Sri Jayendravani    Chapters    Last Page

11. భూలోకము - దాని ప్రాముఖ్యత

మనం జీవించే ప్రపంచాన్నే భూలోకమంటాం. ఈ భూలోకంలో చాలా దేశాలున్నాయి. మనం నివసించే దేశాన్ని భారతవర్ష మంటాం. మొత్తం 14 లోకాలున్నాయని వాడుక. 7 లోకాలు ఊర్ధ్వ దిశలోను, 6 క్రిందను, ఈ రెంటికి మధ్య మన భూలోకం వున్నాయి. మన లోకం మధ్యలో వుంది గనుక దానిని మధ్యమలోకం అనికూడ అంటారు.

మనకు ఊర్ధ్వ దిశలో వున్న లోకాలు : సూర్యలోకం, చంద్రలోకం, ఇంద్రాది దేవతలుండే దేవలోకం, బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం మొదలైనవి మనకు క్రింద వున్న లోకాలు పాతాళలోకం మొదలైనవి.

పాతాళలోకం లేక క్రిందిలోకాన్ని నరకలోకంగా ప్రజలు భావిస్తారు. కాని అది నిజంకాదు. క్రింది లోకాల్లో దేవతాంశ గల నాగదేవతలు నివసించే నాగలోకం లాంటివి కూడా వున్నాయి. నిజంగా నరకుని యొక్క లోకం పాతాళలోకంలో లేదు. అది భూలోకంలోనే ఒక దిశలో ఒకమూలగా వుంది. పాపం చేసినవాడు నరకలోకంలోనికి త్రోసి వేయబడతాడని జనుల విశ్వాసం. అనగా పాపియైనవాడు పరిణామ క్రమంలో ఒక మెట్టు నుండి మరియొక మెట్టునకు దిగజారి మిక్కిలి హీనమైన స్థితికి చేరుకుంటాడు.

శ్రీకృష్ణలీలల్ని వివరించే భాగవత గ్రంథంలోని 4, 5 స్కంధాల్లో ఈ 14 లోకాల్ని గురించిన వివరాలన్నీ విశదీకరింప బడ్డాయి. ఏ లోకంలో ఎవరుంటారు, ఏఏ దేవతల్ని ఎవరు ఆరాధిస్తారు. రాముణ్ణి, కృష్ణున్ని ఎవరు కొలుస్తారు మొదలైన విషయాలేగాక, ఆ లోకాల్లో నివసించే ప్రజలు ఏఏ పనులు నిర్వహిస్తారు. అచ్చటి ఉత్పత్తులు, సంపదలు ఎలా ఉంటాయి మొదలుగా గల అంశాలన్నీ మనకు భాగవతంలో లభిస్తాయి. క్షీరసముద్రం, తేనె సముద్రం మొదలైన వివిధ జలభాగాల్ని గురించి కూడ దానిలో వర్ణన లున్నాయి. మనకు మన భూమిపై ఉన్న లవణ సముద్రాన్ని గురించే తెలుసు. కాని ఇతర లోకాల్లో క్షీరసముద్రం, తేనె సముద్రం, దధి సముద్రాలు వున్నాయి. వాటిలో కొన్ని లోకాల్లో క్షీరము, మధువు వృక్షాల నుండి క్రిందికి ప్రవహిస్తూ వుంటాయి. ఆ క్షీరాన్ని త్రాగినవాడు అప్రయత్నంగానే ధనాధికుడు, ఆరోగ్యవంతుడై మరణాన్ని కూడ జయించిన వాడౌతాడు. అలాంటి లోకాలు మన భూలోకానికి పైన వున్నాయి.

మనది మధ్యమలోకం గనుక ఊర్ధ్వ లోకాల్లో వారు గాని, క్రింది లోకాల్లో వారుగాని పై లోకం నుండి క్రింది లోకానికి, క్రింది నుండి పై లోకానికి వెళ్లవలయునంటే మన లోకం ద్వారానే పయనించాలి. అలాగే ఎవరుగాని మహోన్నత పదవియైన మోక్షాన్ని పొందాలంటే మన లోకానికి ముందుగా రావాలి. స్వర్గలోకంలోగాని, దేవలోకంలోగాని నివసించే ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఇంకా ఇతర దేవతలు కొన్ని కార్యాలు సాధించటం కోసం మన లోకానికి విచ్చేస్తారు. ఒక్కొక్కప్పుడు వారు చేసిన పాపకార్యాలకు ఫలితంగా పదవీచ్యుతులై కూడ వారు మన లోకానికి వస్తారు. కొన్ని సందర్భాలలో మహర్షులచే శపింపబడి శాపఫలాన్ని అనుభవించటానికి కూడ భూలోకం వస్తారు. దేవలోకంలో వారికి నిత్యం సుఖానుభవమే వుంటుంది. కష్టాల్ని అనుభవించాలంటే వారు భూలోకానికి రావాల్సిందే. మనం అనుకుంటాం. భూలోకంలో వున్న ప్రజలకే కష్టాలుంటాయని. కాని దేవతలు కూడ బాధల్ని అనుభవించటానికి మన లోకం వస్తారు. భరతభూమి ఆ విధంగా కష్టాలు అనుభవించటానికి ప్రజలకై సృష్టింపబడిన దేశం. మనం అనుభవించే భోగాలు గాని, సుఖాలు గాని, కేవలం విషయ వాంఛా జనితములే. దేవలోకంలో కూడ ఇలాంటి భోగాలే ప్రాప్తిస్తాయి. కాని పరిమాణం విషయంలో అవి చాల ఎక్కువగా వుంటాయి.

మన మతం ప్రకారం మనం భగవానుని మూడు రూపాల్లో ఆరాధిస్తాం. మొదటి రూపంలో ఆయన సర్వాంతర్యామియై భాసిస్తాడు. సర్వసృష్టికి కారణభూతుడాయనే. రెండవది సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు. సరస్వతి, లక్ష్మి, పార్వతి - ఈ ముగ్గురు శక్తి స్వరూపిణులు. పై ముగ్గురితోను వారి కార్యనిర్వహణమందు సహచారిణులై యుంటారు. మూడవ రూపం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మొదలైనవారి అవతారాలే. మన దేశంలో విష్ణువు పది అవతారాలు తాల్చాడనే సిద్ధాంతం వుంది. కొంతమంది అవతారాలు పదికాదు 21 అని కూడ భావిస్తారు. వైకుంఠవాసియైన విష్ణుమూర్తి ధర్మ సంరక్షణార్ధం, అధర్మనిర్మూలన నిమిత్తం, దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణ కొరకు భూలోకంలో అవతరిస్తాడు. ఇదే విషయం శ్రీకృష్ణపరమాత్మ గీతలో ఈ విధంగా చెప్తాడు :

శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం |

ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ||

\|msƒ«s ƒ«sV²T…„sƒ«s ª«sVW²R…V LRiWFyÌÁV gSNRP ˳ÏÁgRiªyƒ«sVƒ«sNRPV @µ³j…NSLjiNRP xmsoLRiVxtsvÌÁ®ƒs[ ƒyÌæÁª«s LRiWxmsLi NRPW²R… ª«soLiµj…. BLiúµR…V²R…V, NRPVÛËÁ[LRiV²R…V, ª«sLRiVßáV²R…V ®ªsVVµR…ÌÁgRiVªyLRiV C ª«sLæRiLiÍÜ[NTP ª«sryòLRiV. ª«sLRiVßáV²R…V ª«sL<Ri„sVryò²R…V, NRPVÛËÁ[LRiV²R…V xqsLixmsµR…ÖÁryò²R…V. BÛÉýÁ[ B»R½LRi ®µ…[ª«s»R½ÌÁV ª«sVƒ«s ÍÝNTPNRP xmsLjiFyÌÁƒy „sµ³yƒ«sLiÍÜ[ NRPÛÍÁNíRPLRiV, úxmsµ³yƒ«sª«sVLiú¼½, ú|mszqs®²…LiÈÁV ®ªsVVµR…ÌÁgRiV ªyLRiV ¬sLñki»R½\®ªsVƒ«s N]¬sõ „sµ³R…VÌÁƒ«sV ¬sLRi*z¤¦¦¦LiÀÁƒ«sÛÉýÁ[ C ®µ…[ª«s»R½ÌÁV NRPW²R… ª«sVƒ«s\|ms Aµ³j…xms»R½ùLi ª«sz¤¦¦¦LiÀÁ N]¬sõ ¬s¸R…V„sV»R½ NSLSùÌÁƒ«sV ¬sLRi*QQLjiòryòLRiV. ˳ÏÁWÍÜ[NRPLiÍÜ[¬s úxmsÇÁÌÁV ZOP[Qª«sVLigS ÒÁ„sLi¿RÁVÈÁNRPV »R½gjiƒ«s úxms¾»½[ùNRP ¿RÁLRiùÌÁƒ«sV C @µ³j…NSLRiVÌÁV ¿Á[‡Á²R…»yLRiV. µk…¬s®ƒs[ ª«sVƒ«sLi \®µ…„sNRP\®ªsVƒ«s xmsLjiFyÌÁƒy ¸R…VLiú»yLigRiLigS ˳؄sLi¿yÖÁ. Bµj… ¬s»R½ùLi ƒ«s²R…VxqsWò®ƒs[ ª«soLiÈÁVLiµj….

వరుణుడు, కుబేరుడు, చంద్రుడు మొదలైన దేవతలకు ఇంద్రుడు ప్రధానమంత్రి. ప్రధానమంత్రిత్వమనేది అధికారం చెలాయించే ఒక పదవి. ఈ పదవిని అర్హతగలవాడు ఎవరైనా అధిరోహించవచ్చు. నూరు అశ్వమేధయాగాలు చేసినావాడు ఆ పదవికి అర్హుడౌతాడు. నూరు అశ్వమేధాలు నిర్వహించటం బహుకష్ట సాధ్యమైంది. దీనికి అనేక ఆటంకాలు సంభవిస్తాయి. మన లౌకిక రాజ్యపరిపాలనలో పదవులకోసం ఉద్భవిల్లే రాజకీయ వైషమ్యాలు, పెనుగులాటలు లాగానే దేవలోకంలో కూడ అత్యున్నతమైన ఇంద్ర పదవిని కాంక్షించే వారి మధ్య తీవ్ర సంఘర్షణలు చెలరేగుతాయి. 99వ అశ్వమేధం ముగిసి నూరవ అశ్వమేధం నిర్వహిస్తున్నప్పుడు కర్త అనేక రకాలైన అవరోధాల్ని ఎదుర్కుంటాడు. ఇంద్ర పదవిలో నున్నవాడే తన శాయశక్తులా ప్రయత్నించి నూరవ అశ్వమేధాన్ని పూర్తికాకుండా నిరోధిస్తాడు.

సముద్రమనే అర్థంలో వాడే 'సాగర' శబ్దం ఒక పూర్వ వృత్తాంతాన్ని జ్ఞప్తికి తెస్తుంది. నగర చక్రవర్తి 99 అశ్వమేథ యాగాల్ని పూర్తిచేసి నూరవ దానికి ఉపక్రమించాడు. అశ్వమేధయాగ ప్రక్రియలో అశ్వాన్ని ఆరాధించి దేశంలోకి వదులుతారు. రాజు యొక్క ఆధిపత్యాన్ని సవాలుచేస్తూ అశ్వాన్ని బంధించిన వారిని తాను యుద్ధంలో పరాజితుణ్ణి చేసి సార్వభౌమత్వాన్ని నిరూపించి అశ్వాన్ని విడిపించి తెచ్చుకొని యాగాన్ని పరిసమాప్తం చేయాలి. కాని నగర చక్రవర్తి నూరవ యాగం జరుపుతుండగా ఇంద్రుడు అశ్వాన్ని గ్రహించి కపిల మహర్షి తపస్సు చేస్తున్న పాతళలోకంలో రహస్యంగా దాచాడు. సగరుని కుమారులు అశ్వంకొరకు విశ్వమంతా శోధించారు. కాని దాని జాడ తెలియలేదు. అప్పుడు ఎవరో అశ్వం పాతాళలోకంలో దాచి వుంచబడి వుందని సమాచారం ఇచ్చారు. అంత సగరుని కుమారులు 60,000 మంది తమ పరివార జనంతో సహా పాతాళలోకాన్ని చేరటంకోసం భూమిని త్రవ్వటం ఆరంభించారు. అలా త్రవ్వటంవల్ల ఏర్పడిందే సముద్రం. సగర చక్రవర్తి కుమారులు త్రవ్వగా ఏర్పడింది కనుక దానికే సాగరమనే నామం సార్ధకమైంది.

వారు పాతాళలోకాన్ని చేరి తమ అశ్వం తపమాచరించుచున్న మహర్షి వద్ద బంధింపబడి వుండటాన్ని గమనించారు. ఈ మహర్షే తమ అశ్వాన్ని సంగ్రహించి తెచ్చి బంధించాడని వారు భావించి ఆయన తపస్సును భంగ పరచటానికి ఉద్యుక్తులైనారు. మహర్షి వారిపై ఆగ్రహించి శపించగా వారందరూ భస్మీభూతులైనారు.

అప్పుడు వారికి శాపవిమోచనం ఎలా ప్రసాదించాలా యనే సమస్య తలెత్తింది. గంగానదిని వారి భస్మాలపై ప్రవహించునట్లు చేస్తే వారు శాపవిముక్తు లౌతారని మహర్షి సెలవిచ్చారు. రాజుగారి వంశంలో రెండు, మూడు తరాలు గతించాయి. ఐనా ఆకాశగంగను భూమి మీదకు తెచ్చే ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు భగీరధుడు ఆ వంశంలో జన్మించి ఘోర తపస్సు చేసి, అష్టకష్టాలు పడి గంగను ఆయన పూర్వీకుల భస్మాలపై ప్రవహించునట్లు చేసి సగరుని సంతతికి పాపవిమోచన కలిగిస్తాడు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మనకు గోచరిస్తుంది. చాల మంది ఒక లక్ష్యసాధనకై కార్యోన్ముఖు లౌతారు. కాని మధ్యలో అనుకోని అంతరాయాలు, సమస్యలు తటస్థపడగా వాటిని గురించి ఆలోచించి వాటి విమోచన మార్గాలు అన్వేషిస్తూ అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు. సగరుడు కూడ ఇంద్ర పదవిని ఆశించి నూరు అశ్వమేధ యాగాల్ని చేయటానికి ఉపక్రమించి మధ్యలో తలెత్తిన సమస్యలతో ప్రధాన లక్ష్యాన్ని మరచి, గంగానదిని తన తనయుల భస్మాలపై ప్రవహింపచేసే కార్యక్రమానికి కారణభూతు డయ్యాడు.

ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు- ఇవి కేవలం పదవులకు చిహ్నాలు మాత్రమేనని లోగడ చెప్పాను. ఎవరైననూ, పుణ్యకర్మలు చేసినవారు ఆయాపదవుల్ని ఆక్రమించవచ్చు. కొన్ని సమయాల్లో దేవతలుకూడ పాపకర్మలు చేసి శాపగ్రస్తులై శిక్షల్ని అనుభవించటానికి భూలోకంలో జన్మిస్తారు. ఆ విధంగా చంద్రుడు, వరుణుడు మొదలగు దేవతలు వారి కర్మల ఫలితాన్ని అనుభవించటానికి భూలోకానికి వచ్చినట్లు మనం గమనిస్తాం. కర్మ విమోచనం కాగానే వారు తిరిగి వారి పదవుల్ని స్వీకరించటానికి ఈ లోకాన్ని వదలివెళ్తారు. ఆ విధంగా వారి యానంలో భూలోకం ఒక మధ్యస్థ మజిలీగా ఉపకరిస్తుంది. అలా వారొనరించిన అకృత్యాల ఫలితంగా దేవతలు పదవీచ్యుతులై భూలోకంలో జన్మించి మరల భగవానుని కరుణా కటాక్షంతో తిరిగి వారి లోకానికి వెళతారు. వారిలో శాపాలు, ప్రతిశాపాలు కూడవుంటాయి. దేవతలు పరస్పర దూషణంలోను, శాపాలలోను చిక్కుకున్నట్లు మనకు గోచరిస్తుంది. దేవతలు శాపగ్రస్తులు కావటంకూడ మానవుల శ్రేయస్సు కొరకేనని గ్రహించాలి. శాపాలకు గురియై వారు భూలోకంలో జన్మించటంవల్ల వారి ప్రభావం భూలోక ప్రజలపైబడి వారిలో దైవభక్తి పెరిగి దేవాలయాలకు వెళ్లి దైవారాధనచేయటం మొదలైన అభిలషణీయమైన ఫలితాలు సమకూరుతాయి.

దేవతలు వారి అనుగ్రహాన్ని మనపై ప్రసరింప చేయటానికై మనమీద దయతో భూలోకానికి విచ్చేస్తారు. భగవానుడు కూడ మానవులపై కరుణతోనే ఇక్కడ అవతరిస్తాడు. కృష్టావతరాం, రామావతారం ఈ విధంగానే సంభవించాయి. భగవంతుడు తన దర్శన భాగ్యాన్ని మనకు లభింప చేయటానికి, తద్వారా మనల్ని సద్గుణోపేతులుగా మార్చటానికి ఆయన భూలోకంలో అవతరిస్తాడు. భూలోక ప్రజలను ఉద్ధరించుటకే దేవతలు శాపగ్రస్తులైనామనే నెపంతో ఇచ్చట జన్మిస్తారు. ఇదే అభిప్రాయాన్ని రామాయణంలో వాలి విశదీకరిస్తాడు. తాను మరణించ బోయే సమయంలో ''నీతో నిజంగా యుద్ధం చేయలానే తలంపు నాకులేదు. నిన్ను దర్శించి నీ యొక్క నిజమైన బలాన్ని తెలిసికోవటమే నా లక్ష్యం'' అని రామునితో అంటాడు.

స్వర్గలోకంలో, చంద్రలోకంలో చాలమంది దేవతలు నివసిస్తారు. ప్రతి లోకంలోను పదవులనేకం వుంటాయి. దేవతలందరి ఆయుః ప్రమాణం నూరు సంవత్సరాలు. దాని తర్వాత శాపకారణంగా గాని, ఇతర హేతువులవల్ల గాని వారు భూలోకం వస్తారు; మళ్లీ తిరిగి తమ లోకానికి వెళ్తారు. ఒక పదవిలో ఒకనికి నూరు సంవత్సరాలు పూర్తికాగానే మరొకరు ఆ పదవికొరకు వేచియుంటారు. ఉదాహరణకు బ్రహ్మ యొక్క తదుపరి పదవీ స్థానం ఆంజనేయునకు లభిస్తుంది. ఈ రోజు వరకు జీవించియున్న చిరంజీవులై వారు 7 గురు వ్యక్తులున్నారు. వారు ఆంజనేయుడు, అశ్వద్థామ, బలి, వ్యాసుడు మొదలగువారు. ఈ క్రింది శ్లోకం ఈ విషయం వివరిస్తుంది.

శ్లో|| అశ్వత్థామా బలిర్వ్యాసిః హనుమాంశ్చ విభీషణః |

కృపః పరశురామశ్చ సపై#్తతే చిరంజీవినః ||

„dsLRiLiµR…LRiW BLiúµR… xmsµR…„s\ZNP ®ªs[ÀÁ¸R…VVƒyõLRiV. ®µ…[ª«sÍÜ[NRPLiÍÜ[¬s xmsµR…ª«soÌÁ „sxtsQ¸R…VLiÍÜ[ NRPW²R… xmsµR…ª«soÍýÜ[ ª«soƒ«sõªyLRiV ¬sLñki»R½ NSÌÁLi ª«sVVgjizqsƒ«s »R½LS*»R½ ª«sWLRiª«sÌÁzqsLi®µ…[.

మంచి పనులు, యజ్ఞయాగాదులు చేసి ఎవరైనా స్వర్గలోకానికి వెళ్లవచ్చు. అలాగే దుష్కృత్యాలు, పాపాలు చేసినవారు అధోలోకానికి పోవచ్చు. క్రింది లోకాల్నుంచి పై లోకాలకు వెళ్లాలంటే భూలోకానికి రావల్సిందే. మధ్యమ లోకమైన భూలోకం ఒక లోకం నుండి మరొక లోకం చేరటానికి ఒక మాధ్యమంగా వుంటుంది. మంచి వాతావరణ ముండి, మంచి కార్యాలు నెరవేర్చ గల్గినవాడు ఈ లోకం నుండి ఊర్థ్వ లోకాలకు వెళ్లగలడు. భగవంతుడు మనకు బుద్ధిని ప్రసాదించాడు. దానితోబాటు ప్రపంచంలోని మంచి వస్తు సంపదను సమకూర్చాడు. మంచి విషయాలేమిటో కూడ వివరించాడు. మనం చేయవలసిందల్లా వివేచనతో నడచుకొనటమే. మనకు భగవానుడు జీవితంలో మంచి విషయాలు మాత్రమే ఎందుకు ఈయకూడదనే ప్రశ్న ఉదయించవచ్చు. ఆయన అలా వ్యవహరించి వుంటే ఆయన అవసరాన్నే మానవుడు గుర్తించడు. అంతేగాక మానవునకున్న బుద్ధితో పనియుండదు. మానవుడు యోచనజేసి విచక్షణతో తనకై తానే విషయాల్ని ఎన్నుకోవలెనని భగవంతుని తలంపు.

ఉదాహరణకు విద్యుచ్ఛక్తి ఉంది. దానితో పనిచేసే బల్బు మొదలైన పరికరాలున్నాయి. వాటిని మన గృహాల్లో ఉపయోగించుకునే పద్ధతుల్ని పనివాడు మనకు సూచిస్తాడు. ఐనా ఆ పని నిర్వహించేటప్పుడు మన పొరపాటువల్ల మనకు 'షాక్‌' తగలవచ్చు. దానివల్ల ప్రమాదం సంభవించవచ్చు. విద్యుచ్ఛక్తి వల్ల మన జీవనంలో అనేక సౌకర్యాలను, సౌలభ్యాలను పొందుతాం. మనకు మనపొరపాటు వల్ల 'షాక్‌' తగిలిందని విద్యుచ్ఛక్తిని, పనివాణ్ణి దూషించటం ఎంతవరకు సమంజసం ? మన మతం విషయంలో కూడ ఇదే ధర్మసూత్రం వర్తిస్తుంది. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు. మనకు మంచి విషయా లెన్నో సమకూర్చాడు. మంచి చెడ్డలను విచక్షణ చేయగల బుద్ధిని కూడ మనకు ప్రసాదించాడు. అప్పుడు కూడ మనం ఏవైన బాధలకు గురియైతే భగవంతుణ్ణి నిందించటం భావ్యమా? మనకీ కష్టాల్ని ఎందుకు సృష్టించావని భగవానుని ప్రశ్నించటం ఉచితమేనా ? భగవంతుడు మన ప్రయోజనాల కొరకు ఎన్నో విషయాలు మనకు సమకూర్చాడు. మన అజ్ఞానంతో వాటిని సరియైన పద్ధతుల్లో వినియోగించుకోలేక బాధలకు గురియైతే అది సృష్టికర్త తప్పా ? మనం సరియైన పథంలో నడవటానికి ఉపకరించే సాధనలు. మంత్రాలు మనశ్శాస్త్రాల్లో సూచింపబడ్డాయి. భక్తి మార్గం కూడ మనకు సూచింపబడింది. వాటిని వినియోగించ గల్గటమే మన వంతు.

