Sri Jayendravani    Chapters    Last Page

ఏడవ భాగము

36. పురాణాలు

ª«sVƒ«sNRPV xmsLRiLixmsLSƒ«sVgRi»R½LigS xqsLiúNRP„sVLiÀÁƒ«s úFyÀdÁƒ«s ª«sV»R½ xqsLixmsµR…ÍÜ[ xmsoLSßØÌÁNRPV úxmsª«sVVÅÁ\®ªsVƒ«s róyƒ«sLi ª«soLiµj…. ®ƒs[ÉÓÁ ¿RÁLjiú»R½NSLRiVÌÁV xmsoLSßØÌÁV ªyùxqsV¬s»][ ALRiLi˳ÏÁª«sV¬s ¬sLôðSLjiLi¿RÁª«s¿RÁVè. NS¬s ¸R…Vµ³yLóRiLigS xmsoLSßØÌÁV @Li»R½NRPV xmspLRi*xmso ¸R…VVgSÍýÜ[ ÇÁLjigjiƒ«s xqsLixmnsVÈÁƒ«sÌÁƒ«sV NRPW²R… úxmsNRPÉÓÁryòLiVV.

పురాణ శబ్దానికి అర్థం ''పూరా అపినవం'' .... అంటే అది పురాతన మైనదైననూ నూతనమైనదే. పురాణాలను మనం ఎన్ని మార్లు ఎక్కువ చదివితే అన్ని నూతన భావాలు మనకు స్ఫురిస్తాయి. ఉదాహరణకు ఈ రోజు రామాయణం చదివితే మనకొక అర్థం స్ఫురిస్తుంది. రేపు మళ్లీ చదివితే మరొక అర్థం వస్తుంది.

గీత కూడ చాల పురాతనమైనదే కావచ్చు. కాని దాన్ని పలుమార్లు చదివితే క్రొత్తక్రొత్త అర్థాలు, భావాలు వెలుగులోకి వస్తాయి.

పురాణాల్లో వేదవ్యాసుడు దేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాల రమ్యమైన పట్టికను సమర్పించాడు. అంతేగాక వారి రాజ్యపాలనలో వారికి ఎదురైన ఇబ్బందులను, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఫలితంగా నెలలతరబడి ఇక్కట్లకు పాలైన ప్రజల చరిత్రను, ప్రజల బాధల్ని ఉపశమింప చేయటానికై భగవంతుడవతరించిన తీరును వ్యాసుడు సవివరంగా చిత్రీకరించాడు.

ఈ సందర్భంలో మహాభారతంలోని నలోపాఖ్యానం విశేషంగా చెప్పుకోదగ్గది. మహారాజైన యుధిష్ఠురుడు పన్నెండువత్సరాలు అరణ్యవాసం చేయవలసివచ్చి అనూహ్య బాధలకు గురౌతాడు. అతడొక రోజున తానీకష్టాలను ఎందుకు అనుభవించాలి ? దీనికి హేతువేమై యుండవచ్చని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడతనితో ''ధర్మరాజా, నీ కష్టాలొక కష్టాలు కావు. హరిశ్చంద్రుని గాధ నీవెప్పుడైన విన్నావా ? అతనికి భార్యాపుత్రుల వియోగం కల్గింది. కాటికాపరియైనాడు. అలాగే నలచక్రవర్తిని గురించి వినే వుంటావు. అతను కూడ మహారాజే. రాజ్యాన్ని కోల్పోయి, పడరాని పాట్లకు గురియై చివరకు వంటవాడుగా పనిచేయవలసిన దుస్థితి నను భవించాడు. వారి కష్టాలతో పోలిస్తే నీ ఇక్కట్లు చాల స్వల్పం. శ్రీరాముడనుభవించిన బాధల్ని కూడ నీవనుభవించలేదు. కనుక బహు కష్టాలకు లోనైన పైవారి గాధల్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఊరట చెందు. వారి కష్టాలతో పోలిస్తే నీ బాధలొక బాధలేకాదు. నీ అనుంగుసోదరులు, నీ సతీమణి ఎల్లపుడు నిన్ను సేవిస్తూ నీతోనే వుంటున్నారు. నేను కూడ నీ బాధల్ని తొలగించటానికి అప్పుడప్పుడు వస్తూనే వున్నాను.'' అని ఉపశమన వాక్యాలు పలికాడు. మనం బాధల్లో మునిగియున్నప్పుడు, మనకంటే తీవ్రతరమైన కష్టాల్ని అనుభవించిన వారిని గురించి తలంచుకొని మన ఇక్కట్లని గురించి కలవరపడక ఊరట చెందాలనే నీతిని ఇక్కడ మనం గ్రహించాలి. ఈ అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని, భవిష్యత్తులో మనకిలాటి కష్టాలు రాకుండా కృషి చేయాలి. మనల్ని దైన్యస్థితి ఆవరించినప్పుడు తేలికగా దుఃఖితులమౌతాం. కాని అది వివేకమనిపించుకోదు. కష్టాల్ని సహనంతో భరించి భావిలో అలాంటివి సంభవించకుండా జాగ్రత్తపడుతూ, బాధల ఉద్ధృతను తగ్గించుకునే యోచన చేయటం యుక్తమనిపించు కుంటుంది.

