Sri Jayendravani Chapters Last Page
నాల్గవ భాగము
25. ఆత్మజ్ఞానానికి సాధనంగా భక్తి
ఈ విశాల ప్రపంచంలో ఎన్నో విధాలైన జీవరాసులున్నాయి. ఆకాశంలో విహరించే పక్షులున్నాయి. చేపలు, తిమింగలాలు, సొరచేపలు మొదలైన జలచరాలున్నాయి. అలాగే కుక్క, గోవు, పిల్లి, ఏనుగు మొదలైన భూచరాలుకూడ వున్నాయి. ఇవన్నీగాక మానవులం మనం కూడ భూమిపై నివశిస్తాం.
సర్వప్రాణులకు చక్షువులు, శ్రవణంద్రియాలు, నోరు మొదలగు జ్ఞానేంద్రియాలుంటాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా వారికి విషయజ్ఞానం లభిస్తుంది. వారు కళ్లతో చూస్తారు, చెవులతో వింటారు. నోటితో మాట్లాడుతారు. మానవునకు ఇతర ప్రాణులకు ఈ విషయంలోనే సూక్ష్మవ్యత్యాసముంది. ఇతర ప్రాణులకు భగవన్నామాన్ని ఉచ్చరించే శక్తి వుండదు. గనుక అవి పరమాత్మ నామాన్ని పారాయణ చేయలేవు, వినలేవు. పరమాత్మని దర్శించనూ లేవు. కాని మానవుడు మాత్రము ఈ రెండు పనులను చేయగలడు. జంతువులు ఏవో ధ్వనులు చేయగలవు కాని భగవన్నామం మాత్రం పఠించలేవు. కనుక మానవ జన్మ చాల విశేషమైంది; నిజంగా అన్ని జన్మలకంటే శ్రేష్ఠమైంది.
ఆ సందర్భంలో చెప్పబడినదే ఈ సూక్తి.
''జంతూనాం నరజన్మ దుర్లభం''
కనుక ఈశ్వరభక్తి సర్వమానవులు అలవరచుకోవాలి. మానవుడు తననోటితో భగవన్నామ చేయనిచో, మరుజన్మలో మూగవానిగా పుట్టటకు ఎక్కువ అవకాశాలున్నాయి.
కొంతమంది పిల్లలకు శ్రవణంద్రియా లుంటాయి. కాని వారు చెవిటి వారు. వారి పూర్వజన్మల్లో వారు భగవన్నామాన్ని శ్రవణం చేసి వుండక పోవటమే దానికి కారణం. అలాగే కొంతమంది పిల్లలకు నయనేంద్రియా లుంటాయి. అయినా వారికి దృష్టి ఉండదు. వారి పూర్వజన్మల్లో వారు భగవద్దర్శనానికి నోచుకొని వుండరు. ఆ కారణంగానే వారిప్పుడు గ్రుడ్డితనాన్ని అనుభవిస్తున్నారు.
ఒక వ్యక్తి భగవన్నామాన్ని స్ఫుటంగా ఉచ్చరించగల్గితే అతడు సంగీతం గానం చేయగల శక్తిని కూడ క్రమంగా సమకూర్చుకుంటాడు. ప్రార్థనాశ్లోకం ఈ క్రింది విధంగా చెపుతుంది.
శ్లో|| ''మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ |
యత్కృపా తమహం వందే పరమానందమాధవం ||''
NRPXxtñsQxmsLRiª«sW»R½Vø²R…V ª«sVWgRiªy¬s¬s ª«sWÈÁÍØ²T…Lixms ¿Á[¸R…VVÈÁNRPV, NRPVLiÉÓÁªy¬s¬s N]Li²R… ®ƒsNRPV䃫sÈýÁV ¿Á[¸R…VVÈÁNRPV NRPW²R… xqsª«sVLóRiV²R…V. »R½ƒ«s ˳ÏÁNRPVò¬s\|ms @Li»R½ÉÓÁ @ƒ«sVúgRi¥¦¦¦¬sõ úxmsxqsLjiLixms ¿Á[¸R…VV ryª«sVLóRiQùª«sVV NRPÌÁªy²R…V NRPƒ«sVNRP ˳ÏÁgRiª«sƒyõª«sW¬sõ D¿RÁèLjiLi¿RÁNRP, ƒyª«sW¬sõ „sƒ«sNRP, ˳ÏÁgRiª«sLi»R½V¬s µR…Lji+Li¿RÁNRP NSÌÁLi gRi²T…}ms ª«sùQQNTPòNTP ryª«sWƒ«sù µR…XztísQgS¬s, úFyxmsLiÀÁNRP ÌÁOSQQùÖÁõ @ª«sgSx¤¦¦¦ƒ«s ¿Á[xqsVN][gRiÌÁ aRPNTPògS¬s ª«soLi²R…µR…V. Dµyx¤¦¦¦LRißáNRPV F¡ÖÁ¹¸…W ªyùµ³j…NTP gRiV\lLiƒ«s zmsÌýÁÖÁõ ¿RÁWaSLi. µy¬sNTP