బుద్ధి అనగా ఆలోచనాశక్తి కల్గి యుండటం మానవుని ప్రత్యేకత. ఇతర జీవరాసుల కీ శక్తి యుండదు. ప్రపంచంలో అనేక జీవరాసులున్నాయి. వాటిలో ప్రధానమైనవి : ఏనుగు, గోవు, కుక్క, క్షీరదాలు, సరీసృపాలు (పాకెడి జంతువులు), ద్విపాద జంతువులు, చతుష్పాద జంతువులు, పక్షులు మొదలైనవి. వాటిలో ఒకే ఒక మతి ఉన్నవి కొన్ని, రెండున్నవి కొన్ని, మూడున్నవి మరికొన్ని, నాల్గు ఉన్నవి ఇంకొన్ని ఉండగా, మానవునికి మాత్రమే 5 రకాలైన ఆలోచనాశక్తులున్నాయి. నాలుగు, అంతకంటే తక్కువైన బుద్ధిశక్తులున్న జీవరాసులు, వాటి కర్మలకు అవి బాధ్యులుకావు. వాటికై అవి మంచి చెడులను విడదీయు శక్తినిగాని, వివేచననుగాని కల్గివుండవు.

పై విషయాన్ని ఈ ఉదాహరణతో విశదీకరించవచ్చు. మామిడి పళ్ల ఋతువులో పక్షులు మామిడి చెట్లపై వాలి పండ్లను యధేచ్ఛగా తింటాయి. తోటమాలి అంటూ ఒక డుంటాడు. అతడు వాటిని రాళ్ళతో కొడతాడు అనే ఆలోచనే వాటికి రాదు. ఒకవేళ వాటిని ఎవరైనా రాళ్ళతో కొడితే దూరంగా ఎగిరి వెళ్ళి మళ్ళీ కొంతసేపటికి ఆ చెట్టు మీదకే వచ్చి పళ్ళు తినటం ఆరంభిస్తాయి. అంతేకాని అంతకు ముందే తోటమాలి వాటిని కర్రలతో కొట్టి, రాళ్ళను విసిరి వెళ్లగొట్టిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవు. ఆ ఆలోచనాశక్తి వాటికుండదు. అదే ఒక మానవుని విషయంలో భిన్నంగా ఉంటుంది. ఒక మనిషి మామిడి తోట ప్రక్కనుంచి నడుస్తూ ఒక చెట్టుకు వేళాడుతున్న పండ్లను చూచాడనుకుందాం. చూచిచూడగానే పళ్లుకోయటానికి ఉంకించడు. తోటమాలి అక్కడ కాపలా ఉన్నాడా, లేడా అని చూస్తాడు. వివేచనాజ్ఞానం లేని పక్షుల్లాగా మానవుడు నడుచుకోడు. ఇదే పక్షులకు, మానవులకూ ఉన్న తేడా.

ఒక మనిషి తాను దేనినైనా పొందాలనుకుంటే, ముందు అది మంచిదా, చెడ్డదా అని పరికిస్తాడు. తర్వాత దానిని పొందే మార్గాన్ని గూర్చి యోచిస్తాడు. ఈ కార్యక్రమంలో అతనూ తప్పులు చేయవచ్చు. జంతువులను, పక్షులు మంచి, చెడులను గుర్తించే వివేచనాశక్తిని కల్గివుండవు గనుక అవి చేసే తప్పులకు ఫలితాలు అవి అనుభవించవు. కాని మానవుడు పొరపాట్లు చేసినా, పాపకార్యాలొనరించినా, తప్పొప్పులను విడదీయగల బుద్ధిశక్తి కలవాడు గనుక ఆ శక్తిని సవ్యంగా ఉపయోగించనందుకు వాటి ఫలితాలను అనుభవించి తీరాలి.

మామిడి తోటవద్దకు ఆ మనిషి వెళ్లినప్పుడు తోటమాలి అక్కడ లేడని అనుకుందాం. ఆ అదను ఉపయోగించుకొని మామిడిపళ్లను దొంగతనంగా కోసి తింటంలో కృతకృత్యుడయ్యాడనుకుందాం. తర్వాతైనా తాను చేసినపని మంచిదా, కాదా అనే చర్చ ఆరంభ##మై అతడు మనోవేదనకు గురి¸°తాడు. ఆ వేదన అలా అతన్ని బాధిస్తూనే ఉంటుంది. భూలోకంలో జంతువులకు, పక్షులకు ఈ బాధలేదు. ఎందుకంటే వాటికి మంచి, చెడులను విచక్షణ చేయగల బుద్ధిని భగవంతుడు ఈయ లేదు గనుక. అయితే మానవుడు తనకున్న వివేకం(బుద్ధి) తోనే తానొనరించిన దుష్కృత్యాలవల్ల సంక్రమించే పాప ఫలంనుండి విముక్తుడు కాగల్గుతాడు.

దేవతలు పొరపాట్లు చేస్తే వారు వాటి ఫలితాన్ని అనుభవించటానికి భూలోకం రావాలి. జంతువుల విషయంలో విమోచనం అంచెలంచెలుగా లభిస్తుంది. దీనినే క్రమముక్తి అంటాం. వాటి పాపవిముక్తి ఒక క్రమమైన సరళిలో సంభవిస్తుంది. ఒక స్థితిలో వాటికి మానవజన్మ కూడ లభిస్తుంది. అప్పుడే వాటి కర్మఫలాన్ని అనుభవించటం ఆరంభమౌతుంది.

మానవుని విషయంలో అతడు తన కర్మఫలాన్ని వెనువెంటనే అనుభవించటం జరుగుతుంది. అతడు మంచిపని చేస్తే అందరూ అతన్ని స్తుతిస్తారు. అలాగే చెడ్డపని చేసి నప్పుడు అందరూ నిందిస్తారు. మనిషి మంచిగాని, చెడుగాని ఏది చేసినా దానికి ప్రతిస్పందన అప్పటికప్పుడే ఉంటుంది. అతని మనస్సులో కూడ ప్రతిస్పందన కనిపిస్తుంది. చేసిన పని మంచిదైతే అతనికి మనశ్శాంతి లభిస్తుంది. మరొక విధమైతే అతని మనస్సు ఎల్లవేళల వికలమై ఉంటుంది. అతడు మనోవేదన అనుభవిస్తాడు. ఒక మనిషి బాహ్యంగా చెడ్డవాడయితే బయటకు ప్రశాంతతను ప్రదర్శించినా, ఆంతరంగికంగా మనోవ్యధను, పరితాపాన్ని కల్గివుంటాడు. మానవుడు తాను చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవించాల్సిందే అనేదే ఇచ్చట మూల సిద్ధాంతం. కర్మ సిద్ధాంతానికిది మూల సూత్రము.

