Brahma Suthra Vivruthi    Chapters    Last Page

ద్వితీయాధ్యాయే (అవిరోధాధ్యాయే)

- ప్రథమః పాదః -

బ్రహ్మసూత్రవివృతి ః :c

ప్రథమేధ్యాయే సర్వజ్ఞ స్సర్వశక్తిః పరమేశ్వరో జగదుత్పత్తి స్థితిసంహారకారణం - స ఏవ చ సర్వేషా మాత్మా ఇతి - తత్త్రైవ సర్వేషాం వేదాన్తవాక్యానాం సమన్వయ ఇతి ప్రతిపాదితమ్‌ - ప్రధానాది కారణవాదా శ్చాశబ్ధత్వేన నిరాకృతాః ఇదానీం స్వపక్షే స్మృతిన్యాయ విరోధః పరిహర్తవ్య ఇతి - ప్రధానాది కారణవాదానాం చ న్యాయాభావ మూలత్వ మేవేతి - సృష్ట్యాది ప్రక్రియాయా శ్చ సర్వవేదాన్తే షై#్వకరూప్య మస్తీతి చేత్యేత త్ర్పతిపాదనాయ ద్వితీయోధ్యాయ ఆరభ్యతే - అత్ర చ ప్రథమపాదే ప్రథమాధ్యాయ ప్రతిపాదితస్య సమన్వయస్య సాంఖ్యాది స్మృతిభి స్తదీయాభి ర్యుక్తిభి శ్చ విరోధః పరిహ్రియతే - ద్వితీయపాదే సాంఖ్యాద్యాగమానాం భ్రాన్తిమూలత్వ మవిరోధాయ ప్రతిపాద్యతే - తృతీయపాదే ప్రతివేదాన్తం సృష్టిశ్రుతీనాం - జీవాత్మశ్రుతీనాం చ వ్యోమాది మహాభూతానాం జన్మలయక్రమాది కథనే నావిరోధః ప్రతిపాద్యతే. చతుర్థపాదే లింగశరీర శ్రుతీనా మవిరోధః ప్రతిపాద్యతే. అత శ్చాయ మధ్యాయ అవిరోధాద్యాయ ఇతి వ్యవహ్రియతే ||

వివరణము ః- ప్రథమాధ్యాయమున సర్వజ్ఞుడు - శర్వసక్తి సంపన్నుడు నౌ పరమాత్మ జగదుత్పతిలయకారణమనియు - ఆ పరమాత్మయే సర్వప్రాణులకు ఆత్మయనియు - ఆ పరమాత్మ తత్త్వమునందే సమస్తవేదాన్తములకును తాత్పర్య మనియు ప్రతిపాదింప బడినది. ప్రధానాది కారణ వాదములును వేద ప్రతిపాద్యములు = వేదసమ్మతములు కావు గనుక నిరాకరింప బడినవి. ఇక నీ యధ్యాయము శ్రుతిసిద్ధమగు స్వపక్షమునందలి స్మృతివిరోధములను - న్యాయ (యుక్తి) విరోధములను పరిహరించవలయుననియు - ప్రధానాదికారణవాదములు యుక్త్యాభావ మూలకములేగాని సద్యుక్తి సంపన్నములు కావనియు - సృష్ట్యాది ప్రక్రియలు సమస్త వేదాన్తభాగములయందును ఏకరూపముగనే ప్రతిపాదింపబడి యున్నవనియు - నీ యంశములను ప్రతిపాదించుటకై ఆరంభింప బడుచున్నది.

ఈ యధ్యాయమున - ప్రథమపాదములో ప్రథమాధ్యాయములో నిరూపింపబడిన సమన్వయమునకు సాంఖ్యాది శాస్త్రములతోను - వారు ఉదహరించుచున్న యుక్తులతోను గల విరోధము పరిహరింపబడును. ద్వితీయపాదములో సాంఖ్యాది శాస్త్రములు భ్రాంతిమూలకములనియు - కనుక వానితో శ్రౌతసమన్వయమునకు విరోధములేదని (అవిరోధమేయని)యు ప్రతిపాదింపబడును. మూడవ పాదములో ఆయావేదాన్తభాగములలో గల సృష్టి ప్రతిపాదక శ్రుతులకును - జీవాత్మస్వరూప బోధక శ్రుతులకును - ఆకాశాది పంచమహాభూతములయొక్క జన్మలయక్రమాదుల నిరూపణముద్వారా విరోధాభావము (అవిరోధము) ప్రతిపాదింపబడును. నాల్గవపాదమున లింగ (సూక్ష్మ) శరీర ప్రతిపాదక శ్రుతివాక్యములలోని విరోధాభావము (అవిరోధము) ప్రతిపాదింపబడును. కాన నీ యధ్యాయము అవిరోధాధ్యాయమని వ్యవహరింపబడుచున్నది.

స్మృత్యధి కరణమ్‌ 1

1. సూ : స్మృత్యనవకాశదోష ప్రసంగ ఇతిచేన్నాన్య

స్మృత్య నవకాశదోష ప్రసంగాత్‌

వివృతిః :- తత్రాదౌ తావ త్స్మృతివిరోధ ముపన్యస్య పరిహరతి. బ్రహైవ జగతః కారణ మితి వేదాన్తతాత్పర్యే నిశ్చితే సతి స్మృత్యనవకాశ దోషప్రసంగః = స్మృతేః = మహర్షికపిలప్రోక్తాయా స్తన్త్రాఖ్యాయాః ప్రధాన కారణత్వ ప్రతిపాదికాయా స్తత్వప్రతిపాదనమాత్ర పరాయాః (తంత్ర్యన్తే ప్రతిపాద్యన్తే తత్త్వాని ప్రధానాదీన్యత్రేతి తన్త్రం = కాపిల పంచశిఖాదిముని ప్రణీతం శాస్త్రమ్‌)అనవకాశదోషస్య = అనవకాశరూప దోషస్య = అప్రామాణ్యలక్షణస్య దోషస్య ప్రసంగః = ప్రసక్తిః స్యాత్‌ - (కాపిలస్మృతే స్తత్వ

37]

ప్రతిపాదనమాత్ర పరత్వా ద్విషయాంతర ప్రతిపాదనస్య తత్రా దృశ్యమానత్వా న్నిరవకాశత్వమ్‌ - మన్వాది స్మృతీనాం తు ధర్మప్రతిపాదన పరత్వ మప్యస్తీతి తాసాం ధర్మవిషయే ప్రామాణ్య మవ్యాహత మేవ భవతీతి సావకాశత్వమ్‌. నిరవకాశం హి శాస్త్రం ప్రబల మితి శాస్త్రవిదాం మర్యాదా - అతో వేదానాం తాత్పర్యం ప్రబల సాంఖ్యస్మృత్యనుసారేణౖవ నేయమ్‌ - ఇతి -చేత్‌ = ఇత్యుక్తంచేత్‌. న = న తథా వక్తవ్యమ్‌ - కుత ఇతి చేత్‌ ? అన్యస్మృత్య నవకాశదోష ప్రసంగాత్‌ = అన్యాసాం = సాంఖ్యస్మృతిభిన్నానాం వైదికాగ్రేసర పరమాప్త మహర్షి మన్వాది ప్రణీతానాం - బ్రహ్మకారణత్వ ప్రతిపాదికానాం బహ్వీనాం స్మృతీనాం అనవకాశ దోష ప్రసంగాత్‌ = అప్రామాణ్యదోషస్య ప్రసంగాత్‌ - బహ్వనురోధోన్యాయ్య ఇత్యభిజ్ఞ నిర్ణయః. అత స్తదనురోధేన బ్రహ్మకారణత్వవాద ఏవాదర ః కర్తవ్య ఇతి సిద్ధ్యతి - అపిచ - వేదస్య హి నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం రవేరివ రూపవిషయే - పురుషవచసాం తు ప్రామాణ్యం మూలాంత రాపేక్షం, వక్తృస్మృతి వ్యవహితం చేతి విప్రకర్షః - తస్మాద్వేదవిరుద్ధే విషయే స్మృత్యనవకాశ దోషప్రసంగో న దోషాయ భవతి.

వివరణము :- ఈ పాదమున ముందుగ పూర్వోక్త బ్రహ్మకారణవాద పక్షమున స్మృతివిరోధమును ప్రదర్శించి పరిహరించుచున్నారు. వేదాంతముల కన్నిటికిని బ్రహ్మయే జగజ్జన్మాదికారణమని తాత్పర్యము అని నిశ్చయించినచో స్మృత్యనవకాశ దోష ప్రసంగము వాటిల్లును. కపిల మహర్షి ప్రోక్తమైన - ప్రధానతత్త్వమే జగజ్జన్మాది కారణమని ప్రతిపాదించుచు ప్రధాన, మహదహంకారాది తత్త్వములను మాత్రము ప్రతిపాదించుటయందు పర్యవసించు సాంఖ్యస్మృతికి అనవకాశరూపదోషము (అప్రామాణ్యము) ప్రసక్తము కాగలదు. (కపిలమహర్షి ప్రణీతమగు సాంఖ్యస్మృతి ప్రధాన మహదహంకారాది తత్త్వములను మాత్రము ప్రతిపాదన చేయును. విషయాంతరములచట ప్రతిపాదింప (వర్ణింప)బడియుండలేదు. కనుక నిరవకాశము - మన్వాది మహర్షి ప్రణీతములగు స్మృతులకు ధర్మప్రతిపాదన పరత్వము కలదు గాన నా స్మృతులకు ధర్మము విషయములో ప్రామాణ్య మప్రతిహతముగ లభించును. కాన నీ స్మృతులు సావకాశములు. నిరవకాశశాస్త్రము సావకాశశాస్త్రముకంటె ప్రబలమని శాస్త్రమర్మజ్ఞుల నిర్ణయము. కనుక వేదములయొక్క తాత్పర్యమును ప్రబలమగు సాంఖ్యస్మృత్యనుసారముగనే నిర్ణయించవలయును, తద్విరుద్ధముగ నిర్ణయింపరాదు. అని యనరాదు. ఏలయన? అట్లనినచో సాంఖ్యస్మృతికంటె భిన్నమైనట్టి - వైదికాగ్రేసరులును పరమాప్తులునగు మనువు మొదలగు మహర్షులచే రచియింపబడినట్టి - సర్వజ్ఞమగు బ్రహ్మయే జగజ్జన్మాదికారణమని ప్రతిపాదించుచున్నట్టి - బహుసంఖ్యాకములగు స్మృతుల కప్రామాణ్యము సంభవించును. బహు సంఖ్యాకుల ననుసరించుట యుక్తమని యభిజ్ఞుల నిర్ణయము. బ్రహ్మకారణవాదము బహుస్మృత్యనుసారి గనుక ఆ పక్షమునం దాదరము నుంచుట ఉచితము. మరియు రూపములను తెలియజేయుటలో సూర్యభగవానునికి ఇతరాపేక్ష లేకుండగ స్వతస్సిద్ధముగ ప్రామాణ్యము కలదనుట యెట్లు సర్వసంప్రతి పన్నమో, అట్లే వేదములకును స్వప్రతిపాద్యార్థములపట్ల ఇతరానపేక్షమైన స్వతః సిద్ధ ప్రామాణ్యము కలదనుట యుక్తము. పురుష నిర్మితములైన స్మృత్యాదులకు గల ప్రామాణ్య మట్టిదికాదు. అది మూలభూతగ్రంథాంత రాపేక్షగలది. గ్రంథకర్తయగు పురుషుడు తాను రచింపదలచిన గ్రంథార్థములను మూలగ్రంథములనుండి తాను ముందుగ గ్రహించి (తెలిసికొని) ఆ తరువాత ఆ విషయములను స్మరించి ఆ అర్థములను ప్రతిపాదింపగల శబ్దజాలమును సేకరించి అటుపైని గ్రంథమును రచించును. కనుక మూలగ్రంథ ప్రామాణ్యముకంటె యీ పౌరుషేయములగు స్మృత్యాది గ్రంథముల ప్రామాణ్యము చాలా విప్రకృష్టమైనది యగుచున్నది. ఈకారణములను బట్టి పరిశీలింప వేదవిరుద్ధమగు విషయముల ప్రతిపాదించు సందర్భములలో స్మృతుల కప్రామాణ్యదోష ప్రసంగము వచ్చుననుట అయుక్తము కానేరదు.

2. సూ : ఇతరేషాం చానుపలబ్ధేః

వివృతిః :- సాంఖ్యస్మృతే రప్రమాణత్వే కారణాన్తరముచ్యతే. ఇతరేషామ్‌ = సాంఖ్యస్మృతి కల్పితానాం - మహదహంకార తన్మాత్రాణామ్‌ అనుపలబ్ధేః = లోకే, వేదే వా యత్ర క్వాప్యనుపలంభాత్‌ - తన్మహత్తత్త్వాది కల్పక స్మృతి రప్రమాణం - తద్వజ్జగత్కారణత్వేన ప్రతిపన్న స్వతంత్రప్రధాన కల్పకస్మృతే రప్యప్రామాణ్య మేవేతి.

వివరణము :- సాంఖ్యస్మృతి యప్రమాణ మనుటలో మరియొక కారణము చెప్పబడుచున్నది. సాంఖ్యస్మృతియందు కల్పింపబడియున్న ప్రధానతత్త్వేతరములగు మహతత్త్వము-అహంకార తత్త్వము-పంచతన్మాత్రలు మొదలగు పదార్థములు వేదములయందుగాని- లౌకికములగు ఇతర గ్రంథములయందుగాని యెచ్చటను కానుపింప కుండుటవలన ఆ మహాత్తత్వము మొదలగు పదార్థములను కల్పించు సాంఖ్యస్మృతి యప్రమాణమే యగును. అట్లే జగత్కారణము ప్రధానతత్త్వ మని కల్పించుస్మృతియు నప్రమాణమేగాని ప్రమాణము కానేరదు.

యోగ ప్రత్యుక్త్యధికరణమ్‌ 2

3. సూ : ఏతేన యోగః ప్రత్యుక్తః

వివృతిః :- ఏతేన = సాంఖ్యస్మృతి ప్రత్యాఖ్యానేన యోగః = యోగస్మృతి రపి మహర్షి పతంజలి ప్రణీతా ప్రధానాది తత్త్వప్రతిపాదికా ప్రత్యుక్తః = ప్రతిషిద్ధా వేదితవ్యా - శ్రుత్యవిరు ద్ధాష్టాంగయోగే తాత్పర్యవత్వేన తదంశేస్య శాస్త్రస్య ప్రామాణ్యభ్యుపగతేపి శ్రుతివిరుద్ధప్రధానాదివిషయే త్వప్రామాణ్యమేవేతి భావః -

వివరణము :- ఇట్లు సాంఖ్యస్మృతిని నిరాకరించుటతో పతంజలి మహర్షి ప్రణీతమైనట్టి - ప్రధానాది తత్త్వముల ప్రతిపాదించుచున్నట్టి - యోగస్మృతి (యోగశాస్త్రమును) యు నిరాకరింప బడినట్లు తెలిసికొన దగును. ఈ శాస్త్రమునకు శ్రుతివిరుద్ధముకాని యమనియమాద్యష్టాంగయోగమునందు తాత్పర్యము గాన నా యంశమునందు ప్రామాణ్యము నంగీకరించినను శ్రుతివిరుద్ధములగు ప్రధానాది తత్త్వముల విషయములో మాత్ర మప్రామాణ్యమే అని భావము.

విలక్షణాధికరణమ్‌ 3

4. సూ : న విలక్షణత్వా దస్య తథాత్వం చ శబ్దాత్‌

వివృతిః - పూర్వ త్రాధికరణద్వయే అస్య జగతో దృశ్యస్యబ్రహ్మైవ నిమిత్తకారణం ప్రకృతిశ్చేతి య శ్ర్శౌతో నిర్ణయ స్తస్మిన్‌ సాంఖ్యాది స్మృతిప్రయుక్త ఆక్షేపః పరిహృతః - ఇదానీం తర్కనిమిత్త ఆక్షేప ఉదాహృత్య పరిహ్రియతే - న = బ్రహ్మ న జగత్కారణమ్‌ - కుతః ? విలక్షణత్వాత్‌ - అస్య = కారణత్వే నాభిమతా ద్ర్బహ్మణః కార్యభూత స్యాస్య జగత ఆకాశాదే ర్విరుద్ధ ధర్మవత్వాత్‌ - బ్రహ్మ చేతనం - విశుద్ధం చ - జగత్తు అచేతనం - అశుద్ధం చేతి తయోః పరస్పర విరుద్ధ ధర్మవత్త్వం ప్రసిద్ధమ్‌. య ద్యద్విలక్షణం న తత్తత్ర్పకృతికం భవతి. తంతు విలక్షణో ఘటో న కథమపి తంతు ప్రకృతికో భవతి - అతోవిలక్షణత్వాత్‌ = విరుద్ధధర్మవత్త్వాత్‌ బ్రహ్మ న జగతః కారణం భవితు మర్హతి - తథాత్వమ్‌ - చ = బ్రహ్మజగతో ర్వైలక్షణ్యం చ శబ్దాత్‌ = ''విజ్ఞానం చావిజ్ఞానం చ '' ఇతి, జగతి కస్యచిదంశ స్యాచేతనత్వప్రతిపాదకా చ్ఛ్రుతివాక్యా దవగన్తవ్యమ్‌ -

వివరణము :- వెనుకటి రెండధికరణములలోను ఈ పరిదృశ్యమానమగు జగత్తునకు బ్రహ్మవస్తువే నిమిత్తకారణమును - ఉపాదానకారణమును నని చేయబడిన శ్రుతి సమ్మతమగు నిర్ణయముబట్ల సాంఖ్యాది స్మృతులనుబట్టి యేర్పడిన ఆక్షేపము పరిహరింపబడినది. ఇప్పుడు తర్కశాస్త్రమునుబట్టి యేర్పడు ఆక్షేప మిచట పరిహరింప బడుచున్నది.

పరమాత్మ జగత్కారణమని యనుట యుక్తముకాదు. ఏలయన కారణమైన బ్రహ్మయు, కార్యమైన ప్రపంచమును పరస్పర విరుద్ధధర్మములు కలవి యగుటవలన. బ్రహ్మచేతనము - పరిశుద్ధమునైన వస్తువు. జగత్తు - ఆచేతనము - అపరిశుద్ధము నని ప్రసిద్ధము. ఎయ్యెది దేనికంటె విరుద్ధ

స్వభావము కలది యగునో అయ్యది దానినుండి పుట్టినది యనుటకు వీలులేదు. తంతువుల (దారముల) కంటె విలక్షణ స్వభావముగల ఘటము = కుండ తంతువులనుండి పుట్టినది యనుట యుక్తము కాదుగదా ! కానప్రపంచవిరుద్ధ స్వభావముగల బ్రహ్మవస్తువు ప్రపంచకారణముకాజాలదు. బ్రహ్మ జగత్తులకు వైలక్షణ్యము కలదను నంశము. ''విజ్ఞానం చావిజ్ఞానం చ'' సత్యస్వరూపుడగు పరమాత్మ చేతనాచేతనాత్మక ప్రపంచముగ తానయ్యెను. అని జగత్తునందు కొంత భాగమునకు అచేనత్వమును ప్రతిపాదించు శ్రుతివాక్యమువలన తెలిసికొనదగును.

5. సూ : అభిమానివ్యపదేశ స్తు విశేషానుగతిభ్యామ్‌

వివృతిః :- ''మృదబ్రవీత్‌ - '' '' ఆపోబ్రువన్‌ - '' '' తత్తేజ ఐక్షత - '' '' తేహేమే ప్రాణా అహం శ్రేయసే వివదమానాః - '' ఇత్యాదికాభిః శ్రుతిభి ర్భూతేంద్రియాదే ర్జగత శ్చేతనత్వావగమాద్ర్బహ్మజగతో రస్తి వైలక్షణ్య మిత్యేత స్నసిద్ధ్యతీ త్యాశంకాయా మిదం సూత్రమ్‌ - తు = పూర్వోక్తా శంకా నోపపద్యతే - కుతః? పూర్వోక్తాభి శ్ర్శుతిభి ర్భూతేంద్రియాదే ర్జగత శ్చేతనత్వం న ప్రతిపాద్యతే ఇతి. అభిమానివ్యపదేశః = తాను శ్రుతిషు మృదాదిపదైర్న భూతేంద్రియాదీనాం వ్యపదేశః క్రియతే. కింతు తదభిమానినీనీం దేవతానా మే వ్యపదేశః క్రియత ఇతి పరత్యేతవ్యమ్‌ - కుతః? విశేషానుగతిభ్యామ్‌ = విశేషో = విశేషణమ్‌ - అనుగతిః = ప్రవేశః- తాభ్యామ్‌ - ''ఏతా హవై దేవతా అహం శ్రేయసే వివదమానా'' ఇత్యాదిశ్రుత్యా అచేతనానాం ప్రాణానాం (ఇన్ద్రియానాం) దేవతాశ##బ్దేన విశేషితత్వాత్‌ - ''అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్‌'' ఇత్యాది మన్త్రార్థవాదాదిషు సర్వత్ర తత్తదభిమాని దేవతానామనుగతేః (ప్రవేశస్య) శ్రవణాచ్చ - తస్మా చ్ఛ్రుతిషు శ్రూయమాణా మృదాదిశబ్దా శ్చేతన దేవతాబోధనపరా ఇతి - మృదాదికం తు జగత్‌ స్వతః అచేతన మితి చ సిద్ధ్యతి - తత శ్చాచేతన మిదం జగ చ్ఛేతన బ్రహ్మప్రకృతిక మిత్యేత న్నోపపద్యత ఇతి పూర్వః పక్షో వ్యవస్థిత :-

వివరణము:- ''మృదబ్రవీత్‌'' మృత్తు = మట్టి పలికెను. ''ఆపోబ్రువన్‌ '' ఉదకములు పలికినవి. '' తత్తేజ ఐక్షత '' ఆతేజస్సు సంకల్పించెను. '' తేహేమే ప్రాణా అహంశ్రేయసే వివదమానాః'' అవాక్చక్షుశ్రోత్రప్రాణాదులు తమతమ శ్రైష్ఠ్యము విషయములో వివాదమును చేయుచున్నవి యగుచు - అవి యిట్లు మృదాదులకు మాటలాడుట మొదలగు చేతనోచిత వ్యాపారముల వర్ణించు కొన్ని శ్రుతివాక్యములనుబట్టి భూతములు, ఇంద్రియములు మొదలగు పదార్థములకు చేతనత్వమున్నట్లు తెలియవచ్చుచున్నది గాన జగద్ర్బహ్మలకు వైలక్షణ్యముకలదని యనుట - విలక్షణములు గనుక జగద్ర్బహ్మలకు కార్యకారణభావ ముపపన్నము కాదని యనుట - సిద్ధించదని ఆక్షేపమురాగా సమాధానముగా నీ సూత్రము చెప్పుచున్నారు- ఈ చెప్పిన ఆక్షేపము ఉపవన్నము కానేరదు. ఏలయన? పూర్వోదాహృత శ్రుతివాక్యములలో భూతేంద్రియాది రూపమగు జగత్తునకు చేతనత్వము ప్రతిపాదింపబడుటలేదు; ఆ శ్రుతులలో మృదాదిపదములతో భూతేంద్రియాది పదార్థములు వర్ణింపబడుటలేదని, అచట ఆ మృదాది పదార్థముల కభిమాని దేవతలగు చేతనవ్యక్తులే వర్ణింపబడుచున్నారని తెలిసికొనదగును. కారణమేమియన ? విశేషాను గతుల చేత నట్లు నిర్ణయింపబడచున్నది. '' ఏతా హ వై దేవతా అహంశ్రేయసే వివదమానాః'' ఈ ప్రాణంద్రియాది దేవతలు స్వస్వశ్రైష్ట్యముకొఱకు వివాదము చేయుచున్న వారగుచు - అని వర్ణించుచున్న ఈ శ్రుతివాక్యములో ప్రాణాదులకు ''దేవతాః'' అని దేవతా శబ్దము విశేషణముగ వాడియుండుటవలనను - ''అగ్ని ర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్‌ '' అగ్ని వాగింద్రియరూపుడై ముఖమును ప్రవేశించెను. అని యిట్లు వర్ణించు మన్త్రార్థ వాదాదులయందు సర్వపదార్థములయందును ఆయా పదార్థాభిమాని దేవతలయొక్క అనుగతి=ప్రదేశము ప్రతిపాదింపబడి యుండుటవలనను నట్లు నిర్ణయింపబడుచున్నది. కాన శ్రుతులలో కానవచ్చుచున్న మృదాది శబ్దములు చేతనులగు తదభిమాని దేవతలను బోధించునవి యనియు - మృదాది రూపమగు జగత్తంతయు స్వతః అచేతనమే అనియు సిద్ధించుచున్నది. అట్లుకాగా అచేతనమగు నీదృశ్యప్రపంచము చేతనుడగు బ్రహ్మ కారణముగా కలదియనుట ఉపపన్నము= యుక్తియుక్తము కానేరదు అని పూర్వపక్షము స్థిరపడుచున్నది.

6. సూ : దృశ్య తే తు

వివృతిః :- తు= చేతనం బ్రహ్మ అచేతనస్య జగతః కారణ మిత్యేత న్నో పవద్యత ఇతి యకదుక్తం తన్నోపపద్యతే. కుతః? దృశ్యతే= లోకే చేతనేభ్యః పురుషాదిభ్య స్తద్విలక్షణానాం (అచేతనానాం) కేశనఖాదీనా ముత్పత్తిః - తథా అచేతనేభ్యో గోమయాదిభ్య స్తద్విలక్షణానాం (చేతనానాం) వృశ్చికాదీనాం చోత్పత్తి ర్దృశ్యత ఏవ - అత శ్చేతనం బ్రహ్మ అచేతనస్య జగతః కారణం న భవతీ త్యుక్తి రయుక్తైవ -

వివరణము -: చేతనమగు బ్రహ్మవస్తువు అచేతనమగు జగత్తును గూర్చి కారణమని యనుట యుక్తముకాదని చేసినవాదము యుక్తమైనది కాదు. ఏలయన? లోకములో చేతనులగు పురుషులనుండి అచేతనములగు కేశనఖాదులు (వేండ్రుకలు - గోళ్ళు మొదలగునవి) పుట్టుచుండుటయు - అట్లే అచేతనములైన గోమయాదుల (ఆవు పేడ మొదలగువాని) నుండి చేతనములగు తేళ్ళు మొదలగునవి పుట్టుచుండుటయు ప్రత్యక్షముగ దృష్టమగుచున్నది. ఆ కారణమున చేతనమగు బ్రహ్మవస్తువు తద్విలక్షణమగు అచేతనమగు జగత్తునకు కారణము కాదని యనుట అయుక్తమే యగును.

7. సూ : అసదితి చేన్న ప్రతిషేధమాత్రత్వాత్‌

వివృతిః :- చేతనా చ్ఛుద్ధా చ్ఛబ్దిదిహీనా ద్రహ్మణ స్తద్విపరీతమచేతన మశుద్ధం శబ్దాదిమ జ్జగ దుత్పద్యత ఇతి యద్యుత్చేత - తర్హి అసత్‌= కార్యం జగత్ర్పాగు త్పత్తే రసదేవ స్యాత్‌ - తత శ్చాసత్కార్య వాద శ్చ ప్రసజ్యేత. తచ్చానిష్టం సత్కార్యవాదినాం వేదాన్తినామ్‌. కార్యం తూత్పత్తేః ప్రాక్కారణాత్మనా వతిష్ఠత ఇతి, తత శ్చ పున రావిర్భవతీత సత్కార్యవాదినా మాశయః ఏవం చ శబ్దాదిహీన బ్రహ్మాత్మ నావస్థానం ప్రాగుత్పత్తే శ్శబ్దాదిమతో జగతో యద్యుచ్చతే - బ్రహ్మ కారణకత్వా జ్జగత - స్తర్హి జగ దస దేవేత్యుక్తం స్యాత్‌ - ఇతి - చేత్‌= ఇత్యుచ్చతే చేత్‌ - న= న తథా వక్తుం యుక్తమ్‌. ప్రతిషేధమాత్రత్వాత్‌= అసత్‌ స్యాదితి యోయం ప్రతిషేధ ఉక్త స్తస్య తన్మాత్రత్వాత్‌ - ప్రతిషేధస్తు క్రియతే - నతు తస్య ప్రతిషేధస్య ప్రతిషేద్ధవ్య మస్తీతి. కార్యస్య జగతః స్స్వతో మిథ్యాత్వా త్కాలత్రయేపి కారణాత్మనా సత్వ స్యావిరుద్ధత్వా చ్చ ప్రాగుత్పత్తేః కార్య మసత్స్యాదితి నిషేధస్య నిరర్థకత్వ మేవ - (కార్యస్య కారణసత్తాతిరిక్త సత్తాయా అభావా త్థ్సితిదశాయా మివోత్పత్తేః పూర్వమపి బ్రహ్మాత్మక మేవేదం జగ న్నాసదితి భావః)

వివరణము :- చేతనము - శుద్ధము - శబ్దాది విహీనము నగు బ్రహ్మనుండి తద్విలక్షణము - అచేతనము - అపరిశుద్ధము - శుబ్దాదులతో గూడుకొనియున్నది యగు జగత్తు ఉద్భవించుచున్నది యని చెప్పుచో - కార్యమైన ఈ జగత్తు ఉత్పత్తికి (పుట్టుకకు) పూర్వము ఆసత్తే (లేనిదే) అని చెప్పవలసి వచ్చును. అంత అసత్కార్యవాదము ప్రసక్తము కాగలదు. అసత్కార్య వాదాభ్యుపగమము సత్కార్యవాదులగు వేదాన్తుల కనిష్టమైన విషయము. కార్యమనునది తాను తన ఉత్పత్తికి పూర్వము కారణస్వరూపముగ నుండుననియు ఆ కారణమునుండి తిరిగి తా నావిర్భావము నొందుచున్నది యని సత్కార్యవాదుల యాశయము. శబ్దాది విశేషములతో గూడిన ఈ జగత్తు ఉత్పత్తికి వెనుకటికాలమున శబ్దాది విరహిత బ్రహ్మస్వరూపముగ నుండునని చెప్పినచో (బ్రహ్మ జగత్తునుగూర్చి కారణము గనుక) జగత్తు అసత్స్వరూపమే అని చెప్పినట్లు కాగలదు, అని యనుట పొసగునదికాదు. ఏలయన ? ''అసత్‌ స్యాత్‌ '' జగత్తు అసత్తు (లేనిది) కాగలదు అని ఏపత్రిషేధము చేయబడెనో అది ప్రతిషేధమాత్రమే (అది మాటమాత్రేమే అని యనుట) అనగా ఆ ప్రతిషేధమునకు ప్రతిషేధింపదగిని వస్తువు లేదని యర్థము. కార్యమగు జగత్తు స్వస్వరూముతో మిథ్యయే గనుక ఆ జగత్తునకు సర్వకాలముల (భూత భవిష్యద్వర్తమాన కాలముల) యందును కారణస్వరూపముతో సత్త్వము (ఉండుట =ఉనికి) అవిరుద్ధము (అయుక్తము కాదు) గనుక ఉత్పత్తికి పూర్వపుకాలమున కార్యము ''అసత్‌ - స్యాత్‌ '' అసత్తు (లేనిది) కాగలదని కార్యప్రపంచమును నిషేధించుట నిరర్థకమే యగును. (కార్యమునకు= పుట్టుక కలదానికి కారణవస్తువునందు గల సత్త (ఉనికి) కంటె వేరైన సత్త (ఉనికి) ఎన్నడును ఉండుదుగాన స్థితికాలమునందువలెనే ఉత్పత్తకి వెనుకటి కాలమునందును జగత్తంతయు బ్రహ్మాత్మకమే యగునుకాని అసత్తుకాదని భావము.) కార్యమగు జగత్తు స్వయముగ సత్తా శూన్యముగనుక అసత్‌ స్యాత్‌ - అని దానిని నిషేధించుట వ్యర్థమని తాత్పర్యము.

8. సూ : అపీతౌ తద్వత్త్పసంగా దసమంజసమ్‌

వివృతిః :- పూర్వోక్తే జగద్ర్బహ్మణోః కార్యకారణభావే అస్వారస్య ముద్భావయతి - శుద్ధత్వాది గుణకం బ్రహ్మ, అశుద్ధత్వ స్థూలత్వాది గుణకస్య జగతః కార్యస్య కారణ మితి యదీష్యేత తర్హి - అపీతౌ= ప్రళయకాలే కార్యస్య కారణా దవిభాగాపత్తేః కారణస్యాపి బ్రహ్మణః - తద్వత్ర్ప సంగాత్‌= అశుద్ధత్వ స్థూలత్వాదిమత్త్వ ప్రసక్తి స్స్యాత్‌ - ప్రళయసమయే అశుద్ధ్యాదిగుణకం జగ ద్ర్బహ్మిణి లీయమానం సత్‌ న్వనిష్ఠాశుద్ధ్యాది దర్మై ర్ర్బహ్మ దూషయే దితి భావః- అతో హేతోః - అసమంజసమ్‌= ఔపనిషదం దర్శన మయుక్తం స్యాదితి పూర్వపక్షవాదినా మాశయః -

వివరణము :- జగద్ర్బహ్మలకు కార్యకారణ భావము కలదను పక్షములో ఒక అస్వారస్యము కలదని ప్రతిపాదించుచున్నారు. శుద్ధము- శబ్దాదివిహీనము నైన బ్రహ్మ అపరిశుద్ధము శబ్దాది విశేషములతో గూడి యుండు ప్రపంచమునకు కారణమని యంగీకరించినచో - ప్రళయ కాలమునందు కార్యమగు జగత్తుకారణభావమును (కారణముకంటె వేరుగ విభజింప నర్హముగాని స్థితిని) పొందును గాన కారణమగు బ్రహ్మవస్తువుకు కూడ కార్యమునకువలె అపరిశుద్ధత్వము - స్థూలత్వము మొదలగు గుణములు గలిగి యుండుట అను ప్రసక్తి యేర్పడగలదు. అనగా ప్రళయకాలమున అశుద్ధ్యాదిగుణములుగల జగత్తు స్వకారణమగు బ్రహ్మయందు లయమును పొందుచు తనయందుండు అపరిశుద్ధత్వము మొదలగు ధర్మములతో ఆ బ్రహ్మవస్తువును దోషయుక్తముగ =తన గుణములచే కారణమును గుణయుక్తముగ చేయునని భావము. అందువలన ఔపనిషదమగు= ఉపనిషత్తులయందు ప్రాతిపాదింపబడియున్న దర్శనము= తత్త్వము యుక్తమైనది కాదని పూర్వపక్షుల యాశయము.

9. సూ : న తు దృష్టాన్త భావాత్‌

వివృతిః :- అత్ర సిద్ధాన్త ఉచ్యతే - న - తు= అత్ర తు శబ్ద ఏవకారార్థకః - ఔపనిషదం దర్శనం జగదేత చ్చేతనబ్రహ్మ ప్రకృతికమితి య త్తదేత న్త్నైవాసమంజసం. కుతః? దృష్టాన్త భావాత్‌= కార్యస్య కారణనస హైకత్వాపత్తి దశాయాం కారణస్య కార్యధర్మవత్త్వాభావే (కారణ లీయమానం కార్యం కారణం నైవదూషయ తీత్యత్ర) ఘట శరావ హిమ కరకాదీని కార్యాణి ప్రళ##యే స్వకారణషు లయంగతాని సన్తి స్వధర్మైః పృథుబుధ్నాదిరూపై స్స్వకారణ మృత్పిండ జలాదౌ తద్ధర్మవత్త్వరూపం దోషం నాపాదయ న్తీత్యత్ర బహువిధానాం దృష్టాన్తానాం సద్భావాత్‌ -

వివరణము :- ఇట సిద్ధాన్తము చెప్పబడుచున్నది. ఔపనిషదుల సిద్ధాన్తము ఈ దృశ్యమగు జగత్తు చేతనమగు బ్రహ్మనుండి ఉత్పన్నమైనది యని. అందసామంజస్యము (అస్వారస్యము) ఏమియు లేదు. ఏలయన ? కార్యము కారణముతో సహ ఏకత్వమును =అవిభాగమును పొందుదశయందు (ప్రళయదశయందు) కారణమునకు కార్యమునందలి గుణముల సంబంధముతో తద్గుణవత్త్వము కలుగనేరదనుటలో (కారణమునందు లయమును పొందుచున్న కార్యము కారణమును స్వగతగుణముల సంక్రమింపజేసి దోషము కలదానినిగ చేయజాలదనుటలో) బహువిధములగు దృష్టాంతములు కలవు గాన. కుండ - చట్టి - వడగళ్ళు - మొదలగు కార్యవస్తువులు ప్రళయావస్థయందు (తామునాశము పొందునపపుడు) తమ తమ కారణస్వరూపమున లయమును పొందుచున్నవి యగుచు తమకు కారణమగు ఆ మట్టి ముద్దయందును - నీటియందును తమ ఆకారములను - స్వభావములను సంక్రమింపజేసి వారికి తద్ధర్మవత్త్వరూప దోషము నాపాదించుటలేదు గదా !

10. సూ : స్వపక్షదోషా చ్చ

వివృతిః :- స్వపక్షే పరై రారోపితాన్‌ దోషాన్‌ పరిహృ త్యేదానీం తాన్‌ దోషాన్‌ తత్పక్షఏవ యోజయతి. స్వపక్షదోషాత్‌ - చ= అచేతనం జగత్ర్పతి చేతనం న కారణం విలక్షణత్వా దితి - ఉత్పత్తేః పూర్వం జగతోసత్త్వప్రసక్తిస్స్యాదితి - ప్రళయసమయే కారణస్య కార్యధర్మై స్తద్వత్త్వప్రసంగ ఇతి- సాంఖ్యే ర్యే దోషా ఔపనిషదే సిద్దాన్తే సముద్భావితా స్తే సాంఖ్యపక్షేపి సమానాః. యత శ్శబ్దాదిరహితా త్ర్పధానా చ్ఛబ్దాదిమతో జగతోవిలక్షణస్య కార్య స్యోత్పత్తి సై#్తర్నిరూపితా - అతః కార్యకారణయోర్వైలక్షణ్య మపి స్యాత్‌ - ప్రళయదశాయాం శబ్దాదిహీనస్య ప్రధానస్య శబ్దాదిమత్త్వ మపి స్యాత్‌ - వస్తుతస్తు ప్రపంచసత్యత్వవాది నాం సాంఖ్యానా మేవ మతే తే దోషాః - అనిర్వచనీయవాదినా మౌపనిషదాంతు మతే న తే దోషా భవన్తీతి భావః.

వివరణము :- తమ సిద్ధాన్తపక్షమునందు ఇతరవాదులచే ఆరోపింపబడిన దోషములను పరిహరించి ఆ దోషములు ఆ పరపక్షములయందే కలవని నిరూపించుచున్నారు.

అచేతనమగు జగత్తునుగూర్చి చేతనమగు బ్రహ్మవస్తువు కారణమనుట యుక్తముకాదు. విలక్షణమలు (చేతనత్వాచేతనత్వ రూపవిరుద్ధ ధర్మములు కలవి ) గనుక అనియు - ఉత్పత్తికి పూర్వము జగత్తున కసత్త్వప్రసక్తియేర్పడుననియు - ప్రళయ సమయమున కారణమునకు కార్యధర్మములతో తద్ధర్మవత్త్వప్రసంగము వచ్చుననియు - ఔపనిషదమగు సిద్ధాంతమునందు సాంఖ్యులచే నేదోషము లారోపింపబడినవో ఆ దోషములు సాంఖ్యుల పక్షమునందును సమానములే - ఎట్లన - శబ్దాది విరహితమగు ప్రధాన తత్త్వమునుండి శబ్దాది విశేషములతో గూడిన జగత్తుయొక్క అనగా కారణవిలక్షణమగు కార్యముయొక్క ఉత్పత్తిని వారంగీకరించిరి. అందువలన వారికి కార్యకారణములకు పరస్పర వైలక్షణ్యమను దోషమును సంభవించును. ప్రళయదశయందు శబ్దాది విశేష విధురమగు ప్రధానమునకు తనయందు లయించిన కార్యమగు ప్రపంచముద్వారా శబ్దాదిమత్త్వ ప్రసంగమను దోషమును సంభవించును. వస్తుస్థితిని బట్టి చూడ ప్రపంచము సత్యమని వాదించు సాంఖ్యులయొక్క మతమునందే ఆదోషములు ప్రసక్తములు కాగలవు. దృశ్యజాతమంతయు అనిర్వచనీయమము = మిథ్యాభూతము అని నిరూపించు ఔపనిషదమతము నందైతే ఆ దోషము లేవియును వర్తించనేరవని భావము.

11. సూ : తర్కాప్రతిష్ఠానా దప్యన్యధానుమేయ మితి చే దేవమ ప్యనిర్మోక్ష ప్రసంగః

వివృతిః :- తర్కాప్రతిష్ఠానాత్‌ - అపి= తర్కాణాం= పురుషోత్ర్పేక్షామాత్ర నిబన్ధనానాం - అప్రతిష్ఠానాత్‌= ఏకరూపతయా అవస్థానాభావా దపి - (ఏకేన తార్కికే ణానుమితోప్యర్థోన్యేన శ్రేష్ఠతరే ణాన్యధానీయత ఇతి కేవలస్య తర్క స్యాప్రతిష్టితత్వదోషయుక్తత్వా దపి హేతో ర్నిర్దోష శ్రుతిమూల వేదాన్తసమన్వయః సర్వజ్ఞం సర్వశక్తిమ చ్చేతనం బ్రహ్మ జగత్కారణ మిత్యాది స్తర్కమూల ప్రధానకారణవాద మాశ్రిత్యన దూషయితుం శక్యః అన్యధా - అనుమేయమ్‌= కస్యచి త్తర్క స్యాప్రతిష్టితత్వేపి న సర్వ స్తర్కోప్రతిష్ఠిత ఏవేతి వక్తుం న యుక్తం - అతోస్మాభిరిదానీ మప్రతిష్ఠితత్వదోష స్తర్కస్య యథాన భ##వే త్తథానమాతుం శక్యమ్‌ - తేన చ తర్కేణ వేదాన్తసమన్వయే విరోధాదిక మనుమేయమ్‌ - ఇతి - చేత్‌= ఇత్యుక్తం చేత్‌ ఏవం అపి - ఏవ ముక్తేపి - అనిర్మోక్షప్రసంగః= ఇదానీం భవద్భి స్పంస్థాపితస్య తర్కన్య భవద్భ్యోపి బుద్ధిమత్తరాణాం దేశాన్తరే కాలాన్తరే వా సంభవా త్తదీయ తర్కే ణాప్రతిష్టితత్వం భ##వే దేవేతి తర్కస్యాప్రతిష్ఠితత్వ దోషా దనిర్మోక్షః ప్రసజ్యత ఏవ - తస్మా దాగమానుసారేణ సర్వజ్ఞం బ్రహ్మైవ జగతః కారణ మితి నిర్ణయే న కోపి విరోధ ఇతి - (సమ్యగ్జానా న్మోక్ష ఇతి సర్వేషాం మోక్షవాదినాం సిద్ధాన్తః. లోకే తావ దైకరూప్యేణ హ్యవసితో యోర్థ స్స పరమార్థ ఇతి; తద్విషయం చ జ్ఞానం సమ్యగ్జాన మితి- చ ప్రసిద్ధమ్‌ - తథాసతి సమ్యగ్జానే పురుషాణాం విప్రతిపత్తి రనుపపన్నాస్యాత్‌. ఐకరూప్యే ణానవస్థితో యోర్థో నా సౌపరమార్థః - యత్ర చ జ్ఞానే విప్రతిపత్తి ర్న తత్‌ సమ్యగ్‌జ్ఞానం భవితుమర్హతి - కేవలతర్కమాత్రశరణౖః కపిలకాణాద ప్రభృతిభి ర్మహాత్మభిః పరమార్థతయా వ్యవస్థాపితాః పదార్థా అప్యన్యధా న్యధా దృశ్యన్తే. తదీయాని చ దర్శనాని పరస్పరం విప్రతిపన్నాని భవన్తీతి న తద్‌జ్ఞానానాం సమ్యగ్‌జ్ఞానత్వమ్‌ - తేషా మవ్యవస్థితవిషయత్వాత్‌ - తాదృశావ్యవస్థిత విషయకేణ జ్ఞానేన కథంనామ మోక్ష స్స్యాత్‌. తస్మా దాగమనిరపేక్ష తర్కమాత్రజన్య బ్రహ్మజ్ఞానా న్మోక్షో న సంభవతీతి - తాదృశ స్తర్కోప్రమాణ మితి చ సిద్ధమ్‌.)

వివరణము :. తార్కికులగు పురుషులు తమ ఉత్ర్పేక్షలు= ఊహలు మాత్రమే అవలంబనము చేసికొని యేర్పరుచుకొను= నిర్ణయించుకొను యుక్తులు ఒకేరూపముగ నుండవు. కనుక - ఒక తార్కికుని చేత ఒకవిధముగ యుక్తిబలమున= అనుమాన ప్రమాణ మర్యాదతో ఊహించి నిర్ణియింపబడిన విషయము ఆతనికంటె శ్రేష్ఠతరులగు వారిచే మరియొక విధముగ మార్పుచేయబడుచున్నది. కాన కేవలతర్కము అప్రతిష్ఠితత్వదోష దూషితము. అందువలన దోషరహితమగు= నిర్దుష్టమగు శ్రుతిమూలకమగు= శ్రుతిప్రమాణ సమ్మతమగు వేదాన్తాసిద్ధాంతము - సర్వజ్ఞము - సరశక్తిమత్తు - చేతనమునగు బ్రహ్మ సర్వజగత్కారణము అను పక్షము తర్కయుక్తి మూలకమగు ప్రధానకారణవాదము నాశ్రయించి దోషయుక్తమని దూషించుటకు శక్యమైనది కాదు.

ఏదో ఒక తర్కమునకు =యుక్తికి అప్రతిష్ఠితత్వదోషము సంభవించినంతమాత్రమును సర్వతర్కములను అప్రతిష్ఠితములే (నిలకడలేనివే.) అని యనుట యుక్తముకాదు. కాన అప్రతిష్ఠితత్త్వదోషము తర్కమునకు =యుక్తికి యెట్లు సోకకుండునో ఆ విధముగ నట్టి తర్కమును మేమివుడు హేతుదృష్టాంతాది సాధనములతో= ననుమాన ప్రక్రియతో సాధింపగలము. - అట్టి తర్కముచేత వేదాన్తసిద్ధ సమన్వయమున విరోధమును - దోషసంపన్నత్వమును అనుమాన ప్రక్రియతో (యుక్తి బలముతో) నిరూపింప గలమని యనినచో నట్లనినను తర్కమునకు అప్రతిష్ఠితత్వ దోషమునుండి విముక్తి కలుగజాలదు - ఇప్పుడు మిచేత బాగుగా ఆలోచించి స్థాపింపబడిన తర్కమునకు మీకంటెను అధికమగు బుద్ధిబలముకలవారు దేశాంతరమునగాని, కాలాంతరమునగాని సంభవించినప్పుడు వారియొక్క తర్కముచేత నప్రతిష్ఠితత్త్వదోషమునుండి అనిర్మోక్షము ప్రసక్తమై తీరును. ఆ కారణమువలన వేదాన్తసిద్ధాంతము ననుసరించి యేర్పడిన బ్రహ్మయే జగత్కారణమను నిర్ణయమునం దెట్టి విరోధమును లేదని తాత్పర్యము.

(సమ్యగ్‌ జ్ఞానము(పరమార్థతత్త్వ జ్ఞానము) వలన మోక్షము లభించునని మోక్షమునుగూర్చి విచారించు వారందరిచేత సిద్ధాంతము చేయబడియున్నది - ఏకరూపముగ నిలచియుండినట్టి అవ్యభిచరితమగు అర్థమే= విషయమే పరమార్థమని - అట్టి వస్తువును గూర్చిన జ్ఞానమే సమ్యగ్‌ జ్ఞానమని, అను నీయంశము సర్వలోక ప్రసిద్ధమైనది. అట్లుకాగా సమ్యగ్‌ జ్ఞానమునందు= పరమార్థ సత్యజ్ఞానమునందు పురుషులకు విప్రతిపత్తి =పరస్పర విరుద్ధాశయములు కలుగుట అనుపపన్నము. ఏ అర్థము ఏకరూపముగ అవ్యభిచరితముగ నుండనిదియో అది పరమార్థము కాదు. ఏ జ్ఞానముందు విప్రతిపత్తి (అభిప్రాయభేదములు) ఉండునో ది సమ్యగ్‌ జ్ఞానము =తత్త్వజ్ఞానము కానేరదు. శ్రుతిపరాయణత్వము లేవకేవలయుక్తి మాత్రమును శరణుపొందిన మహాత్ములగు కపిలుడు - కణాదుడు మొదలగు వారిచే పరమార్థముగా =యథార్థముగా సిద్ధాంతీకరింపబడిన పదార్థముకూడ ఏకరూపముగ లేక వేరువేరు విధములుగ కానుపించుచున్నది. వారి వారి దర్శనములును= శాస్త్రములును పరస్పర విరుద్ధములుగా నున్నవి. కాన నా దర్శనములకు - తచ్ఛాస్త్రజన్యజ్ఞానములకు సమ్యగ్‌ జ్ఞానత్వము సంభవించదు. కారణమేమియన? ఆదర్శనములయందు నిర్థరింపబడిన విషయములు తత్తచ్ఛాస్త్రసిద్ధ మర్యాదలతో పరాహతములగుచు నవ్యవస్థితము లగుచున్నవి గనునక. అవ్యవస్థితవిషయకములగు ఆయాదర్శనజన్య జ్ఞానములచే మోక్షమెట్లు కలుగును - ఎన్నటికిని కలుగదని భావము. కాన ఆగమ నిరపేక్షమగు తర్కమాత్రమువలన నుత్పన్నమగు బ్రహ్మజ్ఞానమువలన ముక్తి సంభవించదని, అట్టితర్క మప్రమాణమే అని సిద్ధమగుచున్నది.

శిష్టాపరిగ్రహాధి కరణమ్‌ 4

12 సూ: ఏతేన శిష్టాపరిగ్రహా అపి వ్యాఖ్యాతాః

వివృతిః :- ఏతేన= మనువ్యాస ప్రభృతిభి శ్శిష్టైః కైశ్చి త్సత్కార్యవా దాత్మాసంగత్వ స్వప్రకాశ త్వాద్యంశైః పరిగృహీత సాంఖ్యప్రధాన కారణవాద నిరాకరణప్రకారేణ శిష్టాపరిగ్రహాః - అపి= శిష్టా మనువ్యాస ప్రముఖాః - పరిగృహ్యన్త ఇతిపరిగృహాః కేన చిదంశేనాపి శిష్టై రపరిగృహీతా అణ్వాదికారణవాదాః వ్యాఖ్యాతాః= ప్రతిషిద్ధతయా నిరస్తాద్రష్టవ్యాః. అతో వేదాన్త సిద్ధస్య సమన్వయస్య తార్కికన్యాయేన న విరోధ ఇతి సిద్దమ్‌.

వివరణము :- మనువు - వ్యాసుడుమొదలగు సర్వాత్మనా వేదప్రామాణ్యము సంగీకరించు శిష్టులగు మహాత్ములు సాంఖ్యశాస్త్రమునందలి సత్కార్యవాదమును, ఆత్మ అసంగము - స్వప్రకాశము అని చేసిన సిద్ధాంతములను అంగీకరించి ఈ అంశములయందు ఆశాస్త్రము నంగీకరించి పరిగ్రహించిరి. ఆ సాంఖ్యదర్శన మివెనుకటి అధికరణములలో నిరాకరింపబడినది. పరమాణువులు జగత్కారము అని వాదించువారు అణుకారణవాదులు - వీరి శాస్త్రములలోని ఏఒక్క అంశమును పూర్వోక్తశిష్ట సమ్మతముకాదు. ఇట్టి వాదములు శిష్టాపరిగృహీతములన్నియు నిరసింపబడినవని తెలికొనవలయును. కానవేదాన్త సంసిద్ధమైన సమన్వయమునకు తార్కికన్యాయముచేత విరోధము సంభవించదని సిద్ధమగుచున్నది.

భోక్త్రాపత్త్యధికరణమ్‌ 5

13. సూ : భోక్త్రాపత్తే రవిభాగశ్చే త్స్యాల్లోకవత్‌

వివృతిః :- ఔపనిషద సమన్వయేద్వితీయం బ్రహ్మైవ జగత ఉపాదాన మితి నిర్ణయః - తత్రేదానీం ప్రత్యక్షవిరోధ మాశంక్య పరిహరతి - భోక్త్రాపత్తేః= య ద్యద్వితీయం బ్రహ్మ సర్వస్యాపి జగత ఉపాదానం తర్హి కార్యస్య జగతః కారణాత్మ నైకత్వా ద్భోక్తు ర్భోగ్యత్త్వాపత్తిః (భోగ్యం= శబాదికం విషయజాతం - భోక్తా =చేతనో జీవః -) భోగ్యస్య భోక్తృత్వాపత్తి శ్చ స్యాత్‌ - భోక్తృభోగ్య ప్రపంచస్య సర్వస్యాపి బ్రహ్మానన్యత్వా ద్ధేతోః - అవిభాగః - చేత్‌= న విభాగః= అవిభాగః - లోకప్రత్యక్షసిద్ధః భోక్తా - భోగ్య మితి యోవిభాగ న్తస్యాభావః ప్రసజ్యే తేత్యాశంకా కృతా చేదేవ మత్ర సమాధీయతే - స్యాత్‌ - లోకవత్‌= లోకే ఇవ= లోకవత్‌ - యథా లోక ఏకసముద్రోత్పన్నానాం ఫేనబుద్బుద తరంగాదీనాం స్వకారణీభూత సముద్రాత్మ నైకత్వే పీదం ఫేన మయం బుద్బుదోయంతరంగ ఇత్యాద్యాత్మనా విభాగో న విరుద్ధ్యతే - యథా చ లోకే మృదాత్మనాభిన్నానాం ఘటానాం పరస్పరం భేదః. ఏవంభోక్తృభోగ్యయో ర్ర్బహ్మాత్మ నైకత్వే ప్యన్యోన్యాత్మనా విభాగ స్స్యాదేవ - తతశ్చ కల్పితభేదసత్వా న్న ప్రత్యక్ష విరోధోపి వేదాన్త సమన్వయే సంభవతీతి భావః.

వివరణము :- ఉపనిషత్సిద్ధాంతమునం దద్వితీయమగు బ్రహ్మ వస్తువే జగత్తునుగూర్చి ఉపాదానకారణమని నిర్ణయము. ఈ సూత్రము నందు ఆ అంశము ప్రత్యక్షవిరుద్ధము అను ఆక్షేపమురాగా పరిహరించు చున్నారు.

ఈ సమస్తదృశ్య ప్రపంచమునకును నుపాదానకారణ మద్వితీయ బ్రహ్మవస్తువే యైనచో అప్పుడు కార్యమగు జగత్తునకు కారణస్వరూపముతో ఏకత్వమే కలదు గనుక భోక్తయగువానికి భోగ్యత్వమును - భోగ్యపదార్థమునకు భోక్తృత్వమును - ఏర్పడవలసివచ్చును. (భోగ్యమనగా శబ్దాదికమగు విషయసముదాయము. భోక్తయనగా చేతనుడగు జీవుడు.) ఏలయన ? భోక్తయగు జీవుడు, భోగ్యమగు ప్రపంచము ఈ సమస్తమను వేదాన్త సిద్ధాంతములో బ్రహ్మవస్తువుకంటె అన్యముకాదు కనుక - అట్లగుచో అవిభాగః= విభాగాభావముఅనగా సర్వలోక ప్రసిద్ధమగు భోక్తా - భోగ్యము (భోక్త యనగా అనుభవించువాడు - భోగ్యమనగా అనుభవింపబడునది) అను నిట్టి విభాగము లేదని చెప్పవలసి వచ్చును అని ఆశంక కలుగగా సమాధానము చెప్పుచున్నారు. ''లోకవత్‌ స్యాత్‌'' అని. లోకములో ఒక్కసముద్రము నుండియే ఉత్పన్నములైన నురుగ - బుడగ - తరంగము మొదలగునవి బాగుగా విచారించిచూడ సముద్ర స్వరూపము కంటె వేరుగాక సముద్రాత్మకములే యగుటచే ఏకత్వము= అభేదము కలివియే ఐనను ఇది నురక ఇది బుడగ - ఇది తరంగము అని యిట్లు పరస్పర విభాగము కలవిగ ఏవిధమైన విరోధము లేకయే గ్రహింపబడుచున్నవి - మృత్తునుండి సముత్పన్నములైన ఘటాదులు మృదాత్మకములే యగుటచే తదభిన్నములే ఐనను ఆ ఘాటాదులలో పరస్పర భేదము స్పష్టముగ గ్రహింపబడుచున్నది. అట్లే భోక్తృభోగ్యములు స్వకారణమగు బ్రహ్మస్వరూపముతో అభిన్నములే ఐనను వానికి స్వస్వరూపములతో పరస్పరము విభాగముండవచ్చును. ఇట్లు చెప్పుటచే వేదాన్త సిద్ధాంతములో భోక్తృభోగ్యాత్మక ప్రపంచమునందు వాస్తవముగ భేదము లేమియు లేకున్నను భ్రాంతి కల్పితమగు భేదమున్నను ప్రత్యక్ష విరోధమేమియు సంభవించ దని భావము.

ఆరంభణాధి కరణమ్‌ 6

14. సూ : తదనన్యత్వ మారంభణ శబ్దాదిశ్యః

వివృతిః :- పూర్వసూత్రే పరిణామవాదినాం మత మవలంబ్య స్యాల్లోకవ దితి సామాధాన ముక్తమ్‌ - అస్మిన్‌ సూత్రే వివర్తవాదినాం మత మవలంబ్య సమాధాన ముచ్చతే - తదనన్యత్వమ్‌= న అన్యత్‌ అనన్యత్‌ - అనన్యస్య భావః అనన్యత్వం - తస్మా దనన్యత్వం=తదనన్యత్వం జగత్కారణా ద్ర్బహ్మణ స్సకాశా త్కార్యస్య జగతః అనన్యత్వం= వస్తుతః పృథక్‌ సత్తా రాహిత్యమవగమ్యతే - కుత ఏవమవగమ్యత ఇతిచేత్‌ - ఆరంభణ శబ్దాదిభ్యః= వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్య మిత్యాది శ్రుతివాక్యేభ్యోవగమ్యతే - (వాచారంభణశ్రుతే రయమర్థః - వాచా కేవలమస్తీత్యారభ్యతే వికారో ఘట శ్శరావ ఉదంచనం చేతి - నతు వస్తువృత్తేన వికారోనామ కశ్చిదస్తి - నామధేయమాత్రం హ్యేత దనృతం మృత్తికేత్యేవ సత్యమితి.) ఏష బ్రహ్మణో దృష్టాన్త ఆమ్నాతః - తత్ర శ్రుతా ద్వాచారంభణ శబ్దాద్దార్షాంతికేపి బ్రహ్మవ్యతిరేకేణ కార్యజాత స్యాభావ ఏవేతి గమ్యతే - కించ యథా ఘటకరకాద్యాకాశానాం మహాకాశానన్యత్వం- యథా వామృగ తృష్టికోదకానా మూషరాదిభ్యోననత్వం దృష్ట నష్ట స్వరూపత్వాత్‌ - స్వరూపేణ త్వనుపాఖ్యత్వాత్‌ - ఏవ మస్య భోక్తృ భోగ్యాది ప్రపంచ జాతస్య బ్రహ్మవ్యతిరేకే ణాభావ ఇతి ద్రష్టవ్యమ్‌. తతశ్చ కార్యస్య భోక్తృభోగ్యలక్షనస్య ప్రపంచస్య సర్వకారణ బ్రహ్మసత్తయైవ సత్త్వమితి - న స్వతః కార్యస్య సత్వం విద్యత ఇతి - కార్యంతు మిథ్యైవేతి స్పష్ట మవగమ్యతే - అతోవిద్యాసముత్థేన మిథ్యాభూతేనే భోక్తృభోగ్యాది ప్రపంచేన - తద్విషయక ప్రత్యక్ష ప్రమాణన చ శ్రౌతస్య సమన్వయస్య న కోపి విరోధ ఇతి సర్వ మనవద్యమ్‌ - సగుణ బ్రహ్మోపాసనే షూప యోక్ష్యత ఇతి మత్వా పరిణామప్రక్రియా మాశ్రిత్య నానాభేదభిన్నం ప్రపంచ మప్రత్యాఖ్యాయ వ్యవహారదృష్ట్యా స్యాల్లోకవదితి బ్రహ్మణో మహాసముద్రస్థానీయత్వ ముక్తం పూర్వసూత్రే - ఇదానీ మస్మిన్‌ సూత్రేపరమార్థ దృష్ట్యా ప్రపంచస్య బ్రహ్మనన్యత్వ ముక్తమ్‌. బ్రహ్మనన్యత్వం నామ బ్రహ్మవ్యతిరేకణ ప్రపంచస్యాసత్వమే వేత్యర్థః

వివరణము :- వెనుకటి సూత్రమునందు పరిణామవాదుల మతము ననుసరించి లోకమున ప్రత్యక్షముగ కానవచ్చుచున్న సముద్ర-తరంగ - ఫే బుద్బుదాది దృష్టాంతములనిచ్చి భోక్తృభోగ్య విభాగమునందలి ఆక్షేపమునకు సమాధానము చెప్పబడెను. ఈ సూత్రమునందు వివర్తవాదుల మతము ననుసరించి సమాధానము చెప్పబడుచున్నది. కార్యమగు జగత్తునకు, తత్కారణమైన సదాత్మక బ్రహ్మవస్తువునకును అనన్యత్వమే అని తెలిసికొనవలయును. అనన్యత్వమనగా కారణమగు బ్రహ్మవస్తువు యొక్క సత్త (ఉనికి) కంటె పృథగ్భూతముగ= వేరుగ కార్యమునకు స్వతంత్రముగ సత్త =(ఉనికి) లేదు అని అర్థము.

