Brahma Suthra Vivruthi    Chapters    Last Page

చతు ధ్యాయే (ఫలాధ్యాయే)

- ప్రథమః పాదః-

బ్రహ్మసూత్ర వికృతిః

తృతీయే అధ్యాయే ప్రాయః పరాపరవిద్యాసాదనసంబన్ధివిచారః కృతః.

అస్మిన్న ధ్యాయే ఫల సంబనివిచారాః కరిష్యన్తే. ప్రసంగాగతం చ

కిమప్యన్యత్‌. అత్ర ప్రథమత స్తృతీయధ్యాయశేశ##త్వేన కతిచన

సాధనాశ్రయా ఏవ విచారాః క్రియన్తే

ఆవృత్త్యధికరణమ్‌ 1

1. సూ: ఆవృత్తి రసకృదుపదేశాత్‌

వివృతిః :- పూర్వాధ్యాయ వినిశ్చి తేతికర్తవ్యతానాం బ్రహ్మతత్త్వ సాక్షాత్కార కారణానాం శ్రవణాదీనా మావృత్తిః కార్యావా, ఉత తే సకృ దేవానుష్ఠేయా ఇత్యే దత్ర విచార్యతే -ఆవృత్తిః=షడ్జాదిస్వరసాక్షాత్కారే యథా ఆవృత్తి విశిష్ట మేవ శ్రవణం హేతు స్తథా దుర్విజ్ఞే యాత్మతత్త్వ సాక్షాత్కారే ప్యావృత్తివిశిష్ట శ్రవణాదీనాం హేతుత్వం వక్తవ్యం. అతస్తేషా మావృత్తిః కర్తవ్యైవ. నతు దర్శాదియాగసాధనానాం ప్రయాజాదీనా మివ తేషాం సకృదనుష్ఠానం యుక్తం భవతి. కస్మాత్‌? అసకృదుపదేశాత్‌=శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్య ఇతి పౌనః పున్యేన్యానుష్ఠానోపదేశాత్‌. అత్రైవ మనుసంధేయమ్‌ : దర్శాది యాగసాధనాని ప్రయాజాదీని న దృష్టార్థాని, కిం త్వదృష్టార్థాని యత స్తాని పుణ్యరూపాపూర్వ ద్వారా యాగోప కారకాణి భవన్తి -అత స్తేషాం ''సకృత్కృతే శాస్త్రార్థః కృతః స్యాత్‌'' ఇతి న్యాయ మనుసృత్య సకృదనుష్ఠాన మిత్యేత ద్యుక్తం స్యాత్‌ శ్రవణా దీని త్వాత్మతత్త్వ సాక్షాత్కార రూప దృష్టఫలకాని కర్మాణి- యాగసాధనీ భూ తావఘాతాదివత్‌. ఏతాని తు యాగోపయోగినాం దృష్టానాం తండులా నాం నిష్పాదనద్వారా యాగోపకారకాణి భవన్తీత్యతో నాదృష్టార్ధాని, కింతు దృష్టార్థానీతి నిర్ణయః - తాని సకృదనుష్ఠితాని నన్తి న ఫలాయ కల్పంతే - అతో యావత్ఫలోదయ మావర్తనీయా న్యేవ తాని, అత ఏ వాత్ర సకృత్కృతే శాస్త్రార్థః కృతృః స్యా దిత్యయం న్యాయో న ప్రసరతి. తద్వత్‌ శ్రవణాదీనా మపి ఆత్మతత్త్వ సాక్షాత్కారరూప దృష్టఫలే హేతుత్వా ద్యాపత్స్వఫలోదయం తే ఆవర్తనీయా ఏవే త్యభ్యుపగన్తవ్యం. ఏవం ''ఆత్మాన మేవ లోక ముపాసీత'' ఇత్యాదినా విహితే షూపాస్యసాక్షాత్కారద్వారా ఫలహేతు షూపాసనే ష్వప్యావృత్తి రంగీకార్యా - దృష్టార్థత్వాత్‌.

గడిచిన మూడవ అధ్యాయములో పరాపర బ్రహ్మ విద్యలకు సంబంధించిన సాధనములను గూర్చిన విచారము చేయబడినది. ఇక నీ అధ్యాయమున విద్యా ఫలమగు పరమ పురుషార్థమునకు సంబంధించిన విచార ములును, తత్ర్పసంగాగతమగు విచారాంతరములును చేయబడగలవు. ఇందు మొదట నీ పాదమున తృతీయాధ్యాయమున కనుబంధముగ సాధన ములకు సంబంధించిన కొన్ని విచారములు చేయబడగలవు.

వివరణము :- బ్రహ్మతత్త్వ సాక్షాత్కారమును గూర్చి కారణము లుగ పూర్వాధ్యాయమున నిశ్చయింపబడిన శ్రవణాదులను అసకృత్‌ అనగా అనేక పర్యాయములు - మరల మరల నాచరింప వలయునా? లేక ఒక పర్యాయము మాత్రము ఆచరించిన చాలునా? అను అంశమీ యధికరణములో విచారింపబడును.

గాన శాస్త్ర ప్రసిద్ధములైన షడ్జ మధ్యమాది స్వరవిశేషములయొక్క సాక్షాత్కారము కలుగవలయునన్న ఆవృత్తి విశిష్టమైనపు=నః పునః క్రియ మాణమైన తత్తత్స్వర విశేష శ్రవణము కారణమునునది సర్వలోక ప్రసిద్ధముకదా! అట్లే దుర్విజ్ఞేయమగు ఆత్మతత్త్వ సాక్షాత్కారమును గూర్చి ఆవృత్తి విశిష్టమైన శ్రవణమననాదులే కారణమని చెప్పవలయును. కాన శ్రవణమననాదులు అసకృత్‌=పునః పునః అనుష్ఠింపదగినవియే అని చెప్పదగును. అంతియేకాని దర్శ పూర్ణమాసయాగ సాధనములగు ప్రయాజాదులకువలె సకృదనుష్టానము = ఒక్క పర్యాయము అనుష్ఠించుట వానికి చాలదు. తగదు. కారణమేమియన? ''ఆత్మావారే ద్రష్టవ్య శ్శ్రోతవ్యో'' అను నీ వాక్యమున శ్రవణాదులు పునః పునః అనుష్ఠింప దగినవిగా నుపదేశింప బడినవి గనుక. దర్శాది యాగములకు సంబంధించిన ప్రయాజాదికము లంగము లదృష్టార్థకములు గాని దృష్టార్థకములు కావు. అనగా అవి ఇంద్రియ గోచరములగు ఫలములను పుట్టించునవి కావు. ఒకానొక విధమగు పుణ్యరూప ఫలము (అపూర్వము) నుత్పాదించి తద్ద్వారా యాగసాధనములగు చున్నవి. కాన నవి యదృష్టార్థక (అదృష్టఫలక) ములగు కర్మలని వ్యవహరింప బడునవి యగును. కాన నా కర్మలకు ''సకృత్కృతే....'' శాస్త్ర విహితమైన కర్మను ఒక్క పర్యాయము అనుష్ఠించి నంత మాత్రమున ఆ కర్మను విధించు శాస్త్రము కృతార్థమగును అనగా శాస్త్ర విహితమగు కర్మకు ఆవృత్తి (పునః పునరనుష్ఠానము) అనావశ్యకము అని చెప్పు న్యాయము ననుసరించి ఒక్క పర్యాయము అనుష్ఠానము (సకృదనుష్ఠానము) మాత్రమే యుక్తము కావచ్చును. శ్రవణాదులు మాత్రమట్టివి కావు. అవి ఆత్మతత్త్వ సాక్షాత్కారరూప దృష్టఫలకములు. యాగ సాధనములె ఐన అవఘాతాది కర్మల వంటివి. అవఘాతము అనగా దంచుట (రోకలిని ఎత్తి క్రిందికివేయుట) అని యర్థము. ఇవి యాగమున నుపయోగింపదగినట్టి దృష్టములైనట్టి తండులముల (బియ్యము) నుత్పాదనచేసి తద్ద్వారా యాగోపకారకములగు చున్నవి. కాన నివి దృష్టార్థకములగు కర్మలు అనియు, అదృష్టార్థకములు కావనియు నిర్ణయింప దగును. అవఘాతాదికము ఒక పర్యాయము అనుష్ఠింపబడిన ఫలము నిష్పన్నము కానేరదు. ఒకతూరి రోకంటిపోటు వేసినంత మాత్రమున ధాన్యమునుండి బియ్యము లబ్ధము కానేరదుగదా! కాన నీ కర్మలు ఫలోదయ పర్యంతము పునః పునః ఆవర్తింపదగినవియే యగుచున్నవి. ఆకారణమున నిట్టి దృష్టార్థక కర్మల విషయములో పూర్వోక్తమైన ''సకృత్కృతే....'' అను నీ న్యాయము ప్రసరించ నేరదని తెలియదగును. ప్రకృతములగు శ్రవణాదులును ఆత్మతత్త్వ సాక్షాత్కార రూప దృష్టఫల సాధకములు గాన స్వఫలోత్పత్తి పర్యంతము (ఆత్మతత్త్వసాక్షాత్కారము కలుగు వరకును) నవి ఆవర్తింపదగినవియే యని నిశ్చియింప వలయును.

ఇట్లే ''ఆత్మాన మేవ లోక ముపాసీత'' ఇత్యాది వాక్యములలో విహితములైనట్టి ఉపాస్యవస్తు సాక్షాత్కార ద్వారా ఫలసంపాదకము లైనట్టి ఉపాసనములకును ఆవృత్తి కలదని అంగీకరింపదగును. ఏలయన? నవియును దృష్టార్థకములే గనుక.

2. సూ: లింగాచ్చ

వివృతిః :- చ = అపిచ - లింగాత్‌ = ఉద్గీథవిద్యాయాం కేవలాదిత్యో పాస్తి నైకపుత్రతైవ సిద్ధ్వతీతి నిందిత్వా ''రశ్మీన్‌ం స్త్వం పర్యావర్తయాత్‌'' ఇతి ప్రవృత్తవాక్యం రశ్మిబహుత్వం బహుపుత్రతాయై విదధత్‌ సిద్ధవత్ర్పత్య యావృత్తిం దర్శయతి. అత్రత్య ప్రత్యయావృత్తి రూపాల్లింగా త్సర్వ ప్రత్యయే ష్వావృత్తి రస్తీత్యవగమ్యతే. బహుపుత్రతాయై త్వమాదిత్యరశ్మీన్‌ పృథగా వర్తయ స్వేతిశ్రుతే రర్థః.

వివరణము :- మరియు ఉద్గీథ విద్యయం దాదిత్యోపాసమును విధించి అందు కేవలము ఆదిత్యుని మాత్రముపాసించిన ఏక పుత్రలాభము కల్గును. అది యుక్తము కాదని నిందించి ''రశ్మీం స్త్వం పర్యావర్తయాత్‌'' అని ప్రవర్తించిన ఈ వాక్యము బహు పుత్రలాభము కొరకు బహు సంఖ్యాకములగు ఆదిత్య రశ్ముల నుపాసింపుము. బహు సంఖ్యాక ఆదిత్యరశ్మి విషయకమైన సజాతీయ చిత్తవృత్తుల నావర్తింప జేయుము అని విధానము చేయుచు - ప్రత్యయావృత్తి కర్తవ్యమని ప్రదర్శించుచున్నది. ఇచట సూచింపబడినట్టి ప్రత్యయావృత్తి (ఆదిత్యునియందును తద్రశ్ములయందును చేయబడు ధ్యానావృత్తి) రూపమగు లింగమును బట్టి శ్రవణాది సర్వ ప్రత్యయముల యందును ఆవృత్తి ఆవశ్యకమని తెలియదగును. బహు పుత్రలాభము కొరకు ఆదిత్యుని, తద్రశ్ములను వేరు వేరుగ నీవు ఆవర్తించి ఉపాసింపుము అని పూర్వోక్త శ్రుతి వాక్యమునకు అర్థము.

ఆత్మత్వోపాసనాధికరణం 2

3. సూ: ఆత్మేతి తూపగచ్ఛన్తి గ్రాహయన్తిచ

వివృతిః :- నిత్యశుద్ధబుద్ధముక్తస్వరూపో యః పరమాత్మా సః తత్త్వసాక్షాత్కారార్థధ్యానా వృత్తికాలే అహ మిత్యనన్యత్వేన గ్రహీతవ్యో వా ఉత మత్స్వా మీశ్వర ఇత్యాదినా7న్యత్వేన గ్రహీతవ్యో వేత్యేత దత్ర విచార్యతే - ఆత్మా - ఇతి తు = య శ్శాస్త్రోక్తవిశేషణః పరమాత్మా సః- సగుణాయాం నిర్గుణాంయా చ విద్యాయాం - శ్రవణాద్యావృత్తికాలే చాహమిత్యేవ గ్రాహ్యః నతు మదన్య ఇతి. కుతః? ఉపగచ్ఛన్తి = యతో హి జాబాలా స్తేషా ముపనిషది పరమేశ్వర ప్రక్రియాయాం ''త్వం వా అహమస్మి భగవో దేవతే అహంవై త్వమసి'' ఇత్యాదినైనముపాసక స్యాత్మత్వే నైవోపగచ్ఛన్తి గ్రాహయన్తి - చ = వేదాన్తవాక్యాని ''ఏష త ఆత్మా సర్వాం తరః'' ''స ఆత్మా - తత్త్వమసి'' ఇత్యాదీ న్యాత్మత్వేన పరమాత్మాన మవగమయన్తి చ. (అత్ర శిష్టా స్శ్వశిష్యాన్‌ వేదాన్తవాక్యై రేవం గ్రాహయ న్తీత్యపి వ్యాఖ్యా కర్తుం శక్యతే)

వివరణము :- నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనది పరమ్మాత వస్తువు. తత్సాక్షాత్కారార్థము చేయబడు ధ్యానాద్యావృత్తి కాలమున నాపర మాత్మ వస్తువు ''నేనే'' అని అనన్య భావముతో గ్రహించి ధ్యానింపదగునా లేక ఆ పరమాత్మ ''సర్వనియంత - నాకు యజమానుడు - నన్ను పరిపాలించువాడు'' అని యిట్లు అన్య (భేద) భావముతో గ్రహించి ధ్యానింప దగునా? అను విచారమిట గావింపబడుచున్నది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన పరమాత్మ సగుణ విద్యయందుగాని, నిర్గుణ విద్యందుగాని శ్రవణ, ధ్యానాద్యావృత్తి కాలమునందుగాని ''నేనే ఆ పరమాత్మ వస్తువు'' అని అనన్యముగా గ్రహింప దగినదిగాని అన్యముగా - తనకంటె భిన్నమైనదిగా గ్రహింప దగినదికాదు. ఏలయన? జాబాలోపనిషత్తు నందు పరమాత్మ ప్రకరణములోని ''త్వం వా అహ మస్మి....'' ఈ వాక్యము ఓ పరమాత్మా; నీవు నేనే అయియుంటిని. నేను నీవే అయియుంటివి అని పరమాత్మను ఉపాసకుడగు జీవాత్మకంటె అనన్యముగా - (అభిన్నముగా) వర్ణించు చున్నది గనుక. మరియు - ''ఏష త ఆత్మా సర్వాంతరః'' ఈ నీ ఆత్మ సర్వమునకు ఆంతరమైన సర్వానన్యమైన వస్తువు. ''స ఆత్మాతత్త్వ మసి'' సర్వ జగత్కారణమైన సద్రూప పరమాత్మ వస్తువే సమస్త ప్రపంచమునకు వాస్తవమైన స్వరూపము. ఆ వస్తువే నీవు అని బోధించుచు వేదాంత వాక్యములన్నియు ఆత్మను పరమాత్మా భిన్నునిగనే తెలియ జేయుచున్నవి. శిష్టులగు పెద్దలు స్వ శిష్యులకు వేదాన్త వాక్యానుసారము ఈ అనన్యత్వమునే బోధించుచున్నారు, కాన పరమాత్మను స్వానన్యముగానే ధ్యానింప వలయును.

ప్రతీకాధికరణం 3

4. సూ: న ప్రతీకే నహి సః

వివృతిః :- ప్రతీకే = ''మనో బ్రహేత్యుపాసీత'' ఇత్యాది వాక్యో క్తోపాసనేషు ప్రతీకే మనఆదౌ - న = అహంగ్రహః = అహంప్రత్యయః = బ్రహ్మోపాసనే ష్వివాత్మాభేదబుద్ధి ర్న కార్యా. కుతః? హి = యస్మాత్‌ సః = స ఉపాసకః న = న ప్రతీకాభిన్నః - ప్రతీకస్య జడత్వాత్‌. ఆత్మన స్త్వతద్రూపత్వాత్‌; - జడాజడయో రభేదాసంభవాత్‌ అతః ప్రతీకే అహం బుద్ధి ర్నకార్యేతి సిద్ధం.

వివరణము : ''మనో బ్రహ్మే త్యుపాసీత'' ఇత్యాది వాక్యములలో మనస్సు మొదలగు ప్రతీకములయందు బ్రహ్మోపాసనములు విదింపబడి యున్నవి. ఆ ఉపాసనములలో మన ఆది రూపములగు ప్రతీకముల యందు ప్రతీకోపాసనములు కాని బ్రహ్మోపాసనముల యందువలె ఆత్మా నన్యత్వ బుద్ధి ఉపాసకునిచే చేయదగదు. కారణమేమి యన? ఆ ఉపాసకుడు ప్రతీకములగు మనఆది వస్త్వభిన్నుడు కాదు గనుక ప్రతీకములు జడములు. ఉపాసకుడగు జీవుడట్టివాడు కాదు. జడాజడముల కెన్నడును అభేదము సంభవించదు. గదా కాన ప్రతీకములయందు ''అహం'' అను అభేద బుద్ధి చేయజనదు.

బ్రహ్మ దృష్ట్యధికరణం 4

5. సూ: బ్రహ్మదృష్టి రుత్కర్షాత్‌

వివృతిః :- ప్రతీకోపాసనవిషయే ఏవా న్యోవిచారః క్రియతే బ్రహ్మ దృష్టిః = (ప్రతీకోపాసనేషు) మన ఆది ప్రతీకేష్వేవ బ్రహ్మదృష్టిః సంపాదనీయా, నతు బ్రహ్మణి మన ఆదీనాం దృష్టిః. కుతః? ఉత్కర్షాత్‌=బ్రహ్మణ స్సర్వోత్కృష్టత్వేన నికృష్టే మన ఆదికే తద్దృష్ట్య ధ్యాసే తేషాం మన ఆదీనా ముత్కర్షస్య సిద్ధేః - నికృష్టే కృతో త్కృష్టదృష్టిః ఫలవతీ త్యేత త్సర్వలోకప్రసిద్ధం - తతో వైపరీత్యేతు రాజని కృతా భృత్యబుద్ధి రివానర్థా యైవ భ##వేత్‌ - అతో మనాది ప్రతీకే ఏవ బ్రహ్మదృష్టిః కార్యేతి.

వివరణము :- ప్రతీకోపాసనములకు సంబంధించిన మరియొక విచారము. ప్రతీకోపాసనములలో ప్రతీకములైన మనఆదులయందు బ్రహ్మదృష్టి=బ్రహ్మభావనము చేయదగును కాని బ్రహ్మయందు ప్రతీకములగు మన ఆది దృష్టి చేయరాదు. ఏలయన? బ్రహ్మ సర్వోత్కృష్టము. మన ఆది ప్రతీకములు నికృష్టములు. నికృష్టములగు మన ఆదుల యందుత్కృష్టబ్రహ్మదృష్టి చేయబడినచో మనఆదుల కుత్కర్ష సిద్ధించగలదు. అట్లు చేయబడిన ఆ బుద్ధి ఫలసంపన్నమగు ననునది సర్వలోక ప్రసిద్ధము. అట్లుకాక తద్విపరీతముగ నుత్కృష్టుని యందు నికృష్టబుద్ధి చేయబడినచో రాజును బంటుగ గుర్తించినట్లుగ నది అనర్థహేతువు కాగలదు.కాన మన ఆది ప్రతీకముల యందే బ్రహ్మదృష్టి = బ్రహ్మ భావనము చేయదగును.

ఆదిత్యాది మత్యధికరణమ్‌ 5.

6. సూ: ఆదిత్యాదిమతయ శ్చాంగ ఉపపత్తేః

వివృతిః :- ''యేవాసౌ తపతి తముద్గీథ ముపాసీత'' ఇతి. ''లోకే షు పంచవిధం సామోపాసీత'' ఇత్యాది వాక్యవిహితేషు కర్మాంగసంబన్ధ్యుపాసనేషు - ఆదిత్యాదీనా ముద్గీథానాం చ బ్రహ్మకార్యత్వావిశేషా దన్యోన్య ముత్కర్షాపకర్షభావాభావేపి - అంగే = ఉద్గీథాది కర్మాంగే ఏవ - ఆదిత్యా దిమతయః = ఆదిత్యాది దృష్టయః కార్యాః - నత్వాదిత్యాది షూద్గీథాదిదృష్టయః - కస్మాత్‌? ఉపపత్తేః = ఆసా ముపాస్తీనాం కర్మఫల సమృద్ధి సంపాదనాయ స్వీకృతత్వాత్‌ - తాభి రాదిత్యాదిదృష్టిభిః = ఉపాస్తిభి రుద్గీథాద్యం గేషు సంస్ర్కియమాణషు కర్మసమృద్ధే రుపపన్నత్వాత్‌ - చ = కించ (చేత్యనే నాయ మధికోంశ స్సూచ్యతే) ఆదిత్యాదీనాం కర్మఫలరూపత్వేన కర్మాంగతయా కర్మరూపేభ్య ఉద్గీథాదిభ్య ఉత్కృష్టత్వ స్యోపపత్తేశ్చ. కర్మాంగే ష్వేవ దేవతాదృష్టిః కార్యేతి.

వివరణము:- ''య ఏవాసౌ .....'' ఇత్యాది వాక్యములలో ఉద్గీథాది కర్మాంగములయందు ఆదిత్యాది దేవతాదృష్టి = ఆదిత్యాది దేవతోపాస నములు విహితములై యున్నవి. ఇచట ప్రతీకములగు ఉద్గీథాదులును - ఉపాస్యములగు అదిత్యాది దేవతులును బ్రహ్మకార్యములే గనుక వీనిలో ఉత్కర్షాప కర్షభావము లేదు. ఐనను కర్మాంగములగు ఉద్గీథాదులయందే ఆదిత్యాది దేవతాదృష్టి చేయదగును కాని, ఆదిత్యాదులయందు ఉద్గీథాది దృష్టి చేయరాదు. ఏలయన? ఈ ఉపాసనములు కర్మఫల సమృద్ధిని సంపాదించుటకై స్వీకరింప బడినవి గనుక కర్మాంగములగు ఉద్గీథాదులు ఆదిత్యాది దేవతాదృష్టులతో సంస్కరింపబడగా సంస్కృతమైన ఆకర్మాంగములద్వారా ఆయా కర్మలయొక్క ఫలములు సమృద్ధి సంపన్నములు కాగలవు. కాన కర్మాంగములయందే దేవతాదృష్టి చేయదగును. మరియు సూత్రస్థమగు ''చ'' అను శబ్దము ఆదిత్యాది దేవతలు కర్మఫల రూపులు గనుక కర్మాంగములగు ఉద్గీథాదులకంటె నుత్కృష్టమైనవారు కానను కర్మాంగములయందే దేవతాదృష్టి చేయదగును అను విశేషమును సూచించు చున్నది.

ఆసీనాధికరణమ్‌ 6.

7. సూ: ఆసీన స్సంభవాత్‌

వివృతిః : కర్మాంగోపాసనాతిరిక్తే షూపాసనేషు ప్రవృత్తో యః పురుష స్సః - ఆసీనః స్సన్నేవ ఉపాసీత, నతు శయాన స్తిష్ఠన్‌ గచ్ఛన్‌ వా. కుతః? సంభవాత్‌ = మానస ప్రత్యయ ప్రవాహీకరణాత్మక స్యోపాసనస్య చిత్తవిక్షేపకారణాది దోషవియుక్తాయా మాసీనత్వదశాయా మేవ సంభవాదితి.

వివరణము :- కర్మాంగములు కాని స్వతంత్రోపాసనములు చేయ బూనినవాడు ఆసీనుడయియే తానా ఉపాసనముల చేయవలయును. పరుండి యుండిగాని నిలవబడి యుండిగాని నడచుచుగాని చేయరాదు - ఏలయన? ఉపాసనము చేయుట యనగా సజాతీయ మనోవృత్తి ప్రవాహమును సంపాదించుటయే యగును. అట్టి ఉపాసనము చిత్త విక్షేపమునకు, ఇంద్రియ వికారాది దోషములకును ప్రసక్తి లేనియట్టి ఆసీనత్వ దశయందే అనగా కూరుచొని యున్నప్పుడే సంభవించునుకాననని తెలియదగును.

8. సూ: ధ్యానాచ్చ

వివృతిః :- చ = అపిచ - అస్యోపాసనస్య ధ్యానాత్‌ = ధ్యాయతి ధాత్వర్థత్వాత్‌ - ధ్యాయతిధాతోశ్చ ప్రశిథిలాంగచేష్టేషు, ఏకవిషయాక్షిప్త చిత్తేషు ప్రతిష్ఠితదృష్టిషు ప్రయోగదర్శనాత్‌ - ''ధ్యాయతి బకః - ధ్యాయతి ప్రోషితభర్తృకా నారీ'' ఇత్యాదినా - తస్మా దుపాసన మాసీనెనైవ కార్యమితి.

వివరణము :- ఉపాసనమనునది ''ధ్యాయతి'' ధాత్వర్థముగా ప్రసిద్థ మైయున్నది. ఆధ్యాయతి ధాతువు ''ధ్యాయతి బకః'' కొంగ ధ్యానించు చున్నది. ''ధ్యాయతి ప్రోషిత భర్తృకానారీ'' తన భర్త ప్రవాసముననున్న స్త్రీ ఆతనిని ధ్యానించుచున్నది యని యిట్టి వాక్యములలో అవయవ చేష్టలు దక్కియున్న - ఒకే ఒక విషయమునందు లగ్నమైన చిత్తవృత్తి పరంపరగలవారైయున్న - స్థిర మగు దృష్టి గలిగియున్న వ్యక్తులయందు ప్రయోగింపబడు చున్నది. కానను ఉపాసనము ఆసీనుడైన వానిచేతనే చేయదగినది యని నిర్ణయింపదగును.

9. సూ: అచలత్వం చాపేక్ష్య

వివృతిః :- చ = అపి చ అచలత్వం - అపేక్ష్య - ''ధ్యాయతీవ పృథివీ'' ఇత్యాది ప్రయోగేషు పృథివ్యాది ష్వచలత్వ మపేక్ష్యైవ ధ్యాయతీతి నిర్దేశః క్రియమాణో దృశ్యతే - తదేత దుపాసనం - థ్యాన మాసీనస్య కర్మేత్యస్యార్థస్య జ్ఞాపకం భవతి.

వివరణము :- మరియు ''ధ్యాయతీవ పృతివీ'' భూమి ధ్యానించు చున్నదివలె నున్నది అనునిట్టి ప్రయోగములలో పృథివి మొదలగు వాని యందలి అచలత్వము (చలింపక స్థిరముగ నుండుట) నపేక్షించి యే ధ్యాయతి శబ్దము ప్రయోగింపబడుట కానవచ్చు చున్నది. దీనిని బట్టియు ధ్యానము = ఉపాసనము అనునది కూర్చుని యున్నవానిచే చేయదగిన కర్మయే అని ధ్రువపడుచున్నది.

10. సూ: స్మరంతి చ

వివృతిః :- చ = అపి చ - స్మరన్తి = శిష్టా ఉపాసనాంగత్వేన చేలాజి నాదిమయం బాహ్య మాసనం ''శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిర మాసన మాత్మనః'' ఇత్యాదినా స్మృతిషు ప్రతిపాదయన్తి. యోగినశ్చ శారీరక మాసనం పద్మక స్వస్తికాదిక ముపదిశంతి చ. తస్మా దప్యుపాసన మాసీనేన కార్య మితి.

వివరణము :- శిష్టులగు వారలు ''శుచౌ దేశే ప్రతి.....'' ఇత్యాది వాక్యములలో చేలాజినాది (వస్త్రము - కృష్ణాజినము - దర్భాసనము) రూపమగు బాహ్యమైన ఆసనమును ఉపాసనాంగముగ స్మృతులలో ప్రతిపాదించు చున్నారు. ఇట్లే యోగులును శారీకమగు పద్మ స్వస్తికాద్యాసనముల నుపదేశించుచున్నారు. కానను ఉపాసనము కూర్చునియే చేయదగినది యని నిశ్చయింపదగును.

ఏకాగ్రతాధికరణం 7

11. సూ : యత్రైకాగ్రతా తత్రావిశేషాత్‌

వివృతిః :- కర్మస్వి వోపాసనేషు దిగ్దేశకాలాదినియమో నాస్తీత్యుచ్యతే - యత్ర = యస్మిన్‌ దేశే - యస్మిన్‌ కాలే - యస్యాం దిశి - ఏకాగ్రతా = మనస ఏకాగ్రతా - ఏకవిషయప్రవాహః సౌకర్యేణ సంపద్యతే తత్ర = తస్మిన్‌ దేశే - తస్మిన్‌ కాలే - తస్యాం దిశ్యుపాసనం ప్రయుంజీత - కస్మాత్‌? అవిశేషాత్‌ = కర్మసు యధా ''ప్రాచీనప్రనణ వైశ్వదేవేన యజేత'' ఇత్యాది దేశ కాలాదివిశేష శ్శ్రత స్తథోపాసనేషు దిగ్దేశకాలాది; విశేష శ్రవణాభావాత్‌. యద్యపి ''సమే శుచౌ శర్కరావహ్ని వాలుకావివర్జితే శబ్దజలాశ్రయాదిభి ర్మనోనుకూలే - నతు చక్షుః పీడనే గుహా నివాతాశ్రయణ ప్రయోజయేత్‌'' ఇత్యాదినా దేశాదివిశేషః క్వచిచ్ఛ్రుతః - తథా విశేషశ్రవణ సత్యపి గంగా తీర - కురుక్షేత్ర - సూర్యోపరాగాది దేశకాలవిశేషనియమో నాస్తీతి సూత్రకృదత్ర సుహృద్భూత్వోపదిశ తీతి.

వివరణము :- కర్మలయందు దిగ్దేశాది నియమములున్నట్లు ఉపాసనములయం దుండవని చెప్పబడుచున్నది. ఏదేశమున - ఏకాలమున - ఏదిక్కునందు - మనస్సునకు ఏకాగ్రత = విషయాంతర విక్షేప విచ్ఛేదములు లేని ఏక జాతీయ వృత్తి సాంతత్యము సుకరముగ లభించునో ఆదేశమున - ఆకాలమున - ఆదిక్కునందు ఉపాసనము ననుష్ఠింప వచ్చును. ఇట్లేల చెప్పబడుచున్నది యన? కర్మ ప్రసంగములలో ''ప్రాచీన ప్రవణ వైశ్వదేవేన యజేత'' వైశ్వదేవ పర్వానుష్ఠానము తూర్పు దిక్కునకు పల్లముగా వంగియున్న ప్రదేశములో చేయవలయును అని యిట్లు దిగ్దేశాది విశేషములు నియమింపబడి యున్నవి. అట్లు ఉపాసనముల విషయములో ఆ విశేషములు వర్ణింపబడి యుండలేదు గాననట్లు చెప్పబడినది ''సమేశుచౌ.....'' ఇట్లు కొన్ని గ్రంథములలో ఉపాసనము - సమము - శుద్ధము గులకరాళ్ళు, నిప్పు మొదలగు బాధాకర పదార్థములులేని - సుఖశబ్దము గలిగి, చక్కని జలాశ్రయము (సరోవరాదికము) తో నొప్పుచు మనోహరమై నేత్రపర్వముగనున్న - దోమలులేని - అతివాయు ప్రసారము లేని - గుహాదిస్థానముల యందనుష్ఠింపదగునని దేశాది విశేషములు వర్ణింపబడి యున్నవి. అట్టి విశేషములు ప్రతిపాదింపబడి యున్నను గంగాతీరము - కురుక్షేత్రము - సూర్య గ్రహణకాలము అను నిట్టి దేశకాలాది నియము విశేషము కర్మలకున్నట్లు ఉపాసనములకు ఉండదని భగవానుడగు సూత్ర కారుడిచట సుహృద్భావముతో నుపదేశించు చున్నారని తెలియదగును.

ఆప్రాయణాధి కరణం 8

12. సూ: ఆప్రాయణా త్తత్రాపి హి దృష్టం

వివృతిః :- ఆద్యే ఆధికరణ ఉపాసనే ష్వావృత్తి రావశ్యకీతి నిరూపితం - తేషు యాని సమ్యగ్దర్శనార్థాని = తత్త్వసాక్షాత్కారార్థాని తేషాం దృష్టార్థత్వా దాఫలోదయ మావృత్తి ర్భవతి. యానిపున రభ్యుదయార్థా న్యుపాసనాని తేషు, సగుణబ్రహ్మవిషయే ష్వహం గ్రహోపాసనే ష్వావృత్తిః పౌనః పున్యేనానుష్ఠానం ఆప్రాయణాత్‌ = ప్రాయణం = ఉత్క్రాంతిః తావత్పర్యన్తం కర్తవ్యం. న ద్వివారం త్రివారం వా ఆవృ త్యోపరమేత - కస్మాత్‌? - హి = యస్మాత్‌ - తత్ర అపి = ప్రయాణాకాలేపి - దృష్టం = ప్రత్య యానువృత్తి రస్తీతి ''స యావత్క్రతు రస్మా త్లోకాత్ర్పైతి'' ఇతి శ్రుతౌ ''యంయం వాపి స్మరన్‌ దేహం త్యజ త్యన్తే కళేబరం| తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః'' ఇతి స్మృతౌ చ దృశ్యత ఇతి. ప్రయాణ కాలికః అంత్యప్రత్యయః = భావిజన్మనః ప్రయోజకో భవ తీత్యతః - ఆమరణ మహంగ్రహోపాసనానా మావృత్తిః కర్తవ్యేతి సిద్ధమ్‌.

వివరణము :- ప్రథమాధికరణములో ఉపాసనములకు ఆవృత్తి = పునః పునరనుష్ఠాన మావశ్యకమని నిరూపింపబడినది. వానిలో సమ్యగ్‌ దర్శనార్థములు అనగా తత్త్వ సాక్షాత్కారము ఫలము గాగల ఉపాసన ములు దృష్టార్థకములు - కాన వానికి స్వఫలోత్పత్తి పర్యంత మావృత్తి యావశ్యకము. అభ్యుదయార్థకములగు ఉపాసనముల యందును. (అభ్యుదయమనగా నిచట ఆముష్మిక సంపత్తులని యర్థము) సగుణ బ్రహ్మ విషయకములగు అహంగ్రహోపాసనముల యందును ఆవృత్తి=పునః పునరనుష్ఠానము ప్రాణోత్క్రాంతి పర్యంతము చేయదగును గాని కొలది పర్యాయము లావర్తించి ఉపాస్యవస్తు విషయక ప్రత్యయానువృత్తి = ధ్యేయ వస్తువునకు సంబంధించిన మనోవృత్తి యనుసరించి యుండునని'' స యా వత్ర్కతు ....'' అను శ్రుతియందును..... ''యం యం వాపి స్మరన్‌......'' అను స్మృతియందును తెలియజేయబడు చున్నది. అట్టి ప్రయాణ కాలము నందలి ఆ అంత్య ప్రత్యయము = అంతిమ మనోవృత్తి భావిజన్మను గూర్చి ప్రయోజకము కాగలదు. కాన మరణ పర్యంతము అహంగ్రహోపాసన ముల కావృత్తి చేయదగునని సిద్ధమగుచున్నది.

తదధిగమాధి కరణం 9

13. సూ: తదధిగమ ఉత్తరపూర్వాఘయో రశ్లేషవినాశౌ తద్దర్శనాత్‌

వివృతిః :- యద్యపి పూర్వా ణ్యష్టా వధికరణాని సాధనాశ్రయత్వా త్పూర్వాధ్యాయయోగ్యా న్యేవ, తథాపి ఫలంప్రతి ప్రత్యాసన్నసాధనత్వాత్‌ ఫలా ధ్యాయేస్మిన్‌ సంయోజితాని. ఇదానీం ఫలవిషయకో విచారః ప్రస్తూయతే. తదధిగమే = తస్య = బ్రహ్మణః - అధిగమే = సాక్షాత్కారే సంపన్నే సతి ఉత్తరపూర్వాఘయోః = బ్రహ్మజ్ఞానోతృత్తే రుత్తరపూర్వకాలానుష్ఠితయోః బ్రహ్మజ్ఞానఫలాద్విపరీతఫలయో ర్దురితయోః - అశ్లేషవినాశౌ = ఉత్తరాఘస్య అసంశ్లేసః = లేపాభావః - పూర్వాఘస్య - వినాశశ్చ క్రమేణ భవతః. కుత ఏత దవగమ్యతే? తద్వ్యవదేశాత్‌ = ''యథా పుష్కరపలాశ ఆపో న శ్లిష్యన్తే ఏవ మేవంవిది పాపం న శ్లిష్యతే'' ఇతి ''తద్యథేషీకా తూల మగ్నౌ ప్రోతం ప్రదూయె తైవం హాస్య సర్వే పాప్మనః ప్రదూయన్తే'' ఇత్యాదిషు శ్రుతిషు పాపాశ్లేషవినాశయో ర్వ్యపదేశాత్‌. తస్మా ద్బ్రహ్మ తత్త్వాపగమే ప్రారబ్ధవ్యతిరిక్త సర్వదురితక్షయో భవతీ త్యవగన్తవ్యం.

వివరణము : గడచిన ఎనిమిది యధికరణములును సాధనములకు సంబంధించినవియే గాననవి మూడవదియగు సాధనాధ్యాయమునకు సంబంధించినవియే కాదగును. ఐనను నీ శ్రవణాది సాధనములు బ్రహ్మసాక్షాత్కార రూప ఫలమునకు సన్నిహితములు గాన నీఫలాధ్యాయములో కూర్చబడినవి. ఇక ఫలమునకు సంబంధించిన విచారము ప్రస్తావింపబడుచున్నది.

బ్రహ్మ సాక్షాత్కారము కలుగగా, బ్రహ్మజ్ఞానోత్పత్తికి పూర్యోత్తర కాలములలో ననుష్ఠింపబడిన బ్రహ్మజ్ఞానఫలముకంటె వివరీతమగు అనర్థఫలమును కలుగజేయు దురితములకు - ఉత్తరాఘమునకు బ్రహ్మ జ్ఞానోదయానన్తరభావిదురితమునకు అసంశ్లేషము = లేపాభావమున్నూ - పూర్వాఘమునకు - తత్పూర్వ మనుష్ఠింపబడిన దురితమునకు వినాశమున్నూ ఏర్పడునని తెలియదగును ఏలయన? ''యథా పుష్కరపలాశ.....'' తామరాకునందు నీ రెట్లు సంశ్లేషమును పొందరో అట్లు బ్రహ్మ విదుని యందు పాపమంటనేరదు. అనియు ''తద్య థే షికాతూల మగ్నౌ.....'' అగ్నియందు పడిన రెల్లు పూవెట్లు నిశ్శేషముగ దగ్ధమగునో అట్లు బ్రహ్మ వేత్తయైన వాని పాపములు నిరపశేషముగ దగ్ధములగుచున్నవి. అనియు నిట్లు శ్రుతులలో బ్రహ్మవిదుని పాపములకు అశ్లేష వినాశములు వర్ణింప బడియున్నవి గనుక నని తెలియదగును. కాన బ్రహ్మతత్త్వ సాక్షాత్కారముకలుగగా ప్రారబ్ధవ్యతిరిక్త సమస్త పాపజాతమును క్షయము నొందునని నిశ్చయింపదగును.

ఇతరాశ్లేషాధి కరణం 10

14. సూ: ఇతరస్యాప్యేవ మసంశ్లేషః పాతే తు

వివృతిః :- యథా పాప స్యాశ్లేషవినాశౌ తథా పుణ్యస్యాపీ త్యు చ్యతే - ఇతరస్య - అపి = విదు షానుష్ఠిత స్యోత్తరస్య పూర్వస్య చ పుణ్య స్యాపి కర్మణః ఏవం = యథా దురితస్య తథా - అసంశ్లేషః = అసంశ్లేషో - వినాశశ్చ భవతః - కుతః? ''ఉభే ఉ హైవైష ఏతే తరతి'' ఇతి ''క్షీయన్తే చాస్య కర్మాణి'' ఇత్యాది శ్రుతిషు దురితవ త్సుకృతస్యాపి ప్రణాశవ్యప దేశాత్‌ - ఇత్థం బ్రహ్మ విద్యాసామర్ధ్యాత్పాపపుణ్యయో ర్వినాశేనతి విదుషః పాతే - తు = శరీరపాతే ముక్‌ఇ ర్భవత్యేవ (అత్ర తు శబ్దః అవధారణార్థః) ఇత్థం బ్రహ్మవిదః పురుషధౌరేయస్య పుణ్యపాపయో ర్బంధహేత్వో రభావాద్దేహపాతే ముక్తిరవశ్యం భవత్యే వేత్యధికరణద్వయస్య ఫల ముక్తం భవతి.

వివరణము :- దురితమునకువలె పుణ్యమునకును అశ్లేషవినాశములు సంభవించునని చెప్పబడుచున్నది. బ్రహ్మ విద్వాంనునిచే ననుష్ఠింపబడిన ఉత్తర పూర్వ పుణ్యములకును దురితములకువలె ఉత్తర పుణ్యమునకు అసంశ్లేషమున్నూ - పూర్వ పుణ్యమునకు వినాశమున్నూ కలుగునని చెప్పవలయును. ఏలయన? ''ఉభే ఉ హైవైష .....'' ''క్షీయన్తే చాస్య....'' అనునిట్టి శ్రుతులలో దురితమునకువలె పుణ్యమునకును నాశము వర్ణింపబడి యున్నది గనుక. ఇట్లు బ్రహ్మ విద్యా సామర్థ్యమున పుణ్యపాపములు రెండును నశించిపోగా నాబ్రహ్మ విదునకు ఆరబ్ధాధీనమగు శరీరము పతనము నొందినంతనే ముక్తి కలుగ గలదు. పురుష శ్రేష్ఠుడగు బ్రహ్మవిదునకు బంధహేతువులగు పుణ్య పాపములు లేవుగాన దేహపాత ముకలుగగా ముక్తి యవశ్యము సంభవించునని నిరూపించుటయే ఈ అధికరణద్వయమునకు ఫలము.

అనారబ్ధర్యాధి కరణమ్‌ 11

15. సూ: అనారబ్ధకార్యే ఏవ తు పూర్వే తదవధేః

వివృతిః :- పూర్వే = అనాదిభవపరంపరాయాం జ్ఞానోత్పత్తిసమయ పర్యన్తం సంచితే - అనారబ్ధకార్యే - ఏవ - తు = అప్రవృత్తఫలే సుకృతదుష్కృతే ఏవ బ్రహ్మవిజ్ఞానా న్నశ్యతః - న త్వారబ్ధఫలే అపి - కుత ఏత దవగమ్యతే? తదవధేః = ''తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యే అథ సంపత్స్యే'' ఇతి శ్రుత్యామోక్షస్య శరీరపాతావధికరణాత్‌ - శరీరధారణో పయుక్త ప్రారబ్ధలేశానువృత్తే రవశ్యాభ్యువగ న్తవ్యత్వా చ్చేతి. యదినామ ''క్షీయన్తే చాస్య కర్మాణి'' ఇత్యత్ర కర్మాణీతి బహువచనశ్రుతిబలా త్సర్వే షాం సారబ్ధఫలానాం కర్మణాం నాశో7వశ్య మభ్యుపగన్తవ్య ఇత్యుచ్యేత తర్హి విద్యాసంప్రదాయోప దేష్టు రభావః ప్రసజ్యేత - తతశ్చ ''ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన న్తత్వదర్వినః'' ఇత్యాది స్మృతివ్యాకోపశ్చ స్యాత్‌. తస్మా న్నా రబ్ధఫలయోః ర్నాశ ఇతి.

వివరణము :- అనాదికాల ప్రవృత్తమైన జననమరణ ప్రవాహరూప మైన సంసార పరంపరలో జీవుడు తనకు బ్రహ్మాత్మైక్య (తత్త్వ) విజ్ఞాన ముదయించు వరకు సంపాదించిన పుణ్య పాపములలో ఆరబ్ధ ఫలములు కాని పుణ్య పాపములు మాత్రమే బ్రహ్మాత్మ విజ్ఞానము వలన నశించును. కాని ఆరబ్ధ ఫలములు నశించవని తెలియదగును. కారణమేమి యన? ''తస్య తావదేవ చిరం.....'' బ్రహ్మవిదుడు ముక్తి నొందుటకు ప్రారబ్ధకర్మ కార్యమగు దేహాదులనుండి ఎంత వరకు విముక్తుడు కాకుండునో అంతవరకే విలంబము. ప్రారబ్ధము ఉండి విముక్తుడయినంతనే బ్రహ్మ సంపత్తి రూపమగు మోక్షము నందగల డని ప్రతిపాదించు ఈ శ్రుతిలో శరీరపాతము మోక్షమున కవధిగ చెప్పబడి యుండుటచే నిట్లు నిర్ణయింపబడు చున్నది. శరీరాదారణమునకు హేతువగు ప్రారబ్ధలేశము బ్రహ్మ విజ్ఞానము కలిగిన తరువాత గూడా శేషించి యుండునని యవశ్య మంగీకరింప వలయును. అట్లంగీకరింపక ''క్షీయన్తే చాస్య కర్మాణి....'' అను నీశ్రుతిలో బ్రహ్మదర్శనము కలుగగా కర్మలు క్షీణించునని చెప్పుచు ''కర్మాణి'' యని బహువచనము వాడబడినది గాన ఆరబ్ధ ఫలములగు కర్మలతోసహ సర్వకర్మలకును నాశము నంగీకరింప వలయు నని చెప్పుచో విద్యా సంప్రదాయోప దేష్టలగు ఆచార్యులకే అభావము ప్రసక్తము కాగలదు. ''ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం....'' తత్త్వ సాక్షాత్కారము నొందిన విజ్ఞాన సంపన్నులు తత్త్వజ్ఞానము నుపదేశింతురని ప్రతి పాదించు ఈ స్మృతికిని విరోధమేర్పడగలదు. కాన ఆరబ్ధ ఫలములగు పుణ్యపాపములు తత్త్వజ్ఞానము కలుగగనే నాశము నొందునని చెప్పవలను పడదు.

అగ్నిహోత్రాద్యధి కరణం 12

16. సూ: అగ్నిహోత్రాది తు తత్కార్యాయైవ తద్దర్శనాత్‌

వివృతి:- అగ్నిహూత్రాది - తు = యదస్తి నిత్యం నైమితైకం చ వైదిక మగ్నిహోత్రాది పుణ్యశబ్దవాచ్యం కర్మ - తత్తు - తత్కార్యాయ - ఏవ = తస్య = జ్ఞానస్య - ఉపాసనస్యవాయత్‌ కార్యం = ఫలం ముక్తిరూపం తస్మా ఏవ ప్రభవతి - చిత్తశుద్ధ్యాది పరంపరయా జ్ఞానసంగతం - సాక్షాదుపాసనా సంగతం చ స త్తత్కర్మ తత్తత్ఫలసాధనం భవతీత్యర్థః - కస్మాత్‌? తద్దర్శనాత్‌ = ''తమేతం వేదానువచనేన......'' ఇత్యాది శ్రుతిషు వేదానువచనాదీనాం కర్మణాం జ్ఞానసాధనత్వ ప్రతిపాదనాత్‌ - అత్రత్య తు శబ్దః అగ్నిహోత్రాది కర్మణాం పుణ్యత్వసామ్యే సత్యపి విద్యాప్రభావా దనారబ్ధపుణ్యకర్మవ న్నాశో నాస్తీతి వైలక్షణ్యం ద్యోతయతి.

వివరణము :- వేదోక్తములు నిత్యనైమిత్తిక రూపములునగు అగ్ని హోత్ర, యజ్ఞ, దానాదికములగు పుణ్య కర్మలు ''తమేతం వేదాను వచనేన.....'' ఇత్యాది శ్రుతులలో జ్ఞాన సాధనములుగా ప్రతిపాదింపబడి యున్నవి గనుక నవి చిత్తశుద్ధి సంపాదనద్వారా జ్ఞానముతోను - సాక్షాత్తుగ ఉపాసనముతోను - సంగతములగుచు జ్ఞానోపాసనములచే సాధింపదగిన ముక్తి రూప ఫలమునే సంపాదించునవి యగుచున్నవి. సూత్రస్థ మగు ''తు'' శబ్దము అగ్నిహోత్ర, యజ్ఞ, దానాది కర్మలు పుణ్యరూపములే గాన ఇతర పుణ్యములతో పుణ్యత్వసామ్యమున్నను విద్యా ప్రభావము చేత అనారబ్ధఫలములగు ఇతర పుణ్య కర్మలకువలె వానికి నాశముండదని ఆ కర్మల యందలి విలక్షణత్వమును సూచించు చున్నది.

17. సూ: అతో7న్యాపి హ్యేకేషా ముభయోః

వివృతిః :- సుహృద స్సాధుకృత్వా మితి వినియోగవచనస్య విషయం విశదయతి. అతః = అగ్నిహోత్రాదే ర్నిత్యాత్కర్మణః - అన్యా - అపి = యాకాచి త్సాధుకృత్యా అన్యా - ఫల మభినంధాయ కృతా - పూర్వో దాహృతా సైవ - అశ్లేషవినాశ వచనగోచరా - ఏకేషాం = సైవ ఏకేషాం శాఖినాం ''సుహృద స్సాధుకృత్యాం....'' ఇతి వినియోగవచన స్యాపి విషయః - తస్యాః కామ్యతయా విద్యాంప్ర త్యనుపకారకత్వాత్‌ - నిత్య నైమిత్తిక కర్మణ ఏవ విద్యాంగత్వమితి, న కామ్యస్యకర్మణ స్తథాత్వ మిత్యస్మిన్నర్ధే - ఉభయోః = జైమినిబాదరాయణాచార్యయో ర్ద్వయో రపి సమ్మతి రేవ, న వైమత్యమ్‌.

వివరణము :- ''సుహృద స్సాధుకృత్యాం.....'' అను వినియోగ వాక్యములోని విషయమును గూర్చి చెప్పుచున్నారు. అగ్నిహోత్రాది రూపమైన నిత్య నైమిత్తిక కర్మలకంటె అన్యమైన ఫలాభిసంధిపూర్వకముగ ననుష్ఠింపబడిన కామ్యకర్మలవలన సంపన్న మయిన సాధు కృత్య = పుణ్యమే అశ్లేష వినాశ వచనములోను, ఈ వినియోగ వచనము లోను వర్ణింప బడినది గాని తదన్యముకాదు. ఆసాధు కృత్యము కామ్యము. అది విద్యోపకారకము కాదు. నిత్య నైమిత్తిక కర్మలే విద్యాంగములు. కామ్యములట్లు కాదనుట జైమిని బాదరాయణుల కుభయలకును సమ్మతము. ఈ విషయములో వారికి భావభేదము లేదు. (''తస్య పుత్రా దాయ ముపయన్తి, సుహృద స్సాధుకృత్యాం, ద్విషన్తః పాపకృత్యాం'' అనునిది విని యోగ వాక్యము. బ్రహ్మాత్మైక్య సాక్షాత్కారమును పొందిన విద్వాంసునికి సంబంధించిన ధనాదులను ఆతని పుత్రులు - ఆతనిని యెడ సుహృద్భావమును పొంది యుండువారు ఆతని పుణ్యపుంజమును - ఆతనిని ద్వేషించువారు ఆతని పాపరాశిని పొందుదురు అని వినియోగ వాక్యమున కర్థము.)

విద్యాజ్ఞాన సాధనత్వాధి కరణం 13.

18. సూ: యదేవ విద్యయేతి హి

వివృతిః :- విద్యావిరహిత మప్యగ్నిహోత్రాదికర్మ జ్ఞానాయోప యుజ్యత ఇత్యుచ్యతే - విద్యాసంయుక్తం - తద్విహీనం చేత్యుభయవిధమప్యగ్నిహోత్రాది నిత్యం కర్మ ముముక్షుణా మోక్షప్రయోజన ముద్దిశ్య కృతం విద్యాయా ముపకరోతి, నతు విద్యాసంయుక్త మేక మేవేతి - కస్మాత్‌? హి = యస్మాత్‌ - యత్‌ - ఏవ - విద్యయా. ఇతి = ''యదేవ విద్యయా కరోతి శ్రద్ధ యోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి'' ఇతిశ్రుతిః - విద్యాయుక్తస్య కర్మణః వీర్యవత్తరత్వం తరప్ర్పత్యయేన బ్రువతీ విద్యాహీనస్యాపి కర్మణ స్స్వఫలదాతృత్వరూప వీర్యవత్త్వం దర్శయతి. తదేత త్కేవల స్యాపి కర్మణో జ్ఞానహేతుత్వే లింగం - అపిచ ''యజ్ఞేన దానేన.....'' ఇత్యాది శ్రుతౌ ''యజ్ఞాదీనా మవిశేషేణ విద్యాహేతుత్వ ప్రతిపాదనా దప్యేవ మభ్యుపగన్తవ్యం.

వివరణము :- ముముక్షువగు వానిచే మోక్షము నుద్దేశించి చేయబడు అగ్నిహోత్రాది నిత్య కర్మజాతము జ్ఞాన పూర్వక (విద్యా సంయుక్త) మైనను, జ్ఞాన పూర్వకము కాకున్నను ఈ ఉభయవిధ కర్మయున్నూ బ్రహ్మ సాక్షాత్కార రూప విద్యోపకారకము కాగలదు. విద్యా సంయుక్త కర్మయే విద్యోపకారకమగు నను నియమము లేదు. కారణమేమియన? ''యదేవ విద్యయా.....'' విద్యా - శ్రద్ధా - కర్మానుబంధిరహస్యవిజ్ఞానాది సహితమగు కర్మ వీర్య వత్తరమగును అని చెప్పుచున్న ఈ శ్రుతి విద్యా యుక్తమగు కర్మకు వీర్యవత్తరత్వమును తరప్ప్రయముతో బోధించుచు కేవల కర్మకును వీర్యవత్త్వము ఫల ప్రదాన సామర్థ్యము కలదనియే సూచించు చున్నది. మరియు ''తమేతం.....'' ఈ శ్రుతి యజ్ఞాది సమస్త సత్కర్మలు జ్ఞానోత్పాదకములు - విద్యోపకారకము లగునని ప్రతి పాదించుచున్నది. కానను కేవలకర్మలును మోక్ష హేతు విద్యోపకారకములే యగునని నిశ్చయింపదగును. యజ్ఞాది కర్మలన్నియు విద్యోత్పాదకములే - కాని విద్యాసంయుక్త మైనప్పుడు వానికి శీఘ్రకార్య కారిత్వ రూప సామర్థ్యాతిశయ మేర్పడునని సారాంశము.

ఇతరక్షపణాధి కరణమ్‌ 14

19. సూ: భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే

వివృతిః :- ఇతరే = అనారబ్ధఫలాతిరిక్తే ప్రారబ్ధఫలే పుణ్యపాపే భోగేన - తు = తత్ఫలానుభ##వేనైవ. క్షపయిత్వా = వినాశ్య - విద్వాన్‌ సంపద్యతే = ''బ్రహ్మ సంపద్యతే'' - ''తస్య తావదేవ చిరం యావ న్న విమోక్ష్యే - అథ సంపత్స్యే-'' ఇతి మోక్షస్య ప్రారబ్ధబలాయత్త శరీరపాతావధికత్వ శ్రవణాత్‌ - సూత్రస్థ తు శబ్దః - శంకానిరాసార్థః = యావత్ర్పారబ్ధానుభవం బ్రహ్మసాక్షాత్కారే ణాప్యనివర్త్యస్య. అతఏవ తతోపి ప్రబల ఇతి గ్రహీతుం యోగ్యస్య అవిద్యాలేశస్య ప్రారబ్ధక్షపణానంతర మప్యనువృత్తి రస్తు. విలక్షణస్య తన్నివర్తకహేతో రనువలంభాత్‌. ఇతి శంకానిరాసార్థః. బ్రహ్మ సాక్షాత్కారసై#్యవ ప్రతిబంధక ప్రారబ్ధకర్మాపగమే సతి తాదృశావిద్యాలేశనివర్తకత్వ ముపపద్యత ఏవేతి నాస్తి నివర్తకాంతరాపేక్షా - తస్మాద్భోగేన ప్రారబ్ధకర్మనాశానంతరం విద్వాన్‌ స్వరూపానందాత్మనా వస్థాన లక్షణం కైవల్యం లభత ఏవ ఇతి శం.

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ చతుర్థాధ్యాయస్య ప్రథమః పాదః -

వివరణము :- ప్రారబ్ధ ఫలములు కాని = అనారబ్ధ ఫలములగు కర్మలకంటె భిన్నమైన ప్రారబ్థ ఫలములగు పుణ్య పాపములను బ్రహ్మ విదుడగు మహాత్ముడు ఆ పుణ్య పాప ఫలములగు సుఖదుఃఖములను తదను భవముచేతనే నశింపజేసి ఫలానుభవమున పుణ్యపాప కర్మ లుపక్షీణము కాగా తాను బ్రహ్మ భావమును = మోక్షమును = విదేహ కైవల్యమును పొందును. 'తస్య తావదేవ....'' అను నీశ్రుతి ప్రారబ్ధ కర్మ బలముచే నేర్పడిన శరీరము యొక్క పతనమెప్పుడు జరుగునో అప్పుడే = ఆక్షణ ముననే బ్రహ్మవిదునకు ముక్తి = ముక్తత్వము = బ్రహ్మ స్వరూపస్థితి = కైవల్యము సిద్ధమగునని మోక్షమును గూర్చి బ్రహ్మవేత్తకు శరీరపాతమునే అవధిగా చెప్పినది గనుక నిట్లు నిర్ణయింప బడినది.

భోగము = ఫలానుభవము చేతనే ప్రారబ్ధ ఫలములగు పుణ్య పాపములు నశించునని చెప్పుటతో ప్రారబ్ధ కర్మఫలానుభవ పర్యంతము ఆ ప్రారబ్ధకర్మ మూలమగు అవిద్య బ్రహ్మ సాక్షాత్కారము (బ్రహ్మ విజ్ఞానము) కలిగినను నశించక యుండునని చెప్పవలసి వచ్చును. అట్లుకాగా ఆ అవిద్యాలేశము అనునది బ్రహ్మవిజ్ఞానముకంటె ప్రబలమనియు - ప్రారబ్ధ కర్మఫల భోగము పర్యంతము ఆ ఆవిద్య అనువర్తమానమగు ననియు ఒప్పుకొనవలసి వచ్చును. అట్లగుచో ప్రారబ్ధకర్మ ఫలభోగానంతరము = శరీరపాతానంతరము ఆ అవిద్యాలేశమును నివర్తింపజేయు పదార్థమేదియు లేదు గనుక ఆ అవిద్యాలేశము నివర్తించకపోవును. అది నివర్తించక అనువర్తించుచున్నచో శరీరపాతానంతరము మాత్రము మోక్ష మెట్లు లభించగలదు. తన్నివర్తకపదార్థము మరియొకటి లేదుగదా! అనునొక ఆక్షేపమును తొలగింప జేయుటకై యీ సూత్రమున ''తు'' అను శబ్దము వాడబడినది. దానిభావమిది. బ్రహ్మవిజ్ఞానము అవిద్యను నివర్తింప జేయుటలో సమర్థమైనదియే ఐనను ప్రారబ్ధఫలక కర్మయను ప్రతిబంధక సామగ్రి యుండగా నా విజ్ఞానము అవిద్యను నిరవశేషముగ నివర్తింప జేయజాలక పోవును. అంత స్వల్పముగ అవిద్య (అవిద్యాలేశము) మిగిలి యుండి ప్రారబ్ధకర్మ ఫలభోగము పర్యంత మది అనువర్తించు చుండును.

