే జ్ఞానక్రియా రూపమని భావము. ఈ ప్రకారము జ్ఞానజాగ్రత్‌, క్రియాజాగ్రత్‌, జ్ఞానసుషుప్తి, క్రియాసుషుప్తి పునఃపునః జాగ్రదాది దశాచతుష్టయాత్మకమైనటువంటి తుర్యాతీతము నాభిగాగల కాలచక్రముయొక్క పరిభ్రమణమును అనుసంధానము చేయతగినది.
జాగ్ర ద్బహిర్విలసనం నను భేద సృష్టేః
స్వప్నోంతరుల్లసన మిత్యుభయీ దశైవ |
తుర్యాభిధాన ముపయా త్యవిభేద సృష్టౌ
సృష్టి ద్వయస్య జని విశ్రమభూ స్సుషుప్తి.

భేదసృష్టేః - భేదరూప ప్రకృతి సంసారము యొక్క బహిర్విలసనం
= బాహ్వేంద్రియ కక్షయందు భాసించుట, జాగ్రత్‌=జాగ్రద్దశ, అంతరుల్లసనం=అంతరింద్రియకక్షయందు స్ఫురించుట, స్వప్నః=స్వప్నము, ఇత్యుభయీ దశైవ=ఇట్లు జాగ్రత్స్వప్న రూప దశాద్వయమే, అవిభేద సృష్టౌ=నివృత్తిరూపమైన అభేదసృష్టియందు తుర్యాభిధానం=తుర్యమను పేరును, ఉపయాతి=పొందుచున్నది, సృష్టిద్వయస్య=భేదాభేదరూప సృష్టిద్వయమునకు, జనివిశ్రమభూః=ఉత్పత్తి విశ్రాంతులకు స్థానమైనది, సుషుప్తి=సుషుప్తి.
బాహ్యేంద్రియ కక్ష్యయందు భేదరూపమైన ప్రవృత్తి సంసారముయొక్క అవభాసనము జాగ్రత్‌. అంతరింద్రియ కక్ష్యయందు అభేదరూపప్రవృత్తి సంసారముయొక్క అవభాసనము స్వప్నము. ఈ రెండు అవస్థలు జీవునియొక్క సంసారభూమిక అని తెలుసుకొనవలెను, ఈ జాగ్రత్స్వరూప దశాద్వయమే అవి భేధసృష్టియందు అనగా, నివృత్తిరూప సంసారమందు తుర్యమనుపేరును పొందుచున్నది. సుషుప్తి స్వభావమును చెప్పుచున్నారు. భేదసృష్టికి ఉత్పత్తి స్థానమును అభేదసృష్టికి విశ్రమస్థానమును ఐనది సుషుప్తి. సుషుప్తి మొదలుకొని జాగ్రద్దశవరకు పదత్రయమందు భేదరూపము చేత జీవుడుసంచరించును. జాగ్రత్‌ మొదలుకొని సుషుప్తివరకు అభేదరూపము చేతతుర్యమను పేరుగల పదత్రయమందు శివుడను పేరుగల వాడై విశ్రమించును. అటువంటి విశ్రమమార్గమును పొందుచున్న నుపశుత్వమందు విమర్శించుట లేదు. ఇట్లు శివుడును ఇచ్ఛా జ్ఞానక్రియలను పేరుగల భేదరహితసుషుప్తి స్వప్న జాగ్రత్‌లయందు సంసరణము పొందును తుర్యపర్యాయమైన జాగ్రదాది సుషుప్త్యంతము నివృత్తి మార్గముచేత విశ్రమించును. శివునకు ప్రవృత్తి నివృత్తి మార్గములయందు రెంటియందును అభేదముచేత ఏకరూపముగా తుర్యవ్యవహారమున్నను. నివృత్తి మార్గమందే శివునకు ముఖ్యవ్యవహారమని ఉపదేశించబడినది. అద్వైతసంసారము, ద్వైతసంసారము, ద్వైతాద్వైతసంసారము. సర్వసమాధి అని ముందు ప్రతిపాదించబోవు ఆయా అవస్థలయందు ఆయా ప్రక్రియలు ఊహించతగినవి:
సృష్టా బహిః శివచితా ప్రకృతి ర్విసర్గః
తాం స్వాత్మనా కబళయన్‌ శివ ఏషబిందుః |
సంసార విశ్రమ జుషోరితి నామధేయే

సంసారిణీ పశుశివౌ పరమః శివశ్చ ||
9
శివచితా
=శివుడనివ్యవహరించబడిన ప్రకాశతత్త్వము చేత, బహిః=వెలుపలకు వలెనే, సృష్టా=వదలిపెట్టబడిన, ప్రకృతిః=స్వభావము, విసర్గః=విసర్గ అనిపించుకొనును తాం=ఆ విమర్శరూపమైన విసర్గను, స్వాత్మనా=స్వాత్మ చేత, కబళయన్‌=మ్రింగుచు, ఏషః = ఈ, శివః=శివుడు, బిందుః=బిందుశబ్దవాచ్యుడగును, ఇతి=ఈ ప్రకారము, సంసారవిశ్రమజుషోః = సంవరణ విశ్రమణ స్వభావముగల వరాకి, నామధేయే=పేర్లు, పశుశివౌ=జీవశివులు, పరమ శ్శివశ్చ=పరశివుడును, సంసారిణః = సంసారులే.
శివుడని వ్యవహరింపబడు చిత్‌ చేత అనగా ప్రకాశ తత్వముచేత వెలుపలకువలెనే వదలిపెట్టబడినది, పరమార్థమున వెలుపలకాదు. సమస్త వస్తువులకు ప్రకాశభిత్తియందు లగ్నమగుచునే సత్తా సిద్ధించువల్ల ప్రకాశముకంటె వెలుపల వస్తుసిద్ధి లేదు. వదలిపెట్టబడిన, వదలిపెట్టుట కూడ చమత్కారమాత్రమే. ప్రకృతిః అనగా స్వభావము, విమర్శ అని తెలుసుకొనదగినది. ప్రకాశకు విమర్శ స్వభావముకలదు. ప్రకాశకు ఈ విమర్శ లేకున్న ప్రకాశ స్వరూపములైన స్ఫటికాదులకు వలెనే జడత్వము సిద్ధించునని ప్రాచీన సంవిచ్ఛాస్త్రకారులచే ఉద్ఘోషింపబడినది. మంత్రమాత్ర సమదీక్షానం తరము సంవిచ్ఛాస్త్ర సిద్ధాంతముల యందు అలవాటుకల వారే పరమరహస్య రూపమైన మంత్రార్థము యొక్క ఉపదేశమందు అధికారులని మాచేత ఈ మంత్రార్థ వివేక ప్రస్తావమందు సంవిన్మత సారము మాత్రమే తెలుపబడు చున్నది. ప్రకాశము తన స్వభావ భూతమైన తనయందు విశ్రమించియున్న పరాప్రకృతి, స్వాతంత్ర్య, మాయా, అవి ద్యాది శబ్దములతో ఆగమికులచే వ్యవహరించబడుచున్న, జగద్బీజభూతమైన విమర్శను ఒకానొకప్పుడు, ప్రపంచరచన చేయవలెనన్న స్వాత్మభిత్తియందే వెలుపలకువలెనే వదలి పెట్టబడి, విసర్గ అని వ్యవహరింపబడును. విసృజ్యత ఇతి విసర్గః. అనగా వదలిపెట్టబడునదిగనుక విసర్గ అనిఅందురు. అట్టి విసర్గ రూపమైన వేద్యాకారమగు విమర్శ వేదకుని కబళించును. అందుచే ప్రమాతకూడ అగును. ఆ వేదకుడైన చిద్రూపుడు తన వైభవముపోయినవాడై ప్రమేయిత్వమును పొంది జీవుడగుచున్నాడు. ఎప్పుడైతే ఆ శివుడే ప్రపంచమును విరమించుకొనవలెనన్న, ఆ విమర్శరూపమైన ప్రకృతిని తానే కబళించుచు బిందుశబ్దవాచ్యుడగుచున్నాడు. భిద్యతే, విచ్ఛిద్యత ఇతి బిందుః. అనగా అపరిచ్ఛిన్న స్వభావుడగు నని అభిప్రాయము. ఈ ప్రకారము వేద్యరూపమైన విమర్శకు విసర్గత్వ మును, వేదకాత్మకుడైన ప్రకాశకు బిందుత్వమును ఉపదేశించబడెను. సంసరణ స్వభావము విమర్శ, విశ్రమస్వభావము పకాశ. అటు వంటి సంసరణ విశ్రమణస్వభావులకు క్రమముగా వ్రిసర్గ బిందు శబ్దమును నామములుగా అంగీకరించిరి. విసర్గ సమున్మీలితమైన విచిత్రమగు సంసారము యొక్క విషయమును సామాన్య దృష్టిచే చెప్పుచున్నారు. పశువును, శివుడును, పరమశివుడును, సామాన్యముగా ముగ్గురును సంసారులని చూపించబడినది.
ద్వైతాత్మకం భవతి సంసరణం పశోస్త
దద్వైత రూప మభవస్య పరస్య శంభోః |
మిశ్రం త్రిరూపమపి సంసరణం యత స్స్యా

ద్విశ్రాంతి భాగ్భవతి తత్పరధామ బిందుః ||
10
పశోః
=జీవునియొక్క, సంసరణం - సంసారము, ద్వైతాత్మకం=భేదరూపమైనది, భవతి=అగుచున్నది, అభవస్య=శివునియొక్క, తత్‌=ఆసంసారము, అద్వైతరూపం=అద్వైతరూపమైనది, భవతి=అగుచున్నది, పరస్యశంభోః=పరశివునియొక్క, సంసరణం=సంసారము, మిశ్రం=భేదా భేదరూపమైనది, భవతి=అగుచున్నది, త్రిరూపం=మూడు విధములైన, సంసరణమపి=సంసారము, యతః=ఎక్కడనుంచి స్వాత్‌=అగుచున్నదో, యత్ర=ఎక్కడ విశ్రాంతిభాక్‌=విశ్రాంతిని పొందినది, భవతి = అగుచున్నదో, తత్‌ అది,పరధామ=ఉత్కృష్ట స్థానమైన, బిందుః=బిందువు అగుచున్నది.
పశువుయొక్క సంసారము దైత్వ్వరూప మైనది పశుసంసారమందు విసర్గపర్యాయమైన విమర్శ అవిద్యా రూపముచేత భేదచమత్కారమును చూపించుటవలన ఆ సంసారమే శివునకు అద్వైతరూపముగా నుండును. అనగా శివసంసారమందు విమర్శ విద్యారూపముచే అద్వైత చమత్కారమును పరిగ్రహించుట వలన పరశంభుసంసారము మిశ్రమముగా నుండును. ఇచట విద్యావిద్యోభయరూప మైన విమర్శశక్తి ఏకకాలమందు భేదాభేదైక రస్యప్రదర్శన చమత్కారమును పొందుటవలన ఈ తృతీయ కక్ష్యయందు పరశంభు పదగ్రహణముచేత త్త్రికవిశ్రాంతి లేకపోయి నప్పటికిని బహుమానము సూచించబడినది. తృతీయ పదాధిష్ఠాతను గూడ సంసారులయందు చేర్చుట చతుర్థపద మందుండు శ్రద్ధచేత సంసారకళ##చే స్పృశింపబడని శుద్ధాంతర్ముఖ విశ్రమ స్వభావమైన మహాబిందు పదమును విరవించుచున్నాడు. ఎచటనుండి త్రిరూపమైనసంసారమగుచున్నదో ఎచట త్రిరూపమైన సంసారము విశ్రమించుచున్నదో అది పరమైనది, అనుత్తరమైన ధామబిందువని తెలియవలెను. ఉత్కృష్టమైన దని తాత్పర్యము, విచారించిన చతుర్థకక్ష్య సర్వసంసారమునకు ఉపాదానభూతమైన పూర్ణ విమర్శ స్వభావ ముచే మహావిశ్రాంతిపద మైనప్పటికిని కక్ష్యాత్రయమందు ఒప్పుచున్న ప్రపంచ కలాను సంధాన గంధము ఉపశమించ లేదని తదుత్తీర్ణమైన ఐదవదియగు పరవ్యోమలక్షణమైన పదమును పంచమామ్నాయ పరిశోధితమైన నిష్కళంకమగు మహాబిందుతత్త్వమని తాత్వికసిద్ధాంతము. ఇచట ఈ విధముగా ఉవదిష్టమగుచున్నది. ఏది సశువుయొక్క భేదరూపమైన సుప్త్యాద్యవస్థాత్రయము పిమ్మట అభేదరూపమైన శివసంబంధమైన తుర్యదశ, తదతీతమైన దశ, అనగా తుర్యాతీతదవ, కలవో స్వరస్పర్శాది వర్గములచే మంత్ర మందు చెప్పబడిన దశాపంచకమందు భేదాభేద మిశ్ర సంసార రూపమైన మూడు దశలు సర్వ సంసారై కరస్య విశ్రాంతి రూపమైన చతుర్థదశ. తదుత్తీర్ణమైన మహాబిందు దశ ఐదవది. యధాయోగముగా ఊహించవలెను. పశుసంబంధమైన సుషుప్తి జాగ్రత్స్వప్నములయందు భేదాభేదమిశ్రదశలకు సంబంధము. తదతీతమందు మహాబిందుదశకు సంబంధముగా తెలుసుకొనవలెను. త్రివిధసంసారము తదేకరస మిశ్రమము తదుత్తీర్ణ మహాఅంతర్భూతమైనదని సిద్ధజనులయొక్క ఘంటాపధము. అందుచే ఈ ఉపదేశము అంతర్ముఖులైన వారికే తెలియనైయున్నది.
గౌణో హి బిందు రిహ విత్తి రభేదరూపా
శైవీ తనుర్భవతీ భేదపదం తు వేద్యం |
జీవస్య సంవరక మస్య తత స్ప్వరూపం

