Sri Matrukachakra viveka    Chapters   

అథ సుప్తి వివేకః ద్వితీయః

మాయాబలా త్ర్పథమభాసి జడస్వభావం

విద్యోదయా దధ వికస్వర చిన్మయత్వం |

సుప్త్యాహ్వయం కిమపి విశ్రమణం విభాతి

చిత్రక్రమం చిదచిదేకరస్య స్వభావమ్‌ || 1

టీక :- మాయాబలాత్‌=మాయయొక్క బలమువలన, ప్రథమభాసిజడస్వభావం=ముందుగా భాసించు జడస్వభావ ముగలిగి, అథ=అనంతరమందు, విద్యోదయాత్‌=విద్యో దయమునుంచి, వికస్వరచిన్మయత్వం=వికసించు చిన్మయ స్వభావముగలిగినదియు, చిదచిదేకరసస్వభావం=చిదచిత్తుల యొక్క రసస్వభావమైనదియు, చిత్రక్రమం=చిత్తరవుయొక్క క్రమమువంటి క్రమము కలిగినదియు, కిమపి=అనిర్వచనీయ మైన, సుప్త్యాహ్యయం=సుషుప్తి అను పేరుగలదియునై, విశ్రమణం=విశ్రాంతిస్థానము, విభాతి=ప్రకాశించు చున్నది.

మంత్రఖండములకు నాలుగుదశలను ప్రతిపాదించు చున్నాము. ముందుగా జీవశివులకు విశ్రాంతిపదము, సర్వసంసారబీజమైన సుషుప్తిని బోధించు సర్వఖండమును వివరించవలెను. జడాజడరూపమగు సుషుప్తి యొక్క ఏకపద మందుగల సామరస్యము చేత స్థితిచమత్కారమును స్తోత్రము చేయ నగును. చిదచిత్తులకు 'గజవృషభచిత్రన్యాయము' వలన అన్యోన్యము విరోధము లేక ఏకపదమందు అనుప్రవిష్టమైన ఉభయతత్త్వమయమగు రసమే స్వరూపముగా గలదు. ఏరసమందు అజడజడతత్త్వములకు ప్రత్యేకభాగ నిర్ణయము లేకుండా సర్వతః స్వరూపాను ప్రవేశమున్నది. గజవృభముల చిత్రవిశేషమందు భాగనిర్ణయములేకుండా, సాకల్యముగా ప్రత్యేకము అను ప్రవేశమున్నది. అటువంటి సుషుప్తి అను పేరు గల అనిర్వచనీయము, అనుభ##వైకవేద్యమునగు విశ్రాంతి ప్రకాశించుచున్నది. అందరకు ఇది అనుభవవిషయమే. ఒకే సుషుప్తి విశ్రమమందు జడాజడపర్యాయములైన విసర్గ బిందువులకు ప్రత్యేకముగా అంతట ప్రవేశము గలదని చిత్ర విశేషసాదృశ్యమువలన సుషుప్తి దశయందు జడత్వము అందరకు అనుభవమే. 'ఇంతకాలము సుఖముగా నేను నిద్రించితి'నని సుప్త్యంతమందు భావించిన సుప్తి సుఖముయొక్క అనువాదము చేత అజడత్వమందు కూడ తోచుచున్నది. చిత్రశబ్దమునకు గల అద్భుతార్థమును తెలిసికొనవలెను. ఒకే సుషుప్తి యందు అన్యోన్యవిరుద్ధములగు జడాజడసామరస్యము అద్భుతము. ఇట్లు సుషుప్తిలో విషయములగు జడాజడప్రతీతుల రెంటి లోను జడప్రతీతికే ప్రాధమ్యము గలదు. విద్యకంటె మాయయే బలముకలది. బాహ్యకక్ష్యయందు విలసన స్వభావ ముండుటచే ముందుగా స్ఫురించుచుండును. విద్య ఐనచో అంతఃకక్ష్యయందు విలసనస్వభావము కలది. పిమ్మట క్రమముగా స్ఫురించుటచే ప్రాధమ్యలక్షణమును పొందలేదు. ఉత్పత్తియందైన విద్యకే ప్రాధమ్యము. మాయకులేదు. అందుచే మాయాబలమువలన ముందుగా జడస్వభావమే భాసించుచున్నటువంటిది. పిమ్మట విద్యోదయమువలనచిన్మయ ముగా స్ఫురించున్నది. చిదచిత్సామరస్యముచేత నిష్పంద మైనదియగు తత్వమునకు ఒకసారియే జడాజముల అన్యోన్య వ్యాప్తి రూప స్పందచమత్కారమని, సామరస్య జడాజడ పర్యాములైన ఇచ్ఛాజ్ఞానక్రియలకు యమళత్వము సిద్ధాంతముగా మంత్రముచేత చెప్పబడుచున్నది. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి మయములైన సామరస్య స్పందద్వయ స్వరూపపదత్రయ మునకు సుప్త్యాది దశలయందు యామళత్వ ముండుటచేతనే దీని తరువాత ఇదేనను నియమములేకపోయెను. అందువలననే త్రితయబోధకములైన మంత్రఖండములకు పౌర్వాపర్య క్రమము అవసరములేదు. తదాత్మకమైన ఇచ్ఛాజ్ఞానక్రియా త్మకమగు మహాచక్రాంగభూతచక్ర త్రయమునకు క్రమనియమములేదని, సర్వత్ర స్కంధత్రయమునకు ప్రత్యేకముగా ప్రాధాన్యాభివ్యక్తి నిమిత్తమై తత్తదాద్యావర్తన ప్రక్రియను ఇదివరకే చెప్పితిమి.

మాతా నభః క్షితి విమిశ్రపదం ప్రమాణం

వాయు శ్శిఖీ చ సలిలం చ మహీ చ మేయం |

జ్ఞానాత్మ పూర్వపఠితం యుగళత్రయే7పి

పశ్చాదుదీరిత మిహీథిమతం క్రియాత్మ || 2

టీక :- నభఃక్షితిమిశ్రపదం=ఆకాశ, పృథివీమిశ్ర పదము, మాతా=ప్రమాత, వాయుః=వాయువు, శిఖీచ=అగ్నియు, ప్రమాణం=ప్రమాణము, సలిలంచ=ఉదకము. మహీచ=భూమియు, మేయం=ప్రమేయము, యుగళ త్రయేపి=యుగ్మ త్రయమందు, పూర్వపఠితం=ముందుగా చెప్పబడినది, జ్ఞానాత్మా=జ్ఞానస్వరూపము, ఇహ=ఈ యుగళత్రయమందు. పశ్చాత్‌=తరువాత, ఉదీరితం=చెప్పబడినది, క్రియాత్మ=క్రియాస్వరూపము, ఇతి=ఈ విధము, అభిమతం=సమ్మతమైనది.