భోగముచేత ప్రారబ్ధకర్మ సంపూర్ణముగ నశించగా నప్పుడు ప్రతిబంధకములేదు గనుక ప్రతిబంధక రహితమైన పూర్వోత్పన్నమైన బ్రహ్మ సాక్షాత్కారమే ఆ అవిద్యాలేశమును నివర్తింపజేయును. అంతియేగాని అవిద్యాలేశమునునివర్తింప జేయుటకు నివర్తకాంతరాపేక్ష అవసరములేదు. కాన భోగమున ప్రారబ్ధకర్మ ఉపశాంతముకాగా బ్రహ్మవిదుడగు మహాత్ముడు స్వరూపానంద రూపముననుండుట యను కైవల్యమును = మోక్షమును నిరింతరాయముగ పోందగలడు. ఈ యంశమున నెట్టి ఆక్షేపము నకును అవకాశము లేదు అని

ఇట్లు శ్రీగాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున

చతుర్థాధ్యాయమున - ప్రథమ పాదము ముగిసెను.

చతుర్థాధ్యాయే - ద్వితీయః పాదః

వాగధికరణమ్‌ 1

1. సూ: వాఙ్మనసి దర్శనా చ్ఛబ్దాచ్చ

వివృతిః :- పూర్వపాదే ముక్తివిరుద్ధానారబ్ధ ఫలకకర్మనివృత్యా జీవన్ముక్తత్వం - ఆరబ్ధకనర్మనివృత్తౌ తు విదేహముక్తత్వ మితి సగుణనిర్గుణ బ్రహ్మ విద్యయోః ఫలం సామాన్యతో నిరూపితం - సంప్రతి ప్రారబ్ధకర్మక్షయాన న్తర భావిని మోక్షే వివేషప్రదర్శనాయ పాదత్రయ మారచ్యతే - తత్రాపర విద్యాఫలప్రాప్తయే దేవయానం పంథాన ముత్తరత్ర కథయిష్యన్‌ ప్రథమం తావ ద్యథాశాస్త్ర ముత్క్రాంతిక్రమం విశదయతి. వాక్‌ = వాగింద్రియ వృత్తి రేవ. మనసి = సంపద్యతే - నతు వాగింద్రియం కస్మాత్‌? దర్శనాత్‌ = లోకే మ్రియమాణషు పురుషేషు మనోవృత్తా వవస్థితాయాం వాగ్వృత్తేః పూర్వముపసంహార దర్శనాత్‌ - శబ్దాన్‌ - చ = ''అస్య సోమ్య పురుషస్య ప్రయతో వాఙ్మనసి సంపద్యతే, మనః ప్రాణ, ప్రాణ స్తేజసి, తేజః పరస్యాం దేవతాయాం' ఇతి శ్రుతౌ వాగితి శబ్దాత్‌ వృత్తి వృత్తిమతో రభేద వివక్షయా ప్రయుక్తా చ్చ అయమర్థో7వగమ్యతే - వాగింద్రియసై#్యవ మనసి లయే అభ్యువగతే వాగింద్రియస్య మనఃప్రకృతిత్వాభావాత్‌ - అప్ర కృతౌ కార్యస్య విలయ శ్శాస్త్రవిరుద్ధం అభ్యుపగత స్స్యాత్‌ - నహి క్వాపి లోకే కార్యస్య స్వాప్రకృతౌ లయో దృష్టచరః - అతో వృత్తిలయ ఏవ వాచో మన స్యంగీకార్యః.

వివరణము:- పూర్వపు పాదమునమోక్ష ప్రతి బంధకములగు అరబ్ధఫలక కర్మాతిరిక్తమగు కర్మజాలము బ్రహ్మ విద్యాసామర్థ్యమున నశించగా జీవన్ముక్తియు, భోగమున ఆరబ్ధకర్మలును నివర్తించగా విదేహ కైవ ల్యమును సంపన్నమగునని పూర్వోక్త సగుణ నిర్గుణ బ్రహ్మ విద్యల యొక్క ఫలము సామాన్య రూపముగ నిరూపింప బడినది. ఇపుడు ప్రారబ్ధకర్మక్షయానంతర భావియగు మోక్షమునందలి విశేషమును ప్రదర్శించు టకై మిగిలిన పాదత్రయము రచింపబడు చున్నది.

ప్రకృతము అపరవిద్యాఫల ప్రాప్తిహేతువగు దేవయాన మార్గము నుత్తరత్ర ప్రతిపాదింపబోవుచు ముందు యథా శాస్త్రముగ నుత్క్రాంతి క్రమమును విశదీకరించు చున్నారు.

''అస్య సౌమ్య పురుషస్య...'' అను నీ శ్రుతిలో ఉత్క్రాంతి నొందుచున్న పురుషుని యొక్క వాక్కు మనస్సునందును - మనస్సు ప్రాణమునందును - ప్రాణము తేజస్సునందును - తేజస్సు పరదేవత యందును - లయించును అని వర్ణింపబడి యున్నది. ఇచట వాక్కు అను పదమునకు వాగింద్రియము అని అర్థము చెప్పరాదు. వాగింద్రియ వృత్తి యనియే చెప్పవలయును. ఏలయన? మరణింపబోవుచున్న పురుషుల మనోవృత్తి - మానసిక వ్యాపారము మామూలుగ నుండగనే ముందుగ వాగ్వ్యాపార ముపసంహృతమ గుచుండుట ప్రసిద్ధముగ కానవచ్చుచున్నది. కనుక మరియు వాగింద్రియము మనస్సునందు లయించుచున్నది యని చెప్పుట యుక్తమును కాదు. వాగింద్రియము మనస్సునుండి పుట్టు కార్య వస్తువు కాదు కనుక, కార్య వస్తువు కారణ వస్తువునందు లయించునుగాని అన్యత్ర లయించనేరదు అనునది శాస్త్ర సమ్మతమగు విషయము. కారణ వస్తువునందు గాక అన్యత్ర కారణ వస్తువులయించుట లోకమున నెచటను కానవచ్చుటలేదు. కాన మనస్సునందు వాగింద్రియ వ్యాపారము మాత్రమే లయించునని యంగీకరించి తీరవలయును.

2. సూ: అత ఏవ చ సర్వా ణ్యను

వివృతిః :- అతః - ఏవ = వాచ ఇవ చక్షురాదీనా మపి సవృత్తికే మన స్యవ స్థితే వృత్తిలోపదర్శనా దేవ. అప్రకృతే కార్యవిలయాసంభవాచ్చ - సర్వాణి - చ = 'ఇంద్రియై ర్వనసి సంపద్యమానైః' ఇత్యత్రోక్తాని సర్వా ణీంద్రియాణి చ వృత్తి ద్వారేణౖవ - అను = మనో7నువర్తన్తే - న స్వరూపేణతి బోధ్యం.

వివరణము :- ''ఇంద్రియై ర్మనసి సంపద్యమానైః'' అను నీశ్రుతి లో సవృత్తికమైన మనస్సునందు చక్షురాది సర్వేంద్రియ లయము వర్ణింప బడినది. ఇచటను గూడ మనస్సునందు వృత్తి ద్వారా ఇంద్రియ లయము చెప్పబడినది యనియే గ్రహింపవలయును గాని ఇంద్రియము అకు స్వరూపలయము చెప్పబడినది యని గ్రహించరాదు - మనస్సునకు ఇంద్రియము లకు కార్య కారణభావము లేదు గనుక.

మనోధికరణమ్‌ 2

3. సూ : తన్మవః ప్రాణ ఉత్తరాత్‌

వివృతిః :- తత్‌ = సర్వేంద్రియలయాధారం - మనః = మనో7పి ప్రాణ = ప్రాణ వృత్తిలయద్వారేణౖవ విలీనం భవతి - న స్వరూపేణ, కస్మాత్‌? ఉత్తరాత్‌ - ''మనః ప్రాణ'' ఇత్యుత్తరస్మా ద్వాక్యాత్‌ - అత్రాపి మనశ్శబ్దో వృత్తిలక్షకః. ప్రాణస్య సాక్షాస్మనఃప్రకృతికత్వాభావేన మనన స్తత్ర లయాసంభవాచ్చ - చితి.

వివరణము :- ''మనః ప్రాణ'' అను తదుత్తర వాక్యములో సర్వేంద్రియ లయాధారమగు మనస్సునకు ప్రాణమునందు లయము వర్ణింపబడినది. ఆ లయమును మనస్సు యొక్క వృత్తిలయమే కాని స్వరూప లయము కానేరదు? కారణమేమి యన? మనః ప్రాణములకు కార్య కారణభావము లేదు గనుకనే అని గ్రహింప వలయును.

అధ్యక్షాధి కరణమ్‌ 3

4. సూ : సో7ధ్యక్షే తదుపగమాదిభ్యః

వివృతిః :- నః = ప్రకృతః ప్రాణః - నివృత్తవృత్తిస్సన్‌ - అధ్యక్షే = విద్యాకర్మ పూర్వప్రజ్ఞోపాధికే. విజ్ఞానాత్మ న్యవతిష్ఠతే, తదధీనవృత్తిర్భవ తీత్యర్థః - కుతః ? తదుపగమాదిభ్యః = తదుపగమ - తదనుగమన - తదవస్థాన రూపేభ్యో హేతుభ్యః = తం విజ్ఞానాత్మానం ప్రత్యుపగమాత్‌ - తేన సహానుగమనాత్‌ - తేన సహావస్థానాత్‌ - ఇత్యర్థః - ''ఇమ మాత్మాన మన్తకాలే సర్వే ప్రాణా అభిసమాయన్తి'' ఇతి శ్రుతౌ సర్వేషాం ప్రాణానాం విజ్ఞానాత్మానం ప్రత్యుపగమనం శ్రూయతే - ''తముత్క్రామన్తం ప్రాణో7సూత్క్రా మతి'' ఇత్యత్ర విజ్ఞానాత్మనా సహానుగమనం శ్రూయతే - ఏవం ''నవిజ్ఞానో భవతి'' ఇత్యత్ర జీవే ప్రాణ స్యావస్థానం చ శ్రూయతే. ఏతేభ్యో హేతుభ్యః ప్రాణోపి నివృత్తవృత్తి ర్జీవే7వతిష్ఠత ఇతి నిశ్చీయతే.

వివరణము :- ఈ ప్రాణమును స్వవ్యాపారము నివర్తించిపోగా తాను ''తం విద్యాకర్మణీ సమన్వారభేతే పూర్వప్రజ్ఞా చ'' అను శ్రుతి వాక్యాను సారము ముమూర్షాదశయందు సమన్వారబ్ధములైన విద్యా కర్మ పూర్వ ప్రజ్ఞలు ఉపాధిగా కలిగియున్న జీవాత్మయందు నిలీనమై తదధీన వ్యాపారము కలదియగునని తెలియదగును. కారణమేమి యన? తదుపగమ - తదనుగమన - తదవస్థాన - రూపములగు హేతువులను బట్టి యట్లు తెలియదగును. తదుపగమము ''ఇమ మాత్మానం....'' అను నీశ్రుతి ఉత్ర్కాన్తి దశయందు సమస్త ప్రాణములును జీవాత్మను గూర్చి సమీపించు చున్నవి యని తదుపగమమును = జీవసమీపగమనమును ప్రాణము లకు వర్ణించు చున్నది. ఇట్లే తదనుగమనము = - ''తముత్క్రాంతం....'' అను నీ శ్రుతి ప్రాణములకు జీవాత్మతో అనుగమనము = తదను గమనమును వర్ణించు చున్నది. ఇట్లే - తదవస్థానము - ''సవిజ్ఞానో భవతి'' అను నీశ్రుతి జీవాత్మయందు ప్రాణము లవస్థితములై యుండుటను = తదవస్థానమును వర్ణించుచున్నది. ఈ హేతువులను బట్టి ప్రాణము వృత్తి రహితమై అంతకాలమున జీవాత్మను పొందియుండునని నిశ్చయింపబడు చున్నది.

5. సూ: భూతేషు తచ్ఛ్రుతేః

వివృతిః :- భూతేషు = స ప్రాణసంపృక్తో జీవోభూతేషు తేజస్సహచరితేషు దేహబీజభూతేషు సూక్ష్మే ష్వవతిష్ఠతే - కస్మాత్‌? తచ్ఛ్రుతేః = ''ప్రాణ న్తేజసి'' ఇతి తాదృశార్థప్రతిపాదకశ్రుతే స్సద్భావాత్‌.

వివరణము :- ప్రాణసహితుడైన ఆ జీవుడు తేజస్సహితములైన. ఆగామిదేహబీజ భూతములైన సూక్ష్మ భూతములయందు చేరియుండునని తెలియదగును. ''ప్రాణ స్తేజసి'' అను నీ శ్రుతివాక్య మీ యర్థమును ప్రతిపాదించు చున్నది.

6. సూ: నైకస్మిన్‌ దర్శయతో హి

వివృతిః :-శరీరాంతరప్రేస్సాసమయే జీవః - తేజ స్యేకస్మి న్నేవ న = నావతిష్ఠతే - కింతు పంచస్వపి భూతసూక్ష్మేషు. కస్మాత్‌? ఉత్తరశరీరస్యాపి పాంచభౌతికత్వేన పంచమ భూతేషు తస్యావస్థితే రావశ్యకత్వాత్‌ దర్శయతః - హి = ఇమ మర్థం పంచాగ్నివిద్యాప్రకరణస్థ ''ఆపః పురుష వచసో భవన్తి'' ఇత్యాదివాక్యగత ప్రశ్నప్రతివచనే ప్రతిపాదయతః. యద్వా - దర్శయతః = ''పృథివీమయ ఆపోమయో వాయుమయ ఆకాశ మయ స్తేజోమయ'' ఇత్యాద్యా శ్రుతిః - ''అణ్వ్యోమాత్రా వినాశిన్యో దశార్థానాం తు యా స్స్మృతాః | తాభి స్సార్థ మిదం సర్వం సంభవ త్యనుపూర్వశః'' ఇత్యాద్యా స్మృతిశ్చేమ మర్థం ప్రతిపాదయతః - ఇతి. ''హి'' ఇత్యేత దస్యార్థస్య ప్రసిద్ధిం సూచయతి.

వివరణము :- శరీరంతరమును ( జన్మాంతరమును) పొందబోవు సమయమున నా జీవుడు ఒక్క తేజోభూతమునందే గాక సూక్ష్మములగు పంచభూతములయందును చేరియుండునని నిశ్చయింపదగును. ఏలయన? రాబోవు శరీరమును పాంచ భౌతికమే గనుక పంచభూతములయం దవ స్థానము జీవున కావశ్యకము కాగలదు. ఈ యంశమును స్పష్టముగ పంచాగ్ని విద్యా ప్రకరణస్థమగు ప్రశ్న ప్రతి వచనములు ప్రతిపాదించుచున్నవి. సూత్రము నందలి ''దర్శయతః'' అను పదమునకు మరియొక అర్థము - ''పృథివీమయ ఆపోమయః...'' ఇత్యాది శ్రుతియును, ''అణ్వ్యోమాత్రా...'' ఇత్యాది స్మృతియున్నూ ఈ యర్థమును ధ్రువపరచు చున్నవి యని. కాన ''ప్రాణస్తేజసి'' అను నీ శ్రుతి వాక్యములోని తేజః పదము సర్వభూతో పలక్షకమని తెలియదగును. [దేహమును బట్టి జీవుడు పంచ భూతమయుడని శ్రుతి వాక్యమున కర్థము. పరిచ్ఛిన్నములును, మోక్షదశవరకును నశించకయుండు స్వభావము కలవియు, సూక్ష్మములునగు భూత భాగము లైదింటితో కూడుకొనియే సమస్త దేహధారులగు జీవులును పుట్టుచున్నారని స్మృతి వాక్యమున కర్థము.]

ఆసృత్యుపక్రమాధి కరణమ్‌ 4

7. సూ: సమానా చాసృత్యుపక్రమా దమృతత్వం చానుపోష్య

వివృతిః :- సేయ ముత్క్రాంతి ర్విద్వ దవిదుషో స్సగుణ బ్రహ్మోపాసకస్య - అనుపాసకస్య చ సమానా వా నవే త్యేత ద్విచార్యతే - ఆసృత్యువక్రమాత్‌ = సృతిః = మార్గః - మూర్ధన్యనాడీ మారభ్య మారభ్య బ్రహ్మలోకప్రాప్త్యర్థం వేదాన్తేషు తత్రతత్ర సమామ్నాతో దేవయానాఖ్యో య స్తదుపక్రమ పర్యన్తం - దేవయానమార్గోపక్రమాత్‌ ప్రాక్‌ ఇత్యర్థః - సమానా = విద్వద విదుషో ర్వాఙ్మన సీత్యాది శ్రుతిషు వర్ణితక్రమవతీ య ముత్క్రాన్తి స్సమానైవ. తతః పరంతు విద్వా న్మూర్ధన్యనాడీం ప్రవిశ్యార్చిరాదిద్వారా బ్రహ్మ లోకం గచ్ఛతి - అవిద్వాంన్తు నాద్యన్తర మవాప్య న్వకర్మానుగుణాం గతిం గచ్ఛతి. ''వాఙ్మనసి'' ఇత్యాదా వవిశేషత యోత్క్రాన్తే శ్శ్రవణాత్‌ - ''శతం చైకా హృదయస్య నాడ్య స్తాసాం....'' ఇతిశ్రుత్యన్తరా చ్చాయ మర్థో7వగమ్యతే - నను కథం తర్హి సగుణవిద్యాయా మమృతత్వ శ్రవణ మితి? తత్రాహ - అమృతత్వం - చ = ఉపాసనా ప్రకరణ ''తయోర్ధ్వ మాయన్నమృతత్వమేతి'' ఇత్యాదిస్థలే షూక్త మిద మమృత్వం = మోక్షః న ముఖ్యం - అనుపోష్య = అవిద్యాదిక్లేశజాత మదగ్ధ్వా సగుణోపాసనాసా మర్థ్యాత్‌ ప్రాప్య మిత్యత స్తదమృతత్వ మాపేక్షిక మేవ భవితు మర్హతి. న త్వాత్యంతికం - తస్మాదిహ విదుషః = ఉపాసక స్యావిదుష ఇవోత్క్రాన్త్యాదివర్ణనం న్యాయ్య మేవ భవతి - యేతు సర్వాత్మక బహ్మాత్మ తత్త్వ విజ్ఞానసంపన్నా స్తేషా జ్ఞానమహిమ్నా అవిద్యాదిక్లేశజాతం భస్మసాత్కృత మితి తస్యాప్రాప్యం ప్రాప్తవ్యం దేశాదిక మేవ నాస్తీతి న తస్యోత్క్రాన్తి రేవ సంభవతి - ఉక్తంచ ''న తస్యప్రాణా ఉత్క్రామన్తి'' ఇత్యాదినా - తతో7న్యానాం సర్వేషాం తు సంభవ త్యుత్క్రాంతిః. సా చోత్క్రాన్తి రామార్గోపక్రమం సమానప్రకారైవేతి వివేకః

వివరణము :- సగుణ బ్రహ్మోపాసకులకు. అనుపాసకులకు - విద్వాంసులకు. అవిద్వాంసులకు అందరకు నుత్క్రాన్తి సమానమే యగునా లేక భిన్నభిన్నమా అను అంశమిచట విచారింపబడు చున్నది.

బ్రహ్మలోక ప్రాప్త్యర్థము వేదాంతములలో దేవమాన మను నొక మార్గము ప్రతిపాదింపబడి యుండెను. ఆ మార్గము మూర్థన్యనాడి నుండి ఆరంభము కాగలదు. ఆ మార్గము ప్రారంభమగు వరకును విద్వాంసులకు గాని. యవిద్వాంసులకుగాని ''వాఙ్మనసి సంపద్యతే'' ఇత్యాది శ్రుతి సిద్ధ క్రమముతో నొప్పు ఉత్క్రాంతి సమానముగనే యుండును. విద్వాంసుడగువాడు మూర్థన్యనాడిని (సుషుమ్నానాడిని) ప్రవేశించి అర్చిరాది ద్వారా బ్రహ్మలోకమును పొందును. విద్వాంసుడు కానివాడు అట్లుకాక - మూర్ధన్య నాడిని ప్రవేశింపక తదితరములగు నాడులను పొంది స్వకృతములగు పుణ్యపాప కర్మల కనుగుణమగు గతిని పొందుచుండును. ''శతం చైకా.... అను నీ శ్రుతి యీ అర్థమునే ప్రతిపాదించు చున్నది. ఈ శ్రుతి సగుణోపాసనా ప్రకరణములోనిది. కాన ''తయోర్ధ్వ మాయ న్నమృతత్వ మేతి'' అను నీ శ్రుతిలోని అమృతత్వ శబ్దమునకు ముఖ్యమగు మోక్షము అను అర్థమును చెప్పగూడదు. ముఖ్యమగు మోక్షము బ్రహ్మ విద్యోదయమై ఆ విద్యా దిక్లేశజాల మే మహాత్మునకు సంపూర్ణముగ దగ్ధమగునో ఆతనికే అభించును. సగుణోపాసకునకు అవిద్యాది క్లేశములు దగ్ధము కావుగాన తదు పాసనా సామర్థ్యమున పొందదగిన ఆపేక్షిక అమృతత్వము (బ్రహ్మలోక లక్షణమగు మోక్షము) మాత్రము అభించును. కాన నిచట ఉపాసకునకు అవిద్వాంసునకువలె ఉత్క్రంత్యాదులు వర్ణింపబడుటయుక్తమని తెలియదగును. సర్వాత్మక బ్రహ్మాత్మైక సాక్షాత్కార మెవరికి కల్గునో వారికి క్లేశములు సంపూర్ణముగ దగ్ధమగును గాన నట్టివారికి ప్రాప్తముగాక నప్రాప్యమైన దేశముగాని, వస్తువు గాని ఏమియు నుండదు. కాన ఉత్క్రాంతి యనునదియే వారివి సంభవించదు. ఈ యర్థము ''న తస్య ప్రాణా ఉత్క్రామంతి'' యను శ్రుతి ప్రతిపాదించు చున్నది. తద్భిన్నులగు వారికంద రకు నుత్క్రాంతి తప్పదు. ఈ ఉత్క్రాంతి తప్పదు. ఈ ఉత్క్రాంతి మాత్రము మార్గోపక్రమ పర్యంతము అందరకును సమానముగనే యుండును.

సంసారవ్యపదేశాధి కరణమ్‌ 5.

8. సూ. తదాసీతే స్సంసారవ్యపదేశాత్‌

వివృతిః :- ఉత్క్రాన్తిస్వరూప ప్రతిపాదకశ్రుతౌ ''తేజః పరస్యాం దేవతాయాం'' ఇత్యంత్ర తేజఆదికభూతసూక్ష్మాణాం పరస్యా మాత్మని సంపత్తి రుక్తా - సాచ సంపత్తి స్తేజఆదీనాం సర్వాత్మనా పరమాత్మని లయరూపై వేతి, తతో దేహారంభకాణాం తేషాం నాశాత్‌ పునర్దేహారంభో నోపపద్యత ఇత్యతః మృతమాత్రస్య ముక్తి స్సద్ధ్యతీ త్యాక్షేపే ఇద ముచ్యతే - తత్‌ = తేజ ఆది భూత సూక్ష్మం - శ్రోత్రనేత్రాదీనాం కరణానా మాశ్రయభూతం ఆపీతేః =+ అపీతేః = ఆపీతేః = ఆసంసారమోక్షాత్‌ - (తత్త్వజ్ఞాన నిమిత్తాత్‌) అవతిష్ఠతే. న తూత్క్రాన్తికాలే సర్వాత్మనా వినశ్యతి. కింతు తదానీం వృత్తిమాత్రస్య లయ ఏవ వక్తవ్యః. కుతః? - సంసారవ్యవదేశాత్‌ = ''యోని మన్యే ప్రపద్యన్తే శరీరత్వాయ దేహినః | స్థాణుమన్యే7నుసంయన్తి యథా కర్మ యథాశ్రుతం'' ఇతి మరణానన్తర మపి సంసారస్య వర్ణితత్వాత్‌ - అన్యథా సర్వేషాం మరణానన్తర మేవ మోక్షప్రసంగ ఇతి విధినిషేధ శాస్త్ర వైయర్థ్యం ప్రసజ్యేత - తస్మాత్‌ తత్త్వవి ద్భిన్నానాం పరమాత్మని సంపత్తి స్సుషుప్తా వివ వృత్తిలయరూపైవ - న స్వరూపలయరూపా - ఇతి భావః - అత్ర తేజశ్శబ్దేన లింగశరీరం వివక్ష్యత ఇతి విజ్ఞేయం.

వివరణము :- ఉత్క్రాంత స్వరూపమును బోధించు శ్రుతిలోని ''తేజః పరస్యాం దేవతాయాం'' అను వాక్యములో తేజ అదికములగు సూక్ష్మ భూతములకు పరదేవతయందు = పరమాత్మయందు లయము చెప్పబడినది. ఆ చెప్పబడిన భూతములయొక్క లయము సంపూర్ణమూన స్వరూపలయమని చెప్పవచ్చును. పరమాత్మ సర్వ కారణము గనుక - అంత దేహాంతరారంభకములగు భూతములు నశించినవి గాన దేహాంతరము సంభవించనేరదు. దేహాంతరము లేదు గనుక మరణము సంభవించినంత మాత్రమున జీవులకు ముక్తి సిద్ధించునని చెప్పవలసి వచ్చునని ఆక్షేపమేర్పడ సమాధానమును చెప్పుచున్నారు.

శ్రోత్రనేత్రాది సమస్తేంద్రియాదులకును నాధారభూతమైన తేజస్సు మొదలుగాగల భూత సూక్ష్మములు తత్త్వ విజ్ఞానము కలిగి సంసారము నివృత్తమైన సంపూర్ణముగ మోక్షము లభించు వరకును నశించకయుండునవియే గాని ఉత్క్రాంతి కాలములో స్వరూపనాశమును పొందునవి యని చెప్పవలను పడదు. ఆ కాలమున వానికి వృత్తి - వ్యాపార లయము మాత్రమే సంభవించునని చెప్పవలయును. ఏలయన? ''యోని మన్యే... యథా శ్రుతం|| అను నీశ్రుతి మరణానంతరము జీవులు వారి వారి కర్మల కనుగుణముగను, వారి వారి విజ్ఞానముల కనుగుణముగను, చరస్థావర శరీరముల పొందుదురని చెప్పుచు మరణానంతరము సంసారమును వర్ణించుచున్నది గనుక, మరణము పొందిన మాత్రమున సర్వజీవులకును సంసారము నివర్తించును. మోక్షము లభించునన్నచో శాస్త్రముల యందలి విధి నిషేధము లనర్థకములు కావలసి వచ్చును. కాన తత్త్వవేత్తలు కాని జీవులకందరకును ''తేజః పరస్యాం దేవతాయం'' అను వాక్యములో పరమాత్మయందు తేజ ఆది భూతములకు వర్ణింపబడిన సంపత్తి యన సుషుప్తి యందువలె నిదియు వృత్తిలయమే గయగునుగాని స్వరూపలయము కానేరదని భావము - [ఇచట ''తేజః'' అనుపదము లింగ (సూక్ష్మ) శరీర బోధకమని గుర్తించదగును.]

9. సూ: సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్ధేః

వివృతిః :- ప్రమాణతః - చ = ఉత్క్రమిష్యతో జీవ స్యాశ్రయ భూతం భూతాంతర సంయుక్త మపి తత్తేజః పరిమాణత స్స్వరూపత శ్చ సూక్ష్మం = త్రసరేణువత్‌ సూక్ష్మమేవ - కుతః? తథా ఉపలబ్ధేః = నాడీనిష్క్రమణ ప్రతిపాదక శ్రుత్యాదిభ్యో హేతుభ్య సూక్ష్మత్వ స్యోపలభ్యమాన త్వాత్‌ - ఆతఏ వోత్క్రాంతి సమయే తత్పార్శ్వస్థే ర్నోవలభ్యత ఇతి భావః.

వివరణము :- ఉత్క్రాంతి పొందు జీవున కాశ్రయ భూతమగు స్వేతర భూతములతో కూడుకొని యున్నదియైన తేజస్సు యొక్క స్వరూపమును, పరిమాణమును త్రసరేణువునకు వలె అత్యంత సూక్ష్మమని తెలియదగును. ఉత్క్రాంతి సమయన జీవుడు ఆయా నాడులనుండి నిష్క్రమించుచున్నాడని వర్ణించు శ్రుతివాక్యము లీయంశమును ధ్రువపరచుచున్నవి. సూక్ష్మముకాననే పార్శ్యమున నున్నవారికి ఉత్క్రాంతి నొందు జీవున కాశ్రయ భూతములగు ఆతేజఆది భూతము లుపలభ్యములగుట లేదని భావము.

10. సూ: నోపమర్దే నాతః

వివృతిః :- అతః = సూక్ష్మత్వాదే వేదం తేజశ్శబ్దేన వివక్షతం లింగ శరీరం ఉపమర్ధేన = స్థూలసరీర స్యోపమర్దేన దాహాది నిమిత్తేన - న = నోపమృద్యతే.

వివరణము :- కాననే ఈ తేజస్సు అనగా లింగ శరీరము స్థూల శరీరమునకు సంబంధించిన దాహాది నిమిత్తకమైన పీడలచే పీడింపబడక యుండుననియు తెలియదగును.

11. సూ: అసై#్య వచోపపత్తే రేష ఊష్మా

వివృతిః :- ఏషః = య స్తావ దేతస్మిన్‌ జీవచ్ఛరీరే సంస్సర్శేన విజ్ఞాయమానః - ఊష్మా = ఔష్ట్యం - స ఏషః - అస్య - ఏవ = సూక్ష్మ శరీరస్యంసంబన్ధ్యేవ భవితు మర్హతి - కుతః? ఉపవత్తేః = అన్వయవ్యతిరేక రూపోపపత్తే ర్భావాత్‌ - సత్యేవ సూక్ష్మశరీరే జీవద్దేహే ఊష్మణ ఉపలంభాత్‌ - మృతదేహే (అసతి సూక్ష్మశరీరే తత్ర) ఉష్మణ ఊపలంభాభావా దిత్యర్థః. స్థూలశరీరాతిరిక్తస్య సూక్ష్మ శరీరస్య సత్వే ఔష్ణ్యలింగక మనుమానం ప్రమాణ మితి భావః.

