Sri Jayendravani    Chapters    Last Page

మూడవభాగము

13. దేవాలయ ఆరాధన

˳ÏÁgRiªyƒ«sV²R…V „saRP*ªyùxmsoò²R…V. NRPƒ«sVNRP A¸R…Vƒ«s N]LRiNRPV ®µ…[ªyÌÁ¸R…WÌÁV FsLiµR…VNRPV ¬sLjiøLi¿yÖÁ @®ƒs[ úxmsaRPõ DµR…LiVVxqsVòLiµj…. ˳ÏÁgRiª«sLi»R½V²R…V xqsLRi*ªyùxmsNRPV²R…¬s ¾»½ÖÁzqsƒy A ˳ت«sƒ«s ª«sVƒ«s ª«sVƒ«sxqsV=ÍýÜ[ zqósLRiLigS ®ƒsÌÁN]ÌÁö‡Á²R…µR…V. C ÀÁLi»R½ƒ«s ª«sVƒ«s\®µ…ƒ«sLiµj…ƒ«s NRPLRiøÍýÜ[ NRPW²R… úxms¼½ÕÁLiÕÁLixms‡Á²R…µR…V. ª«sùQQNTPò ˳ÏÁgRiª«sLi»R½VßñÓá FsÌýÁxmsöV²R…V xqsøLji}qsò @»R½²R…V @ƒ«sX»R½ ˳ØxtsQßáNRPV FsÍØ FyÌÁö²R…»y²R…V ? µR…VxtsQäLRiøÌÁV FsÍØ Â¿Á[¸R…VgRiÌæÁV»y²R…V ?

భగవానుడు కేవలం సర్వాంతర్యామి యైనంత మాత్రాన మనకు ఒరిగేదేమీలేదు. మనం అందరం ఎలాగైనా ఆయన కృపను సంపాదించాలని ఆకాంక్షిస్తాం. కనుక మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన కృపకు పాత్రులం కావాలి. ఆగమశాస్త్రాలు ఈ ప్రక్రియ ఏ విధంగా జరగాలని సూచిస్తాయి? సూర్యకిరణాలు అమితమైన ఉష్ణశక్తిని కల్గివుంటాయి. సూర్యరశ్మిలో ఒక గుడ్డముక్కను ఉంచితే దానంతట అది మండదు. కాని మధ్యలో ఒక అద్దాన్ని ఏర్పాటుచేసి సూర్యుని వేడికిరణాలు ఆబట్టపై ప్రసరింపచేస్తే కొంతసేపటికి బట్ట మండటాన్ని చూడగలం. అలాగే విద్యుచ్ఛక్తి ప్రతిచోట ఉంటుంది. కాని దాని ఉపయోగాన్ని మనం పొందాలంటే ఆ శక్తిని ప్రవహింపచేయటానికి జనరేటర్లు కావాలి. మరియు ఆ శక్తిని కావలసిన చోట్లకు పంపటానికి ప్రసారయంత్రాలు (ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్స్‌)స్థాపించాలి. అదే విధంగా సర్వవ్యాపకుడైన భగవానుని కరుణా కటాక్షం మనం పొందాలంటే ఆయనశక్తి కేంద్రీకరింపబడి ప్రతిష్ఠ కావింపబడిన విగ్రహాల్ని కల్గిన దేవాలయాల్ని నిర్మించుకోవాలి.

అలా నిర్మింపబడిన దేవాలయాలు మనదేశంలో చాలా ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడ ఇతరమతాలు సాంప్రదా యానుసారం నిర్మింపబడిన ప్రార్థనామందిరా లనేకం వున్నాయి. కాని వాటిలో మన దేవాలయాల్లో వలె విగ్రహ ప్రతిష్ఠ ప్రసక్తే వుండదు. వారికి విశాలమైన ప్రార్థనామందిరాలు ఉంటాయి. ప్రజలు అక్కడ సమావేశ##మై ప్రార్థనలు చేసికొని, లేక నిశ్శబ్దతతో ధ్యానమాచరించి మందిరం వీడి వెళ్ళిపోతారు. మన దేవాలయాల్లో అలా గాక అభిషేకాలని, అర్చనలని, దీప హారతులని అనేక రకాలైన ఉపచారాలను దైవానికర్పిస్తారు. మన దేవాలయాల్లో జరిగే ఈ ఉపచార కార్యక్రమాలు, ఇతర తతంగం ఇతర మతాలవారి ప్రార్థనామందిరాల్లో సంభవించవు. వారి మతాచారాల ప్రకారం వారికి సగుణరూపంలో భగవంతుని ఆరాధించే పద్ధతులపై విశ్వాసంలేదు. నిరాకార నిర్గుణ తత్వంగల భగవంతుని ఆరాధనయందే వారికి విశ్వాసము.