స్వరవర్గ ప్రస్తావమందు స్వరవర్గములకు సారభూత మైన భూతపంచకాభిధాయకత్వమును చెప్పుటకై ఈ భూత పంచకమునకు సకల సంసారరూపమైన ప్రమాతృప్రమాణ ప్రమేయాత్మకతను ఉపపాదించగలము. ఆకాశపృథివీమిశ్రపదము ప్రమాత. పృథివ్యాకాశాదిరూపులైన దేహాత్మల కిద్దరకు ప్రమాత చిదభిమానరూపుడగుట వలన వాయ్వగ్నులు రెండును ప్రమాణములు. జలము, పృథివి అనునవి ప్రమేయములు. శివజీవాత్మలలో ఒకిరికి ప్రమాతృత్వమున్నప్పుడు రెండవ దానికి ప్రమేయత్వముండును గనుక పృథివ్యాకాశము లకు ప్రమేయత్వము సంభవించును. ఇప్పుడిచట ఆత్మయొక్క ప్రమాతృత్వాపేక్షచే పృథివికి ప్రమేయత్వము నిశ్చయించ బడినది. జ్ఞానక్రియలకు పరస్పరము అవినాభావ సంబంధముండుటచే ప్రమాత్రాది పదత్రయమందు కూడా ప్రత్యేక పదమందు జ్ఞానక్రియాస్థితిని విభాగించి చెప్పనగును. యుగళ త్రయమందు (నభః క్షితి, వాయు, శిఖి, సలిల మహీరూప మైనయుగ్మ త్రయమందు) పూర్వపఠితమైన నభోవాయు సలిల రూపమును జ్ఞానాత్మ అని తరువాత చెప్పబడు క్షితి, శిఖి, మహీరూపమును క్రియాత్మ అని వివరణ. నభస్వరూపమైన ఆత్మాజ్ఞాన ప్రమాత. క్షితిరూపమైన దేహము క్రియాప్రమాత. జ్ఞానప్రమాణము వాయువు, క్రియాప్రమాణము వహ్ని. జ్ఞాన ప్రమేయము సలిలం. క్రియాప్రమేయము భూమి. ఈ విభాగము నిచట చూపించి ఉత్తరప్రమాతలు ఒకరినొకరు వ్యాపించు నపుడు ప్రమాణాది పదద్వయమందు వారివారి అంశ##యే ఏర్పడుననినారు.

వర్ణాః ఖ వాయు శిఖి తోయధరాః క్రమేణ

స్యుః కంఠ తాలుక శిరో రదనోష్ఠ జాతాః |

స్యాద్వ్యుత్క్రమః పశుపదే వియదాదికానాం

స్థానోచ్చయాపచయజౌ మహదల్పభావౌ || 3

టీకా :- కంఠతాలుకశిరోరదనోష్ఠజాతాః=కంఠము, తాలుక, శిరస్సు, రదనము, ఓష్ఠములనుంచి వచ్చిన, వర్ణాః=వర్ణములు, క్రమేణ=క్రమముగా, ఖ వాయుశిఖితోయధరాః=ఆకాశ, వాయ్వగ్ని, సలిల మహీరూపములు, స్యుః=అగును. పశుపదే=పశుపదమందు, వియదాదికానాం=ఆకాశాదుల స్థానోచ్చయా పచయజౌ=స్థానములయొక్క ఉచ్చత్వ నీచ త్వమువలన పుట్టిన, మహదల్పభాతాః=మహదల్పభావములు వ్యుత్క్రమః=వ్యతిరేకముగా, స్యాత్‌=అగునవి.

ప్రమాత్రాదిరూపముచే సకల సంసార కలాపమగు భూతపంచకమునకు వర్ణావబోధ్యత్వమును సంబంధప్రవచన పూర్వకముగా ఉపపాదించెదము. కంఠాది ఓష్ఠాంత పంచస్థాన సంభూతములైన వర్ణములు క్రమముగా ఆకాశాది పృథివ్యంత పంచభూతబోధకములు.క ంఠాదిస్థానములనుంచిపుట్టిన వర్ణము లకు ఆకాశాదిబోధనయందు సంబంధము కలదు. మహావృత్తి అల్పవృత్తి అనువాటిచేత పరస్పరము ప్రసిద్ధములైన ఆకాశాదులకు అన్యోన్యాపేక్షచే మహత్తని, అల్పమని రెండు స్వభావములు కంఠాదులయొక్క ఉచ్ఛత్వనీచత్వముల వలన కలిగినవి. వర్ణములకు సుప్త్యాదిదశావబోధన మందు ఏ ప్రకారము సాదృశ్యసంబంధమో, ఆప్రకారమే ఆకాశాద్యవ బోధనాసంబంధమును కూడ సాదృశ్యసంబంధమే. స్థానపంచక ములో కంఠము సర్వోన్నతస్థానము గనుక మహావృత్తికలది. భూతపంచకమందు మహావృత్తి యగు ఆకాశమును సాధనము చేత బోధించుచున్నది. ఈ ప్రకారమే తాలవ్యమైనవర్ణము శిరోభవ మైనదానికంటె మహావృత్తికలది. అగ్న్యాద్యపేక్షచే మహావృత్తిఐ వాయువును సాదృశ్యముచేత బోధించుచున్నది. ఈ ప్రకారముగా పంచభూతములకు ఊహించవలెను. శిరస్సుకు పంచస్థానముల లోపల మాధ్యత్వేన దుతమైనందున సర్వోచ్చత్వము శంకించ తగినదికాదు. కంఠజాదులకు ఆకాశాదిబోధనము పశుపదమందు వ్యుత్క్రమమును పొందు చున్నది. పశుపద మనగా చైత్యవ్యాప్తి కలది. ఆ పదమందు వ్యాప్తిని పరిగ్రహించుటచే పృథివికి ఆకాశభావము వ్యాప్తి భ్రంశవలన కలుగును. ఆకాశమునకు పృథివీభావమువచ్చును. అప్పుడు కంఠజములైన వర్ణములచే ఆకాశభావమును పొందిన పృథివీ రాగలదు. తాలుభవములైన వర్ణములచే వాయుభావమును పొందిన సలిలమున్నది. శిరోభవములైన వర్ణములచే అజడాంశకక్ష్యనుపొందిన జడాంశకు వహ్ని చెప్పబడను. వహ్ని జడాజడరూపమగు తేజస్సని, వాయువు అజడరూప తేజస్సని సలిలమురూపతేజస్సని జాగ్రత్‌ స్కంధమందు చెప్పితిమి. రదన ములచేత పృథివ్యుదకరూపములైన వాయ్వాకావములు చెప్పబడుచున్నవి. సర్వత్ర క్రియావ్యాప్తి గలదు. పశుపదమందు క్రియారూపపృథివియే జ్ఞానాంశ##మైన జలమును వ్యాపించు చున్నది. దంత్యోష్ఠ్యములకు పృథివీజలబోధకత్వమే ఉపపన్నమైనది, దంత్యోష్ఠ్యములయిన లకార, వకారములకు పృథివీ జలబీజత్వము ప్రసిద్ధమైనందున కూడ ఉపపన్నత కుదిరినది. ఏపంచవర్ణములు వివృతత్వాది ప్రయత్నములచే సుప్త్యాది బోధకములు. ఆ ప్రకారమే కంఠాదిస్థానతారతమ్యముచేత ఆకాశాది బోధకములని మంత్రతాత్పర్యము.

