Sri Jayendravani    Chapters    Last Page

తొమ్మిదవ భాగము

42. గాయత్రి ఉపదేశము (ఉపనయనము)

u¡²R…aRP xqsLiryäLSÌÁÍÜ[ Dxmsƒ«s¸R…Vƒ«sLi INRPÉÓÁ. @LiµR…V gS¸R…Vú¼d½ ª«sVLiú»][xms®µ…[aRPLi úxmsµ³yƒ«s\®ªsVƒ«sµj…. µk…¬sNTP ª«sVVLiµR…V zmsÌýÁÌÁV »R½ª«sV »R½ÖýÁµR…Liú²R…VÌÁNRPV ƒ«sª«sVxqsäLjiLi¿Á[ xqsª«sV¸R…WÍýÜ[ ªyLji g][ú»R½ƒyª«sWÌÁV ¿Áxmsöª«sÌÁzqsƒ«s @ª«sxqsLRiLiÛÍÁ[µR…V. ªyLjiN]NRP ÀÁLRiVƒyª«sW ÛÍÁ[ƒ«sÛÉýÁ[ ÛÍÁNRPä. NS¬s Dxmsƒ«s¸R…Vƒ«s xqsLiryäLRiLi ÇÁLjigjiƒ«s zmsµR…xms ªyLRiV |msµôR…ÌÁNRPV ƒ«sª«sVxqsäLjiLi¿Á[ xqsLiµR…LS÷éÍýÜ[ „sµ³j…gS ªyLjig][ú»y¬sõ @LiÛÉÁ[ ‡ÁVVztsQxmsLRiLixmsLRiƒ«sV, ƒyª«sWÖÁõ ¿ÁxmsöVN][ªyÖÁ. AL][ÇÁÙ ƒ«sVLi²T… ªyLjiNTP ªyLji\®µ…ƒ«s ÀÁLRiVƒyª«sW ÌÁÕ³ÁLiÀÁƒ«sÈýÁV. ¸R…VÇìÜ[xms„ds»R½ µ³yLRißá»][ ªyLRiV ªyLji ‡ÁVVztsQxmsLRiLixmsLRiƒ«sV ÒÁ„s»R½LiÍÜ[ ªyLjiNRPVƒ«sõ róyƒy¬sõ xqsøLRißáNRPV ¾»½¿RÁVèN]LiÉØLRiV.

''గాయత్రీమంత్రం మూడువేదాల సారం.''

''త్రిభ్య ఏవ తువేదేభ్యః పాదం పాదము దాహృతం.''

గాయత్రీ మంత్రము యొక్క మూడు పాదములూ, మూడు వేదాలనుంచీ గ్రహింపబడ్డాయి.

''గాయన్తం త్రాయతే యస్మాద్‌ గాయత్రీత్యభిధీయతే''

ఈ మంత్రం పఠించినవారిని అది రక్షించును.

వేదాల్లో గాయత్రిని గురించి ఇలా చెప్పబడింది :

''గాయత్రీ ఛందసాం మాతా''

చందస్సు అనే శబ్దానికి వేదాలని అర్థం. గాయత్రి వేదాలకు మాతయని చెప్పబడుతోంది. యథార్థంగా గాయత్రీ మంత్రం యొక్క మూడుపాదాలు వరుసగా మూడు వేదాల్నుంచి గ్రహింపబడినవే.

ఇతర మంత్రాల విషయంలో ఆశించిన ఫలితాలు మంత్రజపానికి పూర్వం చేసే సంకల్పంలోనే సూచింపబడతాయి. ఇతరమంత్రాలు స్వచ్ఛమైన మనస్సును సాధించటానికి ఉపకరణములు మాత్రమే. కాని గాయత్రీ మంత్రం అలాగాక, మనస్సునకు పవిత్రతను నేరుగా సిద్ధింపజేస్తుంది.

శాస్త్రసమ్మతంగా ఏదైనా కర్మను చేయతలపెట్టినప్పుడు మంత్రశక్తిద్వారా సాధించినశక్తి క్షీణించకుండా దేహాన్ని పరిశుద్ధంగా వుంచుకోవాలని వేదాలు శాసిస్తున్నాయి.