వివరణము :- జీవించియున్న స్థూలశరీరమును ఉపలభ్యమానమగు ఊష్మ (ఔష్ట్యము) ఈ సూక్ష్మ (లింగ) శరీరమునకు సంబంధించినదియే యని తెలియదగును. ఏలయన? సూక్ష్మ శరీర సంబంధమున్నప్పుడు జీవద్ధేహమున ఊష్మ గోచరించుచున్నది గనుకను - సూక్ష్మ శరీర సంబంధము లేనప్పుడు ఊష్మ గోచరించుట లేదు గానను ఇట్లు నిర్ణయింపబడుచున్నది. [స్థూల శరీరము నందలి కాదాచిత్కౌష్ణ్యోపల బ్ధ్యుపల బ్ధ్యభావములు స్థూల శరీరాతిరిక్తమగు సూక్ష్మ శరీరము కలదనుటను నిరూపించు చున్నవి.

ప్రతిషేధాధి కరణం 6

12. సూ: ప్రతిషేధా దితిచేన్న శరీరాత్‌

వివృతిః :- నిర్గుణబ్రహ్మవిజ్ఞానిన ఉత్క్రాన్తి ర్నాస్తీతి నిర్థారయితు మిద మధికరణ మారచ్యతే - ప్రతిషేధాత్‌ = ''న తస్య ప్రాణా ఉత్క్రామన్తి'' ఉతి శ్రుతౌ పరిబ్రహ్మవిదః ప్రాణానా ముత్క్రాన్తి ర్నాస్తీతి వక్తవ్యం ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ - న = న తద్యుజ్యతే - కుతః? శారీరాత్‌ = తస్యాం శ్రుతౌ యః ప్రాణోత్క్రాన్తేర్నిషేధః కృత స్సశరీరాత్సకాశా త్ప్రాణానా ముత్క్రాంతిం నిషేద్ధుం న ప్రభవతి - కింతు శారీరాత్‌ = జీవాత్మనస్సకాశా దేవ ప్రాణానా ముత్క్రాంతిం నిషేధతి - కుతఏవ మవ గమ్యత ఇతిచేత్‌. యత స్తచ్ఛ్రుతౌ శ్రూయమాణః ''తస్య'' ఇత్యయం సర్వ నామశబ్దః పూర్వప్రక్రాంతం జీవాత్మాన మేవానువదతి తత్ప్రకరణస్థత్త్వా త్తస్య వాక్యస్య. కించ మాధ్యందినాశాఖాయాం ''న తస్మా త్ప్రాణా ఉత్క్రామన్తి'' ఇతి పంచమ్యన్తేన జీవస్వరూపానువాదకేన ''తస్మాత్‌'' ఇతి శ##బ్ధేన జీవాత్మాన మసూద్య జీవాత్మన స్సకాశాదేవ ప్రాణోత్క్రాంతిప్రతిషేధః కృతః - తతశ్చ శారీరాపాదానక ప్రాణోత్క్రాన్తి రేవాత్ర ప్రతిషిద్ధేతి ప్రాణాదిసహితస్య జీవస్య పరబ్రహ్మవిదోపి శరీరాపాదనకోత్క్రాంతి రస్తీతి పూర్వః పక్షః.

వివరణము :- నిర్గుణ బ్రహ్మతత్త్వ విజ్ఞానము గల్గిన మహాత్మునకు ఉత్క్రాంతి యుండదని నిర్ధారణ చేయుట కీయధికరణము ప్రవర్తించు చున్నది.

''న తస్య ప్రాణా ఉత్క్రామన్తి'' పర బ్రహ్మవిదునియొక్క ప్రాణ ములకు ఉత్క్రాంతి లేదని వర్ణించు ఈ శ్రుతినిబట్టి బ్రహ్మవిదుని శరీరము నుండి ప్రాణము లుత్క్రాంతి నొందవని చెప్పవలయునని యనుట యుక్తము కాదు. ఏలయన? ఆ శ్రుతి జీవాత్మకు సంబంధించిన ప్రకరణ ములోనిది గాన నా శ్రుతిలోని ''తస్య'' అను సర్వనామ శబ్దము పూర్వో పక్రాంతమైన జీవాత్మనే బోధించును. కాన నా శ్రుతిలో చేయబడిన నిషేధము బ్రహ్మ విదుడగు జీవాత్మనుండి ఉత్క్రాతిని నిషేధించును గాని శరీరమునుండి యుత్క్రాంతిని నిషేధింప జాలదు. మరియు మాధ్యందిన శాఖయందలి ''న తస్మా త్ప్రాణా అపక్రామన్తి'' అను వాక్యములోని ''తస్మాత్‌'' అను జీవాత్మను అనువదించు పంచమ్యంత శబ్దమున్ను జీవాత్మ నుండియే ప్రాణోత్క్రాంతిని నిషేధించుచున్నది కాన ప్రాణాది సహితుడైన జీవాత్మకు ఆతడు బ్రహ్మవిదుడైనను శరీరము నుండి ఆతని కుత్క్రాంతి యుండితీరును అని పూర్వపక్షము.

13. సూ: స్సష్టో హ్యేకేషాం

వివృతిః :- ఏకేషాం = కాణ్వానాం శాఖాయాం - ప్రాణానా మయ ముత్క్రాన్తిప్రతిషేధ శ్శరీరాపాదానక ఏవేతి స్పష్టః = స్ఫుటం జ్ఞాయతే. హి = తథాహి - బృహదారణ్యకోపనిషది ఆర్తభాగప్రశ్నే ''యత్రాయం పురుషోమ్రియతే - ఉదస్మా త్ప్రాణాః క్రామ న్త్యాహో నేతి '' ఇతి ప్రశ్నస్య ''నేతి హోవాచ యాజ్ఞవల్క్యః'' ఇతి సమాధాన ముక్తం - తతః తర్హ్య యం బ్రహ్మవిత్‌ అనుత్క్రాంతేషు ప్రాణషు మృతో నస్యా దిత్యాక్షేపే జాతేసతి ''అత్రైవ సమవలీయన్తే'' ఇతి ప్రాణాన మత్రైవ లయ ఉక్తః -తత్రైవ ప్రాణానాం ప్రవిలయం ప్రతిజ్ఞాయ తత్సిద్ధయే ''స ఉచ్ఛ్వయ త్యాధ్యాయ త్యాధ్మాతో మృత శ్శేతే'' ఇతి స ఇతి శ##బ్దేన పరామృష్ట స్యోత్క్రాన్త్యపాదానభూతస్య దేహ స్యోచ్ఛ్వయనాదయో ధర్మాస్సమామ్నాతాః - తేహి శరీరసై#్యవ భవితు మరహన్తి న దేహినః - అతో జీవనా సంభవా స్మృతో దేహ ఇతి వ్యవహారో భవతి యథా చోచ్ఛ్వయనాదయో ధర్మా దేహమాత్రసంగిన స్తథోత్క్రాన్తి ప్రతిషేధోపి తత్ప్రకరణగతో దేహాపాదానక ఏవేతి వక్తవ్యః - తస్మా త్పరబ్రహ్మవిదః ప్రాణానా ముత్క్రాన్తి ర్వా గతిర్వా నాస్తీతి సిద్ధం - [ఉచ్ఛ్వయతి = బాహ్యవాయు పూరణాద్వర్థతే ఆధ్మాయతి = ఆర్ద్రభేరీవ చ్చబ్దం కరోతి.]

వివరణము :- కాణ్వశాఖా గ్రంథమునందు బ్రహ్మ విదుని శరీర మునుండియు ప్రాణముల కుత్క్రాంతి యుండదని స్పష్టముగ తెలియవచ్చుచున్నది. బృహదారణ్యకోప నిషత్తులోని ఆర్త భాగప్రశ్న గ్రంథములో ''యత్రాయం పురుషో... నేతి'' బ్రహ్మవిదుని దేహము మృతిని పొంది నప్పుడు ఈ దేహమునుండి ప్రాణము లుత్క్రాంతి నొందునా? లేదా? అను ప్రశ్నకు యాజ్ఞవల్క్యమహర్షి లేదు అని సమాధానము పల్కెను. అంత ప్రాణము లుత్క్రాంతి నొందకున్న బ్రహ్మవిదునకు మృతి లేకుండ వలయునను ఆక్షేపమురాగా ''అత్రైవ సమవలీయన్తే'' ఆ ప్రాణము లిచటనే లయించునని ప్రతిపాదించి తత్సమర్థన కొరకు ''స ఉచ్ఛ్వయ త్యాధ్మాయ త్యాధ్మాతో మృతశ్శేతే'' అని ఆ దేహమునకు ఉచ్చ్వయనము - ఆధ్యానము - మరణము - మొదలగు ధర్మములు వర్ణింపబడినవి - ఆ ధర్మములు దేహము నకు మాత్రము సంబంధించినవియే గాన ఆ ప్రకరణము నందలి ఉత్క్రాంతి ప్రతిషేధమును దేహమునకు సంబంధించినదియే యని చెప్పదగును. కాన పరబ్రహ్మతత్త్వ విజ్ఞానము కల్గిన మహాత్ముని ప్రాణముల కుత్క్రాంతి గాని, గమనము గాని లేదనునది సిద్ధము. [బ్రహ్మవిదునికి శరీరసంబంధి ప్రారబ్ధము నశించగా దేహాంతరారంభము ప్రసక్తముకాదు గనుక ఆ దేహమున నున్న ప్రాణములు - ఇంద్రియాదులు ఆయా భూతములలో (స్వ స్వకారణములలో) లయము నొందును. ప్రాణ సంబంధము గళితము కాగా ఆ దేహము ఉచ్ఛ్వయనము (బాహ్యవాయు పూరణమున వృద్ధి) నొందును. ఆ తరువాత ఆధ్మానము (ఆర్ద్రమగు భేరీవలె శబ్ధము)ను కలిగించును. మృతమును నగును. అంతియే గాని సంసారులకువలె వారి ప్రాణములకు ఉత్క్రాంతి గాని - గతిగాని యుండదు.]

14. సూ: స్మర్యతే చ

వివృతిః :- చ = కించ - స్మర్యతే = సర్వభూతాత్మభూతాత్మభూతస్య సమ్యగ్భూతాని పశ్యతః | దేవాపిమార్గే ముహ్యన్తి హ్యపదస్య పదైషిణః'' ఇతి మహాభారతే పరబ్రహ్మవిద ఉత్క్రాన్త్యభావః ప్రతిపాద్యతే - తస్మా త్పర బ్రహ్మవిదో గత్యుత్క్రాంతీ న సంభవత ఇతి సిద్ధ్యతి.

వివరణము :- మరియు ''సర్వభూతాత్మ...పదైషిణః'' సర్వాత్మక బ్రహ్మాత్మభావమును పొందిన - సమస్త భూతములను ఆత్మభావముతో చక్కగా దర్శించుచున్న - తనకు ప్రాప్తముకాక, తానుకాని తనకు ప్రాప్యమైన స్థానమేలేనియట్టి - బ్రహ్మ విదునియొక్క గమన మార్గమును తెలిసి కొనగోరి దేవతలును ఆ మార్గము విషయములో మోహమునే పొందు చున్నారు. ఆ మార్గమును తెలిసికొనలేక పోవుచున్నారు. [ఆతనికి గమనమే అసంభవము గనుకనని భావము] అని వర్ణించు ఈ మహా భారత వాక్యమును బట్టియు బ్రహ్మావేత్తయగు మహాత్మునకు గత్యుత్క్రాంతులు ఉండవని సిద్ధమగుచున్నది.

వాగాదిలయాధి కరణం 7

15. సూ: తాని పరే తథాహ్యాహ

వివృతిః :- తాని = పరబ్రహ్మవిదః ప్రాణశబ్దోదితాని వాగాదీన్త్రి యాణి భూతాని చ పరే = పరస్మిన్‌ బ్రహ్మణ్యవ ప్రవిలీయన్తే. న త్వవిదుష ఇవ స్వస్వప్రకృతిషు - కస్మాత్‌? హి = యస్మాత్‌ - తథా - ఆహ = శ్రుతిః ''యథేమా నద్య స్స్యందమానా స్సయుద్రాయణా స్సముద్రం ప్రాప్యాస్తం గచ్ఛన్తి భిద్యేతే తాసాం నామరూపే సముద్రఇత్యేవ ప్రోచ్యతే - ఏవ మే వాస్య పరిద్రష్టు రిమా ష్షోడశ కలాః పురుషాయాణాః పురుషం ప్రాప్యాస్తం గచ్ఛన్ని భిద్యేతే తాసాం నామరూపే పురుష ఇత్యేవ ప్రోచ్యతే - ''ఇత్యేవం ప్రతిపాదయతి - అత్రాయం వివేషః. ఇయం శ్రుతి స్తత్వవిత్పురుషవిషయేతి, ''అగ్నిం వాగప్యేతి'' ఇత్యాద్యా శ్రుతయన్తు తటస్థపురుషవిష యా - ఇతి - మ్రియమాణ తత్త్వవిది సమీపవర్తినః పురుషా స్స్వస్వదృష్టాన్తేన తదీయవాగాదీనా మగ్న్యాదిషు లయం మన్యన్తే ఇతి - అత శ్శ్రుత్యో ర్న పరస్పరం విరోధః ఇతి - తస్మా త్పరబ్రహ్మవిదః ప్రాణానాం బ్రహ్మణ్యవ లయః - ఇతి సిద్ధం.

వివరణము :- ''యథేమా నద్యః....ప్రోచ్యతే'' సర్వత్ర బ్రహ్మను దర్శించుచుండు మహాత్ముని యొక్క వాగాది సర్వేంద్రియములు, భూత ములు ఇవియన్నియు పురుషునియందు కల్పితములైనవియే గనుక పురుష తత్త్వము జ్ఞాతముకాగా జ్ఞేయమగు ఆ పురుషుని పొంది లయమును పొందును. అని వర్ణించు ఈ శ్రుతినిబట్టి బ్రహ్మవిదుని వాగాదీంద్రియములు - భూతములును పరబ్రహ్మయందే లయించును గాని అవిద్వాంసుని ఇంద్రియ ప్రాణాదులువలె స్వస్వకారణములయందవి లయములను పొంద వని నిశ్చయింపదగును. ''అగ్నిం వాగప్యేతి....'' ఇత్యాది శ్రుతులు తటస్థ పురుషులయొక్క మరణకాలీన విశేషములను వర్ణించునవి యని యును - ''యథేమా నద్యః...'' అను నీ శ్రుతి బ్రహ్మతత్త్వ విత్పురుషుని మరణకాలీన వివేషములను వర్ణించునది యనియు వివరించి తెలిసికొన వలయును. కాన శ్రుతులకు పరస్పరము విరోధము లేదనియు - బ్రహ్మ విదుని ప్రాణముల (ఇంద్రియాదుల) కు పరమాత్మయందే లయము అనియు సిద్ధమగు చున్నది.

ఆవిభాగాధి కరణం 8

16. సూ: ఆవిభాగో వచనాత్‌

వివృతిః :- అవిభాగః = పర బ్రహ్మవిద్యానిష్ఠ స్యాయం ప్రాణాదీనాం కలానాం విలయః - అవిభాగః = విభాగశూన్యః = నిరవశేష ఏవ న త్వజ్ఞస్యేవ సావశేషః. కుతఏవం నిశ్చీయతే? వచనాత్‌ = పూర్వోక్తశ్రుతౌ కలా విలయో క్త్యనంతరం ''భిద్యేతే తాసాం నామరూపే'' ఇతి తాసాం నిరవ శేషత్వోక్తేః - న హ్యవిద్యానిమిత్తానాం కలానాం విద్యానిమిత్తే ప్రళ##యే సావశేషత్వ ముపపద్యతే ఇతి.

వివరణము :- పూర్వోదాహృత శ్రుతిలో ''భిద్యేతే తాసాం నామ రూపే'' అని బ్రహ్మవిద్యా నిష్ఠునియొక్క ప్రాణాది కళలకు నామరూపములన్నియు నశించుననుచు నిశ్శేషముగ సంపూర్ణ స్వరూపలయము వర్ణింపబడినది. గాన అజ్ఞుని కళలకు సావశేషలయముగాని విజ్ఞునకట్లు కాదని తెలియదగును. ఈ లయము విద్యాప్రయుక్తము కాన ఆవిద్యకములగు కళలకు (ఇంద్రియ ప్రాణాదులకు) సావశేషలయము చెప్పుట యుక్తము కానేరదు. రజ్ఞు (త్రాడు) అను జ్ఞానము కలిగిన తరువాత భ్రాంతి ప్రయుక్తమగు సర్పము (పాము) నకు లయము సంపూర్ణముగనే యేర్పడును గాని సావశేషముగ కాదుగదా.

తదోకోధి కరణమ్‌ 9

17. సూ తదోకోగ్రజ్వలనం తత్ప్రకాశితద్వారో విద్యాసా మర్థ్యాత్తచ్ఛేషగత్యనుస్మృతియోగాచ్చ హార్దా నుగృహీత శ్శతాధికయా

వివృతిః :- పరవిద్యానిష్ఠ స్యోత్క్రాన్తి ర్నాస్తీతి - సగుణబ్రహ్మో పాసకస్య చాజ్ఞస్య చాస్తీతి ప్రతిపాదిత మేతావతా. ఇదానీం విద్వ దవిదుషో ర్యా తావ దుత్క్రాన్తి స్తత్ర విశేష ఉచ్యతే - తదోకోగ్రజ్వలనం = తస్య = ఉపసంహృత వాగాదికలాపస్య = లీనవృత్తిక వాగాదిసముదాయ స్యోచ్చక్రమిషతో విజ్ఞానాత్మనః = జీవస్య - ఓకః = ఆయతనం = హృదయం యదస్తి - తస్యాగ్రన్య = నాడీముఖస్య - జ్వలనం = భావిఫల (భావి జన్మ) స్ఫురణం ప్రద్యోతనాఖ్యం భవతీతి యత్‌ - తతః తత్ప్రకాశితద్వారః = తేన హృదయాగ్రప్రద్యోతనేన సాధనభూతేన ప్రకాశితం = ప్రకటీకృతం యత్‌ - ద్వారం = నిష్క్రమణమార్గః యస్య సః = నః = తత్ప్రకాశితద్వారః - తథావిధో జాయతే విద్వా నవిద్వాం శ్చ - పశ్చాత్‌ సగుణబ్రహోపాసకో విద్యాంస్తు - హార్దానుగృహీతః = హార్దేన = హార్దాలయేన. నూపాసితేన, బ్రహ్మణా - అనుగృహీతః = తద్భావమాపన్నః - శతాధికయా = శతా దతిరి క్తయా = ఏకశతతమ్యా. హృదయా దుద్గతయా, కంఠాన్తస్తనయా, నాసికా భిత్తిద్వారా మూర్ధాన మేత్యరశ్మిభి రేకీభూతయా, ఆదిత్యమండల మనుప్రవిష్టయా సుషుమ్నాఖ్యయా నాడ్యా వినిష్క్రామతి - నత్వవిద్వా నివ చక్షురాదిస్థానస్థితేభ్యో నాడ్యంత రేభ్యః - కస్మా దిద మవసీయత ఇతిచేత్‌ - విద్యాసామర్థ్యాత్‌ = ఉత్కృష్టస్థానప్రతిలంభార్థ ముపదిష్ట సగుణ బ్రహ్మ విద్యాసామర్థ్యాత్‌ - యది విద్వాన పీతరవత్థ్సానాంతరేభ్యో నిష్క్రామేత్తర్హినైవోత్కృష్టం ఫలం లభేత - తస్మా దేవ మవసీయతే. కించ తచ్ఛేష గత్యనుస్మృతియోగాత్‌ - చ = తస్యా = స్సగుణవిద్యాయాః - శేషగతిః = శేషభూతా యా గతిః మూర్ధన్యనాడీసంబద్ధా - అర్చిరాదికా సృతిః = మార్గః తస్యాః అనుస్మృతిః = ధ్యానం అహరహరా ప్రాయణ మనుచింతనం - తస్యాః - యోగాత్‌ = విధానాత్‌ - చ - యది స్థానాంతరేభ్యోపి నిష్క్రామతో విశిష్టఫలప్రాప్తిస్స్యాత్‌ - తర్హివిశిష్టగతిచిన్తనస్య = విశిష్టమార్గానుస్మృతే ర్విధానం వ్యర్థం స్యాత్‌ - అత ఏవ మవసీయత్‌.

వివరణము :- పరబ్రహ్మనిష్ఠున కుత్క్రాంతియే యుండదనియు - సగుణ బ్రహ్మ విద్వాంసునకు (సగుణ బ్రహ్మోపాసకునకు) ను అజ్ఞునకును ఉత్క్రాంతి యుండుననియు నిరూపించ బడినది. ఇప్పుడు ఆ ఉభయుల ఉత్క్రాంతుల యందలి విశేషము వివరింప బడుచున్నది.

''అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాఙ్మనసి సంపద్యతే'' ఇత్యాది శ్రుత్యుక్త ప్రకారము వాగాదులన్నియు తమ తమ వ్యాపారముల నుపరమించి లయించగా ఉత్క్రాంతి నొందబోవు చున్నప్పుడు జీవాత్మకు నివాస స్థానమైన హృదయము యొక్క అగ్రభాగము (నాడీముఖ భాగము) ప్రజ్వలించును. దానికి ప్రద్యోతనమని పేరు. అది భావజన్మను. తన్మార్గమును స్ఫురింపజేయును. ఆ హృదయాగ్రప్రద్యోతనము చేత ప్రదర్శింపబడిన మార్గము ననుసరించి విద్వాంసులు గాని - యవిద్వాంసలు గాని అందరు జీవులును జన్మాంతరగ్రహణమునకై నిష్క్రమించు చుందురు. ఇది యందరకును సమానము. ఆ తరువాత సగుణ బ్రహ్మ విద్వాంసుని నిష్క్రమణ విధానము వేరు. ఇతరుల నిష్క్రమణ ప్రకారము వేరు విద్వాంసుడు హృదయ నివాసియగు ఆత్మను = బ్రహ్మను బాగుగ నుపాసించి తదనుగృహీతుడై - తద్భావమును పొందిన వాడై యుండును. ఆతడు హృదయ స్థానమున నుండు నూటఒక్క నాడులలో నూట ఒకటవదియగు - హృదయము నుండి ఊర్ధ్వముగా ప్రసరించుచు కంఠమధ్య భాగమునుండి నాసికాభిత్తి మధ్యము ద్వారా మూర్థస్థానము చేరుకొని యచట వ్యాపించియున్న - ఆదిత్యరశ్ముల ద్వారా ఆదిత్యుని చేరుకొను - నుషుమ్నా నాడీద్వారమున నిష్క్రమించును. ఇతరులట్లుగాక దక్షుః శ్రోత్రాది గోళకముల చేరుకొనియెడి ఆయా నాడులద్వారా నిష్క్రమించుచుందురు. విద్వాంసుని నిష్క్రమణక్రమ మిట్టిది యనియెట్లు నిశ్చయింప బడుచున్నది? యన చెప్పుచున్నారు. విద్యా సామర్థ్యాత్‌ - అని - సగుణ బ్రహ్మ విద్యయనునది ఉత్కృష్టస్థానలాభము కొర కుపదిష్టమయినది. తదుపాసనా సామర్థ్యమున నీ విద్వాంసుడు ఉత్కృష్ట స్థానమును పొందుట కనువుగ నిట్లు నిష్క్రమించును. విద్వాంసుడయ్యును ఇతరులువలె నాడ్యంతరముల నుండి నిష్క్రమించుచో నా ఉపాసకునకు ఉత్కృష్టస్థాన లాభము లేకపోవును. కాన నిట్లు నిశ్చయింప బడుచున్నది. మరియు సగుణ బ్రహ్మోపాసనమునందు తదంగముగ మూర్థన్య నాడీ సంబద్ధము - అర్చిరాదికమునగు మార్గము ధ్యానింపదగినదిగ విధింపబడి యున్నది. కాన నా ఉపాసకుడనుదిన ముప్రాయణ పర్యంతము ఆమార్గమును చింతించు (ధ్యానించు) చుండును. కాన నా విద్వాంసున కట్టి నిష్క్రమణమును తత్ప్రయుక్తమగు ఉత్తమ ఫలప్రాప్తియు లభింపగలదు - నాడ్యంతరముల నుండి నిష్క్రమించు జీవులకును నిట్లుత్తమఫలలాభ మున్నదనుచో అట్టి చింతనము (ధ్యాన ప్రక్రియ) ను విధించుట వ్యర్థము కాగలదు. కాన నిట్లు నిశ్చయింప బడుచున్నది.

రశ్మ్యధికరణమ 10

18. సూ: రశ్మ్యను సారీ

వివృతిః :- రశ్మ్యనుసారీ = ముపాసకో రాత్రా వహని వా మ్రియమాణో రశ్మనుసారీ = సూర్యకిరణానుసారీ భూత్వై వోర్ధ్వ మాక్రమతే - కస్మాత్‌? ''అథైతై రేవ రశ్మిభి రూర్ధ్వ మాక్రమతే'' ఇత్యవిశేష శ్రవణాత్‌.

వివరణము:- ''అథైతైరేవ....'' అను శ్రుతి ననుసరించి రాత్రి యందుగాని, పగటియందుగాని ఏ సమయమున మరణించినను విద్వాంసుడు ఆదిత్య రశ్ముల ననుసరించినవాడగుచు ఆదిత్యునిచేరి యుత్కృష్ట ఫలమునే పొందగలడు.

19. సూ: నిశి నేతిచేన్న సంబన్ధస్య యావద్దేహభావిత్త్వాద్దర్శయతి చ

వివృతిః :- నిశి = రాత్రౌ మృతస్య విదుషఃన=రశ్మ్యను సారిత్వం న సంభవతి - రాత్రౌ సూర్యస్యాభావా త్తద్రశ్మిర్నాడీనాం సంబన్ధో విచ్ఛిన్నో భవతి - అహని సూర్యరశ్మినాఢీసంబన్ధస్య సత్వా త్తత్రైవ మృతో రశ్మనుసారీభవతి - న రాత్రౌమృతః - తతశ్చ విద్యా పాక్షికఫలా స్యాత్‌ - ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతేచేత్‌ - న = నతద్యుజ్యతే - కుతః? సంబన్దస్య=నాడీ రశ్మి సంబన్ధస్య - యావద్దేహభావిత్వాత్‌ = యావద్దేహో భవతి తావ న్నాడీ రశ్మిసంబనన్ధో భవత్యేవేతి - రాత్రౌ తదభావస్య వక్తు మయుక్తత్వాత్‌ - దర్శయతి చ = ''అముష్మా దాదిత్యా త్ప్రతాయన్తే తా అను నాడీషు సృఫ్తా ఆభ్యో నాఢీభ్యః ప్రతాయన్తే తేముష్మి న్నాదిత్యే నృప్తాః'' ఇత్యాద్యాశ్రుతి రేత మర్థం ప్రతిపాదయతి - రశ్మీనాం రాత్రా వనుపలంభోనత్వభావప్రయక్తః - కింతు స్తోకానువృత్తివ్రయుక్త ఏవ - తస్మా దవిశేషేణౖ వేదం రాత్రిందివం రశ్మ్యసారిత్వ ముపపద్యత ఇతి, విద్యాచ నియతఫలైవేతి చ సిద్ధ్యతి.

వివరణము :- పగలు సూర్యుడుండును. కాన తద్రశ్మి నాడీ సంబంధము పగలు మరణించిన విద్వాంసునకు సంభవించును. రాత్రి మరణించిన విద్వాంసునకు సంభవించదు. కాన సగుణ బ్రహ్మవిద్య యనునది నియత ఫలదాయకమని యనుటకు వీలులేదని ఆక్షేపింపరాదు. ఏలయన? దేహమున్నంత వరకు ఏ కాలమున నైనను నాడులకా దిత్యరశ్మిసంబంధ ముండియే తీరును గనుక, నాడీ ఆదిత్య రశ్ములకు నిరంతరము పరస్పరానుబంధముండు నని ''అముష్మా దాదిత్యాత్‌....'' ఇత్యాది శ్రుతి ప్రతి పాదించు చున్నది. రాత్రులలో ఆదిత్య రశ్ములు గోచరింపకుండుట అవి లేకపోవుట వలనగాదు. అవి స్వల్పముగ నుండును గనుకనని తెలియదగును. కాన రాత్రింబవళ్ళు ఎల్లప్పుడును ఆదిత్యరశ్ము లుండుననియు. రశ్మ్యను సారిత్వము సర్వదా సిద్ధమనియు - కాన సగుణ బ్రహ్మవిద్య నియత ఫలదాయకమే యగుననియు తెలియదగును.

దక్షిణాయనాధి కరణమ్‌ 11

20. సూ: అతశ్చాయనేపి దక్షిణ

వివృతిః :- అతః - చ = (చశబ్దోత్రావధారణార్థకః) అతఏవ = విద్యాయా అపాక్షిక (నియత) ఫలకత్యా దేవ - దక్షిణ అయనే - అపి = దక్షిణా యనేపి మృతో విద్వాన్‌ ప్రాప్నో త్యేవ విద్యాఫలం. ఉత్తరాయణ మరణ ప్రాశస్త్యప్రసిది స్త్వవిద్వ ద్విషయా. భీష్మస్య చోత్తరాయణ ప్రతీక్షా ఆచారపరిపాలనార్థం - పితృప్రసాదలబ్ధ స్వచ్ఛన్దమరణతాఖ్యాపనార్థం చేతిమన్తవ్యం.

వివరణము :- సగుణ బ్రహ్మవిద్య నియత ఫలదాయకము కాననే దక్షిణాయనమున మృతులగు విద్వాంసులును విద్యాఫలమును పొందుదురనుటలో సందేహములేదు. గ్రంథములలో ఉత్తరాయణ మరణము ప్రశస్తమని వర్ణించుట అవిద్వాంసులను గూర్చి చేయబడినది యనియు - భీష్ముడు ఉత్తరాయణము వచ్చువరకును ప్రతీక్షించి మరణించుట యనునది లోక సిద్ధాచార పరిపాలనము కొరకును. తన తండ్రిగారి యనుగ్రహమున తనకు లబ్ధమైన స్వచందమరణత్వ సిద్ధిని ప్రఖ్యాపనము చేయుట కొరకును ననియు తెలియదగును.

