SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణనమః

2. కేనోపనిషత్తు

ఈ ఉపనిషత్తు సామవేదములోని తలవకార బ్రాహ్మణములోనిది -ఇందు కేన అని ప్రశ్నవచ్చుటచే దీనిని కేనోపనిషత్తు అందురు. ఇందతు నిగూఢమగు పరబ్రహ్మతత్వమును గురు శిష్య సంవాదరూపమున తత్వ వివేచన చేయుట జరిగినది.

శాంతి పాఠము:- హే పరమాత్మా! నాయొక్క సర్వాంగములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణసమూహము, మానసికశక్తులు, పుష్టిని, ఓజస్సును, వృద్ధినిపొందుగాక, ఉపనిషత్తులలో వర్ణిత పరబ్రహ్మకు, నాకు నిత్యసంబంధము. ఎల్లపుడు ఉండి ప్రతి పాదిత ధర్మములు నాయందు ఎల్లపుడు, ప్రకాశితములై యుండి త్రివిధ తాపములు తొలగించుగాక.

ప్రధమ ఖండము:- 1) జడరూప అంతఃకరణము, ప్రాణము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు తమతమ పనిని చేయుటకు యోగ్యతనిచ్చు సర్వశక్తివంతమగుచేతన మేది? అది ఎవరు? ఎట్లుండును.

2) మనస్సు, ప్రాణము, సమస్త ఇంద్రియములు, సమస్త జగత్తుకు పరమకారణ భూతుడు, ఎవనిచే ఇవి ఉత్పన్నమై శక్తినిపొంది తమ తమ కార్యములను నిర్వర్తించుటకు సమర్ధమో, ఎవరు దీనిని సంపూర్ణముగా తెలిసికొనిన పరబ్రహ్మపురుషోత్తముడే వీటన్నిటికి ప్రేరకము. ఇది తెలిసిన జ్ఞానులు జన్మ మృత్యు రహిత విదేహ ముక్తి, జీవన్ముక్తి పొందెదరు.

3) సచ్చిదానందపరబ్రహ్మగు అంత, కరణాది ఇంద్రియములు తెలిసికొనలేవు. అట్టి అలౌకిక దివ్యశక్తిలో ప్రవేశించలేవు. కాని వీనిలో చేతన క్రియ ఆపరబ్రహ్మ ప్రేరణ చేతనే, శక్తి చేతనే సాద్యము. కావున ఇంద్రియములు ఆ పరబ్రహ్మము ఇట్టివాడని ఎట్లు చెప్పగలవు? పరబ్రహ్మ జడచేతన తత్వములకంటె భిన్నుడు. ఆ స్వరూప తత్వము చెప్పనలవికానిది.

4) వాణిద్వారా తెలుపబడు, ఉపాసింపబడు తత్వము బ్రహ్మయొక్క వాస్తవిక స్వరూపముకాదు. ఎవరి ప్రేరణచే మాట్లాడు శక్తి వచ్చుచున్నదో, ఎవరు వాణి ద్వారా తెలుసు కోబడు ప్రేరక ప్రవర్తకులో అతడే పరబ్రహ్మ.

5) పరబ్రహ్మ మనస్సు, బుద్ధికంటె అతీతుడు. మనస్సు బుద్ధిచే తెలుసు కోబడును. మననము చేయుట, నిశ్చయించు శక్తి నిచ్చువాడే పరబ్రహ్మ.

6) చక్షర్విషయమగు చూచుట, తెలుసుకొనుట అను ప్రేరణ శక్తి నిచ్చువాడే పరమాత్మ.

7) శ్రవణాది కార్యములు నొనరించుటకు, శక్తి, ప్రేరణ నిచ్చువాడే పరమాత్మ.

8) ప్రాణముల యొక్క జ్ఞాత, ప్రేరకుడు, శక్తినిచ్చువాడే సర్వశక్తివంతుడగు పరమాత్మ. పరమాత్మను మనోబుద్ధ్యాదులకు అతీతుడని సంకేత భాషలో చెప్పుటచే సర్వశక్తి ప్రదాత, ప్రేరకుడు, ప్రవర్తకుడు, నిత్య, అప్రాకృత పరమ తత్వమే పరబ్రహ్మ పరమాత్మ.