మన దేవాలయాల్లో పూజాసమయంలో ఒక పెద్దగంటను మ్రోగిస్తారు. ఆ సవ్వడితో దుష్టగ్రహాలు ఆలయ ఆవరణను వదలి నిర్గమిస్తాయని మ్రోగిస్తారు. అంతేగాక తిట్లు, తుమ్ములు మొదలగు అశుభసూచకములైన ధ్వనులను కూడ ఆ గంట మ్రోతలు మింగివేయగలవు. మన ఇండ్లలో మాత్రం పూజా సమయంలో చిన్న గంటను మాత్రం మ్రోగిస్తాం. దేవాలయాల్లో జరిపే ఉపచారాలుగాని, అచట ఏర్పాటుచేసే సంగీత వాద్యాలుగాని మన ఇండ్లలో ఉండవు. గృహాల్లో జరిగే పూజాకార్యక్రమం ఎవరికి వారు తమ కుటుంబాల యోగక్షేమానికే నిర్వహిస్తారు. అదే దేవాలయాల్లో సర్వజనోపహితంగా చేస్తాం గనుక విస్తృతమైన తతంగం ఉంటుంది. పర్వదినాల్లో అయితే శుభప్రదమైన వేదఘోషతో, సంగీతవాద్యములతో, బాణా సంచాలతో అట్టహాసంగా దేవత యొక్క ఊరేగింపు కార్యక్రమం నిర్వహింపబడుతుంది.

మనం భగవంతుని ఒక రాజాధిరాజుగా పరిగణించి ఛత్రం, చామరం, సంగీత నృత్యవాద్యాలు, వాహనం ఇత్యాది రాజరికానికి తగిన రాజోపచారాలన్నీ చేస్తాం. మన విగ్రహాల్లో దైవశక్తిని ఆపాదించుకుంటాం గనుక మన ప్రార్థనలవల్ల మన దారిద్ర్యం, కీడు అన్నీ నిర్మూలింపబడతాయి. మన జన్మలు పావనమౌతాయి. దేవతామూర్తులైన విగ్రహాలు సౌందర్యరాశులవలె మన ఆలయాల్లో మనకు దర్శనమిస్తాయి. ఉన్నతమైన భావాలతో దేవుని ధ్యానిస్తూ, విలువైన ఆభరణాలతో మూర్తిని అలకంరించి, వివిధములైన ఉపచారములతో, అభిషేకములతో భగవానుని ఆరాధించే సదాచారసంపత్తి మన హిందూ మతానికే పరిమితమైవుంది.

మన మతంలో విగ్రహారాధన సామాన్య ప్రజానీకానికి అతిముఖ్యమైంది. ఒక విగ్రహము ముందు వంగి నమస్కరించినా ఆ విగ్రహంలో ప్రతిష్ఠింపబడిన దేవతను ప్రార్థించినా ఆ విగ్రహాన్ని ఒక రాయిగా చూడక, ఆ దేవతను ఒక సర్వరక్షకుడనే భావనతో దర్శిస్తాం. ఈ విధంగా దేవాలయాలు మనుజుని యందు దైవ భక్తిని పెంపొందించుటకు సహాయపడతాయి. అతనిలోని దైవభక్తి అతని దుఃఖాల్ని తగ్గించటానికి, లేక అధిగమించటానికి తోడ్పడుతుంది.

సామాన్య ప్రజలకు వారికి ప్రాప్తించిన కష్టాలను సహించగల శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. కాని ఈశ్వర భక్తితో వాటిని ఎదుర్కొనగలరు. వాటిని సహించగల మనోదాడర్థ్యతను కూడ పొందగలరు. ఈ లక్ష్యంతోనే సామాన్యమానవుడు దేవాలయాల్ని సందర్శిస్తాడు. సందర్శించి, ప్రార్థనలు సల్పి మనశ్శాంతిని సంపాదిస్తాడు. అలా గాక తనకున్న కష్టాలను ప్రక్కవానితో చెప్తే తాను ఇంతకంటే మిక్కుటమైన బాధల్ని అనుభవిస్తునాన్నని ఏకరువు పెడతాడే తప్ప తన బాధల నివృత్తికి అతడు ఏ విధంగాను తోడ్పడడు. మీదు మిక్కిలి నీవు నీ బాధల్ని గురించి ఎక్కువగా సంభాషిస్తే నిన్ను తిట్టి కొట్టినంత పనిచేసి పంపుతాడు. కనుక మనం మన దుఃఖాల ఉపశమనం కోసం దేవాలయంలోకి వెళ్లి దేవుని ముందు మొరబెట్టుకోవటమే సరియైన పని. దైవసాన్నిధ్యంలో మన మనోవ్యధను అనేక రీతుల్లో వ్యక్తీకరించవచ్చు. 'నీ కరుణాకటాక్షాన్ని ఎందుకు వెంటనే ప్రసరింపచేయవు' అని నిలదీయవచ్చు. అలా ప్రార్థనలు సల్పి ఆలయం వెలువడి వస్తుంటే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డ విగ్రహం చైతన్య సహితం గనుక సగుణారాధన ద్వారా మనకు అమూల్యమైన చిత్తశాంతి లభ్యమౌతుంది. దేవాలయాల్ని దర్శించే అభ్యాసాన్ని మనం ఇందుకొరకే అలవరచుకుంటాం.

కొంతమంది దేవాలయాలకు వెళ్లరు. నదీతీరానికి గాని, ఏకాంత ప్రదేశాలకు గాని వెళ్లి బాధల్ని తలచుకొని దుఃఖించి మనశ్శాంతితో తిరిగివస్తారు. మామూలుగ ప్రజలకు తమ భావప్రకటనలకు ప్రతిస్పందన శూన్యమైన చోటనే మానసిక శాంతి లభిస్తుంది. వ్యక్తి ఈశ్వరుని ప్రార్థించినప్పుడు ఆయన వద్దనుండి ప్రతివచనమేమీ ఉండదు గనుక అతడు చిత్తశాంతిని సంతరించుకుంటాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. మనకేమి కావాలో ఆయనకు తెలుసు. మనం కోరిందంతా మనకు ప్రసాదించగలడు. ఐనా మన మనశ్శాంతికి ఏది అవసరమో అంతవరకే మనకిస్తాడు. మనం ఏ కోర్కెలను కోరదలచామో కూడ దేవునకు తెలుసు. ఐనా ఆయన ముందు మన బాధల్ని వెళ్లబోసుకోవాల్సిన అవసరం ఏమిటి ? కేవలం మన దుఃఖాలన్నిటిని ఆయన ముందు ప్రకటించి మనం మానసిక ప్రశాంతతను సమకూర్చుకోటానికే అలా చేస్తాం. ఈ సందర్భంలో నీలకంఠ దీక్షితులు ఈ క్రింద చెప్పిన విషయం గమనార్హం.

శ్లో|| ఆవేద్యతాం అవిదితం కిమధాప్యనుక్తం

వక్తవ్యమాంతరరుజోపశమాయ నాలమ్‌ |

ఇత్యర్థసే కిమపి త్వఛవణ నిధాతుం |

మాతః ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే ||

""xqsLRi*ÇìÁÙ²R…ª«so ! ¬dsNRPV ¾»½ÖÁ¸R…VLi®µ…[ª«sVVLiµj… ? ªyùNRPVÌÁ»R½ ¿ÁLiµj…ƒ«s ƒy ª«sVƒ«sxqsV=ÍÜ[¬s „sxtsQ¸R…WÌÁ¬dsõ ¬ds ª«sVVLiµR…VLiÀÁ¾»½[ »R½xmsö ƒy ª«sVƒ«sxqsV= NRPVµR…VÈÁ xms²R…µR…V. ƒyNRPVaSLi¼½ xqsª«sVNRPWLRiµR…V. @LiµR…Vª«sÌýÁ®ƒs[ ƒy Ëص³R…ÌÁ¬dsõ ¬dsNRPV ®ªsÌýÁ²T…xqsVòƒyõƒ«sV.''

