Sri Matrukachakra viveka    Chapters   

అథ తురీయ వివేకః పంచమః

అక్షేషు వేద్యవిలయః ఖలు శుద్ధవిద్యా

దేహే తదక్షవిలయో భవతీశ్వరత్వం |

ఈశో హి విశ్వమయ దేహకృతాభిమానో

జాగ్రచ్ఛివస్య పశు జాగర చక్రలగ్నమ్‌ || 1

నివృత్తి రూపమైన తుర్యస్కంధమును ప్రారంభించు చున్నారు. నివృత్తికి జాగ్రదుపక్రమము గనుక నివృత్తి జాగ్రతకు అథిష్ఠాతయైన శివుని యొక్క సర్వకర్తృత్వ భూమి కాభూతమైన ఈశ్వరాఖ్య ప్రమాతను చెప్పుచున్నారు. తద్బాహ్యదశయందు శుద్ధవిద్యాప్రమాతతో కూడ చూపించుచున్నారు. పాయ్వాది, ఘ్రాణాది ఇంద్రియములయందు, పృథివ్యాది, గంధాదివేద్యములయొక్క ఏకీకరణము, శుద్ధ విద్యఅనబడును. శుద్ధవిద్యాశ్రయుడైన ప్రమాతనే శుద్ధ విద్యయందురు. పశుత్వమందు ఇంద్రియ ప్రకాశకంటె ఇంద్రియ వెలుపలగా, ఇంద్రియాదులకంటె వేరుగా భాసించుచున్న వేద్యములకు ఇంద్రియప్రకాశగర్భమందే అవభాసనము. ఇంద్రియప్రకాశ విలాసరూపముగా అధ్యవసాయముకలుగును. ఇంద్రియమై కాత్మ్యానుభవరూపమగు శుద్ధవిద్యాపాశవ్యామోహమును హరించు గుర్వనుగ్రహమూలముగా వికసించును. ఈ శుద్ధవిద్య పశుత్వదశయందు ఇదం. ప్రత్యయైక విషయములైన వేద్యములయందు, పాశవ్యావృత్తి కాగా, స్వాత్మేంద్రియ ప్రకాశతో తాదాత్మ్యమును పొందును. అహంప్రత్యయ విషయత్వమును అర్చించును. పాశనివృత్తి ప్రథమ పదమందు మాయోత్తీర్ణుడు కాగానే, ఆ ప్రమాతయందు ద్యోతమానమగు అనుభవమునకు శుద్ధవిద్యయని చెప్పుదురు. ఈ ప్రకారము ప్రమాణపదమందు ప్రమేయనిమజ్జనరూప శుద్ధవిద్యా ప్రమాతృపదమును ఉత్పాదించిదానికిపైన ఈశ్వర దశను చెప్పుచున్నారు. దేహప్రమాతయందు శుద్ధవిద్యా దశలో అభ్యాసముచే ప్రమేయములను స్వాత్మీకరించుచున్న ఇంద్రియముల విలయము, ఏకరసీకరణము ఈశ్వరతత్త్వమగు చున్నది. శుద్ధవిద్యాదశయందు ప్రమాణపదము నిమజ్జనము నొందినది ప్రమేయములు. ఇది ప్రమాణపదముతో కూడ దేహాత్మరూప ప్రమాతృపదమున దేహాంశలో నిమజ్జనము నొదుట ఈశ్వరత్వమనియర్థము. ఈపదమందు ప్రమేయాత్మక మగు విశ్వముయొక్క కించిదిదం ప్రత్యయముచేత అధివాసితమైనది అహంప్రత్యయ విషయత్వము. దేహపదమందు నిమజ్జితమైన విశ్వమునందు దేహమునందువలెనే దృఢమైన అహంప్రత్యయ విషయ మగును. ఈశ్వరునకు విశ్వమే దేహముగా పనిచేయును. అందువలననే ఈశ్వరునకు సర్వ కర్తృత్వము అని తెలియవలెను. శుద్ధ విద్యాపదమందైతే, ఇదం ప్రత్యయ, అహం ప్రత్యయములలో, ఇదంప్రత్యయమే హెచ్చుగా నున్నందున, విశ్వచేష్టకత ఉదయింపలేదు. ఈ సందర్భముచే విశ్వశరీరుడైన ఈశ్వరుడు శివజాగ్రత్పదము గాన పశుజాగ్రత్పదమందే సంశ్లేష యని ప్రతిపాదించుచున్నారు. విశ్వమయమైన దేహమందు చేయబడిన అభిమానముగల ఈశ్వరుడు, శివునియొక్క జాగ్రత్‌ పరిచ్ఛిన్న దేహాభిమానియగు పశువుయొక్క దశారద్వయాత్మకము జాగ్రచ్చక్రమందు శ్లిష్టమైనది. పశుజాగ్రత్పదమందు శివ జాగ్రత్‌యొక్క శ్లేష ఉచితమైనందువలన అని యర్ధము. జడాజడపదము లైన సుప్త్యాదిదశాత్రయమందు అన్యోన్య శ్లేషస్వభావమని ఇదివరకు ప్రతిపాదించితిమి.

యద్బాహ్య బాహ్యపదమజ్జన మంతరంత

స్తచిత్పదే జడపదే విపరీత మేతత్‌ |

అక్షాత్మవేద్య మిహ శ స్సహి శుద్ధవిద్యా

దేహావిభిన్న కరణంద్రియ మీశ్వరష్షః || 2

నివృత్తి రూపుడైనను ప్రమేయములయందు అభ్యసింపబడిన అహంభావము గల శుద్ధవిద్యాప్రమాతకు భేదము శాంతించలేదని, అభేదజాగ్రత్పదవికి ఆధిష్టాతృత్వము అందలేదు. చిద్వ్యాప్తిపదమందు నిమజ్జనరూపమైన స్వభావమును వర్ణించుచు, శవర్గయందు శుద్ధవిద్యాది అభేదప్రమాతల యొక్క విషయభాగమును చూపించుచున్నారు.

లోలోపల స్థానములయందు బహిర్బహిష్పదముల యొక్క నిమజ్జనముకలదో, అనగా ప్రమేయములు, ప్రమాణ పదమందు మజ్జనము, ప్రమాణములు, ప్రమాతృపదమందు మజ్జనము అని యర్థము. చిద్వ్యాప్తి పదమందు అగును. చైత్యవ్యాప్తి పదమందు ఈ నిమజ్జనము వైపరీత్యముగా నుండును. అంతరంతఃపదము బహిర్బహిః పదమందు నిమజ్జనము విపరీతము. ప్రమాతృపదమునకు ప్రమాణపదమందు మజ్జనము. ప్రమాణమునకు ప్రమేయపదమందు నిమజ్జనము. శుద్ధవిద్యేశ్వర సదాశివశక్తి అను పేరుగల ప్రమాతృచతుష్టయమునకు సాధారణపదమైన శవర్గ యందు ఇంద్రియ ప్రకాశతో ఐక్యమును పొందిన ప్రమేయస్థానీయము శవర్గము. విచారింపగా, చవర్గ, యకార సంకోచత్యాగాత్మక మగుశకారమును శబ్దాదిమాత్ర వేద్యస్థానీయత్వముయుక్తమే. సర్వప్రమేయము ఉపలక్షణమే. చిత్పదమైన హకారమందు కవర్గ లకారములయొక్క మజ్జనమువలన, బహిరవభాసమాన మగు చవర్గ, యకారముల రూపాంతరమగు శకారము సర్వ ప్రమేయోపలక్షణ మనియే తెలియవలెను. ఆ శకారము శుద్ధవిద్యాప్రమాత. ప్రమాతృ ప్రమాణప్రమేయరూప పదత్రయముచేత నిష్పాద్యమగు స్వరూపముగల ప్రమాతకు ఎట్లు ప్రమేయమాత్ర ప్రతిపాదక శకారమునందు స్వరూపోప పత్తి అనిన చెప్పుచున్నారు. వర్ణచతుష్టయాత్మకమైన శవర్గ అంతయు శుద్ధవిద్యాది ప్రమాతృచతుష్టయమునకు ప్రత్యేకముగా స్వరూపమగును. అయినప్పటికిని శుద్ధవిద్యాది నాలుగు ప్రమాతలకు శకారాది నాల్గువర్ణములు. ఒక్కొక్క ప్రమాతకు ఒక్కొక్క స్వరూపసిద్ధికి హేతుభూతమైన విశేషమును ప్రతిపాదించునని తెలుపుటకు నాల్గుగా చూపించిరి అదియుక్తమే గదా. శుద్ధవిద్యాప్రమాతయందు వేద్యములు ఇంద్రియములతో ఐక్యమును పొందినవని విశేషము. అందు వలన ఆశుద్ధవిద్యాప్రమాతకు ఇంద్రియైకాత్మ్యమును పొందిన వేద్యములను ప్రతిపాదించు శకారరూపత్వము. దేహముతో అభిన్నమగు స్వాత్మీకృత కార్యవేద్య కర్మేంద్రియత్వము షకారము. ఈశ్వరుడు ఈశ్వరప్రమాతకు దేహాభిన్న కార్యవేద్యైకాత్మ్యక కర్మేంద్రియత్వము స్వరూపసిద్ధికి హేతువగు విశేషము.

జ్ఞానేంద్రియ సహి సదాశివ ఆత్మనైక్యే

స్వాత్మా ఖవిశ్రమమయో హ ఇతీహశక్తిః |

ఏతత్తురీయపద మంగ చతుష్టయాఢ్యం

బాహ్యాంతరాళ పదయో శ్శ్రితరూపసామ్యమ్‌ || 3

సదాశివ, శక్తి ప్రమాతృ స్వరూపవర్ణద్వయమును చెప్పుచున్నారు. సదాశివప్రమాతకు ఆత్మతో అవిభిన్నమగు స్వాత్మీకరించుకొన్న జ్ఞేయవేద్యజ్ఞానేంద్రియత్వము స్వరూపసిద్ధికి హేతువగు విశేషము. అందువలన ఆసదాశివునకు అటువంటి జ్ఞానేంద్రియప్రతిపాదక సకారరూపత్వము. ఆత్మతో తాదాత్మ్యము కలుగుచుండగా జ్ఞానేంద్రియము సకారముగదా. సదాశివుడని యర్థము. అపరిచ్ఛిన్న చిదచిత్సామరస్యరూప ఆకాశ విశ్రాంతిమయమైన దేహాత్మో భయలక్షణస్వరూపము హకారమగు వర్ణము. ఈ శవర్గ యందు శక్తి అనుప్రమాత అపరిచ్ఛిన్న విశ్రాంతిమయమగు దేహాత్మ సామరస్యలక్షణ స్వరూపత్వమున శక్తి స్వరూపసిద్ధికి హేతువగు విశేషము. ఆ శక్తి ప్రమాతకు, అట్టి స్వరూపప్రతి పాదకమైన హకారరూపత్వము. ఈప్రకారముగా శుద్ధవిద్యా దులకు హేతు విశేష ప్రతిపాదకవర్ణముల ఆశ్రయణముచేత కలుగును. విషయ విభాగమును ఉపపాదించి, ఈ శవర్గ రూపమైన పదమునకు బాహ్యమందు స్పర్శసంకోచత్యాగరూపమునకు, ఉభయత్ర రూపసామ్యము ప్రాగుపదిష్టమైనను, స్ఫుట ప్రత్యయముకొరకు ఉపపాదించుచున్నారు.

మహాభూతచతుష్టయము గర్భమందు గల మహాపృథ్విని, ప్రకృతి చిత్పదమైన హకారమందు నిమజ్జనమైనందున, ఉభయత్ర అంగచతుష్టయముచేత ఒప్పుచున్న అభేదజాగ్రత్స్వపరూపమైన తురీయపదము స్పర్శాంతస్థ ప్రతిపాద్య జాగ్రత్స్వప్నపదములయొక్క రూపసామ్యమును ఆశ్రయించినది. చవర్గయొక్క, యకారముయొక్కసంకోచత్యాగమందు శకారము టవర్గయొక్క రేఫయొక్క సంకోచత్యాగమందు షకారము ఈప్రకారము మిగిలిన వాటిని ఊహించవలెను.

ఏతత్పద పద మఖండితమేవ శుద్ధ

విద్యాదికస్య ఖలు తత్త్వచతుష్టియస్య |

దేద్యాద్వుదంచిత చితీస్ఫురణక్రమేణ

తత్తద్దశావతరణం విభుధైర్విభావ్యమ్‌ || 4

శవర్గ శుద్ధవిద్యాదులకు సాధారణమైన పదమని చెప్పితిమి. ఈ శవర్గరూపమైన పదము అవిభక్తమైనదే. శుద్ధ విద్య మొదలుగాగల తత్త్వచతుష్టయముయొక్క పదముగదా. ప్రమాణప్రమేయములు అంగముగా గల ప్రమాతను ఏకవర్గ ముమాత్రముచేత ప్రతిపాదించుట అసాధ్యము, ఐనను శుద్ధ విద్యాదులకు ఏకై వర్ణ వ్యవహారోపచారమందు ఇదివరకు చెప్పిన ఉపపత్తినే సూత్రీకరించుచున్నారు. చైత్యవాప్త్యవసాన మందు ఎపుడు చిదున్మేషము ప్రారంభమో, ఈ ప్రారంభమందు ముందుగా వేద్యాదులయందే కలుగుచుండుటకు అనుభవమే ప్రమాణము. పాశవాసానమందు సాధకుడు గుర్వనుగ్రహముచేత వికసించిన వివేకదృష్టికలవాడై వేద్యమునే స్వాత్మేంద్రియ ప్రకాశయందు విలయము చేయుచున్నాడు. ఈ ప్రకారము ప్రమేయమును ప్రమాణమందు నిమజ్జనాభ్యాసముచేయుట వలన ఆరూఢమైన శుద్ధవిద్యా స్వభావము కలవాడు అగును. తదనంతరము స్వాత్మీకరించిన ప్రమేయముగల ప్రమాణమును ప్రమాతృపదమందువిలయము చేయుటకు ఉద్యుక్తడై ముందు శరీరరూపమైన ప్రమాతృ భాగమందు స్వాత్మీకరించిన కార్యప్రమేయముగల కర్మేంద్రియ వర్గరూపమై ప్రమాణమును నిమజ్జనము చేయుచున్నాడు. అందువలన విశ్వశరీరుడైన విశ్వచేష్ట కలవాడగు టచే సర్వకర్తృత్వ శక్తి గలవాడై ఈశ్వరత్వ కక్ష్యను ఆరూఢించును. తదనంతరము స్వాత్మీకరించిన జ్ఞేయప్రమేయముగల జ్ఞానేంద్రియ ప్రమాణమును ఆత్మరూపప్రమాతయందు నిమజ్జనముచేయును. అందువలన విశ్వాత్మకుడై ఆవిర్భూతమైన సర్వజ్జశక్తి కలిగి, ఆరూఢ సదాశివకక్ష్య గలవాడై జ్ఞానశక్తి తగ్గియుండగా, క్రియాశక్తిని, క్రియాశక్తి తగ్గియుండగా, జ్ఞానిశక్తిని అనుసంధానముచేయును. తదనంతరము జ్ఞానక్రియాసామరస్య భూమికయగు అపరిచ్ఛిన్న విశ్రాంతిమయమైన ఇచ్ఛాశక్తి కక్ష్యను ఆరోహించు ప్రక్రియచేత వేద్యాదులయందు ఒప్పుచున్న చితిస్ఫురణక్రమము రాగలదు. ఉక్తమర్యాదచే శుద్ధ విద్యాది తత్తద్దశావతరణము విద్వాంసులచే ఊహింపదగినది. వేద్యములు ప్రారంభించి చిన్మయములగుచుండగా శుద్ధవిద్యాదులలో ఏ ఏ భాగము నధిష్టించిన స్వరూప లాభమో, ఆయా భాగమును ప్రతిపాదించు వర్గమునకు ఆయా ప్రమాతృపదత్వము ఔపచారిక మని భావము.

సాదాశివస్య ఖలు బిందుమయ స్తవర్గ

స్తత్రేశ్వరాంగమయ మంతరధామ యోగ్యః |

జ్ఞానక్రియే నను శివస్య సదాశివేశా

వంతర్బహి శ్చ నియతాంగిపదౌ క్రమేణ || 5

బాహ్యేంద్రియ ప్రతిపాదక తవర్గసంకోచత్యాగరూపమైన సకారరూప సదాశివ కళయున్నను, ఈశ్వరునకు అంగమే. అంతఃపదమందు రేఫసంకోచత్యాగరూపమైన షకారరూప ఈశ్వరకళ సదాశివునకు అంగమని ఉపపాదించుచున్నారు. చిన్మయమైన, అనగా సంకోచత్యాగమైన తవర్గ సకారముగదా. ఈ సకారము సదాశివస్వభావము. స్వప్న రక్షణజ్ఞాన కక్ష్యసముచితుడైన ఈ సకారరూప సదాశివుడు క్రియా ప్రధానమైన బాహ్యపదమందు ఈశ్వరునకు అంగమే. క్రియాపదమందు జ్ఞానాంశ తగ్గియుండును. ఇందుకు ఉపపత్తిని చెప్పుచున్నారు. సదాశివ ఈశ్వరులు శివునకు జ్ఞానక్రియా శక్తులుగదా. శివునకు జ్ఞానశక్తి విలాసరూపము సదాశివుడు. క్రియాశక్తి విలాసరూపము ఈశ్వరుడు. ప్రస్తుతము అందేమి ఉపపత్తి కుదిరి నదనగా, ఈ సదాశివేశ్వరులు క్రమముగా లోపల వెలుపల నియతమైన అంగిపదముగలవారు. సదాశివునకు అంతఃకక్ష్యయందు నియతాంగి పదత్వము. ఆయన జ్ఞానస్వభావము కలవాడగుటకు అంతఃపదమందు జ్ఞానమునకు ప్రాధాన్యము కారణము. బహిఃకక్ష్యయందైతే అంగపదమే. ఈశ్వరుడు క్రియాస్వభావము కలవాడు గనుక, బాహ్యమందు క్రియకే ప్రాధాన్యము. అంతఃకక్ష్యయందైతే ఈశ్వరునకు అంగపదమే. అందువలన రేఫసంకోచత్యాగరూపమైన షకారరూప ఈశ్వరకళలకు అంతఃకక్ష్యయందు అంగత్వమే అని వివేకము.

ఇచ్ఛా పపంచ కవ బిందుమయీ హశక్తిః

జ్ఞానక్రియాసమపదం ఖలు సోభయాత్మా |

బిందౌసమున్మిషతి సర్గపదే క్రమేణ

సంసృష్టి రాపరిసమాప్తి తయో ర్విభాహ్య || 6

సదాశివకళను అంతఃప్రాధాన్యము. ఈశ్వరకళకు బహిఃప్రాధాన్యమని చెప్పబడినది. ఇచ్ఛాత్మికమగు శక్తి కళకు సామ్యమువలన తదుభయమూలమగుటచే బాహ్యమందు, ఆంతరమందు కూడ ప్రాధాన్యమని ప్రతిపాదించుచున్నారు. వర్ణపంచకాత్మకమగు పవర్గయొక్క, వకారము యొక్క, బిందుస్వరూపమైన, అనగా సంకోచత్యాగమైన హకార ప్రతిపాద్యమగు శక్తి దశ ఇచ్ఛాస్వభావము. ఆఇచ్ఛా శక్తి జ్ఞానక్రియాసాధారణ్యముచే మూలపదము. ఇచ్ఛ వినాగా జ్ఞానక్రియలు ప్రవర్తింపవు. ఇందుచే జ్ఞానక్రియలకు ఇచ్ఛయే ఆంతరమగు కూటస్థరూపము. అందువలన జ్ఞాన క్రియాద్వయమునకు మూలరూపము. కావున ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానపదము లోపల క్రియాపదమునకు వెలుపల ప్రాధాన్యమే గాని, అంగత్వములేదు. ఇపుడు విసర్గపదమందు వేద్యాది క్రమముచేత బిందూన్మేషము ప్రవృత్తమగుచుండగా క్రమ ప్రవృత్తిశాలియగు ఈ బిందూన్మేషము ఎంతవరకు స్వప్న పదమును కూడ వ్యాపించునో, అంతవరకు విసర్గగంధము యొక్క అనువృత్తివలన బిందువిసర్గల సంసృష్టియేగాని, బిందువునకు ఏకాధిపత్యములేదు.

బిందువు వికసించునదై యుండగా బిందువ్యాప్తి నిష్పత్తిపర్యంతము, ఆబిందువిసర్గలకు త్రిపుటీరూపపదమందు ఒకచోట బిందూన్మేషము, ఒకచో విసర్గ స్ఫురించుచుండునని ఊహింపదగినది. శుద్ధవిద్యాప్రమాతయందు వేద్యములు ఇంద్రియ ప్రకాశనిమజ్జనముచేత వేద్యాంశమునందే బిందూ న్మేషము. ఇంద్రియములు ప్రమాతృపదమందు నిమజ్జనాభ్యాసపాటవము లేకపోవుటచే ఉత్తరోత్తరపదములైన ఇంద్రియాదులందు భేదమునకు ప్రశమనము లేదు.

భేదముయొక్క స్ఫురత్తనుబట్టి బిందువిసర్గ సంసృష్టి. ఈశ్వరకళ శుద్ధవిద్యోత్తరపదము గనుక ప్రమేయములందు చిదున్మేషము సిద్ధమే. విశేషమేమన, స్వాత్మీకరించిన స్వవిషయములు గల కర్మేంంద్రియములకు దేహాత్మకప్రమాతృపద మందు నిమజ్జనము. స్వాత్మీకరించిన స్వవిషయములు గల జ్ఞానేంద్రియములకు ఆత్మరూప ప్రమాతృపదభాగమందు నిమజ్జనప్రాధాన్యము లేనందువలన, ఉత్తరపదమందు భేదము స్ఫురించుచున్నదని విసర్గసంసృష్టి. సదాశివదశయందు ఈశ్వర దశాపర్యంతము చిదున్మేషము సిద్ధమే. స్వాత్మీకరించిన జ్ఞేయ వేద్యముగల జ్ఞానేంద్రియములకు విశ్వమయమైన స్వాత్మ ప్రమాతృకక్ష్యపదమందు నిమజ్జనమున్నను, నిరాకులమైన చిద్విశ్రమరూపమగు ఇచ్ఛాశక్తికి తత్వైకాత్మ్యకము మిగిలి యున్నదని తదంశయందు భేదగంధమువలన విసర్గస్పర్శ. శక్తి దశయందైతే విశ్రమరూపమైనది గనుక, అపిరచ్ఛిన్నమైన దానియందు అభేదసామ్రాజ్యమని తాత్పర్యము.

బిందూన్మేష పదమందు విసర్గానువృత్తి తారతమ్య వివేకము శుద్ధవిద్యాదిత్త్వముల ప్రస్ఫుటజ్ఞానకారణమని కర్తవ్యమందు ప్రోత్సాహము.

పూర్వత్ర నైవహి పరో నియతః పరత్ర

పూర్వో భ##వేన్నియత ఏవ శషాదిబృందే |

ఏకత్ర సంవిదుదయే ప్యపరత్ర భాస

స్తస్యా ఇతీద మథవా సమమేవబిందుః ||

శుద్ధవిద్యాదులయందు బహిర్బహిదశయందు అంతరంతర్దశ అంతర్భావముగా నుండదు. అంతరంతర్దశయందు బహిర్బహిర్దశ అంతర్భావముగానుండును. శషాది ప్రతిపాద్యమగు శుద్ధవిద్యాది బృందమందు శుద్ధవిద్యాది పూర్వదశయందు పరదశ నియతముకాదు. శుద్ధవిద్యయందు ఈశ్వరదశ నియత ముగాదు. ఈశ్వరదశయందు సదాశివ, సదాశివదశయందు శక్తి, ఆ ప్రకారమే నియతముకావు, ఈశ్వరదశాదిదశ యందైతే, శుద్ధవిద్యాదిదశ నియమముగా నుండునదే. ఈశ్వర దశయందు శుద్ధవిద్యాదశ అంతర్భూతమైయున్నది. సదాశివ దశయందు ఈశ్వరదశ, శక్తిదశయందు సదాశివదశ, ఆ ప్రకారమే ఉన్నవి. ఇపుడు వేద్యోపక్రమముచేత సంవిదుదయమగుచుండగా, క్రమము వినాగా వేద్యాదిప్రతిపాదక మైన శషాదిబృందము సర్వము సంవిన్మయూఖములయొక్క నిరాఘాట ప్రసరణముచేత ఒక్కమాటుగనే సంకోచత్యాగ మగునని పక్షాంతరమును చూపించుచున్నారు. వేద్యాంశ భాగమందు సంవిదుదయమగుచుండగా, ప్రమాణాదిపద మందంతటను ఆసంవిత్తుయొక్క కాంతులు ప్రవహించునని అట్లుకాని యెడల శషాద్యక్షరచతుష్టయము ఒక మారుగానే బిందువగును. బిందుశబ్దముచేత సంకోచభావ మగునని యర్థము. వేద్యోపక్రమముచేత బిందూన్మేషమగుచుండగా శుద్ధవిద్యాదిదశలకు కాలవిలంబాపేక్షక్రమము నియతము కాదు. ఒకప్పుడు ప్రమాతయొక్క భాగ్యాధిక్యమునుబట్టి శక్తిపాతము అతితీవ్రముగా నుండి శుద్ధవిద్యాదిదశలు నిర్విలంబముగనే క్షణమాత్రములోనే, ఒకసారియే ఆవిర్భవమగును. ఒకప్పుడు క్రమాపేక్షచే మెల్లగా సంభవించునని పక్షద్వయమును ఇచట అనుసంధించవలెను.

జాగ్రచ్ఛివస్య పశుజాగర యుక్తదైశ

మంతర్దశార మిమకోణగతం బహుత్వం |

భేదోదయోల్లసిత మేత దభేదకోట్యాం

ప్రాప్నోతి సంగ్రహమితి ప్రతిపద్రహన్యమ్‌ || 8

శకారాది అక్షరచతుష్టయాధిష్ఠాతయైన శివునకు బాహ్యక్షర సన్నివేశము కల్గినదశారయుగ్మరూప పశుజాగర చక్రమందు ఎట్లు సన్నివేశౌచిత్యము అను శంకకు సమాధానము నిచ్చుచున్నారు. శివుని జాగ్రదవస్థ పశుజాగ్రదవస్థ యందుకలసికొన్నది. నియత శ్లిష్టమని యర్థము. ఆకారణము వలనదశేంద్రియసన్నివేశపదమైన వ్యాప్యదశారము. ఈశ్వరా ధిష్టాతృకమైనది. ఈశ్వరాధిష్టాతృకమైనద శారచక్రపదమందు భేదవిజృంభణచేత సముదంచితమైన ఏ కోణగతమైన బాహుళ్యమో, అదిఅభేదపక్షావిర్భావమందు అభేదపదమునకు ఉచితమైన బాహుళ్యత్యాగమును పొందుచున్నది. ఈ విధముగ జ్ఞానరహస్యమున్నది. సకల భేద సముజృంభణస్థలమైన విసర్గ వ్యాప్తిలో చతుర్వింశత్యక్షరాత్మకమైన స్పర్శకదంబకమందు పంచవర్గలుగా సంవిభక్తమైన ఏపంచాంగమైన పదముకలదో, అది పశుజాగ్రతయందు, చతురశ్రమందును దశారయుగ్మము యొక్క నాలుగుకోణపంచకములయందును కలదు. శివ జాగ్రతయందైతే, భేదసంక్షయమగుచుండగా, చతురస్రపదమందున్న పాదివర్ణచతుష్టయము, హకారముగా పరిణమించెను. బహిర్దశారకోణపంచకగతమైన కవర్గకు హకారమందు అంతర్ధానమున్నది. అవశిష్టకోణపంచకగత చవర్గ వకారముగా పరిణమించెను. అంతర్దశారకోణపంచకగత టవర్గ షకార ముగా పరిణమించెను. అవశిష్టకోణపంచగత తవర్గ సకారముగా పరిణమించెను. మకారము హకారముగా పరిణమించిన పవర్గయందును సంబంధమును పొందుచున్నది. ప్రమాతృకక్ష్యయందును వక్ష్యమాణత్రికోణబింబమందును సంబంధమును పొందుచున్నది. ఈ విధమున విసర్గపదమందు బింద్వావిర్భావప్రక్రియ చతురస్రదశారయుగ్మరూపమైన చక్రత్రయము కోణచతుష్టయాకారముచే పరిణమించును. విసర్గ పదమందు, బిందుపదమందు, వర్ణములకు ఏకరూపమనితలంచు వారుభేదాభేదదశలయందు విశేషమును గుర్తించరైరి.