21. సూ: యోగినః ప్రతిచ స్మర్యతే స్మార్తేచైతే

వివృతిః :- నను ''యత్రకాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః ప్రయాతా యాన్తితం కాలం వక్ష్యామి భరతర్షభ'' ఇతి కాలప్రాధాన్యే నోపక్రమ్య గీతాను ''అగ్నిర్జ్యోతి రహః శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణం'' ఇత్యాది నాహరాది కాలవిశేష్యస్య స్వరణాత్‌ - కథం దక్షిణాయనే రాత్రౌ వా మృతానాం విదుషాం బ్రహ్మలోకప్రాప్తి రిత్యత ఆహ - యోగినః - ప్రతి = భగవదారాధనబుద్ద్యా నుష్ఠితం కర్మ యోగః - ధారణాపూర్వకః అకర్తృత్వానుభవ స్సాంఖ్యం - తదుభయనిష్ఠా అత్ర యోగిన ఇత్యుచ్యన్తే - తాన్‌ ప్రత్యేవ స్మర్యతే - చ = అయ మహరాదికాలవినియోగో గీతాసు స్మర్యతే - ''అగ్నిర్జ్యోతి రహశ్శుక్ల...'' ఇత్యాదినా, నతు శ్రౌతదహరాదివిద్యానిష్ఠాన్‌ ప్రతి - కుతః? - ఏతే - చ = పూర్వోక్తే ఏతే యోగసాంఖ్యే చ స్మార్తే = యత స్స్మత్యుక్తే - అతః - యోగసాంఖ్యయో స్స్మృత్యుక్తత్వేన అహరాది కాల వినియోజకస్య ''అగ్ని ర్జ్యోతి రహ శ్శుక్లః.....'' ఇత్యాదివాక్యస్య చ ప్రత్యాసత్తిసద్బావా దత్రోక్తకాలవినియోగ విషయతాయాస్సంభవా దిత్యర్థః తస్మాన్నిశి దక్షిణాయనే వా మృతానా మపి బ్రహ్మవిదాం బ్రహ్మలోక ప్రాప్తి రవ్యవధానేనైవ సంభవతీతి - అగ్నిర్జ్యోతి రిత్యాది గీతావచనం శ్రౌతమార్గ ప్రత్యభిజ్ఞాపకం భవతీతి - తతశ్చ శ్రుతా వాతివాహిక దేవతా పరా అగ్నిజ్యోతిరాదిశబ్దా భవన్తీతి న కశ్చిద్విరోధ ఇతి సర్వమనవద్యమ్‌

[అగ్నిర్జ్యోతి రిత్యాది గీతావచనం న శ్రౌతమార్గప్రత్యభిజ్ఞాపక

మితి కృత్వాచింత యేదం సూత్రం ప్రవృత్తం]

ఇతి శ్రీ గాయత్రి పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర

విరచితాయం బ్రహ్మసూత్ర వివృతౌ చతుర్థాధ్యాయస్య - ద్వితీయః పాదః

వివరణము :- భగవద్గీతాగ్రంథములో ''యత్రకాలే త్వనావృత్తిం....'' ఏ కాలములో మరణించినవారు ఆ వృత్తిని పొందుదురో - ఏ కాలములో మరణించినవారు ఆ వృత్తిని పొందక ఉత్కృష్టఫలమగు బ్రహ్మ లోకమును పొందుదురో ఆ కాలమును చెప్పుదును. అని కాలప్రాధాన్యముతో విషయము నుపక్రమించి ''అగ్ని ర్జ్యోతి రహః...'' అనుచు అహరాది కాలవిశేషము విద్వాంసుల గూర్చి వర్ణింపబడినది. కాన దక్షిణాయనమున గాని, రాత్రియందుగాని మృతులగు విద్వాంసులకు బ్రహ్మలోకమెట్లు ప్రాప్తించగలదను ఆ శంకకు సమాధానమిచట చెప్పబడుచున్నది. ఆ వాక్య ములో యోగులను గూర్చియే అహరాదికాల విశేషము యొక్క వినియోగము వర్ణింపబడినది. కాని శ్రుత్యుక్తమగు దహరాది విద్యానిష్ఠులను గూర్చి కాదని తెలియదగును. ఏలయన? ఆ వాక్యములు యోగులను గూర్చి ప్రవృత్తములైనవియే. యోగులనగా భగవదారాధనమను బుద్ధితో ననుష్ఠింపబడు కర్మ కర్మయోగమని చెప్పబడును. ధారణా పూర్వకముగ ఆత్మ అకర్త (కర్తృత్వరహితమైనది) యను అనుభవము (నిశ్చయబుద్ధి) నకు సాంఖ్యమని పేరు. ఆ యుభయులు (కర్మయోగ సాంఖ్యనిష్టులు) ను ఇచట యోగులని చెప్పబడుచున్నారు. వారిని గూర్చి ఆ భగవద్గీతా వాక్యము కాల వినియోగమును చెప్పుచున్నది. ఈ కర్మయోగ సాంఖ్యములు రెండును స్మార్తములు స్మృతి ప్రసిద్ధములు. కాన గీతా స్మృత్యుక్తకాల వినియోగమును వారికి సంబంధించినది యనుట యుక్తము కాగలదు. కాన రాత్రియందు గాని, దక్షిణాయనమున గాని మృతులగు బ్రహ్మ విదులకు కాలవ్యవధానము లేకుండగనే బ్రహ్మాలోక ప్రాప్తి సంభవించుననుటలో విరోధమేమియు నుండదు.

''అగ్నిర్జ్యోతిః...'' ఇత్యాది గీతా వాక్యము శ్రుత్యుక్తమగు అర్చిరాది మార్గమునే యనువదించు చున్నది యని - శ్రుతియందలి. ''అర్చిః'' ఇత్యాది శబ్దమువలె గీతా వాక్యములోని ''అగ్నిః'' ఇత్యాది శబ్ధములున్నూ ఆతివాహిక దేవతా బోధకములే యగునని యనుచో ఏ విరోధము (ఏఆశంకయు) ను లేనేలేదు. [అగ్నిర్జ్యోతిః...'' ఇత్యాది గీతావాక్యము శ్రుత్యుక్తార్థాను వాదకము (శ్రుత్యుక్తార్థ జ్ఞాపనము) కాదను భావముతో (అట్టి భావము కల వారికి సమాధానముగా) ఈ సూత్రము బయలుదేరినది.]

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యా శంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున

చతుర్థాధ్యాయయమున ద్వితీయపాదము ముగిసెను.

చతుర్థాధ్యాయస్య - తృతీయః పాదః

అర్చిరాద్యధి కరణమ్‌ 1

1. సూ: అర్చిరాదినా తత్ప్రథితేః

వివృతిః :- ఇత్థ ముత్క్రాన్తిం నిరూప్య తత్సాధ్యం మార్గం, గన్తవ్యం చ నిరూపయితు మయం పాద ఆరభ్యతే - పూర్వస్మిన్‌ పాదే ఆసృత్యుపక్రమా త్సమా నోత్క్రాంతి రిత్యుక్తం - ఇదానీం సా సృతిః = మార్గః శ్రుతి ష్వనేకదా శ్రూయమాణత్వా దనేకవిధేతి భ్రాంతిః కేషాంచన సంభ##వే దితి తద్వ్యుదాసా యోచ్యతే - అర్చిరాదినా = సర్వోపి బ్రహ్మలోక ప్రేప్సురర్చిరాది పర్వవతా మార్గేణౖకేనైవ గన్తుమర్హతి. నతు మార్గాంతరేణ కస్మాత్‌? తత్ప్రథితేః = తసై#్య వార్చిరాది మార్గస్య పంచాగ్ని విద్యా ప్రకరణాదిషు ''యేచేమే అరణ్య శ్రద్ధాతప ఇత్యుపాసతే - తేర్చిష మభిసంభవంతి'' ఇత్యాదినా పంచాగ్న్యుపాసకస్యే వేతరస్యాపి సగుణ బ్రహ్మోపాసకస్య ప్రసిద్ధత్వేన శ్రుతత్వాత్‌ = వర్ణితత్వాత్‌, శ్రుతి ష్వనేకధాశ్రవణ సత్యపి సర్వవివేషణోపసంహారే ణానేకవిశేషణయుక్త ఏక ఏవ మార్గో నానేకవిధ ఇతి నిశ్చేతు శక్యత్వాన్న కశ్చిద్విరోధః.

వివరణము :- పూర్వపాదమున ఉత్క్రాంతి ప్రకారమును నిరూపించి ఆ తరువాతి మార్గమును - గన్తవ్యమును నిరూపించుటకై యీ పాదమారంభింప బడుచున్నది. వెనుకటి పాదములో మార్గోపక్రమము వరకు నందరకునుత్క్రాంతి ప్రకార మొకతీరుననే యుండునని చెప్పబడెను. శ్రుతి వాక్యములలో మార్గ మనేకవిధములుగ వర్ణింపబడి యుండుటచే నామార్గ మనేకవిధము, ఏకవిధమైనది కాదని భ్రాంతి కల్గును. ఆ భ్రాంతిని తొలగించుటకై యిప్పుడు చెప్పబడుచున్నది.

బ్రహ్మ లోకమును గూర్చి ప్రయాణించు వారందరును అర్చిరాది పర్వము (స్థానము) లతో గూడియున్న నొక్క మార్గము వెంటనే ప్రయాణింతురు గాని మార్గాంతరముద్వారా కాదు. ఇట్లేల చెప్పవలయుననిన? పంచాగ్ని విద్యా ప్రకరణము మొదలగు గ్రంథములలోని ''యేచేమే అరణ్య...'' ఇత్యాది వాక్యములలో పంచాగ్న్యు పాసకునికివలెనే సగుణ బ్రహ్మో పాసకుల కందరకును ఈఅర్చిరాది మార్గమే ప్రసిద్ధముగా వర్ణింపబడి యున్నది గనుక నిట్లు చెప్పబడుచున్నది. శ్రుతులలో ననేకవిధములుగ వర్ణింపబడి యున్నను సర్వ వాక్యములలోని విశేషణలనన్నిటిని యోజన చేసి సర్వ విశేషణములతో గూడిన మార్గము ఒక్కటియే గాని అనేకము కాదని నిశ్చయింప వచ్చును గాన విరోధమేమియు లేదు.

వాయ్వధికరణమ్‌ 2

2. సూ : వాయు మబ్దా దవిశేషవిశేషాభ్యాం

వివృతిః :- బ్రహ్మనాడ్యా నిష్ర్కమ్య రశ్మిభి రూర్ధ్వ మాక్రమన్తో బ్రహ్మవిదః ''తే7ర్చిష మభిసంవిశన్తి అర్చిషో7హః అహ్న ఆపూర్యమాణపక్షం ఆపూర్యమాణపక్షాత్‌ షడుదజేతి మాసాన్‌ మాసేభ్య సంవత్సరం సంవత్సరా రాదిత్యం ఆదిత్యా చ్చన్ద్రమనం చన్ధ్రమసో విద్యుతం తత్పురుషో7మానవ స్స ఏతాన్‌ బ్రహ్మ గమయతి'' ఇత్యాది శ్రుత్యక్తక్రమేణ - అర్చిర్దిన పూర్వపక్షోదగయన సంవత్సరా సవాప్య - ఆబ్ధాత్‌ = సంవత్సరా త్పరాంచ మాదిత్యా దర్వాంచం చ - వాయుం = వాయుం దేవలోక పూర్వక మభిసంవిశన్తి. కస్మాత్‌ - అవిశేష విశేషాభ్యాం = కౌషీతక్యాం శ్రుతౌ ''స వాయులోకం'' ఇత్యత్రావిశేషే ణోపదిష్టత్వాత్‌. తథా శ్రుత్యన్తరే ''యదావై పురుషో7స్మా ల్లోకా త్ప్రైతి స వాయు మాగచ్ఛతి తసై#్మ తత్ర విజిహీతే యథా రథచక్రస్య ఖం తేన స ఊర్థ్వ మాక్రమతే స ఆదిత్య మాగచ్ఛతి'' ఇత్యత్ర విశేషేణోపదిష్టత్వాచ్చ - ఏవం ''మాసేభ్యో దేవలోకం దేవలోకా దాదిత్యం'' ఇత్యాది శ్రుతిపర్యాలోచనయా అట్టా ద్దేవలోకం ప్రాప్య తతో వాయు మభిసంవిశన్తీతి చ గమ్యతే - ఇతి.

వివరణము :- సుషుమ్నానాడీద్వారా నిష్ర్కమించి ఆదిత్య రశ్ములతో నేకీభవించి యోర్ధ్వలోకముల నాక్రమింపబోవు బ్రహ్మోపాసకులు ''తే7ర్చిష మభిసంవిశన్తి...గమయతి'' ఇత్యాది శ్రుతియందు ప్రతిపాదింపబడిన విధముగ మొదట అర్చిస్థ్సానమును, ఆ తరువాత పగటిని, ఆ తరువాత క్రమముగ పూర్వపక్ష- ఉత్తరాయణ - సంవత్సరము లను స్థానములను పొంది సంవత్సరమునకు పై నదియు ఆదిత్యలోకమునకు క్రిందిదియునైన వాయులోకమును దేవలోక పూర్వకముగ చేరికొందురు. అనగా సంవత్సరమును, ఆ తరువాత దేవలోకమును - ఆ తరువాత వాయులోకము చేరుదురని యర్థము - కౌషీతకి శ్రుతిలో- ''స వాయులోకం'' ఆ ఉపాసకుడు వాయులోకమును చేరునని అవిశేషముగను - మరియొక శ్రుతిలో ''యదా వై పురుషో... '' అని వాయులోకము చేరిన వానికి ఆ వాయువు ఒక ఛిద్రరూపమైన మార్గము నిచ్చుననియు, ఆ మార్గమున నాతడు ఆదిత్యుని చేరుననియు విశేషముగాను(వాయ్వనంతర భావిత్వ మాదిత్యునికిని) ఇట్లే - ''మాసేభ్యో...'' అను శ్రుతి మాసముల యనంతరము దేవలోకమును వర్ణించి యుండుటచే నా ఉపాసకులు అబ్ధలోకమునుండి దేవలోకమును చేరి యటనుండి వాయులోకమును చేరుచున్నారని తెలియవచ్చుచున్నది.

తటి దధికరణమ్‌ 3

3. సూ : తటితో7ధి వరుణ స్సంబన్ధాత్‌

వివృతిః :- అస్మి న్నర్చిరాదిపర్వవ త్యధ్వని - తటితః - అధి = విద్యుల్లోకాదుపరిష్టాత్‌ - వరుణః = ''సవరుణలోకం - సఇంద్రలోకం - సప్రజాపతిలోకం'' ఇతి కౌషితకిశ్రుతా వవిశేషేణ శ్రుతో వరుణలోకో య స్స విద్యుల్లోకా దుపరి నివేశయితవ్యః - కుతః? సంబన్ధాత్‌ = విద్యుత్కార్యాణా మపాం వరుణాధిష్ఠాతృత్వస్మరణన విద్యు ద్వరుణయోస్సంబన్ధ సద్భావాత్‌ - ఏవం ''స ఇన్ద్రలోకం - సప్రజాపతిలోకం'' ఇత్యుక్తయో స్త్విన్ద్రప్రజాపత్యో ర్యథాశ్రుతి వరుణానంతరం నివేశః కార్య ఇతి.

వివరణము :- ఈ అర్చిరాదికమగు దేవయాన మార్గములో వరుణ లోకమును విద్యుల్లోకమునకు పైననుండు దానినిగా నిర్ణయింప దగును. మేఘమున నుండునదివిద్యుత్తు అటనుండి యుదకములు పుట్టును. ఉదకములకు వరుణడు ప్రభువు. ఆసంబంధమునుబట్టి యట్లు నిర్ణయింపబడుచున్నది. ఇట్లే ''స వరుణలోకం....'' అను కౌషీతకి శ్రుతిననుసరించి వరుణలోకము తరువాత ఇంద్రలోకము ఆ తరువాత ప్రజాపతి లోకము అనియును తెలియదగును.

ఆతివాహి కాధికరణమ్‌4

4. సూ: ఆతివాహికా స్తల్లింగాత్‌

వివృతిః :- ఏవ మర్చిరాదీనాం క్రమం నిరూ ప్యేదానీం స్వరూపం నిరూప్యతే - ఆతివాహికాః = బ్రహ్మోపాసకా నతివహన్తి = స్థానాంతరం ప్రాపయన్తీతి తథోక్తాః = బ్రహ్మలోకంప్రతి గన్తౄణాం గమయితార శ్చేతనా దేవతావిశేషా ఏవ, నతు తన్మార్గచిహ్నభూతాః. నవా భోగ భూమయః - కస్మాత్‌ ? తల్లింగాత్‌ = ''చన్ద్రమసో విద్యుతం - తత్పురుషో మానవ స్స ఏవాన్‌ బ్రహ్మ గమయతి'' ఇత్యన్తే శ్రూయమాణ స్యామానవ పురుషస్య విద్యుల్లోకం ప్రాప్తా నుపాసకాన్‌ప్రతి నేతృత్వశ్రవణా దిత్యర్థః. అనే నార్చిరాదయో హ్యాతివాహికా శ్చేతనా దేవతా ఇత్యవగమ్యతే. ఉపదేశస్వారస్యా దర్చిరాదయో మార్గచిహ్నభూతా ఇతి తు స వక్తవ్యం. తేషామర్చిరాదీనా మాతివాహికత్వే ఉక్తే7పి విరోధాభావాత్‌ - తద్వాక్యేషు లోకశబ్దస్య శ్రూయమాణత్వా దర్చిరాదయో భోగభూమయ ఇత్యపి వక్తుం న శక్యతే. నిలీనేంద్రియవర్గాణా ముపాసకానాం తత్ర భోగాయోగాత్‌ - అతః అర్చిరాదయ స్సర్వేప్యాతివాహికా దేవతా ఇతి - వైద్యుతస్య పురుష స్యామానవ ఇతి విశేషణా త్తదితరేషాం మానవపురుషత్వ మితి గమ్యత ఇతి వివేకః.

వివరణము :- దేవయాన మార్గమునందలి అర్చిరాదుల యొక్క క్రమమును నిరూపించి యిప్పుడు తత్స్వరూపమును నిరూపించుచున్నారు. అర్చిరాదులు దేవయాన మార్గచిహ్నములు గాని - భోగ భూములగు లోకములు గాని కావు. అర్చిరాది పదములచే చెప్పబడువారు బ్రహ్మలోకమును గూర్చి వెడలుచున్న బ్రహ్మో పాసకులను ఆ లోకమును గూర్చి పొందించు చేతనులగు దేవతలే అని చెప్పవలయును. ఏలయన? ''చంద్రమసో విద్యుతం .. గమయతీతి''అను నీ శ్రుతిలో విద్యుల్లోకమును గూర్చి చేరిన ఉపాసకులను అమానవపురుషుడు వచ్చి బ్రహ్మలోకమును గూర్చి పొందించును అని చెప్పుచు అమానవ పురుషునకు బ్రహ్మలోక నేతృత్వము వర్ణింపబడినది. కాన తత్ర్పకరణగత మగు అర్చిరాది శబ్దవాచ్యులును నేతృత్వము కలవారే అని చెప్పవలయును. కాన వారు చేతనులగు దేవతలే అని నిర్ణయింప బడుచున్నది. అర్చిరాదులు మార్గ చిహ్నభూతులే అని అనజనదు. ఆతివాహిక (ప్రాపక = నేతృభూత) దేవతలని చెప్పినను విరోధము లేదుగనుక. ''స వరుణలోకం, స ఇంద్రలోకం.... '' ఇత్యాది వాక్యములలో లోక శబ్దము వాడబడినది గనుక అర్చిరాదులు భోగ భూములని చెప్పవచ్చుననియు అనరాదు. దేవయాన మార్గగులగు ఈ ఉపాసకుల యొక్క ఇంద్రియ వర్గమంతయు విలీనమై యుండెను గాన వారి కిపుడు భోగము అనుమాటయే యుక్తము కాజాలదు. కాన అర్చిరాదులు అతివాహికులగు - నేతలగు (ఒక స్థానమునుండి మరియొక స్థానమునకు ఉపాసకులను పొందించుచుండు) దేవతలనియు - విద్యుల్లోకమువరకు నుండు వీరందరు మానవ పురుషులని:విద్యుల్లోకము, తరువాతివారు అమానవ పురుషులని - చెప్పబడుదురనియు తెలియదగును.

5 సూ: ఉభయవ్యామోహా త్తత్సిద్ధేః

వివృతిః :- అర్చిరాదిపదానాం చేతనదేవతాపరత్వాంగీకారే యుక్తిం దర్శయతి - ఉభయవ్యామోహాత్‌ = ఉభ##యేషాం = గన్తౄణాం ముపాసకానాం, అర్చిరాదిపదానాం యే ముఖ్యార్థా స్తేషా ముభ##యేషాం చ వ్యామోహాత్‌ = ప్రజ్ఞారాహిత్యాత్‌. అర్చిరాదీనాం స్వతః అచేతనత్వేన ప్రజ్ఞావైధుర్యం - యే త్వర్చిరాదిమార్గగా స్తేషాం దేహవియోగాత్‌ - సంపిండిత కరణగ్రామత్వాచ్చ ప్రజ్ఞావైధుర్యం - లోకే చ ప్రజ్ఞారహినాం మూర్ఛితాదీనాం, స్వతః అచేతనానాం చాన్యప్రయుక్త మేవ గమనం దృశ్యతే - న స్వత ఇత్యతః బ్రహ్మగవ్తౄణా ముపాసకానా మపి తథావిధానా మన్యై రేవ = అతాదృశై రేవ గమయితవ్యత్వ స్యౌచిత్యా దర్చిరాదిపదానాం - తత్సిద్ధేః = ఆతివాహిక (గమయితృ) దేవతావాచిత్వస్య సిద్ధేః.

వివరణము :- అర్చిరాది పదములచే చేతనులగు దేవతలే చెప్పబడు చున్నారనుటలో యుక్తి చెప్పబడుచున్నది - అర్చిరాదులు దేవయాన మార్గమునందలి చిహ్నములే అని యన్నను - లేక ఆ మార్గమునందలి లోకములు అని యన్నను వారు ప్రజ్ఞారహితులు - అచేతనులని తేలును. అట్లే ఆ మార్గమున గమనము చేయుచుండెడి ఉపాసకులును స్థూల దేహములు లేనివారు గనుగను - విలీనమైన ఇంద్రియ సముదాయము కలవారు (సంపిండిత కరణగ్రాములు) గనుకను ప్రజ్ఞా రహితులే - అచేతనుల వంటివారే - (మూర్ఛనొందినవారువలె నున్నవారే) అని తేలుచున్నది. ఇట్లు ఉభయులు = అర్చిరాదులు - ఉపాసకులును ప్రజ్ఞారహితులే యగుచో ఉపాసకులకు బ్రహ్మలోక ప్రాప్తి లేకపోవలసి వచ్చును. లోకమున అచేతవస్తువులకుగాని మూర్ఛాదులచే ప్రజ్ఞారహితులైనవారికిగాని స్థానాంతర ప్రాప్తి చేతనులగు అన్యులచే సంభవించు చున్నది గాని స్వతః సంభవించుటలేదు. కాని యిచట వర్ణింపబడిన అర్చిరాది శబ్దములు - సంపిండితకరణగ్రాములగుటచే ప్రజ్ఞారహితులైయున్న ఉపానకులను బ్రహ్మ లోకమును గూర్చి పొందించుచున్న ఆతివాహిక దేవతలనే చెప్పుచున్నవి యని యనుట ఉచితము కాగలదు. [ఆతివాహికులనగా ఒక చోటినుండి మరియొకచోటికి ఇతరులను నడిపించు [పొందించు]వారు అని యర్థము. అర్చిరాద్యభిమాని దేవతలే ఆతివాహిక దేవతలు.]

6. సూ: వైద్యుతే నైవ తత స్తచ్ఛ్రుతేః

వివృతిః :- తతః = విద్యుదభిగమనా దూర్ధ్వం - అర్చిరా ద్యభిమాని దేవతాభి రతివాహ్యమానో7 య ముపాసకః - వైద్యుతేన - ఏవ = విద్యుల్లోక మాగతః అమానవః పురుషః = వైద్యుతః తేనైవ స్వయమూహ్యతే. న తు వరుణాదిభిః - కుత ఇద మవగమ్యత ఇతిచేత్‌ ? తచ్ఛ్రుతేః = ''తాన్‌ వైద్యుతా త్పురుషొ7మానవ ఏత్య బ్రహ్మలోకం గమయతి'' ఇతి తసై#్మవ

127]

గమయితృత్వ (నేతృత్వ) శ్రవణాత్‌-వరుణాదయ స్తు తత్సాహయ్యకే వర్తమానా వోఢారో భవన్తి నతు సాక్షాదితి.

వివరణము :- ''తాన్‌వైద్యుతాత్‌...'' అమాన పురుషుడు వచ్చి విద్యుల్లోకము చేరిన ఉపాసకులను బ్రహ్మలోకమునకు చేర్చును అని చెప్పు ఈ శ్రుతి ననుసరించి విద్యుల్లోకము వరకు అర్చిరాదులు ఈ ఉపాసకులను చేర్చుచు (వహింతు)రనియు, విద్యుల్లోకమునుండి ఉపాసకులను బ్రహ్మలోకమును గూర్చి పొందించుటలో - ప్రాపింప జేయుటలో అమానవ పురుషుడే యాజమాన్యము వహించుననియు, వరుణాదులాతనికి సాహాయ్యమాచరించువారుగ మాత్రముందురనియు తెలియదగును.

కార్యాధి కరణమ్‌ 5

7. సూ: కార్యం బాదరి రస్య గత్యుపపత్తేః

వివృతిః :- ఇత్థం గన్తవ్యప్రాప్తిహేతో ర్మార్గస్య క్రమం స్వరూపం నిరూప్య గన్తవ్యం నిరూపయతి - కార్యం = సగుణం - అపరం బ్రహ్మ - అమానవః పురుష స్స ఏనాన్‌ గమయతి-ఇతి-బాదిరిః = బాదరి రాచార్యోమన్యతే - కుతః అస్య = సగుణస్య బ్రహ్మణ. పరిచ్ఛిన్నస్య ప్రదేశ వత్త్వేన - గత్యువపత్తేః = గన్తవ్యత్వ సంభవాత్‌ - యద్వా - అస్య = ఉపాసకస్య - తత్త్వమసీత్యాది మహావాక్యార్థ సాక్షాత్కారాభావేన స్వాత్మానం వస్తుతో7నవచ్ఛిన్న మప్యవచ్ఛిన్న మివ లోకేభ్యో7భిన్నమపి భిన్నమి వాభిమన్యమానస్య - గత్యుపపత్తేః = అర్చిరాదిలోకాన్‌ ప్రతి గమనసంభవాత్‌.

వివరణము :- ఉపాసకులకు గంతవ్యమైన బ్రహ్మతోకమునకు మార్గమైన దేవయానము యొక్క స్వరూపమును, క్రమమును నిరూపించి యిట గన్తవ్యమును నిరూపించు చున్నారు. ఆ ఉపాసకులను అమానవ పురుషుడు అపర = కార్య = సగుణ బ్రహ్మను గూర్చియే పొందించుచున్నాడు. (అనగా ఉపాసకులకు గన్తవ్యము సగుణ బ్రహ్మయే అని భావము) అని మహర్షి బాదరి యొక్క ఆశయము - ఏలయన? పరబ్రహ్మ దేశకాలాద్య నవచ్ఛిన్నము - పరిపూర్ణము - సర్వాత్మకము. సగుణ బ్రహ్మ అట్లుకాక పరిచ్ఛిన్నము కాన ప్రదేశాదులచట సంభవించును. కాననే ఆ సగుణ బ్రహ్మకు గంతవ్యత్వము సంభవించును గనుక నని. ఈసూత్రమునకు మరియొక విధమగు వ్యాఖ్యానము. ఈ ఉపాసకునకు ''తత్త్వమసి'' ఇత్యాది మహా వాక్యముల యొక్క అర్థము అవరోక్షముగ ననుభూతముకాలేదు గాన, నీతడు వస్తుతః తాను అపరిచ్ఛన్నుడైనను తనను పరిచ్ఛిన్ను నిగను - సర్వ దేశకాలాత్మకుడయ్యును వానికంటే భిన్నునిగను తలంచుచున్నాడు గాన నీతనికి అర్చిరాదికములగు లోకములను గూర్చి గమనము సంభవించును. కనుక నా మార్గమున సగుణ బ్రహ్మనే ఆతడు పొందును. అంతియే గాని పరబ్రహ్మను కాదు. సర్వమునకు ఆత్మయే గాన పరబ్రహ్మకు గంతవ్యత్వము సంభవింప నేరదు అని భావము.

8. సూ: విశేషితత్వాచ్చ

వివృతిః :- చ = కించ.విశేషితత్వాత్‌ = ''బ్రహ్మలోకాన్‌ గమయతి తే తేషు బ్రహ్మలోకేషు పరాః పరావతో వసన్తి'' ఇతి శ్రుత్యన్తరే - లోకా ఇతి - లోకే ష్వితి - బహువచన, ఆధార సప్తమీశ్రుతిభి ర్గన్తవ్యస్య బ్రహ్మణో విశేషితత్వాత్‌ = పరస్మా ద్ర్బహ్మణో వ్యావర్తితత్వా దపి కార్య బ్రహ్మవిషయైవ గతి రిత్యేత దుపపద్యతే.

వివరణము :- మరియు ''బ్రహ్మలోకాన్‌... వసన్తి'' అమానవపురుషుడు ఉపాసకుని బ్రహ్మ లోకమును గూర్చి చేర్చును. వారా బ్రహ్మలోకములలో చిరము నివసింతురని వర్ణించు ఇట్టి శ్రుతులలో బహువచనమును, ఆధారత్వమును బోధించు సప్తమీ విభక్తిని వాడియుండుటచే గన్త్యవ్యమైన బ్రహ్మ పరబ్రహ్మ కాదనియు, సగుణ బ్రహ్మయే యగుననియు చెప్పుట యుక్తమగును. నిర్విశేష పరబ్రహ్మయందు బహుత్వముకాని. ఆధారాది భావముకాని. అసంభవముగదా !