(సద్రూపమగు జగత్కారణమగు బ్రహ్మయందు వస్తుతః అసత్తైన= లేనిదియైన కార్యమగు జగజ్జాలము విద్యావిలాసముచేత సత్తకలదివలె= ఉన్నదివలె భాసించుచున్నది. కాన నీ ప్రపంచవ్యవహారమంతయు మిథ్యయని వివర్తవాదుల యాశయము) కారణానన్యము కార్యమను విశేషమెట్లు తెలియవచ్చినది యనగా - చెప్పుచున్నారు. ఆరంభణ శబ్దాదిభ్యః=''వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం'' ఈ మొదలగు శ్రుతివాక్యముల వలన తెలియవచ్చుచున్నది. వాచారంభణ శ్రుతివాక్యార్థము :- వికారము= కార్యజాతము - వాక్కుతో మాత్రమే ఆరంభింపబడుచున్నది= పలుకబడుచున్నది. కుండ అని, చట్టి అని - బొక్కెన అని. ఇంతియేకాని కార్యమనునది వస్తుతః లేనేలేదు. నామధేమయు (పేరు) మాత్రమే, యిది యంతయు= అనృతము= మిథ్య - ఈ ఘటాదికార్యజాతమునకు కారణమగు మృత్తిక యనునది యొక్కటియే సత్యము - అని. ) ఇది బ్రహ్మవస్తువునకు దృష్టాంతముగా వర్ణింపబడినది. ఆ వాక్యములో కానవచ్చుచున్న వాచారంభణ శబ్దమునుబట్టి దార్షాంతికములోగూడ బ్రహ్మకంటె వేరుగ కార్యమగు ప్రపంచమునకు సత్తలేదని, బ్రహ్మయే సత్యమని, జగత్తునామ మాత్రమే అని =అనృతమే అని= మిథ్యయే అని తెలియవచ్చుచున్నది. మరియు ఘటాకాశ - మఠాకాశాదులకు మహాకాశముకంటె ఎట్లనన్యత్వమో (ఘటాకాశ - మఠాకాశములనునవి నామమాత్రములే కాని మహకాశముకంటె వేరుపదార్థములు కావనుట) ఎండమావులలోని ఉదకములకు చవిటిభూములకంటె యెట్ల నన్యత్వమో - అదృష్ట-దృష్ట-నష్ట-స్వరూపములు కనుక- స్వతః సత్తాశూన్యములు కనుక - అట్లే యీ భోక్తృభోగ్యాది భేదములతో గూడిన ప్రపంచము బ్రహ్మకంటె వేరుగ లేదని గ్రహింపవలయును. ఇట్లు చెప్పుటచే భోక్తృ భోగ్యరూపముగ గోచరించు కార్యమగు ప్రపంచమునకు సర్వకారణమగు బ్రహ్మయొక్క సత్తచేతనే సత్త్వము= ఉనికి యనియు - కార్యమునకు స్వతః సత్త్వముండదనియు, కాన కార్యముమిథ్యయేఅనియు స్పష్టముగ తెలియవచ్చుచున్నది. కాన అవిద్య విజృంభణముచేత సముత్థితమైన - మిథ్యభూతమగు భోక్తృ భోగ్యాది భేదములతో గోచరించుచున్న ప్రపంచముచేతగాని, అట్టి ప్రపంచమును గ్రహించుచున్న= ప్రత్యక్ష ప్రమాణముచేతనుగాని శ్రుతిసమ్మతమగు సమస్వయమునకు ఏ కొంచెమైనను విరోధము వాటిల్లదు.

సగుణ బ్రహ్మోపాససములయం దుపయోగింపగలదని తలచి పరిణామవాద ప్రక్రియ ననుసరించి నానాభేదములతో నొప్పుచున్న ప్రపంచమును ప్రత్యాఖ్యానముచేయక (లేనిదియని త్రోసిపుచ్చక) వ్యవహారదృష్టి నాశ్రయించి పూర్వసూత్రములో ''స్యా ల్లోకవత్‌'' అని బ్రహ్మవస్తువు మహాసముద్ర స్థానీయముగా వర్ణింపబడినది. ఇప్పు డీ సూత్రములో పరమార్థదృష్టి నాశ్రయించి కార్యప్రపంచమునకు కారణ బ్రహ్మనన్యత్వము చెప్పబడినది. బ్రహ్మనన్యమన ప్రపంచము బ్రహ్మవ్యతిరిక్తముగ లేనిదియే అని యర్థము.

15. సూ: భావే చోపలబ్ధేః

వివృతిః :- కార్యస్య కారణా ద్వ్యతిరేకేణ సత్వాభావే యుక్తిం దర్శయతి - భావే - చ =కారణస్య సత్వే ఏవ ఉపలబ్దే= కార్య స్యోప లంభా చ్చ - కార్యం కారణా దనన్యత్‌ - మృది సత్యామేవ ఘట ఉపలభ్యతే నాసత్యామ్‌ - కించ నహి ఘటోనామ మృద్వ్యతిరిక్తః కశ్చన వస్తువిశేష ఉపలభ్యేతే - తతః కాణవ్యతిరేకేణ కార్యం నామ నాస్తీతి నిశ్చేతుం శక్యతే -

వివరణము :- కార్యము కారణానన్యమనుటలో యుక్తిని ప్రదర్శంచుచున్నారు. కారణవస్తువున్నప్పుడే కార్యము కానవచ్చుచుండును. గాని తాను ప్రత్యేకముగ చూడబడుటలేదు గనుక కార్యము కారణానన్యమే అని నిర్ణయింపబడుచున్నది - మృత్తు మట్టి ఉన్నప్పుడే తత్కార్యమగు ఘటము కానవచ్చుచుండును గాని మృత్తులేనప్పుడు కానరాదు గాదా ! మరియు ఘటమను పేరుతో పిలువబడునది మృత్తుకంటె వేరైనదిగా మరియొక వస్తువుపలభ్యమాన మగుటలేదు. ఆ కారణములవలన కారణవస్తువు కంటె వేరుగ కార్యమనునది లేదని నిశ్చయింపదగును.

16. సూ : సత్వా చ్చా వరస్య

వివృతిః :- అవరస్య =కార్యస్య ప్రపంచ స్యోత్పత్తేః ప్రాక్‌ సత్వాత్‌ - చ= కారణ కారణాత్మ నైవ సత్వాత్‌ - ''సదేవ సోమ్యేద మగ్ర ఆసీత్‌'' ''బ్రహ్మవా ఇద మగ్ర ఆసీత్‌'' ఇత్యాదౌ సృష్టేః పురా కార్యస్య కారణాత్మ నైవ సత్వశ్రవణాత్‌; ఉత్పత్త్యనంతర మపి కార్యస్య కారణా దనన్యత్వం సిద్ధ మిత్యర్థః-

వివరణము :- అవరమనగా కార్యము - కార్యమగు ప్రపంచము తనయొక్క ఉత్పత్తికి పూర్వము తాను కారణవస్తువునందు ఆకారణ స్వరూపముగానే ఉండెనని ''సదేవ సౌమ్యేద మగ్ర ఆసీత్‌ '' - ''బ్రహ్మ వా ఇద మగ్ర ఆసీత్‌'' ఈ నామరూపాత్మకదృశ్య ప్రపంచము సృష్టికి పూర్వము కారణమగు సద్రూపముగానే - బ్రహ్మరూపముగానే ఉండెను అని చెప్పు శ్రుతులనుబట్టి నిర్ణయింపబడుచున్నది. కాన కార్యమగు ప్రపంచమునకు సృష్ట్యనంతరమున గూడ వెనుకటికవలె కారణానన్యత్వము కలదని సిద్ధమగుచున్నది.

17. సూ : అసద్వ్యపదేశా న్నేతి చేన్న ధర్మాంతరేణ వాక్యశేషాత్‌

వివృతిః :- ప్రాగుత్పత్తేః కార్యస్య కారణాత్మనా సత్వం యత్ర్పతి పాదితం తదాక్షిప్య సమాధీయతే - అసద్వ్యపదేశాత్‌= ''అసద్వా ఇద మగ్ర ఆసీత్‌'' ఇత్యాదౌ ప్రాగుత్పత్తేః కార్యస్య ప్రపంచ స్యాసచ్ఛబ్దేన వ్యపదేశస్య దృష్టత్వాత్‌ - న - ఇతి - చేత్‌= ప్రాగుత్పత్తేః కార్యస్య కారణాత్మనా సత్వం యదుక్తం తన్నోపపద్యత ఇతి చేత్‌ - న= ''అసద్వా ఇద మగ్ర ఆసీత్‌ '' ఇత్యాది శ్రుతిషు శ్రూయమాణ మసత్పదం కార్యస్య ప్రపంచస్య నాత్యంతాసత్త్వం ప్రతిపాదయితుం ప్రవృత్తమ్‌ - కింతు ధర్మాంతరేణ= వ్యాకృతనామరూపత్వ ధర్మా దితరే ణావ్యాకృత నామరూపత్త్వే ధర్మే ణాసత్వం ప్రపంచస్య ప్రతిపాదయతి. కుత ఏవమవగమ్యత ఇతిచేత్‌ - వాక్యశేషాత్‌= ''తథ్స దాసీత్‌ '' ఇత్యసత స్సత్వనిశ్చాయకా ద్యాక్య శేషా దవగమ్యతే - సందిగ్ధార్థం వాక్యం వాక్య శేషానురోధేన ని శ్చితార్థం కుర్వన్తి హి వాక్యమర్యాదాభిజ్ఞాః

వివరణము :- కార్యము తన ఉత్పత్తికి పూర్వము కారణస్వరూపముతో నుండునని చేసిన ప్రతిపాదనము నాక్షేపించి సమాధానము చెప్పుచున్నారు.

'' అసద్వా ఇదమగ్ర ఆసీత్‌ '' ఈ ప్రపంచము సృష్టికి పూర్వమసత్తు అయియుండెను. అనునిట్టి వాక్యములలో ప్రపంచము సృష్టికి పూర్వము ''అసత్‌ '' శబ్దముతో వర్ణింపబడియున్నది గాన సృష్టికి పూర్వము కార్యప్రపంచమునకు కారణస్వరూపముతో '' సత్త్వం''= ఉండుట అనునది యుక్తముకాదు అను ఆక్షేపము చేయరాదు. ఏలయన? ''అసద్వా ... '' ఇత్యాది శ్రుతులలోని అసత్పదము కార్యప్రపంచమునకు అత్యంతము అసత్త్వమును ప్రతిపాదించుటకై బయలు దేరలేదు. ఆపదము ప్రపంచము సృష్టికి వెనుకటి కాలమునందు వ్యాకృత నామరూపముగ లేదు - అవ్యాకృత నామరూపముగ నుండె నని ప్రతిపాదించుచున్నది. ఇట్లు నిర్ణయించుటకు కారణమేమి యనిన ఈ వాక్యమునకు సంబంధించిన ఈ ప్రకరణములోని ''తథ్స దాసీత్‌ '' ఆ అసత్తుగ నున్న వస్తువు సత్తుగా నాయెను అని అసత్తునకు సత్త్వమును ప్రతిపాదించుచున్న వాక్యభాగమును బట్టి యిట్లు నిర్ణయింపబడుచున్నది. ఏ వాక్యముయొక అర్థము సందిగ్ధమున నుండునో ఆ వాక్యమునకు సంబంధించిన వాక్యశేషము (వాక్యభాగము) చేత ఆ వాక్యార్థమును వాక్య మర్యాదలను గుర్తెరిగినవారు అసందిగ్ధముగ జేసి నిర్ణయ పరచుచుందురు గదా !

18. సూ: యుక్తే శ్శబ్దాన్తరా చ్చ

వివృతిః :- యుక్తేః= కారణషు క్షీరమృదాదిషు తత్కార్యభూతా నాం దదిఘటాదీనా మభావే దదిఘటాద్యర్థిభిః క్షీరమృదాది ద్రవ్యగ్రహణ నియమేన యా ప్రవృత్తి ర్లోకే దృశ్యతే సా నస్యా దిత్యాదికాయా యుక్తేః - శబ్దాంతరాత్‌ - చ పూర్వసూత్ర ఉదాహృతా దసద్వ్యపదేశిన శ్శబ్దా దన్యః ''సదేవ సోమ్యేద మగ్ర ఆసీత్‌ '' ఇత్యత్ర శ్రూయమాణ స్సద్వ్యపదేశ శ్శబ్ద శ్శబ్దాంతరం - తస్మాచ్చ ప్రాగుత్పత్తేః కార్యం కారణస్తితి, తచ్చ కారణా దనన్య మితి చ గమ్యతే-

వివరణము :- పెరుగు కుండ మొదలగు కార్యవస్తువులు తత్కారణములుగు. పాలు, మట్టి మొదలగు వస్తువులయందు తమ యుత్పత్తికి పూర్వము లేక యున్నచో వానిని సంపాదింపగోరువారికి తత్కారణములుగ ప్రసిద్ధములైన క్షీరము మట్టి మొదలగు వస్తువులునే సంపాదించుట కొరకై యేర్పడుచున్న నియతప్రవృత్తి సంభవింపనేరదు. అను నిట్టి యుక్తిని బట్టియు - ''సదేవ సోమ్యేద మగ్ర ఆసీత్‌ '' సృష్టికి పూర్వ మి జగత్తు సన్మాత్రమే అయి యుండె నని జగత్తునకు సద్రూపత్వమును వర్ణించు శబ్దాంతరమును బట్టియు - ఉత్పత్తికి పూర్వము కార్యము కారణ వస్తువునం దుండుననియు - ఆ కార్యము కారణానన్యమనియు - తెలియబడుచున్నది.

19. సూ : పటవ చ్చ

వివృతిః :- కారణానన్యత్వే కార్యస్య మృదియం ఘటోయ మితి కారణ కార్యరూపమో ర్మృద్ఘటయో ర్విలక్షణస్త్ర ప్రతీతివిషయత్వం కథ ముపపద్యత ఇతి చేత్‌ ? పటవత్‌ - చ = యథా సత్యపి విలక్షణప్రతీతివిషయత్వే ప్రసారితః పటః సంవేష్టితా త్పటా దన్యో న భవతి, తథా ఘటాదికం కార్య మపి కారణా దన్య న్న భవత్యేవ.

వివరణము :- కార్యము కారణానన్యమే యగుచో (కారణముకంటె వేరుగ వాస్తవముగ లేనిదే యగుచో) ఇది మట్టియని, ఇది కుండ అని యిట్లు కార్యకారణములగు మట్టికుండలకు సంబంధించిన వేర్వేరు జ్ఞానము లెట్లేర్పడగలవు. ఆ జ్ఞానములు వేరుగ నున్నవి గనుక కారణమగు మట్టియును, కార్యమగు కుండయును అన్యములే =భిన్నములేగాని యనన్యములు కానేరవు అను ఆక్షేపమునకు సమాధానము ''పటవచ్చ'' అని - వస్త్రము మడత వేయబడినప్పుడు - ఇది మడతయని - పరచబడి యున్నప్పుడు ఇది చాపు అనియు వేరువేరుగ జ్ఞానము కలిగినను చావు అనునది మడత అను దానికంటె వేరైన వస్తువుకాదు. అట్లే ఘటాదిరూపమగు కార్యము తత్కారణమగు మృదాదికముకంటె వేరుకాకున్నను ఇది కుండ - ఇది మట్టి యనుచు పరస్పర విలక్షణము జ్ఞానము కలుగవచ్చును. ఆ వస్తువులకు విలక్షణజ్ఞాన విషయత్వమును కలుగవచ్చును. దోషములేదు.

20. సూ : యథా చ ప్రాణాది

వివృతి :- కారణానన్యత్వే కార్యస్య తయోః కార్యకారణయో ర్విలక్షణ కార్యజనకత్వం కథముపపద్యతిఇచేదుచ్చ తేయథా-చ -ప్రాణాది= యథా ప్రాణాపానాది రూపస్య వాయో రేకస్యాపి నిరోధ ప్రసారణావ స్థయో ర్విలక్షణ కార్యజనకత్వ ముపద్యతే - తథా కార్యకారణయో రనన్యత్వేపి విరుద్ధకార్యజనకత్వం న దోషాయేతి సిద్ధమ్‌. (నిరుద్ధః ప్రాణాది ర్జీవనమాత్రం కార్యం నిష్పాదయతి - అనిరుద్ధ స్సఏ వాకుంచన ప్రసారణాదికం కార్యంనిష్పాదయ త్యేవంవిలక్షణ కార్యజనకత్వమేకసై#్యవవాయో స్సిద్థమ్‌.)

వివరణము :- కార్యము కారణానన్యమే (కారణాభిన్నమే) యగుచో ఆ కార్య కారణములు రెండును విలక్షణములగు (వేర్వేరు) కార్యముల నెట్లు పుట్టించగలవని యనినచో- ప్రాణాపానాది రూపమగు వాయువు ఒక్కటియే ఐనను నిరోధావస్థయందును - ప్రసారణావస్థ యందును ఆ వాయువునకు విభిన్నకార్యములను పుట్టించుచుండుట సహజమే కదా. అట్లే కార్యకారణము లనన్యములే ఐనను కార్యవస్థ, కారణావస్థయను అవస్థాభేదముతో విలక్షణ కార్యముల నుత్పాదనచేయుననుటలో విరోధమేమియు నుండదు. (ప్రాణవాయువు యోగాభ్యాస వశమున నిరోధింపబడిన యప్పుడు మానవునకు జీవనమాత్ర కార్యమును నిష్పాదన చేయును - ఆ ప్రాణవాయువు నిరోధింపబడక ప్రసారణావస్థను పొందియున్నప్పుడు ఆవయవములయొక్క ఆ కుంచన ప్రసారణాది (ముడుచుట - చావుట మొదలగు) కార్యములను నిష్పాదనచేయును. ఇట్లు ఒకే వాయువునకు విలక్షణ కార్యోత్పాదకత్వము అసస్థాభేదముచే సంభవించును.)

ఇతర వ్యపదేశాధి కరణమ్‌ 7

21. సూ : ఇతరవ్యపదేశా ద్ధితాకరణాది దోషప్రసక్తిః

వివృతిః :- ఇతరవ్యపదేశాత్‌= ఇతరః= శారీరః. తస్య ''స ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో'' ''అయ మాత్మా బ్రహ్మ '' ఇత్యాదినా బ్రహ్మరూపత్వ వర్ణనాత్‌ - అథవా - ఇతరః= పరమాత్మ - తస్య ''తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్‌ ''ఇత్యాదినా శారీరత్వ వర్ణానాత్‌ - తథాచ బ్రహ్మణః= పరమాత్మనః సృష్టృత్వే శారీరస్య జీవస్యాసి స్రష్టృత్వాత్‌ - హితాకరణాదిదోషప్రసక్తిః= తస్య స్రష్టు ర్హితాకరణాది దోషః ప్రసజ్యేత. అహితస్య జరామరణాది బహువిధానరస్య కరణం, యచ్చ స్వస్య హితం తదకరణం చేత్యేవమాదిదోషస్య బ్రహ్మణి ప్రసక్తి స్స్యాత్‌ - నహి క్వాపి స్వతన్త్ర శ్చేతన స్నర్వశక్తి సంపన్న స్స్వస్య హితం న సంపాదయతి, అహితం తు సంపాదతీతి సాంప్రతమ్‌. అత శ్చేతనం భ్రాన్త్యాది సర్వదోషవిరహితం శుద్ధం బ్రహ్మైవ జగతః కారణ మితి శ్రౌతో నిర్ణయో నోపపద్యత ఇతి పూర్వపక్షః -

వివరణము :- ఇతరుడనగా నిచట శారీరుడ అని యర్థము - ఆతనికి '' స ఆత్మ తత్త్వమసి శ్వేతకేతో'' - అయ మాత్మా బ్రహ్మ '' ఇత్యాది వాక్యములలో బ్రహ్మరూపత్వము వర్ణింపబడి యున్నది. ఇతర శబ్దమునకు పరమాత్మయనియు నర్థము చెప్పవచ్చును. ఆ పక్షములో ఆ పరమాత్మకు ''తత్సృష్ట్వా| తదేవాను ప్రావిశత్‌ '' ఆ పరమాత్మ జగత్తును సృజించి అందు జీవరూపముగ తాను ప్రవేశించెను అని చెప్పు ఈవాక్యములో జీవభావము వర్ణింపబడియున్నది. ఇట్లు చెప్పుటతో జీవాత్మ పరమాత్మలకు అ భేదము సిద్ధించుచున్నది. అట్లుకాగా పరమాత్మ సర్వ జగత్సృష్టికర్త గనుక శారీరుడగు జీవునకు గూడ సృష్టికర్తృత్వము సిద్ధించును. అట్లగుచో ఆస్రష్ట (సృష్టికర్త) యగు జీవునకు హితాకరణాది దోషము ప్రసక్తమగును. తనకు అహితములగు జరామరణాది బహు విధములగు అనర్థములను చేయుట - ఏది తనకు హితమో దానిని చేయకుండుట - ఈ మొదలగు దోషములు జీవాభిన్న బ్రహ్మయందు ప్రసక్తములు కాగలవు. స్వతంత్రుడై - చేతనుడై - సర్వశక్తి సంపన్నుడైన వాడెవడును తనకు హితమును సంపాదింపకయు - అహితమును సంపాదించుచును నుండడు. కాన చేతనము - భ్రాంత్యాది సర్వదోష విరహితము - శుద్ధమునగు బ్రహ్మయే జగత్కారణము అను శ్రౌతసిద్ధాంతము యుక్తి యుక్తము కానేరదని పూర్వపక్షము.

22. సూ: అధికం తు భేదనిర్దేశాత్‌

వివృతిః :- తు= బ్రహ్మకారణవాదే య ఆక్షేపః కృత స్స నోప పద్యతే- అధికమ్‌= యత శ్శారీరా దధికం, సర్వజ్ఞం, సర్వశక్తి, బ్రహ్మైవ జగ దుపాదానత్వే నాస్మాభి ర్నిర్దిష్ట మతో హితాకరణాది దోషస్య ప్రసక్తి ర్న తత్ర సంభవతి - కుత ఏత దవగమ్యత ఇతి చేత్‌ ? భేదనిర్దేశాత్‌= ''ఆత్మా వారే ద్రష్టవ్య శ్ర్శోతవ్యో మన్తవ్యః'' ఇత్యాదినా కల్పితభేద మంగీకృత్య ద్రష్ట్వవ్యస్య బ్రహ్మణో భేదేన శారీరస్య వ్యపదేశాత్‌= ప్రతిపాదనా దవగమ్యతే - తదేత జ్జగత స్ర్పష్టృ న శారీరాభిన్నమ్‌. తస్మా న్నోక్త దోషప్రసక్తి ర్భవతి - న హి పరమాత్మనో నిత్యముక్తస్య హిత మహితం వా కించ త్సంభవతి . జీవపరమాత్మనో రభేదనిర్దేశ స్తు నిరుపాధిక స్వరూప వివక్షయే త్యదోషః - అత్ర భాష్యే - యదాతత్త్వమ సీత్యేవం జాతీయకేనాభేదనిర్దేశే నాభేదః ప్రతిబోధితో భవతి అపగతం తదా జీవస్య సంసారిత్వం బ్రహ్మణ శ్చ స్రష్టృత్వం - సమస్తస్య మిథ్యా జ్ఞానవిజృంభితస్య భేదవ్యవహారస్య సమ్యగ్‌ జ్ఞానేన బాధితత్వాత్‌. తత్ర కుత ఏషా సృష్టిః - కుతో వా హితాకరణాదయో దోషా ఇతి - తస్మా న్నిత్యముక్తస్య బ్రహ్మణో న హితాకరణాది దోష ప్రసంగః - ఇతి.

వివరణము :- బ్రహ్మకారణ వాదపక్షమున చేయబడిన ఆక్షేపము యుక్తమైనది కాదు. ఏలయన ? శారీరునికంటె అధికమైన - సర్వజ్ఞమై - సర్వశక్తి సంపన్నమైన - బ్రహ్మయే సర్వజగ దుపాదానకారణముగ మాచే నిర్ణయింపబడియున్నది కాన నట్టి ఆ బ్రహ్మవస్తువునందు హితాకరణాది దోషములకు ప్రసక్తి సంభవించదు. ఇది యెట్లు తెలియబడుచున్నది. యనగా - భేదనిర్దేశమువలన తెలియబడుచున్నది - బృహదారణ్యములోని '' ఆత్మా వారే ద్రష్టవ్య శ్ర్శోతవ్యో మన్తవ్యో --'' అమృతత్త్వమును కాంక్షించు ముముక్షువగు వానికి ఆత్మ ద్రష్టవ్యము - (సాక్షాత్కరించుకొన దగినది.) తత్సాక్షాత్కారార్థము ఆత్మతత్త్వము విచారింపదగినది, మననము చేయదగినది యని బోధించు వాక్యములో కల్పితమైన భేదము నంగీకరించి ద్రష్టవ్యమగు బ్రహ్మకంటె వేరుగ జీవుడు ఆత్మసాక్షాత్కారమునకై యత్నింపవలసిన వాడుగ ప్రతిపాదింపబడి యుండుటవలన తెలియబడుచున్నది. ఆ జగత్కర్తగ వర్ణింపబడిన బ్రహ్మ శారీరాభిన్నము కాదు గాన పూర్వోక్త దోష ప్రసంగ మచట నుండదు. నిత్యముక్త స్వభావమగు పరమాత్మకు హితమిది యనిగాని అహితమిది యనిగాని కొంచెమును నుండదు. మహావాక్యములయందు నిరుపాధికమగు కేవల స్వరూపమును బోధింపవలయును కోరికతో జీవాత్మ పరమాత్మలకు అభేదము నిర్దేశింపబడుచుండును. కాన పూర్వోక్త దోషములకు ప్రసక్తియుండదు. ఈ సందర్భములోని భాష్యగ్రంధమిట్లున్నది. ''తత్త్వ మసి'' మొదలుగాగల అభేదబోధకములగు మహావాక్యములచేత జీవపరమాత్మలకు గల అభేదమెప్పుడు సుష్ఠుగ తెలియబడినది యగునో అప్పుడు జీవాత్మకు సంసారిత్వమును -బ్రహ్మకు జగత్ర్సష్టృత్వమున్నూ అపగతము కాగలవు. మిథ్యాజ్ఞాన (అవిద్యా) విజృంభణ మాత్రమే యగు సర్వవిధ భేదవ్యవహారమున్నూ జీవపరైక్య లక్షణమగు యథార్థజ్ఞానముచేత బాధింపబడును గనుక - అట్టి పరమార్థ స్వరూపమగు జీవాత్మ పరమాత్మైక్యస్థితియందు - ఈ సృష్టి యొక్కడిది - హితాకరణాది దోషముల ప్రసక్తి యొక్కడిది ? ఇవి యేవియు లేవనుట - కాన నిత్యముక్త స్వభావుడగు బ్రహ్మకు హితాకరణాది దోషప్రసంగము సంభవించదు, అని.

23. సూ : అశ్మాదివచ్చ తదనుపపత్తిః

వివృత్తిః :- అఖండైకరూపే బ్రహ్మణి కథం జీవేశ్వరాదిభేద్‌ః, కథంవా కార్యవైచిత్ర్యం చోపపద్యత ఇత్యాశంకాయా ముచ్చతే - అశ్మాదివత్‌ చ= వజ్ర వైడూర్య లోష్ఠాదీనీ మశ్మనాం - చందన కింపాకాది బీజానాం చ పార్థివత్వావిశేషేపి యథోత్తమాధమాది భావః - గంధరసాది వైచిత్ర్యం చోపలభ్యతే-ఏవ మేకస్యాపి బ్రహ్మణో జీవేశ్వరభేదః - జగత్సృష్ట్యాది కర్తృత్వ తదకర్తృత్వాది కార్యవైచిత్ర్యం చ తత్తత్కార్య సంస్కారరూ పానాది శక్తిభేదా దుపపద్యతే - తదనుపపత్తిః= అఖండైకరసే బ్రహ్మణి కథం జీవేవ్వరాది విభేదః - కథం వా కార్య వైచిత్ర్య మిత్యాదీనాం పరపరికల్పితదోషాణా మనుపపత్తి ర్ద్రష్టవ్యా -

వివరణము :- అఖండైకరసమగు, ఆనందఘనమగు బ్రహ్మయందు జీవేశ్వరాది విభేదము - కార్యవైచిత్ర్యమును ఎట్లుపపన్నము కాగల దనునాశంక రాగా చెప్పబడుచున్నది - శిలలన్నియు పార్థివములే ఐనను (పృథవిని ఆశ్రయించి యేర్పడినవియే ఐనను) కొన్ని శిలలు వజ్రములు - కొన్ని వైడూర్యములు. కొన్ని పలుగురాళ్ళు అగుచు విభిన్న సామర్థ్యము లతో ఉత్తమమధ్యమాధమభావముతో నెట్లు గోచరించుచున్నవో - పార్థివములైన చందనము (మంచిగంధము) కింపాకము (మహాతాళము) మొదలగు బీజములు భిన్న భిన్న గంధరసాదులతో నెట్లు ఒప్పుచున్న వియో అట్లే ఒక్క బ్రహ్మవస్తువునకే జీవేశ్వరభేదమున్నూ - జగత్సృష్టి స్థిత్యాది కర్తృత్వము, తదకర్తృత్వము మొదలగు కార్యవైచిత్ర్యమున్నూ ఆయాకార్యములకు సంబంధించిన బీజావస్థయే స్వరూపముగాగల శక్తి విశేషమునుబట్టి ఉపపన్నము కాగలదు. కాన ఆ పూర్వోక్తములగు అఖండైకరసమగు బ్రహ్మయందు జీవేశ్వరభేదము లెట్లు కుదురును ? కార్యవైచిత్ర్య మెట్లుపపన్న మగును? అను నిట్టి పరపరికల్పిత దోషముల ఆరోపణమన కిచట ఉపపత్తి లేదని ( తావులేదని) గ్రహింపవలయును.

ఉపసంహారదర్శనాధి కరణమ్‌ 8

24. సూ: ఉపసంహారదర్శనా న్నేతిచేన్న క్షీరవద్ధి

వివృతిః :- అద్వితీయం బ్రహ్మ జగతః కారణం భవితుం నార్హతి. కుతః ? ఉపసంహారదర్శనాత్‌= యతో లోకే కులాలాదీనాం ఘటాది కర్తౄణాం ఘటాద్యుత్పాదనాయ మృద్దండచక్రాదీనా మనేకేషాం స్వేతర కారకపదార్థనా ముపసంహారో దృశ్యతే - అద్వితీయస్య తు బ్రహ్మణ స్స్వేతరకారకపదార్థాసంభవాత్‌ - న - ఇతి - చేత్‌= జగత్కారణత్వం స సంగచ్ఛత ఇతి చేత్‌ - న= నేష దోష ః - క్షీరవత్‌ - హి =యథా లోకే క్షీరస్య దధిభావాపత్తియోగ్య శక్తియుక్తస్య బాహ్యాది సాధనాని స్వేతరా ణ్యనపేక్ష్యైవ దధ్యాద్యుత్పాదకత్వం దృష్టం తథా బ్రహ్మణోపి విచిత్రశక్తియుక్తస్య బాహ్య స్వేతరసాధన నిరపేక్ష మేవ జగత్కారణత్వ ముపపద్యతే -

వివరణము :- అద్వితీయమగు బ్రహ్మ జగత్కారణము కాజాలదు. ఏలయన? లోకమునందు కులాలుడు (కుమ్మరి) మొదలగు ఘటాది పదార్థ నిర్మాతలకు ఆయా పదార్థములను నిర్మాణము చేయుటకు స్వేతరములగు మట్టి - చక్రము - దండము - నీరు మొదలగు ననేకములగు సాధన సంభారములయొక్క సంగ్రహణము కానవచ్చుచున్నది. బ్రహ్మవస్తువునకు మాత్ర మీ జగత్తులను నిర్మాణముచేయుటకు స్వేతరములగు (తనకంటె వేరైన) పదార్థములు సాధన సంభారము లేమియు సంభవించవు. బ్రహ్మ అద్వితీయము గదా ! కాన జగత్కారణత్వమా బ్రహ్మవస్తువునకు సంగతముకాదని యనుటయు యుక్తముకాదు - పెరుగుగా కాదగిన శక్తిగలిగి యున్న క్షీరము (పాలు) స్వేతరములు - బాహ్మములు నగు సాధనముల వేని నపేక్షింపకయే దధిని (పెరుగును) ఉత్పాదనము చేయుచుండుట లోకమున కానవచ్చుచున్నది. అట్లే విచిత్రశక్తి సంపన్నమైన బ్రహ్మవస్తువునకు బాహ్యములు, స్వేతరములు నగు సాధన సంభారముల నపేక్షింపకయే జగత్కారణత్వము ఉపపన్నము కాగలదు.

25. సూ: దేవాదివ దపి లోకే

వివృతిః :- జడం క్షీరద్రవ్యం దృష్టాన్తీకృత్య జగత్కారణతాం బ్రహ్మ ణ్యుపపాద్య చేతనాన్‌ దేవాదీన్‌ దృష్టాన్తీ కృత్యాపి బ్రహ్మణి జగత్కారణత్వం సమర్థయతి - లోకే= మన్త్రార్థవాదేతిహాస పురాణాదిషు, వృద్ధవ్యవహారే చ దేవాదివత్‌ - అపి= చేతనా దేవా మునయః పితరశ్చ యోగసిద్ధా స్స్వీయేన యోగమహిమ్నా కించిదపి బాహ్యం సాధనాంతరమనపేక్ష్యైవ నానావిధానాం నగరాదీనాం నానాసంస్థానానాం శరీరాదీనాం చ నిర్మాతృత్వేన ప్రతీయమానా భవన్తి. ఏవం పరమేశ్వరోపి నిత్యసిద్ధ స్స్వమహిమ్నా సాధనాన్తరా ణ్యనపేక్ష్యైవ వివిధం విచిత్రం జగన్నిర్మిమాతీ త్యత్ర న కశ్చి ద్విరోధః -

వివరణము :- జడమగు క్షీరమును దృష్టాంతముగా ప్రదర్శించి అద్వితీయ బ్రహ్మవస్తువునకు జగత్కారణత్వమున సమర్థించి యిపుడు చేతనులగు దేవతలు మొదలగు వారిని దృష్టాంతములుగాజేసి జగత్కారణత్వము బ్రహ్మకు సంభవించునని ఉపపాదనము చేయబడుచున్నది.

వేదములయందలి అర్థవాదముల యందును - మంత్రముల యందును, భారతా దీతిహాసముల యందును, బ్రహ్మండాది పురాణముల యందును, జ్ఞానవృద్ధుల వ్యవహారముల యందును చేతనులగు దేవతలు - మునులు - పితరులు - యోగసిద్ధులు మొదలగువారు తమ తమ యోగ మహితచేత బాహ్యములు, స్వేతరములు నగు సాధనాంతరముల నేకొలదిగను గూడ నపేక్షింపకయే నానావిధములగు పట్టణములు, పల్లెలు మొదలగువానిని, నానా ప్రకారములుగా గోచరించుచు భిన్న భిన్నములగు అవయవ సన్నివేశములు గలిగియున్న - పశు - పక్షి - మానవాది శరీరములు మొదలగు వానిని - నిర్మించుచున్నట్లుగ తెలియవచ్చుచున్నది. అట్లే పరమేశ్వరుడున్నూ నిత్యసిద్ధమగు తన మహిమచేత సాధనాంతరముల నేమాత్రము నపేక్షింపకయే వివిధమగు - విచిత్రమగు జగజ్జాలమును నిర్మాణము చేయుచున్నాడని యనుటలో విరోధమేమియు లేదు.

కృత్స్నప్రసక్త్యధి కరణమ్‌ 9

26. సూ: కృత్స్నప్రసక్తిర్నిరవయవత్వ శబ్దకోపో వా

వివృతి :- క్షీరాది దృష్టాన్తోక్త్యా బ్రహ్మణః పరిణామిత్వ భ్రాన్తిస్స్యాదిత తాదృశభ్రాన్తే ర్వ్యుదాసా యేద మధికరణ మారభ్యతే - జగదు పాదానం బ్రహ్మేత్యత్ర కిం నిరయవం బ్రహ్మ జగత్కారణం కింవా సావయవ మితి వికల్ప్యోభయధాపి దోషో భవ తీత్యత్ర ప్రతిపాద్యతే - కృత్స్నప్రసక్తిః= నిరవయవస్య బ్రహ్మణో జగదుపాదానత్వే7భ్యుపగతే కృత్స్నస్యాపి బ్రహ్మణో జగదాకారేణ పరిణామో వక్తవ్య స్స్యాత్‌ - తదా జగత్వ్యతిరేకేణ బ్రహ్మణోభావాత్‌ ''ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యః....'' ఇత్యాది శ్రుతిషు ద్రష్టవ్యత్వేన శ్రోతవ్యత్వే నోవదిష్ట స్యాత్మాభిన్నస్య బ్రహ్మణోభావా త్తాదృశ స్యోపదేశస్య వైయర్థ్యం స్యాత్‌ - యది సావయవ మేవ బ్రహ్మ జగదుపాదాన మిత్యంగీక్రియేత తదా సావయవస్య బ్రహ్మణః ఏకదేశే= ఏకస్మిన్‌ భాగే (కైశ్చిదవయవైః) జగదాకారతా భవతి - తతోన్యత్ర భాగాన్తేరే తత్‌ స్వస్వరూపేణౖ వావతిష్ఠత ఇత్యుక్తే పూర్వోక్తదోషో యద్యపి న స్యాత్‌ - తథాపి - నిరవయవత్వ శబ్దకోవః - వా= ''నిష్కలం నిష్ర్కియం శాన్తం ....'' ఇత్యాదీనాం బ్రహ్మతో నిరయవత్వ ప్రతిపాదికానాం శ్రుతీనాం బాధ స్స్యాత్‌ - తస్మా దుభయధాపి బ్రహ్మ జగత్కారణ మితి పక్షో న సమంజస ఇతి పూర్వః పక్షః.

వివరణము :- క్షీరదృష్టాంతమును చెప్పుటచేత బ్రహ్మ క్షీరము వలె పరిణమించు స్వభావము కలది యను భ్రాంతి కలుగవచ్చును. అట్టి భ్రాంతిన తొలగించుటయై యీ అధికరణ మారంభింప బడుచున్నది.

జగదుపాదానకారణము బ్రహ్మ అని చెప్పగా నిరవయవమగు బ్రహ్మ జగత్కారణమా - లేక సావయవ బ్రహ్మయా అని ఆలోచించి చూడ నీరెండు కల్పములయందును దోషము సంభవించు నని యిచట ప్రతిపాదింప బడుచున్నది.

నిరవయపమగు బ్రహ్మ జగదుపాదానమని యనుచో నా బ్రహ్మ వస్తువంతయు జగదాకారముగ పరిణమించెనని చెప్పవలసివచ్చును. అట్లు కాగా జగత్తుకంటె వేరుగ బ్రహ్మవస్తువు మిగిలియుండుదు గావున ''ఆత్మా వారే ద్రష్టవ్యః'' అను నిట్టి శ్రుతులలో ద్రష్టవ్యముగా (సాక్షాత్కర్తవ్యముగా ). శ్రోతవ్యముగా నుపదేవింపబడిన ఆత్మాభిన్నమగు బ్రహ్మవస్తువు నకు అభావమేర్పడును. కాన నట్టి యుపదేశము వ్యర్థము కావలసివచ్చును.

సావయవమగు బ్రహ్మ జగదుపాదానమని యంగీకరించుచో నప్పుడు సావయవమగు బ్రహ్మ ఒక భాగములోని తన కొన్ని యవయవములతో జగదాకారముగ పరిణమించునని - మరియొక భాగమున స్వస్వరూపముతో నే మార్పులు లేకనే తానుండు నని చెప్పవలసి వచ్చును. అట్లు చెప్పగా ఆ పక్షములో వెనుక చెప్పిన దోషముండదు కాని '' నిష్కలం నష్ర్కియం శాన్తం'' బ్రహ్మ నిరవయవము - నిష్ర్కియము - శాన్తము - అని యిట్లు బ్రహ్మకు నిరవయవత్వమను ప్రతిపాదించు శ్రుతులకు విరోధమేర్పడును. కాన సాయవ - నిరవయవ పక్షములలో రెండిండి లోను బ్రహ్మ జగత్కారణమను వాదము సమంజసము కాదని పూర్వ పక్షము.

27. సూ : శ్రుతేస్తు శబ్దమూలత్వాత్‌

వివృతిః :- శ్రుతే - తు= ''ఏతావా నన్య మహిమా 1 అతో జ్యాయాగ్‌ శ్చ పూరుషః'' ఇత్యాది శ్రుతిషు బ్రహ్మణ స్స్వవికార ప్రపంచ వ్యతిరేకే ణావస్థానం శ్రూయతే - అతో న బ్రహ్మణి కృత్స్నప్రసక్తిరితి యో దోష ఉద్భావిత స్స న భవతి - నాపి తావతా బ్రహ్మణ స్సావయత్వప్రసక్తిః- ''నిష్కలం నిష్ర్కియం... '' ఇత్యాది నిరవయవత్వ ప్రతిపాదక శ్రుతిబలా దేవ. యద్యేవం తర్హి ఏకదేశవరినామ నిరవయవత్వ ప్రతిపాదయో శ్ర్శుత్యో ర్విరోధః ప్రసజ్యత ఏవేతిచేత్‌ - శబ్దమూలత్వాత్‌ బ్రహ్మస్వరుప స్వభావప్రతిపత్తే శ్శబ్దమాత్రప్రమాణకత్వాత్‌ - శ##బ్దైక సమధిగమ్యేర్థే యథాశబ్ద మర్థోధిగన్తవ్యో నప్రత్యక్షాదివిరోధ స్తత్రప్రసంజనీయః - ప్రత్యక్షాది ప్రమాణావిషయత్వా త్తస్య - అపిచ ''వాచా రంభణం వికారో నామధేయ'' మిత్యాది శ్రుత్యా బ్రహ్మ వికారస్య జగతో మిథ్యాత్వావగమాత్‌ - వస్తుత స్సన్మాత్రస్య బ్రహ్మణ స్తాదృశ జగత్పరిణా మోసాదానత్వాసంభవా ద్వివర్తోపాదానత్త్వ మేవ శ్రుతి షూపపాదిత మిత్య వగన్తవ్యమ్‌. తతశ్చ జగత్ర్పతి బ్రహ్మణో వివర్తోపాదానత్వేంగీకృతే కృత్స్నప్రసక్త్యాదీనాం దోషాణాం నాస్త్యే వాత్రావకాశ ఇతి సిద్ధమ్‌.

వివరణము :- ''ఏ తావా నస్య మహిమా | అతో జ్యాయాగ్‌ శ్చ పూరుషః '' ఈ దృశ్యమానమగు ప్రపంచమంతయు నాపరమాత్మయొక్క మహిమయే. పరిపూర్ణుడగు నా పరమాత్మ ఇంతకంటె నెంతయో గొప్పవాడు. అను నిట్టి శ్రుతివాక్యములయందు తనవలన నేర్పడుచున్న స్వవికారమగు ప్రపంచముకంటె వేరుగ తానుండుట బ్రహ్మవస్తువునకు వర్ణింపబడుచున్నది. అందువలన బ్రహ్మయందు కృత్స్నప్రసక్తిః నిరవశేషముగ బ్రహ్మతానంతయు జగదాకారముగ పరిణమించవలసివచ్చు నని యే దోషము బ్రహ్మకారణ వాదమున నుద్భావింపబడినదో అది తొలగిపోవును. అంత మాత్రముచేత బ్రహ్మకు సావయవత్వదోషమును ప్రసక్తము కాజాలదు. ఏలయన? ''నిష్కలం నిష్ర్కియం .... '' ఇత్యాది నిరవయత్వ ప్రతిపాదక శ్రుతిసామర్థ్యమువలన. ఇట్లగుచో ఒకభాగమున పరిణామమును ప్రతిపాదించుచున్న - నిరవయత్వమును ప్రతిపాదించున్న నీయుభయశ్రుతులకును పరస్పర విరోథము ఏర్పడును కదా అని ఆక్షేపమురాగా దానికి శబ్దమూలత్వాత్‌ అని సమాధానము చెప్పబడుచున్నది. బ్రహ్మస్వరూప స్వభావములను గూర్చిన జ్ఞానము శబ్దప్రమాణ లభ్యముగాని శ##బ్దేతరములగు ప్యత్యక్షాది ప్రమాణలభ్యము కాదు. (శబ్దమనగా నిచట వేదమని యర్థము ) శబ్దమాత్రముచేతనే గ్రహింపదగిన పదార్థము విషయములో నా శబ్దమెట్లు ఆ అర్థమును వర్ణించుచున్నదో అట్లే ఆ అర్థమును గ్రహింపవలయును గాని దానిపై ప్రత్యక్షాది ప్రమాణ విరోధమును ప్రసరింప జేయరాదు. ఏలయన ? ఆ వస్తువు ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరించనిది కనుక. మరియు - ''వాచారంభణం వికారో ...'' ఇత్యాది శ్రుతి బ్రహ్మవికారమగు (బ్రహ్మనుండి ప్రభవించిన ) జగత్తునకు మిథ్యాత్వమును తెలియజేయుచున్నది గనుక, సన్మాత్రమే యగు బ్రహ్మవస్తువునకు మిథ్యాభూతమగు ప్రపంచమునుగూర్చి పరమార్థముగ పరిణామోపాదానత్వము సంభవించదు గాన వివర్తోపాదానత్వమే శ్రుతిలయందు ఉపపాదింపబడినది యని గ్రహింపవలయును, జగత్తునుగూర్చి బ్రహ్మవస్తువునకు వివర్తోపాదానత్వ మంగీకరింపగా కృత్స్న ప్రసక్త్యాదులగు దోషముల కిచట అవకాశ మేమాత్రమును లేదని సిద్ధమగుచున్నది.

28. సూ :- ఆత్మని చైవం విచిత్రాశ్చ హి

వివృతిః :- కథ మద్వితీయే సదేకస్వభావే బ్రహ్మణి స్వస్వరూపానుపమర్దేన నానావిధా విచిత్రా స్సంభవన్తీతి మా విస్మేతవ్యమ్‌ - హి= యస్మాత్‌ - ఆత్మని - చ= ఏకస్మి న్నపి స్వప్నదృ శ్యాత్మని విచిత్రాః= నానాకారా వివిధా స్సృష్టయః ప్రాదుర్భవన్తి వినైవ స్వరూపోపమర్ద మాత్మన ఇతి ప్రతిపాదయతి శ్రుతిః - ''న తత్ర రథా న రథయోగా న పన్థానో భవన్తి, అథ రథాన్‌ రథయోగాన్‌ పథ స్సృజతే, సహి కర్తా '' ఇత్యాదినా - లోకే చ మాయావిని స్వరూపానుపమర్దేనైవ హస్త్యశ్వాది విచిత్రా స్సృష్టయో దృశ్యన్తే - నహి తత్ర స్వప్నదృశ్యాత్మని, మాయావిని చ కృత్స్నప్రసక్త్యాదయో దోషా భవన్తి, దృష్టవిరోధాత్‌ - ఏవం= ఏవం పరమాత్మ న్యపి మహామాయే విచిత్రాః పదార్థా జాయన్తే - న తత్ర ప్యుక్తా దోషా స్సంభవన్తి శ్రుతిప్రామాణ్యాత్‌ -

వివరణము :- అద్వితీయమైన - సన్మాత్రమైన బ్రహ్మయందు స్వస్వరూపమునకు ఉపమర్దము (ప్రచ్యుతి) ఏమాత్రము లేకుండగ నానావిధములగు నీ విచిత్రరూపమగు ప్రపంచము ఎట్లు సంభవించుచున్నది యని ఆశ్చర్యపడ నవసరము లేదు. ఎందువలన ననగా - స్వప్నద్రష్ట ఒక్కడే ఐనను ఆతనియందు విచిత్రములు - నానా కారములతో నొప్పు వివిధ పదార్థముల సృష్టులు ప్రాదుర్భవించుచున్నవి యని. అట్టియెడ ఆత్మకు స్వస్వరూపోపమర్ద ముండదని ''న తత్రరథాన రథయోగా .... సహి కర్తా ''స్వప్న దర్శనసమయమున స్వప్నద్రష్టయగు నాతనియందు రథములుగాని, గుర్రములుగాని, రథసంచార యోగ్యమార్గములుగాని ఉండవు గాని ఆ స్వప్నద్రష్ట నిద్ర యేర్పడిన తరువాత రథములను, గుర్రములను, మార్గములను ఇట్లు సమస్త ప్రపంచమును తాను సృజించును. ఆతడే ఆ పదార్థముల నిర్మించు కర్త అని ఈ శ్రుతివాక్యముప్రతిపాదించుచున్నది. అట్లే లోకమున మాయావి (గారడీవాని) యందును ఆతని స్వరూపములో ఏమియు మార్పులేకుండగనే ఏనుగులు, గుర్రములు మొదలగు వివిధపదార్థముల యొక్క సృష్ట్యాదులు చూడబడుచున్నవి. ఆ స్వప్నద్రష్టయగు ఆత్మయందుగాని - ఆ మాయావియందుగాని పూర్వోదాహృతములగు కృత్స్నప్రసక్త్యాదులగు దోషములు సంభవించువుగదా ! వారియందిట్టి దోషముల నారోపించబూనుట అసంగతము. అనుభవ విరుద్ధము గనుక - ఇట్లే మహామాయానియగు పరమాత్మయందును విచిత్రములైన ఆకాశవాయ్వాది సమస్త పదార్థములును పుట్టుచున్నవి. ఆ ఆత్మయందును శ్రుతి ప్రామాణ్యము ననుసరించి పూర్వక్తదోషములు సంభవించనేరవు.

29. సూ : స్వపక్షదోషా చ్చ

వివృతిః :- స్వపక్షదోషాత్‌ - చ= కృత్స్న ప్రసక్తప్రముఖా యే దోసా స్సాంఖ్యై శ్ర్శౌతే సమన్వయే చేతన బ్రహ్మకారణవాదే ఉద్భావితాస్తే సర్వేపి దోషాః స్వపక్షే= సాంఖ్యానాం పక్షేపి= ప్రధానకారణవాదేపి సమానా ఏవ - యత స్తేపి జగత్కారణత్వేన తైరభిమతస్య ప్రధానస్య నిరవయత్వ మురరీచక్రుః. పరిహృతాశ్చ బ్రహ్మకారణవాదిభి ర్మాయా శక్తీ ః పురస్కృత్య తే దోషా ః - తథా సాంఖ్యైః ప్రధానకారణవాదే న తే దోషా ః పరిహర్తుం శక్యాః - అత స్సమంజసతరో బ్రహ్మకారణవాదః -

వివరణము :- చేతనమైన= సర్వజ్ఞమైన బ్రహ్మవస్తువు జగత్కారణమనునది శ్రుతిసమ్మతమైన సమన్వయము. ఆ సమన్వయముపై సాంఖ్యులచేత కృత్స్నప్రసక్తిమొదలగు దోషములు సంభవించు నని ఆరోపణ చేయబడినది. కాని ఆ దోషములు వారి పక్షమైన ప్రధానకారణ వాదపక్షములోను సమానములే. కారణమేమియన ? వారును జగత్కారణముగ వారిచే సంగీకరింపబడిన ప్రధానతత్త్వమును నిరవయవము అని అంగీకరించిరి. బ్రహ్మకారణవాదులగు ఔపనిషదులు కృత్స్నప్రసక్త్యాదిదోషములను బ్రహ్మ నిరవయవమే ఐనను స్వగత మాయాశక్తి విశేషములను పురస్కరించుకొని నిచిత్ర జగత్కారణత్వమా బ్రహ్మకు ఉపపన్నమగు నని చెప్పుచు పరిహరించిరి. సాంఖ్యులకుమాత్ర మాదోషములు పరిహరింప శక్యముకానివి యగుచున్నవి. కాన బ్రహ్మకారణవాదము నిర్దుష్టము సమంజసతరము నని తెలియదగును.

సర్వోపేతాధికరణమ్‌ 10

30. సూ :- సర్వోపేతా చ తద్దర్శనాత్‌

వివృతిః :- విచిత్ర మాయాశక్తియోగా ద్ర్బహ్మణో విచిత్రజగదుత్పాదకత్వ ముపపాదితం - తన్నోపపద్యతే - అశరీరస్య న మాయేతి న్యాయే నాశరీరస్య బ్రహ్మణో న మాయాయోగో వా న తచ్ఛ క్తియోగో వా సంభవతీతిచుత్‌ - ఉచ్యతే - సర్వోపేతా - చ అశరీరాపి సా పరాదేవతా పరమాత్మా సర్వశక్తియుక్తైవ. కస్మాత్‌ - తద్దర్శనాత్‌ ''సర్వకర్మా సర్వకామ స్సర్వరసః '' ఇత్యాదికాసు శ్రుతిషు తథా వ్రతిపాదనాత్‌ -

వివరణము :- విచిత్రమాయాశక్తి సంబంధమువలన బ్రహ్మకు విచిత్ర జగదుత్పాదకత్వ ముపపన్నమగునని ప్రతిపాదింపబడినది. ఆవాదము యుక్తి యుక్తమైనది కాదు. శరీరములేని వానికి మాయఉండదు. అశరీరస్య న మాయా అని లోకసిద్ధమగు నొక న్యాయము కలదు. ఆ న్యాయము ననుసరించి బ్రహ్మ అశరీరిగాన ఆ బ్రహ్మకు మాయాసంబంధముగాని, మాయాశక్తి సంబంధముగాని సంభవించ దని ఆక్షేపము రాగా ఈ సూత్రము చెప్పబడుచున్నది.

ఆ పరాదేవత పరమాత్మ సర్వశక్తి సంప్నమైనదే అని నిర్ణయింపదగును. కారణమేమియన ? '' సర్వకర్మా ... రసః '' ఆ పరమాత్మ సర్వకర్మ స్వరూపుడు - సర్వకామస్వరూపుడు. సర్వరస స్వరూపుడు - అని వర్ణించు శ్రుతులలో శరీరాదులు లేకున్నను సర్వశక్తి సంపన్నత్వము ప్రతిపాదింపబడియున్నది గనుక ఆ ఆక్షేపము బ్రహ్మకారణవాదమున ప్రసరించనేరదు.

31. సూ :- వికరణత్వా న్నేతిచే త్తదుక్తమ్‌

వివృతిః :-''అచక్షుష్క మశ్రోత్రం '' .... ''అప్రాణః-'' అమనాః '' ఇత్యాది శ్రుతిషు కరణవిరహితత్వం బ్రహ్మణః ప్రతిపాదితం - సర్వశక్తిమతా మపి దేవాదీనాం చక్షుశ్ర్శోత్రదేహాదికరణయుక్తానా మేవ విచిత్ర కార్యజనకత్వ మవగమ్యతే - ఏవం స్థితే - వికరణత్వాత్‌= దేహాదికరణానా మభావాత్‌ బ్రహ్మణ స్సర్వశక్తిత్వేపి జగత్ర్సష్టృత్వం నోపపద్యతే - ఇతి - చేత్‌= ఇత్యాశంకా కృతా చేత్‌ - తత్‌= తత్ర యదుత్తరం వ్యక్తవ్యం తత్‌ - ఉక్తమ్‌= పూర్వ మేవోక్తమ్‌ ''శ్రుతేస్తు శబ్దమూలత్వా '' దిత్యత్ర - శ##బ్దైకసమధిగమ్యేర్థే యథాశబ్ద మేవార్థో ధిగన్తవ్య ఇత్యాదినా - శ్రుత్యవగాహ్య మేవేద మతిగంభీరం బ్రహ్మ న తర్కాద్యవ గాహ్యమ్‌. యద్వా - తత్‌= తత్ర వక్తవ్యం సమాధానం ఉక్తమ్‌= ''అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యచక్షు స్సశృణోత్యకర్ణః'' ఇత్యాది శ్రుత్యా, అకరణస్యాపి బ్రహ్మణ స్సర్వకర్తృత్వం సంభవతీతి సమాధాన ముక్తమ్‌ - అపిచ వికరపణస్య జీవస్య కర్తృతావాసంభ##వే పీశ్వరస్య సంభవ తీతి "దేవాదివ దపి లోకే'' ఇత్యత్రోక్తమ్‌. యేన ప్రకారే ణౖకస్య సామర్థ్యం దృష్టం భవతి తేనైవాన్యస్యాపి సామర్థ్యేన భవితవ్య మితి న హ్యస్తినియమ ఇతి.

వివరణము :- ''అచక్షుష్క మశ్రోత్రం ... '' ''అప్రాణః '' - ''అమనాః... ఆ బ్రహ్మవస్తువు చక్షురింద్రియము లేనిది - శ్రోత్రేంద్రియము లేనిది ఆ పరమాత్మ ప్రాణములేనివాడు - మనస్సులేనివాడు - అని చెప్పు నిట్టి శ్రుతులలోబ్రహ్మకు ఇంద్రియములు లేవని ప్రతిపాదింపబడుచున్నది. సర్వశక్తి సంపన్నులే ఐనను చక్షున్సు - శ్రోత్రము - ప్రాణము - మనస్సు - దేహము - మొదలగు సాధనములు గలిగియున్న దేవతలు - మునులు మొదలగువారే విచిత్రములగు కార్యముల నుత్పాదన చేయువారు గ్రహింపబడుచున్నారు. సర్వశక్తి సంపన్నమే ఐనను దేహేంద్రియాది కరణములు సాధనములు లేవు గాన అట్టి బ్రహ్మవస్తువునకు జగత్ర్సష్టృత్వమును సంభవించనేరదును ఆశంకయేర్పడుచున్నది. కాని ఆ ఆశంక విషయములో చెప్పదగిన సమాధానము "శృతేస్తు శబ్దమూలత్వాత్‌ '' అనుచోట చెప్పబడియున్నది. ''బ్రహ్మస్వరూపస్వభావములను గూర్చిన జ్ఞానము శబ్ద ప్రమాణలభ్యముగాని శ##బ్దేరతరము లగు ప్రత్యక్షాది ప్రమాణ లభ్యముకాదు. (శబ్దమనగా నిచట వేదమని యర్థము.) శబ్దముచేతనే గ్రహింపదగిన పదార్థముల విషయములో నా శబ్దమెట్లు ఆపదార్థమును వర్ణించుచున్నదో అట్లే ఆ పదార్థమును గ్రహింపవలయును గాని దానిపై ప్రత్యక్షాది ప్రమాణ విరోధమును ప్రసరింపజేయురాదు. ఏలయన? ఆ వస్తువు ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరించనది కనుక" అని. సూత్రములోని "తదుక్తం" అను భాగమునకు మరియొక వ్యాఖ్యానము. పూర్వోదాహృత శంకకు సమాధానము శ్రుతియందు చెప్పబడియున్నది అని ''అపాణి పాదో ... కర్ణః '' ఆపరమాత్మ హస్తములు- పాదములు లేనివాడైనను, శీఘ్రగమనము కలవాడును - ఆయా పదార్థములను స్వీకరింపగలవాడను అగుచున్నాడు. ఆయన నేత్రములు లేనివాడు. కాని సర్వమును చూచుచున్నాడు. శ్రోత్రము లేనివాడయ్యును వినుచున్నాడు. అని చెప్పు నిట్టి శ్రుతివాక్యముచేత కరణములు లేకున్నను సర్వకార్య కర్తృత్వము బ్రహ్మకు సంభవించునని సమాధానము చెప్పబడినది. మరియు - నా ఆశంకకు ''దేవాది ప దపి లోకే '' అను సూత్రమునందు సాధనములులేని జీవునకు కర్తృత్వము సంభవించకున్నను ఈశ్వరునకు సాధనాపేక్ష లేకయే కర్తృత్వము సంభవించునని సమాధానము చెప్పబడియున్నది - ఒకనికి ఏ విధమగు సామర్థ్యము కానవచ్చునో మరియొకని సామర్థ్యముకూడ నట్లే ఉండవలయునను నియమము లేదుగదా !