యః పార్థివే చిదుదయ స్సహి శుద్ధవిద్యా

యః ప్రాకృతే సపున రీశ్వరతా ఖిలాండే |

యో మాయికే స తు సదాశివతేతి శాచే

సై#్త్రరూప్యధీ రిహ రహస్యతమం గురూణామ్‌ || 9

పక్షాంతరాశ్రయణముచేత ఇంద్రియ దేహాత్మ నిమజ్జిత ప్రపంచముగల శుద్ధవిద్యేశ్వర సదాశివులకు, పృథివీ, ప్రకృతి మాయాండములు చిన్మయీకృతములుగా కల్పించుచున్నారు దశేంద్రియవిషయరూప పార్థివాండమందు ఏచిద్వ్యాప్తియో ఆ చిదుదయముగదా శుద్ధవిద్య. శుద్ధవిద్య ఇంద్రియ ప్రకాశైకాత్మీకృత ప్రమేయత్వలక్షణము కలది. పార్థివాండమందు ప్రమాతృస్థానీయమైన పవర్గ సంబంధము కలది. త్రిపుటి నిత్యయుక్తత్వనియమము కలది అని యర్థము. అందువలన త్యక్తసంకోచముగల పార్థివాండమందు చతుర్వర్ణరూపమైన శవర్గసర్వము ఉన్నట్లే. ఈ పక్షమందు శుద్ధవిద్యాప్రమాతకు భేదప్రశమనమము యొక్క ఉపక్రమపదము. కనుక పశు జాగ్రచ్చక్రమందు కోణబాహుళ్యము ఉండగా సన్నివేశము నకు ఉపపత్తి రాగలదు. స్పర్శకు శవర్గాకారముగా పరిణామావస్థలో నుండగా శుద్ధవిద్యాప్రమాతయందు భేదము యొక్క శిరోదర్శనమున్నది. ముఖ్యవృత్తి చేత శివజాగ్రతయైన ఈశ్వరునకే పశజాగ్రచ్చక్రమందు సంశ్లేష. శుద్ధ విద్యకు అపరిణత అని వివేకుల అంగీకారముకొరకు పాక్షిక ముగా సంశ్లేషయని చెప్పిరి. ఏప్రాకృతాండమందు చిదుదయమో, శవర్గాకారేణ సంకోచత్యాగమో, ఆ చిదుదయము ఈశ్వరత్వము గదా. ఇచట ఉపపత్తి ప్రతిభామాత్ర గమ్యము గనుక ''కిల'' అని సాంప్రదాయికముగా నుపయోగించిరి. ఇచట పవర్గకు శవర్గాకారముగా సంకోచత్యాగము. ఈ ప్రకార మూహించవలెను. ఓష్ఠ్యవర్గమైన మకారముయొక్క సంకోచత్యాగము కంఠ్యువర్ణమైన హకారమని సుగమము. ప్రకృతివర్ణమగు పకారము చిత్పదమైన హకారమందు అంతర్భావము. ఫకారాది వర్గత్రయమునకు శకారది వర్ణత్రయమునందు యుక్తిని చెప్పుచున్నారు. ఫకార, బకార. భకారములు, జలాగ్నివాయువులు, శకార, షకార, సకారములు అట్టివియే. అందువలన ఫకారాదివర్ణ సంకోచత్యాగరూపత్వము శకారాదుల సమానతత్త్వ ప్రతి పాదకమగుటచే, శకారాదులకు జాలాదితత్త్వప్రతిపాదకత్వము ప్రాగుక్తభూతవైపరీత్యముచే భావవిమర్శయందు స్ఫుటమాయెను. పకారాదులకు చెప్పబడుచున్నది. పవర్గ ప్రథమ వర్ణము. అల్పప్రాణము కలది. ఇతర భూతాపేక్షచే పృథివి అల్పవృత్తి కలది. అందువలన పకారము పృథివీప్రతిపాదకము పవర్గ ద్వితీయవర్గము మహాప్రాణము కలది. పృథివ్యపేక్షయా జలము మహావృత్తి కలది. అందుచే ఫకారము జలప్రతిపాద కము. పవర్గతృతీయ వర్ణము నాదము కలది. మహాప్రాణము కంటె నాదమధికవృత్తి కలది. జలముకంటె అధికవృత్తి గలది అగ్ని. అందుచే బకారమగ్ని ప్రతిపాదకము. పవర్గ చతుర్థ వర్ణముకేవల నాదవత్తుకంటె భకారము నాదవత్తును, ఘోష వత్తునుగాన, అధిక వృత్తి కలది. అగ్ని కంటె అధికవృత్తి కలది వాయువు. అందుచే భకారము వాయుప్రతిపాదకము. మకార ముపైనచెప్పిన సకల ధర్మసంసృష్టిరూపమగు పవర్గపంచమ వర్గము. పృథివ్యాది నాల్గుభూతముల కంటె అథికవృత్తి గలది ఆకాశము. అందుచే పంచమవర్ణమైన మకారము ఆకాశప్రతిపాదకము. అందువలన శకారాదుల ఫకారాది ప్రతిపాద్య ప్రతిపాదకతత్త్వ ప్రతిపాదకములు, గనుక సంకోచత్యాగరూపమందు ఫకారాది పరిణామరూపములని తెలియుచున్నది. ఈశ్వరుడు విశ్వమయ ప్రకృత్యభిమానలక్షణము కలవాడుగాన, త్యక్త సంకోచమైన ప్రకృత్యండము ఈశ్వరపదత్వమునకు అర్హమగు చున్నదని అభిప్రాయము. ఏ మాయి కాండమందు చిదుదయమో ఆ చిదుదయము సదాశివతత్త్వము. మాయికాండైన స్వప్నము ఆత్మ ప్రకాశపదము గనుక సదాశివుడు విశ్వాత్మత్వలక్షణము కలవాడు కనుక త్త్యక్తసంకోచమైన మాయికాండము సదాశివపదము. శకారాది వర్గచతుష్టయముయొక్క పృథివ్యండ మందు, ప్రకృత్యండమందు, మాయికాండమందు, ప్రసిద్ధ మైన త్రైరూప్యము, ఏకరూపత్వమున ఉండుట. అవస్థాన కృతమైన త్రైవిధ్యముయొక్క వివేకము. ఇది శుద్ధవిద్యాది దశావివేక ప్రస్తావమందు గురూణాం గురువులఅతిరహస్యము.

బిందూదయే విశతి సర్గ ఇమం తధైవ

సర్గోదయే తమథనోపి పదే తదంతః |

కస్స్యాద్ధకార హృది లశ్చ లవకారగర్భే

బాహ్యేతు చిత్ర్పకృతి సర్గముఖే విభక్తాం || 10

శవర్గయందు కవర్గయొక్కయు, దేహప్రతిపాదక లకారముయొక్కయు సంకోచత్యాగరూపవర్ణము కనుపించ నందుకు ఉపపత్తిని చెప్పుచున్నారు. బిందువ్యాప్తి యందు ఈబిందువు దీనికి వ్యాపకమగు విసర్గ బిందువు నందు కే ఏకీభవించును. పూర్వముర బిందుగర్భమునుండియే బయటకు విడువబడిన విసర్గ, తిరిగి బిందువును ప్రవేశించును. ఆప్రకారముగనే విసర్గవ్యాప్తి యందు ఆవిసర్గను అనంతరము ఆబిందువు కూడ ప్రవేశించును. ఆ కారణమువలన బిందువ్యాప్తి స్థల మందు జలాదిభూత చతుష్టయ ప్రతిపాదకమైన ఖాదివర్ణచతుష్ట యాం తర్గర్భమందు గల పృథ్వీప్రతిపాదకమగు కకారము, హకారముయొక్క హృదయమందు కలదు. హకారమం దంతర్భావము నొందును అని యర్థము. స్వప్నము కూడ ఆంతరపదమే గనుక స్వప్నమందును విసర్గప్రమాతయగు లకారమునకు చిత్పదమైన హకారముయొక్క గర్భమందు స్థితిని చెప్పుచున్నారు. లకారము వకారగర్భందును, చకారమువలన హకారేచ, అంతస్థసంకోచత్యాగరూపమైన శవర్గలోని హకారగర్భమందును, లకారము అంతర్ధానమైన దని యర్థము. విసరగకు బిందుసమావేశమందు దానితో ఏక రసత్వమే బిందువునకు విసర్గసమావేశమందు విశేషమును చెప్పుచున్నారు. విసర్గవ్యాప్తి స్థలమందైతే, బిందువు ప్రకృతి రూపవిసర్గయొక్క సమ్ముఖమందు ఉంటున్నను, వేరుగనేయున్నది. ప్రకృతియందు అంతర్ధానము కాదు. ఇంకను వేరుగనే కనబడుచుండును. మకారము పకారరూపప్రకృతికి తత్సమీపత్థ్సితిచేత సూచితమైన అబహిర్మోక్షణమునకు కర్మయే. కాని, దానిచే అంతర్ధానము చేయబడదు. ఆ ప్రకృతియందు ఐకరస్యమువలన స్వరూపహాని పొందదు. బిందువుచే బహిర్విస్పష్టమైన పృథివీరూప విసర్గకు బిందువును ఏకరసీకరించుటలేదు. పవర్గరూపముగా బిందువుయొక్క దర్శనముకలదు. అందుచే విసర్గవ్యాప్తిలో బిందుస్వరూప లోపములేదు.

అంతఃపదం భవతి తచ్చతురంగమైక్యా

చ్చిచ్చైత్యయోః కరణసీమ్న్యపి భావితైక్యమ్‌ |

పంచాంగకం భవతి బాహ్యపదం ప్రకృత్యామ్‌

చిద్వహ్ని గర్భ కుహరా దధీ నిర్గతాయామ్‌ || 11

విసర్గబిందువునందు విలయనముచేత, అంతఃపదము చతురంగమని, విసర్గయందు బిందువుయొక్క అవిలయనము చేత, బాహ్యపదము పంచాంగమని, ఇదివరకు చెప్పబడినది. ప్రస్ఫుటముగా తెలియుటకు మరల ఉద్ఘాటన చేయుచున్నారు. ఆకారణముచే అనగా బిందువునందు విసర్గయొక్క విలయన రూపహేతువువలన, అంతఃపదము చతురంగమైనది. ఎందు వల్లననిన చెప్పుచున్నారు. చిచ్చైత్యములయొక్క ఐక్యము, చిత్తునకు చైత్యమును ఏకరరసము చేసికొను సామర్థ్యము కలదు. ఆ అంతఃపదమెట్టి దనిన, విసర్గ ప్రమాతయొక్క సర్వపదమును ఉపలక్షణమే. చిన్నిమజ్జన మగుచునే బహిర్భాసన మగు కరణత్రయ పదమందు భావింపబడిన చిదైక్యము కలది. విసర్గపదమైన కవర్గ హకారమందు మజ్జనమగుటచే, ఉప లక్షణముచేత కరణత్రయస్థానీయ చవర్గ, టవర్గ, తవర్గ సంకోచత్యాగరూపములైన శ ష సలు కూడ హకారమందే నిమజ్జనమని భావింపవలెను. ఆశషసలయొక్క బహిఃస్ఫురణ చేత శుద్ధవిద్యాది స్ఫురణ వివేచనము. ఆ హకారమందు నిమజ్జనమగుచునే కలుగుచున్నదని తెలియవలెను. అందుచే అభేదరూపమైన చిత్పదము ఏకాంగకమే. శ, ష, సలు హకారమందు నిమజ్జనమగుటచేత కనబడునప్పుడు శుద్ధ విద్యాది స్వరూపము తెలియబడదు. తద్విజ్ఞానముకొరకు హకారాంతర్గతములైన శ, ష, స లే బహిరవభాసనమగుచున్న వని తెలియవలెను. విసర్గపదమందు చిత్తును వహ్నిగర్భ కుహరమువలన విసర్గ బయలు వెడలిన దగుచుండగా, (కరణ త్రయముతో సహా బయలువెడలిన దనియే ఇచట అభిప్రాయము), బాహ్యపదము పంచాంగకమగును. చైత్యమునకు చిత్పదము లేకుండ, స్వరూపము సిద్ధించదు గాన అలుప్తమగు చిత్పదముతో కూడ కలసిన పంచాంగకమగును.

జ్ఞానక్రియోన్ముఖ హకారమయా ర్వయేచ్ఛా

విశ్రాంతి రంతరబహిర్ముఖ విశ్రామాత్మా |

కూటాక్షరాత్మా తను రేష శివ స్సుషుప్తి

విశ్రాంతి రేవ సవికల్ప కళాల్పగంధా || 12

శక్తిరూపమైన హకారముయొక్క స్వరూపమును విశదముగా ఉపపాదింతుము. దీనికి ఉత్తరపదమైన ళకార, క్షకారరూప కూటాక్షరప్రతిపాద్యమైన శివతత్త్వముయొక్క స్వరూపమును బోధించుచున్నారు. సదాశివేశ్వరాత్మకము లైన జ్ఞానక్రియలకు ఉన్ముఖమైన (ఆ రెంటికి అధిష్ఠాతృత్వ మైన దగుటచేత) హకారస్వరూపమగు అభేదేచ్ఛ అనునది విశ్రాంతి. ఏది అపరిచ్ఛిన్న జ్ఞానక్రియాత్మకమైన సదాశివేశ్వర రూప జ్ఞానక్రియాకరణములకు అధిష్ఠాతయో, అది జ్ఞానక్రియలకు కూటస్థత్వలక్షణమైన కదధిష్ఠాతృత్వముచేత ఇచ్ఛా అను వ్యపదేశమునకు విషయమైనది. జ్ఞానక్రియా కూటస్థమే ఇచ్ఛాలక్షణము. ఇచ్ఛాస్వరూపమగు శక్తి శక్తి తత్వమని ఆగమికులచే చెప్పబడుచున్న ద్వైతసృష్టిరహిత మైన హకార ప్రతిపాద్యమగు మహావిశ్రాంతి కలదు. అదియే అంతఃపదమందు ప్రపంచమునకు అనభిముఖ విశ్రాంతి స్వరూపమైనదియు, వికల్పకళ యొక్క అల్పగంథముతో కూడుకొనిన స్వరూపానుభవ మాత్ర వికల్పముతో కూడుకొన్న సుషుప్తియే, ళకార, క్షకారోభ##యైక్య రూప కూటాక్షరాత్మకమగు నిజస్వమాపమును గల్గిన ఈ అపరో క్షానుభవగోచరమగు శివతత్త్వము. జాగ్రత్‌ యందే సంభవించునది, సోమాదిసాధక భాగ్యవశమువలన గాని, స్వతః ప్రవృత్తమైగాని, కల్గిన సుషుప్తి విశ్రాంతి అంతర్ముఖమైన శివతత్త్వమగును. అదియే బహిర్ముఖమైన శక్తి తత్త్వముగా వ్యవహారయోగ్యమగును.

నాస్త్యస్తి వే త్యుదిత సంశయ జాగ్రతీవ

సుప్తౌ శివే జగదభేద విబేద రూపం |

జ్ఞానక్రియాత్మకతయా ప్రతిరూపభిన్నమ్‌

ఏవం చతుర్విధ మధిశ్రిత బీజమాత్రమ్‌ || 13

అంతర్ముఖమైన అజడసుషుప్తి విశ్రాంతి రూపమగు శివునకు జడసుషుప్తి విశ్రాంతి రూపమగు స్వరప్రతిపాద్యమైన శక్తికివలెనే జగత్కారణత్వముండుటచేత. అ శివునియందు కూడ జగద్బీజస్థితి ఉచితము. కటాక్షర రూపముచేత విభావ్యమానమగు తదవస్థానమును ఉపపాదించుచున్నారు లేదా ఉన్నదా, అను సంశయము కల్గిన జాగ్రత్‌ కలిగిన సుషుప్తి స్వరూపమైన శివునియందు అభేదవిభేదముచేత ద్వివిధమైనదియు, జ్ఞానక్రియాస్వరూపముగా ప్రతిరూపమున తిరిగి భేదమును పొందినట్టిది. జ్ఞానక్రియాస్వరూపముగా భేదము రెండువిధములు. అట్లే అభేదము కూడ రెండువిధములు. ఈ ప్రకారము నాల్గువిధములైన జగత్తు బీజమాత్రముచేత అధిశ్రితమైనది. భేదస్వప్నరూపమైన అంతఃపదమందు భేదజ్ఞానరూపము, భేదజాగ్రద్రూపమైన బహిఃపద మందు భేదక్రియారూపముకలవు, ఆ ప్రకారముగనే అభేద స్వరూపమని సంగ్రహముగా జగత్తు చతుర్విధముగను శివతత్త్వమందు కూటాక్షరరూపము చేత బీజమాత్రముగను ఉన్నదని చెప్పిరి.

జ్ఞానం ద్వయాద్వయమయం ల సకార రూపం

తాదృశ్చ కర్మక షకారమయం మిథస్తత్‌ |

శ్లిష్టం పుర స్స్ఫురిత సద్వయకోటి శ క్ష

రూపం పరస్పరగతం చ సమం చ కూటమ్‌ || 14

లకార, సకార, కకార, షకార రూప వర్ణ చతుష్టయ కలాపమైన కూటాక్షరమునకు చతుర్విధ జగద్బీజసంసృష్టి రూపమును చెప్పుచున్నారు. భేదాభేదాత్మకమైన జ్ఞానము లకార, సకార రూపమైనది. భేదజ్ఞానపదమైన అంతస్థవర్గ యందు ప్రకృతిప్రతిపాదకమైన లకారమునకే జ్ఞానప్రమాతృత్వము. ఆ పదము జ్ఞానపదము. ఆ పదమునకు అధిష్ఠాత యగు లకారమునకే జ్ఞానప్రమాతృత్వము. మనః ప్రతిపాదక మైన లకారమునకు తద్వ్యాప్యత్వాభిమాన దోషము వలన జ్ఞాతృత్వమనుటకు ఉపపత్తి లేదు. తన్మూలరూపమైన వకార మునకు కూడ అంతే. జ్ఞేయస్థానమైన యకారమునకు జ్ఞాతృత్వ శంకయే లేదు. జ్ఞేయవర్గమైన గంధాదుల సర్వత్ర పృథి వ్యాదులకు అంగమగుటయే కారణము. ప్రకృత్యా కారపృథివీ రూప లకారమునకు అంతఃపదమగుటచే క్రియా ప్రమాతృశంక సముచితముగాదు. అందువలన లకారమునకు జ్ఞాతృత్వము నిశ్చయింపబడినది. శవర్గపదమందు సదాశివాత్మకమైన సకార మునకైతే అభేదజ్ఞానత్వము నిర్వివాదము. అటువంటి భేదాభేదా త్మకమైన క్రియయు, కకార, పకారరూపమైనది. భేదక్రియా రూపమైన స్పర్శస్థలమందు టవర్గకు కవర్గ వ్యాప్యత్వాభిమాన దోషము వలన కర్తృత్వము లేదు. ఇక కవర్గకు అధిష్ఠాతయైన కకారమునకే కర్తృత్వము. అభేదక్రియాపదమందైతే శవర్గ యందు ఈశ్వరాత్మకమైన షకారమునకు కర్తృత్వము స్ఫుటము. ఆ చతుష్కము అన్యోన్యముభేదజ్ఞానమైన లకార ముతో, అభేదజ్ఞానమైన సకారమునకు, భేదక్రియయగు కకార ముతో, అభేదక్రియయగు షకారము కలిసినది, భేదాభేదము లకు అన్యోన్యశ్లిష్టతా స్వభావము దీనికి హేతువు. మాయా బలమువలన ముందుగా ద్వైతకోటిస్ఫురించును. శ్లిష్టములైన అక్షరద్వికముల ద్వైతకోటి స్ఫురణ యెట్టిదనిన చెప్పుచున్నారు. లకార, సకారముల శ్లేషయందు భేదరూపమైన లకారము ముందు స్ఫురించగా, ళ అను వర్ణమగును. జ్ఞాన ముతో జ్ఞానము ఏకరసమగును గాన లకారమందు సకారము సామరస్యమునందును సకారయోగముచేత సంభవించిన ఉచ్ఛూనభావము కలదై, లకారమేళ అని వినబడును. కకార షకారముల శ్లేషయందు ద్వైతరూపమైన కకారముయొక్క స్ఫురణలో క్రియయందు క్రియాసామరస్యము పొందదు. కనుక క్షకారమగును. ఈ కూటముక్రమముగా పరస్పరము వ్యాప్త మగుచుండును. ముందు లకారముచేత సకారము వ్యాపింపబడును. ఆసంస్థానము భేదసంసారబీజము. అనంతరము సకారముచేత లకారము. ఈ సంస్థానము అభేదసంసారబీజము. క్రియాపదమందును ముందుగా కకారముచేత షకారము వ్యాపింపబడును. అనంతరము షకారముచేత కకారము. సంస్థానకృతమైన బేదాభేదబీజత్వము. పూర్వమువలెనే అని తెలియవలెను. మధ్యమపదము సమవ్యాప్తి కలదిగాన నిష్పందమగును. భేదాభేదోభయమిశ్రణబీజమగును. భేదసంసారబీజ భూతమైన సంస్థానముచేత దృశ్యమానమగు కూటమున కనిభావము. ఈ ప్రకారముగా సంస్థాపనక్రియ గురుముఖతః పారంపర్యముగా వచ్చుచున్నదని ప్రతిభావంతులచేత అను సంధానము చేయదగినది. శివతత్త్వవ్యంజకమైన కూటమునకు ఏకాకక్షరమే. వ్యంగ్యమగు శివతత్వ మొకటియే గనుక సాస్నాదిమత్వముచేత వ్యంగ్యమగు గోత్వజాతికివలెనే స్థూల రూపకూటాక్షరముచేత వ్యంజితమైన శివతత్త్వమునకు విశ్రాంతిరూపతాభంగమేమియు లేదు.

జ్ఞానాత్మ జాగర సుషుప్త్యవధీ మకార

కూటాత్మకౌ పశుశివౌ గుణకోణ బింద్వోః |

శ్లిష్టౌ వశాది చతురస్ర యుగాన్వయోత్థః

నాగాశ్ర రశ్శ్యుదరగౌ నను సర్గబిందూ || 15

మకారాది క్షకారాంత దశాక్షరరూపమైన ప్రమాతృ పదమునకు అష్ఠారత్రికోణబిందుచక్రములయందు సన్నివేశ మును చెప్పుచున్నారు. జ్ఞానాత్మక జాగరముయొక్కయు, జ్ఞానాత్మకసుషుప్తి యొక్కయు, స్థానభూతమైనది, అనగా అవధిస్థానమందున్నది. జ్ఞానజాగరమగనా, అంతస్థప్రతిపాద్య మగుస్వప్నము. దాని అవథియం దనగా యకారప్రాంతమందు ప్రవృత్తి ప్రథమపదమ స్వప్నముగు జాగ్రదభిముఖముగా ప్రవర్తించునది. కనుక వకారము ప్రారంభించి యకారమందు పరిసమాప్తి. తదనంతర పదమందుండువాడు గనుక మకార మునకు స్వప్నావధిస్థానత్వము. జ్ఞానసుషుప్తి అనగా శవర్గపన్రతి పాద్యమగు నిర్విభేద జాగ్రత్స్వప్నరూపమైన పదద్వయము. దానియొక్క అవధియందు అనగా హ కారముయొక్క ఉత్తరభాగమందు, క్షకారరూపుడు నివృత్తి రూపమైన జ్ఞానసుషుప్తి నుంచి సుషుప్త్యభిముఖముగా ప్రవర్తించువాడు. శకారము ప్రారంభించి హ కారమునందు పరిసమాప్తి. తదనంతర పదమందుండువాడు గనుక క్షకారమునకు జ్ఞాన సుషుప్త్యవధిస్థానత్వము. ఈ రీతిగా జ్ఞానజాగర జ్ఞానసుషుప్తి అవధిగాగలిగిన మకారకూటాక్షర స్వరూపులగు పశుశివేజీవ శివులు త్రికోణ బిందుచక్రములయందు కలసికొనుచున్నారు. త్రికోణగర్భమందు బిందువు. బిందుగర్భందు త్రికోణమని జీవశివులకు అన్యోన్యవ్యాప్తి స్వభావమునుబట్టి శ్లేషయని తెలియవలెను. భేదము త్రైగుణ్యరూపము గనుక త్రిగుణా వచ్ఛిన్నుడగు భేదప్రమాతయైన జీవునకు త్రికోణరూపత. అభేదము ఏకరూపము గనుక అభేదప్రమాతయగు శివునకు నిర్గుణత్వ సూచకమగు నిష్కోణ బిందుస్వరూపత. ఐతే భేద ప్రమాతృత్వము ప్రకృతికిగాని, పృథివికిగాని, తగినదని, భేద మందు జీవునకు ప్రమేయత్వమని, పూర్వము ప్రతిపాదించి యుంటిమి. ఇచట భేదప్రమాతృత్వము జీవునకెట్లు చెప్పబడినది? అభేదప్రతిసింహాసనారోహణమును, ఈ జీవునకు చెప్పుచుంటిరి అనిన సమాధానము చెప్పుచున్నారు. ప్రమాతృత్వ మనగా అనుసంధాతృత్వలక్షణము కలది. కనుక ముఖ్య వృత్తికే చిత్పదముకే ఉపపత్తి. చైత్యపదమందు వ్యాప్తిని అనుసరించి, గౌణవృత్తిచే చైత్యమునకు ప్రమాతృత్వమును ఉపచారముగా చెప్పినారు. ఫలసమయమున జీవునకే భేదపదీయ మైన వ్యవహారమందు చైత్యమునకు చెప్పిరి. ఇచట త్రికోణ బిందువుల యందు శ్లిష్టమైన జీవశివులు. వకారాది వర్ణముల చేత, శకారాది వర్ణములచేత, ఉత్థితమైనది చతురస్ర యుగము వ మొదలు య వరకు గల నాల్గువర్ణములచేత ఒక చతురస్రము. శ మొదలు హ వరకు గల నాల్గువర్ణములచేత ఇంకొక చతురశ్రము. ఆ రెంటియొక్క అన్వయముచేత (శ్లేషచేత) ఉద్భూతమైన నాగాస్రము కలదియే (అష్టకోణము) రశ్మి చక్రము. క్షకారాత్మకుడైన శివునకు శాదివర్ణ నిష్పన్నమైన చతురస్రము రశ్మిచక్రము. మకారాత్మకుడైన జీవునకు వాదివర్ణ చతుష్టయ నిష్పన్నమైన చతురస్రము రశ్మిచక్రము. ఆ రెండు చతురశ్రములయొక్క మధ్య అధిష్ఠాతలుగా విసర్గ బిందుస్వరూపులు గలరు. త్రికోణాత్మకుడైన జీవునకు విసర్గ రూపత. బిందుచక్రాత్మకుడైన శివునకు బిందురూపత అని భావము.