జీవులు, యధార్థంగా, వారివారి కర్మఫలాన్ని బట్టి వృక్షములుగానో, పక్షులుగానో, జంతువులుగానో, మానవులుగానో, దేవతలుగానో జన్మిస్తారు. ఆధునిక సిద్ధాంతమైన పరిణామ వాదాన్ని బట్టి ఆదిలో మొక్కలు పుట్టి, అవి వృక్షాలుగ పరిణామం చెందెనని, తర్వాత పక్షులు, వాటి నుండి జంతువులు, జంతువులనుండి మానవులు పరిణమించారని ఒక ప్రతిపాదన

7)

ప్రచారంలో ఉంది. దీనిని మనం ఆమోదించం. సృష్టి ప్రారంభంలోనే జీవరాసులన్నీ వాటివాటి కర్మఫలాన్ని అనుసరించి వివిధ రూపాల్లో భిన్నభిన్న స్థితులలో సృష్టించబడినవని మన సృష్టిక్రమ పరిణామ సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నాయి. వివిధ జీవరాసుల యొక్క కార్యకలాపాలకు వాటి భౌతిక లక్షణాలు, ఇతర లక్షణాలు అనువైనవిగా ఏర్పడివున్నాయి. ప్రపంచంలో జీవన గమనం బాగా జరుగుటకు జీవుల కార్యకలాపాలు వారి గుణాలకు, కర్మలకు సరిపోయే పద్ధతిలో ఉంటాయి. కనుక జీవి తన గుణకర్మలకు వ్యతిరేకమైన కార్యాలను ఆచరిస్తే, అది క్రమంగా దాని హీనస్థితికి దారితీస్తుంది. అందువలన జీవి యొక్క క్రియా కలాపం పూర్తిగా చెడిపోయి, తత్ఫలితంగా ప్రపంచాన్నే చెడుస్థితిలోనికి దించుతుంది. కనుక ప్రపంచం మంచిస్థితిలో నడపవలెనంటే జీవుల కార్యకలాపాలు మంచివి, సత్ఫలితాల్ని ఇచ్చేవిగా ఉండాలి.

ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామికర్మ అని మూడు రకాలైన కర్మఫలాలు మనిషిని ఆశ్రయించుకొని ఉంటాయి. పూర్వ జన్మల్లో పేరుకుపోయిన దానిని సంచిత అనే పదంతో వర్ణిస్తారు. పర్వత పరిమాణంలో అది ప్రోగుచేయబడి ఉంటుంది. అందులో కొంత భాగం ప్రారబ్ధ కర్మగా విడిపోతుంది. ప్రారబ్ధ కర్మ ఫలితంగానే జీవులు సృష్టింప బడుతున్నారు. అనేక జన్మల్లో కూడుకొని యున్న కర్మఫలితాల్నే ప్రారబ్ధమంటాం. మామూలు వ్యవహారంలో కూడ మనం తరచుగ కొంతమందిని ఉద్దేశించి ఇలా అంటాం. 'నేను నీకు అన్ని విధాలా సహాయం చేయాలని ప్రయత్నించాను. కాని ఏంచేయగలను ? నీ ప్రారబ్ధకర్మఅలావుంది.'' మామూలుగా చెడు జరిగిన సందర్భాల్లోనే పైవిధంగా అంటాం. ఎవరైనా సత్ఫలితాలు సాధిస్తే ఆ సమయంలో అతని అదృష్టం బాగుందని అంటాం. నిజానికి అదృష్టమన్నా, ప్రారబ్ధమన్నా ఒకటే అర్థం. 'అదృష్టం' అనే మాటకు అర్థం దృష్టంకానిది అనగా మనకు కనబడనది. అంతిమంగా ప్రారబ్ధం, అదృష్టం రెండూ కనిపించనివే. మనం ఈ రోజు అనుభవించే సుఖదుఃఖాలకు మన ప్రారబ్ధ కర్మయే కారణం. వర్తమానంలో మనం ఆచరించే కర్మలు 'ఆగామి'గా పరిగణింపబడతాయి. భవిష్యత్తులో సంభవించే దాన్ని 'ఆగామి'అని చెప్తాం. మనమిప్పుడు చేస్తున్న కర్మలకు ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తాం.

మనమిప్పుడు చేసే కర్మలు మంచివి కావచ్చు. చెడ్డవి కావచ్చు. ఉదాహరణకు మనం అసత్యాలు పలుకవచ్చు, లేక దొంగతనాలు చేయవచ్చు. యజ్ఞాలు చేయవచ్చు. దైవపూజలు సలుపవచ్చు. మంత్రసాధన లేక ఇతర పుణ్యకార్యాలు నిర్వహింపవచ్చు. అనృతం పల్కటం, దొంగతనం చేయటం లాంటివి మనకు దుష్ఫలితాలనిస్తవి. దైవపూజ, పరోపకారం లాంటివి మనకు సత్ఫలితాలను సమకూరుస్తాయి. గనుక వాటిని పుణ్య కార్యాలుగ విభజిస్తాం.

ఆ విధంగా మనకు ధర్మాధర్మాలని, పాపపుణ్యాలని, అదృష్టాదృష్టాలనే సిద్ధాంతీకరణ ఉంది.

మనం కొన్ని కాలాల్లో సుఖాల్నీ, మరికొన్ని సమయాల్లో దుఃఖాల్నీ అనుభవిస్తున్నాం అనుకుందాం. అప్పుడు మనకో ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సుఖాలకి గాని ఆ దుఃఖానికి గాని కారణమేమిటి ? ఈ జన్మకు పూర్వజన్మలో చేసిర కర్మలా, లేక అంతకంటే ముందు జన్మలో ఒనరించిన కర్మలా, ఏవి కారణం ? ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవిస్తామా? అలాగయితే ఎంతకాలంలో అనుభవిస్తాం, కొద్ది రోజుల్లోనా, కొలది మాసాల్లోనా, లేక కొన్ని సంవత్సరాల తర్వాత ? ఇదేదికాక ఫలితాల్ని వచ్చేజన్మలో అనుభవిస్తామా? ఈ ప్రశ్నలన్నీ మనకుదయిస్తాయి. ప్రజలు తరచుగా వచ్చి ''నేను సంవత్సరకాలం నుండి భగవంతుని ఆరాధించాను. భగవంతుని కరుణ నాపై ఇంతవరకు ప్రసరించలేదు. ఇది ఇలా ఎందుకు జరగాలి?'' అని ప్రశ్నిస్తారు.

ఈ ప్రశ్నలకు సమాధానం మనకు రోజూ అనుభవంలో ఉన్న ఈ క్రింది ఉదాహరణలో సుళువుగా లభిస్తుంది. మనలో చాలమంది తమకు కావల్సిన అత్యవసర వస్తువుల్ని రేషన్‌కార్డుల ఆధారంగా రేషన్‌ షాపులనుండి కొంటారు. రేషన్‌కార్డుల పద్ధతిపై అత్యవసర వస్తువుల పంపిణీ విధానాన్ని అవగాహన చేసుకుంటే, కర్మ, కర్మవల్ల వచ్చే ఫలితాలు ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయో మనకు సవ్యంగా అర్థమౌతాయి.

రేషన్‌కార్డు ఒక కుటుంబానికి యిచ్చేముందు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంతెంత బియ్యం, పంచదార ఇయ్యాలో మొదలైన లాంఛనాలన్నీ అధికారులు నిర్వహించాలి.

