Brahma Suthra Vivruthi
Chapters
Last Page ప్రిన్సిపాల్, ఆంధ్ర జాతీయ కళాశాల, బందరు. విద్వాన్ - బ్రహ్మశ్రీ వేదమూర్తులు భాగవతుల కుటుంబరావుగారు
ఈ గ్రంథ రచయితలు శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు శ్రీ శాంకర భాష్యములను, తదితర వేదాన్త గ్రంథములను మహానీయులైన గురువుల ముఖమున అత్యంత జిజ్ఞాసతో శ్రవణముచేసి,. సహజమైన బుద్ధి కౌశలముతో మననముచేసి, తదర్థమును జీర్ణము చేసికొని, ఇతరులకు బోధించి, ఆచరణమున నుంచి, ప్రచారము చేయుచున్న మహా పురుషులు. వీరి యీ రచనలు ఆంధ్రసాహితి కొక యలంకారము.
బ్రహ్మసూత్ర వివృతి యనునది. అతి సులభ##మైన సంస్కృతవ్యాఖ్య. వివరణ మనునది తేఁట తెనుఁగున నున్న వ్యాఖ్య. శాస్త్రీయ చర్చలయొక్క లోతులలో దిగకయే. సూత్రముల యొక్క ముఖ్య భావమును తెలిసికొనుటకు తెనుఁగున నిటువంటి గ్రంథము యొక్క అవసర మెంతైననున్నది. ఇప్పటి కాకొఱత తీరినది.
ఈ వివరణముల యందు, సమానాధికరణము, హ్రస్వపరిమండలములు, ప్రతిసంఖ్యానిరోధము మొదలగు పారిభాషిక పదములు వివరింపఁబడినవి. భాషా కాఠిన్యము లేదు. విషయ ప్రతిపాదన మతిసరళము. సంస్కృత భాష యనిన భయఁబడి వేదాన్తశాస్త్రమును పరిశీలించుటకు జంకుచున్న వారీ గ్రంథమును చదువుచో వారికి భయము పోవుటయే గాక, సూత్రరచనాకౌశలమును గూడ వారర్థము చేసికొనగలరు. క్లుప్తముగఁ జెప్పవలయు నన్నచో నీ గ్రంథమునకు, బ్రహ్మ సూత్రార్థ వివృతియను నామమన్వర్థము. శ్రీ శాంకర భాష్యమునకుఁ గూడ నింతటి తేఁట తెనుఁగుననే వివరణమును వ్రాయవలయు నని శ్రీ స్వామివారిని అభ్యర్థించు చున్నాను.