జ్ఞానక్రియాత్మక సుషుప్తి విబోధ మధ్య

సంస్థౌ క్షమా వుభయపక్షగ బిందుసర్గౌ |

తౌ వ్యాపకౌ తదుభయస్య తదంగిభూతౌ

జాగ్రత్సుషుప్తి సమవాయ పదే7నుషక్తౌ ||

క్షకార మకారాత్మకులగు శివజీవులకు జ్ఞానక్రియా సుషుప్తుల మధ్యపదమందు, జ్ఞానక్రియాజాగ్రతల మధ్యపద మందు యధాక్రమముగా సన్నివేశౌచిత్యమును చెప్పుచున్నారు. జ్ఞానాత్మకమైన సుషుప్తి కలదు. శవర్గ ప్రతిపాద్య మగు అభేదజాగ్రత్స్వప్న రూపమైనది. క్రియాత్మకసుషుప్తి యును కలదు. స్వరములయందు బిందుభాగ ప్రతిపాద్యమైన అభేదసుషుప్తి యున్నది. ఆ రెండు సుషుప్తులమధ్య క్షకార రూప శివసంస్థానము. జ్ఞానాత్మకవిబోధ అనగా అంతస్థప్తరి పాద్యమగు భేదస్వప్నము. క్రియాత్మకవిబోధ యనగా స్పర్శ ప్రతిపాద్యమగు భేదజాగ్రత. ఆ రెంటియొక్క మధ్యభాగ మందు మకారరూప జీవునియొక్క సన్నివేశము. జ్ఞానవిబోధ యను జ్ఞానసుషుప్తి కూడ ఉపలక్షణముగ తెలియనగును అభేదజాగ్రత్స్వరూపము పూర్వకోటిగా గలిగి, అభేద సుషుప్తి ఉత్తరకోటిగా గలిగి, ఆ రెంటి మధ్య ఏప్రకారముగా శివునియొక్క సన్నివేశమో, ఆ ప్రకారము భేదసుషుప్తి జ్ఞాన జాగరము పూర్వకోటిగా నుండి, క్రియాజాగ్రత్‌ ఉత్తర కోటిగా నుండగా ఈ రెంటిమధ్య జీవునియొక్క సన్నివేశమని తెలియవలెను. ఈ ప్రకారము నిరూపింపబడిన సన్నివేశ స్థానములు గల క్షకార, మకారాత్ములగు శివజీవులలు ఉభయ పక్షములను పొందిన బిందువిసర్గరూపులు. అనగా జ్ఞాన క్రియాసుషుప్తి లక్షణములతో ఉభయపక్షములను పొందిన వాడు తద్వ్యాపకుడు. అనగా ఆ రెంటికి అధిష్ఠాతయైన వాడు క్షకారరూపబిందువు. భేదసుషుప్తి సహితజ్ఞానజాగరము కేవల క్రియాజాగరము. ఈ రెండుపక్షములకు వ్యాపకుడు, అనగా తదథిష్ఠాతయైన విసర్గరూప మకారము. ఆ ఇద్దరు ఈ ప్రకారము సుషుప్తి రూప ఉభయపక్షములకు వ్యాపకులు. నివృత్తిరూపమైన ద్వివిధసుషుప్తికి, ప్రవృత్తిరూపమైన భేద సుషుప్తి సహితమగు ద్వివిధజాగ్రత్‌కు అధిష్ఠాతృత్వ సూచక ముగా మధ్యయందుగల సన్నవేశముచేత నివృత్తి ప్రవృత్తి రూప ములు, అభేదభేదములకు అంగిభూతులును, జాగ్రత్సుషుప్తులు కలిసికొన్న పదమందు (అంతర్థవర్గ ఊష్మవర్గ జాగ్రత్సుషుప్తుల సమవాయుపదము) సమానమైన వానికే సమావాయపదము గాని వ్యస్తములైన వాటికి లేదు. అంతస్థపదమందు జాగ్రత్సుషుప్తులకు సమవాయము. అంతస్థవర్గ ఈషత్స్పృష్టతా విషయమైనది. కనుక ఊష్మపదమందు జాగ్రత్సుషుప్తులకు సమవాయము, ఊష్మవర్గ ఈషద్వివృతతావిషయమైనదిగాన వ్యాపకవర్గదశాక్షరాత్మకము. స్వరస్పర్శపదములకు వ్యాపక మైనదిగాన దీనికి వ్యాపకమని సంజ్ఞ. మధ్యపదమందు పక్ష ద్వయ వ్యాపకమైనదియు, మధ్యపదమునకు ఉచితమైనట్టిదియు, నగుటచే శివజీవుల సన్నివేశము ఉపపత్తి యుతముగనే యున్న దని తాత్పర్యము.

సంకోచపూర్తి పరసీమ పదోభయార్థ

శ్రీ చక్రమధ్యనిలయా త్రిపురేశ్వరీసా |

త్రేధా విసర్గపదమేక విధం పదం చ

బిందో స్తురీయ మితి బాహుచతుష్టయాధ్యా || 1

దశారయుగ్మమునకు, చతుర్దశారమునకు, వ్యాపకమైన అష్ఠారాత్మకమగుమధ్యచక్రమునకు అధిష్ఠాతృత్వముచేతజీవ శివాత్మకమైన మకార, క్షకారసామరస్యమే సర్వచక్రాధిష్ఠా తృత్వభూతమైనటువంటిది, మధ్యచక్రము నిలయముగా గలిగినదియునైనదియు, త్రిపురేశ్వరియొక్క స్వరూపమని చెప్పుచున్నారు. సంకోచభావమునకు పూర్ణభావమునకు, పరమా వధిస్థానమైనది. అనగా, జాగ్రదాత్మక దశారయుగ్మరూపము సుప్త్యాత్మక చతుర్దశారరూపము, తదుభయార్థమునైనది పరమేశ్వరి, ప్రమేయ, ప్రమాణ ప్రమాతృ లక్షణ పురత్రయాత్మక శ్రీచక్రముయొక్క మధ్యప్రదేశము అష్ఠారము అనగా స్వప్నాత్మకమగు అష్ఠారరూపమైన ప్రమాతృపదము. ఆప్రమాతృపదమే స్థానముగా గలిగినది త్రిపురసుందరి. ఇందు చేత మకార, క్షకారములకు అష్టారాధిష్ఠాత్వము కలదు గనుక ఆ మకార, క్షకారముల సామరస్యమే త్రిపురేశ్వరీ స్వరూమని బోధింపబడినది. అనంతరము సుషుప్తి జాగర తుర్యములే లక్షణములుగా గలిగిన సకలచక్రార్థ స్వరూపిణి యగు త్రిపురేశ్వరికి దశాచతుష్టయమే అంగచతుష్టయము. ఆ విభాగమును చెప్పుచున్నారు. మూడువిధములైన భేదపదము భేదసుషుప్తి, భేదస్వప్న భేదజాగ్రద్రూవమైనది. బిందువు యొక్క ఒకేవిధమైన తుర్యపదము. ఈ తుర్యపదమందును, విచారింపగా, అభేదసుషుప్తి అభేదస్వప్న, అభేదజాగ్రత్‌, రూపములచేత త్రైవిద్యము సంభవమైనను, ఆత్రైవిద్యము ప్రతియోగి ఉపాధివశమున స్ఫురత్తయేగాని, పారమార్థికముగా లేదు. అభేదమైన తుర్యమేకవిధమే. ఈ చెప్పిన దశాచతుష్టయమే బాముచతుష్టయముగా ఒప్పుచున్నది. త్రిపురేశ్వరికి బాముచతుష్టయ మున్నదని సంప్రదాయము. దశాచతుష్టయమును, అంగముగా గల్గినదని సంకేతముకాని, పారమార్థికముగా బాహుచతుష్టయము కాదని సద్గురు కటాక్షముచేత నశింపగలవు. ఇట్లు నశించిన సంశయములు కలిగిన మహాభాగ్యవంతునకే ఈ మహారహస్యము వేద్యమని సాంప్రదాయిక సిద్ధాంతము.

సౌషుప్త జాగ్రదబహిః పద జాగరేషు

తోయ క్షమా నిల మయే ష్వకళాత్మ శక్త్యా |

ఆత్తే చవర్గ యమస్వగుణషుక్షు చాప

పుష్రేషు పాశనిగృహీత చితా త్రిబాహుః || 18

ఈ బాహుచతుష్టయ సంకేతమే ఆయుధచతుష్టయ సంకేతముతో కూడ ప్రస్ఫుటముగా చెప్పబడుచున్నది. సుషుప్తి, జాగ్రత్స్వప్నములు జల, పృధివీ, వాయు, రూపములు. సుషుప్తి జడముగాన జలరూపము. జాగ్రత్‌ సంకోచ రూపమగుటచే కాఠిన్యమువలన పృథివి. స్వప్నము వాయుపర్యాయ మైన మనోవిలాసము గాన వాయురూపము. క్రమముగా ఈ దశలయందు అకార, కకార, లకార, రూపశక్తి కలదు. చైత్యా త్మకమైనది పృథివీరూపము. కఠినరూపమైన పృథివియే పరమ చైత్యమగును. ఆ శక్తి ఏవిధమైన దనగా, సుషుప్తి జాగ్రత్స్వప్నములయందు క్రమముగా పరిగృహీతములైన ఇకార, చవర్గ, యకారమయములైన స్వకీయధర్మములగు భూతపంచ కాథిష్ఠాతృభూతమైన పృథివికి శబ్దాదిపంచకముగదాధర్మము. నియమముచేత వాటినే ఆశ్రయించుననీ శబ్దాదులు. ఇట్టి శబ్దాది స్వగుణములు సుప్త్యాదిదశాత్రయ ప్రాప్త్యౌల్బణ్య తారతమ్యము కలవి. గనుకనే సుప్తి జలమయమగుటచేత, మధరమగుటచేత, జీవస్వరూపావర్జకమగుట వలన ఇక్షుచాప మని సంకేతముగలదు. జాగ్రత్‌ యందు ప్రవృద్ధమైన భేదము గలవై వశీకరణ మాత్రవ్యాపారము కలవగుటచేత సుమబాణ ములని సంకేతముగలవి. కించిదుచ్ఛూనదశయగు స్వప్నమగు వాయురూపమగుటవలన వాయువువలెను భ్రమణవ్యాపారము కలదు. అభేదమందు భేదభ్రాంతి కలిగించుటచేత పాశమని సంకేతము గలవి. ఈప్రకారము ఇకార, చవర్గ, యకార, ప్రతిపాద్యములైన శబ్దాదులే, ఇక్షు, చాప, పుష్పబాణ పాశములుగా సంకేతములైనవి. ఇటువంటి సాధనములచేత నిగృహీతమైన అనగా ఆవృతమైన, జీవస్వరూపముగలది, ఇటువంటి పృథివీశక్తి చేత మూడు బాహువులుకలది. ఈరీతిగా సుప్త్యాదిదశాత్రయాధిష్ఠాత్రియగు త్రిపురేశ్వరి అను చైత్యాత్మికశక్తికి బాహుత్రయమున్నది. తదాశ్రితమైన శబ్దాది పంచకమే ఆయా దశలయందు వ్యవస్థితమైన స్వరూపవిశేష మగుచు ఇక్షుచాపాద్యాయుధ త్రయమైనదని మహోపదేశము.

తుర్యేగ్నిధామ్ని హచితా ససృణి ప్రణున్న

చైత్యాతి పశ్వి భ జడత్వరుజైక బాహుః |

ఏవం చతుర్భుజ విభావ్య చతుర్దశాంగా

క్షాత్మాంగినీ జయతి మధ్యపదేతి తుర్యా || 19

ఈ ప్రకారము బింధకమైన బాహుత్రయమును, వాటి ఆయుధములతో సహా చెప్పి, మోచకమైన చతుర్థబాహువును తదాయుధముతో కూడ వివరించుచున్నారు. చిద్వ్యాప్తి పదమగుటచే అగ్ని స్వరూపమైన చతుర్థదశయందు (పారిశేష్యము వలన తుర్యాతీతము ఆకాశస్వరూపమని తెలియవలెను), సకారరూపమగు అంకుశముచేత నశింపచేయబడినది చైత్యమే మహాపశువగు గజముయొక్క చిద్వ్యతిరేకస్ఫురణ అను రోగము గల హకారప్రతిపాద్యమగునది చిత్తు. (మహాపశువైన గజమును అంకుశముచేత బోధించిరి). చైత్యము కూడ సకారరూపమైన సదాశివవిమర్శచేత బోధింపబడును. చిదేక రసరూపమును పొందింపబడునవి సకారమునకు అంకుశ సంకేతోపపత్తి. అభేదవిమర్శయైన సకారము హకారాత్మకమగు సంవిచ్ఛక్తికి అంగమగుటవలన, ధర్మము. ఆ సకారమునకు తదాయుధత్వము. ఈ రీతిగనే సకారమను అంశమును ధరించిన హకారశక్తిచేత ఏకబాహువుకలది. ఈ ప్రకారము చతుర్దశాంగా చతుర్భుజములతో ఊహింపబడిన నాల్గుదశ##లే అంగముగా గల్గిన క్షకార, మకారములయొక్క సంసృష్టి రూపమైనది అంగి. క్షకార, మకారములచేతనే దవాచతుష్ట యము అధిష్ఠింపబడినది. తదుభయ సంసృష్టికే అంగిత్వము. త్రిపురేశ్వరికి ప్రాణస్వరూపమను ఉపపత్తి బాగున్నది. నిర్వికల్పకమైన తుర్యముయొక్క మధ్యభాగమందు బీజభూతమైన క్షకారము అధిష్ఠాత. వికల్పపదమైన సుషుప్త్యాదిదశాత్ర యముయొక్క మధ్యభాగమందు బీజభూతమైన మకారము. తదుభయసంసృష్టియే సర్వమూలము గనుక తుర్యాతీతస్వభావ మని ఉపదేశించుచున్నారు. మధ్యపదమందు తుర్యాతీతాత్మా కమై సర్వోత్కృష్టముగా నున్నది. జయతి అనుశబ్దముచే ఈ పదమునకే సర్వోత్కృష్టతయని తెలిపిరి.

