Brahma Suthra Vivruthi Chapters Last Page
ప్రథమాధ్యాయే (సమన్వయాధ్యాయే) ప్రథమఃపాదః
జిజ్ఞాసాధికరణమ్.
1. సూత్రమ్ : అథాతో బ్రహ్మజిజ్ఞాసా
వివృతిః :- ఇదమాదిమం సూత్రమ్. అత్ర కర్తవ్యా ఇతి పద మధ్యాహృత్య వ్యాఖ్యేయ మిదం సూత్రమ్. అథ=సాధన చతుష్టయ సంపత్త్యనంతరం అతః= యతో వేద ఏవ ''తద్య థేహ కర్మచితో లోకః క్షీయతే ఏవ మేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయత'' ఇత్యాదినా శ్రేయస్సాధనత్వేన ప్రతిపన్నానా మప్యగ్నిహోత్రాదీనా మనిత్యఫలత్వం దర్శయతి, ''బ్రహ్మవి దాప్నోతి పర''మితి బ్రహ్మ విజ్ఞానస్య చ పరమ పురుషార్థ సాధనత్వం దర్శయతి, తతః నిత్యానిత్యవస్తు వివేకాదిపూర్వ కైహికాముష్మిక ఫలభోగ విరాగాది సాధనచతుష్టయ సంపన్నత్వా త్ హేతోః బ్రహ్మజిజ్ఞాసా=బ్రహ్మణో జిజ్ఞాసా బ్రహ్మజిజ్ఞాసా - అత్ర జిజ్ఞాసా పదంలక్షణయా వృత్త్యా అవగతిపర్యంత బ్రహ్మకర్మక (బ్రహ్మ విషయక) జ్ఞానస్య సాధనభూతం విచారం బ్రూతే. సా కర్తవ్యా, తథాచ సాధన చతుష్టయ సంపత్త్యనంతరం తత్సంపత్తిమతా పురుషేణ సర్వానర్థరూపస్య సంసార స్యా విద్యాప్రభవత్వా దవిద్యా ప్రతిబం ధ్యవగతిపర్యంత బ్రహ్మ విషయక జ్ఞాన సాధనీభూతో వేదాంతవాక్య కరణకో విచారః కర్తవ్య ఇతి సూత్రార్ధ స్సంపద్యతే.
బ్రహ్మ సూత్రార్థ వివరణము
1. సూత్రమ్: అథాతో బ్రహ్మజిజ్ఞాసా
వివరణము :- ఇది బ్రహ్మవిచారశాస్త్రము నందలి మొదటి సూత్రము. ఇచట ''కర్తవ్యా'' అను పదమును అధ్యాహరించుకొని సూత్రార్థమును గ్రహించవలయును. అథ=సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత అతః=స్వర్గాదిశ్రేయస్సాధనములుగా ప్రసిద్ధములయిన అగ్నిహోత్రాది సత్కర్మల యొక్క ఫలములును అనిత్యములే యని వేదములయందు ''తద్యథేహకర్మ'' ఈ లోకమున కృషి వాణిజ్యాది కర్మలచే సంపాదితములగు ధనధాన్యాదులెట్లు నశించుచున్నవో అట్లే పుణ్య కర్మ సంపాదితములగు స్వర్గాదులును నశించగలవు అని ప్రతిపాదింపబడి యుండుటచేతను, (ఐహికములగు కర్మ ఫలములు అనిత్యములని ప్రత్యక్ష ప్రమాణముచేతనే తెలియబడుచున్నది.) ''బ్రహ్మవిదాప్నోతి పరం'' బ్రహ్మతత్త్వాభిజ్ఞుడు ఉత్కృష్టమగు. దేశకాలాది పరిచ్ఛేదశూన్యము, నిత్యమునగు, స్వ స్వరూపమును=బ్రహ్మీ భావమును పొందునని ప్రతిపాదింపబడి యున్నది గనుకను, విజ్ఞుడు నిత్యా నిత్యవస్తు వివేకము ఐహికాముష్మిక ఫలభోగవిరాగము మొదలగు సాధన చతుష్టయ సంపన్నుడు కాగలడు. అట్టి యోగ్యత గల మానవశ్రేష్ఠునిచే బ్రహ్మజిజ్ఞాసా=బ్రహ్మ సంబంధి జిజ్ఞాన-జిజ్ఞాన యనగా నిచట విచారము అని యర్థము. అది యర్థము. అది కర్తవ్యా=చేయదగినది. అనగా సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత ఆ సంపదకలిగిన వానిచేత సర్వానర్థ రూపమగు సంసారము అవిద్యామూలకమే గాన అవిద్యా ప్రతిబంధియగు ఫలీభూత బ్రహ్మతత్త్వా పరోక్షానుభూతికి (తన నిజ స్వరూపము నిర్గుణ పరబ్రహ్మతత్త్వమేయను అపరోక్షాను భూతికలుగుటకు) సాధనమగు బ్రహ్మతత్త్వ విచారము వేదాన్త వాక్యముల ద్వారా చేయదగినది యని సూత్రార్థము.
సాధన చతుష్టయ సంపత్తి యనగా 1, నిత్యా నిత్య వస్తు వివేకము 2. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము 3. శమాదిషట్క సంపత్తి (శమము - దమము - తితిక్ష - ఉపరతి - శ్రద్ధ - సమాధియను నివి శమాదులు) 4. ముముక్షత్వము.
బ్రహ్మసూత్ర వివృతిః
జన్మా ద్యధికరణమ్.
2. సూత్రమ్: జన్మాద్యస్య యతః
వివృతిః :- కింలక్షణం పునస్తద్ర్బ హ్మేత్యత ఆహ సూత్రకారః అన్య=ప్రత్యక్షాది సన్నిధాపితస్య, విచిత్ర రచనారూపస్య, జగతః జన్మాది=సృష్టి స్థితి భంగం యతః= యస్మా త్సర్వజ్ఞా త్సర్వశ##క్తేః కారణా ద్భవతి తద్ర్బహ్మేతి సూత్రార్థః ఏవం జగజ్జన్మాది కారణత్వరూపం బ్రహ్మణస్తటస్థలక్షణ ముక్త్వా 'యత' ఇతి శ##బ్దేన భృగువల్ల్యాం ''యతో వా ఇమాని భూతాని'' ఇత్యాదినా అనిర్ధారిత స్వరూపవిశేషం యద్వ స్తూపక్రాంతం బ్రహ్మరూపస్య తస్తెవ్య వస్తునః ''ఆనందో బ్రహ్మేతి'' ''ఇత్యుపసంహారేణ యదానందరూపత్వం నిర్ధారితం తత్ సచ్చిదానందరూపం బ్రహ్మేత్యేవం రూపం జిజ్ఞాస్యస్య బ్రహ్మణ స్స్వరూపలక్షణ మపి సూచితం సూత్రకారేణ.
2. సూత్రమ్ : జన్మా ద్యస్య యతః
వివరణము :- విచారింపదగిన బ్రహ్మయొక్క లక్షణమిట నిరూపింప బడుచున్నది. ఏ వస్తువునుండి ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరించు ఈ విచిత్ర రచనారూపమగు జగత్తు పుట్టుచున్నదో - ఏ వస్తువు మీద ఈ జగత్తుయొక్క స్థితి ఆధారపడియున్నదో - లయము పొందు సమయమున నీ జగత్తంతయు ఏ వస్తువులో లయము నొందుచున్నదో అది బ్రహ్మయని సూత్రార్థము. జగజ్జన్మాది హేతువైన బ్రహ్మసర్వజ్ఞము, సర్వశక్తి సంపన్నము అనియును తెలిసికొనదగును. కాకున్నచో నది ఈ విచిత్ర జగద్రచనమునకెట్లు కారణము కాగల్గును.
ఇట్లు బ్రహ్మకు జగజ్జన్మాది కారణత్వ రూపమగు తటస్థ లక్షణమును ఈసూత్రమున వివరించి భృగువల్లిలో ''యతో వా ఇమాని'' దేనినుండి యీ జగత్తు జనించుచున్నదో అని ఉపక్రమముచేసి అనిర్ధారిత స్వరూపముగ నే బ్రహ్మ వస్తువు వర్ణింపబడినదో ఆ బ్రహ్మ వస్తువునకే ''ఆనందో బ్రహ్మేతి'' అను ఉపసంహార వాక్యముతో ఆబ్రహ్మ ఆనంద స్వరూపము అని వర్ణించుచూ ఆనందము అనునది బ్రహ్మయొక్క స్వరూప లక్షణమని గూడ సూచింప బడినది. అదియే జిజ్ఞాస్య బ్రహ్మయొక్క స్వరూప లక్షణమని ఈ సూత్రములోని ''యతః'' అను పదముతో సూత్రకారులు సూచించుచున్నారు.
శాస్త్రయోని త్వాధికరణమ్-3
3. సూత్రమ్: శాస్త్రయోనిత్వాత్
వివృతిః :- పూర్వ సూత్రే జిజ్ఞాస్యస్య బ్రహ్మతో జగత్కారణత్వోక్త్యా సర్వజ్ఞత్వం యత్ సూచితం తదేవ ద్రఢయతి. శాస్త్ర యోనిత్వాత్=శాస్త్రస్య యోనిః - శాస్త్రయోనిః, తస్య భావః - శాస్త్రయోనిత్వం తస్మాత్ శాస్త్రయోనిత్వాత్. శాస్త్రస్య=ఋగ్వేదాదేః - సర్వజ్ఞకల్పస్య - సర్వార్థావద్యోతినః యోనిత్వాత్=కారణత్వాత్ సర్వజ్ఞకల్పస్య వేదస్య కర్తృత్వాద్ర్బహ్మ సర్వజ్ఞ మితి సిద్ధ్యతి. శాస్త్రస్య యోనిః ఇతి పష్ఢీతత్పురుష మాశ్రిత్య సూత్ర మిదం వ్యాఖ్యాతమ్. బ్రహువ్రీహి మాశ్రిత్యా ప్యేతత్సూత్రార్థో వివ్రియతే. పూర్వోక్త లక్షణలక్షితస్య జిజ్ఞాస్యస్యబ్రహ్మణః అవగమే కిమస్తి ప్రమాణ మిత్యాశంకాయాం సూత్రమ్ - శాస్త్రయోనిత్వాత్ - శాస్త్రం యోనిః యస్య తత్= శాస్త్రయోని, తస్యభావః=శాస్త్రయోనిత్వం, తస్మాత్=శాస్త్రయోనిత్వాత్=శాస్త్రం= ఋగ్వేదాదిః యోనిః= ప్రమాణం బ్రహ్మణ స్స్వరూపావగమే ఇతి. తథా చ ఋగ్వేదాది రూప ద్వేదా దేవప్రమాణా త్సర్వజ్ఞం సర్వశక్తి జగదుత్పత్తి స్థితిలయ కారణం బ్రహ్మఅవగమ్యతే నాన్యే నేతి సిద్ధం భవతి. అన్య సూత్ర స్యాయ మేవార్థోముఖ్యతయా గ్రాహ్యః. తత శ్చ వేదైకసమధికమ్యత్వాత్ బ్రహ్మణో వేదాంతవచనైరేవ తద్విచారః కర్తవ్య ఇతి సూచ్యతే.
3. సూత్రమ్: శాస్త్ర యోనిత్వాత్
వివరణము :- పూర్వ సూత్రమున బ్రహ్మ సర్వ జగత్కారణము అని చెప్పుటచే బ్రహ్మ సర్వజ్ఞము (చేతనము) అని సూచింప బడినది. ఆ సర్వజ్ఞత్వము నిచట ధ్రవపరచు చున్నారు.
శాస్త్రమనగా=ఋగ్యజుస్సామాది వేదరాశియని యర్థము- అది సర్వజ్ఞకల్పము గొప్పదియగు ప్రదీపమువలె సర్వార్ధావద్యోకతకమును. యోని అను శబ్దమునకు కారణము అని అర్థము. అట్లుకాగా సర్వజ్ఞకల్పము సర్వార్థావద్యోతకము (సర్వ ప్రపంచమున గల సర్వ విషయములను తెలియజేయ గలదియు) నగు వేదమునకును కారణము (కర్త) యని చెప్పుటచేత బ్రహ్మ సర్వజ్ఞమేఅని యేర్పడు చున్నది. సర్వజ్ఞుడు కానివాడు ఇట్టి వేదరాశిని నిర్మించగల్గునా? శాస్త్రయోని- అనునీ సూత్రపదము షష్టీతత్పురుష సమానము ప్రకారము వ్యాఖ్యానింప బడినది. ఇప్పుడు బహువ్రీహి సమాస ప్రకారము నాశ్రయించి వ్యాఖ్యానము చేయబడుచున్నది.
జగత్కారణము జిజ్ఞాస్యమునగు బ్రహ్మ యొక్క స్వరూప విశేషమును తెలియజేయు ప్రమాణ మేమైన కలదాయను ఆశంక కలుగగా నీ సూత్రము చెప్పబడుచున్నది. శాస్త్రయోనిత్వాత్=శాస్త్రం - యోనిః - ప్రమాణం - యస్యతత్ - శాస్త్రయోని - తస్యభావః - శాస్త్రయోనిత్వం - తస్మాత్ - శాస్త్రయొనిత్వాత్. అని ఈ సూత్రమునకు సంబంధించిన బహు వ్రీహి సమాసము యొక్క స్వరూపము. అనగా జగదుత్పత్తిస్థితి లయ కారణమైన, సర్వజ్ఞమైన, సర్వశక్తి సంపన్నమైన బ్రహ్మ ఋగ్వేదాది రూప శాస్త్ర ప్రమాణము చేతనే తెలిసికొన దగినదిగాని అనుమానాది ప్రమాణములచే తెలియబడునది కాదు అని అర్థము. (ఈ సూత్రమున కీయర్థమే ప్రధానమైనది. బ్రహ్మ స్వరూప బోధక ప్రమాణము వేదమే కాన వేదాన్త వాక్యములచేతనే బ్రహ్మ విచారము గావింపదగినది యని సూత్ర తాత్పర్యము.
ప్రథమాధ్యాయ - ప్రథమపాదః
సమన్వయాధి కరణమ్-4
4. సూ: తత్తు సమన్వయాత్
వివృతిః :- సర్వజ్ఞం తద్ర్బహ్మ వేదాంతశాస్త్రా దేవ ప్రమాణాదవగమ్యత ఇతి పూర్వ త్రోద్ఘాటితం. త త్కథ ముపపద్యతే? విధినిషేధ పరత్వా చ్ఛాస్త్ర స్యే త్యత ఆహ - తు=సూత్రస్థః అయం తు శబ్దః సర్వేవేదాంతాః కార్య శేషభూత కర్తృదేవతాది పరాః. న తు సిద్ధ బ్రహ్మపరాః, ఇత్యాది పరపక్షవ్యావర్తనార్థః తత్=సర్వజ్ఞం, సర్వశక్తి, జగదుత్పత్తి స్థితి లయకారణం బ్రహ్మ వేదాంతశాస్త్రా దవగమ్యత ఏవ. కుతః? సమన్వయాత్= ఉపక్ర మోవసంహారాదిభి స్సర్వేషాం వేదాంత వాక్యానాం తాత్పర్యేణ బ్రహ్మ ణ్యవ సమన్విత త్వావగమాత్, సర్వేషాం వేదాంతానాం సిద్ధే బ్రహ్మ ణ్యవ తాత్పర్యం. నతు కర్మణి, నా ప్యుపాసనే ఇతి స్ఫుట మవగమ్యతే. ఏవం బ్రహ్మణ స్సర్వవేదాంత ప్రతిపాద్యత్వోక్త్యా తద్ర్బహ్మతత్త్వానుభూతిః వేదాంతవాక్య విచార సాధ్యై వేతి, తదను భూత్యా చ సర్వానర్థరూపస్య సంసారస్య బీజభూతా యా అవిద్యాతస్యా నివృత్తిర్భవితేతి, తతశ్చ బ్రహ్మభావలక్షణా ముక్తిరధిగంతవ్యేతి సూత్రసారాంశః.
4. సూ : తత్తు సమన్వయాత్
వివరణము :- సర్వజ్ఞమౌ ఆ బ్రహ్మము వేదాంత ప్రతిపాద్యము అని పూర్వ సూత్రమునుబట్టి తేలుచున్నది. అది యెట్లు కుదురును? శాస్త్రమునకు విధి నిషేధములయందు గదా తాత్పర్యము. అట్టి శాస్త్రము విధి నిషేధములకు విషయము కాని సిద్ధరూపమగు బ్రహ్మము నెట్లు బోధింప గలదు అను ఆశంకకు సమాధాన మీసూత్రమున చెప్పబడుచున్నది. తు= సమస్త శాస్త్రము (వేదాంతము) లకును తాత్పర్యము కర్తవ్యములగు కర్మలయందు గాని,ఉపాసనలయందుగాని సంభవించును గాని, సిద్థమును, హేయోపాదేయ రహితమును నగు బ్రహ్మమునందుకాదు అను పరపక్షములను ఈ సూత్రమునందలి ''తు'' అను శబ్దము నిరసించుచున్నది. తత్=సర్వజ్ఞము - జగజ్జన్మాది కారణమునగు ఆ సిద్ధవస్తువగు బ్రహ్మమే సర్వ వేదాన్తము (శాస్త్రము) లకు తాత్పర్య భూమి. ఏలయన? సమన్వయాత్=ఉపక్రమోప సంహారాది షడ్విధ తాత్పర్య లింగముల ననునరించి పరిశీలింప సర్వ వేదాన్తములకు బ్రహ్మమునందే తాత్పర్యముగాని కర్మోపాసనాదులయందు కాదని స్పుటముగ తెలియబడుచున్నది గనుక. ఇట్లు బ్రహ్మయే సర్వవేదాన్త ప్రతిపాద్యమని చెప్పుటతో బ్రహ్మతత్త్వానుభవము వేదాన్త వాక్య విచారలభ్యమే అనియు, తదనుభవమున సర్వానర్థరూప సంసారమునకు మూలకారణౖన అవిద్య తొలగిపోగలదనియు, అంత నా యనుభూతి పొందిన విజ్ఞునకు తాను పరబ్రహ్మ భావముతో నుండుట యను ముక్తి లభించగల దనియు సూత్ర సారాంశము.
ఈక్షత్యధికరణమ్-5
5. సూ: ఈక్షతేర్నా శబ్దమ్
వివృతిః :- పూర్వత్రయ జ్జగత్కారణం తద్ర్బహ్మ సమన్వయాదిత్యుక్తం. తథాసతి సాంఖ్యైః ప్రతిపాదితం త్రిగుణాత్మకం యత్ర్పధానంతదేవ బ్రహ్మ కుతో న భ##వే దిత్యత ఆహ-న=ప్రధానం న జగత్కారణం భవతి కుతః? అశబ్దం=వేదే తస్య ప్రధానన్య జగత్కారణత్వే నాప్రతి పాదనాత్. వేద ప్రతిపాద్యం జగత్కారణం వస్తు ప్రధానభిన్నమ్ భవితుమర్హతి. కుతః? ఈక్షతేః=''నదేవ సోమ్యేద మగ్ర ఆసీత్'' ఇత్యత్రసచ్ఛబ్దేన విపక్షితస్య జగత్కారణవస్తునః ''త దైక్షత బహు స్యాం'' ఇతి ఈక్షితృత్వ వర్ణనాత్. ఈక్షణ కర్తృత్వం చ న అచేతనస్య ప్రధానస్య సంభవతి, ఈక్షణస్య చేతన ధర్మత్వాత్. బ్రధానభిన్నం జగత్కారణం ఇత్యుక్తే, తుల్యవిత్తి న్యాయేన ప్రధానం న జగత్కారణ మితి సిద్ధ్యతి.
వివరణము :- పూర్వ సూత్రములలో జగత్కారణమెద్దియో అది బ్రహ్మ యని సిద్ధాంతీకరింప బడగా సాంఖ్యులు మాచే జగత్కారణముగ నిర్ణయింపబడిన త్రిగుణాత్మకమగు ప్రధానతత్త్వమేది గలదో దానినే బ్రహ్మయని యేల అనరాదు అని ఆశంక చేయుదురు. అట్టి ఆశంకకు సమాధానముగా నీసూత్రము చెప్పబడు చున్నది. సాంఖ్యులు ప్రతిపాదించు ప్రధానము జగత్కారణము (బ్రహ్మ) కానేరదు. వేదములో ప్రధానము జగత్కారణముగ ప్రతిపాదింపబడి యుండలేదు గనుక. ''సదేవ సోమ్య'' అను శ్రుతిలో సత్పదముతో సద్వస్తువును జగత్కారణ వస్తువుగ ప్రతిపాదించి, తరువాత ''తదైక్షత బహు స్యాం'' అను శ్రుతిలో ఆసద్వస్తువు సృష్టికొఱకై ఈక్షణము చేసెను, అనగా సంకల్పించెను - ఆలోచించెను అని వర్ణింపబడి యుండెను. సంకల్పము - ఆలోచనము అనునది అచేతన వస్తువు యొక్క ధార్మముకాదు. కాన సాంఖ్యులు చెప్పు జడమైన ప్రధానము జగత్కారణము కానేరదని యేర్పడుచున్నది.
6. సూ: గౌణ శ్చే న్నాత్మశబ్దాత్
వివృతిః :- ''తత్తేజ ఐక్షత'' ''తా ఆప ఐక్షన్త'' ఈ త్యప్తేజపో శ్ర్శూయమాణం ఈక్షణం యథా గౌణం తథా సతి శ్రూయమాణ మపి గౌణం కుతో న భ##వే దిత్యత ఆహ - గౌణః=సతి శ్రూయమాణః ఈక్షతిః గౌణ ఏవ, న ముఖ్యః, అతః జగత్కారణవాచినా సచ్ఛబ్దేన ప్రధాన మేవ ప్రతిపాద్యతాం ఇతి - చేత్ = ఇత్యుక్తం చేత్ న=తథా వక్తుం న యుజ్యతే కుతః? ఆత్మశబ్దాత్=''అనేన జీనే నాత్మ నానుప్రవిశ్యనామరూపే వ్యాకరవాణి'' ఇతి శ్రుతౌ ''న ఆత్మా'' ఇతి శ్రుతౌ చ జగత్కారణస్యసతః ఆత్మత్వనిశ్చయాత్. చైతన్యరూపే ఐహ్మణ్యవ ఆత్మశబ్దప్రయోగ ఉపపద్యతే, న త్వచేతనే ప్రధానే. న హి చేతన ఆత్మా అచేతన ప్రధానాభిన్న తామర్హతి. అత స్సతి శ్రూయమాణ ఈక్షతిః న గౌణః. కిం తు ముఖ్యః తత శ్చజగత్కారణం సర్వజ్ఞం బ్రహ్మైవేతి సిద్ధమ్.
వివరణము :- ఛాన్దోగ్య శ్రుతిలోని ''తత్తేజ ఐక్షత - తా ఆపఐక్షన్త'' ( ఆ తేజస్సు సంకల్పించెను. ఆ ఉదకములు సంకల్పించినవి.) అను వాక్యములలో జడములైన తేజస్సు, ఉదకము అనువానికి ఈ క్షణము - ఆలోచనము - సంకల్పము వర్ణింప బడినది. జడ వస్తువులయందు వర్ణింపబడిన ఆ ఈక్షణము - ఆ యాలోచనము ముఖ్యము కానేరదు. కాన నది గౌణమైన - అముఖ్యమైన ఈక్షణమే అని చెప్పక తప్పదు. అట్లె ఈ వాక్యములకు పూర్వము పఠింపబడిన ''త దైక్షత'' అను వ్యాములో సద్వస్తువు నందు ప్రతిపాదింప బడిన ఈక్షణమును గౌణమే ఏలకారాదు అని ఆక్షేపమురాగా నీసూత్రము చెప్పబడుచున్నది. సద్వస్తువునందు వర్ణింపబడిన ఈ క్షణము గౌణమేకాని ముఖ్యము కాదు. కాన జగత్కారణముగా వర్ణింపబడిన సద్వస్తువు ప్రధాన తత్త్వమే అని చెప్పవచ్చును అనియనుట తగదు. ఏలయన - ఆప్రకణములోని ''అనేన జీవే నాత్మనా'' ''నఆత్మా'' అను వాక్యములలో జగత్కారణమైన ఆసద్వస్తువే ఆత్మయని నిశ్పయింపబడి యున్నది గనుక. చైతన్య స్వరూపమైన బ్రహ్మయందే ఆత్మశబ్దమును ప్రయోగించుట యుక్తి యుక్తమగును కాని అచేతనమగు ప్రధానమునందు కాదుగదా. ఆత్మ చేతనము - ప్రథానము అచేతనము = జడము. చేతనా చేతనములగు నీ రెంటికి అభేదమెట్లు పొసగును. కాన సద్వస్తువునందు వర్ణింపబడిన ఈ క్షణము గౌణము కాదనియు - ముఖ్యమే అనియు - జగత్కారణమగు ఆసద్వస్తువు సర్వజ్ఞమగు - చేతనమగు బ్రహ్మవస్తువే అనియు సిద్ధమగుచున్నది.
7. సూ: తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్
వివృతిః :- ఆత్మశబ్దః న చేతనమాత్రవిషయః. ''భూతాత్మా'' ''ఇంద్రియాత్మా'' ఇత్యాదిషు అచేతనేపి భూతాదౌ ఆత్మశబ్దప్రయోగస్య దృష్టత్వాత్. అతః ఆత్మశబ్దాత్ సతి శ్రూయమాణం ఈక్షణం ముఖ్య మేవ న గౌణ మితి కుతో నిశ్చీయతే ఇత్యత ఆహ - తన్నిష్ఠస్య = సత్పదార్థే నిష్ఠా ఆభేదజ్ఞానం సద్రూవం బ్రహ్మైవాహ మిత్యా కారకం యస్య తస్య మోక్షోపదేశాత్= ''తస్య తావదేవచిరం'' ఇత్యాది వాక్యేన మోక్ష స్యోపదిష్టత్వాత్ సచ్ఛబ్దవాచ్యం బ్రహ్మైవ, న ప్రధానం. న హి కదాపి చేతనస్య మోక్షయితవ్యస్య పుంసః అచేతనప్రధాననిష్ఠయా (అచేతన ప్రధానాభేద జ్ఞానేన) మోక్ష స్సంభవతి. అతః ఆత్మశబ్దో೭త్ర చేతనవిషయ ఏవేతి, సచ్ఛబ్దేన ప్రధానం నోచ్యత ఇతి, ఆత్మశబ్ద సంబంధాత్ సతి శ్రూయమాణం ఈక్షణం ముఖ్య మేవేతి చ నిశ్చీయతే.
వివరణము :- భూతాత్మా - ఇద్రియాత్మా అను నిట్టి ప్రయోగములలో అచేతనములైన భూతేంద్రియాదుల యందును ఆత్మ శబ్ద ప్రయోగము కానుపించుచుండుటచే ఆత్మశబ్దము చేతన వస్తువును మాత్రమే బోధించును, అచేతన వస్తువును బోధించదు, అను నియమము లేదు అని యేర్పడుచున్నది. కనుక పూర్వ సూత్రములో సూచించినట్లు ఆత్మశబ్ద సంబంధము వలన సద్వస్తువునందు వర్ణింపబడిన ఈ క్షణము గౌణము కాదని యెట్లు నిశ్చయింపనగును, అని ఆక్షేపమురాగా నీ సూత్రము చెప్పబడుచున్నది - సత్పదార్థమునందు సద్రూపమైన బ్రహ్మయే నేను అనునిష్ఠ - అభేద జ్ఞానము కల పురుషునకు ''తన్య తావ దేవ చిరం'' అని మోక్ష ముపదేశింపబడినది. ఆ ఉపదేశమునుబట్టి సచ్ఛబ్ద వాచ్యమైన వస్తువు బ్రహ్మయే అనియు - ప్రధానము కాదనియు నిశ్చయింపదగును. మోక్షమును పొందు చేతనుడగు పురుషునకు అచేతన ప్రధానాభేద జ్ఞానమున ముక్తిలభించు ననుట యుక్తముకాదు గదా! కాన నీ ప్రకరణమున వాడబడిన ఆత్మ శబ్దము అచేతనవాచి యన వీలులేదు. చేతనవాచియే యనవలయుననియు, అట్టి ఆత్మశబ్ద సంబన్ధము వలన సత్పదార్థమునందు వర్ణింపబడిన ఈక్షణము గౌణము కాదనియు, సచ్ఛబ్దముచేత అచేతనమగు ప్రధానము చెప్పబడనేర దనియు నిశ్చయింపబడు చున్నది.
8. సూ: హేయత్వావచనా చ్చ
వివృతిః :- ప్రధానస్య సచ్ఛబ్దావాచ్యత్వే హేత్వంతర ముచ్యతే-హేయత్వావచనాత్ =హేయత్వస్య - అవచనాత్= అనభిధానాత్. సాంఖ్యాస్తు హానాయైవ ప్రధానస్య జ్ఞేయత్వం వర్ణయంతి. యది ఛాందోగ్యే సచ్ఛబ్దేన అనాత్మైవ ప్రధానం వివక్షితం స్యాత్, తర్హి ముఖ్య మాత్మానముపదిదిక్షుణా శాస్త్రేణ తస్య సత్పదవాచ్యస్య నాయ మాత్మా ఇతి హేయత్వ మపి వక్తవ్యం స్యాత్ స్థూలారుంధతీన్యాయేన- తథాహేయత్వావచనాత్= తథా సచ్ఛబ్దవాచ్యస్య వస్తునః హేయత్వానుక్తేః సచ్ఛబ్దవాచ్యం న ప్రధాన మితి. చ=అయం చ శబ్దః హేత్వంతర ప్రదర్శనార్థః. ప్రధానస్య సచ్ఛబ్ద వాచ్యత్వాంగీకారే ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం య త్ర్పతిజ్ఞాతం త ద్విరుధ్యేత. అతో೭పి న సచ్ఛబ్దవాచ్యం ప్రధా నమితి.
వివరణము :- ''స దేవ సోమ్యేద మగ్ర ఆసీత్'' (ఉద్దాలక మహర్షితన కుమారుడగు శ్వేతకేతువునకు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ సౌమ్యుడా! ఈ పరిదృశ్య మానమగు గిరినదీ సముద్రాది రూపమగు సమస్త ప్రపంచము సృష్టికి పూర్వము సన్మాత్రమే అయి యుండెను. ఆ సన్మాత్రమగు వస్తువు దేశకాలవస్తు పరిచ్ఛేదశూన్య మైనది. అని) ఈ ఛాన్దోగ్య శ్రుతిలోజగత్కారణమగు పదార్థమును బోదించు సచ్ఛబ్దముచే ప్రధానము చెప్పబడదు అని అనుటలో మరియొక యుక్తిని సూచించు చున్నారు - సాంఖ్యులు తమ శాస్త్రములో ప్రధానమును తెలిసికొనుట దానిని పరిత్యజించుటకొఱకే అని వర్ణించియుండిరి. అట్లుకాగా సత్పదముతో అనాత్మయగు ప్రధానమునే శ్రుతిచెప్పదలచినచో ముఖ్యాత్మ స్వరూపమును బోధింపబూనిన ఆ శాస్త్రము స్థూలారుంధతీ న్యాయానుసారము ఆనాత్మయగు ప్రధానమును మున్ముందుగ నాత్మ స్వరూపముగ సచ్ఛబ్ధముతో బోధించి ఆ తరువాత ఇది ముఖ్యాత్మకాదని, ఇది పరిత్యజింప దగినదని, హేయత్వమును దానిని వర్ణించవలసి యుండును. అట్లు హేయత్వ మాప్రకరణములో నెచ్చటను సచ్ఛబ్దవాచ్య వస్తువునకు చెప్పబడక పోవుటతో సచ్ఛబ్ద వాచ్యవస్తువు ప్రధానముకానేనరదని తేలుచున్నది. ఈ సూత్రములోని ''చ'' అను పదము ఆ భాందోగ్య శ్రుతిలోని సచ్ఛబ్దవాచ్యవస్తువు ప్రధానమే యైనచో ఆ శ్రూతిలోనే వర్ణింపబడిన ''ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ'' ఉపపన్నము కాకపోవును. కాన సచ్ఛబ్దార్థము ప్రధానము కాదుఅను విశేషమును గూడ సూచించుచున్నది.
9. సూ: స్వాప్యయాత్
వివృతిః :- స్వాప్యయాత్= స్వస్మిన్ =ప్రకడతే సచ్ఛబ్దవాచ్యే స్వస్వ రూపే అస్యయాత్. ''సతా సౌమ్య తదా సంపన్నో భవతి. స్వగ్‌ంహ్యపీతో భవతి'' ఇత్యాదినా సుషుప్తౌ తస్మిన్ సర్వేషాం జీవానాం లయన్య వర్ణనాత్ సచ్ఛబ్దవాచ్యం చేతనం బ్రహ్మైవ జగత్కారణం, నాచేతనం ప్రధాన మితి నిశ్చేతవ్యో భవతి. న హ్యచేతనే ప్రధానే చేతనానాం జీవానాం కదాపి లయ ఉపపద్యతే.
వివరణము :- శ్రుతిలోని సచ్ఛబ్దము ప్రధాన బోధకము కానేరదనుటలో యుక్త్యంతర మిట ప్రదర్శింప బడుచున్నది. సుషుప్తి దశయందు జీవుల స్థితిని వర్ణించుచు శ్రుతి ''సతా సోమ్య తదా సంపన్నో భవతి'' అను వాక్యములో జీవుడు సుషుప్త్యవస్థలో నా సద్వస్తువునం దేకీభవించును అనుచు సచ్చబ్దవాచ్య వస్తువగు స్వ స్వరూపములో సర్వజీవులు లయింతురని వర్ణించినది. కాన సచ్ఛబ్ద వాచ్యవస్తువు చేతనమైన బ్రహ్మయే కాని అచేతనమగు ప్రధానము కానేరదని నిశ్పయింపనగును. అచేతనమగు ప్రధానమున చేతనులగు జీవుల కెన్నడును లయము సంభవించుదు కదా!
10. సూ: గతి సామాన్యాత్
వివృతిః :- గతి సామాన్యాత్=గతేః= అవగతేః - సర్వ వేదాంతవాక్య జన్యస్య అవబోధస్య సామాన్యాత్=ఏ కవిధత్వాత్ ''ఆత్మన స్సర్వే ప్రాణాః'' ''ఆత్మన ఏష ప్రాణో జాయతే'' ఆత్మన ఆకాశ స్సంభూతః'' ఇత్యాదినా సర్వేషు వేదాంతేషు ఐక్యరూపేణ చేతనస్య ఆత్మ ఏవ కార ణత్వ ప్రతిపాదనా దపి న సచ్ఛబ్దవాచ్యం ప్రధానం భవతీతి నిశ్చీయతే.
వివరణము :- ''ఆత్మన స్సర్వే ప్రాణాః'' ''ఆత్మన ఏష ప్రాణో'' ''ఆత్మన ఆకాశ స్సంభూతః'' ఇట్లనేకములగు వేదాన్త వాక్యములు ఆత్మ నుండియే సర్వ ప్రాణములును జనించినవి యనియు, ఆత్మనుండియే యీ ప్రాణము పుట్టెననియు, అత్మనుండియే ఆకాశము ఉదయించెననియు వర్ణించుచు నొకేవిధముగ చేతనమగు నాత్మయే జగత్కారణమని బోధించుచుండుట చేతను గూడ అచేతనమగు ప్రధానము జగత్కారణ పదార్థమును బోధించు సచ్ఛబ్దముచే చెప్పబడదని నిశ్చయింపబడు చున్నది.
బ్రహ్మసూత్ర వివృతిః
11. సూ: శ్రుతత్వా చ్చ
వివతిః :- చ=కించ - శ్రుతత్వాత్=''జ్ఞః కాలాకాలః'' ఇతి సర్వజ్ఞం బ్రహ్మ ప్రక్రమ్య తదేవ బ్రహ్మ సర్వ జగత్కారణ మితి ''న కారణం కారణ కారణాదిపో న చాన్య కశ్చిజ్జనితా'' ఇత్యాదినా శ్వేతాశ్వతరోపనిషది సాక్షా దేవ సర్వజ్ఞస్య చేతనస్య బ్రహ్మణ ఏవ జగత్కారణత్వ శ్రవణాత్ సచ్ఛబ్దవాచ్యం జగత్కారణం వస్తు సర్వజ్ఞం బ్రహ్మైవ., న త్వచేతనం ప్రధానం మన్యద్వా.
వివరణము :- శ్వేతాశ్వతరోపనిషత్తులో ''జ్ఞః కాలకాలః'' అని సర్వజ్ఞమౌ పరమాత్మను వర్ణించుచు నాప్రకరణములో ''స కారణం కారణకారణాధిపః'' ఆ పరమాత్మయే సర్వ జగత్కారణమును, పరిపాలకుడును అని వర్ణించుచు సర్వజ్ఞుడౌ పరమాత్మయే జగత్కారణమని స్ఫుటముగ ప్రతిపాదింపబడి యుండుటచేత సర్వజ్ఞమైన (చేతనమైన) బ్రహ్మయే జగత్కారణమగును గాని అచేతనమగు ప్రధానముగాని - అన్యముగాని సచ్ఛబ్దవాచ్యమగు జగత్కారణ వస్తువు కానేరదని ధ్రువపడుచున్నది.
ఆనందమయాధి కరణమ్-6
12. సూ ఆనందమయో೭భ్యాసాత్
వివృతిః :- ఏతావత్పర్యంతం పూర్వసూత్రై స్సర్వజ్ఞం సర్వశక్తి బ్రహ్మైవ జగజ్ఞన్మాదికారణం న సాంఖ్యప్రతిపాదితం ప్రధాన మన్యద్వేతి ప్రతిపాదితం. ఏకమపి తద్ర్బహ్మ నిరస్తోపాది సంబంధం సత్ జ్ఞేయత్వేన, ''ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా'' ఇతి న్యాయేన కల్పితో పాధి సంబంధం స దుపాస్యత్వేన చ వేదాంతే షూపదిశ్యత ఇతి ప్రదర్శనాయేత ఉత్తరో గ్రంథ ఆరభ్యతే- ఆనందమయః= అత్ర త్యానందమయశ##బ్దేన తైత్తిరీయోపనిష ద్యానందవల్ల్యాం శ్రూయమా ణానందమయ వాక్యాంతర్గత ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్టా'' ఇతి వాక్యఘటకీభూతం బ్రహ్మోచ్యతే. తత్ బ్రహ్మ ఆనందమయ స్యావయవత్వేన వివక్ష్యతే వా, స్వప్రాధాన్యేన వివక్ష్యతే వా? ఇతి సందేహే, అవయవత్వే నాత్ర బ్రహ్మ నోపదిశ్యతే, కింతుస్వప్రాధాన్యే నైవేతి నిర్ణీయతే. కుతః? అభ్యాసాత్=''అసన్నేవ స భవతి'' ఇత్యానందమయ కోశనిగమన శ్లోకే ''అస్తి బ హ్మేతి చే ద్వేద'' ఇత్యాదినా కేవలస్య బ్రహ్మణ ఏవాసకృ దుక్తత్వాత్.
వివరణము :- ఇంతవరకు గడచిన గ్రంథములవల్ల సర్వజ్ఞము, సర్వశక్తిమంతము నగు బ్రహ్మమే జగజ్జన్మాది కారణము గాని సాంఖ్యదర్శనాది సిద్ధ ప్రధానాదులు కాదని నిరూపించు బడినది. అట్టి అద్వితీయమగు ఆ బ్రహ్మ వస్తువే ఉపాధిసంబంధ విరహితమగుచు జ్ఞేయముగను, ''ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా'' అను వాక్యానుసారము కల్పిత నామరూపాద్యుపాధి సంబంధము కలది యగుచు నుపాస్యముగాను ఇట్లు రెండు విధములుగ వేదాంతముల యందు (ఉపనిషత్తుల యందు) ప్రతిపాదింప బడుచున్నది యని నిరూపించుటకై యీ పై గ్రంథము ప్రారంభింవ బడుచున్నది.
ఈ సూత్రములోని ఆనందమయ శబ్దమునకు తైత్తిరీ యోపనిషత్తు నందలి బ్రహ్మవల్లిలోని ఆనందమయ ప్రకరమాన్తర్గత ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్టా'' అను వాక్యమునందు ప్రతిపాదింప బడుచున్న బ్రహ్మ వస్తువు అని యర్థము, ఆ బ్రహ్మ వస్తువు ఆనందమయున కవయవమగు పుచ్ఛముగ నిచట ప్రతిపాదింప బడుచున్నదా? లేక స్వప్రధానముగనే ప్రతిపాంపబడు చున్నదా? యని సందేహము. అనగా ఈ గ్రంథములో ఆనందమయ వస్తువును ప్రతిపాదింప దలచి బ్రహ్మ ఏ వస్తువునకు పుచ్ఛము=తోక అను అవయవము అగుచున్నదో అది ఆనందమయము అని నిరూపింప బడుచున్నాదా? బ్రహ్మ వస్తువునే ప్రతిపాదింపదలచి అన్నమయా ద్యానందమయాంత కోశములకు పుచ్ఛము=పుచ్ఛ భాగమువలె ఆధారమైన వస్తు (సర్వాధారవస్తు) వెద్దియో అది బ్రహ్మ వస్తువని నిరూపింప బడుచున్నదా? అను సందేహము కలుగగా స్వప్రాధాన్యముతో=బ్రహ్మ వస్తువును నిరూపించుట కొఱకే ''ణ్రహ్మ పుచ్ఛం ప్రతిష్టా'' అని యిట వర్ణింపబడు చున్నది గాని మరియొక దాని (ఆనందమయ వస్తువు యొక్క) అవయవమము (పుచ్ఛము=తోక) గ బ్రహ్మ ఇచట ప్రతిపాదింప బడుటలేదని నిర్ణయము. ఏలయన? ''అస న్నేవ స భవతి| అసద్ర్బహ్మేతి'' అని ఆనందమయ కోశమునకు నంబంధించిన నిగమన శ్లోకములోను, ఆ పై గ్రంథమునను బ్రహ్మమే అభ్యసింప బడుచున్నది. (అనేక పర్యాయములు చెప్పబడుచున్నది) గాని ఆనందమయుడట్లు చెప్పబడుట లేదు కనుక ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా'' అను వాక్యమునందు వర్ణింపబడిన బ్రహ్మ స్వప్రాధాన్యముతో (బ్రహ్మ స్వరూప నిరూపణార్థమే) ఇట వర్ణింపబడిన దనియు - ఆనందమయము అట్లు అభ్యసింపబడలేదు (పునః పునః చెప్పబడలేదు) గాన ఆనందమయ వస్తు స్వరూప నిరూపణార్థము కాదనియు నిర్ణయింపదగి యున్నది.
13. సూ వికారశబ్దా న్నేతి చేన్న ప్రాచుర్యాత్
వివృతిః :- ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్టా'' ఇత్యాత్రావయవ వాచి పుచ్ఛ శబ్ద సామానాధికరణ్యాత్ బ్రహ్మ శబ్ద స్యావయవపరత్వం కుతో న స్యా దిత్యాశంకాయా మిదం సూత్రమ్ - వికారశబ్దాత్=అవయవవాచి పుచ్ఛశబ్ద సామానాథి కరణ్యాత్-నేతిచేత్=బ్రహ్మశబ్దో న స్వప్రధాన బ్రహ్మపరః, కింతు ఆనందమయ స్యావయవపర ఏవే త్యుచ్యతే చేత్-న=న ఇత్యనేన పూర్వోక్తః పక్షః ప్రతిషిద్ధ్యతే-తథోక్తిర్న యుక్తెత్యర్థః-కుతః? ప్రాచుర్యాత్=అవయవప్రాయ ప్రయోగాత్ బ్రహ్మపుచ్ఛ మిత్యుచ్యతే, న అవయవ వివక్షయేతి వక్తవ్యం-పూర్వ త్రాన్నమయాదీనాం హి శిర ఆదిషు పుచ్ఛాంతే ష్వవయవే షూక్తేషు తా మేవ మర్యాదా మనుసృత్య ఆనందమయ స్యాపిశిర ఆదీ న్యవయవాంతరా ణ్యుక్త్వా అవయవ ప్రాయాపత్త్యా ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా''ఇతి అత్రా ప్యుచ్యతే, నావయవవ్రివక్షయా. యదేతత్ స్వప్రాధాన్యే నైవాత్ర బ్రహ్మ ప్రతిపాదిత మితి, తదేతత్ అభ్యాసా దితి హేతూక్త్యా సమర్థితం పూర్వసూత్రే. అతః పుచ్ఛ మిత్యస్య పుచ్ఛవ దాధార ఇత్యర్ధో వర్ణనీయః. కించ ప్రతిష్ఠాపద సమభివ్యాహారా చ్చ పుచ్ఛశబ్ద స్యాధారపరత్వమవసీయతే. అతోత్ర స్వప్రాధాన్యే నైన బ్రహ్మోచ్యతే నావయవ వివక్షయేతి నిశ్చీయతే.
వివరణము :- ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా'' అను నీ వాక్యమున అవయవ విశేషమునుబోధించు పుచ్ఛ శబ్దముతోసహ ''బ్రహ్మపుచ్ఛం అని సమానాధికరణముగ బ్రహ్మ వర్ణింపబడి యున్నది గాన బ్రహ్మ ఆనందమయుని పుచ్ఛము-అవయవముగానే వర్ణింప బడినదని యేల అనరాదు. అను నాశంకకు ఈ సూత్రములో సమాధానము చెప్పబడుచున్నది.
ఇచట బ్రహ్మశబ్దము పుచ్ఛమను అవయవమును భోదించు పుచ్ఛ శబ్దముతో సమానమగు (ఒకే) విభక్తికలిగియున్నది గాన స్వప్రధానముగ బ్రహ్మను బోధించును అని యనుటకు వీలులేదు. ఏలయన? ప్రాచుర్యాత్=అవయవప్రాయ పాఠమువలన - పూర్వగ్రన్థములో అన్నమాయాది కోశములకు శిరస్సు - పక్షము - ఆత్మ - పుచ్ఛము - అను అవయవములను వర్ణించుచు ఆప్రకరణ ప్రవాహములో నదేరీతిని ఆనందమయ కోశమునకు గూడ నట్లే అవయవములను కల్పించి ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్టా'' అని వర్ణింపబడినదే గాని, ఆనందమయుని అవయమును బోధించుటకై కాదు. కనుక నిచట బ్రహ్మ స్వప్రధానముగనే వర్ణింప బడుచున్నది యని తేలుచున్నది. బాగుగ విచారించిచూడ అన్నమయాది కోశములకు వర్ణింపబడిన శిరః పక్షా ద్యవయవములున్నూ కల్పితములే కాని వాస్తవములు కావు, ప్రాణాదులకు శిరఃపక్షపుచ్ఛాదులు సంభవించవు కదా! కాన నిచట అవయవబోధక శిరః పక్షాత్మ పుచ్ఛ శబ్దములు అవయవ వివక్షయా ప్రయోగింప బడినవి కావు అని తెలియదగును. ఈ యంశము పూర్వ సూత్రమున ''అభ్యాసాత్'' అను హేతూపన్యాసముతో సమర్థింప బడినది. కాన నిచటీ పుచ్ఛ పదమునకు పుచ్ఛమువలె ఆధారమగు వస్తువు అను అర్థము చెప్పదగును. మఱియు స్థితిహేతువు అను అర్థమును బోధించు ప్రతిష్ఠా అను పదముతో కూడియున్నది గాన నీ పుచ్ఛశబ్దమునకు ఆధారము అను అర్థమునందే తాత్పర్యము అని స్పష్టమగుచున్నది. కాన సర్వాధారమగు బ్రహ్మ యిచట వర్ణింప బడుచున్నదని, అన్యావయవముగ నిచట బ్రహ్మ వర్ణింపబడుట లేదని నిశ్చయింపదగును.
14. సూ తద్ధేతు వ్యపదేశా చ్చ
వివృతిః :- చ=కించ - తద్దేతువ్యపదేశాత్=తస్య సర్వ స్య సానందమయస్య వికారజాతస్య హేతుత్వ వ్యపదేశాత్=హేతుత్వేన ''ఇదగ్‌ంసర్వ మసృజత'' ఇతి వాక్యే ఉక్తత్వాత్. తథా చ సర్వకారణం తద్ర్బహ్మస్వవికార స్యానందమయ స్వావయవ ఇతి వక్తుం నోపపద్యతే. న హికారణం కార్య స్వావయవో భవితు మర్హతి.
వివరణము :- ''ఇదగ్‌ం సర్వ మసృజత| యదిదం కిం చ'' అను వాక్యముతో ఆనందమయ కోశముతోసహ ఈ దృశ్యమానమగు కార్యమగు నీ సమస్త ప్రపంచమునకు కారణమైనది బ్రహ్మయని వర్ణింపబడియున్నది గానను బ్రహ్మ ఆనందమయా వయవ మనుటకు వలనుపడదు. కార్యమునకు పూర్వమే సిద్ధమైయుండి ఆ కార్యము నుత్పాదన జేయు కారణము కార్యము యొక్క అవయవమని యనుట యుక్తియుక్తము కానేరదు.
15. సూ: మాంత్రవర్ణిక మేవ చ గీయతే
వివృతిః :- కించ మాంత్రవర్ణిక మేవ ''బ్రహ్మవి దాప్నోతి వరం'' ఇతి వాక్యే యస్య జ్ఞానా న్ముక్తి రుక్తా, యచ్చ ''సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'' ఇతి మంత్రే వర్ణితం, యచ్చ తత్ర స్వప్రధానత యైవనిర్దిష్టం తదే తద్ర్బహ్మ మాంత్రవర్ణిక మిత్యుచ్యతే మంత్రేణ వర్ణిత మితిహేతోః. గీయతే=తదేవాత్ర బ్రాహ్మణవాక్యే ''బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠా'' ఇతి ప్రతిపాద్యతే - నియతం హి మంత్రబ్రాహ్మణయో రేకార్థకత్వం. అతః అత్ర పుచ్ఛవాక్య ప్రతిపాదిత మపి బ్రహ్మ నాన్య స్యావయవో భవితు మర్హతి. కింతు స్వప్రధాన మేవేతి వక్తవ్యమ్.
