Sri Jayendravani    Chapters    Last Page

48. గోసంరక్షణ - గోపూజ

@ƒyµj… ƒ«sVLiÀdÁ ª«sV»R½LiÍÜ[ ˳ÏÁgRiª«sµyLSµ³R…ƒ«s µj…*„sµ³R…LigS ÇÁLRiVgRiV»R½VLiµj…. INRPÉÓÁ ¬sLæRiVßãÜ[Fyxqsƒ«s, lLiLi²R…V xqsgRiVßãÜ[Fyxqsƒ«s. ¬sLæRiVßãÜ[Fyxqsƒ«s „sµ³yƒ«sLiÍÜ[ xmsLRiª«sW»R½ø ¬sLæRiVßáV²R…V, ¬sLSNSLRiV²R…V. xqsgRiVßãÜ[Fyxqsƒ«s xmsµôðR…¼½ÍÜ[ xmsLRiª«sW»R½ø xqsgRiVßáV²R…V, ryNSLRiV²R…V. xmsLRiª«sW»R½ø gRiâßá[aRPV²R…V, NSLjiòZNP[¸R…VV²R…V, ÌÁOTPQQø, xqsLRixqs*¼½ ®ªsVVµR…\ÛÍÁƒ«s ryNSLRiLRiWFyÍýÜ[ ª«soLiÉزR…V. „dsÉÓÁÍÜ[ úxms¼½ ®µ…[ª«s»yª«sVWLjiò úxms¾»½[ùNRP\®ªsVƒ«s ª«sLSÌÁƒ«sV úxmsryµj…Li¿RÁVaRPNTPò NRPÖÁgji ª«soLiÈÁVLiµj…. Dµyx¤¦¦¦LRißáNRPV bPª«so²R…V ‡ÁVµôðj…¬s, ®ªsWOSQ¬sõ Bryò²R…V. gRiâßá[aRPV²R…V „sxmnsWõÌÁƒ«sV ¬sª«sX¼½ò ¿Á[ryò²R…V. ÌÁOTPQQø xqsLixmsµR…ÌÁƒ«sV @ƒ«sVúgRiz¤¦¦¦xqsVòLiµj….

లక్ష్మీదేవి మొత్తం జగత్తుకు మాతయై సర్వాంతర్యామిని యైనా కొన్ని స్థలాల్లో ప్రత్యేకంగా నివసిస్తుంది. అవి గోపృష్ఠ భాగం, గజము యొక్క శిరోభాగము, బిల్వదళాలు, తామర పువ్వు, పతివ్రత శిరస్సుపై పాపటలోని సిందూరస్థానం.

ఈ లక్ష్మీనివాస స్థానాల్లో గోపృష్ఠభాగం విశేషమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. వ్యక్తి చంద్రమండలానికి వెళ్లి తిరిగివచ్చినవాడైనా, కోటీశ్వరుడైనా, అతని పృష్ఠభాగాన్ని చూట్టానికి ఎవరూ యిష్టపడరు. ఎంత గొప్పదేవతలైనా వారి పృష్ఠభాగాన్ని కూడ చూడరు. మనం గోపృష్ఠభాగాన్ని అర్చిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం. దీనికి కారణం లక్ష్మి ఆ భాగంలో నివసించటమే.

అంతేగాక సూర్యచంద్రులు మొదలైన దేవతలందరు గోవు యొక్క వివిధశరీర భాగాల్లో నివసిస్తారు. కనుకనే ఒక భూప్రదక్షిణం ద్వారా సాధించే ఫలితాన్ని ఒకసారి గోప్రదక్షిణం చేసి పొందవచ్చు.

మా మఠంలో ప్రతిదినం గజపూజ, గోపూజ నిర్వహిస్తాం. ఎందుకంటే యీ జంతువులలో లక్ష్మి నివసిస్తున్నది గనుక.

గోవునుండి మనకు పాలు, పెరుగు, వెన్న, ఘృతము ప్రాప్తిస్తాయి. ప్రతి మానవునకు దైనందిన ఆహారం కొరకు ఈ పదార్థాలు అత్యావశ్యకం. గోవుయొక్క ఏ పదార్థం వృథాగా పోదు.

గోమూత్రము, గోమలము పవిత్రమైనవిగా భావింపబడుతున్నాయి. సాధారణంగా ఏ యితర జీవి, ఆఖరికి మన సొంత పిల్లలవి గాని, మన తల్లిదండ్రులవైనాగాని మల మూత్రాదులను దుర్గంధ వస్తువులుగా ఏహ్యభావంతో విసర్జిస్తాం. ఒక్క గోవుయొక్క మలమూత్రాదులను మాత్రమే పవిత్రములుగా భావిస్తాం.

''పంచగవ్యప్రాశనం మహాపాతక నాశనం.''

పంచగవ్యం' శబ్దానికి గోవునుండి లభించే ఐదు వస్తువుల మిశ్రమ మని అర్థం. గవ్యం అంటే గోఃఇదం-గవ్యం-గోవునకు సంబంధించిన వస్తువులు. పంచ అంటే ఐదు. ఇవి ఎన్నో పాపాలకు ప్రాయశ్చిత్తాలుగా చెప్పబడుతాయి. పంచగవ్యమనగా గోవుయొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, మలముల యొక్క మిశ్రమమే.

ఒక గృహంలో ఏ రకమైన కాలుష్యం ఏర్పడినా దానిని శుద్ధిచేయుటకు గోమలాన్ని ఉపయోగిస్తాం.

గోధూళి అంటే గోవుపాదాలనుండి రేగిన ధూళి. ఇది కూడ పవిత్రమైనదే. ఉడిపి నగరంలో బ్రాహ్మణుల సామూహిక భోజనం తర్వాత ఆ స్థలాన్ని శుద్ధిచేయుట కొరకు అచ్చటివారు ఒక ఆవులమందను ఆ స్థలంపైకి పంపుతారు. గోవుల పాదాల నుండి రేగిన గోధూళి ఆ స్థలాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడ కొన్ని చికిత్సా విధానాల ప్రకారం ఆవులమంద మధ్యలో రోగిని నివసింపచేయటం, గోధూళి రోగి శరీరంపైబడి రోగనివారణ జరగటం సూచింపబడింది.

శ్రీకృష్ణుడు ధరించిన పేర్లలో గోపాలుడు, గోవిందుడు అనేవి విశేషించి చెప్పుకోతగ్గవి. గోపాల అనే శబ్దానికి రెండర్థాలు. గోశబ్దానికి సంస్కృత భాషలో వేదాలు, ఉపనిషత్తులని, మరియు గోవు అని. గోపాలుడు అంటే వేదాల్ని ఉపనిషత్తులను సంరక్షించేవాడు మరియు గోవులను పాలించేవాడు. గోవింద శబ్దానికి కూడ అదే అర్థం.

'గోపాల', గోవింద అనే రెండు మాటలకు అర్థం :

''గోపరిపాలక, పశుపరిపాలక, గో సంరక్షక''