సుప్తిప్రభృ త్యుదిత చైత్య విజృంభితస్య

జాగ్రత్పదప్రభృతి చిద్వినిమజ్జనం యత్‌ |

తుర్యం పదం ఖలు తదత్ర సుషుప్తి భాగో

య శ్చిన్నమయ శ్శివవపు స్తదతీతతుర్యమ్‌ || 20

పంచ భూతములు, పంచామ్నాయములు, దేవునకు పంచముఖములు ఉండగా, దశలు కూడ ఐదు; అంగములుగా నున్న ఈ ఐదింటికి తత్సమరసమైన అంగి వేరుగానుండవలెను. ఐదవది యగు తుర్యాతీతమునకు అంగిత్వమెట్లు కలుగును. సుప్తిదశను ఆరంభించి వచ్చిన చైత్యవిజృంభణకు జాగ్రత్పద మును మొదలుకొని ఏ చిన్మయతావభాసనమో, అదిగదా తురీయపదము. సుషుప్తి స్వప్నజాగ్రత్క్రమముచేత బయలు వెడలిన భేదాభావసకు జాగ్రత్స్వప్న సుషుప్తి క్రమమువలననే అభేదావభాసనము కలదు. అది తుర్యదశ. ఈ దశయందు ఏ చిన్మయమైన సుషుప్తి భాగము కలదో, అనగా జాగ్రత్స్వప్నములు చిన్మయములుగా భాసించిన పిమ్మట సంభావ్యమాన మగు చిన్మయీభూత సుషుప్తి రూప విశ్రమముకలదో, అది తుర్యాతీతస్వభావమైన శివుని శరీరము. చిన్మయములైన జాగ్రత్స్వప్నములు శివుని జఘన్యరూపమైన శరీరము. చిన్మయసుషుప్తి శివునిశిరః పదమని తెలియవలెను. ఎవరికి నాలుగేదశలని మతమో వారు చిన్మయసుషుప్తికి అతితుర్యమని, అనగా తుర్యము బాగా అతిశయించినదను భావముతో తుర్యమునందే అంతర్భావమని అనిరి. తుర్యాతీతత్వ సంభావనా విషయమైన చిన్మయసుషుప్తి తుర్యమందే అంతర్భావము కలిగినది. కనుక తుర్యాతీతమని వేరుగా దశకాదు. అందువలన తుర్యాతీతము సర్వదశాసమవాయరూపముగాని దశామాత్రముకాదు. సర్వదశాధిష్ఠాతయగు అంగి అని తన్మతానుసారముగ సర్వదశాధిష్ఠాతృభూతమైన క్షకార, మకార సమవాయమునకు తుర్యాతీతస్వభావత్వము అంగి త్వాభిప్రాయముచేత చెప్పబడినది గాని దశామాత్రపరమ గాదని పూర్వసూత్రాభిప్రాయము. తుర్యాతీతస్వభావము అంగిపరత్వముగా అభిమతమైనప్పుడు సర్వదశాంగ సమవాయమేయుక్తము గాని ఏకదేశమందు నియతముగ క్షకార మకారసంసృష్టియొక్క సన్నివేశౌచిత్యము తగదని చెప్పుచున్నారు. ఏప్రకారముగా దేహికి సర్వశరీరసమవాయమున్నను, శరీరముయొక్క ఏకదేశ##మైన హృదయకమల మందు సన్నివేశాంగీకారమో, ఆ ప్రకారమే, సర్వదశా సమవాయమున్నను, తుర్యాతీతస్వభావమునకు క్షకార, మకారసంసృష్టి రూపమధ్య చక్రమందు సన్నివేశము తగినదే యని భావము. ఎవరిమతమందు తుర్యాతీతమనగా చిన్మయ సుషుప్తి పదము పంచమదశయో, వారి మతమందు క్షకార, మకార సంసృష్టిరూపమైన పదము సన్వదశాసమవేత్తమైన మహాతత్త్వమని, త్రిపరేశ్వరీప్రాణపర్యాయమైన దనియు వ్యవహారము.

తుర్యం ద్విఖండ మభవస్య జిఘన్యభాగో

మూర్థాతితుర్య మనయో రసు భూః క్షమధ్యం |

జాగ్రచ్ఛిరా స్స్వపన సుప్తి జఘన్య భాగో

మప్రాణకః పశురసౌ విపరీతబోధః || 21

పూర్వ సూత్రమందు సామాన్యముగా చెప్పబడిన దానికి వివరించుచున్నారు. ఖండద్వయముతో కూడుకొన్న (అభేదజాగ్రత్స్వప్నరూపమనిభావము) తురీయము శివునకు జఘన్యభాగము. అభేదసుషుప్తి రూపతుర్యదశాభాగము శిరస్సు. శివునకు నిర్వికల్పము ప్రధానము. వికల్పము అప్రధానము. ఈ అప్రధాన ప్రధానాంగములకు క్షకారరూపమధ్యస్థానము ప్రాణస్థానము. జఘన్యశిరోరూపములైన అంగముల మధ్య స్థానమైన కంఠమందు ప్రాణస్థితి. ఉభయాధిష్ఠాతకు ఉభయ మధ్యస్థితి ఉపపన్నమైనదే యని తాత్పర్యము. శివప్రసంగ ముచే జీవునియొక్క అంగవివేకమునుకూడ చెప్పుచున్నారు. జాగ్రత్‌ శిరస్సుగా గలిగినది. స్వప్నము, సుషుప్తి, జఘన్య భాగముగా గలిగినది, శివునికంటె విపరీతజ్ఞానము కల్గినట్టిది. (వికల్పము ప్రధానము, నిర్వికల్పము అప్రధానము కనుక పశువునకు శివునికంటె వైపరీత్యము) జీవుడు మకారస్థానమును ప్రాణపదముగా గలవాడు. ఉభయాంగ మధ్యవర్తి యగు మకారమే పశువుయొక్క ప్రాణస్థానమని పూర్వమువలెనే తెలియవలెను.

మాత్మాపశుః ప్రకృతి రేవ తయా నిగర్ణో

హాత్మాపి చిత్ప్రకృతి రేవ నివృత్తి రూపా |

ఇత్థం ద్విధా ప్రకృతి విశ్రమభూః క్షకారః

శంభుః పరః వరత ఏవ భ##వేత్ప్ర కృత్యాః || 22

భేదసంసార ప్రవర్తకమైన ప్రకృతిచేత ఏ ప్రకారము మకార, రూపుడగు పశువుబద్ధుడో, ఆ ప్రకారము అభేద సంసార ప్రవర్తకమగు ప్రకృతిచేత, క్షకారరూప శివునకు బంధము భావింపబడుచుండగా ఎట్లు నియతబంధము కలిగిన క్షకార, మకారసామరస్యము ఉపాస్యముగా అంగీకరించి రని చెప్పుచున్నారు. మకారరూపుడైన జీవుడు, ప్రకృతి. ఆ ప్రకృతి చేత మ్రింగబడినవాడు. ప్రకృతిచే నిగర్ణుడు ప్రకృతియేగాని తదుత్తీర్ణుడుగాడు. హకారరూపమగు చిత్తుకూడ నివృత్తిరూపమైన ప్రకృతియే. ఆ ప్రకృతితో యతానుషంగము నలన అని భావము. క్షకారమైతే, ఈ ప్రకారము, రెండు విధములైన ప్రకృతులకు విశ్రమస్థానము. శుద్ధాంతర్ముఖతచే రెండు విధములైన సంసారకళలచే స్పృశింపబడలేదు. కనుక, ప్రకృతిచే ఆవరింపబడనివాడు. ఇంకను, ప్రకృతిచే ఆవరకుడని అభిప్రాయము. అందువలన క్షకారము పరశంభువు. ప్రకృతికంటె పరమందే ఉన్నవాడు. కానిప్రకృతికిలోబడిన వాడుగాడు. అందుచే క్షకారరూపుడు నిత్యముక్తుడు. ఆ క్షకారముయొక్క బహీరూపమే. హకారము అత్యంత బహీరూపము మకారము. ఆ ఇద్దరికే ప్రకృతిపారతంత్ర్య ముచే ప్రకృతిత్వము. క్షకారమునకు లేదు. అందుచే ఆ క్షకారమునకు ఉపస్యత్వము ఉచితమని భావము.

యద్వా శివః క్ష ఇహ మత్రియోగి భావా

త్సౌషుప్త మేవ పరశంభు పదం చిదాత్మా |

య చ్చక్రమధ్య పదతా తదధీశతా

శంభోస్తదస్య గుణగంథియా రత్స్యభావాత్‌ || 23

క్షకారమును మకారప్రతియోగి కనుక వికల్పగంధము దుర్నివారము. అందుచే శుద్ధనిర్వికల్పకమైన చిత్సుప్తిపదమే పరమతత్త్వము. అదియే ఉపాస్యమని తలంచువారిని ఆక్షేపించుచు చెప్పుచున్నారు. అట్లు కానిచో జీవప్రతిప్రాదికమైన మకారమునకు ప్రతియోగి భావమువలన అన్యోన్య వ్యాప్య వ్యాపక భావ సంసర్గవలన క్షకారము శివుడు. పరశివుడు మాత్రముకాడు. వికల్పగంధముయొక్క నైయ్యత్యము వలన నని భావము. చిన్మయమైన సుషుప్తియే పరశివతత్త్వము. ఈ చిన్మయసుషప్తి యందు వికల్పముయొక్క అత్యంతో చ్ఛదమును సాధించుటదుర్లభము. సాధించినను, పర్యవసానమునకు జడత్వము సంభవించును. జడము ఉపాస్యముకాదు. అందుచే వికల్పగంధము గలిగిన తత్త్వమే ఉపాస్యమని క్షకారమునకు మధ్యస్థితినిబట్టి విభావ్యమగు చక్రాధిష్ఠాతృత్వము. ఉపాస్యత్వము స్ఫుటీభూతమైనదని సమాధానము చెప్పుచున్నారు. క్షకారరూప శంభువునకు ఏ చక్రమధ్యమందు ప్రతిష్ఠయు, ఆ చక్రాధీశ్వరత్వము కలదో అది ఈ క్షకారరూప శివునకు గుణవాసన కలవాడగుట చేతనే సిద్ధమైనట్టి అర్చనాభావము వలన ఉపపాదింపబడుచున్నది. గుణగంధము కలవాడే అర్చింపదగినవాడు గాని నిర్గుణుడుకాడను ప్రతిపత్తియే. క్షకార శంభువునకు చక్రమధ్యస్థితి సంప్రదాయికము.

చంద్రాగ్ని భుక్చశిభు గగ్ని రధ స్సమత్వం

భానుః పదే పద ఇదం త్రితయం స్వరాదౌ |

ఖండత్రయాత్మక మఖండపదం చ తద్వ

త్తద్విశ్రమ శ్చ తిధిఖ స్సమసంఖ్య తైషామ్‌ || 24

పునఃపునః తిరుగుచున్నదశ##లే తిధులని, అట్టి తిధుల చేత కాలవ్యవస్థ చేయబడున్నది అనియు చెప్పబడుచున్నారు. తిధులు శుక్లపక్షమందు పదిహేను, కృష్ణపక్షమందు పదిహేను కలిసి ముప్పది, పునఃపునః తిరుగుచుండును. యోగదృష్టి యందు తిధులనగా దశ##లే. ఆ దశలకు తిధిసమానసంఖ్య సాంప్రదాయికోపదేశ గమ్యము. ఆ ప్రమేయము నుపదేశించుచున్నారు. చంద్రాగ్నిభుగిత్యాది సూత్రద్వయము. ప్రతి దశయందు దశానురూపమైన సంసారము పంచభూతాత్మక మైన కలాపముచేతనే ఏర్పడుచున్నది. ఆ భూతములు దశాస్వభావములే. జలతత్వాత్మకమైన చంద్రుడు సుషుప్తి రూపము వాయుతత్వాత్మకమైన సూర్యుడు జాగ్రద్రూపము. తేజస్త త్వాత్మకమైన వహ్ని స్వప్నరూపము. పృథివీతత్వాత్మకమైన ప్రకృతి గుణత్రయపర్యాయమైన తేజస్త్రయమునకు, బీజ భూతమైన తుర్యము. ఈకాశతత్త్వాత్మకమైన పురుషుడు సకల ప్రపంచమునకు బీజరూపమైన ప్రకృతికి విశ్రాంతిస్థానమైన తుర్యాతీతము. విచారింపగా, సుప్త్యాదుల యందు కళలు బాహుళ్యముగా నుండెను. అయినప్పటికిని ఆకళలు అన్నియు ఐదుతత్త్వములయందే అంతర్భవించును. కనుక, ప్రతిదశకు అవే అంగదశలు. సుషుప్తి జలము. సుషుప్తి జాగ్రత్‌ వాయువు. సుషుప్తి స్వప్నము వహ్ని. సుషుప్తి తుర్యము పృథివి. సుషుప్తి తుర్యాతీతము ఆకాశము. ఈ రీతిగా జాగ్రత్స్వస్నముల యందును అంగదశాపంచకస్వభావము కలదు. ఇట్లు ప్రవృత్తి రూపమైన సుషుప్తి జాగ్రత్స్వప్నములయందు ప్రతిదశ##పైన చెప్పిన ప్రకారము అంగదశాగణనము చేయగా, అవృత్తి సంసార పంచదశాంగముకది అగును. ఆ ప్రవృత్తి సంసారము యొక్క అంగములే శుక్ల పక్షములోని పంచదశతిధు లని వివేకము. పిమ్మట నివృత్తి సంసారమందు ప్రవృత్తి సంసారాంగకములకే నివృత్తి రూపత. కావున కృష్ణపక్షమందు పంచదశతిధు లగుచున్నవి. ప్రవృత్తి సంసారమందు వేద్య మయుడైన చంద్రునకు అభివృద్ధిగాన, ఆసంసారమునకు శుక్ల పక్షత. నివృత్తి సంసారమందు వేద్యమయుడైన చంద్రునకు క్షయముగాన నివృత్తిసంసారమునకు కృష్ణపక్షత అనివివేకము. సూత్రము యొక్క అక్షరార్థమేమన అగ్నివ్యాపకుడు, చంద్రుడు చంద్రవ్యాపకుడు అగ్ని. ఇది చంద్రాగ్నుల స్వభావోక్తి. కాని సర్వదశలయందు అగ్నిచే చంద్రకబళన మని, చంద్రునిచే అగ్ని కబళనమని వివక్షింపబడలేదు. అట్లు వివక్షించిన ప్రవృత్తి. నివృత్తి సుషుప్త్యాదుల యందు అగ్ని చంద్రకబళనముచేత శుక్లకృష్ణపక్షత్వసిద్ధికే వ్యాహతి వచ్చును. ఈ చంద్రాగ్నులకు సమానావస్థ సూర్యుడు సర్వ వర్గాదులయందు ప్రతిపదమందును, ఈమూడు సంసారకలాపమగుటచే నియతముగానుండును. ఆ చంద్రాదులవలెనే చంద్రాద్యాకారముగా భాసించు అఖండపదమైన ప్రకృతి పర్యాయ పృథివీరూపమును (చంద్రాగ్నులు గుణత్రమయ మైన ప్రకృతికి పర్యాయమైన పృథివియొక్క విలాసరూపులు అని వివేకము) ప్రకృతి గుణత్రయసమష్టిరూపము గనుక అఖండపదమగును. ఈ పదము గూడ ప్రతిపదమందు చంద్రాదిపదమువలెనే ఉన్నది. ఆ ప్రకృతి రూపపదమునకు విశ్రాంతిస్థానమైన ఆకాశరూపస్వాత్మతత్త్వము ప్రతిదశ యందు నియతముగా నుండునదే. ఏ దశలకు అంతదశా పంచకనైయత్వము చెప్పబడెను. దశలయందు నియతములైన ఈ అంగదశలకు తిధులతో సమానసంఖ్య యని తెలిసికొన వలెను.

