SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

నారాయణోపనిషత్తు

శృతిస్మృతులచే స్తుతింపబడునట్టి శ్రీహరి శిష్యాచార్యుల మగు మమ్ము రక్షించుగాక, శిష్యాచార్యులమగుమేము. బ్రహ్మవిద్యా పధమున అభ్యాస, అనుభూత, తేజోధారణల యందు నిరంతర శాంతిని కలిగి యుండుముగాక, మా బుద్ధి బ్రాహ్మీస్మృతికి అనుకూలమగు దివ్యతేజస్సును పొందుగాక, మా ఉపాసనాను భూతులలో పరస్పర ద్వేషములేని శౄంతిని కలిగి యుండుముగాక. జాగృత్స్వప్న సుషుప్తులలో మాకు నిర్వికారమగు శాంతి కలిగియుండుముగాక.

ఆదిపురుషుడగు నారాయణుడు ప్రాణుల సృజింపదలచెను. అపుడా దేవ దేవుని నుండి మూలప్రకృతియు, సమిష్టి ప్రాణము, సర్వేంద్రియ సూక్షాణువులు కలిగెను. తదుపరి ఆకాశము, వాయువు అగ్ని, జలము, భూమి పుట్టెను. నారాయణుని నుండియే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ప్రజాపతులు, ఉద్భవించిరి. నారాయణు నుండియే ద్వాదశాదిత్యులు, ఏకాదశరుద్రులు, అష్టవసువులు, సమస్త వేద విజ్ఞానము ఆవిర్భవించెను. ఇట్లు సర్వజగత్తును నారాయణుని నుండియే ఆవిర్భవించి, జీవించి, నారాయణుని యందేలయంమొందుచున్నవి.

నారాయణుడు శాశ్వతుడు. ఆయన యొక్క దివ్యాంశ మగుటచే బ్రహ్ము నారాయణుడే. శివుడు నారాయణుడే. ఇంద్రుడు నారాయణుడే. భూమ్యాకాశాలు నారాయణుడే, కాలము నారాయణుడే, దశ దిశలు నారాయణుడే. మీద, క్రింద, వెలుపల, లోపల నెల్లడలా నున్నది నారాయణుడే! నారాయణుడే విజ్ఞానము, భూత భవిష్యత్తులన్నియు నానారయణుడే, కళాతీతుడు, అనుభవాతీతుడు అచలుడు, అనంతనామ సంజ్ఞాతీతుడునునగు శుద్ధుడైన దేవుడొక్కడే నానాయణుడు, ఆది దేవుని కన్న అన్యమేమియు లేదు. ఆ విషయమును ఏవిజ్ఞాని తన నిత్య స్మృతియందు నిలుపు కొనుచో అతడే విష్ణువుయగుచున్నాడు. అతడేవిష్ణువు యగుచున్నాడు.

మొదట 'ఓం' అనియు, తరువత 'నమో' అనియు, ఆ తరువత 'నారాయణ' అనియు ఉచ్చరింపవలెను. ఓం అను అక్షరము ఒకటి. నమో అను రెండక్షరములు, నారాయణాయ అను ఐదు అక్షరములు కలిసి శ్రీమన్నారాయణాష్టాక్షర మహామంత్రము అయినది. ఏయోగి ఈ అష్టాక్షరమంత్రాన్ని శరణాగత భక్తితో ధారణచేసి ఉపాసించుచున్నాడో అతడు పూర్ణాయువగు చున్నాడు. ప్రజాపతిత్వమును, ఆనందమయమగు గోపదము పొందును.

ఎవడు శ్రీమన్నారాయణాష్టాక్షరీమంత్రము లక్షసాధనలు ప్రాజ్ఞులచే తెలిసి ఉపాసించుచున్నాడో అతడు శ్రీహరి కృపచే అమృతత్వమును పొంది శాశ్వత సాయు%్‌యము (కైవల్యము) పొందుచున్నాడు.

పరమ పురుషుడైన పరమాత్మయే ప్రత్యగానందస్వరూప జీవుడుగాను, ప్రణవ స్వరూపుడుగానుండి, అకార, ఉకార, మకార స్వరూపమగు సర్వమునందును తత్వరూపుడై సమసముగా వ్యాపించియున్నాడు. ఇట్టి పరమాత్మను ఏయోగి ఉపాసించుచున్నాడో అతడు పరమేశ్వరు కృపచేత సంసారదుఃఖ అజ్ఞాన జన్య బంధములనుండి విడివడుచున్నాడు. ఓం నమోనారాయణాయ యను అష్టాక్షరీమంత్రోపాసకుడు పరమేశ్వర సాన్నిధ్యమగు వైకుంఠపురమును చేరుచున్నాడు. ఆ పరతత్వమగు బ్రహ్మమే హృదయ పద్మము నందు విజ్ఞానఘనుడై శృతస్మృతులకు సాక్షియై గాఢమగు చీకటి యందు మెరుపుతీగవలె ప్రాకృతమగు సర్వము నందును దానికి ద్రష్టమై యున్నాడు. ఆ బ్రహ్మము తనయొక్క దివ్య సంకల్పమున వ్యక్తమైన మూల ప్రకృతి యను దేవకీపుత్రుడు (విరాటీ ఈవభావనుడు) గానున్నాడు. ఈ నారాయణుడే మధురమగు నొక ఆనందస్థితికిని విలక్షణుడైయున్నాడు. ఈ దేవదేవుడే సర్వభూతాంతరాత్మయై సర్వమునకు కారణపురుషుడై యున్నాడు. అతడే పరబ్రహ్మము.

నాలుగు వేదములకు శిరస్సుయగు ఈ ఉపనిషత్తును ఎవరు ప్రాతఃకాలమున పారాయణచేయునో అతనికి అజ్ఞాన వశమున రాత్రియందొనర్చిన పాపము నశించుచున్నది. ఎవడు దీనిని సాయంకాలము పారాయణచేయునో అతని పగటి యందొనర్చిన పాపము నశించుచున్నది. మధ్యాహ్న కాలమున సూర్యనకభిముఖముగా నుండి ఎవడు పారాయణ చేయునో అతని పంచమహాపాతక, ఉపపాతకములు నశించుచున్నవి. ఈ పవిత్రమగు ఉపనిషత్తును పారాయణ చేయువారికి సర్వవేద పారాయణ పుణ్యము లభించును. అంతియేగాక శ్రీమన్నారాయణు సాయుజ్యము లభించును. ఈ విషయమును తెలియవలసినదని ఈవులకీ ఉపనిషత్తు ప్రబోధించుచున్నది.

ఓం నారాయణాయ విద్మహే! వాసుదేవాయ ధీమహి!

తన్నోవిష్ణుః ప్రచోదయాత్‌

ఓం సహనావవతు! సహనౌ భునక్తు! సహవీర్యం కరవావహై !

తేజస్వినావధీతమస్తు! మావిద్విషావహై!!

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం తత్‌సత్‌

***

ఓం తత్‌ సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

మంత్రపుష్పము

సహస్ర శిరస్సులు కలవాడును, విశ్వమే నేత్రములుగా కలవాడును. ప్రపంచమునకు సుఖము చేయువాడును, విశ్వమే స్వరూపముగా కలవాడును, నాశరహితుడగు శ్రీమన్నారాయణుని సేవింపవలెను.

విశ్వముకంటె పరముడును, నిత్యుడును, విశ్వస్వరూపుడును, నారాయణుడను పేరుకలవాడును అయి పరమాత్మ వెలయుచున్నాడు. ఈ ప్రపంచమంతయు ఆతని స్వరూపమే. ఈ ప్రపంచమునంతను ఆతడే ఆశ్రయించియున్నాడు.

విశ్వము నంతను పాలించువాడును, జీవులకు నియంతయు, నిత్యుడును, సుఖము నిచ్చువాడును, అక్షయుడును, నారాయణుడను పేరుకలవాడును, గూఢతత్వముకలవడును, చరాచరము లయందు విశ్వాత్మనుండువాడు గొప్పగా తెలుసుకొనదగినవాడు అయియున్నాడు.