వివరణము :- మాంత్ర వర్ణికం= ''బ్రహ్మవిదాప్నోతి పరం'' అను బ్రహ్మవల్లి (తైత్తిరీ యోపనిషత్తు) యొక్క ఉపక్రమ వాక్యములో ఏ బ్రహ్మ యొక్క విజ్ఞానము ముక్తి హేతువుగ నిర్దేశింప బడినదో ఆ బ్రహ్మమే ''సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ'' అను మన్త్రములో ప్రధానజ్ఞేయముగ - సత్యం=త్రికాలాబాధ్యము అనియు, జ్ఞానం=జ్ఞాన (జ్ఞప్తి) మాత్ర స్వరూపము అనియు అనన్తం=త్రివిధ (దేశ, కాల, వస్తు) పరిచ్ఛేద రహితమనియు వర్ణింపబడి యున్నది. ఇట్లు మన్త్ర ప్రతిపాదితమైన బ్రహ్మవస్తువునకే మాంత్రవర్ణిక మని పేరు. ఆ బ్రహ్మయే ''బ్రహ్మపుచ్ఛం'' అని బ్రాహ్మణ వాక్యములో వర్ణింప బడినది. కనుక నా బ్రహ్మము మరియొక దాని అవయవము అని యనుట యుక్తముకాదు. మన్త్రవాక్య బ్రహ్మణ వాక్యము లేకార్థకములుగనే యుండవలయునని గదా శాస్త్రవిదుల నిర్ణయము. (బ్రాహ్మణ వాక్యములు మన్త్ర వాక్య వ్యాఖ్యాన రూపములు గాన మన్త్ర బ్రాహ్మణము లేకార్థకములుగానే యుండవలయును.) కనుక పుచ్ఛ వాక్యములో ప్రతిపాదింప బడిన బ్రహ్మ స్వప్రధానమే గాని అన్యావయవము కానేరదు.
16. సూ: నేతరో೭నుపపత్తేః
వివృతిః :- ఆనందమయ కోశ గ్రంథస్థ ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా'' ఇతి వాక్యే ఉపాసనార్థ మానందమయస్య జీవస్య పూచ్ఛరూ పావయవత్వే నైవ బ్రహ్మ నిర్దిష్టమ్. న స్వప్రాధాన్యే నే త్యాశంకాయా మిద ముచ్యతే. ఇతరః న=బ్రహ్మణః ఇతరః జీవః ఆనందమయరూపః అత్ర గ్రంథే ఉపాస్యత్వేన న ప్రతిపాద్యతే. కుతః? అనుపపత్తేః= ఉపక్ర మోపసంహారాదిభిః అన్య ప్రకరణస్య జ్ఞేయ బ్రహ్మ పరత్వస్య నిశ్చితత్వా ద్ధేతోరత్ర ప్రకరణ ఉపాసనా ప్రసంగో నోపపద్యతే. అతః పుచ్ఛవాక్యే బ్రహ్మస్వప్రధానత యైవ నిర్దిష్టం, నాన్యావయవత్వే నేత్యుచ్యతే.
వివరణము :- ఆనందమయ కోశమునందలి ''బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్టా'' అను వాక్యములో ఉపాసన కొఱకు ఆనందమయుని (ఒకానొక జీవుని) యొక్క పుచ్ఛము అను అవయవముగ బ్రహ్మ నిర్దేశింప బడినది గాని స్వప్రాధాన్యముతో బ్రహ్మ యిచట వర్ణిపబడలేదు. అను నాశంకకు సమాధాన మిచట చెప్పబడు చున్నది.
పరమాత్మకంటె ఇతరుడైన ఆనందమయుడు (ఒకానొక జీవుడు) ఇచట నుపాస్యముగ ప్రతిపాదింప బడుచున్నాడు అని యనుట పొసగదు. ఏలయన? అనుపపత్తేః=ఉపక్ర మోపసంహారాది తాత్పర్య నిర్ణాయక ప్రమాణములచేత నీ ప్రకరణ మంతయు జ్ఞేయమగు వర బ్రహ్మమునందే తాత్పర్యము కలది యని నిర్ణయింపదగి యుండుటచే నీ ప్రకరణములో నుపాసనా ప్రసంగమును దెచ్ఛుట అనుపపన్నము. కాన పుచ్ఛ వాక్యములో బ్రహ్మ స్వప్రధానముగనే నిర్దేశింప బడినదిగాని ఆనందమయావయముగ నిర్దేశింప బడలేదని నిశ్చయింపనగును.
17. సూ: బేదవ్య పదేశాచ్చ
వివృతిః :- చ=కించ - భేదవ్యపదేశాత్= భేదేన వ్యపదేశః=భేద వ్యపదేశః, తస్మాత్ - భేదేన=అన్నమయాది పర్యాయ చతుష్టయా పేక్షయా ఆనందమయస్య ఫలానిర్దేశరూప వైలక్షణ్యన - వ్యపదేశాత్=నిర్దేశాత్. నానందమయ స్యోపాసన మత్ర విపక్షిత మితి వక్తుం శక్యతే. అతో೭త్ర బ్ర హ్మస్వప్రా ధాన్యే నైవ నిర్దిష్ట మితి నిశ్చీయతే.
వివరణము :- అన్నమయాది కోశములను వర్ణించుచు ''సర్వం వైతే೭న్న మాప్నువన్తి'' ఇత్యాది వాక్యములలో అన్నమయోపాసన చేయువారు సర్వవిధమైన అన్నసమృద్ధిని పొందుదురు అని యిట్లు అన్నమయాది కోశచతుష్టయమునకు సంబంధించిన ఉపాసనాఫలములు నిర్దేశింపబడియున్నవి. ఆనందమయోపాసనము కూడ శ్రుతికి వివక్షితమగుచో ఆనందమయో పాసనము యొక్క ఫలము గూడ నిచట ప్రతిపాదింపబడి యొండెడిది. అట్లు ఫలము ప్రతిపాదింపబడి యుండలేదు. ఇట్లు ఫలనిర్దేశము లేకుండుట యను భేదముతో (వైలక్షణ్యముతో) ఆనందమయ కోశము వర్ణింపబడి యున్నది కాన పుచ్ఛ వాక్యములో ఉపాసనార్థము ఆనందమయా వయవముగ బ్రహ్మ ప్రతిపాదింప బడినది యనుట యుక్తము కాదనిన్నీ, స్వ ప్రధానముగనే ప్రతిపాదింపబడి యున్నదనిన్నూ నిశ్చయింపదగును.
18. సూ కామా చ్చ నానుమా నాపేక్షా
వివృతిః :- పంచమ స్థాన సంబన్ధ మాశ్రి త్యానందమయస్య బ్రహ్మత్వంకుతో న స్యా దిత్యా శంకాయా మిద ముచ్యతే - చ = అపి చ - కామాత్ = కామ్యత ఇతి కామః=ఆనందః - ఆనందరూపం చ బ్రహ్మ. తస్య భృగువల్ల్యాం ''ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్'' ఇతి పంచమస్థానే నిర్దిష్టత్వాత్ అతః నానుమా నాపేక్షా=బ్రహ్మవల్ల్యాం పంచమస్థానే నిర్దిష్ట స్యానందమయ స్యాపి బ్రహ్మత్వ మనుమీయతే స్థానసంబంధా దిత్యనుమా నాపేక్షా న కర్తవ్యా - కుత)? ఆనందమయశబ్ద ఘటకీభూత వికారార్థక మయట్ఛబ్దంవిరోధాత్ - న హి వస్తు స్వస్వరూప మనపేక్ష్య తత్థ్సానసంబన్ధ మాత్రమాశ్రితియ తదేవ భవతి. నా హ్యశ్వస్థానే బద్ధా గౌ రశ్వో భవతి - అతః ఆనందమయో న బ్రహ్మ.
వివరణము :- ఆనందమయునికి పంచమస్థాన సంబంధము ననుసరించి బ్రహ్మత్వము ఏల సిద్ధించదు అను శంకకిట సమాధానము చెప్పబడుచున్నది.
కామ్యత ఇతి కామః= విశేషముగ కోరబడునది. ఈ వ్యుత్పత్తి ననుసరించి కామము అనగా ఆనందము అని యర్థము - ఆనందరూపము బ్రహ్మయని సర్వవేదాన్త సిద్ధాంతము. భృగువల్లిలో ''ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్'' బ్రహ్మము ఆనంద స్వరూపము అని వరుణ పుత్రుడు భృగువు తెలిసికొనియెను అని వర్ణింపబడి యుండెను. అన్నమునుండి ఐదవ స్థానములో నానందరూపము బ్రహ్మయని వర్ణింపబడి యున్నట్లే ఈ బ్రహ్మవల్లిలోగూడ (అన్నమయ కోశమునుండి) ఐదవ స్థానమున వర్ణింపబడిన ఆనందమయుడును స్థానసామ్యమును పుచ్చుకొని బ్రహ్మయే యని నిశ్చయింప వచ్చును. ఏలయన? పంచమస్థానస్థితము గనుక అని అనుమానము నిటయ వాడగూడదు. కారణమేమన? ఆనందమయ శబ్ధము వికారార్థకమయట్ఛబ్దముతో గూడుకొని యున్నది కనుక. ఏవస్తువైనను తానుమరియొక వస్తువు యొక్క స్థానమును చేరినంత మాత్రమున తన స్వరూపమును కోల్పోయి ఆ వస్తువే తాను కానేరదు - గుర్రమును కట్టుచోటున ఆవును కట్టినచో ఆ ఆవు తాను గుర్రమగునా? కాన స్థాన సామ్యమును పుచ్చుకొని ఆనందమయుడు బ్రహ్మయని తలంచుట యుక్తము కాదు.
19. సూ అస్మి న్నస్య చ తద్యోగం శాస్తి
వివృతిః :- చ=కించ - అస్మిన్=పుచ్ఛవాక్యోక్తే బ్రహ్మణి అస్య=అహ మేవ బ్రహ్మేతి ప్రబోధవతః, అ స్యానందమయస్య (జీవస్య) తద్యోగం=బ్రహ్మభావం - శాస్తి= ''యదా హ్యేవైష ఏతస్మి న్నదృశ్యే'' ఇత్యాది శాస్త్రం నిరూపయతి. తదేత ద్ర్బహ్మావాస్తి లక్షణం ఫలం ''బ్రహ్మవిదాప్నోతి పరం'' ఇత్యాది నోపక్రాంతం. తచ్చ బ్రహ్మాత్మ నావస్థాన లక్షణం ఫలం నిర్విశేష స్వతంత్ర బ్రహ్మావబోధా దేవ భవతి. నానందమయ స్యోసాసనా ద్వా, నాప్యానందమ యాంగ బ్రహ్మవిజ్ఞానా ద్వా సంభవ తీతి పుచ్ఛవాక్యోక్తం బ్రహ్మ స్వప్రధాన మేవేతి నిర్ణేయమ్. కృ త్స్నేయం బ్రహ్మవల్లీ నిర్విశేష బ్రహ్మతత్త్వ ప్రతిపాదన పరైవేతి నిర్ధారయితు మేవాయం విచారంః ప్రవర్తితః.
వివరణము :- పుచ్ఛవాక్యమందలి బ్రహ్మ స్వప్రధానమే యనుటలో హేత్వంతరము సూచింప బడుచున్నది. ''బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా'' అను నీ వాక్యమునందు ప్రతిపాదింపబడిన బ్రహ్మమునందు నేనే ఆ సర్వాధార బ్రహ్మ స్వరూపుడ నను సాక్షాత్కారముగల విజ్ఞుడగు నానందమయునకు (జీవునకు) ''యదా హ్యేవైష ఏతస్మిన్'' అను శాస్త్ర (శ్రుతి) వాక్యము బ్రహ్మ భావమును వర్ణించుచున్నది. బ్రహ్మభావాప్తి లక్షణమైన ఆ ఫలమునే ''బ్రహ్మ వి దాప్నోతి పరం'' అని గ్రంథారంభమున శ్రుతి యుపక్రమించి యున్నది. బ్రహ్మ భావ రూపమగు నీ ఫలము స్వతంత్ర, నిర్విశేష బ్రహ్మతత్త్వ జ్ఞానము వలననే సంభవించును గాని ఆనందమయో పాసన వలనగాని, ఆనందమయావయవ బ్రహ్మ విజ్ఞానము వలనగాని సంభవించదు. కాన పుచ్ఛవాక్యోక్త బ్రహ్మము స్వప్రధానమైనదే కాని యన్యధా కాదిని సిద్ధమగు చున్నది. ఈ తైత్తిరీయ శాఖాంతర్గత బ్రహ్మవల్లి యంతయు నిర్విశేష స్వతంత్ర పరబ్రహ్మ తత్త్వ ప్రతిపాదనపరమే అని నిర్ధరించుటకే ఈ ఆనందమయాధికరణ రూపవిచారమిట ప్రదర్శింపబడినది.
అంతరధికరణమ్ 7
20. సూ అంత స్తద్ధర్మోప దేశాత్
వివృతిః :- ఛాన్దోగ్యే శ్రూయతే ''అథ య ఏషో೭న్త రాదిత్యే హిరణ్మయః పురుషః'' ఇత్యాది, ''య ఏషో೭న్తరక్షిణి పురుషః'' ఇత్యాది చ - అంతః=అత్ర ఆదిత్యాంతరే, చక్షురంతరే చ శ్రూయమాణః పురుషః పరమేశ్వర ఏవ - న విద్యాకర్మాతిశయవశా ల్లబ్ధోత్కర్ష స్సంసారీ. కుతః? తద్దర్మోపదేశాత్=తస్య పరమేశ్వరస్య యే ధర్మాః అపహతపాప్మత్వాదయ స్తేషా మిహాదిత్య పురుషే, చక్షుః పురుషే చ వర్ణనాత్ -
వివరణము :- ఛాన్దోగ్యోప నిషత్తునందలి ''అథ య ఏషో೭న్త రాదిత్యే హిరణ్మయః పురుషః'' య ఏషో೭న్తరక్షిణి పురుషః'' ఇత్యాది వాక్యములలో అధిదైవాధ్యాత్మ భేదముతో నాదిత్యునియందును, నేత్రము నందును ఒక హిరణ్మయ పురుషుడున్నట్లు వర్ణింపబడుచున్నాడు. ఆ పురుషుడు పరమేశ్వరుడై కాని - (ఉత్కృష్ట పుణ్య కర్మత పోనుష్ఠా న బలమున లబ్ధమైన మహా మహిమతో గూడికొనియున్న) జీవుడు కాదు. ఏలయన? ఆ హిరణ్మయ పురుషుని యందు పరమేశ్వరునకు సంబంధించిన అపహత పాప్మత్వాది ధర్మములు వర్ణింపబడి యున్నవి. ఆ అపహత పాప్మత్వాది ధర్మములు (పాప సంబంధ మేమియు లేకుండుట మొదలగు ధర్మములు) జీవుని యందుండుట అసంభవము. కనుక నా పురుషుడు పరమేశ్వరుడేనని నిర్ణయింప దగును.
21. సూ భేద వ్యపదేశా చ్చాన్యః
వివృతిః :- చ= కించ - అన్యః= అక్ష్యాదిత్యయే రన్త శ్ర్శూయమాణః ఆదిత్యాదిశరీ రాభిమానినో జీవా దన్యః. కుతః? బేదవ్యపదేశాత్= అంతర్యామి బ్రాహ్మణ ''య ఆదిత్యే తిష్ఠనే'' ఇత్యాదినా ఆదిత్య పురుషతదంతర్యామిణో ర్భేదేన నిర్దేశాత్ ఆదిత్యపురుషా దన్యఏ వాయ మక్ష్యాదిత్యయో రంత శ్ర్శూయమాణః పురుషః, స చ పరమేశ్వర ఏవ.
వివరణము :- ఆదిత్యునియందును, పురుషుని నేత్రమునందును, నున్నట్లు వర్ణింపబడిన ఆ హిరణ్మయ పురుషుడు ఆదిత్యాది శరీరాభిమానియగు జీవునికంటె నన్యుడే. ఎందుచేత ననగా? బృహదారణ్య కోపనిషత్తులోని యన్తర్యామి బ్రాహ్మణములో ''య ఆదిత్యే తిష్ఠన్'' ఎవ్వడు ఆదిత్యునిలోపల నుండి ఆదిత్యునిచే నెరుగబడకయే ఆ అదిత్యుని కార్యముల యందు నియమించు చున్నాడో ఆతడే పరమాత్మయని చెప్పుచు నియమింపబడు ఆదిత్య పురుషునికంటె నియామకుడగు తదస్తర్యామికి భేదమున్నట్లు వర్ణింప బడినది. కనుక నా పురుషుడు జీవభిన్నుడౌ పరమాత్మయే గాని జీవుడు కాదని నిర్ణయింపదగును.
ఆకాశాధికరణమ్8
22. సూ:ఆకాశ స్తల్లింగాత్
వివృతిః :- ఆకాశః=ఛాన్దో గ్యోపనిషది శ్రూయతే ''అస్య లోకన్య కా గతి రితి| ఆకాశ ఇతి హో వాచ'' ఇతి అత్రోక్త ఆకాశః పరమేశ్వర ఏవ, న భూతాకాశః. కుతః? తల్లింగాత్=తస్య పరమేశ్వరస్య యల్లింగంసమస్త మహాభూతాది సృష్ట్యాదికం - తస్య ''సర్వాణి హ వా ఇమాని భూతా న్యాకాశా దేవ నముత్పద్యంతే| ఆకాశం ప్రత్యస్త యన్తి'' ఇత్యాది వాక్యే దృష్టత్వాత్.
వివరణము:- ఛాన్దోగ్యోప నిషత్తునందలి ''అన్య లోకస్య కా గతి రితి| ఆకాశ ఇతి హోవాచ'' ఈ లోకమునకు గన్తవ్యమైన మూల పదార్థమేదియను ప్రశ్నకు ఆకాశ##మే ఆ మూలపదార్థము అను సమాధానము నిచ్చువాక్యములోని ఆకాశ పదముచేత పరమేశ్వరుడే వర్ణింపబడు చున్నాడు కాని భూతాకాశము వర్ణింప బడుటలేదు. ఏలయన? ''సర్వాణి హ వా ఇమాని భూతా న్యాకాశా దేవ సముత్పద్యన్తే'' ఈ పరిదృశ్య మానములగు సమస్త భూతములును ఆకాశమునుండియే సముత్పన్నములగు చున్నవి. అని ఆప్రకరణములోని వాక్యాన్తరమున పరమేశ్వర లింగ (సూచక) మగు సర్వభూత సృష్టికర్తృత్యాది రూపమగు ధర్మము వర్ణింపబడియున్నది. పంచ భూతములలో చేరిన భూతాకాశమునకు సర్వభూత స్రష్టృత్వము సంభవించదు. గనుక (ఆకాశము స్వేతర భూతములను సృజించిన సృజింపవచ్చును గాని భూతములలో నొకటి యగు తనను తాను సృజించుకొనునా? తనను తాను సృజించుకొనుట యనునది సర్వధా అసంగతము గదా !) కాన నిట ఆకాశము అనగా పరమాత్మ యనియే నిర్ణయింపయువలను. ఆ=సమన్తాత్ - కాశ##తే=ప్రకాశ##తే - ఇత్యాకాశః అను వ్యుత్పత్తి ననుసరించి ఆకాశ శబ్దమునకు సర్వత్ర ప్రకాశించు చున్న వస్తువు అని అర్థము. అట్టి వస్తువు పరమాత్మయే.
ప్రాణాధి కరణమ్ 9
23. సూః అత ఏవ ప్రాణః
వివృతిః :- ప్రాణః=ఛాన్దోగ్యే ఉద్గీథప్రకరణశ్రూయతే ''కతమా సా దేవతా-ప్రాణ ఇతి హోవాచ'' ఇతి - అత్ర శ్రూయమాణః ప్రాణశబ్దో బ్రహ్మై వాభిధత్తే, న పంచవృత్తిమంతం ప్రాణమ్ - కుతః? అత ఏవ=తల్లింగా దేవ - తస్య బ్రహ్మణో యల్లింగం తస్య సర్వభూత సంవేశనాది రూపస్య ''ప్రాణ మేవాభి సంవిశంతి'' ఇత్యాది వాక్యే దృష్టత్వాత్.
వివరణము : ఛాన్దోగ్యోపనిషత్తులోని ఉద్గీథ ప్రకరమమునందు ''కతమా సా దేవతా - ప్రాణ ఇతి హోవాచ'' యాగముల యందు గానము చేయబడు సామాంశముల యందలి ప్రస్తావ భాగమున ధ్యానము చేయుట కొఱకు తెలిసికొనదగిన దేవత యెవరు? అను ప్రశ్నకు 'ప్రాణము' అను సమాధానము నిచ్చు ఈ వాక్యములోని ప్రాణశబ్దము పరబ్రహ్మ బోధకమగును గాని ప్రాణవాయు బోధకము కాదు. ఎందు కనగా? పూర్వ సూత్రమునందు చెప్పబడినట్లు సర్వ భూతోత్పత్తి ప్రళయ కారణత్వ రూపమగు పరమేశ్వర లింగము లాప్రకరణములోని ''ప్రాణ మేవాభి సంవిశన్తి'' (సర్వ భూతములును ప్రాణమునందే లయించు చున్నవి) అను నిట్టి వాక్యములలో వర్ణింపబడి యుండుట వలన - పంచ భూతాంతర్గతము వాయువు. ఆ వాయు విశేషము ప్రాణము. అట్టి ప్రాణము సర్వ భూత కారణమగుట సంభవించదు గదా.
జ్యోతిరధి కరణమ్ 10
24. సూః జ్యోతి శ్చరణాభిధానాత్
వివృతిః :- జ్యోతిః= ఛాన్దోగ్యే శ్రూయతే ''అథ యదతః పరోదివో జ్యోతి ద్దీప్యతే'' ఇతి. అత్ర జ్యోతి శ్శబ్దో బ్రహ్మపర ఏవ - నాదిత్యాది తేజఃపరః. కుతః? చరణాభిధానాత్= జ్యోతిర్వాక్యా త్పూర్వవాక్యే ''పాదో೭న్య సర్వా భూతాని| త్రిపా దస్యామృతం దివి'' ఇతి చతుష్పాత్యాభిధానాత్. అతో జ్యోతిశ్శబ్దేన పరం భ్రహ్మైవాభిధీయతే. న హి భౌతి కన్య తేజస స్సర్వాణి భూతాని పాదతా ముపగచ్ఛన్తి.
వివరణము :- ఛాన్దోగ్యోపనిషత్తు నందలి ''అథ యతః పరోదివో జ్యోతి ద్దీప్యతే'' అను వాక్యములోని ''జ్యోతిః'' అను శబ్దము బ్రహ్మ పరమే కాని, ఆదిత్యాది భౌతికతేజః పరముకాదు - ఎందుకనగా? ఈ వాక్యనకు పూర్వపు వాక్యములో ''పాదో೭స్య సర్వా భూతాని'' అని ఆ జ్యోతిస్సునకు నాలుగు పాదములు గలిగి యున్నట్లును, అందు సర్వ భూతములును ఒక్క పాదమనియు వర్ణింపబడి యున్నది. కాన నిచటి ''జ్యోతిః'' అను శబ్దముతో పర బ్రహ్మయే చెప్పబడు చున్నదని తెలియనగును. భౌతిక జ్యోతిస్సునకు సర్వ భూతములును ఒక పాదమని యనుట సంభవించదు గదా !
25. సూ ఛన్ధోభిధానా న్నేతి చేన్న తథా చేతోర్పణ
నిగదా త్తథా హి దర్శనమ్.
వివృతిః :- ఛందోభిధానాత్= ''గాయత్రీ వా ఇదగ్‌ం స్వరం'' ఇతి పూర్వవాక్యే గాయత్ర్యాఖ్యస్య ఛందస ఏవాభిధానాత్ - న=నాత్ర బ్రహ్మాఖి హితమ్ - ఇతి - చేత్ = ఇత్యుక్తం చేత్ - న = న తథా వక్తుం శక్యతే - చేతోర్పణనిగదాత్ = తథా గాయత్ర్యాఖ్య ఛన్దోద్వారా చేతోర్పణస్య గాయత్య్రనుగతే బ్రహ్మణి చిత్తసమాధానస్య వర్ణితత్వాత్, జ్యోతిశ్శబ్దో బ్రహ్మపర ఏవ. హి= యతః తథా = ఏవ మన్యత్రాపి వికారద్వారేణ ''ఏతం హ్యేవబ హ్వృచామహత్యుక్థేమీమాంసంతే (ఏతం - ఆత్మాన మే) మహత్యక్థే - ప్రధానశ##స్త్రే తదనుగతం బ్రహ్మో పాసతే హోతారః ఇతి బ్రహ్మ వికారా భూత శస్త్రద్వారేణ ఏవోపాసనమ్. దర్శనమ్=దృష్టం-అతో హేతోః పుర్వవాక్యే బ్రహ్మైవ నిర్దిష్టం న గాయత్య్రాఖ్యం ఛంద ఇతి సిద్ధమ్.
వివరణము :- జ్యోతిర్వాక్యమునకు పూర్వ వాక్యములో ''గాయత్రీ వా ఇదగ్‌ం సర్వం'' అని గాయత్రియను పేరుగల ఛందస్సు వర్ణింపబడి యుండుటచేత నీ ప్రకరణము బ్రహ్మ ప్రతిపాదకమని యనుట యుక్తము కానేదరని యనుటకు వీలులేదు. కారణ మేమి యన? ఇచట గాయత్రీ ఛన్దస్సుద్వారా ఆ ఛన్దమ్సనందు అనుగతయై యుండు బ్రహ్మ తత్త్వము నందు చిత్తైకాగ్రమును (చిత్త సమాధానమును) సంపాదించుట కొఱకై అట్లు వర్ణింపబడి యున్నది గాని ఛందస్సును వర్ణించుటకు గాదు. (ఈ జగ త్తంతయు బ్రహ్మ నుండి ప్రభివించు చున్నది. కాన ఈ పరిదృశ్య మానమగు వస్తుజాలమంతయు కార్యము, బ్రహ్మ దానికి కారణము అని యనదగి యున్నది. మరియు కారణము కార్య వస్తువునందంటను అనుగతమై యుండును. ఘటమును గూర్చి కారణమైన మృత్తు (మట్టి) తననుండి ప్రభవించుచున్న (పుట్టుచున్న) ఘటమను (కుండ) యను కార్యమునందు అనుగతమై (అంతటను వ్యాపించి) యున్నట్లు. ఇట్లే బ్రహ్మనుండి ప్రభవించు జగత్తులో చేరియున్న (బ్రహ్మ సృష్ట్యన్తర్గతమైయున్న) గాయత్రీ ఛందస్సనందు తత్కారణమగు బ్రహ్మ వస్తువు అనుగతమై యుండును. ఇచట గాయత్రీ చందస్సునం దనుగతమై యున్న ఆ బ్రహ్మతత్త్వము నుపాసించుటకు గాను గాయత్రి చెప్పబడినదే గాని ఛందస్సును వర్ణించుటకు కాదు) ఇట్ల మరియొక చోట ''ఏతం హ్యేవ బహ్వృచా మహ త్యుక్థే మీమాంసంతే'' యజ్ఞాంగ భూతమగు ఒకానొక ప్రధానమైన శస్త్రమునందు ఆ శస్త్రాను గతమగు నాత్మతత్త్వమును హోత లుపాసింతురు. అను వాక్యములో గూడ బ్రహ్మ వికారమగు (బ్రహ్మ కార్యమగు= బ్రహ్మ సృష్ట మగు) శస్త్రమును (శస్త్రమనగా యజ్ఞములయందు వేద వాక్యములతో చేయబడు ఒక విధమైన దేవతా స్తోత్రము.) ద్వారముగ జేసుకొని తదను గత బ్రహ్మ వస్తువునే ఉపాసింతురని వర్ణింపబడి యున్నది. కాని పూర్వ వాక్యమునను అట్లె గాయత్య్రనుగత బ్రహ్మవస్తువే నిర్దేశింప బడినదని గాయత్రీ చన్దస్సు మాత్రము నిర్దేశింపబడలేనని తెలియదగును.
26. సూ : భూతాది పాద వ్యపదేశోపపత్తేశ్చైవమ్
వివృతిః :- ఛ= కించ భూతాది పౌద వ్యపదేశోపపత్తేః-ఏవం= ''సైషా చుతష్పదా'' ఇతి వాక్యే యో భూత, పృథివీ, శరీర, హృదయై శ్చతుష్పదా గాయ త్రీతి వ్యపదేశః కృతః, తస్య బ్రహ్మ ణ్యవోపపన్నత్వాత్, గాయత్రీవాక్యే బ్రహ్మైవ ప్రతిపాద్య మితి సిద్ధమ్. న హి పరిమితాక్షర సన్నివేశరూపస్య ఛన్దసో గాయత్య్రాఖ్యస్య భూతాదయః పాదా భవంతి. తదేతత్ పూర్వ ప్రకృతం బ్రహ్మైవ జ్యోతిర్వాక్యేపి ద్యుసంబన్ఢా త్ప్రత్యభి జ్ఞాయతే ఇతి నిశ్చీయతే.
వివరణము :- మరియు జ్యోతిర్వాక్యమునకు పూర్వ వాక్యములో ''స్తేషా చుతష్పదా'' అని ఆ గాయత్రి భూత - పృథివీ - శరీర హృదయ ములు అను నాలుగు పాదములు గల్గియున్నదని వర్ణింపబడి యున్నది. ఇట్లు భూతములు మొదలగునవి తన పాదములగుట పరిమితములగు అక్షర ముల సన్నివేశ రూపమగు ఛన్దస్సునకు సంభవించుట అసంభవము గాన గాయత్రీ వాక్యములో బ్రహ్మయే ప్రతిపాదింప బడినదని తేలుచున్నది. ఆ బ్రహ్మయే తదనంతర వాక్యమగు జ్యోతిర్వాక్యమునందు గూడ వర్ణింపబడినదని ద్యుసంబంధమును బట్టి తెలియజేయబడినది యగుచు పరామర్శింప బడుచున్నదని నిశ్చయంపనగును.
27. సూ : ఉపదేశ##భేదా న్నేతి చేన్నోభయస్మి న్న
ప్యవిరోధాత్
వివృతిః :- ఉపదేశ##భేదాత్= పూర్వవాక్యే ''త్రిపా దస్యామృతం దివి'' ఇతి సస్తమీ విభక్త్యా ద్యులోక స్యాధారత్వే నోపదేశః కృతః, తతః ''అథ యదతః పరో దివో జ్యోతిః'' ఇతి వాక్యే పంచమీవిభక్త్యాద్యులోక స్యావధిత్యే నోపదేశః కృతః. ఏవ ముపదేశ##భేదస్య దృశ్యమాన త్వాత్ న=గాయత్రీ వాక్యోక్తస్య బ్రహ్మణో7త్ర జ్యోతిర్వాక్వే ప్రత్యభి జ్ఞానం న సంభవతి. ఇతి-చేత్= ఇత్యక్తం చేత్-న= నతథాయుజ్యతే వక్తుం - ఉభయస్మిన్ - అపి= ఉభయవిభే - పంచమ్యంత సప్తమ్యంతరూ పోపదేశ##భేదే సత్యపి. అవిరోధాత్= ప్రత్యభిజ్ఞాయో విరోధాభావాత్. వృక్షాగ్రే శ్యేనః - వృక్షా త్పరత శ్శ్యేనః ఇత్యాది లౌకికవ్యపదేశే ష్వపి స ఏవశ్యేన ఇతి ప్రత్యభిజ్ఞా దృశ్యత ఏవ - అతః ప్రకృత త్రిపాద్బ్రహ్మ పరామర్శి యచ్ఛబ్దానుబంధా చ్ఛ పరం బ్రహ్మైవ జ్యోతిర్యవాకే7పి జ్యోతిశ్శబ్డే నోపాస్యత్వేన నిర్దిశ్యత ఇతి సిద్ధమ్.
వివరణము :- పూర్వవాక్యములో ''త్రిపా దస్యామృతం దివి'' అను వాక్యములో ''దివి'' అని సప్తమీ విభక్తితో ఉపాస్యమగు ప్రకృత వస్తువునకు ద్యులోకమును ఆధారముగను, ''అథ యదతః పరో దివో జ్యోతిః'' అను నీ వాక్యములో ''దివః'' అని పంచమీ విభక్తితో ఉపాస్య వస్తువునకు ద్యులోకమును అవధిగను- వర్ణింపబడి యుండుట కానవచ్చు చున్నది. ఇట్లు ఉపదేశ##భేదము కానవచ్చుచున్నది కనుక గాయత్రీ వాక్యమున ప్రతిపాదింపబడిన బ్రహ్మ వస్తువే ఇచటనుగూడ వర్ణింపబడి యున్నది, అన్యముకాదు అని అనవలనుపడదు. అను పూర్వపక్షమున కిట్లు సమాధానము చెప్పబడుచున్నది.
పూర్వోత్తరవాక్యములలో సప్తమ్యన్త - పంచమ్యంత రూపమగు ఉపదేశ భేదమున్నను ఆ వాక్యములయం దపదేష్టవ్యమగు వస్తువు భిన్నము (వేరైనది) కావలయు నను నియమము లేదు. కాన పూర్వవాక్య ప్రతిపాద్యమౌ ప్రకృత జ్యోతిర్వాక్యము ననుగూడ వర్ణింపబడుచున్నదనుటలో విరోధమేమియు లేదు. లౌకిక వ్యవహారములలో గూడ చెట్టు కొనపైన డేగ కలదు అని చెప్పవలసి వచ్చినపుడు ''వృక్షాగ్రే శ్యేనః'' (చెట్టు కొనయందు డేగ కలదు) అని సప్తమీ విభక్తితోనూ - ''వృక్షాగ్ర త్పరతః శ్యేనః'' (చెట్టు కొననుండి పైగా డేగ కలదు) అని పంచమీ విభక్తితోను - ఇట్లు రెండు విధములుగను ఒకే వస్తువును వరణించుట కలదు. కనుక ఉపదేశ##భేదమున్నను ఆవాక్యములో నుపదేశింపబడిన వస్తువే యిచటను ఉపదేశింప బడుచున్నది, అన్యము కాదని ప్రత్యభిజ్ఞ కలుగు చున్నదనుటలో విరోధమేమియు లేదు. మఱియు ''అథ య దతః'' అను జ్యోతిర్వాక్యము నందలి పూర్వ వాక్య ప్రకృతమగు త్రిపాద్బ్రహ్మను పరామర్శించు యుఛ్ఛబ్దమును బట్టియు పరబ్రహ్మయే జ్యోతిర్వాక్యమున గూడ జ్యోతిశ్శబ్దము చేత నుపాస్యముగ నిర్దేశింపబడున్నదని నిశ్చయింప బడుచున్నది.
ప్రతర్ద నాధికరణమ్ 11
28. సూ : ప్రాణ స్తథానుగమాత్
వివృతిః :- ప్రాణః= కౌషిత క్యుపనిష దీన్ద్ర ప్రతర్దనాఖ్యాయి కాయాం ప్రతర్దనం ప్రతీన్దవాక్య మేవం శ్రూయతే ''ప్రాణో7స్మి ప్రజ్ఞా త్మాతం మా మాయు రమృత ముపాస్వ'' ఇతి. అత్ర ప్రాణశ##బ్దేన పరం బ్రహ్మైవ వివక్ష్యతే. న వాయుమాత్రం. న వేంద్రరూపా దేవతా - నాపి జీవః కశ్చన - కుతః? తథా-అనుగమాత్= హితతమత్వ-సర్వకర్మక్షయ- ఆనంద -అజరత్వాది ధర్మ ప్రతిపాదకానాం ''యం త్వం ముర్త్యాయ హితతమం మన్యసే'' ఇత్యా ద్యేతత్ప్రకరణస్థ వాక్యానాం బ్రహ్మపరత్వే నైవ సమన్వితత్వాత్.
వివరణము :- కాషీతక్యు పనిషత్తునందలి యింద్ర ప్రతర్ధనాఖ్యాయి కలో దివోదాసుని కుమారుడగు ప్రతర్దనునికి యింద్రుడు చేసిన ''ప్రాణోస్మి ప్రజ్ఞాత్మా తం మా మాయు రమృత ముపాస్వ'' ప్రాణ స్వరూపుడను, చిదాత్మకుడను, ఆయుస్స్వరూపుడను, నాశరహితుడను, నన్ను పాసింపుము అను నీ యుపదేశ వాక్యములోని ప్రాణశబ్దము పరబ్రహ్మ పరమేయగును కాని - వాయు పరముకాని, ఇంద్ర దేవతాపరము కాని, జీవపరము కాని, కాదు. ఏలయన? ఇంద్రుని ప్రతర్దనుడు ''యం త్వం మర్త్యాయ'' అను వాక్యములో మర్త్యుడౌ (మరణించు స్వభావము గల) మునుజునకేది హితతమమో దానిని నీవే ఆలోచించి నాకు బోధింపుమని కోరెను. అంత యింద్రు డతనికి పైన చెప్పిన విధముగ నుపదేశించెను. ఆ ప్రకరణము లోని పై వాక్యములలో హితతమత్వ - అజరామరత్వాది రూప ధర్మములు ప్రతిపాదింపబడి యున్నవి. ఆ ధర్మము లన్నియు బ్రహ్మయందేసమన్వితములగును గాని అన్య వస్తువునందు సమన్వయమనును పొందనేరవు. కాన నా ప్రాణశబ్దము పరబ్రహ్మపరమే అని నిశ్చయింపదగును.
29. సూ : న వక్తు రాత్మోపదేశా దితి చే దధ్యాత్మ
సంబన్ధభూమా హ్యస్మిన్
వివృతిః :- వక్తుః= ఇంద్రస్య - దేవతావిశేషస్య - ఆత్మోపదేశాత్= ''మామే విజానీ హీతి'' ఇత్యుపక్రమ్య ''ప్రాణో7స్మి ప్రజ్ఞాత్మా'' ఇతివాక్యే ఆత్మన ఏవ జ్ఞేయత్వే నోపదేశ శ్రవణాత్ - న= న ప్రాణో బ్రహ్మ - కిం త్వింద్ర ఏవ - ఇతిచేత్= ఇత్యుక్తంచేత్ - అత్రోచ్యతే. హి= యస్మాత్ అస్మిన్= అస్మి న్నధ్యాయే - అధ్యాత్మ సంబన్దభూమా= ''యావ ద్ద్యస్మిన్ శరీరే ప్రాణో వసతి తావ దాయుః| సేష ప్రాణ ఏవ ప్రజ్ఞా త్మానందో7 జరో7మృతః'' ఇత్యా ద్యధ్యాత్మసంబన్ధస్య= ప్రత్యగాత్మ సంబన్దస్య - భూమా= బాహుళ్యం దృశ్యతే - తస్మా త్ప్రాణాత్మక బ్రహ్మోపదేశ ఏవాయం, న దేవతావి శేషోపదేశ ఇతి సిద్ధమ్.
వివరణము :- వక్తయైన ఇంద్రుడు ''మా మేవ విజానీహి'' అని ఆరంభించి చేసిన ఉపదేశములో ''మా మేవ'' నన్నే తెలిసికొనుము ''మా మాయు రుపాస్వ'' నన్ను పాసించుము అని తనను గురించియే ఉపదేశించి నట్లున్నది గనుక ''ప్రాణో7స్మి'' అను వాక్యములో ప్రాణశబ్దము బ్రహ్మ పరమనుగ యుక్తము కాదు. వక్తయగు ఇంద్రపరమే యనుట యుక్తము అని అనదగదు. ఏలయన? ఆ ప్రకరణములో ''స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా'' ఇత్యాదివాక్యములలో ప్రత్యగాత్మకు సంబంధించిన అజరామరత్వాది ధర్మములు బహుళముగా కానుపించు చున్నవి గనుక. కాన ప్రతరనునికి యింద్రుడు చేసిన ఉపదేశము ప్రాణరూపమగు బ్రహ్మోపదేశ##మే కాని ఇంద్రదేవతా విషయకోపదేశము కానేరదు.
30. సూ : శాస్త్రదృష్ట్యా తూపదేశో వామదేవవత్
వివృతిః :- కథం తర్హి వక్తు రాత్మోపదేశః? తత్రాహ - ఉపదేశః- తు= వక్తు రింద్రస్య ''మామేవ విజానీహి''ఇత్యుపదేశస్తు-శాస్త్ర దృష్ట్యా= తత్త్వము సీతి మహావాక్యరూప శాస్త్రశ్రవణజని తాహంబ్రహ్మాస్మీత్యపరోక్ష జ్ఞానేన ప్రవృత్తః ప్రవృత్తః - వామదేవత్= యథా వామదేవో నామా ఋషి స్స్వాత్మానం పరం బ్రహ్మ జ్ఞాత్వా ''అహం మను రభవం సూర్యశ్చ'' ఇత్యాద్యుపదిదేశ, తద్వత్ - అతః పరబ్రహ్మపరర మేవైత ద్వాక్య మితి సిద్ధమ్.
వివరణము :- ఈఉపదేశము బ్రహ్మపరమే అనియన్నచో ''మా మేవ విజానీహి'' నన్నే తెలిసికొమ్ము అని వక్తయగు ఇంద్రుడు చేసిన ఉపదేశ మెట్లు పోసగును. అను నాశంకకు సమాధానము నిటచెప్పుచున్నారు వక్తయైన ఇంద్రుడు ''మామే విజానీహి'' నన్నే తెలిసికొమ్ము అని యుపదేశించుట ''తత్త్వమసి'' మొదలగు మహా వాక్యర శాస్త్ర శ్రవణము వలన లభించిన అరోక్ష బ్రహ్మాత్త్మెక్యాను భూతిచేత చేయబడినది గాని అవిద్యా కార్యములగు దేహాదుల యందలితాదాత్య్యాధ్యాసతో (భ్రంతి చేత) కాదని తెలియదగును. వామదేవ మహర్షి సర్వాత్మక బ్రహ్ముత్త్మెక్య సాక్షాత్కారము కలవాడై ''ఆహం మను రభవం సూర్యశ్చ'' నేను మనువునై యుంటిని, సూర్యుడనై యుంటిని, అని యీ విధముగనే తత్త్వ సాక్షాత్కార ప్రయుక్తమైన తన సర్వాత్మత్వ ప్రతిపత్తిని ప్రకటించెను. ఈ యుపదేశమును నట్టిదే. కాన ''ప్రాణో7స్మి ప్రజ్ఞాత్మా'' అను నీ వాక్యము నందలి ప్రాణశబ్దము బ్రహ్మ పరమేయగునని నిశ్చయింపనుగును.
31. సూ : జీవ ముఖ్యప్రాణ లింగా న్నేతిచోన్నోపాసా
త్రైవిధ్యా దాశ్రితత్వా దిహ తద్యోగాత్
వివృతిః :- జీవ ముఖ్యప్రాణ లింగాత్= అత్ర ప్రకరణ ''వక్తారం విద్యాత్'' ఇతి జీవలింగస్య ''ఇదం శరీరం పరిగృ హ్యోత్థాపయతి'' ఇతి ముఖ్య ప్రాణలింగస్య చ దర్శనాత్ ''ప్రాణో7స్మితి'' వాక్యం తదుభయపర మపి భవతీ త్యతో హేతోః-న=తద్వాక్యం న బ్రహ్మపరం భవతి-ఇతి-చేత్= ఇత్యుక్తం చేత్-న= తత్ర్పాణవాక్యం తథా జీవపరం వా ముఖ్యప్రాణపరం వా భవితుం నార్హతి, కింతు బ్రహ్మపర మేవ. కుతః? ఉపాసాత్రైవిధ్యాత్= తథాసతి జీవోపాసనం - ముఖ్యప్రాణోపాసనం - బ్రహ్మోపాసనం చేతి త్రివిధ ముపానన మత్ర ప్రసజ్యేత - నచైత దేకస్మిమిన్నేవ వాక్యేయుక్త మభ్యుపగన్తుమ్. ''మామేవ విజానీహి'' ఇత్యుక్త్వా - అంతే ఉపసంహరతి ''ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా'' ఇత్యాది. ఏవ ముపక్ర మోప సంహారాభ్యాం వాక్యైక్యవాక్యత్వ మవగమ్యతే - అతః బ్రహ్మమాత్ర విషయ ఏవాయ ముపదేశ ఇత్యవగంతవ్య మితి గమ్యతే - కించ - ఆశ్రి తత్వాత్= ఏవ మన్యత్రాపి బ్రహ్మలింగవశా త్ప్రాణశబ్దస్య బ్రహ్మణి వృత్తే రాశ్రితత్వాత్= అంగీకృతత్వాత్ - ఇహా - తద్యోగాత్= ఇహాపి హితతమ త్వా ద్యసాధారణ బ్రహ్మలింగయోగాత్ బ్రహ్మోపదేశ ఏవాయ మితి గమ్యతే.
ఇతి శ్రీగాయత్రీ పీఠాధీశ్వర శ్రీవిద్యాశంకర భారతీ యతివర
విరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ ప్రథమాధ్యాయస్య ప్రథమః పాదః.
వివరణము :- ఈ ప్రకరణములోని ''వక్తారం విద్యాత్'' వక్తనగు నన్ను తెలిసికొమ్ము అని యింద్రుడు పలికిన వాక్యములో వక్తయగు జీవునికి (ఇంద్రునికి) సంబంధించిన లింగము (చిహ్నము=గుర్తు) న్నూ- ''ఇదం శరీరం పరిగృ హ్యోత్థాపయతి'' ఈ శరీరమును పట్టి లేవనెత్తు చున్నది యను వాక్యములో ముఖ్యప్రాణమునకు సంబంధించిన లింగ మున్నూ కానుపించుచున్నవి గనుక ''ప్రాణో7స్మి ప్రజ్ఞాత్మా'' అను వాక్యము జీవపరమును. ముఖ్య ప్రాణపరమును కూడ కాదగును, బ్రహ్మ పరము మాత్రమేయ ని యనుట యెట్లు పొసగును అని అనరాదు. ఏలయన? అట్లు చెప్పినచో ఈ ప్రకరణములో గల వాక్యములలోని లింగమును బట్టి యిచట జీవోపాసనము - ప్రాణోపాసనము - బ్రహ్మోపాసనము అను మూడు విధములైన ఉపాసనములు విధింప బడుచున్నవి యని చెప్పవలసి వచ్చును అట్లు చెప్పిచో ఏక ప్రకరణస్థములగు ఈ వాక్యములకు ఏకవాక్యత లేకపోవును ఉపక్రమోప సంహారములను బట్టి చూచిన''మా మేవ విజానీహి'' అని యారంభించి ''ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా'' అను వరకు గల వాక్యములకు ఏకవాక్యత్వము కలదని తెలియబడుచున్నది. ఒక వాక్యములో ఒక్క విషయమే విధింప బడవలయును గాని అనేక విషయములు విధింపబడరాదు అని శాస్త్రజ్ఞుల నిర్ణయము. కాన అనేక (మూడు) విషయము లీప్రకరణములో విధింపబడుచున్న వనుట యుక్తము కాదు. ఇట్లె మరియొక స్థలమున (ప్రాణాధికరణమున) ప్రాణశబ్దమునకు బ్రహ్మలింగ సంబంధమును బట్టిబ్రహ్మపరత్వమంగీకరింపబడి యున్నది. కనుకనున్నూ ఈ ప్రకరణములో గూడహితతమత్వాది బ్రహ్మధర్మముల సంబంధము కానుపించు చున్నది గనుకనున్నూ ఇంద్రుడు ప్రతర్థనునికి చేసిన ఉప దేశము బ్రహ్మ విషయకమగు ఉపదేశము కాని యన్య విషయకము కాదనినిశ్చయింపనగును.
ఇట్లు శ్రీగాయత్రీ పీఠాధీశ్వర శ్రీవిద్యాశంకర భారతీ యతివర
విరచితమగు బ్రహ్మ సూత్రార్థ వివరణమున
ప్రథమాధ్యాయమున - ప్రథమ పాదము ముగిసెనూ.
ప్రథమాధ్యాయస్య - ద్వితీయః పాదః
సర్వత్ర ప్రసిద్ధ్యధికరణమ్
1. సూ : సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్
వివృతిః :- పూర్వస్మిన్ పాదే స్పష్టబ్రహ్మలింగానాం వేదాంత వాక్యానాం బ్రహ్మణి సమన్వయ స్సాధితః అదునాద్వితీయ తృతీయయోః ప్రాదయో రస్పష్ట బ్రహ్మలింగానాం వేదాంతవాక్యానాం సమన్వయః ప్రదర్శ్యతే.
ఛాదోగ్యే శాండిల్యవిద్యాయా మీద మామ్నాయతే ''న క్రతుం కుర్వీత| మనోమయః ప్రాణశరీరో భారూప స్సత్యకాయః'' ఇత్యాది. తత్ర మనోమయత్వాది గుణకః పర ఏవోపాస్యత్వేన నిర్దిశ్యతే. సతు శారీర రితి వక్తవ్యం. కుతః? సర్వత్ర ప్రసిద్దోపదేశాత్ = సర్వేషు వేదాంతేషు యజ్జగత్కారత్వేన ప్రసిద్ధం బ్రహ్మతసై#్య వాత్ర ''సర్వం ఖల్విదం బ్రహ్మ| తజ్జలా నితి శాన్త ఉపాసీత ఇత్యాది నోపదిష్టత్వాత్.
వివరణము :- గడిచిన మొదటి పాదములో బ్రహ్మను స్పష్టముగా సూచించు వేదాంత వాక్యములలో వానయందు సాక్షాత్తుగ బ్రహ్మ శబ్దము కానుపించకుండుటచే నీ వాక్యములకు బ్రహ్మయందు తాత్పర్యము కలదా, లేదా అని సందేహము రాగా ఆ వాక్యములలో వర్ణింపబడిన లింగములను (ధర్మములను) బట్టి ఆధర్మములు బ్రహ్మ భిన్న జీవాదులయందు వర్తింప నేరవు గాన - బ్రహ్మకు మాత్రమే సంబంధించినవి గాననూ ఆ వాక్యము లకు బ్రహ్మయందు సమన్వయము కలదని నిరూపింపబడినది. ఇప్పుడీద్వితీయ, తృతీయ పాదములలో అస్పష్ట బ్రహ్మలింగక వేదాన్త వాక్యము లకు బ్రహ్మయందు సమన్వయము ప్రదర్శింప బడుచున్నది.