భేదావిభేదసమతా తనుభి స్సుషుప్తిః

స్వప్న ప్రజాగర పదై స్త్రిగుణీకృతాభిః |

పృథ్వ్యాదిఖాంత తిధిభి ర్నను శుక్లపక్షః

కృష్ణస్తు జాగర పదాదిక తన్నివృత్త్యా || 25

భేదము, అభేదము తదుభయము సామ్యస్వరూపము లైన సుషుప్తి, స్వప్నప్రజాగరలచేత త్రిగుణీకృతములైన పృథివ్యాది ఆకాశాంత దశారూపములగు ఐదుతిధులచేత శుక్ల పక్షమగును. తుర్యదశయందు జాగ్రదాది ప్రవాహముచేత ఆ తిధులకు నివృత్తి రూపాంగీకారముచేత కృష్ణపక్షమగును. ఈరీతిగా సిద్ధుల సాంప్రదాయికమైన కాలవివేకమను యోగ మందు నిలిపినదృష్టిగల పురుషునకు కాలపంచకత్వము సిద్ధించును.

దేహాత్మికా ప్రకృతిరేవ పరావిమర్శా

సై#్సవ ప్రవృత్తి వినివృ త్యుభయాది భూతా |

వాగర్థమిశ్ర వపురిద్వనలార్య మత్ర

య్యైకైక యుక్త్రిపుటికా నవమూర్తి రేకా || 26

మహాప్రకృతి రూపిణి యగు పరారూప విమర్శశక్తి యొక్క ప్రతిబింబరూపమైన శ్రీచక్రమను విశేషరూపములైన అంగములు నవసంఖ్యాకములగుటచే నవచక్రసమవాయు రూపమని చెప్పుచున్నారు. పరాశక్తి దేవరూపిణి, ఇందుచే త్రిపురసుందరికి శరీరచక్రమే ముఖ్యము. ప్రకృతి స్వరసప్రవ హణలక్షణము గలిగిన పరాప్రాగ్రూపిణీ. ఈ ప్రకారము ప్రకృతి యని, పరావాక్కని, చెప్పబడినది విమర్శశక్తియే. ఆవిమర్శశక్తియే ప్రవృత్తి, నివృత్తి రూప సంసారద్వయమునకు కారణభూతురాలు. ప్రకృతియొక్క విలాసరూపము గనుక సర్వసంసారము ప్రకృతిమూలకము. కేవల పరావాగ్రూప మగుటవలన శబ్దరూపమేకాదు, అర్థరూపము, మిశ్రరూపము కూడ అగును. సమస్త వస్తువులకు శబ్దమే మూలము గనుక శబ్ద మందంతర్భావము. ఇట్టిది త్రిపురేశ్వరీ త్రిపుటయనప్రమేయ, ప్రమాణ ప్రమాతృసముదాయ లక్షణమైనది. చంద్రాగ్ని సూర్యులయొక్క త్రయముచేత ప్రత్యేకము కూడుకొన్నట్టిది. అనగా ప్రత్యేకము. ప్రవృత్తి రూపుడగు చంద్రునితో, నివృత్తి రూపుడగు అనలునితో కూడుకొనినది. ప్రమేయాది పుర త్రయీస్వరూపురాలగుచు యధార్థముగా విశ్రాంతిదశ యందు అద్వితీయురాలైనను, నవసంఖ్యాక స్వరూపభేదము కలది. జగమగుట వలన ప్రమేయరూపమగు చతుర్దశారాత్మక సుషుప్తి పురము విసర్గప్రాధాన్యము. బిందు ప్రాధాన్యమువలన ఉభయ ప్రధాన్యము, ప్రమాతృరూపమగు అష్ఠారాత్మక స్వప్నపురము కలదు. ఇట్లు నవచక్రవివేకము. ఈ చక్రము ఆయాదశారూపముచే నవవిధముగా ప్రకాశించు త్రిపురేశ్వరి బింబ మని యభిప్రాయము.

చైతన్యతా చ జడతా చ విమర్శచిత్యోః

తుల్యా యదింద్వనలయో రుభయం తదిచ్ఛా |

స్యాత్కర్మభావ గిళితం తు మిధోజడత్వా

జ్ఞానం తయో స్సమపదం చ తధా ద్విరూపమ్‌ || 2

శివుని సగుణస్వరూపమైన ప్రకృతినే ఉత్కృష్టముగ ఉపాసింపవలసిన దనుభావనచేత నవచక్రేశ్వరినిగా చెప్పి ఆ ప్రకృతికి చైత్యత్వప్రసిద్ధిచే ఉపాసించుటకు అనర్హమను శంక కలిగించుచున్న జడత్వప్రవాదమును తొలగించువారై చెప్పుచున్నారు. విమర్శప్రకాశలకు చైతన్యమును; జడత్వమును సమానము. రెంటికి ప్రత్యేకముగా చైతన్యము, జడత్వము సంభవించునని చమత్కారము. ఈ చమత్కార మన్యోన్య వ్యాప్తిచే వచ్చినది. వ్యాపకత్వమే చైతన్యము. వ్యాప్యమే జడము. రెంటికిని వ్యాపకత్వము. వ్యాప్యత్వము కలుగు చుండగా చిదచిద్భావ చమత్కారమును నిర్విశేషముగా అంగీకరింపవలెనని భావము. ఈ ప్రకాశవిమర్శద్వయమును ఇచ్ఛాజ్ఞానక్రియలే గాన విమర్శకును అజడత్వ ప్రతిపాదన మందు హేతువును చెప్పుచున్నారు. ఒక కారణము వలన చంద్రాగ్నులయొక్క ద్వయము. ఆ ప్రకాశవిమర్శలకు ఇచ్ఛఅగును. (ఆ ప్రకాశకు ఒకప్పుడు వ్యాపకత్వమందు అనలుడు ఇచ్ఛయగును. ఒకప్పుడు వ్యాప్యత్వమందుచంద్రుడు ఇచ్ఛయగును. విమర్శకును ఆ ప్రకారమే. విమర్శకు చంద్రుడే ఇచ్ఛ అని శంకించదగదు. ఆ విమర్శకు వ్యాపకదశయందు తదిచ్ఛయైన చంద్రునకు అగ్నివైభవము వచ్చుటవలన అగ్నిత్వమే. ప్రకాశయొక్క ఇచ్ఛయైన అగ్నికి తద్వ్యాప్య దశయందు చంద్రజాడ్యము ప్రాప్తించుటచే ఇందుత్వమే. ఈప్రకారము ప్రకాశవిమర్శలకు వ్యవహారపదమందు స్వరూపమైన అనలేందుద్వయముయొక్క అన్యోన్యము అభిలషింపదగిన ఇచ్ఛారూపముచేత ప్రత్యేకము జడాజడత్వమును చెప్పి అన్యోన్యము కర్తృకార్యరూపముచేత జడాజడత్వమును చెప్పుచున్నారు. పరస్పరము జడమగుట వలన వ్యాపింపబడుచున్నది. కర్తచేత కర్మ వ్యాపింప బడును. అందుచే పరస్పరము గ్రసితమగుచు, కర్మఅగును కర్త కూడ నగునని యర్థము. ఆ రెంటియొక్క సమానపదము అన్యోన్య విషయమగుటవలన తుల్యరూపమైనది. అటువంటి జ్ఞానము కూడ ఆ ప్రకారమే రెండురూపములు అగుచున్నది. అన్యోన్యము జ్ఞాతఅగును. జ్ఞానము కూడ అగునని యర్థము ఈ ప్రకారము విమర్శప్రకాశలకు ఇంద్వనలముల అభిలషింప దగిన ఇచ్ఛాభావమందు, కార్యకర్తృజభావమందు జ్ఞాతృజ్ఞేయ భావమందు; పరస్పరము విశేషములేకుండ ప్రకాశతత్త్వము అజడమని, విమర్శతత్త్వము జడమని, దురాగ్రహాము వివేక హీనతను ఆపాదించునని యర్థము.

పక్షద్వయేపి పరివృత్తి వశాత్త్రయణా

మిచ్ఛాదిక త్రితయతా ప్రతిధామ ధామ్నాం |

షట్స్వత్ర వృత్తిషు చ కారణ కార్యతాస్య

బిందుక్షయోర్మ బభయోః ప ఫ వర్గయోశ్చ || 28

ఖండత్రయాత్మకమైన మాతృకామహామంత్రము యొక్క ప్రతిఖండము ఉభయపక్షావర్తముచేత షడావర్త మును పొందగా ఖండములకు అన్యోన్యము ఆదిమధ్యాంతత్వము సహజమైనపుడు, అన్యోన్యకార్యకారణభావ చమత్కారము. చక్రాకారత కలుగునని ఈ రహస్యమును చెప్పుచున్నారు. మూడు పదములలో (అనగా మంత్ర ఖండములో) పక్షద్వయమందును (అనగా దక్షిణతః వామతః) ఆవృత్తివశము వలన ప్రతిపదము ఇచ్ఛాత్వము, జ్ఞానత్వము, క్రియాత్వము అగును. ఏ ఖండమునగాని ప్రారంభించిన దానికి ఇచ్ఛాత్వము, మధ్యదానికి జ్ఞానత్వము, చివరదానికి క్రియాత్వము, అని వివేకము. ఈఖండత్రయమందు ఆరైనప్రవృత్తుల యందు స్వరవర్గ యందున్న బిందువునకు వ్యాపకవర్గయందు సన్ని వేశము గల్గిన క్షకారమునకు వ్యాపకవర్గయందు సన్నివేశము కల్గినమకార మునకు స్పర్శవర్గయందు సన్నివేశము గల్గిన బకార, భకార, యుగళమునకు, స్పర్శవర్గయందున్న పకార, ఫకారయుగళ మునకు, స్వరవర్గ యందున్న విసర్గకును అన్యోన్యము కార్య కారణభావము కలదు. ప్రతిఖండము హృదయప్రదేశము నుండి ప్రాణమువలె ఆవర్తోదయమగును. ప్రతిఖండమునకు హృదయప్రదేశమందు బిందువిసర్గలుండును. స్వరవర్గ యొక్క ఉదరమందు అంఅః అను బిందువిసర్గ లుండును. స్పర్శవర్గముయొక్క ఉదరమందు చతురస్రచక్ర సన్నివిష్టము లైన ప్రకృత్యహంకారబుద్ధి మనః ప్రతిపాదకములైన ప, ఫ, బ, భలలో విసర్గ స్థానీయ మ, ప, ఫ లు, బిందుస్థానీయములు. బ, భ లు వ్యాపకవర్గయొక్క ఉదరమందు మకార, క్షకార ములు విసర్గబిందుస్థానీయములు. ఇట్లుండ స్వరములయందు బిందువు ప్రారంభించి ప్రతిలోమావర్తముచేత వ్యాపకవర్గ యందున్న క్షకారపర్యంతము ఆవర్తము. అపుడు బిందువు కారణము, క్షకారము కార్యము. క్షకారమును ప్రారంభించి అనులోమావర్తముచేత బిందుపర్యవసానమందు క్షకారము కారణము. బిందువు కార్యము. స్వతోదరగతమైన విసర్గ ప్రారంభించిన స్పర్శోదరగతమైన ప ఫలవర్గరూపవిసర్గాంతము, అనులోమావర్తమందు స్వవర్గయందున్న విసర్గ కారణము, ప ఫ కారరూపవిసర్గ కార్యము. ప ఫ రూపవిసర్గతో ప్రారంభించిన స్వరస్థవిసర్గాంతము ప్రతిలోమావర్తమందు ప ఫవిసర్గ కారణము. స్వరస్థవిసర్గ కార్యము. స్వర్శోదరగతమైన బ భ వర్గరూపమైన బిందువుతో ప్రారంభించి అనులోమముచేత వ్యాపకవర్గోదరస్థ మకారబిందుపర్యంతము ఆవర్తమైనపుడు బభరూపబిందువు కారణము. బభరూపబిందువు కార్యము. ఈ ప్రకారము వివేకము. ఇచట బిందుక్షకారములకు బిందుత్వము శుద్ధము. విసర్గ ప ఫవర్ణయుగ్మమునకు విసర్గ త్వముశుద్ధము. బభవర్ణయుగ్మ మకారములకు సాంకర్యము చేత బిందుత్వము, విసర్గత్వమని సాంప్రదాయికోపదేశము. ప్రమేయ, ప్రమాణ, ప్రమాత్మ, ఖండములలో ప్రతిఖండము నకు మూలత్వాభ్యుపగత సిద్ధాంతము సిద్ధులచేత అనుభ వానురోధముచే అంగీకరింపబడినది. అనుభవము ఇట్లే ఘటపటాది స్ఫురణము, చక్షురాది స్ఫురణము, ప్రమాతృస్ఫురణము అను వాటిని భావించి క్రమముగా అనుభవింపబడును. అందు ఒకరు ఘటస్ఫురణమును ప్రధానముగా తలంతురు. ఇంకొకరు ఇంద్రియస్ఫురణను వేరొకరు ప్రమాతృస్ఫురణను ఇట్లు వారి వారి ప్రతిభయందు వ్యవస్థాపితమైన సిద్ధాంత త్రయము ప్రతిషేధవిషయ మగుచుండగా సైద్ధసిద్ధాంతము ప్రకాశవిమర్శ చమత్కారభూతమైన ఘటపటాదిస్ఫురణ యందు సిద్ధాంతత్రయసమిష్టి గనే చెప్పుచున్నదని వివేకము.