పురాణాలు నీతినియమాలను, ధర్మసూక్ష్మాల్ని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మనం నడుచుకోవాల్సిన విధానాల్ని మనకు వివరిస్తాయి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన విజ్ఞానాన్ని కూడ అవి వాటిలో పొందుపరుస్తాయి.

వేదాలకు భూతద్దంలాంటివి పురాణాలు. 'సత్యంవద'లాంటి అనేక ధర్మసూక్ష్మాలు పురాణాల్లో గోచరిస్తాయి. కాని మనం వానిని ఎల్లప్పుడు స్మృతి పథంలో వుంచుకోలేక పోతున్నాం. కాని హరిశ్చంద్రుని గాథను చదవగానే మనకా విషయం వెంటనే స్ఫురణకు వస్తుంది. అలాగే వేదాల్లో 'పితృదేవోభవ' అనే విషయం చెప్పబడింది. రామాయణం చదువుతూండగానే మనకీ యంశం స్ఫురిస్తుంది.

ఆ విధంగా పురాణాలు వేదాల్లో చెప్పబడిన ధర్మసూక్ష్మాల్ని గొప్పచేస్తూ, అతిసులభంగా అర్థమయ్యే కథల రూపంలో మనకు వాటిలోని ప్రధానాంశాలను చేరువకు తెస్తాయి.

నిజంగా మన దైనందిన జీవితాల్ని ఉత్తమమార్గంలో నడుపుకోటానికి దోహదపడే అనుభవాలు కోకొల్లలుగా మనకు పురాణాల్లోను, ప్రాచీన చారిత్రాత్మిక సంఘటనల్లోను లభిస్తాయి. గనుకనే మనము వాటిని పఠిస్తాం. సత్కర్మలద్వారా సత్ఫలితాల్ని సాధించిన మహాపురుషుల జీవిత గాధల్ని చదివి మనం కూడ వారిననుసరించాలనే ప్రేరణను పొందుతాం. అదే విధంగా దుష్కర్మలాచరించి దైన్యాన్ననుభవించిన వారి ఇతివృత్తాల్ని చదివి మనం చెడుకర్మల జోలికిపోకుండా వుండాలని తెలిసికొని మన జీవితాల్ని మెరుగుపరచుకోవాలి. పురాణాలు మనలను భార్యలాగా బుజ్జగిస్తాయి. చెడుమార్గానికి దూరంలో వుంచి సన్మార్గంలో నడిపిస్తాయి.

ప్రధానమైన పురాణాలు 18 వున్నాయి.

1. బ్రహ్మ 2. పద్మ 3. విష్ణు 4. శివ 5. భాగవత 6. నారద 7. మార్కండేయ 8. అగ్ని 9. భవిష్య 10. బ్రహ్మవైవర్త 11. లింగ 12. వరాహ 13. స్కంద 14. వామన 15. కూర్మ 16. మత్స్య 17. గరుడ 18. బ్రహ్మాండ

వీటికి 18 ఉపపురాణాలు కూడ వున్నాయి. 18 పురాణాల్లో 4 లక్షల గ్రంథాలున్నాయి. (32 అక్షరాలు ఒక గ్రంథం అంటారు.) 17 పురాణాల్లో 3 లక్షల గ్రంథాలున్నాయి. ఒక్క స్కంధపురాణంలోనే ఒక లక్ష గ్రంథాలున్నాయి. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దేవతను స్తుతిస్తుంది.

ఒక పర్యాయం ఒక ఆంగ్లేయుడు నేను కంచి నుండి వెళ్లక పూర్వం నన్ను కలిశాడు. మోక్ష సాధనకై తానేమి చేయవలయునని, వేదాలు లేక మరేమైనా శాస్త్రాలు చదవాలా అని నన్ను ప్రశ్నించాడు. ''ఏ వేదాంతాన్ని గాని ఏ మతగ్రంథాన్ని గాని పఠించ పనిలేదు. నీ విధులను శ్రద్ధగా నిర్వహించు. నీ భార్యా పిల్లల్ని ప్రేమతో సాకు. వారిలో దైవభక్తి పెంపొందించు. ఏ గ్రంథం చదవాల్సిన ఆవశ్యకత లేదు.''అని చెప్పాను.

పురాణాలుగాని, గీతగాని, మరేదైనా పవిత్రగ్రంథం గాని చదివినంత మాత్రాన మోక్షం ప్రాప్తించదు. ఆ గ్రంథాల్లో ప్రతిపాదించబడిన ధర్మాల్ని అమలుచేయాలి. ఈ సందర్భంలో గీతాకావ్యమే మనకు ఆదర్శం. తను క్షత్రియుడైయుండి క్షత్రియధర్మాన్ని వదలి ఆయుధ విసర్జనం చేసిన అర్జునుడు కృష్ణుని ఉపదేశాన్ని విన్న తర్వాత కార్యోన్ముఖుడైనాడు.

పురాణాల్లో సమిష్టి ధర్మం, వ్యష్ఠి ధర్మం, సామాన్యధర్మం, ఆచరణీయ ధర్మం-ఈ ధర్మాలన్నింటిని నిర్ధారించటం జరిగింది. ఆధర్మాల్ని ఆచరించటం వలనే మోక్షం లభిస్తుంది.

Sri Jayendravani    Chapters    Last Page