రేషన్‌కార్డు లభించిన తర్వాత రేషన్‌ దుకాణానికి వెళ్లి వరుసలో నిలబడి కొన్ని గంటలు వేచియుండాలి. దుకాణ దారుడు కార్డుల నన్నింటిని వరుసక్రమంలో ఉంచి ఒక్కొక్కరికి క్రమమైన పద్ధతిలో వస్తువులు సప్లై చేస్తాడు. ఆ లోపల పలుకుబడి కలవారుగాని, అధికారుల తరుపువారు గాని వస్తే వారిపని ముందుచూచి వారిని పంపింతర్వాత మిగతావార్కి వస్తువులు సప్లైచేస్తాడు. ఈ విధంగా అనేకరకాల ఇబ్బందులను ఓర్చుకొని గంటల తరబడి వరుసలో నిలబడిన గాని మన కార్డుపై మనకు వస్తువులు లభింపవు. రేషన్‌కార్డుపై నిత్యావసరవస్తువులను సేకరించు అనుభవాన్ని పోలికగా తీసికొని మనంచేసే కర్మలు, దైనందిన జీవితంలో వాటి ఫలితాల అనుభవం గురించి విశదంగా తెలిసికోవచ్చు.

ప్రతివాని విషయంలో వాడొనరించిన సత్కర్మలు, దుష్కర్మల పట్టిక తయారుచేయబడి ఉంటుంది. దానిననుసరించి ప్రతిమానవుడు అనుభవించాల్సిన సుఖదుఃఖాల్ని బ్రహ్మ నిర్ణయించి అతని నుదుట వ్రాస్తాడు. ఏదైనా ఫలితం వెంటనే అనుభవించాల్సి యుంటే అది ముందే మనకు తటస్థిస్తుంది. అలాకాక ఒకని విషయంలో నూరు కర్మలున్నాయనుకుందాం. వాటి ఫలితాలు కూడ వరుసక్రమంలో అతని అనుభవంలోకి వస్తాయి. వాటిలో పుణ్యకర్మలుండవచ్చు. పాపకర్మలు ఉండవచ్చు. అంతేగాక ఒక కర్మ క్రిందటి జన్మలోను మరియొకటి దానిముందు జన్మలోను చేసి ఉండవచ్చు. అయినా వాటి ఫలితాలు మాత్రం ఆ క్రమంలోనే మన అనుభవంలోకి వస్తాయి. మనం ఇప్పుడు అనుభవించే ఫలితాలు క్రిందటి జన్మలో చేసిన కర్మలకు సంబంధించినవే అని అనుకుంటే అదీతప్పే. మనం మన పూర్వజన్మల్లో ఏ కర్మలు చేశామో మనం తెలుసుకోవడానికి అవకాశం లేదు. కనుక ఫలాని అనుభవం ఫలాని జన్మలో చేసిన కర్మ సంబంధితమని చెప్పలేము. నిజానికి ఈ కర్మలు ఎన్ని జన్మలకు సంభంధించినవో రూఢిగా ఎవరికి తెలీదు. ఈ సందర్భంలో ఎన్ని జన్మలను గణనలోనికి తీసికోవాలో కూడ తెలియని విషయమే.

మళ్ళీ రేషన్‌కార్డుల పరిధిలోకివస్తే కొంతమంది వస్తువులను పూర్తి పరిమితికి తెచ్చుకుంటారు. మరికొంతమంది పూర్తిగా తీసుకోరు.

అలాగే ఈశ్వర ఆరాధన, ఈశ్వర ప్రార్థన, నవగ్రహహోమం మొదలైనవి చేస్తే కొంత పాపఫలం పరిహారం కావచ్చు. ఏ దుకాణదారుడు రేషన్‌కార్డులో అనుమతింపబడ్డ దానికంటే అధికంగా పంచదారను మనకీయడు. కాని దాన్ని మనం మన ఇష్ట ప్రకారం తగ్గించుకోవచ్చు. అలాగే భగవంతుని కృపకు పాత్రులం కాగల్గితే కర్మఫలాన్ని తగ్గించుకోవచ్చు. భగవత్ప్రార్ధన ద్వారా మన సుఖదుఃఖాల పరిమితిని తగ్గించుకోగలం, హెచ్చించుకునే శక్తిమనకుండకపోయినా.

ప్రతివాడు తనకున్న దుఃఖాన్ని తగ్గించుకోవాలని తలుస్తాడు. హెచ్చించు కోవాలని అనుకోడు. కనుక మనకున్న కాలాన్ని ఏవిధంగాను వృధాచేయక భగవదారాధన, ఈశ్వర ప్రార్థనలకై వినియోగించడం శ్రేయోదాయకం. మంచి జీవితం, సత్ర్పవర్తన, మంచినడత, సత్కార్యాలు ఇవన్నీ మనబాధల్ని తగ్గిస్తాయి. లోగడచేసిన కర్మల ఫలితాల్ని మనం విధిగా ఇప్పుడు అనుభవించాల్సిందే.

అత్యవసర వస్తువుల కొనుగోలు, రేషన్‌ షాపుల విషయం లోగడ చెప్పాం. ఒక ఉన్నత అధికారి తరపు మనిషి హఠాత్తుగా వచ్చి తనకు కావాల్సిన అవసర వస్తువులను వరసలో నుంచున్న వారికంటే ముందుగా తీసికొని వెళ్తాడు. కార్డులో సూచించిన పరిమితికంటే ఎక్కువ కూడ తీసుకుంటే ఆశ్చర్యంలేదు. ఈ సామ్యం కర్మఫలాల విషయంలో ఎంతవరకు వర్తిస్తుంది? ఇచ్చట ఈ క్రింది వాక్యాన్ని చూడండి.

అత్యుత్కటైః పాపపుణ్యౖః ఫలం ఇహైవాశ్నుతే || పాపంగాని, పుణ్యంగాని ఎక్కువ మోతాదులో వున్నప్పుడు, ఫలితాలు వెంటనే అనుభవించాల్సి వుంటుంది. అలాంటి కర్మల ఫలాల్ని ఇక్కడే, ఇప్పుడే, ఈలోకంలోనే, ఈ జీవితకాలంలోనే అనుభవించాల్సి ఉంటుంది.

ఒకడు చాలా సాధారణ స్థితిలో నున్నవాడు తానూహించని రీతిలో లాటరీలో బహుమతి సంపాదించి 10 లక్షల కధికారి కావచ్చు. మరొకడు వ్యాపారంలో కలిసొచ్చి హఠాత్తుగా కోట్లు గడించవచ్చు. లేక ఒక కోటీశ్వరుడు వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవించి తనకున్న సంపదనంతా కొల్పోయి బికారి కావచ్చు. కొన్ని కర్మల విషయంలో ఫలితాల కొరకు వేచి యుండట మనే ప్రశ్నే వుండదు. ఫలితాలు ఇప్పుడే ఇక్కడే ఇదే జీవితంలో సంభవిస్తాయి. వాటిని అనుభవించటానికి మరొక జన్మను ఈ లోకంలో ఎత్తవలసిన అవసరముండదు. ఉన్నతాధికారి మనిషి వచ్చి తన తరుణం రాకుండానే మధ్యలోనే నిత్యావసర వస్తువుల్ని, ఎక్కువగాకూడ, తీసుకున్నట్లే కొన్ని అతి తీవ్రమైన కర్మలకు ఫలం అర్థాంతరంగానే వస్తుంది. ఇదే జీవితంలో అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి కర్మ ఫలాలు సంచిత, లేక ప్రారబ్దాలుగ కూడియుండవు.

ఆగామి విషయంలో మనం ఎక్కువగ జాగరూకత వహించాలి. వర్తమానంలో చేసే కర్మల్ని గురించి, భవిష్యత్తులో ఆచరించే కృత్యాల్ని గురించి మనం జాగ్రత్త వహించటానికి అవకాశం వుంటుంది. మన దుఃఖాల్ని ఇంతటితో అరికట్టుకోవాలనుకుంటే మనం మన వర్తమాన భవిష్యత్‌ కర్మల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మనిషి తన కష్టాల్ని అధికం చేసుకోదలిస్తే పాపకర్మలు కొనసాగిస్తూనే పోవచ్చు. కాని ఎవరూ అలా చేయటానికి ఇష్టపడరు. తమ జీవితాన్ని దుఃఖమయం చేసుకోరు. కాబట్టి మనిషి యొక్క లక్ష్యం పుణ్యకర్మలు చేయుటయందు, పుణ్యాన్ని సంపాదించటం పట్ల నిలపాలి. అసలు పాపం అంటే ఏమిటి ? పుణ్యం అంటే ఏమిటి ? ఏ పని చేయవద్దని మనస్సు చెపుతుందో అదే పాపం. ఏ పని చేయమని అదే మనసు ప్రబోధిస్తుందో అదే పుణ్యం. ప్రతివాడు పుణ్యం యొక్క ఫలితాన్నే అనుభవించాలని కోరుకుంటాడు. పాపం చేయాలని అభిలషించడు. కాని నిజ జీవితంలో ఇవి తారుమారై కనిపిస్తవి.

ఇది చూడండి :

శ్లో|| పుణ్యన్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః |

న పాపఫలమిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః ||

¸R…Vµ³yLôðRiLigS ª«sVƒ«sNRPV xqsVÅÁaSLi»R½VÖÁõ úxmsryµj…Li¿Á[®µ…[ xmsoßáùª«s°»R½VLiµj…. µR…VLRiµR…XxtísQª«saS»R½Vò úxmsÇÁÌÁV xmsoßáùLi ¹¸…VVNRPä xmnsÍجsõ ªyLiÀ³ÁryòLRiV. NS¬s ªyLRiV ¿Á[}qs úxms¼½NRPX»R½ùLi Fyxms xmsLRi\®ªsVLiµj…gS ª«soLiÈÁVLiµj…. @Li¾»½[gSµR…V FyFyÌÁV ¿Á[¸R…VÉجsNTP úxms¾»½[ùNRP\®ªsVƒ«s D»y=¥¦¦¦¬sõ úxmsµR…Lji+ryòLRiV.

మనకు కష్టం కల్గిందంటే అది పాపకర్మల ఫలితమే. మరి పాపం ఎలా చేయ బడుతుంది ? గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు.

''అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః |

అనిచ్ఛన్నపి వార్ణేయ బలాదివ నియోజితః ||

''మనుజుడు పాపాన్ని చేయాలని ఉద్దేశించక పోయినా, పాపం చేయటానికి ఎలా అతనిపై ఒత్తిడి వస్తోంది.

శ్రీ కృష్ణుని సమాధానం ఇలా వుంది.

శ్లో|| కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః |

మహాశనో మహాపాప్మా విద్ధయేనం ఇహ వైరిణమ్‌ ||

""µR…VMÅÁ ˳ØÇÁƒ«s\®ªsVƒ«s µR…VxtsQäLRiøÌÁNRPV N][LjiZNP[ ª«sVWÌÁNSLRißáLi. ª«sVƒ«sLi »R½Xzmsò xmsLRi¿RÁÛÍÁ[¬s®µ…[ N][LjiNRP. µy¬s¬s |msLiÀÁƒ«s N]µôk… ˳ÏÁgæRiVƒ«s lLi[lgi[ ª«sVLiÈÁÍØgS úxmsÇÁ*LjiÌýÁV»R½VLiµj….''ª«sVƒ«s µR…VMÅÁ ¬sªyLRißجsNTP ¿Á²R…V NRPLRiøÌÁ ÇÜ[ÖÁNTP F¡NRPVLi²y ª«soLi²R…ÈÁLi INRPäÛÉÁ[ DFy¸R…VLi. N][LjiNRP ú}msLji»R½\®ªsVƒ«s G NRPLRiøQ\¹¸…Vƒy ¿Á²R…VgS®ƒs[ xmsLjißá„sVxqsVòLiµj…. ú¼½NRPLRißáaRPVµôðj…gRi ª«sVƒ«sLi ª«sVLiÀÁxmsƒ«sVÌÁƒ«sV ª«sWú»R½®ªs[V ¿Á[¸R…WÖÁ. ¿Á²R…V NRPLRiøÌÁ ¸R…VLiµyxqsNTPò ¿RÁWxmsÈÁLiª«sÌýÁ ¿Á²R…V xmnsÍجsõ @ƒ«sV˳ÏÁ„sLi¿RÁÈÁLi ª«sWú»R½®ªs[V NSµR…V, ˳ÏÁ„sxtsQù»R½VòÍÜ[ NRPW²R… ¿Á²R…Vxmsƒ«sVÌÁV ¿Á¸R…WùÌÁ®ƒs[ NRPV»R½Wx¤¦¦¦ÌÁLi ª«sVƒ«sxqsV=ÍÜ[ ‡ÁÌÁxms²R…V»R½VLiµj….

దుష్కర్మలకు దూరంగా వుండాలంటే మనమనస్సును, వాక్కును, కాయాన్ని మంచి విషయాల్లో లగ్నంచేయటం ఒకటే మార్గం. తులసీదాసు, సమర్థరామదాసు మొదలైన మహాత్ముల జీవితాలు సత్ర్పవర్తనను గుర్తుచేయటానికి నిత్యమైన నిధుల్లాంటివి. మనమెప్పుడు సదాలోచనలతో సత్కర్మలలో నిమగ్నులమైయుండి, ఎల్లవేళల సత్పురుషుల సాంగత్యంలో మెలగుతుంటే చెడు ఆలోచనలు మనజోలికి రావు, చెడుకర్మలు మనం చేయలేము. మనం ఎల్లప్పుడు మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తూవుంటే దుష్టత్వమనేది వ్రేళ్లతోసహా దానంతట అదే నశిస్తుంది. దీనికొరకు మనం ఒక ప్రశాంతవాతావరణంలో కూర్చొని భగవన్నామం జపిస్తూ భగవానుని గూర్చే ఆలోచించాలి. చేయగల్గితే భగవన్నామాన్ని రోజుకి వెయ్యిసార్లైనా జపించాలి. ఈశ్వరధ్యానంతో స్తోత్రరూపంలో ఆయన్ని ప్రార్థించాలి. ఇది ప్రతిదినం తప్పక చేయాలి. మన కాయం ద్వారా గూడ మంచిపనులే చేయాలి. మనం దేహం భగవంతుని యొక్క సాధనమని భావించాలి. ఈభావనకు మనం ఒకసారి అలవాటు పడితే చెడ్డకర్మలు అప్రయత్నంగానే తగ్గిపోతాయి, మనం మంచికర్మలే చేస్తాం. ప్రజలందరకు సుఖజీవనానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇది మాత్రమే సృజించ గల్గుతుంది.

పైవిధంగా మనం ఆగామి ఫలాన్ని నియంత్రించాలి. కనుక మనం మన వర్తమాన కర్మకాండలను సవ్యమైన రీతిలో సవరించు కోవాలి. భగవానుడు మనల్ని ఏమి చెయ్యమని ఆజ్ఞాపిస్తాడో వాటిని సవ్యమైన మార్గంలో ఆచరించాలి. ప్రతివాడు తన కర్తవ్యాన్ని ఉచితరీతిలో నిర్వర్తించటం అతిప్రధానమైన విషయం. కేవలం భజన్లు, పూజలు మాత్రం చేస్తే చాలదు.

ఒక పరిశ్రమలో ఒకడు పనిచేస్తున్నా డనుకుందాం. అతని ఉద్యోగంలో పైస్థానం సంపాదించాలంటే అతడు అతని విధుల్ని సవ్యంగా నిర్వర్తించటం తోబాటు యజమానిని దూషించకుండా ఉండే జాగ్రత తీసికొని ఆయన్ని గౌరవంతో చూడాలి. ఈ రెండు విషయాలు ముఖ్యమే. అప్పుడే అతనికి పైస్థానం లభిస్తుంది. విధులను నిర్వహిస్తూ యాజమాన్యాన్ని దూషించినా, యాజమాన్యాన్ని గౌరవిస్తూ, విధుల విషయంలో నిర్లక్ష్యంచూపినా అతనికి ఉన్నతపదవి లభించదు.

అలాగే భగవంతుణ్ణి పొగడుతూ లేక భజన్లు, పూజలు చేస్తేనే చాలదు. భగవంతుని ఆజ్ఞల్ని పాటించి నడుచుకోవాలి కూడ స్తోత్రాలు ఎంత అవసరమో కర్మకూడ అంత అవసరమే. మన ప్రార్థల్ని సమర్పిస్తున్నా మంటే అది భగవంతుని సంతోషం కొరకు కాదు; మన సుఖదుఃఖాల మధ్యకూడ భగవంతుణ్ణి మరవకుండా ఉండటానికీ, ఆయన కరుణకు పాత్రులంకావటానికి మాత్రమే. కనుక మన కర్తవ్యాలను యధావిధిగా నిర్వర్తిస్తూ భగవంతునిపై భక్తినికూడ ప్రదర్శించాలి.

మనం చేసే ప్రతికర్మను భగవత్సాక్షిగా చేయగల్గి ఉండాలి. మనం ఈ క్రింది శాసనాన్ని పాటించాలి.

మాతృదేవోభవ | పితృదేవోభవ | ఆచార్యదేవోభవ ||

మనం మన తల్లిలో, తండ్రిలో, గురువులో ఈశ్వరుణ్ణి చూడగల్గి వారిపట్ల మనవిధులను నిర్వర్తిస్తే భగవంతుని ఎలా మరువగలం ? సాధన, స్వధర్మ పరిపాలన అందరికి అవసరం. ప్రత్యేకమైన వ్యక్తులకు ప్రత్యేకమైన విధులు నియమింపబడ్డాయి. ప్రతివ్యక్తి తన విధుల్ని తాను నిర్వహిస్తే భగవంతుని దయ మనపై తప్పక ప్రసరిస్తుంది. ప్రతిఒక్కరు సుఖజీవితాన్ని గడుపుతారు.

మనం మన దైనందిన జీవితంలో ఆచరించే కర్మలు నిత్యం మనకు దైవాన్ని గుర్తుకుతేవాలి. మనకు బాల్యం నుండే దేవుని గురించిన ఆలోచన ఉపదేశింపబడాలి. అప్పుడప్పుడు నన్ను కలిసిన పెద్దలను తమపిల్లలకు స్తోత్రాలు బోధించమని అడిగితే పిల్లవాడు బాగా పిన్న వయస్కుడు, తర్వాత బోధిస్తామని, బడికివెళ్ళే సమయంలో చేస్తామని, ఏవేవో సాకులు చెప్తూ పిల్లలు పెద్దవాళ్లయ్యే వరకు ఏమీ చెప్పకుండానే కాలం గడపటం గమనించాను. పిల్లవాడు వయస్కుడైన తర్వాత అతన్ని సమస్యలు చుట్టివేస్తాయి. మరీ వయస్సుమించి తాతగారైన తర్వాత తన మనవళ్లు, మనవరాడ్లతో గడపటం తప్ప పరమాత్ముని గురించి ఆలోచించే సమయమే లభ్యంకాదు.

ఆదిశంకరులు చెప్పినట్లు :

శ్లో|| బాలస్తావత్‌ క్రీడాసక్తో తురుణస్తావత్‌ తరుణీసక్తతః |

వద్ధస్తావత్‌ చిన్తాసక్తో పరే బ్రహ్మణికో పి న సక్తః ||

NRPƒ«sVNRP \®µ…ª«sÀÁLi»R½ƒy˳Øùry¬sõ ÀÁLRiV»R½úFy¸R…VLiÍÜ[®ƒs[ ¿]zmsöLixmsÛÇÁ[}qsò »R½xmsö ª«sV¬sztsQ |msµôR…ªy\®²…ƒ«s »R½LS*»R½ A¸R…V¬sõ gRiVLjiLiÀÁƒ«s ÀÁLi»R½ƒ«sNRPV @ª«sNSaSÌÁV xqsƒ«sõgjiÌýÁV»yLiVV. ƒ«s²T…ª«s¸R…VxqsVäQ\®²…ƒ«sxmsöV²R…V ª«sV¬sztsQ @Li»R½VÛÍÁ[¬s xqsª«sVxqsùÌÁ ª«sÌÁ¸R…VLiÍÜ[ ÀÁNRPVäNRPVLiÉزR…V. ª«sXµôðyxmsùLiÍÜ[ »R½ƒ«sxqsª«sVxqsùÌÁNRPV »R½ƒ«sª«sVƒ«sª«sÎýÏÁ, ª«sVƒ«sª«sVLSLiú²R… xqsª«sVxqsùÌÁV ÇÜ[²_»yLiVV. NRPƒ«sVNRP ª«s¸R…VxqsV ËØgS \|ms‡Á®²…[µyNRP ®ªs[ÀÁ¸R…VVLi²yÖÁ=ƒ«s @ª«sxqsLRiLiÛÍÁ[µR…V. CaRP*LRiúFyLóRiƒ«s ËØÌÁùLi ƒ«sVLi®²…[ @ÌÁª«sLRi¿RÁV N][ªyÖÁ. »R½ÖýÁµR…Liú²R…VÌÁV »R½ª«sVgRiX¥¦¦¦ÍýÜ[ ª«sVLiÀÁr¡òú»yÌÁ¬s »R½ª«sVzmsÌýÁÌÁNRPV ËÜ[µ³j…Li¿RÁª«so. ËØÌÁùLiÍÜ[ @˳ÏÁùzqsLiÀÁƒ«s ÒÁ„s»yLi»R½Li ®ªsVµR…²R…VÍÜ[ ¬sª«szqsryòLiVV. NS¬s µR…VLRiµR…XxtísQ®ªs[Vª«sVLiÛÉÁ[ ¿yÌÁª«sVLiµj… |msµôR…ÌÁZNP[ C „sxtsQ¸R…WÌÁV ¾»½ÖdÁª«so. |msµôR…ÌÁV ª«sVVLiµR…V ªyÉÓÁ¬s ÒÁLñjiLi¿RÁVN]¬s »R½LS*»R½ ªyLji zmsÌýÁÌÁ¿Á[»R½ @˳ÏÁùzqsLixms¿Á[¸R…WÖÁ. ª«sVƒ«sxqsLixmnsVLi DµôðR…LjiLixms‡Á²R…ÉجsNTP, Dƒ«sõ»R½róyƒy¬sNTP ¿Á[LRiè‡Á²R…ÉجsNTP Bµj… INRPäÛÉÁ[ DFy¸R…VLi.

మళ్లీ మళ్లీ నొక్కిచెప్పే విషయం ఒక్కటే. ప్రతివాడు తన కర్తవ్యాల్ని నిర్వహిస్తూ, తనకర్మల్ని అప్రమత్తతతో క్రమబద్ధంచేసుకుంటూ నడచుకుంటే సత్ర్పవర్తనను, శ్రేయోదాయకమైన జీవితాన్ని సముద్ధరించే వాతావరణం అప్రయత్నంగా సృష్టింప బడుతుంది. ఈ నేపథ్యంలో ఆగామి ఫలాల్ని గూర్చికూడ ఆందోళన చెందనవసరంలేదు.

సత్కర్మలయందు దృష్టినిల్పటానికి సహకరించే వాతావరణాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని ఆకాంక్షిద్దాం. సర్వజనులపై భగవంతుడు తన శుభాశీస్సులను వెదజల్లుగాక!

Sri Jayendravani    Chapters    Last Page