''దేహో దేవాలయః ప్రోక్తో జీవో | దేవ స్సనాతనః''

దేహమే దేవాలయం. అందులోని జీవుడే దేవుడు. అందుకే మనశరీరాన్ని అశుచిగాను, అపవిత్రంగాను చేసే పనులేమియు మనం ఆచరించరాదు. మానవ శరీరాలు, ముఖ్యంగా విప్రుల దేహాలు దేవాలయాల వంటివి. వేదాల్లోని మంత్రాలయొక్క శక్తిని కాపాడుకోగలందులకై విప్రులు తమదేహాల్ని పవిత్రంగా వుంచుకోవాలి. బ్రాహ్మణులకు శరీరం కేవలం భోగాల్ని అనుభవించటం కొరకు గాక వేదాల్ని సంరక్షించటానికి వినియోగపడాలి. అందువల్లనే వారికి వారి శరీరం విషయంలో ఎక్కువ కట్టుబాట్లను పాటించవలసిన ఆవశ్యకత వుంది. అందువల్లనే ద్విజుడు ఇతరవృత్తులపై దృష్టిని మరల్చరాదు. మనం మంత్రశక్తి యొక్క జ్వాలను పరిరక్షించుకొనగల్గితే అదే మనలను ఆజన్మాంతం కాపాడి సర్వశ్రేయస్సుల నిస్తుంది.

ఈ రోజుల్లో హిప్నోటిజం ద్వారా చాలా విషయాలు ప్రదర్శింపబడుతున్నాయి. ఒకవిధంగా గాయత్రికూడ హిప్నోటిజం లాంటిదే. అది మన వాంఛల్ని అదుపుజేసి మోక్షమార్గాన్ని సుగమం చేస్తుంది. కనుక గాయత్రికూడ హిప్నోటిజం ఇచ్చే ఫలితాల్నే యిస్తుంది. కనుక గాయత్రిని ఎవరు అనుష్ఠిస్తారో వారు వారికేగాక మొత్తం దేశానికి సద్యఃఫలితాల్ని సమకూర్చగల్గుతారు. ఢిల్లీలోని ఉత్తరస్వామిమలై దేవాలయంలో నిర్వహింపబడిన సామూహిక ఉపనయన కార్యక్రమం చాల ఉత్కృష్టమైంది. దానివలన చాలమంది బాలురు గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది తద్వారా అమిత ప్రయోజనాన్ని వారి కొరకై సాధించు కొనుటయేగాక, భవిష్యత్తులో వారిసేవలు ఇతరులకుకూడ అందించగల్గుతారు.

ఉపనయన సంస్కారం జరిగిన దినంనుండి గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందిన బాలురు తమ జీవితాల్లో దేన్ని గురించి భయపడపనిలేదు. గాయత్రీ జపం నిత్యం నియమంగా చేస్తే పరీక్షల్లో ఉత్తీర్ణతను గురించి గాని, ఉద్యోగాల్ని సంపాదించే అంశంలోగాని, మరి ఏ యితర విషయంలోగాని వారి ప్రయత్నాలు సహజరీతిలో సఫలీకృతమౌతాయి. రాముణ్ణి, కృష్ణున్ని ధ్యానిస్తూ గాయత్రీమంత్ర జపాన్ని నియమం తప్పకుండా చేస్తే వారికి మంచిఫలితం లభిస్తుంది.

గాయత్రీ మంత్రానుష్ఠానం లేకుండా యితర మంత్రాలు శక్తిని సమకూర్చకోలేవు.

గాయత్రీజపం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధవహిస్తే సమాజశ్రేయస్సు సులభ సాధ్యమవుతుంది.