సర్గో భ##వేద్వ్యవహృతి ర్మహతా మితీయం ||
11
శివః
=శివుడు, గౌణ=గౌణమైన, అనగా అముఖ్యమైన, బిందుః=బిందువు, ఇహ=ఈ శివునియందు. విత్తిః=జ్ఞానము, అభేదరూప=అభేదరూపమైనది అభేదరూపమైన సంవిత్తి, శైవీ=శివసంబంధమైన, తనుః=స్వరూపము, భవతి=అగుచున్నది, భేదపదం=భేదస్థానమైన, వేద్యంతు=చైతన్యమైతే, జీవస్య=జీవునికి, సంవరకం=ఆవరకము, తతః=అందువల్ల, అస్య=ఈ జీవునకు, సర్గః = విసర్గ శబ్దవాచ్యుడై, భ##వేత్‌=అగును, ఇతి = ఈలాగున. మహతాం=మంత్రశాస్త్ర వేత్తలయొక్క, ఇయం=ఈ, వ్యవహృతి=వ్యవహారము.్ష?ౌుnష్హ
శివునకు గౌణబిందువని వ్యవహారము. ఈ శివునకు స్వరూపమేమనగా అభేదరూపమైన సంవిత్తే మిశ్ర సంసారాధిష్ఠాతకు కూడ ఈ ప్రకారము బిందుత్వము ఊహించవలసినదే గాని వ్యవహార బాహుళ్యము శివునకుండుటచే బిందుత్వమని తెలియవలెను. ఇట్లు పశువునకును పరిచ్ఛేదమున్నప్పటికిని చిద్రూపుడగుటచే బిందుత్వమున్నదే గాని చైతన్య వ్యాప్యముచేత విసర్గత్వము భావింపడెను. భేదస్థానమైన వేద్యము జీవునకు ఆవరకమైనందుల్ల ఏది, ఎవరికి ఆవరకమో అది వారికి స్వరూపమని భావము. అందున చైతన్యరూపుడగుటచే జీవునకు వేద్యము వలెనే విసస్గశబ్దముచే వ్యవహారింపబడిన వాయెను. ఈ ప్రకారము మంత్రశాస్త్రవేత్తలయొక్క వ్యవహారము.
చైత్యం విమర్శ పరిణామ దశావిమర్శః
చిద్ధర్మ ఏష చ చితో జననాల్లయాచ్చ |
నాస్త్యేవ సా చిదపి యద్య విమృష్ఠరూపా

ధర్మస్తతో భవతి చిచ్చ విమర్శశ##క్తేః ||
12
చైత్యం
=వేద్యము, విమర్శ పరిణామదశా=విమర్శయొక్క పరిణామరూపమే, ఏషః=ఈ, విమర్శః=విమర్శ, చితః=చిత్తు నుంచి, జననాత్‌=పుట్టుటవల్లను, లయాచ్చ=లయించుటవల్లను, చిద్ధర్మః=చిత్తు యొక్క ధర్మము. సా=ఆ, చిదపి=చిత్తు కూడ, అవి మృష్టరూపా యది = విమర్శలేనిదైతే, నాస్త్యేవ=లేనిదే, తతః=అందు వల్ల, చిచ్చ=చిత్తున్నూ, విమర్శశ##క్తేః=విమర్శశక్తికి ధర్మః=ధర్మము, భవతి=అగుచున్నది.
శివభక్తి పర్యాయములైన ప్రకాశ విమర్శలయొక్కపరిణామము జగత్తని ఆగమసిద్ధాంతము. విచారించగా జగత్తు విమర్శయొక్క విలాసమని పురాతనులచే అంగీకరింబడ్డది. అయినప్పటికిని ప్రకాశ##లేకుండా విమర్శకు స్వరూపసిద్ధి లేనందున విమర్శ జగదాకారముగా విలసించుచున్నప్పటికిని ప్రకాశాంశముగా సోహం నిజాంశగా భాసించుచున్నదని తాత్పర్యము. అట్టి సందర్భమందు వేత్త ప్రకాశాంశ. వేద్యము విమర్శాంశ. ఇట్లుండ వేద్యపర్యాయమైన చైత్యము విమర్శయొక్క పరిణామదశ అనగా చైత్యము విమర్శే అని తాత్పర్యము. ఈ విమర్శ చిద్ధర్మము. అనగా ప్రకాశము యొక్క ధర్మము. ఏలననగా చితోజలనాల్ల యాచ్చ, ప్రకాశమునుంచే పుట్టుచున్నది, ప్రకాశయందే లీనమగు చున్నందున సమస్త వస్తువులకు స్ఫురణ లేకసత్తా సిద్ధించుట లేదు. ఇట్టి స్ఫురణ ప్రకాశాధీనమైనది గనుక ప్రకాశకు కూడ జగత్కారణత్వము అవశ్యము అంగీకరించ తగినది. ఇంకున శబ్దరూపమైన విమర్శకు గగనము వల్లనుంచే ఉదయము, గగనమందే లయము సంభావించబడుచున్నవి. కనుక ఆ గగనమే ప్రకాశ అని అధికారులైనవారికి విశేషముగా చెప్పవలసినది లేదు. రెండుపక్షమందు ప్రకాశ కూడ విమర్శకు ధర్మమగుచున్నది. నాస్త్యేవేతి. ఆ ప్రకాశకు కూడ ఇది యిటువంటిది అని విమర్శలేనప్పుడు లేనిదే అగు చున్నది కూడ. వస్తుసిద్ధి ఐన ఎడల కుందేలుకు కొమ్మున్న దన్న చందముగా నుండును. కనుక సమస్తవస్తు సత్తా సిద్ధించు టకు విమర్శకు అపేక్షించుటచే ప్రకాశసత్త్వమందు విమర్శ కారణమగుటచే ఇదిఇటువంటిది అని విమర్శ లేనప్పుడు ప్రకాశ విమర్శయొక్క ధర్మమని అవశ్యముగా అంగీకరించతగినది.
చిచ్చైత్యయో రితి సమే సతి ధర్మధర్మి
భావే వరస్పర పదాక్రమణం స్వభావః |
చైత్యావృతా భవతి చిత్పశురేషచైత్య

మావృణ్వతీ చిదధ యాతి శివప్రసిద్ధిమ్‌ ||
13
ఇతి
=పైన చెప్పిన ప్రకారము చేత, చిచ్చ్యైత్యయోః=చిచ్చ్యైత్యములకు, ధర్మధర్మిభావే=ధర్మధర్మీభావము, సమేసతి=సమానమైనదౌచుండగా, పరస్పరపదాక్రమణం=ఒకరి పదమును ఒకరు ఆక్రమించుట, స్వభావః=నైసర్గిక వ్యాపారము, చైత్యావృతా=చైత్యము చేత ఆవరించబడిన, చిత్‌=చిత్తు, ఏషః=ఈ, పశుః=జీవుడు, భవతి=అగును, అధ=అనంతరము, చైత్యం=చైత్యమును, ఆవృణ్వతీ=ఆవరించినదై, చిత్‌=చిత్తు, శివప్రసిద్ధిం=శివుడనే ప్రసిద్ధిని యాతి=పొందుచున్నది.
ప్రకాశ విమర్శలకు అన్యోన్య ధర్మధర్మిభావమున్నందుకు ప్రయోజనమును చెప్పుచున్నారు. ఈ ప్రకారముగా చిచ్చెత్యములకు ధర్మధర్మిభావము. సమానముగా నుండగా ఒకరి పదమును ఒకరు ఆక్రమించుచుండుట నైసర్గిక వ్యాపార మాయెను. ధర్మికి ధర్మపదము వ్యాపించుట ఉచితమే గదా! ఐతే చిచ్చ్యైత్యములు అన్యోన్య పదమును ఆక్రమించుటచే ఏదశ సంభవించునంటే, చైత్యముచేత ఆవరింపబడినపుడు చిత్తు పశువగును. అనగా జీవుడగును చైత్యమును ఆవరించినప్పుడు ఆ చిత్తే శివుడని ప్రసిద్ధినొందును.
చిచ్చైత్యయో స్సమతయా ప్థిమితే స్వభావే
మిశ్రంతు మధ్యమ పదం పరశంభు రూపం |
చిచ్చైత్య మిశ్రణతయా తదయం త్రిరూపః

ధర్మీచ తత్తదుచితశ్చ తథా విమర్శః ||
14
చిచ్చైత్యయోః
=చిచైత్యములయొక్క, స్వభావే=స్వభావము, సమతయా=సమవ్యాప్తి కలుగుటచేత, స్థిమితే=నిశ్చలమైనదౌ చుండగా, మిశ్రంతు=మిశ్రమైనటువంటి, మధ్యమపదం=మధ్యమపదం, పరశంభురూపం=పరశివ రూపము, భవతి=అగుచున్నది, తత్‌=అందువల్ల అయం=ధర్మీప్రమాత, చిచ్చైత్యమిశ్రణ తయా=చిత్తుచైత్యము మిశ్రమము కలవాడగుటచే త్రిరూపః=మూడురూపములు తథా = ఆప్రకారముగా, విమర్శశ్చ=విమర్శయు, తత్తదు చితః=ఆయాధర్ములకు ఉచితమైనదై, త్రిరూపః = మూడు రూపములు గలది.
చిచ్చైత్యములకు సమవ్యాప్తి కలుగుట చేతస్వభావము నిశ్చలమైన దగు చుండగా, విశ్రాంతి స్వభావములో ముణిగి ఉండుటచే నిశ్చలముగా నుండ మధ్యమపదము మిశ్రమమని వ్యవహరింపబడుచున్నది పరశంభు రూపమగును. మధ్యమ పదమని చెప్పుటచే ఈ పదమును తృతీయ వదమైనప్పటికిని శివజీవులయొక్క స్వభావము కలదు. ఉభయవ్యాపార సంధిగా నున్నందున మధ్యమపదమని అంగీకరించిరి. ప్రవృత్తి నివృత్తి రూపములగు జీవశివ వ్యాపారములకు ఏకకాలీనత్వ పర్యాలోచనయందు ఒకదానిని ఒకటి తాకుకొనుటచే రెంటి యొక్క వ్యాపారవేగము చాలించి నిర్వ్యాపారముగనున్న దశ##యే సమవ్యాప్తి పదమని భావించబడుచున్నది. అట్టి స్థిమితదశ##యే. ఉభయమూలమైన దగుటచే ఉభయపక్షము లను వ్యాపించునదై, ఆ రెంటికి మూలముగా నుండును. అనేక కొమ్మలకు మూలభూతమైన తరుశాఖ కొమ్మల యందుండు పుష్పఫలాదులయందు స్వత్వమును పొందుచున్నది. ఈ తరుశాఖ పుష్పించినది, ఫలించినది అని అందుము. ఆ ప్రకారముగా ఏకరూపముచేతనే మిశ్రపద ప్రమాతకు, శివజీవ వ్యాపారములకు ఒకసారే అనుసంధానము. శివజీవులకు వలెనే వేరుగా ఇంకొక కక్ష్యలేదు. యీ మహాతత్త్వమునకు కూడ శివజీవులకు వలెనే వేరుగా వ్యాపారాంతరమును అంగీకరించినచో శివజీవులయొక్క స్వభావము మూల భూతమైన ఈ మహాత్త్వమందు లేకపోవలసి వచ్చుటచేత శివజీవవ్యాపారములకు యుగపదను సంధానము నంగీకరించిరి. ఈ చెప్పిన శివాది స్వరూపమును త్రైవిధ్యముగా దృఢపరుచు చున్నారు. చైత్యమిశ్రరూపములచేత ఈ అపరోక్షభూతుడైన ధర్మి త్రిరూపమాయెను. ఈ ధర్మిత్రయ మందే వ్యవహార బాహుళ్య దృష్టిచే త్రైరూప్యమనిరి. కాని చతుర్థపంచమదశలను అనంగీకరించుటచేత కాదు. ధర్మిత్రైవిద్యముచే ధర్మమునకు త్రైవిద్యమొప్పెను. జీవునకు ద్వైతవిమర్శ ఉచితమాయెను. శివునకు అద్వైత విమర్శ పరశివునకు ఉభయాత్మకవిమర్శ.
''చిత్తిశ్చ చైత్యమపి తచ్చ విమర్శతత్త్వం
జ్ఞానక్రియేన హి తయోః పరమార్థభేదః |
జ్ఞానం గృహీత కఠినత్వ గుణం క్రియా స్యా