''అకుహవిసర్జనీయానాం కంఠః. ఇచుయశానాంతాలుః. ఋటురషాణాం మూర్ధా. ళులసానాందంతః. ఉపూపధ్మానీయానామోష్ఠః.'' ఇది వ్యాకరణమతము.

ఇచ్ఛాద్వయం భవతి తాలుభవోష్ఠ్యవర్ణౌ

మూర్థన్య దంత్య తనుమానయుగం క్రియాది |

సంకోచభావ తదభావ వశాదకారః

సర్గోపి బిందురపి సంశ్రిత మాతృభావః || 4

టీక :- తాలుభవోష్ఠ్యవర్ణౌ=తాలువులనుంచి, ఓష్ఠముల నుంచి పుట్టిన, వర్ణౌ=ఇకార ఉకారవర్ణములు, ఇచ్ఛాద్వయము, భవతి=అగుచున్నవి, మూర్ధన్యదంత్యతను=శిరస్సు నుంచి, దంతముల నుంచి పుట్టిన ఋకార, లుకారములు, క్రియాది=కర్మేంద్రియము ఆదిగాగల, మానయుగం=ప్రమాణయుగము, భవతి=అగుచున్నవి, అకారః=అకారము, సంకోచభావతదభావవశాత్‌=భేదాభేదభావముల వలన, సర్గోపి=విసర్గయు, బిందురపి=బిందువుకూడ, సంశ్రిత మాతృభావః=ఆశ్రయించబడిన, ప్రమాతృభావముకలవి.

సకలసంసారమునకు కారణరూపమైన సుషుప్తి యందు కార్యకారణములకు ఐకరూప్యతానియమము వలన వాసనా రూపముగా సర్వసంసారముండు నని అకారాది పంచస్వర ములయందు భేదాభేదరూపవాసనా సంసారసన్నాహమును వివరింతుము. తాలుభవోష్ఠ్యవర్ణౌ - తాలువులనుంచి, ఓష్ఠ ములనుంచి పుట్టిన ఇకార ఉకారములు రెండును జడాజడ ప్రమాతలగు విసర్గబిందువులకు ఇచ్ఛలగుచున్నవి. ఇకార ఉకారములకు వ్యాప్యపదమందే ఇచ్ఛాత్వము. వ్యాపకపద మందుకాదు. విసర్గవ్యాప్తి యందు విసర్గరూపము అకారమే. ఇచ్ఛ ఇకారము విసర్గకుసాధనము. అకార ఇకారములు క్రియయే గనుక ఐకరస్యము లేదు. బిందువ్యాప్తి యందు బిందురూపము అకారమే. ఇచ్ఛ ఉకారము. జ్ఞానరూపము గనుక ఉకారము బిందువుతో కలియును. అందువలన ఎపుడు విసర్గ వ్యాపకముగా ఉండునో అపుడు ఉకారమునకు బింద్విచ్ఛాత్వము. బిందువునకు ఉపరూపమే గనుక ఎపుడు బిందువ్యాపకమో అపుడు ఇకారమునకు విసర్గే చ్ఛాత్వము. విసర్గకు ఉపరూపముగనుక మూర్ధన్యదంత్యము లకు ఋకార లుకారస్వరూపములు క్రియాది మానయుగళము. కర్మేద్రియ, జ్ఞానేంద్రియరూప, ప్రమాణయుగళ మని తాత్పర్యము. సంకోచభావమనగా భేదరూపత, తదభావ మనగా అభేదరూపత. ఈ రెంటివలన అకారమే విసర్గబిందువు ప్రమాతృభావమును ఆశ్రయించును. ఇచట రహస్యమే మనగా అకారమే అభేదరూపమగు బిందువు. అకారమే భేద రూపమగు విసర్గ. ఆ బిందువిసర్గలయొక్క సామరస్యపదము కూడ అకారమే. సామరస్య పదమందు నిష్పందమైన అకారమే జ్ఞానక్రియారూపబిందు విసర్గేచ్ఛారూపముచేత బహిస్పంద చమత్కారమును పరిగ్రహించును. అందు మొదట ఎపుడు విసర్గ రూపముగా స్పందమగునో అపుడే ప్రమాతృభూత విసర్గ రూప అకారస్పందసమకాలమందే ఇకారాది వర్ణచతుష్ట యాత్మకమగు త్రిపుటిరూప సంసారకలాపము రాగలదు. అకారగర్భమువలన బహిస్పందమగును. ఎపుడు బిందురూపముగా అకారస్పందమో అపుడు బిందుప్రమాతతోకూడ నివృత్తి రూపమైన ప్రాగుక్తవర్ణచతుష్ఠయత్మక సంసార కలాపము పూర్వమువలెనే అకారగర్భమందే స్పందమగును. అందుచే అకారమే సామర్స్యపదము, అకారమే బిందువిసర్గ రూపముగా బహిస్పందమగును. అకారమునుంచియే సకల సంసారకలాపభూతమైన పంచభూతముల ఉత్పత్తి. అకారమే మాతృకోదయ విశ్రాంతిస్థానము.