ఉపనిషిదాదుల యందు చెప్పబడిన పరంజ్యోతిః పరంబ్రహ్మ, పరమాత్మ, ధ్యాత, ధ్యేయము, ధ్యానము మొదలగు శబ్దములన్నియు శ్రీమన్నారాయణునకే చెల్లును.

ఈ జగత్తు నందు కనబడునట్టియు, వినబడునట్టియు, ప్రతి స్వల్ప వస్తువు నందును, లోపలను, బయటను, అంతటను శ్రీమన్నారాయణుడు వ్యాపించియున్నాడు.

అంతములేనిదియు, అక్షయమును, సర్వజ్ఞమును, సంసారమను సాగరమునకు అవధియును, విశ్వసుఖకరమును, అగుపరబ్రహ్మను ధ్యానింపవలెను. నాభికంటె ఊర్ధ్వ భాగమందు వితస్తిమాత్ర దూరమున కంఠము కంటె అధోభాగమున హృదయ పద్మముకలదు. అందు మహాతేజస్వియై పరమాత్మ వెలుగుచుండును.

తామర మొగ్గవలె నున్న హృదయ పద్మము నాభికంటె ఊర్ధ్వమున 10 బొటన వ్రేళ్ల (జానేడు) దూరమున అధోముఖముగా నున్నది. అందు నాడులు వ్యాపించి యున్నవి. అందు సుషుమ్న అనుపేరు గల సూక్ష్మ నాడికలదు. ఆ సుషుమ్న యందే ఈ సర్వవిశ్వము ప్రతిష్టింపబడియున్నది.

సుషుమ్న నాడి యొక్కమధ్యభాగమునందు అనేక శిఖలు గల సర్వవ్యాపకమగు నొకగొప్ప అగ్నికలదు. అది తన సమీపమునకు వచ్చినట్టి అన్నము మొదలగటు వానిని ఆయా అవయవములకు విభజించి యిచ్చి జీర్ణింపజేయుచున్నది. కాని అది జీర్ణింపక అట్లే యుండును. దాని కిరణములు క్రిందికి మీదికి అంతట వ్యాపించి యుండును.

ఆ అగ్ని దేహమును పాదము మొదలు కొని శిరస్సుదాకాతపింప జేయును. ఆ అగ్ని మధ్యభాగమందు ఊర్ధ్వముఖమైన అణువువలె సూక్ష్మమైన ఒక అగ్ని శిఖకలదు. ఆయగ్నిజ్వాల నలమేఘమధ్యము నందుండు మెరుపువలె ప్రకాశించుండును. వరి గింజముల్లువలె మిక్కిలి సూక్ష్మమై యుండును. అణువుతో పోల్చదగినవియై పీవర్ణము కలిగియుండును.

ఆ అగ్ని జ్వాల యొక్క మధ్యమున పరమాత్మ వ్యవస్థితుడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు విష్ణువు. అతడే ఇంద్రుడు, అతడే అవ్యయుడు. అతడే పరముడు. అతడే విరాట్టు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

***

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపర బ్రహ్మణనమః

పురుష సూక్తము

వేయి శిరస్సులు కలవాడును వేయి కన్నులు కలవాడును, వేయి పాదములు కలవాడును, అగునట్టి విరాట్‌ పురుషుడు సర్వ పృధ్విని ఆక్రమించుకొని పదియంగుళముల శరీరమున క్రమ్ముకొనియున్నాడు భూత భవిష్యత్‌ వర్తమాన కాలాత్మకమైన సమస్త ప్రపంచమును ఈ విరాట్‌ పురుషుడే. మరియు అమృతత్వమునకు ప్రభువగు ఈ పురుషుడు అన్నమనుకారణముచేత నిజకారణావస్ధను మీరి జగద్రూపకార్యవస్ధను పొందుచున్నాడు. ఇదంతయు ఈ పురుషుని యొక్క సామర్ధ్యాతిశయము, ఈ సామర్ధ్యాదిశయము కన్నమిగులనధికుడు.

