Brahma Suthra Vivruthi
Chapters
Last Page శ్రీ సద్గురు పాదుకాభ్యాంనమః శ్రీ మహాగణాధి పతయేనమః శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితా బ్రహ్మసూత్రవివృతిః శ్లో|| సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం చంద్రశేఖర పర్యన్తాం వందే గురుపరంపరామ్ || బ్రహ్మసూత్ర వివృతిః :- శ్రీమద్భగవద్వేదవ్యాస సంగ్రథితానాం పరమ గంభీరాణాం బ్రహ్మ సూత్రాణా మేషా మర్థావబోధ స్సంస్కృత భాషాయాం విశేషతః పరి చయాభావే೭పి తజ్జిజ్ఞాసూనాం ముముక్షూణా మనాయా సేన భ##వేదితి తదర్ధావబోధాయ సులభయా శైల్యా వాక్యరూపేణ తేషాం బ్రహ్మసూత్రాణాం భావో೭త్ర విశదీక్రియతే. సర్వాసా ముపనిషదాం నిర్విశేషే ప్రత్యగభిన్నే బ్రహ్మణ్యవపరమం తాత్పర్య మితి, తాదృశం బ్రహ్మైవ సత్యం, జగన్మిథ్యా, జీవస్తు న బ్రహ్మణో భిన్నః ఇతి, పరమః పురుషార్థో మోక్షాఖ్యో జ్ఞానే నైవలభ్యతే నాన్యేనే త్యేవ మద్వైత సిద్ధాంతో బ్రహ్మసూత్రేషు సుష్ఠు నిరూపితః. బ్రహ్మసూత్ర లక్షణో೭యం గ్రన్థః అధ్యాయ చతుష్టయాత్మకః. తత్ర ప్రత్యథ్యాయం చత్వారః పాదా స్సన్తి. కృత్స్నే ೭స్మిన్ గ్రన్థే పంచపంచాశ దుత్తర పంచశతం (555) సూత్రాణివర్తన్తే. అథికరణానితు ద్వినవత్యుత్తర శత (192) సంఖ్యాకాని. తేషు ప్రత్యధికరణ మేత చ్ఛాస్త్రసంబన్ధీ బ్రహ్మ జ్ఞానోపయోగీ ఏకైకో విషయః పక్ష ప్రతిపక్ష ప్రదర్శన పూర్వకం విచార్య నిస్సందిగ్ధ మిద మిత్థ మితి నిరూపితః. అత్రత్యే అద్వైత సిద్ధాంతే సంసారలక్షణం సర్వ మప్యనర్థజాత మధ్యాస మూలక మేవేతి నిర్ణయః. స చాధ్యానః అనాత్మసు దేహాది ష్వాత్మత్వ భ్రాంతిలక్షణః. తాదృశస్య సర్వానర్థ మూలస్య అధ్యాసస్య ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే బ్రహ్మసూత్రా ణీమాని భగవతా వేదవ్యాసేన విరచితాని. తేషాంచ శ్రీ శంకర భగవత్పూజ్య పాదైరమూల్యం భాష్యం విరచితం విజయతే. తదనుసృత్యై వాద్యాస్మాభి స్తద్ర్బహ్మసూత్రాణా మియం వివృతిః క్రియతే. బ్రహ్మ సూత్ర సంబంధినాం చతుర్ణా మప్యధ్యాయానాం క్రమేణ సమన్వయాధ్యాయ ఇతి, అవిరోధాధ్యాయ ఇతి. సాధనాధ్యాయ ఇతి, ఫలాధ్యాయ ఇతిచ వ్యవహారః. తత్ర ప్రథమాధ్యాయే ప్రమాణ మూర్ధన్యానాం సర్వవేదాంతానామ పై#్యకమత్యేన అద్వితీయే సచ్చిత్సుఖ స్వరూపే బ్రహ్మణి నిర్విశేషే ఏవతాత్పర్యం, న సాంఖ్యాదిదర్శన సంమతేషు తత్త్వేష్వితి సమన్వయః (తాత్పర్యం) సమ్యక్ నిరూపిత ఆసీత్. అతో೭స్యనమన్వ యాధ్యాయ ఇతి ప్రమాణ ప్రమితే೭స్మిన్ పరమేతత్త్వే ఇతరై ర్దార్శనికవరై రుద్భావితానాంసర్వేషాం విరోధానాం పరిహారస్య సంపాదితత్వాత్ ద్వితీయ స్యాధ్యాయస్య అవిరోధాధ్యాయ ఇతి ప్రమాణ ప్రమితం తత్తత్త్వం ప్రత్యధిజిగమిషా యేషాం తేషాం తత్సాధనానాం వైరాగ్యా దీనాం ప్రదర్శనం యతోత్ర కృత స్తత స్తృతీయాధ్యాయస్యాస్య సాధనాధ్యాయ ఇతి. ఫల స్వరూప ప్రదర్శన పరత్వా చ్చతుర్థాధ్యాయస్య ఫలాధ్యాయ ఇతిచ వ్యవహార స్తత్త దర్థానుసారే ణాభిజ్ఞైః క్రియమాణో దృశ్యతే || ప్రథమాధ్యాయమున ప్రమాణ శ్రేష్ఠములగు సర్వ వేదాంతము లకును ఐకమత్వముతో (భిన్నాభిప్రాయ మిసుమంతయు లేకుండ) అద్వితీయము, సచ్చిత్సుఖాత్మకము, నిర్విశేషమునగు బ్రహ్మతత్త్వము నందే తాత్పర్యము గాని, సాంఖ్యాది దర్శనసంమతతత్త్వముల యందు తాత్పర్యము కాదని సమన్వయము (తాత్పర్యము) ప్రదర్శింపబడి యుండుటతో నీ ప్రథమాధ్యాయ మును సమన్వయాధ్యాయ మనియు, సర్వ ప్రమాణ సమ్మతమగు నీ తత్త్వమునందు సాంఖ్యాది శాస్త్రకర్తలచే చూపబడుచున్న సమస్త విరోధములును ఇచట పరిహరింపబడి యుండుటచే ద్వితీయాధ్యాయమును అవిరోధాధ్యాయ మనియు, ప్రమాణ సమ్మతమగు నా తత్త్వము నధిగమింప గోరువారికి వలయు వైరాగ్యాది సాధనములను ప్రతిపాదించుటచే తృతీయాధ్యాయమును సాధనాధ్యాయ మనియు, ఫల స్వరూపమును ప్రతిపాదించుటచే చతుర్థాధ్యాయమును ఫలాధ్యాయ మనియు, ఆ యా అధ్యాయ ప్రతిపాద్యార్థముల ననుసరించి విజ్ఞులు వ్యవహరించు చున్నారు.