9. సూ: సామీప్యాత్తు తద్వ్యపదేశః

వివృతిః :- గన్తవ్యత్వం కార్యస్య సగుణస్య బ్రహ్మణ ఇత్యుపపాదితం - తర్హి ''స ఏనాన్‌ బ్రహ్మ గమయతి'' ఇత్యాదిశ్రుతిషు పరస్మిన్‌ బ్రహ్మణి ముఖ్యేన నపుంసకబ్రహ్మశ##బ్దేన గన్తవ్యస్య బ్రహ్మణో వ్యపదేశః క్రియమాణః కథ ముపపద్యత ఇత్యాశంకాయా మిద ముచ్యతే - తు = అయం ''తు'' శబ్దో నపుంసకబ్రహ్మశబ్దస్య కారణపరత్వేన కార్యే బ్రహ్మణి తస్య ప్రయోగో నోపపద్యత ఇతి యా శంకా తత్పరిహార్థః - అతో7త్ర శ్రుతౌ తద్వ్యపదేశః = నపుంసక బ్రహ్మశ##బ్దేన కార్యస్య బ్రహ్మణో వ్యపదేశః = వర్ణనం న విరుద్ధ్యతే - కుతః? సామీప్యాత = పరబ్రహ్మ సన్నికర్ష సద్భావాత్‌ - పరే బ్రహ్మణి ముఖ్యస్య తస్య శబ్దస్య కార్యే బ్రహ్మణి లక్షణయా ప్రయోగ ఇత్యర్థః - పర మేవ హి బ్రహ్మ విశుద్ధోపాధిసంబన్ధం క్వచి త్కైశ్చిద్వికారధర్మై ర్మనోమయత్వ, సర్వజ్ఞత్వ, సత్యకామత్వాదిభి రుపాసనా యోపదిశ్యమాన మపర మితి - కార్యమితి , సగుణ మితి చాఖ్యాయతే.

వివరణము :- ''స ఏనాన్‌ బ్రహ్మ గమయతి'' ఆ అమానవ పురుషుడు ఈ ఉపాసకులను బ్రహ్మను గూర్చిపొందించును. అని చెప్పు ఈ శ్రుతిలో ''బ్రహ్మ'' అని నపుంసకలింగ బ్రహ్మ శబ్దము వాడబడినది. ఆ శబ్దము పరబ్రహ్మను బోధించు శబ్దము కదా? - ఇట్లుండ గంతవ్యత్వము కార్య (సగుణ) బ్రహ్మమునకే సంభవించునని చెప్పుట యెట్లు పొసగును? అను ఆక్షేపమురాగా చెప్పబడుచున్నది.

నపుంసక బ్రహ్మ శబ్దముచేత కార్య బ్రహ్మ వర్ణింపబడుటలో విరోధమేమియు లేదు. ఆ బ్రహ్మశబ్దమునకు పరబ్రహ్మయే ముఖ్యార్థమైనను లక్షణావృత్తితో ఆ శబ్దము కార్య బ్రహ్మను బోధించవచ్చును. ఏలయన? కార్యబ్రహ్మకు పరబ్రహ్మ సాన్నిధ్యము కలదు గనుకనని తెలియదగును. [పరబ్రహ్మయే విశుద్ధ మాయోపాధి సంబంధమును పురస్కరించుకొని మనోమయత్వము - సర్వజ్ఞత్వము - సత్య కామత్వము మొదలుగాగల కొన్ని కొన్ని వికార ధర్మములతో ఉపాసకుల ఉపాసనా సౌకర్యము కొరకు ఉపదేశింప బడుచుండును. అట్టి పరబ్రహ్మ వస్తువే అపర బ్రహ్మయని, కార్య బ్రహ్మయని, సగుణ బ్రహ్మయని వ్యవహరింప బడుచుండును. ఇట్లు పరబ్రహ్మ సామీప్యము కార్య బ్రహ్మకు కలదుగాన ఆ బ్రహ్మ శబ్దము కార్యబ్రహ్మ యందు లాక్షణికముగ ప్రయోగింపబడు చున్నది]

10. సూ: కార్యాత్యయే తదధ్యక్షేణ సహాతఃపరమభిధానాత్‌.

వివృతిః :- కార్యాత్యయే = సగుణబ్రహ్మోపాసకా దేవయానేన పథాబ్రహ్మలోకం ప్రాప్య తత్రై వోత్పన్న బ్రహ్మతత్త్వసాక్షాత్కారా న్సన్తః - కార్యస్య = కార్య బ్రహ్మలోకస్య, ఆత్యయే = ప్రళ##యే సముపస్థితే సతి - తదధ్యక్షేణ - సహ = తల్లోకాధికారిణా హిరణ్యగర్భేణ సహ అతః - పరం = అస్మా ద్విలక్షణం తద్విష్ణోః పరమం పదం ప్రతిపద్యన్తే - కుతఏవం నిశ్చీయత ఇతి చేత్‌ ? అభిధానాత్‌ = ''న స పునరావర్తతే'' ఇతి కార్యబ్రహ్మలోకం గత స్యాపునరావృత్త్యభిధా నాదితి బ్రూమః.

వివరణము :- సగుణ బ్రహ్మోపాసకులు దేవయాన మార్గమున బ్రహ్మలోకమును పొంది యచట శ్రవణాద్యనుష్ఠానమున లబ్ధమైన బ్రహ్మ తత్త్వ సాక్షాత్కారము (బ్రహ్మతత్త్వా పరోక్ష జ్ఞానము) కలవారై కార్య బ్రహ్మ లోకమునకు ప్రళయ మేర్పడి నప్పుడు తల్లోకాధి కారియైన హిరణ్య గర్భునితో సహ కార్యబ్రహ్మ వస్తువు కంటె విలక్షణమైన సర్వ వ్యాపక పరమాత్మ తత్త్వము నధిగమింతురు. ఇట్లేల నిశ్చయింప బడుచున్నది యన? ''న స పునరావర్తతే'' కార్య బ్రహ్మలోకమును పొందిన వాడు పునరావృత్తిని (తిరిగి సంసారమును) పొందడు అని వర్ణింపబడి యుండుటచే నిట్లు నిశ్చయింప బడుచున్నది.

11. సూ : స్మృతేశ్చ

వివృతిః :- చ = అపిచ - స్మృతేః = ''బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరేః పరస్యాంతే కృతాత్మానః ప్రవిశన్తి పరం పదం'' ఇతి స్మృతే ర ప్యయ మర్థో7వగమ్యతే - బ్రహ్మలోకం ప్రాప్తాః క్రమేణ ముక్తిం పాప్నువన్తీత్యవగమ్యత ఇత్యర్థః.

128]

వివరణము :- కార్య బ్రహ్మలోకమును పొందినవారు క్రమముగ ముక్తిని పొందుదురు గాని వారికి తిరిగి సంసారముండదని ''బ్రహ్మణా సహ తే .... పరంపదం'' మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మలోకస్వామియైన హిరణ్యగర్భునికిని అంతము సంభవింగా (సమష్టిలింగశరీరాభిమాని హిరణ్యగర్భుడు. ఆతనికి గల ఆ లింగశరీర రూప వికారమును నశించగా) ముక్తి నొందుచున్న ఆతనితోసహ ఆలోకమున నివసించుచున్న బహ్మాత్మైక్య సాక్షాత్కారమును పొందియున్న మహాత్ములందరును పరమ పదమును (ముక్తిని) పొందుదురు అని వర్ణించుచున్న ఈ స్మృతిని బట్టియు నిశ్చయింపబడు చున్నది.

12. సూ: పరం జైమిని ర్ముఖ్యత్వాత్‌

వివృతిః :- ఏవం సిద్ధాంతం పూర్వం ప్రతిపాద్య పూర్వపక్షం దర్శయతి - జైమినిః = జైమిని రాచార్య స్తు - పరం = అతివాహికో గణ ఉపాసకాన్‌ పరమేవ బ్రహ్మ ప్రాపయతీతి మన్యతే - కస్మాత్‌ ? ముఖ్యత్వాత్‌ = ''న ఏనాన్‌ బ్రహ్మ గమయతి'' ఇతి శ్రుతా వుపలభ్యమానస్య నపుంసక బహ్మశబ్దస్య పరబ్రహ్మణ్యవ ముఖ్యత్వాత్‌.

వివరణము :- ఇట్లు స్వసిద్ధాంతమును ముందుగ ప్రతిపాదించి ఇక పూర్వపక్షమును ప్రదర్శించు చున్నారు. - ''స ఏనాన్‌ బ్రహ్మ గమయతి'' అను ఈ శ్రుతి వాక్యములో పరబ్రహ్మ వస్తువునే ముఖ్యముగ బోధించు నపుంసక బ్రహ్మశబ్దము వాడబడినది గనుక ఆతివాహిక గణము సగుణ బ్రహ్మోపాసకులను పరబ్రహ్మను గూర్చియే పొందింతురని చెప్పుటయే యుక్తమని జైమిన్యాచార్యు లభిప్రాయ పడుచున్నారు.

13. సూ: దర్శనాచ్చ

వివృతిః :- చ = అపిచ - దర్శనాత్‌ = ''తయోర్ధ్వ మాయ న్నమృ తత్త్వ మేతి'' ఇతి కార్యే బ్రహ్మ ణ్యనుపపద్యమాన స్యామృతత్వస్య గతి పూర్వకత్వదర్శనా దపి పరమేవ బ్రహ్మ గన్తవ్య మితి మన్తవ్య మితి.

వివరణము :- మరియు ''తయోర్ధ్వ మాయ న్నమృతత్వ మేతి'' ఆసుషుమ్నా నాడీద్వారా వెడలి వెళ్ళుచు (గమనము చేయుచు) ఉపాసకుడ మృతత్వమును పొందును అని చెప్పు ఈ శ్రుతి అమృతత్వమును (మోక్షమును)గమనపూర్వకముగా వర్ణించుచున్నది. ముక్తియనునది పరబ్రహ్మ ప్రాప్తి రూపమే. అమృతత్వము కార్యబ్రహ్మకు సంబంధించునది కాదు. కాన గన్తవ్యత్వము పరబ్రహ్మకే చెప్పవలయు ననియు వారు తలంచు చున్నారు.

14. సూ: నచ కార్యే ప్రత్యభిసన్ధిః

వివృతిః :- చ = అపిచ - ప్రత్యభిసన్ధిః = ''ప్రజాపతే స్సభాం వేశ్మప్రపద్యే'' ఇత్యేవంరూపో మరణకాలీనోయః ప్రాప్తిసంకల్పః - నః కార్యే = అపరస్మిన్‌ బ్రహ్మణి = కార్య బ్రహ్మవిషయకః న = నైవ భవితు మర్హతి. కింతు పరబ్రహ్మ విషయక ఏవ. కస్మాత్‌? ''నామరూపయో ర్నిర్వహితా తే యదన్తరా తద్ర్బహ్మ'' ఇతి కార్యవిలక్షణస్య పరస్య బ్రహ్మణ ఏవాత్ర ప్రకృతత్వా దితి పూర్వః పక్షః - అస్మిన్‌ పక్షే - ముఖ్యత్వాత్‌ - దర్శనాచ్చేతి హేతుద్వయ మర్వాగేవ దూషితం - యత్తు ప్రకరణా ద్వేశ్మప్రాప్తి సంకల్పః పరవిషయ ఇతి - తదపి నోపపద్యతే - ''ప్రజాపతే స్సభాంవేశ్మ ప్రపద్యే'' ఇతి వాక్యశ్రుతిభ్యాం దుర్బలప్రకరణవిచ్ఛేదేన వేశ్మప్రాప్తిసంకల్పస్య కార్య బ్రహ్మ విషయకత్వావగమాత్‌ - అతః కార్యం బ్రహ్మైవ గన్తవ్యం ఇతి సిద్ధ్యతి.

వివరణము :- మరియు ''ప్రజాపతే స్సభాం వేశ్మ ప్రపద్యే'' ప్రజాపతి యొక్క సభామందిరమును నేను పొందుదును అనెడి ఉపాసకుని మరణకాలికమగు అంతిమసంకల్పము నీ శ్రుతి వర్ణించు చున్నది. ఇచటి ఈ ప్రాప్తి సంకల్పము పరబ్రహ్మ విషయకమే అని చెప్పదగును గాని కార్య బ్రహ్మవిషయకమని చెప్పదగును. ఏలయన? ''నామరూపయోర్నిర్వహితా తే యదంతరా తద్ర్బహ్మ'' అను నీ శ్రుతి స్పష్టముగ పరబ్రహ్మ విషయకము. పూర్వోదాహృతమగు నాశ్రుతి యీ ప్రకరణము లోనిది. కాన నట్లు నిశ్చయింపదగు ననియు జైమిన్యాచార్యుల యాశయము. ఇది పూర్వపక్షము. ఈ పక్షమునకు సంబంధించిన మొదటి రెండు సూత్రములలోని హేతువులు పూర్వమే నిరసింప బడినవి. పరబ్రహ్మ ప్రకరణమును బట్టి ప్రజాపతి సభావేశ్మ ప్రాప్తి సంకల్పము పరబ్రహ్మ విషయకమని యనుటయు యుక్తము కానేరదు. కార్య బ్రహ్మను బోధించు ప్రజాపతి శబ్ద సంబన్ధము (ప్రకరణముకంటె ప్రబలమగు వాక్య ప్రమాణము) ను బట్టియు. సర్వానన్యము ప్రాప్తృప్రాప్యాది భావ విధురమునైన పరబ్రహ్మ యం దనుపపన్నమైన ప్రాప్తి సంకల్పమును వర్ణించుచుండుట (శ్రుతి పమాణము) ను బట్టియు-ప్రకరణము నుపేక్షించి శ్రుతిలో వర్ణింప బడిన ప్రాప్తి సంకల్పము కార్యబ్రహ్మ విషయక మైనదియే యని తెలియదగును.

అప్రతీకాలంబనాధి కరణమ్‌ 6

15. సూ: అప్రతీకాలంబనా న్నయతీతి బాదరాయణ

ఉభయధా7దోషా త్తత్ర్కతుశ్చ

వివృతిః :- ఇత్థ మర్చిరాది గన్తవ్యం నిరూప్య తత్ర గన్తౄన్‌ నిరూపయతి -అప్రతీకాలంబనాన్‌ = ఆశ్రయాంతరప్రత్యయ స్యాశ్రయాంతరే ప్రక్షేపః = ప్రతీకః - యథా బ్రహ్మాశ్రయస్య ప్రత్యయస్య నామాదిషు ప్రక్షేపః - తాదృశ ప్రతీకాలంబనేభ్యః = ప్రతీకోపాసకేభ్యః వ్యతిరిక్తాః అప్రతీకాలంబనాః - తాన్‌ = వికారాలంబనాన్‌ = పంచాగ్నివిద్యా - దహరవిద్యా - పర్యంకవిద్యా - వైశ్వానరవిద్యాద్యుపాసకాన్‌ = అహం గ్రహోపాసకా నితి యావత్‌ - తాన్‌ నయతి = అమానవః పురుషో బ్రహ్మలోకం ప్రాపయతి - ఇతి = ఇత్యేవం - బాదరాయణః = బాదరాయణ ఆచార్యో మన్యతే - కుతః? - ఉభయధా = కాంశ్చి త్ర్పతీకాలంబనా న్న నయతి - వికారాలంబనాంస్తు నయతీ త్యుభయార్థత్వే7భ్యుపగతేపి - అదోషాత్‌ = ''అనియమ స్సర్వేషాం'' ఇతి ప్రాగుక్త న్యాయస్య విరోధాభావాత్‌ - అని యమ న్యాయస్య ప్రతీకభిన్న విషయత్వాభ్యుపగమా న్న తద్విరోధ ఇతి భావః - తత్ర్కతుః - చ = ''యథా క్రతు రస్మిన్‌ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి'' - ఇత్యుక్త తత్ర్కతున్యాయ శ్చాత్ర నియామకః- తస్య = కార్యస్య బ్రహ్మణః. క్రతుః = ఉసాసనం యస్యసః - తత్ర్కతుః - ఉపాసకః - ఏవం చ యో యద్విషయకోపాసకో భవతి స తత్ర్పాప్నోతి ఇతి శ్రుతిస్మృతి సిద్ధత్వాత్‌ - తదుపాసకానా మేవ కార్యబ్రహ్మప్రాప్తిః - ప్రతీకోపాస నేషు ''నామ బ్రహ్మేత్యుపాసీత'' ఇత్యాదిషు బ్రహ్మణః ప్రతీకంప్రతి విశేషణత్వేన ప్రతీక సై#్యవ ప్రాధాన్యా న్న తదుపాసకానాం బ్రహ్మప్రాప్తిః - పంచాగ్న్యుపాసకానాం చాబ్రహ్మోపాసకత్వే7పి శ్రుతిబలాద్ర్బహ్మప్రాప్తి రితి విశేషః.

వివరణము :- ఇట్లు అర్చిరాదిమార్గముద్వారా గన్తవ్య మేదియో నిరూపించి యచటికి చేర్చబడు వారెవారో వారిని నిరూపించు చున్నారు. ప్రతీకోపాసకులని అహంగ్రహోపాసకులని ఉసాసకులు రెండు తెగలు. ప్రతీకమనగా ఒక బుద్ధిని మరియొక స్థానమున నుంచుట - ఎట్లన! బ్రహ్మయందుంచ దగిన బ్రహ్మయను బుద్ధిని (జ్ఞానమును - భావమును) బ్రహ్మభిన్నమగు నామాదుల యందుంచుట. అట్టినామాదులకు ప్రతీకములను వ్యవహారము కలదు. అమానవపురుషుడు ప్రతీకోపాసకులు కానివారిని పంచాగ్ని విద్యా - దహరవిద్యా - పర్యంకవిద్యా - వైశ్వానరవిద్యా ఇత్యాద్యుపాసకులను-అనగా అహంగ్రహో పాసకులను బ్రహ్మలోకమును గూర్చి పొందించు నని బాదరాయణాచార్యుల యాశయము ప్రతీకో పాసకుల సమానవ పురుషుడు బ్రహ్మ లోకమును గూర్చి చేర్పడు-ఇతరులను చేర్చును అని ఉపాసకులలో నుభయవిధత్వము నంగీకరించినచో సర్వవిధోపాసకులకును దేవయాన మార్గముద్వారా బ్రహ్మలోక ప్రాప్తిని నిరూపించు ''అనియమ స్సర్వేషాం....'' అను అనియుమన్యాయము విరోధించదా అని శంకింప పనిలేదు. అన్యాయము ప్రతీ కోపాసకులుకాని వారికి మాత్రము సంబంధించునదియే గనుక నట్టి విరోధ ముండదని భావము.ఈ ఉపాసకుల యొక్క బ్రహ్మలోక ప్రాప్త్యప్రాప్తులలో నియామకమైనది తత్ర్కతు న్యాయము. క్రతువనగా ఉపాసనము - తత్ర్కతుః - అనగా నిచట సగుణ బ్రహ్మోపాసకుడని యర్థము.

ఎవడు దేని నుపాసించునో వాడు దానిని పొందు ననునది శ్రుతిస్మృతి సమ్మతమగు విషయము. కాన సగుణ(కార్య)బ్రహ్మోపాసకులకుమాత్రము తత్ర్పాప్తి సంభవించును. ప్రతీకోపాసకుల కట్లుకాదు. ''నామ బ్రహ్మేత్యుపాసీత'' సాలగ్రామమును బ్రహ్మబుద్ధి (భావము) తో నుపాసింపుము అని యనునట్లు నామమును బ్రహ్మగా-బ్రహ్మబుద్ధితో నుపాసింపుమని యిట్లు విధింపబడిన ప్రతీకోపాసనములలో బ్రహ్మకు ప్రాధాన్యముండదు. అట బ్రహ్మ విశేషణమే యగును. ప్రతీకమునకు మాత్రము ప్రాధాన్యముండును. కాన అట్టి ప్రతీకోపాసకులకు బ్రహ్మలోక ప్రాప్తి సంభవించదు. పంచాగ్ని విద్యయందు బ్రహ్మప్రాధాన్యము లేకున్నను ఆ ఉపాసకులకు శ్రుతివచన ప్రామాణ్యము ననుసరించి బ్రహ్మలోకప్రాప్తి యుండుననునది విశేషాంశము.

16. సూ: విశేషం చ దర్శయతి

వివృతిః :- చ = అపిచ - విశేషం = నామాది ప్రతీకోపాసనేషు పూర్వస్మా త్పూర్వస్మా దుత్తరస్మి న్నుత్తరస్మి న్నుపాసనే ఫలవిశేషం - దర్శయతి=''యావన్నామ్నో గతం తత్రాస్య యథా కామచారో భవతి - మనో వాగ్వావ నామ్నోభూయసీ - యావ ద్వాచో గతం తత్రాస్య యథా కామచారో భవతి - మనో వావ వాచో భూయః......'' ఇత్యాదిః శ్రుతిః ప్రతీకతారతమ్యేన ఫల తార తమ్యం దర్శయతి - స చాయం ఫలవిశేషః ప్రతీకతంత్రత్వా దుపాననానా ముపపద్యతే - బ్రహ్మతంత్రత్వే తు బ్రహ్మణో7విశిష్టత్వా త్ఫల విశేషో నోపపద్యతే - తస్మా న్న ప్రతీకాలంబనానా మితరై స్తుల్యఫలత్వమితి - తస్మా ద్ర్బహ్మధ్యాయిన ఏవ బ్రహ్మగంతారః - నాన్యే ఇతి సిద్ధం.

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ చతుర్థాధ్యాయస్య - తృతీయః పాదః

వివరణము :- మరియు. ''యావన్నామ్నో గతం.... వాచో భూయః'' ఇత్యాదిఛాందోగ్య శ్రుతి నామము వాక్కు మనస్సు మొదలగు ఉత్తరోత్త రోత్ర్కష్ట ప్రతీకములను వర్ణించి తదుపాసకులకు తరతమ భావాపన్నమైన ఫలవిశేషములను వర్ణించు చున్నది. ఈ ఉపాసనములలో ప్రతీకములే ఉపాస్యములు (ప్రధానములు) గాన తత్తారతమ్యమునుబట్టి ఫలతారతమ్యము సంభవించుననుట ఉపపన్నమగును. ఆ ఉపాసనములు బ్రహ్మోపాసనములే యనుచో నచట వర్ణింపబడిన నామవాగాది సర్వోపాసనములలోను బ్రహ్మయే ఉపాస్యమగును. అంత బ్రహ్మయనునది యంతటను ఏక రూపమే గాన ఆ ఉపాసనములలో వర్ణింపబడిన ఫలతారతమ్యము ఉపవన్నము కాకపోవును. కాన ప్రతీకోపాసకులకు అహంగ్రహోపాసకులతో సామ్యముండదనియు - బ్రహ్మోపాసకులు మాత్రమే బ్రహ్మ తోకమును పొందుదురు కాని తదన్యులు పొందలేరనియు నిశ్చయింపదగును.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మ సూత్రార్థ వివరణమున

చతుర్థాధ్యాయ - తృతీయపాదము ముగిసెను.

చతుర్థాధ్యాయస్య - చతుర్థః పాదః

సంపద్యావిర్భావాధి కరణమ్‌ 1

1. సూ: సంప ద్యావిర్భావ స్స్వేన శబ్దాత్‌

వివృతిః :- పూర్వస్మిన్‌ పాదే బ్రహ్మోపాసకానాం కార్య బ్రహ్మప్రాప్తి రుక్తా. ఇదానీం తేషా ముపాసకానాం తద్ర్బహ్మలోక సంబన్ధి విశేషాదిక ముత్తరార్థేన నిరూపయిష్యన్‌ ప్రథమతః అభ్యర్హితాయాః పరవిద్యాయాః ప్రాప్యం నిర్విశేష బ్రహ్మభావం ప్రతి పాదయతి - సంపద్య = అవిద్యాపగమ మాత్రేణ స్వప్రకాశమాత్మానం సాక్షా దనుభూయ = బ్రహ్మ స్వరూపతా మవాప్య, స్థితస్య ముక్తస్య - ఆవిర్భావః = అభినిష్పత్తిః - కేవలేనైవాత్మనా భవతి. సతు ధర్మాంతరేణ - కస్మాత్‌? - స్వేవశబ్ధాత్‌ = ''ఏషసంప్రసాదో7స్మా చ్ఛరీరా త్సముత్థాయ పరం జ్యోతి రుపసంపద్య స్వేనరూపే ణాభినిష్పద్యతే'' ఇతి శ్రుతౌ స్వశబ్దస్య శ్రూయమాణత్వాత్‌ - స్వశబ్దోహ్యాత్మవాచీ.సచ రూపవిశేషణత్వం భజ న్నత్రాగంతకుక ధర్మయోగం నిరుణ ద్ధీత్యర్థః

వివరణము :- వెనుకటి పాదములో బ్రహ్మపాసకులగువారికి కార్యబ్రహ్మ ప్రాప్తి సంభవించునను అంశము ప్రతిపాదింప బడినది. ఈ పాదములో ఆ ఉపాసకులకు లబ్ధమైన బ్రహ్మలోకమునకు సంబంధించిన విశేషములను మొదలగు వానిని ఉత్తర భాగములో నిరూపింపబోవుచు ముందుగ నీపాదారంభమున అత్యంత పూజ్యము - మహనీయమునగు పరబ్రహ్మ విద్యకు (బ్రహ్మాత్మైక్య సాక్షాత్కారమునకు)ఫలము నిర్విశేషప్రత్యగభిన్న బ్రహ్మభావమే అను అంశమును ప్రతిపాదించు చున్నారు.

సర్వ జీవులును వస్తుతః నిర్విశేష స్వప్రకాశ పరమానంద ఘన పరమాత్మ స్వరూపులే - అయినను వాస్తవమగు ఆ స్వరూపము అవిద్యా ప్రభావమున తిరోహితము కాగా జీవభావముతో - కర్తృ, భోక్తృ భావములు కలవారుగ - సంసారులుగ - జనన మరణాదులు కలవారుగ వ్యవహించుచుందురు. బహు జన్మకృత సుకృత పరంపరా పరిపాకమున యథాశాస్త్రముగ శ్రవణాదుల ననుష్ఠింప గల్గిన సార్థక జన్ములగు మహాత్ములకు సమ్యగ్‌ జ్ఞానము (తత్త్వసాక్షాత్కారము) లభించును. అంత వస్తుతత్త్వా(స్వ స్వరూపా) వరకమగు అవిద్య తొలగిపోవును. అపరకావిద్య అవగతము కాగా స్వ ప్రకాశ స్వభావక స్వ స్వరూపానుభూతి (బ్రహ్మత్మైక్యానుభవము) కలుగును. ఇట్లు బ్రహ్మ స్వరూపమును (బ్రహ్మ భావమును) పొందియుండు ముక్తుడౌ మహాత్ముని స్థితిని గూర్చి యిచట విచారణ చేయబడుచున్నది.

ముక్తుడు ముక్తి దశయందు అగంతు కావిద్యాప్రయుక్త విశేషములు తొలగిపోగా కేవలస్వ స్వరూపముతోనే ప్రకాశించు చుండునా ? లేక ధర్మాంతరములతో గూడికొని యుండునా ? అని-ముక్తునికి ధర్మాంతర సంబంధ మేమాత్రము నుండనేరదనియే చెప్పవలయును. ఏలయన? ''ఏషసంప్రసాదో.... '' ఈ జీవుడు శరీరమునుండి ఉత్థితుడై (శరీరాత్మ భావమును పోరాడి) పరమ జ్యోతి స్స్వరూపుడైన పరమాత్మతో నేకీభవించి స్వ స్వరూపముతోనే యుండువా డగుచున్నాడు అని నిర్గుణ బ్రహ్మ విద్యా ఫలమును చెప్పు ఈ శ్రుతి వాక్యములో స్వ స్వరూపమును మాత్రము బోధించు ''స్వేన రూపేణ'' అని స్వశబ్దము వాడబడినది గనుక - ''స్వ'' శబ్దము ఆత్మను బోధించునట్టిది ఆ శబ్దము రూపమునకు విశేషణముగా ''స్వేన రూపేణ'' అని యిచట ప్రయోగించబడి యున్నది. ఇట్టి యీ శబ్దము నిర్విశేష బ్రహ్మ సాక్షాత్కారము పొంది ముక్తుడై యున్న వానికి ఆగంతుకములగు ధర్మాంతరములతో, సంబంధమును పూర్ణముగ నిరోధించు చున్నది. కాన ముక్తుడు కేవల స్వ స్వరూపముతోనే ప్రకాశించుచుండునని నిశ్చయింపదగును.

2. సూ: ముక్తః ప్రతిజ్ఞానాత్‌

వివృతిః :- బంధముక్తావస్థయోః కోవిశేష ఇత్యత ఉచ్యతే.ముక్తః = పూర్వ మవస్థాత్రయ కలుషిత స్సంసా రీవావతిష్ఠమానో ప్యాత్మా- సఏవ సర్వ సంసారానర్థవ్రాతాత్‌ పూర్వావస్థాధర్మై స్సర్వై రపి ముక్త ఇహాభి నిష్పద్యతే - పరితః ప్రద్యోతమాన పూర్ణానందాత్మ నావతిష్ఠత ఇత్యుక్తః - కస్మాత్‌ ? ప్రతిజ్ఞానాత్‌ = ''ఏతం త్వేవ తే భూయో7ను వ్యాఖ్యాస్యామి'' ఇత్యవస్థాత్రయ వినిర్ముక్తసై#్య వేహాత్మనో వ్యాఖ్యేయత్వేవ ప్రతిజ్ఞాతత్వాత్‌. పూర్వావస్థా స్విహ చ స్వరూపానపాయసామ్యే సత్యపి సర్వసంబన్ధోపే తత్వ, తద్విముక్తత్వాభ్యా మ స్త్వాత్మనో మహాన్‌ విశేషో ముక్తతాయా మితి భావః.

వివరణము :- ముక్తియందును స్వరూపస్థితియే యగుచో బంధముక్తి దశల యందలి విశేషమేమి? యన చెప్పబడుచున్నది. పూర్వమవిద్యాదశయందు జాగ్రదాద్యవస్థాత్రయ మాలిన్యముతో గూడి సంసారి వలె నున్న ఆత్మయే ముక్తి దశయందు నిర్విశేష బ్రహ్మాత్మ విద్యా ప్రభావమున అవిద్యా ప్రయుక్తమగు సంసార రూప సర్వానర్థ సముదాయము నుండియు- జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థా ధర్మముల నుండియు విముక్తుడై స్వ స్వరూపాభి నిష్పత్తి నొందుచున్నాడని - అనగా సర్వవ్యాపక స్వయం ప్రకాశమాన పరిపూర్ణానంద ఘనరూపముతో నుండునని చెప్పబడెను. ఇట్లేల చెప్పబడినది ? యన ''ఏతం త్వేవ....'' ఈ ఆత్మ స్వరూపమునే తిరిగి వివరించి చెప్పుచున్నామని యనుచు ఛాందోగ్యోవ నిషత్తులో ఈ ఆత్మయే వ్యాఖ్యాతవ్యముగ ప్రతిజ్ఞ చేయబడినది గనుక నిట్లు చెప్పబడినది. బంధముక్త్యవస్థల యందు వస్తు స్వరూపము ఒక్కటియే ఐనను బంధావస్థయందు సర్వ సంబంధ సంపన్నత్వముండును. ముక్త్యవస్థయందు సర్వాత్మనా తద్విముక్తి యుండును. ఇట్లు బద్ధాత్మాపేక్షయా ముక్తాత్మకు విశేష వైలక్షణ్యముకలదని తెలియదగును.