దురదృష్ట మేమంటే మంత్రజప విధానంలో అపవిత్రత చోటు చేసుకోవటంవల్ల చాలమంది విషయంలో మంత్రశక్తి పూర్తిగా లుప్తమౌతున్నది. అయినా ఇంకా కొంత కణలేశం సజీవంగా వుండటం మన అదృష్టం. దీన్ని మనం పోషించి పెద్దజ్వాలగా పెంపొందించు కోవాలి. ఆకణమే గాయత్రి. ఇదిమనకు వంశపారంపర్యంగా సంక్రమించింది. అందుకొరకై మనదేహాన్ని పవిత్రంగా వుంచుకోవాలి. అలాగైతేనే ఆకణం ఆరిపోకుండా గొప్పజ్వాలగా ప్రజ్వరిల్లుతుంది. అల్పకణమెప్పుడూ స్వల్పప్రయోజనాన్నే ఇస్తుంది. కనుక మనం గాయత్రి జపాన్ని వీలైతే 1008 మార్లు, లేనిచో కనీసం, 108, 54, 27 లేక 10 మార్లైనా ఒక రోజులో ఆచరించి ఆ కణాన్ని పెద్దజ్వాలగా రూపొందించుకోవాలి.

మూడు జన్మల్లో వరసగా గాయత్రీ జపాన్ని విస్మరిస్తే అతడు తన విప్రజన్మను కోల్పోతాడు. ఇదేరకమైన స్థాయీ భ్రష్టత్వం క్షత్రియులు, వైశ్యుల విషయంలో సంభవిస్తుంది.

గాయత్రీ మంత్రం ఒక్కటే మనం ఎలాగో మిగుల్చుకో గలిగాం. కాలగమనంలో మిగతా విషయాలన్నీ లుప్తమైనాయి. కనుక దానిని మాత్రం జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనపైవుంది. దీన్నికూడ పోగొట్టుకుంటే మనకు చెప్పుకోతగ్గ ఆస్తి యేమీవుండదు. ప్రతిబాలుడు తనబాల్యం నుండి ప్రగాఢ విశ్వాసంతో దీన్ని ఆశ్రయించి ఆచరిస్తే అతనిని ఏరకమైన వ్యాకులతలు దరిజేరవు.

పిల్లలకు చాలారకాలైన ఉపదేశాలు యిస్తాం. ఒక చెవితోవిని మరొక చెవిద్వారా విసర్జించినట్లు గాయత్రీ ఉపదేశాన్ని మరువకూడదు. గాయత్రీ మంత్రజపంతో పరబ్రహ్మను మానసికంగా ధ్యానించాలి. ఈ అలవాటును పిల్లలకు బాల్యం నుండి అభ్యసింపచేయాలి.

గాయత్రీ మంత్రోపదేశం పిల్లవానికి ఏడవయేట చెయ్యాలి. ఆవయస్సులో పిల్లవాని మనస్సు అమాయకస్థితిలోను, నిష్కల్మషంగాను వుంటుంది. అప్పుడు మంత్రస్వరూపం అప్రయత్నంగా పిల్లవాని మనస్సులో చొరబడి దురాలోచనలకు ఆశ్రయమివ్వక, చెడు విషయాలనుండి రక్షణను కూడ కల్పిస్తుంది.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈ త్రికాలాల యందు గాయత్రీజపం అందరూ నిర్వర్తించాలి. ప్రాతఃసంధ్యాకాలంలో జంతుజాలం, మానవగణంకూడ నిద్రలేచి వుండటం వల్ల మానసిక ప్రశాంతతకు అదిఅనుకూలసమయం. అలాగే పగలంతా శ్రమించి అందరూ విశ్రాంతి తీసికునే సమయంకనుక సాయంసమయవేళ కూడ మనకు అనుకూల మైనదే. ఇక మధ్యాహ్న సమయంలో ప్రజలు అలసి, నిద్రమత్తులో వుంటారుగనుక ఆవేళ కూడ గాయత్రి జపానికి చాలా దోహదపడుతుంది.

సంధ్యావందనంలో సూర్యునకు అర్ఘ్యప్రదానం, గాయత్రీజపం ప్రధానాంశాలు. మిగతా కార్యక్రమం వాటికి అనుబంధితమైనది మాత్రమే. సంధ్యావందనం యథాతధంగా చేయలేనివారు, అనారోగ్యవంతులు, అర్ఘ్యప్రదానంచేసి, కనీసం పదిమార్లైనా గాయత్రీ మంత్రజపం చేసికోగల్గితే చాలు.

మహాభారత యుద్ధ సమయంలో కూడ అర్ఘ్యానికి నీరు లభించనప్పుడు యుద్ధభూమిలో లభ్యమైన ధూళితో యుద్ధవీరులు ఉచితసమయంలో అర్ఘ్యాన్ని ఇచ్చినట్లు వింటాం. అలాగే సంప్రదాయ పద్ధతిలో జపం చేయటానికి వారికి అవకాశములు లేక ధ్యానాన్ని సక్రమంగా నిర్వర్తించారు.

మనకు జ్వరం వచ్చినపుడు మందుతీసుకుంటాం. అలాగే దేహాంతర్గత వ్యాధులకు గాయత్రీమంత్రం దివ్యౌషధం. వ్యక్తి తన జీవితాంతం గాయత్రీ చేయవలసిందే. గాయత్రిని మాతృస్వరూపిణిగా ఆరాధించాలి. భగవంతుడు అనేక రూపాల్లో అవతరిస్తాడు. బిడ్డయొక్క కష్టసుఖాల్ని ఆలకించటానికి, వాని యోగక్షేమాలు ప్రేమతో చూట్టానికి మాతృమూర్తి కంటె మించిన వ్యక్తి యుండబోదు. కనుక భగవంతుడు వివిధరూపాల్లో అవతరించినా, మాతృమూర్తిగా ఆరాధింపబడే గాయత్రి అందరికంటెమిన్న.

గాయత్రి బాలురకు, పురుషులకు మాత్రమే విధింపబడింది. స్త్రీలకు నిషిద్ధము. భర్తలు గాయత్రి చేస్తే దాని ఫలితం భార్యలకు చేరుతుంది. ఇతర వర్ణాలవారికి కూడ దాని ప్రయోజనం సిద్ధిస్తుంది.

యజ్ఞోపవీతాన్ని మనం ఎన్నడూ, ఏ నెపంతోనూ త్యజించరాదు. ఒకసారి ఒక పెద్దమనిషి యజ్ఞోపవీతం ధరించియున్నపుడు పాపకార్యాలు చేయకూడదనే తలంపుతో దాన్ని తీసివేసి యుండటాన్ని గమనించాను. యజ్ఞోపవీతం ధరించియుంటే అదితాను చేస్తున్నది పాపకార్యాలని, వాటికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హెచ్చరిస్తుంది కనుక దానిని ఎట్టి పరిస్థితులలోను తీసివేయవలదని నేనాయనకు సలహాయిచ్చాను. అదిలేని సందర్భంలో వ్యక్తి పాపాలు చేస్తున్నాడని గుర్తుచేసే సాధనం కూడ వుండదు కనుక యింకా ఎక్కువ పాపకర్మలు అతడు చేయటానికి వ్యామోహితుడు కావచ్చు.

