Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

7. శ్రీమత్పరమహంస కల్యాణగుణ గంభీర

శ్రీశేషాద్రిస్వామిస్తుతి

కృతి. కీరవాణి రాగము - ఆదితాళము

పల్లవి

గురువరుని సేవించిన వారికి

దొరకని ఫలముకలదా - శేషాద్రిసత్‌. (గురువరుని)

అనుపల్లవి

స్మరణా దరుణాచల తేజోమయ

పురమున జీవన్ముక్తుడైన సత్‌. (గురువరుని)

చరణము - 1

బహుకాలముగా సజ్జనులకు కరుణతో

ఇహపరసుఖములకై సూక్ష్మరూపుడై

మహనీయుల సదుపదేశముల

మహిమలుపొగడ విదులకైతరమా సత్‌.

(గురువరుని)

చరణము - 2

కలినరులకు నామమహిమలు తెలుసును

సలిలమువలె పాపతాపము తొలగును

చెలిమితో దైన్యులకభయ మొసగును

ఫలితమౌ పుణ్యజ్ఞానము వెలుగును సద్గురు.

(గురువరుని)

కృతికర్త :

---సంగీత కళానిధి, టి. కె. బాలగణశయ్యరు.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page