జ్జానం భ##వేద్విరళి మాశ్రయణీ క్రియైవ ||
15
టీక - చిత్తిశ్చ
= ప్రకాశమును, విమర్శతత్త్వం=విమర్శ రూపమైన, తత్‌ = ఆ, చైత్యమపి = చైత్యమున్ను, జ్ఞానక్రియే=జ్ఞానక్రియలు. తయోః=ఆజ్ఞాన క్రియలకు, పరమార్థభేదః=నిజముగా భేదము, నహి=లేదు, జ్ఞానం=జ్ఞానము, గృహీత కఠినత్వగుణం=గ్రహించబడిన కఠినస్వభావము కలదై, క్రియాస్యాత్‌=క్రియఅగును, క్రియైవ = విరళి మాశ్రయణీ, విరళి=విశ్రాంతిని, ఆశ్రయణీ=ఆశ్రయించినదై, జ్ఞానం=ప్రకాశ, భవతి = అగును.
తా|| ఈప్రకారము మంత్రవిషయోపయుక్తమైన జీవాది ప్రమాతృ త్రయస్వరూపమును స్ఫుటతరముగా చెప్పి ఆ ప్రమాతలకు అత్యంతో పయుక్తమగు జ్ఞానక్రియస్వరూపమును ఉత్పాదించుచున్నారు. చిత్తు, చైత్యము కూడ. చైత్యమనగా విమర్శతత్త్వమే. ఈ రెండును జ్ఞానక్రియలే, చిత్తు జ్ఞానమని చైత్యము క్రియ అని తెలియవలెను. అభేదరూపమైనది గనుక చిత్తు జ్ఞానము, భేదరూపమైనది చైత్యము క్రియ అని ''ఘటోజ్ఞాతః పటోజ్ఞాతః'' అని నప్పుడు ఘటపటాదులు పరస్పరము వేరైనప్పటికి, ఏకరూపమైన దగుటచేత వేరు లేకుండా జ్ఞానము అనుభూయమాన మగుచున్నందువల్ల అభేదరూపము. చైత్యరూపమైన క్రియభేదరూపమైనది. చైత్యమున ఘటఫటాదులకు అన్యోన్యము వ్యావృత్తస్వరూపములు కలవగుటచేత భేదరూపము అనుభవములోనే గలదు. చిచ్చైత్యరూపములైన జ్ఞానక్రియలకు పరమార్థముగా భేదము లేదని చెప్పుచున్నారు. చిచ్చైత్యములకు ఏభేదావభాప కలదో అది మాయసంబంధమైన విపరీత జ్ఞానమని అభిప్రాయము. చిచ్చైత్యములకు అభేద మెట్లు? జ్ఞానమనగా ప్రకాశ ఆప్రకాశ గ్రహింపబడిన కఠినత్వగుణము కలదై (అనగా విమర్శాకారము చేత అని భావము) క్రియ అగుచున్నది. ఆకాశమునకు కాఠిన్యము శబ్దము, ఆ ప్రకారమే చిదాకాశమునకు కాఠిన్యము వర్ణరూపమైన విమర్శ. ప్రకాశవిమర్శలకు జలకణములకు వలెనే నిజముగా భేదములేదని తాత్పర్యము. కణములకు వలెనే ప్రకాశవిమర్శలకు భేదము లేకపోవచ్చును. చైత్యాత్మక మగుటచే ఘట ఫటాదిరూపమైన క్రియకు జ్ఞానరూపమైన ప్రకాశకు భేదమెట్లు నివారించును? వర్ణరూపమైన విమర్శ కన్న పృథుబుధ్నోదరాకారములు కలిగి ఘటఫటాదులు భేదించబడుచున్నవి. ఘటపటాది సమస్త వస్తువులు ఘట ఫటాది శబ్దరూపవిమర్శకంటె అతిరిక్తముగాక ఏస్వరూపము కించిత్తయినను వివేకదశయందు వుండదని శ్రీగురుకటాక్షముచే నశించిన మాయాంధకారము గల వారేతెలుసుకొన తగినది. ఇట్లు జ్ఞానముతో క్రియకు అభేదము ప్రతిపాదించి క్రియతో జ్ఞానమునకు అభేదమును ప్రతిపాదించి క్రియతో జ్ఞానమునకు అభేదమును చూపించుచున్నారు. ఆ విమర్శ రూపమగు క్రియ కాఠిన్యమును వదలి. విశ్రాంతిలక్షణమైన విరళిమన పరిగ్రహించినదై జ్ఞానమగుచున్నది. ప్రకాశైకరస్యమును పొందుచున్నదని తాత్పర్యము. ఈ ప్రకారముగా జ్ఞానమునకు బాహ్యరూపము క్రియ యకు ఆంతరరూపము జ్ఞానమని, వాటికి రెంటికి ఏకార్థత్వమని నిష్కర్షచేయబడెను.
''జ్ఞానస్య సిద్ధ్యతి వినా క్రియయా నరూపం
తస్యా స్తథైవ నహి తేన వినోపలంభః |
తస్మాత్తయో ర్యమళ##తైవ మతం హి సైద్ధం

పూర్వాపరత్వ కలనం త్విహ పూర్వపక్షః ||
16
టీక :- హి
=ఏ కారణమువల్ల క్రియయావినా=విమర్శ లేకయే, జ్ఞానస్య=ప్రకాశయొక్క, రూపం=స్వరూపము, నసిద్ధ్యతి=సిద్ధించదో, తథైవ=ఆ ప్రకారముగానే, తస్యాః=ఆ క్రియకు తేనవినా=జ్ఞానముతో సంబంధములేకయే, ఉపలంభః= సిద్ధి, న=లేదు. తస్మాత్‌=అందువల్ల, తయోః=ఆజ్ఞానక్రియలకు, యమళ##తైవ=యామళత్వమే, సైద్దం=సిద్ధ సంబంధమైన, మతం హి=మతముకదా, పూర్వపరత్వ కల నంతు=ముందు వెనుక చెప్పుట. పూర్వపక్షమేకదా.
తా|| శివశక్తి స్వరూపములైన జ్ఞానక్రియలకు తుల్య ప్రాధాన్య ముండుటచే ఒకసారే రెండును సిద్ధించుననుటకు మూలమైనటువంటి జంటసిద్ధాంతము మంత్రతాత్పర్యమగుటచే సిద్ధులయొక్క అభిమతమని బోధించుచు, ఇందుకు మూలభూతమైన ప్రకాశవిమర్శలకు పర్యాయములైన జ్ఞానక్రియలకు అన్యోన్యకారణత్వమును ఇదివరకు చెప్పినదే అనువాదము చేయుచున్నారు. ఎందువల్ల క్రియవినాగా (అనగా విమర్శలేకుండా) జ్ఞానముయొక్క రూపము (అనగా ప్రకాశయొక్క స్వరూపము) సిద్ధించదో, ఆ ప్రకారముగానే క్రియకును జ్ఞానమువినా ఉపలంభము సిద్ధించదు. అందువల్ల ఆ జ్ఞానక్రియలకు యమళత (అనగా జంట) మంత్రతాత్పర్యనుని సిద్ధులయొక్క మతుమ. ఈ జ్ఞానక్రియాసిద్ధి విచార విషయములో పూర్వాపరత్వ విచారణ పూర్వపక్షమగును. వేద్యవేదకాకారముగాగాని, ప్రకృతిపురుషరూపముగాగాని, దేహాత్మాకారముగాని, శబ్దార్థాకారముగాగాని, ఇంకా వీటికి పర్యాయములైన ఇతరాకారములుగా గాని, క్రియాజ్ఞానముల యొక్క సిద్ధినిబట్టి ఇదిముందు, ఇది వెనుక అను వాదము పూర్వపక్షమే.
''అర్థం క్రియా భవతి దక్షిణ మన్యదర్థం
జ్ఞానం సమత్వ మనయో రితి మధ్యమిచ్ఛా |
ఇచ్ఛైవ బీజ మచలాంతర బాహ్యగత్వా

జ్ఞాన క్రియా చ ఖలు మూల మిహాంకురశ్చ ||
1
టీక :- దక్షిణం
=దక్షిణమునగల, అర్థం=సగభాగము, క్రియా=క్రియాశక్తి, భతి = అగుచున్నది, అన్యత్‌ = ఇతరమైన ఎడమ, అర్థం=సగభాగము, జ్ఞానం=జ్ఞానము, భవతి=అగుచున్నది, అనయోః=ఈ రేంటి యొక్క, సమత్వం=సామాన్యావస్థ, మధ్యం=మాధ్యమికమైనది, ఇచ్ఛా =ఇచ్ఛాతత్త్వము, భవతి=అగుచున్నది, ఇచ్ఛైవ=ఇచ్ఛాతత్త్వమే బీజం=బీజము, అచలా=స్తిమితమైనది, ఇహ=బీజము నందు, జ్ఞానం=జ్ఞానము, క్రియా చ=క్రియయును, అంతర బాహ్యగత్వా=అంతరబాహ్యగతిచేత, మూలం=మూలమును, అంకురశ్చ=అంకురమును గలది.
తా|| ఇప్పుడు జ్ఞాన క్రియలకు అన్యోన్యము అవినాభావ స్వభావ ముండుటచేత తదుభయ సమిష్టిరూపమైన ఇచ్ఛాతత్వము పరమశివ స్వరూపమని చెప్పుచున్నారు. పరశివునకు సోహమైన దక్షిణభాగము క్రియాస్వరూపము. కర్మకాండను దక్షిణమార్గముగా అంగీకరించినందువలన సోహమైన వామ భాగము జ్ఞానస్వరూపము. జ్ఞానకాండను వామమార్గముగా అంగీకరించినందు వలన శైవము దక్షిణాచారమని, శాక్తము వామాచారమని సిద్ధజన ప్రవాదము. క్రియ విమర్శరూపమైనది గనుక శక్తి స్వరూపమని జ్ఞానము ప్రకాశరూపమగుటచే శివ స్వరూపమని అంగీకరించిరి. ఇట్లుండ క్రియకు దక్షిణత్వము, జ్ఞానమునకు వామత్వము ఎట్లు సిద్ధించును, సమాధానము చెప్పుచున్నారు. రహస్యశాస్త్రము యొక్క సారజ్ఞులైన సద్గురువుల యొక్క సేవావిముఖులకు ఈ విప్రతిపత్తి ఘట్టమును అతిక్రమించుట శక్యము కాదు. మహాగురుకటాక్షము గల వారికే తెలియనైయున్నదని ఉపదేశించుచున్నారు. జ్ఞానక్రియారూపులైన శివశక్తుల అన్యోన్యారాగము చేత అన్యోన్యస్వభావమందు ఉపరక్తమైన స్వభావమని తెలియవలెను. శివుని యొక్క స్వభావము జ్ఞానము. జడాకారమైన క్రియతో ఉపరక్తమైనదై జడమైనచంద్రుని యొక్క శుక్లత చేత శుక్లమగుచున్నది. శక్తియొక్క స్వభావము క్రియ. అజడమైన జ్ఞానముతో ఉపరక్తమైనదై అజడమైన వహ్నియొక్క అరుణిమచేత అరుణ మగుచున్నది. తదు భయ మిశ్రరూపమై ఉభయవర్ణ సంసర్గవలనపీతమై హేమ సమమగుచున్నది. ఈ ప్రకారముగా జ్ఞానరూపుడైనశివుడు శక్తి స్వభావమైన క్రియాస్వరూపమందే అనుసంధానవ్యాపారము కలవాడగుటచే క్రియామార్గమైన దక్షిణాచారమందు స్థాపితుడని, క్రియారూపమైన శక్తి, శివస్వభావ జ్ఞానాను సంధానమందే వ్యాపారము కలదగుటచేత జ్ఞానమార్గమైన వామాచారమందు వ్యవస్థాపితమైనదని కౌళికోపనిషత్తు. ఈ తాత్పర్యము చేతనే సూత్రకారినిచేత జ్ఞానక్రియలకు వామదక్షిణార్థత్వో పన్యాసముద్వారా ఉపపాదించబడినవి. జ్ఞాన క్రియా మిశ్రపదమైన ఇచ్ఛయొక్క భాగవ్యవస్థను చెప్పుచున్నారు. ఈ జ్ఞానక్రియలకు సమవ్యాప్తి కత్వ మేదికలదో అది ఇచ్ఛాలక్షణము. దక్షిణవామములకు మధ్యనున్నది. జ్ఞానక్రియాత్మకమైనటువంటిది, ఇదివరకు ప్రతిపాదించిన పర శివస్వభావమైన ఇచ్ఛాతత్వమునకు ఉభయపక్షములకు మూలరూపమగుటచే తదుభయబీజత్వమును సమర్థించు చున్నారు. ఇచ్ఛైవబీజమిత్యాది జ్ఞానం చ కర్మచ పరస్పరమూలమని చెప్పబోవు శ్లోకము చేత పక్షత్రయమునకు అన్యోన్యమూలత్వము ఉపపత్తి కలవైనప్పటికిని, సుషుప్తి పర్యాయభూతమైన ఇచ్ఛనే మాధ్యమికమనుటచే బుద్ధి మంతులైన యో లచేత జ్ఞానక్రియామూలత్వము ఉపదేశించబడెను. ఇచ్ఛైవబీజమచలా ఇచ్ఛయే బీజమువలె స్తిమిత స్వభావము కలదై నిశ్చలముగానుండి బీజముమూలాంకురములుగా ప్రసరించినట్టు ఆంతరగతి కలిగి నివృత్తి రూపప్రసరణ కలిగి ఉన్నది. జ్ఞానముమూలము. అధోభాగముగా ప్రసరించిన వ్రేళ్ళవలె బాహ్యగతి కలిగి ప్రవృత్తి రూప ప్రసరణ కలదగుటచే క్రియ అంకురము. బీజమునకు ఊర్ధ్వభాగముగా ప్రసరించును.
''జ్ఞానం క్రియా తదుభ##యైకరసాపి చేచ్ఛా
తత్త్వత్రయం భవతి నిత్య యుతస్వభావం |
జ్ఞానస్య మానమితి మేయమితి క్రియా యా

మాతేతి చేతర పదస్య హి నామ భేదాః ||
18
టీక :- జ్ఞానం
=జ్ఞానము, క్రియా=క్రియము, తదుభ##యై కరసా=ఆజ్ఞానక్రియాసామరస్యరూపమైన, ఇచ్ఛాపి=ఇచ్ఛయును, తత్వత్రయం=ప్రమాత్రాదిత్రయము, నిత్యయుత స్వభావం=సర్వదా కూడుకున్న స్వభావము కలది, భవతి=అగుచున్నది, జ్ఞానస్య=జ్ఞానమునకు, మానమితి=ప్రమాణమని, క్రియాయాః=క్రియకు, మేయమితి=ప్రమేయమని, ఇతరపదస్య=జ్ఞానక్రియలకంటె ఇతరపదమైన ఇచ్ఛకు, మా తేతి=ప్రమాత అని, నామభేదాః=నామభేదములు.
జ్ఞానము, క్రియ, తదుభయ సంసృష్టిరూపమైన ఇచ్ఛ ఈ మూడును తత్వత్రయ మగుచ్నువి. వీటికి నిత్యయుత స్వభావముత్రిపుటీరూపమగుటచే నిత్యయుతస్వభావము లైన ప్రమాత్రాదులతో ఇచ్ఛాదులకు సాదృశ్యమును చెప్పుచున్నారు. ఇచ్ఛాదులకు ప్రమాత్రాదుల యందు ఎవరికి ఎవరి ఏకార్థత (అనగా జ్ఞానముకు మానమని. క్రియకు, మేయమని, యితరపదమైన ఇచ్ఛకు మాత అని) నామభేదములు కలిగినవో ఆలోచించగా ఇచ్ఛాదులకు ప్రమాత్రాదులతో అభేదము సిద్ధించును.
జ్ఞానం చ కర్మ చ పరస్పర మూల మిచ్ఛా
మూలం తయోస్తదుభయం ఖలు మూలమస్యాః |
మూర్తిత్రయం మతమిదం త్రయమేవసృష్టి

స్థిత్యంత కారణతయా త్రిగుణ స్వభావమ్‌ ||
19
టీక :- జ్ఞానం చ
= జ్ఞానము, కర్మ చ = కర్మయు, పరస్పరమూలం=ఒక దానికి ఒకటి మూలమైనది, తయోః=అజ్ఞానక్రియలకు, ఇచ్ఛా=ఇచ్ఛాతత్త్వము, మూలం=మూల మైనది, అస్యాః=ఈ ఇచ్ఛాశక్తికి, తదుభయత = ఆజ్ఞాన క్రియలు, మూలంఖలు=మూలముగదా, ఇదం=ఈ ఇచ్ఛాది త్రయమే మూర్తిత్రయం=హరిహరహిరణ్య గర్భరూపమైన దని, మతం=సమ్మతము, త్రయమేవ=ఇచ్ఛాత్రయమే ఇచ్ఛాదిత్రయమే, సృష్టిస్థిత్యంత కారణతయా=సృష్టి స్థితి సంహారకారణమగుటచేత, త్రిగుణస్వభావం=త్రిగుణ స్వభావమైనది.
ఇచ్ఛాదులకు మంత్రశాస్త్రమందు సిద్ధమైన త్రికోణభావము యొక్క ఉపపత్తిని ఉత్పాదించవలెనను అభిప్రాయముచేత ప్రత్యేకముగా ఇతరద్వయ మూలతను ఉపపాదించుచున్నారు. జ్ఞానము, కర్మయు ఇదివరకు చెప్పిన మర్యాదచే ప్రకాశవిమర్శస్వభావములే గనుక ఒకరికొకరు మూలము, ఇచ్ఛ ఆ జ్ఞానక్రియలకు మూలము. మిశ్రమ తత్వమునకు ఉభయమూలత్వము ఇదివరకు చెప్పితిమి. ఇచ్ఛకు ఆజ్ఞానక్రియలు రెండును మూలము. జ్ఞానక్రియ మిశ్రమరూపమైన మూడవది యగు యిచ్ఛాతత్త్వము. ఈ యొక్కసిద్ధి జ్ఞానక్రియాసిద్ధిమూలమని తెలయుచున్నది. ఈ ఇచ్ఛాది త్రయమే పైనచెప్పిన మర్యాదచే అన్యోన్య మూలమగుచు మూర్తిత్రయము (అనగా హరిహర హిరణ్య గర్భరూపమని తాత్పర్యము.) ఇచ్ఛాజ్ఞానక్రియారూపమైన మహాశక్తియే లోకమందు హరిహర హిరణ్యగర్భరూపము లుగా భాసించుచున్నదని తత్త్వవేత్తల మతము. మూర్తి త్రయముకూడ పరస్పరమూలము కలవారే గనుక ఇచ్ఛాది భావముయొక్క ఉపపత్తి వచ్చును. ఇచ్ఛాదిత్రయమే ఈ యిచ్ఛాదిత్రయమే సృష్టి స్థిత్యంకారణము లగుటచే త్రిమూర్తులైనందులకు హేత్వంతరమును చెప్పుచున్నారు. త్రిగుణస్వభావము కలది. భేదసంసార మందేమి? ఆభేద సంసారమందేమి? మిశ్రసంసారమందేమి? ఇచ్ఛాతత్త్వమందు సృష్టి, జ్ఞానతత్త్వమందు స్థితి, క్రియాతత్త్వమందుసంహారము. ఇచ్ఛాదిత్రయమునకు సృష్ట్యాది హేతువగుటచే త్రిగుణస్వభావము సృష్ట్యాది క్రమముగా రజస్సత్త్వ తమస్సులు కలిగియున్నది. ఇచ్ఛాదితయమే గుణత్రయస్వభావమని తాత్పర్యము.
ఏతత్త్రయాత్మకతయా సకల త్రిరూపం
సుప్త్యాదికా అపి దశాశ్చ తథైవ త్రిస్రః |
సుప్తిః క్రియా జడతయా భవతి ప్రబోధో,

జ్ఞానం విమిశ్ర మనయోః పద మన్యదిచ్ఛా ||
20
టీక :- సకలం
=సమస్తము, ఏతత్త్రయాత్మకతయా=ఈఇచ్ఛాదిత్రయాత్మకమౌటచేత, త్రిరూపం=మూడురూపములైనది, సుప్త్యాదికాః=సుషుప్తి మొదలుగా గల, త్రిస్రః=మూడు. దశాశ్చ=దశలు, తథైవ=ఆప్రకారమే, సుప్తిః=సుషుప్తి, జడతయా=జడమైన దగుటచేత, క్రియా=క్రియా శక్తి, భవతి=అగుచున్నది, ప్రబోధః=జాగ్రత్‌, జ్ఞానం=జ్ఞానము, భవతి=అగుచున్నది, అనయోః=ఈరెంటియొక్క విమిశ్రం=మిశ్రమైన, అన్యత్‌=ఇతరమగు, పదం=స్వప్నము, ఇచ్ఛా=ఇచ్ఛాతత్త్వము, భవతి=అగుచున్నది.
సంసారమందు సమస్తము ఇచ్ఛాది రూపమే గనుక త్రైరూప్యముగా నున్నదని చెప్పుచున్నారు. లోక త్రయమని, వర్ణత్రయమని, వేదత్రయమని సమస్త వస్తుజాతమును ఆలోచించగా ఇచ్ఛాది త్రయాత్మకమే గనుక త్రైరూప్యముగానే ఉన్నది. ప్రకృతిలో మూడైన సుప్త్యాది దశలు కూడ ఇచ్ఛాద్యాత్మికములే అని సూత్రకారుని మతము. ఉత్తరత్ర అట్టి దశను పారంపర్యముగా గురుముఖము గనే తెలిసికొనవలెను. అందలి రహస్యప్రమేయమును ఉప దేశించు చున్నారు. ఇచ్ఛాద్యాత్మికములైన సుప్త్యాదులకు అన్యోన్యమూలత కలదు. తుల్యప్రాధాన్యము గనుక త్రికోణ భావము ప్రాప్తించగా అన్యోన్యము ఆదిమధ్యాంతభావము ఏర్పడుచున్నది. అట్లు ఏర్పడి ఉండగా, ఆదిమధ్యాంతముల యందున్న ఇచ్ఛాజ్ఞానక్రియాభావము ప్రత్యేకముగా కూడ ఊహించవలసివచ్చును. అది యుక్తమే. భేదసంసారమందు సుషుప్తి ఇచ్ఛ. అభేదాకార విశ్రాంతిరూపమైన దగుట వలన భేదసంసార ప్రారంభపదమగుటవలన ప్రారంభపదము ఇచ్ఛ అని ప్రహతమైన మార్గము. స్వప్నము జ్ఞానము. కించిత్సంకోచ పదమగుటవలన ఆరంభ##మైన దానికి కించిత్సిద్ధిపదము జ్ఞానపదమని స్ఫుటతరమైన మార్గము. జాగ్రత్‌ క్రియ సంకోచము పూర్తి ఐనందువలన ప్రారంభ##మైన దానియొక్క నిర్వహణము క్రియ అని ఋజుమార్గము. ఈ ప్రకారముగా సమస్తమైన ఉద్యమము కలదు. ఇచ్ఛతి, జానాతి, కరోతి. అని పదత్రయముగా నున్నది. తిరిగి విశ్రమణక్రియా సముద్యమమందు జాగ్రత ఇచ్ఛ, ఒకానొక ఉద్యమము నివృత్తమై ఇతర ఉద్యమము ప్రవృత్తముకానుండగా మధ్య విశ్రాంతి సంభవించును గనుక జాగ్రద్విరతియందు ఇచ్ఛా లక్షణమైన విశ్రాంతిపదము సంభవించును. ఈ ప్రకారము అన్యత్ర కూడ తెలుసుకోవలెను. నివృత్తి స్వప్నము. జ్ఞానము కించద్విశ్రాంతి కలుగుట వలన సుషుప్తి క్రియ. విశ్రమరూపమైన క్రియకు పూర్ణానుసంధానము వలన, ఈ ప్రకారము సుషుప్తి జాగ్రతలకు ప్రత్యేకము ఇచ్ఛాత్వము - క్రియాత్వములు కలవు. స్వప్నమునకు జ్ఞానత్వముకూడ నిరూపించబడినది. అనంతరము మరియొక పదము నిరూపించబడుచున్నది. వికల్పాది కల్పోభయ రూపమైనందువలన అజడ విశ్రమ రూపమైన స్వప్నము ప్రకాశపదము. జడవిశ్రమ రూపమైన సుషుప్తి విమర్శపదము. ఈ రెంటికి అన్యోన్యభావ పరిగ్రహ ప్రక్రియయందు స్వప్నము ఇచ్ఛ. జడభావక్రియ ప్రారంభరూప మైనందువలన జాగ్రతజ్ఞానము. జాగ్రతయందు ప్రకాశకు వెలుపల భాసించుచున్న వేద్యాంశయందు జడతా పరిగ్రహమువలన జడసుషుప్తి క్రియ. అభిలషితమైన జడీభావ క్రియకు సాకల్యముగా అనుసంధానము కలదు. పిమ్మట ఈజడ స్వరూపమునకే తిరిగి ప్రకాశగతమైనది. అజడీభావక్రియాసముద్యమమందుసుషుప్తి ఇచ్ఛ. అజడీభావక్రియా ప్రారంభము వలన జాగ్రత్‌ జ్ఞానము. వేదక ప్రకాశ స్పృష్టి చేత వేద్యమునకు కించిదజడీభావ ముదయించును గనుక స్వప్నము క్రియ. కించి దజడరూపమైన వేద్యమునకు సాకల్యముగా అజడీభావక్రియాను సంధానమున్నది. ఈ ప్రకారము స్వప్నసుషుప్తులకు ప్రత్యేకము ఇచ్ఛాత్వము, క్రియాత్వమురాగలవు. జాగ్రత్‌ కు జ్ఞానత్వము కలదని తెలుసుకొనవలయును. ఈ రీతిగానే జడాజడప్రమాతృపదములైన జాగ్రత్స్వప్నములకు అన్యోన్యభావ ప్రక్రియ యందును వక్ష్యమాణ మర్యాదచే బిందువిసర్గ శ్లేషరూపమైన దగుట చేజడాజడ విశ్రాంతి రూపమైన సుషుప్తి మధ్యమకక్ష్యగా నున్నప్పుడును ప్రత్యేకము ఇచ్ఛాత్వము క్రియాత్వము గలవు అని యోజన చేయవలెను. విశ్రాంతి రూపమైనప్పటికిని సుషుప్తి చిదచిన్మయమగుట వలన జ్ఞానత్వమును చెప్పుట ఉచితమే. జీవుడు సుప్త్యవగాహనము చేత విశ్రాంతిని తెలుసుకొనుచునే శివుడగును. శివుడును సుషుప్త్యవగాహనమైనప్పుడు జడమును తెలుసుకొనుచునే జీవుడగును. ఈ ప్రకారముగా సుషుప్తికి మధ్యమపదత్వము ఉపపన్నమైనది. ఈ ప్రకారముగా సుప్త్యాది పదత్రయములో యేది ప్రారభించినను విలోమానులోమభావ మువలన పదత్రయ ప్రవాహమందు శివశక్తులకు అన్యోన్యభావ సమాధి సిద్ధించును గనుక సుప్త్యాదిదశాత్రయమును బోధించు మాతృకాఖండత్రయ మందు ఏ ఖండమును ఉపక్రమించి నను సాంప్రదాయకమే అని గమనించవలెను. లఘుస్తోత్ర కారులు మాతృకాసంగ్రహమైన బాలామంత్రప్రస్తావనలో క్రమముగను వ్యుత్క్రమముగను దీనిని చెప్పిరి. సుప్త్యాది దశాత్రయ ప్రతిబింబభూతమైన చతుర్దశారాది చక్ర స్కంధ త్రయాత్మకమైన శ్రీచక్రముయొక్క పూజావిషయములోను ఆ ప్రకారమే యేస్కంధమును ఉపక్రమించినను బీజ త్రయోద్దేశముచేత విలోమానులోమ స్కంధ త్రయ ప్రవాహ మందు సమ్యగనుభవము సామయిక సిద్ధమైనదే. స్వప్నజాగ్రత్సుషుప్తులకు ఇచ్ఛాజ్ఞానక్రియాత్వము. ప్రసిద్ధమార్గము నను సరించి చెప్పచున్నారు. సుషుప్తి క్రియజాడ్యమైనది. క్రియ క్రియగదా. స్మృతికివిలక్షణమై సాక్షాదనుభవ రూపమై నందున బామ్యమందు అరుసంధాన రూపమైనది. బహిరుప సంధానము జ్ఞానరూపమైన అంతరాను సంధానము వలె అజడముకాదు గనుక క్రియకుజడత్వము అనుభవసిద్ధము. జ్ఞానము, స్వప్నము ఇచ్ఛ అని తెలియవలెను.
అన్యోన్య లీన వపుఘా రిహ చైత్యచిత్యోః
సుప్త్యాదిషు త్రిషు పదేషు భవో ద్విరూపః |
శ్లిష్టః ప్రవృత్తి వినివృత్తి మయో విభావ్యః

శ్రీచక్రమూల మనుసంస్థితి దర్శనేవ ||
21
టీక :- అన్యోన్య లీలావపుషోః
=అన్యోన్యము లీనమైన స్వరూపములు కలిగినటువంటి, చైత్యచిత్యోః=జీవశివులకు, ప్రవృత్తి వినివృత్తి మయః=ప్రవృత్తినివృత్తి రూపమయ ములైనటువంటి, ద్విరూపః=రెండువిధములైన, భవః=సంసారము, సుప్త్యాదిషు=సుషుప్తి మొదలుగాగల, త్రిషు=మూడు, పదేషు = స్థానములయందు, శ్లిష్టః=కలుసుకొని ఉన్నదని, శ్రీచక్రముయొక్క = మూలమను, మూలమంత్రము యొక్క, సంస్థితి=సంస్థానముయొక్క, దర్శనేన=చూడడము చేత, విభావ్యః=ఊహించవలెను.
సుప్త్యాదులకు జడాజడ స్వభావము కలదు గనుక రెండు విధములుగా నుండుట సుస్పష్టము. సుప్త్యాది దశాత్రయము చిచ్చైత్య పర్యాయములైన శివజీవులకు సంసరణ విశ్రమణ వ్యవహారపదము. ప్రకాశవిమర్శ పర్యాయములైన చిచ్చైత్యములకు అన్యోన్యలీనత్వము స్వభావము. ప్రకాశ యందు విమర్శ వాసనామయముగానుండును. విమర్శ యందు ప్రకాశవాసన అట్లే: ఆ రెంటికి అన్యోన్యభావోపాదాన స్వభావముకలదు. ఆప్రకారముగా జడాజడత్వ వ్యవస్థచే ఆరెంటికి ప్రత్యేకము స్వరూభూతమైన సుప్త్యాది దశాత్రయ మందు ఉన్నది. అజడమందు జడము. జడమందు అజడము వాసనారూపము చేత లీనమై పర్యాయముగా స్ఫురించుచుండు ననిసూత్రతాత్పర్యము. చైత్యశబ్దము ముందుగా చెప్పి నందున ప్రవృత్తి మయమగు మాయా ప్రాబల్యమువలన చైత్యపర్యాయ మైన జీవదశలకే ప్రథమపర్యాయ స్ఫురణ మని తాత్పర్యము. జీవశివులకు క్రమముగా ప్రవృత్తి నివృత్తి మయమైన ద్విరూపమగు సంసారము సుప్త్యాది పదములయందు శ్లిష్టమైనది. అన్యోన్యలీనత్వమును భావించవలెను. జీవశివదశలకు అన్యోన్యలీనతాలక్షణము కలదు. ఈ శ్రీచక్రము యొక్క మూలమంత్ర స్థితినిబట్టి విచారించగా శ్రీచక్రసంస్థితి చతుర్ద శారాది స్కంధత్రయమందు ప్రతిస్కంధమున త్రికోణముల యొక్క శ్లేషకలిగియున్నది. ఆశ్లేష చేత ప్రత్యేకము త్రైరూప్యముగా ఉన్న జీవశివదశలకు అన్యోన్య లీనతాధ్యవసాయము చేత క్రమముగా స్ఫురణము కలుగుచున్నది. ఖండత్రయమగు మూలమంత్ర స్థితిని అనులోమ విలోమానువర్తనముచేత ప్రవృత్తి నివృత్తి రూపవ్యవస్థచే అన్యోన్యములీనమైన శివజీవ దశలకు క్రమముగా ఉల్లసనమని తెలియవలెను.
ఇచ్ఛా సుషుప్తి రబహిర్జనిత ప్రబోధో
జ్ఞానం క్రియా భవతి జాగరణం జడస్య |
తుర్యస్థ జాగరపదాది సుషుప్తి సీమా

ఇచ్ఛాదయః ఖలు దశాస్త్వజడాశ్శివస్య ||
22
టీక :- జడస్య
=జీవునకు, సుషుప్తి=సుషుప్తి, ఇచ్ఛా=ఇచ్ఛాతత్త్వమును, అబహిర్జనిత ప్రబోధః=స్వప్నము జ్ఞానం=జ్ఞానమును, జాగరణం=జాగ్రత్‌, క్రియా=క్రియ యును, భవతి=అగుచున్నది, శివస్య తు=శివునకైతే, తుర్యస్థ=తుర్యమందున్నటువంటి, జాగరపదాది=జాగ్రత్‌ పదముమొదలుకొని, సుషుప్తిసీమాః=సుషుప్తి చివరగా గల, దశాః=దశలు, అజడాః=జడములుకానటువంటి, ఇచ్ఛాదయః ఖలు=ఇచ్ఛాదులు గదా.
ఈషత్స్పృష్టి, ఈషద్వివృత్తి, స్పృష్టిప్రయత్న క్రమముచే ఉన్న మంత్రసంస్థానము చేత తెలుసుకొనవడు జాగ్రదాది సుప్త్యంత ప్రవృత్తి నివృత్తి మార్గమందు జీవశివులకు సంకోచభావము పూర్ణభావాభివ్యక్తి సహృదయసామయి కులకు అభిమతము. ఆ మార్గానుసారముగా మంత్రార్థమును బోధించుచున్నారు. సుప్త్యాదులకు ఇచ్ఛాదిభావమును ఉపపాదించుచున్నారు. సుషుప్తి, ఇచ్ఛ భేదసంసారమందున్నవి. స్వప్నము, జ్ఞానము, జాగరణము క్రియ. జీవునకు అభేదజాగ్రత్‌ స్వప్నసుషుప్తుల ఎడల తుర్యవ్యవహార మని ఇదివరకు చెప్పితిమి. అందుచేతనే ఇచట తుర్యస్థమైన అభేదజాగ్రత్‌ మొదలు సుషుప్త్యంతదశలని చెప్పిరి. అభేదజాగ్రత్‌ స్వప్న సుషుప్తులు శివునకు ఇచ్ఛాదులైన దశలగుచున్నవి. ప్రకాశ మయుడైన శివుడు ప్రవృత్యభిముఖుడు. విమర్శమయుడగు పశువు నివృత్యభిముఖుడు అని ఇదివరలో చెప్పితమి. ఇచ్చట నివృత్తి రూపమగు తుర్యదశ శివునిది అని చెప్పుటెట్లు? సమాధానమును చెప్పుచున్నారు. నివృత్యభిముఖుడైన పశువు శివుడనే చెప్పబడును. ప్రవృత్త్యభిముఖుడైన శివుడు పశువు అనే వ్యవహరింపబడును. ఈ ప్రకారము సూత్రకారులైన మహాగురువులయొక్క ప్రవచనము.
అంతర్ముఖీ భవతి బిందుగతి ర్విసర్గ
స్యోక్తా గతి ర్గురుజనేన బహిర్ముఖీతి |
పూర్వ స్సుషుప్తి పద మధ్య ముపైతి జాగ్ర

న్మధ్యాత్తమృచ్ఛతి పరస్తు సుషుప్తి మధ్యాత్‌ ||
23
టీక:- బిందుగతిః
=బిందువు యొక్క గమనము, అంతర్ముఖీ=అంర్ముఖమైనది, భవతి=అగుచున్నది. విసర్గ స్య = జీవునియొక్క, గతిః=గమనము, బహిర్ముఖీతి=బహిర్ముఖమైనదని, గరుజనేన=గురుజనముచేత, ఉక్తాచెప్పబడినది. పూర్వః=ముందుగా నిర్దిష్టమైన బిందువు, జాగ్రన్మధ్యాత్‌=జాగ్రన్మద్యము నుంచి, సుషుప్తి పద మధ్యం=సుషుప్తి స్థానముయొక్క మధ్యను, ఉపైతి=పొందు చున్నది. పరస్తు =సుషుప్తి మధ్యనుంచి, తం=ఆజాగ్రన్మధ్యను, ఋచ్ఛతి=పొందును.
జీవశివులకు బహిర్ముఖాంతర్ముఖతచే అన్యోన్య విలక్షణ స్ఫురణము ఉపపత్తికలదు. ఈ ప్రక్రియను స్మరింపచేయు చున్నారు. బిందుగతి అంతర్ముఖమని, విసర్గగతి బహిర్ముఖమని శ్రీగురువులు బోధించిరి. బిందువిసర్గలకు విశ్రమణసంసరణ స్వభావములు ఇదివరలో చెప్పినవే గనుక ఇచట చెప్పలేదు. అందువలన బిందువు జాగ్రన్మధ్యనుంచి సుషుప్తి పదమధ్యను పొందును. మూడుదశలకు ప్రత్యేకము జడాజడభాగనియమ మును ప్రతిపాదించి నందువలన మధ్యదేశము భాగద్వయము నకు సంధిగా తెలియవలెను. జడజాగ్రత పరిసమాప్తి ఐన తరువాత ఉద్బుద్ధమైన తుర్యపర్యాయమగు అజడజాగ్రత్ప్రారంభపదము జాగ్రన్మధ్యమము. ఆ మధ్యనుంచి అభేద సుషుప్తి పరిసమాప్తి పదమును పొందును. విసర్గ సుషుప్తి మధ్య నుంచి అజడసుషుప్తి (పరిసమాప్త్యనంతరము) ఉద్బుద్ధమైన జడసుషుప్తికి పూర్వావధి. ఈ ప్రారంభపదమునుంచి భేద జాగ్రత్‌ ఉత్తరావధిలో సమాప్తిపదమును పొందును. ఈ ప్రకారము బిందువిసర్గలకు అంతర్బహిః ప్రసరణప్రక్రియ మంత్రార్థ వివేకమందు అత్యంత ముపయోగమని సూత్ర కారులచేత స్ఫుటీకృతమైనది.
సుప్త్యాది జాగ్రదవధి త్రితయం దశానాం

జంతోః ప్రవృత్తి వపుపో
7థ నివృత్తిమూర్తేః |
తజ్జాగ్రదాద్యవధిభూత సుషుప్తి శంభో

రారోహసీమ సముపక్రమణో
7వరోహః || 24
టీక :- ప్రవృత్తి వపుషః
=ప్రవృత్తి స్వరూపుడైన, జంతోః=జీవుని యొక్క, దశానాం = దశల యొక్క, త్రితయం=మూడును, సుషుప్త్యాది జాగ్రదవధి=సుషుప్తి మొదలుగా గలిగి జాగ్రత్‌ అవధిగాగలది, నివృత్తిమూర్తేః=నివృత్తిస్వరూపుడైన, శంభోః=శివునియొక్క, తత్‌ =ఆదశా త్రితయము, జాగ్రదాద్యవధి భూతసుషుప్తి, జాగ్రత్‌ ఆదిగాగలిగి సుషుప్తి అవధిగాగలది,అవరోహః=అవరోహము, ఆరోహసీమ సముపక్రమణః=అరోహసీమప్రారంభముగాగలది.
స్ఫుటీకృతమైన అర్థముచే దృఢపర్చుటకు మరియొక ఉపపత్తిని ప్రతిపాదించుచున్నారు. ప్రవృత్తి స్వరూపుడైన జీవునకు దశాత్రితయమున్నది. సుప్త్యాది జాగ్రదవధికలదు. నివృత్తి స్వరూపుడైన శివునకు ఆ దశాత్రితయము జాగ్రదాది సుషుప్తి అవధిగానున్నది. ఇదివరకు చెప్పిన మర్యాద ననుసరించి జీవదశలకు వైలక్షణ్యముగా శివదశలకు జాగ్రదాది ప్రవహణ ప్రక్రియయందు ఉపపత్తిని చెప్పెదరు. ఆరోహణ రూపక్రియయొక్క ఏ అవధికలదో అచట ప్రారంభించి అవరోహణము కలదు. అందువలన ప్రవృత్తి రూప జీవదశావధి పదమగు జాగ్రత్‌ అవరోహణపర్యాయమగు నివృత్తిరూప మైన శివదశాప్రారంభపద మగుచున్నది.
తస్మాత్ప్రవృత్తి వినివృత్తి మయోభయార్థః
స్వప్న స్సుషుప్తి రపి జాగ్రదపీతి గోప్యం |
భేదావిభేదమయ జీవశివాంగ కానాం