NSLRiß᮪s[V\®ªsV ¸R…VVLiÈÁVLiµR…LiÉØLRiV ? ªyLRiV ®µ…[ªyÌÁ¸R…VLiÍÜ[ úxmsµR…OTPQߨÌÁV ¿Á[¸R…VÉØ¬sNTP ªyLji FyµyÖÁõ „s¬s¹¸…WgjiLiÀÁƒ«sÈýÁLiVV¾»½[ ªyLji¬ds ªyùµ³j… xqsöQXbPLi¿Á[µj… NSµR…V. @ÍØgSNRP ªyLRiV ªyLji FyµyÖÁõ zqs¬dsª«sW¥¦¦¦ÌÁV=NRPV B»R½LRi „sƒ¯[µR… úxms®µ…[aSÌÁ ¿RÁVÈíÁW ¼½LRigRiÉØ¬sNTP Dxms¹¸…Wgji}qsò BÍØLiÉÓÁ ªyùµ³R…VÛÍÁ[ xqsLiúNRP„sVryòLiVV. ª«sùQQNTPò »R½ƒ«s µR…Xlgi[Liúµj…¸R…WÖÁõ ˳ÏÁgRiª«sLi»R½V¬s µR…Lji+Li¿RÁÉØ¬sNTP, ¿Áª«soÌÁƒ«sV A¸R…Vƒ«s ƒyª«sWÖÁõ „sLiÉØ¬sNTP, ƒ¯[ÉÓÁ¬s A¸R…Vƒ«s ƒyª«sWÖÁõ NUPLjiòLi¿RÁÉØ¬sNTP @LiNTP»R½Li ¿Á[¸R…VVƒ«sLi»R½ª«sLRiNRPW @»R½¬sNTP D»R½òL][ú»y úFyzmsòLi¿Á[ ÇÁƒ«søxmsLjiߨª«sV úNRPª«sVLiÍÜ[ úNTPLiµR… róyLiVVNTP µj…gRiÇØLRiV»R½VLiµj….
మానవజన్మ చాల అరుదైంది, విశేషమైంది గనుక వ్యక్తికి ప్రాప్తించిన జ్ఞానేంద్రియాల్ని భగవంతుని కొరకు అంకితం చేయాలి. అలా చేసినప్పుడే మన జ్ఞానేంద్రియాలకు యోగ్యత, సార్థకత ప్రాప్తిస్తాయి. అలాగాక వాటిని ప్రాపంచిక విషయాలపై దుర్వినియోగం చేస్తే మరుజన్మ ఉత్తమ జన్మ కానేరదు.
కనుక మానవులకు ఈశ్వరభక్తి అత్యావశ్యకం. పూర్వపు యుగాల్లో ఉదాహరణకు కృతయుగంలో భగవత్సాన్నిధ్యం పొందటానికి వేల సంవత్సరాలు ఘోరతపస్సు చేసేవారు. త్రేతాయుగంలో ప్రజలు విష్ణుభక్తి నాశ్రయించి జంతుబలులను నిర్వహించేవారు. త్రేతాయుగంలోనే భగవానుడు రామచంద్రమూర్తిగా అవతరించాడు. ద్వాపరయుగంలో ఆయనే కృష్ణుడుగా అవతరించాడు. కృష్ణుడు, గోపికల మధ్య గోపాలుర నడుమ సాధారణ వ్యక్తిగా జీవించాడు. కనుక ప్రజలకు కృష్ణభక్తి సులభసాధ్యమైంది.
మన కలియుగంలో ఇంతవరకు అలాంటి అవతారాలు తటస్థించలేదు. కనుక భగవత్స్వరూపాన్ని గురించి మాత్రమే స్మరించగల్గుతాం. దానికై భక్తి అత్యావశ్యకం. రామభక్తి, కృష్ణభక్తి మొదలైన విషయాలు మనకీ కాలంలో వున్నాయి.
''భక్తిరేవ కలౌ యుగే'' అనే విషయం చెప్పబడింది.
కలియుగంలో మోక్షానికి భక్తి యొక్కటే మార్గం; భ##క్తే ప్రధానమైంది కూడ. ప్రస్తుతకాలంలో భక్తితత్వమే బహుళ ప్రచారాన్ని సంతరించుకుంది; విరివిగా అమలులో ఉంది.
ఆదిశంకర భగవత్పాదుల వచనాల్లో మానవజన్మకు గమ్యం; ''స్వస్వరూపావ బోధ'' లేక ఆత్మజ్ఞాన పరిజ్ఞానమే. దీన్ని పొందటానికి సాధనాలు బహుళం. ఆ సాధనాల్లో భక్తి కూడ ఒకటి. భక్తిని గురించి ఆదిశంకరుల వచనం విందాం.
''స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ||''
సత్యమైన ఆత్మజ్ఞానాన్ని పడయుటకు భక్తి యొక సాధనం. అదే అంతిమ గమ్యం లేక సాధ్య విషయంకాదు; దాన్ని పొందుటకు సాధన మాత్రమే. కాని కలియుగంలో ఇదే సులభ##మైన మార్గం కనుక మనం ఈశ్వరునియందు, లేక రాముడు లేక కృష్ణునియందు భక్తిని లగ్నం చేసుకొని దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి.