Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

8. శ్రీమత్పరమహంస శ్రీరాజపూజిత

శ్రీ కళందైయానందస్వామి స్తుతి

కృతి - ఆనందభైరవి - ఆదితాళము

పల్లవి

ఆనందస్వామిని వేడరే

శ్రీరాజపూజిత కొళందై. (యానందస్వామిని)

అనుపల్లవి

జ్ఞానానంద మనోహరం అభ

యానంద భక్తార్తిహరం కుళందై - (యానందస్వామిని)

చరణము - 1

అతిసుందర మీనాక్షి కుమారం

యతిరూప భృంగి నరావతారం

శృతి శాస్త్ర పురాణాది సాగరం

స్తుతిసలుపరె గురువర కుళందై - (యానందస్వామిని)

చరణము - 2

బాలుని వలె ముద్దుపలుకు లాడుచును

మేలైన భువనేశ్వరిని వేడుచును త్రి

కాలము నెరిగి భక్తుల కాపాడును

బాలగణపతిని బోలిన కుళండై. (యానందస్వామిని)

కృతికర్త :

---సంగీతకళానిధి, టి.కే. బాలగణశయ్యరు

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page