చంద్రాగ్ని విశ్రమణయో స్స్వరయాది ధామ్నో

ర్విశ్వస్య బీజదశయోః ప్రథమే పదే చిత్‌ |

చైత్యే నిమజ్జతి పరత్ర చితౌ తు చైత్య

మేత త్సమస్త ముభయో ల్లసితే తు భానౌ || 29

చైత్యమందు నిమగ్నమైన చిత్స్వరూపము గల్గిన చతుర్దశారస్వరూపమగు సుప్త్యాత్మకమైన శాక్తేయమగు స్వర ఖండమును ప్రధానముగా పూజించుట శాక్తసిద్ధాంతము. చిత్తునందు నిమగ్నమైన చైత్యస్వరూపమును కల్గిన అష్టారాత్మక మగు స్వప్నాత్మక శివసంబంధవ్యాపకఖండమును ప్రధానముగా పూజించుట శైవసిదాంతము. చతురశ్రగర్భిత దశార ద్వయవిన్యాసము కల్గిన జాగ్రదాత్మక స్పర్శఖండమునకు పశుదశ అను శంకచేత ప్రధానముగా పూజించుట అవివేక జనము. ఇది ఉపేక్షావిషయమగునని ఆ ఖండమునే ముఖ్యముగా పూజించుటయందు ఔచిత్యము సాంప్రదాయికమని సూత్రచతుష్టయముచేత చెప్పుచున్నారు. చంద్రాగ్నులకు విశ్రాంతి స్థానములైన స్వరవర్గవ్యాపక వర్గాత్మక పదములగు విసర్గయైన చంద్రునకు విశ్రాంతిస్థానము స్వరవర్ణ పదము. బిందురూపమగు అగ్నికి విశ్రాంతిస్థానము వ్యాపక వర్గపదము. స్వరవర్గయందు చిత్తుయొక్క నిగరణముచే చైత్యమున కేకాధిపత్యము. వ్యాపకవర్గయందు చైత్యము యొక్క నిగరణముచే చిత్తునకు ఏకత్రత అనిభావము. ప్రపంచముయొక్క బీజదశలలో చైత్యము విశ్రమచిద్విశ్రమ పదములకు ప్రత్యేకము విశ్వబీజత్వము. విశ్వము విమర్శ మయముగను, ప్రకాశమయముగాను అనుభవమువలన తెలియనగును. స్వరపదమందు చిత్తు చైత్యమందు మునిగి పోవును. చిత్తుయొక్క దర్శనము లేదు. వ్యాపకవర్గమపదమందైతే చైత్యము చిత్తునందు మునిగిపోవును. చైత్యము కనబడదు. చిచ్చైత్యములరెంటికి ఉల్లాసరూపమైన స్పర్శఖండమందైతే ఈ చిచ్చైత్యములు రెండును సమముగానుండును. చిచ్చైత్య ములు రెండును అన్యోన్యము అని గీర్ణ స్వరూపమగుచు కలిసి కనబడుచుండును. శివశక్తుల ఇద్దరికి దర్శనస్థానముగాన, భాను రూపమైన జాగ్రచ్చక్రమే ప్రధానముగా ముందు పూజనీయ మని వివేకము.

ఇందౌ చ హవ్యభుజి చో దరసేమ్ని యత్స్వా

చ్చక్రద్వయం చిదచిద భ్యవమర్దరూపం |

బింబద్వయో ర్యుగళ##మేత దశీత భానో

ర్బింబస్థలే హి చతురస్రతయా సమస్తమ్‌ || 30

చతుర్దశారచక్రమందు గర్భితమైన చిత్స్వరూపముగల చైత్యము అష్ఠారమందు గర్భితమైన చైత్యస్వరూపము గల చిత్తు (అనగా ఈ చక్రద్వయాధిష్ఠాతృభూతమగు దేవతా యుగళము) దశారద్వయమునకు అధిష్ఠాతృభూతమైన చతురస్ర చక్రమందు కలిసికొనెను. అందువలననే ఈ చక్రమునకు చతురస్రభావమనినారు. చతుర్దశారచక్రమందు అష్ఠారచక్ర మందును బింబస్థలమందు రశ్మిచక్రమధ్యయందు బింబచక్ర స్థితిగనుక ఏ చక్రద్వయము కలదు. (అనగా ప్రతిచక్రము యొక్క ఉదరమందు చక్రద్వయము కలదని యర్థము.) చతుర్దశారముయొక్క ఉదరమందు అష్టదళ, షోడశదళాత్మకమైన చిచ్చైత్యరూపచక్రద్వయము. అష్టారముయొక్క ఉదరమందు త్రికోణబిందురూపమైన చైత్యచిదాత్మక చక్రద్వయము. ఆ చక్రద్వయమెట్టిదన, చిచ్చైత్యములయొక్క అన్యోన్యక్రమణ కేనమైనది. చతుర్దవారమందు షోడశదళాత్మకమైన చైత్య చక్రముచేత అష్టదళాత్మక చిచ్చక్రాక్రమణము. అందు వలననే షోడశదళమునకు బాహ్యమందు రశ్మిరూపముగా అష్టదళముయొక్క అవస్థానము. అష్టారమందు బిందు రూపచిచ్చక్రముచే త్రికోణాత్మక చైత్యచక్రముయొక్క ఆక్రమణము. అందువలననే బిందువునకు బాహ్యామందు రశ్మిరూపముగా త్రికోణముయొక్క అవస్థానము. ఈప్రకారముగా నున్న అష్టదళ షోడశదళాత్మక త్రికోణబిందాత్మక చక్రద్వయముయొక్క యుగళము. కలిసిచతురూపమైనది. సూర్యునియొక్క దశారద్వయముయొక్క ఉదరమందు చతురస్రరూపముచేత కలిసికొని యున్నది. అష్టదళ, షోడశ దళ, త్రికోణబిందురూపమైన చక్రచతుష్టయము చతురస్ర మందు చతుష్కోణ రూపముగా నున్నది. అందుచే చతురస్రము ప్రాధాన్యముగా పూజింపవలసినదని నిష్కర్ష.

తస్మా చ్చతుష్పద మిదం చతురశ్రబింబం

చిచ్చైత్య నిర్జర సరిద్యమునా ప్రయాగః |

అర్చ్యం భ##లేత్ప్రధమతో7ధ తదంగభూత

చిచ్చైత్య చక్రయజనం త్వితి పూర్వత స్తత్‌ || 31

చతురశ్రచక్రము పైన చెప్పిన ఉపపత్తి చేత ముందుగా పూజించుటను దృఢపరచుచున్నారు. పైసూత్రమందు చెప్పిన ఉపపత్తివలన అంగాంగిరూపముతో ఉన్నటువంటి దేవతా చతుష్టయముయొక్క సమవాయస్థలమైన ఈ చతురశ్రబింబము చిచ్చైత్యములను భాగీరధీ, యమునలయొక్క సంగమస్థానమైన పుణ్యతమమగు తీర్ధవిశేషము. చిత్తు స్వచ్చమైనది గాన ధావళ్యము చేత భాగీరథీసామ్యము. చైత్యము సంసారరూపమగుటచేత కళంకితమైనదిగాన నైల్యముచేత యమునా సామ్యము. ప్రయాగ యనగా గంగాయమునల యొక్క సంగమరూపమైన పుణ్యతమమగు తీర్థవిశేషము. చతురశ్రబింబముగూడ ఆ ప్రకారమే పుణ్యతమమైనది. అచట నిమజ్జనముచే అపుడే దేవతాభావ మేర్పడును. ఆ ప్రకారము నిరూపింపబడినది. ముందుగా పూజింపదగినది అగును. చతురశ్రమమును పూజించిన తర్వాత ఆ చతురశ్రచక్రమునకు అంగభూతములైన అష్టార, చతుర్దశారములయొక్క యజనమని ఆ చతురశ్రచక్రము, ప్రముఖముగా కల్పింపబడినది. అనగా పురత్రయాత్మకమగు శ్రీచక్రమందు చతురశ్రమే ముందుగా పూజింపవలసినదను ఉపదేశముకొరకు చక్రము యొక్క ప్రముఖపదమందు సర్వచక్రవ్యాపకస్థము గాన బాహ్యపదమందు కల్పించబడినది. చతురశ్రచక్రముయొక్క నైసర్గికస్థితి అయితే, చతుర్దశార; అష్టారమధ్యదేశమందు ముందుగా పూజింపవలెనను ఉత్పాదన కొరకు ఆ చక్రములకు వ్యాపకత్వేన అభిమతైన బామ్యస్ధలమందు సన్నివేశము చూపబడిన దనిభావము. చతురశ్రచక్ర మనగా దశార ద్వయమునకు ఉపలక్షణము. రశ్మిచక్రములేకుండా బింబచక్ర ముండుట అనుపపన్నము.

అంతస్థ మేవ చతురశ్ర ముషర్భుధేంద్వో

రర్కాత్మకం చిదచిదుద్భవ మేత దంగమ్‌ |

ఏవం చ సత్యపి జడాజడ సార మేత త్ర్పా

గేవ పూజ్యమితి పూర్ణపదే కృతం తత్‌ || 32

చతురశ్రముచేత ఉపలక్షితమైన జాగ్రచ్చక్రము యొక్క బహిఃసన్ని వేశ శిష్యవ్యుత్పాదనకొరకే. వుత్పన్నుడు ఈ కల్పనను అనుసరించుచు మధ్యనున్న చతురశ్రచక్రమే ప్రధానదృష్టిచేత ముందుగా పూజింపవలసినదను సిద్ధికొరకు బాహ్యమందు సన్నివేశమును కల్పించినారు. వాయమను పరిహరించుచున్నారు. దశారద్వయముయొక్క ఉదరమందు నియతసన్నివేశము గలిగిన చతురశ్రచక్రము అష్టార చతుర్దశారములచేత ఉపక్షితములైన అగ్ని చంద్రులయొక్క మధ్య యందే కలదు. ఏ వకారము చేతనై యత్నము చెప్పబడినది, గాని బహిర్దేశమందు దాని సన్నివేశమును శంకింప పనిలేదు. చిదచిత్తువలన ఉద్భువమైనది. ఈ అగ్నిచంద్రులకు అంగమైనది. చతురశ్రము భానురూపము. భానుడు అగ్ని చంద్రులకు అంగము, అగ్ని చంద్రాధీనమైన, సిద్ధికలవాడు. కాన ఈ రీతి చతురశ్రము అంగమైనను, చంద్రాగ్నితత్త్వముల యొక్క సారభూతమైన చతురశ్రరూపమైన అంగము. ముందుగానే పూజింపదగిన దను వుత్పాదనకొరకు ఆ చతురశ్రచక్రము వ్యాప్తి స్థలమందు అనగా బాహ్యదేశమందు, సన్నివేశితమై నది. ఆదిసిద్ధునిచేత'నని అధ్యాహార్యము. ఎవరు మూలాంకురాపేక్షయా మధ్యనున్న బీజమును వలె చతురశ్రోపలక్షిత మైన మధ్యచక్రమునే ఉపాసింపదగిన దని తలంతురో; వారు చతురశ్రమము మధ్యనున్నప్పటికిని, బీజప్రాధాన్యదృష్టిచే ముందుగానే అర్చింతురు. ఎవరు ఈ స్థలమందు అవ్యుత్పన్నులో వారిని గురించియే చతురశ్రచక్రమునకు ఈ బహిసన్నివేశ రూపకల్పన. చక్రమందున్నట్లుగనే వ్యాఖ్యను చేసినపుడు ప్రత్యవాయములేదని తాత్పర్యము.

ఇక అష్టదళ, షోడశదళములకు చతుర్దశారమధ్య యందే సన్నివేశము అయితే చితురశ్రమునకు ఉత్తరభాగ మందు ఆ రెంటియొక్క కల్పన. చతురశ్రయజనానంతరము చతుర్దశార, అష్టారముల అర్యనచేయదగినది. చతురశ్రమన్నప్పుడు దశారద్వయమునకు ఉపలక్షకమే. చతుర్దశారో పలక్షకత్వముచేత షోడశదళము, అష్టారోపలక్షకముగా అష్లదళము కూడ శిష్యులయొక్క వ్యుత్పాదనకొరకు బాహ్య మందు కల్పింపబడినవని తెలియవలెను. సుషుప్తి జాగ్రత్స్వ ప్నాత్మకమైన చక్రత్రయమును ప్రత్యేకము ప్రధానముగా పూజింపవచ్చును. ఆ త్రయమందు చతుర్దశారాత్మకమైన సుషుప్తి చక్రముయొక్క వ్యాప్తి స్థలమందు అనగా బహిర్దేశ మందు స్థితిచేత ప్రాధాన్యము తోచుచుండును. విలోమ సంప్రదాయమును బట్టి అష్టదళాత్మక స్వప్న చక్రము ప్రధాన మనిపించును. తదుభయమధ్యపతితమైన జాగ్రచ్చక్రమునకు బీజనివేశన్యాయము వలన, ఎవరు ప్రధానమని ఎంచెదరో, వారికి జాగ్రత్సుప్తి స్వప్నోపలక్షితములైన చతురస్ర, షోడశ దళ, అష్టదళముల బహిః సన్నివేశ కల్పనను అనుసరింప నక్కరలేదు. ఎవరీ విషయములో అవ్యుత్పన్నులో, వారిని గురించి జాగ్రచ్చక్రమ ప్రధానమని బాహ్యమందు చతురస్రాది చక్రత్రయమును సన్నివేశ వశమున చూపించినారు. కావున ఈ కల్పన వ్యుత్పాదనమాత్ర పరమైనది. సన్నివేశ కల్పనను గుర్తించిన సాధకులచే చతుర్దశారపర్యంతమే శ్రీ చక్రమందు సుషుప్త్యాది చక్రత్రయసంచారము చేయదగినది.

ఇతి పరమరహస్యం మాతృకార్థస్వరూపం

స్ఫుటపదముపద ముపదిష్టం చక్రరాజాభినీతమ్‌ |

లగతి యదయ మర్థః శక్తివిద్దే7ంతరంగే

న తు పున రపరత్ర ప్రత్యవాయో న చాత్ర || 33

ఇతి శ్రీస్వతంత్రానందనాథ విరచిత శ్రీమాతృకాచక్రవివేకః సమాప్తః

పరమరహస్యమైనది శ్రీమాతృకాచక్ర స్వరూపము. శ్రీ చక్రరాజమున గల భావమును స్ఫుటముగా ఈ రీతిన ఉపదేశించినారు. శక్తి విద్ధమగు అంతరంగమున ఈ అర్థము బాగుగా నాటుకొనినచో ఎట్టి ప్రత్యవాయము కలుగజాలదు.

ఇది శ్రీస్వతంత్రానందనాథ విరచితమగు శ్రీమాతృకాచక్ర వివేక మందలి తురీయవివేకమను ఐదవ స్కంధమునకు ఆంధ్రవివృతి.

విమర్శానందనాథేన విరజానందపుత్రేణ |

మాతృకాచక్ర వివృతౌ స్కంధో7యం పంచమః స్మృతః ||

స్వతంత్రానందనాథేనరహస్యం మాతృకాచక్రస్య |

స్కంధేషు పంచమేష్వేవసమగ్రం ప్రతిపాదితమ్‌ ||

శివానందమునినాచ దేశికాదేశవర్తినా

వ్యాఖ్యాతమిద మపూర్వం గ్రంథో7యం పూర్ణతాగతా.

విరజానంద దేశికైః ఉపదిష్ట రహస్యకమ్‌

విమర్శానందనాథేన ఆంధ్రీకృతం యథామతి.

శ్రీ స్వతంత్రానందనాథ విరచితమగు శ్రీమాతృకాచక్ర

వివేకమునకు ఆంధ్రవివృతి సమాప్తము

***

Sri Matrukachakra viveka    Chapters