షణ్ణాం విమిశ్రణ మిదం ప్రకృతి ర్దశానామ్‌ ||
25
టీక :- తస్మాత్‌
=అందువలన, స్వప్నః=స్వప్నము, సుషుప్తిరపి = సుషుప్తియు, జాగ్రదపి=జాగ్రతయు, ప్రవృత్తి నివృత్తిమయో భయార్థః=ప్రవృత్తి నివృత్తిమయములు గనుకనే ఉభయార్థమైనవి, ఇతి=ఈవిధమున, గోప్యం=రహస్యము, భేదావిభేద... కానాం=భేదాభేదమయములు గనుకనే శివజీవులకు, అంగకములై నటువంటి, షణ్ణాం=ఆరు, దశానాం=దశలకు, ఇదం=ఈ, విమిశ్రమణం = కలసి కొనుట, ప్రకృతిః=స్వభావము.
ప్రవృత్తినివృత్తి పర్యాయములగు చైత్యచిత్తులకు ఆరోహావరోహణముల యందు వచ్చునట్టి దశాత్రయము ఒకటే ఐనను దశలకు ప్రత్యేకము భాగద్వయాంగీకారము రహస్యమార్గమని, ఉపదేశించుచున్నారు. ఇదివరకు ప్రతి పాదించిన గ్రంథతాత్పర్యమున ప్రవృత్తికర్త ఐన జీవుడే నివృత్తిని అంగీకరించి శివుడని చెప్పబడును. శివుడును ప్రవృత్తి పదమందు జీవుడని వ్యవహరింపబడును. తిరిగి నివృత్తి పదమందు శివశబ్ద వ్యవహారము వచ్చును. నిజముగా జీవశివులకు భేదములేదు. దశాభేదముచేత భేదమొచ్చెను. శివజీవులకు పర్యాయములైన ప్రకాశవిమర్శలకు ఈ ప్రాకర ముగా ఏకార్థతను అనుసంధానము చేయవలెను. ఈ ప్రకారము ప్రవృత్తి నివృత్తి కర్తలకు ఏకార్థత్వమందు ఏ ప్రవృత్తిరూప క్రియకలదో దానికేనివృత్తిని భావించవలెను. అట్లుగాక ఒకచో ప్రవృత్తే, ఒకచో నివృత్తి ఐన జీవునకు అన్యత్ర ప్రాప్తమైన ప్రవృత్తిరూపబంధముపోదు. అన్యత్ర నివృత్తి రూపమైన ముక్తి కిబంధసహితమే గనుక నిరాకులానందరూప మైన తల్లక్షణమును పొందలేదని ప్రవృత్తి నివృత్తులకు ఐక పద్యమే ఒప్పుచున్నది. ఆ ప్రవృత్తి రూపమైన దశాత్రయము నకే నివృత్తి రూపత అని ప్రత్యేకము అవస్థాద్వయరూపత్వ మును అంగీకించవలెను. ఆ అవస్థాద్వయమే భాగద్వయము. అందువలన స్వప్నము ప్రవృత్తి మయమైనది, నివృత్తి మయమైనది. ఉభయార్ధమైనది. సుషుప్తిని ఈ ప్రకారమే, జాగ్రత్‌ను భావించవలెనని రహస్యాంశము. ఈ ప్రకారము ప్రవృత్తి నివృత్తులచే సంభవించిన భేదాభేదములచే ప్రత్యేకము ద్విస్వభావములైనవి గనుక ఆరైన జీవశివాంగకములైన దశలకు అన్యోన్యవిమిశ్రణము అన్యోన్యలీనతాలక్షణాశ్లేషము, స్వభావమగు శివస్యాభ్యంతరే శక్తిః, శ##క్తేరభ్యంతరేశివః ఏప్రకారముగా శివశక్తులకు అన్యోన్యాంతరావస్థానమో ఆప్రకారము భేదాభేదవిభాగముచేత తదంగభూతములైన జాగ్రదాదుల యొక్క భాగద్వయమునకు అన్యోన్యాంతరావస్థానమని తెలియవలెను.
స్వప్న ప్రజాగర సుషుప్తి మయాష్టకోణ
పంక్త్యస్రయుగ్మ మనుకోణ విరాజమానే |

యంత్రేశ్వరే హి శివజీవ సమన్వయో
7యం
దృష్ట స్సమస్త పరమార్థ విదిష్టదైవే ||
26
టీక :- స్వప్నప్రజాగర ... విరాజమానే
= స్వప్న జాగ్రత్సుషుప్తి మయములైన, అష్టార, దశారయుగ్మ, చతుర్ద శారములచేత ప్రకాశించుచున్నది. సమస్త పరమార్థ విదిష్ట దైవే =సమస్త పరమార్థమును గుర్తెరిగిన మహానుభావులకు ఇష్టదైవమైనది అగు. యంత్రేశ్వరే =శ్రీ చక్రరాజమందు, అయం=ఈ, శివజీవసమన్వయః=శివ జీవులయొక్క, అనన్య త్వము, దృష్టోహి=కన్పించునది.
తత్ప్రతిబింబభూతమైన చక్రరాజమందు ప్రత్యేక ముపపాదించబడిన భేదాభేదభాగముల యందు ద్విరూపమైన జాగ్రదాదికమునకు అన్యోన్యత్వమును చూపించుచున్నారు. స్వప్నాది ప్రతిబింబభూతములైన అష్టకోణ, దశారయుగ్మ, మనుకోణములను తీసికొనుము. అష్టకోణము స్వప్నప్రతిబింబము, యకారాది హకారాంత అష్టవర్ణముల చేతస్వప్నతత్త్వావయవము లున్నవి. కళదిశక్త్యంతమువరకు చెప్పినారు. జాగ్రత్ప్రతిబింబమగు పఙ్త్య శ్రయుగ్మము కకారాది వకారాంతము ఇరువది వర్ణములచేత జాగ్రత్తత్వావయవము లైన పృధివ్యాది శ్రోత్రాంతమువరకు రాగలవు. సుషుప్తి ప్రతిబింబభూతమైన చతుర్దశకోణమందు అకారాది ఔకారాంత చతుర్దశవర్ణములతో సుషుప్తి తత్వావయవములైన పృధీవీ సంస్కారాది బింద్వావర్త సంస్కారాంతము వరకు ఉన్నది. ఈ ప్రకారము స్కంధత్రయాత్మకములైన చక్రములతో విరాజమానమగు మహాయంత్రమందు ప్రత్యేకము అవస్థాత్ర యాత్మకులైన శివజీవుల యొక్క మేళనము కనబడుచున్నది. ఇచట అష్టకోణాది చతుర్దశకోనాంత చక్రములయందు ఏ త్రికోణద్వయ సంశ్లేష చూపబడుచున్నదో అది జీవశివాంగ భూతములైన స్వప్నాదుల యొక్క జడాజడభాగమేళనము యొక్క ప్రతిబింబమని తెలియవలెను. జాగ్రదాది దశా త్రయముయొక్క త్రికోణము ప్రతిబింబమనుట యుక్తమే. ఒక్కొక్కటి ఐన జాగ్రదాది పదమందు త్రికోణభావమూల భూతమైన త్రైరూప్యోపపత్తి సంభవించును. అవస్థాదులు ఇచ్ఛాదిరూపములే గనుక ఇచ్ఛాదిత్రయము నిత్యయుత స్వభావములు. ఇదివరలో చెప్పిన మర్యాద ననుసరించి ఒక్కొక్క పదమందు త్రిపుటితో సంబంధమున్నవే మాతృకా మంత్రమునకువలెనే యంత్రాజమందు కూడ మహాప్రమాణ మును ఉపపాదించుచున్నారు. యంత్రరాజము సమస్త పరమార్థవేత్తలగు మహానుభావులకు ఇష్టదేవతారూపమని చెప్పుచున్నారు. ఇందుచే శిష్టోపాదేయత చెప్పబడినది. మంత్ర దేవతలకంటె అతిరిక్తమైనది ప్రామాణికము కాదు గనుక మాతృకాచక్రములచేత బోధించబడు భావమును సంశయింప బనిలేదు.
సుప్తిశ్శశీ జడతయా తపనోహి జాగ్ర
చ్చైత్యస్య సంతపనమాత్ర చిదాత్మకత్వా |

త్స్వప్నో
7నలో గిళిత చైత్యతయా పశుత్వే
సోప్యర్క ఏవ దహన స్సకలం శివత్వే ||
2
టీక :- సుప్తి
=సుషుప్తి, జడతయా=జడమైన దగు టచేత, శశీ=చంద్రుడు, జాగ్రత్‌ =జాగ్రత, చైత్యస్య=చైత్యము యొక్క, సంతపనమాత్ర చిదాత్మత్వాత్‌=శోషింపచేయ తగునదై చిదాత్మకమైన దగుటవలన, తపనః=సూర్యుడు, స్వప్నః=స్వప్నము, గిళిత=కబళించబడిన, చైత్యతయా=చైత్యము కల దగుటచేత, అనలః=అగ్ని హోత్రుడు, పశుత్వే=పశుదశయందు, సో7పి=ఆ అగ్ని హోత్రుడు కూడ, అర్కఏవ=సూర్యుడే, శివత్వే =శివదశ యందు, సకలం=సుషుప్త్యాది త్రయము, దహనః = అగ్ని
జీవశివులకు దశాత్రయమందు స్వాత్మాభిమాన దార్ఢ్యము సర్వత్ర ఉన్నదా, ఏకత్ర కలదా, అను ప్రశ్న రాగా మంత్రతాత్పర్యమును చెప్పుచున్నారు. చైత్యము అత్యంత భేదముగా విజృంభించు అవధిగా కలిగిన జాగ్రత్‌లో భేదపరమావధియందు జీవునియొక్క ప్రతిష్ఠ. స్వాత్మాభిమాన దార్ఢ్యముతో ఉండుటచే జాగ్రత్పద బోధకములైన స్పర్శలయందు మకారము జీవకళాస్థానముగా చెప్పబడెను. శివునకు స్వాత్మాభిమాన దార్ఢ్య చెచట? విమర్శ కలది గనుకనే జాడ్యమలములేని జాగ్రత్సుషుప్తి దశలకు మధ్య భాగమం దని తెలియనగును. ఇచట జాగ్రత్‌ అనగా అభేద వికల్పపదమని వివక్ష. నిర్వికల్పపదమైనది సుషుప్తి. ఆ రెంటికి మధ్యభాగ మందు సంధిరూపమైన పదము వికల్పా వికల్పోభయపద వ్యాపకముగా నుండును. అభేద వికల్పా వికల్పసంధి పదబోధకమైన క్షకారము శివకళాస్థానముగా చెప్పితిమి.
చైత్యాతివిస్ఫురణసీమ్ని ఖలు ప్రతిష్ఠా
జాగ్రత్వణో రథ తురీయ పదాంతరేచ |
శంభో ర్విమర్శవతి జాడ్యమల వ్యపేతే

జాగ్రత్సుషుప్తి దశయో స్సమ మధ్యభాగే ||
28
టీక :- చైత్యాతివిస్ఫురణ సీమ్ని
=చైత్యము అత్యంత భేదముగా విజృంభించుటకు అవధి అయిన, జాగ్రత్‌=జాగ్రత్‌ యందు. అణోః=జీవునియొక్క, ప్రతిష్ఠా=సంస్థానము, అధ=అనంతరము, తురీయపదాంతరేచ=తురీయపదము యొక్క అంతరమందు, విమర్శవతి=విమర్శగలది గనుకనే జాడ్యమలవ్యపేతే=జాడ్యమలము లేనటువంటి, జాగ్రత్సుషుప్తి దశయోః=జాగ్రత్సుషుప్తి దశలయొక్క, సమమధ్యభాగే=సమానమైన మధ్యభాగమందు, శంభోః=శివుని యొక్క, ప్రతిష్ఠా=అవస్థానము.
స్వర స్పర్శ వ్యాపకములకు చంద్ర సూర్యాగ్ని వ్యవహారోపపత్తి కలదు. తదర్థభూతనమైన సుప్త్యాదులకు చంద్రాదిత్యోపపత్తి మూలము. ఈ ప్రమేయమును ఉపపాదించుచున్నారు. సుషుప్తి యగు చంద్రుడు జడమైనందువలన బ్రహ్మాండమందు యే ఏజడస్వరూపము చంద్రుడో పిండాండ మందు సుషుప్తిగా అతడు ఉండును. బ్రహ్మాండపిండాండము లకు అన్యోన్యకారణత్వము గలదు గనుక వీటికి ఏకస్వభావమున్నది. జాగ్రదవస్థ సూర్యుడు. చైత్యమగు ఘటపటాదులను సుషుప్తిగతమైన జాడ్యమును బోగొట్టి అజడత్వస్పృష్టి యొక్క ఉపలంబనము చేయగా, ప్రకాశోష్మచేత శోషింప చేయ తగుమాత్ర చిదాత్మకమైన దగును. కాని తదైకాత్మ్య పర్యంతము దహించుట లేదు. జాగ్రత్‌కు పరిచ్ఛిన్న ప్రకాశ కలదు గనుక సూర్యునకు వలెనే బహిర్గతమైన చైత్యప్రకాశనమే. అగ్నికివలెనే స్వాంతర్గతమైన దగుట చేత స్వాభేదపర్యంతము ప్రకాశము లేదు. స్వప్నము అనలము. తనలోపలనే ఇమిడిన చైత్యము కలది గనుక స్వప్నమందు చైత్యము స్వమనోగర్భమందేలీనమై భాసించుచున్నది. ఈ ప్రకారము వహ్నిగా సంభావితమైన స్వప్నము నకు పశుత్వమందు సూర్యత్వమే చెప్పవలెను. 'పశుత్వే సోప్యర్కఏవం' పశువు స్వప్నమందు తనమనస్సులో స్వాంతస్థ మైనప్పటికిని జగత్తును మాయచే జాగ్రత్‌ లో వలె తనకు వెలపలగా నున్నదను అనుసంధానముచేయును. అందుచే జాగ్రత్‌ వలె స్వప్నము కూడ పశువుకు సూర్యుడే అని అనుభవమువల్ల తెలియుచున్నది. శివత్వమందు సుప్త్యాదులకు వివేషము కలదు. శివత్వమందు సకలము సుప్త్యాదిత్రయము అనలమే. శివునకు అన్నిదశలయందు అభేదవాసనాపాటవము చేత జగత్తును కబళించుట కలదు.
మాతా శశీభవతి మేయపదం పశుత్వే
వహ్నిః ప్రమాణ మిహ తిగ్మరుచిః క్రియాగ్ర్యం |
మాతానలః శివపదే హి మగుః ప్రమేయం