3. సూ: ఆత్మా ప్రకరణాత్‌

వివృతిః :- ''పరంజ్యోతి రుపసంపద్య'' ఇత్య త్రోపసంపత్తి కర్మతయా శ్రూయమాణం జ్యోతిః ఆత్మా = పరమాత్మైవ, సతు భౌతికం జ్యోతిః - కస్మాత్‌? ప్రకరణాత్‌ = ''య ఆత్మా7పహతపాప్మా విజరో.... '' ఇత్యాదినా పరమాత్మన ఏవ ప్రకృతత్వాత్‌. తస్మాదార్తతయా ప్రసిద్ధ వికార విషయ జ్యోతి స్స్వరూప ముపసన్నః కథం ముక్త ఇతి న శంకితవ్యమితి భావ ఇతి -

వివరణము :- ''పరం జ్యోతి రుపసంపద్య'' అను నీ శ్రుతిలోని జ్యోతిశ్శబ్ధమునకు భౌతిక జ్యోతిస్స ని యర్థముకాదు. పరమాత్మ యనియే అర్థము. ఏలయన? ఈవాక్యము ''య ఆత్మా....'' అని యిట్లు పరమాత్మను వర్ణించుచున్న ప్రకరణములోనిది గనుక. ఇట్లు చెప్పుటతో పరిచ్ఛిన్నమైన భౌతిక జ్యోతి స్వరూపమును పొందిన వాడెట్లు ముక్తుడు కాగలడను శంక కవకాశము లేదని భావము.

అవిభాగేన దృష్టత్వాధికరణమ్‌ 2.

4. సూ: అ వి భా గేన దృష్టత్వాత్‌

వివృతిః :- ముక్తః కిం బ్రహ్మభిన్నత్వే నావతిష్ఠతే. ఉత బ్రహ్మాభిన్నత్వే నేతి సంశ##యే - ఉచ్యతే - అవిభాగేన = ముక్తః పరేణ బ్రహ్మణా అవిభాగేన = అభేదేన = నిరతిశయానంద బ్రహ్మాత్మనై నావతిష్ఠతే - నతుపృథగ్రూపేణ. కస్మాత్‌? దృష్టత్వాత్‌ = ''స్వేన రూపేణా7భినిష్పద్యతే- స ఉత్తమ! పురుషః'' ఇత్యా ద్యభేదావబోధ ఫలోపదేశ వాక్యోద్బలితత్వే నాన్యధా వ్యాఖ్యాతు మశక్యాను ''బ్రహ్మైవ సన్‌ బ్రహ్మాప్యేతి'' ''తత్త్వమసి'' ఇత్యాదిశ్రుతిషు ఆత్మబ్రహ్మణో రత్యన్తాభేదస్య దృష్టత్వా దితి.

వివరణము :- ముక్త పురుషుడు పరబ్రహ్మకంటె వేరుగానుండునా లేక తదభిన్నుడై యుండునా ? అని సంశయమురాగా చెప్పుచున్నారు. ముక్తపురుషుడు పరబ్రహ్మాభిన్నుడై = నిరతిశయానందరూప బ్రహ్మస్వరపుడయియే యుండును గాని భిన్న స్వరూపముతో నుండడు. ఇట్లేల నిశ్చయింప బడుచున్నది? యన ''స్వేన రూపే.... '' ఇత్యాదికములగు ముక్తపురుష బ్రహ్మతత్త్వముల కభేదమును బోధించు నిర్విశేష బ్రహ్మ విద్యాఫల వాక్యములను బట్టి అన్యధా వ్యాఖ్యానించుట కవకాశములేని ''తత్త్వమసి'' '' బ్రహ్మైవసన్‌ బ్రహ్మాప్యేతి'' అను నిట్టి శ్రుతులలో ఆత్మబ్రహ్మ వస్తువుల కత్యన్తా భేదము వర్ణింపబడి యున్నది గనుక నని తెలియదగును.

బ్రాహ్మాధికరణం 3

5. సూ: బ్రాహ్మేణ జైమిని రుపన్యాసాదిభ్యః

వివృతిః :- పూర్వాధికరణ బ్రహ్మాత్మనైవావస్థితి ర్ముక్తస్య ప్రతిపాదితా - తత్రైవ విశేషబుభుత్సాయా మభీధీయతే - బ్రాహ్మేణ = బ్రహ్మ సంబన్ధినా అపహతపాష్మత్వ - సర్వజ్ఞత్వా ద్యుపేతేన రూపే ణాభినిష్పద్యతే ముక్త ఇతి - జైమినిః = జైమిని రాచార్యో మన్యతే - కస్మాత్‌? ఉపన్యాసాదిభ్యః = అత్ర త్యాదిశ##బ్దేన విధి వ్యపదేశౌ గృహ్యేతే - తథా చోపన్యాస- విధి - వ్యపదేశేభ్య ఇత్యర్థో వక్తవ్యః తత్ర- ఉపన్యాసః =''సోన్వేష్టవ్య న్న విజిజ్ఞాసితవ్యః'' ఇతి విధానార్థ మాగతః ''య ఆత్మా7పహతపాప్మా విజరో విమృత్యుః'' ఇత్యాధిః - ఉపదేశః - సచ ముక్తస్య తద్ధర్మకతామవగమయతి - విధిః = ''స తత్ర పర్యేతి జక్షన్‌ క్రీడన్‌ రమమాణః - తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి.'' ఇత్యాది రజ్ఞాతార్థజ్ఞాపకః - అయమపి ముక్తస్య నిరంకుశ మైశ్వరయం దర్శయతి - వ్యపదేశః = ''సర్వజ్ఞః''. ''సర్వవిత్‌'' - ''సర్వేశ్వరః'' ఇత్యాదిః అయం తు విధేయాన్తరా భావాత్‌ - సిద్ధవ న్నిర్దేశా చ్చోపన్యాస విధి విలక్షణో వ్యపదేశ ఇత్యుచ్యతే. అసావపి చ పారమేశ్వరధర్మయోగం ముక్తే పురుషే సంగమయతి - అత ఏతేభ్యో హేతుభ్యో బ్రాహ్మై ర్ధర్మై రుపేతో ముక్తాత్మా నప్రపంచ ఏవేతి తేషా మాశయః.

వివరణము :- ముక్తునకు బ్రహ్మభేదము వర్ణింప బడియెను. ఆ యంశమునందలి విశేషమిచట వివరింప బడుచున్నది. ముక్తుడు బ్రహ్మకు సంబంధించిన సర్వజ్ఞత్వాది గుణములతో గూడుకొని యుండునని జైమిని మహర్షి యొక్క అశయము. ఉపన్యాసము - విధి - వ్యపదేశము. అనుకారణములను బట్టి వారిట్లభిప్రాయము పడుచున్నారు. ఉపన్యాసమనగా ఉపదేశము -''సో7న్వేష్టవ్యః....'' ఆ ఆత్మ వెతకి విచారించి తెలిసికొన దగిదది యని విధింపబోవుచు ఆత్మ యొక్క స్వరూపము ''య ఆత్మా....'' ఏది సమస్త పాపవిదూరమో-ఎయ్యెది జరావిరహితమో - ఎయ్యెది మృత్యు సంబంధరహితమో అయ్యది ఆత్మయనుచు నిట్లు పరమాత్మ(ఆత్మ)స్వరూపముదేశింపబడినది. ఇట్టి ఉపదేశమును బట్టియు-''స తత్ర పర్యేతి....'' ముక్తుడు సర్వత్ర స్వేచ్ఛానుసారము అప్రతిహత సంచారము కలవాడై క్రీడించుచు సంప్రీతుడై యుండునని స్రమాణాంతరములచే తెలియజేయబడని ముక్త పురుషులకు సంభవించు నిరంకుశైశ్వర్యమును బోధించు ఇట్టి విధులను బట్టియు. ''సర్వజ్ఞః....'' బ్రహ్మకు సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాది ధర్మములను బోధించు ఉపదేశ - విధి-విలక్షణములగు ఇట్టి సిద్ధారాను వాదరూపవ్యపదేశములను = వర్ణములను బట్టియు ముక్త పురుషుడు పరమేశ్వర ధర్మములతో గూడుకొని యుండునని తెలియవచ్చు చున్నది యనియు - ముక్తపురుషుడు సప్రపంచస్వరూపుడేగాని నిష్ర్పపంచ స్వరూపుడు కాదనియు వారి యాశయము.

6. సూ: చితితన్మాత్రేణ తదాత్మ్యకత్వా దిత్యౌడులోమిః

వివృతిః :- తదాత్మకత్వాత్‌ = ''ఏవం నా అరే అయ మాత్మా కృత్స్నః ప్రజ్ఞాన ఘన ఏవ'' ఇత్యాది శ్రుతిషు జీవాత్మనః కేవల చిదాత్మకత్వా వగమాత్‌-చితితన్మాత్రేణ = చైతన్య మాత్రాత్మనా నిరస్తాశేషప్రపంచే నావ్యపదేశ్యేన ముక్తాత్మా7భినిష్పద్యతే. నతు బ్రాహ్మైర్ధర్మై ర్యుక్తో భవతి - ఇతి - ఏవం = ఇత్థం - ఔడులోమిః = ఔడులోమి రాచార్యో మన్యతే - చైతన్యాత్మనా భినిష్పన్నో ముక్తో నామ బ్రహ్మైవ-తత్ర శ్రూయమాణా స్సర్వజ్ఞత్వాదిశబ్దా నిరర్థకా ఏవ - సర్వజ్ఞత్వాది ధర్మాణా మత్యన్తాసత్వా దిత్యౌ డులోమే రాశయః.

వివరణము :-''ఏవం వా అరే......'' ఇత్యాది శ్రుతులు జీవాత్మ కేవల చిన్మాత్ర స్వరూపుడని వర్ణించుచున్నవి గనుక ముక్త పురుషుడు తనయందు అవిద్యా ప్రభావమున కల్పింపబడిన సమస్త ప్రాపంచిక ధర్మములును విద్యాసామర్థ్యమున నిరన్తములు కాగా వాచామగోచరమగు స్వీయమగు చైతన్యమాత్రస్వస్వరూపముతో నభి నిష్పన్నమగును - నభివ్యక్తము కాగలడు. అంతియెగాని బ్రహ్మ సంబంధి ధర్మములతో గూడుకొని యుండడని ఔడులోమి మహర్షి యొక్క ఆశయము. చైతన్య మాత్రముగా నిష్పన్నమగును అనగా బ్రహ్మగా తాను తన స్వరూపముతోనే ఉండునని యర్థము. శాస్త్రములలోవర్ణింపబడిన సర్వజ్ఞత్వ.సర్వేశ్వరత్వాది ధర్మము లన్నియు కల్పితములే గాన నవి అత్యంతాసత్తులు - కాననే ఆ శబ్దములన్నియు పరమార్థతః విచారించగా నిరర్థకములే ననియు వారి యాశయము.

7. సూ: ఏవమ ప్యుపన్యాసా త్పూర్వభావా దవిరోధం

బాదరాయణః

వివృతిః :- ఏవం - అపి = బ్రహ్మత్మతా మాపన్నస్య ముక్తస్య పరమార్థత శ్చైతన్యమాత్ర స్వరూపత్వే సత్యపి - ఉపన్యాసాత్‌ = పూర్వోదాహృతోపన్యాసాత్‌ ''య ఆత్మా7పహతపాప్మా.'' ఇత్యాదికాత్‌ - పూర్వభావాత్‌ = పూర్వస్య భావః = పూర్వభావః - తస్మాత్‌ = పూర్వస్య = బ్రాహ్మసై#్యశ్వర్యరూపస్యాపి - భావాత్‌ = సద్భావాత్‌ = అప్రత్యాభ్యానాత్‌ - అవిరోధం = విరోధాభావం జైమినివక్షస్య - బాదరాయణః = బాదరాయణ ఆచార్యో మన్యతే - తత్వత శ్చైతస్యమాత్ర ఏవాత్మా - అపహతపాష్మత్వా దయ న్తు జీవాన్తరై స్తత్ర చిదాత్మని ముక్తే జీవే వ్యవహ్రియన్తే ఇతి.

వివరణము :- బ్రహ్మాత్మత్వము (బ్రహ్మ రూపము) ను పొందిన ముక్తపురుషుడు చైతన్య మాత్ర స్వరూపుడే అగునని యన్నను - ఆతనికి ఉపన్యాసాదులను బట్టి బ్రాహ్మ(బ్రహ్మ సంబంధి) ధర్మములగు సర్వజ్ఞత్వ - అపహత పాష్మత్వాదులును సంభవించు నను జైమిని పక్షమున కేమియు విరోధముండదు అని బాదరాయణాచార్యుల నిర్ణయము. ఆత్మ పరమార్థతః చైతన్య మాత్ర స్వరూపుడే. బ్రహ్మ రూపుడే - కాని చిదాత్మ కుడగు ఆ ముక్త పురుషునియందు అపహత పాష్మత్వాది ధర్మము లితరజీవులచే కల్పింపబడి వ్యవహరింపబడు చుండునని భావము.

సంకల్పాధి కరణం 4

8. సూ: సంకల్పాదేవ తు తచ్ఛ్రుతేః

వివృతిః :- ఏతావ తాధికరణత్రయేణ పరవిద్యాఫలం విదేహకైవల్యం విచార్యా థేదానీ మాపాద సమాప్తే స్సగుణవిద్యాఫలం విచార్యతే - సంకల్పాత్‌ - ఏవ = కార్యబ్రహ్మలోకం గతస్య ముక్తస్య సంకల్పాదేవకేవలా త్సామగ్ర్యన్తర నిరపేక్షా ద్ర్బహ్మలోకసంబన్ధినాం పుష్కలభోగ సాధనానాం పిత్రాదీనాం సముత్థానం భవతి - కుతః? - తచ్ఛ్రుతేః = ''స యది పితృలోకకామో భవతి సంకల్పా దేవాస్యపితర స్సముత్తిష్ఠన్తి ఇతి ముక్తభోగ్యానాం సంకల్పమాత్రజన్యత్వ శ్రవణాత్‌ - తు = తుశబ్ధోముక్తసంకల్పస్య ప్రాకృత్యసంకల్ప విలక్షణత్వ ద్యోతకః - అతఏవ తేషాం భోగ్యా నాం సంకల్ప మాత్రజన్యత్వేపి యావత్ర్పయోజనం స్థిరత్వోపవత్తిః.

వివరణము :- నిర్విశేష బ్రహ్మ విద్యా ఫలమగు విదేహ కైవల్యము నీ మూ డధికరణములలో నిరూపించి యికముం దీపాదము చివరి వరకును సగుణ (సవిశేష) బ్రహ్మ విద్యాఫలమును విచారించు చున్నారు. సగుణ బ్రహ్మ విద్యాఫలము తల్లోక (కార్యబ్రహ్మలోక) ప్రాప్తి. దీనికి క్రమ క్తియని పేరు. ఇట్టి ముక్తిని పొందిన వానికి కేవల సంకల్పమాత్రము చేతనే ఇతరసామగ్రీ విశేషము లనేమియు నపేక్షింపకయే బ్రహ్మలోక సంబంధులగు - పుష్కలమగు సమస్త భోగ సాధనములును లభించును. ఈ యంశము ''స యది పితృ....'' ఆతడు పితృలోకమును. పితృలోక భోగసాధనములను కాంక్షించుచో ఆపితరులే ఆభోగ సాధనములతో సహ సమీపింతురు అని యిట్లు బోధించు శ్రుతులను బట్టి తెలియ వచ్చుచున్నది.

9. సూ: అతఏవ చానన్యాధిపతిః

వివృతిః :- చ=కించ - అత - ఏవః = అవంధ్యసంకల్పత్వా దేవ - అనన్యాధిపతిః = న విద్యతే అన్యః అధిపతిః = నియన్తాయస్యసః = అనన్యాధిపతిః - స్వతంత్ర ఇత్యర్థః - ముక్తః పరమేశ్వరాతిరిక్తాధిపతిరహితో భవతి - పరమేశ్వరాతిరిక్తైర్లోకాధిపతిభి ర్ముక్తస్య సంకల్పో న ప్రతిబధ్యతే - పరమేశ్వరస్తు శాస్త్రప్రామాణ్యా న్నాస్య ముక్తస్య విదుష స్సంకల్పం ప్రతిబధ్నా తీతి భావః

వివరణము :- మరియు నాముక్తుని సంకల్పము అవంధ్యము (వ్యర్థము కానిది) కాననే అతడు స్వతంత్రుడు - పరమేశ్వరాతిరిక్తుడగు అధిపతి ఆతనికి ఉండడు - లోకపాలురు గాని - పరమేశ్వరుడు గాని యీ సగుణ బ్రహ్మవిదుని సంకల్పమును ప్రతిబంధించరని భావము.

అభావాధికరణమ్‌ 5

10. సూ : అభావం బాదరి రాహ హ్యేవం

వివృతిః :- ''సంకల్పా దేవాస్య పితర స్సముత్తిష్ఠన్తి'' ఇతి శ్రుత్వా విదుషోముక్తస్యమనోస్తీ త్యవగతం - కిం తస్యమనోవ చ్ఛరీరేంద్రియాణ్యపి నన్త్యుత నేతి సందేహే విచార్యతే - బాదరిః = బాదరి స్త్వాచార్యః మహీయమానస్య = ముక్తస్య విదుషః - అభావం = శరీరేంద్రియాణా మభావం = శరీర మింద్రియాణి చ న సన్తీతి మన్యతే హి = యస్మాత్‌ - ఏవం - అహ = ''మన సైతాన్‌ పశ్యన్‌ రమతే - య ఏతే బ్రహ్మలోకే'' ఇత్యాది రామ్నాయః =శ్రుతిః శరీర స్యెన్ద్రియాణాం చాభావం ప్రతిపాదయతి. యది మనసా - శరీరేణ - ఇంద్రియైశ్చ యుక్తస్సన్‌ ముక్తో విహరేత తర్హి ''మనసా'' ఇత్యన్యయోగవ్యవచ్ఛేదకం విశేషణం వ్యర్థం స్యాత్‌ - తస్మా న్ముక్తానాం శరీర మిన్ద్రియాణిచ మనోతిరిక్తాని నసన్తీతి సిద్ధ్యతీతి.

వివరణము :- ''సంకల్పా దేవాస్య....'' అను శ్రుతి సంకల్పమాత్రముననే ముక్తునకు సర్వబోగ సిద్ధిని ప్రతిపాధించుచు ఆతనికి మనస్సు కలదని సూచించుచున్నది. ఆతనికి మనస్సునట్లు శరీరేంద్రియాదులును కలవా? లేవా? అని సందేహమురాగా చెప్పుచున్నారు. బాదరి మహర్షి ''మన సైతాన్‌....'' బ్రహ్మలోకమున నున్నవారు మనస్సుతోనే భోగముల ననుభవింతురని యీశ్రుతి వర్ణించు చున్నది గనుక వారికి మనోతిరిక్తము లగు శరీంరేంద్రియాదులు ఉండవని తలంచుచున్నారు. మనస్సువలె శరీరాదులును నాతనికి ఉన్నవనుచో ''మనసా'' మనస్సుతో నని శ్రుతిలో వాడ బడిన విశేషణము వ్యర్థముకదా యని వారి ఆశయము.

11. సూ : భావం జైమిని ర్వికల్పామననాత్‌

వివృతిః :- జైమినిః = జైమిని స్త్వాచార్యః భావం = ముక్తస్య విదుషో మనస ఇవ శరీరేంద్రియాణా మపి భావం = అస్తితాం మన్యతే. కస్మాత్‌? వికల్పామననాత్‌ = ''స ఏకధా భవతి. త్రిధా భవతి'' ఇత్యాదిశ్రుతౌ వికల్పస్య = అనేకధా భావస్య ఆమననాత్‌ = వర్ణితత్వా దిత్యర్థః - నహి శరీరభేదం వినాకదాచి దేకధా భావః. కదాచి దనేకధా భావ స్సంభవతీతి.

వివరణము :- ''స ఏకధా....'' ఈ శ్రుతి ఆ బ్రహ్మలోకగతుడౌ ముక్తుడు ఒకప్పుడు ఒకటిగా నుండును మరియొకప్పుడు మూడుగానుండును అని వికల్పమును వర్ణించుచున్నది - శరీరభేదము లేకున్న నిట్లు అనేకధా భావము ముక్తునకు సంభవించనేరదు గాన ముక్తుడౌ విద్వాంసునకు మన స్సువలె శరీరేంద్రియాదులును ఉండు నని జైమిని మహర్షి తలంచుచున్నారు.

12. సూ : ద్వాదశాహవ దుభయవిధం బాదరాయణోతః

వివృతిః :- బాదరాయణః = బాదరాయణాచార్యః పునః - అతః = ఉభయవిధ శ్రుతి దర్శనాత్‌ - ఉభయవిధం = ముక్తస్య విదుష స్సశరీరత్వ మశరీరత్వం చేత్యుభయవిధత్వం స్వసంకల్ప విశేషత స్సంభవతీతి మన్యతే = యదా నశరీరతాం సంకల్పయతి, తదా నశరీరో భవతి - యదా త్వశరీరతాం సంకల్పయతి తదా హ్యశరీరో భవతి ఇతి - అత్ర దృష్టాన్తః - ద్వాదశాహవత్‌ = యథా ద్వాదశాహాఖ్యః క్రతు - ఉభయవిధ శ్రుతిదర్శనాత్‌. సంకల్ప విశేషాచ్చ సత్రం - అహీనం చ భవతి తద్వత్‌.

వివరణము :- అహీనములని - సత్రములని -యాగములని రెండు విధములుగ నుండును - ద్వాదశాహమను యాగము శ్రుతి ప్రామాణ్యము ననుసరించియు - యజమానుని సంకల్పము ననుసరించియు అహీనమును కావచ్చును. సత్రమును కావచ్చును. అట్లే సగుణ బ్రహ్మవిదుడౌ ముక్తునకును నశరీరత్వము (శరీరేంద్రియాదులు కలిగియుండుట) అశరీరత్వము (అవి లేక యుండుటయు) ను ఇట్లు ఉభయ విధత్వమును శ్రుతి సమ్మతమే గనుక ముక్త పురుష సంకల్పాను సారము సంభవించవచ్చునని బాదరా యణాచార్యులు యాశయము.

13. సూ: తన్వభావే సంధ్యవ దుపపత్తేః

వివృతిః :- శరీరాభావపక్షే కథం విదుషో భోగ ఉపపన్నో భవతీ త్యత అహ - తన్వభావే = తనోః = శరీరస్య సేంద్రియ స్యాభావే సతి - సంధ్య వత్‌ = స్వస్నస్థాన ఇవ - ఉపపత్తేః = ముక్తస్య జాగ్రద్భోగవిలక్షణో మాన సిక పిత్రాది విషయభోగ ఉపపద్యతే ఏవ - ''మన సైతాన్‌ కామాన్‌ పశ్యన్‌ రమతే'' ఇతిశ్రుతేః - అతో బాదరిపక్షస్య న కాచిద వ్యనుపపత్తి రితి.

వివరణము :- శరీరాదు లుండవను బాదరిపక్షములో ముక్తాత్మకు భోగమెట్లు సంభవించును? అన చెప్పుచున్నారు. స్వప్నావస్థయందు శరీరాదులు లేకున్నను జాగ్రదివస్థాకాలిక భోగవిలక్షణమగు మానసికభోగము సంభవించినట్లు ముక్తునకును "మన సైతాన్‌ ...." అను శ్రుతి ననుసరించి మానసిక భోగము ననుసరించి మనసిక భోగము సంభవించ వచ్చును. కాన బాదరి మహర్షి పక్షమును యుక్తి యుక్తమే అని తెలియదగును.

14. సూ: భావే జాగ్రద్వత్‌

వివృతిః :- అసత్యపి దేహేంద్రియాదౌముక్తస్య భోగసత్వే శరీరాది మత్వాభ్యుపగమో వ్యర్థ ఇత్యత్రాహ - భావే = శరీరేంద్రియాణాం సద్భావే జాగ్రద్వత్‌ = జాగరితదశాయా మివ ముక్తస్య పిత్రాది భోగోవపత్తేః - జైమిని పక్షస్యాసి న కాచి దునుపపత్తి రితి - తస్మానుక్తస్య పురుషస్య దేహాది భావాభావా వైచ్ఛికా వితి పక్షద్వయ మపి సమంజస మేవేతి భగవతో బాదరాయణ స్యాశయః.

వివరణము :- శరీరాదులు లేకున్నను ముక్తునకు భోగము సంభవించవచ్చు నన్నచో శరీరాదులుండు ననుట వ్యర్థము కాదా? అన చెప్పుచున్నారు. ముక్తుని యొక్క సంకల్పము ననుసరించి శరీరాదులున్నపని యన్నప్పుడాతనకి జాగ్రదవస్థ యందువలె భోగము సంభవించు చుండును కాన జైమిని మహర్షి పక్షమున్నూ యుక్తియుక్తమే నని తెలియదగును. ముక్తపురుషునికి తన ఇచ్ఛను బట్టి శరీరాది సత్వాసత్త్వములు రెండును సంభవించును గనుక వారి యుభయుల పక్షములునుసంమంజసములే అని బాదరాయణాచార్యుల ఆశయము.

ప్రదీపాధి కరణమ్‌ 6

15. సూ: ప్రదీపవ దావేశ స్తథాహి దర్శయతి

వివృతిః :- ముక్తస్య యుగప దనేకశరీరాదిపరిగ్రహ ఐచ్ఛిక ఉప పద్యత ఇత్యుక్తం. తత్ర విశేష ఉచ్యతే - ప్రదీపవత్‌ = యథా ప్రదీపసై#్యక స్యాప్యనేకవర్తిషు ప్రవేశ స్సంభవతి, తథా ముక్తానా మపి నసూక్ష్మదేహానాం విద్యాయోగసామర్థ్యా దనేకేషు స్వసృష్టేషు శరీరే ష్వేకదై వానే కాన్తః కరణద్వారా - అవేశః = అభివ్యక్తిః =ప్రవేశః - సంభవతి. కథ మేత దవగమ్యత ఇతిచేత్‌? హి = యస్మాత్‌ -దర్శయతి = ''సఏకధా భవతి త్రిధా భవతి'' ఇత్యాదిశ్రుతిః ప్రతిపాదయతి. తస్మా న్ముక్తసృష్టాని సర్వాణ్యపి శరీరాని సాత్మకాన్యేవ - న నిరాత్మకానీతి సిద్ధం.

వివరణము :- ముక్తపురుషుడు స్వేచ్ఛ ననుసరించి ఒకే పర్యాయము రెండు, మూడు, ఐదు, పది యిట్లు అనేక దేహములను ధరించ వచ్చునని చెప్పబడినది. ముక్తపురుష సృష్టములగు ఆ దేహము లన్నియు సాత్మ కములెట్లు కాగలవు. ముక్తాత్మ ఒక్కటియే గదా అనగా చెప్పుచున్నారు. అనేకములగు వర్తులయందు ఒకే దీపమున కెట్లు ప్రవేశము సంభవించునో అట్లే సూక్ష్మదేహ యుక్తులగు ముక్తాత్మలకును తమచే సృజింపబడిన నానా దేహములయం దంతఃకరణము ద్వారా ప్రవేశము తమకు గల విద్యా -యోగ, సామర్థ్యప్రభావమున సంభవించును. ఈ యంశమును ''స ఏకధా...' అను శ్రుతి ప్రతిపాదించు చున్నది. కాన ముక్త పురుష సృష్టములగు శరీరము లన్నియు సాత్మకములే గాని - నిరాత్మకములు కావని ధ్రువపడు చున్నది.

16. సూ: స్వాప్యయసంపత్యో రన్యతరాపేక్ష మావిష్కృతం హి

వివృతిః :- ముక్త స్యానేకధాభావాంగీకారే ''తత్కేన కంపశ్యేత్‌'' ఇత్యాది విశేష విజ్ఞానాభావచనం కథ ముపపద్యత ఇత్యత అహ - స్వాప్యయ సంపత్యోః = స్వావ్యయః = సుషుప్తిః - సంపత్తి = పరమముక్తిః = కైవల్యం - తయోః - అన్యతరాపేక్షం = అన్యతరా మవస్థా మపేక్ష్య ''తత్కేన కంపశ్యేత్‌... నతు తద్ద్వితీయ మస్తి'' ఇత్యాది విశేషవిజ్ఞానాభావవచనం ప్రవృత్తం- నతు సగుణవిద్యావిపాక మపేక్ష్య కథ మిద మవగమ్యత ఇతిచేత్‌? హి = యస్మాత్‌ - అవిష్కృతం = ప్రకరణా దేవ మావిష్కృతం. నుషుప్తిప్రకరణాపేక్షయా ''నతు తద్ద్వితీయ మస్తి - యతోన్య ద్విభక్తం'' ఇత్యాదిశ్రుతం - పరమముక్తి ప్రకరణాపేక్షయా ''తత్‌ కేన కం పశ్యేత్‌'' ఇత్యాది శ్రుతం - తస్మా దవాంతరముక్తౌ సగుణ బ్రహ్మవిద స్సశరీరత్వా ద్విశేష విజ్ఞానవత్త్వే న కాచి దనుపపత్తి రితి.

వివరణము :- ముక్తున కనేకశరీర సంబంధము - తద్ద్వారా భోగాదులు నంగీకరించుచో ''తత్కేన కం పశ్యేత్‌'' సార్వాత్మ్యమును సంతరించుకొనియున్న ముక్తాత్మ ఏ సాధనములో నే దృశ్యమును దర్శించును? ఏ శబ్దమును వినగల్గును? ఏయంశము నాలోచింప గల్గును? అనుచును - ''న తు తద్ద్వితీయ...'' ఆత్మనుండి విభక్తమై భోక్తృభోగ్య - జ్ఞాతృ. జ్ఞేయ కార్య, కరణాది రూపమైన ద్వితీయవస్తువే లేదు - అనుచు ముక్తిదశయందు విశేష విజ్ఞానమేమియు సంభవించదను అర్థమును ప్రతిపాదించు శ్రుతి వచనము లెట్లుపపన్నము లగును? అను ఆక్షేపము రాగా చెప్పుచున్నారు.