ప్రయోజన వత్త్వాధికరణమ్‌ 11

32. సూ :- న ప్రయోజ వత్వాత్‌

వివృతిః :- న= పరమాత్మ జగన్నిర్మాతేతి యదుచ్చతే తన్నోప పద్యతే - కుతః? ప్రయోజన వత్త్వాత్‌= లేకే చేతనవాతం ప్రవృత్తీనాం సర్వాసాం ప్రయోజనవత్త్వస్య నియమేన దృష్టత్వాత్‌ - సహ్యభ్రాన్తః కశ్చిదపి ప్రయోజన మనపేక్ష్య క్వాపి ప్రవర్తతే - పరమాత్మా తు చేతన స్సర్వజ్ఞో - నిత్యతృప్తవ్చ - నిత్యతృప్తత్వా దేవ ప్రయోజనాభిసంధి పూర్వికా ప్రవృత్తి ర్ర్బహ్మణో న సంభవ తీతి జగన్నిర్మాతృత్వం బ్రహ్మణో న సంగచ్ఛత ఇతి పూర్వః పక్షః -

వివరణము :- పరమాత్మ జగత్కర్త యనుట యుక్తముకాదు. ఏల యన? లోకమున చేతనులగువారి సర్వవ్యాపారములును ప్రయోజనము కలవిగనే ఉండునుగదా ! భ్రాంతుడుకాని వాడెవడును ఏ ప్రయోజనమును కోరక ఏపనియందును ప్రవర్తించడు. ఇది సర్వలోక ప్రసిద్ధము - పరమాత్మ చేతనుడు - సర్వజ్ఞుడు - (భ్రాంతుడు కాదని యనుట) నిత్యతృప్తుడును. నిత్యతృప్తుడు కాననే ప్రయోజనము నొకదానిని కోరి తదభి సంధి పూర్వకముగ ప్రవృత్తి వ్యాపారము పరమాత్మకు సంభవించుదు. కాన జగన్నిర్మాణ కర్తృత్వము బ్రహ్మకు కలదనుట అసంగతము అని పూర్వపక్షము.

33. సూ :- లోకవత్తు లీలాకైవల్యమ్‌

వివృతిః :- లోకవత్‌= లోకేఇవ లోకవత్‌ - యథా లోకే రాజా మాత్యాదీనాం వినైవ ప్రయోజనము మృగయాదిషు కేవలలీలారూపాః ప్రవృత్తయో దృశ్యన్తే - యథైవ చోచ్ఛ్వా సనిశ్వాసాదయ స్స్వభావే వోత్పద్యన్తే తథా బ్రహ్మణోపి జగన్నిర్మాణాది విచిత్రకార్యరచనా కేవలలీలామాత్రమేవ. న ప్రయోజనసాపేక్షమ్‌. కథం చిద్రాజామాత్యాదీనాం ప్రవృత్తౌ ప్రయోజనవత్తాయా స్సంభ##వేపి నిత్యతృప్తే బ్రహ్మణి తు లీలామాత్రమేవ జగన్నిర్మాణాది ప్రవృత్తి రితి వక్తవ్యమ్‌.

వివరణము :- లోకమునందు ప్రయోజనాపేక్షలేకయే సర్వసంపత్సమృద్ధులతో నొప్పుచున్న ప్రభువులు - మంత్రులు మొదలగు వారలకు వేటలాడుట మొదలగు వ్యాపారములయం దెట్లు కేవలలీలారూపములైన ప్రవృత్తులు= వర్తించుటలు కానవచ్చుచున్నవో - ఉచ్ఛ్వాస నిశ్వాసాదులెట్లు స్వభావముచేతనే పుట్టుచున్నవో - అట్లే పరబ్రహ్మవస్తువునకు కూడ జగన్నిర్మాణము మొదలగు విచిత్రకార్యరచన యనునది కేవల లీలారూపమే యగునుగాని ప్రయోజనాపేక్షతో చేయబడునది కాదు. ప్రభువులకు, మంత్రులకు సంబంధించిన వేట మొదలగు వ్యాపారములలో ఏ కొంచమైనను ప్రయోజనము (వినోదాదికము) సంభవించినను నిత్యతృప్తుడౌ పరమాత్మయందు మాత్రము జగన్నిర్మాణాది ప్రవృత్తి లీలామాత్రమే అని చెప్పితీరవలయును.

వైషమ్యనైర్ఘృణ్యాధి కరణమ్‌ 12

34. సూ :- వైషమ్యనైర్ఘృణ్య న సాపేక్షత్వా

త్తథాహి దర్శయతి

వివృతిః :- పరమాత్మనో జగత్కర్తృత్వాభ్యుపగమే - దేవాదయో హి జీవా స్సుఖభాజో దృశ్యన్తే, తిర్యగాదయస్తు దుఃఖభాజ స్తదుభయభిన్నా మనుష్యా మధ్యమాః - ఏతాదృశీం విషమాం సృష్టిం నిర్మిమాణస్య నిర్నిమిత్తం సర్వాః ప్రజా స్సంహరత స్తస్య పామరజనస్యేవ విషమత్వ నిర్దయత్వ రూపౌ దోషౌ సంభవతః - ''నిరవద్యం నిరంజనం'' ఇత్యాదిశ్రుతిషు బ్రహ్మణో నిరవద్యత్వం= నిర్దోషత్వ ముపవర్ణితమ్‌ - అతో నిరవద్యస్య బ్రహ్మణో జగత్కర్తృత్వం నోపపద్యత ఇత్యాక్షేపే సమాధాన ముచ్చతే - వైషమ్యనైర్ఘృణ్య= విషమత్వ నిర్దయత్వరూపౌ దోషౌ - న= బ్రహ్మణి న ప్రసజ్యేయాతామ్‌ - కుతః ? సాపేక్షత్వాత్‌= తత్త త్ర్పాణికృత సాధ్యసాధు కర్మసాపేక్షత్వా త్తత్సుఖాదివైచిత్ర్యస్య - కుత ఏత దవగమ్యతే బ్రహ్మణః ప్రాణికర్మసాపేక్షమేవ విషమసృష్టి కర్తృత్వ మితిచేత్‌ - తథా - హి - దర్శయతి= ''ఏషహ్యేవ సాధుకర్మ కారయతి తం.......'' ఇత్యాద్యా శ్రుతి స్త మర్థం స్పష్టం ప్రతిపాయతి - తత్తత్పురుషకృత సాధ్వసాధు కర్మాపేక్ష్య నిగ్రహానుగ్ర హకర్తరి రాజ్ఞివైషమ్యనైర్ఘృణ్య న వ్యవహరన్తి లోకా ః - అతో నిరవద్య బ్రహ్మకారణవాద స్సమంజస ఏవేతి సిద్ధమ్‌ -

వివరణము :- పరమాత్మ జగత్కర్తయని యంగీకరించుచో ''వైషమ్య నైర్ఘృణ్యము '' లను దోషములు పరమాత్మకు సంభవించును - ఎట్లన ? ఈ జగత్తులో - దేవతలు అత్యంతము సుఖభోగములు కలవారుగ కానవచ్చు చున్నారు. పశుపక్ష్యాది తిర్యగ్జీవులు వాతాతపాదులచే నేర్పడు మహాదుఃఖముల ననుభవించువారుగ కానవచ్చుచున్నారు. మనుష్యజీవులు మాత్రము అత్యంత సుఖభోగులుకాక - మహాదుఃఖముల నొందువారునుగాక మధ్యమ రీతి కలవారుగ కానవచ్చుచున్నారు. ఇట్టి విషమసృష్టిని నిర్మాణము చేయుచున్నట్టి - నిర్నిమిత్తముగ సమస్త ప్రజలకు సంహరించుచున్నట్టి - పరమేశ్వరునకు పామరుడగు= అజ్ఞుడగు జనునకువలె -వైషమ్యము= విషమత్వము - నైర్ఘృణ్యము= నిర్దయత్వము అను దోషములు సంభవించగలవు. ''నిరవద్యం నిరంజనం'' ఇత్యాది శ్రుతులలో బ్రహ్మనిర్దోషము= దోషరహితము అని వర్ణింపబడియున్నది. బ్రహ్మ జగత్కర్త యనుచో దోషములు సంభవించును గనుక నిరవద్యమగు నిర్దోషమగు బ్రహ్మకు జగత్కర్తృత్వము చెప్పుట యుక్తము కా దను ఆక్షేపము రాగా సమాధానము చెప్పబడుచున్నది.

బ్రహ్మ వస్తువునందు విషమత్వ - నిర్దయత్వరూప దోషములు ప్రసక్తములు కానేరవు. ఏలయన ? ఆయాదేవ మనుష్య పశ్వాదిప్రాణుల యందలి సుఖదుఃఖాది తారతమ్యరూప వైచిత్ర్యములు ఆయా ప్రాణులచే ననుష్ఠింపబడిన సాధ్వసాధు= పుణ్యా పుణ్య కర్మవైచిత్ర్యము నపేక్షించి యేర్పడుచున్నవి గనుక. ఇట్లు విషమమగు (తాత్మములతో గూడిన) సృష్టిని పరమేశ్వరుడు ఆయాప్రాణులచే చేయబడిన కర్మల నపేక్షించియే చేయుచున్నట్లు ఎట్లు తెలియవచ్చుచున్నది యనుచో చెప్పుచున్నారు. ''ఏషహ్యేవ సాధు కర్మ కారయతి తం '' ఈ పరమేశ్వరుడు ఏ ప్రాణిని యీ లోకమునుండి ఉన్నత లోకములనుగూర్చి పొందింపవలయునని తలంచునో ఆతనిచేత పుణ్యకర్మను చేయించును. అని యిట్లు చెప్పుచున్న ఈ శ్రుతి ఆ యర్థమును స్పష్టముగ ప్రతిపాదించుచున్నది. ఆయా పురుషులచే చేయబడిన యోగ్యాయోగ్య కర్మలనుబట్టి నిగ్రహానుగ్రహములను (శిక్షను - సమ్మానమును) చేయుచున్నట్టి ప్రభువునందు వైషమ్యనైర్ఘృణ్యములను దోషముల నాపాదించి యీ ప్రభువు విషమ స్వభావముకలవాడనిగాని, దయారహితుడనిగాని, లోకమున నెవరును వ్యవహరించరు. కాన నిరవద్య (నిర్దోష) బ్రహ్మకారణవాద మసమంజసము కాదని, సమంజసమే అని సిద్ధించుచున్నది.

35. సూ :- న కర్మావిభాగా దితిచే న్నానాదిత్వాత్‌

వివృతిః :- అవిభాగాత్‌= ''సదేవ సోమ్యేద మగ్రఆసీ '' దిత్యాది శ్రుతౌ సృష్టేః ప్రాక్‌ బ్రహ్మజగతో ర్విభాగాభావావధారణాత్‌ - న - కర్మ= తదానీం కర్మ నాస్తి; యదపేక్ష్య విషమాం సృష్టి ముత్పాదయే త్పరమాత్మా - తతః కర్మాపేక్షయా పరమాత్మా విషమాం సృష్టిం జనయేదిత్యేత దసంగత మిత్యాక్షేపే సమాధాన ముచ్యతే - అనాదిత్వాత్‌= అనాదిత్వా త్సంసారస్య - బీజాంకురన్యాయేన పూర్వపూర్వసర్గానుష్ఠిత కర్మణా ముత్తరోత్తర - బీజాంకురన్యాయేన పూర్వపూర్వసర్గానుష్ఠిత కర్మనా ముత్తరోత్తర సర్గహేతుత్వ సంభవాత్‌ బ్రహ్మకారణవాదే న కోపి దోష ఇతి -

వివరణము :- ''సదేవ సోమ్యేద మగ్రఆసీత్‌ '' ఇత్యాది శ్రుతులలో సృష్టికి పూర్వపుకాలమున జగద్ర్బహ్మలకు విభాగాభావము (జగత్తు కంటె వేరై బ్రహ్మవస్తువుగాని - బ్రహ్మకంటె వేరై జగత్తుగాని విభక్తమై లేకపోవుట) నిశ్చయింపబడుటవలన, నెట్టికర్మనుబట్టి విషమమగు ఈ విచిత్ర జగస్సృష్టిని పరమార్మ నిర్మించునని వెనుక చెప్పబడినదో అట్టి కర్మ ఆ సమయములో లేదు కనుక కర్మ నపేక్షంచి పరమేశ్వరుడు విషమమగు నీ దేవతాదిసృష్టిని చేయుచున్నాడనుట సంగతముకాదు అను ఆక్షేపము రాగా - సమాధానము చెప్పబడుచున్నది. ''అనాదిత్వాత్‌ '' అని. అనగా అనాదియగు నీ సంసారమునకు బీజాంకుర న్యాయానుసారము పూర్వపూర్వకల్పములయందలి సృష్టికాలమున ననుష్ఠింపబడినతత్తత్ర్పాణి కర్మలకు ఉత్తరోత్తరకల్పములయందలి సృష్టినిగూర్చి కారణత్వము సంభవిచుచున్నది గాన బ్రహ్మకారణవాదమున ఏ ఒక్క దోషమును లేదని సిద్ధమగుమన్నది.

36. సూ :- ఉపపద్యతే చాప్యుపలభ్యతే చ

వివృతిః :- ఉపపద్యతే - చ యదుక్త మనాదిత్వం సంసారస్య తదుపపద్యత ఏవ - కుతః ? సంసారస్యాదిమత్త్వే హ్యంగీకృత్తేకస్మా దేవ సృష్టి రిత్యంగీకృతా స్యాత్‌ - తతశ్చ ముక్తస్యాపి పునర్జన్మప్రసంగః- అకృతాభ్యాగమ - కృతప్రణాశాది దోషప్రసంగ శ్చ స్యాత్‌ - తస్మా త్సంసార స్యానాదిత్వ మవశ్య మభ్యుపగన్తవ్యమ్‌. ఉపలభ్యతే - చ - అపి సంసార స్యానాదిత్వం ''సూర్యాచంద్రమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్‌ '' ఇత్యాదిశ్రుతిష్వపి స్పష్ట మవగమ్యత ఏవ -

వివరణము :- పూర్వసూత్రమున సంసార మనాదియని సూచించిరి. అది ఉపపన్నమేనా అని ఆ శంకించువారిని గూర్చి చెప్పుచున్నారు.

సంసారమునకు అనాదిత్వము ఉపపన్నమేను. ఏలయన ? సంసార మనాదియని యనక ఆది కలది యని యనినచో సృష్టిని గూర్చి కారణము లేకపోవును. సృష్టి కారణాపేక్ష లేక (అకస్మాత్‌ ) పుట్టుచున్నది - యని యంగీకరించిన ముక్తపురుషులకు తిరిగి జన్మ ప్రసక్తము కావలసివచ్చును. అనుష్ఠింపబడని కర్మఫలములకు ఆగమప్రసంగము - పూర్వానుష్ఠిత కర్మలకు వినాశప్రసంగమును రాగలదు. కానసంసారమునకు అనాదిత్వ మవశ్యముగ నంగీకరింపవలయును. మరియు సంసారమునకు అనాదిత్వము ''సూర్యాచంద్ర ... మకల్పయత్‌'' సృష్టికర్తయగు ప్రజాపతి సూర్యచంద్రులు మొదలుగా గల సమస్తప్రపంచమును పూర్వకల్పమునందు వలెనే నిర్మించెను అని చెప్పు నిట్టి శ్రుతులలో స్పష్టముగా తెలియవచ్చుచున్నది. కాన సంసార మనాదియనుట యుక్తిసమ్మతమును - శ్రుతి సమ్మతమును నని భావము.

సర్వోధర్మోప పత్త్యధికరణమ్‌ 13

37. సూ :- సర్వధర్మోపపత్తే శ్చ

వివృతిః :- సర్వధర్మోపపతేః - చ సర్వజ్ఞే - సర్వశక్తౌ మహామాయే పరే బ్రహ్మణి కారణ పరిగృహ్యమాణ ప్రదర్శితేన ప్రకారేణ సర్వేషాం కారణధర్మాణా ముపపద్యమానత్వా దిద మనతిశంకనీయ మౌపనిషదం దర్శన మితి సిద్ధమ్‌.

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయతివర విరచితాయాం బ్రహ్మసూత్రవివృతౌ ద్వితీయధ్యాయస్య - ప్రథమః పాదః-

వివరణము :- ఇట్లు వెనుకటి యధికరణములలో విచారించినరీతుల ననుసరించి చూడ కారణవస్తువునకు ఉండదగిని ధర్మములన్నియు సర్వజ్ఞము. సర్వశక్తి సంపన్నము - మహామాయాసముల్లసిము నౌ పరబ్రహ్మ వస్తువునందు నంభవించుచున్నవి గనుక నీ యుపనిషత్సమ్మతమగు దర్శనము ఏమాత్రము సందేహింప దగినది కాదని సిద్ధమగుచున్నది.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకరభారతీ యతివర విరచితమగు బ్రహ్మ సూత్రార్థ వివరణమున

ద్వితీయాధ్యామున - ప్రథమపాదము ముగిసెను.

ద్వితీయాధ్యాయస్య - ద్వితీయః పాదః

పూర్వపాదే స్వపక్షే పరోద్భావిత దూషణనిరాకరణన స్వపక్ష స్సాధితః. ఇదానీం పరపక్షం దూషయితుం ద్వితీయపాద ఆరభ్యతే సాంఖ్యా ఏవం మన్యన్తే - సర్వత్రజగతి సుఖదుఃఖాద్యన్వయ దర్శనా త్సుఖదుఃఖమోహాత్మకం ప్రధానం జగదుపాదానం నాన్య దితి. ఘటపటాదయో హి లభ్యమానా స్సుఖాయ భవన్తి జలాహరణ ప్రావరణాది కార్యకారిత్వాత్‌ - త ఏవాన్యై రపహ్రియమాణా దుఃఖాయ మోహాయ చ భవన్తి, ఏవం సుఖదుఃఖమోహానా మన్వయదర్శనా త్ర్పపంచస్య సుఖదుఃఖ మోహాత్మకతయా త్రిగుణాత్మక స్యాస్య జగత స్త్రిగుణాత్మకం ప్రధాన మేవోపాదానం భవితు మర్హతి నాన్య దితి - అత్రేద ముచ్చతే -

రచనా నుపపత్త్యధి కరణమ్‌

1. సూ :- చరనానుపపతేశ్చ నానుమానమ్‌

వివృతిః :- అనుమానం ప్రధానం న= జగత్కారణం భవితుం నార్హతి - కుతః? రచనానుపపత్తేః అచేతనాత్‌= స్రష్టవ్యార్థ జ్ఞానశూన్యా త్ర్పధానా - దనేక విధవిచిత్రజగద్రచనాయా అనుపపత్తేః - లోకే విచిత్రప్రాసాదాది రచనాయా బుద్ధికుశలశిల్ప్యాది కార్యత్వదర్శనా దితి భావః

వివరణము :- వెనుకటి పాదములో తమ పక్షమునందు ఇతర పక్షముల వారిచే నారోపింపబడిన దూషణములను = ఆ క్షేపములను నిరాకరించుట ద్వారా స్వపక్షము నిర్దుష్టము, యుక్తిసంపన్నము, శ్రుతిసమ్మతము నని ప్రతిపాధింపబడినది. ఇపుడు పరుల పక్షములను దూషించుటకు అనగా ప్రమాణయుక్తి సంపన్నములు కావని నిరూపించుటకు రెండవపాదమారంఖింప బడుచున్నది.

సాంఖ్యులిట్లు ప్రతిపాదించుచున్నారు. ఈ సమస్త ప్రపంచమును, అనగా సమస్త దృశ్యపదార్థములను సుఖదుఃఖాదులతో ననుబద్ధములై యున్నట్లు కానుపించుచున్నవి గనుక, సుఖదుఃఖ మోహాత్మకమగు ప్రధానము సర్వజగదుపాదాన కారణము కాదగియున్నది గాని తద్భిన్నము మాత్రము జగదుపాదానముకాజాలదు అని. ఘటపటాది పదార్థము లుపలబ్ధములగుచు మానవులకు సుఖహేతువు లగుచున్నవి. ఘటము నీరు తీసికొని వచ్చుటకుని, వస్త్రము కప్పుకొనుటకును ఉపయోగపడి సుఖసంపాదకము లగుచున్నవి. ఆ వస్తువులే ఇతరులచే నపహరింపబడినపుడు దుఃఖమును, మోహమును కలుగజేయునవి కాగలవు. (మోహమనగా విమనస్కత - చిత్తవైకల్యము - దుఃఖాతిరేకమున తెలివి లోపించిపోవుట) ఇట్లు విచారించిచూడ సర్వప్రపంచమును సుఖదుఃఖమోహహేతు వగుచుండుటచేత సుఖదుఃఖ మోహములతో ననుబంధము గలదిగ (సుఖదుఃఖ మోహాన్వితముగ) కానవచ్చుచున్నది. కనుక నీ ప్రపంచము సుఖదుఃఖ మోహాత్మక మనియు కనుకనే సత్వరజస్తమో గుణాత్మకమనియు నిర్ణయింపబడుచున్నది. (సుఖము సత్వగుణమునకు - దుఃఖము మోహము రజస్తమోగుణములకును సూచకములు.) అట్టి జగత్తునకు త్రిగుణాత్మకమైన ప్రధానమే ఉపాదాన కారణము కాదగునుగాని యన్యము గానేరదు, అని - ఇట్టి సాంఖ్యపక్షము విషయములో ఈ సూత్రము చెప్పబడుచున్నది.

ప్రధానము జగత్కారణము కానేరదు. ఏలయన ? అచేతనమైన, కాననే స్రష్టవ్య (సృష్టింపబడదగిన) పదార్థములను గురించిన జ్ఞానము లేని ప్రధానములవలన నానా ప్రకారములతో నొప్పుచు, విచిత్రమైన ఈ ప్రపంచముయొక్క రచన = నిర్మాణము జరుగుట అసంభవము గనుక. లోకమున బుద్ధికౌశలముగల్గి తాను సృజింపదలచిన పదార్థములయొక్క జ్ఞానముగల్గి యున్న శిల్పులచేతనే విచిత్రముగలగు ప్రాసాదములు మొదలగు వానియొక్క రచనము = నిర్మాణము చేయబడుచున్నట్లు కానవచ్చుచున్నదిగాని అచేతనములచే = జడపదార్థములచే చేయబడుట లేదు గదా.

2. సూ : ప్రవృత్తే శ్చ

వివృతిః :- సాంఖ్యా హి చేతనాధిష్ఠిత సై#్యవ స్వతన్త్రస్య ప్రధానస్య జగత్కారణత్వం వర్ణయన్తి - తత్రేద ముచ్చతే - ప్రవృత్తేః - చ = ప్రధానస్య గుణత్రయ సామ్యావస్థారూపస్య యా సృష్ట్యర్థం ప్రవృత్తిః = సామ్యావస్థానా త్ర్పచ్చుతిః - తస్యా అపి ప్రవృత్తే శ్చేతనాధిష్ఠాన మన్తరేణానుపత్తే = అసంభవా దపి ప్రధానం న జగత్కారణం భవతి. చేత నాధిష్ఠితస్య రథాదే దేవ లోకే ప్రవృత్తి దర్శనాత్‌.

వివరణము :- సాంఖ్యులు ప్రధానము స్వతంత్రముగ చేతను డొకడు ప్రేరణము చేయకుండగనే (చేతనా నధిష్ఠితమగుచునే) తాను సర్వజగత్కారణ మగుచున్నది యని వర్ణించుచున్నారు. మరియు సత్వము - రజస్సు - తమస్సు - అను మూడు గుణములును వైషమ్యము (హెచ్చుతగ్గులు) లేక సమభావము పొంది యుండగ దానిని సామ్యావసయందురు. అట్టి గుణత్రయ సామ్యావస్థయే ప్రధానమనగా. సామ్యస్థితి నుండి ప్రధానమునకు సృష్ట్యారంభకాలమున సామ్యస్థితిని భంగింపజేయు నొక ప్రవృత్తి యేర్పడు నని, అంత గుణములయొక్క విషమభావముతో (హెచ్చుతగ్గు స్థితులతో) సృష్టి ఆరంభమగుననియు వారందరు. ఇట్టి సాంఖ్యపక్షము విషయములో చెప్పబడుచున్నది.

గుణత్రయ సామ్యావస్థాస్వరూపమగు ప్రధానమునకు జగత్సష్టి కొరకైన ప్రవృత్తి (సామ్యావస్థాన ప్రచ్చుతి అనగా సామ్యస్థితిని కోల్పోవుట) యేది కలదో ఆ ప్రవృత్తి ప్రవర్తకుడగు చేతనుని ప్రేరణము లేక సంభవించదు. కనుక స్వతంత్రముగ జడమగు ప్రధానము జగత్కారణము కాజాలదు. జడములగు రథములు (బండ్లు) మొదలగువానికి చేతనులతో సంబంధ మున్నప్పుడు ప్రవృత్తి = కదలిక కానవచ్చుచున్నది గదా !

3. సూ : పయోంబువచ్చే త్తత్రాపి

వివృతిః :- పయోంబువత్‌ - చేత్‌= పయ శ్చాంబు చ పయోంబునీ - పయోంబునీ ఇవ పయోంబువత్‌ - యథా పయః= క్షీరం అచేతన మపిస్వత ఏవ వత్సవివృద్ధయే ప్రవర్తతే - యథా వా అంబు= జలం స్వయమేవ స్యన్దతే - తథా అచేతనం ప్రధాన మపి స్వత ఏవ చేతనాధిష్ఠాన మన్తరేణౖవ ప్రవర్తత ఇత్యుచ్యతే చేత్‌ - తత్ర - అపి పయోంబునో రపి చేతనాధిష్ఠితత్త్వ మస్త్యే వేతి '' యోప్సు తిష్ఠ న్న పోన్తరో యమయతి.'' ఇత్యాది శ్రుతిబలా దస్మాభి రుపగతత్వాత్‌ - పయోంబుదృష్టా న్తేన ప్రధానస్య స్వతః అన్తరా చేతనాధిష్ఠానం ప్రవృత్తి స్సమర్థయితుం న శక్యా -

వివరణము :- క్షీరము పాలు = అచేతన మయినను = జడమయి నను, శిశువుల అభివృద్ధికొరకు తాన స్వయముగ నెట్లు ప్రవర్తించుచున్నదో - జలము జడమయ్యును తాను స్వయముగ నెట్లు ప్రవహించుచున్నదో - అట్లే ప్రధాన మచేతనమయ్యును ప్రవర్తక చేతన ప్రేరణము లేకనే తాను స్వయముగ జగత్సృష్టి కనుకూలముగ ప్రవర్తించునని సాంఖ్యులు చెప్పగా. ''తత్రాపి'' అను సూత్రభాగముతో నా సమాధానము సరిగాదని నిరూపించుచున్నారు. ఈ క్షీరజలాదుల యందును చేతనాధిష్ఠితత్వము (ప్రేరకుడగు చేతనుని సంబంధము) కలదని ''యోప్సు తిష్ఠన్నపోన్తరో యమయతి '' ఉదకముల యందున్నవాడై ఆ ఉదకముల కాంతరుడై వానిని నియమించుచున్న వాడె వడో ఆత డన్తర్యామి. అని యిట్లు చెప్పు అన్తర్యామి బ్రహ్మణ వాక్యముల సామర్థ్యము ననుసరించి మేము నిర్ణయించుచున్నాము. కాన నవి దృష్టాంతములు కానేరవు. కాన పయోంబు దృష్టాంతములతో ప్రధానమునకు చేతన సంబంధము లేకుండ గనే స్వతంత్రముగ ప్రవృత్తి సంభవించు నని సమర్థింప శక్యము కాదు.

4. సూ : వ్యతిరేకానవస్థితే శ్చానపేక్షత్వాత్‌

వివృతిః :- సాంఖ్యమతే సామ్యే నావస్థితా గుణాః= ప్రధానం ఇతి - పురుష స్తూదాసీన ఇతి నిర్ణయః - ఏవం చ సతి - వ్యతిరేకానవ స్థితే - చ =ప్రధానవ్యతిరేకేణ సహకా ర్యన్తరస్య తత్ర్పవర్తకస్య నివర్తకస్య వా కస్యచిత్‌, అనవస్థితేః= అభావాత్‌ - పురుషస్య చోదాసీనత్వాత్‌ అనపేక్షత్వాత్‌= ప్రవృత్తౌ వా నివృత్తౌ వా సాంఖ్యైః ప్రధాన స్యాన్యాన పేక్షత్వం వక్తవ్యం స్యాత్‌. తన్మతే తాదృవచేతనానపేక్షత్వాదేవ ప్రధానం కదాచి న్మహ దాద్యాకారేణ పరిణమతే - కదాచి న్నివర్తతే ఇతి న శక్యం వక్తుం - నియామకస్య చేతన స్యాభావాత్‌ - ఆతః ప్రధానకారణ వారదో నోపపన్న ఇతి సిద్ధ్యతి - ఈశ్వరస్య తు సర్వజ్ఞత్వాత్‌ - సర్వశక్తి మత్త్వాత్‌ - మహామాయత్వా చ్చ ప్రవృత్తినివృత్తీ న విరుద్ధ్యేతే -

వివరణము :- సాంఖ్యమతములో సామ్యస్థితినిపొందియున్న సత్వరజస్తమోగుణములే ప్రధానమనియు - పురుషు డుదాసీనుడనియు నిర్ణయము - ఈ నిర్ణయము యుక్తము కాదనుచున్నారు. ప్రధాన వ్యతిరిక్తమైన (ప్రధానభిన్నమైన) ప్రధానముయొక్క ప్రవృత్తికిగాని నివృత్తికిగాని సహకారియైన వస్తువు మరియొకటి ఆ మతములో లేదు గనుకనున్నూ - పురుషుడు దాసీనుడు గనుకనున్నూ - ప్రధానముయొక్క ప్రవృత్తి నివృత్తులకు ఇతరాపేక్ష లేదని (అనపేక్షత్వము) చెప్పవలసివచ్చును. అట్లు అనపేక్షత్వము ప్రధానమున కంగీకరించుటవలన నా మతములో ప్రధానము ఒకప్పుడు మహత్తత్త్వాది రూపముగ పరిణమించునని, మరియొకప్పుడు తద్వ్యతిరిక్తముగ నివర్తించునని నిర్ణయించుట శక్యము కాదు. నియామకుడగు చేతనుడు లేడు గాన - కనుక ప్రధానకారణవాదము ఉపపన్నము కాదని సిద్ధమగుచున్నది. బ్రహ్మకారణ వాదములో నీశ్వరుడు సర్వజ్ఞుడు - సర్వశక్తి సంపన్నుడు - మహామాయా విలసితుడు గాన ప్రవృత్తి నివృత్తుల విషయములో విరోధముండదు.

5. సూ :- అన్యత్రాభా వా న్న తృణాదివత్‌

వివృతిః :- సహకారిణః అభావా త్ర్ప దానస్య ప్రవృత్తి నివృత్తీ నో పపద్యేతే ఇత్యుక్తం - ఇదానీం సహకార్యభావేపి ప్రధానస్య ప్రవృత్తి రుపపద్యతే దృష్టాన్తబలా దిత్యత ఆహ - తృణాదివత్‌ = తృణపల్లవా దీనాం ధేన్వా ద్యుపభుక్తానా మన్యనిరపేక్ష మేవ యథా క్షీరభావేన పరిణామః - తద్వ త్ర్పధాన స్యాపి సహకారినిరపేక్ష మేవ జగదాకారేణ పరిణామో భవతు - ఇతిచేత్‌ - న న తథా వక్తుం యుక్తం - కుతః ? అన్యత్రాభావాత్‌ = ధేన్వాదే రన్యత్ర అనడుహా ద్యుపభోగే గర్తప్రక్షేపే వా తృణాదేః క్షీరీభావాభావాత్‌; దేన్వాది సాపేక్ష మేవ తృణాదికం క్షీరా కారతాం భజతే నాన్యధేతి వక్తవ్యం - నిరపేక్షత్వే బలీవర్దాదా వపితృణాదేః క్షీరప్రసంగ స్స్యాత్‌ - అతః ప్రధానం స్వతః అన్యనిరపేక్షం ప్రవర్తత ఇత్యేత న్నోపపన్నమ్‌ -

వివరణము :- సహకారి వస్తువు లేకపోవుటవలన ప్రధానమునకు ప్రవృత్తి నివృత్తులు సంభవించ వని చెప్పబడినది. ఇప్పుడు సహకారి వస్తువ లేకున్నను ప్రధానమునకు ప్రవృత్తి సంభవించగలదని దృష్టాంతబలముతో నిరూపించ దలచగా చెప్పుచున్నారు.

తృణములు = గరికె మొదలగునవి - పల్లవాదులు = చిగురుటాకులు మొదలగునవి ఆవులు మొదలగువానిచే భక్షింపబడినవియై ఇతరాపేక్ష ఏమి లేకుండగనే క్షీరాది రూపముగ నెట్లు పరిణమించుచున్నవియో అట్లే ప్రధానముకూడ సహకారి వస్తువుయొక్క అపేక్ష లేకుండగనే జగదాకారముగ పరిణమించవచ్చును అని యనుట యుక్తము కాదు. ఏలయన ? ఆవులు మొదలగు వానికంటె నన్యమైన = భిన్నమైన వృషభాదులచే భక్షింపబడినప్పుడు ఆతృణాదులు క్షీరభావమును పొందుటలేదు. కాన ఆవులు మొదలగువానియొక్క సహకారము నపేక్షించియే తృణాదులు క్షీరభావమును పొందుచున్నవి గాని మరియొక విధముగ కాదని చెప్పవలయును. అన్యాపేక్ష అనావశ్యకమగుచో వృషభాదులయందును తృణాదులకుపాలుగా పరిణామము రావలసివచ్చును. అందువలన ప్రధానము ఇతారపేక్ష లేక స్వతంత్రముగ ప్రవర్తించుననుట అనుపపన్నము.

6. సూ అభ్యుపగమే ప్యర్థాభావాత్‌

వివృతిః :- ఇదానీం ప్రధానస్య స్వతః ప్రవృత్తి మంగీకృత్యాపి ప్రధానవాదం దూషయతి - అభ్యుపగమే - అపి= ప్రధానస్య స్వతః ప్రవృత్తి రస్తీ త్యభ్యుపగమేపి తద్వాదస్య నిర్దుష్టత్వం న సంభవతి - కుతః ? అర్థాభావాత్‌= ప్రధానప్రవృత్తేః - అర్థస్య= ప్రయోజనస్య - అభావాత్‌ - సాంఖ్యైర్హి పురుషస్య= ఆత్మనో భోగాపవర్గార్థం ప్రధానే ప్రవృత్తి రంగీక్రియతే - ప్రధాన స్యాచేతనత్వేన పురుషస్యార్థం =ప్రయోజనం భోగరూపం - అపవర్గరూపం వా - సాధయామితి ధియా ప్రవృత్తి ర్న సంభవతి - నిర్మలస్య - అసంగస్య - ఉదాసీనస్య - పురుషస్య అనాధేయాతివయత్వాత్‌, తత్ర భోగం వా - అపవర్గం వాన ప్రధానం సంగమయితుం సమర్థం భ##వేత్‌ - తస్మా త్పురుషార్థా ప్రధానస్య ప్రవృత్తి రిత్యేత దయుక్తం -

వివరణము :- ఈ సూత్రములో ప్రధానమునకు స్వతః= స్వతంత్రమగు ప్రవృత్తి కలదని యంగీకరించియు ప్రధానవాదములను నిరసించుచున్నారు.

ప్రధానము స్వతంత్ర ప్రవృత్తి కలదని యంగీకరించినను ఆవాదము నిర్దుసటము కానేరదు, ఏలయన ? ఆ ప్రధానముయొక్క ప్రవృత్తికి ప్రయోజనము సంభవించదు గనుక. సాంఖ్యులు పురుషునియొక్క= ఆత్మయొక్క భోగాపవర్గార్థము ప్రధానమునందు ప్రవృత్తి నంగీకరించుచున్నారు. (భోగమనగా నిషయానుభవము - అపవర్గమనగా మోక్షము) ప్రధాన మచేతనము గాన పురుషునకు= ఆత్మకు భోగరూప ప్రయోజనమును గాని, అపవర్గరూప ప్రయోజనమును గాని సంపాదింతునను బుద్ధితో ప్రవృత్తి దానికి సంభవించదు - మరియు వారి మతములో పురుషుడు నిర్మలుడు - అసంగుడు - ఉదాసీనుడు - నని నిర్ణయము -ఆతడు అనాధేయాతిశయ స్వరూపుడు, (అనగా సంపాదించి ఆతనియందు సంక్రమింపజేయదగిన విశేషము లేమియు లేనివాడని యర్థము.) అట్టి పురుషునియందు ప్రధానము భోగమునుగాని అపవర్గమునుగాని సమకూర్ప సమర్థము కానేరదు. కాన ప్రధానముయొక్క ప్రవృత్తి పురుషునికొరకు అని యనుటయు యుక్తము కాదు.

7. సూ : పురుషాశ్మవ దితి చేత్తత్రాపి

వివృతిః :- పురుషాశ్మవత్‌= పురుష శ్చాశ్మా చ పురుషాశ్మనీ - పురుషాశ్మనీ ఇవ - పురుషాశ్మవత్‌ - పురుషః= యథా లోకే దృక్‌ శక్తియుక్తః ప్రవృత్తిశక్తిహీనః పంగుః పురుషః - స్వయ మప్రవర్తమానోపి సన్నిధి మాత్రేణ దృక్‌ శక్తిహీనం ప్రవృత్తి శక్తయుక్తం పురుష మధిష్ఠాయ తం ప్రవర్తయతి - అశ్మా అయస్కాంతః స్వయ మప్రవర్తమానోపి సన్నిధి మాత్రేణాయః ప్రవర్తయతి - తద్వత్పురుషః = ఆత్మా స్వయ మప్రవర్తమానోపి ప్రధానం ప్రవర్తయతి ఇతి - చేత్‌ = ఇత్యుక్తం చేత్‌ - తత్ర - అపి తథోక్తేపి = తస్మి న్నపి పక్షే - ప్రధానస్య పురుషు ప్రేర్యత్వే - సాంఖ్యైః స్వాతంత్ర్యం ప్రధానస్య యదభ్యుపగతం తస్య విరోధః - పురుషస్య ప్రధానపేరకత్తే సాంఖ్యైః కౌటస్థ్యం పురుషస్య యదభ్యుపగతం తస్య విరోధః - ఇత్యాదయో దోషాః ప్రధానకారణవాదే తదవస్థా ఏవ భ##వేయుః- బ్రహ్మకారణవాదే తు బ్రహ్మణః ప్రవర్తకత్త్వా దయో హ్యావిద్యకా ఇతి న కౌటస్థ్యహానిః.

వివరణము :- దృక్‌ శక్తి (చూచుశక్తి) కలిగి - ప్రవృత్తిశక్తి (కదలుశక్తి) లేని పంగుపురుషు డొకడు (ఒక కుంటివాడు) స్వయముగ తానేమియు కదలనివాడయ్యును సాన్నిధ్యమాత్రముచేత దృక్‌ శక్తిహీనుని - (చూచుశక్తిలేనివానిని) ప్రవృత్తి శక్తియుక్తుని (కదలుశక్తితో కూడియున్న వానిని) (నడవగలవానిని) అధిష్ఠించి యాతనిని ప్రవర్తింపజేయును. అట్లే అయస్కాంతశిలయు స్వయముగ తానేమియు ప్రవర్తించక (కదలక) యుండియు సాన్నిధ్యమాత్రముచేత ఇనుమును ప్రవర్తింపజేయు చున్నది. అట్లే ఆత్మ స్వయముగ ప్రవృత్తి (కదలిక) లేనివాడయ్యును ప్రధానమును ప్రవర్తింపజేయును అని యన్నను ఆ పక్షములో విరోధము తప్పదు. ఎట్లన ? ప్రధానము పురుషునిచే ప్రవర్తింపచేయబడినది యనినచో - ప్రధానతత్త్వమునుందు సాంఖ్యులచే నంగీకరింపబడిన స్వాతంత్ర్యమునకు భంగము వాటిల్లును - పురుషుడు ప్రధానమును ప్రేరేపించెను = ప్రవర్తింపజేసెనని యనినచో పురుషునకు సాంఖ్యులచే నంగీకరింపబడిన కూటస్థత్వము (వికారరహితత్వము) నకు భంగము వాటిల్లును. ఇట్టి దోషములు ప్రధానకారణవాదమున అసమాహితములై నిలచి యుండగలవు. బ్రహ్మకారణ వాదమునందు ప్రవర్తకత్వము మొదలగు ధర్మములు అవిద్యవలన నేర్పడిన వని నిర్ణయింపబడి యుండుటతో బ్రహ్మవస్తువునకు చెప్పబడిన కూటస్థత్వము (నిర్వికారత్వము) నకు భంగము లేదు.

8. సూ :- అంగిత్వానుపపత్తేశ్చ

వివృతిః :- అత్రాపి ప్రధానస్య ప్రవృత్తి ర్నావకల్పత ఇత్యేవోచ్చతే - సత్వరజస్తమసాం త్రయాణాం గుణానాం పరస్పరం ప్రధానోపసర్జనభావం పరిత్యజ్య సామ్యేన స్వస్వరూపమాత్రే ణావస్థానం యత్తత్‌ ప్రధానం= ప్రకృతి రితి సాంఖ్యా వదన్తి - తస్యాం సామ్యావస్థాయాం త్రిషు గుణషు ఏకస్యగుణిత్వం= ప్రాధాన్యం; అన్యన్యగుణత్వం అప్రధాన్య మితి విశోషో న సంభవతి - సర్వేషా మపి అన్యనిరపేక్ష తయా సమప్రధానత్వాత్‌ - యది గుణగుణిభావోంగీకృత స్స్యాత్తర్హి సామ్యస్వరూపస్య నాశ ఏవ స్యాత్‌ - తస్మా త్తేషాం గుణానా మంగాంగి భావ స్తదా న వక్తవ్యః - తథా చేత్‌ - అంగిత్వానుపపత్తేః - చ= అంగాంగి భావానుపపత్తేః ప్రధానస్య ప్రవృత్తి ర్న స్యాత్‌. తతశ్చ మహదాది పారంపర్యేణ పరిణామరూపస్య కార్యస్య అనుదయః - తతశ్చ రచనా నుపపత్తి శ్చ స్యాత్‌ -

(అయం భావః - సామ్యావస్థా గుణానాం ప్రధాన మిత్యుక్తం - సామ్యావస్థాతః ప్రచ్యుతే స్సర్గ స్సంపత్స్యతే - సా చ ప్రచ్యుతిః గుణ వైషమ్య రూపా గుణానాం సామ్యే నావస్థితానాం గుణప్రధానభావసంపాదకే నాన్యేన క్షోభ##కేణ వినా న సంభవతి - క్షోభకశ్చ తాదృశః అన్యో నాస్తి - పురుషస్య తూదాసీ నత్వా న్న తతోభకత్వ ముపపద్యతే - తస్మా త్ర్పధానస్య మహదాది పారంపర్యేణ జగదుత్పాదనానుకూల ప్రవృత్తి ర్న స్యాదితి )

వివరణము :- ఈ సూత్రమునందును ప్రధానమునకు ప్రవృత్తి సంభవించదని చెప్పబడుచున్నది.

సత్వ రజస్తమస్సులనున గుణములు మూడును అన్యోన్యము ఇది ప్రధానము ఇది యప్రధానము అను భావములేక సమస్థితితో స్వస్వరూపమాత్రముగానుండు స్థితి యేదిగలదో అది ప్రధానము= ప్రకృతి యని సాంఖ్యులందురు. ఆ సామ్యావస్థయందు మూడు గుణములలో నొకదానికి ప్రాధాన్యము, మరియొక దానికి అప్రాధాన్యము అను విశేషము సంభవించదు. గుణము లన్నియు నితరాపేక్ష లేనివే గనుక అన్నిటికిని సమప్రాధాన్య ముండును. గుణగుణిభావము= ప్రధానా ప్రధానభావము నంగీకరించినచో సామ్యస్థితికి నాశ##మే యేర్పడగలదు. కాన నా గుణ సామ్యావస్థయందు గుణములకు అంగాంగి భావము (ఇది అంగి= అవయవి - ఇది అంగము దాని అవయవము అను భావము) చెప్పదగదు. అంగాంగి భావ మను పపన్నము గనుక ప్రధానతత్త్వమునకు ప్రవృత్తి= కదలిక లేకపోవును. అంత మహదహంకారాది పరంపరా పరిణామరూపమగు కార్యము పుట్టకుండుటయు - అంత జగద్రచనయు= జగన్నిర్మాణమును అనుపపన్నము కాగలదు.

(గుణములయొక్క సామ్యావస్థ ప్రధానమని చెప్పబడుచున్నది. ఆ సామ్యావస్థ చ్యుతముకాగా సృష్టి ఆరంభమగును. సామ్యావస్థయొక్క ప్రచ్యుతి గుణ వైషమ్యరూపము - సామ్యావస్థను పొందియున్న గుణము లకు వైషమ్యము= ప్రధానా ప్రధానభావము - తత్సంపాదకుడు మరియొకడు గుణములను సంక్షోభింప= సంచలింప చేయగలవాడు లేకున్న సంభవిచదు. ఆ మతములో గుణసంక్షోభకుడు మరియొక డున్నట్లు చెప్పబడియుండలేదు. పురుషుడు ఆత్మ= ఉదాసీనుడని నిర్ణయము. కాన నాతడు గుణములను సంక్షోభింపజేయువాడు= చలింపజేయువాడు అని యనుట చెల్లదు. కాన ప్రధానమునకు మహదాది పారంపర్యముతో జగత్తుల నుత్పాదన చేయుట కవసరమగు ప్రవృత్తి సంభవించ నేర దని భావము)

9. సూ : అన్యధానుమితౌ చ జ్ఞ శక్తివియోగాత్‌

వివృతిః :- గుణానాం ప్రధానావస్థాయాం పరస్పరనిరపేక్షత్వం, కూటస్థత్వం - అప్రచలితత్వం - పూర్వ ముపవర్ణితం - ఇదానీం అన్యధా= తతోన్యధా కార్యవశేన గుణానాం స్వభావః= యథా యథాకార్యోత్పాద ఉపపద్యతే - తథా తథా తేషాం స్వభావః అభ్యపగంత్య ఇతి అనుమితౌ = పరస్పర సాపేక్షత్వేన ''చలం గుణవృత్త మితి '' నిత్యప్రచలితత్వేన గుణానా మనుమానే కృతేపి - జ్ఞశక్తివియోగాత్‌ గుణానాం జ్ఞానశక్తిరహితత్వాత్‌ - అచేతనానాం గుణానాం సామ్యావస్థాయాం వైషమ్యయోగ్యాణా మపి నిమిత్త మంతరేణ వైషమ్యే సర్వదా తత్ర్పసంగః - సామ్యే చ సర్వదా సామ్య ప్రసంగః - ఇత్యంగాంగిభావానుపపత్తి దోష స్తదవస్థ ఏవ -

వివరణము :- ప్రధానావస్థయందు గుణములు అన్కోన్య నిరపేక్షములు - కూటస్థములు = నిర్వికారములు - అప్రచలితములు చలించు స్వభావము లేనివి యని గడచిన సూత్రములలో వర్ణింపబడినది. అన్యధా = వెనుక వర్ణింపబడిన విధమునకు ఇప్పుడు మార్పుగ = మరియొక విధముగ - అనగా ఏ విధముగ నిర్ణయించిన కార్యముయొక్క ఉత్పత్తి నిర్దుష్టముగ సంభవించునో ఆ విధముగ గుణముల స్వభావమును అంగీకరింపవలయును గాన గుణములకు పరస్పర సాపేక్షత్వమున్నూ - ''చలం గుణవృత్తం'' గుణములు చలించు స్వభావముకలవి యను నీ వాక్యము ననుసరించి నిత్య ప్రచలన స్వభావమున్నూ కలదని అనుమానము = ఊహ జేసినను గుణములు జ్ఞానశక్తి రహితములు గనుక (గుణములు జడములు వానిక జ్ఞానశక్తి యుండదు. గనుక ) పూర్వోక్తదోషములు నివర్తించవు.

గుణము లచేతనములు. వానికి వైషమ్యముపొందు యోగ్యత కలదని యంగీకరించినను నిమిత్తమేమియు లేకుండగనే వానికి వైషమ్య మేర్పడునని చెప్పుచో ఎప్పుడును వైషమ్యము కలుగుచునే యుండవలసి వచ్చును. అట్లగుచో సదా సృష్టి జరుగుచునే యుండవలయునుగాని ఆసృష్టికి నివృత్తి యేర్పడుట కవకాశముండదు - ఆ సామ్యావస్థయందు గుణము లకు వైషమ్యమును కలుగజేయు నిమిత్తము లేదు గనుక వైషమ్యము (సామ్యావస్థకు భంగము) కలుగదన్నచో సదా సామ్యావస్థయే ఉండవలసివచ్చును. అట్లగుచో ఎన్నటకిని సృష్టి యేర్పడుట కవకాశముండదు. మరియు గుణములకు అంగాంగి భావము (ప్రధా నాప్రధాన భావము) ఉపపన్నము కానేరదను దోషమునును తొలగిపోదు.

10. సూ : విప్రతిషేధా చ్చాసమంజసం

వివృతిః :- సాంఖ్యా హి క్వచి న్మహతః పంచత్మాత్రసృష్టిం వర్ణయన్తి - క్వచి దహంకార దితి వర్ణయన్తి - తథా క్వచి దేకాదశేంద్రియా ణోతి - క్వచి ద్బాహేంద్రియాణి త్వగిన్ద్రియే న్తర్భావ్య సప్తేంద్రియా ణీత్యేవం - విప్రతిషేధాత్‌ - చ పరస్పర విరుద్ధార్థ ప్రతిపాదనా దపి అసమంజసం సాంఖ్యానాం దర్శన మసమంజస మేవేతి -

వివరణము :- సాంఖ్యులు తమ శాస్త్రములో ఒకచోట మహతత్త్వమునుండి పంచతన్మాత్రలు పుట్టినవని వర్ణించిరి. మరియొకచోట అహంకారమునుండి యని వర్ణించిరి. అట్లే ఒకచోట ఇంద్రియము లేకా దశ సంఖ్యాకములని - మరియొకచోట బాహ్మేంద్రియముల నన్నిటిని త్వగింద్రియములోనికి చేర్చి యింద్రియము లేడే ననియు వర్ణించిరి. ఇట్లు పదార్థములు పరస్పర విరుద్ధముగ ప్రతిపాదింప బడియుండుటచే నీ సాంఖ్యదర్శనము సమంజసమైనది కాదని తెలియదగును.

మహద్దీర్ఘాది కరణమ్‌ 2

11. సూ: మహద్దీర్ఘవద్వా హ్రస్వపరిమండలాభ్యామ్‌

నివృతిః :- వై శేషికా హి - శుక్లేభ్య స్తన్తుభ్య స్స్వనమవాయికారణభ్య ఆరభ్యమాణః పట శ్శుక్ల ఏవ భవతీతి, ఏవం రక్తేభ్యో రక్త ఏవేతి కారణగుణ సమానగుణా న్యేవ కార్యాణి భవన్తి నాసదృశ గుణా నీత్యభ్యుప గమ్య చేతనా ద్ర్బహ్మణః అచేతనం జగ జ్జాయత ఇత్యేత దనుప పన్న మిత్యౌపనిషదం దర్శన మాక్షిపన్తి - తన్న సాంప్రత మిత్యత్ర నిరూప్యతే -

అత్ర సూత్రే ప్రథమపదే హ్రస్వపద మప్యధ్యాహృత్య మహ ద్దీర్ఘ హ్రస్వవత్‌. ఇతి పఠనీయం - అత్రత్య వాశబ్ద శ్చ కారార్థకః-

హ్రస్వపరిమండలాభ్యాం హ్రస్వం చ పరిమండలం చ హ్రస్వపరిమండలే - తాభ్యాం - మహద్దీర్ఘహ్రస్వవత్‌ = మహ చ్చ దీర్ఘం చ మహద్దీర్ఘే - మహద్దీర్ఘే చ హ్రస్వం చ మహద్దీర్ఘహ్రస్వాని - తద్వ దితి సమాసః - హ్రస్వాత్‌ = హ్రస్వత్వ పరిమాణ విశిష్టాత్‌ ద్వ్యణుకాత్‌ - మహద్దీర్ఘవత్‌ = స్వ (త్ర్యణుక) సమవాయి కారణీభూత ద్వ్యణుకగత హ్రస్వత్వపరిమా ణాసమానజాతీయ మహత్త్వ పరిమాణ విశిష్టం త్ర్యణుకం జాయతే - స్వసమవాయికారణ ద్వ్యణుక వృత్తి హ్రస్వత్వ పరిమాణసమానజాతీయ దీర్ఘత్వ పరిమాణయుక్తం చ త్ర్యణుకం జాయతే - (పరితోవస్థితై రవయవై ర్యదారభ్యతే త్ర్యణుకం తద్వర్తులం చతురస్రం వా భూత్వా మహదితి వ్యవహ్రియతే; యత్తు దక్షిణోత్తరభాగసంయుక్తైః ప్రాక్పశ్చాద్భాగసంయిక్తై ర్వా అవయవై రారభ్యతే తద్దీర్ఘ మితి చ వ్యవ హ్రియతే లోకే ) ఏవం. పరిమండలాత్‌ = పారిమాండల్య పరిమాణవిశిష్టాత్‌ పరమాణోః స్వసమవాయికారణ పరమాణు వృత్తి పారిమాండల్య పరిమా ణాసమానజాతీయ హ్రస్వత్వ పరిమాణవిశిష్టం ద్వ్యణుకం జాయతే - ఇతి సృష్టి ప్రక్రియాం ప్రదర్శయన్తోవదన్తి - తతశ్చ కారణగుణసమానగునా న్యేవ కార్యా ణీత్యేష స్వాభ్యుపగమ సై#్త రేవ పరిత్యక్త ఇతి సావద్యో వైశేషికవాద ఇతి - తేన చౌపనిషదస్య దర్శనస్య న కాప్యనుప పన్న తేతి చ సిద్ధం భవతి.

వివరణము :- వైశేషికమతము వారిట్లనుచున్నారు. వస్త్రమను కార్యమునకు సమవాయి కారణము (ఉపాదాన = ముఖ్యకారణము తంతువులు = దారములు. ఆదారములు తెల్లవియైన వానినుండు తయారైన వస్త్రము తెల్లనిదియే యగును. ఇట్లే యెర్రని దారములనుండి తయారైనది యెర్రనిదియే యగును. ఈ న్యాయము ననుసరించి పర్యాలోచింప కారణపదార్థములయందలి గుణములతో సదృశమగు గుణములు కలవి గనే కార్యములు పుట్టుచుండును గాని అసమానగుణములు కలవిగ పుట్టవు అని. ఇట్టి ఒక నిర్ణయమును వారు స్వీకరించి చేతనమగు బ్రహ్మవస్తువు నుండి అచేతమగు ప్రపంచము పుట్టుచున్నది యని యనుట యుక్తి యుక్తము కాదని ఉపనిషత్సమ్మతమగు సిద్ధాంతము నాక్షేపించుచున్నారు. వారి యీ ఆక్షేపము సమంజసము కానేర దని యిచట నిరూపింపబడు చున్నది.

హ్రస్వపరిమండలాభ్యాం = హ్రస్వపరిమండలమునుండి - మమద్దీర్ఘ హ్రస్వవత్‌ = మమాద్దీర్ఘహ్రస్వములు పుట్టుచున్నట్లు - చేతనమగు బ్రహ్మనుండి అచేతనమగు జగత్తు పుట్టవచ్చును. ఆ శాస్త్రమువారు జగత్సృష్టి ప్రక్రియను వివరించు సందర్భములో పరమాణువులు జగత్సృష్టికి మూలమనియు - పరమాణువులు ఒకటితో నొకటి కలసికొని = సంయుక్తమై ద్వ్యణుకము లేర్పడుననియు, ద్వ్యణుకముల సంయోగముతో త్ర్యణుకము లేర్పడుననియు - వానినుండి చతురణుకములును నిట్లు క్రమముగ పరస్పర సంయుక్తములగు బహుసంఖ్యాక అణుద్రవ్యములనుండి యీ గిరినదీ సముద్రాది రూపమగు ప్రపంచమంతయు పుట్టుచున్నదనియు నందురు. ద్వ్యణుకరూపకార్యమును గూర్చి పరమాణువులు సమవాయి కారణ మనియు - త్ర్యణుకరూప కార్యమునుగూర్చి ద్వ్యణుకములు సమవాయి కారణమనియును వారు సూచించిరి. మరియు పరమాణువు నందుండు పరిమాణము పారిమాండల్య పరిమాణమని చెప్పుచు ఆ పరమాణువునుండి పుట్టుచున్న ద్వ్యణుకములు తమకు (ద్వ్యణుకములకు) సమవాయి కారణమైన పరమాణువునందుండు పారిమాండల్య పరిమాణము కాక తద్విజాతీయమగు హ్రస్వత్వపరిమాణము కలవియగు ననియు- అట్లే హ్రస్వత్వ పరిమాణము కలిగియున్న ద్వ్యణుకములనుండి పుట్టుచున్న త్ర్యణుకములును తమకు (త్ర్యణుకములకు) సమవాయి కారణమైన ద్వ్యణుకములు యందుండు పరిమాణముకాక తద్విజాతీయమగు మహత్వ - దీర్ఘత్వ పరిమాణము కలవియు నగుచున్న వనియును ప్రతిపాదించుచున్నారు. (స్వావయవములగు అణువులు చుట్టు వారు కొని గుండ్రముగ (వర్తులముగా) త్ర్యణుకమేర్పడినచో దానిని మహత్తు (మహత్పరిమాణముకలది) అని వ్యవహరింతురు. అట్లుగాక ఆ అవయవములు పొడవుగ పంక్తివలె సంయుక్తములు కాగా ఏర్పడిన త్ర్యణుకము దీర్ఘము (దీర్ఘత్వపరిమాణము కలది) ఆనియు వ్యవహరింతురు.) సృష్టిప్రక్రియ నిట్లు నిర్వచించుచున్న ఆ శాస్త్రకారులు కారణమునందలి గుణములతో సమానమగు గుణములు కలవిగనే కార్యములు పుట్టుచుండవలయు నని వారు చేసికొనిన నియమమును వారే పరిత్యజించిన వారైరి. కాన నీ వైశేషిక వాదము దోషభూయిష్ఠము. కాన నట్టి వైశైషిక వాదముచేత నుపనిషత్సమ్మతమగు నీ బ్రహ్మకారణవాదము అనుపపన్నమని యనుట అసమంజసమని సిద్ధమగుచున్నది.

పరమాణు జగదకారణత్వాధి కరణమ్‌ 3

12. సూ : ఉభయధాపి న కర్మాత స్తదభావః

నివృతిః :- జగత్కారణతా బ్రహ్మనో నోపపద్యతే - కారణీభూత బ్రహ్మగత చైతన్యస్య తత్కార్యే జగ త్యననుగతత్వా దితి వైశైషికైర్య ఆక్షేపో బ్రహ్మకారణవదే ఉద్భావితస్తం తత్ర్పక్రియానుగతేన నిదర్శనే నైవ పరిహృ త్యేదానీం వైశైషికాభిమతః పరమాణుకారణవాదో నిరాక్రియతే - పరమాణవో జగత్కారణ మితి వైశేషికిః. ఇయ మత్ర తేసాం ప్రక్రియా - పృథివ్యప్తేజో వాయ్వాకాశ కాలది గాత్మ మనాంసి నవ ద్రవ్యాణి - తే ష్వాకాశాదయః పంచ నిత్యాని, నిరవయవాని చ- పృథివ్యా దీని చత్వారి నిత్యా న్యనిత్యాని చేతి ద్వివిదాని - తత్ర పృథివ్యప్తేజో వాయవీయా శ్చతుర్విధాః పరమాణవో నిత్యా నిరవయవా శ్చ - తే పరస్పరం సంయుజ్యమానా ద్వ్యణుక త్ర్యణుకాది క్రమేణ జగదుత్పాదయన్తి - సోయం ఘటపటాదే ర్జగత స్సర్గః - తచ్చోత్పన్నం ద్వ్యణుకాదికం జగదనిత్యం - త ఏవ పున ర్వియుజ్యమానా స్సన్తో జగ ద్వినాశయన్తి - తత్ర వినశ్యతాం పృథివ్యాదీనాం సావయవానాం పరమాణుపర్యన్తోవిభాగో భవతి - స ప్రళయ ఇత్యా ద్యాచక్షతే - ఏవం చ సతి సర్గం ప్రతి ప్రయోజక స్సంయోగ ఇతి - ప్రళయం ప్రతీ ప్రయోజకో విభాగ ఇత్యాయాతి - తయో శ్చ సంయోగవిభాగయో ర్నిమీత్తం కించి త్కర్మే త్యభ్యుపగన్తవ్యం - ఇదానీంతనయో స్సంయోగ విభాగయోః దృష్టాదృష్టాన్యతర కర్మనిమిత్తత్వస్య దృష్టత్వాత్‌ - తథా చ యుగప దనన్తపరమాణూనాం సర్గప్రయోజకే సంయోగే వా, ప్రళయప్రయోజకే విభాగే వా దృష్టస్య నిమిత్త స్యాసత్త్వాద్ధర్మాధర్మరూప మదృష్టం కర్మైవ తన్ని మిత్త మితి వక్తవ్యం- తస్య కర్మణః ఆత్మసమవేతత్వే అణుషు సంయోగ ముత్పాదయితుం త న్నశక్కోతి - అణుసమవేతత్వే అభ్యుపగమహానిః - [ధర్మాధర్మా వాత్మ గుణ ష్యన్తర్భూతా వితి తేషా మభ్యుపగమః - తస్య హానిస్యాత్‌] అత స్తస్య కర్మణః సంయోగవిభాగ ప్రయోజకత్వం నోపపద్యతే - అపిచ ధర్మాధర్మయోః సుఖదుఃఖార్థత్వాభ్యుపగమా - త్సంయోగవిభాగ ప్రయోజకత్వం, తద్ద్వారా సృష్టిప్రళయ ప్రయోజకత్వం చ న సంగచ్ఛతే - ఉభయధా - అపి = సంయోగార్థత్వేన విభాగార్థత్వేన చ న కర్మ = ప్రయోజకం కర్మ నాస్తి - అస్తి - అతః = తస్మాత్‌ కర్మాభావాత్‌ - తదభావః = తయో స్సంయోగవిభాగ పూర్వకయో స్వర్గప్రళయయో రభావః - తస్మాత్పరమాణు కారణవాదో న సమంజస ఇతి -

వివరణము :- జగత్కారణము బ్రహ్మయనువాదము యుక్తమైనది కాదు; కారణమగు బ్రహ్మయందుండు చైతన్యము తత్కార్యమగు జగత్తు నందుకానవచ్చుటలేదు గనుక అని వైశేషికులచే చేయబడిన ఆక్షేపమును వైశేషికులు వర్ణించు సృష్ఠి ప్రక్రియ ననుసరించియే నిరాకరించి యీ సూత్రములో వారు చెప్పు పరమాణువులు జగత్కారణమను వాదముగూడ నిరాకరింపబడుచున్నది.

పరమాణువులు జగత్తునుగూర్చి మూలకారణమని వైశేషికుల యాశయము - వారి శాస్త్ర ప్రక్రియలో పృథివి - జలము - తేజస్సు - వాయువు, ఆకాశము - కాలము - దిక్కు - ఆత్మ - మనస్సు, అని తొమ్మిది ద్రవ్యములని, అందు మొదటి నాలుగు ద్రవ్యములును నిత్యములని - అనిత్యములని రెండు విధములుగ నుండుననియు - మిగిలిన ఐదు ద్రవ్యములును నిత్యములు - నిరవయవములునునై యుండుననియు - పృథివ్యాది నాలుగు ద్రవ్యములకు సంబంధించిన పరమాణువులు మాత్రము నిత్యములు - నిరవయవములనియు - తద్ఛిన్నములు - (ద్వ్యణుకము మొదలు మిగిలిన ఘటాదికములగు కార్యములన్నియు) అనిత్యములు - సావయవములనియు - పరస్పర సంయుక్తములగు పరమాణువులు ద్వ్యణుక - త్య్రణుకాది క్రమముగ ఘట - పటాది (పటమనగా వస్త్రము) జగత్తును పుట్టించుచున్నవనియు ఇదియే సృష్టిక్రమమనియు - ఈ ఉత్పన్నమగుచున్న ద్వ్యణుక - త్య్రణుకాది జగత్తంతయు అనిత్యము కాన కారణములగు ఆ పరమాణువులు తిరిగి ఒకదానినుండి యొకటి విభక్తములగుచు = వియుక్తములగుచు = విడిపోవుచు ఘటపటాది రూప మగు కార్యమును నశింపజేయుననియు - నాశననము నొందుచున్న సావయవములగు పృథివి మొదలగు కార్యవస్తువులన్నియు తమకు మూల కారణమగు పరమాణువుల వరకు సంయోగమునకు విరోధియగు విభాగమును పొందుననియు - ఇదియే ప్రళయక్రమమనియు - ప్రతిపాదించు చున్నారు. ఇట్లు చెప్పగా సృష్టినిగూర్చి సంయోగము ప్రయోజకమనియు - ప్రళయమునుగూర్చి విభాగము ప్రయోజకమనియును నిర్ణయింపబడినట్లగుచున్నది. అట్లుకాగా సృష్టి హేతువగు సంయోగమునకు కారణమగు (నిమిత్తకారణమగు) కర్మ నొకదానిని, అట్లే ప్రళయహేతువగు విభాగము నకు కారణమగు కర్మ నొకదానిని అంగీకరించవలసివచ్చును. లోకమున సంయోగవిభాగములు (కర్మ) లేక పుట్టుచుండుట లేదుగదా! అంత సృష్ట్యారంభ సమయమున గరినదీ సముద్రాది కార్యరంభకములగు అనంత సంఖ్యాక పరమాణువులయందు ఒక్కపర్యాయము సృష్టి ప్రయోజకమగు సంయోగమును కలిగించు (సంయోగమునకు నిమిత్తకారణమగు) కర్మ - అట్లే ప్రళయారంభ సమయమున ప్రళయ ప్రయోజకమగు విభాగమును కలిగించు (విభాగ నిమిత్తకారణమగు) కర్మయు కలదని చెప్పవలయును గదా? ఆకర్మ దృష్టమగు కర్మయా? లేక అదృష్టకర్మయా అని విచారింప ఏవిధముగను నచట కర్మను ప్రతిపాదింప శక్యము కాదు. ఆకర్మ దృష్ట కర్మయనుట పొసగదు. సృష్ట్యారంభ సమయమున నట్టి కర్మను పుట్టించు వస్తువు మరియొకటి యేదియును లేదు గనుక - అది అదృష్టకర్మయనుటయు పొసగదు. అదృష్టకర్మయనగా ధర్మదర్మరూపమగు కర్మ - అవి ఆత్మగుణములుగా నిర్ణయింపబడినవి. ఆ కర్మ పరమాణువులయందు సంయోగమును పుట్టించనేరదు. ఏలయన? కారణమొకచోట నుండ కార్యమొకచోట పుట్టుననుట యుక్తము కాదు గదా. ఆ కర్మ పరమాణువులయందే ఉండి పరమాణువులయందు సంయోగమును పుట్టించుననుటయు యుక్తముకాదు. ఏలయన? అట్లనినచో వారి శాస్త్ర ప్రక్రియా నిర్ణయమునకు భంగము వాటిల్లును. కాన కర్మ సంయోగ విభాగ కారణమనుట ఉపపన్నము కానేరదు. మరియు ధర్మాధర్మములు సుఖదుఃఖ హేతువులుగ నిర్ణయింపబడియున్నవి. అట్టి ధర్మాధర్మములు సంయోగ విభాగ ప్రయోజకములనుటయు. తద్ద్వారా అవి సృష్టి ప్రళయ ప్రయోజనములని సంగతము కాదు. ఈ యంశము సూత్రమున నిట్లు సూచింపబడుచున్నది.

ఉభయధా - అపి = సృష్టి హేతువగు సంయోగము నుత్పాదనచేయుటకు గాని - ప్రళయ హేతువగు విభాగము నుత్పాదన చేయుటకుగాని న - కర్మ = ప్రయోజకమగు (ఉపయోగపడు) కర్మ వారిశాస్త్ర ప్రక్రియ ననుసరించియు సంభవించదు - అతః = ఆకారణమువలన అట్టికర్మ లేదు గాన - తదభావః = సంయోగ విభాగములవలన నేర్పడునని ప్రతిపాదింపబడిన సృష్టి ప్రళయములు సంభవించవు. కాన నాపరమాణు కారణవాదము సమంజసము కానేరదు.

13. సూః సమవాయాభ్యుపగమాచ్చ సామ్యాదనవస్థితేః

వివృతిః :- సమవాయాభ్యుపగమాత్‌ - చ = ద్వాభ్యాం పరమాణుభ్యా ముత్పద్యతే ద్వ్యణుకం - తచ్చోత్పాదకాభ్యాం పరమాణుభ్యాం భిన్నం సత్‌ తయో స్సమవాయసంబన్ధేన తిష్ఠతీతి వదన్తో వైశేషికాన్సమవాయ మభ్యుపగతవస్తః - తస్మాదేవ హేతోః పరమాణుకారణవాదః అను పపన్నః - కుతః? సామ్యాత్‌ = యథా పరమాణ్వపేక్షయా ద్వ్యణుక మత్యన్తం భిన్నం - తథా సమవాయోపి భిన్నం - ఏవం పరమాణుభిన్నత్వ రూపస్య సామ్యస్య సత్యాత్‌ - అనవస్థితేః = ద్వ్యణుకవ త్సమవాయోపి సమవాయాంతరేణ సంబన్ధ్యతాం - స చ తదన్యేన - సోపి తదన్యే నేత్య నవస్తాపాతాత్‌ - ఏవం సమవాయాసిద్ధౌ సమవేత ద్వ్యణుకాది సృష్ట్యసిద్ధి రితి భావః -

వివరణము :- వై శేషికశాస్త్రమువారు సృష్టి ప్రక్రియను ప్రతిపాదించుచు రెండు పరమాణువులనుండి యొక ద్వ్యణుకము పుట్టుచున్నది యనియు - ఆ ద్వ్యణుకము తన కుత్పాదకములగు (కారణములగు) పరమాణుల నధిష్ఠించి యుండుననియు - కారణవస్తువునందు కార్యవస్తువుండునప్పుడు ఆరెండువస్తువులకు గల సంబంధము సమవాయ సంబంధ మనియు - చెప్పుచు సమవాయ సంబంధమను నొక సంబంధరూప పదార్థాంతరము నంగీకరించిరి. ఇట్లీ సమవాయ సంబధము నంగీకరించుటవలన గూడ నీ నైశేషికవాదము అనుపపన్నమైనది యని తెలియవచ్చుచున్నది. ఎట్లన? కారణమగు పరమాణువులకంటె తత్కార్యమగు ద్వ్యణుక మత్యంతభిన్నపదార్థము. కాన ఆ రెండు పదార్థముములకు గల అనుబంధము సమవాయ సంబంధరూపము అని వారు నిర్ణయించిరి. అట్లగుచో పరమాణువులకంటె ద్వ్యణుక మెట్లు భిన్నపదార్థమో, అట్లే సమవాయ సంబంధ మనునదియు నొక భిన్నపదార్థమే కాన ద్వ్యణుకమునకువలె సమవాయమునకు గూడ మరియొక సంబంధమును (పరమాణు ద్వ్యణుకములకు మధ్య సమవాయ సంబంధమును కల్పించినట్లు పరమాణు సమవాయ సంబంధములకు మధ్యమ గూడ నొక సంబంధమును) కల్పించవలసివచ్చును. అట్లు కల్పించిన నదియును పరమాణువులకంటె భిన్నపదార్థమే కాన నచటను మరియొక సంబంధమును దానికిని మరి యొక సంబంధమును ఇట్లు అనవస్థ యేర్పడును. ఆ కారణమువలన సమవాయమను పదార్థాంతరము నంగీకరించుట యుక్తముకాదని తేలుచున్నది. ఇట్లు సమవాయము సిద్ధింపకున్న పరమాణువులయందు తత్కార్యమగు ద్వ్యణుకము సమవాయ సంబంధముతో ననుబంధించి సమవేతమై యుండునని - ఆ ద్వ్యణుకమునందు తత్కార్యమగు త్ర్యణుకము సమవేతమై యుండునని - ఇట్లు కారణములయందు తత్తత్కార్యములు సమవేతములగుచు క్రమవృద్ధినొందుచు స్థూలమగు నీ జగత్తంతయు సృష్టమగుచున్నది యని ప్రతిపాదింపబడు వారి సృష్టిప్రక్రియ సిద్ధింప నేరదనియును స్పష్టపడుచున్నది.

14. సూ : నిత్య మేవ చ భావాత్‌

వివృతిః :- పరమాణూనాం ప్రవృత్తిస్వభావత్వే నిత్యం - ఏవ - చ - భావాత్‌ = నిత్య మేవ ప్రవృత్తే ర్భావాత్‌ - ప్రళయో న స్యాత్‌ - ఏవం నివృత్తి స్వభావత్వే నిత్య మేవ నివృత్తే ర్భావా త్సర్గో న స్యాత్‌ - తస్మా దనుపపన్నః పరమాణుకారణవాదః.

వివరణము :- మరియు - పరమాణువులు ప్రవృత్తి స్వభావముకలవియనుచో - స్వభావమునకు మార్పు ఉండదు గనుక ఎల్లప్పుడును పరమాణువులు ప్రవర్తించుచునే యుండునని చెప్పవలసివచ్చును. అట్ల గుచో ప్రళయము సంభవించకపోవును. పరమాణువులు నివృత్తిస్వభావము కలవి యనుచో ఎల్లప్పుడును పరమాణువులకు నివృత్తియుండి తీరును గనుక సృష్టి సంభవించక పోవును. కాన అట్టి పరమాణుకారణవాదము యుక్తిసంపన్నము కానేరదు.

15. సూ : రూపాదిమత్త్వా చ్చ విపర్యయో దర్శనాత్‌

వివృతిః :- చ=కించ పృథివ్యప్తేజోవాయవీయా శ్చతుర్విధాః పరమాణవో విద్యన్తే - తే చాణవః - నిత్యా, నిరవయనా శ్చేతి వైశేషికానా మభ్యుపగమ ఇతి పూర్వముక్తం - తే చ రూపరసాదిమన్త ఇతి చ తేషా మాశయంః - తతశ్చ రపాదిమత్వాత్‌ = యతః పరమాణుషు రూపరసాదయో గుణా విద్యన్తే ఘటపటాది ష్వివ. తతః విపర్యయః = అణుత్వ నిత్యత్వ, నిరవయవత్వ విపర్యయః = విపరీతతా ప్రసజ్యేత - కుతః? దర్శనాత్‌ = రూపాదిగుణవత్సు ఘటపటాదిషు అణుత్వ - నిత్యత్వ - నిరవయవత్వ విపరీతానాం స్థూలత్వ - అనిత్యత్వ - సావయవత్త్వానాం దర్శనాత్‌ -

వివరణము :- మరియు - పృథివీ - జల - తేజో - వాయు ద్రవ్యములకు సంబంధించిన నాల్గువిధములగు పరమాణువులు కలవనియు - నవి అణువులు, నిత్యములు, నిరవయవములు ననియు వైశేషికుల యాశయమని వెనుక చెప్పబడినది. మరియు నా పరమాణువులు రూపరసాదిగుణ యుక్తములనియును వారి యాశయము - ఇట్టి వీరి ఆశయము నాశ్రయించి యీ సూత్రము చెప్పబడుచున్నది. ఘట, పటాది పదార్థముల యందు న్నట్లు రూపరసాది గుణములు పరమాణువులయందును కలవు గాన వైశేషికులు అణువులకు ప్రతిపాదించిన అణుత్వము - నిత్యత్వము - నిరవయ వత్వమునను ధర్మములకు విపర్యయము = విపరీతత్వము ప్రసక్తము కాగలదు. ఎందువలన ననగా? రూపాదిగుణములతో గూడికొనయున్న ఘటపటాది పదార్థములయందు అణుత్వమునకు విరుద్ధమగు స్థూలత్వము - నిత్యత్వమునకు విరుద్ధమగుఅనిత్యత్వము - నిరవయవత్వమునకు విరుద్ధమగు సావయవత్వము అను నిట్టి ధర్మములు కానవచ్చుచున్నవి గనుక.

16. సూ : ఉభయధా చదోషాత్‌

వివృతిః :- గంధ, రస, రూప స్పర్శ. లక్షణ చతుర్గుణా పృథివీ - సా స్థూలా - రసాదిభి స్త్రి గుణా ఆపః - అత స్సూక్ష్మాః - రూప - స్వర్శోభయ గుణం తేజః - అత స్సూక్ష్మతరం - స్వర్శమాత్రగుణో వాయు స్స సూక్ష్మ తమః - ఏవ ముపచితాపచిత గుణాని పృథివ్యాదీని భూతాని స్థూల సూక్ష్మాది తారతమ్యోపేతాని లక్ష్యన్తే - తద్వ త్పరమాణవో ప్యుపచితాప చిత గుణా ఇతి కల్ప్యతే వా, నవా? ఇతి వికల్ప్య పరమాణుకారణ వాదోత్రనిరాక్రియతే - ఉభయధా - చ = పక్షద్వయేపి - ఉపచితాపచిత గుణవత్త్వకల్పనే, తదకల్పనే చ దోషాత్‌ = తథా కల్పనే కృతే పరమాణూనా మపరమాణుత్వ ప్రసంగః - ఉపచితగుణానాం పృతివ్యాదీనాం స్థూలత్వాది దర్శనాత్‌ - అకల్పనే సర్వేషాం పరమాణూనా మేకైకగుణవత్త్వ మేవేతి - తత్కార్యేషు పృథివ్యాదిషు గుణాన్తరోపలబ్ధి ర్నస్యాతి - స్యాత్‌ - తస్మా దుభ యధా చ దోషా న్న పరమాణుకారణవాదో యుక్త - ఇతి.

వివరణము:- గంధ - రస - రూప - స్వర్శములను నాల్గుగుణ ములు కలది పృథివి - అది స్థూలము - రస - రూప - స్పర్శములను మూడు గుణములతో నొప్పునవి జలములు - అవి సూక్ష్మములు - రూప - స్పర్శములను రెండు గుణములు కలిగినది తేజస్సు - ఇది సూక్ష్మతరము- స్వర్శమను ఒక్కగుణమును మాత్రము కలిగియున్నది వాయువు. ఇది సూక్ష్మతమము. ఇట్లు న్యూనాధిక గుణములు గలవిగ తెలియబడుచున్న పృథివ్యాది భూతములు - తమయందుండు గుణముల సంఖ్య ననుసరించి స్థూలమని, సూక్ష్మమని, సూక్ష్మతరమని, సూక్ష్మతమమని, తరతమ భావములుకలవిగ సర్వులచే గ్రహింపబడుచున్నవి. అట్లే తత్పరమాణువులును న్యూనాధికగుణములు గలవి యని యందురా? అట్లు కాదందురా? అని రెండుగ వికల్పించి యీ సూత్రమున వైశేషికుల పరమాణుకారణవాదము నిరాకరింపబడుచున్నది.

పార్థివాది పరమాణువులు న్యూనాధిక గుణములు కలవియని కల్పించినను - అట్లు కాదన్నను - ఆ వాదమున దోషము తప్పదు. న్యూనాధిక గుణవత్వ కల్పనపక్షములో పరమాణువులకు అణుత్వమే ఉపపన్నము కానేరదు - ఉపచిత (అధిక) గుణములగు పృథివ్యాదులకు న్యూన (తక్కువ) గుణములుగల తదితర భూతములకంటె స్థూలత్వము కాన వచ్చుచున్నది గనుక - న్యూనాధిక గుణవత్వమును కల్పించని పక్షములో పార్థివాది పరమాణువు లన్నియు ఏకైక (ఒక్కొక్క) గుణము కలవియే యగును గాన పార్థివాది పరమాణుకార్యములగు (పార్థివాది పరమాణువు లతో పుట్టుచుండు) పృథివ్యాదులయందు ఒక్కగుణము మాత్రము గోచరించవలయునే గాని మరియొక గుణము ఉపలబ్ధము కారాదు. పృథివ్యాదులయందు గుణాంతరము లుపలబ్ధము లగుచున్నవి. ప్రత్యక్షవిరుద్ధమగు కల్పనము యుక్తముకాదుగదా? ఈ యుభయ పక్షములయందును దోషము తప్పుట లేదు. కనుక నీ పరమాణుకారణవాదము యుక్తము కానేరదు.

17. సూ : అపరిగ్రహా చ్చాత్యన్త మనపేక్షా

వివృతిః :- అపరిగ్రహాత్‌ = వేదవీద్భి ర్మన్వాదిభిః కైశ్చిదపి శిష్టైః కేనచి దవ్యంశే నాపరిగృహీతత్వా దస్మి న్వైవేషికదర్శనే అత్యన్తమ్‌ = సుతరామ్‌ - అనపేక్షా = అనపేక్షైవ కర్తవ్యా ముముక్షుభి రితి -

వివరణము:- వేదతత్త్వవేత్తలును శిష్టాగ్రేసరులును నగు మన్వాది మహాత్ములలో నెవరిచేతను నే ఒక్క అంశముగూడ సమ్మతించి పరిగ్రహింపబడి యుండలేదు గాన నీ వైశేషిక దర్శనము మముక్షువులగు వారికి యేమాత్రము అపేక్షణీయము కాదు. ఈ పరమాణుకారణవాదము యుక్తిసమ్మతము ప్రమాణ సమ్మతమును కాదు. భ్రాంతిమూలకము. కాన నిట్టి పరమాణుకారణ వాదముచేత వేదాన్తసిద్ధాంతమునకు విరోధము వాటిల్లదని భావము.

సముదాయాధి కరణమ్‌ 4

18. సూ: సముదాయ ఉభయ హేతుకేపి తదప్రాప్తిః

వివృతిః :- వైశేషికానాం మతం నిరాకృ త్యేదానీం బౌద్ధం దర్శనం నిరాక్రియతే. బౌద్ధాశ్చతుర్విధాః సౌత్రాంతికా - వైభాషికా - యోగా చారా - మాధ్యమికా శ్చేతి - తత్ర సౌత్రాంతిక వైభాషికా వేపం బ్రువతః - వస్తు ద్వివిధం - బాహ్య మాభ్యన్తరం చేతి-తత్ర బాహ్యం పున ర్ద్వివిధం- భూతం భౌతికం చేతి- ఏవ మాన్తర మపి ద్వివిధం- చిత్తం - చైత్తం చేతి - తత్ర భూతం పృథివ్యప్తేజోవాయవః - భౌతికం తు రూపరసాది విషయజాతం, తద్గ్రాహక మింద్రియజాతం చ - త ఏతే భూతభౌతికాః పదార్థాః పార్థివాది చతుర్విధ ఖర - స్నేహో - ష్ణే - రణ స్వభావ - పరమాణు సంఘాత రూపా ఏవ - న చ కార్యం నామ స్వావయవపుంజా దతిరిక్తం భవతి - అవయవ సంస్థానభేదా త్తద్గతసంఖ్యాభేదా చ్చ కార్య భేదసిద్ధిః - స్వావయవభూత తన్తుపుంజవ్యతిరేకేణ పటోనామ నాస్తి - ఏవం తత్తద్వస్త్వవయవభూత పరమాణునమదాయ ఏవ భూత భౌతిక లక్షణం బాహ్యం వస్తు - నాన్యత్‌ - అతో బాహ్యవస్తునో బాహ్యసము దాయ ఇతి వ్యవహారః తథాచ పరమాణు హేతుకోయం సముదాయః - ఏవం చిత్తచైత్తాస్తు - రూప - విజ్ఞాన - వేదనా - సంజ్ఞా - సంస్కార - లక్షణ పంచస్కంధీ సముదాయరూపాః - అతశ్చిత్తచైత్తాత్మక స్యాన్తరస్య వస్తున ఆధ్యాత్మికసముదాయ ఇతి వ్యవహారః - పంచస్కంధహేతుక ఏష సముదాయః సర్వేప్యేతే క్షణికా ఇత్యాది - తయో ర్మత మిదానీం ప్రతిక్షిప్యతే - ఉభయహేతుకే - అపి = పరమాణుహేతుకే స్కంధహేతుకే చ సముదాయే = భూత - భౌతిక - చిత్త - చైత్తాత్మకే అభిప్రేయమాణ - తదప్రాప్తిః = తస్యసముదాయద్వయ స్యాప్రాప్తి రేవ స్యాత్‌ - కుతః? సముదాయినా మణ్వాదీనా మచేతనత్వాత్‌. అన్యస్యభోక్తు స్సంహంతు స్థ్సిరస్య చేతనస్య తై రసభ్యుపగమాత్‌ - పరమాణూనా మన్యనిరపేక్ష ప్రవృత్తి స్వాభావ్యాభుపగమే చ ప్రవృత్త్యనుపరమ స్స్యాత్‌ - వినా చ సంహంతారం సముదాయ ఉత్పద్యమానో క్వాపి దృష్ట శ్శ్రుతో వా - సంహంతు స్థ్సిరస్యాభావా త్సముదాయాసిద్ధౌభావా త్సముదాయాసిద్ధౌ తదాశ్రయా లోకయాత్రలుప్యేత -

వివరణము :- వైశేషికుల మతమును నిరాకరించి బౌద్ధదర్శనము నిచట నిరాకరించుచున్నారు.

బౌద్దులు నాల్గు తెగలుగ నున్నారు. సౌత్రాంతికులని, వైభాషికులని, యోగాచారులని, మాధ్యమికులు నని - అందు సౌత్రాంతిక - వైభాషికులు వారిమతమునిట్లు ప్రతిపాదించుచున్నారు.

లోకమునందలి పదార్థజాతమంతు బాహ్యమని - ఆభ్యంతరమని రెండు విధములు - అందు బాహ్యపదార్థజాతము భూతము - భౌతికము నని రెండు తెగలుగ నుండును. ఇట్లే ఆభ్యంతర పదార్థజాతమును చిత్తమని - చైత్తమని రెండు తెగలు - అందు భూతమనగా - పృథివీ - జలము - తేజస్సు - వాయువు - ననునవి - భౌతికమనగా రూప - రస - గంధాది విషయజాతమున్నూ - ఆరూపరసాదుల గ్రహించుచుండు చక్షురాదీం ద్రియ జాతమున్నూ - ఈ భూత భౌతికరూప పదార్థములన్నియు పూర్వోక్తచతుర్విధ భూతములకు సంబంధించిన పరమాణు పుంజరూపములే కాని తత్పరమాణు వ్యతిరిక్త స్వరూపములు కావు. ఇందు పార్థివపరమాణు వులు ఖర (కఠిన) స్వభావము కలవిగను - జలీయపరమాణువులు స్నేహస్వభావము కలవిగను (జిడ్డుగను - ద్రవత్వము కలవిగను) తైజస పరమాణువులు ఉష్ణస్వభావము కలవిగను - వాయవీయపరమాణువులు చలన స్వభావము కలవిగను నుండును. ఇట్టి పరమాణు పుంజస్వరూపమే కార్యవస్తువుగాని తద్వ్యతిరిక్తవస్తువు కాదు. (వైశేషికులు - అవయవ ములనుండి అవయవి అవయవములకంటె వేరైన వస్తువుగా పుట్టునని యందురు. వీరు అవయవ సముదాయముకంటె అవయవి వేరైన వస్తువు కాదందురు. అవయవములు = కారణము - అవయవి = కార్యము -) కార్యములన్నియు కారణమగు అవయవ పుంజరూపమే ఐనను అవయవముల కూర్పులలో నుండు మార్పులవలనను, అవయవముల సంఖ్యలలోని భేదములను బట్టియు కార్యములలో భేదము సిద్ధించుచుండును. వస్త్రము అనునది తదవయవములగు తంతు (దారముల) పుంజముకాక తాను వేరువస్తువై లేదుకదా? కాన నిట్లు విచారించగా ఆయా వస్తువులకు కారణమైన అవయవసముదాయమే భూత భౌతిక రూపముగ వ్యవహరింపబడుచున్న బాహ్యపదార్థజాతము కాని అంతకంటె వేరుకాదు. బాహ్యవస్తుజాతమునకుబాహ్మ సముదాయమని యీ శాస్త్రమున వ్యవహారము - ఈ బాహ్యసముదాయము పరమాణు హేతుకమని తెలియదగును. ఇట్లే ఆంతర పదార్థజాతమగు చిత్త - చైత్తములురూప స్కంధము - విజ్ఞానస్కంధము - వేదనాస్కంధము - సంజ్ఞాస్కంధము - సంస్కారస్కంధము - అను పంచస్కంధ సముదాయరూపములు - ఇట్టి యీ చిత్త - చైత్తాత్మకమగునాభ్యంతర పదార్థజాతమునకు ఆధ్యాత్మిక సముదాయమని వ్యవహారము. బాహ్యసముదాయము పరమాణుహేతక మైనట్లే ఆధ్యాత్మికసముదాయము పంచస్కంధహేతుకమని తెలియదగును. ఈ పదార్థములన్నియు క్షణికములేగాని, స్థిరములుకావు. అని యీ ప్రకారముగ తమశాస్త్ర ప్రక్రియలను వివరించుచుందురు. ఇట్టివారి మతమిపుడు ప్రతిషేధింపబడుచున్నది.

బాహ్యసముదాయము అణుహేతుకమని - ఆధ్యాత్మిక సముదాయము స్కంధహేతుకమని వారభిప్రాయపడినను ఈ సముదాయ ద్వయము వారికి ప్రాప్తించనేరదు. కారణమేమి యన? సముదాయమనగా ప్రత్యేక వస్తువులుకొన్నింటియొక్క కూటము - అందుగల సముదాయి వస్తువులు - అణ్వాదులన్నియు సచేతనములు - ఆ అచేతన వస్తువులను భిన్న భిన్న సన్నివేశములతో సమకూర్చునట్టి చేతనుడగు సంహంత = సంధానము చేయువాడు స్థిరస్వభావుడు కలడని సర్వక్షణికవాదులగు వీరిచే నంగీకరింపబడి యుండలేదు. కనుక పరమాణు లితరాపేక్షలేక తామంతతామే ఆయాపదార్థరూపముగ ప్రవర్తించు స్వభావము కలిగియుండునని చెప్పుచో నెల్లప్పుడును పదార్థముల నుత్పాదనచేయుచు పరమాణువులు ప్రవర్తించుచుండవలయునే గాని ఆ ప్రవృత్తికి ఉపరతి = విశ్రాంతిలేక పోవలసివచ్చును. మరియు లోకమున నెచటను జడ వస్తువుల సముదాయమనునది సంధాయకుడగు చేతనుని సంబంధములేక ఏర్పడుట ఎవరి చేతను చూడబడియుండలేదు, వినబడియు నుండి యుండలేదు. అవయవ ములను సంధానము చేయు స్థిరుడగువాడు క్షణికవాదుల మతములో లేడు గనుక సముదాయము సిద్ధించదు. సముదాయము సిద్ధించకున్న (అవయవ సముదాయమే యీ మతములో ఘటపటాది కార్యజాతము గనుక) సముదాయము నాశ్రయించి ప్రవృత్తమగు లోకయాత్రయంతయు లోపించి పోవును.

19. సూ : ఇతరేతరప్రత్యయత్వా దితి చేన్నోత్పత్తి

మాత్రనిమిత్తత్వాత్‌

వివృతిః :-సంహంతుస్థ్సిర స్యాభావేన సముదాయస్య - తదధీన లోకయాత్రయా శ్చ లోపఃస్యా దిత్యేత న్నోపపద్యతే - ఆవిద్యాదీనా మితరేతరకారణ త్వాంగీకారేణ సముదాయ స్యాప్యర్థా త్సిద్ధత్వా దిత్య త్రాహ - బౌద్ధనయే - అవిద్యా - సంస్కారః - విజ్ఞానం - నామ - రూపం ఇత్యాదయః పదార్థాః ప్రసిద్ధాః - తే చేతరేతరకారణీభూత ఇతి తేషా మాశయః - తత శ్చ ఇతరేతరప్రత్యయత్వాత్‌ = అవిద్యాదిహేతుకా జన్మాదయో జన్మాదిమేతుకా అవిద్యాదయ ఇత్యేవం తేషాం మిథో హేతుహేతు మద్భావాత్‌ - తేషు చ ఘటీయంత్రవ దనిశ మావర్త్యమానేషు - అర్థాక్షిప్తస్సముదాయ ఉత్పద్యతే - ఇతి - చేత్‌ = ఇతి బౌద్ధా యది బ్రూయుః - న = త న్నోపపద్యతే - (సముదాయోత్పత్తి ర్న భ##వే దేవ) కుతః? ఉత్పత్తిమాత్ర నిమిత్తత్వాత్‌ = తేషా మవిద్యాదీనా ముత్తరోత్తరోత్పత్తి మాత్రే ఏవ నిమిత్తత్వాభ్యుపగమాత్‌ సముదాయో నోత్పద్యత ఏవ - ఉత్పాదక నిమిత్తాభావా త్తస్య.

వివరణము :- అవయవములను ఆయాకార్యాకారముగ సంధానము చేయు స్థిరుడగు చేతనుడు క్షణికవాది మతములో లేడుగనుక - కార్యరూప సముదాయమును, సముదాయరూపమగు నాయాకార్య వస్తువుల నాశ్రయించి ప్రవర్తించుచుండు లోకయాత్రయును లోపించునని యనుట యుక్తముకాదు; అవిద్యాదులు ఇతరేతర కారణములై పట్టుచుండునని యీ శాస్త్రములో నంగీకరింపబడియున్నది గనుక ఆయా పదార్థములు పుట్టుచుండు ననుటలో అర్థాత్‌ కార్యరూపమగు సముదాయమును సిద్ధించును గాన అని చేయు బౌద్ధులవాద మిచట ఖండింపబడుచున్నది.

బౌద్ధశాస్త్రములో - అవిద్య - సంస్కారము - విజ్ఞానము - నామము - రూపము మొదలగు పదార్థములు కలవనియు - అవి పరస్పర కార్యకారణ రూపములుగా నుండుననియు - అనగా నొకదాని నొకటి కార్యము - కారణముగూడ నగుచు నుండుననియు - వర్ణింపబడియున్నది. ఇట్లు నిర్ణయింపబడగా - అవిద్యాదులు జన్మాదులకును - జన్మాదులు అవిద్యాదులకును హేతువులని యేర్పడును - అంత పరస్పరహేతు హేతుమద్భావము సిద్ధింప నా అవిద్యాది పదార్థములు ఘటీయంత్రమువలె (గడియారములోని ముల్లువలె) నిరంతరము కార్యకారణ భావముతో ఆ వృత్తము లగుచుండుటచేత సముదాయము అర్థాత్‌ సిద్ధము కాగలదు. అని బౌద్ధులు చెప్పుదురు. ఆ వాదము యుక్తముకాదు. అనగా సముదాయము సిద్ధించదని (ఉత్పన్నము కానేరదని) యర్థము - ఏలయన? వారు అవిద్యాదులు ఉత్తరోత్తర పదార్థముల ఉత్పత్తినిగూర్చి మాత్రమే కారణమని యంగీకరించిరి గనుక - అట్టి ఆ అవిద్యాదులనుండి సముదాయము ఉత్పన్నమగుననుట యుక్తముకాదు. ఏలయన? సముదాయము నుత్పాదనచేయు నిమిత్తము (కారణము) ఏదియులేదు గనుక - సముదాయము సిద్ధింపకున్న తదాశ్రితమగు లోకయాత్రయు లోపించునని యాశయము.

20. సూ: ఉత్తరోత్పాదే చ పూర్వనిరోధాత్‌

వివృతిః :- అవిద్యాదీనా ముత్తరోత్తరోత్పత్తినిమిత్తత్వం పూర్వ మంగీకృతం - ''సర్వం వస్తు క్షణికం'' ఇతి వాదిభి సై#్త రవిద్యాదీనాం క్షణిక త్వాభ్యుపగమా త్తదపి నోపపద్యత ఇతీదానీం ప్రతిపాద్యతే - ఉత్తరోత్పాదే = అవిద్యా - సంస్కార - విజ్ఞాన - నామ - రూపాదిషు సంస్కారా ద్యుత్పత్తిదశాయాం పూర్వనిరోధాత్‌ = పూర్వస్య తత్కారణ స్యావిద్యాదేః నిరోధాత్‌ = వినాశ స్యాంగీకృతత్వాత్‌ - నహి వినిష్టం - అవిద్యమానం వస్తు అన్యస్య యస్య కస్యాపి కారణభావ ముపగచ్ఛతి - అతః కారణాధీనః కార్యోత్పాదోస్మిన్‌ మతే న సంభవతి.

వివరణము :- అవిద్యా సంస్కారాదులు తాము ఉత్తరోత్తర పదార్థములయొక్క ఉత్పత్తికి కారణములని బౌద్ధులు చెప్పిన యంశము పూర్వ సూత్రములో నంగీకరింపబడినది. ''సర్వం క్షణికం'' సర్వవస్తువులును క్షణికములే = ద్వితీయక్షణములో నశించిపోవునవియే అని చెప్పు ఆ బౌద్ధులచే అవిద్యాదులుకూడ క్షణికములే అని నిర్ణయింపబడినది. ఈ నిర్ణయమునుబట్టి యాలోచింప వెనుక చెప్పినట్లు అవిద్యాదులకు ఉత్తరోత్తర కారణత్వమును ఉపపన్నము కానేరదని యీ సూత్రములో ప్రతి పాదింపబడుచున్నది.

అవిద్య - సంస్కారము - విజ్ఞానము - నామము - రూపము - ఈ మొదలగు పదార్థములలో అవిద్యవలన సంస్కారము, సంస్కారము వలన విజ్ఞానము, విజ్ఞానమువలన నామము, నిట్లు పూర్వ పూర్వ పదార్థమువలన నుత్తరోత్తర పదార్థము పుట్టవలసివచ్చినప్పుడు = సంస్కారముయొక్క ఉత్పత్తిదశయందు తత్కారణమగు అవిద్యయును - విజ్ఞానముయొక్క ఉత్పత్తిదశయందు తత్కారణమగు సంస్కారమును - నిట్లు పూర్వ పూర్వ పదార్థములు నశించిపోయెనని వారి నిర్ణయము ప్రకారము చెప్పవలయును. నశించిపోయిన = వినష్టమైన = లేనిదయగు వస్తువ ద్వితీయ క్షణములో మరియొకవస్తువున కెట్లు కారణము కాగలదు? ఎన్నడును అట్లు కానేరదు. కాన నొకకారణ వస్తువువలన కార్యము పుట్టుట (కారణాధీనకార్యోత్పత్తి) యనునది యీమతమున సంభవించదు.

21. సూ : అసతి ప్రతిజ్ఞోపరోధో ¸°గపద్‌ మన్యధా

వివృతిః :- అసతి=అసత్యపి కారణ అవయవసముదాయాఖ్య (పుంజాఖ్య) స్య కార్య స్యోత్పత్తి ర్భవతీతి యద్యుచ్యేత - తర్హి - ప్రతిజ్ఞోవరోధః = చక్షుః - ఆలోకః - విషయః ఇత్యాదిషు హేతుషు సత్స్వేవ కార్యం నీలాదిజ్ఞానం జాయతే - ఇతి యాప్రతిజ్ఞాతైస్తచ్ఛాస్త్రే పూర్వం కృతా తస్యా ఉప రోధః =హానిస్స్యాత్‌ అన్యధా = సత్యేవ కారణ కార్య ముత్పద్యతే ఇత్యంగీకృత్య - వినష్ట స్యానతః కారణస్య కార్యోత్పాదకత్వ మనుపపన్న మితి కార్యోత్పత్తి పర్యన్తం హేతోస్థ్సిత్యంగీకారే - ¸°గ పద్యమ్‌ = హేతు ఫలయోః (కార్యకారణయోః) ఏకస్మిన్‌ కాలే స్థితి స్య్యాత్‌ - పూర్వక్షణవృత్తినః హేతోః కార్యోత్పత్తిక్షణపి వృత్తి రంగీకృతా స్యాత్‌ - ఏవం హేతోః క్షణద్వయవృత్తిత్వే సర్వం క్షణిక మితి యా ప్రతిజ్ఞా తైః కృతా తస్యా ఉపరోధః = హానిః స్యాత్‌ -

వివరణము :- ఒకవేళ కారణము లేకున్నను అవయవ పుంజ (అవయవ సముదాయము) రూపమగు కార్యము పట్టునని వారు చెప్పినను అదియును యుక్తము కాబోదు. ఏలయన? అట్లు చెప్పిన - బౌద్ధులు వారి శాస్త్రములో ఇది నల్లనిది, ఇది యెర్రనిది యని యిట్టి నీల రక్తాది జ్ఞాన రూపమగుకార్యములు పుట్టుటకు నేత్రము - వెలుగు - వస్తువు మొదలగు నవి హేతువులనియు, ఆ హేతువు లున్నప్పుడే ఆ కార్యము పుట్టుననియు పూర్వమే ప్రతిజ్ఞను చేసియుండిరో ఆ ప్రతిజ్ఞకు భంగము వాటల్లును. అట్లుగాక - కారణమున్నప్పుడే కార్యము పుట్టునని యంగీకరించి - నశించిపోయి, లేనిదియైన పూర్వక్షణమునందలి పదార్థమునకు మరియొక పదార్థమును గూర్చి కారణమగుట అత్యంత మనుపపన్నముగనుక కార్యము పుట్టువరకు తత్కారణమగు పూర్వక్షణమునందలి పదార్థముండునని హేతువునకు స్థితి నంగీకరించినచో నప్పుడు హేతుఫలమునకు (కార్య కారణములకు) ఏకకాలములో (ఒకక్షణములో) స్థితి (ఉనికి) యేర్పడగలదు. అనగా పూర్వక్షణములో నుండెడి హేతువునకు (కారణమునకు) కార్యోత్పత్థి క్షణమునందుగూడ వృత్తి = స్థితి = ¸°గపద్యము అంగీకరింపబడినది యగును. అట్లంగీకరించుచో హేతువు రెండు క్షణముల లోను గూడ నున్నది యగును. అట్లగుచో ''సర్వం క్షణికం'' అను వారి ప్రతిజ్ఞకు భంగము వాటిల్లును.

22. సూ : ప్రతిసంఖ్యా ప్రతిసంఖ్యా నిరోధాప్రాప్తి రవిచ్ఛేదాత్‌

వివృతిః - ఏతావతా బౌద్ధే శాస్త్రే పరికల్పితో య ఉభయహేతుక స్సముదాయ ఇతి పక్షః సచ - తదుక్తకార్యకారణభావప్రకారః - సర్వక్షణి కత్వవాద శ్చ నిరాకృతః - ఇదానీం తదభిమతం ద్వివిధం వినాశం దూష యతి - ప్రతిసంఖ్యా ప్రతిసంఖ్యా నిరోధాప్రాప్తిః = ప్రతిసంఖ్యా - అప్రతి సంఖ్యా చ - ప్రతిసంఖ్యా ప్రతిసంఖ్యే. తయో ర్నిరోధౌ = ప్రతిసంఖ్యా ప్రతిసంఖ్యానిరోధౌ - తయోరప్రాప్తిః- ప్రతిసంఖ్యాప్రతిసంఖ్యానిరోధాప్రాప్తి రితిసమాసః- బౌద్ధాః- ప్రతిసంఖ్యానిరోధ ఇతి - అప్రతిసంఖ్యానిరోధ ఇతి ద్వైవిధ్యం వినాశస్య కల్పయన్తి - తయో రుభయో శ్చాభావమాత్రత్వం తైరభిహితం - తత్ర ప్రతిసంఖ్యానిరోధో నామ ''ఏవం వినాశయా మీద మితి బుద్ధిపూర్వకం ముసలపాతాదినా సంపాద్యమానః సర్వలోకప్రసిద్ధః స్థూలో వినాశః - అప్రతిసంఖ్యానిరోధో నామ ప్రతిక్షణం సర్వం వస్తు వినశ్యతి, నవం చోత్పద్యతే - ఇతి వైనాశికై రభ్యుపగతత్వాత్‌ - ప్రతి క్షణం ఘటాదీనాం భావానాం యుక్త్యా సాధ్యమానః అకుశ##లై రవగన్తు మశక్యః - తదీయ యుక్త్యభిజ్ఞైరేవావగన్తుం శక్య స్సూక్ష్మో వినాశః తయో రప్రాప్తి రసంభవ ఏవ వైనాశికసమయే వక్తవ్యః కుతః? అవిచ్ఛేధాత్‌ = సంతాని సంతాన విచ్ఛేద స్యాసంభవాత్‌ - ఆత్ర శాస్త్రే సంతనో నామ హేతుఫలభావేన (కార్యకారణభావేన) భావానాం ప్రవాహః- సంతానినో నామ భావాః = ఘటపటాదయః పదార్థాః తేషాం క్షణికత్వేన బుద్ధిపూర్వకవినాశస్య న తత్రావకాశః - అబుద్ధిపూర్వకోపి నాశ స్తత్ర నోపపద్యతే - కుత ఇత్యుక్తౌ ? తన్మతానుసారేణ ప్రతిక్షణం వినశ్యతాం ఘటాదీనాం భావానాం సమూలనాశం = ఘటాదీనాం తన్మూలకారణీభూత మృదాదినాశపర్యన్తం నాశో వక్తవ్యః - తథా నాశే పున రన్యస్య భావస్య ఘటాదే రుద్భవే - క్షణాంతరవృత్తి తద్ఘటాదౌ స ఏవా యంఘట ఇత్యాద్య బాధిత లోకప్రసిద్ధ ప్రత్యభిజ్ఞా నోపపద్యేత - తన్మూలమృదాదే ర్వినష్టత్వాత్‌ - సర్వత్ర ఘాటాదిభావేషు తత్తన్మూలకారణ మృదాదీనా మన్వయో దృశ్యత ఏవ - అతః అబుద్ధిపూర్వకోపి వినాశ స్తత్ర నోపపద్యతే - కించ ఘటకపాలచూర్ణా ద్యవస్థాసు సేయం మృదితి ప్రత్యభిజ్ఞాయా స్సత్వాత్‌, మృదాదే ర్నాత్యంతిక వినాశఇత్యపి జ్ఞేయమ్‌. తథాసతి మృదాదేః బహుక్షణ స్థాయిత్వ స్యావశ్య మభ్యువగస్తవ్యతయా సర్వం క్షనిక మితి వాదో భగ్న స్స్యాత్‌ - తన్మతే - సంతాని వ్యతిరిక్తస్య సంతానా స్యాభావేన అన్త్యసంతాని నాశ ఏవ సంతాన నాశద ఇతి వక్తవ్యం - ఏవంచ సతి - అన్తస్య సంతానినో భావాంతరాజనకతయా అసత్వం స్యాత్‌ - తన్మతే అర్థక్రియాకారిణః = భావ జనకసై#్య వభావస్య సత్వేనాభ్యుపగమాత్‌ - తథాచ అన్త్యస్య సంతానస్య అసత్త్వే తజ్జనకస్య ఉపాన్త్య స్యాపి సంతానినః అత్యన్తాసత్వం. ఏవం తత్త్పూర్వస్య తత్పూర్వస్యాపీతి సంతాన స్యాసత్వా న్న తస్య నాశః - నిరుపాఖ్యస్య నాశాసంభవాత్‌ - అత స్సంతానస్యాపి వినాశో నోపవద్యతే - అంత్యస్య సంతానినః భావాంతరాజనకత్వేపి - సత్వాభ్యుపగమే సంతానస్య విచ్ఛేద ఏవ నాస్తీతి న తత్ర = సంతానే వినాశో నోపపద్యతే - తస్మా ద్ద్వి విధస్యాపి నిరోధస్య తదభ్యుపగతస్య అసంభవా న్నాదర్తవ్యోయం యం వైనాశిక సమయ ఇతి.

వివరణము :- ఈ వెనుకటి నాలుగు సూత్రములలో - బౌద్ధులు తమ శాస్త్రములో కల్పించిన ''పరమాణుహేతుకము భూత, భౌతిక సముదాయము. స్కంధ హేతుకము చిత్త. చైత్తాత్మక సముదాయము'' అను పక్షమును, వారు చెప్పిన కార్యకారణభావ స్వరూపమును, సర్వపదార్థమును క్షణికమే అనువాదమును, నిరాకరింపబడినవి. ఇక నీ సూత్రములో వారి శాస్త్రమునందు ప్రతిపాదింపబడియున్న పదార్థముయొక్క వినాశము రెండు విధములను పక్షముగూడ దోషయుక్తమే అని నిరూపింపబడు చున్నది.

బౌద్ధులు ప్రతిసంఖ్యా నిరోధమని, అప్రతిసంఖ్యా నిరోధమని నిరోధము రెండువిధములనిరి. నిరోధము అనగా వినాశము. ఈద్వివిధ నిరోధములును అభావమాత్రములే అనియును వారు చెప్పిరి. అందు ప్రతి సంఖ్యా నిరోధమనగా ''ఇట్లు దీనిని నశింపచేయుదు నను బుద్ధితో = సంకల్పముతో దండప్రహారము వగైరాలు చేసి సంపాదింపబడు ఘటాదిపదార్థములయొక్క లోకప్రసిద్ధమైన వినాశము. దీనిని స్థూలవినాశమనియు వారందురు. అప్రతిసంఖ్యా నిరోధమనగా ప్రతివస్తువును, ప్రతిక్షణము నశించుచున్నదని బౌద్ధులచే నంగీకరింపబడియున్నది గనుక వారి నిర్ణయము ప్రకారము ఘటాదివస్తువులకు ఏర్పడుచున్న - శాస్త్రయుక్తి ప్రసిద్ధ మైన - సామాన్యప్రజల కగ్రాహ్కమైన వినాశము. బౌద్ధశాస్త్ర యుక్తి విజ్ఞానము కలవారిచేతనే గ్రహింప శక్యమైనది యగుటచే దీనిని వారు సూక్ష్మవినాశమని యందురు. ఇట్లు రెండువిధములైన వినాశములు (నిరోధములు) కలవని వైనాశికలు (బౌద్ధులు) కల్పించిరేగాని బాగుగా విచారించిన నివి సంభవించునవి కావని తేలగలదు - ఏలయని - సంతాని సంతాన విచ్ఛేదము సంభవించదు గనుక. [ఈ శాస్త్రములో భావా? అనగా ఘటపటాది పదార్థములని యర్థము - వీనికి సంతానినః అనికూడ పేరు. వీనిని సత్‌ అను పదముతో, సత్యం అను పదముతో కూడా వ్యవహరింతురు. సమస్త పదార్థములును క్షణమాత్ర కాలస్థాయులు గనుక క్షణములనిగూడ చెప్పబడును. ప్రతిభావమును భావాంతర జనకము (మరియొక భావమును పుట్టించు స్వభావముకలదియే) కనుకనే భావమునకు సత్వమని వ్వవహారమనియు వారందరు. సంతానమనగా హేతుఫల = కార్యకారణ = జన్య జనక - భావముతో గూడిన భావముల ప్రవాహము ఈని యర్థము.] భావములన్నియు క్షణికమలు = ప్రతిక్షణమును నశించు స్వభావము కలవియే అని వారి నిర్ణయము గనుక అచట బుద్ధిపూర్వక వినాశమున (ప్రతిసంఖ్యా నిరోధమున) కవకాశము లేదు. అబుద్ధిపూర్వక వినాశకము (అప్రతిసంఖ్యానిరోధము) కలదనుటయు అనుపపన్నమే. ఏలయన? వారి మతసిద్ధాంతము ననుసరించి ప్రతిక్షణము నశించుచుండు స్వభావము గల ఘటాదిపదార్థములకు సమూలనాశము అనగా తన్మూల కారణమగు మృత్తు = మట్టి మొదలగు వాని యొక్క నాశమువరకు నాశము నంగీకరింప వలయును. అట్లు నశించగా మరుక్షణమున తిరిగి మరియొక ఘటాది భావము పుట్టినదని యనవలయును. పూర్వక్షణమునందలి ఘటముకంటె మరుక్షణమున పుట్టిన ఘటము వేరైనదియే యగునో ఆఘటమే యిది (ఆవస్తువేయిది) యను సర్వలోక ప్రసిద్ధమైన వస్త్వేకత్వ (పూర్వోత్తర కాలద్వయమునందున్న వస్తువు ఒక్కటియేగాని భిన్నముకాదని సూచించు) సూచకమగు అనుభవము అనుపపన్నము కావలసివచ్చును. ఆ ఘటాది వస్తు మూలకారణముగు మృదాదులు వినష్టము లయినవి గనుక. పరి శీలించిచూడ ఘటపటాది రూపభావములలో తన్మూలకారణములగు మృత్తు యొక్క తంతువుల దారము) యొక్క అనుబంధము స్పష్టముగ కానవచ్చునే యున్నది.కాన అ బుద్ధి పూర్వకవినాశము కలదనుటయును అనుపప్నమే యగును. మరియు ఘటపూర్వావస్థయగు కపాలావస్థయం దును, తత్పూర్వావస్థయగు చూర్ణావస్థయందును. తత్పూర్వావస్థయగు మృదవస్థయందును - బహుక్షణములు ఆయా వస్తువులు కానవచ్చుచున్నప్పుడు ఆకపాలమే యిది, ఆ చూర్ణమే యిది, ఆ మృద్వస్తువే యిది. యని యిట్లు ప్రత్యభిజ్ఞ (వస్త్వేకత్వ సూచకమగు ప్రత్యక్షజ్ఞానము) సర్వజన సాధారణముగ కలుగుచునే యున్నదిగనుక మృదాది భావములకు సంపూర్ణ వినాశము నిరోధము కలిగినది యనుటయు యుక్తము కానేరదు. అట్లు కాగా మృదాదిపదార్థములు అనేక క్షణములయందును నుండునవియే యని అవశ్యమంగీకరించవలసి వచ్చుచున్నది గనుక ''సర్వం క్షణికం'' అను వారి సిద్ధాంతము భగ్నము కాగలదు.

మరియు వారిమతములో సంతాని (భావ) వ్యతిరిక్తమైన సంతానములేదు గనుక అన్త్యసంతానినాశ##మే సంతానము (భావములు కార్యకారణ భావముతో ప్రవహించుచుండుట) యొక్క నాశమని చెప్పవలయును. ఇట్లు చెప్పినచో అన్త్యసంతాని (చివరిభావము = ఏ క్షణము తరువాత భావమునకు సంపూర్ణవినాశము సంభవించునో ఆ క్షణములో నుండు భావము = పదార్థము) భావాంతరమును పుట్టించదు గనుక అసత్తు అని చెప్పినట్లగును. కారణమేమియన? వారిమతములో భావాంతరమును పుట్టించుచుండు భావమునకే వారు సత్వము నంగీకరించిరి. అన్త్యసం తాని = అన్త్య భావము భావాంతరాజనకము కనుక దానికి అసత్వమేర్పడగా అట్టి = అసత్తైన అన్త్యసంతానికి పూర్వక్షణమందున్న ఉపాన్త్య సంతానియు అత్యంతాసత్తు కావలసివచ్చును. భావాంతర జనకముకాలేదు గనుక. ఇట్లే తత్పూర్వసంతానియు భావాంతర జనకముకాదు గనుకనే అసత్తే యగును. ఇట్లు పూర పూర్వ సంతాని పదార్థములకు అసత్వము సిద్ధించగా తత్సంతానమునకును అసత్వము సిద్ధించును గాన దానికి నాశము= నిరోధము కలదని చెప్పుటయు అసంగతమే యగును - నిరుపాఖ్యమైన =స్వరూప శూన్యమైన= వంధ్యాపుత్రాదులవతె అత్యన్తా సత్తైన పదార్థమునకు వినాశమనునది సంభవించదు గదా ! కాన సంతానమునకును నిరోధము= వినాశము సంభవించదు.

అస్త్యసంతాని భావాంతరము నుత్పాదనచేయకున్ననూ సత్వము నంగీకరించుచో సంతానమునకు విచ్ఛేదమే సంభవించదు గనుక ఆ పక్షము లోను సంతానములో (కార్యకారణ భావాపన్న భావపదార్ధ ప్రవాహములో) వినాశము ఉపపన్నము కానేరదు. కాన వైనాశికమతసిద్ధమగు ద్వివిధ నిరోధమును= నాశమును సంభవించునది కాదు గనుక వైనాశికపక్ష మేమాత్రమును ఆదరింపదగినది కాదని తెలియదగును.

23. ఉభయధా చ దోషాత్‌

వివృతిః :- ఉభయధా -చ - దోషాత్‌= యోయ మవిద్యాదినిరోధః ప్రాగుక్త ప్రతిసంఖ్యనిరోధాంతర్భూతః బౌద్ధైన పరికల్పితః - స యది సమ్యగ్‌ జ్ఞానేన యమనియమాదిసహితేన భ##వేత్‌ - తర్హి బౌద్ధై స్తచ్ఛాస్త్రే కృత స్సర్వభావానాం నిర్హేతుకవినాశాభ్యుపగమో హీయెత - యది స్వయమేవ స్యాత్‌ తర్హి '' సర్వం క్షణిక మితి భావయేత్‌ '' ఇత్యాచార్యకృత ఉపదేశో వ్యర్థః స్యాత్‌ - ఇత్యుభయధా దోషసద్భావా ద్వైనాశికమత మసమంజసమ్‌ -

వివరణము :- క్షణికమగు (దృశ్య) పదార్థములయందు స్థిరత్వజ్ఞానము అవిద్యయనబడును. యమనియమాది పరికరములతో గూడిన సమ్యగ్‌ జ్ఞానమువలన అవిద్యానిరోధ మేర్పడునని బౌద్ధమతము. ఈ యవిద్యానిరోధమనునది పూర్వోక్త ప్రతిసంఖ్యా నిరోధాంతర్భూత మని బౌద్ధులు కల్పించిరి - సపరికరమగు సమ్యగ్‌ జ్ఞానముచేత అవిద్యా నిరోధమని చెప్పిన, సర్వభావములకు, ప్రతిక్షణము నిర్హేతుకముగనే నిరోధము= వినాశ##మేర్పడు చుండు నను వారి సిద్ధాంతము భగ్నము కాగలదు. అట్లుగాక స్వయముగనే కారణాపేక్షలేకయే అవిద్యా నిరోధమేర్పడు నన్నచో ''సర్వం క్షణికం'' అని భావన చేయవలయునని బౌద్ధాచార్యులు చేసిని మార్గోపదేశము వ్యర్థమగును. ఇట్లు అవిద్యా నిరోధము నిర్హేతుక మన్నను, సహేతుక మన్నను. రెండు పక్షములయందును దోషము కలదు. గనుక వైనాశికమత మసమంజసమని ధ్రువపడుచున్నది.

24. సూ : ఆకాశే చావిశేషాత్‌

వివృతిః :- ఆకాశ మపి నిరోధద్వయవ దభావమాత్ర మేవేతి తేషా మతం - ఆకాశే - చ =ఆకాశేపి అభావమాత్రత్వోక్తి రయుక్తైవ కుతః ? అవిశేషాత్‌= ఆకాశేపి భూతలాది ష్వివ వస్తుత్వబుద్ధే రవిశిష్టత్వాత్‌ - అత్ర ఘట ఇత్యాదౌ యథా భూతలస్య ఘటాధారత్వం ప్రతీయతే తథాత్ర శ్యేనః పత తీత్యాదా వాకాశ స్యాపి వస్తుత్వావగమా దభావత్వ మాకాశ##స్యేతి వచనం నోపపన్నం స్యాత్‌ - అభావ స్యాధారత్వాసం భవా దిత్యర్థః - ''తస్మాద్వా ఏతస్మా దాత్మన ఆకాశ స్సంభూతః'' ఇతి శ్రుత్యాకాశ స్యోత్పత్తిశ్రవణాత్‌ - శబ్దరూపగుణవత్త్వ ప్రసిద్ధేశ్చ పృథి వ్యాదివత్‌ వస్తుత్వప్రతీతే రవిశేషాచ్చాకాశ స్యభావత్వోక్తి రయుక్తైవ.

వివరణము :- ఆకాశమును నిరోధద్వయమువలె అభావమాత్రమే అసత్తే అని వారి మతము. అట్లనుట యుక్తము కానేరదు. ఏలయన ? భూమి మొదలగు పదార్థములయందును వలెనే ఆకాశమునందును ఇది వస్తువు అను అనుభూతి సర్వులకు కలుగుచునే యున్నది గనుక. ఇచట ఘటము కలదను అనుభవము = జ్ఞానము కలిగినప్పుడు భూమి ఘటమునకు ఆధారము అని యెట్లు తెలియబడుచున్నదో అట్లే ఇచట శ్యేనము= డేగ ఎగురుచున్నది యని కలుగుచున్న అనుభవములో ఆకాశమునకును ఆధారత్వము గుర్తింపబడుచున్నది గనుక భూమివలె ఆకాశముగూడ సద్వస్తువే అని చెప్పవవలయును గాని అభావరూపమనియునట యుక్తముకాదు. అ భావము దేనికిని ఆధారము కాజాలదు గాదా ! మరియు ''తస్మాద్వా .... స్సంభూతః'' ఆ బ్రహ్మాభిన్నమగు ఆత్మవస్తువునుండి ఆకాశము పుట్టెనని చెప్పు శుత్రి ఆకాశమునకు ఉత్పత్తిని బోధించుచున్నది గనుకనున్నూ - ఆకాశము శబ్దరూపగుణము కలదియని శాస్త్ర - లోకప్రసిద్ధి కలదు గనుక నున్నూ. పృథిని మొదలగు పదార్థములకు వలె ఆకాశమునకును వస్తువుత్వానుభవము ( ఇది భావపదార్థమను లోకానుభవము) కలదు గనుకనున్నూ ఆకాశము అ భావరూపమని యనుట అత్యంతా నుపపన్నము.

25. సూ : అనుస్మృతే శ్చ

వివృతిః :- ఇదాని మాత్మనః క్షణికత్వం నిరస్యతే - అనుస్మతేః - చ= అనుభవ మనూత్పద్యమానా స్మృతి రనుస్మృతిః- తద్బలాత్‌ - అహమద్రాక్ష మితి ప్రాగనుభూత సై#్యవ విషయస్య కాలాన్తరే స్మర్యమాణత్వాత్‌ - ప్రాక్కాలిక విషయానుభవయుక్తస్య స్ముర్తు రాత్మన స్మరణకాల పర్యన్తతం స్థాయిత్వావశ్యం భావా త్తస్య క్షణిక త్వోక్తి రసంగతైవ -

వివరణము :- ఆత్మయు క్షణికమే అని వారిమతము- ఈ సూత్రమున నా యంశము నిరసింపబడుచున్నది.

అనుస్మృతి యనగా ఆయా పదార్థముల అనుభవము కలిగిన తరువాత కలుగుచున్న ఆ పదార్థములకు సంబంధించిన జ్ఞానము - అట్టి అనుస్మృతి బలమున అనగా నేనా పదార్థమును చూచితిని అని పూర్వము తెలిసికొనియున్న వస్తువునుగూర్చి కాలాంతరమున స్మృతి= స్మరణముకలుగుచున్నది గనుక - పూర్వకాలమున ఆ వస్తువును తెలిసికొని ఆయను భవముతో కూడుకొని తిరిగి యీ కాలమున (మరియొక కాలమున) ఆ వస్తువును స్మరించుచున్న ఆత్మ పూర్వోత్తరకాలములలో అనగా పదారానుభవకాలములోను - తిరిగి ఆ పదార్థమును స్మరించుకాలములోను కలడని ఆత్మకు పూర్వోత్తరకాల స్థాయిత్వమవశ్య మంగీకరించవలసియున్నది గనుక ఆత్మయు క్షణికమే అని యనుట అత్యంతాసంగతము.

26. సూ : నాసతోదృష్టత్వాత్‌

వివృతిః :- ''నానుపమృద్య ప్రాదుర్భావాత్‌'' ఇత్యుదాహరన్తః వినష్టాది బీజా దంకుర ఉత్పద్యతే - నానష్టాత్‌ - ఏవం నష్టా తీక్షరా ద్దధి ఇత్యాది వదన్తోవైనాశికాఅభావా ద్భావోత్పత్తి రితిమన్యన్తే. తత్రేదముచ్యతే - అసతః= అభావాత్‌ - న= భావోత్పత్తి ర్న సంభవతి - కుతః ? అదృష్టత్వాత్‌= అభావరూపతయాభిమతాత్‌ శశవిషాణదే రంకురాద్యుత్పత్తే రదర్శనాత్‌ -

వివరణము :- ''నానుపమృద్య ప్రాదుర్భావాత్‌'' హేతువు వినష్టముకాక కార్యము పుట్టదు అను నొకన్యాయము నుదాహరించుచు బీజము నశించగా అంకురము పుట్టుచున్నదిగాని బీజము నశించకున్న పుట్టుట లేదు; ఇట్లే క్షీరము నశించగా దధి =పెరుగు పుట్టుచున్నది యని దృష్టాంతముల చెప్పుచు వైనాశికులు అభావమునుండి భావముయొక్క ఉత్పత్తి జరుగుచున్నదని తలంచుచున్నారు - ఆ యంశములో చెప్పబడుచున్నది.

అవభామునుండి భావ ముత్పన్నము కానేరదు. ఏలయన ? అభావరూపములైన శశవిషాణము= కుందేటి కొమ్ము మొదలగు వానినుండి అంకురాది భావపదార్థములయొక్క ఉత్పత్తి ఎచటను లోకమున కాన వచ్చుటలేదు గనుక.

27. సూ : ఉదాసీనా మపి చైవం సిద్ధిః

వివృతిః :- ఏవం= యద్యభావా ద్భావోత్పత్తి రంగీక్రియేత - తర్హి ఉదాసీనానాం - అపి =ప్రయత్నశూన్యానా మపి జనానాం సిద్ధిః= అభిమతార్థసిద్ధిః లభేతైవ - ఉద్యోగాభావస్య సులభత్వాత్‌ - వినాపి కృష్యుద్యోగం సస్యాది సమీహితసిద్ధి స్స్యాత్‌ - స్వర్గాపవర్గాద్యర్థం న కశ్చిత్కథంచిత్‌ సమీహేత - తస్మా దసంగత మిదం సౌత్రాంతిక వైభాషికయో ర్దర్శనమ్‌ -

వివరణము :- అభావమునుండియు భావపదార్థములయొక్క ఉత్పత్తి యంగీకరింప బడినచో ఉదాసీనులకు (ప్రయత్నమేమియును చేయకనున్న వారికి) కూడ అభిలషిత సర్వార్థసిద్ది కలుగవలయసియుండును. ఉద్యోగము= ప్రయత్నము చేయక ఊరక నుండుట మిక్కిలి సులభము. అట్టివారికిని ధనధాన్య సంపత్తులు కోరబడిన వన్నియు సిద్ధించవలసియుండును. స్వర్గమోక్షములకై ఎవ్వరును ఎన్నడును ప్రయత్నించ నవసరముండదు. ఇట్టి ఆక్షేపముల కాలావాలము గనుక నీ సౌత్రాంతిక, వైభాసికుల దర్శనమత్యంతా సంగతము.

అభావాధి కరణమ్‌ 5

28. సూ : నాభావ ఉపలబ్ధేః

వివృతిః :- బాహ్యార్థాపలాపినో యోగాచారాః పునరేవం బ్రువతే బాహ్యా అర్థా ఘటపటాదయో న సన్త్యేవ - విజ్ఞానస్కంధః ఆధ్యాత్మిక సముదాయాన్తర్గతత్వేన పూర్వ ముక్తః, ఆన్తర ఏక ఏవాస్తి - సోపి క్షణికః - విజ్ఞానాకారా ఏవ నీలాదయో గుణా వా - ఘటపటాదయో వా పదార్థాః యథా స్వప్నే వినైవ బాహ్యం వస్తు విజ్ఞానాకారా ఏవ భవన్తి సర్వే గ్రహ్యగ్రహక భావే నా వస్థతాః పదార్థా స్తద్వదితి - తన్మత మిదానీం నిరస్యతే - అభావః= బాహ్యానా మర్థానా మభావ ఇతి (బాహ్యార్థా న నన్తీతి) వ= నిశ్చేతుం న శక్యమ్‌. ఉపలభ్దేః= అయం ఘటః, అయం ఘటః ఇత్యాది ప్రత్యక్షేణ ఘటపటాదీనాం బాహ్యానా మర్థానాం స్పష్టం ప్రతీయమానత్వాత్‌ - న హ్యుపలభ్యమానం వస్తు నాస్తీతి వక్తుం శక్యమ్‌.

వివరణము :- బాహ్యపదార్థము లసలే లేవు అని చెప్పు యోగాచారులిట్లు చెప్పుదురు. బాహ్యములగు ఘటపదా పదార్థములన్నియు అసత్తులే లేనివియే - పూర్వము ఆధ్యాత్మిక సముదాయము లోనివిగా చెప్పబడిన పంచస్కంధములలో జేరినది యగు విజ్ఞానస్కంధ మొక్కటి మాత్రము కలదు. అది ఆంతరపదార్థము, క్షణికమును - నీలపీతాది గుణములుగాని - ఘటపటాది పదార్థములగాని యివి యన్నియు విజ్ఞానము యొక్క ఆకార విశేషములే కాని విజ్ఞానాతిరిక్త వస్తువులు కాదు. స్వప్నములో బాహ్యమగు వస్తు వేదియు లేకున్నను గ్రహ్యగ్రహక రూపముగ చూడబడునవిగ, చూచుచున్నవిగ నానావిధములుగ గోచరించు పదార్థము లన్నియు విజ్ఞానాకారవిశేషములేగాని తదతిరిక్తము లెట్లు కానేరవో అట్లే అను వారి మతమిప్పుడు నిరసింపబడుచున్నది.

ఇది ఘటము అని. ఇది పటము అని యిట్లు ప్రత్యక్షముగ బాహ్య పదార్థములు స్పష్టముగ భాసించుచున్నవి గనుక బాహ్యవస్తువులకు అభావము( అనగా బాహ్యవస్తువులు లేనే లేవు. ) అని నిశ్చియింప శక్యము కాదు. ప్రత్యక్షముగ వస్తు వుపలభ్యమానమగుచుండ ఇది లేనిది యని యపలపించుట యుక్తము కాదు.

29. సూ : వైధరాశ్మ్యి చ్చ న స్వప్నాదివత్‌

వివృతిః :- స్వప్నాదిబోధవత్‌ జాగరితగోచరా అపి ఘటపటాది బోధాః వినైవ బాహ్య మర్థం భ##వేయుః - ప్రత్యయత్వావిశేషా దిత్యాది వదన్తి విజ్ఞానవాదినః - (విజ్ఞానమాత్రస్తిత్వవాదినో యోగాచారాః) తన్మత మత్ర నిరాక్రియతే - స్వప్నాదివత్‌= స్వప్న, గంధర్వనగర, శుక్తి రజతాది, ప్రత్యయవత్‌ - జాగ్రత్ర్పత్యయా అపి - న =బాహ్యార్థాలం బనా న భవన్తీతి వక్తుం న యుక్తం - కుతః ? వైధరాశ్శ్యిత్‌= స్వప్నజాగరితయో ర్బాధితవిషయత్వ - అబాధితవిషయత్వరూపస్య వైషమ్యస్య సత్వాత్‌ - స్వప్నదృష్టం వస్తు బాధ్యతే ప్రబోధే జాతే సతి - నైవం జాగ్రద్దృష్టం వస్తు బాధ్యతే - దినాంతరే పురుషా న్తరే ణాప్యుపలభ్యమానత్వాత్‌ - ఏవ మస్తి వైషమ్య మితి - వస్తుతస్తు - స్వాప్నికా అపి బోధా బాహ్యా ర్థానాలంబనా ఇతి నాస్మాభి రంగీక్రియతే - తత్రాపి ప్రాతిభాసికానా మర్థానాం సత్వాంగీకారాత్‌ - బాహ్యార్థానా మభావే ఘటజ్ఞానం పటజ్ఞానమితి జ్ఞానవైచిత్ర్యం నోపపద్యత ఇతి సూత్రద్వయస్యార్థః.

వివరణము :- విజ్ఞానమాత్రస్తి త్వవాదులు యోగాచారులు. జాగ్రదవస్థయందలి తత్తద్‌ జ్ఞానములు జ్ఞానవ్యతిరిక్తజ్ఞేయములు కలవికావు. స్వప్నావస్థయందలి జ్ఞానములవలె నవియును జ్ఞానములే కనుక అనువారి మత మిచట నిరాకరింప బడుచున్నది.

స్వప్న - గంధర్వనగర - శుక్తిరజతాది జ్ఞానములవలె జాగ్రదవస్థ యందలి జ్ఞానములను బాహ్యమగు అర్థము= వస్తువు ఆలంబనముగా కలవికావు అని యనుట యుక్తముకాదు. ఏలయన ? స్వప్నాదులకును - జాగ్రత్తునకును సాదృశ్యములేదు. వైషమ్యము (వైధర్మము) కలదు కనుక - స్వప్నములో గ్రహింపబడిన వస్తువు ప్రబోధము జాగరము రాగా భాదింపబడుచున్నది. అనగా ఇది అసత్యము లేనిదియని నిశ్చయింపబడుచున్నది. జాగరమున గ్రమింపబడిన వస్తు వట్లు బాధింపబడుటలేదు. ఆ వస్తువు దినాంతరము నను స్వేతరపురుషులకును ప్రత్యక్షముగ సత్తై, గ్రహింపబడుచున్నది. ఇట్లు స్వప్న జాగ్రద్భోధలకు బాధితార్థకత్వా బాధితార్థకత్వ రూపవైధర్శ్యము స్పష్టముగ కానవచ్చుచున్నది. వస్తువతత్త్వమును విచారించి చూడ స్వాప్నికజ్ఞానములును బాహ్యార్థ సంబంధములేనివి యని మే మంగీకరించము. స్వప్నములయందు ప్రాతి భాసిక పదార్థము లుండునని, అవి తద్‌జ్ఞానాలంబనము కాగలవనియును మేమంగీకరింతుము - బాహ్యపదార్థములే లేక యున్న ఘటజ్ఞానము అని - పటజ్ఞానము అని - యిట్లు జ్ఞానములయందు వైచిత్ర్యము వైవిధ్యము ఉపపన్నము కారనేదని పై రెండు సూత్రముల సారాంశము.

30. సూ : న భావో నుపలభ్దేః

వివృతిః :- అయంఘటః- అయం పట ఇత్యాది వ్యవహారః న బాహ్య పదార్థ సద్భావనిబన్థనః - కింతు జ్ఞానవైచిత్ర్యనిబన్ధన ఏవ - జ్ఞానవైచిత్ర్యం చ వాసనావైచిత్ర్యా దితి యోగాచారై రుచ్చతే - తన్మత మిదానీం నిరాక్రియతే - న - భావః= వాసనానాం భావ ఏవ నాస్తి - కుతః ? అనుపలబ్ధేః= తత్పక్షే బాహ్యార్థానా మనుపలంభాత్‌ - వినానుభవం కథం వాసనా = సంస్కారః ఉత్పద్యేత - అర్థాభావేపి వాసనా భవన్తీ త్యనుపపన్నం - అనుపలబ్ధం చ - యద్వా - భావః= వాసనానాం సత్తా =స్థితిః - న= న సంభవతి - కుతః ? అనుపలబ్ధే =వాసనాశ్రయస్య స్థిరస్య కస్యచిదపి, తన్మతే అనుపలంభాత్‌ -

వివరణము :- ఇది ఘటమని, ఇది పటమని యిట్లు చేయబడుచున్న వివిధ వ్యవహారముల వైచిత్ర్యమునుబట్టి బాహ్యపదార్థములు కలవని (అవి భావపదార్థములని) చెప్పనవసరములేదు. ఆ వ్యవహారభేదము జ్ఞానవైచిత్ర్య ప్రయుక్తము. జ్ఞానవైచిత్ర్యమును వాసనా (సంస్కార) వైచిత్ర్యమునుబట్టి యేర్పడుచుండునని యోగాచారుల నిర్ణయింతురు. ఆ మత మిచట నిరాకరింపబడుచున్నది.

వాసన లనునవి ఈ మతములో సంభవించనేరవు. ఏలయన? బాహ్య పదార్థములు లేనేలేవు గనుక, ఆ పదార్థములను గూర్ఛిన అనుభవము కలుగు నవకాశములేదు. అనుభవము కలుగకున్న వాసనలు= సంస్కారము లెట్లు పుట్టగలవు ? వస్తువులు లేకున్నను తదనుభవములు గాని, తత్సంస్కారములు గాని యేర్పడగలవనునది - అనుపపన్నమును, అననుభూతచరమును, ఈ సూత్రమునకు మరియొక విధమగు వ్యాఖ్యానము :-- వాసనలకు భావము= సత్త= ఉనికి సంభవించనేరదు. ఏలయన ? ఆ వాసనలకు= సంస్కారములకు ఆశ్రయమగు స్థిరమగు వ్యక్తి (ఏ వస్తువైనను) వారి మతములో లేదు గాన -

31. సూ : క్షణికత్వా చ్ఛ

వివృతిః :- అహమహ మితి సంతత మనువర్తమానా యా విజ్ఞాన పరంపరా సా ఆలయవిజ్ఞానశ##బ్దే నోచ్యతే. తదేవ వాసనాశ్రయ మితి తే పరికల్పయన్తి - అథాపి న సక్షో నోపపద్యత ఇత్యుచతే - క్షణికత్వాత్‌ -చ =తస్యాలయవిజ్ఞాన స్యాపి క్షణికత్వాత్‌, స్థాయి త్వానభ్యపగమాత్‌, స న వాసనానా మాశ్రయో భవితు మర్హతి - ఏవం సౌత్రాంతిక, వైభాషిక, యోగాచారణాది పక్షాన నిరస్తాః - ఏతాభి రేవోపపత్తిభి ర్మాధ్యమికానాం పక్షోపి నిరస్త ఏవ -

వివరణము :- అహం - అహం= నేను - నేను అని సర్వజనులకును నిరంతరము ననువర్తించుచున్న జ్ఞానపరంపర ఆలయ విజ్ఞానమని వీరి మతములో వ్యవహరింపబడుచుండును. అదియే వాసనల కాశ్రయమని వారందురు. అట్లన్నను ఆ పక్ష ముపపత్తి లేనిదియే అని యిచట చెప్పబడుచున్నది.

ఆలయవిజ్ఞానమును క్షణికమే అని వారనిరి. దానికి స్థాయిత్వమును= స్థిరత నంగీకరించి యుండలేదు. కాన నా విజ్ఞానపరంపర వాసనలకు= సంస్కారముల కాశ్రయము కాజాలదు. ఇట్లు సౌత్రాంతికి వైభాషిక, యోగాచారుల పక్షములు నిరసింపబడినవి. ఈ యుక్తులతోడనే మాధ్యమికుల పక్షమును నిరసింపబడినది కాగలదు.

32. సూ : సర్వధానుపపత్తేః

వివృతిః :- సర్వధా= సర్వప్రకారే ణాప్యాలోచ్యమానే అనుపపత్తేః= కస్యా అప్యుపపత్తే రత్రాభావాత్‌ - బౌద్ధానా మిదం దర్శనం శ్రేయస్కామై ర్నాదరణీయ మితి -

వివరణము :- సర్వవిధములగ పరిశీలించినను (ఎన్నివిధములుగ పరిశీలించినను) ఈ బౌద్ధుల దర్శనములో ఏఒక్క యుక్తియు నుచితమైనది లేదుగాన నీ దర్శనము శ్రేయస్సును వాంఛించువారిచే నాదరింపదగినది కాదని సారాంశము.

ఏకస్మి న్నసంభవాధి కరణమ్‌ 6

33. సూ : నై కస్మి న్నసంభవాత్‌

వివృతి :- అర్హన్తం భగవన్తం యే మన్యన్తేత ఆర్హతాః - జైనా ఇతి, దిగంబరా ఇతి చ తే వ్యవహ్రియన్తే - తే వేం కథయన్తి - జీవ - అజీవ - ఆస్రవ - సంవర - నిర్జర - బన్ధ - మోక్షా ఇతి పదార్థా స్సప్తేతి - తే హి సప్తాపి పదార్థాన్‌ స్యాదస్తి - స్యాన్నాస్తీత్యాది సప్తభంగీ నయేన యోజయిత్వా వ్యవస్థాపయన్తి - ఏవం సతిత అస్తిత్వ నాస్తిత్వ రూప విరుద్ధ ధర్మసమావేశా త్సర్వేపి పదార్థా అనైకాంతికాః - అనిర్థారితస్వరూపా ఏవ భవన్తి. ఇతి. తేషాం మత మిదానీం నిరాక్రియతే - న= ఆర్హతం మతం న యుక్తం - కుతః ? ఏకస్మిన్‌= జీవాది పదార్థే ష్వేకస్మి న్నపి ధర్మిణి అసంభవాత్‌= సత్వాసత్వయో ర్విరుద్ధయో ర్ధర్మయో రసంభవాత్‌.

వివరణము :- ''అర్హన్‌'' అను నొక మహాత్ముడు గలడు. ఆతనిని భగవంతుడుగా తలంచువారు ఆర్హతులు - వారికి జైనులని, దిగంబరులనియు వ్యవహారము కలదు. వారిట్లు చెప్పుదురు. జీవ - అజీవ - ఆస్రవ - సంవర - నిర్జర - బన్ధ మోక్షములను సంజ్ఞలు కలిగి పదార్థము లేడు విధములుగ నున్నవని యందురు. వారు సద్వాదులు - అసద్వాదులు - సదసద్వాదులు మొదలగు తమకు ప్రతిపక్షులైన సప్తవిధములగు నున్న ప్రతివాదులకు ప్రత్యుత్తరముల నిచ్చుచు తమకు శాస్త్రములోని పదార్థములను ''స్యాదస్తి - స్యాన్నాస్తి '' ఈ మొదలగు సప్త భంగీ న్యాయమును యోజనముచేసి వ్యవస్థాపనము చేయుదురు. జీవాది సమన్త పదార్థము లును స్యాదస్తి - స్యాన్నాస్తి (స్యాత్‌ అను పదమునకు ఈషత్‌ అని అర్థము - అనగా కొంచెమని. ఒకవిధముగ జూచిన అని దాని భావము - ఒకవిధముగ జూచిన ఇది కలదని స్యాదస్తి అను న్యాయమున కర్థము - ఒకవిధముగ జూచిన లేనిదియని స్యాన్నాస్తి యను న్యాయమున కర్థము-) మొదలగు సప్తభంగీ న్యాయముతో యోజన చేయబడగా వానియందు అస్తిత్వ. నాస్తిత్వరూప విరుద్ధధర్మ సమావేశ మేర్పడుచున్నది. కాన జీవా జీవాదిపదార్థము లన్నియు అనైకాంతికములు - అనిర్ధారిత స్వరూపము కలవియే అనియు వారి మతము. ఆ మత మిచట నిరాకరింపబడుచున్నది.

ఆర్హతమతము యుక్తిసంపన్నముకాదు. ఏలయన? జీవాది పదార్థము లోనే ఒక్క ధర్మి =పదార్థము నందును పరస్పర విరుద్ధములగు సత్వా సత్త్వరూప ధర్మములు సంభవించవు గనుక -

34. సూ : ఏవం చాత్తమా కార్త్స్నయమ్‌

వివృతిః :- దేహపరిమాణ ఏవాత్మే త్యార్హతా మన్యన్తే - ఏవం - చ= యథా ఏకస్మి న్ధర్మిణి విరుద్ధధర్మాసంభవో దోష - స్తద్వత్‌ - ఆత్మా కార్స్న్యమ్‌= జీవాత్మనః అకార్స్న్యం= శరీర సమాన పరిమాణత్వం పరిచ్ఛిన్నత్వ మిత్యపరో దోస ఏతస్మి న్మతే భవతి. పరిచ్ఛి న్నత్వే చ ఘటాదివ దనిత్యత్వ మాత్మనః ప్రసజ్యేత - కించ శరీరాణా మనవస్థిత (అనియత) పరిమాణత్వాత్‌ మనుష్యశరీరే వర్తనదశాయాం మనుష్య శరీర పరిమాణో జీవః కేనచి త్కర్మణా గజశరీరం ప్రాప్తో న తచ్ఛరీరం కృత్స్నం వ్యాప్నుయాత్‌ - పిపీలికాశరీరం ప్రాప్నువ న్న తచ్ఛరీరే సంమీయేత - తస్మా జ్జీవస్య శరీరపరిమాణత్వ మయుక్తం -

వివరణము :- ఆర్హతులు దేహపరిమాణ సమాన పరిమాణముకలది ఆత్మవస్తువు అని యందురు.

ఈ మతమున, ఒకేపదార్థమునందు సత్త్వాసత్త్వరూప విరుద్ధ ధర్మములయొక్క ప్రసంగము ఎట్లు దోషమో అట్లే జీవాత్మకు అకార్స్న్యము= శరీరసమాన పరిమాణత్వము అనగా పరిచ్ఛిన్నత్వమను మరియొక దోషమును సంభవించును. పరిచ్ఛిన్నత్వము నంగీకరించిన ఘటాదిపదార్థములకు వలె ఆత్మకు ననిత్యము ప్రసక్తమగును. మరియు శరీరము లనియత పరిమాణములు కనుక మనుష్యశరీరములో నున్నప్పుడు జీవుడు మనుష్యశరీర సమాన పరిమాణము కలవాడై యుండి తిరిగి ఏదో ఒక కర్మవిశేషముచేత గజశరీరమును పొందగా నా శరీరము నా జీవుడు పూర్ణముగా వ్యాపించలేకపోవును. చీమ దేహమును పొందినచో నా శరీరమున నా జీవుడు ఇమిడియుండలేక పోవును. కాన జీవుడు శరీర సమాన పరిమాణము కలవాడని యనుట యుక్తముకాదు.

35. సూ : న చ పర్యాయా ద ప్యవిరోధో వికారాదిభ్యః

వివృతిః :- పర్యాయాత్‌ - అపి= అవయవోపగమాపగమాత్మకా దిపి - న-చ అవిరోధః =జీవస్య తత్తచ్ఛరీర సమానపరిమాణత్వ మవిరుద్ధ మితి

వక్తుం శక్యతే - పిపీలికాదేహం ప్రవిష్టస్య జీవస్య కేషాంచి దవయవా నాం ప్రాక్సతా మపగమా త్తచ్ఛరీరపరిమాణత్వం సంభవతి - హస్తిదేహం ప్రవిష్టస్య తు కేషాంచి దవయవానాం ప్రాగసతా ముపగమా త్తచ్ఛరీరపరిమాణత్వం సంభవతీతి న శక్యతే వక్తు మిత్యర్థః - కుతః? వికారాదిభ్యః = అవయవోప గమాపగమాభ్యా మనిశ మాపూర్వమాణస్య అపక్షీయమాణస్య చ వికారాది దోషప్రసంగాత్‌ - విక్రియావత్వేచ చర్మాదివ దనిత్యత్వప్రసంగా చ్చ-కించ అనిత్యత్వే చాత్మనో బంధమోక్షాభ్యుపగమో బాధితో భ##వేత్‌ - తస్మా చ్ఛరీరపరిమాణో జీవ ఇతి వచన మనుప పన్న మేవ -

వివరణము:- జీవునకు అల్పాధిక పరిమాణ దేహములను పొందు చున్నప్పుడు అవయవముల అపగమ. ఉపగమ రూపపర్యాయము వలన జీవునకు ఆయా శరీరములతో సమానపరిమాణత్వము సంభవించవచ్చును. విరోధము లేదు; అని యనుటకును శక్యముకాదు. [చీమ దేహ మును పొందిన జీవునకు పూర్వము తలకుగల అవయవములలోని కొన్ని అవయవములు లోపించి పోవుటవలన తచ్ఛరీర పరిమాణత్వము సంభవించును. గజదేహమును ప్రవేశించిన జీవునకు పూర్వము తనకు లేని అవయవములు వచ్చి చేరుటవలన తచ్ఛరీర పరిమాణత్వము సంభవించునని యనుటకు వీలులేదని యర్థము.] ఏలయన? ఆయా దేహములను పొందుచు నెల్లప్పుడిట్లు అవయవముల రాకపోకలతో పూరించబడుచు-కృశించుచు నుండుననుచో జీవునకు వికారాది దోషములు ప్రసక్తము కాగలవు. వికారము=మార్పులుపొందు స్వభావము కలదన్నచో సంకోచ వికాసాది వికారములు గల చర్మాదులకు వలె నాత్మకు అనిత్యత్వమును ప్రసక్తమగును. అనిత్యత్వమేర్పడినచో నాత్మకు బంధమోక్షోపదేశములు వ్యర్థమలు కాగలవు. ఆత్మ నశించువాడగుచో మోక్షపురుషార్థమున కాశ్రయ మెవడు కాగలడు? కాన శరీరసమాన పరిమాణము కలవాడు జీవుడని యనుట అనుపపప్నము.

36. సూ : అన్త్యావస్థితే శ్చోభయనిత్యత్వా దవిశేషః

వివృతిః :- చ=అపి చ అన్త్వావస్థితేః = అన్త్యస్యావస్థితి రన్త్యావస్థితిః - అన్త్యస్య= మోక్షవస్థాభావినో జీవపరిమాణస్య అవస్థితేః = జైనశాస్త్రేషు నిత్యత్వాభ్యుపగమాత్‌-తద్వత్‌ ఉభయనిత్యత్వాత్‌= ఉభయో ర్నిత్యత్వ ముభయనిత్యత్వం - ఉభయో రాద్యధ్యమ మయో రపి జీవపరిమాణయో ర్నిత్యత్వప్రసంగాత్‌| అవిశేషః= అవయవోపచయాపచయరూప విశేషాభావ ఏవ ప్రసజ్యతే- తతశ్చైక శరీరపరిమాణతైవ స్యాత్‌ - తస్మా దార్హతం మత మప్యనాదరణీయ మేవ శ్రేయస్కామై రితి-

వివరణము: మరియు- జైనులు తమశాస్త్రములో యోక్షావస్థను పొందు జీవునియొక్క పరిమాణ మేది కలదో అది నిత్యమని యంగీ కరించిరి. అట్లే అద్యమధ్యమ జీవపరిమాణములకును నిత్యత్వము ప్రసక్తము కాగలదు. గాన అద్యమధ్యమాంత్య పరిమాణములకును అవిశేషము సామ్యము = అవయవాపచయోపచయ రూపవిశేషాభావము ప్రసక్తము కాగలదు. ఆపరిమాణము మాత్రము నిత్యమనుటలో విశేషప్రమాణమేదియు లేదు. గాన అంత ఏకశరీర పరిమాణవత్త్వమే సార్వత్రికము గాన స్వల్పాధిక శరీరప్రాప్తి జీవునకు సంభవించనేరదు. కాన నార్హత మతమును ఉపపత్తి రహితమగుటచే శ్రేయస్కారముల కాదరణీయము కాదు.

పత్యధికరణమ్‌7

37. సూ. పత్యు రసామంజస్యాత్‌

వివృతిః :- పూర్వాధ్యాయే ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాన్తానుపరోధా దిత్యత్ర నిమిత్తకారణ ముపాదానకారణం చ పరమేశ్వర ఇత్యువపాదితం శ్రుతిప్రమాణబలాత్‌. తదనసహమానా స్సాంఖ్యయోగవ్యపాశ్రయా మాహేశ్వరాదయః కేచి త్ప్రధానపురుషయో రధిష్ఠాతా కేవలం నిమిత్తకారణ మేవ పరమేశ్వరః - ఇతరేతర విలక్షణాః ప్రధానపురుషేశ్వరా ఇత్యాది మహేశ్వర ప్రోక్తాగమానుగామిన స్సన్తో వదన్తి -తేచ మాహేశ్వరాః- శైవా ఇతి- పాశుపతా ఇతి- కారుణిక సిద్ధాన్తిన ఇతి- కాపాలికా ఇతి చతుర్విధాః -తే హి కార్య, కారణ, విధి, యోగ , దుఃఖాన్తా, ఇతి పంచపదార్థాః పశు (జీవ) పాశమోచనయ పశుపతి నేశ్వరే ణోపదిష్టా ఇతి చ వదన్తి- తేషాం మత మిదానీం ప్రతిషిద్ధ్యతే పత్యుః ఈశ్వరస్య జగదూపాదానా ప్రధానాది ప్రేరకత్వేన జగత్ర్పతి నిమిత్తకారణ మాత్రత్వం నోపపద్యతే -కుతః అసామంజస్యాత్‌ ఆయుక్తత్వాత్‌ పాశుపతాఅనుమానే నేశ్వరం ప్రసాధ్య ప్రధానపురుషయో రధిష్ఠాతృత్వేన జగత్కారణతా ముపవర్ణయన్తి- తదేత దయుక్తం హీనమధ్యమోత్తమ భావేన ప్రాణిభేదాన్‌ విదధత ఈశ్వరస్య రాగద్వేషాదిదోషప్రసక్తే రస్మదాదివదనీశ్వరత్వప్రసంగా దిత్యర్థః - అస్మాకం తు శ్రుత్యను సారిత్వా దనిర్వచ నీయవాదిత్వా చ్చ నదోష ఇతి భావః-

వివరణము :- పూర్వాధ్యాయపు చివరిభాగములో ''ప్రకృతి శ్చప్రతిజ్ఞా.......'' అను సూత్రములో పరమాత్మ ప్రపంచమును గూర్చి నిమిత్తకారణమును, ఉపాదానకారణమును అని శ్రుతి ప్రమాణబలముతో ప్రతిపాదింపబడినది. ఈయంశము నంగీకరింపనివారై సాంఖ్యదర్శన యోగదర్శనముల సహకారముతో మహేశ్వరులు మొదలగు వారు కొందరిట్లను చున్నారు. పరమాత్మ ప్రధాన పురుషతత్త్వములకు ప్రేరకుడు. ప్రపంచమును గూర్చి నిమిత్తకారణమే గాని ఉపాదాన కారణముకాదు, ప్రధానము, పురుషుడు =ఆత్మ, పరమాత్మ = పరమేశ్వరుడు నను నీముగ్గురును పరస్పరము అత్యంత విలక్షణులు. మహేశ్వర ప్రోక్తాగమము ననుసరించినవారై ఇట్లు ప్రతిపాదించుచున్నారు. ఈ మహేశ్వరులు శైవులని-పాశుపతులని-కారుణిక సిధ్ధాంతులని -కాపాలికులని నాలుగు విధముగ నున్నారు. వీరందరును మహేశ్వరాగమాను యాయులే గాన మహేశ్వరులని చెప్పబడుదురు. వారు కార్యము- కారణము- విధి- యోగము- దుఃఖాంతము అను ఐదు పదార్థములు పరమేశ్వరుని చేత పశు(జీవ) పాశవిమోచనముకొరకు ఉపదిష్టములైనవి యనియు చెప్పుచున్నారు. వారిమత మిచట నిరాకరింపబడుచున్నది.

పరమేశ్వరుడు ప్రధానాది తత్త్వములకు ప్రేరకుడు. కాన జగత్తులగూర్చి నిమిత్తకారణమే కాని ఉపాదాన కారణము కాదని యనుట ఉపపన్నము కాదు. ఏలయన? అసమంజసము ఆయుక్తము కనుక. పాశుపతులు అనుమానప్రమాణబలముతో పరమేశ్వరుడు కలడని సాధించి ఆ పరమేశ్వరునకు ప్రధానపురుష ప్రేరకత్వము నంగీకరించి జగత్కారణత్వమును వర్ణించిరి. అట్లనుట యుక్తము కాదు. జీవులను కొందరను హీనులుగను-మరికొందరు ను మధ్యుమలుగను- మరి కొందరను ఉత్తములుగను నిట్లు విషయముగ నిర్మాణము చేయుచున్నాడు పరమేశ్వరుడన్నచో రాగద్వేషాది దోషములు కలవాడు పరమేశ్వరుడని యేర్పడును. అట్లగుచోపరమేశ్వరునకును జీవులకువలె అనీశ్వరత్వము ప్రసక్తము కాగలదని యర్థము. అద్వైతవాదులకైతే యీదోషము ప్రసక్తముకాదు. వారి వాదము ప్రమాణ మూర్థన్యముగ శ్రుత్యనుసారి గనుకనున్నూ-మరియు సృష్టి అనిర్వచనీయము.మిధ్యా భూతము నని వీరి నిర్ణయము గాననూ అని తెలియదగును.

38. సూ. సంబన్ధానుపపత్తేశ్చ

వివృతిః : - ప్రధానాదిప్రేరకత్వ మీశ్వర స్యోక్తం -తచ్చ ప్రేర కత్వం ప్రేర్యప్రేరకయో స్సత్యేవ సంబన్దే ఉపపద్యతే- నాసంబద్ధస్య సంబన్ధస్తుతయో ర్నోపపద్యత ఇత్యుచ్యతే - సంబన్ధానుపత్తేః చ= తన్మతే ప్రధానపురుషయో రీశ్వరస్య చ త్రయాణా మపి సర్వగతాత్వాత్‌, నిరవయవత్వాచ్చ సంయోగసంబన్ధో నో పపద్యతే - ఏవం - కార్యకారణ రూపత్వాభావా త్తేషాం ధర్మధర్మి భావోsపి నాస్తీతి సమవాయసంబన్థో వా నోపపద్యత ఇతి హేతో రసమంజస మేత ద్దర్శనం -ఆస్మాకం తు మతే ఆవిద్యాప్రేరకత్వ మీశ్వరస్య కల్పితతాదాత్మ్యసంబన్ధే నోపపద్యతే ఇత్యబోషః

వివరణము:- పరమేశ్వరుడు ప్రధానది ప్రేరకుడని చెప్పబడినది. ప్రేరకత్వమనునది ప్రేరకప్రేర్యులకు సంబన్థమున్నప్పుడే ఉపపన్నము కాగలదు. గాని సంబందము లేకున్నచో ఉపపన్నము కానేరదు. ప్రధాన పరమేశ్వరుల కట్టి సంబంధము సంపన్నము కాదని యిచట ప్రతిపాదింపబడుచున్నది.

వారుప్రధానము పుడుషురు = ఆత్మ. పరమేశ్వరుడు నను నీ మూడు తత్త్వములును సర్వగతములని, నిరవయవములని యందురు. కాన నచట సంయోగమను సంబంధము కుదరదు. సావయవ ద్రవ్యములకే సంయోగ సంబంధము సంభవించును, మరియు ఈ మూడును కార్యకారణ రూపములు కాదు గాన సమవాయ సంబంధమును నచట సంభవించదు. ధర్మ ధర్మి భావమున్నప్పుడును సమవాయ సంబంధము సంభవించును. ఇచట నట్టి భావములేదు గదా. సంబంధము లేదు గనుక ప్రేర్యప్రేరక భావము ప్రధాన పురుషేశ్వరులకు సంభవించదు. కాన నీదర్శన మసమంజసము. మా మతములో పరమేశ్వరునకు అవిద్యాకల్పిత తాదాత్మ్య సంబంధమును పురస్కరించుకొని ఆవిద్యా ప్రేరకత్వము ఉపన్నమగును గాన దోషము లేదు.

39.సూ : అధిష్ఠానానుపపత్తేశ్చ

వివృతి: - అధిష్ఠానానువపత్తేః చ= అదిష్ఠానస్య= ప్రేరణాయాః- అనుపపత్తేః -రూపాదిరహితత్వా దప్రత్యక్షస్య ప్రధాన స్యేశ్వరప్రేర్య త్వం నోపద్యేతే -లోకే కులాలాదిః రూపాదిరహితం వస్తు న క్వాపి ప్రేరయన్‌ దృష్టః - అతోపీదం దర్శన మనమంజసం -అస్మాకం తు నాస్తి దృష్టాన్తాపేక్షా.శ్రుత్యేకశరణత్వా దితి భావః

వివరణము :- అధిష్ఠానమనగా ప్రేరణము. ప్రధానము రూపరహితము గాన ప్రత్యక్షగమ్యము = ఇంద్రియగ్రాహ్యము కాని యదార్థము. అట్టి ప్రధానము సృష్ట్యర్థ మీశ్వరునిచే ప్రేరింపబడుచున్నది యనుటయుక్తము కాదు. లోకమున కులాలుడు =కుమ్మరిగాని మరియేవ్యక్తిగాని రూపరహితమై ప్రత్యాక్షాగోచరమగు పదార్థమును కార్యార్థము ప్రేరణచేయుట కానవచ్చుటలేదు. కానను ఈదర్శన మసమంజసమని తెలియదగును, మా సిద్ధాంతములో మాకు దృష్టాంతాపేక్షలేదు. మేము శ్రుతిమాత్రశరణ్యులము గాన నని భావము.

40.సూ : కరణవచ్చే న్న భోగాదిభ్యః

వివృతిః :- కరణవత్‌ -చేత్‌ = యథా చక్షురాదికం కరణగ్రామం రూపాదిహీన మపి పురుషేణ = జీవేన ప్రేర్యమాణం దృష్టం- తథాప్రధాన మపీతి చేత్‌ -న =తథా ఈశ్వరస్య ప్రధానప్రేరకత్వం నోపపద్యతే- కుతః ? భోగాదిభ్యః =సుఖదుఃఖానుభవాదిభ్యో హేతుభ్యః పురుషస్య= జీవస్య చక్షురాదికరణాధిష్ఠితత్వం సంభవతి. ఈశ్వరస్య త్వాప్త కామత్వాన్నిత్యతృప్తత్వా ద్భోగాద్యభావేన ప్రధానద్యదిష్ఠితత్వం న సంభవతి-ఈశ్వరస్యాపి భోగా ద్యభ్యుపగమే అనీశ్వరత్వ ప్రసంగః-

వివరణము:- చక్షురాదీంద్రియ సముదాయము రూపాదిరహిత మైననూ-ప్రత్యక్షయోగ్యము కాకున్ననూ -జీవులచే దర్శనాది వ్యాపారములయందు ప్రేరేపింపబడినది కావచ్చుచున్నది. అట్లే ప్రధాన మున ఈశ్వరప్రేరితము కారాదా అనుచో అట్లు ఈశ్వరునకు ప్రధానప్రేరకత్వము సంభవించనేరదు. ఏలయన? సుఖదుఃఖానుభవాది హేతు వులను బట్టి జీవునకు ఇంద్రియప్రేరకత్వము సంభవించవచ్చును.అనగా ఇంద్రియాదులు దతధిష్ఠాతయగు జీవునకు భోగసాధనములు గాన తత్ర్పేర్యత్వము చక్షురాదుల కంగీకరింపబడుచున్నది. అట్లే ప్రధానమునకు ఈశ్వర ప్రేరత్వమంగీకరించుచో నది ఈశ్వర బోగాసాధనమని చెప్పి నట్లగును. ఈశ్వరుడు నిత్యతృప్తుడు, ఆప్తకాముడు గాన భోగప్రసక్తి ఈశ్వరునకు లేదు. కాన ప్రధానమునకు తత్ర్పేర్యత్వముగాని, ఈశ్మరునకు తత్ప్రేరకత్వముగాని సంభవించదు. ఈశ్వరునకు జీవులకువలె భోగము నంగీకరించిన ఈశ్వరతత్వమే లుప్తము కాగలదు.

41.సూ: అంతవత్త్వ మసర్వజ్ఞతా వా

వివృతిః :- మహేశ్వరా హీశ్వరస్య సర్వజ్ఞత్వం ప్రధానపురుషేశ్వరాణా మనస్తత్వం చాభ్యుపగచ్ఛన్తి -తత్రప్రధానపురుషయో రాత్మన శ్చేయత్తా ఈశ్వరేణ జ్ఞాయతే న వేతి వికల్ప్య తన్మతే అసామంజస్యం నిరూప్యతే -అంతవత్వం= ఈశ్వర స్తామియత్తాం జానాతీత్తుక్తే తేషాం ప్రధానపురుషేశ్వరాణా మన్తవత్వం స్యాత్‌ -అసర్వజ్ఞతా వా= ఈశ్వరో నజానా తీత్యుక్తే తస్య అసర్వజ్ఞత్వం వాస్యాత్‌ -తస్మా న్మాహేశ్వరం మత మసమంజస మేవేతి-

వివరణము: - మాహేశ్వరులు పరమేశ్వరుడు సర్వజ్ఞుడని, ప్రధాన పురుషేశ్వరులు అనంత స్వరూపులని (ఇయత్తారహితులని)అంగీకరించి యుండిరి. ప్రధాన- పురుషులయొక్క తనయొక్కయు ఇయత్తను= పరిమితిని ఈశ్వరుడు గుర్తించుచున్నాడా? లేదా అని రెండుగ వికల్పించి ఆ మతములోని అసామంజస్య మిచట నిరూపింపబడుచున్నది.

ఈశ్వరుడు ప్రధాన పురుషేశ్వరులకు సంబంధించిన ఇయత్తను=పరిమితిని గ్రహించుచున్నాడని యన్నచో వారికి అంతవత్త్వము - పరిచ్ఛిన్నత్వమును, గ్రహించుటలేదు. అని యున్నచో నీశ్వరునకు అసర్వజ్ఞత్వ మును సంభవించగలదు. కాన నీమాహేశ్వరమత మసమంజసమైనది యని తెలియదగును.

ఉత్పత్త్యధికరణమ్‌ 8

42. సూ: ఉత్పత్త్యసంభవాత్‌

వివృతిః:- ఉత్పత్త్యసంభవాత్‌= పాంచరాత్రాగమానుపారిణాం భాగవతానాం మత మిదానీం నిరాక్రియతే-ఇత్థం పాంచరాత్రికా మన్యన్తే- భగవా నేకో వాసుదేవో నిరంజనో జ్ఞానరూపః పరమార్థతత్త్వం -స జగత ఉపాదానం , నిమిత్తం చ- తస్మా చ్చ వాసుదేవా త్సంకర్షాణాఖ్యో జీవో జాతయే -తస్మా త్ప్రద్యుమ్నాఖ్యం మనో జాయతే -తస్మా దని రుద్ధాఖ్యోs హంకారో జాయతే ఇతి -సంకర్షణాదీనాం భగవాన్‌ వాసుదేవ్‌ః పరాప్రకృతి రితి చ - త మిత్థంభూతం భగవన్త మభివగమనోపాదానేజ్యాస్వాధ్యాయయోగై ర్వర్షశత మిష్ట్వా క్షీణక్లేశా భగవన్త మేవప్రతి పద్యన్తే ఇతి చైవ మాది. యదత్ర భగవా నేవ జగత ఉపాదానకారణం నిమిత్తకారణం చేత్యుక్తం తన్న నిరాక్రియత్యేః శ్రుతిసమ్మతత్త్వాత్తదంశస్య, ఏవమేవ తస్యభగవతోs భిగమనదిలక్షణ మారాధన మజస్ర మనస్యచిత్తతయాsభిప్రేయతే - తదపి న ప్రతిషిద్ధ్యతే - శ్రుతిస్మృత్యో రీశ్వర ప్రణి ధానస్య ప్రసిద్ధత్వాత్‌ -యత్తు వాసుదేవా త్సంకర్షణో నామ జీవో జాయతే ఇత్యుక్తం తదయుక్త మితీదానీం ప్రత్యుచ్యతే - ఉత్పత్త్యసంభవాత్‌= జీవస్య నిత్త్యత్తే రసంభవాత్‌ - ఉత్పత్తిమత్త్వే జీవస్య అనిత్యత్వం స్యాత్‌ - అనిత్యత్వే తస్య భగవ త్ప్రాప్తిలక్షణోమోక్షః కస్య స్యాత్‌?

వివరణము :- పాంచరాత్రాగమము ననుసరించు భాగవతుల మత మిపుడు నిరాకరింపబడుచున్నది.

పాంచరాత్రాగమము వారిట్లు తలంచుచున్నారు. జ్ఞానస్వరూపుడు, నిరంజనుడు-భగవంతుడు నగు వాసుదేవు డొక్కడే పరమార్థతత్త్వము- అతడు జగములగూర్చి ఉపాదానకారణము- నిమిత్తకారణముగూడనై యున్నాడు. ఆ వాసుదేవుని నుండి సంకర్షణాఖ్య వ్యూహరూపడగు జీవుడుదయించుచున్నాడు. అతనినుండి ప్రద్యుమ్నాఖ్య వ్యూహరూపముగు మనస్సు పుట్టుచున్నది. ప్రద్యుమ్నునినుండి అనిరుద్ధాఖ్య వ్యూహరూపమగు అహంకారము పుట్టుచున్నది అని, సంకర్షణాదుల కందరకు భగవానుడగు వాసుదేవుడ పరాప్రకృతి యనియును-అట్టి- ఆ భగవానుని అభిగమన- ఉపాదాన -ఇజ్యా- స్వాధ్యాయ యోగములతో బహుకాల మారాధించి సమస్తక్లేశములును ప్రక్షీణములు కాగా భక్తులగు పురుషులా భగవానునే పొందుదురు. అనియును ప్రతిపాందించుచున్నారు. ఈ దర్శనమును వారు ప్రతిపాదించు భగవానుడు ప్రపంచమును గూర్చి నిమిత్తకారణమును, ఉపాదాన కారణమును అగు నను నంశ మిచట నిరాకరించపబడుటలేదు. ఆ యంశము శ్రుతిసమ్మతము కనుక- అట్లే అభిగమనాది రూపమగు ఆ భగవదారాధనము నిరంతరము సనస్యచిత్తముతో చేయదగినది యని చెప్పబడిన అంశమును నిరాకరింపబడుటలేదు. శ్రుతి స్మృతిత్యాది గ్రంథములలో ఈశ్వరాప్రణిదానము కర్తవ్యముగా స్పష్టముగా ప్రతిపాదింపబడియున్నది. గనక- వాసుదేవుని నుండి సంకర్షణాఖ్య జీవుడు పుట్టుచున్నాడని చెప్పబడిన యంశము అయుక్తము గాన నిచట నా అంశము నిరాకరింపబడుచున్నది.

జీవుడు నిత్యుడు గాన అతనికి ఉత్పత్తి సంభవించదు. ఉత్పత్తి కలదన్నచో జీవున కనిత్యత్వము ప్రసక్తమగును-జీవుడనిత్యు డగుచో భగవత్ప్రాప్తి రూపమగు మోక్షము ఎవరికి కలుగగలదు?

43. సూ : న చ కర్తుః కరణం

వివృతిః :- చ= అపిచ కర్తుః = జీవాత్‌ - సంకర్షణాఖ్యాత్‌ కరణం= ప్రద్యుమ్నాఖ్యం కరణ రూపం మనోపి న= నోత్పద్యతే -లోకే తథాs దర్శనాత్‌- శ్రుత్యభావాచ్చ.

వివరణము: - కర్తృరూపమగు సంకర్షణాఖ్య జీవునునుండి కరణ స్వరూపమగు ప్రద్యుమాఖ్యమగు మనస్సు పుట్టుననుటయు సంభవించదు. కర్తనుండి కరణము సాధనము పుట్టుట లోకములో నెచటను కానవచ్చుటలేదు. దృష్టాంతము లేదు గనుకను అట్టి శ్రుతివాక్యము లేదు గనుకనున్నూ ఇట్లు నిశ్చయింపబడుచున్నది.

44. సూ : విజ్ఞానాదిభావే వా తదప్రతిషేధః

వివృతిః :- విజ్ఞానాదిభావే -వా =సంకర్షణాదీనా మపి వాసుదేవన ద్విజ్ఞానైశ్వర్య తేజోబల వీర్యాదిగుణాదిభి రన్వితత్వాభ్యుపగమే -సర్వేషాం పరమాత్మత్వాభ్యుపగమే పీతి యావత్‌ తదప్రతిషేదః= తస్య ఉత్పత్త్య సంభవస్య పాంచరాత్రాగ మాప్రామాణ్యసాధకస్య అప్రతిషేధ ఏవప్రాప్నోతి -సంకర్షణాదీనాం తుల్య ధర్మత్వే నేశ్వరత్వావిశేషాత్‌ ఏకస్మా దన్య స్యోత్పత్త్యసంభవాత్‌ - అనేకేశ్వరత్వప్రసక్తిశ్చ స్యాత్‌ -కించ సంకర్షణాదీనాం త్రయాణా మపి వాసుదేవతుల్యత్వే భగవానేక ఏవ వాసుదేవ ఇతి యస్తేషాం సిద్ధాన్త స్తస్య హాని ః - ఇత్యాదయో దోషా ఏతన్మతే ప్రాదుర్భవన్తి-

వివరణము:- సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను ముగ్గురును వాసుదేవుని వలె జ్ఞానైశ్వర్యశక్తి బలవీర్య తేజః ప్రభృతి ధర్మములతో నొప్పువారనియు, నర్దోష నిరవద్య స్వరూపులనియు నంగీకరించినను= అందరు పరమాత్మ స్వరూపులే నని యంగీకరించినను వాసుదేవునినుండి సంకర్షణుడు - అతని నుండి ప్రద్యుమ్నుడు -అతినినుండి అనిరుద్ధడు నుత్పన్న మయ్యెనని పాంచరాత్రాగమములో వర్ణింపబడిన ఉత్పత్తి సంభవించినదియే యగును.అనుపన్నమగు నుత్పత్తిని ప్రతిపాదించుటచే తదాగమనము అప్రమాణము కాగలదు. మరియు సంకర్షణాదులందరు తుల్యజ్ఞాన తుల్య ధర్మతుల్యైశ్వర్యాదులు గలవారు గనుక నందరకు నీశ్వరత్వము సమానమే యగును. కాన వారిలో ఒకరినుండి మరియొకరు పుట్టుట సంభవించదు. అనే కేశరత్వ ప్రసక్తియు నేన్పడును. మరియు సంకర్షణాదులు ముగ్గురును వాసుదేవ తుల్యులే యగుచో వాసుదేవుడొక్కడే భగవంతుడను వారి సిద్దాంతమునకు హానియు కలుగును. ఇత్యాదిదోషము లీ మతమున ప్రాదుర్భవించగలవు.

45. సూ : విప్రతిషే ధాచ్చ

వివృతిః :- వివృతిషేధాత్‌ -చ ఏతస్మిం చ్ఛాస్త్రే జ్ఞానైశ్వర్య శక్తిబలవీర్యతేజాంసి గుణాః - ఆత్మాన ఏవైతే భగవన్తో వాసుదేవా ఇత్యాదిదర్శనాత్‌ గుణగుణిత్వాదికల్పనాది రూపో విప్రతిషేదో బహు ధోపలభ్యతే- ఏవం వేదవిప్రతిషేధ శ్చాత్రోపలభ్యతే -చతుర్షు వేదే ష్వేవం శ్రేయః అలబ్ధ్వా శాండిల్య ఇదం శాస్త్ర మధీతవా నత్యాదివేద నిందాదర్శనాత్‌ -తస్మా దసంగ తైషా కల్పనేతి సిద్ధమ్‌.

ఇతి శ్రీ గాయత్రీ పీఠాదీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయవరవిరచాతాయాం బ్రహ్మసూత్ర వివృతౌ ద్వితీయధ్యాయస్య - ద్వితీయ ః పాదః

వివరణము: - ఈ శాస్త్రములో ఒకచోట జ్ఞానైశ్వర్య బలవీర్యతేజస్సులనునవి గుణములని- మరియొక స్థలమున ఆపూర్వక్తగుణ ములే వాసుదేవుడని యిట్లు ఒకనికే గుణవత్వ కల్పనారూపమగు విరోధము బహువిధములుగ నుపలబ్ధమగుచున్నది. ఇట్లే ఈ పాంచరాత్రాగమమున వేదవిప్రతిషేధమును సంభవించుచున్నది.ఎట్లన నాలుగు వేదములయందు పరమశ్రేయస్సును సాధింపగల్గు సాధనమును పొందలేక శాండిల్యు డీశాస్త్రము నధ్యయనము చేసెను అనియు- ఈ పాంచరాత్రతంత్రమునందలి ఒక్క అక్షరమును మాత్ర మధ్యయనించినను అతడు నాల్గు వేదముల నధ్యయనించినవానికంటె నధికుడు కాగలడు అనియు నిట్లు వేదనింద కానవచ్చుచున్నది. కాన నీ పాంచరాత్రాగమ సిద్ధభాగ వతమతకల్పన మసంగతమని సిద్ధమగుచున్నది.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతి వర విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున ద్వితీయాధ్యాయమున - ద్వితీయ పాదము ముగిసెను

ద్వితీయాధ్యాస్య - తృతీయః పాదః

ఇతఃపరం పాదద్వయేన నానాశాఖాగతోత్పత్తివాక్యానాం , బ్రహ్మోపాదనత్వస్య చ విరోధః పరిహ్రియతే - తత్ర ప్రథమం ఆకాశస్యోత్పత్తి రస్తి నాస్తీతి చిన్త్యతే-

వియ దధికరణమ్‌ 1

1. సూ: న వియ దశ్రుతేః

వివృతిః :- వియత్‌ = ఆకాశం న = నోత్పద్యతే -కుతః? అశ్రుతేః=ఛాన్దోగ్యే సృష్టిప్రతిపాదక ప్రకరణ ఆకాశస్యోత్పత్తే రశ్రవణాత్‌

వివరణము :- ఇక మిగిలిన రెండుపాదములలో ఆయా వేదశాఖలలో గోచరించుచున్న ఆకాశాది పదార్థముల ఉత్పత్తిని బోధించు వాక్యము లకు సంబంధించిన విరోధమును, బ్రహ్మ ఉపాదాన కారణమును సంశమునకు సంబంధించిన విరోధమును, పరిహరింపబడును. అందు ప్రథమమున ఆకాశమున కుత్పత్తి కలదా? లేదా? అని విచారింపబడుచున్నది. ఆకాశమున కుత్పత్తి కలదనుట యుక్తముకాదు. ఏలయన? ఛాందో గ్యోపనిషత్తులోని సృష్టిప్రతిపాదక ప్రకరణములో ఆకాశమున కుత్పత్తి వర్ణింపబడి యుండలేదు గనుక.

2. సూ : అస్తితు

వివృతిః :- అస్తి- తు = ఆకాశ స్యోత్పత్తిప్రతిపాదికా శ్రుతిస్తు తైత్తిరీయశాఖాయా మస్త్యేవ - ''తస్మా ద్వా ఏతస్మా దాత్మన ఆకాశ స్సంభూతః'' ఇత్యేవంరూపా - ఏవం శ్రుత్యో ర్ద్యయో ర్వియో ర్విరుద్ధార్థప్రతి పాదకత్వా దప్రామాణ్యమ్‌.

వివరణము :- తైత్తిరీయశాఖయందు ''తస్మా ద్వా ఏతస్మా దాత్మన ఆకాశ స్సంభూతః'' బ్రహ్మాభిమన్నమగు నాత్మవస్తువునండి ఆకాశ ముద్భవించెను అని ఆకాశమున కుత్పత్తిని వర్ణించు వాక్యము కలదు. ఇట్లు శ్రుతులు రెండును పరస్పర విరుద్ధముగ నుండుటచే ఈ శ్రుతివాక్యముల కప్రామాణ్యమును సిద్ధించును.

3.సూ : గౌణ్య సంభవాత్‌

వివృతిః :- ఆకాశస్య నిత్యత్వవాదినో వదన్తి - గౌణీ = ఆకాశ స్యోత్పత్తిప్రతికాదికా శ్రుతిః -న ముఖ్యా - కింతు గౌణీ భతితు మర్హతి - కుతః? అనంభవాత్‌ = నిరవయవస్య హ్యాకాశస్య ఉత్పత్తికారణసామగ్ర్యా స్సమవాయకారణాదే రభావాత్‌ - ఉత్పత్తిమతాం హి పృథివ్యాదీనాం కార్యాణాం పూర్వోత్తరయోః కాలయో ర్విశేష స్సంభావ్యతే - పూర్వం మృత్పిండో7భూ దిదదామినీం ఘటఇత్యాది - ఆకాశస్య తు న పూర్వోత్తర కాలయో ర్విశేష స్సంభావ్యతే - పూర్వ మనవకాశ మచ్ఛిద్రం బభూవ - ఇదానీం సచ్ఛిద్రం - సావకాశం ఇతి - అతస్తదుత్పత్తిప్రతిపాదికా శ్రుతిర్గౌణ్యవ ఇతి -

వివరణము :- ఆకాశము నిత్య మనువారు చెప్పుచున్నారు. ఆకాశమున కుత్పత్తిని వర్ణించు శ్రుతి ముఖ్యము కాదు. గౌణము కాదగును. [అనగా ''........... ఆకాశ స్సంభూతః '' అను శ్రుతిలోగల '' సంభూతః'' అను పదమునకు ముఖ్యార్థము ఉత్పత్తి అనియే ఐనను ఆ అర్థము నిచట చెప్పగూడదని , అభివ్యక్తమయ్యెనను అముఖ్యార్థమును భోదించుటయందే ఆ వాక్యమునకు తాత్పర్యమని భావము] ఏలయన? పుట్టుకగల పృథివి మొదలగు కార్యవస్తువలకు ఉత్పత్తికి ముందు వెనుకటి కాలములయందు విశేషము గర్తింపబడుచున్నది. ఉత్పత్తికి = పుట్టుక కు పూర్వము ఇది మట్టిముద్దయే అయి యుండెను. ఇప్పుడు ఉత్పత్తియైన తరువాత నిది ఘటమయ్యెను అని. ఆకాశమునకు ముందు వెనుకటి కాలములలో నట్లు విశేష మేవిధముగను గ్రహింపబడుటలేదు. పూర్వమిది అవకాశరహితము, చిద్రరహితమునునై యుండెను. ఇప్పుడు అవకాశముకలది - చిద్రము కలదియని యిట్లు విశేషమేమియు గోచరించుటలేదు. కాన ఆకాశమున కుత్పత్తిని ప్రతిపాదించు శ్రుతి గౌణమే యని యనదగును.

4. సూ : శబ్దాచ్చ

వివృతిః :- శబ్ధాత్‌ - చ = ''వాయు శ్చాన్తరిక్షం చైత దమృతం'' ఇత్యాకాశ స్యామృతత్వవాచిశబ్దా దప్యాకాశ స్యోత్పత్తి ర్నాస్తీతి, ఉత్పత్తి ప్రతిపాదికా శ్రుతి ర్గౌణీతి చ ప్రతిపత్తవ్యమ్‌ - నహ్యుత్పన్న స్యామృతత్వ ముపపద్యతే-

వివరణము :- ''వాయుశ్చాన్తరిక్షం చైత దమృతం'' వాయువు - అంతరిక్షము నను నీ ద్వంద్వము అమృతస్వరూపము = నాశరహితము అని ఆకాశమునకు అమృతతత్వమును ప్రతిపాదించు శ్రుతినిబట్టియు ఆకాశ మున కుత్పత్తి లేదనియు - ఉత్పత్తి బోధక శ్రుతి గౌణమనియు గ్రహింపదగును. ఉత్పత్తికల పదార్థమునకు అమృతత్వ ముపన్నము కాదు గదా!

5. సూ : స్యాచ్చైకస్య బ్రహ్మశబ్దవత్‌

వివృతిః :- ''తస్మాద్వా ఏతస్మా దాత్మన ఆకాశ స్సంభూతః '' ఇతి శ్రుతౌ శ్రూయమాణ స్సంభూతశబ్దః'' ఆకాశ ద్వాయుః , వాయో రగ్నిః''- ఇత్యాద్యుత్తర వాక్యే ష్వనువర్తమానో వాయ్వాదీనాం ముఖ్యం సంభవం ప్రతిపాదయన్‌ ఆకాశవిషయమే కథం గౌణోభ##వేత్‌ - ఏకసై#్యవ శబ్దస్య ముఖ్యత్వం గౌణత్వం చేత్యేత ద్విప్రతిపన్న మిత్యత అహ. స్యాత్‌ - చ - ఏకస్య = ''....ఆకాశ స్సంభూతః ఆకాశాద్వాయుః'' ఇత్యత్రైక స్యాపి సంభూతశబ్ధస్య ఆకాశే గౌణత్వం - వాయ్వాదిషు ముఖ్య త్వం చ స్యాదేవ - కథం ? బ్రహ్మశబ్దవత్‌ = ''తపసా బ్రహ్మ విజిజ్ఞాసన్వ - తపో బ్రహ్మేతి'' ఇత్యత్ర ఏక స్యాపి బ్రహ్మశబ్దస్య జిజ్ఞాసా కర్మణి ముఖ్యత్వం - తపసి గౌణత్వం చ తద్వత్‌ - తస్మా న్నాప్తి శ్రుత్యో ర్విప్రతిషేదో, వియత శ్చోత్పత్తి రపి.

వివరణము :- ''తస్మాద్వా....సంభూతః'' అను నీ శ్రుతియందలి సంభూతశబ్దము - ''ఆకాశా ద్వాయుః | వాయో రగ్నిః'' ఈ మొదలగు పైవాక్యములలోనికి అనువర్తించి ఆకాశమునుండి వాయువు పుట్టెను - వాయువునుండి అగ్ని పుట్టెను. అని వాయ్వాదులకు ముఖ్యమైన ఉత్పత్తిని బోధించుచు ఆకాశము విషయములో మాత్రము గౌణార్థమును బోధించుననుట యెట్లు పొసగును. ఒకే శబ్దమునకు ముఖ్యార్థత్వము, గౌణార్థత్వము అని రెండు విధములుగ చెప్పుట విప్రతిపన్నము కాదా ? అనగా చెప్పుచున్నారు.

ఒక్కటియే యగు సంభూతశబ్దమునకు ఆకాశము విషయములో గౌణత్వమును, వాయ్వాదులయందు ముఖ్యత్వమును నంగీకరింపవచ్చును. అది దోషావహముకాదు. ''తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ| తపో బ్రహ్మేతి'' అను నీ వాక్యములలో ఒకే బ్రహ్మశబ్దము మొదటి వాక్యములో విచారింపదగిన బ్రహ్మవస్తువును (ముఖ్యార్థమును) బోధించుటకై ప్రయోగింప బడెను. రెండవ వాక్యములో బ్రహ్మావభోద సాధనమగు తపస్సును = అముఖ్యా (గౌణా)ర్థమును బోధించుటకై ప్రయోగింపబడెను. అట్లే సంభూత శబ్దమునకును గౌణత్వ - ముఖ్యత్వములు రెండును సంభించవచ్చును. కాన శ్రుతివాక్యములకు పరస్సర విప్రత్తిపత్తియను ఆకాశమునుకుత్పత్తియును లేదని తెలియదగును.

6. సూ : ప్రతిజ్ఞాహాని రవ్యతిరేకా చ్ఛబ్దేభ్యః

వివృతిః :- ఏవ ముపపాదితం వియదనుత్పత్మతిపక్షం దూషయన్‌ ప్రకారాన్తరేణ శ్రుత్యో ర్విరోధం పరిహరతి - ప్రతిజ్ఞాహానిః = ప్రతిజ్ఞాయా అహానిః ప్రతిజ్ఞాహానిః - ఆకాశ స్యోత్పత్తా వభ్యుపగమ్యమానాయా మేవ ''యే నాశ్రుతం శ్రుతం భవ త్యమతం మతం'' ఇత్యాదిశ్రుతి వాక్యేభ్యః ప్రతిజ్ఞాతాయా ఏవవిజ్ఞానేన సర్వవిజ్ఞానప్రతిజ్ఞాయాః - అహానిః = అబాధః స్యాత్‌ - కుతః ? అవ్యతిరేకాత్‌ = ఆకాశస్యాపి బ్రహ్మకార్యత్యవే ఏవ బ్రహ్మణః అవ్యతిరిక్తత్వా ద్బ్రహ్మజ్ఞానేన జ్ఞాతత్వం సంభవతి. కుత ఏవ మవగమ్యత ఇతిచేత్‌- శ##బ్దేభ్యః = ''యథాసోమ్యైకేన మృత్పిండేన....'' ఇత్యాదిభ్యః కార్యకారణాబేధప్రతిపాదన పరేభ్యః- ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞాయ స్సమర్థితత్వాత్‌ - తస్మా దాకాశ మప్యుత్పద్యత ఇత్యవగన్తయం - ఛాందోగ్యే ప్యాకాశోత్పత్తి రనుమతైవ - అప్రతిషిద్ధ త్వాత్‌ - అత శ్చాన్దోగ్యతైత్తిరీయయో రేకవాక్యతయా విరోధాభావాత్‌, శ్రుత్మో ర్నాస్తివిరోధ ఇతి - న చాకాశోత్పత్తౌ సామగ్ర్యభావః బ్రహ్మణ ఏవ తత్సామగ్రీత్వాత్‌ - అస్తి వియత ఉత్పత్తి రితి - అమృతత్వోక్తి రాకాశ స్యాపేక్ష కామృతత్వవిష యేతి చ ద్రష్టవ్యమ్‌ - ఇతి -

వివరణము :- ఆకాశమున కుత్పత్తిలేదని ప్రతిపాదింపబడిన పక్షమున దూషించుచు మరియొక విధముగ నిచట శ్రుతివాక్యములలోని విప్రతిపత్తిని పరిహరించుచున్నారు.

ఆకాశమున కుత్పత్తి యంగీకరించిననే '' యేనాశ్రుతం శ్రుతం భవ త్యమతం మతం '' ఏ వస్తువు విచారింపబడగా పూర్వము విచారంప బడని వస్తుజాతమంతయు నిశ్శేషముగ విచారంపబడినదియే యగునో - యేవస్తువు మనము చేయబడగ సర్వమును మననము చేయబడినదియే యగునో - అని సర్వాత్మకమగు నద్వితీ యైకరవస్తువు నిచట ప్రతి పాదించుచు శ్రుతివాక్యములలో చేయబడిన ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ బాదింపబడకుండ నుండగలదు. ఏలయన? ఆకాశము గూడ బ్రహ్మకార్యము (బ్రహ్మనుండి పుట్టిన వస్తువే) కాన బ్రహ్మ కంటే వేరుకానిది కాగలదు. అంత బ్రహ్మ జ్ఞాతముకాగా తదవ్యతిరిక్త మగు ఆకాశమును తెలియబడగలదు. ఈ యంశ మెట్లు తెలియబడు చున్నది. యనిన. ''యథా సౌమ్యైకేన మృత్పిండేన'' కారణమగు ఒక మృత్పిండము (మట్టిముద్ద) తెలయబడగా తత్కార్యములగు ఘట = కుండ, శరావము = మూకుడు మొదలగు పదార్థములన్నియు నెట్లు తెలియబడునో అట్లే సర్వకారణమగు సద్రూప బ్రహ్మవస్తువు తెలియబడగా తత్కార్యమగు ఆకాశాది సమ్తదృశ్య ప్రపంచమును తెలియబడును అని సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞా సమర్థన సందర్భములోని కార్య కారణాభేద ప్రతిపాదన పరవాక్యముల వలన తెలయిబడుచున్ది. కాన ఆకాశమును ఉత్పత్తి కలదయనియే తెలిసికొనవలయును. ఛాన్దోగ్యోపనిషత్తులో గూడ ఆకాశము యొక్క ఉత్పత్తి అనుమతింపబడిన యట్లే అగును. ప్రతినిషేధింప బడియుండలేదు. గనుక, ఇట్లు ఛాన్దోగ్య తైత్తిరీయశ్రుతులకు ఏకవాక్యత సంభవించును. విరోధములేదు, కాన శ్రుతివాక్యములకు పరస్పర వివ్రతి పత్తి= విరోధములేదని భావము. ఆకాశముయొక్క ఉత్పత్తికి కారణసామగ్రి లేదని శంకించ నవసరము లేదు. ఆ సామగ్రి బ్రహ్మవస్తువే. కాన ఆకాశముకు పుట్టుక కలదని - ఆకాశవాయువులకు చెప్పబడిన అమృతత్వము సాపేక్షికామృతత్వము గాని ముఖ్యామృతతత్వము కాదనీయు నిశ్చయింపదగును.

7. సూ : యావద్వికారం తు విభాగో లోకవత్‌

వివృతిః :- అనుమానేన ఆకాశే కార్యత్వం = ఉత్పత్తిమత్త్వం సాధ్యతే - విభాగః = విభేదః - యావద్వికారం = వికారశబ్దః కార్యవాచీ - యావచ్చబ్దస్య వ్యాప్తి రర్థః - తతశ్చ యత్రయత్ర విభాగ స్తత్రతత్ర కార్యత్వ మితి పర్యవసితో7ర్థం - తథా చాకాశే పృథివ్యాదిభ్యో విభాగో 7స్తీత తత్ర కార్యత్వ మభ్యుపగస్తవ్యం - లోకవత్‌ = ఘటాదివత్‌ = యథా ఘటాదిషు పటాదిభ్యో విభాగః తత ఏవ కార్యత్వ మస్యస్తి - తద్వ దితి - అత ఆకాశస్య బ్రహ్మకార్యత్వం సిద్ధమ్‌ -

వివరణము :- ఆకాశ ముత్పత్తి కలదియని అనుమాన ప్రక్రియతో సాధించుచున్నారు. విభాగమనగా బేధము - ఏ పదార్థమునందు పదార్థాంతర భేదరముండునో ఆ పదార్థము వికారము = కార్యము = పుట్టుక కలది యని యీ సూత్రముయొక్క సారాంశము. ఆకాశము కార్యము = ఉత్పత్తికలది - ఏలయన ? పృథివ్యాది పదార్థములకంటె ఆకాశము భిన్నము గనుక. లోకమునందు ఘటాది పదార్థములు పటాది పదార్థముల కంటె భిన్నముల కాననని వికారరూపములు = కార్యములు, అట్లే ఆకాశమును కార్యరూపము = ఉత్పత్తికలది యని నిశ్చయింపదగును. మరియు నాకాశము బ్రహ్మకార్యము = బ్రహ్మనుండి యుత్పన్నమగునది యనియును తెలియదగును.

మాతరి శ్వాధికరణమ్‌ 2

8. సూ : ఏతేన మాతరిశ్వా వ్యాఖ్యాతః

వివృతిః :- ఏతేన = వియదుత్పత్తి వ్యాఖ్యానేన - మాతరిశ్వా = వాయు రప్యుత్పన్న ఏవేతి - ఆకాశవచ్ఛిన్న బ్రహ్మజన్య ఇతి వ్యాఖ్యాతః= సృష్టం ప్రతిపాదిత ఇత్యవగన్తవ్యమ్‌.

విరణము :- ఆకాశముయొక్క ఉత్పత్తని గురించిన వ్యాఖ్యాన ప్రక్రియతో వాయువును ఉత్పత్తి కదియే అని - ఆ వాయువు ఆకాశభావమును పొందిన బ్రహ్మవస్తువునుండి పుట్టునది యని సృష్టముగా ప్రతి పాదింపబడినది యని తెలియదగును.

అసంభవధి కరణమ్‌ 3

9. సూ : అసంభవస్తు సతో7నుపపత్తేః

వివృతః :- వియత్పవనయో రసంభావ్యమానజన్మనో రప్యుత్పత్తి ముపశ్రుత్య స్యా త్కస్యచి దేవం మతిః, బ్రహ్మణోపి కుతశ్చి త్కారణా దుత్పత్తి స్స్యాదితి - తామాశంకా మపనేతు మిదం సూత్రం - సతః తు= సద్రూపన్య బ్రహ్మణ స్తు - అసంభవః = ఉత్పత్త్యభావ ఏవ నిశ్చేతవ్యః - కుతః ? అనుపత్తేః= సతో వా అసతోవా సద్రూపస్య బ్రహ్మణ ఉత్పత్త్య - సంభవాత్‌ - తథాహి - సతః - సదన్తరా దుత్పత్తౌతయోః కార్యకారణభావ నుపపత్తిః- అనత స్సత ఉత్తత్తౌ అన్య నత్త్వం న స్యాత్‌ -''కథ మసత స్సజ్ఞాయేత'' '' ఇత్యాదినా త్వసత స్సజ్ఞన్మ శ్రుత్యా ప్రతిషిద్ధం - తస్మా దనుత్పన్నం బ్రహ్మేతి సిద్ధం.

వివరణము :- సామాన్య జనులచే గ్రహింపశక్యముగాని ఉత్పత్తి గల వాయ్వాకాశములకుని జన్మకలదని చేయబడని నిర్ణయమును విని బ్రహ్మకును ఏదో ఒక కారణమువలన ఉత్పత్తి ఉండవచ్చు నను అశంక ఒకనికి కలుగవచ్చును. అట్టి అశంకను తొలగించుటకు ఈ సూత్రము చెప్పబడుచున్నది.

సద్రూపమగు బ్రహ్మవస్తువునకు ఉత్పత్తి అసంభవమని నిశ్చయింపదగును. ఏలయన ? బ్రహ్మకు జన్మ చెప్పవలసివచ్చిన సత్తునుండియో ? అసత్తునండియో జన్మచెప్పవలయును. ఈ రెండు విధములను బ్రహ్మకు జన్మ పొనగదు. ఎట్లన - బ్రహ్మ సద్రూపము గాన దానికి మరి యొక సద్వస్తువునండి ఉత్పత్తి సంభవించదు. సమాన స్వరూప స్వభావములుగల రెండు వస్తువులకు కార్యకారణ భావ ముపపన్నము కానేరదు. అసత్తునుండి ఉత్పత్తియు పొసగదు. అసత్తునుండి పుట్టినదన్నచో బ్రహ్మ సద్రూపము కాకపోవలసివచ్చును. మరియు '' కథ మసత స్సజ్జాయేత '' అను శ్రుతి అసత్తునుండి సద్వస్తువునకు జన్మను ప్రతిషేదించినది. కాన బ్రహ్మ ఉత్పత్తి లేనిదే అని సిద్ధమగుచున్నది.

తేజోధికరణమ్‌ 4

10. సూ : తేజో7త స్తథా హ్యాహ

వివృతిః : - ఛాన్దోగ్యే - '' తత్తేజో7సృజత -'' ఇతి తేజసో బ్రహ్మోపాదాన మితి - త్తెత్తిరీయకే ''వాయో రగ్నిః'' ఇతి వాయు రూపా దాన మితి చ శ్రూయతే - తతశ్చ తేజన ఉపాదానం కిమిత్యత్ర విప్రత సత్తౌ సత్యా మిద ముచ్యతే - తేజః = తేజో భూతం తు అతః = వాయోరేవ జాయతే - న తు సాక్షా ద్బ్రహ్మణః - కుతః ? తథా = తథా ''వాయోరగ్నిః'' ఇతి అహ - హి = శ్రుతిః ప్రతిపాదయతి హి = నచ తర్హి ఛాన్దోగ్యశ్రుత్యా విరోధ స్తదవస్థ ఏవేతి వాచ్యం వాయో ర్బ్రహ్మ జన్యత్వేన వాయుభావాపన్న బ్రహ్మజన్యత్వస్య ఛాందోగ్యశ్రుత్యర్థ సై#్యవ వాయో రగ్ని రితి శ్రుతే రప్యర్థత్వే ఏకార్థత్వాన్న విరోధ ఇతి-

వివరణము : - చాన్దోగ్యములో ''తత్తేజో7సృజత'' ఆ సద్రూప మగు బ్రహ్మ తేజస్సును సృజించెను, అని - త్తెత్తిరీయములో ''వాయోరగ్నిః'' వాయువునుండి అగ్ని = తేజస్సు ఉత్పన్నమైనది యనియు వర్ణంచు వాక్యములలో ఒక వాక్యములో తేజస్సను భూతమునకు బ్రహ్మ ఉపాదాన కారణమనియు - మరియొక వాక్యములో వాయు వుపాదాన కారణ మనియు వర్ణింపబడియుండుటచే తేజస్సున కుపాదాన మెద్ది యని సందేహము రాగా చెప్పబడుచున్నది.

తేజోభూతము వాయూపాదానకమే గాని సాక్షాద్బ్రహ్మోపాదానకము కాదు. ''వాయో రగ్నిః '' అనిత్తెత్తిరీయ శ్రుతి ప్రతిపాదించుచున్నది గనుక- అట్లనుచో ఛాన్దోగ్యశ్రుతితో విరోధము రాదా అని శంకింప నవ సరములేదు. వాయువును బ్రహ్మజస్యముగాన వాయు భావాపన్నమైన బ్రహ్మనుండి తేస్సు పుట్టెననియే ఛాన్దోగ్యశ్రుతి కర్థము, అదియే త్తెత్తి రీయ శ్రుతికిని అర్థము గనుక విరోధమేమియు లేదని యర్థము.

అబధికరణమ్‌ 5

11. సూ : ఆపః

వివృతిః :- ఛాన్దోగ్యే ''తదసో7సృజత '' ఇత్యపాం బ్రహ్మజన్య త్వం - తైత్తిరీయకే ''అగ్ని రావ'' ఇత్యపా మగ్ని జన్యత్వం చ శ్రూయతే - తత శ్చాంబూపాదానావిషయే వివ్రపత్తౌ సత్యా ముచ్యతే - అవః = జలభూతం - (పూర్వస్మా త్సూత్రాత్‌ అత స్థథా హ్యాహ - ఇత్యనువర్తతే) అతః = అగ్నే రేవ జాయతే- న తు సాక్షా ద్బ్రహ్మణః- కుతః తథా = తథా - ''అగ్నే రావ'' ఇతి, అహ - హి = శ్రుతిః ప్రతిపాదయతి హి - అతః పూర్వవ త్తేజోభావాపన్న బ్రహ్మజస్యత్వే నానయో శ్శ్రత్యో రేకార్థత్వాన్న విరోధః - ఇతి -

వివరణము :- ఛాందోగ్యములో ''తదపో7సృజత'' బ్రహ్మ జలమును సృజించెను అని జలములకు బ్రహ్మ జన్మత్వము. తైత్తిరీయములో ''అగ్నే రావః'' అని అగ్నిజన్వత్వము వర్ణింపబడగా జలముల కుపాదాన కారణము విషయములో విప్రతిపత్తి యేర్పడుచున్నది. ఆ విషయములో నీ సూత్రము చెప్పబడుచున్నది.

జల మనుభూతము అగ్నినుండియే పుట్టుచున్నది గాని సాక్షాత్తుగ బ్రహ్మనుండి పుట్టుటలేదు. ''ఆగ్నే రావః'' అను శ్రుతి యిట్లు వర్ణించు చున్నది గనుక. ఇచటను వాక్యద్వయమునకు విరరోధము లేకుండుటకు తేజోభావాపన్న బ్రహ్మము జలములకు ఉపాదానమని చెప్పవలయును, అట్లు చెప్పుటతో వాక్యదయ్వమున కేకవాక్యత లభించును. విరోధమును పరిహృతుమగును.

పృథివ్యధికా రాధికరణమ్‌ 6

12 సూ : పృథివ్యధికారరూప శబ్దాంతరేభ్యః

వివృతః- ''తా అప ఐక్షస్త బహ్వ్య స్స్యాము ప్రజాయేమ హీతి తా అన్న మసృజన్త'' ఇతి శ్రూయతే - ఆత్రాన్నశ##బ్దేన వృథివ్యేవాభి దేయతే - నతు వ్రీహియవా ద్యభ్యవహార్యం - కుతః ? అధికార, రూప, శబ్దాంతరేభ్యః = ఏతేభ్యో హేతుభ్యో అధికారః = ప్రకరణం - స హి ''తత్తజో7సృజత''ఇత్యాదినా మహాభూతావిషయో దృశ్యయే - దృశ్యతే రూపమ్‌= తద్వాక్యశేషే ''యత్కృష్ణం తదన్నుస్స'' ఇతి పృథివ్యనుగుణం దృశ్యతే - పృథివ్యా రూపం కృష్ణ మితి పౌరాణికా జ్యోతిర్విద శ్చోపదిశంతి శబ్దాస్తరం = సమానప్రకరణం - తత్ర ''అద్భ్యః పృథివీ '' ఇతి తైత్తిరీయ శ్రుతా వుపలభ్యతే - తస్మా దేతేభ్యో హేతుభ్యః అన్నశ##బ్దేన పృథి వ్యేవో చ్యత ఇతి నిశ్చీయతే -

వివరణము :- ''తా అప ఐక్షస్త బహ్వ్య స్స్యామ ప్రజాయేమ హీతి తా అన్న మసృజన్త'' ఆ ఉదరకములు (ఉదకభావన్నమైన బ్రహ్మ) బహువిధములుగా అగుదము. ప్రకృష్ణముగా పుట్టుదము అని సంకల్పించి అన్నమును సృజించినవి అని చెప్పు శ్రుతివాక్యములోని అన్న శబ్దమునకు పృథివి యని యర్థము గాని వ్రీహియ వాదిరూపమగు భుజింపదగిన అన్నమని యర్థము కాదు. ఏలయన? అధికార - రూప - శబ్దాంతరములను హేతువులవలన నట్లు నిర్ణయింపబడుచున్నది. అధికార మనగా ప్రకరణము. పైనుదహరింపబడిన వాక్యము ''తత్తే7జోసృజత'' అను మహాభూతముల సృష్టిని వర్ణించు వాక్యములతో గూడిన ప్రకరణము లోనిది. రూపము:- పై వాక్యమునకు తరువాతి గ్రంథములో ''యత్కృష్ణం తదన్నస్య '' అని అన్నమనుదానియొక్క రూపము కృష్ణము అని పృథివికి అనుగుణమైన రూపమే వర్ణింపబడినది. పృథివీ భూతముయొక్క రూపము కృష్ణమని పౌరాణికులు, జ్యోతిశ్శాస్త్రుజ్ఞులు నుపదేశించు చున్నారు. శభ్దాంతరమనగా గ్రంథాంతరములోనున్న సమానప్రకరణము. తైత్తిరీయోపనిషత్తునందు వియదాది భూతముల సృష్టిని వర్ణించు ప్రకరణములో ''అద్భ్యః పృథివీ'' అని ఉదకములనుండి పృథివీభూతము ఉదయించెనని వర్ణింపబడియుండెను. కాన నీ హేతువులనుబట్టి పై వాక్యము లోని అన్న శబ్దముచేత పృథివియే చెప్పబడుచున్నదని నిశ్చయింపబడు చున్నది.

తదభిధ్యానాధి కరణమ్‌ 7

13. సూ : తదభిధ్యానా దేవ తు తల్లింగా త్సః

వివృతిః :- ఇదానీం వియదాదీని భూతాని స్వయమేవ స్వవికారాన్‌ సృజన్తి, ఉత పరమేశ్వర ఏవ తేన తేనాత్మనా వతిష్ఠమానో భీధ్యాయన్‌ తంతం వికారం సృజతీతి సందేహే ఉచ్యతే. తదభిధ్యానాత్‌-ఏవ-తు = తస్య = పరమేశ్వరస్య. అభిధ్యానం = తత్తత్కార్యవిషయక మీక్షణం-కామనాదిరూపం-తస్మాదభిధ్యానా దేవ తత్తత్కార్యం జాయతే - పరమేశ్వర ఏవ తత్తద్భూతా న్యధిష్ఠాయ ఈక్షణాద్యాత్మకాభిధ్యానా త్తత్త త్కార్యం సృజతీత్యర్ధః - అతః సః = పరమేశ్వర ఏవ సాక్షా త్కర్తా - నతు వియదాదీని స్వస్వకార్యాణాం వాయ్వాదీనాం కర్తౄణి- కస్మాత్‌? తల్లింగాత్‌ = ''యః పృథివ్యాం తిష్ఠన్‌ - యః పృథివ్యా అన్తరః యమయతి'' ఇత్యాద్యన్తర్యామి బ్రాహ్మణాదిషు పరమేశ్వర సై#్యవ వియదాది ప్రవర్తకత్త్వ లింగదర్శనా దితి -

వివరణము:- ఇప్పుడు ఆకాశము మొదలగు మహాభూతములుల స్వచముగ స్వకార్యములగు భౌతికపదార్థములను (గిరి- నదీ- సముద్ర- ఘటపటాదికములను) సృజించుచున్నవా? లేక ఆయా స్వరూపముతో నుండి పరమేశ్వరుడే సంకల్పపూర్వకముగ నాయా వికారములను (కార్యములను) సృజించుచున్నాడా అను సందేహము రాగా చెప్పబడుచున్నది.

ఆ పరమేశ్వరునియొక్క ఆయా కార్యములను గురించిన సంకల్పేచ్ఛాది రూపమగు ఈ క్షణము = అభిధ్యానమువలన ఆయా కార్యములుత్పన్నమగుచున్నవి. అనగా పరమేశ్వరుడే ఆయా ఆకాశ వాయ్వాది భూతముల నధిష్ఠించి ఈ క్షణాది రూపాభిధ్యానము చేసి ఆయా భౌతికరూప కార్యములను సృజించుచున్నాడని యర్ధము. కనుక నా పరమేశ్వరుడే సర్వకార్యములను గురించి సాక్షాత్తుగ కర్తగాని ఆకాశాదులు మాత్రము తమ కార్యములగు భౌతికములనుగూర్చి కర్తలు కాదు. కారణమేమియన ? ''యః పృథివ్యాం తిష్ఠన్‌...యమయతి'' ఎవడు పృథివియందున్నవాడై- పృధివికి అంతరుడై యుండెనో -ఎవనికి పృథివిశరీరమో- ఎవనిని పృథివి తెలిసికొనలేనిదియై యున్నదో ఎవ్వడుపృథివికి అంతరుడైయుండి పృథివిని నియమించుచున్నవాడో అతడే అన్తర్యామి. అతడే నీ ఆత్మ. అమృత స్వరూపుడు అని వర్ణించు అంతర్యామి బ్రాహ్మణము మొదలగు శ్రుతులయందు పరమేశ్వరునకే వియదాది సమస్త ప్రవర్తకత్వము కలదని సూచించు ప్రమాణములు కానవచ్చుచున్నవి కనుక నని తెలియదగును.

విపర్యయాధి కరణమ్‌ 8

14 సూ : విపర్యయేణతు క్రమోత ఉపపద్యతేచ

వివృతిః :- భూతానా ముత్పత్తిక్రమం నిరూప్యేదానీం లయక్రమం నిరూపయన్తి - ఉత్పత్తౌయః క్రమ స్స ఏవక్రమః లయేపి యోదనీయ స్సిద్ధత్వా త్తస్య - నవ్యస్య కల్పనే గౌరవాచ్చేత్యత ఉచ్యతే- క్రమః-తు = కార్యజాతస్య లయేక్రమస్తు అతః = ''ఆత్మన ఆకాశ స్సంభూతః'' ఇత్యాది శ్రుత్యుక్తా దుత్పత్తిక్రమాత్‌ విపర్యయేణ = వైపరీత్యం నైవేత్యాస్ధేయః - యేన క్రమేమ సోపానపంక్తి మారూఢ స్తతోవిపరీతక్రమే ణావరోహ తీతి ప్రసిద్ధం లోకే తస్మాత్‌ - పృథివీరూపం కార్యం స్వకారణ అఫ్సు లీయతే - తధా ఆపశ్చ స్వకారణ తేజసి లీయన్తే - ఇత్యేవం తత్తత్కార్యం తత్తత్కారణ లీయతే - ఏవంభూతో లయక్రమ ఇతి నిశ్చీయతే - కారణ స్థితే ఏవ కార్యవినాశస్య లోకే దృశ్యమానత్వాత్‌- కారణనాశా త్కాక్యనాశ ఇతి నోపపద్యత ఏవ -

వివరణము :- భూతములయొక్క ఉత్పత్తి క్రమమును నిరూపించియిపుడు లయక్రమమును నిరూపించుచున్నారు. ఉత్పత్తికి సంబంధించిన క్రమమునే లయమునందును యోజన చేయవచ్చును. నూతనమగు క్రమమును కల్పించుట గౌరవము (అదికశ్రమావహము) కాదా ? అని యనగా చెప్పబడుచున్నది.

సమస్త కార్యజాతము యొక్క లయమునకు సంబంధించిన క్రమము ''ఆత్మన ఆకాశ స్సంభూతః'' ఇత్యాది శ్రుతివాక్యోక్తమగు ఉత్పత్తి క్రమమునకు విపరీతమైనది యని తెలియదగును. సౌధోపరి తలము నధిష్టించుటకు ఏ క్రమముతో మెట్లను ఎక్కిపోవునో అటనుండి అవరోహించుటకు వెనుకటి క్రమమునకు విపరీతమగు క్రమముతో ఆ మెట్లనుండి దిగవలయు ననునది లోకమున ప్రసిద్ధమేకదా! కాన పృథివీ రూపమగు కార్యము స్వకారణమగు జలములయందు లయించును. జలములును తత్కారణమగు తేజస్సునందు లయించును. ఇట్లు తత్తత్కార్యములు స్వస్వకారణములయందు లయించుచుండును. ఇట్టిది లయక్రమమని నిశ్చయింపబడుచున్నది. ఇంతియేగాని కారణ నాశమువలన కార్యనాశముఅని కొందరు నిర్ణయించు లయవిధానము యుక్తముకాదు. కారణము స్వస్వరూపముతో నిలబడియుండగనే తత్కార్యము స్వకారణమునందు లయించిపోవుచుండుట లోకమున చూడబడుచున్నది గనుక -

అంతరా విజ్ఞానాధికరణమ్‌ 9

15. సూ: అంతరా విజ్ఞానమనసీ క్రమేమ తల్లింగా

దితిచేన్నానవిశేషాత్‌

వివృతిః :- భూతానా ముత్పత్తి ప్రళ¸° క్రమవ్యుత్ర్కమాభ్యాం భవత ఇతి నిరూపితం. తత స్సర్వస్య కార్య స్యోత్పత్తి ర్వా ప్రళయో వా ఆత్మా వధి రితి సిద్ధం. అథేదానీం బుద్ధిమనసో రుత్పత్తి శ్చిన్త్యతే- విజ్ఞానమనసీ = విజ్ఞానం మనశ్చ విజ్ఞానమనసీ = విజ్ఞానశ##బ్దేన బుద్ధి రింద్రియాణి చకరణవ్యుత్పత్యా గృహ్యన్తే - యద్వా జహల్లక్షణ యాన్తః కరణాశ్రయః ప్రాణో గృహ్యతే - మనశ్శబ్దేన సంశయవృత్తిక మన్తః కరణం గృహ్యతే - యద్వా జహల్లక్షణయా సేంద్రియం మనోగృహ్యతే- (తాని బుద్ధీంద్రియమనాంసి)తే విజ్ఞానమనసీ ద్వే అపి అంతరా = అత్మాకాశయో రన్తరాళే - క్రమేణ = క్రమా జ్ఞాయేతే ఇతి వక్తవ్యం - కుతః ? తల్లింగాత్‌ = తాదృశార్ధప్రతిపాదకాత్‌- ''ఏతస్మా జ్ఞాయతే ప్రాణో మన స్సర్వేంద్రియామి చ ఖం వాయుః'' ఇత్యాది పాఠక్రమరూపాల్లింగాత్‌ - ఇతి - చేత్‌ - ఇతి యద్యుచ్యేత్‌ - తర్హి న = తన్నోపపద్యతే - కుతః ? అవిషాత్‌ = అన్నమయగా హి సోమ్య మనః - ఇత్యాది శ్రుత్యా మన ఆదీనా మిన్ద్రియాణాం భౌతికత్వప్రతీతే ర్భూతోత్పత్యైవ తేషా ముత్పన్నత్వేన విశిష్య కథనాయోగాత్‌ యేన క్రమేణ భూతనా ముత్పత్తి స్తేనైవ క్రమేణ భౌతికానా మప్యుత్పత్తి రితి ప్రతిపత్తవ్యం- (''అన్నమయగ్‌ం హి సోమ్య మనః....'' ఇత్యాదినా మన ఆదీనాం భౌతికత్వావగమాత్‌ భూతే ష్వేవాన్తర్భావా న్న పృథక్ర్కమా పేక్షా తత్రాన్వేషణీయా) ''ఏతస్మా జ్ఞాయతే ప్రాణో మనస్సరేంద్రియాణి....'' ఇత్యాది శ్రుతిస్తు సర్వేషా మాత్మన స్సకాశా దుత్పత్తిం పరం ప్రతిపాదయత్తి, నక్రమం - తత్ర మనః ప్రాణాదీనాం ప్రథగామ్నానం తు బ్రాహ్మణపరి వ్రాజకన్యాయే నేత్యేవ మవగన్తవ్యం -

వివరణము:- ఆకాశాది భూతములయొక్క ఉత్పత్తి క్రమస్వరూపమును, దానికి విపరీతమైన ప్రళయక్రమమును నిరూపింపబడినది ఇట్లు నిరూపించుటతో కార్యజాతముయొక్క ఉత్పత్తియు- ప్రళయమును ఆత్మావధికమే అని సిద్ధించినది. ఇప్పుడు బుద్ధి, మనస్సులయొక్క ఉత్పత్తి విచారింపబడుచున్నది.

విజ్ఞానశబ్దమునకు బుద్ధియు, ఇంద్రియములును - అథవా - ప్రాణములు అని యర్ధము. మనశ్శబ్దమునకు సంశయాత్మక వృత్తితోగూడిన అంతఃకరణము - అథవా ఇంద్రియసహితమైన మనస్సు అని యర్థము. ఈ విజ్ఞాన మనస్సులు (బుద్ధి- ఇంద్రియములు - మనస్సు) అను రెండును ఆత్మాకాశములయొక్క అంతరాళమున (నడుమను) క్రమముగా పుట్టుచున్నవి, యని చెప్పవలయును. ఏలయన? అట్టి అర్ధమును ప్రతిపాదించు "ఏతస్మాజ్జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ| ఖం వాయుః'' ఈ బ్రహ్మాభిన్నమగు ఆత్మతత్త్వమునుండి ప్రాణము - మనస్సు - సర్వేంద్రియములు - ఆకాశము - వాయువు. ఇత్యాదులన్నియు పుట్టుచున్నవి యని సృష్టి ప్రతిపాదక వాక్యములో గోచరించుచున్న పాఠ క్రమ మను లింగమునుబట్టి యిట్లు చెప్పవలయును, అని యనుట తగదు. ఏలయన ? ''అన్నమయగ్‌ం హి సౌమ్యమనః'' ఇత్యాదిశ్రుతులలో మనస్సు మొదలగు ఇంద్రియములకు భౌతికత్వము ప్రతిపాదింపబడి యుండుట వలన భూతములయొక్క ఉత్పత్తిచేతనే భౌతికములైన ఇంద్రియాదుల ఉత్పత్తియు సిద్ధమగుటచేత వానియొక్క ఉత్పత్తిక్రమమును గూర్చి విశేషించిచెప్పనవసరముండదు. భూతములయొక్క ఉత్పత్తియే క్రమము కలదియో భౌతికములయొక్క ఉత్పత్తి క్రమమును నదియే అని తెలియదగును - ''ఏతస్మా జ్జాయతే....'' అను నీ శ్రుతివాక్యము సమస్త పదార్ధములను ఆత్మనుండియే పుట్టుచున్నవని బోధించుటకై ప్రవృత్తమైనది గాని యా పదార్ధముల ఉత్పత్తి క్రమమును బోధించుటకు గాదు. మనఃప్రాణాదులు భౌతికములో యగుచో ''ఏతస్మాతే....'' అను శ్రుతివాక్యములో భూతములకంటె వేరుగ నవియేల పఠింపబడినవి యనిన ప్రాధాన్యమును సూచించుటకై బ్రాహ్మణ పరివ్రాజక న్యాయము ననుసరించి యట్లు పఠింపబడినవి యని గుర్తింపవలయును.

చరాచరవ్య పాశ్రయాధి కరణమ్‌ 10

16. సూ : చరాచరవ్యపాశ్రయస్తుస్యా త్తద్వ్యపదేశో

భాక్త స్తద్భావభావిత్వాత్‌

వివృతిః :- భూతానాం భౌతికానాం చోత్పత్తిప్రళయా వేతావతా సప్రపంచం నిరూపితౌ - ఇత ఉత్తరం యదవధికౌ తౌ త్యస్యాత్మన ఉత్పత్తిప్రళ¸°స్తో నవేతి విచార్యతే, త్వం పదార్ధశోధనాయ తద్వ్యవ దేశః - తు = తయోర్జన్మమరణయో స్తస్మిన్‌ జీవే వ్యపదేశః=నిర్దేశః, దేవదత్తో జాతో - యజ్ఞదత్తో మృత ఇత్యాదివ్యవహారసిద్ధః చరాచరవ్యపా శ్రయః - స్యాత్‌ = స్ధావరజంగమ శరీరవిషయక ఏవ భ##వేత్‌ - న జీవ స్వరూపవిషయకః. అత ఏవ - భాక్తః = స నిర్దేశః జీవే గౌణ ఇత్యేవ ప్రతిపత్తవ్యః - కుతః ? తద్భావభావిత్వాత్‌ = తస్య = శరీరస్య - భావే = ప్రాదుర్భావే, తిరోభావే చ జన్మమరణశబ్దయోః భావిత్వాత్‌ = వ్రవృత్త త్వాత్‌. నహి దేహసంబన్ధమన్తరా జీవః కేనచిదపి గృహ్యమాణో భవన్తి.

వివరణము :- భూతభౌతికములయొక్క ఉత్పత్తి ప్రళయములు గడచిన గ్రంథములో విచారింపబడినవి. ఇప్పుడు ఉత్పత్తి ప్రళయములకు అవధిభూతమగు ఆత్మకు ఉత్పత్తి ప్రళయములు కలవా ? లేవా ? అని విచారణ చేయబడుచున్నది. (మహావాక్యాంతర్గతమగు త్వం పదమునకు అర్థమైన జీవాత్మ తత్త్వమును శోధనము చేయుట కీ విచార ముపయోగ పడగలదు.

దేవదత్తుడు పుట్టెను - యజ్ఞదత్తుడు మరణించెను - అను లోక వ్యవహారములలోని జీవాత్మకు సంబంధించినవిగా జేయబడు జన్మమరణ ములయెక్క నిర్దేశములు - స్థావర జంగమాత్మకములగు శరీరములకు సంబంధించినవియే గాని జీవాత్మకు సంబంధించినవి కావు. కాననే ఆ నిర్దేశములు జీవునియందు గౌణములని గుర్తింపవలయును. అనగా ఆ నిర్దేశసిద్దములగు జననమరణములు జీవాత్మకు ఉపాధియగు శరీరమునకు సంబంధించినవియై యుండగా శరీరోపహితుడగు ఆత్మకు సంబంధించినవిగా వ్యవహరింపబడుచున్నవి యని అర్ధము. ఏలయన ? ఆ శరీరము ప్రాదుర్భవించినప్పుడును - తిరోహితమైనప్పుడును జన్మరణ శబ్దములు ప్రవృత్తము లగుచున్నవి = వాడబడుచున్నవి గనుక శరీర సంబంధములేక ఎవ్వనిచేతను ఆత్మ ఎన్నడును గ్రహింపబడుట లేదు గదా !

ఆత్మాధి కరణమ్‌ 11

17. సూ : నాత్మాశ్రుతేర్నిత్యత్వాచ్చ తాభ్యః

వివృతిః :- జీవ స్యోత్పత్తివినాశౌ ముఖ్యా వేవ భ##వేతాం - నగౌణౌ- ''యథా7గ్నే ర్విస్ఫులింగా వ్యుచ్చరన్త్యేవ మే వైతస్మా దాత్మన స్సర్వే ప్రాణా స్సర్వేలోకా స్సర్వేదేవా స్సర్వాణి భూతాని సర్వ ఏతే ఆత్మానో వ్యుచ్చరన్తి'' ''యథా సుదీప్తాత్‌ పావకా ద్విస్ఫులింగా స్సహస్రశః ప్రభవన్తే సరూపాః| తథాక్షరా ద్వివిధా స్సోమ్య భావాః ప్రజాయంతే తత్రచైవాపియన్తి'' ఇత్యాదిశ్రుతిషు జీవాత్మనాం ఉత్పత్తిప్రళయయోః ప్రతిపాదితత్వాత్‌ - అత్రోచ్యతే - ఆత్మా = జీవః న = నోత్పత్యతే - కుతః ? అశ్రుతేః = శ్రుతౌ ఉత్పత్తిప్రకరణషు క్వాపి జీవోత్పత్తేరశ్రూయ మాణత్వాత్‌ - కించ తాభ్యః ''అజో నిత్య శ్శాశ్వతో7యం పురాణః'' ''న జాయతే మ్రియతే వా విపశ్చిత్‌'' ఇత్యాది నిత్యత్వప్రతిపాదక శ్రుతిభ్యః నిత్యత్వాత్‌ - చ = నిత్యత్వావగమా చ్చ - పూర్వోదాహృత శ్రుతయ స్తు జీవాత్మనా మౌపాధిక జన్మల¸° ప్రతిపాదయన్తీతి న శ్రుతీ నాం పరస్పరవిరోధః - ఆత్మనాం ముఖ్యజన్మ నాశాంగీకారే కృతహానా కృతాభ్యాగమ దౌషౌ ప్రసజ్యేయాతాం -

వివరణము :- జీవునికి ఉత్పత్తి వినాశములు ముఖ్యములే యగును. గౌణములు కావు - ఏలయన ? ''యథాగ్నేర్విస్ఫులింగా..... వ్యుచ్చరన్తి'' అగ్నినుండి మిణుగురు లెట్లుత్పన్నము లగుచున్నవో అట్లే పరమాత్మ నుండి సమస్తములగు ప్రాణములు - లోకములు - దేవతలు - భూతములు- ఈ జీవాత్మలును ఉద్భవించుచున్నారు అను వాక్యములోను- అట్లే ''యథా సుదీప్తా త్పావకా ద్విస్ఫులింగా స్సహస్రశః ప్రభవన్తే సరూపా స్తథాక్షరా ద్వివిధా సౌమ్య భావాః ప్రజాయన్తే తత్ర చైవాయన్తి'' బాగుగా జ్వలించుచున్న అగ్నినుండి వేలసంఖ్యలతో తదగ్ని సమానరూపములగు మిణు గురులు పుట్టుచున్నట్లు అక్షర స్వరూపమగు పరమాత్మనుండి చైతన్యస్వభావముతో తత్సరూపులును శరీర సంబంధమున వివిధ స్వరూపులునునగు జీవులు పుట్టుచున్నారు. తిరిగి అచటనే లయమునుగూడ పొందుచున్నారు అను వాక్యము మొదలగు వాక్యములలో జీవాత్మలకు ఉత్పత్తి ప్రళయములు ప్రతిపాదింపబడుచున్నవి గనుక. ఇట్టి వాదముపై చెప్పబడుచున్నది.

జీవాత్మ ఉత్పత్తిని పొందుటలేదు. ఏలయన ? శ్రుతులయందలి ఉత్పత్తిని వర్ణించు ప్రకరణములలో ఎచటను జీవోత్పత్తి వర్ణింపబడలేదు గనుక - మరియు ''అజో నిత్య శ్శాశ్వతో7యం పురాణః''- ఈ ఆత్మపుట్టుకలేనివాడు - నిత్యుడు - ఎల్లప్పుడు నుండువాడు. ప్రాచీనమైనవాడు- ''న జాయతే మ్రియతే వా విపశ్చిత్‌'' ఆత్మ పుట్టుటలేదు- మరణించుట లేదు - సర్వజ్ఞుడు. ఈ మొదలగు నిత్యత్వమును ప్రతిపాదించు శ్రుతులను బట్టి జీవాత్మకు నిత్యత్వ మవగతమగుచున్నది గనుకనున్నూ- పూర్వ ముదహరింపబడిన జీవోత్పత్తి ప్రళయ ప్రతిపాదకమైన శ్రుతులు జీవులయొక్క జన్మలయములను ప్రతిపాదించుచున్నవి కావనియు జీవోపాధులగు దేహాదులకు సంబంధించిన జ న్మలయములను ప్రతిపాదించుచున్న వనియును తెలియదగును. ఇట్లు చెప్పుటచే శ్రుతివాక్యములకు పరస్పర విరోధమును తొలగిపోగలదు, ఇట్లుగాక జీవాత్మలకే జన్మలయములు ముఖ్యముగ కలవని చెప్పిన కృతహానా కృతాభ్యాగమ దోషములును ప్రసక్తములు కాగలవు.

[జీవుడు అనిత్యుడు, మరణించువాడని యన్నచో అతడు జీవించియుండగా జేసిన కర్మలయొక్క ఫలముల కాశ్రయము (అనుభవించువాడు) లేదు గాన నాతనిచే కృతమైన అనుష్టింపబడిన కర్మలకు హానము = వైయర్ధ్యము వచ్చును. ఇది కృతహానము అను దోషము - నూతనముగ పుట్టునని చెప్పుచో తనచే అకృతములైన = అనుష్ఠింపబడని కర్మలకు సంబంధించిన ఫలములయొక్క అభ్యాగమము = ఆగమము అనగా అనుభువము సంక్రమించవలసివచ్చును. ఇది అక్రతాభ్యాగమము అను దోషము.]

జ్ఞాధికరణమ్‌ 12

18. సూ: జ్ఞోత ఏవ

వివృతిః :- ఆత్మనో నిత్యత్వ మభిదాయ చిద్రూపత్వం నిర్ధారయితు మిద ముచ్యతే - జ్ఞః = అయం జీవాత్మా జ్ఞానస్వరూప ఏవ - కుతః ? అతః - ఏవ =''ప్రజ్ఞానఘన ఏవ - '' ''ద్రుష్టుర్త్రష్టే ర్విపరిలోపో విద్యతే'' ఇత్యాది శ్రుతిబలా దేవ

వివరణము:- ఆత్మ నిత్యము అని నిరూపించి చిద్రూపము అనియు నిర్ధారణ చేయబడుచున్నది- ఈ జీవాత్మ చిద్రూపుడు = జ్ఞానస్వరూపుడు. ఏలయన? ''ప్రజ్ఞానఘన ఏవ'' ఆత్మప్రజ్ఞానఘనుడు. ''నహి ద్రష్టుర్ద్రష్టే ర్విపరిలోపో విద్యతే '' ద్రష్టయగు జీవాత్మకు స్వరూపమగు ద్రష్టికి = జ్ఞానమునకు నాశముండదు. ఇత్యాది శ్రుతులు ఆత్మకు చిద్రూపత్వమును స్పష్టముగ ప్రతిపాదించుచున్నవి గనుక.

ఉత్క్రాన్త్యధి కరణమ్‌ 13

19. సూ: ఉత్ర్కాన్తి గత్యాగతీనాం

వివృతిః :- జీవస్య నిత్యత్వ - చిద్రూపత్వే ప్రసాధ్య పరిమాణం విచారయతి - ఉత్ర్కాన్తిగత్యాగతీనాం = ఉత్ర్కాన్త్యాదీనాం శ్రవణాత్‌. ''సయదా అస్మా చ్ఛరీరా దుత్ర్కామతి'' ఇతి శ్రుతా వుత్ర్కాన్తి శ్రుతా- ''చంద్రమస మేవ తే సర్వే గచ్ఛన్తి'' ఇతి శ్రుతౌ గతి శ్శ్రతా- ''తస్మా ల్లోకా త్పున రేత్యసై#్య లోకాయ కర్మణ'' ఇతి శ్రుతౌ ఆగతి శ్శ్రుతా. ఏవం శ్రుతిషు జీవ స్యోత్క్రాన్తేర్గతే రాగతే శ్చోపలభ్యమానత్వాత్‌, జీవోణుపరిమాణ ఏవేతి ప్రతిపత్తవ్యం-విభుత్వే తు ఉత్ర్కాన్త్యాదే రసంభవః - మధ్యమపరిమాణత్వే అనిత్యత్వ ప్రసంగః- ఇతి-

వివరణము :- జీవుడు నిత్యుడు. జ్ఞానమే స్వరూపముగా కలవాడు అని నిర్ధరించి ఆతని పరిమాణమునుగూర్చి చర్చించుచున్నారు. ''సయదాఅస్మాచ్ఛరీరాదుత్ర్కామతి'' ఆజీవుడీ దేహమునుండియెప్పుడు త్ర్కాంతి పొందునో అని చెప్పుచు ఈ శ్రుతి జీవున కుత్క్రాంతిని వర్ణించినది. ఉత్క్రాంతి యనగా దేహమును వీడిపోవుట. ''చంద్రమస మేవ తే సర్వేగచ్ఛన్తి'' ఆ జీవులందరు చంద్రలోకమునుగూర్చి వెళ్ళుచున్నారు అనిచెప్పుచు ఈ శ్రుతి జీవాత్మకు గతిని = గమనమును వర్ణించినది. ''తస్మాల్లోక త్పున రేత్యసై#్మ లోకాయ కర్మణ'' కర్మఫలభూతమగు నా లోకమునుండి తిరిగి కర్మానుష్ఠానముకొరకు యీ లోకమునకు జీవుడు వచ్చుచున్నాడు అని చెప్పుచు ఈ శ్రుతి జీవాత్మకు ఆగతిని = ఆగమనమును వర్ణించినది. ఇట్లు శ్రుతులలో ఉత్క్రాంతి గత్యాగతుల వర్ణింపబడియుండుటచే జీవు డణుపరిమాణము కలవాడని నిర్ణయించవలయును. జీవుడు విభువు (సర్వవ్యాపకుడు - పరమమహత్పరిమాణము కలవాడు) అని యనుచో అట్టి ఆత్మకు విభువులగు ఆకాశాదులకువలె చలనరూపములగు ఉత్ర్కాంత్యాదులు సంభవించనేరవు. అణుపరిమాణముకాక, మహాపరి మాణముకాక మధ్యమ పరిమాణము కలవాడన్నచో మధ్యమ పరిమాణముగల ఘటాదులకు వలె అనిత్యత్వముసిద్ధించును. కాన జీవుడణు పరిమాణము కలవాడే అని నిర్ణయింపదగును.

20. సూ : స్వాత్మనా చోత్తరయోః

వివృతిః:- యద్య వ్యుత్ర్కాన్తిశబ్దస్య దేహస్వామ్య నివృత్తి రర్ధఇతి; అచలత్యపి జీవే. తస్య విభుత్వేపి దేహస్వామ్యనివృత్యా ఉత్ర్కాన్తి వ్యవహార ఉపపద్యత ఏవేతి వక్తుం శక్యతే - అథాపి ఉత్తరయోః = గత్యా గత్యోః - గమనక్రియాకర్తు రుత్తర పూర్వదేశ సంయోగవాచినో రచలతి కర్త ర్యసంభవత్యోః - స్వాత్మనా - చ = జీవాత్మనైవ సంబంధా దణు రేవ జీవ ఇతి -

వివరణము :- ఉత్క్రాంతి శబ్దమునకు దేహమునందు గల స్వామిత్వము యాజమాన్యము వదిలిపోవుట అను అర్ధమును స్వీకరించి జీవాత్మ చలింపకున్నను అట్టి ఉత్ర్కాంతి సంభవించ వచ్చునన్ననూ - గతి. ఆగతులు రెండును అట్లు కానేరవు. ఈ రెండు శబ్దములును ఒక స్థానమున నున్నవానికి తదుత్తరపూర్వదేశ సంయోగమును కలిగించుచలన రూప క్రియలను బోధించు స్వభావము కలవి. వానికి జీవాత్మతోడ సంబంధము పూర్వోక్తశ్రుతులలో కానవచ్చు చుండుటచేత ఆత్మ చలించువాడనియు. కాననే అణుస్వరూపుడనియును గ్రహింపదగును.

21. సూ: నాణు రతచ్ఛ్రుతే రితి చే న్నేతరాధికారాత్‌

వివృతిః :- అతచ్ఛ్రుతేః = తచ్ఛబ్దోత్ర అణుత్వవాచీ - న తత్‌ = అణుత్వవిపరీతం మహాత్వం = అతత్‌ - తస్యశ్రుతిః =మహాత్వప్రతి పాదకా శ్రుతిః = అతచ్ఛ్రుతిః ''సవా ఏష మహా నజ ఆత్మా...'' ఇత్యాదిః - తస్యా శ్శ్రుతేః ఆత్మనః అణుత్వవిపరీత మహత్పరిమాణ శ్రవణాత్‌ - న - అణుః = ఆత్మా అణుపరిమాణో న భవతి - ఇతి- చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ - న =న తథా వక్తుం శక్యతే - కుతః ? ఇతరాధికారాత్‌ = తస్యాశ్శ్రుతే రితరస్య జీవాత్మాపేక్షయాన్యస్య పరమాత్మనః ప్రకరణ పరిపఠితత్వాత్‌. తస్మా జ్జీవాత్మా అణు రిత్యస్య న కాపి క్షతిః.

వివరణము:- ''స వా ఏష మహా నజ ఆత్మా'' ఆ ఆత్మ ఉత్పత్తి లేనివాడు - మహత్పరిమాణము కలవాడు - అని వర్ణించుచున్న ఈ శ్రుతిని బట్టి ఆత్మ అణు పరిమాణము కలవాడు కాదు, తద్విపరీతమగు మహత్పరిమాణము కలవాడని యనుటయు తగదు. ఏలయన - ఈ శ్శ్రుతివాక్యము జీవాత్మ ప్రకరణములో కాక పరమాత్మ ప్రకరణములో పఠింపబడినది గనుక. కాన జీవాత్మ అణుపరిమాణము కలవాడే అని అనుటలో దోషమేమియును లేదు.

22. సూ: స్వశబ్దోన్మానాభ్యాం చ

వివృతిః :-= కించ - స్వశబ్దోన్మానాభ్యాం = స్వశబ్దః = ''ఏషోణు రాత్మా చేతసా వేదితవ్యః '' ఇతి ఆత్మన స్సాక్షా దణుత్వప్రతి పాదికా శ్రుతిః ఉన్మానం =

ఉద్ధృత్యమానం అత్యన్తాల్పత్వం ''ఆరాగ్రమాత్రో హ్యవరోపి దృష్టః'' ఇత్యున్మాన ప్రతిపాదికా శ్శుతిః - తాభ్యాం జీవాత్మా అణు రేవే త్యవగమ్యతే.

వివరణము:- ''ఏషోణు రాత్మా చేతసా వేదితవ్యః'' ఈ యాత్మ అణుస్వరూపుడు - సంస్కరింపబడిన సూక్ష్మర్థగ్రాహియగు చిత్తముతో తెలిసికొన దగినవాడు అని వర్ణించు ఈ శ్రుతి సాక్షాత్తుగ ఆత్మకు అణుత్వమును ప్రతిపాదించుచున్నది. ఈశ్శ్రుతిని సూత్రములోని స్వశబ్దము బోధించుచున్నది. ఉన్మానమనగా అత్యన్తాల్పత్వము ''ఆరాగ్రమాత్రోహ్యవరోపి దృష్టః'' ఆత్మ ముల్లుకర్రయొక్క చిగురుభాగమున గల ముల్లు కొసకంటె సూక్ష్మమైనవాడు అని = అత్యంతాపకృష్ట పరిమాణము కలవాడని వర్ణించు శ్రుతి ఉన్మానశ్రుతి - ఈ స్వశబ్ద - ఉన్మాన శ్రుతులను బట్టి జీవాత్మ అణుపరిమాణము కలవాడనియే స్పష్టమగుచున్నది.

23. సూ : అవిరోధ శ్చందనవత్‌

వివృతిః :- చందనవత్‌ = యథా హరిచందనబిందో రేహైకదేళస్థితస్యాపి సకలదేహవ్యా వ్యాహ్లాదకారిత్వ మేవం అవిరోధః = అణో రపిజీవస్య దేహైకదేశ స్థితస్యాపి సకలదేహగత సుఖాదిజ్ఞానే విరోధాభావః -

వివరణము :- అత్మ అణువైనచో సకల శరీరమును వ్యాపించి సుఖదుఃఖాద్యనుభూతి (సుఖదుఃఖాది జ్ఞానము) ఎట్లు కలుగునను అశంకకు సమాధానము - మంచి గంధపుచుక్క శరీరమున నొక్కచోటనే ఉన్ననూ శరీరమున కంతకును ఆహ్లాదమును కలిగించుటలేదా అట్లే అణువైన జీవుడు శరీరమున నేదో ఒకభాగములో నున్నను సకల శరీరగత సుఖాదిజ్ఞానమును కలిగించవచ్చును. విరోధమేమియును నుండదు.

24. సూ : అవస్థితి వైశేష్యా దితిచే న్నాభ్యుపగమాద్ధృది హి

వివృతిః :- పూర్వం చందనబిందు దృష్టాన్తే నాణోరపి సతో జీవస్య సకలదేహవ్యాపి సుఖదుఃఖానుభూతి రవిరుద్ధేతి ప్రతిపాదితం - అత్రద్ద్రష్టాన్తే వైషమ్య మాశంక్య ప్రతిక్షపతి - అవస్ధితివైశేష్యాత్‌ = చందనబిందోర్దేహైకదేశావస్ధానస్య విశేషతో దృష్టత్వాత్‌ సర్వాంగీణాహ్లాదకారిత్వ కల్పనా యుక్తా - జీవస్య తు దేహైకదేశావస్థాన స్యాప్రత్యక్షత్యా త్సర్వశరీరగత సుఖాదిజ్ఞానకల్పనా న యుక్తా - ఇతి చేత్‌ =ఇత్యుచ్యతే చేత్‌ - న =తథా వక్తుం న శక్యతే కుతః? హృది హి = ''హృది హ్యేష ఆత్మా'' ఇత్యాది శ్శ్రుతిభ్యో జీవస్యాపి దేహైకదేశభూత హృదయ పుండరీక వర్తిత్వస్య - అభ్యువగమాత్‌ = అంగీకృతత్వాత్‌ - న దృష్టాన్త, దార్‌ష్టాం తికయో ర్వైషమ్యం - తస్మాదణు రేవజీవః -

వివరణము :- చందనబిందువును = మంచిగంధపుచుక్కను దృష్టాంతముగా నిచ్చి జీవుడణు రూపుడే ఐనను సకలదేహవ్యాపి దుఃఖానుభవమును కలిగించు ననుటలో విరోధము లేదని ప్రతిపాదింపబడినది. కాని యీ దృష్టాంతము చసరియైనది కాదు; విషమము అని ఆక్షేపించి సమాధాన మిట చెప్పబడుచున్నిది.- చందనబిందువు దేహమున నొక స్థానముననే కలదు; అంతటలేదు అని విశేషముగ - స్పష్టముగ - ప్రత్యక్షముగ చూడబడుచున్నది గాన తదనుగుణముగ సర్వాంగవ్యాపి, ఆహ్లాదికారిత్వము కల్పింపబడుట అచట యుక్తమే కాని జీవుడు దేహైక దేశములో - దేహమున నొక భాగములోనే ఉన్నాడు కాని సర్వత్ర - దేహమునందంతట లేడని విశేష ప్రత్యక్షములేదు కాన నా అణురూపుడగు జీవునకు సర్వదేహవ్యాపి సుఖాదిజ్ఞాన కల్పనము యుక్తముకాదు అనియనుట పొసగదు. ఏలయన? ''హృది హ్యేష ఆత్మా'' ఈ జీవాత్మ హృదయమునందుండెను అని వర్ణించుచున్న ఇట్టి శ్రుతి వాక్యములవలన దేహైకదేశమగుహృదయపుడరీకమున జీవునియునికి అంగీకరింపబడినది. కనుక దృష్టాంత దార్‌ష్ఠాంతికములకు వైషమ్యములేదు. కాన జీవుడణు పరిమాణము కలవాడే యని నిర్ణయము.

25. సూ : గుణాద్వా లోకవత్‌

వివృతిః :- వా = యద్వా - గుణాత్‌ = అణోరపి నతో జీవస్య వ్యాపకా త్సంకోచవికాసశీలా చ్చైతన్యగుణాత్‌ - సకలశరీరవ్యాపి కార్యముత్పద్యత ఇత్యత్ర న కోపి విరోధః - కథం? లోకవత్‌ = యథాలోకే మణిప్రదీపాదీనాం గేహైకదేశావస్థితానా మల్పత్వేపి స్వప్రభాత్మక గుణవశా త్సకలగేహం వ్యాప్య ప్రకాశకరణం దృశ్యతే - తద్వదితి.

వివరణము :- జీవు డణు పరిమాణుము కలవాడే ఐనను వ్యాపకమగు సంకోయప వికాస స్వభావము కలిగిన చైతన్యగుణమునుబట్టి సమస్త దేహమును వ్యాపించిన సుఖాద్యనుభవ రూపమగు కార్యము పుట్టు ననుటలో విరోధమేమియు నుండదు. ఎట్లనిన లోకమునందు మణిదీపము - సొదలగునవి గృహముయొక్క ఒకప్రదేశములో నున్నవియు - అల్పమైనవియు నైనను వానియొక్క ప్రభయనుగుణమునుబట్టి గృహమునంతను వ్యాపించిన ప్రకాశమును కలిగించుచుండుట ఎట్లు కానవచ్చుచున్నదో అట్లే అని తెలియదగును.

26 సూ : వ్యతిరేకో గన్ధవత్‌

వివృతిః :- పటాదే ర్గుణి నోన్యత్ర గుణస్య శుక్లత్వాదే ర్వృత్తి ర్యథానుపపన్నా తథా దేహైకదేశస్ధ స్యాణో ర్జీవస్య యో జ్ఞానగుణః = చైతన్యగుణ స్తస్య సకలశరీరవృత్తిత్వం నోపపద్యతే - దీపప్రభా తు ద్రవ్యమే వేత్యత్ర నోదాహరణతా ముపగచ్ఛ తీత్యత్రోచ్యతే - గంధవత్‌ = యథా గంథస్య గుణస్యాపి సతో గంథవద్ద్రవ్యా దన్యత్ర వ్యాప్తి రుపలభ్యతే. ఏవం వ్యతిరేకః = ఆత్మసంబన్ధి చైతన్యగుణ స్యాప్యాత్మనః అన్యత్ర వ్యాప్తి రుపపద్యత ఏవేతి.

వివరణము :- వస్త్రములు మొదలుగాగల ద్రద్యములయందలి శుక్లత్వ పీతత్వాది (తెలుపు-పసుపు మొదలగు) గుణములకు ఆద్రవ్యములను వదలి మరియెక స్థానమున నునిక యెట్లు ఉపపన్నముకాదో అట్లే దేహముయొక్క ఒకభాగములో నుండు అణురూపుడగు జీవునియొక్క చైతన్యగుణము శరీరమునం దంతటను వర్తించుననుటయును ఉపపన్నము కానేరదు. దీపప్రభ యనునది ద్రవ్యముగాని గుణముకాదు గనుక నీ సందర్భములో నది దృష్టాంతము కాజాలదని యనగా చెప్పబడుచున్నది - గంధమనునది గుణమే ఐనను గంధవద్ద్రవ్యమగు పుష్పాదులను వదలి స్థానాంతరమునను దానిని వ్యాప్తి యెట్లుపలభ్యమానమగు చున్నదో అట్లే ఆత్మసంబంధియగు చైతన్యగుణమునకును ఆత్మఉన్నచోటుననేగాక సర్వదేహ ప్రదేశములయందును వ్యాప్తికలదని యనుట యుక్తమే కాగలదు.