ఛాన్దోగ్యములోని శాండిల్యవిద్యా ప్రకరణమునందు ''స క్రతుం కుర్వీత| మనోమయః ప్రాణశరీరో భా రూపః'' అను వాక్యము కలదు. ఇచట వర్ణింపబడిన మనోమయత్వాది గుణములు గలవాడు పరబ్రహ్మయే గాని జీవాత్మ కాదు. ఏలయన? సమస్త వేదాంతముల యందు (సర్వోపనిషత్తులయందును) జగత్కారణముగ ప్రసిద్ధమైన వస్తువు బ్రహ్మవస్తువే కదా. ఆ బ్రహ్మవస్తువే ఈ ప్రకరణములో గూడ ''సర్వం ఖ ల్విదం బ్రహ్మ| తజ్జలా నితి శాన్త ఉపాసీత'' ఈ పరిదృశ్యమానమగు సమస్త ప్రపంచమును బ్రహ్మయే. భ్రహ్మకంటె వేరుగ నీ ప్రపంచము లేదు. (అవిద్యాశమున బ్రహ్మయే ఇట్లు ప్రతిభాసించు చున్నదని యర్థము) కారణమేమియన ఈ ప్రపంచము తజ్జము - తల్లము - తదనము (అనగా ఆ బ్రహ్మ నుండి పుట్టునది. దానియందే లయించునది. దానియందే ప్రతిష్ఠింపబడి జీవించుచు వ్యవహరింపబడుచు నున్నది) కాన ద్వైతబుద్ధిని విడనాడి శాంతుడవై ఆతత్త్వము నుపాసింపుము అని వర్ణింపబడినది. కాన నీ మనోమయ వాక్యమును ఈ ప్రకరణమునందలి బ్రహ్మ ప్రతిపాదక వాక్యముననుసరించి బ్రహ్మపరమే. ఆ బ్రహ్మయే (పరవేశ్వరుడే) ఇచట మనోమయత్వాది గుణములతోక నుసాసింప దగినవాడుగత నిర్దేశింపబడె నని తెలియదగును.
2. సూ వివక్షిత గుణోపపత్తేశ్చ
వివృతిః :- చ= కించ - వివక్షితగుణోపపత్తేః= వివక్షితాః- గుణాః= వివక్షిత గుణాః - తేషాం ఉపపత్తేః వివక్షితగుణాః= ఉపదిష్టా స్సత్యసం కల్పత్యాదయో గుణాః తేషాం బ్రహ్మణ్యవ - ఉపపత్తేః= సంభవాత్ - మనోమయత్వాది గుణకః పరమేశ్వర ఏవేతి వక్తవ్యమ్.
వివరణము :- మఱియు - ఈ ప్రకరణములోని వాక్యములలో వర్ణింపబడిన సత్యసంకల్పత్వాది గుణములు బ్రహ్మయందే సమన్విత ములు కాగలవు గాన మనోమయ వాక్యము బ్రహ్మపరమే అని నిర్ణయిందగును.
3. సూ : అనుపపత్తేస్తున శారీరంః
వివృతిః :- శారీరః-తు= జీవస్తు - మనోమయత్వాది గుణకః న= న భవతి కుతః? అనుపపత్తేః= ఏతత్ప్రకరణగతానాం ''సత్యసంకల్ప ఆకాశాత్మా೭వా క్యనాదర" ఇత్యాది వాక్యోక్తానాం సత్యక్తానాం సత్యసకంల్పత్వాదీనాం గణానా తత్ర జీవే అంసభవాత్, మనోమయత్వాదిగుణకో బ్రహ్మైవ న శారీరః.
వివరణము:- ఈ ప్రకరణములో " సత్యసంకల్ప ఆకాశాత్మ వాక్యనాదరః" అమోఘమగు సంకల్పము కలవాడు- ఆకాశమువలె అమూర్తమగు, వ్యాపకమగు స్వరూపము కలవాడు - వాగాదీంద్రియములు లేనివాడు- కోరికలు లేనివాడు అని సత్య సంకల్పత్వాది గుణములు వర్ణింపబడినవి. ఈ గుణములు శారీరుని (జీవుని)యందు సంభవించనేరవు గాన మనోమయ వాక్యములో వర్ణింపబడిన మనోమయత్వాది గుణములతో నుపాసింపదగినవాడు బ్రహ్మయేగాని జీవుడుకాదు.
4. సూ: కర్మకర్తృ వ్యపదేశాచ్చ
వివృతిః:- చ= అపిచ - కర్మకర్తృవ్యపదేశాత్= "ఏత మితః ప్రేత్యాభి సంభవి తాస్మి" ఇత్యత్ర "ఏతం" ఇతి ప్రకృతస్య మనోమయ త్యాదిగుణక స్యోపాస్యస్య కర్మత్వేన (ప్రాప్యత్వేన) "అభిసంభవితాస్మి " ఇతి శారీర స్యోపానకస్య కర్తృత్వేన (ప్రాప్తకర్తృత్వేన) చ వర్ణనా చ్చ హే తోః మనోమయత్వాదిగుణకో న జీవః
వివరణము:- మఱియు " ఏత మితః ప్రేత్యాభి సంభవితాస్మి" ఈ దేహమును వీడి ఇతనిని పొందుదును అని ఈ వాక్యములోని ఏతం = ఇతనిని అని ప్రకృతమగు మనోమయ వాక్యములో చెప్పబడిన ఉపాస్యుడౌ పురుషుని= బ్రహ్మను ప్రాప్యునిగాను, (పొందదగిన వానిని గాను) అభిసంభవి తాస్మి= పొందుదును అని ఉపాసకుడౌ జీవుని ప్రాప్తనుగాను (పొందు వానిని గాను) ఇట్లు బ్రహ్మ జీవులను ఉపాస్యోపాసకులుగా - ప్రాప్యప్రాప్తలుగా అనగా ఉపాసనా కర్మగా బ్రహ్మను - ఉపాసనాకర్తగా జీవుని - అట్లే ప్రాప్తి క్రియాకర్మగా బ్రహ్మను ప్రాప్తి క్రియాకర్తగా జీవుని వేరుగా వర్ణించుటచేతను గూడ మనోమయత్వాది గుణములతో నుపాసింపదగినవాడు బ్రహ్మయే గాని జీవుడు కాదని నిర్ణయింపదగును.
5. సూ: శబ్ద విశేషాత్
వివృతిః ః- శబ్దవిశేషాత్= శబ్దయో ర్వి శేషః - తస్మాత్ = శబ్దభేదాత్= విభక్తి భేదాదిత్యర్థః "యథా వ్రీహి ర్వా, యవో వా, శ్యామాకో వా ఏవ మయ మంతరాత్మన్ పురషో హిణ్మయ'' ఇతి వాక్యే "అంతరాత్మన్" ఇత్యుపాసకాభిధాయకస్య శబ్దస్య సప్తమ్యన్తస్య "పురుషః" ఇత్యుపాస్య వాచ కస్య శబ్దస్య ప్రథమాంతస్య చ విశిష్యాభిధానా దుపాస్యోపాసకయోర్భేదో೭వగమ్యతే. తస్మా చ్ఛారీరా దుపాసకా దన్యో మనోమయత్వాది గుణక ఉపాస్యః పరమేశ్వరః.
వివరణము :- శబ్ద విశేషము అనగా నిచట విభక్తి భేదము అని యర్థము. "యథా వ్రీహి ర్వా, యవో వా, శ్యమాకో వా, ఏవమయ మన్తరాత్మన్ పురుషః " (శరీరము యొక్క లోపలి భాగమునందు అత్యన్త సూక్ష్మపూపుడగు పురుషు డుపాసింప దగినవాడు) ఈ శ్రుతి వాక్యములో " అంతరాత్మన్" ఉపాసకుని బోధించు సప్తమ్యన్త శబ్దమునకును భేదము కానవచ్చుచున్నది. శబ్దములకు భేదము కలదు గాన తదర్థములకును భేద మవశ్య మగీకరింప వలయును, ఆ కారణమువలన ఉపాసకుడగుశారీరుని (జీవుని) కంటే అన్యమైనవాడు మనోమయత్వాది గుణములతో ముపాసింప దగినవాడు పరమేశ్వరుడే అని నిర్ణయింపదగును.
6. సూ: స్మృతేశ్చ
వివతిః :- చ= కించ - స్మృతే " ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే೭ర్రజున తిష్ఠతి" ఇతి శ్రీమద్భగవద్గీతాస్యస్మృతే శ్చశారీరపరమే శ్వరయో ర్భేదో೭వగమ్యతే. అతో೭త్ర మనోమయత్వాది గుణకః పరమే శ్వర ఏవోపాస్యః, న శారీరః.
వివణము :- " ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే೭ర్జున తిష్ఠతి" (ఓ అర్జునా! సమస్త ప్రాణులయొక్క హృదయ దేశమునందును అన్తర్యామి యగు పరమేశ్వరుడుండును.) అను శ్రీమద్భగవద్గీతా రూపమగు స్మృతియందును జీవులకును వారియందుండు పరమేశ్వరునకును భేదము స్వష్టముగా సూచింప బడినది. కానను మనోమయ వాక్యములో ఉపాస్యుడుగా వర్ణింపబడినవాడు పరమాత్మయే కాని శారీరుడు కాదని నిర్మయింపదగును.
7. సూ: అరభకౌకస్త్వా త్తద్వ్యపదేశా చ్చ నేతిచే న్న నిచాయ్యత్వా దేవం వ్యోమవ చ్చ
వివృతిః :- అర్భకౌకస్త్వాత్= "ఏష మ ఆత్మా న్త ర్హృదయ" ఇతి మనోమయత్వాది గుణకస్య పరిచ్ఛినాయతనత్వ వ్యపదేశాత్ తద్వ్యపదేశాత్ -చ= తస్య అణీయస్త్వస్య= అల్పత్వస్య - స్వశ##బ్దేనైవ " అణీయాన్ వ్రీహేః " ఇతి వ్యపదేశాత్ = వర్ణితత్వాత్ - ఆరాగ్రమాత్ర శ్శారీర ఏవాత్రోపదిశ్యతే - న= విభుః పరమా త్మేహ నోపదిశ్యతే - ఇతి- చేత్= ఇత్యుక్తం చేచ్ - న=నతథా వక్తుం శక్యతే- విభో రపి సతః పరమేశ్వరస్య అర్భకౌక స్త్వాణీయస్త్వాది గుణవిశిష్టత్వేన హృదయపుండరికే నిచాయ్యత్వాత్ = ఉపాస్య త్వాత్ - ఏవం= అల్పాయతనత్వాదినా నిర్దేశః అత్ర క్రియతే - న తావతా పరమేశ్వరస్య సర్వగతత్వహానిః - తత్ర దృష్టాంతః - వ్యోమవత్ - చ=యథా వ్యోమ సర్వగత మపి సూచీపాశాద్య పేక్షయా అర్భకౌకః - అణీయ శ్చ వ్యపదిశ్యతే - ఏవం బ్రహ్మా పి త్యర్థః.
వివరణము :-" ఏష మ ఆత్మాన్తర్హృదయే" అను వాక్యములో ఉపాస్యమైన మనోమయత్వాది గణకమగు వస్తువునకు పరిచ్ఛిన్నమైన = అల్పమైన హృదయము ఆయతనముగా (స్థానముగా) వర్ణింప బడినది గనుకనున్నూ - " అణీయాన్ వ్రీ హేః" వడ్లగింజకంటె చిన్నవాడు - అణుపరిమాణను కలవాడు అనిఉపాస్యుమి శ్రుతి స్వయముగ వర్ణించి యున్నది గనుకనున్నూ - ఇచట ఉపాస్యముగా నిర్దేశింపబడిన వస్తువు బ్రహ్మయే అని యనుట తగదు, ఏలయన? బ్రహ్మ సర్వ వ్యాపకముగదా! సర్వగతమౌ బ్రహ్మవస్తువు అల్పమగు హృదయమును ఆయతనమున
నెట్లుండ గల్గును? అణుపరిమాణము కలవాడని యనుట యెట్ల పొసగును? కాన మనోమయ వాక్యములో నుపాస్యముగా చెప్పబడిన వస్తువు శారీరుడే= జీవుడే అని అనవలయును అని అనుటయ యుక్తుముకాదు. కారణమేమన? పరమాత్మ సర్వ వ్యాపకుడే ఐనను అల్ప పరిమాణము గల హృదయ పుండరీకము అను స్థానములో నుపాసింప దగినవాడు గనుక ఆ స్థానమును బట్టి ఆయన స్వల్పమగు ఆయతనము= స్థానమున నున్నాడనియు, అణుపరిమాణము కలవాడనియు నిర్దేశింపబడినది. అంతమాత్రము చేత నా పరమేశ్వరుని సర్వగతత్వమునకు = సర్వవ్యాపకత్వమునకు భంగము లేదు. ఆకాశము సర్వగతమే ఐనను మఠములోను, ఘటములోను - సూదిబెజ్జములోను. త్రాడులోను, కానుపించుచునప్పుడు మఠాకాశము - ఘటాకాశము - సూచ్యాకాశము- పాశాకాశము అని అల్పస్థానము కలదిగను, చిన్నదిగను, వ్యవహరింప బడుచుండుట లోకమున ప్రసిద్ధకమేకదా? అట్లే బ్రహ్మము కూడ నిచట ముపాసనకొఱకైన హృదయము అను స్థానమును బట్టి అల్పపరిమాణము గలదిగ = చిన్నదిగ నుపదేశింప బడుచున్నది. కాన పరమాత్మయే మనోమయ వాక్యములో నుపాస్యముగా వర్ణింపబడెను అని యనుటలో విరోధ మేమియు లేదని నిశ్చయింపదగును.
8. సూ: సంభోగప్రాప్తి రితి చేన్న వైశేష్యాత్
వివృతిః :- సంభోగ ప్రాప్తిః = వ్యోమన త్సర్వగతస్య బ్రహ్మణ స్సర్వప్రాణిహృదయ సంబంధాత్ - చిద్రూపతయా చ బ్రహ్మణ శ్శారీరేణావిశిష్టత్వాత్. సుఖదుఃఖాది సంభోగ స్యావిశేషాణ ప్రాప్తి స్స్యాత్ ఇతి - చేత్ = ఇత్యుక్తం చేత్ - న=న తత్ర్పాప్తి స్సంభవతి - కుతః? వైశేష్యాత్= కర్తృత్వాకర్తృత్వ - భోక్తృత్వా భోక్తృత్వాది రూపవిశేషస్య= భేదస్య సద్చావాత్- యద్వా- సంభోగప్రాప్తిః= "నాన్యోతో೭స్తి ద్రష్టా..... నాన్యోతో೭స్తి విజ్ఞాతా" ఇత్యాదిశ్రుతిభ్య శ్శారీరపపమేశ్వారయో రేకత్వావగమాత్, శారీరస్య సంభోగే= సుఖదుఃఖానుభవరూపే సతి పరమేశ్వర స్యాపి తత్సుఖదుఃఖా నుభవరూప స్సంభోగో భ##వే దేవ - ఇతి చేత్= ఇత్యుక్తం చేత్- న = ఏక త్వేపి శారీర స్యోపభోగేన స బ్రహ్మణ ఉపభోగప్రసంగః - కుతః? వైశేష్యాత్= వేశేషో హి భవతి సమ్యగ్ జ్ఞాన మిథ్యాజ్ఞానయోః - మిథ్యాజ్ఞానకల్పిత ఉపభోగః - సమ్యగ్ జ్ఞానదృష్ట మేకత్వం. నచ మిథ్యాజ్ఞానకల్పిత నోపభోగేన సమ్యగ్ జ్ఞానదృష్ట మేకత్వం వస్తు సంస్పృశ్యతే. తస్మా న్నోపభోగగంధో೭పి పి శక్య ఈశ్వరస్య కల్పయితుమ్.
వివరణము :- బ్రహ్మ ఆకాశమవలె సర్వగతము కనుక బ్రహ్మవస్తువునకు సమస్త ప్రాణి సంబన్ఢము సంభవించును. కనుకనున్నూ- చిద్రూపము గనుక జీవునికిని - పరమాత్మకును భేదము లేక ఏకత్వము సిద్ధించు చున్నునది గనుకనున్నూ జీవునికి సంబంధించిన సుఖదుఃఖాది సంభోగము (సుఖదుఃఖాద్యనుభవము = సంసారము) పరమాత్మకును సంభవించును అని యనుట యుక్తముకాదు. ఏలయన ? జీవ బ్రహ్మలకు కర్త - అకర్తయనియు, భోక్త - అభోక్త యనియు, నిట్లుస్ఫుటముగ భేదము= విశేషము కలదు. కనుక కర్తయగు జీవునికి సంబంధించిన సుఖదుఃఖాద్యనుభవముచేత అకర్తయగు పరమాత్మకు ఆ సుఖదుఃఖాద్యనుభవము= సంసారము ఏమాత్రమును సంభంవించదు.
ఈ సూత్రమునకు మరియొక విధమగు వ్యాఖ్యానము:- ''నాన్యో೭తో೭స్తి ద్రష్టా - నాన్యో೭తో೭స్తి శ్రోతా - నా న్యో೭తో೭ స్తి విజ్ఞాతా" అను శ్రుతి పరమాత్మకంటె భిన్నమైన= వేరైన మరియొక ద్రష్టా= చూచువాడు లేడు - పరమాత్మకంటే భిన్నమైన = వేరైన మరియొక శ్రోతా = విను వాడు లేడు - పరమాత్మకంటె భిన్నమైన= వేరైన విజ్ఞాతా= తెలిసికొను వాడు లేడు. అని వర్ణించుచు జీవాత్మ పరమాత్మలకు అభేదమును బోధించు చున్నది. కాన శారీరుడగు జీవువని సుఖదుఃఖాద్యనుభవము = సంసారము పరమాత్మకు సంబంధించును అని యనుట తగదు.
ఎందువలన ననగా ? వైశేష్యాత్ = భేదము కలదు గనుక. అనగా మిథ్యాజ్ఞాన సమ్యగ్ జ్ఞానములకు భేదము కలదు గాన అని యర్థము. జీవునకు సుఖదుఃఖాద్యను భవరూప సంభోగము=సంసారము మిథ్యాజ్ఞాన కల్పితము (అనాత్మలగు స్థూల సూక్ష్మ దేహాదులయందు ఆత్మత్వజ్ఞానము మిథ్యాజ్ఞానము. అనగా భ్రాంతి. తత్పయుక్తము జీవునకు సంసారము.) సమ్యగ్ జ్ఞాన దృష్టము జీవాత్మ పరమాత్మలకు గల ఏకత్వము (వేదన్త వాక్య విచారము వలన యథార్ధమగు (త్తత్వ) జ్ఞానము లభించును. అదియే సమ్యగ్ జ్ఞానము. దానివలన జీవ పరైక్య సాక్షాత్కారము లభించును.) మిథ్యాజ్ఞాన కల్పితమగు ఆ జీవాత్మగత భోగము = సంసారము సమ్యగ్ జ్ఞాన దృష్టమగు ఏకత్వమును అనగా పరమాత్మ వస్తువును స్పృశింపజాలదు. (సమ్యగ్ జ్ఞానము లబ్ధముకాగా = బహ్మాత్మైకత్వము తెలియబడగా భోగమునకు = సంసారమునకు ప్రసక్తియే ఉండదు.) కాన బ్రహ్మవస్తువు నకు యథార్థముగా సుఖదుఃఖాద్యనుభవము నాపాదింప శక్యము కాదు. కనుక నీ ప్రకరణములో మనోమయత్వాది గుణములతో నుపాసింపదగిన వస్తువుగ వర్ణింపబడినది పరమాత్మయే గాని జీవుడుకాదు అని నిశ్చయింపబడును.
అత్రధికరణమ్ 2
9. సూ: అత్తా చరాచరగ్రహణాత్
వివృతిః :- అత్తా = కఠోపనిషది శ్రూయతే ''యస్య బ్రహ్మ చక్షత్రం చోభే భవత ఓదనః| మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్రసః'' ఇతి. అత్ర బ్రహ్మక్షత్రియయో ర్భ క్షకత్వేన వర్ణితః అత్తా = భక్షకః పరమేశ్వర ఏవ నాగ్ని ర్నాపి జీవః. కుతః? చరాచరగ్రహాణాత్ = బ్రహ్మక్షత్ర శబ్దాభ్యాం (మృత్యూపసేచనేపేతాభ్యాం) స్థావర జంగమాత్మక సర్వ ప్రంపచస్య గ్రహణాత్. తద్భక్షకత్వం బ్రహ్మణ ఏవ సంభవతి నాన్యన్యేతి.
వివరణము :- అత్తా అనగా భక్షకుడు. కఠోపనిషత్తులోని ''యస్య బ్రహ్మ చక్షత్రం చ ....యత్ర సః'' అను మన్త్రములో బ్రహ్మణ క్షత్రియ జాతులను ఆహారముగాను, మృత్యువును ఉపసేచనముగాను (నంజుడు వస్తువుమగాను) కలవాడు అని ఎవడు వర్ణింపబడినాడో అతడు పరమాత్మయే యగును. కాని - జీవుడుగాని - అగ్నిగాని కాదు. ఏలయన ? మన్త్రము లోని బ్రహ్మ క్షత్ర పదములచే సూచింపబడిన స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తును, మృత్యు దేవతనుగూడ ఆహారముగను, ఉపసేచనద్రవ్యము గను భుజించువాడు పరమాత్మకాక మరియొక డెట్లు కాగలడు?
10. సూ: ప్రకరణా చ్చ
వివృతిః:- చ=కించ ప్రకరణాత్ = ''న జాయతే మ్రియతే వా'' ఇత్యాదినా పరమాత్మన ఏవ ప్రకృతత్వాత్ - తత్ప్రకరణస్థో೭య మత్తా = భక్షకః పరమాత్మైవ నాన్యః.
వివరణము :- మరియు ''న జాయతే మ్రియతే వా విపశ్చిత్'' పుట్టునది గాని, మరణించునది గాని కాదు సర్వజ్ఞము అని వర్ణించుచు పరమాత్మ తత్త్వమునధికరించకొనియే ఈ ప్రకరణము ఆరంభింప బడినది. ఆ ప్రకరణములోని యీ ''యస్య బ్రహ్మ చ క్షత్రం చ'' అను మంత్రములో వర్ణింపబడిన అత్త= భక్షకుడును బ్రహ్మయే అని చప్పవల యును. అట్లు చెప్పకున్న ప్రకరణ విరోధ మేర్పడును గదా!
గుహాంప్రవిష్టాధికరణమ్ 3
11. సూ: గుహాం ప్రవిష్టా వాత్మానౌ హి తద్దర్శనాత్
గుహాం- ప్రవిష్టౌ = కఠవల్లీషుశ్రూయతే'' ఋతం పిబన్తౌ సుకృతస్యలోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధ్యే'' ఇతి. అత్ర గుహాం ప్రవిష్టావితి వర్ణితౌ జీవాత్మ పరమాత్మానా వేవ - న బుద్ధిజీవౌ - కుతః? హి= యస్మాత్. ఆత్మానౌ = చేతనౌ = చిద్రూపత్వేన సమానస్వభావౌ ''ఋతం పిబన్తావితి'' మంత్రే ఉభయోః కర్మఫలభోగస్య శ్రుతత్వాత్. యథాకర్మఫలభోగ శ్రవణ నైకస్య త్మత్వ చేతనత్వే చ నిశ్చితే - తథాద్వితీయస్యా ప్యాత్మత్వం చేత సత్వం చావశ్య మభ్యుపగన్తవ్యం. కుతః? తద్దర్శనాత్= లోకే చ అస్య గో ర్ద్వితీయొ೭ న్వేష్టవ్య ఇత్యాదిషు ప్రయోగేషు సంఖ్యా శ్రవణ సంఖ్యావతో స్సమానస్వభావయో రేవ ప్రతీతే ర్దర్శనాత్.
వివరణము :- కఠోపనిషత్తులో - ''ఋతం పిబన్తౌ ....గుహాం ప్రవిష్టౌ......'' అను మంత్రములో ఋతం పిబన్తౌ= కర్మఫలము ననుభవించుచు - గుహాం ప్రవిష్టౌ= హృదయ గుహను ప్రవేశించి యున్నవారు అని యిట్లు వర్ణింపబడిన వారిద్దరు జీవాత్మ పరమాత్మలేకాని బుద్ధి జీవులు కారు - ఎందుచేతననగా - ఆ మన్త్రములో ''ఋతం పిబన్తౌ'' అని ద్వివచ నాంత శబ్దముతో ఇద్దరు వ్యక్తులు చెప్పడుచున్నారు. అందు ఒకనికి కర్మఫల భోక్తృత్వము కలదని వెనుక చెప్పబడి యుండుటచేత ఆతడు ఆత్మయని చేతనుడని, నిర్ణయింపడుచున్నది. అచేతనుడు - అనాత్మ యగువాడు ఎట్లు భోక్తకాగలడు. ఒకడు ఆత్మయని చేతనుడని నిర్ణయము కాగా - అత నితో కలిసి రెండవవాడుగా వర్ణింపబడిన రెండవ వ్యక్తియును, ఆత్మయు, చేతనుడును - అయియుండుట న్యాయసమ్మతము. లోకములో కూడ ఈ వృషభమునకు జత (రెండవది) కావలయునని యన్నచో మొదటి దానితో సమానమగు జాతి - స్వభావము గల వృషభ##మే అపేక్షింపబడు చున్నదని విజ్ఞులు గ్రహింతురు గాని భిన్న జాతీయమైన - భిన్న స్వభావము గల అశ్వాదుల లపేక్షింప బడినవని గ్రహింపరు గదా ! కాన నీ మంత్రములో ''గుహాం ప్రవిష్టౌ'' అని వర్ణింపబడిన వారిద్దరు చేతనులగు జీవాత్మ పరమాత్మలే గాని - అచేతనమగు బుద్ధిజీవులు కారని నిర్ణయింపదగును.
12. సూ : విశేషణాచ్చ
వివృతిః :- చ = కించ - విశేషణాత్ = అస్మిన్నేవ ప్రకరణ ''ఆత్మానాం రథినం విద్ధి'' ఇత్యాదినా జీవస్య రథికస్య సంసారమోక్షయో ర్గంతృత్వేన విశేషితత్వాత్, ''సో೭ధ్వనః పరమాప్నోతి'' ఇతి పరమాత్మనో గంతవ్యత్వేన చ విశేషితత్వాత్ గుహాం ప్రవిష్టౌ జీవాత్మ పరమాత్మానా వేవ న బుద్ధిజీవా వితి నిశ్చీయతే.
వివరణము :- ఈ ప్రకరణముననే ''ఆత్మానం రథినం విద్ధి'' అను మన్త్రములో జీవుని రథికునిగా తెలిసికొనుము అని చెప్పుచు జీవాత్మను సంసార మోక్ష స్థానములను గూర్చి ప్రయాణము చేయు వానినిగ నిరూ పించి యుండుట చేతను - అట్లే ''సో೭ ధ్వనః పర మాప్నోతి'' అను మంత్రములో ఆ జీవుడు (రథికుడు) ఆ మార్గము యొక్క అవతలి ఒడ్డు అగు పరమాత్మను పొందును అని ప్రతిపాదించుచు పరమాత్మను జీవునకు గన్తవ్యమునుగా (పొందిదగిన వానినిగా) నిరూపించి యుండుటచేతను వెనుక చెప్పినట్లు గుహా ప్రవిష్టులు జీవాత్మ పరమాత్మలే అని చెప్పవలయును గాని బుద్ధిజీవులని చెప్పరాదు.
అంతరధికరణమ్ 4
13. అంతర ఉపపత్తేః
వివృతిః :- అంతరః= ఛాందోగ్యోపనిషది ఉపకోసలవిద్యాయాం శ్రూయతే ''య ఏషో೭ క్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతిహోవాచైత దమృత మేత దభయ మేత ద్బృహ్మ'' ఇతి. అత్ర అక్షిణ్యంత రుపదిశ్య మానః అంతరః పురుషః పరమాత్మైవ - న ప్రతిబంబాత్మా - నాపిదేవ తాత్మా - నవాజీవః. కుతః ? ఉపవత్తేః = అత్ర ప్రకరణోక్తానాం ఆత్మత్వ - అమృతత్వ - అభయత్వాదీనాం ధర్మాణాం పరమాత్మ న్యేవోపపద్య మానత్వాత్.
వివరణము :- ఛాన్దోగ్యోప నిషత్తులోని ఉపకోసల విద్యాప్రకరణము లోని ''య ఏషో೭క్షిణి పురషో దృశ్యతే - ఏష త ఆత్మేతి హోవాచ'' నేత్రములో ఏ పురుషుడు చూడబడుచున్నాడో ఆపురుషుడు నీ ఆత్మ యని చెప్పు ఈ వాక్యములో అక్షిణి = నేత్రములోపల నున్నట్లు వర్ణింపబడిన ఆ పురుషుడు పరమాత్మయే అని నిర్ణయింపదగును. అంతియే కాని అతడు నేత్రములోని ప్రతిబింబ స్వరూపుడని కాని, జీవుడనిగాని, చక్షురింద్రియాధి ష్ఠాతృదేవత యని గాని చెప్పవలను పడదు. ఏలయన? ఈ వాక్యములు ప్రతిపాదింపబడిన ఆత్మత్వ - అమృతత్వ - అభయత్వాది ధర్మములు పరమాత్మయందే ఉపపన్నములు కాగలవు గాని తదితరముల యందు ఉపపన్నములు కానేరవు గనుక.
14. సూ : స్థానాది వ్యపదేశాచ్చ
వివృతిః :- చ= కించ స్థానాదిప్యపదేశాత్ = ''యః వృథివ్యాం తిష్ఠన్'' ''య శ్చక్షుషి తిష్ఠన్'' ఇత్యాదినా స్థానవ్యపదేశః - ''తస్యోదితి నామ'' ఇత్యాదినా నామవ్యపదేశః - ''హిరణ్యశ్మశ్రుః'' ఇత్యాదినా రూపవ్యపదేశ శ్చోపాసనార్థం బ్రహ్మణి తత్ర తత్ర క్రియతే. తథా೭త్రాపి బ్రహ్మ ణ్యుపాసనార్థం ''య ఏషోక్షిణి పురుషః'' ఇత్యాక్షిస్థాన వ్యపదేశః కృత స్సన్నపి నానుపపన్నో భవతి. అతో7 క్షిణ్యన్త రుపదిశ్యమానః పురుషః పరమాత్మైవ.
వివరణము :- స్థానాది అనచోట గల అదిపదముచేత - నామము - రూపము గూడ గ్రహించ బడుచున్నవి. ''యః పృథివ్యాం తిష్ఠన్'' అను వాక్యములో పృథివి యందున్న వాడగుచు పృథివిని నియమించువాడేవడో ఆతడే పరమాత్మయని వర్ణించుచు పరమాత్మకు స్థానము వర్ణింపబడినది. ''తస్యో దితి నామ'' యను వాక్యములో ఆ పరమాత్మకు ''ఉత్'' అను నామము కలదని నామము వర్ణింప బడినది. ''హిరణ్యశ్మశ్రుః'' ఇత్యాది వాక్యములో హిరణ్మయములగు సర్వావయవములు కలవాడు అని వర్ణించుచు పరమాత్మకు రూపము వర్ణింప బడినది. ఇట్లు నామాది విరహితుడగు పరమాత్మకు ఉపాసనార్థము వేదాంతములలో నచ్చటచ్చట స్థానాది కమును వర్ణించు చుండుట గలదు. అట్లే యిచటను ''య ఏషో೭క్షిణి'' అని పరమాత్మకు నేత్రము స్థానముగ వర్ణింపబడినది. అంతియే కాని నేత్రము అను స్థానమునమాత్ర ముండువాడు అని నిర్దేశించుటకు కాదు. కాన నుపాసనార్థము చేయబడిన స్థానాది వ్యపదేశము= స్థానాదుల వర్ణనము పరమాత్మ యందనుపపన్నము కాదు. కనుక నాంతర పురుషుడు పరమాత్మయే -(ఇచట సర్వవ్యాపకుడు గాన పరమాత్మకు పరిమితమగు నేత్రమను స్థానమున నుండువాడు అని వర్ణించుట ఉచితముకాదు, కాన అక్షిలోపల నున్నట్లు వర్ణింపబడిన ఆ పురుషుడు పరమాత్మ కాకూడదని పూర్వపక్షుల ఆశయము - నేత్రస్థాన సంబంధము ఉపాసనకొఱకు వర్ణింప బడినది కాని నేత్రమునందునమాత్ర ముండువాడు - అన్యత్ర లేనివాడు ఆ పురుషుడు అని నిరూపించుట ఆ వాక్యము యొక్క తాత్పర్యము కాదు గాన అంతర పురుషుడు పరమాత్మయే యనుటలో ఏవిధముగు విరోధమును లేదని సిద్ధాంతుల ఆశయము.)
15. సూ :- సుఖ విశిష్టాభిధానా దేవ చ
వివృతిః :- చ = అపిచ - సుఖవిశిష్టాభిధానాత్= ''ప్రాణో బ్రహ్మ - కం బ్రహ్మ - ఖం బ్రహ్మ'' ఇతి వాక్యోపక్రమే యత్సుఖవిశిష్టం బ్రహ్మో పక్రాంతం తసై#్య వాక్షివాక్యేపి ''ఏషః'' ఇతి ప్రకృతపరామర్శినా శ##బ్దేనా భిధానా దేవ చాక్ష్యన్తరః పురుషః పరమాత్మైవ
వివరణము :- ఈ ప్రకరణములోనే ఆరంభమున ''ప్రాణం బ్రహ్మ - కం బ్రహ్మ-ఖం బ్రహ్మ'' అను వాక్యములలో సుఖవిశిష్టమైన బ్రహ్మ వస్తువు వర్ణింప బడినది. ఆ బ్రహ్మవస్తువే ''య
ఏషో7క్షిణి'' అను వాక్యములోని పూర్య ప్రకృత పదార్థమును పరామర్శించు ''ఏషోః'' అను పదముచే పరామర్శింప బడుచున్నది. కాననూ - అక్ష్యంతర పురుషుడు పరమాత్మయే అని తేలుచున్నది.
16. సూ : శ్రూతో పనిషత్క గత్యభిధానా చ్చ
వివృతిః :- చ= అపిచ - శ్రుతోపనిషత్క గత్యభిధానాత్ = శ్రుతోప నిషత్కస్య శ్రుత రహస్య విజ్ఞానస్య బ్రహ్మవిదో యాగతి ర్దేవయానాఖ్యా శ్రుతౌ స్మృతౌ చ ప్రసిద్ధా తస్యా ఏవ గతే రిహాప్యక్ష్యన్తరపురుషవిదః ''తేర్చిష మభిసంభవన్తి'' ఇత్యాదినా భిధానా దప్యక్ష్యన్తరః పురుషః పరమాత్మైవ.
వివరణము :- మఱియు - వేదాన్త వాక్య విచారాదుల సలిపి తద్ర హస్యముల నవగత మొనరించుకొనిన బ్రహ్మ విదునకు శ్రుతిస్మృతుల యందు ఏదేవయాన మార్గము వర్ణింపబడి ప్రసిద్దమై యుండెనో ఆమార్గమె యిచటను గూడ అక్ష్యంతర పురుషోపాసకునకును వర్ణింపబడి యున్నది గానను అక్ష్యంతర పురుషుడు పరమాత్మయె అని నిశ్చయింపదగును.
17. సూ : అనవస్థితే రసంభవాచ్చ నేతరః
వివృతిః :- ఇతరః= ప్రతిబింబాత్మవా - దేవతాత్మావా - శారీరో వా న=అక్ష్యస్తరః పురషో న భవతి. కుతః? అనవస్థితేః= చక్షుషి తేషాం నియమే నావస్థానభావాత్. అంభవాత్ - చ= అమృతత్వాది ధర్మాణాం తేషు ప్రతిబింబాది ష్యసంభవా చ్చాక్ష్యన్తరః పురుషః పరమాత్మైవ - నాన్యః ఇతి సిద్ధ్యతి.
వివరణము :- నేత్రమున ప్రతిబింబించి కానవచ్చు ప్రతిబింబాత్మ గాని - నేత్రము నధిష్టించి తాత్కర్య నిర్వహణమునకు సహకారియగుచు నుండు ఆదిత్యరూప దేవతాత్మగాని - దృష్టయగు జీవాత్మగాని అక్ష్యంతర పురుషుడు కారాదు ? అని యనుట తగదు - ఏలయన ? నేత్రమునందు వారెవరికిని నియతమగు అవస్థానము (ఉనికి) నంభవించదు గనుకనున్నూ, ఆవాక్యములో వర్ణింపబడిన అమృతత్వ - అభయత్వాది ధర్మములు వారి యందు సంభవించవు కనుకనున్నూ ఆక్ష్యంతర పురుషుడు పరమాత్మయే కాని తదితర లెవరునూ కాదని తేలుచున్నది.
అన్తర్యా మ్యధికరణమ్ 5
18. సూ : అన్తర్యా మ్యధిదైవాదిషు తద్ధవ్యపదేశాత్
వివృతిః :- అధిదైవాదిషు= బృహదారణ్యకోపనిషదన్తర్గ తాంతర్యామి బ్రాహ్మణ శ్రూయతే ''యః పృథివ్వాం తిష్ఠన్ పృథివీ మన్తరో యమయ త్వేష త ఆత్మాన్తర్యా మ్యమృతః ఇతి. అత్రోక్త దైవతేషు లోకాదిషు చ అన్తర్యామీ= అన్తర వస్థాయ తత్తద్దేవ తాదికం నియమయ తీతి తద్ర్బాహ్య ణ వర్ణ్యమానః అన్తర్యామీ పరం బ్రహ్మైవ - నతు దైవతాద్యభి మానీ దేవతాత్మా - నవా యోగసిద్దః కశ్చన జీవః - కుతః ? తద్ధర్మవ్యపదేశాత్= తస్యరమాత్మనః, అసాధారణాః యే సర్వాన్తర్యామిత్వ - ఆత్మత్వ - అమృతత్వాదయో ధర్మా స్తేషా నిర్దేశాత్ - అన్తర్యామీ పరమాత్మేతి సిద్దమ్.
వివరణము :- బృహదారణ్యములోని అంతర్యామి బ్రహ్మణ ములో ''యః పృథివ్యాం తిష్ఠన్ పృథివీమంతరో .... మ్యమృతః'' ఇత్యాది వాక్యములలో పృథివ్యాది లోకములు - దేవతలు - ఆత్మ మొదలగు పదార్థ ములయందు వారిచే తెలియబడకయే వానిలోపల నుండుచు వానిని నియ మించుచుండు నంతర్యామియైన వాడేవ్వడో ఆతడు నీయాత్మయని వర్ణింప బడియున్నది. అచట వర్ణింపడిన ఆ అంతర్యామి పరబ్రహ్మయే యని చెప్పవలయును గాని - అతడు తత్తత్పదార్థాభిమాని యగు దేవతా విశేషము అని కాని, అణిమాది యోగసిద్దులను పొందిన ఒకొనొక జీవుడు అని కాని, చెప్పుటకు వలను పడదు. ఏలయన ? ఆవాక్యములలో వర్ణింపబడిన సర్వాన్తర్యామిత్వము - అత్మత్వము - అమృతత్వము - మొదలగు ధర్మములు పరమాత్మయందు మాత్రమే వర్తించునవిగాని తదితర పదార్థముల యందు వర్తించునవి కాదు గనుక - ఆ కారణమున నంతర్యామి పరమాత్మయే అని నిశ్చయింపదగును.
19. సూ : నచ స్మార్త మత ద్ధర్మాభిలాపాత్
వివృతిః :- స్మార్తం చ = సాంఖ్యస్మృత్యుక్తం ప్రధానమపి న = అన్తర్యామీ న భవతి. కుతః? అతద్ధర్మాభిలాపాత్ = తత్ = అచేతనం ప్రధానం, న తత్ = అతత్ = ప్రధానభిన్నం = చేతనం. తత్సంబన్ధి ధర్మాణాం ''అదృష్టో ద్రష్టా'' ఇత్యాదినా అభిలాపాత్ = అత్రోక్తత్వాత్.
వివరణము :- సాంఖ్యస్మృతి ప్రతిపాదితమైన ప్రధానమును గూడ ఆ అంతర్యామి వస్తువు అని అనుటకు వీలులేదు. ఏలయన? అంతర్యామిని వర్ణించు ప్రకరణములోని ''అదృష్టో ద్రష్టా'' ఇత్యాది వాక్యములలో అచేతనమగు ప్రధానమునకు సంబంధించనివియు - చేతనడగు పరమా త్మకు మాత్రమే సంబంధించు నవియు నగు ద్రష్టృత్వాది (చూచుట మొద లగు) ధర్మములు వర్ణింపబడి యున్నవి గనుక.
20. సూ : శారీర శ్చోభ##యే పి హి భేదేనైన మధియతే
వివృతిః :- శారీరః- చ=జీవోపి నాన్తర్యామీ, కింతు పరమాత్మైవ. కుతః? హి = యస్మాత్ ఉభ##యే - అపి = కాణ్యమాధ్వందినాశాఖినః ఉభ##యే7పి ఏనం = శారీరం (జీవం) భేదేన = అంతర్యామిణః = పర మాత్మనః పృథక్త్వేన ''యో విజ్ఞానే తిష్ఠన్'' ''య అత్మని తిష్ఠన్'' ఇతిచ అధీయతే = పఠన్తి = వర్ణన్తి = ప్రతిపాదయన్తీత్యర్థః. అతో೭న్తర్యామీ పరమాత్మవ న శారీరః.
వివరణము :- జీవుడు అన్తర్యామి కానేరడు. ఏలయన? కాణ్వమాధ్వందిన శాఖలవారుభయులను ''యో విజ్ఞానే తిష్ఠాన్'' అని వాక్యము లోను, ''య ఆత్మని తిష్ఠన్...'' అను వాక్యనులోను గూడ జీవుని అన్తర్యామి కంటె భిన్నునిగ ప్రతిపాదించుచున్నారు గనుక - కాన నన్త ర్యామి జీవుడు కాదని పరమాత్మయేయని తెలియదగును.
అదృశ్యత్వాధికరణమ్ 6
21. సూ : అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తేః
వ్వృతిః :- అదృశ్యత్వాదిగుణకః = ''ముండకోపనిషది శ్రూయతే ''యత్త దద్రేశ్యమగ్రహ్య మగోత్ర మవర్ణ మచక్ష శ్శ్రోతం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యత్ భూతయేనిం పరిపశ్యన్తి ధీరాః'' ఇతి. అత్రోక్తః అదృశ్యత్వాదిగుణకః భూతాయోనింః పరకమేశ్వరఏవ. న ప్రధానం, న వా జీవః - కుతః? ధర్మోక్తేః = ''య స్సర్వజ్ఞ స్సర్వవిత్'' ఇతి సర్వజ్ఞత్వాది ధర్మాణాం పారమేశ్వరాణాం ఇహోక్తత్వత్ - పరమాత్మైవ భూతయోని ర్మాన్యః.
వివరణము :- ముండకోపనిషత్తులోని ''యత్త దద్రేశ్య మగ్రాహ్య మగోత్రమవర్ణ మచక్షుః.... యద్భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః'' అను వాక్యములో ఇది యిట్టిది అని నిర్దేశింప నలవిగాని- ఏ సాదనముల చేతను గ్రహింపబడని- గోత్ర వర్ణేంద్రియాది విరహితమగు సమస్త - భూతములకు యోని యగు (మూలకారణమగు) వస్తువును విజ్ఞాన సంపన్నులు ప్రత్యక్షముగ సర్వత్ర దర్శింతురు, అని వర్ణింపబడి యున్నది. ఆ వాక్యములో అద్రేశ్యమని - అగ్రహ్యమని యిట్లు వర్ణింపబడిన భూతయోని పరమాత్మ యేగానీ - ప్రధానముకాని జీవుడుకాని కాదు. ఏలయన? ఆ ప్రకరణము లోని ''యస్సర్వజ్ఞస్సర్వవిత్'' అని పరమాత్మకే సంబంధించు సర్వజ్ఞ త్వము మొదలగు ధర్మములు వర్ణింపబడినవి గనుక - జడమగు ప్రధానము నకు గాని, కించిద్‌జ్ఞుడగు జీవునకుగాని సర్వజ్ఞత్వాది ధర్మములు సంభవించవు. కాన భూతయోని వస్తువు పరమాత్మయే.
22. సూ: విశేషణ భేద వ్యపదేశాభ్యం చ నేతరౌ
వివృతిః :- ఇతరౌ = జీవో వా - ప్రధానం వా. న = భూతాయోని ర్న భవతః - కుతః? విశేషణ భేదవ్యపదేశాభ్యాం - చ = ''దివ్వో హ్యమూర్తః పురష స్సబాహ్యాభ్యన్తరో హ్యజో೭ప్రాణో హ్యమనా శ్శుభ్రః'' ఇతి వాక్యే దివ్యత్వాది విశేషణవ్యపదేశాత్ జీవో న భూతయోనిః. ఏవం ''అక్షరా త్పరతః పరః'' ఇతి వాక్యే ఆక్షర శబ్దవాచినః ప్రధానాత్ భేదేన వ్యపదేశాచ్చ న ప్రధానం భూతయోనిః. కిం తు పరమాత్మై వేతినిశ్ఛీయతే.
వివరణము :- ఈ ప్రకరణములో నున్న ''దివ్యో హ్యమూర్తః పురుషః'' అను వాక్యములో దివ్యత్వాది విశేషణములు వర్ణింపబడి యున్నవి. ఆ విశేషణములు ఆవిద్యకల్పిత శరీరాద్యుపాధి పరిచ్ఛిన్ను డగు జీవునియందు సంభవించనేరవు గాన భూతయోని జీవుడు కాదు. అట్లే ''అక్షరా త్పరతః పరః'' అను వాక్యములో సర్వోత్కృష్ట మగు అక్షరశబ్ద వాచ్యమైన ప్రధానము కంటె పరుడు = ఉత్కృష్చుడు అని ప్రధానభిన్నముగ భూతయోని వస్తువు వర్ణింపబడి యున్నది. కాన భూత యోని ప్రధానము కాదనియు పరమాత్మయే అనియు తెలియదగును.
23. సూ : రూపోపన్యాసా చ్చ
వివృతి- :- అగ్ని ర్మూర్ధా చక్షుషీ చన్ద్రసూర్యౌ'' ఇత్యాదినా భూతయో న్యక్షరస్య త్రైలోక్యాత్మక రూపప్రతిపాదనా దపి అదృశ్యత్వాది గుణకో భూతయోనిః పరమాత్మై వేతి నిశ్చీయతే - యద్వా - ''పురుష ఏవేదం విశ్వం కర్మ తపో మృతం'' ఇతి సర్వాత్మకత్మ రూపోపన్యాసా దపి భూతయోనిః పరమాత్మైవేతి నిశ్చీయతే.
వివరణము :- మరియు నీ ప్రకరణములో అగ్ని ర్మూర్దా చక్షుషీ చన్ద్రసూర్యౌ......'' అను వాక్యములో ఆ అక్షరమగు భూతయోని వస్తువు నకు అగ్ని ఉత్తమాంగము = శిరస్సు - చంద్రసూర్యులు నేత్రములు అని యిట్లు మల్లోకములును ఆతని స్వరూపమే (అవయవములు) అని వర్ణింప బడి యున్నది. ముల్లోకములును తనకు స్వపరూమే యగుట పరమాత్మకే సంభంవించును. కనుక భూతయోని శబ్దముచే చెప్పబడినది పరమాత్మయే అని నిశ్చయింపబడుచున్నది. (ఈ సూత్రమునకు మరియొక విధమగు వ్యాఖ్యానము.)
మరియు నీ ప్రకరణములో ''పురుష ఏవేదం విశ్వం....'' అను నీ వాక్యములో పరిపూర్ణుడు- ఈ కన్పట్టు (పరిదృశ్యమానమగు) చరా చరాత్మకమగు నిఖిల ప్రపంచ స్వరూపుడు అని యిట్లు అక్షరమగు భూత యోని వస్తువ వర్ణింపబడి యున్నది. సర్వ ప్రపంచ స్వరూపత్వము అనునది పరమాత్మకు దక్క నన్యపదార్థమునకు సంభవించదు కనుక నున్నూ - ఈ ప్రకరణములో వర్ణింపబడిన భూతయోని వస్తువు పరమాత్మయే అని నిశ్చయింపదగును.
వైశ్వాన రాథికరమ్ 7
24. సూ : వైశ్వానర స్సాధారణశబ్దవి శేషాత్
వివృతిః :- ఛాందోగ్యోపనిషది వేశ్వానరవిద్యాయాం శ్రూయతేకో న ఆత్మా - కిం బ్రహ్మ'' ఇతి. ''ఆత్మాన మేవేమం వైశ్వానరం సంప్రత్యధ్యేషి తమేవ నో బ్రూహి ''ఇత్యాది వైశ్వానరః=అత్ర శ్రూయమాణః వైశ్వానరః పరమాత్మైవ. న జఠరాగ్నిః _ న భూతాగ్నిః _ నాప్యగ్ని దేవతా _ నవా జీవః _ కుతః ? సాధారణ శబ్దవిశేషాత్ = సాధారణ శబ్దవిశేషాత్ = సాధారణయోః వైశ్వానర ఆత్మ శబ్దయోః విశేషాత్ వైశ్వారశబ్దః జాఠరౌగ్నౌ, భూతగ్నౌ, అగ్నిదేవతాయాం చ సాధారణః శబ్దః ఆత్మశబ్దస్తు జీవే _ పరమాత్మని చ సాధారణః శబ్దః _ ఉభయత్ర సాధారణయో శ్శబ్దయోస్సతో రపి తయో శ్శబ్దయోః పరమాత్మపరత్వే ఏవ విశేషః అవగమ్యతే. ''తస్య హ వా ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః'' ఇత్యాదినాత్రైలోక్య శరీరత్వేన పరమేశ్వరాసాధారణధర్మేణ విశేషితత్వాత్ _కించ ''ఏవగ్ హ అస్య సర్వే పాప్మనః ప్రదూయన్తే'' ఇతి తద్విదః సర్వపాప దహన శ్రవణం, ఆత్మశబ్ద బ్రహ్మశబ్దాభ్యా ముపక్రమణ మిత్యాదీని చ లింగాని వైశ్వానరం పరమాత్మాన మేవ గమయన్తి నాన్యమ్.