జ్ఞానాగ్ర్యభాగ మిహ తుర్యరవిః ప్రమాణం ||
29
టీక :- పశుత్వే
=పశుదశయందు, శశీ=చంద్రుడు, మాతా=ప్రమాతా, భవతి=అగుచున్నాడు, వహ్నిః=అగ్ని, మేయపదం=ప్రమేయము, ఇహ=ఈపశుత్వమందు, తిగ్మరుచిః=సూర్యుడు, క్రియాగ్య్రం=వేద్యాంశము ప్రధానముగా గలిగిన, ప్రమాణం=ప్రమాణము, శివపదే=శివ దశయందు, అనలః=అగ్ని, మాతా=ప్రమాత, హిమగుః=చంద్రుడు, ప్రమేయం=ప్రమేయము, ఇహ=ఈ శివపదమందు, తుర్యరవిః=తుర్యరవి, జ్ఞానాగ్ర్యం=జ్ఞానము ప్రధానముగాగల, ప్రమాణం=ప్రమాణము.
జాగ్రన్మధ్యపదమైన మార్గముయొక్క ప్రమేయమును చెప్పునున్నారు.
పశుత్వమందు శశీ (అనగా సుప్త్వాత్మక స్వరఖండార్థ మగు చంద్రుడు) ప్రమాత అగుచున్నాడు. పశుత్వమందు చంద్రరూపమైన వేద్యమునకే వ్యాప్తి. మేయపదమువహ్ని. అనగా స్వన్నాత్మక వ్యాపక ఖండార్థమగు అగ్ని ప్రమేయ పదమగును. పశుత్వమందు వహ్నిరూపమైన వేదకునకు వ్యాప్యత్వము వలన పశుత్వమందు జాగ్రదాత్మక స్పర్శఖండార్థ మైన సూర్యుడు వేద్యాంశప్రధానమైన ప్రమాణము. పశుదశలో వేద్య వేదకోభయాత్మకమైన ప్రమాణమందు వేద కాంశముకన్న వ్యాపకమై నందువలన వేద్యాంశము ప్రధానముగా నుండును. పిమ్మట శివత్వమందు చంద్రాదులకు భావాంతరగ్రహణము కలదు. శివపదమందు వేదకుడు వ్యాపకుడగుట వలన, చంద్రుడు ప్రమేయము గనుక వ్యాప్యముగా నుండును. అభేదజాగ్రద్రూపుడైనరవి, వేదకాంశ ప్రధానమైన ప్రమాణము. ఇది సుప్త్యాది స్వప్నాంతమార్గ మని తెలియవలెను.
చైత్య ప్రమాతు రిహ యజ్జడమేవ మానం
తచ్చిత్ర్పమాణ మనుజీవతి తచ్చిచైత్యం |
చిత్తత్వ మేవ నియమా దనుజీవదేత

న్నాత్యశ్నుతే స్వమివ చిత్తదిదం విభేది ||
30
టీక :- ఇహ
=జాగ్రన్మధ్యమందు, చైత్యప్రమాతుః=చైత్యప్రమాత యొక్క, యత్‌=ఏ, జడమేవ=జడమైన మానం=ప్రమాణము, తత్‌=ఆ ప్రమాణము, చిత్ర్పమాణం=చిత్తు యొక్క ప్రమాణమును, అనుజీవతి=అనుసరించి జీవించును, తత్‌=ఆ, చైత్యంచ=చైత్యప్రమాతయు, చిత్తత్వ మేవ=చిత్తత్వమును, నియమాత్‌=నియమించుటవలన, అనుజీవత్‌=అనుసరించిజీవించుచున్నదై, ఏతత్‌=ఈచిత్తత్వ మును, చిత్‌=చిత్తు, స్వమివ=తననువలెనే, నాత్యశ్నుతే=అత్యంతములేని దానినిగా చేయదు, తత్‌=అందువలన, ఇదం=ఈచైత్యము, విభేది=భేదము కలది.
విసర్గరూపమైన వేద్యప్రమాత భేదరూపముగా నుండుటలో ఉపపత్తి కలదు. ఈ జాగ్రన్మధ్యపదకమైన మార్గమందు చైత్రప్రమాత క్రియారూపమైనది గనుక జడమగు ప్రమాణము వేదకుని కబళించుటకు సాధనమైన వేద్య ప్రమాణము జ్ఞానరూపమగు చిత్ర్పమాణమును అనుసరించి జీవించును. పశుత్వమందు వేదకుని కబళించు పృధివ్యాది రూపమైన వేద్యప్రమాతకు శబ్దాదిపంచకము సాధనము పృధివ్యాదులు స్వధర్మభూతములగు శబ్దాదిసాధనములచేత. వేదకుని బంధించుచున్నది. శబ్దాదులు జడమైనందున వేద్యముయొక్క సాధనము విమర్శరూపమైనవి గనుక అజడమైన శ్రోత్రాదికమును అనుసరించుచు జీవించుచున్నవి. శ్రోత్రాదులు శబ్దాది వ్యాప్తిని అనుసంధానము చేయుచుండుట చేతనే శబ్దాదులకు వ్యాప్తి ప్రవాదము సిద్ధించుచున్నది. అందువలన వేద్యప్రమాణముకు వేదకప్రమాణ సాపేక్షచే కార్యకారిత్వమున్నది. ఆ చైత్యప్రమాత కూడ ఆచిత్తత్వమునే నియమములో అనుసరించి జీవించుచు, చిత్తత్వము లేనిచో ఈచైత్యవ్యాప్తిని అనుసంధానము చేయవాడు లేకపోయిన చైత్యవ్యాప్తికే సిద్ధిలేకపోవలసివచ్చును. చైత్య స్వరూపమునకేముందు సిద్ధిలేకపోవును. ఇందుచే చైత్యవ్యాప్తి పదమందు చిత్తుయొక్క శిరోదర్శనము ఆవశ్యకము.చిద్వ్యాప్తి యందు చైత్యోచ్ఛేదమువలె చైత్యవ్యాప్తి పదమందు చిత్తు యొక్క ఉచ్ఛేదములేదు. అందువలన చైత్యము తనయొక్కవ్యాప్తి పదమందు చిత్తుతో సహా ఉండునని భేదమునకు ఉపపత్తి. చిత్తు తనను కబళించినట్లుగా చైత్యము చిత్తత్వమును అత్యంతము లేనిదిగా చేయదు. అందువలన ఈ చైత్యము భేదముకలది.
జాడ్యా దచిన్నవిమృశ త్యపి మాతృభావే
తాం చిత్కళైవ గిళితాత్మ పదాం మృశం తీ |
మోహేన కల్పయతి మాతృపదశా మముష్యా

వ్యాప్తి ర్హి మాతృద లక్షణతోపపన్నా ||
31
టీక :- అచిత్‌
=చైతన్య, మాతృభావేపి=మాతృభావ మందుకూడ, జాడ్యాత్‌=జడతవలన, నవిమృశతి=విమర్శించదు, తాం=అచైత్యమును, చిత్కళైవ=వేదకుడైన చిత్కళ##యే, గిళిత=వ్యాప్తమైన, ఆత్మపదాం=ఆత్మపదమును, మృశంతీ=విచారించుచున్నదై, అముష్యాః=ఈ చైత్యమునకు, మోహేన=మోహముచేత, మాతృదశాం=ప్రమాతృదశను, కల్పయతి=కల్పించుచున్నది, మాతృపద=ప్రమాతృపదము యొక్క, లక్షణతా=లక్షణము, వ్యాప్తిః=వ్యాపకముగా, ఉపపన్నాహి=ఉపపన్నమైనది.
పైన చెప్పిన అర్ధమునే స్పష్టపరచుచున్నారు. చైత్యము జడమైనందువలన తనయొక్క వ్యాప్తిపదమందు కూడ విమర్శించ జాలదు. చైత్యమగు పృధివ్యాదులయందు విమర్శలేదు. ఆ చైత్యమును చిత్కళ ఐన వేదకుడే కబళించబడిన ఆత్మ పదముగల దానినిగా చేసి, చైత్యముచేత నేను వ్యాపించబడితి నని ఆలోచించుచు, ఈ చైత్యమునకే మోహముచేత ప్రమాతృత్వమును కల్పించుచున్నాడు. విమర్శకుడైన వేదకునికే వేద్యవ్యాప్తి పదమందునూ ప్రమాతృత్వమును చెప్పరాదా? వీలు లేదు. ఏది వ్యాపకమో అదే ప్రమాత అని వ్యాప్తి లక్షణము గనుక విమర్శవంతుడైన వేదకునకు తృతీయ పదము వ్యాప్యతాభిమానదోషము చేతనే వచ్చినది. వ్యాప్యత్వము చేత ప్రమాతృత్వము కూడ లేదు.
మానం తృతీయపద భాస్యపి బాహ్యతస్తు
మధ్యే విమిశ్రణ మిదం ఖలు మేయ మాత్రోః |
మిశ్రం హి మధ్యమపదే నిఖిలస్య దృష్టం

ద్వైరూప్య మస్య చ నపుంసకతా చ ధామ్నః ||
32
టీక :- మానం
=ప్రమాణము, తృతీయపద భాస్యపి=విశ్రాంతియందు తృతీయపదమును పొందినప్పటికిని, బాహ్య తస్తు=వెలపల, మధ్యే=మధ్యయందు, స్థితం=ఉన్నది, ఇదం=ఈ ప్రమాణము, మేయమాత్రోః=ప్రమేయ ప్రమాతలయొక్క, విమిశ్రణం ఖలు =వ్యామిశ్రమముగదా. నిఖిలస్య=సమస్త వస్తువులకు, మిశ్రం=మిశ్రస్థానము, మధ్యమపదే=మధ్యమపదమందు, దృష్టం హి = చూపబడు చున్నదిగదా, అన్యధామ్నః =ఈ పదమునకు, ద్వైరూప్యం=ద్వి స్వభావము, నపుంసకతా చ = నపుంసకత్వమును, వేది తవ్యం=తెలిసికొనవలెను.
ఇపుడు స్పర్శార్థమగు జాగ్రద్రూపమైన ప్రమాణాత్మక సూర్యునకు మేయమాతృమిశ్రరూపమగుటచేత తదుభయ సిద్ధి, అనంతరము సిద్ధిరూపమైన తృతీయపదమునకు తగి ఉండగా మధ్యమరూపమైన ద్వితీయపదమున కెట్లుచితము అను ఆశంకను నివారించుచున్నారు.
ప్రమాణము తృతీయపద మందుండ తగినదైనను, విశ్రాంతిపదమందు మేయమాత్రులు ఆగ్రహములేకనే సిద్ధి స్వరూపులు. బాహ్యమందైన ఉభయులకు అన్యోన్య వ్యాప్తి స్వభావము గనుక అన్యోన్యస్వభావ పరిగ్రహ సన్నాహరూప ప్రమాణమునకు ద్వితీయకక్ష్యయందుండుట సిద్థించును. విశ్రాంతి యందు అంతర్ముఖులైన మేయమాత్రు లకు అన్యోన్యవ్యాప్తి యందు ఆగ్రహము పుట్టకపోయినందున ఉభయవ్యాప్తి పదము వచ్చినది గనుక ఉభయాత్మకమైన ప్రమాణమునకు తాటస్థ్యమే. బాహ్యమందైన అన్యోన్యము ఆగ్రహము కలిగి అభిముఖులైనపుడు మధ్యయందు ప్రమాణ పదావిర్భావ మని తెలియవలెను. ప్రమాణమునకు విశ్రాంతి యందు తృతీయపదత్వము, బాహ్యమందు మధ్యమ కక్ష్యా రోహణముచేత ద్వితీయపదత్వము అని నిష్కర్ష. ఇందుకు ఉపపత్తి ఈ ప్రమాణము మేయమాత్రుల యొక్క మిశ్రణము అన్యోన్యభావ గ్రహణ మార్గమగుట వలన (మేయ మాతృలు కలిసికొన్న స్థలము) సన్నివాతస్థలము, మిశ్రమపదమునుక మధ్యత్వమందు ఉపపత్తి కలదు. అహోరాత్రాది సమస్త వస్తువులకు మిశ్రమమైన సంధ్యాదిరూపపదము మధ్యపద మందుచూబడుచున్నది. ఈ పదమునకు ద్వైరూప్యము కలదు. శక్తి శివాత్మకము గనుక స్త్రీ పుమాత్మక మేయ మాతృ సంకరముచే నపుంసకత్వము వచ్చును.
రశ్మీన నూదయతి బింబ మత స్స్వరేషు
సర్గ స్సితాంశు రణుబిందు రిన శ్చ కాదౌ |
యాదౌ శిఖీ మహితబిందు రితి త్రిఖండ్యా