సమస్త భూతములును, ఈ పరమాత్మ యొక్క నాల్గవ భాగమై యున్నవి. ఈ పరమాత్మ మిగిలిన మూడు భాగములును అక్షయమై దివి యందుండును. త్రిభాగ స్వరూపుడగు పరమాత్మ ఊర్ధ్వమున ఉత్కర్షగాయున్నాడు. పరమాత్మ యొక్క పాతికభాగము మాయను పొందుచున్నది. పిదప అనేక రూపములతో చేతనా చేతనములందు వ్యాపించియుండెను. ఈ పరమాత్మ వలన విరాట్‌ ఉద్భవించెను. దేహ ధారుడగు విరాట్‌ పురుష స్వరూపుడు. జీవుడాయెను. ఆవిరాట్‌ పురుషుడు సర్వమును అతిక్రమించినవాడాయెను. అనంతరము భూమిని సృష్టించెను. తదనంతరము ఈవులకు దేహములను సృష్టించెను.

దేవ శరీరములు సిద్ధించిన తదనంతరము ఉత్తర సృష్టికొరకు దేవతలు పురుషుడను పేరుగ గలహవిస్సుచేత ఒకయజ్ఞము చేసిరి. ఆయజ్ఞమునకు వసంత ఋతువే ఆజ్యము. గ్రీష్మ ఋతువే సమిధలు శరదృతువే హవిస్సు.

ఈ యజ్ఞము నకు గాయత్రి మొదలగు ఛందస్సులు ఏడును. ఎల్లలు, ఈ ఏడును ఇరువది యొకటిగా చేయబడినవి. దేవతలు తమ యజ్ఞము నకు విరాట్‌ పురుషునే యజ్ఞ పశువుగా భావించి యూపస్తంభమునకు గట్టి వేసిరి. సృష్టికి పూర్వమే జన్మించినవాడగు విరాట్‌ పురుషుడు ఇట్లుగా మానస యజ్ఞమందు ప్రోక్షింపబడెను.

దేవతలును, సాధ్యులును, ఋషులును ఆపశువునే సాంకల్పిత యజ్ఞము చేసిరి. విరాట్‌ పురుషుడే హామద్ర్యవ్యముగా గల ఆయజ్ఞము నుండి 'పుషత్‌' అను ఆజ్యముకలిగెను. మరియు ఆయజ్ఞము నుండియే వాయుదేవతానకములైన పశువులును, గ్రామ్యములగు గోవులును, సంపాదింపబడెను. అందుండియే గాయత్రి మొదలగు ఛందములు వేదములు ఉద్భవించెను.

ఆయాగము వలన నుండి అశ్వములు, గార్ధ బాదులు పుట్టెను. గోవులకలిగెను. మేకలు, గొర్రెలు ఉద్భవించెను. దేవతలు ఈ ప్రకారముగా విరాడ్రూపమును సంకల్పము చేత పుట్టించి విషయములు కలిగించిరి. ఈ విరాట్‌ పురుషునకు రెండు బాహువులెవ్వి? తొడలెవ్వి? పాదములెవ్వి? అని ప్రశ్నించినచో సమాధానముగా చెప్పబడుచున్నది.

ఈ విరాట్‌ పురుషును ముఖముబ్రాహ్మణుడు, భుజములు క్షత్రియుడు, తొడలు వైశ్యుడు, పాదముల నుండి శూద్రుడు ఉద్భవించిరి. మనస్సు వలన చంద్రుడు పుట్టెను. నేత్రముల వలన సూర్యుడు ముఖము నుండి ఇంద్రుడు, ముఖము నుండియేఅగ్నియు పుట్టెను. ప్రాణమువలన వాయువు పుట్టెను. నాభినుండి ఆకాశము కలిగెను. శిరస్సు నుండి ద్యులోకముకలిగెను. పాదముల వలన భూమికలిగెను. శ్రోత్రములవలన దిక్కులు కలిగెను. ఇట్లేసమస్త లోకములు పుట్టి యుండెను.

ఏధీరుడగు విరాట్‌ సర్వ రూపములను నిర్మించి, వానికి తగిన పేర్లు పెట్టి, చరాచరాంతర్భూతుడై యున్నాడో ఆ విరాట్‌ పురుషుని అధికునిగా, సూర్యప్రకాశము కలవానిగాను నేను తెలుసుకొనుచున్నాను ఆవిరాట్‌, పురుషుడే అజ్ఞానమను చీకటినకి వెలుపల వర్తించుచున్నాడు. ఏవిరాట్‌ పురుషుని ప్రజాపతి స్తుతించెనో, ఇంద్రుడు జ్ఞానియై నాలుగు దిక్కులయందు, ప్రసిద్ధి చేసెనో, ఆవిరాట్‌ పురుషుని ప్రజాపతి యొక్కయు, ఇంద్రుని యొక్కయు, ఆదేశానుసారముగా తెలుసుకొను విద్వాంసుడు, ఈ జన్మమునందే మరణ రహితుడగుచున్నాడు. మోక్షప్రాప్తికి మరి యొక మార్గములేదు. దేవతలును సంకల్పయజ్ఞముచేత యజ్ఞ స్వరూపుడగు దేవుని పూజించిరి ఆకారణముననే జగద్రూప వికారములనుయ ధరించునట్టి ధర్మములు ప్రాముఖ్యములై యుండెను.

ప్రాచీనులగు సాధ్యులును, దేవతలును ఏ స్వర్గమునందు కలరో ఆ స్వర్గమును ఇచటనే మహానుభావులు పొందుచున్నారు.

శ్రీమన్నారాయణుడు ఉదకము నుండి పుట్టెను. భూ సంబంధమైనయుదకమునుండి బ్రహ్మపుట్టెను. ఇది ఎక్కువగా పరబ్రజమ్మవలననేపుట్టినది. ఈ బ్రహ్మాండము యొక్క రూపమును కలుగ ఏయు చున్నయట్టి వాడును. పరమేశ్వరుని యంశము. విరాట్‌ సంబంధమగు ఈ ప్రసిద్ధ విశ్వమంతయు సృష్టి ప్రారంభమున ఉద్భవించెను ఈ విరాట్‌ పురుషుని మహాత్మునిగను. సూర్యసమతేజస్విగను నేనుతెలసుకొనుచున్నాను.

ఈ విరాట్‌ పురుషుడే అజ్ఞానమను అంధకారమునకు వెలుపల నున్నాడు. విరాట్‌పురుషుని ఈ విధముగా తెలుసుకొని విద్వాంసపుడు ఇచటనే మరణ రహితుడగుచున్నాడు. మోక్షప్రాప్తి కొరకు మరి యొక మార్గములేదు. ఈ బ్రహ్మాండగర్భమందు ప్రజాపతిచరించు చున్నాడు. అతడు న్మింపని వాడయ్యు బ్రహ్మవిధములుగా జన్మించుచున్నాడు.

ఆ ప్రజాపతి యొక్క స్వరూపమును ధీరులు తెలుసుకొనుచున్నారు. బ్రహ్మలు, మరీచి మొదలగు వారియొక్క స్థానమును ఆకాంక్షించు చున్నారు. ఏజగదీశ్వరుడు దేవతలకొరకు ప్రకాశించుచున్నాడో ఎవడు దేవతలకు తొలుదాల్త మేలుచేయుచున్నాడో, ఎవడు దేవతలకు పూర్వుడో, స్వయం ప్రకాశ##మైన పరబ్రహ్మస్వరూపమనకు నమస్కారము. సృష్టిప్రారంభమునదేవతలందరు ఆపరబ్రహ్మతత్వమును గురించి వివరించిరి.