మన దేవాలయాలకి, ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలకు మనం గమనించాల్సిన వ్యత్యాస మింకొకటి ఉన్నది. ఇతర మతాల వారు ప్రార్థనకు వినియోగించే హాలు అచ్చట సమావేశమయ్యే భక్తులందర్ని ఏకకాలంలో ఇముడ్చు కొను విస్తీర్ణంతో నిర్మింపబడుతుంది. సమావేశితుల సంఖ్యను నిర్మాణానికి ముందే గణనచేసి ఉంచుతారు. కాని మన దేవాలయాల్లో భక్తులు ఒకరొకరుగ గర్భగుడిలోనికి ప్రవేశించాలి. భక్త సమూహం ఎంతవున్నా ఒకరొకరుగా మాత్రమే భగవద్దర్శనం కొరకు వెళ్లే క్రమశిక్షణను పాటించాల్సిందే. ప్రతి దేవాలయం వెనుక దానికొక చరిత్ర ఉంటుంది. అతి పవిత్రతతో నిర్మింపబడిన మన దేవాలయాల్లోని విగ్రహాలు శక్తి సమన్వితమైనవి, చైతన్య వంతమైనవి, దైవశక్తి కల్గియున్నవి అని ప్రసిద్ధి.

ఇంటివద్ద కుటుంబ క్షేమంకోసం పూజలు చేస్తాం. దేవాలయాల్లో సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పూజలు చేస్తాం. ఇంటివద్దచేసే పూజల విధానం ఇంటి యజమాని నిర్ణయించుకుంటాడు. దేవాలయాల్లో జరిగే పూజావిధానం ఆగమ శాస్త్రప్రకారం, మతగ్రంథాల్లో సూచింపబడినట్లు నిర్వహింపబడాలి. పూజాకార్యక్రమాన్ని దాని కొరకై నియమితుడైన పూజార్లు మాత్రమే నిర్వర్తించాలి. ఈ నియమాల్ని పల్లెటూరులోని దేవతల దగ్గర్నుంచి వినాయకుడు, సుబ్రహ్మణ్యశ్వరుడు, విష్ణువు, శివుడు మొదలగు అధిదేవతల వరకు అందరి విషయాల్లోను పాటించాలి.

దేవాలయం దైవసాన్నిధ్యాన్ని స్ఫురింపజేస్తుంది గనుక మనం దేవునిపట్ల మన భక్తిని ప్రదర్శించు కోవటానికి అనేక రకాలైన ప్రక్రియల్ని నిర్వహిస్తాం. ఘనంగా అభిషేకాలు చేస్తాం. వివిధములైన ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరిస్తాం. ఆలయ మంటపాల్ని సుందరతరం చేయటానికి అక్కడ చిత్రపటాల్ని, చెక్కిన ప్రతిమల్ని ఉంచుతాం. పర్వదినాల్లో శోభాయమానంగా దేవుని ఊరేగింపులు జరుపుతాం.

ఈ దేవాలయాలు మనదేశం ప్రాచీన సంపదకు ప్రతీకలు. మనది చాల బీదదేశం; ప్రజలు నిరాడంబరులు. కనుక వారి ఆధ్యాత్మిక చింతనను దోహదం చేయుట కొరకు దేవాలయాలు దేవాలయ గోపురాల రూపంలో పెద్ద కట్టడాలు నిర్మింపబడ్డాయి.