వర్ణక్రమేణ విదితం త్రిమహోమయత్వమ్‌ ||
33
టీక :- బింబం
=సూర్యాదుల యొక్క బింబము, రశ్మీనను=కిరణోదయము ననుసరించి, ఉదయతి=ఉదయించును, అతః=అందువలన, సర్వేషు=సర్వములయందు, విసర్గః=విసర్గఅయిన, సితాంశుః=చంద్రుడు అధిష్ఠాత, కాదౌ=స్పర్శకదంబకమందు, అణుబిందుః=పరిచ్ఛిన్నబిందు వైనః ఇనః=అధిష్ఠాత సూర్యుడు, యాదౌ=యకారాది వర్ణగణమందు, మహితబిందుః=క్షకారరూపుడైన, శిఖీ=అనలుడు అధిష్ఠాత, ఇతి=ఈ ప్రకారముగా, వర్ణక్రమేణ=వర్ణక్రమముచేత, త్రిఖండ్యాః=మాతృకాఖండత్రయమునకు, త్రిమహోమయత్వం=చంద్రాదితేజస్త్రయ స్వభావము, విదితం=ప్రసిద్ధమైనది.
స్వరాదులకు ప్రసిద్ధమైన చంద్రాదిభావమును ఉపపత్తి సహితముగా ప్రతిపాదించెదము. సూర్యాదులబింబము కిరణో దయమైన పిమ్మట ఉదయించును. అవయవములు ఉదయ మైన పిమ్మట అవయవి ఉదయము బహుమతము. అందు వలన స్వరములయందు విసర్గయందు చందక్రుడు అధిష్ఠాత అని తెలియవలెను. విసర్గా పేక్షయా అకారాది బిందువువరకు ముందు ఉచ్చరించుటచే ఇది చంద్రునికళలని తెలియవలెను. అకారాది బింద్వంతము గల పదిహేను స్వరములు కళలు, షోడశకళారూపుడైన విసర్గచంద్ర స్వరూపము. ఆ ప్రకారము గనే కాది స్పర్శకదంబమందు అణుబిందువను పరిచ్ఛిన్న బిందువు అన్యోన్యము, అంతర్గతమైన మేయమాత్రు మిశ్ర స్వభావము కలవాడు. పాదిభాంతచతుర్వర్ణ కలాద్వయ రూపమునకు అంగభూతుడైన సూర్యుడు అధిష్ఠాత. సూర్యుడు ద్విస్వభావుడు గనుక కళలు అక్షరద్వయాత్మకములైనవి. అందువలన కకారాది నకారాంతము ఇరువది వర్ణములచేత పదికళలు ఏర్పడును. ఆ పదిని అవయవకళలని, పదకొండు పండ్రెండు కళలను అవయవిరూపమని యకారాది వర్ణగణ మందు మహితబిందువు అని క్షకారమునకు అగ్ని అధిష్ఠాత అని చెప్పవలెను. ఈ రీతిగా వర్ణక్రమముచేత మాతృకా ఖండత్రయమునకు చంద్రాది తేజస్త్రయ స్వభావత్వము విదితమైనది. క్షకారమునకు మహితబిందువని సంప్రదాయము ఇదివరలో ప్రతిపాదించిన స్వప్నమధ్య పదమార్గమందువలెనే జాగ్రన్మధ్యపదమార్గమందుకూడ చైత్యచిత్పర్యాయములైన విసర్గబిందువులకు అన్యోన్యలీనతాలక్షణాశ్లేషను సుప్త్యాది పదత్రయావబోధకమగు స్వరాదిఖండ త్రయమందు ఊహించవలెను.స్వరములయందు ఏకమాత్ర, ద్విమాత్రరూపములైన బిందువిసర్గకళలు ప్రథమద్వితీయోచ్చారణో పలక్షితములైన అంతర్బహిః కక్ష్యలయందున్నది. ఆ ప్రకారముగనే చివర కూడ ముందు బిందువు అనంతరము విసర్గ ఉచ్చరింపబడుచున్నది. ఇచట జడవిశ్రాంతిపద మగు సుషుప్తి యందు వెలుపల విసర్గ లోపలబిందువు 'శ##క్తేరభ్యంత రేశివః' | చైత్య పర్యాయశక్తి తత్వముయొక్క అధ్యవసాయము. పిమ్మట అజడ విశ్రాంతిరూప స్వప్నావబోధకమైన వ్యాపకవర్గయందు యవర్గము ఈషత్స్పృతా విషయమగుటచే భేదప్రమాతృ కళలుగా నున్నది గనుక విసర్గకళాత్వము. శవర్గ వివృతతా విషయము గనుక అభేదప్రమాతృబిందుకళాత్వము. ప్రవృత్తి నివృత్తి మేళనాత్మకమగు వ్యాపకవర్గకు ఉభయపర్యంత మందున్న మకారక్షకారములు భేదాభేదకళలయొక్క బిందు విసర్గరూపములగు అధిష్ఠాతులు ఇచట కూడ ప్రథమద్వితీ యోచ్చారణోపలక్షితమగు అంతర్బాహ్య కక్ష్యయందు 'బిందుగ ర్భేవిసర్గ. శివస్యాంభ్యంతరేశక్తిః' స్వప్నాత్మకమగు విశ్రమపదమునకు శివతత్త్వముయొక్క అధ్యవసాయము. అనంతరము అన్యోన్యగ్రహణపదమైన జాగరావస్థాబోధక మగు స్పర్శఖండమందు కార్యరూపములైన పృథివ్యాదులు ఐదు. జ్ఞేయరూపములైన గంధాదులు ఐదు. మొత్తము పది విషయముల యొక్క పాయ్వాది కర్మేంద్రియములు ఐదు ఘ్రాణాది జ్ఞానేంద్రియములు ఐదు కలిసి పది ఇంద్రియముల యొక్క మేళనముచేత దశకళానివృత్తి యగుచున్నది. ఇచట విషయములు జడము గనుక విసర్గరూపత. ఇంద్రియ ములు అజడములు గనుక బిందురూపత. ఈ అన్యోన్య గ్రహణపదమందు కకారాద్యక్షరములు ముందుగా ఉచ్చరించుట కలదు. ఐనను గ్రాహకత్వాభివ్యక్తి ద్వారా వేద్యతత్వ మునకు ప్రథమవ్యాప్తి కలదు. సుషుప్తి స్వప్నముల యందు విశ్రాంతిపదము గనుక అత్యంతము లీనమగుచే సుషుప్తి యందు బిందువునకు స్వప్నమున విసర్గకు పూర్వనిపాతము చెప్పబడినది. స్పర్శలకు చివరపాదిభాంతవర్ణ చతుష్కము ద్విద్వివర్ణయోగముచే బిందవిసర్గరూపమున అధిష్ఠాతృద్వయముగా అంగిరూపముతో కలవు. ప్రమాణకళలు మేయ మాతృమిశ్రమముల గనుక ద్విద్వివర్ణములచే నిష్పన్నము లగుచున్నవి. ఇట్లుండగా వేద్యమునకు ప్రథమవ్యాప్తి చేత ఖండత్రయమందు ప్రవృత్తి పదమందు విసర్గాంశ##కే వ్యాప్తి. నివృత్తి పదమందు విసర్గాంశ##కే వ్యాప్తి. నృవత్తి పదమందు వేదక వ్యాప్తిచేత ఖండత్రయమందు బింద్వంశకు వ్యాప్తి అని అనుసంధానము చేయవలెను. ఖండత్రయమందు ప్రథమము స్వరాది పాఠము. అనంతరము వ్యాపకాది పాఠము. ముందు వేద్యము చేత వేదకాక్రమణము. పిమ్మట వేదకునిచే వేద్యాక్రమణవ్యాప్తి గలవని ఉత్తరసూత్రమున బోధించుచున్నారు.
ఖండక్రమేణ శశినో దహనాంగతోక్తా
తద్వ్యుత్క్రమేణ జడభానుగుణత్వ మగ్నేః |
ఖండేషు చక్రమవిలోమజపేన చైత్య
చిత్యోః పరస్పర పదాక్రమ రీతి రుక్తా ||
34
ÉÔÁNRP :c ÅÁLi²R…úNRP®ªs[Vßá
=స్వరాదిఖండముల యొక్క, అనులోమపాఠముచేత, శశినః=చంద్రునకు, దహనాం గతా=దహనుడు అంగమగును అని, ఉక్తా = చెప్పబడినది. తద్వ్యుత్క్రమేణ=ఆస్వరాదిఖండముల యొక్క, విలోమ పాఠముచేత, అగ్నేః=అగ్నికి, జడభాను గుణత్వం=చంద్రుడు గుణముగా, ఉక్తం=చెప్పబడ్డది, ఖండేషు=స్వరాదిఖండ ములయందు, క్రమవిలోమజపేన=అనులోమ విలోమజపము చేత, చైత్యచిత్యోః=విసర్గ బిందువులకు, పరస్పర పదాక్రమ రీతిః=ఒకరి పదమును ఒకరు ఆక్రమించుకొను పద్ధతి, ఉక్తా=చెప్పబడినది.
స్వరాదిఖండముల క్రమపాఠము చేత చంద్రునకు దహనుడు అంగము. విలోమపాఠముచేత అగ్నికి చంద్రుడు అంగము. అకారాదిక్షకారాంతము, క్షకారాది అకారాంతము ఖండత్రయము. క్రమవిలోమపాఠములచే చైత్యచిత్తులను ఒకరిస్థానమును ఒకరు ఆక్రమించుకొనుట చెప్పబడినది. అనులోమముగా జపించినపుడు చైత్యము చేత చిదా క్రమణము విలోమజపమందు చిత్తుచే చైత్యాక్రమణము అని యోచించవలెను.
స్వప్నశ్చ జాగ్రదపి వాడర పూర్వయామౌ
తుర్యం పదద్వయవ దుత్తర యామయుగ్మం |
సుప్తి స్తురీయలయ భూః ప్రథమం క్షపార్ధం

స్వప్న ప్రజాగర దశాలయభూ ర్ద్వితీయమ్‌ ||
35
టీక:- స్వప్నశ్చ
=స్వప్నము, జాగ్రదపి=జాగ్రతయు వాసరపూర్వయామౌ=వాసరము యొక్క మొదటి రెండు జాములో, పదద్వయవత్‌=నివృత్తి జాగ్రత్స్వప్నరూపపద ద్వయ యుక్తమగు, తుర్యం=తుర్యము, ఉత్తరయామ యుగ్మం=వాసరముయొక్క మూడు నాలుగు జాములు, తురీయలయభూః=నివృత్తిజాగ్రత్స్వప్న రూపదశలకువిశ్రాంతి స్థానమైన, సుప్తిః=సుషుప్తి, ప్రథమం=మొదటిదైన, క్షపార్థం=యామద్వయము, స్వప్న ప్రజాగరదశాలయభూః=స్వప్న జాగరదశలకు, లయస్థానమైనది, ద్వితీయంక్షపార్థం=రెండవదైన యామద్వయము.
స్వప్నమధ్యమార్గమందు దశల పునఃపునః ఆవృత్తి చేత కాలరూపముయొక్క వ్యవస్థ కాగలదు. అష్టయామాత్మక మగు కాలము అహోరాత్రరూపమైనది. అందు స్వప్నము జాగ్రత, వాసరము యొక్క రెండు పూర్వయామములు వాసరముయొక్క ప్రథమయామము స్వప్నము. సుప్తిరూప మగురాత్రికి అనంతరము ప్రవర్తించును. వాసరముయొక్క రెండవజాము జాగ్రత్‌, స్వప్నానంతరము ప్రవర్తమానమైనది. గ్రాహకరూపుడైన ప్రమాణసూర్యుని భేదస్ఫురణ పరమావధి. నివృత్తి జాగ్రత్స్వప్నరూపపదద్వయ యుక్తమగు తుర్యము వాసరముయొక్క ఉత్తర యామయుగ్మము. అందు తుర్యజాగ్రత్‌ తృతీయయాయము. భేదసంసారముయొక్క నివృత్తి ప్రారంభించును. తుర్యస్వప్నము చతుర్థయామము. భేదజాగ్రద్రూపుడైన సూర్యునికి భేదరూపసంతాపము అతి మాత్రము నివర్తించినందును, పిమ్మట ప్రథమ క్షపార్థము. అనగా రాత్రిలో మొదటి సగమగు రెండు యామములు సుప్తి కాలము. పైన చెప్పిన నివృత్తి జాగ్రత్స్వప్నరూపతుర్యదశా విశ్రాంతిభూమి. సుషుప్తి భేదాభేదరూపసంసారదశలయొక్క విశ్రమస్థానము. కారణరూపమైనందువలన తురీయ జాగ్రద్విశ్రాంతిపదము. సుషుప్తి రూప మగు రాత్రియొక్క మొదటి యామము. తురీయ స్వప్నవిశ్రాంతిపదము రాత్రి ద్వితీయయాయము. ద్వితీయము, క్షపార్థము. మిగిలిన రెండు యామముల సుప్తికాలము. స్వప్నమిశ్రమపదము తృతీయ యామము, జాగ్రత్‌ మిశ్రమపదము రాత్రి చతుర్థయామము. ఈ ప్రకారము మంత్రార్థమందు ప్రాణభూతముగా నున్నది గనుక ఉపదేశింపబడినది. ఇది అనుభవము గలవారికి హృదయంగము.
విమర్శానందనాధేన విరజానంద పుత్రేణ వ్యాఖ్యాతం

మాతృకాచక్ర వివేకే ప్రథమపదమ్‌.

స్వతంత్రానందనాధుని మాతృకాచక్రవివేక మండలి

సంజ్ఞావివేకమను ప్రథమ స్కంధమునకు

శివానంద దేశకుని వ్యాఖ్యానుసారమైన

వివరణ

Sri Matrukachakra viveka    Chapters