మూలద్వయే స్ఫురతి మాతృయుగం తదంత

రిచ్ఛాద్వయం భవతి మానయుగం తదంతః |

ఏతత్సమం పద మతో విషమం ద్విరూపం

చెత్యోచ్ఛ్రయే స్ఫురతి జాతుచిదు చ్ఛ్రయేపి || 5

టీక :- మూలద్వయే=ఉభయమూలములలో, మాతృయుగం=ప్రమాతృయుగళము, స్ఫురతి=ప్రకాశించుచుండును, తదంతతః=ఆప్రమాతలయొక్క వ్యాప్యప్రదేశమందు, ఇచ్ఛా ద్వయం=ఇకార, ఉకారరూప ఇచ్ఛాద్వయము, భవతి=అగు చున్నది. తదంతతః=ఆ ఇచ్ఛలయొక్క, వ్యాప్యపదమందు, మానయుగం=ఋకార లుకారరూప ప్రమాణద్వయము. భవతి = అగుచున్నది. ఏతత్‌=ఈ, పదం=పదము, సమం=సమవ్యాప్తి పదము, అతః =ఈ సమపదముకంటె, విషమం = అసమానమైన, పదం=పదము, ద్విరూపం=రెండురూపములు కలది, భవతి = అగుచున్నది. జాతు=ఒకానొకప్పుడు, చైత్యోచ్ఛ్రయే=విసర్గవ్యాప్తి యందు, స్ఫురతి=స్ఫురించును. జాతు=ఒకానొకప్పుడు, చిద్రుచ్ఛ్రయేపి=బిందువ్యాప్తి యందును, స్ఫురతి=స్ఫురించును.

అనంతర వర్ణముల గర్భమందు వాసనారూపముగా ఉన్న స్పందద్వయవశముచే బహిర్విలసితమైనవి. విసర్గబిందు సంసారద్వయ సన్నాహసంస్థానము యొక్క స్వరూపమును చెప్పెదము. మూలద్వయమందు అనగా సంసారకలాపము యొక్క ఉభయమూలముల యందు, విసర్గ బిందురూపమైన ప్రమాతృద్వయము స్ఫురించుచుండును. ఆప్రమాతలయొక్క వ్యాప్యప్రదేశమందు ఇచ్ఛాద్వయమగు ఇకార ఉకారము లుండును. విసర్గయొక్క అంతస్సన్నిథియందు ఇకారము, బిందువుయొక్క అంతస్సన్నిధియందు ఉకారము, ఆ ఇచ్ఛాద్వయముయొక్క వ్యాప్యపదమందు ఋకార లుకార ఉకార అకార ములు విసర్గాది బింద్వంత షడ్వర్ణరూపమైనది సమపదము. ఇది విసర్గ బిందువులయొక్క సమవ్యాప్తి పదము. ఈసమపదము కంటె విషమమైనది రెండు రూపములుగా నున్నది. ఒకానొకప్పుడు విసర్గవ్యాప్తి యందు బిందురూప అకారముయొక్క దర్శనముండక ఉకారరూపముగానే ఉండును. ఇందుచే పంచాంగత్వము ఒకప్పుడు బిందువ్యాప్తియందు విసర్గ రూప అకారముయొక్క దర్శనముండదు. ఇకారరూపముగా ఉండును. ఉకారము గూడా బిందురూప అకారమందే ఐకరూప్యతచే చతురంగత కలది యగును. ఈ ప్రకారమున విషయపదము. ఉత్తరత్ర ప్రతిపాదించునపుడు యోజనీయమైనది. ఈ ప్రకారము పంచాంగమైన విసర్గపదమునకు సుప్త్యాద్యవస్థా త్రయ సంభావితమైన త్రైరూప్యమందు పంచత్రికోణములు ఏర్పడుచున్నవి. అందు చతురంగమైన బిందుపదమునకు చతుస్త్రికోణములు ఏర్పడుచున్నవి. పంచత్రికోణరూపమై శక్తి పర్యాయమైన విసర్గయొక్క చతుస్త్రికోణరూపమగు శివ పర్యాయబిందువుయొక్క సమపదమందు అన్యోన్యశ్లేషచేత నవత్రికోణాత్మకమైన శ్రీమహాయంత్రముయొక్క సంపత్తి గలదు.

సామ్యం భ##వేత్ర్పకృత మత్ర చమత్క్రియైన

వైషమ్య మద్భుత తరా హి విమర్శవృత్తిః |

నిష్పందతాం సమపదే సతతం భజంతీ

ప్రస్పందతే చ చిదచిత్కలితోచ్ఛ్రితత్వాత్‌ || 6

టీక :- అత్ర=ఈ సమవిషమరూపపదత్రయమందు, సామ్యం=సమత్వము, ప్రకృతం=స్వభావము, భ##వేత్‌=అగును, వైషమ్యం=స్పందరూపమైన విషమత్వము, చమత్క్రియైవ=చమత్కారము మాత్రమే. విమర్శవృత్తిః=విమర్శ వ్యాపారము, అద్భుతతరాహి=ఆశ్చర్యకరమైనది గదా, సమపదే=సమవ్యాప్తి పదమందు, నతతం=ఎల్లప్పుడు, నిష్పం దతాం=నిష్పందత్వమును, భజంతీ=పొందుచున్నదై, చిదచిత్కలితోచ్ఛ్రతత్వాత్‌=చిదచిత్ర్పమాతల యొక్క వాప్త్యతిశయమువలన, ప్రస్పంతేచ=స్పందించుచు ఉన్నది.