27. సూ : తథా చ ధర్శయతి

వివృతిః :- తథా - చ = ఆత్మన శ్చైతన్యగుణన సకలశరీర వ్యాపిత్వం దర్శయతి = శ్రుతి రాత్మనో హృదయాశ్రయత్వ మణుపరిమాణత్వం చాభిధాయ ''ఆలోమభ్యః - ఆనఖాగ్రేభ్యః'' ఇత్యాదినా దర్శయతి - అతః అణుత్వ మాత్మన ఉపపన్న మేవేతి -

వివరణము :- ఆత్మ హృదయము నాశ్రయించి (హృదయమున) ఉండుననియు - అణుపరిమాణము కలదియనియు వర్ణించి ''ఆలోమభ్యః - ఆనఖాగ్రేభ్యః'' రోమములవరకు - గోళ్ళ చిగురులవరకు వ్యాపించెను అని చెప్పుచు శ్రుతివాక్యము చైతన్యగుణముతో ఆత్మకు సకల శరీర వ్యాపిత్వము సంభవించునని ప్రతిపాదించుచున్నది. కాన ఆత్మ అణుపరిమాణము కలవాడని యనుట యుక్తమే.

28. సూ : పృథగుపదేశాత్‌

వివృతిః :- వృథగుపదేశాత్‌ = ''ప్రజ్ఞయా శరీరం సమారుహ్య'' ఇత్యాది శ్రుతౌ - ఆత్మన శ్శరీరసమారోహణ ప్రజ్ఞాశబ్దితస్య చైతన్యస్య కరణత్వేన, ఆత్మనః కర్త్రత్వేన చ పృథగుపదేశాత్‌ ఆత్మనో జ్ఞానాఖ్యః కశ్చిద్గుణః కరణీభూతో స్తీతి తేనైవ చ సర్వశరీరవ్యాప్తి రాత్మన స్సంభవతీతి చావగమ్యతే - తస్మాదణు రేవాత్మేతి పూర్వః పక్షః-

వివరణము:- ''ప్రజ్ఞయా శరీరం సమారుహ్య'' అనునీ శ్రుతి యందు ఆత్మ శరీరము నారోహించుటలో ప్రజ్ఞాశబ్దార్థమగు చైతన్యమును కరణము - సాధనముగాను - ఆత్మను కర్తనుగాను ఇట్లు ఆత్మ - చైతన్యములను వేరుగ వర్ణించి యుండుటచేత ఆత్మకు జ్ఞానమను = చైతన్యమను గుణము సర్వశరీరవ్యాప్తిలో సాధనముగా కలదని - తద్ద్వారా ఆత్మకు సర్వశరీరవ్యాప్తి యేర్పడుననియు తెలియబడుచున్నది. కాన జీవు డణు పరిమాణము కలవాడని యనుట యుక్తము అని పూర్వపక్షులయాశయమ్ము

29. సూ : తద్గుణసారత్వా త్తు తద్వ్యపదేశః ప్రాజ్ఞవత్‌

వివృతిః :- తద్గుణసారత్వాత్‌ = తస్యాః = బుద్ధేః గుణాః = తద్గుణాః = ఇచ్ఛా ద్వేష సుఖదుఃఖ పరిచ్చిన్నత్వాదయః - తే ఏవ సారః = ప్రధానంయస్య జీవస్య స దత్గుణసారః - తస్య భావః = తద్గుణసారత్వం తస్మాత్‌ - తద్గుణసారత్వాత్‌ = తద్గుణప్రధానత్వా దాత్మనః - తద్వ్యపదేశః = బుద్ధిగత పరిచ్ఛిన్నత్వాది వ్యపదేశః ''వాలాగ్రశతభాగస్య శతథా కల్పితస్యచ - ఇత్యాది శ్రుత్యాకల్పితః - న త్వయం వ్యపదేశ స్స్వాభావికః - ప్రాజ్ఞవత్‌ = యథా ప్రాజ్ఞస్య పరమేశ్వరస్య సగుణోపాసనేషు దహరాద్యుపాధి గుణసార త్వాత్‌ (దహరా ద్యుపాధివశాత్‌) అణీయస్త్వాదికం వ్యపదిశ్యతే దత్వత్‌ - ఆత్మ న్యల్పత్వాది (అణుత్వాది) వ్యపదేశః అనాద్య విద్యాకృత బుద్ధితాదాత్మ్యాధ్యాన నిబంధనః - ఇత్యేతత్‌ ''బుద్ధేర్గుణనాత. గుణన చైవ హ్యారాగ్రమాత్రో హ్యవరోపి దృష్టః'' ఇత్యాది శ్రుత్యై వావగమ్యతే - తతశ్చ తత్త్వమసీత్యాది శ్రుతిభ్యో జీవస్య బ్రహ్మాభేదావగమాద్యావ త్పరంబ్రహ్మ తావానేవ జీవో భవితు మర్హతి నాణుత్వ మాత్మన ఇతి సిద్ధాన్తః -

విరణము :- తద్గుణములనగా ఆ బుద్ధియొక్క గుణములని అర్థము - ఆ గుణములే ప్రధానముగా కలవాడు తద్గుణసారః అని చెప్పబడును. తద్గుణసారః అనగా జీవుడని యర్థము - ఆ బుద్ధియొక్క గుణములే ప్రధానముగా కలవాడగుటవలన ఆ గుణములతో అనగా వరిచ్ఛిన్నత్వము = స్వల్పపరిమాణము - మొదలగు గుణములతో ''వాలాగ్ర శత భాగస్య శతధా కల్పితస్య చ'' వెండ్రుక కొసలోని సూరవ వంతును నూరు భాగములుగా కల్పంచగా నెంత స్వల్పపరిమాణ మేర్పడునో అట్లు అత్యంత సూక్ష్మపరిమాణము కలవాడు ఆత్మయని కల్పించి శ్రుతివర్ణించుచున్నది. అంతియేకాని యిట్టి వర్ణనములు (ఆత్మకు గుణసంబంధవర్ణనములు) స్వాభావికములు కావు. ఎట్లన? ప్రాజ్ఞుడనగా పరమేశ్వరుడు వ పరమేశ్వరునియొక్క సగుణోపాసనములయందు దహరము మొదలగు ఉపాధులయొక్క సగుణోపాసనములయందు దహరము మొదలగు ఉపాధులయొక్క గుణములనుబట్టి అణీయస్త్వము - అత్యన్తసూక్ష్మత్వము మొదలగు గుణములెట్లు పరమేశ్వరునకు వర్ణింపబడుచున్నవో అట్లే ఆత్మకును అల్పత్వాది (అణుత్వాది) వర్ణనము అనాదికాల ప్రవృత్తమగు అవిద్యా ప్రభావము చేతనైన బుద్ధితాదాత్మ్య భ్రమమును పురస్కరించుకొని జరుగుచున్నది. ఈయంశము ''బుద్ధేర్గుణనాత్మగుణనచైవ హ్యారాగ్రమాత్రో హ్యవరోపి దృష్టః'' ఆత్మ బుద్ధ్యుపాదికుడు గాన బుద్ధిగతమగు గుణవిశేషము నిమిత్తము కాగా అగుణము ఆత్మకు సంబంధించిన గుణమే అని భ్రాంతి యేర్పడును. బ్రాంతికల్పితమగు ఆ గుణముచేతనే ఆరాగ్రమాత్రుడుగా (అపకృష్ట పరిమాణము కలవాడుగా) జీవుడు గ్రహింపబడుచున్నాడు; శుత్రులయందు వర్ణింపబడుచును నున్నాడు. అంతియేగాని ఆత్మస్వయముగ అనంతుడు; ఏ విధమైన పరిచ్ఛేదము లేనివాడు అని యర్థము; ఇట్లు కాగా ''తత్త్వ మసి'' మొదలగు శ్రుతులలో జీవాత్మకు బ్రహ్మ భేదము బోధింపబడుచుండుటవలన పరబ్రహ్మ వస్తువెంత పరిమాణము కలదియో జీవుడును అంత పరిమాణము కలవాడనుట యుక్తమగును. కాని ఆత్మ అణుపరిమాణము కలవాడనుట యుక్తము కాదు అని సిద్ధాంతము .

30 సూ : యాపదాత్మభావిత్వాచ్చ స దోష స్తద్దర్శనాత్‌

వివృతిః :- ఆత్మ న్యణుత్వాది సంసారస్య బుద్ధ్యాద్యుపాధి ప్రయుక్తత్వే కదాచి ద్బుద్ధ్యా వియోగే సంసారో న స్యా దిత్యాక్షేపే - ఉచ్యతే - దోషః = ''సంయోగా విప్రయోగాన్తా'' ఇతి న్యాయేన - తత్తాదాత్మ్యతద్ధర్మాధ్యాసహేతో ర్బుద్ధిసంయోగస్య వినాపి యత్నం వియోగావశ్యం భావత్‌ - బుద్ధివియోగే స త్యాత్మనః అసంసారిత్వ మకస్మా దేవ స్యాదిత్యయం దోషః - న = అస్మాకం మతే నైవ ప్రసరతి - కుతః? యావదాత్మభావిత్వాత్‌ = బుద్ధిసంయోగస్య యావదాత్మన స్సంసారిత్వం భవతి. (సమ్యగ్దర్శనేన యావ దావిద్యకం సంసారిత్యమస్యన నివర్తతేః) తావ ద్భావిత్వాత్‌ = బుద్ధిసంయోగస్య యావత్సంసారిత్వం మనువృత్తే స్సద్భావాత్‌ - కుత ఏత దవగమ్యత ఇతి చేత్‌ - తద్దర్శనాత్‌ = ''స సమానస్సన్నుభౌ లోకా వనుసంచరతి ధ్యాయతీవ లేలాయతీవ'' ఇత్యాది శ్రుతిదర్శనా దవగమ్యత ఇతి - (సమాన స్సన్నిత్యస్య బుద్ధితాదాత్మ్య మాపన్న ఇత్యర్థః-)

వివరణము :- ఆత్మకు అణుత్వాది పరిమాణము మొదలగు గుణాది సంబంధరూపమైనది సంసారము - అది బుద్ధ్యాద్యుపాది ప్రయుక్తము. కాన నా బుద్ధితో ఆత్మకు వియోగము సంభవించగా సంసారము తొలగిపోయినది యగును గదా! అని ఆక్షేపమురాగా చెప్పబడుచున్నది - ''సంయోగా విప్రయోగాంతాః'' అను లోకసిద్ధన్యాయము ననుసరించి ఆత్మకు బుద్ధితోగల తాదాత్మ్యధ్యాసకును, బుద్ధిధర్మములగు గుణాదులతో గల సంబంధాధ్యాసకును మూలకారణమగు అవిద్యాప్రయుక్తమైన బుద్ధి సంయోగమునకు ప్రయత్నమేమియు లేకుండగనే వియోగ మవశ్యము సంభవించునుగాన నట్లు బుద్ధివియోగమేర్పడగా ఆత్మకు అసంసారిత్వము - సంసారనివృత్తి యేప్రయత్నమును లేకుండగనే సంభవించవలసివచ్చును. అట్లగుచో మోక్షోపాయోపదేశము వ్యర్థముకాదా? అనగా నీదోషము మామతములో ప్రసరించదు. ఏలయన? బుధ్ధిసంయోగ మనునది ఆత్మ కెంతవరకు సంసారముండునో అనగా సమ్యగ్‌ జ్ఞానమువలన అవిద్యా ప్రయుక్తమైన సంసార మెంతవరకు తొలగిపోదో - అంతవరకు నుండను గాన - అనగా నెంతవరకు సంసారమునునది యుండునో అంత వరకును బుద్ధిసంయోగ మనువర్తించుచునే యుండను గనుక అని అర్థము - ఈ యంశ##మెట్లు తెలియబడుచున్నది. యనినచో - ''స సమాన స్సన్నుభౌలోకా వనుసంచరతి ధ్యాయతీవ లేలాయతీవ'' ఆ ఆత్మ సమానస్సన్‌ అనగా బుద్ధితాదాత్మ్యమును పొందినవాడగుచు కర్మఫలభూతమగు ఉభయ లోకములయందును క్రమముగ సంచరించుచున్నాడు. తనకు ఉపాధియగు బుద్ధితో తాదాత్మ్యాధ్యాసను పొందియున్న కారణమున నా బుద్ధి ధ్యానము చేయుచు నున్నప్పుడు అనగా ఏకాగ్రవృత్తిని పొంది యున్నప్పుడు ఆత్మ ధ్యానించుచున్న వాడువలె నుండును. అట్లే ఆ బుద్ధి చలనస్వభావము కలిగి యున్నప్పడు చలింంచుచున్నవాడువలె నుండును. అని యిట్లు వర్ణించు శ్రుతులవలన తెలియబడుచున్నది.

31 సూ : పుంస్త్వాదివత్తస్య సతోభివ్యక్తియోగాత్‌

వివృతిః :- సుషుప్తిప్రళయో రాత్మనో బుద్ధిసంయోగో7స్తీతినవక్తుం న శక్యతే - తదాత్వే బుద్ధ్యాది సర్వకార్యప్రళయ స్యాభ్యుపగ తత్వాత్‌ - అతో యావదాత్మభావిత్వం బుద్ధిసంయోగస్య కథ ముపపద్యత ఇత్య త్రోచ్యతే - పుంస్త్వాదివత్‌ = బాల్యే శక్త్యాత్మనా విద్యమాన సై#్యవపుం స్త్వస్యశ్మశ్ర్వాదే ర్యథా ¸°వనే - అభివ్యక్తిః - సతః = ఏవ మస్యసుషుప్తిప్రళయయో శ్శక్త్యాత్మనా విద్యమాన సై#్యవ బుద్ధి సంయోగస్య అభివ్యక్తిః = పునః ప్రబోధసర్గయో రభివ్యక్తే స్సంభవా ద్యావదాత్మభావిత్వ మస్యోపపద్యత ఏవ-ఇతి.

వివరణము :- సుషుప్తియందును - ప్రళయమునందుమ ఆత్మకు బుద్ధితో సంయోగము కలదనుట కవకాశములేదు. ఆ సమయమున బుద్ధ్యాదికమగు సర్వకార్య ప్రపంచముయొక్క ప్రళయ మంగీకరింపబడి యుండెను. గదా! కాన ఆత్మకు సంసార మున్నంతవరకును బుద్ధి సంయోగ ముండుననుట ఎట్లుపపన్నము కాగలదు. అను నీ ఆశంకకు సమాధానము చెప్పడుచున్నది.

బాల్యమున బీజరూపముగా నుండియున్న పుంస్త్వమునకును - తచ్చిహ్నములగు మీసకట్టు వగైరాలకును ¸°వనము ప్రాదుర్భవింప నెట్లభివ్యక్తి యేర్పుడునో - అట్లే సషుప్తి, ప్రళయములయందు బీజరూప ముగానుండి యున్న బుద్ధిసంయోగమునకు తిరిగి ప్రబోధము - సృష్టి యేర్పడగా అభివ్యక్తి - ప్రకటభావ మేర్పడును. కాన బుద్ధిసంయోగమునకు యావదాత్మ భావిత్వము = ఆత్మ కెంతవరకు సంసారముండునో అంతవరకును నుండుట యనునది ఉపపన్నమే యగును.

32. సూ : నిత్యోపల బ్ధ్యనుపలబ్ధిప్రసంగో7న్యతర

నియయో వా7న్యధా

వివృతిః :- బుద్ధ్యుపాధి ప్రయుక్త మాత్మసంసాఠిత్వ మిత్యుపపాదితం - తత్తథాస్తు - బుద్ధిసద్భావే కిం మాన మిత్యత ఆహ - బుద్ధాఖ్యమన్తఃకరణం ఆత్మోపాధిః - తదస్తిత్వ మవశ్య మభ్యుపగన్తవ్యం అన్యధా = అనుభ్యపగతే తస్మిన్‌ నిత్యోపలబ్ధ్యనుపలబ్ధిప్రసంగః = నిత్యోపలభ్దిప్రసంగో వా - నిత్యానుపలబ్ధిప్రసంగోవా స్యాత్‌, ఆత్మేంద్రియవిషయాణా ముపలబ్ధిసాధనానాం సన్నిధానే నిత్యముపలబ్ధి ర్వా- సత్స్యపి తేషు సాధనేషు తేషా మకించిత్కరత్వే నిత్య మనుపలబ్ధి ర్వా ప్రసజ్యేతేత్యర్థః - అతః కాదా చిత్కోపలబ్ధి సిద్ధ్యర్థం - అస్యతరనియమః - వా= అన్యతరస్య =ఆత్మనః - ఇంద్రియాణాం వా - నియమః =శక్తిప్రతిబన్ధః వక్తవ్యః స్యాత్‌ - స చనసంభవతి - ఆత్మనః అవిక్రియత్వాత్‌- నిర్ధర్మకే ఆత్మని శ##క్తే రభావా దిత్యర్థః - ఇంద్రియాణా మకస్మాత్తదయోగాచ్చ- తస్మాద్యస్యావ ధానేన ఉపలభ్దిః - యస్యానవధానేన అనుపలబ్ధి శ్చ భవతః - తత్‌ బుద్ధ్య పరపర్యాయ మంతఃకరణ మవశ్య మస్తీత్యభ్యుపగన్తవ్యం - తతశ్చ సిద్ధ మన్తఃకరణం - తత్ర్పయుక్త మాత్మన స్సంసారిత్వ మితి చ సిద్ధమ్‌ -

వివరణము :- బుద్ధ్యాదిరూపమగు ఉపాధి సంబంధమువలన నాత్మకు సంసార మేర్పడునని ఉపపాదింపబడినది. ఆ సంగతి నట్లుండనిండు. బుద్ధి యనునది కలదనుటలో ప్రమాణమేమి? అని యనువారికి సమాధానమును చెప్పుచున్నారు. బుద్ధి యనగా అంతఃకరణము - అది ఆత్మకు ఉపాధి - దానియొక్క అస్తిత్వము (అది కలదని) అవశ్య మంగీ కరింపవలయును - అట్లంగీకరించక యున్నచో - నిత్యోపలబ్ధి ప్రసంగము కాని, నిత్యానుపలబ్ధి ప్రసంగము కాని, యేర్పడగలదు. ఉపలబ్ధి యనగా సాక్షాత్కారము - ప్రత్యక్షజ్ఞానము అని యర్థము - అది కలుగవలయునన్న దీనికి సాధనములు ద్రష్టయగు ఆత్మవస్తువు - ఇంద్రియములు - విషయము ( దరిశింపదగిన వస్తువు) న్నూ - ఇవియే ఉపలబ్ధిసాధనములని యన్నచో వీనికి సన్నిధానమేర్పడిన ఎల్లప్పుడునూ ఉపలబ్ధికలుగుచునే యుండవలయును. ఇవి యున్ననూ ఇవి కార్యకారులు కాదన్నచో ఎల్లప్పుడునూ ఉపలబ్ధి లేకపోవుటయే తటస్థించవలసివచ్చును. ఇవి ఉన్నను నొకప్పుడు ఉపలబ్ది కలుగుటయు - ఒకప్పుడు కలుగకుండటయు నిట్లు ఉపలబ్ధి కాదా చిత్కముగా లోకానుభవమువలన తెలియవచ్చుచున్నది. ఇట్టి కాదా చిత్కోపలబ్ధిని సమర్థించుటకు అన్యతర నియమము చెప్పవలసి వచ్చును. అనగా పదార్థముయొక్క సాక్షాత్కారమునకు సాధనము%ులగా స్వీకరింపబడిన - ఆత్మ - ఇంద్రియములు అను నీ రెండంటిలో నేదో ఒక దానికి సామర్థ్యము ఒకప్పుడు ప్రతిబద్ధమైనపోవును అని చెప్పవలయును. అది కుదరదు - ఏలయన? ఆత్మవికార రహితము = నిర్ధర్మకము గాన నచట శక్తి కలదనుటయే అనుపపన్నము- కాన నాత్మకు శక్తి ప్రతి బంధము చెప్ప వలనుపడదు. ఇంద్రియములకు శక్తి ప్రతిబంధము చెప్పవలయునన్న - వానికిగల శక్తి ఒకప్పుడు ప్రతిబంధింపబడును. ఒకప్పుడు కార్యకారి యగునని చెప్పుటకు తగుహేతువును నిరూపించవలయును. అట్లుకాక అకస్మాత్తుగ శక్తి ప్రతిబద్ధమగు ననుట యుక్తముకాదు. అందువలన ఏ వస్తువు%ొక్క అవధానము = ఏకాగ్రత వలన అనగా ఏ వస్తువు సన్నిహితము కాగా ఆయాఇంద్రియములద్వారా తత్త త్పదార్థములకు సంబంధించిన ఉపలబ్ధి కలుగుచున్నదో -

ఏ వస్తువు యొక్క అనవధానముచేత ఉపలబ్ధి కలుగక పోవుచున్నదో ఆ వస్తువు నొకదానిని కాదా చిత్కోపలబ్ధిని సమర్థించుటకై యంగీకరించవలయును. ఆ వన్తువును బుద్ధియని, అంతఃకరణ మని వ్యవహరింతురు. ఈ హేతువుల వలన నంతఃకరణము = బుద్ధి యనునది కలదనియు - ఆత్మకు తత్ప్రయుక్తముగ సంసార మేర్పడుననియు సిద్ధియమగుచున్నది.

కర్త్రధికరణమ్‌ 14

33. సూ : కర్తా శాస్త్రార్థ వత్త్వాత్‌

వివృతిః :- ఏవం బుద్ధే స్సద్భావం ప్రసాధ్య కర్తృత్వ మాత్మనో బుద్ధే ర్వేత్యేత దత్ర విచార్యతే -కర్తా = జీవాత్మైవ కర్తా - న బుద్ధిః - కస్మాత్‌? శాస్త్రార్థవత్త్వాత్‌ = యజేత - దద్యాత్‌ - ఇత్యాదేః ప్రవర్తకస్య కర్తుః ఫలప్రతిపాదకస్య శాస్త్రస్య ప్రయోజనవత్త్వాత్‌ - అన్యభా తదనర్థకం స్యాత్‌ - తద్ధి కర్తు స్సతః కర్తవ్యవిశేష ముపదిశతి - న చాసతి కర్తరి తదుపపద్యేత - బుద్ధే స్తు న కర్తృత్వం - బుద్ధే రచేతనత్వేనా ప్రవర్త్యత్వాత్‌ =న క్వాపి లోకే రథాది రచేతనః ఫలాయ ప్రేరకేన వాక్యేన ప్రేర్యమైణో దృష్టః శ్రుతోవా - అత శ్చేతనో జచీవాత్మైవ కర్తేతి -

వివరణము :- ఇట్లు బుద్ధిని సాధించి కర్తృత్వము ఆత్మకు సంబంధించినదియా, లేక బుద్ధికి సంబంధించినదియాయనియిచట విచారింపబడుచున్నది - కర్తజీవాత్మయే - కాని బుద్ధికాదు - కారణ మేమియన? వేదములలోని యజేత - (యాగము ననుష్ఠింపుము - దేవుని పూజింపుము) దద్యాత్‌ - (దానము చేయుము) ఈ మొదలుగాగల పురుషులమకర్తవ్యార్థములయందు ప్రవర్తిపజేయు- తత్కర్తలకు ఫలమును బోధించువిధి (శాసక) వాక్యములకు సార్థకత కలుగవలయునన్న చేతనుడగు ఒక కర్త ఉండితీరవలయును. లేకున్న నా విధివాక్యము లనర్థములు కాగలవు. శాస్త్రము (విధివాక్యము) కర్తయొక డున్నప్పుడే ఆతనికి ఫలసాధకమగు కర్మనుపుదేశించి యాతని నా కర్మయందు ప్రవర్తింపజేయును. కర్తయే లేకున్న నా శాస్త్రోపదేశ ముపపన్నము కానేరదు. బుద్ధి కర్తయనుట యుక్తముకాదు. అచేతనము గాన నది శాస్త్రవాక్యములచే ప్రవర్తింపజేయబడదు. లోకమున నెచటను అచేతనములగు బండ్లు మొదలగునవి ఫలార్థము విహితకర్మలయందు శాస్త్రవాక్యోపదేశములచే ప్రవర్తింబపజేయుబడినట్లు కానవచ్చుటలేదు. వినబడుటయును లేదు. కానచేతనుడగు జీవాత్మయే కర్తయని నిశ్చయింపదగును.

34. సూ : విహారోపదేశాత్‌

వివృతిః:- విహారోపదేశాత్‌ = ''స్వే శరీరే యథా కామం విపరి వర్తతే'' - ఇతి శ్రుతౌ జీవప్రకరణ స్వప్నావస్థాయాం విహారస్య = స్వేచ్ఛాసంచారస్య ఉపదిష్టత్వాత్‌ - జీ ఏవ కర్తా - న హ్యకర్తు స్సంచరణ ముపపద్యతే -

వివరణము :- ''స్వే శరీరే యథాకామం విపరివర్తతే'' జీవప్రకరణమునందలి యీ శ్రుతివాక్యముతో స్వప్నావస్థయందు విహారము = స్వేచ్ఛాసంచారము ఉపదేశింపబడినది. ప్రకరణమునుబట్టి యీ విహారము జీవాత్మకు సంబంధించినది యని నిశ్చయింపదగును. కాన జీవాత్మయే కర్త - కర్త కాకున్న నతనికి విహారము ఉపపన్నము కానేరదు గదా!

35 సూ : ఉపాదానాత్‌

వివృతిః :- ఉపాదానాత్‌ = ''తదేషాం ప్రాణానాం విజ్ఞేనేన విజ్ఞాన మాదాయ'' ఇత్యాదినా శ్రుతౌ జీవప్రకరణ జివస్య కరణానాం - ప్రాణానా ముపాదానస్య=స్వీకారస్య వర్ణనా దపి జీవ ఏవకర్తా-నాన్యః- నహ్యకర్తుః కరణోపాదానం నంభవతి

వివరణము:- ''తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞాన మాదాయ'' జీవప్రకరణములోని యీ శ్రుతివాక్యములో జీవునకు జ్ఞానాది కరణములైన ప్రాణములను = ఇంద్రియములను గ్రహించుట వర్ణింపబడినది, కాన జీవుడే కర్త కాదగును. కర్త కానివాడు కరణములను = సాధనములము స్వీకరింపడు గదా!

36 సూ : వ్యపదేశాచ్చ క్రియాయాం న చే

న్నిర్దేశవిపర్యయః

వివృతిః :- క్రియాయాం =లౌకిక వైదికస క్రియాసామాన్యే - వ్యవదేశాత్‌ - చ = ''విజ్ఞానం యజ్ఞం తనుతే - కర్మాణి తనుతే7పిచ-'' ఇతిశ్రుతౌ- జీవస్య కర్తృత్వ వర్ణనా దపి- జీవః కర్తా ఇత్యభ్యుపగన్తవ్యం - న-చేత్‌ = విజ్ఞాన మితి శ##బ్దేన జీవో న నిర్దిష్టః, బుద్ధిరేవ నిర్దిష్టా- ఇతి యద్యుచ్యేత - తర్హి నిర్దేశవివర్యయః = కర్తృత్వనిర్దేశవిపర్యయః కరణత్వనిర్దేశః ''విజ్ఞానేన'' ఇతి వకృత స్స్యాత్‌ - కర్మము బుద్ధేః కరణణ్వాత్‌-

వవివరణము :- ''విజ్ఞానం యజ్ఞం తనుతే - కర్మాణి తనుతే7పిచ'' అను నీ శ్రుతి వాక్యములో విజ్ఞానశబ్దముతో జీవాత్మను నిర్దేశించి యాతనికి లౌకికములును, వైదికములును నగు సమస్త క్రియలందును కర్తృత్వమువర్ణింపబడియున్నది గాన జీవుడే కర్తయని యంగీకరింపవలయును కర్తృత్వము వర్ణింపబడియున్నది. గాన జీవుడే కర్తయని యంగీకరింపవలయును. విజ్ఞానశబ్దముచేత జీవుడు నిర్దేశింపబడుటలేదు, బుద్ధియే యిచట నిర్దేశింప బడుచున్నది యనుచో శ్రుతిలో ''విజ్ఞానం'' అనుచోట దానికి విపర్యయ ముగ ''విజ్ఞానేన'' అని పఠింపబడియుండెడిది. కర్మలయందు బుద్ధికరణ మని సుప్రసిద్ధమైన విషయము. తృతీయా విభక్తి కరణత్వమును నిర్దేశించును. అట్టి విభక్తి యిచట వాడబడలేదు. గనుక బుద్ధి యిచట నిర్దేశింపబడుటలేదని, కర్తృత్వబోధక ప్రథమావిభక్తి వాడబడియుండుటచే కర్తయగు జీవుడే యిచట నిర్దేశింపబడు చున్నాడనియు గ్రహింపవలయును.

37. సూ : ఉపలబ్ధివ దనియముః

వివృతిః :- జీవసై#్యవ కర్తృత్వమితి యద్యుచ్యేత తర్హి ''స్వతంత్రః కర్తా'' ఇతి న్యాయేన తస్య స్వాతంత్ర్య వక్తవ్యం - తథాచ జీవ స్స్వతన్త్రశ్చే త్స స్వాభిమత మేవ కుర్యాత్‌- అనభిమతంచ న కుర్యాత్‌ - అస్వతన్త్రశ్చే త్కర్తృత్వమేవ తస్య న స్యాదిత్యాశంకాయా ముచ్యతే అనియమః = సత్యపి స్వాతంత్ర్యే జీవస్య కారకవైచిత్ర్యా దిష్టానిష్టయోః కరణ అనియమః =నియమో నాస్తీతి వక్తవ్యం - కథ మితి చేత్‌? ఉపలబ్ధివత్‌ = యథా ఉపలబ్ధింప్రతి స్వాత్మనః స్వాతంత్ర్యే సత్య ప్యనియ.మే నేష్ట మనిష్టం చోపలభ##తే - స్రక్చందనవనితా దీష్టవిషయోపలబ్ధౌ - విషకంటకా ద్యనిశష్టవిషయోపలబ్ధౌ చానియమ స్తద్వత్‌ -

వివరణము :- ''స్వతంత్రః కర్తా'' అను నొక నియమము కలదు. దాని ననుసరించి జావుడు కర్తయనుచో నాతనికి స్వాతంత్ర్యమును కలదని చెప్పవవలయును. జీవుడు స్వతంత్రుడగుచో అభిమతమునే ఆతడు చేయవలయును. అనభిమతమును చేయకుం నుండలయును. లోకమున నట్టి నియమము కానవచ్చుటలేదు. జీవు డస్వతంత్రుడన్నచో నాతనికి కర్త్వత్వమే లేక పోవలసివచ్చు నను నిట్టి యాశంక కలుగగా సమాధానము చెప్పబడుచున్నది.

జీవునకు స్వాతంత్ర్యమున్నను సాధన వైచిత్ర్యమును బట్టి యిష్టానిష్టయములను చేయుట విషయములో అనియము = నియమాభావము = అనగా నియమములేదని చెప్పవనలయును. ఎట్లన? [ఉపలబ్ధియనగా ప్రత్యక్ష జ్ఞానము - సాక్షాత్కారము.] విషయ సాక్షాత్కారములో అనగా విషయగ్రహణములో ఆత్మకు స్వాతంత్ర్యమున్నను నాతడు ఇష్టవిషయమును - అనిష్టవిషయమునుగూడ ననియతముగ గ్రహించుచున్నాడు. అనగా స్సక్చందనాదీష్ట వస్తువులనే గ్రహించును - సాక్షాత్కరింప జేసికొనును, విషకంటకాదులను గ్రహించకుండు నను నియమము లేదని యర్థము. ఇట్లే ఇష్టానిష్టకతరణమునందును ఆత్మకు నియమాభావ ముపపన్నమే యగునని భావము.

38. సూ : శక్తివిపర్యయాత్‌

వివృతిః :- శక్తివిపర్యయాత్‌ = బుద్ధేః కర్తృత్వాంగీకారే కరణశక్తిర్హీయేత - కర్తృత్వశక్తి శ్చాపద్యేత - బుద్ధేః కర్తృత్వశక్తౌ సత్యాం - తస్యా ఏవాహంప్రత్యవిషయత్వ మభ్యుపగన్తవ్యం - కించ బుద్ధేః కర్తృత్వే కర్తుః కరణసాపేక్షత్వా త్కరణాంతర మపేక్షితం స్యాత్‌- తతశ్చ బుద్ధిరితి కర్తేతి నామమాత్రే వివాదః - న వ స్తు భేదః కశ్చిత్‌ - కరణవ్యతిరిక్తస్య కర్తృత్వాంగీకారాత్‌ - తస్మా త్కర్తా జీవో న బుద్ధిరితి -

వివరణము :- బుద్ధికి కర్తృత్వము నంగీకరించిన బుద్ధియందలి కరణశక్తి = సాధనశక్తి లోపించినదగును. కర్తృత్వశక్తి నూతనముగ రావలసివచ్చును. బుద్ధికి కర్తృత్వశక్తి సంభవించిన దన్నచో ''అహం-అహం'' నేను - నేను అను వ్యవహారములలో జీవాత్మ విషయముకాక బుద్ధియే విషయమనియంగీకరింపవలసివచ్చును - మరియుబుద్ధికర్తయగుచో కర్తకు కరణము - సాధనముయొక్క అపేక్షయుండును గాన కర్తయైన ఆ బుద్ధికి మరియొక కరణమును సంపాదింపవలసివచ్చును. అట్లగుచో నా కరణముకంటె వేరైన బుద్ధి కర్త యనగా నీ వివాదము నామమాత్రము నందే పర్యవసించుచున్నది, ఇందు వస్తుభేద మేమియునులేదు. ఏలయన? కరణముకంటె వేరైన వస్తువునే కర్తగ మీరును నంగీకరించిరి గాన. [మేమును కరణమగు బుద్ధికంటె వేరైన చేతనుడగు జీవాత్మను కర్తగ నిర్ణయించి యుంటిమి] కాన జీవుడే కర్తయగును, బుద్ధి కాదు.

39. సూ : సమాధ్యాభావాచ్చ

వివృతిః :- సమాధ్యభావాత్‌ - చ = ఆత్మనః కర్తృత్వానభ్యుపగమే ''శ్రోతవ్యో - మన్తవ్యో -నిదిధ్యాసితవ్యః -వల ఇత్యాదౌ విహితాయా బుద్ధే స్సమ్యగాధానరూపాయా స్సమాధే రభావప్రసంగః - తస్మా ద ప్యాత్మైవ కర్తేతి సిద్ధ్యతి.

వివరణము :- ఆత్మకు కర్తృత్వము నంగీకరింపకున్న ''శ్రోతకవ్యోమన్తవ్యో నిదిధ్యాసితవ్యః'' అను నిట్టి శ్రుతులలో విధింపబడిన ఆత్మ తత్త్వమునందనన్యభావముతో బుద్ధిని సమాధానపరచుటయే స్వరూపము. గాగల సమాధికి అభావప్రసక్తిరాగలదు. అనగా సమాధియే లేకపోవలసి వచ్చును. కానను ఆత్మయే కర్తయని నిర్ణమము .

తక్షాధికరణమ్‌

40. సూ : యథాచతక్షోభయధా

వివృతి :- యథా తక్షా = యథా లోకే తక్షా వాస్యాది కరణ సంయోగదశాయాం కర్తా, సన్‌, దుఃఖీ చ భవతి, తద్వియోగదశాయా మకర్తాసన్‌ సుఖీ భవతి - ఏవ మాత్మాపి ఉభయధా - చ =అవిద్యా ప్రత్యుపస్థాపితి బుద్ధ్యాది కరణసంయోగదశాయాం కర్తాసన్‌ దుఃఖీ చ, తద్వియోగదశాయా మకర్తానన్‌ సుఖీ చేత్యుభయధా భవతి - తస్మాదాత్మనః ప్రాగుక్తం కర్తృత్వం బుద్ధ్యాద్యుపాధిసంయోగ జనిత మేవ - న పారమార్థిక మితి.

వివరణము :- తక్ష యనగా కొయ్యలను చెక్కునతడు =వడ్రంగి - ఆతడు వాస్యాది = ఉలి, బాడిత మొదలగు సాధనములతో కూడికొని యున్నప్పుడు కర్తగుచు దుఃఖిగూడ నగుచునున్నాడు. వానిని వదలి యున్నప్పుడట్లు కర్త కాక (చెక్కుడుపనులు చేయు కర్తకాక) సుఖి యగుచున్నాడు. ఇట్లు ఆత్మయు అవిద్యా మాహాత్మ్యమువలన సంభవించిన బుద్ధి మొదలగు సాధనములతో సంయుక్తుడైనప్పుడు కర్తయగుచు దుఃఖిగూడ నగుచు, ఆ బుద్ధి మొదలగు వానితో వియోగము సంభవించిన తాను కర్తకాక (అకర్తయై) సుఖియుగూడ నగుచు, రెండువిధములుగను నగు చున్నాడు. కాన పూర్వము ప్రతిపాదింబడిన ఆత్మయొక్క కర్తృత్వము బుద్ధ్యాద్యుపాధుల సంబంధమువలన నేర్పడునదియే కాని వాస్తవ మైనది కాదని నిశ్చయింపదగును.

పరాయత్తాధికరణమ్‌

41. సూ : పరాత్తు తచ్ఛ్రుతేః

వివృతి :- తత్‌ - తు = బుద్ధ్యాది సంయోగదశాయాం జీవస్య కర్తృత్వం యత్ప్రతిపాదితం పరాత్‌ = పరస్మాత్‌ = పరమేశ్వరా దేవ సంభవతి - పరమేశ్వరాయత్త మిత్యర్థః - కుతః? శ్రుతేః = ''ఏష హ్యేవ సాధు కర్మ కారయతి తం, యమేషఏభ్యో లోకేభ్య ఉన్నినీషతే'' ఇత్యాది శ్రుత్యా జీవనిష్ఠస్య కర్తృత్వస్య పరమేశ్వరాయత్తత్వ శ్రవణాత్‌ -

వివరణము :- బుద్ధ్యాదులతో సంయోగము కలిగినప్పు డాత్మకు కర్తృత్వము సంభనవించునని చెప్పబడినది గదా! ఆ కర్తృత్వము పరమేశ్వరుని వలననే జీవునకు సంభవించుచున్నది యని తెలియదగును. కారణమేమియన? ''ఏష హ్యేవ... ఉన్నినీషతే'' ఆ పరమాత్మ ఎవనికి ఉత్తమ లోకములను (ఉత్తము ఫలములను) సమకూర్పదలచునో ఆతనిచేత పుణ్యకర్మల చేయించును అని చెప్పు ఇట్టి శ్రుతులయందు జీవాత్మయందుండు కర్తృత్వము పరమేశ్వరాయత్త మని స్పష్టముగ ప్రతిపాదింపబడుచున్నది. గనుక నని తెలియదగును.

42. సూ : కృతప్రయత్నాపేక్షస్తు విహితప్రతిషి

ద్ధావైయర్థ్యాదిభ్యః

వివృతిః :- ఈశ్వరస్య జీవాత్మప్రవర్తకత్వే తస్య వైషమ్యనైర్ఘృణ్య దోషప్రసంగః - జీవస్య అకృతాభ్యాగమరూపస్య దోషఖస్య ప్రసంగ శ్చస్యా - దిత్యాక్షేపే ఇదముచ్యతే - కృతప్రయాత్నాపేక్షః - తు = కృత శ్చాసౌ ప్రయత్నశ్చ - కృతప్రయత్న స్తస్మి న్నపేక్షా యస్య సః కృతప్రయత్నాపేక్షః - కృతః = జీవేనానుష్ఠితో యః ప్రయత్నో ధర్మాధర్మాదిలక్షణః పూర్వః పూర్వ స్తదపేక్ష ఏవ పరమేశ్వర ఉత్తరోత్తరం కర్మకారయతి - అతఏవ తస్మిన్‌ వైషమ్యాదిదోషా న ప్రసజ్యన్తే - సాపేక్ష ఏవ పరమేశ్వరః కారయతీతి కుతో నిశ్చీయతి ఇతి వచేత్‌? విహితప్రతిషిద్ధావైయర్థ్యా దిభ్యః = యజేత - దద్యాత్‌ - జూహుయాత్‌ - సత్యంవద- ధర్మంచర ఇత్యా ద్యనుష్ఠే యార్థవిధాయకం విధిశాస్త్రం - న సురాం పిబేత్‌ - నానృతం వదేదిత్యాది నిషేధశాస్త్రం - తయో రవైయర్థ్యం = సార్థకత్వం - ఏవం పురుష ప్రయత్నస్య చ ఆవైయర్థ్యం అకృతాభ్యాగమాది దోషజాత స్యా ప్రసక్తి రిత్యాదిభ్యో హేతుభ్యో ననిశ్చీయత ఇత్యర్థః - అన్యదా విధినిషేధశాస్త్ర మనర్థక మేవ స్యాత్‌ - విహితాతిక్రమణన నిషిద్ధానుష్ఠానేన చ జీవస్య దుఃఖభాక్త్వం చ న స్యాత్‌ - తస్మాత్కర్మసాపేక్ష ఏవేశ్వరంః జీవం ప్రవర్తయతీతి సిద్ధమ్‌.

వివరణము :- ఈశ్వరునివలన జీవాత్మకు కర్తృత్వ మేర్పడునని చెప్పుటతో జీవుని ఈశ్వరుని సాధ్వసాధు కర్మలయందు తానై ప్రవర్తింపజేయచున్నాడని యేర్పడినది గదా! అట్లుగచో ఈశ్వరునకు వైషమ్యనైర్ఘృణదోషములుప్రసక్తకములగును. జీవునకు అకృతాభ్యాగమదోషమును ప్రసక్తమగును అను నిట్టి అక్షేపము రాగా చెప్పబడుచున్నది.

ఈశ్వరుడు జీవునిచేత ననుష్ఠింపబడిన ధర్మాధర్మ (సాధ్వసాధుకర్మ) రూపమగు ప్రయత్నము నపేక్షించి అనగా ఆయా జీవలచే పూర్వమనుష్ఠింపడిన పుణ్యపాప కర్మల ననుసరించియే ఉత్తరోత్తరకర్మలను చేయించుచుండును. కాన పూర్వోక్తదోషములకు ప్రసక్తి యుండదు. జీవకర్మల నపేక్షించియే పరమేశ్వరుడు జీవులచే తిరిగి ఆయా కర్మల చేయించుచున్నాడని నిశ్చయించు టెట్లనగా - ''విహిత ప్రతిషిద్ధావైయర్థ్యా దిభ్యః'' అని సమాధానము -

ఈశ్వరుడు వారివారి కర్మల ననుసరించిగాక జీవులకు పుణ్యపాప కర్మలయందు స్వేచ్ఛానుసారము కర్తృత్వమును కలుగజేయుచున్నాడని చెప్పుచో యజేత (యాగము చేయుము - దేవుని పూజింపుము) దద్యాత్‌ (దానము చేయుము) సత్యంవద (యథార్థమును పలుకుము) ధర్మంచర (ధర్మము ననుష్ఠింపుము) ఇట్లనుష్ఠేయార్థముల బోదించు విధిశాస్త్రము లకును - న సురాం పిబేత్‌ ( మద్యమును త్రాగవద్దు) నానృతం వదేత్‌ (అసత్యమును పలుకవద్దు) ఇట్లు వర్జింపదగిన అర్థముల బోధించు నిషేధశాస్త్రములకును సార్థకత లేకపోవును. వైయర్థ్యము సంభవించును. అట్లు విధినిషేధ శాస్త్రములకు వైయర్థ్యము రాకుండుటయు - అట్లే జీవుల యొక్క ప్రయత్నములకు = ధర్మాధర్మా నుష్ఠానములకు వైయర్థ్యము రాకుండుటయు - అకృతాభ్యాగమాది దోషప్రసంగము రాకుండుటయు - మొదలగు హేతువులనుబట్టి యిట్లు నిశ్చయింపబడుచున్నది యని యర్థము - ఇట్లు చెప్పకున్న విధినిషేధశాస్త్రము లనర్థకము లగును- విహితకర్మ ననుష్ఠింపక విధుల నతిక్రమించినను - నిషిద్దముల పాపముల ననుష్ఠించినను జీవులు దుఃఖములను పొందువారు కాకపోవలసివచ్చును. కాన పరమేశ్వరుడు జీవులను వారివారి కర్మల ననుసరించియే తిరిగి పుణ్యపాపకర్మలయందు ప్రవర్తింపజేయుచున్నాడు. గాని నిరపేక్షముగ కాదని నిశ్చయింపదగును.

అంశాధి కరణమ్‌ 17

43. సూ: అంశో నానావ్యపదేశా దన్యధా చాపి

దాశకితవాదిత్వ మధీయత ఏకే

వివృతిః :- జీవస్య కర్తృత్వ మీశ్వరాధీన మిత్యుపపాదితం - తత శ్చేశ్వరో నియంతా = ప్రవర్తకః - జీవో నియమ్యః = ప్రవర్త్యఇత్యాయాతి - నియన్తృనియమ్యభావశ్చ సత్యేవ తయో ర్భేదే సంభవతి- సచ భేదః కిం స్వభావిక ఉతౌపాధిక ఇత్యా ద్యత్ర విచార్యతే - అంశః = జీవః పరస్య బ్రహ్మణః అంశఇవఅంశః - న స్వాభావికః అశః = ఏక దేశః = భాగః, కింతు ఘటాకాశోమహాకాశ##స్యేవ ఉపాధిపరిచ్ఛిన్నో భాగః - ''నిష్కల నిష్క్రియం .........'' ఇత్యాదినా తస్య పరమేశ్వరస్య నిరంశత్వ ప్రతిపాదనాత్‌ - అతః కల్పితాంఖ ఏవ జీవః పరమేశ్వరస్య - కుతః పునః కారణాత్‌ జీవేశ్వరయే రంశాంశిభావో7స్తీతి నిశ్చీయతే - ఇతి చేదుచ్యతే? నానావ్యవదేశాత్‌ = ''య ఆత్మని తిష్ఠ న్నాత్మాన మంతరో యమయతి'' ఇత్యాదినా తయో ర్జీవేశ్వరయో ర్నియమ్యనియామకభావేన నానాత్వేన భిన్నతయా వ్యపదేశాత్‌ = నిర్దేశాత్‌ - ఇతి - తర్హి రాజభృత్యయో రివ తయో రత్యన్తం భేద ఏవాస్తు - కుత స్తద్భేదస్య ఔపాధి కత్వ ముచ్యత ఇతి చేత్‌ - అన్యధా - చ అపి = ''తత్త్వమసీత్యాదినా అనానాత్వస్య = అత్యన్తాభేదస్య వ్యపదేశాత్‌ = నిర్దేశాత్‌ - (వర్ణితత్వాదితి-) తథా చ అనానాత్వం = అత్యన్తాభేదో జీవేన పరమేశ్వరస్య నిశ్చేతవ్యః - కించఏకే = ఏకే అథర్వణశాభినః దాశకితవాదిత్వం - అధీయతే= ''బ్రహ్మదాశా బ్రహ్మదాసా బ్రహ్మైవేమే కితవాః'' ఇతి దాశకితవాదిభావం బ్రహ్మణః అధీయతే = పఠన్తి. ఏవం నానాత్వ స్యానానాత్వస్య = బ్రహ్మణో జీవాభేదస్య చ వర్ణితత్వాత్‌ జీవేశ్వరయో ర్భేదో న స్వాభావిక ఇతి, ఘటాకాశ మహాకాశయో రివౌపాధిక ఏవేతి చ నిశ్చీయతే - తత్ర భేదవాది శ్రుతి జాతస్య ప్రత్యక్షసిద్ధ జీవానువాదే నాభేదపరత్వా త్కల్పితభేదవా నంశ ఇవాంశో జీవః పరమాత్మన ఇతి భావః -

వివరణము :- జీవునకు కర్త్రత్వ మీశ్వరాయత్తమని ఉపపాదింప బడినది. అటు చెప్పుటతో ఈశ్వరుడటు నియంత = ప్రవర్తకుడు - జీవుడు నియమ్యుడు = ప్రవర్తింపజేయువాడు అని తేలినది - ఈ నియమ్యనియామకభావము = ప్రవర్త్య ప్రవర్తకభావము జీవేశ్వరులకు భేదమున్నప్పుడు సంభవించును గాని యన్యధా సంభవించదు. ఆ భేదమనునది స్వాభావికమా, లేక ఔపాధికమా అని యిచట విచారింపబడుచున్నది.

జీవుడు పరమాత్మయొక్క అంశమని కొందరందురు. అంశమనగా ఏకదేశము. ఒక విభాగము అని అర్థము. అట్టి అరమును జీవేశ్వరుల సందర్భములో చెప్పరాదు. జీవుడు పరమాత్మకు అశమువంటివాడు గాని యథార్థముగ అంశము = ఒక భాగముకాదు ఎట్లన? ఘటాకాశము మహాకాశమునకెట్లు ఉపాధిప్రపయుక్తమైన భాగమేగాని సహజమగు భాగము కాదో అట్లు. ''నిష్కలం నిష్క్రియం.....'' బ్రహ్మ అవయవములు లేనిది = భాగములు లేనిది. క్రియలు లేనిది యని యిట్లు పరమాత్మ అంశములు లేనివాడని శ్రుతులలో ప్రతిపాదింపబడి యుండుటచే నిట్లు నిర్ణయింపబడుచున్నది. అట్లుగుచో జీవేశ్వరులకేల అంశాంశిభావము - అవయవావయవి భావము కలదని చెప్పబడుచున్నది. యనగా''య ఆత్మని తిష్ఠన్నాత్మాన మంతరో యమయతి'' ఎవడు ఆత్మయందున్నవాడై ఆత్మను నియమించుచున్నాడో ఆతడు పరమాత్మ అంతర్యామి యని వర్ణించు శ్రుతిలో జీవేశ్వరులకు నియమ్యనియామక భావము - నానాత్వము - అనగా భేదము వర్ణింపబడుచున్నది. గనుక అని సమాధానము. అట్లగుచో నియమ్యనియామక భావముగల రాజభృత్యులకు వలె అత్యంత భేద మేలచెప్పరాదు అని యనుచో చెప్పుచున్నారు. తత్త్వమసి - ఇత్యాది శ్రుతు లలో నానాత్వమునకు వ్యతిరేకముగ అత్యంతాభేదముగూడ వర్ణింపబడి యున్నది. గనుక- జీవేశ్వరుల కత్యంతాభేదము నిశ్చయింపదగియున్నది గనుక యని, ఇట్లు జీవేశ్వరులకు గల అనానాత్వము - అభేదము. ''బ్రహ్మదాశాః - బ్రహ్మదాసాః - బ్రహ్మైవేమే కితవాః'' దాశకితవాది భేదములతో గోచరించు సర్వజీలును బ్రహ్మాభిన్నులే = బ్రహ్మరూవులే అని అథర్వవేద శాఖలోని వాక్యములలో పఠింపబడియున్న [దాశళబ్దమునకు చేపలనుపట్టి జీవించువారిని - కితవశబ్దమునకు జూదరులని - దాసశబ్దమునకు యావజ్జీవదాస్యమునకు అమ్ముడుపోయిన వారనియు అర్థము. వీరందరును బ్రహ్మాస్వరూపులే అని ఆశ్రుతి వర్ణించుచున్నది.] ఇట్లు శ్రుతులలో - నిరంశత్వము - నానాత్వము - అనానాత్వమునుగూడ వర్ణింపబడి యుండుటచే జీవుడీశ్వరుని యంశమువంటచివాడనియు-జీవేశ్వరులకు గల భేదము వాస్తవికము కాదనియు-ఘటకాశ మహాకాశములకువలె ఔపాధికమే అనుయు - నిశ్చయింపదగును. భేదమును ప్రతిపాదించుశ్రుతులు ప్రత్యక్ష ప్రమాణసిద్ధమగు- జీవస్వరూపము నను వదించుచు జీవేశ్వరాభేదమును బోధించుటయందు తాత్పర్యము కలవియనియు, ఉపాధిభేదముచే కల్పింపబడిన - అధ్యస్తమైన భేదముగలవాడై జీవుడు పరమాత్మయొక్క అంశమువలె నున్నాడనియు దీని భావము-

44. సూ : మన్త్రవర్ణాచ్చ

వివృతిః :- మన్త్రు వర్ణాత్‌ - చ = ''పాదో7స్య విశ్వాభూతాని'' ఇతి మన్త్రవరాత్‌ - జీవప్రధానానాం స్థావరజంగమ భూతానాం బ్రహ్మాం శత్వబోధకా దపి జీవో బ్రహ్మణః అంశ ఇతి వ్యవహారః -

వివరణము :- ''పాదో7స్య విశ్వాభూతాని'' జీవప్రధానమైన ఈచరాచరాత్మక నిఖిలభూతములును ఆ పరమాత్రమయొక్క ఒక పాదము - అనగా చేతనా చేతనాత్మక సర్వదృశ్యమును నా బ్రహ్మవస్తువుయొక్క అంశ##మేఅని బోధించు మస్త్రభాగము ననుసరించియు జీవాత్మ బ్రహ్మయొక్క అంశమని వ్యవహారము చేయబడుచున్నది.

45. సూ : అపి చ స్మర్యతే

వివృతిః :- అపి-చ-స్మర్యతే = ''మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః'' ఇతి శ్రీమద్భగవద్గీతా స్వపి చ జీవస్య బ్రహ్మంశత్వం స్మర్యతే.

వివరణము :- ''మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః'' అని శ్రీమద్భగవద్గీతా గ్రంథమునను జీవుడు బ్రహ్మాంశమని వ్యవహారము చేయబడియున్నది.

46. సూ : ప్రకాశాదివ న్నైవం పరః

వివృతిః :- శ్రుతిస్మృతి ఘాపలభ్యతే అంశాంశిభావ ఇతి - సచన వాస్తవభేదముజీవ్య భవతి - కిం త్వౌపాధికభోదోపజీపన ఏవేత్యాద్యర్థస్య ప్రతిపాదితత్వా జ్జీవేశ్వరయో రత్యన్తాభేద స్సుఘాక్తే భవతి. తథాత్వే జీవస్య దుఃఖేనేశ్వరస్యాపి దుఃఖిత్వం స్యాదిత్యత ఆహ. ఏవం = యథా జీవః అవిద్యావేశవశాత్‌ దేహాద్యాత్మభావ మివ గతస్తత్కృ తేన దుఃఖేన దుఃఖ్యహ మిత్యభిమన్యతే - న- వరః = న తథా పరమేశ్వరో దుఃఖభా గ్భవతి. ఆవిద్యకస్య దేహాద్యాత్మభావ స్యభావాత్‌ - అత్రదృష్టాన్తః ప్రకాశాదివత్‌ =యథా సౌరశ్చాన్ద్రమసోవా ప్రకాశః వియద్వ్యా ప్యావతిష్ఠమానః అంగుళ్యా ద్యుపాధిసంబన్ధా దృజువక్రాదిభావం ప్రతిపద్య మానోపి న పరమార్థత స్తద్భావం ప్రతిపద్యతే - యథా చాకాశో ఘటా దిషు గచ్చత్సు గచ్ఛన్నివ దృశ్యమానో7పి పరమార్థతో న గచ్ఛతి - యథా వా జలాదిగత ప్రతిబింబే కంపమానేపి సూర్యాదిబింబం నకంపతే- తద్వత్‌- తథాచ ఆవిద్యానిమిత్తక జీవభావ వ్యుదాసేన బ్రహ్మభావ మేవ ప్రతిపాదయన్తి వేదాన్తా ''స్తత్త్వమసి- అహంబ్రహ్మాస్మీ'' త్యాదయః తస్మా న్నాస్తి జీవసంబన్ధినా దుఃఖేన పరమాత్మనో దుఃఖిత్వప్రసంగః.

వివరణము :- శ్రుతి స్మృతులయందు జీవేశ్వరులకు అంశాంశిభావ వర్ణనము కానవచ్చుచున్నది. అంశాంశిభావము భేదనిబంధనము. పూర్వపు సూత్రములో జీవేశ్వరుల యంశాంశిభావము వాస్తవభేదము నాశ్రయించినది కాదనియు - ఔపాధికబేదము నాశ్రయించి వ్యవహరింప బడునది యనియు - జీవేశ్వరుల కత్యన్తాభేదము సిద్ధమనియు - బాగుగా నిరూపింపబడినది. అట్లగునో జీవునియొక్క దుఃఖాదులచే నీశ్వరునకు గూడ దుఃఖాదిమత్త్వము ప్రసక్తమగును గదా అను ఆ శంకకు సమాధానమునిట చెప్పుచున్నారు.

జీవు డవిద్యావేశమువలన దేహాద్యుపాధులయందు ఆత్మభావమును ''దేహమే నేనను భావమును పొందినవాడగుచు నేను జన్మజరాది దుఃఖములను పొందుచున్నానని యెట్లు తలంచుచున్నాడో పరమాత్మ అట్లు తలంచుట లేదు. అవిద్యాప్రయుక్తమైన దేహాదులయందలి ఆత్మత్వధ్యాస పరమేశ్వరునకు లేదు. గనుక - సూర్యునియొక్క గాని, చంద్రునియొక్క గాని, ప్రకాశము = కాంతి ఆకాశమునంతను వ్యాపంచి యుండియు వేలువంచి ఆ భాగమునుండి చూడబడినది యగుచు ఋజుపక్రాది భావమును పొందుచున్నను (సాఫీగాను - వంకరగాను - నానావిధములుగ గోచరించుచున్నను) యథార్థముగ నా ఋజువక్రాది భావములు లేనిదియే అయి యుండునట్లును. మరియు - ఘటాదులు కదలుచున్నప్పుడు తద్గతమగు ఆకాశము = ఘటాకాశము కదలుచున్నట్లు చూడబడుచున్నది. యగుచున్నను-యథార్థముగ, గమనము-చలనము లేనిదియే అయి యుండునట్లును-మరియు జలాదులయందుగల ప్రతిబింబము కంపిచుచున్నను సూర్యాది బింబములు కంపించకనే యుండునట్లును - జీవులు దుఃఖాదులు కలిగిన వారైనను పరమాత్మకు ఆ దుఃఖాదులతో సంబంధము కలుగనేరదు. కాననే అవిద్యా నిమిత్తకమైన జీవత్వమును తొలంగిపజేసి ఆత్మకు సహజమైన బ్రహ్మభావమునే ''తత్త్వమసి - అహం బ్రహ్మస్మీ-'' ఇత్యాది వేదాంత వాక్యములు ప్రతిపాదించుచున్నవి. కాన జీవసంబంధి దుఃఖమువలన పరమాత్మకు దుఃఖప్రసక్తి సంభవించనేరదు.

47 . సూ : స్మరన్తిచ

వివృతిః :- స్మరన్తి - చ వ్యాసాదయో మహాత్మనోపి "తత్రయఃపరమాత్మాహి సనిత్యోనిర్గుణ స్మృతః | న లిప్యతే ఫలైశ్చాపి పద్మపతక్ర మివాంభసా || కర్మాత్మా త్వపరో యోసౌం%ోక్షబంధై స్సయుజ్యతే | ససప్త దశ##కే నాపి రాశినా యుజ్యేత పునః" ఇత్యాదినా మహాభారతే పరమాత్మనో7విద్యానుసహిత స్యాదుఃఖిత్వం, జీపస్య తు తదుపహితస్య దుఃఖిత్వ మితి స్మరన్తిచ.

వివరణము :- వ్యాసాదులగు మహాత్ములు మహాభారత గ్రంథములో" తత్రయః వపరమాత్మాహి ....యజ్యతేపునః" జీవాత్మ, పరమాత్మ యను నిద్దరిలో పరమాత్మ నిత్యుజు. నిర్గుణుడని విజ్ఞులచే నిశ్చయింపబడుచున్నాజు. మరియు నాతడు తామరపాకు నీటితో లిప్తముకానట్లు కర్మఫలములతో లిప్తుడుకాక అసంగస్వభావుడై యుండును. కర్మఫలభోర్త యగు జీవాత్మయను నాతడు - బంధమోక్షములను, జన్మపరంపరలను పొందుచునుండును అని చెప్పుచు అవిద్యానుబంధ రహితుడగు పరమాత్మకు దుఃఖాభావమును- అవిద్యానుబంధము గల జీవునకు దుఃఖసంబందమును ప్రతిపాదించుచున్నారు.

