Prathyaksha Daivamu    Chapters    Last Page

శ్రీః

ప్రత్యక్ష దైవము

PRATHYAKSHA DAIVAMU

[శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి, పరమహంస పరివ్రాజకాచార్యవర్య, జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీ చరణుల రేఖామాత్ర జీవితము మరియు శతకము - ఆంగ్లభావానువాద సహితము.]

(పుట - 46)

[An out-line life-sketch and Sathakam on His Holiness Sri Sri Sri CHANDRASEKHARENDRA SARASWATHI SWAMIGAL.]

కవయిత : పణతుల రామేశ్వర శర్మ,

14-69 తేరు వీధి,

పుంగనూరు - చిత్తూరు జిల్లా (ఆం. ప్ర.)

పిన్‌ - 517 247.

PRATHYAKSHA DAIVAMU

By

PANATHULA RAMESWARA SARMA

English Translation

By Sri K. A. NARASIMHA CHAR

Cover Design : Sri BAPU

First Edition - 1987

Copies : 2000

Author

Price : For FREE distribution only

(Please send your valuable opinions)

Copies Can be had from:

Sri T. Sathya Narayana Guptha,

Sathya Narayana Cloth Hall,

Bazar St,

PUNGANUR,

Chittoor Dt (A.P.)

Pin - 517 247.

PRINTED at Freedom Press,

528, T. H. Road, MADRAS-21.

Phone : 553826.

OM

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ శ్రీ చరణులవారి

అనుగ్రహ ప్రసాదము

మకాం: బొకారో [బీహార్‌ రాష్ట్రం] తేది: 17-2-87

పుంగనూరు వాస్తవ్యులైన శ్రీ పణతుల రామేశ్వర శర్మచే తెలుగు భాషలో రచింపబడిన శ్రీ పరమాచార్యుల చరిత్ర సంగ్రహము మరియు శతకము పాఠకు లందరి హృదయములలో శ్రీ పాదులవారి మహత్తరమైన మహిమ శిలాలిఖితమగునంతగా భూషితమై యుండుట వలన మేము చాలా ఆనందిస్తున్నాము.

ఈ గ్రంథమును నిర్మించినవారికి, వెలికి తెచ్చినవారికి మరియు అసాంతము చదివిన వారికందరికిని శ్రీ పరమాచార్యులవారి కృపా ప్రసాదముతో ప్రేయమును, శ్రేయమును కలుగవలెనని మేము ఆశిస్తున్నాము.

ఇతి నారాయణ స్మృతిః.

ఓమ్‌

శ్లో|| వర్ణానామర్థ సంఘానాం, రసానాం ఛందసా మపి |

మంగళా నాంచ కర్తారౌ, వందే వాణీ వినాయకౌ ||

కం|| వర్ణములకు నర్థములకు

నిర్ణీత చ్ఛందములకు నిర్మలరస సౌ

వర్ణ నిధులకు శుభములకు -

నిర్ణేతల వాక్సతీ గణశులc గొల్తున్‌.

ఓమ్‌

ప్రత్యక్ష దైవము

కంచి కామకోటి పీఠాధీశ్వర జగద్గురు

శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ

శ్రీపాద శతకము

Prathyaksha Daivamu    Chapters    Last Page