పైన చెప్పిన మర్యాదచే నవాంగరూపమైన సమపదము యొక్క పంచాంగరూపమైన విసర్గపదము చతురంగ రూపమైన బిందుపదముయొక్క స్వాభావిక వైకారిక కక్ష్యావిభాగమును వివరింతుము. సమవిషమరూపమైన పదత్రయమందు సమత్వము స్వాభావికము. విచారించగా యామళన్యాయముచేత పదత్ర యమునకు పౌర్వాపర్యము లేకపోవుటచే స్వాభావిక, ఆగంతుక పర్యలోచనకు అవకాశము లేదు. ఐనను నిష్పంద విశ్రాంతి రూపమగుటచేసమపదమునకు స్పందరూపపదద్వయాపేక్షయా నిర్విరూపత్వము అనుభవమందు స్ఫురించుచున్నది. సమపద మునకు ప్రకృతత్వము, మూలరూపత్వమని తాత్పర్యము. వైషమ్యమనగా స్పందరూపవిషమత్వము. ఇది చమత్కారము మాత్రమే. విచారించగా స్పందకాలమందు భిత్తిభూతముగ నిష్పందస్వభావము అను వృత్తమైనది గనుక విరుద్ధములైన స్పందాస్పందములకు సామానాధికరణ్య మొట్లుండును? సకల సంసార మూలభూతమైన మహాప్రకృతి యగు విమర్శయొక్క వ్యాపారము అద్భుతతరమైనది. సమపదమందు సతతమునిష్పంద ముగా నుండి విరుద్ధములైన చిదచిత్ర్పమాతలయొక్క వ్యాప్తి రూప ఔన్నత్యమువలన స్పందమగుచుండును. ఒక పర్యాయమే నిష్పందస్పందద్వయ ప్రక్రియ నిష్పందస్వరూపానుభవకాల మందు స్పందద్వయము వ్యావృత్తి రూపముగా అనుభవించ బడుచున్నది. నిష్పంద విశ్రమమందు స్పందము స్ఫురించుట లేదని స్పందద్వయమును, అనుసంధానము చేసి నిష్పంద స్ఫురణ అనుసంధానము చేయవలెను. అందువలన నిష్పందపద మందు వ్యావృత్తి విషయముగా ఉభయ స్పందముల అనుభవము నియతమే. ఈ ప్రకారము జడస్పందానుభవకాల మందు విశ్రాంతి, అజడస్పందము వ్యావృత్తి రూపముగ అనుభవము. అజడస్పందానుభవకాలమందు విశ్రాంతి, జడస్పందానుభవములు ఆ ప్రకారమే. చైత్రాదులయొక్క సంవిత్తు ఏకాకారమైనదే గనుక ఏకత్వమందు చైత్రుడు విశ్రమించెను, మైత్రుడు బహిర్ముఖుడయ్యెను. దేవదత్తు డంతరుఖ్ముడయ్యెనన్నప్పుడు, పదత్రయమునకు ¸°గపద్యమే గనుక విమర్శవృత్తి అద్భుత తరమైనది.

చైత్యం యదోల్లసతి సంఘటితస్వకేచ్ఛం

చిత్స్వం స్వభావమణు మాశ్రయతే నిజేచ్ఛాం |

అంతర్భవేసధ చిదుల్లన నేతు చైత్యం

పంచాంగకం జడపదం చతురంగ మన్యత్‌ ||

టీక :- చైత్యం=విసర్గ, యదా=ఎప్పుడు, సంఘటిత స్వకేచ్ఛం=సంఘటన చేసికొనబడిన, తన ఇచ్ఛకలదై. ఉల్లసతి=ప్రకాశించునో. తదా=అప్పుడు, చిత్‌=చిత్తు, అణుం=సంకుచితమైన, స్వం=స్వకీయమైన, స్వభావం=స్వరూపమగు, నిజేచ్ఛాం=తన యొక్క ఇచ్ఛను, ఆశ్రయతే=ఆశ్రయించును, అధ=అనంతరము, చిదుల్లసనేతు=చిద్వ్యాప్తి యందైన, చైత్యం=చైత్యము, అంతర్భవేత్‌=అంతర్భవమవును, జడపదం=విసర్గపదము, పంచాంగకం=పంచాంగకమైనది, అన్యత్‌=అజడపదుమ, చతురంగం=చతురంగమైనది.

చైత్యము బహిః పృథివీరూపముగా అంతఃప్రకృతి రూపముగా ఎపుడు తన ఇచ్ఛతో కలుసుకొని విలసిల్లునో చవర్గయకారశకార ప్రతిపాద్యమగు, గంధాద్యహం కార స్వరూపిణియగు ఇకారప్రతిపాద్యమైన స్వీయేచ్ఛతో తన రూపాంతరముతో సంబంధమై విలసిల్లునో అపుడు చిత్తు. అణుసంకుచితమైన స్వసంబంధి స్వభావమగు నిజేచ్ఛను ఉకార, వకార, మకార ప్రతిపాద్యపరిమిత ప్రమాతృరూప మును ఆశ్రయించును. తదాకారేణ వుండును. చిదుల్లసన మందైన చైత్యము తన్మయుడగు పరిమిత ప్రమాతయుచిత్తు యందు అంతర్ధానమగును. చైత్యముయొక్క రూపాంతరము ఇచ్ఛ మాత్రమున ఉండును. అందువలన జడపదము పంచాంగకము అజడపదము చతురంగకము.

అంతర్బహిః కరణ జృంభణ యోరదీర్ఘ

దీర్ఘస్వరేషు జడసంసరణం ద్విరూపం

ఏఐ ఇతి ద్వయ మిహోల్లిఖతి క్రమేణ

స్వీయేచ్ఛయా పదయుగే ఘటితం జడస్య || 8

టీక :- అంతర్బహిఃకరణజృఃభణయోః=అంతరింద్రియ బాహ్యేంద్రియ సమున్మేషలయందు, అదీర్ఘదీర్ఘస్వరేషు=హ్రస్వదీర్ఘస్వరములయందు, ద్విరూపం=రెండు రూపములైన, జడసంసరణం=జడసంసారమును, ఏఐ ఇతి = ఏఐను, ద్వయం=రెండు, ఉల్లిఖతి = బోధించుచున్నది, ఇహ=ఇచ్చట, క్రమేణ=క్రమముచేత, పదయుగే=అంతర్బహీరూప పదయుగళమందు, జడస్య=జడప్రమాతయొక్క, స్వీయేచ్ఛ యా=తనదైన ఇచ్ఛతోటి, ఘటితం=కలుసుకొన్నదై, ఉల్లిఖతి=బోధించుచున్నది.