వివరణము :- ఛాన్దోగయోపనిషత్తు నందలి వైశ్వానర విద్యాప్రకరణ మున ''కో న ఆత్మా.... కిం బ్రహ్మ''__ ''ఆత్మాన మేవేమం వైశ్వానరం సంప్రత్యధ్యేషి త మేవ నో బ్రూహి'' యను నిట్టి వాక్యములు గలవు. వానిలోని వృత్తాంతమిది. ప్రాచీనశాలుడు మొదలగు మహాత్ములు కొందరు ఆత్మ - బ్రహ్మల యొక్క తత్త్వమును గూర్చి విచారణ సల్పి తన్నిశ్చ యార్థము ఉద్దాలకుని యొద్దకు వెళ్ళిరి. ఆతని వలన గూడ నిర్ణయము తేలకపోవుటతో ఆ ఉద్దాలకుడును వెనుకటివారును కలసి కేకయ దేశాధి నేతయగు అశ్వపతి యను రాజర్షిని జేరి యిట్లనిరి. ఓ రాజా ! వైశ్వానర స్వరూపమగు ఆత్మను నీవిపుడు స్మరించు చుంటివి (తెలిసికొని యుంటివి) గదా. ఆ తత్త్వమును గూర్చి మాకు తెలియజెప్పుము అని అడిగిరి. ఈ వాక్యములలో వర్ణింపబడిన వైశ్వానరుడు జాఠరరాగ్ని అని గాని - భూతాగ్ని యనిగాని- అగ్నిదేవతయని గాని-_జీవుడని గాని యనుటకు వలను పడదు. ఆ వైశ్వానరుడు పరమాత్మయేఅని నిశ్చియింపదగును. ఏలయన? పైవాక్యములలో- వైశ్వానరః అనియు, ఆత్మా అనియు రెండు శబ్దములు కానుపించుచున్నవి. వానిలో వైశ్వానర శబ్దము జాఠరాగ్ని- భూతాగ్ని (పంచభూతములలో నొకటి యగు అగ్నిభూతము) అగ్నిదేవుడు- అను మూడు పదార్థములను బోధింపగల సాధారణ శబ్దము. అట్లే ఆత్మ శబ్దము జీవాత్మ-పరమాత్మ యనునీరెండువస్తువులను బోధించు సాధారణ శబ్దము. ఈ వాక్యములలో కానుపించు ఈ రెండు శబ్దములచేత ఈ ప్రకరణమున వెనుక చెప్పిన ఐదు పదార్థములకు ప్రసక్తి కలదని చెప్పుట కవకాశము కానుపించు చున్నది. అయినను ఈ వాక్యములు పరమాత్మను బోధించు టకై ప్రవృత్తములు కాని యన్యథా కాదని చెప్పుటకు తగిన విశేషహేతువు కలదు. అది యేది యనిన ఈ ప్రకరణములోని ''తస్య హ వా ఏత స్యా త్మనో మూర్ధైవ సుతేజాః ....'' అను వాక్యములో ఆత్మస్వరూపడగు వైశ్వా నరునకు ద్యులోకము శిరస్సు - అని.... పాదములు పృథివి యని యిట్లు త్రైలోక్యమును ఆయనకు శరీరముగా వర్ణింపబడి యున్నది. త్రైలోక్య శరీరత్వము (ముల్లోకములును తనకు శరీరమగుట) పరమేశ్వరునకు దక్క అన్యులకు సంభవించడు గనుక వైశ్వానరుడు పరమాత్మయే యని చెప్పదగును.
మఱియు ''ఏవగ్‌ం హ వా అస్య సర్వే పాప్మనః ప్రదూయన్తే'' అను వాక్యములో వైశ్వానర విద్యాభిజ్ఞునకు సమస్త పాపములును దగ్ధములు కాగలవని ఫలము వర్ణింపబడినది. ఇట్టి ఫలము వైశ్వానరుడు పరమాత్మ యనిననే ఉపపన్నమగును గాని మరియొక విధముగా ఉపపన్నము కానేరదు. కాన నీ ఫలబోధక వాక్యమును వైశ్యానరుడు పరమాత్మయే యని సూచించు చున్నది. మఱియు నీ ప్రకరణము ఆత్మశబ్ద - బ్రహ్మశబ్దములతో నారంభ##మైనది. ఆప్రకరణములోనిదే ఈ వైశ్వానర వాక్యము. కాన నిట వర్ణింపబడిన వైశ్వానరుడును ఉపక్రమము ననుసరించి ఆత్మాభిన్న బ్రహ్మ వస్తువే అని యనుట ఉచితము.
25. సూ : స్మర్యమాణ మనుమానం స్యా దితి
వివృత్తిః :- స్మర్యమాణం = ''య స్యాగ్నిరాస్యం - ద్యౌ ర్మూర్ధా - ఖం నాభిః - చరణౌ క్షితిః -'' ఇతి విష్ణువురాణోక్త శ్లోకేన పరమేశ్వర సై#్యవ త్రైలోక్యాత్మకం రూపం - స్మర్యమాణం సత్ - అనుమానం - స్యాత్ = మూలభూతాయా శ్శ్రుతేం అనుమానం - ద్యోతకం స్యాత్ - ఇతి = ఇత్యేత స్మాద్ధేతోః వైశ్వానరః పరమాత్మైవ.
వివరణము :- ''యస్యాగ్నే రాస్యం ద్యౌ ర్మూర్థా ఖం నాభిశ్చరణౌ క్షితిః'' అను విష్ణుపురాణములోని యీ శ్లోకము అగ్నిముఖమని_ ద్యులోకము శిరస్సని- ఆకాశము నాభియని- పృథివి పాదములని యిట్లు సర్వ ప్రపంచాత్మకునిగా పరమేశ్వరుని వర్ణించుచున్నది. స్మృతి రూపమైన విష్ణు పురాణగతమగు నీ శ్లోకము తనకు మూలభూతమగు ''తస్య హ వా ఏత స్యాత్మనో'' అను శ్రుతివాక్యము నందు త్రైలోక్య శరీరుడగ వర్ణింప బడిన వైశ్వానరుడును పరమేశ్వరుడే అని సూచించు చున్నది. కాన వైశ్వానరు డనిన నిచట పరమాత్మయే అని నిర్ణయింపనగును.
26. సూ : శబ్దాది భ్యోన్తః ప్రతిష్ఠానా న్నేతి చేన్న తథా
దృష్ట్యుపదేశా దసంభవా త్పురుష మపి చైన
మధీయతే.
వివృతిః :- శబ్దాదిభ్యః = శబ్దాదిహేతుభ్యః - వైశ్వానరశబ్దః జాఠ రాగ్నిపర ఏవ. న పరమాత్మపరః-శబ్దః=వైశ్వానరశబ్దం-స హి జాఠరాగ్నౌ రూఢః. ఏవం -అగ్నిత్రేతాకల్పనం = ''హృదయం గార్హపత్యః'' ఇత్యాదినా అగ్నిత్రేతాకల్పనం - ఆహుత్యాధారతా కల్పనం = ''త ద్యద్భక్తం ప్రథమ మాగచ్ఛే త్తద్ధోమియం'' ఇత్యాదినా ప్రాణాహుత్యాధారతా కల్పనం (ఏతేభ్యో హేతుభ్యః) - అంతఃప్రతిష్ఠానాత్ =''పురుషే అన్తః ప్రతిష్ఠితత్వం వేద'' ఇత్యాదినా అంతః ప్రతిష్ఠితత్వోక్తేశ్చ. ఇత్యేతేభ్యో మేతుభ్యో జాఠర ఏవ వైశ్వానరః -న=న పరమేశ్వరః ఇతి చేత్=ఇత్యుక్తం చేత్‌న= వైశ్వానరః పరమేశ్వరో న భవతీతి వక్తుం న శక్యతే. కుతః ? తథా దృష్ట్యుపదేశాత్ = జాఠరాగ్ని రూపేణ పరమేశ్వరస్య దృషే రుపాస్తే రుపదేశాత్ - అథవా తస్మిన్ జఠరాగ్నౌ పరమేశ్వరదృష్టే రుపదేశాత్, వైశ్వానర శబ్దః పర మాత్మపర ఏవ. అసంభవాత్ = వైశ్వానరశబ్దస్య జాఠరాగ్ని పరత్వే ''మూర్ధైవ సుతేజాః'' ఇత్యుపదేశస్య అసంభవః అసంగతత్వం స్యాత్ - తస్మాత్ వైశ్వానరశబ్ద, పరమాత్మపర ఏవ. పురషం - అపి - చ - ఏనం - అధీయతే = ఏనం వైశ్వానరం - వాజసనేయశాఖినః పురుష మపి = ''ఏత మగ్నిం వైశ్వానరం పురుషవిధం పురుషే7న్తః ప్రతిష్ఠితం వేద'' ఇత్యా దినా పురుషవిధం వరయన్తి - పురుషవిధత్వం నామ దేహాకారత్వం - పర మేశ్వరస్య సర్వాత్మకత్వా త్పురుషవిధత్వా ద్యుపపద్యతే - జాఠరస్యతు తన్న కథమ ప్యుపపద్యతే. అతో వైశ్వానరః పరమాత్మైవ.
వివరణము :- వైశ్వానర శబ్దము జాఠరాగ్ని యందు రూఢము. (జఠరాగ్నిని బోధించు ప్రసిద్ధ శబ్దమును) రూఢి నతిక్రమించుట యుక్తముకాదు. కాన నిచట శబ్దమునుబట్టి వైశ్వానరుడు అనగా జఠరాగ్ని యనుటయే ఉచితము. ఇట్లే మరికొన్ని మేతువులును వైశ్వానరుడు జఠ రాగ్నియే యునుటకు తగినవి కలవు. అవియేవి యన? ఈ వైశ్వానర ప్రకరణమున గల నాయా వాక్యములలో వర్ణింపబడిన అగ్నిత్రేతాకల్ప నము మొదలగునవి. అగ్ని త్రేతాకల్పనము:- ''హృదయం గార్హపత్యః'' ఇత్యాది వాక్యములలో ఆ వైశ్వానరునకు గార్హపత్యము- హృదయము అని చెప్పుచు ఆహవనీయాగ్ని- గార్హపత్యాగ్ని- దక్షిణాగ్ని యనునవి వైశ్వా నరుని యవయవములని వర్ణించుచు త్రేతాగ్ని రూపత్వము కల్పించి వర్ణింపబడి యున్నది. ఇట్లే- ప్రాణాహు త్యాధారత్వ కల్పనము:- ''తద్య ద్భక్తం ప్రథమ మాగచ్ఛేత్తద్ధోమీయం'' అను నీ వాక్యములో భుజించుటకై మొదటిదిగా లభించిన భోజ్యద్రవ్యము ప్రాణాదులకు హోమము చేయదగినది (భుక్తి కైలబమైన ద్రవ్యమున కొంత భాగమును ముందుగ హోమము చేసి మిగిలిన ఆహోమశిష్టమును భుజింపవలయునని శ్రుతి శాసనము) యని ప్రతిపాదించుచు ఆ హోమమునకు ఆధారముగ వైశ్వానరుడు వర్ణింపబడి యున్నాడు.
ఇట్లే అంతః ప్రతిషితత్త్వము :- ''పురుషే అంతః ప్రతిష్ఠితం వేద ....'' ఇత్యాది వాక్యములో ఆ వైశ్వానరునకు పురుషుని లోపల యునికి వర్ణింపబడినది. ఈ ప్రకరణమునగల వాక్యములలో కానుపించువైశ్వానర శబ్దము - అగ్ని త్రేతా కల్పనము. భోజ్యద్ర వ్యాహుత్యాధారత్వము - పురుషాన్తః ప్రతిష్ఠితత్వము అను నీ ధర్మములు జాఠరాగ్నియందు సంభ వించునవియే గాన వైశ్వానరుడనగా జఠరాగ్నియే యగును గాని పరమాత్మ కాదు అని పూర్వపక్షము రాగా అది సరిగాదని నిరూపింపబడు చున్నది. ఏలయన ఈ ప్రకరణములో జఠరాగ్ని రూపముగ పరమేశ్వ రోపాసనముగాని జాఠరాగ్నియందు పరమేశ్వర దృష్టిగాని యుపదేశింప బడి యున్నది గాని జాఠరాగ్ని ప్రధానముగ వర్ణింపబడి యుండలేదు. ఇంతియేగాక వైశ్వానరుడు జాఠరాగ్నియే యన్నచో ''తస్య మూర్ధైవ సుతేజాః....'' అను వాక్యములో వర్ణింపబడిన త్రైలోక్య దేహత్వము జాఠరాగ్నియందు సంభవించనేరదు. కాన వైశ్వానరుడనగా పరమాత్మయే అని అనదగును.
మరియు శుక్ల యజుర్వేదాన్తర్గత వాజసనేయి శాఖవారు ''ఏత మగ్నిం వైశ్వానరం పురుషవిధం....'' అను వాక్యములో వైశ్వానరునకు పురుష విధత్వమును వర్ణించుచున్నారు. పురుషవిధత్వము అనగా పురుష దేహా కారత్వము అని యర్థము. పరమేశ్వరుడు సర్వాత్మకుడు గనుక ఆయనకు పురుష దేహాకారత్వ ముపపన్న మగును. జాఠరాగ్నియే వైశ్వానరుడన్నచో ఈ వర్ణింపబడిన పురుషవిధత్వ మాతని యందు సంభవించదు. కాన వైశ్వానరుడు పరమాత్మయే అని నిర్ధరింపదగును.
27. సూ : అత ఏవ న దేవతా భూతం చ
వివృత్తిః :- అతః - ఏవ = పూర్వోక్తేభ్య సై#్త్రలోక్యశరీరత్యాదిభ్యో హేతుభ్య ఏవ- న - దేవతా = అగ్నిదేవతాపి వైశ్వానరో న భవతి - న - భూతం - చ = భూతాగ్ని రపి ; వైశ్వానరో నభవతి, కింతు పరమాత్మైవ.
వివరణము :- అత ఏవ = పూర్వ ముదామరించిన త్రైలోక్య శరీ రత్వము - మొదలుగాగల హేతువుల వలననే శైశ్వానరుడు అగ్ని దేవత యని గిని, పంచభూతములలో నొకటి యగు అగ్నిభూతము అని గాని చెప్పవలనుపడదు. ముల్లోకములును తనకు శరీరమగుట పరిచ్ఛిన్న = పరిమిత శక్తి సంపన్నమగు ఒక అగ్ని నామకమగు దేవతకుగాని, అగ్ని భూతమునకుగాని సంభవింపదుగదా- కాన వైశ్వానరుడు పరమాత్మయే యని నిశ్చయింపదగును.
28. సూ : సాక్షాదా ప్యవిరోధం జైమినిః
వివృతిః :- సాక్షాత్ - అపి = వైశ్వానరవాక్యే ప్రతీకోపాధికల్ప నాభ్యాం వినైవ సాక్షా త్పరమేశ్వరోపాసన పరిగ్రహేపి - అవిరోధం =విరోధాభావం - జైమినిః = జైమిని రాచార్యో మన్యతే - విశ్వశ్చాపౌ సర శ్చెతి = విశ్వాసరః = సర్వాత్మక - విశ్వానర ఏవ వైశ్వానరః ఇతియేగేన వైశ్వానరాదిశబ్దానాం బ్రహ్మేణ్యవ వృత్తేః, అంతః ప్రతిష్ఠానాదీనాం ధర్మాణాం చ బ్రహ్మణ్యవ ముఖ్యత్వాత్. అగ్ని త్రేతాకల్పనస్య చ సర్వాధిష్ఠానే బ్రహ్మ ణ్యవిరుద్ధత్వా చ్చే త్యాది హేతుభ్యోః వైశ్వానర శబ్దస్య బ్రహ్మపరత్వే ''యస్తేత్వం ప్రాదేశమాత్ర మభివిమాన మాత్మానం'' ఇతి ప్రాదేశ మాత్రశ్రుతిః కథ ముపపద్యతే ఇత్యత్రోచ్యతే.
వివరణము :- వైశ్వానర వాక్యములో జఠరాగ్న్యుపాధిక పర బ్రహ్మోపాసనముగాని, జఠరాగ్ని యను ప్రతీకము నందు పరబ్రహ్మో పాసనముగాని యభిహితమైనది యని వెనుక చెప్పబడినది. అట్లుకాక సాక్షాత్తుగ పరమాత్మోపాసనమే యిచట ప్రతిపాదింపబడినదని యనినను దోషము లేదని ఆచార్యులు శ్రీ జైమిని మహర్షి యభిప్రాయపడుచున్నారు.
వైశ్వానర శబ్దమునకు ఆ శబ్దము నందలి అవయవముల అర్థము ననుసరించి విచారించిన (విశ్వశ్చాసౌ నరశ్చ అను వ్యుత్పత్తి ననుసరించి విచారించిన) సర్వాత్మకుడగు పరమాత్మ యను అర్థము లభించును కనుక నున్నూ - పూర్వము ఉదహరించిన అగ్ని త్రేతా కల్పనము, అస్తః ప్రతిష్ఠి తత్వము మొదలగు ధర్మము లన్నియు సర్వాధిష్థానము, సర్వాత్మకము నగు బ్రహ్మము నందు విరోధమేమియు లేక సమన్వితములు కాగలవు కనుకనున్నూ ఇట్లు చెప్పుట యుక్తమని వారి భావము.
29. సూ : అభివ్యక్తే రిత్యాశ్మరథ్యః
వివృతిః :- సర్వవ్యాపకస్వాపి పరమేశ్వరస్య ప్రాదేశమాత్రత్వ ముపపద్యత ఏవ - కుతః ? అభివ్యక్తేః=ఉపాసకానుగ్రహాయ పరమేశ్వరః ప్రాదేశా ద్యల్పపరిమాణుషు హృదయాది స్థానేషు ప్రాదేశమాత్రః అభివ్యజ్యతే - అతః అభివ్య క్త్యాధర స్థానాపేక్షయా పరమేశ్వరస్య ప్రాదేశ మాత్రత్వ ముపపద్యత ఇతి - ఆశ్మరథ్యః=ఆశ్యరథ్యాచార్యో మన్యతే.
వివరణము :- వైశ్యానరశబ్దము పరమాత్మ పరము తద్ఘటితమగు (వైశ్వానరపదముతో గూడిన) ఆ వైశ్వానర వాక్యము పరమాత్మోపాసనాపరము అని యనుట తగదు. ఆ ప్రకరణములోని ''యసై#్వత మేవం ప్రాదేశ మాత్ర మభివిమాన మాత్మానం వైశ్వానర ముపాసై'' అని నీవాక్యము ఎవడు ప్రాదేశ పరిమితమగు, సర్వజ్ఞమగు, ఆత్మాభిన్నమగు, వైశ్వానరు నుపాసించనో అని చెప్పుచు వైశ్వానరునకు ప్రాదేశ మాత్రత్వమును వర్ణించినది. (ప్రాదేశము అనగా లొడితెడు అని ముఖార్థము. ప్రాదేశ పరిమితము అనగా స్వల్ప పరిమాణము కలది యని భావము) వైశ్యానర శబ్దము పరమాత్మ వర్ణనము ఎట్లు కుదురును అను ఆక్షేపము రాగా సమాధానము నిట్లు ఆశ్మరథ్యాచార్యులు చెప్పుచున్నారు.
పరమేశ్వర డుపాసకుల ననుగ్రహించుటకై హృదయాది స్థానములలో నభివ్యక్తమగుచున్నాడు. కనుక అతని యభివ్యక్తికి ఆధారమగు స్థానమును బట్టి ప్రాదేశ పరిణామము కలవాడని పరమేశ్వరుని వర్ణించుట ఉపసన్నము (యుక్తియుక్తము) విరోధమేమియు లేదని వారి యాశయము.
30. సూ : అనుస్మృతే ర్బాదరిః
వివృతిః :- అనుస్మృతేః = ప్రాదేశమాత్ర హృదయ ప్రతిష్టతేన మనసా ధ్యానాత్ - ప్రాదేశమాత్ర ఇత్యుపచర్యత ఇతి. బాదరిః=ఆచార్యో బాదరి ర్మన్యతే.
వివరణము :- సర్వవ్యాపకుడగు పరమేశ్వరునకు ప్రాదేశమాత్రత్వవర్ణన మనుచితమను వెనకటి యాక్షేపమునకు బాదర్యాచార్యుల సమాధానము. ప్రాదేశ మాత్రమగు = స్వల్ప పరిమాణము గల హృదయ పుండరీకమున సమ్యక్ ప్రతిష్ఠితమైన మనస్సుతో ధ్యానింపబడుచున్నాడు. గనుక ఆ స్థానమునుబట్టి ఆ వాక్యము వైశ్వానరునకు = పరమాత్మకు ప్రాదేశ మాత్రత్వమును వర్ణించినదిగాని వాస్తవముగ పరమాత్మకు పరిమాణము కలదని వర్ణించుట కాదు వారి యాశయము.
31. సూ : సంపత్తే రితి జైమిని స్తథా హి దర్శయతి
వివృతిః :- సంపత్తేః = త్రైలోక్యాత్మనః వైశ్వానరస్య మూర్ధాద్యవయ వానాం - ఉపాసకస్య ముర్థాది చుబు కాంతావయవేషు ప్రాదేశమాత్ర పరిమితే దేశే వర్తమానేషు సంపాదనాత్ - ప్రాదేశమాత్రత్వోక్తిః వైశ్వానర స్యోపపద్యతే - ఇతి - జైమినిః = ఏవం జైమిని రాచార్యోమన్యతే - తత్ర = స్వాభిప్రాయే శుత్రిసమ్మితి మపి దర్శయతి - తథా - హి - దర్శయతి = ఉపాసకస్య మురాదిచుబుకాంతే ప్రాదేశమాత్రే దేశే వైశ్వానర మురాద్య వయవానాం సంపత్తిం = సంపాదనం వాజసనేయిశ్రుతిః 'ప్రాదేశమాత్ర మివహవై దేవా స్సువిదితా అభిసంపన్నా'' ఇత్యాదినా ప్రతిపాదయతి ఇతి.
వివరణము :- సర్వవ్యాపకుడగు పరమాత్మకు ప్రాదేశ మాత్రత్వవర్ణన మను పపన్నమను ఆక్షేపమునకు జైమిన్యాచార్యులవారి సమాధానము.
త్రైలోక్యాత్మకు డగు వైశ్వానరుని యొక్క ''తస్య మూర్థైవ సుతేజాః...'' ఇత్యాది వాక్యములలో వర్ణింపబడిన ముర్ధాది (శిరస్సు మొదలుగా గల) అవయవములకు సంబంధించిన - ప్రాదేశ పరిమిత (లొడితెడు) ప్రదేశములో నుండు ఉపాసకుని శిరస్సు మొదలు గడ్డము వరకును గల అవయవములలో చేయదగిన ఉపాసనము కొరకైన సంపాదనము = సంపదుపాసనము విధింపబడినది గాన వైశ్వానరునకు ప్రాదేశ మాత్రత్వ వర్ణనము ఉపాసనార్థమును బట్టి నిరేశింపబడినది. కాన విరోధము లేదు.
[సంపత్ = సంపత్తిః = సంపాదనము అనగా స్వల్ప వస్తువుల యందు అధికత్వ దృష్టిని ఉంచుట = ఉత్కృష్టత్వ భావన చేయుట యని యర్థము. ప్రకృతము :- పరిమిత ప్రదేశములో నున్న పరిమితములైన = అల్పములైన ఉపాసకుని ముర్థాది చుబుకాద్యవయవముల యందు (మూర్థము = శిరస్సు- చుబుకము = గడ్డము) ఉత్కృష్టములైన ద్యులో కాది రూపములైన వైశ్వానరుని యొక్క అవయవములు అను దృష్టితో = భావనముతో చేయుటచే సంపాదనము. ఇట్టి ఉపాసనమును సంపదుపాసనము అని అందురు.]
ఇట్లే వాజసనేయి బ్రాహ్మణము నందలి ''ప్రాదేశమాత్ర మివహ వైదేవా స్సువిదితా అభిసంపన్నా స్తథా తు వ ఏతా9 వక్ష్యామి యథా ప్రాదేశ మాత్రమేవాభి సంపాద యిష్యామీతి... ప్రతిష్ఠా వైశ్వానరః'' పరమేశ్వరుడు అపరిచ్ఛిన్నుడే = సర్వవ్యాపకుడే ఐనను అతనిని సంపదుపాసనా ప్రక్రియతో ప్రాదేశ పరమితునిగ కల్పించి బాగుగా నుపాసించి పూర్వము దేవతలు ఆ పరమేశ్వరుని తమ ప్రత్యగాత్మ స్వరూపునిగ పొందిన (సాక్షాత్కరించుకొనిన) వారైరి. ఆ వివరమును మీకిపుడు నేను బోధింతును అను నీ వాక్యము గూడ ఉపాసకుని మూర్ధాది చుబుకాంతావయవముల యందు వైశ్వానరావయన సంపత్తిని చెప్పుచు వైశ్వానరునకు = పరమాత్మకు ప్రాదేశ పరిమితత్వమును నిరూపించుచున్నది. కాన వైశ్వానరుడు పరమాత్మయే యనుటలో ప్రాదేశ మాత్రత్వ వర్ణనము విరోధించదని తేలుచున్నది.
[ఉపాసకుడు తన శిరస్సునందు వైశ్యారుని శిరస్థానీయమగు ద్యులోకదృష్టినుంచి ధ్యానము చేయవలయును. (ఉపాసకుడుస్వావయవములను వైశ్వానరావయవా భేదదృష్టితో ధ్యానించవలయును) అట్లే తన నేత్రములయందు వైశ్వానర నేత్రస్థానీ యాదిత్య దృష్టిని- తన ప్రాణవాయువు నందు వైశ్వానర ప్రాణస్థానీయ వాయుదృష్టిని- తన ముఖ ద్వారము నందలి ఆకాశమునందు వైశ్వాసర దేహమధ్య స్థానీయా కాశదృష్టిని- తన ముఖమునందలి లాలాజలమునందు వైశ్వానర వస్తి స్థానీయోదకదృష్టిని. తన చుబుకమునందు వైశ్వానర పాదస్థానీయ పృథివీదృష్టిని ఉంచి వైశ్వానరోపాసనము గావించవలయును. ఈ యుపాసనము పరమాత్మోపాసనము. ఇది ప్రత్యక్తత్వ ప్రతిపత్తి సాధనము అని వైశ్వానరవాక్య సారాంశము]
32. సూ : ఆమనన్తిచైన మస్మిన్
వివృత్తిః ః- చ = కించ జాచాలాః - ''య ఏష్కో7నన్తో7వ్యక్త ఆత్మాసో7విముక్తే ప్రతిష్ఠతః'' ఇత్యాదినా (అవిముక్తే = కామాదిభి ర్బద్ద జీవే) అస్మిన్ = ప్రాదేశమాత్రే ముర్ధాదిచుబుకాంతరాళే దేశే. ఏనం = పరమేశ్వరం ఉపాస్యత్వేన పరతిష్ఠతం. అమనన్తి = పఠన్తి. అతః ప్రాదేశమాత్రశ్రుతి రూపప న్నైవేత్యర్ధః. తస్మాత్ వైశ్వానరవాక్యే వైశ్యానరశ##బ్దేన సర్వాత్మకః పరమాత్మై వోపాస్యత్వేన వివక్షిత ఇతి సిద్ధమ్.
ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితాయాం బ్రహ్మసూత్రవివృతౌ ప్రథమధ్యాయస్య ద్వితీయః పాదః
వివరణము :- సర్వగతుడగు పరమాత్మకు ప్రాదేశ మాత్రత్వ వర్ణనము సంపత్తి ప్రయుక్తము అను జైమిని మతమునందు శ్రుతిసమ్మతి కలదని సూత్రకారులు నిరూపించుచున్నారు. జాబాల శాఖవారు ''య ఏషో7నన్తో 7వ్యక్త ఆత్మా సో7 విముక్తే ప్రతిష్ఠితః'' అవరిచ్ఛిన్నుడు - దుర్విజ్ఞేయ స్వభావుడు నగు నాపరమాత్మను ఎట్లె తెలిసికొన (ఉపాసింప) వలయును అను అత్రిమహర్షి ప్రశ్నకు యాజ్ఞవల్క్య మహర్షి అతడు అవిముక్తే = కామాదిభి ర్బద్ధజీవే కామ = క్రోధాది దోషములతో గూడికొని సంసారమున బద్ధుడగు జీవునియందున్నట్లు భేదకల్పనమును జేసి ఉపాసింపదగినవాడు అని సమాధానమిచ్చెను. అంతట అత్రి ఆ జీవుడెచట నున్నాడని ప్రశ్నించగా - యాజ్ఞవల్క్యుడు ''వరణాయాం నాస్యాం చ మధ్యే ప్రతిష్ఠతః'' ఇత్యాదినా ప్రత్యుత్తరించుచు ''...భ్రువోః ఘ్రాణస్యచయ స్పన్ధిః...'' అని ప్రాదేశపరిమిత = అల్పపరిమాణము గల భ్రూ స్థాన నాసికాస్థానాంతరాళము జీవస్థాన మనియు నట జీవద్వారా ఈశ్వర ధ్యానము చేయుట పాపనివారకమనియు నిరూపించెను. ఈ శ్రుతినిబట్టియు ప్రాదేశమాత్రత్వ శ్రుతి ఉపపన్నమె: యగును. కాన వైశ్వానరవాక్యము నందలి వైశ్వానర శబ్దము పరమాత్మ పరమనియు, ఆవాక్యము పరమాత్మో పాసనా పరమనియు సిద్ధించుచున్నది.
ఇట్లు శ్రీ గాయత్రీపీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయ తివర
విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున ప్రథమాధ్యాయమున
ద్వితీయ పాదము ముగిసెను.
-
ప్రథమాధ్యాయస్య - తృతీయః పాదః
పూర్వస్మి& పాదే ప్రాయశః ఉపాస్య బ్రహ్మవిషయాకాణా మస్పష్ట లింగానాం వాక్యానాం సమస్వయః ప్రతిపనాదితః. అధునా జ్ఞేయబ్రహ్మవిషకాణాం తాదృశాస్పష్టలింగానా మేవ వాక్యానాం ప్రాయశ స్సమస్వయం ప్రతిపాదయితు మయం తృతీయ పాద ఆరభ్యతే.
ద్యు భ్యా ద్యధికరణమ్ 1
1. సూ : ద్యుభ్వా ద్యాయతనం స్వశబ్దాత్
వివృతిః :- ముండకోపనిషది శ్రూయతే - '' యస్మిన్ ద్యౌః పృథివీ చాన్తరిక్ష మోతం మన స్సహ ప్రాణౖ శ్చ సర్వై స్త మేవైకం జానథ ఆత్మాన మన్యా వాచో విముంచథ అమృత సై#్యష సేతుః '' ఇతి - ద్యుభ్వా ద్యాయతనం = అస్మిన్ వాక్యే శ్రూయమాణం ద్యుభూమా%్‌యదీనాం ఆయతనం అదిష్ఠానం పరం బ్రహ్మైవ- న ప్రధానం -నవాయుః- నాపి జీవః -కుతః ? స్వశబ్దాత్= స్వస్య పరబ్రహ్మణో వాచకో యః ఆత్మశబ్దః '' తమేవైకం జానథ ఆత్మానం'' ఇతివాక్యే శ్రుతః - తస్మాత్ నిరుపచరితా త్తాదృశాత్మశబ్దప్రయోగాత్- తద్బ్రహ్మేతి ప్రతిపత్తవ్యం
గడచిన రెండవపాదమునందు బహుళముగ = తరచుగ ఉపాస్యబ్రహ్మ విషయకములును, అనృష్ట బ్రహ్మలింగములును నగు వాక్యముల యొక్క సమన్వయము ప్రతిపాదింపబడినది. ఇప్పుడు జ్ఞేయమగు బ్రహ్మ తత్త్వమునకు సంబందించిన అసృష్టబ్రహ్మలింగము లగు (బ్రహ్మబోధకములగు చిహ్నములు స్ఫుటతరముగ లేని) వాక్యముల యొక్క సమన్వయమును ప్రదర్శింప నీ మూడవ పాదము ఆరంబింపడుచున్నది.
వివరణము :- ముండకోపనిషత్తులో ''యస్మిన్ ద్యౌః పృథివీ చాస్తరిక్షం మోతం మన స్సహ ప్రాణౖశ్చ సర్వై స్త మే వైకం జానథ ఆత్మాన మన్యా వాచో విముంచథ'' ఏవస్తువునందు -పృథివ్యాది లోక త్రయాత్మమగు విరాట్పురుషుడున్నూ అవ్యాకృతమగు కారణతత్త్వమున్నూ కల్పింపబడి పడుగు పేకగ ప్రతిష్టించబడి యుండెనో ఆ సర్వాధిష్టాన భూతమగు ప్రత్యగభిన్న పదార్థమును మహావాక్యార్థ విచారలక్షణమగు శ్రవణాద్యుపాయము లతో చక్కగ గ్రహించుడు. అనాత్మవిషయకములగు వాక్కులను పరిత్యజించుడు. ఇట్లు అనాత్మ వాగ్విస్వర్గపూర్వ కాత్మసాక్షాత్కారము మోక్షమును అనగా అంతరవిధురమై దుస్తరమగు సంసార సముద్రముయొక్క అవతలి యొడ్డును పొందుటకు సుఖతరణ సాధనమగు సేతువు వంటిది. అను నర్థము నిచ్చు వాక్యము కానవచ్చుచున్నది. ఈవాక్యములో ద్యుభూమ్యాదులకు ఆయతనము = అదిష్ఠానముగా ప్రతిపాదింప బడిన వస్తువు పరబ్రహ్మ వస్తువే అని నిశ్చయింపదగును కాని ప్రధానము అని గాని - వాయువు అనిగాని - జీవుడు అనిగాని నిశ్చయింపదగుదు. ఏల యన? ఈవాక్యముననే '' త మే వైకం జానథ ఆత్మానం.....'' అని సాక్షాత్తుగ పరబ్రహ్మను బోధించు ఆత్మశబ్దము కానవచ్చుచున్నది. ఇట్టి ప్రధానముగ చేతనమగు బ్రహ్మవస్తువును బోధించు ఆ ఆత్మశబ్దమునుబట్టి ఆ ఆయతన వస్తువు బ్రహ్మయే యని తెలిసికొనదగును.
2. సూ : ముక్తోపసృప్య వ్యపదేశాత్
వివృతిః :- ముక్తోపసృప్య వ్యపదేశాత్ ముక్తైః - ఉపనృప్యం = ప్రాప్యం ముక్తోపనృప్యం - ముక్తోపనృప్యత్వ మిత్యర్థః - తస్యముక్తోపసృపత్వస్య ''తథా విద్వా న్నామరూపా ద్విముక్తః పరాత్పరం పురుష ముపైతి దివ్యం'' ఇతి శ్రుత్వా నిర్దేశా ద్యుభూమ్యాద్యాయతనం పరం బ్రహ్మైవ.
వివరణము :- ముక్తోపనృప్యము అనగా - ముక్తాత్ములచే పొందదగినది యని యర్థము. ఈ ప్రకరణమునందలి పై వాక్యములో ''తథా విద్వాన్నామరూపా ద్విముక్తః పరాత్పరం పురుష ముపైతి దివ్యం'' దూరదూర దేశముల నుండి ప్రవహించి వచ్చిన గంగాయమునాది నదులు సముద్రమును చేరి తమతమ నామరూపాదుల పరిత్యజ్యించి సముద్ర భావమునే యెట్లు పొందుచున్నవో అట్లే బ్రహ్మాత్మైక్య విజ్ఞానముగల విద్వాంసుడు నామరూపాది విశేషములనుండి విముక్తుడై సర్వకారణమగు అవ్య క్తము కంటే పరుడైన- పరిపూర్ణుడైన- స్వయం జ్యోతిస్వరూపుడైన - ఆనందస్వరూపుడైన పరమాత్మను ప్రత్యగాత్మగాపొంది (నిశ్చయించు కొని) యుండును. అని చెప్పుచు ఆ ఆయతన వస్తువునకు ముక్త పురుషప్రాప్యత్వమును వర్ణించెను. కాన ద్యు భూమ్యాద్యాయ తన వస్తువు పరబ్రహ్మయే.
3. సూ : నానుమాన మతచ్ఛబ్దాత్
వివృతిః :- అనుమానం = సాంఖ్యస్మృతి పరికల్పితం ప్రధానం న = ద్యుభూమ్యాద్యాయతనం భవితుం నార్హతి - కుతః ? అతచ్ఛబ్దాత్ = తస్య = అచేతనస్య ప్రధానస్య ప్రతిపాదక శ్శబ్దః = తచ్ఛబ్దః న తచ్ఛబ్దః = అతచ్చబ్దః = ప్రధానవిరోధి చేతనవాచీ శబ్ధః '' య స్సర్వజ్ఞ స్సర్వవి దిత్యాదిః - తస్మాత్ - ప్రధాన బోధక శబ్ద స్యాశ్రవణాత్ - ప్రత్యుత చేతనవాచిన ఇహ శ్రవణా చ్చ తదాయతనం న ప్రధానం కింతు బ్రహ్మైవేతి.
వివరణము :- అనుమానము అనగా సాంఖ్యశాస్త్ర ప్రసిద్ధమగు ప్రధానము - ఆ ప్రధానము ద్యు భూమ్యాద్యాయతనము అని యనుటకు వీలులేదు - ఏలయన? అతచ్చబ్ధాత్ = అనగా అచేతనమగు ప్రధానమును బోధించు శబ్దము = తచ్చబ్ధము . అట్టిది కాని శబ్దము అతచ్ఛబ్దము. అనగా ప్రధాన విరోధియగు చేతన వాచి = చేతన వస్తుబోధకమగు శబ్దము ''య సర్వజ్ఞ స్సర్వవిత్'' సర్వజ్ఞము. సర్వవేత్త యను శబ్దము అప్రకరణములో గలదు. మరియు ప్రధానమును బోధించు శబ్దము కానవచ్చుటలేదు. కాన ఆ ఆయతన వస్తువు ప్రధానము అని అన వలనుపడదు. చేతన మగు బ్రహ్మవస్తువువే అని చెప్పవలయును.
4. సూ : ప్రాణభృచ్ఛ
వివృతిః :- ప్రాణభృత్ - చ = జీవోపి - న ద్యుభ్వాద్యాయతనం - కుతః ? అంతఃకరణా ద్యుపాధిపరిచ్ఛిన్నస్య తస్య సర్వజ్ఞత్వా ద్య సంభవాత్.
వివరణము:- ప్రాణభృత్ = అనగా జీవుడు, ద్యుభూమ్యాద్యాయ తనము జీవుడు అని యనుటయు కుదురదు. ఏలయన? అంతఃకరణా ద్యుపాధులతో గూడి పరిచ్ఛన్న= పరిమితిజ్ఞానశక్తితో విలసిల్లు జీవునకు ఆ ప్రకరణములో వర్ణింపబడిన సర్వజ్ఞత్వ- సర్వవిత్త్వాదులు సంభవించవు. కనుక ద్యుభూమ్యాద్యాయతనము పరమాత్మయే.
5. సూ : భేదవ్యపదేశా చ్చ
వివృతిః :- చ = కించ - భేదవ్యపదేశాత్ = భేదేన భేదప్య వా వ్యపదేశః భేదవ్యపదేశః - తస్మాత్- '' తమే వైకం జానథ ఆత్మానం'' ఇతి పరమాత్మ శారీరయోః జ్ఞేయ జ్ఞతృభావేన భేదస్య వ్యపదిష్టత్వా దపి ద్యుభ్వాద్యాయతనం న శారీరః -కింతు పరం బ్రహ్మైవ.
వివరణము :- మరియు భేదవ్యపదేశము అనగా వేరుగా వర్ణించుట యని యర్థము. ఆ వాక్యములో ''......తమేవైకం జానథ ఆత్మానం.....'' అ అద్వితీయమైన పరమాత్మను తెలసికొనుడు అని భోధించుచు పరమాత్మను జ్ఞేయము = తెలిసికొనదగిన పదార్థముగాను - జీవుని తెలిసుకొను వానినిగాను ఇట్లు వేరుగ వర్ణింపబడి యుండుట వలనను గూడ ద్యుభూమ్యాద్యాయతన వస్తువు జీవుడు కాదనియు - పరమాత్మయే అనియు నిశ్చయింపదగును.
6. సూ : ప్రకరణాత్
వివృతిః :- ప్రరణాత్ ''కస్మిన్ను భగవో విజ్ఞతే సర్వ మిదం విజ్ఞాతం భవతి'' ఇ త్యేక విజ్ఞానేన సర్వవిజ్ఞానోపక్రమా దిదం ప్రకరణం పరబ్రహ్మణ ఏవేతి గమ్యతే - న హి శారీరస్య విజ్ఞానాత్ సర్వవిజ్ఞానం సంభవితి. బ్రహ్మణస్తు సర్వకారణత్వాత్తద్‌జ్ఞానా త్సర్వ విజ్ఞానసంభవతి. తస్మాత్ ప్రకరణా దపి ద్యుభ్వాద్యాయతనం న శారీరః.
వివరణము :- ప్రకరణ పర్యాలోచనము చేసి చూచినను ద్యుభూమ్యాద్యాయతనము జీవుడు అని యనుటకు వీలుకలుగదు. ఈ ప్రకరణము ''కస్మి న్ను భగవో విజ్ఞాతే సర్వ మిదం విజ్ఞాతం భవతి'' ఏఒక్క వస్తువు తెలిసిన ఈ సమస్తదృశ్యమును నిరవశేషముగ విజ్ఞాతము (తెలియబడినది యై) కాగలదు అని ఏకవిజ్ఞానేన సర్వ ప్రస్తావముతో ఆరంభించిపబడినది. సర్వవిజ్ఞాన సాధనమగు ఆవిజ్ఞానము అద్వితీయమగు పరబ్రహ్మ యొక్క (బ్రహ్మను గూర్చిన) విజ్ఞానమే అనదగును గాని జీవాత్మయొక్క (జీవాత్మను గురించిన) విజ్ఞానము అని యనుటకు వీలులేదు. పరబ్రహ్మ వస్తువు సర్వకారణము గనుక తద్విజ్ఞానము సర్వవిజ్ఞాన హేతువుకాగలదు. మృద్వస్తు విజ్ఞానము మృత్కార్యములగు ఘటములయొక్క విజ్ఞానమునకు హేతువైన యట్లు. కాన నట్టి యుపక్రమము (ఆరంభము) ను బట్టియు ద్యుభూమ్యాద్యాయతన వస్తువు పరమాత్మయే కాని జీవుడుకాదని తేలుచున్నది.
7. సూ : స్థిత్యదనాభ్యాం చ
వివృతిః :- చ = అపిచ స్థిత్యదనాభ్యాం = ద్యుభ్వాద్యాయతనం ప్రకృత్య ''ద్వా సువర్ణా సయుజా సఖాయా'' ఇత్యత్ర స్థిత్యదనే నిర్ధిశ్యేతే - '' తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి ''ఇతి కర్మఫలాదన ముచ్యతే ''అనశ్న న్న న్యో అభిచాకశీతి'' ఇత్యౌదాసీన్యేనస్థితి రుచ్యతే - తాభ్యాం చ స్థిత్యదనాభ్యా మీశ్వరక్షేత్రజ్ఞౌ గృహ్యేతే - తథా చ కర్తృత్వేన భోక్తృత్వేన చ సర్వత్ర లోకే ప్రసిద్ధా జీవాత్మనః పృథక్త్వే నాత్ర మన్త్రే ఈశ్వరస్య ప్రతిపాదనం యత్ క్రియతే తదేతత్ ద్యుభ్వాద్యాయతనత్వేన పరమాత్మనః ప్రకృతత్వే
ఏవోపపద్యతే - అన్య థాత్ర క్షేత్రజ్ఞా త్పరమాత్మనః పృథక్త్వకథన మప్రకృత మాకస్మికం చ స్యాత్ - అతో ద్యుబ్వాద్యాయతనం న శారీరః - కింతు పరం బ్రహ్మైవేతి సిద్ధం.
వివరణము :- మరియు - ద్యుభూమ్యాద్యాయతన వస్తువును గూర్చి ప్రస్తావనచేసి ఆ గ్రంథములో ఆతరువాత ''ద్వా సువర్ణా నయుజా సఖా యా'' అను మంత్రములో ఈశ్వరుని, క్షేత్రజ్ఞుడగు జీవాత్మను దేహమను వృక్షము నాశ్రయించియున్న రెండు పక్షులుగా కల్పింపి వర్ణించుచు ''తయో రన్యః పిప్పలం స్వాద్వత్తి, అనశ్న న్నన్యో అభిచాకశీతి'' అనుచు వారిలో నొకరు అనగా క్షేత్రజ్ఞుడగు జీవుడు కర్మఫలమును భుజించుచున్నాడని, మరియొకడగు ఈశ్వరుడు, ఉదాసీన భావముతో నచటనుండె నని ఈశ్వర క్షేత్రజ్ఞులకు నీతి = ఔదాసన్య స్థితియు - అదనము = కర్మ ఫలాను భవమును ప్రతిపాందిపబడి యుండెను. కర్తగా - భోకగా - సర్వత్రప్రసిద్ధమై యుండిన జీవాత్మకంటె వేరుగ నిచట ఈ ప్రకరణములోని మంత్రములో ఈశ్వరుని ప్రతిపాదించుట యనునది ద్యుభూమ్యాద్యాయతనముగ ప్రారంభములో వర్ణింపబడిన ఆ వస్తువు ఈశ్వరుడే అనిబోధించుటకే అని చెప్పదగును. లేకున్న క్షేత్రజ్ఞునికంటె పరమాత్మను వేరుగ నిచట ఈ ద్యుభూమ్యాద్యాయతన వస్తువును ప్రతిపాదించుప్రకరణములో వర్ణించుట అప్రకృతమును - ఆకస్మికమును కాగలదు. కాన ద్యుభూమ్యాద్యాయతన వస్తువు జీవుడు కాదనియు , పరమాత్మయే అనియు నిర్ణయింపదగును.
భూమాధికరణమ్ 2
8. సూ : భూమా సంప్రసాదా దథ్యుపదేశాత్
చాన్ధోగ్యోపనిషది నారదసనత్కుమార సంవాదే శ్రూయతే - ''భూమా త్వేవ విజిజ్ఞాసితవ్యః '' ఇతి - ''యత్ర నాన్య త్పశ్యతి.......నాన్య ద్విజానాతి - న భూమా'' ఇతి చ - భూమా = పూర్వోదాహృత వాక్యయో శ్శ్రూయమాణః యో భూమశబ్ద స్తత్ప్రతిపాద్యార్థః - పరమాత్మైవ - న ప్రాణః - భూమశ##బ్దేన పరమాత్మై వోచ్యతే, న ప్రాణ ఇత్యర్థః - కుతః ? సంప్రసాదాత్ = ప్రాణాత్ ప్రాణ స్యోపదేశాత్ అధి = అనన్తరం = ఊర్థ్వం - ఉపదేశాత్ = ''ఏషతు వా అతివదతి య స్సత్యే నాతివదతి'' ఇతి సత్యశబ్దవాచ్యస్య పరామాత్మన ఉపదిశ్యమానత్వాత్.
వివరణము :- ఛాందోగ్యోప నిషత్తులో నారద సనత్కుమార సంవాద గ్రంథములో ''భూమా త్వేవ విజిజ్ఞాసితవ్యః'' అత్యంత విపుల మైన సర్వోత్కృష్టమైన వస్తువెద్దియో అది విచారింపదగినది. బాగుగా తెలిసికొనదగినది. అని నారదమహర్షికి సనత్కుమారు లుపదేశించిరి. మరియు''యత్రనాన్యత్పశ్యతి - నాన్య చ్ఛృణోతి - నాన్య ద్విజానాతి న భూమా'' అను నీ వాక్యములో అద్వితీయత్వమే అ భూమ వస్తువు యొక్క లక్షణము అనియు వివరించిరి. ఈ వాక్యములలో వినవచ్చుచున్న భూమశబ్ద ప్రతిపాద్యార్థము పరమాత్మయే అని చెప్పదగును కాని ప్రాణము అని చెప్పవలననుపడదు. ఏలయన? ఈ ప్రకరణములో ను త్కృష్ణ వస్తువును ప్రతిపాదింపబూని నామము, వాక్కు, మనస్సు మొదలగుకొని ప్రాణమువరకు కొన్ని పదార్థములను ఒకదానికంటె నొకటి యుత్కృష్ట వస్తువుగా చెప్పుచు ప్రాణపదార్థమును చెప్పిన తరువాత ''ఏష తు వా అతివదతి'' అను వాక్యములో ఎవడు సత్యశబ్దవాచ్య పరమాత్మ వాదము ( సత్యవస్తువే సర్వోత్కృష్టమని తెలిసి పలుకునో) చేయునో వాడే అతివాది(ఉత్తముడు) అనియు (ప్రాజోపానకు డట్లు కాదనియు) ఇట్లు పరమాత్మయొక్క ఉపదేశముచేయబడుచున్నదిగనుక భూమ శబ్దార్థము ప్రాణమే అని యను టకు వీలులేదు. పరమాత్మయే అని చెప్పవలయును.
[ఈ సూత్రములోని సంప్రసాద శబ్దమునకు - ప్రాణము అని అర్థమును గ్రహింపవలయును. సంప్రాసాద శబ్దమునకు ముఖ్యార్థము సుషుప్తి యని, సుషుప్తియందు ప్రాణము ఒక్కటియే జాగరూకమై వ్యాపారము చేయుచుండును. (తద్భిన్నములగు ఇంద్రియములు వగైరా అన్నియు వ్యాపార శూన్యములగును) కాన సంప్రసాద శబ్దముచేత నిచట ప్రాణము అను అర్దము లక్షణామర్యాదతో స్వీకరించబడినది.]
9. సూ : ధర్మో పపత్తే శ్చ
వివృతిః :- చ = కించ ధర్మోపపత్తేః = ''యత్ర నాన్య త్పశ్య తి '' ఇతి. ''యో వై భూమా - తదమృతం '' ఇత్యాదినా చ భూమ్ని శ్రూయా మాణానాం సర్వవ్యవహారభావ, అమృతత్వ- నత్యత్వ- సర్వగతత్వ-స్వమహిమప్రతిష్టతత్వ - సర్వాత్మకత్వాదీనాం ధర్మాణాం పరమాత్మ న్యే వోపపద్యమనత్వా చ్చ భూమ శబ్దోదితః పరమాత్మైవ, న ప్రాణ ఇత్యుచ్యతే.
వివరణము :- మరియు - భూమ పదార్థము యొక్క లక్షణమును వివరించు ''యత్ర నాన్య త్పశ్యతి నాస్య చ్చృణోతి...'' అను వాక్యములో భూమ పదార్థమునందు దర్శన శ్రవణాది వ్యవహారము లేవియు నుండవని సర్వవిధ వ్యవహారభావము వర్ణింపబడినది. ఇట్లే- ''యో వై భూమా తదమృతం'' అను వాక్యములో ఎయ్యది సర్వోత్కృష్ట - అద్వితీయ వస్తువో అయ్యది అమృతస్వరూపము అని అమృత్వము వర్ణింపబడినది. ఇట్లే ఆ ప్రకరణములోని ఆయావాక్యములలో ఆ భూమస్తువు - సత్యమని - సర్వగతమని- స్వమహిమ ప్రతిష్టితమని (తనయందే తాను ప్రతి ష్ఠింపబడి యున్నది గాని దానికి మరియొకటి ఆధారవస్తువుగ లేదని యర్థము) సర్వాత్మకమనియు వర్ణింపబడియున్నది. ఇట వర్ణింపబడిన సర్వవ్యవహరా భావ - సత్యత్వ - సర్వగతత్వ - స్వప్రతిష్టితత్వ - సర్వాత్మకత్వ రూపధర్మములు పరమాత్మయందే సంభివించునవి గనుక భూమశబ్దార్థము పరమాత్మయే యని నిశ్చయింపబడు చున్నది. ప్రాణమునందీ ధర్మములు సమన్వితములు కానేరావు.
అక్షరాధికరణమ్ 3
10. సూ : అక్షర మంబరాంతధృతేః
వివృతిః :- బృహదారణ్యకోపనిషది - గార్గి యాజ్ఞవల్క్యసంవాదే శ్రూయతే - ''ఏతద్వైతదక్షరం గార్గి బ్రాహ్మణా అభివద న్త్యస్థూల మనణు'' ఇత్యాది. తత్ర త్యాక్షరశబ్దా
ర్థోత్ర వివ్రియతే - అక్షరం = అత్ర త్యాక్షర శబ్దః పరం బ్రహ్మై వాభిధత్తే - న తు ప్రణవాత్మకం వర్ణ మితి - కుతః ? అంబరాంతధృతేః = ఏతస్మి న్ను ఖల్వక్షరే గార్గ్యాకాశ ఓతశ్చ ప్రోతశ్చ '' ఇత్యాది నోపపాదిత పృథివ్యా ద్యాకాశాంత వికారజాత ధరాణస్య పరబ్రహ్మ ణ్యవ సంభవాత్.
వివరణము:- బృహదారుణ్యకములోని గార్గియాజ్ఞవల్క్య సంవాదములోని ''ఏతద్వై తదక్షరం బ్రాహ్మణా అభివాద న్త్యస్థూల మనణు'' అను నీ వాక్యము భూత భవిష్య ద్వర్తమానములను మూడు కాలముల యందును నుండు సమస్తప్రపంచమునకు ఆధారమగు వస్తువెయ్యది యని గార్గి అడుగ యాజ్ఞవల్క్యుడు అవ్యాకృతాకాశము అని బదులు చెప్పెను - ఆ యాకాశమునకు గూడ ఆధారమైన దెద్దియని తిరిగి గార్గిప్రశ్నింప యజ్ఞవల్క్యనిచే చెప్పబడినది. స్థూలము కాక సూక్ష్మమును కాకయుండు ఆ అక్షరము సర్వప్రపంచాధార వస్తువు అని వాక్యముయొక్క అర్థము. ఈ వాక్యములో కానవచ్చు అక్షరశబ్దముచే పరబ్రహ్మయే చెప్పబడును. గాని - ప్రణవాత్మకమగు వర్ణము చెప్పబడదు - ఏలయన? ''ఏతస్మి న్ను ఖల్వక్షరే గార్గ్యాకాశ ఓతశ్చ ప్రోతశ్చ'' ఓగార్గి ఈ అక్షరమునందు సర్వ జగదాధార భూతమగు ఆకాశము ఓతప్రోతభావముతో (పడుగు పేకగా) ప్రతిష్టింపబడి యుండెను అని చెప్పుచు ఆ ప్రకరణములోని పైవాక్యము అక్షరవస్తువు పృథివి మొదలుకొని ఆకాశాంతము వరకు గల సమస్త కార్య జాతమును ధరించునది యని నిరూపించెను. అట్టి సర్వజగద్ధారకత్వము పరబ్రహ్మయందే సంగతమగును కాన అక్షర శబ్దము బ్రహ్మబోధకమే యగును.
11. సూ : సాచ ప్రశానాత్
వివృతిః :- అంబరాన్తధారణం ప్రధాన స్యాపి సంభ##వే దిత్యత అహ - సా - చ = సా పూర్వోక్తా అంబరాంతధృతిః - పరమేశ్వరసై#్యవ కర్మ - స ప్రధానస్య - కుతః ప్రశానాత్ = ''ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచన్ద్రమసౌ విధృతౌ తిష్ఠతః '' ఇత్యాదినా అక్షరస్య ప్రశాసన శ్రవణాత్ - న హ్యచేతనం ప్రధానం కస్యాపి శాసితృ భవితు మర్హతి - అతః అక్షర మిహ పరమేశ్వర ఏవ, న ప్రధానం.
వివరణము :- వెనుక చెప్పబడిన ఆకాశాంత సర్వ జగద్దారకత్వము ప్రధానమునకు సంభించునుగదా. కాన అక్షరశబ్ధముచే ప్రధానము చెప్పబడరాదా అనగా సమాధానము చెప్పబడిచున్నది. ఆ చెప్పబడిన సర్వజగద్ధారకత్వము పరమాత్మకు సంబంధించిన కర్మయే. అన్యసంబన్ది కర్మకాదు. ఏలయన? ''ఏతస్య వా అక్షరస్యప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్టతః'' ఈ యక్షరము యొక్క శాసనముననే సూర్య చంద్రులు ధరింపబడియున్నారు. అను నీ వాక్యములో అక్షరమునకు శాసనము (ఆజ్ఞ) వర్ణింపబడినది. ప్రధానము జడుమ కాన నయ్యది దేనిని శాసింపజాలదు. కాన నిచట అక్షరమనగా చేతనుడగు పరమాత్మయే గాని ప్రధానుము కానేరదు.
12. సూ : అన్యభావ వ్యావృత్తేశ్చ
వివృతిః :- చ = అపి చ అవ్యభావవ్యవృత్తేః అన్యస్య భావః = అన్యభావః - అన్యభావాత్ = వ్యావృత్తిః అన్యభావ = వ్యావృత్తిః తతః = అన్యస్య = బ్రహ్మణో భిన్నస్య ప్రదానాదేః భావః = ధర్మః = స్వభవః అచేతనత్వం - తస్మా దక్షరశబ్దవాచ్యస్ - వావృత్తేః = ''తద్వా ఏతదక్షరం గార్గ్యదృష్టం ద్రష్టృ'' ఇత్యాదినా వైలక్షణ్య ప్రతిపాదనాత్ - అక్షరం ప్రధానం భవితుంనార్హతి - కింతు బ్రహ్మైవ.
వివరణము :- మరియు -''తద్వా ఏత దక్షరం గార్గ్యదృష్టం ద్రష్టృ'' ఓగార్గిః ఆ అక్షరము దేనిచేతను చూడ బడునదికాదు. కాని సర్వమును చూచునది. అనునట్టి ఈ ప్రకరణములోని వాక్యములలో అక్షరపదార్థమునకు బ్రహ్మ భిన్న పదార్థములగు ప్రధానాదులయందు గల అచేతనత్వమును తొలగించి తద్వైలక్షణ్యము ప్రతిపాదింపబడు చున్నది. కాన అక్షరశబ్దముచే ప్రధానము చెప్పబడుచున్నది యనుట యుక్తము కాదు. దృష్టృత్వము చూచుట యనునది అచేతనమగు ప్రధానముకు సంభవించదు కదా. కాన అక్షరశబ్దము పరబ్రహ్మపరమే అని చెప్పవలయును.
ఈక్షతి కర్మాధికరణమ్ 4
13. సూ : ఈక్షతికర్మ వ్యపదేశా త్సః
వివృతిః :- ప్రశ్నోపనిపది శ్రూయతే - ''యః పున రేతం త్రిమాత్రే ణోమి త్యేతే నైవాక్షరేణ పరం పురుష మభిధ్యాయీత'' ఇతి - సః = అత్ర వాక్యే అబిధ్యాతవ్యత్వే నోపదిష్ట స్సపరః పురుషః పరం బ్రహ్మైవ. న అపరం బ్రహ్మ హిరణ్యగర్భాఖ్యం . కుతః ? ఈక్షతికర్మవ్యపదేశాత్ = ''స ఏతస్మా జ్జీవఘనా త్పరాత్పరం పురిశయం పురుష మీక్షతే'' ఇతివాక్య శేషే అబిధ్యాతవ్యస్య పుంసః ఈక్షతికర్మత్వేస దర్శన = కర్మత్వేన వ్యపదేశస్య దర్శనాత్ - ధ్యానేక్షణయో రేకవిషయత్వనియమా చ్ఛ - అతః క్రమముక్త్యర్థ మోంకారాలంబనేన ద్యాతవ్యః పురుషః పరమాత్మైవ నాన్య ఇతి సిద్దమ్.
వివరణము :- ప్రశ్నోపనిషత్తులోని ''యః పున రేతం త్రిమాత్రే ణోమిత్యనే నైవాక్షరేణ పరం పురుష మబిద్యాయీత'' అను నీవాక్యములో ఎవడు. త్రిమాత్రమగు ఓంకార రూపమగు ప్రణవాక్షరముతో పరమగు (ఉత్కృష్టమగు )పురుషుని ధ్యానించునో అను ఒక ప్రసంగము చేయబడినది. ఇచట ధ్యాతవ్యముగా వర్ణింపబడిన పురుషుడు పరబ్రహ్మయే గాని హిరణ్యగర్భ రూపుడగు అపర బ్రహ్మయని యనుటకు వీలులేదు. ఏలయన? ఆప్రకరణములోని యీ పైవాక్యములో ''స ఏతస్మా జ్జీవఘనాత్పరాత్పరం పురిశయం పురుష మీక్షతే'' ధ్యాతయగు నాతడు ఉత్కృష్టుడగు నిఖిల జీవ సమష్టి భూతుడగు హిరణ్యగర్భునికంటె పరుడగు సమస్తప్రాణి హృదయముల యందుండు వాడగు పురుషుని = పరబ్రహ్మను దర్శించును అని చెప్పబడి యుండెను. అభిద్యాతవ్యముగా చెప్పబడిన పురుషుని యిచట ఈక్షతికర్మగా = దర్శన కర్మగా అనగా సాక్షాత్కారవిషయముగా వర్ణించి యుండెను గనుక - ధ్యానము చేయబడిన వస్తువు యొక్క సాక్షాత్కారమే ధ్యానప్రయోగములలో నియమముగ సంభవించును గాని ధ్యానవిషయము ఒకటి సాక్షాత్కార విషయము మరియొకటి యగుట ఎన్నడును సంభించదు. కాన నిచట క్రమము క్తికొఱకై ఓంకారావలంబనము (ప్రణవోపానము) ద్వారా ద్యాతవ్యమైన వస్తువు పరమాత్మయే అని నిశ్చయింపదగును.
దహరాధికరణమ్ 5
14. సూ : దహర ఉత్తరేభ్యః
వివృతిః :- ఛన్దోగ్యోపనిషది ''అథ యదిద మస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేశ్మ దహరో೭స్మి న్నంతరాకాశ స్తస్మిన్ యదంత స్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం'' ఇతి శ్రూయతే - దహరః = తత్ర దహరపుండరీకే యో దహరాకాశ శ్శ్రుత స్స పరమేశ్వర ఏవ. న భూతా కాశః - న వా జీవః - కుతః? ఉత్తరేభ్యః = ''యావాన్వా అయ మాకాశస్తావా నేషో೭ స్తర్హృదయే ఆకాశ ఉభే ఆస్మిన్ ద్యావాపృథివీ అంతరేవ సమాహితే - ఏష ఆత్మా೭ పహతపాప్మా'' ఇత్యాది నోత్తరత్ర శ్రూయమాణ వాక్య శేషగతేభ్యః - ప్రసిద్ధాకాశౌపమ్య - ద్యావాపృథి వ్యాధారత్వ - ఆత్మత్వ - అవహతపాప్మత్వాది రూపేభ్యో హేతుభ్యః.
వివరణము :- ఛన్దోగ్యోపనిషత్తులోని ''అథ యదిద మస్మిన్ బ్రహ్మపురే.... తద్వావ విజిజ్ఞాసితవ్యం'' బ్రహ్మతత్త్వాభివ్యక్తి స్థానముగాన శరీరము బ్రహ్మపురము అని చెప్పబడును. అందుండు సర్వజన ప్రసిద్ధమగు దహరము = అల్ప పరిమాణము గల హృదయ పద్మములోపల గల దహరాకాశము ముముక్షువలగు వారిచే నన్వేషింపదగినది. విచారించి సృష్టముగా తెలిసికొన దగినది యను నర్థము నిచ్చు వాక్యములో గల దహర శబ్దము అనగా దహరాకాశ శబ్దము పరబ్రహ్మ వస్తు బోధకమే. కాని భూతాకాశమును గాని జీవాత్మను గాని బోధించునదికాదు. ఏలయన? ఉత్తర గ్రంథములోని ''యావాన్ వా ఆయ మాకాశ స్తావా నేషో೭న్త ర్హృదయే ఆకాశ...... ఆత్మా అపహతపాప్నా'' యీ వాక్యములో ఈ బాహ్యమగు ఆకాశ##మెంత పరిమాణము కలదియో హృదయ పుండరీకాన్తర్గత దహరాకాశమును అంత పరిమాణము కలదియే. ఈ ద్యులోక పృథివీ లోకములు రెండును దీనియందు ఇమిడియున్నవి. ఇది సర్వపాప విదూరమగు ఆత్మవనస్తువు అని వర్ణింపబడినది. ఇచట వర్ణింపడిన ప్రసిద్ధాకాశౌపమ్యము, (ఆకాశముతో పోల్చబడుట) ఉభయలోకాధరాత్వము, ఆత్మత్వము, అపహత పాప్మత్వము (సర్వపాప విదూరత్వము ) ఈ మొదలగు హేతువులను బట్టి దహరాకాశ శబ్దము పరబ్రహ్మ పరమే అని నిశ్చయింప బడుచున్నది. భూతాకాశమునందును - జీవాత్మయందును ఈ ధర్మములు సంగతములుకావు కదా!
15. సూ : గతిశబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ
వివృతిః:- గతిశబ్దాభ్యాం = గతిశ్చ - శబ్ద శ్చ- గతిశబ్దౌ- తాభ్యాం - గతిశబ్దాభ్యాం - గతిః = ''ఇమా స్సర్వాః ప్రజా అహరహర్గచ్ఛస్త్య ఏతం బ్రహ్మలోకం స విందంతి.'' ఇత్యత్ర ప్రకృతం దహరం బ్రహ్మలోక శ##బ్దే నాభిధాయ సర్వేషాం జీవానాం ప్రత్యహం తద్విషయా గతి రుక్తా- తథా - శబ్దః = ప్రకృతే దహరే ప్రయుజ్యమానః జీవ- భూతాకాశావిషయ కః బ్రహ్మలోకశబ్ద శ్చ - తాభ్యాం గతిశబ్ధాభ్యాం దహరాకాశః పరం బ్రహ్మైవే త్యవగమ్యమే - హి = యస్మాత్ - తథా - దృష్టం = శ్రుత్యన్తరే ఛన్దోగ్యేపి'' సతా సోమ్య తదా సంపన్నో భవతి'' ఇతి జీవస్య అహ రహః బ్రహ్మలోకగమనం దృష్టం = వర్ణితం దృశ్యతే - లింగం - చ = బ్రహ్మలోకశబ్ధస్య బ్రహ్మైవలోకః ఇతి వ్యుత్పత్తి పరిగ్రహే జీవానాం ప్రత్యహం తత్రగమనం యుజ్యతః ఏవ. జీవానాం ప్రత్యహం సుషుప్తౌ ఉపాద్యపగమే బ్రహ్మప్రత్యేవ గమన ముపపద్యతే సర్వేషామసి జీవానాం స్వరూపభూతత్వా ద్బ్రహ్మణః - బ్రహ్మణో లోకః బ్రహ్మలోకః ఇతి వ్యుత్పత్తి మాశ్రిత్య బ్రహ్మలోకశబ్దస్య హిరణ్యగర్భలోకః ఇత్యర్థకథనం తు నోప పద్యతే - జీవానాం ప్రత్యహం సమష్ట్యుపాదిక హిరణ్యగర్భలోకం ప్రతి గమన మాగమనం వా సర్వదాన సంభవతి తతశ్చ జీవానా మనుదిన గమన రూపా ల్లింగా చ్చ దహరాకాశః పరమాత్మైవేతి.
వివరణము :- ఈ దహరవిద్యా ప్రకరణములోని పై గ్రంథము లోని '' ఇమా స్సర్వాః ప్రజా అహరహ ర్గచ్చన్త్య ఏతం బ్రహ్మలోకం న విందన్తి'' యీ వాక్యము ప్రకృతమగు దహరాకాశమును బ్రహ్మలోక శబ్దముతో ననుదించి చెప్పి ఈ సమస్త ప్రజలును (ప్రాణులనును) దిన దినమును నుషుప్త్యవస్థయందు దీనిని చేరుచున్న వారగు చున్నను దీనినిగూర్చి తెలిసికొనలేకున్నారు. అని చెప్పుచు సమస్త జీవాత్మలకు దహరాకాశమును గూర్చిన గతిని (గమనమును) వర్ణించు చున్నది. ఇట్టి గతియు, జీవాత్మను గాని - భూతాకాశమును గాని బోదింపజాలని పై వాక్యములోని బ్రహ్మలోక శబ్దమున్నూ దహరాకాశ శబ్దము పరబ్రహ్మపరమే అని సూచించున్నవి. ఛన్దోగ్య శ్రుతి యందు గూడ '' సతాసోమ్య తదా సంపన్నో భవతి'' అను వాక్యము తదా = సుషుప్తి సమయమున జీవుడు సద్రూపమగు బ్రహ్మతో నేకీభావము నొందుచున్నాడు. అని చెప్పుచు జీవులకు దినదినము బ్రహ్మలోక గమనమును వర్ణించు చున్నది. బ్రహ్మలోక శబ్దమునకు ''బ్రహ్మైవ లోకః'' బ్రహ్మలోకః అనువ్యుత్పత్తి ననుసరించిన బ్రహ్మయనియె అర్థము లభించును. ఆబ్రహ్మ వస్తువును గూర్చి జీవులకు ప్రత్యహము సుషప్తియందు గమనము యుక్తమే యగును. సుషుప్తి కాలమునందు జీవులకు స్థూల సూక్ష్మోపాధు లవగతములు కాగా (స్థూల సూక్ష్మ దేహములయందలి తాదాత్మ్యాభిమానము నిస్మృతముకాగా) బ్రహ్మ వస్తువు సమస్త జీవులకును స్వరూపమే గనుక బ్రహ్మను గూర్చి గమనము యుక్తమే యగును. బ్రహ్మలోక శబ్దమునకు ''బ్రహ్మణో లోకః'' బ్రహ్మలోకః అను వ్యుత్పత్తి చెప్పినచో బ్రహ్మయొక్క లోకము హిరణ్యగర్భలోకము అని అర్థమేర్పడును. ఆ అర్థము నిట స్వీకరింపరాదు. జీవులకు సమష్ట్యుపాదికుడగు హిరణ్యగర్భుని లోకమును గూర్చి దినదినమును గమనా గమనములు సంభవించవు గదా| పై వాక్యములో వర్ణింపబడిన జీవుల యొక్క అనుదిన గమనా గమనములను లింగము (చిహ్నము) ను బట్టియు దహరాకాశము పరబ్రహ్మపరమే అని నిర్ణయింపదగును.
16. సూ : ధృతేశ్చ మహిమ్నో೭ స్యాస్మిన్నుపలబ్ధేః
వివృతిః :- చ = కించ - ధృతేః = ''అథ య ఆత్మా స సేతు ర్విధృ తిః'' ఇతి వాక్యే శ్రుతాయా విధృతిః = సర్వజగద్ధారణం - తస్మా ద్ధహరః పరమేశ్వర ఏవేతి వక్తవ్యం - అస్య-మహిమ్నః = అత్ర శ్రుతస్య సర్వజగద్ధారణ లక్షణస్య మహిమ్నః = సామర్ధ్యస్య - అస్మిన్ = పరమాత్మన్యేవ - ఉపలబ్దేః = ''ఏష భూతపాల ఏష సేతు ర్విధరణః'' ఇతి శ్రుత్యన్తరే ప్యుపలబ్దే రపి - దహరాకాశః పరమా త్మైవ.
వివరణము :- మరియు ఈ ప్రకరణములో ''అథయ ఆత్మాన సేతు ర్విధృతిః'' ఆత్మరూపమగు నీ దహరాకాశము సమస్త లోకములను, వర్ణాశ్రమాది ధర్మములను సాంకర్యముపొందనీయక ధరించి కాపాడుచున్నది అని దహరాకాశము యొక్క మాహాత్మ్యము వర్ణింపబడినది. ఇట వర్ణింపబడిన ఈ సర్వ జగద్ధారణ రూపమగు మహాత్మ్యము పరమాత్మయందుండు నని '' ఏష భూతపాల ఏష సేతు ర్విధరణః'' అని శ్రుత్యంతమునను కాన వచ్చుచున్నది. కానను దహరకాశశబ్దము పరమాత్మపరమే యని నిశ్చయింపదగును.
17. సూ : ప్రసిద్ధేశ్చ
వివృతిః :- చ = అపిచ- ప్రసిద్ధేః = ''ఆకాశో హ వై నామరూపయోర్నిర్వహితా'' - సర్వాణి హ వా ఇమాని భూతా న్యాకాశ దేవ సముత్పద్యన్తే'' ఇత్యాదిశ్రుతి ష్వాకాశబ్దస్య పరమేశ్వరే ప్రసిద్ధిదర్శనా చ్చ - దహరాకాశః పరమాత్మైవ.
వివరణము :- మరియు ఆకాశ శబ్దము భూతాకాశమునందు రూఢమైనను- '' ఆకాశో హ వై నామరూపయో ర్నిర్వహితా'' నామరూపాత్మక నిఖిల ప్రపంచ నిర్వహణకర్త ఆకాశ##మేకదా అను చెప్పు ఈ శ్రుతివాక్యము లోను - ''సర్వాణి హ వా ఇమాని భూతా న్యాకాశా దేవ సముత్పద్యన్తే'' ఈ సమస్త భూతములును (ఆకాశవాయ్వాదులు) ఆకాశమునుండియే ఉత్పన్నములగుచున్నవి యని చెప్పు ఈ శ్రుతివాక్యములోను - ఆకాశశబ్దము పరమాత్మయను నర్థములో వాడబడియుండుట ప్రసిద్ధము. కాన దహరా కాశ మనగా పరమాత్మయే.
18. సూ : ఇతరపరామర్శా త్స ఇతి చేన్నా సంభవాత్
వివృతిః :- ఇతరపరామర్శాత్ = ''అథ య ఏష సంప్రసాదో೭స్మా చ్ఛరీరా త్సముత్థాయ పరం జ్యోతి రుపసంపద్య స్వేన రూపే ణాభి నిష్పద్యతే'' ఇతి దహరవాక్యశేషే సంప్రసాదశ##బ్దేన - ఇతరస్య = జీవస్య - పరామర్శాత్ = పరామర్శస్య దర్శనాత్ - సః = దహరః జీవ ఏవ - ఇతి - చేత్ = ఇత్యుచ్యతే. చేత్ - న = తన్నోపద్యతే - దహరో న జీవ ఇత్యర్థః - కుతః ? అసంభవాత్ = ప్రసిద్దాకాశౌపమ్య - అపహత పాప్మత్వాదీనాం ధర్మాణాం వాక్యశేషగతానా ముపాదిపరిచ్ఛిన్నే జీవే అసంగతత్వా ద్దహరాకాశః పరమాత్మైన.
వివరణము :- ఈ ప్రకరణములోని ''అథ య ఏష సంప్రపాదో೭స్మా చ్ఛరీరాత్సముత్థాయ'' అను నీ వాక్యములో సంప్రసాద శబ్దముతో పరమాత్మకంటె నిరతుడగు జీవాత్మను పరామర్శించి అతడు ఈశరీరము నుండి సముత్థానమును పొంది స్థూల సూక్ష్మకారణ దేహములనుండి వివేచనము చేసి తనను వేరుపరచుకొని ఆ వివేచన చేయబడిన ఆత్మను = తనను తనకు నిజ స్వరూపమైన బ్రహ్మ స్వరూపునిగా నిశ్చయించికొని = సాక్షాత్కరించుకొని ఆప్రత్యగభిన్న పరం జ్యోతిని పొందును అని వర్ణింపబడినది. ఈ వాక్యములో జీవ పరామర్శము కలదు గాన దహరాకాశ మనగా జీవుడే అని యనుట కుదురదు. ఏలయన? ఈ ప్రకరణములోని - వాక్యశేషములలో ప్రతిపాదింప బడిన ప్రసిద్ధకాశౌపమ్య - అపహతపాప్మ త్యాది ధర్మములు ఉపాధి పరిచ్ఛిన్నుడైన జీవునియందు సంభవించ నేరవు గనుక - కాన దహరాకాశమనగా పరమాత్మయే.
19. సూ : ఉత్తరా చ్చే దావిర్భూత స్వరూపస్తు
వివృతిః :- అపహతపాతప్మత్వాది ధర్మాణాం జీవే సంభవమాశంక్య పరిహరతి - ఉత్తరాత్ = దహరవిద్యాయా ఉత్తరస్మాత్ ప్రజావతివిద్యాగ తాత్ ''య ఏసో7క్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ'' - ఇత్యాదినా జీవవిషయతయా నిశ్చితాత్ ''య ఆత్మా7పహగపాప్మా'' ఇత్యాదేః ప్రాజాపత్యవాక్యాత్ జాగ్రదా ద్యవస్థాపన్నే జీవే అపహతపాప్మత్వాదీనాం సంభవాత్ - దహరాకాశో జీవ ఏవ - చేత్ = ఇత్యుచ్యతే చేత్ - ఆవిర్భూత స్వరూపః - తు = తత్రాపి ప్రాజాపత్యవాక్యే న జైవేన రూపేణ జీవో వివ క్షితః. కింతు - ఆవిర్భూతం = పారమార్థికం రూప మస్యేతి ఆవిర్భూత స్వరూపః - నిరస్తోపాధి సంబన్ధ ఇత్యర్థః - తత్త్వమస్యాది వాక్యజన్యా పరోక్ష జ్ఞానేన నిరస్త నిఖిలాజ్ఞాన తత్కార్య శ్శుద్ధనచిన్మాత్ర ఏవ జీవో వివక్షితః - సతు బ్రహ్మైవ. తస్యతు భూతపూర్వగత్యా జీవ ఇతి వ్యవహరః. పరమార్థత స్తు సః అవ్యవవహార్యం బ్రహ్మైవ. తస్మా ద్దహరవాక్యే జీవా శంకా న కర్తవ్యా.
వివరణము :- దహర విద్యాప్రకరణము తరువాతిది యగు ప్రాజాపత్య విద్యాప్రకరణ గతమగు ''య ఏషో7క్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ'' నేత్రమునందు గోచరించు ఈ పురుషుడు ఆత్మ యని చెప్పుచుస్పష్టముగ జీవ స్వరూపమును వర్ణించుచున్న ఈ వాక్యములలో జాగ్రదద్యావస్థాపన్న జీవునకు అపహత పాప్మత్వాది (సర్వ పాప సంబన్ధ విధురత్వాది) ధర్మములు వర్ణింపబడి యున్నవి. కనుక దహరాకాశమనగా జీవుడే అని యనుట యుక్తముకాదు. కారణ మేమియన - ఆ ప్రాజాపత్య వాక్యములో జీవుడు జీవసంబంధమైన (జైవ) రూపముతో వర్ణింపబడి యుండలేదు. అచట అవిర్భూత స్వరూపుడగు జీవుడు వర్ణింపబడియున్నాడు. అవిర్భూతస్వపూపుడు అనగా ఆవిద్యకములగు స్థూల సూక్ష్మ కారణరూపోపాధులతో సంబంధమును తొలిగించుకొని వివేచన చేయబడి సాక్షాత్కరించుకొనబడిన పారమార్థిక బ్రహ్మస్వరూపము గల జీవుడని యర్థము. త్త్వమస్యాది మహా వాక్యార్థ విచారజన్యాపరోక్ష సాక్షాత్కారము చేత నిరసింపబడిన (తొలగిపోయిన) అజ్ఞానము, ఆఅజ్ఞాన కార్యమగు ద్వైతప్రపంచము గలవాడై శుద్ధ చిన్మాత్రుడగు జీవుడే అచట ఆ ప్రాజాపత్య వాక్యములో వర్ణింపబడుచున్నవాడు. అతడు బ్రహ్మయే, కాని ఆతనికి జీవపదముతో వ్యవహారము: ''భూతపూర్వగత్యా'' (వెనుకటి వాడుకనుబట్టి) అని చెప్పవలయును. యథార్థస్థితిలో ఆతడు ఆ వ్యవహార్యమగు (ఏవిధమైన వ్యవహారమునకు సంబంధించిన) పరబ్రహ్మయే. కాన దహర వాక్యమున జీవుడు చెప్పబడుచున్నాడనుట యుక్తముకాదు.
20. సూ : ఆన్యార్థ శ్చ పరామర్శః
వివృతిః :- పరామర్శః = ''అథ య ఏష సంప్రసాదః'' ఇతి దహర వాక్యశేషే యో జీవపరామర్శః కృత స్సః - అన్యార్థః - చ = పరమేశ్వర ప్రతిపాదనార్థ - జాగ్రత్స్వప్నయో శ్శ్రాంతస్య జీవస్య యదుపసంపత్యా స్వరూపనుఖావిర్భావో భవతి - యద్విజ్ఞానా చ్చ సకలానర్థ నివృత్తి పూర్వక పరమానందలక్షణ మోక్షప్రాప్తి శ్చ భవతి - న పరమేశ్వర ఇత్యుపపాదనార్థ ఇతి యావత్
వివరణము :- దహర విద్యాప్రకరణములోని ''అథ య ఏష సంప్రసాదః...'' అను నీ వాక్యములో సంప్రసాధ శబ్దముతో జీవాత్మ పరామర్శ చేయబడినదిగదా! దహరాకాశ శబ్దము పరమాత్మ పరమే యున్నచో ఈ ప్రకరణములో జీవ పరామర్శ యేల చేయబడినది యను శంకకు సమాధాన మిట ప్రతిపాదింప బడుచున్నది. ఆ పరామర్శము అన్యార్థము. అనగా పరమేశ్వర ప్రతిపాదనార్థమే. అనగా జాగ్రత్స్వ ప్నావస్థల యందు అలసిపోయిన జీవునకు ఏవస్తువుతో నేకీభావము లభింపగా తనకు సహజస్వరూపమేయగు సుఖాభివ్యక్తి లభించునో - ఏ వస్తువు యొక్క విజ్ఞానమువలన సంసారరూప సకలానర్థ నివృత్తి పూర్వక పరమానంద స్వరూపమగు మోక్షసామ్రాజ్యము లభించునో ఆవస్తువు పరమాత్మయే అని ఉపపాదనము చేయుటకు అని భావము.
21. సూ: అల్పశ్రుతే రితి చేత్తదుక్తమ్
వివృతిః :- అల్పశ్రుతేః = ''దహరోస్మి న్నంతరాకాశ'' ఇతి ఆకాశ స్వాల్పత్వ శ్రవణా న్నదహరాకాశస్య పరమాత్మత్వం - కింతు జీవత్వ మేవ - ఇతి - చేత్ = ఇత్యుచ్యతే చేత్ - తదుక్తమ్ = తత్ర సమాధాన ముక్తం - ''అర్ఛకౌకస్త్వాత్'' ఇత్యత్ర ధ్యానార్థం విభో రపి బ్రహ్మణః అల్పత్వ వ్యపదేశో7వకల్పత ఇతి. తస్మా ద్దహరః పరమాత్మైవ.
వివరణము :- ''దహరోస్మి న్నన్త రాకాశ'' అను ఈ దహర వాక్యములోని దహర శబ్దమునకు అల్పము అని అర్థము - కాగా దహరా కాశము అనగా అల్పమైన ఆకాశము అని అర్థము ఏర్పడుచున్నది. ఆకాశ శబ్దమునకు ఆ - కాశ##తే = అంతటను ప్రకాశించునది అను వ్యుత్పత్తి మొదలగు హేతువుల ననుసరించి పరమాత్మ పరత్వము నంగీకరించిన సర్వవ్యాపకుడగు పరమాత్మ అని అర్థము వచ్చును అతనికి ఆల్పత్వవర్ణనము ఉపవన్నముకాదు. కాన దహరాకాశమనగా జీవుడనుట యుక్తము అని యనినచో దానికి ''అర్భకౌక స్తాత్...'' అను సూత్రములో ధ్యానము కొరకై సర్వవ్యాపకుడైన పరమాత్మకు అల్పత్వవర్ణనము యుక్తమెయగునని సమాధానము చెప్పబడెను. కాన దహరాకాశ మనగా పరమాత్మయే అనుట యుక్తము.
అనుకృత్యధికరణమ్ 6
22. సూ : అనుకృతే స్తస్య చ
వివృతిః :- ముండకోపనిషది శ్రూయతే - ''న తత్ర సూర్యో భాతి న చన్ద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో7య మగ్నిః| తమేన భాంత మనుభూతి సర్వం తస్య భాసా సర్వ మిదం విభాతి'' ఇతి. తత్రసర్వగద్భాసకతయా ప్రతీయమానం వస్తుబ్రహ్మైవ. నతుకశ్చిత్తే జో వివేషః - కుతః - అనుకృతేః = అనుకరణాత్ - అనుభానాత్ = ''తమేవ భాన్త మనుభాతి సర్వం'' ఇత్యుక్తాత్ - సర్వస్య తదనుసారి ప్రకాశాత్ - తన్య - చ = ''తస్య భాషా సర్వ మిదం విభాతి'' ఇతి సూర్యాదే స్తద్ధేతుక ప్రకాశత్వోక్తే శ్చ సర్వజగదవభాసకం తద్వస్తు బ్రహ్మైవ.
వివరణము :- ముండకోపనిషత్తులో ''నతత్ర సూర్యోభాతి న.... సర్వ మిదంవిభాతి'' అను వాక్యము కలదు. అందు ఒకానోక వస్తువును తచ్ఛబ్దముతో పరామర్శించి ఆ వస్తువును సర్వార్థావభాసకులుగా ప్రసిద్ధినొందియున్న సూర్య చన్ద్ర నక్షత్రాదులు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయలేరనిన్నీ ఆవస్తువు తానుస్వయముగ ప్రకాశించుచుండ దాని ననుసరించి ఈ సూర్య చన్ద్రాది సర్వ పదార్థములును భాసించుచున్నవనిన్నీ - దాని యొక్క ప్రకాశముచేతనే ఈ సమస్తదృశ్య ప్రపంచమును ప్రకాశించు చున్నదనిన్నీ వర్ణింపబడి యున్నది. ఇట వర్ణింపబడిన సర్వజగద్భాసక వస్తువు పర బ్రహ్మయే గాని ఒక భౌతికతేజః పదార్థము కాదు. ఏలయన? ''త మేవ భాన్త మనుభాతి సర్వం'' అని అది స్వయముగా భాసించుచుండ దాని ననుసరించి సూర్య చన్ద్రాదులు భాసించు చున్నారని
సూర్య చంద్రాదులకు అనుభానము = ఆ వస్తువు ననుసరించి భాసించు చుంéడట వర్ణింప బడినది. మరియు ''తస్య భాషా సర్వ మిదం విభాతి'' అని సర్వ ప్రపంచమును ఆ వస్తువు యొక్క ప్రకాశముననే ప్రకాశించు చున్నది అని వర్ణింపబడినది. ఇట్టి సర్వ జగదవభాసకముగ వర్ణింపబడిన ఆ వస్తువు పర బ్రహ్మయే గాని భౌతిక తేజః పదార్థము కాదు.
23. సూ : అపి చ స్మర్యతే
వివృతిః :- అత్రార్థే స్మృతి సంవాదం దర్శయతి - అపి - చ=కించ స్మర్యతే=ఆయమేవార్థః ''నతద్భాసయతే సూర్యోనశశాంకో నపావకః| యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ'' - ''యదాదిత్యగతం తేజో జగ ద్భాసయతే=ఖిలం య చ్చన్ద్రమసి య చ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం'' ఇత్యాదినా భగవద్గీతాను స్మర్యతే = ప్రతిపాద్యే. అత స్సర్వా ప్రభాసకం తద్వస్తు బ్రహ్మైవ.
వివరణము :- ఈ సూత్రములోని నిర్ణయముపట్ల స్మృతి సమ్మతి ప్రదర్శింపబడుచున్నది. ''న తద్బాసయతే సూర్యో.... పరమం మమ'' - ''యదాదిత్యగతం తేజో ....విద్ధి మామకం'' ఈ భగవద్గీతా వాక్యములలో ఆ పరమాత్మ వస్తువును సూర్యచంద్రాదులు ప్రకాశింపచేయలేరని చెప్పుచు పరమాత్మ వస్తువు అన్యభాస్యము కాదనియు. సూర్యచంద్రాదుల యందు గల సర్వజగదవభాసక తేజస్సు పరమాత్మజస్సేగాని యన్యము కాదనిన్నీ వివరింపబడినది. కాన ఆ సర్వావభాసక వస్తువు పరమాత్మయే గాని యన్యము కానేరదు.
ప్రమితాధికరణమ్ 7
24. సూ : శబ్దాదేవ ప్రమితః
వివృతిః :- కఠల్లీషు శ్రూయతే - అంగుష్ఠమాత్రః పురుషో మధ్యే ఆత్మని తిష్ఠతి'' ఇతి. ప్రమితః = ఏత ద్వాక్యోక్తః అంగుష్ఠ మాత్రః పురుషః ప్రత్యగభిన్నః పరమాత్మైవ - న జీవః - కుతః ? శబ్దాత్ - ఏవ = ''ఈశానో భూతభవ్యస్య'' ఇతి భూత భవ్య సర్వ విషయక నిరంకు శేశి తృత్వ ప్రతిపాదకాచ్ఛబ్దాత్ = శ్రుతివాక్యాదేవ - స చాస్య పురుషస్య పరమాత్మత్త్వే అంగుష్ఠ మాత్రత్వం విరుద్ధ్యతే ఇతి వక్తవ్యం - అంగుష్ఠమాత్ర జీవానువాదేన తస్య జీవస్య బ్రహ్మాభేదబోధనపరత్వా దస్య వాక్యస్య.
వివరణము :- కఠవల్లియందు ''అంగుష్ఠమాత్రః పురుషో మధ్యే ఆత్మని తిష్ఠతి'' పురుషః = పరిపూర్ణుడైన ఆ పరుషుడు అంగుష్ఠపరిమాణము గలవాడై దేహమధ్యమునందు (అంగుష్ఠము అనగా బొటనవ్రేలు- అంత పరిమాణముగల హృదయ ప్రదేశమున) ఉండెను. అను నొక వాక్యము గలదు. ఈ వాక్యమున అంగుష్ఠమాత్రుడుగ వర్ణింపబడిన పురుషుడు పరమాత్మయే అని చెప్పవలయును గాని జీవుడు అని చెప్పవలయును పడదు. ఏలయన? '' ఈశానో భూతభవ్యస్య'' అను ఈ ప్రకరనములోని పైవాక్యములో భూతాది కాలత్రయమునందుగల సర్వప్రపంచమును నియమించువాడతడు అని సర్వలోక నియామకత్వము వర్ణింపబడినది. అట్టి ఆపురుషుడు పరమాత్మయే అని నిర్ణయింపబడుచున్నది.
ఆ పురుషుడు పరమాత్మయే యగుచో అంగుష్ఠ మాత్రుడు అని చెప్పుటయెట్లు పొసగును. పరమాత్మ సర్మవ్యాపకుడు గదా! అనినచో అది దోషముకాదు. అంగుష్ఠమాత్రుడగు జీవుని అంగుష్థమాత్ర పదముతో ననువదించి యాజీవునకు బ్రహ్మోభిన్నత్వమును బోధించుటయందే ఈ వాక్యమునకు తాత్పర్యము గాన నిట్లు చెప్పబడినది. కనుక దోషము లేదు.
25. సూ : హృద్యపేక్షయా తు మనుష్యాధికారత్వాత్
వివృతిః :- హృది-అపేక్షయా = సర్వగతస్యాపి పరమాత్మనః హృదయే అవస్థానం అపేక్ష్య అంగుష్ఠమాత్రత్వ ముచ్యతే - వంశపర్వాపేక్షయా ఆకాశ స్యారత్ని మాత్రత్వోక్తి రివ - ప్రతిప్రాణిభేదం తద్ధృదయ పరిమాణానా మనవస్థితత్వాత్కథం హృదయస్థి త్యపేక్షయా ప్యంగుష్ఠ మాత్రత్వ ముచ్యత ఇతి చేత్ - మునుష్యాధికారత్వాత్ = శక్తత్వ - అర్థిత్వాదిభి ర్మనుష్యా నేవాధికృత్య శాస్త్రస్య ప్రవృత్తత్వాత్ - మనుష్యాణాం చ నియతపరిమాణః కాయః - స చ సప్తవితస్తి పరిమితః స్వస్వమానేన - నియతపరిమాణ మేవ చైషాం హృదయం అంగుష్ఠపరిమితం - అతోమనుష్యాధికారత్వా చ్ఛాస్త్రస్య హృదయావస్థానాపేక్షయా అంగుష్ఠమాత్రత్వ ముపపన్నం పరమాత్మనః.
వివరణము :- పరమాత్మ సర్వగతుడైనను హృదయ స్థానమునందలి ఆతని యునికిని బట్టి పరమాత్మకు అంగుష్ఠమాత్రుడను వ్యవహారమిచట చేయబడుచున్నది. సర్వగతమగు ఆకాశమును ఒక వెదురుబొంగు యొక్క ఒక కణుపులోని ఉనికిని బట్టి ఆకాశము అరత్ని మాత్రము (మూరెడు పొడవైనది) అని చెప్పుచున్నట్లు- మనుష్య పశ్వాది ప్రాణులలో ప్రాణిభేదము ననుసరించి వారివారి హృదయముల పరిమాణములు (కొలతలు) అవ్యవస్థితములుగ (హెచ్చు తగ్గులుగ) నుండునుగదా హృదయమునందుండుటను బట్టి అంగుష్ఠమాత్రడుఅని యనుటమాత్ర మెట్లు పొసగును అని యనినచో - ఆ ప్రశ్నకు మనుష్యాధికారత్వాత్ అని సమాధానము సూత్రములో చెప్పబడినది. అనగా విధినిషేధాది రూపమగు శాస్త్రము నందు మానవులకే అధికారముగాని తదిరర ప్రాణులకు లేదు గనక అని. శాస్త్రోక్త కార్యముల నాచరింపదగు సామర్థ్యము, తత్పలాభి కాంక్ష మొదలగు అధికార కారణములు మనుజులకే సంభవించును గనుక శాస్త్రము నందు మానవులకే అధికారము. మానవుల దేహము వారివారి కొలతల ననుసరించి సప్తవితస్తి పరిమితముగ నుండును. ( అనగా వారి వారి జానతో ఏడు జానల పొడవుగల్గి మానవ దేహము నియత పరిమాణము కలదియై యుండును.) అట్లె వారి వారి హృదయములును నియతముగ తత్తదంగుష్ఠ పరిమితముగనే యుండును. ఆ కారణమున శాస్త్రమునందు మానవులే అధికృతులు గాన వారి హృదయ పరిమాణాను సారమచట నుండు పరమాత్మకు అంగుష్ఠమాత్రత్వ వర్ణన ముపపన్నమే యగును.
దేవతాధికరణమ్ 8
26 సూ : తదుపర్యపి బాదరాయణ స్సంభవాత్
వివృతిః :- శాస్త్రస్య మనుష్యాధికారత్వోక్త్యా దేవాదీనాం నాస్తి బ్రహ్మవిద్యాయా మధికార ఇత్యాయాతి - తత ఉచ్చతే - తదుపరి - అపి = తేషాం మనుష్యాణా ముపరి యే దేవాదయ స్తా నప్యధికరోతి శాస్త్రం బ్రహ్మవిద్యావిషయం న మనుష్యా నేవేతి నియమః - ఇతి బాదరాయణః = బాదరాయణ ఆచార్యో మన్యతే - కుతః ః సంభవాత్ = య దాధికారే కారణం ఫలార్థిత్వం - విగ్రహాదిమత్త్వం - శాస్త్రార్థ జ్ఞాన వత్త్వాది - విద్యా - అనుష్ఠానసామర్థ్యం - అప్రతిషేధశ్చ - ఇత్యేతస్యదేవాది ష్వపి సంభ-వాత్ - దేవానా మప్యస్తి తత్రాధికారి తేతిసిద్ధం.
వివరణము :- శాస్త్రము మనుష్యాధి కారికము అని చెప్పుటతో దేవాదులకు బ్రహ్మ విద్యయం దధికారము లేదు అని యేర్పడుచున్నది. కాన నీ సూత్రమును చెప్పుచున్నారు. మనుష్యుల కంటె పైవారగు దేవతలు మొదలగు వారికిని బ్రహ్మవిద్యారూప శాస్త్రమునందధికారము కలదు. మనుష్యులకు మాత్రమే అను నియమములేదు అని బాదరాయణాచార్యుల వారు తలంచు చున్నారు. కారణమేమి యనః విద్యా ఫలార్థిత్వము (విద్యాఫలాభికాంక్ష) శ్రవణాద్యనుష్ఠానోపయోగి దేహాది (విగ్రహాది) మత్త్వము- శాస్త్రార్థజ్ఞానవత్త్వాది - విద్యా - అనుష్ఠాన సామర్థ్యము - నిషేధము లేకుండుటయను అధికారి కారణములుగా నిర్ణయింపబడిన ధర్మములన్నియు దేవాదులకును సంభవించును గాన దేవాదులకు గూడ బ్రహ్మ విద్యారూప శాస్త్రము నందధికారము కలదని యేర్పడు చున్నది.
27. సూ : విరోధః కర్మణీతిచేన్నానేకప్రతిపత్తేర్దర్శనాత్
వివృతిః :- దేవాదీనాం విగ్రహవత్త్వా ద్యభ్యుపగమ్య విద్యాయా మధికారోస్తీతి యద్యుచ్యేత - తర్హి- కర్మణి = యాగాదౌ - విరోధః = దేవతాభావరూపో విరోధః స్యాత్ - బహుషు యుగప దనుష్ఠీయమానేషు యాగే ష్యేకస్యా ఏవ దేవతాయా స్సంప్రదాన కారకభూతాయా ఋత్విగా దివత్ స్వరూపేణ సన్నిధానామపపత్తేః - ఇతి - చేత్ = ఇత్యుచ్యతే చేత్ - న = న తథా వక్తుం శక్యతే - ఉక్తో విరోధో న సంభవతీత్యర్థః - కుతః? అనేక ప్రతివత్తేః = ఏకస్యా ఏవ ఆజాన సిద్ధాయా దేవతాయా యుగపదనేక శరీర ప్రతిపత్తేః - అనేక దేహ పరిగ్రహణ సామర్థ్యస్య సంభవాత్ - దర్శనాత్ = తదేత దేకస్యా ఏవ దేవతాయా యుగప దనేకదేహ పరిగ్రహణ సామర్థ్యం ''స ఏకధా భవతి - త్రిధా భవతి'' ఇత్యాది నైకస్యా దేవతాయా అనేక ధాభావస్య దర్శితత్యా దవగమ్యతే.
వివరణము :- దేవాదులకు విగ్రహము = దేహముకలదని యంగీకరించి వారికి బ్రహ్మవిద్యయందధికారము కలదని నిర్ణయింప బడినది పూర్వ సూత్రములో - అట్లగుచో - యాగానుష్ఠాతలచే ననుష్ఠింపబడు యాగాదులయందు దేవత లేకపోవుటయను విరోధము సంభవించును. ఎట్లన బహుమంది యజమానులచే భిన్న భిన్న ప్రదేశములలో ఏక కాలమున చేయబడు యాగములయందు ఒకే దేవత నుద్దేశించి హవిర్గ్రహణము కొరకై ఆ దేవతను ఆహ్మానింప ఆ దేవత వచ్చి ఋత్విక్కులు మొదలగు వారివలె వచ్చి సాన్నిధ్యము నిచ్చుట సంభవించదు. అనేక స్థలములలో ఒకే సమయమున తన శరీరముతో ఆ దేవత తాను సన్నిహితయై యుండుట అసంభవము గదా. కాన దేవతలకు విగ్రహము = శరీరము కలదనుట యుక్తము కాదు అని యనరాదు. అట్టి విరోధము సంభవించదు. ఏలయన? దేవత ఒక్కటియే ఐనను (దేవతావ్యక్తి ఏకమే ఐనను) ఆజానసిద్ధులగు ఆ అగ్న్యాది దేవతలకు ( ఆ జానసిద్ధదేవతలనగా సృష్ట్యా రంభకాలముననే ద్యులోకమున దేవతలుగా పుట్టియట నివసించు చుండువారు అని ఆర్థము) ఒకే పర్యాయము ఒకే కాలమునందు అనేక దేహములను ధరింపగల్గు సామర్థ్యము కలదు గాన పూర్వోక్తవిరోధమేమియును సంభవించదు. ఒకే దేవత అనేక దేహములను ఒక సమయముననే గ్రహించు సామర్థ్యము కల్గియుండును అనునంశము ''స ఏకధా భవతి త్రిధా భవతి'' ఆ దేవుడు ఒకటిగా - మూడుగా -ఇట్లు అనేకధా అగు చున్నాడు. అని శ్రుతి వాక్యములలో కన్పట్టు చున్నది. కాన దేవతలకు విగ్రహము కలదన్నచో విరోధమేమియు లేదు.
