Sri Jayendravani    Chapters    Last Page

24. నవగ్రహారాధన

ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు వినాయకుని ఆరాధిస్తాం. అలాగే నవగ్రహారాధన కూడ కార్యం జయప్రదం కావటానికి సంకల్పిస్తాం.

ఈ నవగ్రహాల్లో ఒక్కొక్కటి ఒక దిశోన్ముఖమై వుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం ఒక మూలవుండి ఒక దిశను చూస్తూ వుంటుంది.

మనం ఏ దిశలో పయనించినా ఏ మూలకు వెళ్ళినా, నవగ్రహారాధన చేస్తే ఆ గ్రహాల అనుగ్రహంతో మన అరిష్టాలన్నీ నిర్మూలింపబడతాయి.

కనుకనే మనం ఏ దేవాలయంలోకి వెళ్లినా నవగ్రహాలకు ఆరాధన అర్పిస్తాం. చాల ఆలయాల్లో నవగ్రహాల్ని ఈ ప్రయోజనాన్ని లక్ష్యించే ప్రతిష్ఠిస్తారు.

మనం నవగ్రహారాధన చేసి వాటి అనుగ్రహంతో మన అరిష్టాలన్నింటినీ తొలగించుకుందాం.

Sri Jayendravani    Chapters    Last Page