ద్వితీయ ఖండము:-

1) పరబ్రహ్మయొక్క అంశమాత్రమే జీవాత్మ, మనస్సు, బుద్ధి, ప్రాణము, ఇంద్రియములందు కేవల పరబ్రహ్మ యొక్క అంశమాత్రముచేతనే తమతమ కర్మల చేయుటకు సమర్థమగుచున్నవి. జీవాత్మ సమస్త బ్రహ్మాండమునందు వ్యాపించిన శక్తి బ్రహ్మయొక్క ఒకఅంశమాత్రమే.

2) బ్రహ్మను గూర్చి తెలిసికొనలేదు. తెలిసికొన్నాను అనికూడా చెప్పలేము. బ్రహ్మ తత్వమును తెలిసికొనిన వారు మాత్రమే బ్రహ్మను గూర్చి తెలిసికొందురు.

3) పరమేశ్వర సాక్షాత్కారము పొందినవారు కూడా నేను పరమేశ్వరుని తెలిసికొన్నానని కొంచెము కూడ గర్వపడరు. వారు పరమాత్మ యొక్క అనంత మహిమా సాగరమున నిమగ్నులై యుందురు. పరమాత్మ స్వయం వేద్యుడు. పరమాత్మను తెలిసికొన్నానను వారు. భ్రమలోనుందురు. పరమాత్మ జ్ఞానాతీతుడు.

4) పరమాత్మ జ్ఞానము కలిగించు జ్ఞానరూపశక్తి మానవునకు అంతర్యామియగు పరమాతమ నుండియే లభించును. బ్రహ్మవిద్య చేతనే అమృత రూప పరబ్రహ్మ ప్రాప్తికలుగును.

5) మానవ జన్మ అత్యంత దుర్లభము. ఈ జన్మలోనే పరమాత్మ ప్రాప్తికి సాధనాతత్సరుడై మానవజన్మను సార్థకము చేసుకోవలెను. భగవత్కృపచేతనే ఇది సాధ్యము. త్రివిధతాపములు భాధలు నశించి జన్మమరణ చక్రమునుండి విడివడవలెను. ఇతర జన్మలు భోగముకొరకేగాని మోక్ష సాధనకు గాదు. కావున శ్రీఘ్రతి శ్రీఘ్రముగా పరమాత్మ సాక్షాత్కారము పొంది పరమ పదము నొందవలెను.

తృతీయ ఖండము:- బ్రహ్మయొక్క ఏకాంశసూత్రము చేతనే జీవాత్మ, మనస్సు, ప్రాణము, ఇంద్రియాదులు వాని దేవతలు అణు ప్రాణితులై ప్రేరేపింపబడి, శక్తిని పొంది కార్యక్ష మత కలిగి యున్నారు, అని తెలిసి మూడవ ప్రకరణములోని విశ్వముతో ఏప్రాణియు శక్తివంతము, సుందరము, ప్రియమునై జీవన సాఫల్యము పొందినట్లు కనబడుట పరబ్రహ్మయొక్క ఆంశిక ప్రభావమే. ఈ విషయమున అభిమానముచెందువారు గొప్ప తప్పు చేయుచున్నారని దృష్టాంతముగా--