28. సూ : శబ్ద ఇతి చేన్నాతః ప్రభవా త్ర్పత్యక్షాను మానాభ్యాం
వివృతిః :- దేవాదీనాం విగ్రహా ద్యభ్యుపగమే కర్మణి విరోధాభావేపి- శ##బ్దే = వైదికే శ##బ్దే - విరోధః - స్యాత్ - కథ మితి చేత్. ఔత్పత్తిక సూత్రే శబ్దార్థయో రనాద్యో స్సంబన్థ స్యాప్యనాదిత్యా ద్వే దస్య స్వార్థే మానాంత రానపేక్షత్వేన ప్రామాణ్యముక్తం - ఇదానీం దేవానా మ ప్యస్మ దాదివ జ్జననమరణవతీ అనిత్యా విగ్రహవ్యక్తి రస్తీత్యంగీకారే తత్సంబన్ధ స్యాప్యనిత్యత్వాత్, మానాంతరేణ వ్యక్తిం జ్ఞాత్వా శబ్దస్య సంకేతః పుంసాకర్తవ్య ఇతి ప్రమాణాంతరాపేక్షా - సంకేతకరణా యావశ్యం భావినీ స్యాత్ - తథా మానాంతరాపేక్షాయాం సత్యాం అనపేక్షత్వేన హేతునా స్థాపితం ప్రామాణ్యం భ##జ్యేత - అపి చ దేవా దివ్యనాశే తద్బోధక శబ్ద స్య వాచకత్వ మపి భ##జ్యేత ఇత్యేవం ప్రామాణ్య భంగరూపో విరోధః ప్రసజ్యతే - ఇతి - చేత్ - న = తథా విరోధో న సంభవతి - కుతః ? అతః ప్రభవాత్ = అస్మా దేవ వైదికా చ్ఛబ్ధాద్దేవాది జగత్ప్రభవ స్యాభ్యుపగత త్వాత్ - కథం తత్ప్రభవత్వం దేవాదే ర్జగతః అవగమ్యత ఇతి చేత్ - ప్రత్యక్షానుమానాభ్యాం = ప్రత్యక్షం = శ్రుతిః - అనుమానం స్మృతిః - తా భ్యాం - శ్రుతిః - ''ఏత ఇతి వై ప్రజాపతి ర్దేవా నసృజత''- స భూరితి వ్యాహరత్ | స భూమి మసృజత - ''రశ్మి రిత్యేవాదిత్య మసృజత'' - ఇత్యాదికా శ్ర్శుతయః - స్మృతిః '' ఆనాధినిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయం భువా| ఆదౌ వేదమయీ దివ్యా యత స్సర్వాః ప్రవృత్త్మయః'' - నామరూపే చ భూతానాం కర్మణాం చ ప్రవర్తనం | వేదశ##బ్దేభ్య ఏవాదౌ నిర్మమే సమహేశ్వరః'' ''సర్వేషాం చ స నామాని కర్మాణి చ పృథక్ పృథక్ వేదశ##బ్దేభ్య ఏవాదౌ పృథక్ సంస్థాశ్చ నిర్మమే'' ఇత్యాదికా స్మృతిః - తాభ్యాం = శ్రుతిస్మృతిభ్యాం నిత్యశబ్దప్రభవత్వం దేవాదే ర్జగతః అవగమ్యతే. ఏవంచ శబ్దా ద్దేవాది వ్యక్త్యుత్పత్తా వపి తన్నిష్ఠాయా జాతేః = ఆకృతే ర్నిత్యత్వా న్ని త్యాభి స్తాభి రాకృతిభి ర్నిత్యానాం వైదికానాం శబ్దానాం య స్సంబన్ధ స్తస్యాపి నిత్యత్వేన అనపేక్షత్వేన హేతునా వైదికే శ##బ్దే ప్రామాణ్యం యదభ్యుపగతం న తస్య భంగో భవతీత్యతో దేవానా మప్యస్త్యధికా రోత్రేతి సిద్ధమ్.
వివరణము :- దేవవాదులకు విగ్రహాదులు కలవని యంగీకరించిన పక్షములో కర్మయందు విరోధము చూపబడినది. దానికి పరిహారమును పై సూత్రములో నిరూపింపబడినది. కర్మయందు విరోధము లేకున్నను శబ్దము నందు (వేదగతములగు = వైదికములగు శబ్దములయందు) విరోధము తప్పదు - అట్లనిన? జెమిని మహర్షి ప్రణీతమైన పూర్వమీమాంసా శాస్త్రము నందలి ''ఔత్పత్తతిక స్తు శబ్దస్యార్థేన సంబన్ధః....'' అను సూత్రములలో శబ్దము తద్బోధ్యమగు అర్థమును అనాది సిద్ధములనియు - వాచ్య వాచకములగు = బోధ్య బోధకములగు ఆ శబ్దార్థములకు గల వాచ్యవాచక భావ సంబంధము గూడ అనాదియే అనియు - కనుక వేదమునందలి శబ్దములు తమ తమ అర్థములను బోధించు సందర్భములో అనాది సిద్ధమగు సంబన్ధము ననుసరించి అనాది సిద్ధములగు తాము అనాది సిద్ధములగు అర్థములయొక్క బోధమును = జ్ఞానమును ఈ శబ్దమునకు ఈ యర్థమును బోధింపగల వాచ్యవాచక సంబధము కలదని నూతనముగ అర్వాచీన పురుషులు వచ్చి బోధింపవలసిన అపేక్ష లేకుండగనే కలిగించుచున్నవి గనుక ( స్వార్థబోధకములగు చున్నవి గనుక) వేదమునకు స్వార్థమునందు ప్రామాణ్యము కలదని ప్రతిపాదింపబడ యుండెను. ఇప్పుడు దేవాదులకు గూడా మనకు వలెనే జననమరణములు గల్గిన అనిత్యమగు విగ్రహము కలదని యంగీకరించినచో (విగ్రహహములు మారుచుండును గనుక) ఆ విగ్రహములకును తద్బోధక శబ్దములకును గల సంబన్ధమును అనిత్యమే యగును గాన (అనాది సిద్ధ సంబన్ధము లేదుగాన) ప్రమాణాంతరముచే దేవతా విగ్రహ వ్యక్తిని గ్రహించి యీ శబ్దమునకు ఈ యర్థమును బోధింపగల సామర్థ్యము (సంబన్ధము) కలదని ఎవని చేతనో ఒక పురుషునిచేత సంకేతము చేయవలసి వచ్చును.
ఈ సంకేతమును కల్పించుటకు వ్యక్తిగ్రహణాది కార్యములయందు ప్రమాణాంతరాపేక్ష యావశ్యకమగును. ప్రమాణాంతరా పేక్ష యేర్పడినచో పూర్వము వేదములకు ఇతర ప్రమాణాంతరాపేక్ష లేకుండగనే అనాది సిద్ధ సంబన్ధ ద్వారమున స్వార్థ బోధన సామర్థ్యము కలదు గాన ప్రామాణ్యము సిద్ధము అనియే ప్రామాణ్యము ప్రతిపాదింపబడెనో దానికి భంగము వాటిల్లును. మరియు దేవాది విగ్రహవ్యక్తి అనిత్యము గనుక ఆ విగ్రహము నశించిన తద్బోధక శబ్దమునకు వాచ్యమగు అర్థము లోపించును గనుక శబ్దమునకు వాచకత్వము గూడ లోపించును. అంత అబోధకము గనుక వేద శబ్దమున కప్రామాణ్యము సంభవించును. ఇట్లు దేవతలకు విగ్రహము కలదని యంగకరించినచో శబ్దము విషయమున విరోధము గనుక వేద శబ్దమున కప్రామాణ్యము సంభవించును. ఇట్లు దేవతలకు విగ్రహము కలదని యంగీకరించినచో శబ్దము విషయమున విరోధము తప్పనిది యగును, అని యనుట తగదు. ఏలయన? ఈ వేదసిద్ధ వైదిక శబ్దముల నుండియే దేవాదికమగు సమస్త ప్రపంచమును ప్రభవించు చున్నదని యంగీకరింపబడి యున్నది గనుక. వేదశబ్ద ప్రభవము సమస్త ప్రపంచము అను అంశము శ్రుతి స్మృతులను బట్టి యేర్పడుచున్నది.
''ఏత ఇతి వై ప్రజాపతి ర్దేవా నసృజత'' ''ఏతే'' అను పదముతో ప్రజాపతి దేవతలను సృజించెను. ''స భూ రితి వ్యాహరత్ | స భూమి మసృజత''-''భూః'' అను పదము నుచ్చరించి తదర్థమగు భూమిని ప్రజా పతి సృజించెను. ''రశ్మి రిత్యే వాదిత్య మసృజత'' ''రశ్మిః'' అను పదముతో ఆదిత్యుని సృజించెను. ఇత్యాది శ్రుతులను బట్టియు, ''అనాది నిధనా నిత్యా .... నిర్మమే'' (వేదశబ్దముల నుండియే మహేశ్వరుడగు పరమాత్మ సర్వమును నిర్మించెను.) ఇత్యాది స్మృతులను బట్టియు అనాది నిధనములు నిత్యములునగు వేదశబ్దముల నుండి దేవాదికమగు సర్వప్రపంచమును ప్రభవించినట్లు తెలియబడుచున్నది. ఇట్లు కాగా శబ్దమునుండి దేవాది వ్యక్తు లుత్పన్నమైనవని యేర్పడి నప్పటికిని ఆ దేవతా వ్యక్తుల యందన్నిటియందు నుండు జాతి = ఆకృతి నిత్యము గాన నిత్యములగు ఆ ఆకృతులకును - నిత్యములగు వేదసిద్ధములగు అగ్న్యాది వైదిక శబ్దములకు గల యే సంబంధము గలదో అదియు నిత్యమే కాన వేదశబ్దములకు స్వార్థబోధనము పట్టున ప్రమాణాంతరాపేక్ష లేకయే బోధకత్వ మేర్పడును గాన అనపేక్షత్వ హేతువుచే వైదికశబ్దమునందు స్థాపింపబడినప్రామాణ్యమునకు ఏ మాత్రమును భంగము = విరోధము లేదు. కాన దేవతలకును బ్రహ్మవిద్యా రూప శాస్త్రమునం దధికారము కలదనుట సిద్ధమగుచున్నది.
(ఇచట పదములకు జాతియందు శక్తిగాని వ్యక్తి యందు కాదను మతము స్వీకరింపబడినది.)
29 సూ : అత ఏవ చనిత్యత్వం
వివృతిః :- అతః - ఏవ - చ = నియతాకృతే ర్దేవాదే ర్జగతో వేద శబ్ద ప్రభవత్వా దేవహేతోః - నిత్యత్వం = వేదశబ్దానా మపి నిత్యత్వం ప్రత్యేతవ్యం - కర్తు రస్మరణన సిద్ధమేవ వేద నిత్యత్వమనేన దృఢీకృత మితిబోధ్యం- ''యజ్ఞేన వాచః పదవీయ మాయన్ తా మన్వవింద న్నృషిషు ప్రతిష్టాం'' ఇతి మన్త్రవర్ణోపి ఋషిషు స్థితా మేవ వాచం లబ్ధ వన్త ఇతి బోధయన్ వేదస్య నిత్యత్వం బోధయతి, వేదవ్యాస శ్చైవం స్మరతి ''యుగాన్తే న్తర్హితాన్ వేదాన్ సేతిహాసావ్ మహార్షయః | లేభిరే తపసా పూర్వ మనుజ్ఞాతా స్స్వయంభువా|'' ఇతి మహాభారతేపి - అత్రోక్తం వేద గతం నిత్యత్వం వ్యావహరిక నిత్యత్వమేవ, న పారమార్థిక మిత్య వధేయమ్.
వివరణము :- నిత్యములగు తత్తద్వ్యక్తినిష్ఠ జాతులతో గూడిన దేవాదికమగు సమస్త ప్రపంచమును వేదశబ్దములనుండి ప్రభవించుచున్నది యని చెప్పుటవలన వేదశబ్దములు ( అనగా వేదరూపశబ్దరాశి) నిత్యమని తెలియదగును. వేదములకు కర్త యీతడని ఆనాదికాలమునుండి యీనాటి వరకు ఎవరికిని తెలియబడమిచే వేదములు నిత్యములని గ్రంథాతరముల యందు నిర్ణయింపబడి యున్నది. ఆ యంశ##మే యిచట మరల ధ్రువపరుపబడినది. వేదనిత్యత్వము ''యజ్ఞేన వాచః....... ప్రవిష్టాం'' యాజ్ఞికు (యజ్ఞకర్మ నిర్వహణ సమర్థు) లగు మహాత్ములు పూర్వార్జిత సుకృత బలమున యోగ్యతను సంపాదించుకొనిన వారగుచు ఋషులయందు నిగూఢమైయున్న వేదవాక్కులను పొందినవారైరి. అని చెప్పు ఈ మన్త్రమును - నూతనముగ వేదమును నిర్మించి యుండలేదని ఋషులయందున్న దానిని పొందిరని చెప్పుచు వేద నిత్యత్వమును ధ్రువపరచుచున్నది. ఇట్లే మహాభారతమున శ్రీ వేదవ్యాస మహర్షియు ''యుగాన్తే೭ న్తర్హితాన్.... స్వయంభువా'' పూర్వయుగాన్తమునందు శబ్దోచ్చారణ కర్తలగు వ్యక్తులు లేకపోవుటతో నన్తర్హితములైన వేదములను ప్రజాపతి యనుమతితో తపోబలమున పూర్వకాలమున యుగాదియందు మహర్షులు సంపాదించిరి అని చెప్పుచు వేదములు నూతనముగ నిర్మింపబడ లేదనియు, వేదములు నిత్యములే అనియు నిరూపించెను. (వేదములు నిత్యములు అనగా వ్యావహారిక నిత్యములు అని గ్రహింపదగును గాని పారమార్థిక నిత్యములు అని గ్రహింపరాదు.)
30. సూ : సమాన నామరూపత్వా చ్చావృత్తా వప్యవిరోధో దర్శనాత్ స్మృతేశ్చ
వివృతిః: మహాప్రళ##యే సకలమపి త్రైలోక్యం పరిత్యక్తనామ రూపం నిర్లేపం ప్రవిలీయతే - ప్రభవతి చాభినవం జగ త్పున స్సర్గే ఇతి శ్రుతిస్మృత్యోః ప్రతిపాద్యతే - తతశ్చ మహాప్రళ##యే ఆకృతీనా (జాతీనా) మపి నాశో వక్తవ్యః - తత శ్చ తదసత్వా చ్ఛబ్దార్థ సంబన్ధ స్యాప్యనిత్యత్వ మాపద్యేత - తత శ్చ శ##బ్దే విరోధ స్తదవస్థ ఏవ స్యాదిత్యా శంకాయాం జాతాయ మిదం సూత్ర మారభ్యతే - ఆవృత్తౌ - అపి = సృష్టి ప్రళయయో రావృత్తా వపి - నమాననామరూపత్వాత్ = ఇంద్రాదే ర్జగతః - వర్షపాయే ప్రాప్తమృద్భావానాం మండూకశరీరాణా మివ పూర్వకల్పీయ సమాన నామరూపోపేతత్వే నోత్పద్యమానత్వా న్మహా ప్రళ##యేపి జగతో న నిరవ శేషం (నిర్లేపం) విలయః - కింతు సావశేషమేవ - (వాసనావశేషమేవ) విలయ ఇతి నిశ్చీయతే. సంస్కారాత్మనా అవిద్యాయా మవస్థానాభ##వే పున స్సృష్టౌ పూర్వకల్పీయ ప్రపంచసమాననామరూపత్వం ప్రపంచస్య న స్యాత్ - అత శ్శబ్దార్థయో స్సంబన్ధః ప్రళ##యే ప్యస్తీ త్యభ్యుపగన్తవ్యం - ఆతో నాస్తి శ##బ్దేపి కశ్చి ద్వీరోధః - కథం సమాన నామరూపత్వం నిశ్చీయత ఇతి చేత్ - దర్శనాత్ = శ్రుతౌ తథా దర్శనాత్ - ''సూర్యచన్ద్రమసౌ ధాతా యథాపూర్వ మ కల్పయత్ | దివం చ పృథివీం చాన్తరిక్ష మథోసువః'' ఇత్యాదినా - స్మృతేః - చ = ''ఋషిణాం నామధేయని యా శ్చవేదేషు దృష్టయః | శర్వర్యన్తే ప్రమసూతానాం తా న్యేవైభ్యో దదాత్యజః'' - యథార్తా వృతులింగాని నానారూపాణి పర్యయే దృశ్యన్తే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు - ఇత్యాది స్మృతేశ్చ - అత శ్చ సర్వకల్పానాం తుల్య వ్యవహారత్వాత్ - కల్పాంతర వ్యవహారాను సంధానక్షమత్వా చ్చేశ్వరా ణాం సమాన నామరూపా ఏవ ప్రతిసర్గం విశేషాః ప్రాదుర్భవన్తి - తస్మా జ్జన్మనాశవ ద్విగ్రహాంగీకారేపి కర్మణి - శ##బ్దే చ విరోధాభావా ద్దేవానా మప్యస్తి విద్యాయా మధికార ఇతి సిద్ధమ్.
వివరణము:- మహా ప్రళయమున నీ ముల్లోకములును నామరూపముల నన్నిటిని కోల్పోయి నిరవశేషముగ నశించును, సృష్ట్యారంభ కాలమున తిరిగి నూతనమగు జగత్తు ప్రభవించును, అని శ్రతి స్మృతులలో ప్రతిపాదింప బడుచున్నది. కాన మహా ప్రళయ కాలమున ఆకృతుల (జాతుల) కును నాశము కలదని చెప్పవలయును. కాన ఆ కాలమున శబ్ద ముల కర్థములగు జాతులును నశించిపోయెను గాన శబ్దార్థములకు గల వాచ్యవాచక భావరూప సంబన్దమును అనిత్యమే అని చెప్పవలసి వచ్చును. అందు వలన పూర్వము ప్రతిపాదించిన శబ్దమునందు (వేదమునందు) ప్రమాణ్యభంగ రూప విరోధము సంభవించును అని చెప్పిన ఆక్షేపము పరిహరింప బడలేదు అను ఆశంకకు సమాధానముగా నీ సూత్రమారంభింప బడుచున్నది.
సృష్టి ప్రళయము లెన్నిమారులు తిరిగి తిరిగి ఆ వృత్తములగుచున్నను వర్షములు గడచిపోయి తటాకాదులయందలి జలము లింకిపోయినప్పుడు తద్గతములగు మండూక శరీరములు మృద్భావమును పొంది తిరిగి వర్ష ప్రాదుర్భావము కాగా వెనకటివలెనే సమాన రూపములతో నట విలసిల్లుచున్నట్లు పునస్సృష్ట్యారంభ కాలమున ఇంద్రాగ్న్యాది సమస్త ప్రపంచమున్నూ పూర్వ కల్పీయ సమాన నామ రూపములతో నుత్పన్నమగు చుండుటచేత మహా ప్రళయమునందు ప్రపంచమునకు నిరవశేషమగ ప్రళయమ = నాశము కలదనుట సమంజసము కాదు. ప్రళయము సావశేషమనియే నిశ్చయింప వలయును. మహా ప్రళయకాలమున సంస్కార రూపమున నవిద్యయందు ప్రపంచము లేకున్నచో తిరిగి సృష్ట్యారంభ కాలమున నుత్పన్నమగు ప్రపంచమునకు పూర్వకల్పమునందలి ప్రపంచము యొక్క నామ రూపములతో సమానములగు నామ రూపములు కల్గుట సంభవించక పోవును. కాన శబ్దార్థముల యొక్క సంబన్ధము ప్రళయమునను శేషించి యుండునని యంగీకరింప వలయును. కాన దేవతలకు విగ్రహము కలదని నిశ్చయించిన శబ్దము విషయములో విరోధము సంభవించునను దోషమున కిప్పుడు అవకాశము లేదు. పున స్సృష్టియందు ప్రపంచమునకు పూర్వ కల్పీయ ప్రపంచ సమాన నామరూపత్వ మెట్లు నిశ్చయింపబడినది యనగా శ్రుతియందట్లు కానవచ్చుచుండుటచేతను. స్మృతి వాక్యములను బట్టియును నిట్లు నిశ్చయింపబడుచున్నది.
''సూర్యచన్ద్రసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్ | దివం చ పృథివీం చాన్తరిక్ష మథోసువః'' సృష్టికర్త¸° బ్రహ్మ యథాపూర్వముగ = పూర్వ కల్పమునందలి క్రమము నతిక్రమింపకయె సూర్య చంద్రులను భూర్భువస్సుర్లోకములను నిర్మించెను అని శ్రుతియందు కానవచ్చుచున్నది. అట్లే ''ఋషిణాం నామధేయాని..... భావా యుగాదిషు'' ప్రళ యానన్తరమున నుద్భవించిన ఋషుల యొక్క నామధేయములను - వేదముల విషయమున గల వారి దర్శనములను - వసన్తాదికములగు ఋతువుల యొక్క చెట్లు చిగర్చుట మొదలగు ఆయా అసాధారణ చిహ్నములను, సమస్త పదార్థములను సృష్టికర్తయగు విధాత ఘటీయన్త్రమునందువలె సృష్టి ప్రళయముల పునఃపునరావృత్తియందు తుల్యములుగనే కల్పించెను అని స్మృతియందును కనవచ్చుచు%్‌న్నది. కాన జనన మరణవత్తగు విగ్రహము నంగీకరించినను కర్మయందు గాని, శబ్దమునందు గాని విరోధమేమియు లేదు. కాన దేవతలకు బ్రహ్మ విద్యారూప శాస్త్రమునందధికారము కలదని సిద్ధమగు చున్నది.
31.సూ: మధ్వాది ష్వసంభవా దనధికారం జై మినిః
వివృతిః :- మధ్వాదిషు = వసురుద్రాదిత్యాది దేవా యాసు ధ్యేయతయా శ్రూయన్తే తాసు మధువిద్యాదిషు అనంభవాత్ = వసురుద్రాది త్యాదీనాం దేవానా మధికారో న సంభవతి. న హి ధ్యేయ ఏవ ధ్యాతా భవితుమర్హతి - తస్మాత్ - అనధికారం = బ్రహ్మవిద్యయా మధికారాభావం జైమినిః = జైమిని రాచార్యో మన్యతే -
వివరణము :- ఉపనిషత్తులలో మధువిద్యయను పేరుతో ఆదిత్యుని దేవతలచే ఆస్వాదింపదగిన మధువు (తేనె) గా వర్ణించుచు నొక విద్యవర్ణింపబడియున్నది. ఆ విద్యయందు వసురుద్రాదిత్యాది దేవతలు ధ్యేయవస్తువులుగా ప్రతిపాదింపబడి యుండిరి. ఇటువంటి విద్యలయందు వసురుద్రాదిత్యాది దేవతలకు అధికారము సంభవించదు. దేవతలిచట ధ్యాతవ్యులు గాన (ధ్యానము చేయదగినవారు గాన) అట్టి ధ్యానమున తామే ధ్యాతలుగ (ధ్యానము చేయువారుగ) నుండుట అసంభవము. ధ్యాత, ద్యేయము ఒకరే యెట్లు కాగలరు? కాన బ్రహ్మవిద్యయం దధికారము దేవతలకు కలదనుట యుక్తము కాదని జైమిని మహర్షి తలంచు చున్నారు.
32. సూ : జ్యోతిషి భావా చ్చ
వివృతిః :- నాస్తి బ్రహ్మవిద్యాయాం దేవానా మధికార ఇత్యత్రహేత్వన్తర ముచ్యతే - జ్యోతిషి = అచేతనత్వే నాభిమతే జ్యోతిర్మండలే భావాత్ - చ = ఆదిత్యాది శబ్దానాం లోకే ప్రయోగసద్భావత్ - న చేతనా దేవా ఇతి వక్తుం శక్యతే - తస్మా న్నాస్త్యాదిత్యాదీనాం దేవానా మధికారో బ్రహ్మవిద్యాయాం.
వివరణము:- బ్రహ్మ విద్యయందు దేవతల కధికారము లేదనుటలో హేత్వంతరము ప్రదర్శింప బడుచున్నది. ఆదిత్యాది పదములకు అచేతనముగ ప్రసిద్ధమైన జ్యోతిర్మండలము (తేజోమండలము) నందు ప్రయోగము లోకమున కానవచ్చు చున్నది గనుక దేవతలు చేతనులు (చైతన్యము కలవారు) అని యనుటకు వీలులేదు. కాన ఆదిత్యాది దేవతలకు బ్రహ్మ విద్యయందధికారము లేదనుట యుక్తము.
33. సూ : భావం తు బాదరాయణో೭ స్తి హి
వివృతిః :- తు = అయం తు శబ్దః పూర్యోక్త జైమినిమత నిరాసార్థః - భావం = దేవాదీనాం విగ్రహాదిమత్వేన బ్రహ్మవిద్యాయా మధికారస్య భావం - బాదరాయణః = బాదరాయాణాచార్యో మన్యతే - హి = యస్మాత్ - అస్తి = అస్తి దేవాదీనా మర్థవాదాది ప్రామాణ్యా ద్విగ్రహాది మత్త్వం - అర్థిత్వాద్యధికారకారణం - అప్రతిషేధ శ్చ - యద్యపి దేవాది మిశ్రాసు విద్యాసు దేవానా మధికారో నాస్తి - అనుపపన్నత్వాత్ - తథాపి శుద్ధబ్రహ్మ విద్యాయా మధికారః అస్త్యేవే త్యవగన్తవ్యం - అనుపపత్తేః కస్యా అప్యభావాత్ - న హి క్వచిదిధికారో నాస్తీతి సర్వత్రా నధికారో వక్తవ్యః - అస్తి హి బ్రహ్మణస్య రాజసూయే೭నధి కృతస్యాపి వాజపేయ బృహస్పతిసవాదా వధికారః.
వివరణము: - పూర్యోక్త పక్షము యుక్తము కాదనియు - దేవతలకు విగ్రహము మొదలగు అధికార కారణములు కలవనియు - దేవతలు చెతనులే అనియు- కాన బ్రహ్మవిద్యయం దధికారము వారలకు కలదనియు - బాదరాయణాచార్యులు తలంచు చున్నారు. కారణమేమియన? దేవతలకు విగ్రహాదులు కలవనియు - బ్రహ్మ విద్య ఫలాబికాంక్ష మొదలగు అదికారణసామగ్రి కలదనియు - అర్థవాదములు మొదలగు వేద - భాగములను బట్టి తెలియ వచ్చుచున్నది గనుకనున్నూ - దేవతల కధికార మును నిషేధించు ప్రమాణ వాక్యము కానవచ్చుట లేదు గనుకనున్నూ. విశేషమేమియన దేవతలు ధ్యైయవస్తువులుగా నిరూపింప బడియున్న మధ్వాధి విద్యలలో అనుపపన్నము గనుక ఆ దేవతల కధికారము లేక పోయినను, శుద్ధ బ్రహ్మ విద్యయందు దేవతల కధికారము కలదనియే చెప్పవలయును. అనుపపత్తి (విరోధము) లేదు గనుక. మధువిద్యయం దధికారము లేదస్నంత మాత్రమున ఏ విద్యయందును అధికారములేదని యనరాదు. బ్రహ్మణునకు రాజసూయ యాగమున నధికారము లేకున్నను వాజపేయ బృహస్పతి సవాది యాములయం దధికారము కలదుకదా! అట్లె దేవతలకు శుద్ధ బ్రహ్మవిద్యలయందధికారము కలదనుట యుక్తమని బాదరాయణాచార్య మతము.
34. xqsW : శుగస్య తదనాదరశ్రవణా త్తదాద్రవణా త్సూచ్యతే హి
వివృతిః :- యథా మనుష్యధికార మియమ మపోద్య దేవాదీనామపి విద్యా స్వధికార ఉక్త స్తథైవ ద్వీజాతి నియమాపవాదేన శూద్రస్యాప్యధికార స్స్యాదిత్యేవ మాశంకాం నివర్తయితు మిద మధికరణ మారభ్యతే - శూద్రాణాం బ్రహ్మవిద్యాయా మధికారోస్తి. అధికారకారణస్య తదర్థిత్వదే స్తత్ర సత్వాదితి పూర్వపక్షిణా మాశయః. సిద్ధాన్తిన స్తు సత్వే ప్యర్థిత్వే వేదాధ్యయన తదర్థజ్ఞానరూప సామర్థ్య స్యాభావాత్ - తేషాం నాధికారో బ్రహ్మవిద్యాయా మిత్యుపపాదయన్త శ్ఛాందోగ్యే సంవర్గ విద్యా ప్రకరణ - ''ఆహా హారేత్వా శూద్రతవైవ సహగోభి రస్తు'' ఇతివాక్యే శ్రుత శ్శూద్రశబ్దస్తు న జాతి శూద్ర పర ఇత్యపి వర్ణయన్తి - తస్యశూద్రశబ్దస్యజాతి శూద్రపరత్వ తదభావా వత్ర వివ్రియేతే (సూత్రార్థ స్తు) అస్య = జానశ్రుతేః క్షత్రియస్య - తదనాదరశ్రవణాత్ = తేషాం హంసరూపాణాం మునీనాం పుణ్య కర్మాణం జానశ్రుతిం ''క మప్యేనం వరాకం విద్యహీనం సయుగ్వానం రైక్వ మివాత్థ....'' ఇత్యాది వాక్యేన బోధయితుం కృత స్యానాదరస్య శ్రవణాత్ - శుక్ = యశ్శోక ఉత్పన్నః - తదాద్రవణాత్ = తయా = శుచా = ఆద్రవణం = జానశ్రుతేః రైక్వంప్రతి గమనం. తస్మాత్ శుచా దుద్రావేతి వ్యుత్పత్తి మభిప్రేత్య శూద్రశబ్దః క్షత్రియే జానశ్రుతౌ రైక్వేణ ప్రయుక్తః - హి = యస్మాత్ - సూచ్యతే - జానశ్రుతేః రాజ్ఞ శ్శుగుత్పన్నా - తయాచాసా వత్రాగత ఇత్యయ మర్థః క్షత్రియే రైక్వేణ మునినా ప్రయుక్తేన శూద్రశ##బ్దేన సూచ్యతే స్వస్య సర్వజ్ఞత్వఖ్యాపనాయ. అతో೭త్రత్య శూద్రశ బ్దోన జాతి శూద్రపర ఇతి. తతశ్చ శూద్రస్య బ్రహ్మవిద్యాయా మధి కారోస్తీతి న యుజ్యతే వక్తు మితి సిద్ధమ్.
వివరణము :- మనుష్యులకే బ్రహ్మవిద్యాది రూపమగు శాస్త్రము నందధికారము అను నియమము లేదని. ఆ నియమము నతిక్రమించి దేవాదులకును విద్యలయం దధికారము కలదని యెట్లు నిరూపింపబడెనో అట్లే ద్విజులగు వారికే ఆ అధికాము అను నియమమును తొలగించి శ్రూద్రునకు గూడ బ్రహ్మవిద్యయందధికారము కలదని చెప్పవచ్చునా ? అనునాశంకను నివర్తింపజేయుటకే ఈయధికరణమారంభింపబడుచున్నది, శూద్రులకు బ్రహ్మవిద్యయందధికారము కలదు, అధికారి కారణమగు - బ్రహ్మ విద్యర్థిత్వ తత్ఫలార్థిత్వము లాతనియందు కలవు గనుక అని పూర్వ పక్షుల ఆశయము. సిద్ధాంతపక్షము వారిట్లనుచున్నారు. వారికి బ్రహ్మవిద్యార్థిత్వమున్నను వేదాధ్యయనము - తదర్థాభిజ్ఞత్వము అను సామర్థ్యము లేదు గనుక బ్రహ్మవిద్యయం దధికారము లేదని ప్రతిపాదించుచు - ఛాన్దోగ్యము నందలి సంవర్గ విద్య ప్రకరణములోని ''అహ హారేత్వా శూద్రతవైవ సహగోభిరస్తు'' ఈ వాక్యములో రైక్వమహర్షి బ్రహ్మ విద్యార్థియగు జానశ్రుతిని శూద్రఅని సంబోదించి - ఓ శూద్ర హారముతో = నిష్కముతో గూడిన ఈ రథము గోవులతో సహా నీకే అగుగాక అనిపల్కెను. (ఈ వాక్యములోని అహ అను పదము ఖేదార్థకమగు నిపాతము - అయ్యో! అని దాని కరము చెప్పవలును) ఈ వాక్యములోని శూద్ర శబ్దము జాతి శూద్రుని బోధించునది కాదు అని. (జానశ్రుతి యను మహారాజు సౌధోపరి భాగమున నుండ నొకనాడు మాలాపూపముగా నాపై ప్రయాణించుచున్న హంసలలో నొక హంస మరియొక దానితో నిట్లనియెను.
ఓయీ చూచితివా ఆ మహాభాగుని జానశ్రుతి మహారాజును అని. అంత రెండవ హంస మొదటిదానితో - ఇతడేమిలెక్క - గ్రుడ్డిగవ్వవంటివాడు. ఇంతకంటె నెంతయో నుత్కృష్టమైనవాడు ఆరైక్వుడు అని బదులు పల్కెను. ఈ ప్రసంగమును విని తన నికృష్టత్వమునకు శోకము నంది జానశ్రుతి మహారాజు గోసహస్రమును, నిష్కముతో గూడిన రథమును ఉపాయనము = కానుకగా తీసికొని మహాత్ముడగు రైక్వుని సమీపమునకు వెళ్ళి బ్రహ్మవిద్య నుపదేశించి యనుగ్రహింపుమని వేడుకొనెను. అప్పుడు రైక్వుడిట్లనెను. ''అహ హారే త్వా శూద్ర ....'' అని. ఇది ఉపనిష ద్గ్రంథమునందలి ఆఖ్యాయిక.)
సూత్రార్థము :- జానశ్రుతి మహారాజునకు హంస రూపమున వచ్చిన మహర్షులు పుణాత్మకుడగు ఆ రాజునకు జ్ఞానమును కలుగ జేయుటకై ''కమప్యేనం వరాకం విద్యహీనం సయుగ్వానం రైక్య మివాత్థ'' ఒక హంసతో ''విద్యహీనుజు, గ్రుడ్డి గవ్వవంటి వాడునగు నీతనిని మహాత్ముదగు రైక్వునివలె వర్ణించుచున్నావేమి ?'' అని చెప్పుచు చేసిన ప్రసంగములోని తనకు సంబంధించిన అనాదరణమును వినుటవలన రాజునకు శోకము కలిగెను. అంతనా శోకముతో ఆ రాజు బ్రహ్మవిద్యాభిలాష గలవాడై రైక్వ మహర్షిని గూర్చి వెళ్ళెను. ఆ సంగతిని గుర్తించి తనకు గల సర్వజ్ఞత్వమును ఖ్యాపన చేయుటకై రైక్వమహర్షి క్షత్రియుడగు జానశ్రుతిందు శూద్ర అను సబ్దమును ప్రయోగించెను. శుచా - దుద్రాప - ఇతి = శూద్రః - శోకము కలిగి వచ్చెను అను అర్థము ''శూద్ర'' అను సబ్దముచే సూచించ బడుచున్నది. కాన నిచట వాడబడిన శూద్రపదము జాతి శూద్రపరముకాదు. కనుక శూద్రునకు బ్రహ్మ విద్య యందధికారము లేదని సిధ్ధమగు చున్నది.
35. సూ : క్షత్రియత్వగతే శ్చోత్తరత్ర చైత్రరథేన లింగాత్
వివృతిః :- జానశ్రుతి ర్న జాతిశూద్ర ఇత్యత్ర యుక్త్యన్తర ముచ్యతే - చ = కించ ఉత్తరత్ర = సంవర్గవిద్యా వాక్యశేషే - చైత్రరథేన = ప్రసిద్ధక్షత్రియేణ - అభిప్రతారిణా సహ - లింగాత్ = సమభివ్యాహారాత్మకా ల్లింగాత్ (సమానజాతీయానా మేవ ప్రాయేణ సమభివ్యహారాః = సహావస్థానాదీని సంభవన్తీతి భావః) క్షత్రయత్వగతేః = క్షత్రియత్వస్య అవగమాత్ - న జానశ్రుతి ర్జాతిశూద్రః.
వివరణము :- జానశ్రుతి జాతిశూద్రుడు కాదనుటలో మరియొక యుక్తి చెప్పబడు చున్నది. సంవర్గ విద్యాప్రకరణములోని పై గ్రంథములో ప్రసిద్ద క్షత్రీయ జాతీయుడగు చైత్రరథుడగు ప్రతారితో కలసి వ్యవహరించుట వర్ణింప బడినది - ఆ కారణమువలన జానశ్రుతియు క్షత్రియుడే అని తెలియబడు చున్నది గనుక జానశ్రుతి జాతి శూద్రుడు కాదు. (లోకములో తరచుగ సమాన జాతీయులగు వరలేక కలసి వ్యవహా రించు చుండుట ప్రసిద్ధము)
36 .సూ : సంస్కారపరామర్శా త్తదభావాభిలాపా చ్చ
వివృతిః :- చ = అపిచ - శూద్రస్య నాస్త్యధికారో బ్రహ్మవిద్యాయా మిత్యత్ర కారణాంతర ముచ్యతే - సంస్కారపరామర్శాత్ = విద్యాప్రదేశేషు ఉపనయనాదయ స్సంస్కారాః ''తం హోపనిన్యే'' ఇత్యాదినా పరామృశ్యన్తే - తస్మాత్ - తదభావాభిలాపాత్ = శూద్ర శ్చతుర్థోవర్ణ ఏకజాతిః - ఇత్యేక జాతిత్వ స్మరణన - ''న శూద్రే పాతకం కించిన్న చ సంస్కారమర్హతి'' ఇత్యాదినా సంస్కారభావాభిధానా చ్చ నాస్తి బ్రహ్మవిద్యాయాం శూద్రస్యాధికారః.
వివణము :- శూద్రమునకు బ్రహ్మవిద్యయం దధికారము లేదనుటలో మరియొక యుక్తిని ప్రదర్శించు చున్నారు. విద్యా ప్రకరణములలో ఉపనయనాది సంస్కారములు ''తం హోపనిన్యే'' ఆ విద్యార్థిని ఉపనయన సంస్కారముతో సంస్కరించెను'' అను నిట్టి వాక్యములలో పరామర్శింప బడుచున్నవి కానను, ''శూద్ర శ్చతుర్థో వర్ణ ఏకజాతిః'' ''న శూద్రే పాతకం కించి న్న చ సంస్కార మర్హతి'' ఇత్యాది గ్రంథములలో శూద్రునకు సంస్కారములు లేవని చెప్పబడి యుండుటచేతను శూద్రునకు బ్రహ్మ విద్యయందధికారము లేదని నిర్ణయింప బడుచున్నది.
37. సూ : తదభావనిర్ధారణ చ ప్రవృత్తేః
వివృతిః :- చ = అపిచ - తదభావనిర్థారణ - ''నైత దబ్రాహ్మణో వక్తు మర్హతి'' ఇత్యాదినా సత్యకామస్య సత్యవచనేన శూద్రత్వాభావనిర్ధారణ సంపన్నే సత్యేవ పశ్చాత్ -ప్రవృత్తేః = గౌతమస్య తదుపనయన, అనుశాసనయోః ప్రవృత్తత్వా చ్చ న శూద్రస్యాధికారః.
వివరణము :- మరియు జాబాలుడు సత్యకాముడను బాలుడు సత్యమును పల్కుటతో అతడు శూద్రుడుకాదని నిర్ధారణము జేసికొని యాతరువాతనే గౌతమమర్షి - అతనికి ఉపనయన సంస్కారము చేయుటకును, విద్యోపదేశము చేయుటకును ప్రవర్తించెను. కానను శూద్రునకు బ్రహ్మ విద్యయం దధికారము లేదని తేలుచున్నది.
38. సూ : శ్రవణా ధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ
వివృతిః :- చ = ఇపిచ - స్మృతేః = ''అత హాస్య వేద ముపశృణ్వత స్త్రపుజపుభ్యాం శ్రోత్రప్రతిపూరణం'' ''పద్యు హ వా ఏతత్ శ్మశానం - యాచ్ఛూద్రః- తస్మా చ్ఛూద్రసమీపే నాధ్యేతవ్యం'' - ''న శూద్రాయ మతిం దద్యాత్ - ఇత్యాదిస్మృతేః శ్రవణాధ్యయ నార్థవ్రతి షేధాత్ = వేదశ్రవణస్య - తదధ్యయనస్య - తదర్థయో రర్థజ్ఞాన తదను ష్ఠానయో శ్చ ప్రతిషిద్ధత్వాత్ - శూద్రాణాం విద్యాసాదనే ష్వే వాధికారా భావా ద్విద్యా స్వపి నాస్త్య ధికార ఇతి - ''శ్రవయే చ్చతురో వర్ణాన్'' ఇతి ఇతి స్మృత్యనుసారే ణ తిహాస పురాణాధిగమే చాతుర్వర్ణ్యా ధికారస్మరణాత్ వేదరపూర్వక స్త్వధికారో నాస్తి శూద్రాణా మితి స్థితం.
వివరణము :- మరియు ''అథ హాస్య.... ప్రతిపూరణం'' - ''పద్యుహవా.... నాధ్యేతవ్యం'' - నశూద్రాయ మతిం దద్యాత్'' ఇత్యాదిస్మృతు లలో వేదశ్రవణ - తదధ్యయన - తదర్థజ్ఞాన - తదనుష్ఠానములు ప్రతిసిద్ధములై యుండుటవలన శూద్రులకు విద్యా సాధముల యందే అధికారము లేకపోవుట వలన - బ్రహ్మ విద్యల యందును అధి కారములేదనియు ''శ్రావయే చ్చతురో వర్ణాన్'' నాలుగు వర్ణముల వారికిని వినిపించ వలయును అను స్మృతి వాక్య ప్రామాణ్యము ననుసరించి ఇతిహాస పురాణాదుల ద్వారా జ్ఞానము నార్జించుటలో నాలుగు వర్ణముల వారికిని అధికారము కలదనియు నేర్పడుచున్నది. వేద పూర్వకమగు అధికారము లేదని మాత్రము నిర్ణయము.
కంపనాధికరణమ్ 10
39. సూ : కంపనాత్
వివృతిః :- ప్రాసింగికః అధికారవిచార స్సమాపితః - ఇదానీం పరమప్రకృతో వాక్యర్థవిచార అనువర్తయిష్యతే - కఠవల్లీషు శ్రూయతే - ''యదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం'' ఇతి. అత్ర మన్త్రే శ్రూయమాణః ప్రణశబ్దః - వాయురూపప్రాణపరో వా ? పరమాత్మ పరో వేతి సంశ##యే పరమాత్మ పర ఏవేతి నిర్ణీయతే కుతః ? కంపనాత్ = జగ త్సర్వం ప్రాణ ఏజతి'' ఇతి సవాయుకస్య జగతః సర్వస్య జీవ నాదిచేష్టాహేతుత్వర్ణనాత్ - పరమాత్మనో జీవనాది చేష్టాహేత్వం చ 'న ప్రాణన సాపానేన మర్త్యో జీవతి కశ్చన - ఇతరేణ తు జీవంతి యస్మి న్నేతా వుపాశ్రితౌ'' ఇత్యాది శ్రుతిషు ప్రసిధ్ధం - అతో೭త్రత్యః ప్రాణసబ్దః పరమాత్మపర ఏవ.
వివరణము:- ప్రసంగాగతమైన విద్యాధికారమను గూర్చిన విచారము సమాప్తమైనది. ఇక ప్రకృతమగు వాక్యర్థ విచారము చేయబోవు చున్నారు. కఠోపనిషత్తునందు ''మదిదం కించ జగ త్సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం'' ప్రాణాఖ్యమగు బ్రహ్మనుండి ఉత్పన్నమైన ఈ సర్వ ప్రపంచమును, చిదాత్మకమగు ప్రాణము ప్రేరకమగుచు నుండగ తాను (ఏజతి = చేష్టతే) జీవనాది వ్యపారము కలదియగుచున్నది. అను నొక మంత్రము కలదు. ఈ మంత్రములో వినవచ్చుచున్న ప్రాణశబ్దము వాయురూప ప్రాణపరమా? లేక పమాత్మ పరమా అని సంశయము రాగా పరమాత్మ పరనే అని నిర్ణయింప బడుచున్నది. ఏలయన? ''జగత్సర్వం ప్రాణ ఏజత'' అను వాక్యములో వాయువుతో సహ సర్వ జగత్తునకున్నూ జీవనాది చేష్టాహేతుత్వము ప్రాణ పదార్థమునకు వర్ణింపబడినది. జీవనాది చేష్టాహేతుత్వము పరమాత్మకు సంబంధించినదియే గాని వాయురూప ప్రాణాదులకు సంబంధించినది కాదని ''న ప్రాణన నాపానేన.... పుపాశ్రితౌ'' మానవులు - ప్రాణాపానాదివాయు సహాయమునగాదు జీవించుట - ఈ ప్రాణా పానాదులు దేనిచయందు ఉపాశ్రితములై యుండెనో అట్టి ప్రాణాపాన విలక్షణమగు పరమాత్మ వస్తువు చేతనే జీవించు చున్నారు. అను నిట్టి శ్రుతి వాక్యుములలో ప్రసిధ్ధమై యుండెను. కాన నీ మన్త్రములోని ప్రాణ శబ్దము పరమాత్మ పరమే యగును.
జ్యోతిరధికరణమ్ 11
40. సూ : జ్యోతి ర్దర్శనాత్
వివృతిః :- జ్యోతిః = ఛాన్ఢోగ్యే ప్రజాపతివిద్యాయాం ''స ఏష సంప్రసాదో7స్మా చ్ఛరీరాత్సముత్థాయ పరంజ్యోతి రుపసంపద్య స్వేనరూపే ణాభినిష్పద్యతే'' ఇత్యత్ర శ్రూయమాణః జ్యోతి శ్శబ్దో నాదిత్యాది తేజోవిషయకః - కింతు పరబ్రహ్మ విషయక ఏవ. కుతః ? దర్శనాత్ = ''య ఆత్మా7పహతపాప్మా'' ఇత్యుపక్రమ పర్యాలోచనేన బ్రహ్మణ ఏవాత్ర ప్రతిపాద్యతయా ೭నువృత్తే ర్దర్శనా దితి.
వివరణము :- ఛాన్దోగ్యోపనిషత్తు నందలి ప్రాజాపత్య విద్యాప్రకరణమున గల ''స ఏష సంప్రసాదో.... భినష్పద్యతే'' అను నీ వాక్యములోని ''జ్యోతిః'' అను శబ్దము ఆదిత్యాది తేజస్సులను బోధించునది కాదు. పరబ్రహ్మ వస్తువును బోధించునదియే. ఏలయన ? ''య ఆత్మా7పహతపాప్మా'' అను పరమాత్మను బోధించు వాక్యములో నీ ప్రకరణ మారంభింప బడినది. ఇట్టి ఉపక్రమము (ప్రారంభము) ను బట్టి యాలోచించిన పరబ్రహ్మయే ఈ వాక్యమునను ప్రతిపాద్యుముగా ననువర్తించియున్నట్లు స్పష్టముగా తెలియ బడుచున్నది. కనుక అదిత్యాది భౌతిక తే జస్సిచట ప్రతిపాదింప బడుచున్నది యని అనుట యుక్తము కాజాలదు. కాన నిచటి జ్యోతిః పదము పరబ్రహ్మ పరమే.
అర్థాన్తరత్వాదివ్యపదేశాధికరణమ్ 12
41. సూ : ఆకాశో7 ర్థాన్తరత్వాది ప్యపదేశాత్
వివృతిః :- ఆకాశ = ఛాన్దోగ్యే ''ఆకాశో హవై నామ నామరూపోయో ర్నిర్వహితా'' ఇత్యత్ర శ్రూయమాణ ఆకాశశబ్దః - న భూతాకాశపరః - కింతు పరమాత్మపర ఏవ - కుతః ? అర్థాంతరత్వాది వ్యపదేశాత్ = ''తే యదన్తరా తబ్బ్రహ్మ ఇతి వాక్యేనోక్తస్య నామరూపాభ్య మర్థాన్తరత్వస్య, తన్నిర్వాహకత్వస్య చాకాశే వ్యపదేశదర్శనాత్ - నహిప్రసిధ్దాకాశే నామ రూపాభ్యామన్యత్వం - తన్ని ర్వాహకత్వంచ సంభవతి - ఆదిశ##బ్దేన వాక్య శేషస్థ ''తద్ర్బహ్మ - తదమృతం - స ఆత్మా ఇత్యాది వ్యపదేశోపి గ్రాహ్యః - నహి భూతాకాశే బ్రహ్మత్వ అమృతత్వా ద్యుపపద్యతే. అతో7 త్రాగాశః పరమాత్మైవ - ఇతి.
వివరణము:- ఛాన్దోగ్యపనిషత్తు నందలి ''ఆకాశో హ వై నామ నామపూపయో ర్నిర్వహితా'' అను నీ వాక్యములోని ''ఆకాశః'' అను శబ్దము పంచభూతములలో నొకటియగు భూతాకాశమును భోధించునది కాదు. పరమాత్మను బోధించునదియే. ఏలయన? ప్రకృతమగు ఆకాశభ్దముచే ప్రతిపాదిపంబడు వస్తువును గూర్చి వివరించు ఆ ప్రకరణములోని ''తే యదన్తరా తద్బ్రహ్మ'' అను వాక్యము నామరూపములు దేనియందు కల్పితములై యుండెనో - అది బ్రహ్మ అని ప్రతిపాదించుచు ఆకాశశబ్దార్థమైన వస్తువు నామరూప విలక్షణమైన పదార్థమని నిరూపించెను. పై వాక్యములో ప్రతిపాదింపబడిన నామరూప నిరాహకత్వము, ఈ వాక్యములో చెప్పబడిన నామరూప విలక్షణత్వము ప్రసిద్ధమగు భూతాకాశమునందు సంభవించవు, భూతాకాశము నామరూపాత్మక ప్రపంచాంతర్గమైనదియే గదా - ఇట్లే ఆప్రకరణములోని ''తద్బ్రహ్మ - తదమృతం - స ఆత్మా'' ఇత్యాది వాక్యములలో వర్ణింపబడిన బ్రహ్మత్వ - అమృతత్వ - ఆత్మత్వములును భూతా కాశమునందు సంభవించ నేరవు, కాన నిచట కానవచ్చు ఆకాశశబ్దము పరమాత్మ వస్తువును బోధించునదియే యగును.