ఓ పరమాత్మ! ఏ బ్రహ్మజ్ఞాని పైన చెప్పిన ప్రకారముగా తెలుసుకొనుచున్నాడో వానికి ఎల్లదేవతలు వశులగుదురు. అజ్జగల దేవతయు, ఐశ్వర్యముగల దేవతయు నీ భార్యలు, రేయింబవళ్లు నీ పార్శ్వములు. నక్షత్రములునీరూపము. అశ్వినీదేవతలు నీవచనము. ఓ పరబ్రహ్మ స్వరూపమా! మాకు ఇష్టమగు దానినొసగుము, తత్వజ్ఞానమునొసగుము. ఈ లోకమునందును పరలోకమునందును మాకు గావలయునన్నింటిని దయచేయుము.

ఓం తత్‌సత్‌- ఓం శాంతిః శాంతిః

ఓం. తత్‌సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

ప్రస్దానత్రయ సారసుధ

భారతీయ ఆధ్యాత్మిక తత్వవిజ్ఞానపథమున ఉపనిషత్తులు. బ్రహ్మసూత్రములు, భగవద్గీత మూడు సోపానములు, వేదశిరోభూషలగు ఉపనిషత్తులలో చరాచర జగతీ సృష్టికర్త, ధర్తి, లయకర్తయగు పరమచైతన్యశక్తియగు పరమాత్ముని. ఆతని అంశరూపమగు జీవాత్మను, జగతీసృష్టికి ఉపాచానకారణరూపమున పరమాత్మ చే సృజింపబడిన ఈయనయొక్క అచింత్యశక్తి ప్రకృతి యొక్క పరస్పర కార్యకారణసంబంధ విశదవర్ణన చేయబడినది. మహాత్ములగు ఋషులు తపోధ్యానముల ద్వారా అనుభూతమొనర్చుకొన్న అనంత సత్య జ్ఞానమును పరస్పర వివేచనద్వారా ముముక్షువులగు సాధకులకు అందించియున్నారు. దానినే బ్రహ్మవిద్యయని నుడివిరి.

ఉపనిషద్వాక్యములకు భాష్యముచెప్పుచు, సాంఖ్యుల, వైశేషికులు, బౌద్ధులు, జైనులు మొదలగువారు. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి గూర్చి తెలిపిన వారి వారి మతాను వాదములయందలి దోషములు చూపుచు. వానిని తర్కయుక్తముగా పరిహరించి, ఉపనిషద్వాక్య ప్రమాణమును బాదరాయణులవారు సిద్ధాంతతీకరించిరి. మరియు జన్మమరణరహిత శాశ్వతపరబ్రహ్మపదము నొందుటకు సాధకులు చేయవలసిన సాదనాక్రమము, దానిఫలితమును. తమ బ్రహ్మసూత్రములలో విశదీకరించిరి.

ఉపనిషత్తులలో శ్రవణము చేసి, బ్రహ్మసూత్రముల ద్వారా మననము చేసిని బ్రహ్మవిద్యాజ్ఞానమును భగవాన్‌ శ్రీకృష్ణుడు. అర్జుననకుపదేశించిన భగవద్గీత ద్వారా బాహ్యాభ్యంతరముల అనుసంధానమొనర్చి. జ్ఞాన, కర్మ, భక్తి, ద్యానించి యోగముల ద్వారా జీవుడు జన్మమరణరహితశాశ్వత పరబ్రహ్మపదము నొందు మార్గమును ప్రశస్థముచేసిరి.

కావున ఈ మూడిటిని ప్రస్ధాన త్రయమనిరి. ఇవి ఒక దానికొకటి పరస్పర సమన్వయాత్మకములు, మరియు ఒకదాని కంటె మరియొకటి సారసుధా సంగ్రహము. వీని సారాంశరూపము నే భక్తులు నిత్య పూఆదికములందు పురుష సూక్త, మంత్రపుష్పాది రూపమున, నారాయణోపనిషత్తురూపమున పఠింతురు.