48. సూ : అనుజ్ఞాపరిహారౌ దేహసంబన్ధా జ్జ్యోతిరాదివత్‌

వివృతిః :- యద్యేక యేవ సర్వేషాం భూతానా మన్తరాత్మా స్యా త్తర్హి కథ మనుజ్ఞాపరిహారౌ లౌకికౌ వైదికౌ వోపపన్నౌ భవత ఇత్యత ఆహ అనుజ్ఞాపరిహారౌ - అనుజ్ఞా=విధిః "ఋతౌ భార్యా ముపేయాత్‌ - ఇత్యాది ర్వైదికః -"మిత్రం సేవ్యం" ఇత్యాది ర్లోకికః - పరహారః=ప్రతిషేధః -"న పరదారాన్‌ గచ్ఛే" దిత్యాది ర్వైదికః - "శత్ర్వః పరిహర్తవ్యా" ఇత్యాది ర్లౌకిశః - ఏతాదృశౌ సర్వావపి- దేహైస్సం బన్ధో =దేహసంబంధః - దేహసంబంధశ్చ - తత్రాహ మిత్యభిమానః తసై#్యవ - సంసారనిదానత్వాత్‌ - తస్మాత్తాపుపపద్యేతే ఏవ - కథం జ్టయోతిరాదివత్‌ = యథా జ్యోతిషః =అగ్నే రేకత్వేపి శ్మశానసంబన్ధ్యగ్నిః పరిహార్యః - శ్రోత్రియాగారస్థ ఉపాదేయ ఇతి భవతి తద్వాత్‌-

వివరణము:- అనుజ్ఞ-యనగావిధి యిది వైదికమని లౌకికమని రెండు విధములు -ఋతౌ భార్యా ముపేయాత్‌ "ఋతుకాలముల యందవశ్యముగ భార్యను పొందుము. అనునది- వైదికము - "మిత్ర ముపసేవ్యం" మిత్రుని సేవించవలయును - అనునది లౌకికము-"పరిహారమనగా ప్రతి షేధము. ఇదియును రెండువిధములు. "న పరదారాన్‌ గచ్ఛేత్‌" పరభార్యల పొందకుము -ద అనునది వైదికము. "శత్‌రవః పరిహర్తవ్యాః" శత్రువుల దూరముగ పరిత్యజింపదగినవారు - అనునది లౌకికము- ఇట్టివిధినిషేధములు సర్వభూతములయందు నుండు ఆత్మ ఒక్కటియే నన్న ఎట్లు సంభవించునని శంకిపం నవసరములేదు. వివిధ కర్మఫలములగు వివిధదేహముల సంబంధములవలన నవి సంభవించగలవు. దేహసంబంధమనగా దేహములయందలి తాదాత్మత్యభిమానము. అదియే సంసార మూలకారణము, దేహతాదాత్మ్యరూప దేహసంబంధమువలన నవి ఉపపన్నములు కాగలవు అట్లన - అగ్నియను పదార్థము ఒక్కటియే ఐనను శ్మశానస్థమగు అగ్ని పరిహర్తపవ్యమును - శ్రోత్రియుల అగ్ని హోత్రశాలల యందలి అగ్ని స్వీకరింప దగినదియునైన యట్లని గ్రహింపవలయును.

49 సూ : అసంతతే శ్చావ్యతికరః

వివృతిః :-అసంతతేః - చ =ఉపాధీనాం అజ్ఞానాంతఃకరణఆదీనాం భిన్నభిన్నతయా తదుపహిదతానాం జీవానాం సర్వేషా మపి పరస్పరం భిన్నత్వేన సర్వశరీరేషు తత్తదంతఃకరణోపాధికానాం తత్తత్‌ జీవానాం అనంతతేః=అసంబంధాత్‌ =వ్యాప్త్యభావాత్‌ - జీవధర్మణా మపి సుఖ దుఃఖ పుణ్య పాపాదీనాం అవ్యతికరః = అసాంకర్య మప్యుపపద్యేతే-

వివరణము :- ఆత్మైకత్వపక్షములో జీవులకు పరస్పర సుఖదుఃఖసాంకర్య మేర్పడదా లను నాశంకకు సమాధానము - ఉపాధరి&ుభీతములగుఅవిద్యాంతఃకరణముల భిన్నభిన్నములు గాన తదుపహితులగు జీవలకును తద్ద్వారా భేదము సిద్ధించును గాన ఆయా శరీరములయందు తత్తదంతఃకరణోపహితులగు జీవులకు సంబంధము = పరస్పరవ్యాప్తి సంభవించదు గాన జీవధర్మములగు ధర్మాధర్మ - సుఖదుఃఖాందులకును - సాంకర్యాభావము సిద్ధించగలదు. కాన ఆత్మైకత్వపక్షము యుక్తతరము,

50 సూ : ఆభాస ఏవ చ

వివృతి :- ఆభాసః - వఏవ - చ =అయం జీవః పరమాత్మన ఆభాస ఏవ = ప్రతిబింబ ఏవ - జలసూర్యకాదివత్‌ - "రూపగ్‌ రూపం ప్రతి రూపో బభూవ " ఇతి శ్రుతేః- తతశ్చ జీవేశ్వరయో రంశాంశిభావః ప్రాగుక్తః బింబప్రతిబింబరూప ఏవేతి - ప్రతిబింబానా మన్యోన్య ధర్మ సాంకర్యాభావవత్‌ జీవానా మన్యోన్య సాంకర్యాభావోపి యుక్తతర ఇతి నిశ్చీయతే.

వివరణము:- ఈ జీవుడు నీటియందు గోచరించుసూర్యునియొక్క ప్రతిబింబమువలె పరమాత్మయొక్క ప్రతిబింబరూపుడే అని " రూపగ్‌రూపం ప్రతి రూపో బభూవ" ఇత్యాది శ్రుతులనుబట్టి నిశ్చయింపదగును. కాన పూర్వోక్తమగు జీవేశ్వరులయొక్క అంశాంశిభావమున్ను - బింబప్రతిబింబరూపమే అనియు - ప్రతిబింబములకు అన్యోన్య - తద్ధర్మ సాంకర్యములు లేనట్లు జీవులకును అన్యోక్య - తద్ధర్మసాంకర్యములు సంభవించనేర వనుట యుక్తతరమునియు నిశ్చయింపదగును. [ఒక ప్రతిబింబము కంపమును పొందుచుండ - మరియొక ప్రతిబింబము చలింపకయె యుండును గదా! అట్లు ఒక జీవుడు ఒక కర్మఫలము ననుభవించుచుండ - జీవాంతరునకు ఆ కర్మఫలసంబంధ ముండదు. ఇట్లిచట ఆత్మైకత్వపక్షములో కర్మఫల సాంకర్యదోషము ప్రతిబింబవాదము నాశ్రయించి పరిహారింప బడినది.]

51 సూ : అదృష్టా నియమాత్‌

నివృతిః:- ఆత్మైకత్వపక్షే కర్మఫలసాంకర్యాభావ ముపపాద్య కర్మఫలసాంకర్యాది దోషపరిహారాయ జీవనానాత్వం యై రభ్యుపగతం తత్పక్ష ఏవ ఏత దోషా భవన్తీతి నిరూప్యతే - జీవా బహవ శ్చిద్రూపా స్సర్వగతా శ్చేతి సాంఖ్యాః కథయన్తి - నైయాయికా అపి జీవా బహవః- విభవః= సర్వగతాఏవ - అపితు తే జడా మనస్సంయోగో ద్భూతచైతన్యా ఇతిచ కథయన్తి, ఏతాదృశానాం మతే సర్వేషాం జీవానాం విభుత్వేన సర్వేష్వపి శరీరే ష్వంతర్భావా త్సుఖదుఃఖాది సాంకర్య మపరిహార్యం భవతి. తత్రాదృష్టం నియామకం భవిత్వితిచే త్తదపి నోపవద్యత ఇత్యుచ్యతే అదృష్టానియామాత్‌ = సుఖదుఃఖాదిహేతో రదృష్టస్య సర్వాత్మ నన్నిధానే ఉత్పన్నస్య అనియమాత్‌ =అస్యాత్మన ఇదిం- అస్యాద ఇతి నియామక స్యాభావ త్తత్పక్షే సాంకర్యం తదవస్థ మేవ భ##వేత్‌.

వివరణము:- ఆత్మైకత్వపక్షములో సుఖదుఃఖాది కర్మఫలా సాంకర్యము నుపపాదించి - కర్మఫల సాంకర్యదోష పరిహారముకొరకు ఆత్మనానాత్వము నంగీకరించివారి పక్షముననే ఆదోషములు సంభవించునని నిరూపింపబడుచున్నది. సాంఖ్యమతమువారు జీవులనంత సంఖ్యాకులని- చిద్రూపులని - సర్వగతులనియు చెప్పుచున్నారు. నైయాయికులును జీవు లనంతసంఖ్యాకులు - విభువులు- (సర్వమూర్త ద్రవ్యములతో సంయుక్తులై యుండువారు ) సర్వగతులు ననియు - స్వతః జడులనియు- మనస్సంయోగమువలన సముద్భూతమైన చైతన్యము కలవారినియు చెప్పు చున్నారు. ఇట్టివారి మతములయందు - సర్వజీవులును సర్వగతులు గానసమస్త శరీరములయందును సర్వజీవులకును నంతర్భావము సంభవించును గాన సుఖదుఃఖాది కర్మఫల సాంకర్యము పరిహరింప శక్యముకానిది కాగలదు. సుఖదుఃఖాది హేతువగు అదృష్టమును (పుణ్యాపుణ్య స్వరూప మైనది ) నియామకముగా నంగీకరింతుమన్నచో- నదియును కుదురదు. సర్వాత్మలకు సర్వశరీరములయందును సన్నివేశము కలదు గాన ఏఒక్క ఆత్మయందు సుఖదుఃఖాది హేతువగు అదృష్ట ముత్పన్నమైనను సర్వాత్మలయొక్క సాన్నిధ్యమును కలిగియే యుండును గాన ఈఅదృ ఆత్మకు సంబంధించినది యని - అది ఆ ఆత్మకు సంబంధించి నదియని యిచ్లు అదగృరష్టమునకు నియామకమగు సామగ్రియిచట లేదు గాన నా పక్షములలో పలసాంకర్యదోషము పరిహృతము కాక మిగిలి పోయినదియే కాగలదు.

52 సూ : అభిసంధ్యాది ష్వపిచైవం

వివృతిః :- అభిసంధ్యాదయో హ్యదృష్టస్యనియామకా భవన్తి, తేన జీవానాం సుఖదుఃఖాదిసాంకర్యం న ప్రసజ్యత ఇతి చేత్‌ - తథాపి స దోషోశో న పరిహృతో భ##వే దిత్యుచ్యతే- అభిసంధ్యాదిషు - అపి చ = అహిమిదం ఫలం ప్రాప్నవాని - ఇదం పరిహారాణి - ఇత్థ మహం ప్రయతే - ఇత్థం కరవాణీత్యేవం మనోవ్యాపారవిశేషా అభిసంధ్యాదయః - తేషు అదృష్ట నియామకత్వే నాంగీకృతేషు సత్స్వపిఏవం = తేపి అదృష్టస్య నియామకా భవితుం నార్హన్తి? అదృష్టస్య యథా సర్వాత్మసాన్నిధ్యం దుర్వారం తథా అదృష్టజనక కర్మోపయోగి పూర్వోక్త ఫలేచ్ఛా చికీర్షాదీనా మపి సర్వాత్మసన్నిధానే ఉత్పద్యమానత్వాత్‌ సర్వాత్మసాన్నిధ్యం దుర్వార మేవ - తేషామపి అస్యాత్మన ఇమే - ఆస్యేమే ఇతి నియామకస్య కస్యా ప్యభావాత్‌ - తతశ్చ సాంకర్య దోషః అపరిహార్య ఏవ భవతి.

వివరణము :- అదృష్టమునకు అభిసంది మొదలగునవి నియమకములు కాగలవు. అంత సుఖదుఃఖాది సాంకర్యదోషము ప్రసక్తముకాదని యన్నను - ఆ దోషము పరిహృతము కానేరదని నిరూపించుచున్నారు. అభిసంధ్యాదులనగా నేనీ ఫలము ననుభవింతును - ఈ దుఃఖమును పరిహరింతునను సంకల్పము - (ఫలేచ్ఛ) తదర్థమై యిట్లు యత్నింతును అను ప్రయత్నము. ఈ పనిని యిట్లు చేయుదును అనెడి నిశ్చయము ఈ మొదలగు మనోవ్యాపారములు. వానిని అదృష్టమునకు నియామకములుగా అంగీకరించినను - అవి అదృష్ట నియామకములు కాజాలవు - అదృష్టమున కెట్లు సర్వాత్మ సాన్నిధ్యము వారింప శక్యముకానిదో అట్లే అదృష్టోత్పాదకమగు ఫలేచ్ఛాదులును సర్వాత్మ సాన్నిధ్యముననే ఉత్పన్నము లగుచున్నవి. గనుక వానికిని సర్వాత్మసాన్నిధ్యము వారింప శక్యముకానిదియే యగును. ఆ ఫలేచ్ఛాదులకును ఇవి యీ ఆత్మకు సంబంధించినవి - ఇవి ఆ ఆత్మకు సంబంధించినవి యని నియామకమగు సామగ్రియేదియు నచటలేదు. గనుక - ఆ కారణమున సాంకర్యదోషము వారి కపరిహార్యమే యగుచున్నది.

53. సూ: ప్రదేశాదితి చే న్నాంతర్భావాత్‌

వివృతిః :- ప్రదేశాత్‌ = శరీరాంత రేవావస్థితాత్‌ - మనస్సంయుక్తాత్మ ప్రదేశాత్‌ - జ్ఞానేచ్ఛా - కృతి - చికీర్షాదీనాం జన్మస్థానాత్తత్తదాత్మసంబన్ధితయా పృథక్త్వే నావగమ్యమానాత్‌ సుఖదుఃఖాది సాంకర్యాభావ స్సంపాదయితుం శక్యతే - ఇతి -చేత్‌ = ఇతి యదుచ్యేత - న = తదపి నోపపద్యతే - కుతః? అన్తర్భావాత్‌ = సర్వేషా మాత్మనాం, విభుత్వాత్‌, సర్వశరీరాన్తఃకరణషు సర్వత్ర సర్వదా అన్తర్భావస్య = అన్తరవస్థానస్య పరిహర్తు మశక్యత్వాత్‌, మనస్సంయోగప్రదేశ స్యాపి అస్యాత్మనో=7యం ప్రదేశో7స్యాయ మితి నియామకస్య కస్య చనాప్య భావాత్‌ సుఖాదిసాంకర్యం తన్మతే సర్వధా7నపోద్య మేవేతి - యుక్తిబాధాగోచర ప్రతిబింబవాద మాశ్రిత్త్రైవ సుఖదుఃఖవ్యవ స్థోపపాదనీయా ఇత్యవగన్తవ్యం-

ఇతి శ్రీ గాయత్రి పీఠాదీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయతివర విరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ ద్వితీయధ్యాయస్య - తృతీయః పాదః-

వివరణము :- జ్ఞానేచ్ఛాకృతులకు జన్మాకారణమగు మనస్సంయుక్త మగు నాత్మప్రదేశము ఆయా జీవులకు సబంధించినదియై నియతముగ శరీరాంతర్భాగముననే సంపన్నమగుచు ఆయా ఆత్మకు సంబంధించి వేరుగ = సంకీర్ణముగ గోచరించుచుండునది యేది గలదో అట్టి ప్రదేశ విశేషమునుబట్టి ఆ ఆత్మ ప్రదేశమున నుత్పన్నమైన జ్ఞానేచ్ఛాదులతో జేయబడిన కర్మలయొక్క ఫలములు ఆ ఆత్మవియగు ననుచు నిట్లసాంకర్యమును సంపాదింపగలమనుటయు యుక్తము కానేదరు. ఏలయన? జీవలందురును విభువులే గనుక సర్వశరీరముయందును - సమస్తాంతః కరణముల యందును సర్వప్రదేశముల యందును సమస్తజీవులకును అంతరవస్థానము పరిహరింప నలవికానిది యగుటవలన నీ మనస్సంయుక్తాత్మ ప్రదేశమనునదియు - ఈప్రదేశ మీ యాత్మకు సంబంధించినది యనియు - ఆ ప్రదేశము ఆయాత్మకు సంబంధించినది యనియు నిట్లునియామకమగు సామగ్రి యేదియునులేదు గాన సుఖదుఃఖాది సాంకర్యదోష మా మతములలో తొలగింప శక్యముగకానిదియే యని తేలుచున్నది. కానయుక్తి విరుద్ధముకాని - ప్రమాణసమ్మతమగు ప్రతిబింబవాదము నాశ్రయించియే సుఖదుఃఖ వ్యవస్థ - సాంకర్యాభావ ముపపాదన చేయదగినది యని తెలిసికొనదగును,

ఇట్లు శ్రీ గాయత్రి పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున ద్వితీయధ్యాయమున - తృతీయ పాదము ముగిసెను.

ద్వితీయాధ్యాయస్య - చతుర్థః పాదః

ప్రాణోత్పత్త్యధి కరణమ్‌ 1

1. సూ: తథాప్రాణాః

వివృతి :- తథా = యథా వియదాదయ ఉత్పన్నా స్తథా ప్రాణాః = ఇంద్రియాఖ్యాః (గౌణాః) ప్రాణా అప్యుత్పన్నా ఏవ - కుత)? ''ఏతస్మాజ్ఞాయతే ప్రాణో మన స్సర్వేంద్రియాణి చ-ఖం వాయు ర్జ్యోతి రావః పృథివీ విశ్వస్య ధారణీ-'' ఇత్యత్రాకాశాదీనా మివ ప్రాణా నా మప్యుత్పత్తేః శ్రూయమాణత్వాత్‌.

వివరణము :- వెనుకటి పాదములో ఆకాశాదులకు ఉత్పత్తి కలదని నిరూపింపబడినది. ఆకాశదులు వలె ప్రాణములును ఉత్పత్తికలవియే అని గ్రహింపవలయును. కారణమేమియన? ''ఏతస్మాజ్జాయతే ....... ...... ధారిణీ'' ఈ పరమాత్మనుండియే ప్రాణము - మనస్సు- సమస్తేంద్రియములు - పంచభూతములును పుట్టుచున్నవి అవిచెప్పు ఈ శ్రుతిలో ఆకాశాది భూతములకు వలె ప్రాణములకును ఉత్పత్తి వర్ణింపబడినది గనుక - (ప్రాణమనగా నిచట ఇంద్రియము లని యర్థము.)

2. సూ : గౌణ్యసంభవాత్‌

వివృతిః :- గౌణ్యసంభవాత్‌ = గౌణ్యా ఉత్పత్తిశ్రుతే రసంభవః - తస్మాత్‌ - (శ్రుతౌ శ్రూయమాణాయాఃప్రాణానా ముత్పత్తే ర్గౌణీత్వాసంభవా దిత్యర్థః-) ''ఏతస్మాజ్జాయతే ప్రాణో మన...'' ఇత్యాది శ్రుతిః గౌణీ న భవతి - తత్ర ప్రతిపాద్యమానా ప్రాణానా ముత్పత్తి ర్నగౌణీ - కింతుముఖ్యైవ - కుతః? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వ మిదం విజ్ఞాతం భవతీతి- ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం ప్రతిజ్ఞాయ తత్సాధన త యేద మామ్నాతం - ''ఏతస్మాజ్జాయతే...'' ఇత్యాది. గౌణ్యాం తూత్పత్తిశ్రుతా వభ్యపగతాయాం సా ప్రతిజ్ఞా హీయేత - అతో వియదాదీనా మివ ప్రాణానా మప్యుత్పత్తి ర్ముఖ్యైవేతి-

వివరణము :- ప్రాణముల కుత్పత్తిని ప్రతిపాదించు శ్రుతి గౌణము (ఉత్పత్తిని ముఖ్యముగ ప్రతిపాదన చేయునది కాదు) అని యనుటకు అవకాశముండదు, ఈ శ్రుతిలో ప్రతిపాదింపబడిన ప్రాణములయొక్క ఉత్తత్తి ముఖ్యమైన ఉత్పత్తియై గాని గౌణము కాదు గనుక ఆశ్రుతి గౌణము కానేరదు. ఏలయన? ''కస్మిన్ను....భవతి'' ఓ భగవత్స్వరూప! ఆచార్య! ఏ వస్తువు తెలియబడగా ఈ సమస్త దృశ్యమును తెలియబడగలదు? అని ఏకవిజ్ఞానేన సర్వవజ్ఞానముయొక్క ప్రసక్తిని జేసి ఆ ప్రతిజ్ఞను సమర్థించుటకు సాధనముగా ''ఏతస్మా జాయతే...'' అని యీ శ్రుతి పఠింపబడినది. ఇచట ప్రతిపాదింపబడిన ఉత్పత్తి గౌణమని, అట్టి ఉత్పత్తిని ప్రతిపాదించుచున్నది గాన నా శ్రుతి గౌణమని యంగీకరించుచో పూర్వము చేయబడిన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ భగ్నము కాగలదు. సర్వమును బ్రహ్మకార్యము = బ్రహ్మనుండి ఉత్పన్న మగునది యని నిరూపింపబడినప్పుడే గదా కారణ విజ్ఞానము ద్వారా సర్వకార్య విజ్ఞానము సంభవించునది. ఆ కారణమువలన ఆకాశాదులకు వలె ప్రాణములకును ఉత్పత్తి కలదనియు- ఆ ఉత్పత్తి ముఖ్యమే అనియు గ్రహింపదగును.

3. సూ: తత్ర్పాక్‌ శ్రుతేశ్చ

వివృతిః :- తత్ప్రాక్‌ శ్రుతేః - చ = ప్రాక్షు = ప్రాచీనేషు శ్రుతిః= ప్రాక్‌ శ్రుతిః - తస్యప్రాక్‌ శ్రుతిః = తత్ర్పాక్‌ శ్రుతిః- తతః = తత్ర్పాక్‌ శ్రుతేః - తస్య పూర్వోదాహృతశ్రుతౌ శ్రూయమాణస్య - జన్మవాచినః ఆకాశాదిషు ముఖ్యోత్పత్తి ప్రతిపాదకస్య జాయత ఇతిపదస్య ప్రాక్షు = ఆకాశాద్యపేక్షయా తచ్ఛ్రుతౌ పూర్వం పరిపఠితేషు ప్రాణష్వపి శ్రుతేః= శ్రవణాత్‌ - (అన్వయాదిత్యర్ధః-) ప్రాణానా మపి జన్మ ముఖ్యమేవ - తస్మాత్సా శ్రుతి ర్న గౌణీ- కింతు ముఖ్యైవ-

వివరణము:- మరియు - ''ఏతస్మా జ్జాయతే...'' ఈ శ్రుతిలోని ఉత్పత్తిని బోధించు జాయతే అను పదము ఆ శ్రుతివాక్యముయొక్క చివరి భాగములో పఠింపబడిన ఆకాశాదులగు పంచభూతములకు ముఖ్యమైన ఉత్పత్తినే బోధించుచు - తత్పూర్వభాగముననే పఠింపబడిన ప్రాణాదుల యందు గూడ నన్వయించుచున్నదియై ప్రాణాదులకును ముఖ్యమైన జన్మను (ఉత్పత్తిని) ప్రతిపాదించగలదు. కాన ఆ శ్రుతి గౌణము కానేరదు. ముఖ్యమే.

4. సూ: తత్పూర్వకత్వా ద్వాచః

వివృతిః :- కించ వాచః = (వాచ ఇతి పదం వాక్ర్పాణమనసా ముపలక్షకం.) వాక్ర్పాణాదీనాం తత్పూర్వకత్వాత్‌ = ''అన్నమయగ్‌ హి సోమ్య మనః - ఆపోమయః ప్రాణః - తేజోమయీ వాక్‌ -'' ఇత్యాదినా- తేజోబన్నపూర్వకత్వాభిధానాత్‌ - వికారార్థక మయట్‌ శ##బ్దేన వాక్ర్పాణ మనసాం తేజోబన్న వికారత్వావగమాచ్చ - సర్వేషాం ప్రాణానా మవ్యుత్పత్తి ర్ముఖ్యై వేత్యవగన్తవ్యం.

వివరణము:- మరియు - ఈ సూత్రములోని వాచః అను పదము ప్రాణమునకును - మనస్సునకును ఉపలక్షకము అనగా బోధకమని యర్ధము. ఛాందోగ్యోపనిషత్తులోని ''అన్నమయగ్‌ం హి సౌమ్య మనః- ఆపోమయః ప్రాణః- తేజోమయీ వాక్‌'' అను నీ వాక్యములలో వాక్ర్పాణ మనస్సులకు తత్పూర్వకత్వము- తేజోబన్న పూర్వకత్వము వర్ణింపబడినది. పై వాక్యములలోని వికారార్ధక = కార్యత్వమును బోధించు మయట్‌ శబ్దములు వాక్ర్పాణమనస్సులకు తేజోబన్న కార్యత్వమును స్పష్టపరచుచున్నవి. కాన సర్వప్రాణములకును ముఖ్యమగు ఉత్పత్తి కలదనియే నిర్ణయింపదగును.

సప్తగ త్యధికరణమ్‌ 2

5. సూ: సప్తగతేర్విశేషితత్వాచ్చ

వివృతిః :- సప్త=ఇమే ప్రాణాస్సపై#్తవ - కుత్‌ః? గతేః = ''సప్తప్రాణాః ప్రభవన్తి తస్మాత్‌'' ఇతి శ్రుత్యా ప్రాణానాం సప్తత్వావగమాత్‌ - విశేషితత్వాత్‌ - చ = సప్తవై శీర్షణ్యాః ప్రాణా ఇతి విశిష్యాబిధానా చ్చ- ఇతి పూర్వః పక్షః -

వివరణము:- ఈ ప్రాణాములు సప్తసంఖ్యాకములే. ఏలయన? సప్తప్రాణాః ప్రభవన్తి తస్మాత్‌'' అను శ్రుతిలో ప్రాణములు సప్తమంఖ్యాకములని తెలియజేయబడుచున్నది కనుక. మరియు ''సప్త వై శీర్షణ్యాః ప్రాణాః'' అని విశేషముగ సప్తత్వము ప్రాణములకు నిర్దేశింపబడి యున్నది గనుకనున్నూ ప్రాణములు సప్తసంఖ్యాకములే అని పూర్వపక్షము.

6. సూ: హస్తాదయస్తు స్ధితేతో నైవం

వివృతిః :- హస్తాదయః - తు=ప్రాణా స్సప్తభ్యో వ్యతిరిక్తాః హస్తప్రముఖాః కేచన ప్రాణాః ''హస్తో వై గ్రహః - స కర్మణా అతి గ్రహేణ గృహీతః - ''ఇత్యాది శ్రుతిభ్యోవగమ్యతే - అతః = అతోహేతోః స్ధితే = ప్రాణానాం సప్తత్వాతిరేకే స్థితే సతి - ఏవం - న = ప్రాణాస్సపై#్తవేతి నియంతుం న శక్యతే - అపితు యుక్తి. వచనబలాత్తే ప్రాణాఏకాదశేతి నిశ్చీయతే - తథా హి - దర్శన - శ్రవణ - ఆఘ్రాణన- ఆస్వాదన - స్పర్శన - వదన - ఆదాన -గమన - ఆనంద - విసర్గ - ధ్యానానాం పరస్పర విలక్షణానాం కార్యాణా మేకాదశానా ముపలంభాత్‌ - తత్సాధనానా మింద్రియాణా మప్యేకాదశత్వ మవసీయతే - ఏవం శ్రుతి రపి - ''దశేమే పురుషే ప్రాణాః- ఆత్మైకాదశ స్తే యదాస్మా చ్ఛరీరాన్మర్త్యా దుత్ర్కామన్తి - అథ రోదయన్తి'' ఇత్యేకాదశానా మింద్రియాణా ముత్ర్కాంతిం దర్శయతి - అతః ప్రాణా ఏకాదశేతి నిర్ణీయతే.

వివరణము:- ప్రాణములు సప్తసంఖ్యాకములే యని యనుట యుక్తముకాదు. తదతిరిక్తముగ హస్తములు మొదలుగా గల ప్రాణములు కొన్ని కలవని ''హస్తోవైగ్రహః- నచ కర్మణా అతిగ్రహేణ గృహీతః'' ఇత్యాది శ్రుతులలో తెలియజేయబడుచున్నవి గనుక. ఆకారణమువలన (శ్రుతివాక్యానుసారము) ప్రాణములు సప్తాధికములని తెలియబడగా సప్తసంఖ్యాకములే ప్రాణము లని నియమము చేయ శక్యము కాదు. యుక్తి బలముచేతను - వచన ప్రాబల్యమునను నా ప్రాణములు ఏకాదశ సంఖ్యాకములని నిశ్చయింపబడుచున్నవి. దర్శనము - శ్రవణము - ఆఘ్రాణనము - ఆస్వాదనము - స్పర్శనము - వదనము - (మాట్లాడుట)- ఆదానము - (స్వీకరించుట) గమనము - ఆనందము- విసర్గము- (మలాదుల నిస్సరింపజేయుట) ధ్యానము - అనునిట్టి పరస్పర విలక్షణములగు కార్యములు లోకమున నేకాదశ సంఖ్యాకములు (పదునొకండు) కానవచ్చుచున్నవి గనుక ఆయా విలక్షణ కార్యములకు సాధనములును నేకాదశ సంఖ్యాకములని నిశ్చయింపబడుచున్నది. మరియు ''దశేమే....దుత్ర్కామన్తి'' పురుషునియందు ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కలసి పదియు- ఏతన్నియంతయగు ఆత్మ=బుద్ధి పదకొండవది, ఇవి మరణ శీలమగు నీశరీరమునుండి యెప్పుడుత్క్రమించునో అప్పుడు తత్సబంధులను రోదింబజేయుచున్నవి యని వర్ణించు ఈ శ్రుతివాక్యములో ఏకాదశేంద్రియములకు ఉత్క్రాంతి వర్ణింపబడినది. కానను ప్రాణము లేకాదశా సంఖ్యాకములని నిర్ణయింపబడుచున్నది.

ప్రాణాణుత్వాధి కరణమ్‌ 3

7. సూ: అణవశ్చ

వివృతిః :- సాంఖ్యాదయ శ్చక్షుః శ్రోత్రాదీనాం ప్రాణానాం సర్వగతత్వం వర్ణయన్తి - తన్నిరాసా యోచ్యతే - అణవః - చ = ఏతే ప్రకృతాః ప్రాణాః పరిచ్ఛిన్నాః సూక్ష్మాశ్చ - కృత్స్నదేహవ్యాపి కార్యోత్పాద కత్వాత్‌, మరణకాలే శరీరా న్నిర్గచ్ఛతాం తేషా ముపలంభాభావాచ్చ - ఏవం నిశ్చీయతే - న హి సర్వగతత్వ మేషాం సంభవతి. ఉత్క్రాన్తి గత్యాగతీనాం శ్రుత్యుక్తానా మనుపపత్తేః-

వివరణము:- సాంఖ్యులు మొదలగువారు శ్రోత్రాదిరూప ప్రాణములకు సర్వగతత్వమును వర్ణించుచున్నారు. ఆ పక్షమును నిరసించుటకై చెప్పబడుచున్నది - ఈ శ్రోత్రాది ప్రాణములు సర్వగతములు (సర్వవ్యాపకములు) కానేరవు. సర్వశరీరము నందును కార్యోత్పాదనము చేయుచున్నవి కనుకనున్నూ - మరణసమయమున శరీరమునుండి నిర్గమించుచున్నప్పుడు పార్శ్వస్థులగు వారి కెవ్వరికిని గోచరించుచుండుట లేదు గాననున్నూ - ప్రాణములు పరిచ్ఛిన్నము లనిన్నీ - సూక్ష్మము లనిన్నీ నిశ్చయింపబడుచున్నవి. మరియు నివి సర్వగతములనుట యుక్తము కాదు. ఏలయన? శ్రుతులలో వర్ణింపబడిన ఉత్క్రాంతి గత్యాగతు లుపపన్నములు కానేరవు గనుక ననియు తెలియదగును.

ప్రాణ శ్రైష్ఠ్యాధి కరణమ్‌ 4

8. సూ: శ్రేష్ఠశ్చ

వివృతిః:- శ్రేష్ఠః- చ = ముఖబిలే సంచరన్‌ ఉచ్ఛ్వాసనిశ్వాసకారీ ప్రాణాపానాది భేదేన పంచధా వర్తమానో యో ముఖ్యః ప్రాణ స్సోపి జాయత ఏవ- ''ఏతస్మాజ్జాయతే ప్రాణో...'' ఇతి శ్రుతౌ తస్యాప్యుత్పత్తి శ్రవణాత్‌ -

వివరణము:- ఉచ్ఛ్వాస నిశ్వాసములను కలుగజేయుచు ముఖబిలము లోపల సంచరించు ప్రాణాపానాది వృత్తిబేధములతో నైదువిధములుగ వ్యవహరింపబడుచున్న ముఖ్యప్రాణమును పుట్టుక కలదియే. ''ఏతస్మాజ్జాయతే....'' ఈ శ్రుతివాక్యములో ఆ ముఖ్యప్రాణమునకును ఉత్పత్తి వర్ణింపబడియున్నది గనుక నని తెలియదగును.

వాయుక్రియాధి కరణమ్‌ 5

9. సూ: న వాయుక్రియే పృథగుపదేశాత్‌

వివృతిః :- ఏవం సర్వేషాం ప్రాణానాం ముఖ్యప్రాణస్య చోత్పత్తి రస్తీతి నిరూపితం- తతశ్చ తేషాం సర్వకారణ బ్రహ్మవికారత్వ మపిస్థాపితం - ఇదానీం ముఖ్యప్రాణస్య స్వరూప మధికృత్య చిన్తా క్రియతే- వాయుక్రియే = వాయుశ్చ క్రియా చ = వాయుక్రియే - వాయుః = అయం ముఖ్యః ప్రాణః వేణురంద్రవ న్ముఖఛిద్రే ప్రవి శ్యావస్థితో బాహ్యవాయు రేవ - అథవా క్రియా = సర్వేంద్రియ సాధారణ వ్యాపార రూపా వా - = న భ##వేత్‌ - కింతు తత్త్వాన్తర మేవ - కుతః? వృథగుపదేశాత్‌ = ''ప్రాణ ఏవ బ్రహ్మణ శ్చతుర్థః పాదః స వాయునైవ జ్యోతిషా భాతి'' ఇత్యత్ర - ప్రాణసంవాదే చ వాయోః వాగాదికరణభ్యశ్చ ప్రాణస్య భేద నిర్దేశాత్‌ - నహి కరణవ్యాపార ఏవ సన్‌ కరణభ్యః పృథగుపదేశ మర్హతి - తస్మా త్ర్పాణ స్తత్వాంతర మేవ.

వివరణము :- ఇంద్రియరూప ప్రాణములకును- ముఖ్యప్రాణమునకును ఉత్పత్తి కలదని నిరూపింపబడెను. మరియు నివియన్నియు సర్వకారణమగు బ్రహ్మనుండియే పుట్టుచున్నవనియు నిర్ధారణ చేయబడినది. ఇప్పుడు ముఖ్యప్రాణముయొక్క స్వరూపమునుగూర్చి విచారము చేయబడుచున్నది.

ఈ ముఖ్యప్రాణము అనునది వేణురంధ్రము నందున్న వాయువువలె ముఖబిలమధ్యమును ప్రవేశించియున్న బాహ్యవాయు ద్రవ్యమే అని గాని - లేదా సర్వేంద్రియములకు సంబంధించిన సర్వసాధారణ (సమిష్టి) వ్యాపారరూపమగు క్రియాస్వరూపమైనది యని గాని నిర్ణయింప వలను పడదు. అది బాహ్యవాయువుకంటెను. వ్యాపారముకంటెను వేరైనపదార్థాం తరమే యగును. ఏలయన? ''ప్రాణ ఏవ బ్రహ్మణ.....భాతి'' మనోరూప బ్రహ్మమును వర్ణించుచు వాగాదులను పాదములుగా ప్రతిపాదించు సందర్భములో ఆ మనోరూప బ్రహ్మమునకు ప్రాణము నాల్గవపాదము - అది అధిదైవికమగు వాయువుచే నభివ్యక్త మగుచున్నది యని చెప్పు ఈ శ్రుతివాక్యములోనున్నూ - ప్రాణసంవాద గ్రంథమునను వాయువుకంటెను - వాగా దీంద్రియముల కంటెను ప్రాణము పృథక్కుగ (వేరుగ) నిర్దేశింపబడియున్నది గనుక - సర్వేంద్రియ సాధారణ వ్యాపారమే యగుచో నింద్రియములకంటె వేరుగ ప్రాణమున కుపదేశముండదు గదా! ఈ కారణములను బట్టి విచారింప ప్రాణము వాయు క్రియలకంటె వేరైన పదార్థాంతరమే అని సిద్ధమగుచున్నది.

10. సూ: చక్షురాదివత్తుత్తత్స హశిష్ట్యాదిభ్యః

వివృతిః :- చక్షురాదివత్‌ - తు = చక్షురాదికరణాని యథా జీవస్యోప కరణాని తథాయం ముఖ్యప్రాణోపి జీవ స్యోపకరణ మేవ - న స్వతంత్రః - కుతః? తత్సహశిష్ట్యాదిభ్యః = తై శ్చక్షురాదిభి స్సహ తుల్యతయా ప్రాణస్యాపి శాసనాత్‌ - వర్ణనాత్‌ - ఆదిశ##బ్దేన చక్షురాదివ దచేత నత్వాత్‌ - సంహతత్వాచ్చ న స్వతంత్రః ప్రాణ ఇత్యపి విశేషాంశో గ్రాహ్యః-

వివరణము:- చక్షురాదీంద్రియములు జీవుని కుపకరణము లైనట్లు ఈ ముఖ్యప్రాణమును జీవాత్మయొక్క ఉపకరణమే గాని స్వతంత్ర పదార్ధము కాదు ఏలయన? చక్షురాదీంద్రియములతో సహ వానితో తుల్యముగ ప్రాణము శ్రుతులలో వర్ణింపబడినది గనుక - మరియు అచేతనము గనుకను - సంహతము గనుకను గూడ నీ ముఖ్యప్రాణము చక్షురాదీంద్రియములవలె నస్వతంత్రమైనది యనియును గ్రహింపదగును.

11. సూ: అకరణత్వాచ్చ న దోష స్తథాహి దర్శయతి

వివృతిః:- ముఖ్యప్రాణస్య జీవోపకరణత్వం న సంభవతి - తథాత్వాభ్యుపగమే చక్షురాదివ త్సవిషయత్వం వక్తవ్యం - తచ్చ న సంభవతి - రూపాలోచ నాద్యేకాదశ విషయాతిరిక్తస్య విషయ స్యాసంభవాత్‌ - ఇత్యత ఆహ - దోషః = సవిషయ త్వాసంభవరూపో దోషః న=ముఖ్యప్రాణస్య న సంభవతి. కుతః? అకరణత్వాత్‌ = తస్య చక్షురాదివత్‌ జ్ఞాన కరణత్వా భావాత్‌ - న చైతావతా తస్య నిర్విషయత్వ మిత్యాస్థేయం - తథా - హి - దర్శయతి = ''తాన్‌ వరిష్ఠః ప్రాణ ఉవాచ మామోహ మాపద్య థాహమే వైత్పంచధాత్మానం ప్రవిభ జ్యైతద్బాణ మవష్టభ్య విధారయామి'' ఇతి శ్రుతి రింద్రియాన్తరే ష్వసంభావ్యమానం అసాధారణం దేహాదిధారణాఖ్యం వ్యాపారం ముఖ్యః ప్రాణో నిర్వహతీతి ప్రతిపాదయతి - అతః ప్రాణస్య జీవోపకరణత్వే న కాచి దనుపపత్తిః -

వివరణము :- ముఖ్యప్రాణము జీవాత్మ కుపకరణమని యనుట యుక్తము కానేరదు. దానికి ఉపకరణత్వము నంగీకరించుచో చక్షుః శ్రోత్రాది తత్త దింద్రియములకు దర్శన. శ్రవణాదిరూపమగు అసాధారణ వ్యాపారములును - రూప- శబ్దాది అసాధారణ విషయములు నున్నట్లు దానికిని ఒక అసాధారణ విషయము చెప్పవలసివచ్చును. అట్టివిషయము ప్రాణమునకు సంభవించదు. రూపము మొదలుకొని ఆలోచనమువరకుగల పదునొకండు విషయమును చక్షురాది - మనోంతకరణములకు అసాధారణ విషయములుగ నిర్ణయింపబడినవి. తదతిరిక్త విషయాంతరము లేదు గాన చక్షురాదులువలె ముఖ్యప్రాణము జీవోపకరణమని యనుట యుక్తము కాదని ఆక్షేపమురాగా చెప్పుచున్నారు.

విషయము సంభవించకపోవుట యను దోషము ముఖ్యప్రాణమునకు సంభవించదు. అది చక్షురాదులవలె జ్ఞానకరణము కాదు గదా! ఇట్లు చెప్పినంతమాత్రమున జీవోపకరణముగా నిర్ణయింపబడిన ముఖ్యప్రాణమునకు అసాధారణ విషయము లేకపోలేదు. ''తాన్‌ వరిష్ఠః..... విధారయామీతి'' ప్రాణసంవాదములోని యీ వాక్యములో ముఖ్యప్రాణము చక్షురాదీంద్రియ రూపములగు అముఖ్యప్రాణములతో నిట్లనుచున్నది, మీరజ్ఞానమును పొందకుడు, నాశ్రైష్ఠ్యమును గుర్తింపుడు, మీరందరు మీ మీ వ్యాపారముల నుపసంహరించుకొన్నను, ఈ శరీరమునకు భంగము లేదు. నేను ఐదువిధములుగ నా ఆత్మను విభజించుకొని యీ దేహమును ధరింతును అని చెప్పు ఈ శ్రుతి వాక్యము ఇంద్రియాంతరములకు సంబంధించని దేహధారణరూపమగు అసాధారణ వ్యాపారమును ముఖ్యప్రాణము నిర్వహించుచున్నది యని ప్రతిపాదించుచున్నది. కాన ముఖ్యప్రాణము జీవోపకరణము అని యనుటలో అనుపపత్తి యేదియును లేదు.

12. సూ: పంచవృత్తిర్మనోవద్వ్యపదిశ్యతే

వివృతిః :- అపిచ పంచవృత్తిః = ఆయం ప్రాణః ప్రాణాపానాది పంచావస్థ ఉచ్ఛ్వాసాది వ్యాపారవా నితి వ్యపదేశాత్‌ = శ్రుతిషు ప్రతిపాద్యతే - మనోవత్‌ = యథా మనః యోగశాస్త్రే ప్రసిద్ధ - ప్రమాణ - విపర్యయ- వికల్ప - నిద్రా - స్మృతిరూప పంచవృత్తి మత్త్వేన వ్యపదిశ్యతే తద్వత్‌ - తస్మా ద్విశిష్టకార్యోపేతత్వాత్‌ ప్రాణోపి జీవస్యోపకరణమేవేతి.

వివరణము:- మరియు నీ ముఖ్యప్రాణము శ్రుతులలో ప్రాణాపానాది పంచవృత్తులు కలదియు - ఉచ్ఛ్వాస నిశ్వాసాదివ్యాపారములు కలదియు నని వర్ణింపబడుచున్నది. యోగశాస్త్రములయందు మనస్సెట్లు ప్రమాణ - విపర్యయ - వికల్ప - నిద్రా - స్మృతులను పంచవృత్తులు కలదిగ వర్ణింపబడుచున్నదో అట్లు. కానను - సర్వశరీర ధారణమను విశిష్టకార్యముకలదిగానను ముఖ్యప్రాణము జీవాత్మ కుపకరణము కాగలదు.

శ్రేష్ఠాణుత్వాధి కరణమ్‌ 6

13. సూ: అణుశ్చ

వివృతిః :- అణుః - చ = ఇతరప్రాణవ దయమపి ముఖ్యః ప్రాణః అణురేవ - న విభుః - పరిచ్ఛిన్నః - సూక్ష్మ శ్చేత్యర్థః- కుతః? ఉత్ర్కాన్త్యాదిషు పార్ష్వస్థై రనుపలభ్యమానత్వాత్‌ - ఇతి.

వివరణము:- ఇంద్రియరూప ప్రాణములువలె నీ ముఖ్యప్రాణమును అణువే - విభువు కాదు (అనగా - పరిచ్చిన్నము- సూక్ష్మమును ననియర్థము) ఏలయన? ఉత్ర్కాంత్యాదులయందు పార్శ్యస్థులచే గ్రహింపబడుటలేదు గనుక.

జ్యోతిరాద్యధి కరణమ్‌ 7

14. సూ: జ్యోతిరాద్యధిష్ఠానం తు తదామననాత్‌

వివృతిః :- ఇదానీం వాగాదీనాం తేషాం ప్రాణానాం స్వస్వకార్య కరణ స్వాతంత్ర్య మన్తి నవేతి విచార్యతే - జ్యోతిరాద్యధిష్ఠానం - తు = జ్యోతిరాదిభి రగ్న్యాదిభి రభిమానిదేవనతాభి రధిష్టితా న్యేవ వాగాదీని సర్వాణి కరణాని వదనాది స్వస్వవ్యాపారా న్నిర్వర్తయన్తి - నతు స్వయమేవ - కుత ఏవం నిశ్చీయతే - తదామననాత్‌ = తస్య జ్యోతి రాద్యధి ష్ఠానత్వస్య- అమననాత్‌ = శ్రుతౌ ప్రతిపాదనాత్‌ - ''అగ్ని ర్వాగ్భూత్వాముఖం ప్రావిశత్‌-'' ఇత్యాదినా కరణానాం దేవతాధిష్ఠానత్వ మభిహితం- తస్మా దధిష్ఠాతృ దేవతాధీ నైవేంద్రియాణాం ప్రవృత్తి రితి సిద్ధ్యతి-

వివరణము:- ఇచట వాగాదీంద్రియములకు తమ తమ వ్యాపారములయందు స్వాతంత్ర్యము కలదా? లేదా? అని విచారింపబడుచున్నది. అభిమాని దేవతలగు అగ్న్యాదులచే నధిష్ఠింపబడినవియై వాగాది సర్వకరణములును స్వవ్యాపారములగు వదనాదులను (మాటలాడుట మొదలగు వానిని) నిర్వర్తించుచున్నవి. కాని స్వయముగ కాదు. ఎందు కిట్లు నిశ్చయింపబడుచున్నది యనగా? ''అగ్ని ర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్‌'' ఇత్యాది శ్రుతులలో కరణములయందు దేవతలధిష్ఠించి యుండుట వర్ణింపబడియున్నది గాన నట్లు నిశ్చయింపబడుచున్నది. కాన ఇంద్రియముల ప్రవృత్తి యంతయు తదధిష్టిత దేవతాధీనమైనదియే అని సిద్ధించుచున్నది.

15. సూ: ప్రాణవతా శబ్దాత్‌

వివృతిః :- దేవతానా మగ్న్యాదీనాం వాగాది కరణాధిష్టాతృత్వే తాసా మేవ భోక్తృత్వప్రసంగో న శారీర స్యేత్యాక్షేపే ఉచ్యతే- ప్రాణవతా = కార్యకరణ సంఘాతస్వామినా జీవే నైవైషాం ప్రాణానాం భోక్తృభోగ్యభావ స్సంబంధః- నత్వగ్న్యాదిభిః కరణాధిష్ఠాతృ దేవతాభిః - కుత ఏవ మవగమ్యత ఇత్‌ చేత- శబ్దాత్‌ = ''అథయో వేదేదం జిఘ్రాణీతి - నఆత్మా గంధాయ ఘ్రాణం'' ఇత్యాది శ్రుతేః - తస్మా దస్మిన్‌ శరీరే జీవ ఏవ భోక్తా నతు కరణాధిష్ఠాత్ర్యో దేవతా శ్శరీరే వర్తమానా అపి-

వివరణము :- వాగాదికరణముల నధిష్టించియుండు అగ్న్యాది దేవతలే తత్ర్పవర్తకులుగాని కరణములకు స్వతంత్రముగ ప్రవృత్తి యుండదని నిరూపింపబడినది. అట్లు కరణాధిష్టాతృత్వము. (ఇంద్రియప్రవర్తకత్వము) తదధిష్ఠిత దేవతలకే కలదన్న వారికే సుఖదుఃఖాది కర్మఫల భోక్తృత్వము చెప్పవచ్చును. శారీరు (జీవు)నకు చెప్పనవసరము లేదు గదా అను ఆక్షేపమురాగా చెప్పు చెప్పుచున్నారు-

ఈ దేహేంద్రియాది సంఘాతమునకు స్వామియైన ఈ జీవాత్మ తోడనే ప్రాణములకు భోక్తృభోగ్యభావ రూపమగు సంబంధముగాని అగ్న్యాది దేవతలతో కాదు. ఏలయన? ''అథ యో వేదేదం జిఘ్రాణీతి స ఆత్మా గంధాయ ఘ్రాణం'' దేహమునందు ప్రాణము ప్రవేశించిన తరువాత నెవడు దీని నాఘ్రాణింతునని సంకల్పించుచున్నడో అట్టి చిద్రూపుడగువాడు ఆత్మ - అతడు గంధజ్ఞానముకొరకు దేవతాధిష్టితమగు ఘ్రాణమును స్వీకరించును- అని చెప్పుచున్న ఇట్టి శ్రుతులనుబట్టి యిట్లు నిర్ణయింపబడుచున్నది. దేవతాధిష్టిత ఇంద్రియ వర్గముచే కల్పింపబడిన గంధాది విషయక భోక్తృత్వము జీవాత్మకు సంబంధించినదియే యగును. శరీరమున నిరంతర ముండువారైనను దేవతల కిట్టి భోక్తృత్వము సంభవించదు. వారు కరణాధిష్ఠితులై కరణోపకారకులు మాత్రమగుచున్నారని తెలియదగును.

16. సూ: తస్య చ నిత్యత్వాత్‌

వివృతిః :- కించ - తస్య-చ = జీవస్య - అస్మిన్‌ శరీరే నిత్యత్వాత్‌ = నిత్యసన్నిహితత్వాత్‌ భోక్తృత్వం, న దేవానాం. తేషాం తత్రపుణ్యపాపలేపాభావాత్‌ - తాహి దేవతాః పరస్మి న్నైశ్వర్యపదే అవతిష్ఠమానాః క్షుద్రే మనుష్య దేహే భోగం న ప్రతిలభ##న్తే.

వివరణము:- మరియు - నా జీవునకు ఈ మానవాది దేహమునందు స్వకృత పుణ్యపాపలేపము సంభవించును గనుక - తత్ర్పయుక్త సుఖదుఃఖ భోగము సంభవించును గనుకనున్నూ - నిత్య సన్నిహితత్వము కలదు గాననూ ఆ జీవాత్మకే భోక్తృత్వము చెప్పదగును గాని దేవతల కట్లు చెప్పతగదు. ఆ దేవతలు విశిష్ట పుణ్యకర్మఫలమగు పరమైశ్వర్య స్ధానమున నుండువారు గనుక నీక్షుద్రమగు మానుష దేహమునందు భోగమును పొందబోరు. కాన భోక్తృత్వము జీవునకే అని నిశ్చయింపదగును.

ఇంద్రియాధి కరణమ్‌ 8

17. సూ: తఇంద్రియాణి తద్వ్యపదేశా దన్యత్ర శ్రేష్ఠాత్‌

వివృతిః :- ముఖ్యః ప్రాణ ఏకః - అన్యేచైకాదశ ప్రాణాః - ఇతిప్రాగుక్తం - అథేదానీం వాగాదయో యే ప్రాణాస్తే ముఖ్యసై#్యవ ప్రాణస్య అపానాదివత్‌ వృత్తిభేదా ఏవ వా? ఉత తత్త్వాంతరాణి వా? ఇతి విచార్యతే. ఇంద్రియాణి = ఇంద్రియశబ్దవాచ్యాః తే = ప్రకృతా వాగాదయః ఏకాదశ ప్రాణాః శ్రేష్ఠాత్‌ = ముఖ్యప్రాణాత్‌ - అన్యత్ర = భిన్నా ఏవ- నతు ముఖ్యప్రాణస్య వృత్తిభేదాః కుతః? తద్వ్యపదేశాత్‌ = ''ఏతస్మాజ్జాయతే ప్రాణో'' ఇతి శ్రుతౌ ముఖ్యస్య ప్రాణస్య. ఇంద్రియాణాం చ భేదేన వ్యపదేశస్య సత్వాత్‌.

వివరణము:- ముఖ్యప్రాణము ఒక్కటి యని, ఇంద్రియరూప ప్రాణములు పదునొకండనియు వెనుక చెప్పబడినది. వాగాదీంద్రియ రూప ప్రాణములు ముఖ్యప్రాణముయొక్క అపానాదివృత్తివిశేషములవలె వృత్తివిశేష రూపములా, లేక పదార్ధాన్తరములా? అని యిచట విచారింపబడుచున్నది.

ఇంద్రియ శబ్దముతో వ్యవహరింబడు ప్రాణములు ముఖ్యప్రాణముకంటె వేరైన పదార్ధములే - ''ఏతస్మాజ్జాయతే ప్రాణో మన స్సర్వేంద్రియాణి చ -'' అను నీ శ్రుతిలో ముఖ్యప్రాణముకంటె వేరుగ ఇంద్రియముల యొక్క ఉత్పత్తి వర్ణింపబడియున్నది గనుక.

18.సూ: భేదశ్రుతేః

వివృతిః :- భేదశ్రుతేః = ''మనో వాచం ప్రాణం తాన్యాత్మనే కురుత'' ఇత్యాదిషు శ్రుతిషు వాగాదిభ్యః ప్రాణస్య భేదశ్రవణాత్‌ - అతస్తత్వాంతరాణ్యవ ప్రాణా దీంద్రియాణీతి-

వివరణము:- మరియు - ''మనో వాచం ప్రాణం తాన్యాత్మనేకురుత'' మనస్సు - వాక్కు - ప్రాణము - అను వీనిని ఆత్మకు భోగోపకరణములుగ జేసెను అని చెప్పు ఈ శ్రుతిలో ఇంద్రియములకు ప్రాణమునకు భేదము వర్ణింపబడియున్నది గనుక ప్రాణముకంటె ఇంద్రియములు భిన్నములే యగును.

19.సూ: వైలక్షణ్యాచ్చ

వివృతిః :- వైలక్షణ్యాత్‌ - చ = వాగాదీనాం - ముఖ్యప్రాణస్య చ- సుప్తత్వ - అసుప్తత్వ- దేహధారణహేతుత్వ - తదహేతుత్వాది విలక్షణ = విరుద్ధ ధర్మవత్వాచ్చ ముఖ్యప్రాణా దితరే వాగాదయ ఇతి-

వివరణము:- వాగాదీంద్రియములు ముఖ్యప్రాణముకంటె వేరైనవియే యగును. ఏలయన? వైలక్షణ్యముకలదు గాన- వైలక్షణ్యమనగా విరుద్ధధర్మములు కలిగియుండుట యని యర్థము. నిద్రాకాలమున నింద్రియములు నిద్రించుచుండును. ముఖ్యప్రాణమట్లు కాక జాగరూకమైయుండును. అట్లే ముఖ్యప్రాణము దేహధారణ హేతువగుచున్నది. ఇంద్రియము లట్లుకాదు. ఇట్టివైలక్షణ్యము ఇంద్రియ ముఖ్యప్రాణములకు కలదు గాన నవి ముఖ్యప్రాణముకంటె వేరైన పదార్థములే యని నిర్ణయింపదగును.

సంజ్ఞామూర్తి కప్త్యధికరణమ్‌ 9

20.సూ: సంజ్ఞామూర్తి కప్తిస్తుత్రివృత్కురతఉపదేశాత్‌

వివృతిః :- సంజ్ఞామూర్తి - కప్తిః తు = సంజ్ఞా = నామ మూర్తిః = రూపం - తయోః కప్తిః = వ్యాకరణం = నామరూప నిష్పాదన మితి యావత్‌ - ''అనేన జీవే నాత్మ నా నుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి'' ఇతి శ్రుత్యుక్తం నామరూపరయో ర్వ్యాకరణం తు త్రివృత్కుర్వతః = త్రివృత్కరణకర్తుః పరమేశ్వర సై#్యవకర్మ - నతు జీవస్య - కుతః - ఉపదేశాత్‌ = ''సేయం దేవ తైక్షత'' ఇత్యుపక్రమ్య వ్యాకరవా ణీత్యుత్తమ పురుష ప్రయోగేణ పరబ్రహ్మణ ఏవ వ్యాకర్తృత్వోపదేశాత్‌.

వివరణము:- సంజ్ఞ యనగా నామము - మూర్తి యనగా రూపము. కప్తి యనగా వ్యాకరణము - సంజ్ఞామూర్తి కప్తి యనగా నామరూపముయొల యొక్క (సమస్త ప్రపంచముయొక్క) నిష్పాదనము. అది త్రివృత్కరణ కర్తయగు పరమేశ్వరునిచే చేయబడునదియే - కాన నామరూపవ్యాకరణ కర్త ఈశ్వరుడే గాని జీవుడు కాదని తెలిసికొనవలయును. ఏలయన? ''సేయం దేవ తైక్షత'' అని సదాఖ్య పరమాత్మతో ఉపక్రమముచేసి - చివర ''వ్యాకరణవాణీతి'' నిష్పాదనము చేయుదును అనుచు ఉత్తమపురష పద ప్రయోగముతో పరబ్రహ్మయే నామరూప వ్యాకరణ కర్తగా శ్రుతిలో నుపదేశింపబడియున్నది గనుక నని తెలియ దగును.

21. సూ: మాంసాది భౌమం యథాశబ్దమితరమోశ్చ

వివృతిః - బాహ్యం త్రివృత్కరణ మభిధాయ అధ్యాత్మికం పరం త్రివృత్కరణ మభిదధాతి - భౌమం = త్రివృత్కృతాయా భూమే రన్నాది రూపాయాః పురషే ణోపభుజ్యమానాయాః కార్యం. మాంసాది = మాంసలోహితాదికం శరీరాన్త రవస్ధితం - యథాశబ్దం = ''అన్న మశితం త్రేధావిధీయతే'' ఇత్యాది శ్రుత్యుక్త ప్రకారేణ నిష్పద్యతే - అశిత మన్నం పురీష - మాసంస - మనోరూపేణ త్రేధా భవతి - ఇతరయోః - చ = అప్తేజసో రపి కార్యం యథాశబ్దం త్రేధా భవతి - అపాం కార్యం - మూత్ర లోహిత - ప్రాణ - రూపం భవతి - తేజః కార్యం తు - అస్ధి - మజ్జా - వాగ్రూపం భవతీత్యర్థః -

వివరణము :- బాహ్యమగు త్రివృత్కరణమునుగూర్చి చెప్పి - ఆధ్యాత్మికమగు శరీరాంతర్గతమగు త్రివృత్కరణము ఇచట చెప్పబడుచున్నది. - త్రివృత్కృతమైన పురుషులచే భుజింపబడిన అన్నాదిరూపమైన భూమ్యంశముయొక్క కార్యమే శరీరాంత రవస్ధితమైన మాంసలోహితాదికము - తద్విశేషములు ''అన్న మశితం త్రేధా విధీయతే'' భుజింపబడిన అన్నము మూడు విధములుగ నగుచున్నది యని యిట్లు తద్విశేషములను ప్రతిపాదించు శ్రుతి ననుసరించి యేర్పడుచుండును. భుజింపబడిన యన్నము పురీష - మాంస - మనోరూపముగ నిట్లు మూడు విధములుగ నగును - ఇట్లే అప్తేజస్సులకు సంబంధించిన విశేషములను యథాశబ్ద మేర్పడుచుండు నని గ్రహింపవలయును. ఉపభుక్తములైన జలములు మూత్ర - లోహిత - ప్రాణరూపముగ నిట్లు మూడువిధములుగ నగును - అట్లే ఉపభుక్తమగు తేజస్సు - (తైల - ఘృతాదికము) అస్ధి - మజ్జా - వాగ్రూపములుగ నిట్లు మూడు విధములుగ నగు ననియు గుర్తింపదగును.

22. సూ: వైశేష్యాత్తు తద్వాద స్తద్వాదః-

వివృతిః :- తద్వాదః - తు = సర్వేషాం భూతభౌతికానాం త్రివృత్కరణావిశేషేపీయం పృథి వీమా ఆప ఇదం తేజః - ఇతి పృథివీత్వాది వ్యవహారస్తు - వైశేష్యాత్‌ = భావో వైశేష్యం - భూయస్త్వ మితర్థః పృథివ్యా ద్యంశానాంమ భూయసాం సద్భావా ద్భవతీతి జ్ఞేయమ్‌ దత్వాదఇతి పద స్యాభ్యాసః = ద్విరుక్తి రధ్యాయపరిసమాప్తిం ద్యోతయతి-

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర

éవిరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ ద్వితీయాధ్యాయస్య - చతుర్ధః పాదః

(అవిరోధాధ్యాయ స్పమాప్తః)

వివరణము:- భూతభౌతిక పదార్ధములన్నియు త్రివృత్కృతములే యగుచో ఇది పృథివియనియు - ఇవి జలములని - ఇది తేజస్సని - యిట్లుచేయబడు లోకవ్యవహార మెట్లుపపన్నము కాగలదనినచో చెప్పుచున్నారు. వైశేష్యాత్‌ అని. అనగా పృథివ్యంశములకు బహుశ్యమున్న పృథివియని - జలాంశములకు బహుళ్యమున్న జలమని - అట్లే తేజోంశ బాహుళ్యముచే తేజస్సనియు వ్యవహారము యుక్తము కాగలదు. అని.

తద్వాదః అను పదముయొక్క అభ్యాసము = ద్విరుక్తి అధ్యాయ పరిసమాప్తిని సూచించును.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్ధ వివరణమున

ద్వితీయాధ్యాయమున చతుర్ధపాదము ముగిసెను.

(అవిరోధా ధ్యాయము ముగిసెను)

Brahma Suthra Vivruthi    Chapters    Last Page