గాయత్రీజపం వలన బాలకులలో సత్ర్పవర్తనా బీజాలు నాటుకొనుటయేగాక, వారు విజ్ఞానవంతులు కూడ అవుతారు. పిల్లలు ఈ విషయాన్ని ఎన్నడూ మరువరాదు. ఉపనయన కార్యం జరిగే రోజున సందడిలో బాలురు మంత్రంయొక్క సరియైన ఉచ్చారణను, స్వరాన్ని సక్రమంగా గ్రహించి యుండకపోవచ్చు. కాని తర్వాతైనా వారు తమతల్లిదండ్రుల ద్వారాగాని, పురోహితుని ద్వారాగాని మంత్రోచ్చారణను స్వరాన్ని స్వచ్ఛమైన రీతిలో అభ్యసించాలి. అది వటువుల బాధ్యతే. ఎనిమిది ఏండ్లు దాటకుండానే ప్రతి పిల్లవాడు ఉపనయనం ద్వారా గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందేటట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అంతేగాక పిల్లలు గాయత్రీజపాన్ని సక్రమంగా నేర్చుకొని ప్రతిదినం నియమం తప్పకుండా ఆచరించేటట్లు కూడ తల్లిదండ్రులు చూడాలి. ఒక గృహంలో ముగ్గురు బ్రహ్మచారులు వుండకూడదనే అపోహతో కొందరు తల్లిదండ్రులు ఉపనయన కార్యక్రమాన్ని వాయిదావేస్తూ ఉంటారు. కాని ఆ అభిప్రాయానికి ఆధారంలేదు. మరికొంతమంది వివాహం జరగబోయేముందు యజ్ఞోపవీతధారణ జరిగితే చాలని భావిస్తారు. ఇదితప్పు. మగపిల్లలు కుటుంబ బాధ్యతల దృష్ట్యా తమ వివాహాన్ని వాయిదావేయవచ్చు. కాని ఉపనయన సంస్కారానికి ఇటువంటి వాటితో ముడిపెట్టనవసరంలేదు. ఉపనయనాన్ని తమగృహాల్లో నిర్వహించటానికి తగిన వసతులు సమకూర్చుకోలేని గృహస్థులు ఆ కార్యాన్ని మఠాల్లో జరిగే సామూహిక ఉపనయనాలతోబాటు జరుపుకోవచ్చు.

దీని ప్రధానోద్దేశ్యమేమంటే బాలునకు ఎనిమిది ఏండ్లు నిండకపూర్వమే ఉపనయనం జరిగివుండాలి. అలా జరిగితే అతని జీవితం సుఖప్రదమవుతుంది. ఈ రోజున మనం చాలబాధలకు గురి¸°తున్నాం. కనీసం మనపిల్లలైనా ఈ బాధలకు వెలిగా జీవించేటట్లు ప్రయత్నిద్దాం. మనపిల్లలే మన భవిష్యత్తుకు సంబంధించిన సంపద. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సంపదా సురక్షితమైందికాదు. గాయత్రీమంత్రం ఒక్కటే మనం ఆధారపడగల్గిన నిధి. అదే మనలను సర్వదా రక్షిస్తుంది. ఈ మంత్రజపం ద్వారా పరబ్రహ్మకరుణ మనపై ప్రసరిస్తే అదే మనకు రక్షణ కవచం. కనుక ఎనిమిదేండ్లు వయస్సుగల పిల్లలున్న తల్లిదండ్రులందరూ వారి ఉపనయన కర్మను వెంటనే జరుపుటకు ఉద్యుక్తులు కావాలి.

పిల్లలు గాయత్రీజపాన్ని పరిపూర్ణ విశ్వాసంతో క్రమం తప్పకుండా ఆచరిస్తే వారి ఆత్మశక్తిని, మనశ్శక్తిని, పెంపొందించుకో గల్గుతారు. వారు గాయత్రిని పఠిస్తేచాలు వారి బుద్ధికుశలత అప్రయత్నంగా సునిశితమవుతుంది. పిల్లవాడు గాయత్రీ జపాన్ని ఒకవారం రోజులు చేసినా దానిఫలితం అతనికే గోచరిస్తుంది. ఇనుమడించిన ప్రతిభ కలవాడౌతాడు.

పిల్లలు గాయత్రీ జపాన్ని క్రమంగా, విడవకుండా చేసేటట్లు తల్లిదండ్రులు శ్రద్ధవహించాలి. వారు జపంపూర్తి చేసినతర్వాతే ఏదైనా పానీయం గాని భోజనంగాని తీసుకునే నియమం పాటించాలి.

జపమెప్పుడూ అవిచ్ఛిన్నంగా జరగాలి. చంద్రమౌళీశ్వరుని కృపకు ప్రజలందరూ పాత్రులు కావాలని వారిజీవితాలు క్షేమప్రదంగా, మంగళప్రదంగా, కళ్యాణప్రదంగా కొనసాగాలని ఆకాంక్షిస్తాను.

Sri Jayendravani    Chapters    Last Page