1-12) పరబ్రహ్మ పరమాత్మ దేవతలయందు దయచే శక్తి ప్రదానము చేయగా వారు అసురులపై విజయము సాధించిరి. కాని వారు అది తమయొక్క మహిమయే యని గర్వించసాగిరి. దేవతల విద్యాభిమానము తొలగించుటకు వానిని పతనమునుండి రక్షించి యధార్థ జ్ఞానము కలిగించుటకు యక్ష రూపమున ప్రత్యక్షమైన నాతని తెలిసికొనుటకు , తేజస్వి , వేదార్థ జ్ఞాతయగు జాతవేదుడగు అగ్ని ఆతని సమీపించెను. యక్షుడాతని నీవెవరవు అని ప్రశ్నింప నేను తేజోరూప అగ్నిదేవతననెను. మరియు సమస్తమును జ్వలింపజేసి భస్మము చేయ గనని పలికెను. అయినచో ఈ గడ్డిపోచను, దగ్ధము చేయమని యక్షుడనగా తనకా దాహకశక్తి పరమాత్మ నుండి ప్రాప్తించినదని తెలియని అగ్ని ఎంత ప్రయత్నించినను, గడ్డి పోచను కాల్చలేక హత ప్రజ్ఞుడై లజ్జచే మాడ బడిన శిరముతో దేవతలచేరి నేనాయక్షుని పూర్తిగా తెలిసకొనలేకపోతిననెను. అయితే వాయుదేవుడుకూడ గడ్డిపోచను ఎగుర గొట్టలేక పోయెను. అంతట దేవేంద్రుడు యక్షుని చేరి నతోడనే వార్తాలాపము చేయక దేవలలో ఈఒక్క దోషము తప్ప అన్ని విధముల అధికారియని బ్రహ్మతత్వ జ్ఞానము కలిగించుటకొరకు స్వయముగా అంతర్ధానమొందెను. ఇంద్రుడు అచటనేయుండగా యక్షుని స్థానములో హిమవత్పత్రి ఉమాదేవి ప్రత్యక్షమాయెను. ఇంద్రుడు ఆమెను సమీపించి, భగవతీమాతా! నీవు సర్వజ్ఞ శిరోమణి శంకర స్వరూపు శక్తివి. మీకు ఈ విషయములన్నియు విదితములే దయచేసి, ఈ యక్షుడెవరు? దర్శన మిచ్చి మరల అంతర్థాన మొందెను. ఇందు కారణము తెలుపవలెను.

చతుర్థ ఖండము:- 1) దేవరాజా! మీరు చూచిన పురుషుడు సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వరుడు. పరబ్రహ్మ ప్రదత్త శక్తి చేతనే మీరు అసురులపై విజయము సాధించి అదిమీ గొప్పయే యనుకొని మిధ్యా భిమానముతో గర్వించుచున్నారు. మీమిధ్యాభిమానము నశింప జేసి మీకళ్యాణముకొరకు యక్షరూపమున ప్రత్యక్షమై అగ్ని, వాయువుల గర్వమండంచెను. మీకు వాస్తవిక జ్ఞానమునొసగుటకు నన్ను ప్రేరేపించెను. ఇదంతయు పరమాత్మ శక్తియేగాని మీశక్తి కాదని తెలిసికొనుడు.

2) సమస్త దేవతలలోను అగ్ని, వాయువు, ఇంద్రుడే శ్రేష్ఠులు, కావున వారికి బ్రహ్మ సాక్షాత్కారము కలిగెను. సౌభాగ్యవంతులకు మహాపురుషులకు మాత్రమే భగవానుని దివ్యదర్శన స్పర్శన వార్తాలాపన భాగ్యము కలుగును.

3) అగ్ని, వాయువు లిరువురికి పరబ్రహ్మసాక్షాత్కారము వార్తా లాపన భాగ్యము కలిగినను స్వరూప జ్ఞానము కలుగలేదు. భఫగవతి ఉమాదేవి ద్వారా ఇంద్రునకు పరతత్వ జ్ఞానము కలిగెను. ఇంద్రుని ద్వారా అగ్ని వాయువు లేకాక అన్య దేవతలు కూడా తత్వ జ్ఞానము పొందిరి. సాక్షాత్కార వార్తాలాపన భాగ్యముచే అగ్ని వాయువులు దేవతలయందు శ్రేష్టులైనను తత్వజ్ఞానము తెలిసికొన్న ఇంద్రుడు సర్వశ్రేష్ఠుడు.

4) పైతెలిసిన ఆర్మాయుక వలన మనకు తెలియునదేమనగా భక్త సాధకుని కన్నుల ఎదుట హృదయములోను మొట్ట మొదట భగవంతుని నిరాకారసాకార రూప దర్శనాను భవము కలిగి ఆనందాశ్చర్య చకితుడగును. ఆతని హృదయములో తన ఆరాధ్య దేవతను సత్యనారంతము దర్శింప మిష్టమగు అభిలాష కలుగును. క్షణమైనను ఇష్టదేవత దర్శనముకానిదే శాంతి లభింపదు. అట్టి తరుణమున పరమాత్మ మెరుపు వలె ప్రత్యక్షమై భక్తుని కడపొందును.

5) సాధకుడు తన ఆరాద్య దైవమును పొందును నిరంతరము నిర్గుణ సగుణ స్వరూప జలతన చేయుట ప్రత్యక్షాను భూతి పొందును. ఆతని హృదయమున ఇష్టదేవతయగు అత్యం త ప్రీతి జనించి క్షణ కాలమైనను మరువలేని అతిశయ క్యాకులతో సదా ప్రేమ పూర్వక స్మరణచేయును.

6) ఆనంద స్వరూప పరబ్రహ్మ పరమేశ్వరుడు అందరికి ప్రియుడే, ఆతని పొందవలెనని సూక్ష్మరూపమున వెదకుచుదుమ రూప నవిషయముల యందు పరిభ్రమించుచుండును. ఈ రహస్యము తెలిసికొని పరమాత్మ ప్రాణిసూత్ర ప్రియుడని నిత్యనిరంతర చింతన చేయుచు ఆనందస్వరూపు సర్వప్రియ పరమాత్మ సాక్షాత్కారము పొంది స్వయముగా ఆనందమయుడగుట కావున జగత్తునందలి సర్వ ప్రాణులు ఆతనిని పరమ ఆత్మీయుడుగా నెంచి ప్రేమతో హృదయమున కొలచెదరు.

7) గురు దేవుని సాంకేతిక భాషలో బ్రహ్మ విద్య యొక్క శ్రేష్ఠతను ఉపదేశము విన్నను పూర్తిగా నా హృదయమందు చేసికొనలోక మరల బ్రహ్మ నిద్యోపదేశము చేయుడని ప్రార్థించెను. అంతట గురువర్యులు నాయనా నీకు పూర్తిగా, బ్రహ్మ విద్యనుపదేశించితినని సునిశ్చిత ముగా తెలిసికొమనెను.

8) కేవలము వినుట, చదువుట తో ఎవరు బ్రహ్మజ్ఞానులు కాలేరు. బ్రహ్వవిద్యను, తమపు, దమము, కర్మమొదలగునవి సాధనములు.సాధకుడు సాధన సంపత్తి యొక్క రక్షణార్థము అనేక కష్టములను సహర్షముగా స్వీకరించి ఇంద్రియములను బాగుగా వశపరచుకొని, నిష్కామభావముతో అనాసక్తుడై వర్ణాశ్రమోచిత కర్తవ్యకర్మల నిర్వర్తించుచు సాధనా తత్పరుడు కావలెను. వేదముల యందు బ్రహ్మవిద్య అంగప్రత్యంగ సహితముగా వర్ణింపబడుటచే సాంగోపాంగ వేదాద్యయనము చేయవలెను. అట్లు చేయువారు సచ్చిదానంద పర బ్రహ్మను పొందెదరు.

9) పై విధముగా ఉపనిషద్రూప బ్రహ్మ విద్యారహస్యములు తెలిసికొని తదను సారముగా సాధనా ప్రవృత్తులై, సమస్త శుభాశుభ కర్మల పరిత్యజించి, నిత్య సత్య పరమధామము నందు ఎల్లప్పటికి ప్రతినిష్ఠితులై యుందురు. ఇది నిశ్చయము.

-----

కేనోపనిషత్తు సమాప్తము. ఓం శాంతి, శాంతి, శాంతి.

SARA SUDHA CHINDRIK    Chapters