సుషుప్త్యుత్క్రాన్త్యధికరణమ్ 13
42. సూ : సుషుప్త్యుత్క్రాన్త్యో ర్భేదేన
వివృతిః :- బృహదారణ్యకే శ్రూయతే - ''కతమ ఆత్మేతి యోయం విజ్ఞానమయః ప్రాణషు హృద్యన్తర్జ్యోతిః పురుష?'' ఇత్యాది - తదిదం వాక్యం సంసారిణో జీవస్య స్వరూపం ప్రతిపిపాదయిషతి - ఉత సంసారి స్వరూపానువాదే నాసంసారిణో బ్రహ్మణ స్స్వరూపం ప్రతిపిపాదయిష తీతి సందేహే - న జీవస్వరూప ప్రతిపాదనపర మిదం వాక్యం - కింతు - విజ్ఞానమయస్య సుషుప్తా ద్యవస్థావ జ్ఞీవస్వరూపానువాదేన బ్రహ్మాభేద ప్రతిపాదన పర మేవేతి నిర్ణీయతే - కుతః ? సుషుప్త్యుత్క్రాన్త్యోః - భేదేన = ''ప్రజ్ఞే నాత్మనా సంపరిష్వక్తో న బాహ్యం కం చన వేదేనాంతరం'' ఇతి సుషుప్తౌ పరమాత్మన శ్శారీరా ద్భేదేన వ్యపదేశాత్ - తథా ''ప్రాజ్ఞే నాత్మ నాన్వారూఢ ఇత్సర్జమ్ యాతి'' ఇత్యుత్క్రాన్తౌ చ శారీరా ద్భేదేన పరమాత్మనః ప్రాజ్ఞశ##బ్దేన వ్యపదేశా చ్చేత్యర్థః. అస్య వాక్య జాతస్య మధ్యే అత ఊర్ధ్వం విమోక్షా యైవ బ్రూహీతి - పదేపదే ప్రశ్నః - తత్సమాధానతయా ''అనన్వాగత స్తేన భవతి - అసంగోహ్యయం పురుషః'' ఇత్యాది ప్రతివచనం చ దృశ్యతే - ఏతాదృశ ప్రశ్న ప్రతివచన. ఉపక్రమోపసంహారాదిభ్యః - పరమాత్మ పరత్వ మస్యవాక్యస్య స్పష్ట మవగమ్యతే.
వివరణము :- బృహదారణ్య కోపనిషత్తునందలి షష్ఠాధ్యాయములో ''కతమ ఆత్మేతి'' అహం- అహం - (నేను- నేను) అని వ్యవహరింపబడుచున్న ప్రాణహబుద్ధ్యాదులలో నేది ఆత్మ యని జనకుడు ప్రశ్నింప యాజ్ఞవల్క్యు డిట్లు చెప్పెను. ''యోయం విజ్ఞానమయః ప్రాణషు హృద్యన్తర్జ్యోతిః పురుషః'' అని. వాక్యములో - ప్రాణములలో (ప్రాణశబ్దముచేత ఉచ్ఛ్వాసనిశ్శ్వాసరూపమగు ముఖ్యప్రాణము, ఇంద్రియములు గూడచెప్పబడును. వానిలో) బుద్ధిమయమైన పరిపూర్ణమైన హృదయాన్తర్గత జ్యోతిస్సు ఆత్మ యని చెప్పెను. (ప్రాణములలో అని, బుద్ధిమయుడు అని చెప్పుటతో ఆత్మవస్తువు బుద్ధి ప్రాణభిన్నము అని తెలియబడుచున్నది.) ఈ వాక్యము సంసారియగు జీవాత్మ యొక్క స్వరూపమును ప్రతిపాదింప బూనినదా ? లేక సంసారి స్వరూపము ననువదించి ఆసంసాయగు బ్రహ్మయొక్క స్వరూపము ప్రపాదింప బూనినదా అని సందేహము రాగా జీవస్వరూపమును ప్రతిపాదించుటకై ఈ వాక్యము ప్రవర్తించ లేదు, సుషుప్త్యాద్యవస్థలతో గూడికొనియుండు జీవాత్మస్వరూపము ననువదించి యాతనికి బ్రహ్మభేదమును బోధించుట యందే ఈ వాక్యమునకు తాత్పర్యము అని యిచట నిర్ణయింప బడుచున్నది. ఏలయన ? ఆ ప్రకరణములోని ''ప్రాజ్ఞే నాత్మనా సంపరిష్యక్తో .... నాంతరం'' ఈ వాక్యము సుషుప్తియందు జీవుడు పరమాత్మతో నేకీ భావమును పొందినవాడై బాహ్యమగు విశేష విజ్ఞానము గాని, అంతరమగు విశేష విజ్ఞానము గాని లేనివాడు యుండునని చెప్పుచు జీవాత్మను పరమాత్మకంటె వేరైన వానినిగ ప్రతిపాదించు చున్నది. ఇట్లే ''ప్రాజ్ఞే నాత్మనా7న్వారూఢ ఉత్సర్జన్ యాతి'' ఈ వాక్యమును ఉత్క్రాంతి సమయమున (మరణ సమయమున) శరీరస్వామియగు జీవుడు పరమాత్మ నధిష్టించి (పరమాత్మతో నేకీ భవము నొంది) తత్కాల సంబంధమగు వేదనలకు కుందుచు ఘోరమగు శబ్దములను చేయుచు పయనించునని చెప్పచు జీవాత్మను పరమాత్మకంటె వేరైన వానినిగ ప్రతిపాదించుచున్నది. ఈ వాక్య సందర్భమున మధ్యలో ''అత ఊర్థ్వం విమోక్షాయైవ బ్రూహి'' ఈ పైన మోక్షోపయోగియగు విషయమును చెప్పుము అనుచు మాటిమాటికి ప్రశ్నించు చుండుయు, దానికి సమాధానముగా ''అనన్వాగత స్తేన భవతి - అసంగో హ్యయం పురుషః'' ఈ ఆత్మ వస్తువు పూర్వావస్థను గడచి ఉత్తరావస్థను పొందగా పూర్వావస్థాగత పుణ్య పాపాదులతోనను బంధించక యుండును, ఊ పరిపూర్ణుడగు పరమాత్మ అసంగ స్వభావుడు గదా అని చెప్పుచున్న ప్రతి వచనములును కాన్పించు చున్నవి. ఇట్టి ప్రశ్న ప్రతివచనములను, ఈ ప్రకరణము యొక్క ఉపక్రమోపసంహారాదులను బట్టి విచారింప ఈ వాక్యమునకు పరమాత్మయందే తాత్పర్యమని స్వష్టముగా తెలియబడుచున్నది.
43. సూ : పత్యాదిశ##బ్దేభ్యః
వివృతిః :- పత్యాదిశ##బ్దేభ్యః = ''సర్వస్ వశీ - సర్వస్యేశానః - సర్వ స్యాధిపతిః'' ఇత్యసంసారిత్వ ప్రతిపాదకేభ్యః పత్యాది శ##బ్దేభ్యః - ''స న సాధునా కర్మణా భూయాన్ - నో ఏవాసాధునా కనీయాన్'' ఇత్యాదిభ్య స్సంసారిత్వ నిషేధకేభ్య శ్శబ్దేభ్య శ్చాసంసారి పరమాత్మ పరమే వేదం వాక్ మితి సమంజసం.
ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితాయాం బ్రహ్మసూత్రవివృతౌ ప్రథమధ్యాయస్య తృతీయః పాదః
వివరణము :- మరియు నీ ప్రకరణములోని ''సర్వస్యవశీ - సర్వ స్యేశానస్సర్వస్యాధిపతిః'' సర్వమును స్వాయత్త పరచుకొనినవాడు - (పరాధీనుడు కానివాడు) సర్వమునకు నియంత - సర్వమునకు పరిపాలకుడు అను నిట్టి అసంసారియగు పరమాత్మను బోధించు పతి, ఈశాన మొదలగు పదములను బట్టియు - '' స న సాధునా కర్మణా భూయాన్. నో ఏ వాసాధునా కనీయాన్'' ఆతడు పుణ్యకర్మలచే వృద్ధిని గాని - పాపకర్మలచే హ్రాసమును గాని పొందువాడు కాదు అని ఆ వస్తువు పరమాత్మయే గాని - జీవాత్మ కాదని బోధిదంచు ఇట్టి శబ్దములను బట్టియు- ఆసంసారియగు పరమాత్మ తత్త్వమునందే యీ వాక్యమునకు తాత్పర్యమని యనుట యుక్తము.
ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయతివర
విరచిమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున ప్రథమాధ్యాయమున
తృతీయ పాదము ముగిసెను.
ప్రథమాధ్యాయస్య - చతుర్థః పాదః
బ్రహ్మజిజ్ఞాసాం ప్రతిజ్ఞాయ జన్మాద్యస్య యత ఇతి బ్రహ్మణో లక్షణ ముక్తం. తల్లక్షణం ప్రధానే೭తివ్యాప్త మిత్యాశంక్య ''ఈ క్షతే ర్నా೭శబ్దం శబ్దత్వేవ తా మాశంకా మపోద్య గతిసామాన్యం చ వేదాన్తానాం బ్రహ్మకారణవాదం ప్రతి విద్యతే న ప్రధానకారణ వాదం ప్రతీతి ప్రపంచితం గతేన గ్రంథేన. ఇదానీం తు ప్రధానస్య యదశబ్దత్వం పూర్వముక్తం తన్నోప పద్యతే, కాను చిచ్ఛాఖాసు ప్రధానప్రతిపాదకానాం శబ్దానాం శ్రూయమాణత్వా దిత్యాక్షేపే సమాపన్నే తేషాం శబ్దానా (పదానా) మన్యపర్వతం ప్రతిపాదయితు మయం పాద ఆరభ్యతే.
ఆనుమాని కాధికారణమ్ 1
1. సూ : ఆనుమానిక మప్యేకేషా మితి చేన్న శరీర రూపక
విన్యస్త గృహీతే ర్దర్శయతిచ
వివృతిః :- ఏకేషాం = ఏకేషాం శాఖినాం = కఠానా ముపనిషది ''మహతః పర మవ్యక్త మవ్యక్తా త్పురుషః'' ఇతి వాక్యే అవ్యక్త శ##బ్దేన - ఆనుమానికం - అపి = అను మానైక వేద్యం సాంఖ్యస్మృత్యుక్తం ప్రధాన మప్త్యుక్తం - అత స్తస్య ప్రధాన స్యేక్షత్యధికరణోక్తం యదశబ్దత్వం తదసిద్ధం - ఇతి - చేత్ = ఇత్యుక్తం చేత్ - న = ప్రధానం శబ్దప్రతి పాద్యం న భ##వేదేవ - కుతః? రూపకవిస్యస్తగృహీతేః = ''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ మేవ చ'' ఇత్యాది పూర్వవాక్యే రథరూపకేణ విన్యస్తస్య = కల్పితస్య శరీర స్యాత్రావక్తశ##బ్దేన గృహణాత్. కథం తదవ్యక్త శబ్దగ్రాహ్యం శరీరం భవతీ త్యత ఆహ - దర్శయతి - చ = ''ఆత్మానం రథినం విద్ధి'' ఇత్యా ద్యనంతరాతీతో గ్రంథో೭ము మేవార్థం దర్శయతి చ - ఇత్యేవం ప్రధానస్యా ప్యేతద్వా క్యావలంబనేన వేదశబ్ద సమధిగమ్యత్వ మస్త్విత్యేషా శంకా నిరాకృతా.
తత్రైవం రూపక కల్పనాదిప్రకారః
విష్ణు పదం రథరూపకకల్పనా
1) ఆత్మా 1) ఆత్మా రథీ
2) అవ్యక్తం 2) శరీరం రథః
3) మహత్ (బుద్ధిః) 3) బుద్ధిః సారథిః
4) మనః 4) మనః ప్రగ్రహః
5) ఇంద్రియాణి 5) ఇంద్రియాణి హయాః
6) విషయాః 6) విషయాః గోచరాః
యద్య ప్యత్రోభయ త్రాత్మాదయః పదార్థా స్తత్తత్ స్థానే సమానాను పూర్వ్యైవోక్తాః తథా ప్యేకత్ర ద్వితీయ స్థానే - అవ్యక్త మిత్యస్య నిర్దేశః కృతః - అన్యత్ర తు తస్మిన్నేవ స్థానే శరీర మిత్యస్య నిర్థేశః కృతః - తతశ్చ ప్రథమ శ్రేణ్యా ముక్తా ఏవ పదార్థా ద్వితీయశ్రేణ్యా మపి ప్రాయః పరిగృహ్యన్త ఇతి ద్వితీయ స్థానే ప్రథమ శ్రేణ్యా ముక్తావ్యక్తశ##బ్దేన ద్వితీయ స్థానే ద్వితీయ శ్రేణ్యా ముక్తశరీర సై#్యవ పరిగ్రహోయుక్తోన ప్రధానస్య - అవ్యక్త శ##బ్దేన ప్రధానస్య పరిగ్రహే అప్రకృత ప్రక్రియా ప్రసక్తి ర్భవే త్ర్ఫధాన స్యాత్రాప్రకృతత్వాత్ - తస్మా న్న ప్రధానస్య వైదిక శబ్దవిషయత్వం.
బ్రహ్మ విచార శాస్త్రము నారంభించుచున్నామని ప్రతిజ్ఞచేసి విచార్యమగు బ్రహ్మ వస్తువు యొక్క లక్షణము ''జన్మా ద్యస్య యతః'' అని వివరింపబడినది. ఆ లక్షణము అనగా జగజ్జన్మస్థితి లయ కారణత్వము సాంఖ్యశాస్త్ర ప్రసిద్ధమైన ప్రధాన తత్త్వమునందున వర్తించుచున్నది గాన ఆతి వ్యాప్తి దోషగ్రస్తమగుచున్నది యని ఆశంకించుకొని ''ఈక్షతే ర్నా೭శబ్దం'' అను సూత్రములో శ్రుతులయందు జగత్కారణముగా వర్ణింప బడిన వస్తువు ఆ ప్రధానము కాదని నిరూపించి అతి వ్యాప్తి దోష శంకను పరిహరించి సమస్త వేదాంతములకును బ్రహ్మకారణ వాదము (సర్వజ్ఞ మగు బ్రహ్మ వస్తువే జగజ్జన్మ స్థితిలయ కారణము అను అంశము) నందే తాత్పర్యమనియు - ప్రధాన కారణ వాదము (జడమగు ప్రధానము జగ త్కారణము అను అంశము) నందు తాత్పర్యము కాదనియు - గడచిన గ్రంథములో వివరింపబడినది. ఇప్పుడు ప్రధానము అశబ్దము = వేద శబ్ద ప్రతిపాద్యము కాదు అని వెనుక చెప్పిన విషయమును గూర్చి మరల విచారము జరుపబడుచున్నది.
ప్రధానము అశబ్దము అని యనుట యుక్తము కాదు. కొన్ని వేదశాఖలలో ప్రధానమును వర్ణించు శబ్దము లుపలభ్య మానము లగుచున్నవి గనుక. అను ఆశంక రాగా ఆ శబ్దములు (అట్టి పదములు) ప్రధానపరములు కావనియు - ప్రధానేతర పరములనియు ప్రతిపాదించుటకై యీ పాద మారంభింప పడుచున్నది.
వివరణము :- కఠోపనిషత్తులోని ''మహతః పర మవ్యక్త మవ్యక్తా త్పురుషః పరః'' మహత్తు కంటె షత్కృఉష్టమైనది అవ్యక్తము. అవ్యక్తము కంటె ఉత్కృష్టమైనవాడు పురుషుడు అని చెప్పు ఈ వాక్యములోని అవ్యక్త శబ్దముచేత ఆనుమానికమైన = సాంఖ్యస్మృతి ప్రతిపాదితమైన ప్రధానము చెప్పబడుచున్నది. కాన ఈక్షత్యధికరణములో ప్రధానము వేదశబ్ద ప్రతి పాదితము కాదు అని చేసిన ప్రతిపాదనము యుక్తము కాదు. అని సాంఖ్య పక్షము వారందురు. కాని యట్లనుట తగదు. ప్రధానము వేదశబ్ద ప్రతిపాద్యము కానేరదు. ఏలయన? ఈ ప్రకరణములోని ''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ మేవతు'' ఆత్మను రథికునిగా (రథస్వామియై గన్తవ్యదేశమును గూర్చి ప్రయాణించు వానినిగా) తెలిసి కొనుము - శరీరమును రథమునుగా తెలిసికొనుము. అని చెప్పు పూర్వ వాక్యములో రథరూపకముతో విన్యస్తమైన = ప్రతిపాదింపబడిన శరీర మిచట అవ్యక్త శబ్దముతో గ్రహింప బడుచున్నది గాని ప్రధానము గ్రహింపబడుట లేదు. ఈ యంశమును ''ఆత్మానం రథినం విద్ధి'' ఇత్యాది గ్రంథము స్ఫుటముగ ప్రదర్శించుచున్నది. కాన నీ వాక్యముల వలన ప్రధానమునకు వేదశబ్ద ప్రతిపాద్యత్వము సిద్ధించుననుట తగదు.
(రూపక కల్పనా ప్రకార మిచట ప్రదర్శింప బడుచున్నది.)
విష్ణుపదము రూపక కల్పనము
1. ఆత్మా 1. ఆత్మా - రథీ (గన్తవ్యమైన విష్ణుపదమును
(మోక్షమును) గూర్చి ప్రయాణించు రథస్వామి)
2. అవ్యక్తం 2. శరీరం - రథః (ప్రయాణ సాధనమగు
రథము)
3. మహత్ - (బుద్ధిః) 3. బుద్ధిః - సారథిః (రథమును నడిపించు
వాడు)
4. మనః 4. మనః - ప్రగ్రహః (రథమున పూన్చబడిన
గుర్రములను నియమించు పలుపు)
5. ఇంద్రియాణి 5. ఇంద్రియాణి - హయాః (రథమున పూన్చ
బడిన గుర్రములు)
6. విషయాః 6. విషయాః - గోచరాః (మార్గములు)
ఈ ప్రదర్శింపబడిన రెండు వరుసలలోను ఆత్మ మొదలగు పదార్థములు ఆయా స్థానములలో వ్యత్యయము లేకుండ సమానమగు క్రమముతో వర్ణింపబడి యున్నవి. విశేషమేమియన? ఒక వరుసలో రెండవ స్థానమున ''అవ్యక్తం'' అను పదార్థము నిర్దేశింపబడినది. మరియొక వరుసలోని రెండవ స్థానములో మాత్రము ''శరీరం'' అను పదార్థము నిర్దేశింపబడి యుండెను. మొదటి వరుసలో నిర్దేశింపబడిన పదార్థములే రెండవ వరుసలో గూడ చాలా భాగము గ్రహింపబడియున్నవి గనుక మొదటి వరుసలో రెండవ స్థానమున నిర్దేశింపబడిన అవ్యక్త శబ్దముచేత రెండువరుసలో రెండవస్థానమున నిర్దేశింపబడిన శరీరము చెప్పబడు చున్నది యనుట యుక్తము కాని ప్రధానము చెప్పబడు చున్నది యని యనుట యుక్తము కాదు. ఆ అవ్యక్త శబ్దముచే ప్రధానమును పరిగ్రహించుచో అప్రకృత ప్రసంగము కాగలదు. ఇది ప్రధానమునకు పరిగ్రహించుచో అప్రకృత ప్రసంగము కాగలదు. ఇది ప్రధాన మునకు సంబంధించిన ప్రకరణము కాదు గనుక. కాన ప్రధానము వేద శబ్ద ప్రతిపాద్యము కానేరదు.
2. సూ : సూక్ష్మం తు తదర్హత్వాత్
వివృతిః :- శరీరస్య స్థూలత్వాత్ వ్యక్తశబ్దవిషయతైవ వక్తవ్యా - కథ మవ్యక్తశబ్ద విషయత్వం తస్యేత్యత ఆహ-సూక్ష్మం - తు=స్థూలశరీరా రంభకం- (స్థూలశరీర కారణం) యత్ భూతసూక్ష్మం తదిహావ్యక్త శ##బ్దేన పరిగృహ్యతే - కుతః? తదర్హత్వాత్ =తసై#్య వావ్యక్త శబ్దార్హత్వాత్ - తేన చ స్థూలం లక్ష్యతే - ''గోభి శ్ర్శీణీత మత్సరం'' ఇత్యాది ప్రయోగేషు కారణవాచీ శబ్దః కార్యే ప్రయుజ్యమానో దృశ్యతే - అతో త్రా ప్యవ్యక్త శబ్దస్య స్థూలశరీరపర త్వేపి న దోషః - ఇతి.
వివరణము :- పూర్వ సూత్రములో అవ్యక్త శబ్దముచే శరీరము చెప్పబడుచున్నది యని నిరూపింప బడినది. శరీరము స్థూలము (వ్యక్తమగు వస్తువు) కాన నది ''వ్యక్త'' శబ్దముతో చెప్పబడినది యగును గాని అవ్యక్త శబ్దముతో నెట్లు చెప్పబడ గలదు అను ఆశంకరాగా చెప్పు చున్నారు. ఇచట వాడబడిన ఆవ్యక్త శబ్దము స్థూల శరీరమునకు కారణ మగు భూత సూక్ష్మావస్థను నిర్దేశించుచున్నదని చెప్పవలయును. ఏలయన? ఆ భూత సూక్ష్మస్థితియే అవ్యక్త శబ్దముతో నిర్దేశించుటకు అర్హమైనది గనుక. అట్టి అవ్యక్త శబ్దము చేత స్థూల శరీరము సూచింపబడును. ''గోభి శ్శ్రీణీత మత్సరం'' మత్సరమనునది ఒక వస్తువు. దానిని ఆవు పాలతో మిశ్రణము చేయుడు (కలుపుడు) అని ఈ వ్యాక్యమునకు అర్థము. ఇది ప్రసిద్ధ వాక్యము. ఇచట నున్న గోభిః అను శబ్దమునకు ఆవులచేత అనునది ముఖ్యార్థము. ప్రస్తుతము ఆపదమునకు ఆవు పాలతో అను అర్థము స్వీకరింపబడినది. ఆవుల నుండి పాలు ఏర్పడును గనుక ఆవులు పాలను గూర్చి కారణము అని చెప్పబడును. కారణమును చెప్పు ''గోభిః'' అను శబ్దముచేత తత్కార్యమగు పాలు ఇచట వర్ణింపబడుచున్నవి. ఇట్లు కారణవస్తు వాచక శబ్దమును కార్య వస్తువును బోధింపదలచి ప్రయోగించుట లోక సిద్ధమైన విషయమే - కనుక స్థూలమగు (వ్యక్తశబ్దముచే చెప్పదగియున్న) శరీరమును తత్కారణ వాచకమగు అవ్యక్త శబ్దముతో వ్యవహరించుట దోషావహము కాదు.
3. సూ : తదధీనత్వా దర్థవత్
వివృతిః :- పూర్వసూత్రే అవ్యక్తశ##బ్దేన స్థూలాంరభక భూతసూక్ష్మావస్థా పరిగృహ్యత ఇత్యుక్తం. తతః తాదృశ్యాః భూతసూక్ష్మావస్థాయా ఏవ ప్రధానత్వేన సాంఖ్యై రంగీకృతత్వాత్, శ్రుత్యా చ తద్వాదో೭భ్యుపగత ఇత్యపసిద్ధాంత స్స్యా దిత్యత ఆహ - తదధీనత్వాత్ = యచ్ఛరీర కారణ మవ్యక్త శబ్దార్హం జగతః ప్రాగవస్థారూపం, తన్య - తదధీనత్వాత్ = పరమేశ్వరాధీన త్వాభ్యుపగమా న్నాస్మాకం స్వతంత్ర ప్రధానకారణ వాదాభ్యుపగమదోషః ప్రసజ్యతే - (సాంఖ్యాస్తు స్వతంత్ర మనన్యాధీనం ప్రధానం జగతః కారణం మన్యన్తే. నాస్వతన్త్రం. అవ్యక్త స్యేశ్వరాధీ నత్వే ఈశ్వరా దేవాస్తు జగదుత్పత్తిః, కిం తేన ప్రధానే నేత్యత ఆహ. అర్థవత్ =''మాయాం తు ప్రకృతిం విద్యా న్మాయినం తు మహేశ్వరం'' ఇతి శ్రుతా వవ్యక్త స్యేవ్వరసహకారి త్వావగామా దవ్యక్తం = జగతః ప్రాగవస్థారూపం ప్రధాన ద్భవతీత్యర్థః.
వివరణము :- పై సూత్రములో అవ్యక్తశబ్దముచేత స్థూలమునకు కారణమైన భూత సూక్ష్మావస్థ పరిగ్రహింప బడునని చెప్పబడినది. కారణమగు భూత సూక్షావస్థయే ప్రధానము అని సాంఖ్యులచే నంగీకరింపబడి యుండుట వలన శ్రుతిచేతను ఈ వాదము అంగీకరింప బడినచో అపసిద్ధాంతము చేసినట్లగును గదా! అను ఆశంకరాగా చెప్పుచున్నారు. అవ్యక్త శబ్దముతో వ్యవహరింపదగిన శరీరకారణమగు జగత్తునుకు పూర్వావస్థయైన ఆ వస్తువు పరమేశ్వరునికి అధీనమైన వస్తువు గాని స్వతంత్రమైన వస్తువు కాదు. సాంఖ్యులు స్వతంత్రమైన దానినిగా ప్రధానమును వర్ణింతురు కాన మాకు సాంఖ్యులకువలె స్వతంత్ర ప్రధానకారణవాదము నంగీకరించిన దోషము వాటిల్లదు. (సాంఖ్యులు జగత్తును గూర్చి స్వతంత్రమైన = అనన్యాధీనమైన ప్రధానతత్త్వ మను వస్తువు కారణమని నిర్ణయించిరి గాని ఈశ్వరాయత్తమైన అస్వతంత్రమైన వస్తువును కాదు.) అట్లగుచో ఆ యీశ్వరుడే జగత్వారణమని చెప్పవచ్చును గదా ఇట్టి అవ్యక్తమును జగత్కారణమునుగా నంగీకరింప వలసిన పనియేమి, వ్యర్థము కదా అను ఆక్షేపము రాగా సమాధానము చెప్పుచున్నారు. ''మాయాంతు .... మహేశ్వరం'' మాయయను వస్తువును ప్రకృతిని (జగత్కారణమును) గాను, మహేశ్వరుని మాయ కలవానినిగాను (మాయా నియామకునిగాను) తెలిసికొనుము. అని చెప్పు ఈ శ్రుతియందు అవ్యక్తము (మాయ) పరమేశ్వరునకు జగన్మిర్మాణ కార్యక్రమమునందు సహకారిగా తెలియపరచ బడినది. కాన జగత్తునకు పుర్వ రూపమగు (కారణమగు) ప్రధానము = అవ్యక్త శబ్దము చేత చెప్పబడుచున్న వస్తువు జగత్సృష్టికర్త యగు పరమేశ్వరునకు సహకారి గనుక దానిని గూడ కారణముగా నంగీకరించుట వ్యర్థము కాదు.
4. సూ : జ్ఞేయత్వావచనా చ్చ
వివృతిః :- అవ్యక్తశబ్దో న సాంఖ్యాభిమత ప్రధాన విషయక ఇత్యత్ర హేత్వంతర ముచ్యతే - చ = కించ జ్ఞేయత్వావచనాత్ = ప్రధాన పురుష వివేకవిజ్ఞానేన కైవల్యం వదద్భి స్సాంఖ్యైః పురుషవత్ ప్రధాన మపి జ్ఞేయత్వే నాభిహితం - అత్రతు అవ్యక్త శబ్దమాత్రం దృశ్యతే - అవ్యక్తం జ్ఞాతవ్యమితి వచనం తు న దృశ్యతే - అతః అవ్యక్తే జ్ఞేయ త్వస్య అవచనాత్ = అనభిధానా న్నావ్యక్తం ప్రధానం.
వివరణము:- శ్రుతియందు వినవచ్చుచున్న అవ్యక్త శబ్దము సాంఖ్యులచే నంగీకరింపబడిన ప్రధానమును బోధించునది కాదనుటలో మరియొక హేతువును చెప్పుచున్నారు. సాంఖ్యులు ప్రధానతత్త్వ పురుష తత్త్వముల యొక్క వివేక విజ్ఞానము వలన కైవల్యము (మోక్షము) లభించునని చెప్పుచు పురుషతత్త్వము వలె - ప్రధానతత్త్వము గూడ తెలిసి కొనదగినది యని నిర్ణయించి యుండిరి. ఇచట అవ్యక్త శబ్దము మాత్రము కాన వచ్చుచున్నది కాని ఆ అవ్యక్తము తెలిసి కొనదగినది యని చెప్పబడి యుండలేదు. కాన ఈ శ్రుతి వాక్యమునందలి అవ్యక్తశబ్దము సాంఖ్యాభిమత ప్రధాన ప్రతిపాదకము కానేరదు.
5. సూ : వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్
వివృతిః :- వదతి =''అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం తథా రసం నిత్య మగంధవచ్చ యత్| అనాద్యనన్తం మహతః పరం ధ్రువం నిచాయ్య తం మృత్యుముఖా త్ర్పముచ్యతే'' ఇతి - ఉత్తరత్ర తద్గ్రన్థే శ్రూయమాణం వాక్య మవ్యక్తశభ్దితం ప్రధానం జ్ఞేయత్వేన వదతి - ఇతి - చేత్ =ఇత్యుక్తం చేత్ - న = అత్ర ప్రధానం జ్ఞేయత్వే నోచ్యత ఇతి న వక్తవ్యం. కుతః? హి = యస్మాత్ ప్రాజ్ఞః = పరమాత్మా- సో೭త్ర నిచాయ్యత్వేన నిర్దిష్టః - న ప్రధానం - కుత ఏత దవగమ్యతే? ప్రకరణాత్ = ''వురుషా న్న పరం కించి త్సా కాష్ఠా సా పరాగతిః'' - ఇతి - అన్యత్ర ధర్మా దన్యత్రధర్మా దన్యత్రాస్మాత్ కృతాకృతాత్ ఇత్యాది గ్రంథే పూర్వం పరమాత్మన ఏవ ప్రకృతత్వాత్.
వివరణము :- కఠోపనిషత్తులోని ఆ పై గ్రంథములో ''ఆశబ్ద మస్పర్శ.... ముఖాత్ప్రముచ్యతే'' శబ్ద స్పర్వరూప రసగంధాదులు లేని, ఆద్యన్త రహితమగు ధ్రువమగు మహత్తుకంటె నుత్కృష్టమగు వస్తువును తెలిసికొని మానవుడు మృతుముఖము (సంసారము) నుండి సంపూర్ణముగా ముక్తుడగు చున్నాడు, అని వర్ణింపబడి యున్నది. వెనుకటి గ్రంథములో ''మహతః పర మవ్యక్తం'' అని మహత్తుకంటె ఉత్కృష్టమైనది అవ్యక్తము అని ప్రతిపాధింపబడియున్నది. ఈ వాక్యములో మహత్తుకంటె పరమైన వస్తువు తెలిసికొనదగిన దిగ= జ్ఞేయముగ చెప్పబడినది. మహత్తు కంటె ఉత్కృష్టమైనది అవ్యక్త శబ్దముచే ప్రతిపాదింప బడునది ప్రధానము. ఆ వస్తువున కిచట జ్ఞేయత్వము వర్ణింపబడినది గాన అవ్యక్త శబ్దము సాంఖ్యాభిమత ప్రధాన తత్త్వ పరమని చెప్పవచ్చును. అని యనుట తగదు. ఏలయన? ఇచట ప్రధానము జ్ఞేయముగా చెప్పబడుట లేదు. ''అశబ్దమస్పర్శ....'' అను వాక్యములో నిచాయ్యముగా (జ్ఞావత్యముగా) వర్ణింపబడిన వస్తువు పరమాత్మ వస్తువుగాని ప్రధానము కాదు. ఇది పరమాత్మ ప్రకరణము గాని ప్రధాన ప్రకరణము కాదు గనుక. దీనికి పూర్వపు గ్రంథములో ''పురుషాన్న.... గతిః'' అవ్యక్తము కంటె ఉత్కృష్టమైనవాడు పురుషుడు. ఆ పురుషుడు = పరిపూర్ణ స్వరూపుడు=పరమాత్మ ఉత్కృష్టత్వమునకు పరమావధి. ఆతడే ముముక్షువులకు గన్తవ్యమగు లక్ష్యస్థాన మనియు- ''అన్యత్ర ధర్మా.... కృతాత్ '' ధర్మా ధర్మములకు - కార్య కారణములకు విలక్షణమైన వస్తువు అనియు - పరమాత్మ యొక్క ప్రసంగము చేయబడి యున్నది కాన నిచట జ్ఞాతవ్యముగా వర్ణింప బడినది పరమాత్మయే అని చెప్పవలయును. ప్రధానమనినచో నది యప్రకృత ప్రసంగము కాగలదు.
6. సూ : త్రయాణా మేవ చైవ ముపన్యాసః ప్రశ్నశ్చ
వివృతిః :- చ = కించ - త్రయాణాం - ఏవ = అస్యాం కఠవల్యాం వరదానసామర్థ్యా దగ్ని జీవ పరమాత్మనాం త్రయాణా మేవ - ఉపన్యాసం = వక్తవ్యత యోపన్యాసః - ప్రతివచనోపన్యాసః - ప్రశ్నః- చ = ప్రశ్నోపితద్విషయక ఏవ దృశ్యతే - అతో೭న్యస్య ప్రశ్నో వా ప్రతివచనోపన్యాసో వా నాస్తి అతో నావ్యక్తశబ్దః ప్రధానం వక్తీతి సిద్ధం.
వివరణము :- మరియు నీ కఠవల్లి యందు బాలుడగు నచికేతస్సునకు యమధర్మరాజు తానచ్చిన వరదానము ననుసరించి అగ్ని - జీవ - పరమాత్మల నెడి మూడు విషయముల గూర్చియే ప్రతివచనో పన్యాసములను గావించెను. ఆ బాలుడు చేసిన ప్రశ్నయు ఆ మూడు విషయములను గూర్చియే - మరియొక వస్తువును గూర్చిన ప్రశ్నగాని ప్రతివచనము గాని ఆ గ్రంథములో కానుపించదు. అందువలన పూర్వోదాహృత వాక్యములలోని అవ్యక్తశబ్దము ప్రదానమును ప్రతిపాదించనేరదని తేలుచున్నది.
7. సూ : మహ ద్వచ్చ
వివృతిః :- చ = కించ మహద్వత్ = యథా సాంఖ్యతన్త్రే మహ దితి శబ్దో మహత్తత్త్వే ప్రయుక్తోపి ''మహాన్తం విభు మాత్మానం'' - వేదాహ మేతం పురుషం మహాన్తం'' ఇత్యాదిషు వైదికేషు ప్రయోగేషు తదేవ మహచ్ఛబ్ద స్తదేవ మహత్తత్త్వం నాభిధత్తె - తద్వ దవ్యక్తశబ్దో ప్యత్ర ప్రధానం న వక్తీతి, ప్రకృతం శరీరమే వావ్యక్తశబ్దిత మితి చ సిద్ధమ్.
వివరణము :- మరియు ''మహత్'' అను శబ్దము సాంఖ్య శాస్త్రములో మహత్తత్త్వమును బోధించుటకై ప్రయోగింపబడుచున్నది యైనను ''మహాన్తం విభు మాత్మానం'' - ''వేదాహ మేతం పురషం మహాన్తం'' ఇత్యాది వైదిక వాక్యములలో వడబడిన ఆ ''మహత్'' అను శబ్దము సాంఖ్యోక్త మహత్తత్వమును ప్రతిపాదించ నేరదు. అట్లే ఈ మంత్రములో ప్రయోగింపబడిన అవ్యక్త శబ్దము గూడ ప్రధానమును ప్రతిపాదింప జాలదు. తత్ర్పకరణములో పఠింపబడియున్న శరీరమును మాత్రమే ప్రతిపాదింప గలదని యేర్పడు చున్నది.
8. సూ : చమసవ దవిశేషాత్
విపృతిః :- శ్వేతాశ్వత రోపనిషది శ్రూయతే - ''ఆజా మేకాం లోహితశుక్లకృష్ణాం బహ్వీః ప్రజా స్సృజమానాం సరూపాం'' ఇతి - అత్రా జాశ##బ్దేనాపి ప్రధానం నోచ్యతే - కుతః? అవిశేషాత్ = అజాశబ్దస్య మాయాదావపి సాధారణత్వాత్ = ప్రధానసై#్యవ బోధక మిద మజాపదమితి జ్ఞాపకస్య విశేషావధారణకారణ స్యాభావాత్ - తత్ర దృష్టాన్తః చమసవత్ = ''అర్వాగ్బిల శ్చమస ఊర్ధ్వబుధ్నః'' ఇత్యస్మి న్మంత్రే, అత్రోక్త శ్చమసః అయం నామాసౌ చమస ఇతి యథా నియంతుం న శక్యతే అస్యత్రా ప్యర్వాగ్బిలత్వాదే స్సాధారణత్వాత్ - ఏవ మజామన్త్రేపి అజాత్వాదే రవి శేషా న్న ప్రధానస్య నిర్ణయ ఇతి - అతో న వైదిక శబ్దగ్రా హ్యతా ప్రధాన స్వేత్యర్థః.
వివరణము :- శ్వేతాశ్వతరోపనిషత్తు నందు ''అజామేకాం.... సరూపాం'' అను మన్త్రములో సరూపులగు బహువిధ ప్రాణి వర్గమునుత్పాదనము గావించు ఒక వస్తువు యొక్క ప్రస్తావము చేయబడినది. ఆ వస్తు విచట ''అజా'' శబ్దముచే చెప్పబడినది. అజా అనగా న జాయత ఇత్యజా అను వ్యుత్పత్తి ననుసరించి పుట్టుకలేనిది యని యర్థము. సాంఖ్య శాస్త్ర ప్రసిద్ధ ప్రధానము (జగత్కారణ వస్తువు) గూడ పుట్టుకలేనిదియే. కనుక అజా శబ్దముచేత ప్రధానము చెప్పబడరాదా అను సాంఖ్యుల ఆశంకకు సమాధానము చెప్పబడుచున్నది. ఇచటి ఈ అజాశబ్దము సాంఖ్యోతక్త ప్రధాన వాచకము కానేరదు. ఏలయన? అజాశబ్దము పూర్వోక్తవ్యుత్పత్తి ననుసరించి మాయ మొదలగు అనాది పదార్థముల కన్నిటికిని సాధారణ శబ్ధము గనుకన్నూ - ఇచటి యీ అజా శాబ్ధము ప్రధానమును ప్రతిపాదించునదియే యని చెప్పుటకు తగిన నియామకమగు విశేషణ మిచట కానవచ్చుట లేదు గనుకనున్నూ. ఎట్లనిన?'' అర్వాగ్బిల శ్చమస ఊర్ధ్వబుధ్నః'' అను కర్మకాండ గతమగు ఒక మన్త్రములో యాగములో నుపయోగింపబడు (చమసము) పాత్రము యొక్క లక్షణము చెప్పబడినది. అంతమాత్రముచేత నిచట వర్ణింపబడిన చమసము ఈ చమసమే యగును అని విశేషముగా నిర్థారణము చేయుటకు తగిన నియామకమగు విశేషము లేదు. అర్వాగ్బిలత్వాదికము సర్వచమనములకును సాధారణ లక్షణమే గనుక. ఇట్లు అజామన్త్రములో గూడ అజాత్వాదులు (పుట్టుకలేక పోవుట మొదలగు ధర్మములు) మాయయందును, ప్రధానము నందును ఉండునవియే గనుక ఇచట అజాశబ్దము చేత ప్రధానమే ప్రతిపాదింపబడు చున్నదని నిర్ణయింప వీలులేదు. కాన సాంఖ్యోక్త ప్రధాన తత్త్వము వేదశబ్ద ప్రతి పాద్యము కానేరదు.
9. సూ : జ్యోతిరుపక్రమా తు తథా హ్యధీయత ఏకే
వివృతిః :- తర్హి కేయ మజా అజామన్త్రే ప్రతిపిపిత్సి తేత్యత ఆహ. జ్యోతిరుపక్రమా - తు=జ్యోతిః=తేజః, ఉపక్రమే =ముఖే =అదౌ, యస్యా స్తేజోబన్నరూపాయాః పరమేశ్వరా దుత్పన్నాయా అవాన్తర ప్రకృతే స్సా జ్యోతిరుపక్రమా - పరమేశ్వరా దుత్పన్నా సైవా త్రాజాశ##బ్దే నోచ్యతే, న గుణత్రయలక్షణా ప్రకృతిః = ప్రధానం - హి = యస్మాత్ - ఏకే = ఏకే శాఖినః = ఛన్దోగాః - యథా ''యదగ్నే రోహితగ్‌ం రూపం తేజస స్తద్రూపం - యచ్ఛుక్లం తదపాం - యత్కృష్ణం తదన్నస్య'' ఇత్యాదినా తేజోబన్నానాం సృష్టి ముక్త్వా అవాన్తరప్రకృతి లక్షణానాం తేజోబన్నానాం తేషాం లోహితాది రూపవత్వం - అధీయతే = సమాయన్తి = పఠన్తి - తథా = తథై వేహాజామన్రై లోహితాది శబ్దసామ్యా త్తాన్యేవ తేజో బన్నాని ప్రత్యభిజ్ఞాయన్త ఇతి, తేజో బన్నలక్షణా೭ వాన్తర ప్రకృతి ర్యా సైవాత్రా ప్యజాశబ్దవిషయా నప్రధానం - ఇతి.
వివరణము :- అజామేకాం....'' అను మన్త్రములోని ఆజాశబ్దమున కర్థమేమియన నిచట చెప్పబడు చున్నది. జ్యోతిరుపక్రమా అనగా తెజస్సు మొదలుగా గల తేజోబన్న రూపమగు (తేజస్సు - ఉదకము- పృథివియను భూతత్రయాత్మకమగు) - సద్రూపుడగు పరమాత్మనుండి ఉత్పన్నమై భైతికమగు సర్వ ప్రపంచమునకును కారణమైన అవాంతర ప్రకృతియగు వస్తువే యిచట అజా శబ్దముచే చెప్పబడును గాని సత్వర జస్తమో గుణాత్మకమగు సాంఖ్య తంత్రోక్త ప్రధానము చెప్పబడదు. కారణమేమియన? కొన్ని శాఖలవారు అనగా ఛాందోగ్య శాఖవారు - ''యదగ్నే రోహితగ్‌ం .... తదన్నస్య'' సమస్త జగత్తునకును తేజస్సు - అప్పు = ఉదకము - అన్నము=పృథివి - ఇవి కారణము లనియు - కార్యమగు వస్తువు నిరూపించి చూడ కారణము కంటె వేరుగ నుండనిది యనియు నిరూపించి చెప్పుచు అగ్నియను పదార్థమునకు సంబంధించిన రోహిత రూప (ఎరుపు రంగు) మేది కలదో అది తత్కారణమగు తేజో బన్న రూపమగు అవాంతర ప్రకృతిలోని తేజస్సు యొక్కరూపమనియు - అట్లే - ఆ అగ్నియందలి శుక్ల రూపము (తెలుపురంగు) అవాంతర ప్రకృతిలోని అప్పుల (ఉదకముల) యొక్క రూపమనియు - అట్లే ఆ అగ్నియందలి కృష్ణ రూపము (నలువు రంగు) అవాంతర ప్రకృతిలోని అన్నము (పృథివి) యొక్క రూపమనియు- నిట్లు సృష్టియంతయు తేజో బన్నములకు సంబంధించినదియే, అని (కార్యము కారణానన్యమని ప్రతి పాదించి సందర్భములో) వర్ణించి ఆ అవాంతర ప్రకృతి రూపములగు తేజోబన్నములకు రోహితాది రూపములను పఠించు చున్నారు. అట్లే యిచట అజా మన్త్రములో గూడ ''లోహిత శుక్ల కృష్ణాం'' అని ఆ తేజోబన్నముల యొక్క రూపములే వర్ణింప బడుచున్నట్లు తెలియబడుచున్నది గనుక ఆ పూర్వోక్త తేజోబన్నరూపా వాంతర వ్రకృతియే యిచట అజా శబ్దముతో చెప్పబడుచున్నది యనియు - ప్రధానము చెప్పబడుట లేదనియు తెలిసికొనదగును.
10. సూ : కల్పనోపదేశా చ్చ మధ్వాదివ దవిరోధః
వివృతిః :- తేజోబన్నానా ముత్పత్తి శ్రవణాత్ - అజాశబ్దస్య ఛాగే రూఢత్వా చ్చ యోగరూఢ్యో స్తత్రాసంభవా త్కథం తస్య శబ్దస్య తేజో బన్నరూపా వాన్తర ప్రకృతి పరత్వ మిత్యత ఆహ''- చ=చశబ్దో೭త్ర శంకానిరాసార్థః - తథాచ - తేజోబన్నాత్మక ప్రకృతౌ నాజాత్వానుపపత్తిః. కుతః? కల్పనోపదేశాత్ = యథా లోకే ప్రసిద్ధా మజాం భుక్తభోగాం ఏకః అజ స్త్యజతి అన్యస్తా మనువర్తతే - ఏవం త్యాగభోగయోః కార్యకారణ సంఘాతా ద్యుపాదాన తేజోబన్నాత్మక ప్రకృతేః సామ్యద్యోతనార్థం కల్పనాయా೭ జాత్వ ముపదిశ్యతే - కథమితి చేత్? మధ్వాదివత్= యథా మధు భిన్నే ఆదిత్యే ''అసౌ వా ఆదిత్యో దేవమధు'' ఇతి మధుత్వోపదేశః క్రియతే, తథా - అవిరోధః=తద్వదజాభిన్నాయాః ప్రకృతే రజాత్వోపదేశే కృతేపి న కశ్చి ద్విరోథః - తస్మా న్నాత్ర ప్రధాన స్యావకావ ఇత్యతో శబ్దం ప్రధానమితి సిద్ధ్యతి.
వివరణము :- అవాంతర ప్రకృతి రూపమగు తేజోబన్నములు సద్రూప పరమాత్మ నుండి ఉత్పన్నములైనవి యని ఛాన్దోగ్యములో వర్ణింపడినది. అజాశబ్దము ''న జాయతే'' అను వ్యుత్పత్తి ననుసరించి పుట్టుకలేని వస్తువును. లోక రూడిననుసరించి ఛాగము (మేక) ను బోధించగలదు. తేజ్ఞోబన్నములు పుట్టుక కలవి కనుక అజాశబ్దము వ్యుత్పత్తిని బట్టిగాని, రూఢిని బట్టిగాని తేజోబన్నములను ప్రతి పాదింప జాలదను ఆక్షేపమునకు సమాధానముగా ఈ సూత్రము చెప్పబడుచున్నది. అజా మంత్రములో లోహిత శుక్ల కృష్ణ రూపముగల బహుసరూవ సంతతి నుత్పాదన చేయుచున్న అజను ఒక అజము (ఒక మేకపోతు) సేవించుచు ననుసరించి యుండును. భుక్తభోగయగు ఆ అజను (మేకను) మరియొక అ (మరియోక మేకపోతు) పరిత్యజించి యుండునని చెప్పుచు తేజోబన్నాత్మకమైన, రోహితాది వర్ణత్రయోపేతమైనప్రకృతిని అవి వేకియగు జీవుడు అనుసరించునని, వివేకి పరిత్యజించునని సూచించుచు త్యాగభోగముల పట్ల ప్రకృతి యందు సమత్వమే గాని వైషమ్య ముండదని బోధించుట కొరకై అవాంతర ప్రకృతి యందు అజాత్వము కల్పించి వర్ణింపబడినది. [ప్రకృతి యనగా కారణము. సర్వ ప్రపంచమునకు అద్వైత వేదాంత సిద్ధాంతము ననుసరించి సద్రూపమగు పరమాత్మ మాయాద్వారా మూల కారణము. దాని నుండి ఉత్పన్నమై తనకు తరువాతి దియగు భౌతిక ప్రపంచమునకు కారణమైన వస్తువు అవాంతర ప్రకృతియని వ్యవహరింపబడును.] అది యెట్లనిన? ''అసౌ వా ఆదిత్యో దేవమధు'' ఈ వాక్యములో ఈ ఆదిత్యుడు దేవతలచే నాస్వాదింపదగిన మధువు = తేనె యని వర్ణింపబడినది. ఇందు ఉపాసన కొఱకై మధువు కాని ఆదిత్యుని యందు మధుత్వము కల్పించి యెట్లు ఉపదేశింప బడినదో అట్లే మేకకాని అవాంతర ప్రకృతియందు అజాత్వ ముపదేశింపబడినది. కాన అజాశబ్దము అవాంతర ప్రకృతిని బోధించు ననుటలో దోషమేమియు లేదు. ఇచటి అజా శబ్దము ప్రధాన బోధకమని యనుట కవకాశము లేదు. కాన ప్రధానము వేదశబ్ద ప్రతిపాద్యము కానేరదని తేలుచున్నది.