g][ª«soÌÁƒ«sV NRP¬s|msÉíÓÁ |msLiÀÁF¡ztsQLi¿RÁVªy²R…V. µy*xmsLRi ¸R…VVgRiLiÍÜ[ ÇÁgRi»R½VòNRPV ËÜ[µ³R…NRPV\®²…ƒ«s $NRPXxtñsv®²…[ g][ª«soÌÁƒ«sV FyÖÁLiÀÁ |msLiÀÁ F¡ztsQLi¿y²R…V. NRPƒ«sVNRP A¸R…Vƒ«s »R½ƒ«s\ZNP »y®ƒs[ g][xqsLiLRiORPQßá NRPÎÏÁƒ«sV, „sµ³yƒy¬sõ úxmsµR…Lji+Li¿y²R…V. A¸R…V®ƒs[ ª«sVƒ«sNRPV ª«sWLæS¬sõ ¿RÁWFy²R…V. NRPƒ«sVNRP g][xqsLiLRiORPQßãÜ[µR…ùª«sVLi úN]»R½ògS xqsXztísQLixms‡Á²T…Liµj… NSµR…V. $NRPXxtñsv²R…Li»R½ÉÓÁªy®²…[ µk…¬sõ úFyLRiLiÕ³ÁLi¿y²R…V. NRPƒ«sVNRP $NRPXxtñsv¬s\|ms ˳ÏÁNTPò úxmsxms»R½VòÌÁVƒ«sõ ªyLRiLiµR…LRiW g][xqsLiLRiORPQßáNRPV xmspƒ«sVN]¬s A¸R…V¬sõ @ƒ«sVxqsLjiLi¿yÖÁ. g][xqsLiLRiORPQßá ª«sVƒ«sLi ¿Á[}qsò®ƒs[ ª«sVƒ«sLi NRPXxtñsv¬s @ƒ«sVúgRi¥¦¦¦¬sNTP Fyú»R½VÌÁª«sVª«so»yLi. g][ª«soÌÁ, g][„sLiµR… ƒyª«sWÌÁV ÇÁzmsxqsWò NRPW²R…, A }msLýRiNRPV @ƒ«sV‡ÁLiµ³j…»R½\®ªsVƒ«s NSLSùÌÁƒ«sV NRPW²R… ¬sLRi*QQLjiò}qsò »R½xmsö ª«sVƒ«sNRPV NRPXxtñsv¬s xmspLjiò @ƒ«sVúgRix¤¦¦¦Li úFyzmsòLi¿RÁµR…V.

గోవును మనదేశీయులు 'గోమాత' అని గౌరవంగా పిలుచుకుంటారు. ఇతర జంతువులు తమ సంతానానికే పాలిచ్చి వాటిని కొంతకాలం మాత్రమే సాకుతాయి. కాని గోవుతాను జీవించినంతకాలం తన దూడలకే గాక పరులకు కూడ తన క్షీరాన్ని యిస్తుంది. అందువల్లనే వేదాలు కూడ గోసంరక్షణ విధిగా చేయాలని ఘోషిస్తున్నాయి. వేదసమ్మతమైన ఏ క్రియా కలాపంలో నైనా ఇలా చెప్పబడింది.

''గోబ్రాహ్మణభ్యః శుభమస్తు''

ఈ సందర్భంలో కూడ గోవుకు మాత్రమే ప్రాధాన్యత ఈయబడింది.

అంతేగాక గోవును సవ్యంగా కాపాడగల్గితే మొత్తం ప్రపంచం దానివలన సంరక్షింపబడుతుంది. గోవు తన వృద్ధికరమైన క్షీరమును మనకిచ్చి అమ్మవలె మనలను రక్షిస్తుంది. కనుక గోసేవకు ప్రతివాడు పూనుకోవాలి.

ప్రస్తుతం ప్రతి ఇంటిలోను అనేక కారణాలవల్ల ఇది ఆచరణ సాధ్యం కావటంలేదు. మన గృహాల్లో గోవుకు ఆశ్రయమిచ్చి సంరక్షించటానికి కావలసిన స్థలం వుండదు. కనుక అందునిమిత్తం ప్రతి ప్రాంతంలో గోసంరక్షణ కేంద్రం నెలకొల్పబడాలి. ఒకటి లక్ష్మీబాయినగరులోను, మరొకటి రూప్‌నగర్‌లోను, మూడవది కరొల్‌బాగ్‌లోను, అలాగే ఇతర ప్రాంతాల్లోను వుండవచ్చు. ఏదైనా పట్టణంలో ఒక ప్రాంతానికి సమగ్రమైన ప్లాను తయారుచేసేటప్పుడు, కొంతస్థలాన్ని పార్కు ఆటల కొరకు, పాఠశాలకు కేటాయించినట్లు గోసంరక్షణకు, గోవులను వుంచుటకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటుచేయాలి.

అందరు గృహస్థులు గోవును తమఇండ్లలో వుంచి నిభాయించ లేకపోయినా, ప్రతివాడు గోవుల కొరకు కొంత బియ్యము, గోధుమలు, కొంతడబ్బు ప్రతిరోజు ప్రత్యేకించి తీసివుంచవచ్చును. అలాతీసినవి కొంత అధిక పరిమాణానికి చేరుకోగానే వాటిని సమీపంలోని గోసంరక్షణశాలకు పంపి అచ్చటి గోవులకు వినియోగింపబడునట్లు చేయవచ్చు.

మన తల్లిదండ్రులను వారి జీవితాంతం మనం సాకినట్లే గోమాతను కూడ అది జీవించినంత కాలం దాని సంరక్షణ నిర్వహించాలి. మన ఇండ్లలో మన బిడ్డలకు తల్లిపాలు ఆగిపోగానే ఆవుపాలను యిచ్చి పోషిస్తాము. ఆవిధంగా గోవు ఆ బిడ్డకు రెండవ తల్లిగా వ్యవహరిస్తుంది.

ప్రభుత్వం గోసంరక్షణకు కొంత ధనం వినియోగిస్తూ ప్రజలకు పాలను పంపిణీ చేయుటకు పాలపథకాలను అమలు చేస్తోంది. కాని వారు పాలిచ్చే గోవులను మాత్రమే పోషిస్తున్నారు. గోవు పాలివ్వటం నిలిచిపోగానే ఆ గోవు రక్షణను నిర్లక్ష్యం చేస్తారు. మనం మన తల్లిని ఆమె జీవితాంతం శ్రద్ధతో చూచుకొనినట్లే, గోవునుకూడ అది సహజ మరణాన్ని పొందేవరకు జాగ్రత్తతో పోషించాలి.

మాంసం కొరకు గోవును బలవంతంగా చంపే ప్రయత్నం చేయకూడదు. గోవు సహజంగా మరణించే వరకు దాన్ని పాలించి పోషిస్తే మనజీవితాలు సుఖమయమవుతాయి.

గోమాంసం భక్షించటానికి అలవాటుపడ్డ వ్యక్తికి బుద్ధి మాంద్యం తప్పక కల్గుతుంది.

గోవులను సర్వవిధములా చక్కగా పోషిస్తూ గోక్షీరాన్ని అలవాటుగా త్రాగుతుంటే మనకు బుద్ధి వికాసం సమకూరుతుంది. అన్నిరంగాల్లోను సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆవుపాలను సేవించక గోవును నిర్లక్ష్యం చేస్తే మన జీవితం దుఃఖమయం ఔతుంది.

గోవులో లక్ష్మి నివశిస్తుంది. గనుక లక్ష్మీ కటాక్షాన్ని అపేక్షించేవారు గోరక్షణకు పూనుకోవాలి. గోమాత సేవచేయాలి. అప్పుడే కృష్ణుని అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది, లక్ష్మీకటాక్షం వెల్లివిరుస్తుంది, దేశం సుసంపన్నమై, సర్వులు అభ్యుదయ పరంపరతో, ప్రశాంతితో జీవిస్తారు. కనుక గోమాతను సేవించుట మన ప్రథమ కర్తవ్యంగా పాటించాలి. లక్ష్మి ఏనుగు యొక్క శిరోభాగంలో నివసిస్తుంది. కనుక దానికి సేవలు చేసి ఆరాధించవచ్చు. కాని ఒక గజాన్ని పోషించి నిభాయించాలంటే సామాన్యునికి సాధ్యమయ్యే పనికాదు. కనుక లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి సులభాతి సులభ##మైనది గోపూజ మాత్రమే. మనం కాలకృత్యాలు నిర్వర్తించటం, ఆహారం తీసుకోటం ఎంత సామాన్యమైన విషయమో, గోవునకు సేవచేయటం, గోవును పూజించటం అంత సామాన్య అంశంగా ప్రతివాని జీవితంలోను చోటు చేసుకోవాలి. వ్యక్తి యొక్క దైనందిన చర్యల్లో ఇదియొక ప్రధాన పాత్ర వహించాలి.

గోరక్షణకు కుల వివక్షత లేదు. అన్ని కులాలవారు, అన్ని మతాలవారు కూడ దీన్ని ఒక ధర్మంగా పాటించి ఆచరించాలి. హిందువులే గాక, బౌద్ధులు, జైనులు కూడ గోసంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

గోవు తన క్షీరాన్ని ముందుగా తన దూడకు యిచ్చినా, దాని పొదుగులో పాలు మరింత పొంగి ఇతరులకు కూడ వినియోగ పడతాయి. గోవుకున్న యీ ప్రత్యేక లక్షణాన్ని గుర్తించే, ప్రజలు దాన్ని పూజిస్తారు. అన్ని కులాలవారు ఈ ధర్మాన్ని అనుసరించి నప్పటికి, వైశ్యకులానికిది ప్రత్యేకంగా నియుక్తమైంది. గీతలో శ్రీకృష్ణుడిలా అంటాడు :

''కృషి గౌరశ్య వాణిజ్యం వైశ్యకర్మ స్వాభావజం ||''

పంటపొలాల్లో సేద్యము చేయుట, గోసంరక్షణ, వ్యాపార వాణిజ్యముల ద్వారా ప్రజలకు దోహదపడుట అనునవి వైశ్యులకు ప్రత్యేక విధులుగా నిర్ణయింపబడినవి. ఆహార ధాన్యాలను అవి పండే స్థలాలనుండి సేకరించి, నిల్వయుంచి అవి అవసరమైనవారికి అమ్మకము ద్వారా పంపిణీ చేయవలెను. వారు వ్యాపారాన్ని ప్రజల యోగక్షేమానికై నిర్వహించాలి; కేవలం తమ సొంత లాభం కొరకే గాదు. పంట క్షేత్రాల్ని సక్రమంగా వినియోగించటం, గోవులను సంరక్షించటం, ప్రజలకు వలసిన నిత్యావసర వస్తువులను వారి అందుబాటులో వుంచటం - ఇవి వైశ్యుల విధులు. ఆవశ్యకమైన సందర్భాల్లో వారు వస్తువులను పరదేశాల్లో కొని కూడ తెప్పించి ప్రజలకు లభింప చేయాలి.

గోసంరక్షణ, గోసేవ వైశ్యుల యొక్క ప్రత్యేక కర్తవ్యంగా పేర్కొన్నను, మిగతావారు గోసేవ చేయకూడదని కాదు. ప్రతివాడు లక్ష్మీ కటాక్షానికి పాత్రుడు కావాలి గనుక, అందరూ గోరక్షణకు పూనుకోవలసినదే; దానిని వారి దైనందిన కార్యక్రమంలో ప్రధానాంశంగా చేపట్టవలసినదే.

ఈ విధి హిందువులకు మాత్రమే పరిమితం కాదు. లక్ష్మీ కటాక్షం అన్ని మతాలవారికి అపేక్షణీయమే. మహమ్మదీయులు, క్రైస్తవులు కూడ లక్ష్మీ కటాక్షాన్ని కోరుతారు గనుక ఏ మతం వారైనా గోమాతను సేవించవలసిందే. ప్రపంచంలో అన్ని వర్గాలవారికి లక్ష్మి యొక్క అనుగ్రహం, కృష్ణుని యొక్క అనుగ్రహం అత్యావశ్యకాలు.

కృష్ణుని కృపను సంపూర్తిగా పొందగల్గుటకు ఆయన నామాన్ని స్మరిస్తే చాలదు. ఆయన చేసి చూపించినవన్నీ మనం ఆచరించాలి.

ప్రపంచానికి అధ్యాపకుడైన కృష్ణపరమాత్ముడు చూపిన మార్గంలో నడచుకుంటూ మనమందరం సర్వశుభాల్ని, సౌభాగ్యాల్ని లభింపచేసుకుందాం.

Sri Jayendravani    Chapters    Last Page