ఆ వాక్యములు రెండును సగుణబ్రహ్మవిదునకు లబ్ధమైన క్రమముక్తికి సంబంధించునవి కావు అని ప్రకరణమును బట్టి తెలియదగును. "న తు తద్ద్వితీయ...'' ఈ వాక్యము సుషుప్తి ప్రకరణములోనిది గాన - నిది సుషుప్తి కాలీన సత్సంపత్తిని వర్ణించు చున్నది యనియు. ''తత్కేన....'' ఈ వాక్యము పరమముక్తియగు కైవల్యప్రకరణములోనిది గాన పరమ ముక్తి స్వరూపమును విశదీకరించుచున్నది యనియు తెలియదగును. అవాంతర ముక్తియగు బ్రహ్మలోక ప్రాప్తి దశయందు విద్వాంసునకు శరీరరాది సంబంధముండును గాన విశేషవిజ్ఞానము (భోగము మొదలగునవి) కల దనుటలో ఆక్షేప మేమియు లేదని భావము.

జగద్వ్యాపారాధికరణమ్‌ 17.

17. సూ: జగద్వ్యాపారవర్జం ప్రకరణా దసన్నిహితత్వా చ్చ

వివృతిః :- జగద్వ్యాపారవర్జం = సగుణ బ్రహ్మోపాసనాత్‌ సహైవ మనసా పరవమేశ్వరసాయుజ్యం గాతానాం ముక్తానా మైశ్వర్యం జగత్సృష్ట్యాదివ్యాపారం వర్జయిత్వా - అన్య దణిమాద్యాత్మక మేవ భవతి - జగద్వాపారస్తు నిత్య సిద్ధసై#్యవ పరమేశ్వరస్య - కుతః? ప్రకరణాత్‌ = జగద్వ్యాపారవాదిషు శ్రుతివచనేషు పరమేశ్వరసై#్యవ ప్రకృతత్వాత్‌ - చ = కించ అసన్నిహితత్వాత్‌ = అసన్నిహితత్వా చ్చేతరేషా ముక్తానాం - ఈశ్వరాన్వే షణోపాసన పూర్వక మితరేషాం తత్త్రసాదతోణిమా ద్యైశ్వర్యం శ్రూయతే - తే నాసన్నిహితాస్తే. అతోన తేషాం జగత్స్రష్టృత్వాదికం సంభవతి. నిరంకుశ మైశ్వర్యం పరమేశ్వర సై#్యవ కేవలం భవతి - నైతేషాం విదుషా మితి భావః.

వివరణము :- సగుణబ్రహ్మో పాసనా మహాత్మ్యమున మనస్సుతో సహ పరమేశ్వర (కార్యబ్రహ్మ) సాయుజ్యమును పొందియున్న మహాత్ములకు జగత్సృష్టి స్థిత్యాదివ్యాపారము మినహా అణిమాది సమసై#్తశ్వర్య ములును సంభవించును. జగత్సృష్ట్యాదివ్యాపారము మాత్రము నిత్య సిద్ధుడగు పరమేశ్వరునకు సంబంధించినదియే యని నిశ్చయింపదగును. కారణమేమియన? జగత్సృష్ట్యాదులను వర్ణించు సందర్భములో శ్రుతుల యందు తత్కర్తగ పరమేశ్వరుడే వర్ణింపబడు చున్నాడు గాని ముక్తాత్మలు వర్ణింప బడుటలేదు గనుక. మరియు పరమేశ్వర నిర్మిత సృష్ట్యంతర్భూతులగు పుణ్యాతులు కొందరు పరమేశ్వరాన్వేషణోపాసనాదుల నాచరించి తత్ప్ర సాదమున నణిమాద్యనంతై శ్వర్యములను పొందుచున్నట్లు శాస్త్రము లలో వర్ణింపబడు చున్నది. ఇట్టి వీరు జగత్సృష్ట్యారంభ కాలములో లేనేలేరు గనుక ఆ వ్యాపార సాన్నిధ్యము వారికి సంభవించనేరదు. కానను జగత్సృష్ట్యాది వ్యాపారములలో ముక్తాత్మలకు కర్తృత్వముండదని నిశ్చయింపదగును. నిరంకుశ (అప్రతిహత) మగు ఐశ్వర్యము పరమేశ్వరునకే సంభవించును. తదుపాసనమున తత్సాయుజ్యము పొందిన ముక్తుల కట్లు కాదనిభావము.

18. సూ: ప్రత్యక్షోపదేశా దితిచే న్నాధికారికమండలస్థోక్తేః

వివృతిః :- ప్రత్యక్షోపదేశాత్‌ = ''ఆప్నోతి స్వారాజ్యం'' ఇతి ప్రత్యక్షశ్రుత్వా ముక్తస్య నిరంకుశ సై#్యశ్వర్య స్యోపదిశ్యమానత్వాత్‌ - (స్వారాజ్యం = అనన్యాధిపతిత్వం) న తత్ర సంకోచో యుక్తః ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ - న = న తద్యుజ్యతే - కుతః? అధికారిక మండలస్థోక్తేః = అధికారే నియోజయ త్యాదిత్యాధీ నితి అధికారికః సచాసౌ మండలస్థః = సూర్యమండలాది ష్వాయతనవిశేషే ష్వవస్థితః = అధికారికమండలస్థః = పరమాత్మా - తస్య ప్రాప్యత్వేన - ఉక్తేః = ఉక్తత్వాత్‌ - ముక్తస్య స్వారాజ్యప్రాప్తి ర్నామ నిత్యసిద్ధ పరమేశ్వరప్రాప్తి రేవేతి ''ఆప్నోతి మనస స్పతిం'' - ఇత్యాద్యుత్తరువాక్య పర్యాలోచన యావగమ్యతే - తత శ్చ ముక్తానా మైశ్వర్యం పరమేశ్వరాయత్తత్వేన నిరవగ్రహం న భవతీతి. తత్ర సంకోచోక్తి ర్యుక్తైవేతి చ భావః.

వివరణము :- ''ఆప్నోతి స్వారాజ్యం'' ఈ శ్రుతి ముక్తునకు స్వారాజ్యము (అనన్యాధిపతిత్వము) ను - నిరంకుశమగు ఐశ్వర్యమును వర్ణించు చున్నది గాన ముక్తునకు నిరంకుశైశ్వర్యము లేదనుట యుక్తము కాదని ఆక్షేపింపరాదు. ఇచట చెప్పబడిన స్వారాజ్యమనగా నిరంకశైశ్వర్య ప్రాప్తియని గ్రహింపరాదు. సూర్యాది మండలముల నధిష్టించి యుండి మహా మహులగు అగ్న్యదిత్యవాయ్వాదులను గూడ వారి వారి కార్యములయందు ప్రవర్తింప జేయుచుండు పరమేశ్వర తత్త్వమేది గలదో అదియే బ్రహ్మో పాసకులకు ప్రాప్యముగా ఆ శ్రుతి వర్ణించుచున్నది గాన నిత్యసిద్ధ పరమేశ్వర ప్రాప్తియే అచట చెప్పబడిన స్వారాజ్య శబ్దమున కర్థమని తెలియదగును. ఇట్టియర్థమునే ఇట స్వీకరించవలయునని ''ఆప్నోతి మనస స్పతిం'' ఇత్యాదికములగు ఉత్తర వాక్యములను విచారించగా తేటపడగలదు. ముక్తులకు గల ఐశ్వర్యము = ఫలసంపద ఈశ్వరాయత్తమైనది గనుకను అది నిరంకుశ##మైనది కాదని యనుట ఉచితమే కాగలదని భావము.

19. సూ: వికారావర్తి చ తథాహి స్థితి మాహ

వివృతిః :- వికారావర్తి - చ = వికారే ష్వాదిత్యమండలాది షూపాది ష్వవర్తమానం నిర్గుణ మపి నిత్యముక్తం పారమేశ్వరం రూపం సగుణ బ్రహ్మ ణ్యస్త్యేవ . కేవలం వికారమాత్రవర్తి = సవిత్రాది మండలమాత్ర వర్త్యేవ రూపం తత్ర విద్యత ఇతి న మంతవ్యం - కుతః? హి = యస్మాత్‌ తథా - స్థితిం = తస్మిన్‌ సగుణ బ్రహ్మణి సగుణత్వ - నిర్గుణత్వయోః స్తితిం - ఆహ = ''ఏతావా నస్య మహిమా| అతో జ్యాయాగ్‌శ్చ పురుషః| పాదోస్య విశ్వా భూతాని| త్రిపా దస్యామృతం దివి'' ఇత్యదినా శ్రుతిః ప్రతిపాదయతి - తస్మా దితి.

వివరణము :- సగుణ బ్రహ్మయందు వికార రూపములగు ఆదిత్యమండలము మొదలగు వానియందుండని నిత్యముక్తము. నిర్గుణమునగు పరమాత్మ స్వరూపము గూడ నుండును. వికార మాత్రవర్తి స్వరూపమే అచట నుండునని మాత్రము తలచరాదు. ఏలయన? (వికార మనగా - కార్యము - పుట్టుక కలది యని యర్థము. దృశ్యము - పరిచ్ఛినము అనియు చెప్పవచ్చును) '' ఏతావా నస్య .... దివి'' ఈ శ్రుతి సగుణ బ్రహ్మయందు సగుణత్వ - నిర్గుణత్వముల (ఉభయముల) యొక్క స్థితిని ప్రతిపాదించు చున్నది గనుకనని తెలియదగును.

20. సూ: దర్శయత శ్చైవం ప్రత్యక్షానుమానే

వివృతిః :- ప్రత్యక్షానుమానే - చ = శ్రుతిస్మృతీ - ''న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం....'' ఇత్యాద్యా శ్రుతిః - '' న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. '' ఇత్యాద్యా స్మృతిః - తే ఉభే అపి - ఏవం = పరమేశ్వరస్య వికారావర్తి రూపం తాత్త్విక మస్తీతి - దర్శయతః = ప్రతి పాదయతః - అతశ్చ యథైవ పరమేశ్వరే ద్విరూపే సత్య ప్యనవాపై#్యవ తత్రత్యం నిర్గుణం రూపం సగుణ ఏవ పారమేశ్వరే రూపే సగుణోపాసకా అవతిష్ఠన్తే. ఏవం సగుణపి విద్యమానం నిరంకుశ మైశ్వర్య మనవాప్య సావగ్రహా ఏవావతిష్ఠన్తే - తే చ సాలోక్య సామీప్య సారూప్య ముక్తిభాజ స్తారతమ్యేన పరమేశ్వర ముపాసీనా స్సన్తో7వతిష్ఠన్తే - అత స్తేషా మైశ్వర్యం సాతిశయ మేవేతి సిద్ధమ్‌ - యథా వికారాలంబనా స్తత్వజ్ఞానా భావా త్సగుణ బ్రహ్మణి స్తిత మపి నిర్గుణం పారమేశ్వరం రూపం న ప్రాప్నువన్తి తథా విధ్యభావేన జగత్సృష్ట్యాదికర్తృ బ్రహ్మాహమస్మీ త్యాకా రక ధ్యానాభావా త్పారమేశ్వరం జగత్స్రష్టృత్వాదిక మపి న ప్రాప్నువ న్తీతి సూత్రద్వయ స్యాశయః - అతశ్చ న నిరంకుశం బ్రాహ్మ మైశ్వర్యం తేషా మితిభావః.

వివరణము :- (ప్రత్యక్ష మనగా శ్రుతి, అనుమాన మనగా స్మృతి.) ''న తత్ర సూర్యో...'' ఇత్యాది శ్రుతియు ''న తద్భా సయతే...'' ఇత్యాది స్మృతియు పరమేశ్వరునకు వికారావర్తి - వికారములయందు వర్తించక యుండు తాత్త్వికమగు రూపమును కలదని ప్రతిపాదించు చున్నవి.

పరమేశ్వర సాయుజ్యమును పొందియున్న సగుణ బ్రహ్మోపాసకులు పరమేశ్వరుడు ద్విరూరుడైనను అచట గల నిర్గుణ స్వరూపమును పొందక సగుణమగు పరమేశ్వర స్వరూపమునే పొంది యొట్లు తత్సాయుజ్యము గల వారగుచున్నారో - అట్లే ఆ సగుణ బ్రహ్మయందు గల నిరంకుశ బ్రాహ్మైశ్వర్యమును పొందక సావగ్రహమగు - పరిమితమగు ఐశ్వర్యము మాత్రము కలవారై యుందురు. వారును తమ తమ తపోబల తారతమ్యము ననుసరించి సాలోక్య - సామీప్య సారూప్య ముక్తులలో నొక దానిని పొంది వారివారి జ్ఞానాది సంపత్తారతమ్యాను సారము పరమేశ్వరు నుపాసింపుచు నుండురు. కాన వారు పొందిన ఐశ్వర్యము నిత్య సిద్ధ పరమేశ్వరుని ఐశ్వర్యమువలె నిరవధికము కాదనియు, సావధికమే యగుననియు తేలుచున్నది.

సగుణ బ్రహ్మోపాసకులు తత్సాయుజ్యమును పొందియు అచట గల నిర్గుణ పరమేశ్వర సంబంధి స్వరూపమును తత్త్వసాక్షాత్కారము లేని కారణమున నెట్లు పొందలేక పోవుచున్నారో. అట్లే ''జగత్సృష్ట్యాదికర్తృ బ్రహ్మాహ మస్మి'' యను భావముతో నుపాసనము (ధ్యానము) ను వారు చేసి యుండలేదు గనుక సగుణ బ్రహ్మయందు గల జగత్సృష్ట్యాది కర్తృత్వమును వారు పొందలేక పోదురు. [అట్టి ధ్యానమునే వారేల చేయరాదనిన అట్లు ధ్యానించవలయు ననెడి విధిలేదు గనుక నని తెలియదగును.] ఆ కారణమున పరమేశ్వర సాయుజ్యమును పొందియున్నను సగుణోపాసకులకు పరమేశ్వరునకువలె నిరంకుశైశ్వర్యముండ దని యీ సూత్రద్వయము యొక్క తాత్పర్యము.

21. సూ: భోగమాత్ర సామ్య లింగాశ్చ

వివృతిః :- చ = అపిచ - భోగమాత్రసామ్యలింగాత్‌ = ''తమాహ, ఆపోవై ఖలు మీయన్తే లోకో7సౌ'' ఇతి - ''యథైతా దేవతాం సర్వాణి భూతా న్యవ న్త్యేవం హైవం విదం సర్వాణి భూతా న్యవన్తి'' ఇత్యాది శ్రుతిషు ముక్తానాం పరమేశ్వరేణ భోగమాత్రస్య = బ్రాహ్మరౌకిక విషయానం దానుభవమాత్రస్య - సామ్యలింగాత్‌ = తుల్యతాసంకీర్తనరూపా ల్లింగాత్‌ = జ్ఞాపకాదపి, న తేషాం సగుణబ్రహ్మోపాస్త్యా బ్రహ్మలోకం గతానాం ముక్తానాం నిరంకుశ మైశ్వర్యం సంపత్స్యత ఇతి సిద్థ్యతి. ముక్తం ప్రతి పరమేశ్వరోక్తస్య ''తమాహ'' ఇత్యాది వాక్య స్యాయ మర్థః. - తం = ముక్తంప్రతి తల్లోకాధిపతిః పరమేశ్వరః = హిరణ్య గర్భః - అహ = ఏవం వదతి - ఆవః = అమృతరూపా ఇమా ఆపః - మీయన్తే = మయా భుజ్యన్తే యథా మమ తథా - అసౌ-లోకః = అసౌ భోగ్యవర్గ స్తవాపి సాధారణః - ఇతి. ''య థేతి'' శ్రుతే రయ మర్థః - యథా హిరణ్యగర్భస్య తల్లోకస్థాని సర్వాణి భూతాని భోగసాధనాని తద్వ దుపాస్య విదుషో7పీతి.

వివరణము :- మరియు - ''త మాహ... లోకోసౌ'' ముక్తపురుషునితో బ్రహ్మలోకాధిపతియగు పరమేశ్వరుడు - హిరణ్యగర్భుడు - అమృత రూపములగు ఈ ఉదకములనే ననుభవించు చున్నాడు. ఇట్టి యిచటిభోగ్య వర్గమంతయు నాకెట్లో నీకును అట్లే కాగలదు.స్వేచ్ఛానుసార మనుభవింపుము. అని యనుచున్నాడని యీ శ్రుతి వర్ణించుచున్నది. అట్లే యథైతాం.....న్యవన్తి...'' బ్రహ్మలోక స్థితములగు సమస్త భూతములు (ప్రాణి వర్గములు) ను హిరణ్య గర్భున కెట్లు బోగసాధనములగు (దాసాది భావమును బొందు) చున్నవో అట్లే తల్లోకము నధిగమించిన ఉపాసకుడగు విద్వాంసునకును నవి భోగసాధనములగును. అని యీ శ్రుతి వర్ణించు చున్నది. ఇట్లు శ్రుతులలో బ్రహ్మలోక గతులగు విద్వాంసులకు బ్రహ్మలోక సంబంధి విషయానందాను భవము మాత్రము తల్లోకాధిపతి యగు పరమేశ్వరునితో తుల్యముగ నుండునని వర్ణింపబడు చున్నది. కానను ఆ ముక్తపురుషులకు - ఉపాసనచే బ్రహ్మలోకము చేరియున్నవారికి నిరంకు శైశ్వర్యము సంభవించ నేరదని నిశ్చయిపందగును.

22. సూ: అనావృత్తి శ్శబ్దా దనావృత్తిశ్శబ్దాత్‌

వివృతిః :- ముక్తానాం విదుషా మైశ్వర్యస్య సాతిశయత్వే నాంత వత్వా త్పునరావృత్తి స్స్యాదిత్యత ఉత్తరం పఠతి భగవాన్‌ బాదరాయణ ఆచార్యః - యే పున ర్నాడీరశ్మీ సమన్వితే నార్చిరాదిపర్వణా దేవయానేన పథా బ్రహ్మలోకం గతాః యత్ర చ లోకే - అర్ణవసదృశౌ అరిఇతి - ణ్య ఇత్యా ఖ్యాయమానౌ సుధాహ్రదౌ విద్యేతే - యత్ర చ సోమసవనః = అమృతవర్షీ అశ్వత్థో విద్యతే - యత్రచ ఐరంమదీయం ఐరం = అన్నమయం. మదీయం = మదకరం - సరశ్చ విద్యతే - తల్లోకం గతా యే తేషాం తత్ర - అనావృత్తిః ఆవృత్త్యభావ స్సిద్ధః చంద్రలోకం గతానాం తత్ర భుక్తబోగానాం కర్మిణా మివ పున స్సంసారప్రాప్తి ర్నాస్తీత్యర్థః - కస్మాత్‌? శబ్ధాత్‌ = ''తయోర్థ్వ మాయ న్నమృతత్వ మేతి'' ''బ్రహ్మలోక మభిసంపద్యతే| న నపున రావర్తతే'' ఇత్యా ద్యపునరావృత్తి ప్రతిపాదకా చ్ఛాస్త్రాత్‌ - అత్రైత తనుసన్ధేయం. ''ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవ మావర్తం నావర్తన్తే...'' ఇత్యాది శ్రుతౌ ''ఇమం'' ఇతి విశేషణా దస్మిన్‌ కల్పే బ్రహ్మలోకం గతానాం కల్పాంతరే ఆవృత్తిరస్తీ ప్రతిభానతే - అథాపి ఈశ్వరోపాస్తిం వినాపంచాగ్నివి ద్యాశ్వమేధ దృఢబ్రహ్మచర్యాదిసాధనై ర్బ్రహ్మలోకం గతాయే తేషామేవ తత్త్వజ్ఞాన నియమాభావా దావృత్తి స్సంభవతీతి - యే పునర్దహరాదీశ్వరోపాస్త్యా తత్ర గతా స్తేషాం తావ త్సగుణవిద్యాఫలే బ్రాహ్మలౌకిక విషయభోగే నోపక్షీణ సత్యపి నిరవగ్రహేశ్వ రానుగ్రహలబ్ధాత్మ జ్ఞానా న్ముక్తిర్నియ తేత్యా వృత్తి ర్నైవ సంభవతీతి -

సగుణ బ్రహ్మవిదా మపి నిర్గుణ బ్రహ్మాత్మైక్య విజ్ఞాన మపేక్ష్యై వానావృత్తి రిత్యుక్త్యా ఆత్మతత్త్వ సాక్షాత్కారవతా మానవృత్తిః కైముతికి న్యాయసిద్ధైవేతి - అత ఏవాభిజ్ఞైరుక్తం - ''నిర్గుణ బ్రహ్మవిదాం త్వావృత్తి శంకైవ నాస్తి - యత స్సగుణవిదా మపి నిర్గుణాశ్రయణ నైవానావృత్తి, ర్నాన్యధా - తస్మా ద్బ్రహ్మతత్త్వవిదాం నిరస్త సమస్త ప్రపంచ స్వప్రకాశ చిదేకరస నిరతి శయానం దాత్మానా వస్థితి రిత్యతిశో భనమ్‌'' ఇతి.

నూత్రస్యకృత్స్న స్యాభ్యాస శ్శాస్త్రసమాప్తిం ద్యోతయతి.

ఇతి సర్వం శివమ్‌.

తదేవ మస్మిం చ్ఛాస్త్రే ప్రథమత స్సమన్వయోక్త్యా బ్రహ్మాత్మైక్య లక్షణ సై#్యతచ్ఛాస్త్ర ప్రతిపాద్యస్య విషయస్య వేదాన్తప్రమాణకత్వం వ్యవస్థాసితమ్‌, తదన న్తరం తమర్థ మవధారయితుం వేదాన్తవాక్యార్థజ్ఞానే స్మృతితర్కాది సర్వ ప్రకారకం విరోధజాతం పరిహృతం - తదను వివేకవైరాగ్యాది సాధన సంపత్తి శ్చ ప్రదర్శితా - తతో వివేకాది సాధన సంపన్నస్య శ్రవణా ద్యావృత్త్యా నిరస్త సమస్త ప్రతిబన్ధస్య పుంనః, అఖండాత్మాపరోక్షసంబోధా త్సహమూలం బంధే విధ్వస్తే స త్యావిర్భూత నిష్కళంకానంత స్వప్రకాశ చిదానందాత్మ నావస్థానలక్షణో మోక్షో భవతీతి సృష్ట ముపపాదిత మితి సర్వ మతిమంగళమ్‌.

ఇతి శ్రీగాయత్రీ పీఠాధీశ్వర శ్రీవిద్యాశంకర భారతీయతివర విరచితాయాం

బ్రహ్మసూత్ర వివృతౌ చతుర్థాధ్యాయస్య చతుర్థః పాదః

(ఫలాధ్యాయశ్చ సమాప్తః)

వివరణము :- ముక్తులగు ఉపాసకులకు లభించు ఐశ్వర్యము సాతిశయము - పరిమితము అని నిశ్చయింప బడినది గదా - అట్లగుచో వారికి పునరావృత్తి (పునః సంసారప్రాప్తి) సంభవించునని చెప్పవచ్చును కదా అని యనగా భగవత్స్వరూపులైన బాదరాయణచార్యులీ సూత్రమును చెప్పుచున్నారు.

బ్రహ్మలోక మిట్టిది - అచట ''అరః'' అని - ''ణ్యః అని పేర్లతో వ్యవహరింపబడు సముద్ర సమానములైన రెండు సుధాహ్రదము లుండును. అమృతమును నిరంతరము వర్షించుచుండు సోమసవనమను దివ్యమగు అశ్వత్థవృక్ష ముండును. బ్రహ్మానంద సంధాయకమగు అన్నరస సంపూర్ణమైన ''ఐరంమదీయ'' మను సరస్సు విరాజిల్లు చుండును - ఇట్టి దివ్య భోగసాధన సంపన్నమైన బ్రహ్మలోకమునకు - శరీరనాడీ - ఆదిత్యరశ్మి సంబద్ధమైన - అర్చిరాదిపర్వయుతమైన - దేవయానమార్గముద్వారా యే ఉపాసకులు చేరుచున్నాడో వారికి - సత్కర్మల నాచరించి తత్ఫలముగ చంద్రలోకమును పొందుయున్న వారికి తల్లోక భోగానంతరము పునరా వృత్తియున్నట్లు - పునరావృత్తి యెన్నడును. సంభవించదు. ఇట్లేల నిశ్చియింపబడు చున్నది? యనిన - బ్రహ్మలోక గతులగు విద్వాంసులకు అమృతత్త్వము (మోక్షము) ను- అవునరావృత్తిని బోధించు ''తయోర్థ్వ.......'' ''బ్రహ్మలోక......'' ఇట్టి శ్రుతులను బట్టి యిట్లు నిశ్చయింపబడుచున్నది.

''ఏతేన ప్రతిపద్య......'' ఈ మార్గమున బ్రహ్మలోకమును పొంది యున్నవారు ఈ కల్పములో తిరిగి ఆవృత్తిని పొందరు అని ప్రతిపాదించు ఈ శ్రుతిలో ''ఇమం ''అను వివేషణము వాడబడుటతో ఈ కల్పములో బ్రహ్మలోకమును గూర్చి చేరియున్నవారికి కల్పాంతరములో ఆ వృత్తి సంభవించు నను అర్థము భాసించు చున్నది. పూర్వము శ్రుతి ప్రమాణాను సారము బ్రహ్మలోక గతులకు క్రమముక్తియే గాని పునరావృత్తి లేదని చెప్పబడినది. ఈ వాక్యములలో గోచరించు పరస్పర విరోధము నిట్లు పరిహరించు కొనవలయును.

ఎవరు పరమేశ్వరోపాసనము లేకుండగనే-పంచాగ్ని విద్య అశ్వమేధ యాగము- దృఢ బ్రహ్మచర్యము- మొదలగు సాధనములతో బ్రహ్మలోకమును పొందుచున్నారో వారికి తత్త్వ సాక్షాత్కారము కలుగునను నియము లేదు గనుక పునరావృత్తి సంభవించు ననియు- ఎవరు దహర విద్యాదులతో పరమేశ్వరు నుపాసించి తద్బలమున బ్రహ్మలోకమును పొందు చున్నారో వారికి వారి సగుణబ్రహ్మోపాసనాఫలము బ్రహ్మ లోక గత విశిష్ట విషయానందానుభవమున నుపక్షీణమైనను అప్రతిహతమగు పరమేశ్వరాను గ్రహ్మసముప లబ్దమైన ఆత్మతత్త్వ సాక్షాత్కార మున ముక్తి నియతముగ కలిగి తీరును గనుక పునరావృత్తి - పునస్సంసా రము సంభనించదనియు తెలియదగును. ఇట్లు చెప్పుటతో ఉభయవాక్యము లకు విషయ భేదముకలదు గాన విరోధము లేదని తేలగలదు. సగుణ బ్రహ్మోపాసకులగు వారకి నిర్విశేష బ్రహ్మాత్మైక్య విజ్ఞానము కలిగియే అపునరావృత్తి లభించునని చెప్పుటచేత ఆత్మతత్త్వ విజ్ఞానము కలవారికి అనావృత్తి కైముతిన్యాయసిద్దము కాగలదు. కాననే అభిజ్ఞులగు పెద్దలిట్లు చెప్పుచున్నారు. నిర్గుణ బ్రహ్మతత్త్వవేత్తల విషయములో పునరావృత్తి శంకయే సంగతముకాదు. ఏలయన? సగుణోపాసకులకును నిర్గుణ తత్త్వ విజ్ఞానము ద్వారానేగదా అపునరావృత్తి లభించును. అన్యథా లభింపదుకదా? కాన బ్రహ్మతత్త్వ సాక్షాత్కారము కలువారలు నిష్ప్రపంచ, స్వప్రకాశ, చిదేకరస, నిరతి శయానంద ఘన స్వరూపులై వెలుగు చుందు రనుట నిశ్చయము. ఇది పరమమంగళమగు స్థితి.

సూత్రము నంతను ఆవర్తించుట ఈ ఉపనిషదర్ధ విచార లక్షణమగు శాస్త్రముయొక్క పరిసమాప్తిని సూచించు చున్నది.

ఈ శాస్త్రమునందు ప్రథమమున వేదాన్త వాక్య తాత్పర్యము ప్రదర్శింప బడుటతో బ్రహ్మోత్మైక్య రూపమగు ఏతచ్ఛాస్త్ర ప్రమేయము వేదాంత శాస్త్ర ప్రమాణకమను అంశము వ్యవస్థాపన చేయబడినది. ఆతరువాత విచార పూర్వకమగు నిర్థారణ చేయబడిన ఆ అర్థమును ధ్రువపరచుటకై ఈ వేదాన్త వాక్యార్థ జ్ఞానమునందు ప్రతిపక్షులచే నుద్భావన చేయబడిన స్మృతి తర్కాది సర్వవిధ విరోధములును పరిహరింప బడినవి. ఆ తరువాత ముముక్ష జనగ్రాహ్యమగు వివేక వైరాగ్యాది మోక్ష సాధన సామగ్రి ప్రదర్శిచబడినది - ఆ తరువాత వివేకాది సాధన సంపత్తి గల వానికి పునః పునః ఫలోత్పత్తి పర్యంత మనుష్ఠింపబడిన శ్రవణాది సామర్థ్య మున ప్రతిబంధములే మహాత్మునకు నిరస్తము లాయెనో అట్టి పురుష ధౌరేయునకు - అఖం డాసం గాద్వితీ యాపరిచిన్నాత్మ విషయకాపరోక్షసంబోధము కలుగును. అంత అవిద్యా ప్రయుక్తమగు బంధము సమూలము విధ్వస్తము కాగా ఆ మహాత్మునకు స్వయముగ నభివ్యక్తమైన నిష్కళంకానంత స్వప్రకాశచిదానంద స్వస్వరూపముతో తానుండుట యను మోక్షము సిద్థించు నని స్పష్టముగా యుక్తియుక్తిగా ప్రతిపాదింప బడినది.

ఇట్ల తికళ్యాణాత్మకమైన ఈ శాస్త్రము ముగిసెను.

సర్వ మతిమంగళమ్‌.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీవిద్యాశంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున

చతుర్థధ్యాయమున చతుర్థ పాదము ముగిసెను

(ఫలాధ్యాయమును ముగిసెను.)

Brahma Suthra Vivruthi    Chapters    Last Page