కాని ప్రస్తుత కాలంలో భిన్నమైన మార్పులు పొడసూపుతూ ఉన్నాయి. గుళ్లు గోపురాలకు బదులుగా సాంఘిక సేవాసంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులు దర్శన మిస్తున్నాయి. కాని వీటి వలన ఆశించిన సత్ఫలితాలు పూర్తిగా సిద్ధించటంలేదు. అందుకు భిన్నంగా ఈ సంస్థల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. కనీసం కొండజాతి ప్రజలు వీటివలన ప్రభావితులు కాకుండా పూర్వపు ఆచారాల్ని, రీతుల్ని పరిరక్షించుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రజల సమస్యల్ని నిర్మూలించటానికి బదులు వారి అవసరాల్ని పెంచుతున్నాయి. ఒక బ్యాంకు దివాలాతీసినప్పుడు దానిలో డబ్బు దాచుకొన్న ఖాతాదార్లు నిర్ధనులుగా పరిణమిస్తారు. అవసరాల్ని పెంచుకోవటం వల్ల మనకీ దుర్దశ ప్రాప్తిస్తోంది అలా గాక నిరాడంబర జీవితాని కలవాటు పడితే మనకు సుఖప్రాప్తి లభిస్తుంది. పూర్వం దేవాలయాలు సమాజ సంక్షేమ నిలయాలుగ విలసిల్లాయి. పండుగ దినాల్లో ఆకలిగొన్న బీదప్రజలకి ఉచితంగాను, లేక తక్కువ ధరకు ఆహారం ఈయబడేది. ఆ సందర్భాల్లో ప్రజలకు సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేయబడేవి.

ప్రస్తుతం ప్రభుత్వం సాంఘిక సంక్షేమ సంస్థలద్వారా ప్రజోపయోగమైన కొన్ని కార్యాలను నిర్వహిస్తోంది. నిజంగా ఆలోచిస్తే ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే పన్నులు ప్రజలకు ప్రభుత్వం అందించే వివిధ సేవలకు లాంఛనప్రాయమైన గుర్తింపు మాత్రమే. బ్యాంకులు, ఆసుపత్రులు, సాంఘిక సంక్షేమ సంస్థలు ఎన్నివున్నా వాటిద్వారా ప్రజలకు అందవలసిన పూర్తిప్రయోజనాలు వారికి చేరటల్లేదనేది నగ్నసత్యం. ఏమైనా ఈ దుస్థతి, దుఃఖాల కబంధహస్తాలనుండి మానవుడు విముక్తి పొందాలంటే దైవకృపపై అచంచల విశ్వాసాన్ని పెంచుకోవటమొకటే తరుణోపాయం. బాధోపశమనం, బాధానివృత్తి సాధించటానికి ఆవశ్యకమైన మనోనిబ్బరం మానవునకు భక్తిద్వారానే లభిస్తుంది. దేవునిపట్ల భక్తిని పోషించి పెంపొందించే నిలయాలే మన ఆలయాలు. కనుకనే ఆలయాల్ని విరివిగా ప్రతి గ్రామంలోను నిర్మించాలి. పూర్వకాలంలో దేవాలయాలు మొదట నిర్మింపబడేవి. వాని నాశ్రయించుకొని దానిచుట్టూ పట్టణాలు ఏర్పడేవి. కాని ఇప్పుడు ముందు పట్టణాలు నిర్మింపబడుతున్నాయి. తర్వాతనే దేవాలయ నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తున్నాం.

భగవానునికి సమర్పించే నైవేద్యం, ఆలయాల్లో ఉంచబడిన హుండీలలో ఉంచే కానుకలు, మనకు పరమాత్ముడు కరుణతో ప్రసాదించే ప్రయోజనాలకు మనం చూపే కృతజ్ఞతాపూర్వక చిహ్నాలు మాత్రమే. మనం ఒక గడ్డిపరకును కూడ సృష్టించలేం. కనుక మనం భగవంతునకు ఏదైనా సమర్పించినా, అది మన ఆత్మతృప్తి కొరకు మాత్రమే. మనకు అన్నీ సమకూర్చేది ఆ పరమాత్ముడు మాత్రమే. కనుక మనం భగవంతునికి నివేదించకుండా భుజిస్తే అంతకంటే కృతఘ్నత మరొకటి ఉండదు. మనం ఏంభుజించినా దానిలో ఉత్తమమైన భాగాన్ని దేవునకు ముందుగా సమర్పించాలి. పూజావిధులు, ఉపచారాలు యధావిధిగా తమ ఇండ్లలో చేయటానికి అందరికి సాధ్యంకాదు. అందుకొరకే దేవాలయాలు నిర్మింప బడ్డాయి.