సంఖ్యోపసంగ్రాహాధి కరణమ్ 3
11. సూ : న సంఖ్యోపసంగ్రహా దపి నానాభావా దతిరేకా చ్చ
వివృతిః :- బృహదారణ్యకే శ్రూయతే యస్మిన్ పంచ పంచజనా ఆకేశ శ్చ ప్రతిష్ఠతః" ఇతి - సంఖ్యోపసంగ్రహాత్ - అపి=తత్ర మన్త్రే పంచపంచశ##బ్దేన పంచవింశతి సంసంఖ్యాభ్యుపగమా దపి - న = సాంఖ్యతంత్రోక్తాని మూలప్రకృతి రిత్యాదీని న తత్సంఖ్య యోచ్యంతే. కస్మాత్! నానాభావాత్=పంచవింశతి సంఖ్యాకానాం తత్త్వానా మపి పరస్పర విల క్షణ ధర్మోపేతత్వా త్పంచ పంచకానీతి విభ జ్యాభిధానహేతో స్సాధారణ ధర్మపంచతక స్యభావా దిత్యర్థః - అరిరేకాత్ = కథంచి త్సాధారణ ధర్మపంచక స్వాంగీకారేపి - తన్మంత్రోక్తాతభ్యా మా త్మాకాశాభ్యాం పంచవింశతి సంఖ్యాతో೭ధికసంఖ్యాకాని తత్త్వాని భవన్తి - ఆతో೭త్ర సంఖ్యయా న సాంఖ్యోక్తతత్త్వానాం గ్రహణం యుజ్యతే - సూత్రస్థ ''అపి'' శ##బ్దేన మన్త్రస్థ పంచ పంచజనశ##బ్దేన సంఖ్యాప్రతీతి రేవనాస్తి - పంచజనశబ్దస్య సంజ్ఞాత్వా దితి ద్యోత్యతే.
వివరణము :- బృహదారణ్య కోపనిషత్తులో యస్మిన్ పంచ పంచ జనా ఆకాశ శ్చ ప్రతిష్ఠతః'' అని ఒక మన్త్రము కలదు. అందలి ''పంచ పంచ'' అను శబ్దముచేత (పంచ = అనగా ఐదు. పంచ X పంచ అనగా ఐదైదులు ) ఇరువదియైదు అను సంఖ్య తెలియజేయ బడుచున్నది గనుక సాంఖ్య శాస్త్రమునందు ప్రతిపాదింప బడిన మూలప్రకృతి - మహాత్తు మొదలుగాగల ఇరువదియైదియైదు తత్త్వములను ఆ పంచ పంచ శబ్దము ప్రతిపాదించుచున్నది యని యనుటయును తగదు. ఏలయన? ఆ తత్త్వములయందు నానాభావము కలదు. ఆ ఇరువది యైదు తత్త్వములును పరస్పర విలక్షణ ధర్మములతో గూడియున్నవి. పంచ పంచ అను పదమునకు ఐదు ఐదులు అను అర్థము స్వీకరించిన ఐదు పంచకములు అను అర్థమేర్పడును. పంచకమనగా ఐదు వస్తువులతో గూడిన ఒక గణమని యర్థము ఇట్లు ప్రతి పంచకమునందలి ఐదు వస్తువులకును సమానమగు ధర్మసంబంధమొకటి యున్ననే అవి అన్నియు గలసి యొక గణమని నిర్థరించుటయు వానిని విభజించి ఇట్టివి ఐదు వర్గము లున్నవని చెప్పుటయు కుదురును గాని అట్లు కాకున్న కుదురదు. సాంఖ్య తంత్రోక్త తత్త్వము లన్నియు పరస్పర విలక్షణ ధర్మములు కలవియే గాని యే ఐదింటికి సమాన ధర్మ వత్త్వము లేదు. కాన నిచట సాంఖ్యతత్త్వములకు ప్రసక్తికలదనుట యుక్తము కాదు. మరియు నేదో ఒక విధముగ ఐదు పంచకములుగ = పంచవర్గములుగ విభజించుటకు అర్హమగు ఐదైదు తత్త్వముల యందుండు సాధారణ ధర్మములు వేరువేరుగ నంగీకరించనను పై మంత్రములో ప్రతిపాదింప బడిన ఆత్మ - ఆకాశము - అను రెండు పదార్థములతో కలసి తత్త్వములు ఇరువదియైదు కంటె అధిక సంఖ్యకలవి కాగలవు.
కాన నీ మంత్రములో ''పంచ పంచ '' శబ్ద మిరువదియైదు అను సంఖ్యను బోధించుననియు - ఆ శబ్దము సాంఖ్యోక్త పంచవింశతి తత్త్వములను ప్రతిపాదించు చున్నది యనియు చెప్పుట యుక్తము కాదు. మరియు సూత్రములోని అపి అను పదము మన్త్రములోని పంచజన శబ్దము సంజ్ఞావాచకము గాని సంఖ్యావాచకము కానేరదను భావమును సూచించుచున్నది.
12. సూ : ప్రాణాదయో వాక్య శేషాత్
వివృతిః :- పంచజనశబ్ద విర్దేశ్యాః కే ఇతి నిరూప్యతే - ప్రాణాదయః= ప్రాణచక్షు శ్శ్రోత్రామనాంసి పంచజన శబ్దనిర్దేశ్యాః - కుత ఏవ మవగన్యతే? వాక్య శేషాత్ ప్రానస్య ప్రాణ ముత చక్షుష శ్చ క్షు రుత శ్రోత్రస్య శ్రోత్ర మన్నస్యాన్నం మనసోమనో యే విదుః'' ఇత్యు త్తరస్మా ద్వక్య శేషా దవగమ్యతే.
వివరణము:- పంచజన శబ్దముచేత నిర్దేశింప బడుచున్న పదార్థము లెవ్వియో వాని నిచట నిరూపించు చున్నారు. ప్రాణము - చక్షుస్సు - శ్రోత్రము- అన్నము - మనస్సు అను పదార్థములను పంచజన శబ్దము నిర్దేశించుచున్నది యని ''ప్రాణస్య ప్రాణ.... యే విదుః'' అను నీ ప్రకరణములోని పైవాక్యమును బట్టి తెలియవచ్చు చున్నది.
13. సూ : జ్యోతి షై కేషా మసత్యన్నే
వివృతిః :- ఏకేషాం =కాణ్యశాఖినా మామ్నాయే ఏతత్ర్పకరణస్థ వాక్య శేషే మాధ్యందిన శాఖాయా మివ ప్రాణాదిభి స్సాక మన్న స్యానా మ్నాతత్వా త్కథం పంచసంఖ్యా పూరణీయే త్యాకాంక్షాయాం - అన్నే - అసతి= తద్వాక్య శేషే అన్య స్యానామ్నాతత్వే జ్యోతిషా= ''తద్దేనా జ్యోతిషాం జ్యోతిః....'' ఇత్యాది పూర్వవాక్యస్థ జ్యోతిషా = బ్రహ్మణా పంచజనానాం పంచత్వసంఖ్యా పూరణీయా భవతి - తస్మాన్నాత్ర సాంఖ్యతత్త్వానా మవగమ ఇతి.
వివరణము :- మాధ్యందిన శాఖయందున్నట్లు కాక కాణ్వశాఖీయుల పాఠమునందు ఇదే ప్రకరణమున నున్న వాక్యములలో ప్రాణాది పదార్థములు మరియొక విధముగ పఠింపబడి యున్నవి. అందు అన్నము అను పదార్థము పఠింపబడి యుండలేదు. ఇట్లుండ నేయే పదార్థముల నచట గ్రహింపవలసి యుండును అను ఆశంకరాగా ఆ వాక్యమున అన్నము పఠింపబడకున్నను ''తద్దేవా జ్యోతిషాం జ్యోతిః'' జ్యోతిస్సులకు జ్యోతిసై#్సన ఆ బ్రహ్మతత్త్వమును దేవత లుపాసింతురు అను తద్గ్రంథస్థ పూర్వవాక్యమున పఠింపబడిన బ్రహ్మరూప జ్యోతిస్సును కలుపుకొని ఆ పదార్థములను గ్రహింప వలయును. అంతేగాని యిచట సాంఖ్య శాస్త్రోక్త తత్త్వములకు ప్రసక్తి యేమాత్రమును లేదని తెలియదగును.
కారణత్వాధి కరణమ్ 4
14. సూ : కారణత్వే న చాకాశాదిషు యథా వ్యపదిష్టోక్తేః
వివృతిః :- ప్రతిపాదితం బ్రహ్మణో లక్షణం - ప్రతిపాదితం చ బ్రహ్మవిషయం గతిసామాన్యం వేదాన్త వాక్యానాం - ప్రధాన స్యాశబ్దత్వ చైతావతా - జగజ్జన్మాది కారణత్వ రూపం బ్రహ్మణో యల్లక్షణ ముక్తం, గతి సామన్యం చ వేదాన్తవాక్యానాం బ్రహ్మణి యత్ర్పదిర్శితం తన్నోపపద్యతే - వేదాన్తవాక్యషు బహుశోవిగాన దర్శనా దిత్యక్షేపే తత్సమా ధానా యోత్తరో గ్రన్థ ఆరభ్యతే - ఆకాశాదిషు= ఆకాశాది సర్వజగత్సృష్టౌ కారణత్వే= బ్రహ్మణః కారణత్వాభిధానే - న =నైవ కశ్చి ద్విరోధో೭స్తి - ప్రతివేదాన్తం సృజ్యమానే ష్యాకాశాదిషు క్రమాది ద్వారకే విగానే సత్యపి స్రష్టరి బ్రహ్మణి తు వన కించ ద్విగాన మస్తి - కథ మేత దవగమ్య త ఇతిచేత్ - యథవ్వదిష్టోక్తేః= యథాబూతో హేకస్మి న్వేదాన్తే సర్వజ్ఞ స్సర్వేశ్వర స్సర్వాత్మకో೭ ద్వితీయః కారణత్వేన వ్యపదిష్ట స్తథాభూత సై#్యవ వేదాన్తాన్తారే ష్వప్యుక్తత్వాత్ - అస్తునామ సృష్టివాక్యేషు విగానం సృష్టౌ సృష్టివాక్యానాం తాత్పర్యా భావాత్ - వేదాన్తా నాం తాత్పర్య భూతే జగత్కారణత్వేన ప్రతిపన్నే బ్రహ్మణి తు నహ్యస్తి క్వచిదపి విగానం -
వివరణము: - బ్రహ్మ యొక్క లక్షణము ప్రతిపాదింప బడినది. సమస్త వేదాన్త వాక్యములకు సర్వజ్ఞ బ్రహ్మతత్త్వమునందే తాత్పర్యము కలదనియు , సాంఖ్యోక్త ప్రధాన తత్త్వము వేదశబ్ద ప్రతిపాద్యము కాదనియును గడచిన గ్రంథములో వర్ణింపబడినది. జగజ్జన్మస్థితి భంగకారణత్వము బ్రహ్మ లక్షణము అనుటగాని, సమస్త వేదాన్తవాక్యములకును బ్రహ్మయందు తాత్పర్యమనుట గాని ఉపపన్నము = యుక్తము కాదు. ఏ లయన? వైదాన్త వాక్యములలో పలువిధములగు విరోధములు గానవచ్చు చున్నవి గనుక అను నిట్టి ఆక్షేపము రాగా దానికి సమాదాముగా నీపై గ్రంథమారంభింప బడుచున్నది.
ఆకాశాదికమగు సర్వజగత్సృష్టిని గూర్చి బ్రహ్మకారణమని చెప్పు విషయములో నేకొంచెమైనను విరోధము లేదు. సమ స్తోపనిషత్తులలోను సృజింప బడుచున్న ఆకాశాది పదార్థములకు సంబంధించిన క్రమము (అనుపూర్వి - వరుస) విషయములో విరోధములున్నను సృష్టికర్తయగు బ్రహ్మ విషయములో ఏవిధమైన విరోధమును లేదు. అదియెట్లు తెలియవచ్చుచున్నది యనిన ? ఒక వేదాంతములో (ఒక ఉపనిషత్తులో) సర్వజ్ఞుడు - సర్వేశ్వరుడు - సర్వాత్మకుడు - అద్వితీయుడు - నగు పరమాత్మయే సర్వ జగత్కారణమని యెట్లు ప్రతిపాదింపబడునో అట్లే సర్వవేదాంతముల యందును సర్వజ్ఞాద్వితీయ పరమాత్మే జగత్కారణముగ వర్ణింపబడి యున్నది గనుక. వేదాంతముల ందు కానుపించు సృష్టి ప్రతిపాదక గ్రంథములలో పరస్వర విరోదము కానవచ్చినను నదిదోషావహాము కానేరదు సృష్టిని ప్రతిపాదించుటలే ఆ వాక్యములకు తాత్పర్యము లేదు కనుక. సర్వవేదాంత తాత్పర్య భూమియగు సర్వజగత్కారణముగ నంగీకరింపబడియున్న బ్రహ్మవస్తువు విషయములో ఏకొంచెము విరోధమును లేదని తెలియదగును.
15. సూ : సమాకర్షాత్
వివృతిః :- యద్యపి ''అసద్వా ఇద మగ్ర ఆసీత్'' ''సదేవ సోమ్యేద మగ్ర ఆసీత్'' ఇత్యాదికారణవాక్యేషు విప్రతిపత్తి రస్తీవ ప్రతీయతే - తథాపి అసద్వా ఇతివాక్యేన సన్త మేనం తతో విదురితి'' ''తత్సత్య మిత్యాచక్షతే'' ఇత్యాది పూర్వవాక్యస్త సదాత్మనః - సమాకర్షాత్ = సమాకర్షణ సావశ్యకర్తవ్యత్వా న్నాసతః కారణత్వ శంకవకాశః - అసచ్ఛబ్ద స్యానభివ్యక్త నామరూప కారణ వాచిత్వౌచిత్యాన్నాస్త్యేవ విరోధః - కారణ వాక్యాన్తరేషు విరోధపరిహారః పూర్యోత్తరగ్రన్థ పర్యోలచన యైవ మేవకర్తవ్య ఇతి.
వివరణము :- ''అసద్వా ఇద మగ్ర ఆసీత్'' సృష్టికి వెనుకటి కాలమున నీ పరిదృశ్యమాన సర్వప్రపంచమును అసత్తైయుండెను. అనుయును - ''సదేవ సోమ్యేద మగ్ర ఆసీత్'' సృష్టికి పూర్వకాలమున నీ ప్రపంచము సద్రూప బ్రహ్మవస్తువే అయియుండెను. అనియు - నిట్లు జగత్కారణ వస్తువును ప్రతిపాదించు వాక్యములలో పరస్పర విరోధమున్నట్లు తెలియవచ్చుచున్నది. ఐనను ''అసద్వా....'' అను వాక్యము చేత ''సన్త మేనం తతో విదు రితి'' - ''తత్సత్య మిత్యచక్షణతే'' ఇత్యాది పూర్వవాక్యములందలి సద్వస్తువుయొక్క ఆకర్షణము చేయుట ఆవశ్యకమై యుండుటవలన ఆసద్వస్తువే జగత్కారణని చెప్పదగును గాని అసద్వస్తువు జగత్కారణమని యనుట యుక్తముగాదు. అసచ్ఛబ్దము అనభివ్యక్తనామరూపాత్మక కారణవస్తును బోధించునది. కాన జగత్కారణ వస్తుబోధక వాక్యములలో నేమాత్రము విరోధములేదు. జగత్కారణ వస్తుబోధక వాక్యంతరములలో భాసించు విరోధములనిట్లు పూర్యోత్తర గ్రంథపర్యాలోచనము ద్వారా పరిహరించుకొనుచుండవలయును.
బాలాక్యధికరణమ్ 5.
16. జగద్వాచిత్వాత్
వివృతిః :- కౌషీతకి బ్రహ్మణ శ్రూయతే - ''యోవై బాలాక ఏతేషాం పురుషాణాం కర్త యస్య వేతత్కర్మ స వై వేదితవ్యః'' ఇతి. అత్ర వేదితవ్యత్వే నోక్తః కర్తా పరమాత్మైవ - న తు జీవః - న వా ముఖ్యః ప్రాణః కుతః ? జగద్వాచిత్వాత్ = అత్రస్థ కర్మ శబ్దస్య చరాచర జగద్వాచిత్వా. త్తత్కర్తృత్వం పరమాత్మన ఏవేతి వక్తవ్యం కించ? ''బ్రహ్మ తే బ్రవాణి'' ఇతి బ్రహ్మణ ఏవ తత్రోపక్రాంతత్వాచ్చ.
వివరణము :- కౌషతికి బ్రహ్మణములో ''యో వై బాలాక ..... వేదితవ్యః'' అను నొకవాక్యముకలదు. అందు బాలకియనువానితో అజాత శత్రువ వినెట్లనెను. ఓ బాలాకి! ఆదిత్యాదుల నధిష్టించియుండు పురుషల కందరకును కర్త యెవ్వడో - ఈ చరాచరమగు జత్తంతయు ఎవ్వని కర్మయై (ఎవ్వనిచే చేయబడినదియై) యుండెనో ఆతడు తెలిసికొనదగిన వాడు అని. ఈ వాక్యములో వేదితవ్యుడుగ (తెలిసికొనదగినవాడుగ) చెప్పబడిన కర్తయగువాడు పరమాత్మయే అని చెప్పవలయును. కాని జీవుడనిగాని, ముఖ్యప్రణమనిగాని చెప్పుటకు వీలులేదు. ఏలయన? ఆ వాక్యములోనున్న ''కర్మ'' అను శబ్దమునకు చరాచరమగు నిఖిల ప్రపంచమనియర్థము. చరాచరజగత్కర్తృత్లమనునది పరమాత్మకు సంభవించునదిగాని యన్యులకు సంభవించునది కాదుకదా! మరియు నీప్రకరణారంభములో ''బ్రహ్మ తే బ్రవాణి'' అని నేను నీకు బ్రహ్మను బోధింతునని బ్రహ్మవస్తువును గూర్చి ప్రస్తావనము చేయబడినది. కాన నీ వాక్యము పరమాత్మపరమే అని నిర్ణయింపదగును.
17. సూ : జీవ ముఖ్యప్రాణ లింగా న్నేతిచే త్తద్వ్యాఖ్యాతం
వివృతిః :- జీవ ముఖ్య ప్రాణ లింగాత్ = ''తద్యథా శ్రేష్ఠి సై#్వర్భుంక్తే'' ఇత్యత్ర భోక్తృత్వరూపస్య జీవలింగస్య దర్శనాత్. తథా ''అథాస్మన్ ప్రాణ ఏవైకధా భవతి'' ఇత్యత్ర ముఖ్యప్రాణలింగస్య చ దర్శనాత్. న = పూర్వత్ర వేదితవ్యత్వే నోక్తః పరమాత్మై వేతి నియన్తుం న శక్యతే. ఇతి - చేత్ =ఇత్యుక్తం చేత్. తద్వ్యఖ్యాతం ప్రతర్దనాధికరణ ''....నోపాసా త్రైవిధ్యా దాశ్రితత్వా దిహ తద్యోగాచ్చ'' ఇత్యత్ర స్పష్ట మయ మంశో విచార్య నిర్ధారిత ఇత్యర్థః.
వివరణము : - ఈ ప్రకరణములో ''యథా వై శ్రేష్ఠీ సై#్వ ర్భుం క్తే'' ప్రధానుడగువాడు తాను తన జ్ఞాతిబంధు పరిజనులతో సమకూర్చబడిన దాని ననుభవించుచుండునో - అను నిట్టి ఒక ప్రసంగము చేయబడి యుండెను. ఇచట భోగము వర్ణింపబడినది. భోగమనునది జీవలింగము. ''అథాస్మిన్ ప్రాణ ఏవైరధా భవతి'' అను వాక్యములో ప్రణశబ్దము కాన వచ్చుచున్నది. ఇది ముఖ్య ప్రణలింగము . ఇట్లు జీవలింగ ప్రాణలింగములీ ప్రకరణములో నుపలభ్యమానములగుటచేత ఈ ప్రకరణములోని ఆ వాక్యములో వేదితవ్యముగ వర్ణింపబడినది పరమాత్మయే అని నిశ్చించుటకు వీలు లేదని యనుట తగదు. ఏలయన? ప్రతర్థ నాధికరణములో ''నోపాసాత్రైవిధ్యా దాశ్రితత్వా దిహ తద్యోగా చ్చ'' అను సూత్రభాగములో స్పష్టముగా నీ యంశము విచారింపబడి నిర్ధరింపబడియున్నది గనుక.
18. సూ : అన్యార్థం తు జై మినిః ప్రశ్నవ్యాఖ్యానా భ్యా మపి చైవ మేకే
వివృతిః :- అన్యార్థం - తు = బ్రహ్మవాక్యే ప్యస్మిన్ జీవపరామర్శ అన్యార్థం = బ్రహ్మ ప్రతిపత్యర్థ మితి. జైమినిః =జైమిని రాచార్యోమన్యతే - కుతః? ప్రశ్నవ్యాఖ్యానాభ్యాం =''క్వైష ఏత ద్బాలాకే పురుషో೭ శయిష్ట - క్వవా ఏత దభూత్ -'' ఇత్యాదేర్జీవ సుషఉప్త్యాధా రాత్మవిషయాత్ప్రశ్నాత్ - ''యదా సుప్త స్స్వప్నం న కించన పశ్యత్య థాస్మిన్ ప్రాణ ఏవైకధా భవతి'' '' ఇత్యాదేః పరమాత్మ న్యేకీభవా ప్రతిపాదకా త్ప్రతివచనాచ్చ. అపి - చ కించ. ఏవం - ఏకే = వాజసనేయిశాఖిన ఏతత్సమానప్రకరణ ''య ఏష విజ్ఞానమయః క్వ వైతదభూత్- య ఏషో೭న్తర్హృదయ ఆకాశః ఇత్యాది ప్రశ్నప్రతియవచనయో ర్విజ్ఞానమయశ##బ్దేన జీవ మభిధాయ తద్వ్యతిరిక్తం పరమాత్మన మామనన్తి - యదుపసంవత్త్యా సుషుప్తౌ జీవస్య విశేషవిజ్ఞాన శూన్యత్వ - విక్షేపమలా భావౌ భవతః - యత్ర చ ముక్తిదశాయాం సకల భేదనివృత్తి పూర్వకమైక్యం సంభవతి తద్బ్రహ్మేతి ప్రతిపాదయితుం బ్రహ్మవాక్యే జీవపరామర్శః కృత ఇత్యర్థః
వివరణము :- పూర్వోదాహృత వాక్యము బ్రహ్మప్రతిపాదనపరమని నిర్ణయింపబడగా ఆ ప్రకరణములో జీవపరామర్శము కానవచ్చుచున్నది గదా దానికి ప్రయోజనమేమియన ? బ్రహ్మతత్త్వ ప్రతిపత్తికొరకే ఆ పరామర్శమిచట చేయబడుచున్నదని ఆచార్యుడగు జైమిని మహర్షి ఆప్రకరణమునగల ప్రశ్న ప్రతివచనములనుబట్టి తలంచుచున్నారు. ''క్వైష ఏత ద్బాలాకే పురుషో೭శయిష్ట - క్వ వా ఏతద భూత్'' ఓబాలాకి ! ఈ పురుషుడు (జీవుడు) విశేషవిజ్ఞానము లేమియు లేని యట్లుగ నెచట శయనించెను? ఈ యేకీభావరూపమగు స్థితి యేర్పడునట్లు ఈ పురుషుడెచట నిద్రించిన వాడాయెను? అను జీవషుప్త్యాధార భూతమగు ఆత్మను గురించిన ప్రశ్నను బట్టియు - ''యదా సుప్తస్స్వప్నం న కించన పశ్య త్యథా೭స్మిన్ ప్రాణ ఏవైకధా భవతి'' జీవు డెపుడు ఏవిధమైన స్వప్నమును కాంచక యుండునో అప్పుడు పరబ్రహ్మతో నేకీ భవించుచున్నాడు. అను పరమాత్మయం దేకీభవమును ప్రతిపాదించునట్టి ప్రతివచనమును బట్టియు నిట్లు నిర్ణయింపబడుచున్నది. ఇట్లే వాజసనేయి శాఖవా రిదే ప్రకరణములో ''య ఏష విజ్ఞానమయః పురుషః క్వవైతదభూత్'' - ''య ఏషో೭న్తర్హృదయ ఆకాశః'' ఇట్టి ప్రతివచనములలో విజ్ఞానమయ శబ్దముతో జీవునిచెప్పి తద్వ్యతిరిక్తమగు పరమాత్మను వర్ణించుచున్నారు. ఎవనితో నేకీభావము లభింప జీవునకు సుషుప్తిదశయందు విశేష విజ్ఞానములు లేకుండుటయు - విక్షేప శూన్యత్వమును - కామాదిమలాభావమును - సంపన్నము లగుచున్నవో - ముక్తిదశయందు సకలభేద నివృత్తిపూర్వకముగ ఏవస్తువునం దైక్యము సంభవించుచున్నదో అది బ్రహ్మతత్త్వమని ప్రతిపాదించుటకై బ్రహ్మ వాక్యమునందు జీవపరమార్శము కావింపబడినది యని యర్థము -
వాక్యాన్యయాధి కరణమ్ 6.
19. సూ : వాక్యాన్వాయాత్
వివృతిః :- బృహదారణ్యకే మైత్రీయీబ్రాహ్మణ శ్రూయతే ''ఆత్మా వారే ద్రష్టవ్యః'' ఇత్యస్మిన్ వాక్యే ద్రష్టవ్యత్వాది రూపేణోవ దిష్ట ఆత్మా బ్రహ్మైవ - న జీవః - కుతః? వాక్యాన్వయాత్ = మోక్షసాదనప్రశ్నః - తాత్సాధనత యాత్మదర్శనోపదేశః - ఏకవిజ్ఞానేన సర్వ విజ్ఞ నోపపాదన మిత్యాది పూర్యోత్తరార్థ పర్యాలోచనయా೭స్య వాక్యస్య పరమాత్మన్యే వాన్వితత్వావగమాత్.
వివరణము :- బృహదారణ్యకోపనిషత్తులోని మైత్రేయీ బ్రహ్మణములో ''ఆత్మ వారే ! ద్రష్టవ్యః.....'' యాజ్ఞవల్క్యమహర్షి తన భార్యయగు మైత్రియితో నిట్లనెను. అమృతత్వమును పొందగోరువారిచే నాత్మతత్త్వ సాక్షాత్కారము సంపాదింపదగినది యని. ఈ వాక్యములో ద్రష్టవ్యముగా చెప్పబడిన ఆత్మ పరబ్రహ్మయే. కాని జీవాత్మకాదు - ఏలయన? ఈ ప్రకరణములో కానవచ్చుచున్న మైత్రేయి తనభర్తతో ప్రసంగించుచు మోక్షసాధన మెద్దియని చేసిన ప్రశ్నయు - తత్సాధనము ఆత్మదర్శనమే అను యాజ్ఞవల్క్యుని యుపదేశమున్ను - ఏకవిజ్ఞానముతో సర్వవిజ్ఞానము సంభవించునని చేసిన ప్రతిపాదనమును - ఇట్టి పూర్వోత్తరార్థముల యొక్క పర్యాలోచనమను బాగుగ జరిపి చూడపైన నుదాహరించిన వాక్యమునకు పరమాత్మయందే తాత్పర్యమని తెలియవచ్చుచున్నది గనుక.
20. సూ: ప్రతిజ్ఞాసిద్ధే ర్లింగ మాశ్మరథ్యః
వివృతిః :- ప్రతిజ్ఞసిద్ధేః= ''ఆత్మని విజ్ఞాతే సర్వ మిదం విజ్ఞాతం భవతి'' ఇతి యా ప్రతిజ్ఞా కృతా తస్యాస్సిద్ధేః లింగం = జీవాత్మ నోప క్రమ ఇతీదం లింగ మితి. ఆశ్మరథ్యః = ఆశ్మరథ్య ఆచార్యో మన్యతే - జీవబ్రహ్మణో ర్హి భేదాభేదౌ స్తఇతి, అత్రాభేదాంశ మాదాయ జీవధర్మై రుపక్రమః ప్రతిజ్ఞాసిద్ధయే కృత ఇత్యశ్మరథ్య స్యాచార్య స్యాశయః - తథా చ జీవబ్రహ్మణోః కార్యకారణభావో೭ స్తీతి చ తదాశయః.
వివరణము :- ఆత్మని విజ్ఞాతే.... భవతి ఆత్మ తెలియబడగా నీదృశ్యజాతమంతయు తెలియబడుచున్నది యనుచు (ఒక వస్తువు తెలియబడగా సమస్తమును తెలియబడుననెడి (ఏకవిజ్ఞానేన సర్వ విజ్ఞానము లభించు నను) ఒక ప్రతిజ్ఞ ఈ బ్రహ్మణమున కావచ్చుచున్నది. ఇచట ''ఆత్మని...'' అని జీవాత్మను బోధించు శబ్దముతో నుపక్రమించుట = అరంభించుట యనునది జీవాత్మకు పరమాత్మతో సంపూర్ణభేద మున్నప్పుడే ఈ ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞయు - ఇదగ్‌ం సర్వం యదయ మాత్మా'' ఈ నిఖిలప్రపంచమును ఈ యాత్మకంటె వేరైనదికాదు అని చేయబడిన జీవాత్మకు సంబంధించిన సార్వాత్మ్యప్రతిజ్ఞయు సిద్ధించ గలవు అను అంశమును సూచించు లింగము = చిహ్నమని ఆశ్మరథ్యాచార్యులు తలంచుచున్నారు.
జీవబ్రహ్మలకు పరస్పరము భేదమును అభేదమును గూడ కలదనియు - అందు అభేదాంశమును స్వీకరించి ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞను సాధించుటకై జీవధర్మములతో నీ ప్రకరణ ముపక్రాంతమైనది యనియు - మరియు జీవబ్రహ్మల కిరువురకు కార్యకారణ భావము కూడ కలదనియు ఆశ్మరథ్యుల యాశయము.
21. సూ : ఉత్క్రమిష్యత ఏవంభావా దిత్యౌడులోమిః
వివృతిః :- ఉత్క్రమిష్యతః = విజ్ఞానాత్మన ఏవావిద్యాకలుషితస్య జ్ఞానధ్యానాది సాధనానుష్ఠానా త్సంప్రసన్నస్య దేహాదిసంఘాతా దుత్క్రమిష్యతః - ఏవం భావత్ బ్రహ్మ ణౖకీభావాత్ - భవిష్య దభేద మాదాయ జీవధర్మై రుపక్రమ ఇత్యౌడులోమి రాచార్యో మన్యతే - సంసార దశాయాం జీవబ్రహ్మణో ర్భేద ఏవేతి, ముక్తిదశాయాం త్వభేదఇ త్యౌడులోమే రాశయః -
వివరణము :- సంసారదశయందు అ విద్యా కామకర్మాదులతో కలుషితుడైయుండి జ్ఞాన ధ్యాన యోగాభ్యాసములచేత మిక్కిలి ప్రసన్నుడై దేహేంద్రియాది సంఘాతమునుండి ఉత్క్రాంతి పొందబోవుతున్న జీవాత్మకు పరబ్రహ్మతో నేకత్వము నొందుట సంభవించును గాన ముక్తిదశయందు రాబోవుచున్న అభేదము = ఏకత్వమును పురస్కరించుకొని జీవధర్మములతో నీ ప్రకరణ ముపక్రాంతమైనది యని ఔడులోమ్యాచార్యులు తలంచుచున్నారు. సంసార దశయందు జీవబ్రహ్మలకు భేదమే ఉండుననియు - ముక్తిదశయందు మాత్రము అభేద మేర్పడుననియు వీరి యాశయము.
22. సూ : అవస్థితే రితి కాసకృత్స్నః
వివృతిః :- అవస్థితేః = పరమాత్మన ఏవా విద్యాకల్పితేన జీవరూపేణావస్థానాత్ - ఇతి - కాశకృత్స్నః = ఏవం కాశకృత్స్న ఆచార్యశ్శ్రతితాత్పర్యజ్ఞో మన్యతే - అతః పూర్వోదాహృతం మైత్రేయీ బ్రహ్మణవాక్యం పరబ్రహ్మణి సమన్విత మితి సిద్ధమ్.
అయమేవ హి సూత్రకార స్యాభిప్రయః - తత్త్వమస్యాది శ్రుత్యనుసారిత్వాత్ -
వివరణము: - పరమాత్మయే అవిద్యాకల్పతమైన భేదమువలన జీవరూపముతో నుండుట సంభవించుచున్నది గాని జీవాత్మ పరమాత్మలకు వాస్తవభేదములేదు గనుక వాస్తవాభేదము ననుసరించియే ఇట్టి ఉపక్రమణము చేయబడినదని శ్రుతి తాత్పర్యజ్ఞుడగు కాశకృత్స్నాచార్యులు తలంచుచున్నారు. కాన పూర్వ ముదహరించిన మైత్రీయీబ్రహ్మణ వాక్యము పరబ్రహ్మ తత్త్వమునందు సమన్వయము పొందుచున్నదియని సిద్ధముగుచున్నది.
ఈపక్షమే ''తత్త్వమసి'' మొదలగు మహావాక్యానుసారియగుట వలన సూత్రకారాభి మతమని తెలియదగును.
ప్రకృత్యధికరణమ్ 7.
23. సూ : ప్రకృతి శ్చ ప్రతిజ్ఞాదృష్టాన్తానుపరోధాత్.
వివృతిః :- న్రిశ్శేయససిద్ధయే బ్రహ్మ జీజ్ఞాస్య మిత్యుక్త్వా తస్య ''జన్మద్యస్య యతః'' ఇతి జగజ్జన్మాదికారణత్వం లక్షణ ముక్తం - తచ్చ కారణత్వం ఉపాదానకారణ, నిమిత్తకారణ చ సమాన మితి తద్వి శేష నిర్ధారణాయ విచారో೭ త్రక్రియతే. ప్రకృతిః - చ = జిజ్ఞాస్యం పరం బ్రహ్మ జగత్ప్రతి ఉపాదానకారణం నిమిత్తకారణం చ భవతి. న కేవలం నిమిత్తకారణ మేవ. కుతః? ప్రతిజ్ఞాదృష్టానుపరోధాత్ = ''యేనాశ్రుతం శ్రుతంభవతి'' ఇత్యాది శ్రుత్యుక్తా ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానవ్రతిజ్ఞా - ''యథాసౌమ్యైకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాద్వాచారంభణం వికారోనామధేయం.'' ఇత్యాది శ్రుత్యుక్తో దృష్టాన్త శ్చ - తయో రుపరోధాభావాత్ - తదనుసారా దిత్యర్థః - బ్రహ్మణః కేవలనిమిత్తత్వే బ్రహ్మజ్ఞానేన సకలకార్య విజ్ఞానోక్తిః - మృదాది ద్రష్టాన్త శ్చ నోపపద్యతే.
వివరణము :- నిశ్శ్రేయసమనగా మోక్షము. తత్సిధ్ధికోఱకు బ్రహ్మతత్త్వవిచార మవశ్యకమని చెప్పి ఆ విచార్యమగు బ్రహ్మకు ''జన్మాద్యస్య యతః'' అనుసూత్రములో జగజ్జన్మ స్థితిభంగ కారణత్వము లక్షణమని పుర్వము ప్రతిపాదింపబడినది. ఆ చెప్పబడిన కారణత్వము బ్రహ్మ జగత్తును గూర్చి ఉపాదానకారణమని చెప్పినను, నిమిత్తకారణమని చెప్పినను సమానమే యగును. అట్లగుటచే నిచట ఆ విశేషమును నిర్ధారణచేయుటకై విచారము చేయబడుచున్నది.
జగత్తనుగూర్చి పరబ్రహ్మ ఉపాదానకారణమును, నిమిత్తకారణమును గూడ నగును. కేవలము నిమిత్తకారణము మాత్రమేకాదు- ఏలయన? పృతిజ్ఞాదృష్టాన్తముల ననుసరించి యిట్లు నిర్ధారణ చేయబడుచున్నది. ''యేనా೭శ్రుతం శ్రుతం భవతి'' ఏ ఒక్క వస్తువు విచారింపబడగ - విచారింపబడని సర్వమునుగూడ విచారింపబడినది యగునో, ఏ వస్తువు తెలియబడగ పూర్వము తెలియబడని సర్వమును తెలియబడినది యగునో అట్టివస్తువు సర్వకారణమగు సద్రూప పరబ్రహ్మవస్తువు అని ఛాన్దోగ్యోపనిషత్తులో వర్ణింపబడినది. ఇదియే ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ యనబడును. ఇట్టి ప్రతిజ్ఞయు - ''యథా సౌమ్యైకేన మృత్పిండేన ... నామధేయం'' అని పూర్వోక్త ప్రతిజ్ఞను సమర్థించుటకు ప్రదర్శింపబడిన మృదాది దృష్టాంతమున్నూ - వీని ననుసరించి యిట్లు నిర్ణయింపబడినది. బ్రహ్మ జగత్తునుగూర్చి నిమిత్తకారణము మాత్రమేయనుచో బ్రహ్మవిజ్ఞానమువలన సకలకార్య ప్రపంచ విజ్ఞానము కలుగుననుటయు - మృత్తు = మట్టి మొదలగు వానిని దృష్టాన్తములుగా నిచ్చుటయు నుపపన్నములు కానేరవు.
24. సూ : అభిధ్యోపదేశాచ్చ
వివృతిః :- చ = కించ -
అఖిద్యోపదేశాత్ = ''సో೭కామయత - బహు స్యాం ప్రజాయే యేతి....'' ఇతి - ''తదైక్షత బహు స్యాం ప్రజయేయేతి ....'' ఇతి తత్ర తత్ర అభిధ్యా = సంకల్ప స్తత్పూర్వికాయా స్స్వతంత్రప్పవృత్తే ర్ద ర్శితత్వా త్కర్తృత్వం = నిమిత్తకారణత్వం - ''బహుస్యాం...'' ఇత్యత్ర సృష్టి సంకల్పస్య ఆత్మకర్మ కత్వో క్త్వోపాదానకరణత్వం చావగమ్యతే - అతో బ్రహ్మణ ఉభయవిధకారణత్వ మప్యంగీక్రయతే -
వివరణము : - అభిధ్యయనగ సంకల్పము - ''సోకామయత బహుస్యాం ప్రజాయే యేతి'' - ''తదైక్షత బహు స్యాం ప్రజాయేయేతి '' - అని అచ్చటచ్చట తైత్తిరీయ ఛాన్దోగ్యోపనిషత్తులలో - ఆపరమాత్మ నేను బహుధా అగుదును. అని సంకల్పముచేసి స్వతంత్రముగ సృష్టియందు ప్రవర్తించెనని వర్ణించియుండుటచేత పరమాత్మ కర్తయనియు = నిమిత్త కారణమనియు ''నేను బహువిధములుగ నగుదును'' అను పరమాత్మ యొక్క సృష్టిసంకల్పములో ఆత్మయే కర్మగ వర్ణింపబడియుండుట చేత ఉపాదానకారమణమనియు తెలియబడుచున్నది. కాన పరబ్రహ్మకు జగత్తును కార్యమును గురించి ఉభయవిధకారణత్వమును అంగీకరింపబడుచున్నది.
25. సూ : సాక్షా చ్చోభయామ్నానాత్.
వివృతిః :- ''సర్వాణి హ వా ఇమాని భూతా న్యాకాశా దేవ సముత్పద్యన్తే - ఆకాశం ప్రత్యస్తం యన్తి'' ఇత్యత్ర సాక్షాత్ = ఆకాశపదేన సాక్షాత్ బ్రహ్మ గృహీత్వా ఉభయామ్నానాత్ = జగదుత్పత్తి ప్రళయయో రామ్నానా ద్బ్రహ్మణ ఉభయవిధ కారణత్వ మస్యస్తీత్యత్ర న కోపి విరోధః.
వివరణము :- ''సర్వాణి హవా ఇమాని భూతా న్యాకాశా దేవ సముత్పద్యన్తే - ఆకాశం ప్రత్యస్తం యన్తి'' ఈ సమస్తమైన భూతములును ఆకాశమునుండియే పుట్టుచున్నవి. ఆకాశమునందే లయించుచున్నవి. యని ఈ వాక్యములో ఆకాశపదముతో సాక్షాత్తుగ బ్రహ్మను గ్రహించి జగత్తుయొక్క ఉత్పత్తి ప్రళయములను రెంటిని వర్ణించియుండుటవలన బ్రహ్మకు నిమిత్తకారణత్వము - ఉపాదాన కారణత్వమును కలదనుటలో విరోధమేమియు లేదు.
26. సూ : ఆత్మకృతేః పరిణామాత్
వివృతిః :- ''తదాత్మానగ్గ్ స్వయ మకురుత - '' ఇత్యత్ర ''ఆత్మానాం '' ఇత్యనేన ద్వితీయావిభక్త్యన్తపదేన కృతివిషయత్వరూపం కర్మత్వం చామ్నాయతే -తతశ్చ బ్రహ్మణ ఉపదానత్వం నిమిత్తత్వం చావిరుద్దం - కుతః? ఆత్మకృతేః = ఆత్మసంబంన్దినీ కృతిః = ఆత్మకృతిః తతః = కర్తృత్వ కర్మత్వ సాధారణ్య నాత్మకృతే ః శ్రావణాత్. కథ మేత ద్ఘటతే? కర్తృత్వేన పూర్వసిద్ధస్య బ్రహ్మణః కృతికర్మత్వం సాధ్యత్వరూప మిత్యత అహ - పరిమాణామాత్ = పరిణామో నామాత్ర వివర్తః - సిద్ధస్యాపి వివర్తాత్మనా సాధ్యత్వా త్కర్మత్వోపపత్తి రిత్యర్థః - యద్వా - ''పరిణామాత్'' ఇతి సూత్రాన్తరం - తస్యాయ మర్థః - పరిణామాత్ = ''సచ్చత్యచ్చాభవత్ - '' ఇతి సర్వవికారాత్మనా బ్రహ్మణ ఏవ పరిణామోక్తా బ్రహ్మ ప్రకృతి శ్చ = ఉపాదాన మపి భవతీతి నిశ్చీయతే.
వివరణము :- ''తదాత్మానగ్గ్ స్వయ మకురుత'' ఆ బ్రహ్మ తనను స్వయముగ తాను జగదాకారముగ చేసెను అని చెప్పు ఈ వాక్యములోని ''ఆత్మానాం '' అను కర్మను బోధించు ద్వితీయా విభక్తి అంతము నందు గల పదముచేత కృతివిషణయత్వరూపమగు కర్మత్వమున్నూ - ''స్వయ మకురుత'' అను భాగముచేత కృతిమత్వరూపముగు కర్తృత్వమున్నూ వర్ణింపబడియున్నది. కాన బ్రహ్మవస్తువును ఉపాదాన కారణత్వమున్నూ - నిమిత్తకారణత్వమున్నూ - రెండును కలవనుటలో విరోధమేమియు లేదు. ఏలయన ? ఆత్మకృతేః = అనగా ఆత్మకు సంబందించిన కృతివలన అని యర్థము. పైవాక్యములో ''స్వయం'' అని ఆత్మకు కర్తృత్వము -''ఆత్మానం'' అని ఆత్మకు కర్మత్వము ఈ రెండును వర్ణింపబడినవి. కర్మత్వము చెప్పుటతో ఉపాదానకారణ్వము సిద్దించును - కర్తృత్వముచేత నిమిత్తకారణత్వమును సిద్దించును. ప్రయత్నములతో సాధింపదగినది అనగా సిద్ధమై యుండనిది కర్మ- సిద్ధమైయుండి తగు ప్రయత్నములతో కార్యమును సాధింపబూనువాడు కర్త - ఇట్లుండ కర్తృత్వుముచే పూర్వసిద్ధమైన బ్రహ్మకు సాద్యస్వరూపమగు కర్మత్వమెట్లు సిద్ధించునను అశంక రాగా చెప్పుచున్నారు. పరిణామాత్ అని- పరిణామమనగా నిచట వివర్తనము అని అర్థము - సిద్దస్వరూపుడే ఐనను బ్రహ్మ అతనికి వివర్తరూపముగ సాధ్య స్వరూపత్వము సంభవించును గాన కర్మత్వ ముపన్నము కాగలదు. ( వివర్తమనగా కారణమైన వస్తువు తన స్వరూపమును కోల్పోకనే అన్యధా = మరియొక విధముగ భాసించుట) ఈ సూత్రములోని ''పరిణామాత్'' అను సూత్రభాగమును ఆ సూత్రమునుండి పృథక్కరించి ప్రత్యేక సూత్రముగజేసి యిపుడు వ్యాఖ్యానము చేయబడుచున్నది. ''సచ్చ త్యచ్ఛాభవత్'' ఆ బ్రహ్మ సర్వభూతాత్మకుడాయె నని సర్వకార్యాకారముగ పరిణామము బ్రహ్మకు వర్ణింపబడినది. కాన బ్రహ్మ ఉపాదానముకూడ నగుచున్నాడని నిశ్చయింపబడుచున్నది.
27. సూ : యోని శ్చ హి గీయతే
వివృతిః :- యోనిః - చ = ''కర్తార మీశం పురుషాం బ్రహ్మ యోనిం.......'' ''య ద్భూతయోనిం పరిశ్యన్తి ధీరాః '' ఇతి చ వేదాన్తేషు గీయతే = ఆమ్నాయతే - యోనిశబ్ద శ్చోపాదాన కారవాచీ - తస్మా ద్బ్రహ్మణః ప్రకృతిత్వం నిమిత్తకారణత్వం చ సిద్ధం -
వివరణము :- '' కర్తార మీశం పురుషం బ్రహ్మయోనిం'' - అనియు ''యద్భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః '' అనియు వేదన్తముల యందచ్చటచ్చట పఠించబడుచున్నది. అ వాక్యములలో కానవచ్చుచున్న యోనిశబ్ద ముపాదానకారణమును బోధించునది. కాన బ్రహ్మకు ఉపాదానకారణత్వ నిమిత్తకారణత్వములు రెండును సిద్దించును.
సర్వవ్యాఖ్యానాధి కరణమ్ 8
28. సూ : ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతాః
వివృతిః :- ఈక్షతే ర్నాశబ్ద మిత్యారభ్య ప్రధానకరారణ వాదః పునఃపున రాశంక్య నిరాకృతః - ఇదానీం బ్రహ్మకారణవాదపక్షస్య ప్రతిపక్షభూతానాం అణ్వాది కారణవాదానాం నిరాసా యేద మారభ్యతే - ఏతేన = ప్రధాన కారణ వాద ప్రతిషేదక న్యాయకలాపేన - [ ప్రధాన కారణవాద ప్రతిషేధే హేతవః - అశబ్దత్వ - అచేతసత్వ - ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానానుపపత్త్వాదయః ] సర్వే = అణ్వాది కారణవాదా అపివ్యాఖ్యాతాః = నిరాకృతత్వేన వ్యాఖ్యాతా ఇతి వేదితవ్యాః ప్రధానమల్ల నిబర్హణన్యయేన. వ్యాఖ్యాతాః = ఇత్యేవం పదస్యావృత్తి రధ్యాయ పరిసమాప్తిం ద్యోతయతి -
''అణ్వ్య ఇమే దానా భవన్తి'' ఇతి వాక్య మణుకారవాదస్య| '' అసద్వా ఇద మగ్ర అసీత్'' ఇతివాక్య మసత్కారణవాదస్య'' ''స్వభావ మేకే'' ఇతి వాక్యం స్వభావవాద స్యోపోద్బలకం భవతి. తత శ్చేమే వాదా శ్శ్రుతిసంప్రతిపన్నా ఇతి కేషాంచన వ్యామోహ స్స్యాత్తదనేన నిరాకృతో వేదివ్యః. తస్మా జ్జగత్కారణ సర్వజ్ఞే జిజ్ఞాస్యే బ్రహ్మణి వేదాన్తానాం సమస్వయో నాన్యత్రేతి సిద్ధమ్
ఇతి శ్రీ గాయత్రీ పీఠాదీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతి వర విరచాతాయాం బ్రహ్మసూత్ర వివృతౌ ప్రథమాద్యాయస్య చతుర్థః పాదః.
(సమన్యయా ధ్యాయ స్సమాప్తః)
వివరణము :- '' ఈక్షతేర్నా೭శబ్దం '' అను సూత్రము మొదలుచేసికొని ప్రధానకారణవాదము మాటిమాటికి అశంకా సమాధానములతో నిరాకరింపబడినది. ఇప్పుడు బ్రహ్మకారణవాదమునకు ప్రతిపక్షులగు అణుకారణవాదము మొదలగు వాదములను నిరాకరించుటకై యీ అధికరణ మారంభింపబడుచున్నది- ప్రధానకారణ వాదమును నిరసించు పూర్వోక్త న్యాయసముదాయముచేత (ప్రధానకారణ వాదమును ప్రతి షేదించు హేతువులు :- వేదశబ్దా ప్రతిపాద్యత్వము - అచేతనత్వము-ఏకవిజ్ఞా నేన సర్వవిజ్ఞానా నుపపత్తి మొదలగునవి. ఇయ్యవి అణ్వాది కారణ పక్షములను నిరసించుటయందును సమర్థములైనవియే-) అణ్వాది కారణవాదములన్నియు నిరాకరింపబడినట్లుగా స్పష్టముగా తెలియజేయబడినవి- ప్రధానమల్లుని జయించిన ప్రభుసంస్థానమున నున్న మల్లులనందర జయించినట్లే యగును. అట్లే ఇచట ప్రధానమల్ల స్థానీయమగు ప్రధానవాదము ఖండితముకాగా అణ్వాదికారణ వాదములన్నియు ఖండితములైనట్లే. ''వ్యాఖ్యాతాః'' అను పదముయొక్క అవృత్తి =పునః కథనము అథ్యాయ పరిసమాప్తిని ద్యోతనచేయుచున్నది.
''అణ్వ్య ఇమే ధానా భవన్తి'' అను వాక్యము జగత్తును గూర్చి పరమాణువులు కారణమను అణుకారణవాదులకు - ''అసద్వా ఇద మగ్రఅసీత్'' అనువాక్యము అసత్కారణ వాదమునకు - ''స్వభావమేకే'' అను వాక్యము స్వభావ వాదమునకును ఉపోద్బలకము లగుచున్నవి గాన ఇవి అన్నియు శ్రుత్యంగీకారము కలవియే అను భ్రాంతి కొందరకు కలుగవచ్చును. ఆవ్యామోహమీ సూత్రముతో నిరాకరింపబడినది. కాన సర్వజగత్కారణమైన సర్వజ్ఞమైన పరబ్రహ్మయందే సమస్త వేదాంత వాక్యములకు తాత్పర్యము కాని అన్యత్రకాదని సిద్ధమగు చున్నది.
ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యా శంకర భారతీ యతివర విరచితమగు బ్రహ్మ సూత్రార్థ వివరణమున ప్రథమాధ్యాయమున చతుర్థపాదుము ముగిసెను-
(సమన్వయాధ్యాయము ముగిసెను)