ప్రమేయ, ప్రమాణ, ప్రమాతృరూపమగు కక్ష్యాత్ర యోపలక్షితములైన స్వప్నాదులకు కారణరూపమగుటచే, కక్ష్యాత్రయము కలిగిన సుషుప్తి పదమందు పంచపంచరూప హ్రస్వదీర్ఘ స్వరవర్గద్వయముచేత విభజింపడిన బిందువిసర్గ పదద్వయాత్మికమగు ప్రమేయకక్ష్యకదలు. ఇది సుషుప్తి. సుషుప్తి యందు భేదాభేదమిశ్రప్రమాతృ సంసారవాసనను కారణాత్మికముగా చెప్పి ఇపుడు సంధ్యక్షరచతుష్కరూప మగు సుషుప్తి ప్రమాణపదమందు గ్రాహకపదమగుట వలన భేదాదిప్రమాతృసంసార విలాసమును చూపించుచున్నారు. అంతరింద్రియ సమున్మేషము కలగుచుండగా జడసంసారము స్వప్న జాగ్రద్రూపముచే రెండు విధములు. ఏ.ఐ. అను వర్ణ ద్వయము ఐదైదుగా విభజించబడగా ఆ దీర్ఘదీర్ఘస్వరముల యందు ఏకారము హ్రస్వము, స్వరములయందలి స్వప్నరూప మైన అంతస్సంసారము. ఐకారము దీర్ఘ స్వరములయందు జాగ్రద్రూపమైన బహిస్సంసారము. క్రమముగా ఈ పదయుగ మందు ఏకమాత్ర, ద్విమాత్రాకారస్వరూపమై జడప్రమాతతో ఘటనమగుచు బోధించుచున్నవి. ఏకార, అకార ఇకార, ఘటనరూపమైనది. ఆ ఏకారమందే అకార ఇకార ద్వితీయమాత్రాయోగముచేత నిష్పన్నమైన ఆకార ఈకార ఘటనరూపము ఐకారము. ఇచ్చట స్పర్శవ్యాపక బోధ్యము లైన జాగ్రత్స్వప్న రూపసంసారపదముల రెంటియందు మొదట ప్రమేయకక్ష్య, మధ్యప్రమాణకక్ష్య, చివర ప్రమాతృకక్ష్య, చూపబడుచున్నవి. కారణరూపము సుషుప్తి. మొదట హ్రస్వదీర్ఘస్వరములు పది కలిసి ప్రమేయ కక్ష్య. సంధ్య క్షర చతుష్ఠయము ప్రమాణకక్ష్య. బిందువిసర్గలు ప్రమాతృ కక్ష్య. ఇట్లుండ ప్రమేయకక్ష్య జడవిశ్రాంతిపదము. ప్రమాతృ కక్ష్య అజడవిశ్రాంతిపదము ప్రమాణకక్ష్య జడాజడసంసార పదము. విశ్రాంతిరూపమైన ప్రమేయపదమందు సంస్థాన వాసన ఇచ్ఛాద్వయం భవతీత్యాదినా సూత్రచతుష్టయము చేత నిరూపించబడినది. ఈ సూత్రముచేత సంధ్యక్షరరూప మైన ప్రమాణపదమందు ఏ.ఐ. అను వర్ణద్వయముచేత జడ ప్రమాతయొక్క అంతర్బాహ్యసంసారములు ప్రతిపాదించబడెను. ప్రమాణము గనుక సంధ్యక్షరములకు ద్విద్వివర్ణ రూపత. సుషుప్తి యందు విశ్రాంతి పదము గనుక ఇచ్ఛా మాత్రమే సంసారముయొక్క ఉపపత్తి. విసర్గఐన అకారము యొక్క ఇచ్ఛఅగు ఇకారమందు ఋకార, లుకార, ఉకార రూపసంసారము విలీనమై యుండును. అందుచే అటువంటి ఇచ్ఛతో కలుసుకొనుటయే విసర్గకు చిత్పదగ్రాహకత్వమని ఏకారమునకు గ్రాహ్యగ్రాహక ఉభయాత్మకత ఇట్లు ఐకారాదుల యందు యోచించవలెను. స్వప్నప్రమాతృయే బహిర్ముఖుడైన జాగ్రత్ర్పమాత గనుక ఏకారమునకే అకార ఇకార ద్వితీయ మాత్రాయోగముతోటి సంధివశమువలన ఐకారత్వము కేవల ఆకార ఈకార యోగనిష్పన్నమైనది కాదు, ఆకార. ఈకార సంధివలన, ఏకారత్వమే వచ్చును. కానిఐకారత్వమురాదు. ఇందువలన స్వప్నమునకు అంతస్సీమ గనుక బిందుపదత్వము. జాగ్రత్‌కు బాహ్యసీమ గనుక విసర్గ పదత్వము సూచించబడినది.

అంతర్బహిః కరణవృత్తి వశాదదీర్ఘ

దీర్ఘస్వరేషు జడసంసరణం ద్విరూపం |

ఓ ఔ ఇతిద్వయ మిహోల్లిఖతిక్రమేణ

స్వీయేచ్ఛయా ద్విరజడస్య పదస్య యోగం || 9

టీక :- అంతర్బహిః=కరణవృత్తి, వశాత్‌=అంత రింద్రియ బాహ్యేంద్రియవృత్తివశము వలన, అదీర్ఘదీర్ఘ స్వరేషు=హ్రస్వదీర్ఘ స్వరములయందు, అజడసంసరణం=అజడసంసారము, ద్విరూపం=రెండు రూపములైనది, ఇతి=ఈవిధమున, ఓ ఔ = ఓ ఔ అను, ద్వయం=రెండును, క్రమేణ క్రమముగా, అజడస్యపదస్య=అజడప్రమాతయొక్క, స్వీయేచ్ఛయా=తనదైన, ఇచ్ఛతోద్విః=రెండు పర్యాయములు, యోగం=సంఘటనను, ఉల్లిఖతి=సూచించుచున్నది.

అంతర్బహిష్కరణ వృత్తి వశమువలన అజడప్రమాతృ సంసారముపూర్వమువలెనే ద్విరూపమని అదీర్ఘ దీర్ఘ స్వరముల యందు అజడప్రమాతయగు బిందువుయొక్క స్వీయేచ్ఛతో అంతర్బాహ్యకక్ష్యలయందు రెండు పర్యాయములు సంఘట నను ఓఔ అను అక్షరములు రెండును సూచించుచున్నవి. ఆకారాత్మకబిందువునకు హ్రస్వస్వరముల యందుస్వీయేచ్ఛ ఐన ఉకారముతో అంతఃపదమందు యోగమును, ఆఓ కార మునకే బాహ్యపదమందు దీర్ఘస్వరములయందు ద్వితీయ మాత్రాయుక్త అకారము ఊకారరూప ఇచ్ఛతో యోగ మును తద్యోగ నిష్పన్న స్వరూపులయిన ఓఔలు సూచించు చున్నవి. గ్రాహ్య గ్రాహకోభయరూపత్వము పూర్వమువలె.

భేదే7పి బిందే రవిభేదపదే విసర్గో

జ్ఞానక్రియా స్థలతయాంతర బాహ్యసీమ్నోః |

దృష్టా విహ ప్రకరణస్య బలా త్స్వభావం

నైవాప్నుతః స్ఫుట మభేద విభేద రూపమ్‌ || 10

టీక :- భేదేపి=భేద సంసారమందు, బిందుః=బిందువు కూడ, అవిభేదపదే=అభేదసంసారమందు, విసర్గః=విసర్గయును ఉభౌ=యిద్దరు, అంతరబాహ్యసీమ్నోః=భేదస్వప్న, అభేద జాగ్రద్రూపమైన, అంతరబాహ్యసీమలయందు, జ్ఞానక్రియా స్థలతయా=జ్ఞానక్రియాస్థలములగుటచేత, దృష్టా=ఓకార, ఔకారరూపముగా చూపబడిరి. ఇహ=ఇక్కడ, ఏతౌ=ఈ బిందువిసర్గలు, ప్రకరణస్య=ప్రకరణము యొక్క, బలాత్‌=ప్రాబల్యమువలన, అభేదవిభేదరూపం=అభేద విభేదరూపమైన, స్వభావం=స్వభావమును, స్ఫటం=స్పష్టముగా, నైవాప్నుతః=పొందకపోయిరి.

బిందువు అభేదరూపము. విసర్గ భేదరూపము భేద ప్రమాతకు అంతఃపదస్వప్నమందు బిందుత్వమెట్లు? అభేద ప్రమాతకు బాహ్యపదమైన తుర్యజాగ్రతయందు విసర్గత్వ మెట్లు వచ్చును? భేదసంసారమందు హ్రస్వస్వరవర్గాధిష్ఠాత ఐన బిందువు అభేదసంసారమందు దీర్ఘస్వరవర్గాధిష్ఠాత ఐన విసర్గ భేదస్వప్న. అభేదజాగ్రద్రూపములైన అంతర బాహ్య సీమలయందు జ్ఞానక్రియాస్థలములను బట్టి ఏకార ఔకారరూపముగా గుర్తించబడిన బిందువిసర్గలు భేదాబేద ప్రకరణబలమువలన అభేదవిభేదస్వరూపమైన స్వభావమును, బిందువుకు అభేదరూపముగా నున్న స్వభావమును, విసర్గకు భేదరూప స్వభావమును, స్ఫుటముగా పొందకపోయిరి. ఇందుచే కించిత్స్వభావమును పొందిరని తెలియనగును. భేద స్వప్నపదమందు నివిష్ఠుడైన బిందువు భేదప్రకరణబలమువలన అభేదరూపమైన స్వభావమును స్ఫుటముగా పొందలేదు. కొద్దిగనే పొందినవాడు. శుద్ధభేద పదమగు జాగ్రత్‌ కన్న స్వప్నమందు అభేదస్పర్శవశమువలన విశేషమున్నది. ఇట్లే తుర్యజాగ్రన్నివిష్ఠుడైన విసర్గ అభేదప్రకరణ బలము వలన భేద రూపమగు స్వభావమును స్ఫుటముగా పొందలేదు. కొద్దిగనే పొందెను. శుద్ధఅభేదపదమైనతురీయ స్వప్నము కన్న తురియ జాగ్రతకు భేదస్పశన్‌ వశము వలన విశేషమున్నదని తలచవలెను.

బిందుః కళా అపి విసర్గకళా గుణాస్స్యుః

సర్గః కళా అపి చ బిందు కళాంగ భూతాః |

బింద్వగ్ని రష్ట కళ ఏవ విసర్గపాయీ

సర్గస్తు షోడశకళో ధృతబిందు రిందుః || 11

టీక :- బిందుః=బిందువు, కళాఅపి=కళలుకూడ, విసర్గకళాగుణాః=విసర్గకు విసర్గకళలకు అంగములు, స్యుః=అగుచున్నవి. విసర్గః=విసర్గయు, కళాఅపి=విసర్గకళలు కూడ, బిందుకళాంగభూతాః=బిందువునకు, బిందుకళలకు అంగభూతములు, స్యుః=అగుచున్నవి. విసర్గపాయీ=విసర్గను కబళించిన, బింద్వగ్నిః=బింద్వగ్ని, అష్టకళ ఏవ=ఎనిమిది కళలుకలవాడు, ధృతబిందుః=ధరించవబడిన బిందువు కలిగిన, సర్గః=విసర్గరూపుడైన, ఇందుః=చంద్రుడు, షోడశ కళః=షోడశకళలు గలవాడు.

ఈ సుషుప్తి పద మందు బిందువిసర్గలకు, తత్కళల అన్యోన్యశ్లిష్టతచే అంగాంగీభావము సమానము. బిందు విసర్గ లకు బింబస్వరూపమును ఉత్పాదింతుము. బిందు రితిబిందుకళలు విసర్గకళలకు గుణములగును. అంగములగునని తాత్పర్యము. విసర్గవాప్త్యభిమానములోనని భావము. పిమ్మట విసర్గకళలు బిందువునకు, బిందుకళలకు గుణము లగును. ఇది బిందు వ్యాప్త్యభిమానమందు కలదు. బిందుకళ లెన్ని? విసర్గకళ లెన్ని? అగ్నిరూపబిందువు అష్టకళలు గలవాడు. హ్రస్వ స్వరములు ఐదు. ఏకార ఓకారములురెండు. అం అనే స్వరూపకళ ఒకటి, కలిసి బిందువునకు ఎనిమిది కళలు. బిందువునకు అంగభూతములైన విసర్గకళలు కూడ ఎనిమిది ఉన్నవి. విసర్గను బిందువు కబళించుచున్నాడు కనుకబింద్వగ్ని యందు కళలతో కూడ విసర్గ ఏకారమును పొందుటచే బిందువు నకు అష్టకళ##లే అని తాత్పర్యము. తన వ్యాప్తియందు బిందువును ధరించి ఉండును గనుక చంద్రరూపవిసర్గ షోడశ కళలు గలది. బిందువునకు ఉచ్ఛేదమే చెప్పిన విసర్గ స్వరూపమునకే సిద్ధి లేకపోవును. అందుచే ధృతబిందువనిరి. అంగభూతమైన బిందుకళలతో కూడ దీర్ఘస్వరములు ఐదు. ఐకార ఔకారములు, అఃకారరూపవిసర్గకళలు పదహారని యోచించవలెను.

బిందోః కళా అపి విసర్గకళా శ్చ సప్త

సపై#్త తదన్వయ వశేన చతుర్దశారం |

బింద్వగ్ని రష్టదళ పద్మ గత స్తదంతః

సర్గశ్చ షోడశదళాబ్జ గతో7స్యచాంతః || 12

టీక:- బిందోః=బిందువుయొక్క, కళాఅపి=కళలు కూడ, సప్త=ఏడు, విసర్గకళాశ్చ = విసర్గకళలు, సప్త=ఏడు, ఏతదన్వయవశేన=సప్తకద్వయము యొక్క కలిసి కొనుట చేత, చతుర్దశారం=చతుర్దశారము, తదంతః=ఆ చతుర్దశకోణము యొక్క లోపల, బింద్వగ్నిః=బిందు రూపాగ్ని, అష్టదళపద్మగతః=అష్టదళపద్మమును పొందినవాడు, అస్య=ఈ అష్టదళపద్మము యొక్క, అంతః=లోపల, సర్గశ్చ=విసర్గయు, షోడశదళాబ్జగతః =షోడశదళపద్మమును పొందినవాడు.

ఇపుడు బిందువిసర్గలకు తత్కళలకు అన్యోన్యశ్లేషను మహాయంత్రముయొక్క సుషుప్తి పదమైన చతుర్దశారచక్ర మందు చూపింతుము. బిందువుయొక్క కళలు ఏడు. విసర్గ కళలు యేడు. ఉభయత్ర అవయవకళలు గాకనే ఈ సప్తక ద్వయముయొక్క అన్వయవశముచేత కలసికొనుటచేత చతుర్ద శారము ఏర్పడినది. ఆ చతుర్దశారకోణముయొక్క అంతర మందు ప్రాగుపదిష్ట విభావనా మర్యాదచే బింద్వగ్ని అష్టదళ పద్మగతుడు. ఈ అష్టదళపద్మరూపబింబమైన బిందువుయొక్క అంతరమందు విసర్గషోడశదళపద్మమును పొంది ఉండును. ఇచట ప్రాక్ప్రతిపాదిత ప్రక్రియయే అనుసంథానము.

హ్రస్వ స్వరాష్టదల భాగ నలోహిదీర్ఘ

మాత్రాత్మ షోడశ దళాంబుజ భాశ్ఛ శాంకః |

చంద్రార్కయో స్త్రిగుణితాష్టకళాత్మనో స్స్యా

ద్బిందౌ ప్లుతాష్టక దళాత్మ నియుక్తి రగ్నౌ || 13

టీక :- అనలః=బిందువు, హ్రస్వస్వరాష్టదళాభాక్‌=హ్రస్వస్వరాష్టదళ పద్మగతుడు, శంశాకః=చంద్రుడు, దీర్ఘమాత్రాత్మదళాంబుజభాక్‌=దీర్ఘ స్వరమాత్రాత్మ దీర్ఘ స్వరములచేత షోడశమాత్రాత్మక షోడశదశ పద్మగతుడు. త్రిగుణితాష్టకళాత్మనో=త్రిగుణితమైన అష్టకళాత్మకుడగు, చంద్రార్కయోః=చంద్రసూర్యలకు, ప్లుతాష్టకదళాత్మని=ప్లుతాష్టకమే అష్టదళస్వరూపముగా గల, బిందౌ=బిందు స్వరూపుడగు, అగ్నౌ=అగ్నియందు, యుక్తిః=సంయోగము స్యాత్‌=అగును.

ప్రకారాంతముగా బిందుకళాతిరిక్తముగనే విసర్గకు షోడశకళలు చూపింతుము. బిందు విసర్గ తత్సామరస్యరూపమైన పదత్రయమును, స్వరవర్గమును చూపెదము. అనలః బిందువు. హ్రస్వస్వరాష్టదళ పద్మ బింబ గతుడు. శశాంకః విసర్గ దీర్ఘ మాత్రాత్మక షోడశదళాంబుజభాక్‌ ఎనిమిది దీర్ఘస్వరములయందున్న ఏ పదహారు మాత్రలు కలవో తదాత్మకమగు షోడశదళాంబుజ బింబసంశ్రితుడు. ఈ ప్రకారము షోడశమాత్రాసంపన్నములైన దీర్ఘస్వర వర్ణముల యందు విచారించగా ఎనిమిది మాత్రలు బిందురూపములే. బిందుసాహిత్యముగనే విసర్గసంస్థాన నియమముకలదు. ఐనను బిందువునకు హ్రస్వ స్వరరూపముయొక్క వివిక్త విషయము గలదు. షోడశమాత్రాత్మకమైన దీర్ఘస్వరాష్టకము విసర్గకు వివిక్త విషయమని అభిప్రాయము. ఈ ప్రకారమున విసర్గ బిందువులకు అభేదపదాధిష్ఠాత ఐన బిందువునకు అర్కత్వ మును సూచించబడుచున్నది. అభేదఖండమునకే అధిష్ఠాన ఐన అగ్నివలె అభేదచమత్కార సంపత్తి లేదు గనుక పాప శేష జగత్స్వాత్నీకరణుడు సూర్యుడు. నిరవశేష జగత్స్యాత్మీ కరుణుడు అనలుడు. అందువలన బిందువ్యవాహారము ఉభయులకు అనిభావము. అందువలన త్రిగుణితమైన అష్టకళాత్మకు లగు విసర్గబిందురూప చంద్రార్కులకు బిందువునకు అష్టకళలు విసర్గకు దీర్ఘస్వరమాత్రారూప షోడశకళలు కలసి ఇరువై నాల్గు కళలగు చున్నది. ఆ ఇరువై నాల్గు మాత్రలచేత యెనిమిది ప్లుతములు యేర్పడుచున్నవి. ప్లుతమనగా మూడు మాత్రలు. అటువంటి ప్లుతాష్టకదళాత్మకుడైన మహాబిందువగు అగ్ని యందు ఆచంద్రాక్కుల కలియక గలదు. మహాబిందువు భేదాభేదోభయపక్షవ్యాపి గనుక మహాబిందువు అనలుడే సూర్యుడు కాడు. తదాత్మకమగు సామరస్యపదమునకే ప్రవృత్తి, నివృత్తి, స్పందభిత్తిభూతమగు నిష్పందతత్వమునకు శాశ్వతత్వమని ఉపదేశించబడినది.

(అవిభేద విభేద మిశ్రణౖ స్త్రిభిరంగైర్ఘటి తైక

మూర్తికా హృదయేషు విభాతి శాంకరీ స్వరవర్గా

ర్ధమయీ మహాత్మనామ్‌ నిత్యాషోడశికాత్మికా

స్వరకళా నిత్యత్రికోణాకృతి ర్దివ్యైర్ద్రవ్యరసై

రదభ్ర లహరీ సాక్షాత్కృత వ్యోమభిః యస్స

మ్య క్పరిపశ్యతి స్ఫురణ యాతస్యాంబికాను గ్రహాత్‌

గూఢోప్యేష స్ఫు రేత్స్వరగణస్యార్ధః కృతార్థత్వభూః)

విమర్శానందనాథేన విరజానంద పుత్రేణ ద్వితీయం

మాతృకాచక్ర వివేకే వ్యాకృతం పదమ్‌

ఇతి మాతృకాచక్ర వివేకమున సుప్తివివేకమను

ద్వితీయ స్కంధము

***

Sri Matrukachakra viveka    Chapters