దేవాలయాన్ని ప్రతివాడు ప్రతిరోజూ సందర్శించాలి. పూర్వం రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి దేవుని పూజాసమయాల్లో మ్రోగించే గుడిగంటలు వినకుండా అచ్చటి ప్రజలు భోజనం చేసేవారుకాదు.

ఆలయాల్లో పూజావిధులు ఇతర కార్యక్రమాలు శాస్త్ర యుక్తంగా నిర్వహింప బడటంద్వారా అచ్చటి దైవత్వాన్ని పరిపుష్టి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దేవాలయ ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉంచుతూ, దీపారాధన నిత్యమూ ఉండేటట్లు కూడ మనం చూడాలి. భగవంతునకు అర్పించే వస్త్రం ప్రతిరోజూ ఉతికించిగాని వాడకూడదు. ఇలా ఈ నిత్యవిధులన్నీ మనం దేవుని విషయంలో నిర్వర్తించగల్గితే ఆసుపత్రులు, సంఘసేవాసంస్థలు ఏర్పాటు చేయటంవలన కలిగే ప్రయోజనాలకన్నా అధికమైన ఫలాలు మనం పొందవచ్చు.

ఆలయంలో దైవశక్తియున్న ఒక పవిత్ర స్థలం కనుక, ఆలయ ప్రాంగణంలో ఉన్నంతవరకు మనం కొన్ని నియమనిష్ఠలను అనుసరించాలి. ఉదాహరణకు దేవుని కొరకు ఉద్దేశింపబడిన వస్తువును దేనిని మనం ఉపయోగానికి వాడరాదు.

దేవాలయ ఆవరణలో అల్పాచమానం చేయుట గాని, ఉమ్మివేయుట గాని మొదలైన పనులు చేయరాదు. మనం పరిశుభ్రతను పాటిస్తూ ఆలయం యొక్క పారిశుద్ధ్యాన్ని కాపాడాలి. తుమ్మటం, దగ్గటం, తాంబూలసేవనం, ఆహారం తినటం, తల ద్రువ్వటం, నిద్రపోవటం లాంటివి కూడ దేవాలయంలో నిషేధం. ఆలయంలోని విగ్రహాల్ని గాని, విగ్రహాలకు పూజచేసే వారిని కాని స్పృశించరాదు. గుడికి ప్రదక్షిణం కనీసం మూడుసార్లైనా చేయాలి. ఆలయంలో వృధాప్రేలాపనలు, అనవసర ధ్వనులు చేయరాదు. అభిషేకం, నైవేద్యం కార్యక్రమాలు జరుగుతున్నపుడు దైవదర్శనం చేయరాదు. గుడిలో ప్రవేశించేటప్పుడు ప్రధాన ద్వారం గుండానే ప్రవేశించాలి.

దైవదర్శనానికి రిక్తహస్తాలతో పోరాదు. దర్శనమై తిరిగి వెళ్లేటప్పుడు దేవునికి పృష్ఠభాగం చూపరాదు.

ప్రదక్షిణాలు చేసేటప్పుడు స్తోత్రసంబంధమైన శ్లోకాలుగాని, మంత్రాలుగాని వల్లించాలి. ప్రదక్షిణాలు 3 నుండి 21 వరకు ఎన్నైనా చేయవచ్చు. దేవతల కర్పించు నమస్కారాలు బేసిసంఖ్యలో ఉండటం ఉచితం. ఈశ్వరునకు 3 నుండి 21 లోపల, దేవికి 4 మాత్రం ఉండాలి. నమస్కారాలు పూర్తియైన తర్వాతే ప్రదక్షిణాలు చేసి తమ ఇళ్లకు పోవాలి.

ఈ నియమ నిబంధనలన్నీ మనకు క్షేమం కల్గించటానికి, దేవాలయాల యొక్క పవిత్రతను, నిర్మలత్వాన్ని పరిరక్షించటానికి నిబద్ధించ బడ్డవే. మనకు మన పూర్వీకుల నుండి సంక్రమించిన మహోన్నతమైన సంపదే. ఈ దేవాలయాలు. వాటి పవిత్రతను కాపాడి పరిపుష్ట మొనర్చుటకు అవసరమైన నియమాల్ని పాటించాల్సిన విద్యుక్త ధర్మం మన అందరిపైన ఉంది.

Sri Jayendravani    Chapters    Last Page