ప్రస్ధానత్రయ సారసుధా చంద్రిక :-

ఈ చారాచర జగత్తును సృష్టించి, పోషించి, లయింప జేయు పరమచైతన్యశక్తినే పరమాత్మయందుము. పరమాత్మ ఒక్కడే, ఆయన సృష్టిచేయసంకల్పించి తన బలీ శక్తిచే మూలప్రకృతిని. బ్రహ్మాదిదేవతలు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, ప్రజాపతులు, మనువులు, యక్షకిన్నరగంధర్వాదుల ను సృజించెను. పిమ్మట మనుష్య, పశుపక్ష్యాదులు, ఉద్భిజములు మొదలగు వానిని సృజించెను.

2. పరమాత్మ సృష్టిలో మానవుడు ఉత్కృష్టప్రాణి, మిగిలిన జీవులకంటె వాగాది శక్తులు కలిగి యుండుటచే మానవజీవితమే మోక్ష సాధనము. ఈ శరీరమనురధమున, బుద్ధియను సారధి. ఇంద్రియములను గుర్రములను. మనస్సను కళ్లెముచే బిగించి జీవాత్మను. తన గమ్యమగు పరమాత్మ సన్నిధిచేర్చును.

3. పరమాత్మఆత్మరూపమున ప్రతిప్రాణి హృదయకుహరమందు జీవాత్తోకూడివసించును. జీవాత్మ కర్మ ఫల భోక్త, పరమాత్మకేవలము ద్రష్టగా నుండును.

4. త్రిగుణాత్మకమైన ప్రకృతి (మాయ) యొక్క సంసర్గముచే జీవుడు దేహేంద్రియాభిమానమతో అనేక కర్మలుచేయుచు సుఖదుఃఖములననుభవించుచు కర్మఫల భోగమునకై మరల మరల జన్మించు చుండును.

5. జీవాత్మ జన్మమరణ రహిత శాశ్వత పరబ్రహ్మపదమునొందుటకు మోక్షమందుట ద్వారా జీవాత్మను పరమాత్మలో విలీనము చేయవలెను. అనగా జీవచైతన్యమును అఖండ చైతన్యములో విలీనముచేసి ఏకాకారముగుట.

6. పరమాత్మ నిరాకార, నరంజన, నిర్వికల్ప, నిర్విశేషాది విశేష గుణసంపన్నుడు. పరమాత్మను పొందుటకు శమాది షట్కసంపత్తిచే దేహేంద్రియాభిమానము వదలి. ఆత్మానాత్మవివేచన చే అనాత్మవస్తు పరివారణచేయుచు. తీవ్రవైరాగ్యభావమున, మోక్షకాంక్షతో జీవాత్మను పరమాత్మలో విలీనము చేయుటయే జ్ఞానయోగము.

7. శాస్త్ర విహితకర్మలు చేయుచు, కర్తృత్వభోక్తృత్వాభిమానము వదలి సర్వము ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించుటే కర్మయోగము. కర్మఫలరాహిత్యమే మోక్షము.

8. పరమాత్మనిరాకార నిర్గుణుడైనను దుష్టశిక్షణ, శిష్టరక్షణ, దర్మసంరక్షణకొరకు. భూలోకమున అవతరించుచుండును. అట్టి పరమాత్మసాకార సగుణ రూపములగు రామకృష్ణాద్యవతారరూపముల ధ్యానించుచు. నామస్మరణచేయుచు, అనన్య భావమున చింతించుచు. సదా భగవానుని శరణు జొచ్చిన భక్తలు, మోక్షపదమునొందెను.

9. కావున మోక్షమునొందగోరుమనుజులు కామక్రోధముల విడచి, దైవీగుణముల నలవరచుకొని, భగవానుని నామరూపాత్మకముగా పూజించి, నామమును నిరంతరము జపించుచు. దివ్యరూపమును సదా ధ్యానంచేయుచు, నిష్టామముగావిహితకర్మలనొనరించుచు, క్రమముగా నిరాకార బ్రహ్మపాసనద్వారా జన్మమరణరహిత శాశ్వతసచ్చిదానంద పర బ్రహ్మపదము ఈ జన్మమందే పొంది జీవన్ముక్తుడు కావలెను.

ఓం. తత్‌సత్‌. ఓం శాంతిః శాంతిః శాంతిః.

SARA SUDHA CHINDRIK    Chapters